
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది సింగం ఏగైన్, క్రూ, ది బకింగ్‌హమ్ మర్డర్స్ చిత్రాలతో అభిమానులను మెప్పించింది. ది బకింగ్‌హామ్ మర్డర్స్ మూవీలో పోలీసు పాత్రలో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అలాంటి సన్నివేశాలను చేయడం తనకు ఎప్పుడూ సౌకర్యంగా అనిపించలేదని తన 25 ఏళ్ల సినీ కెరీర్ గురించి మాట్లాడింది.
కరీనా కపూర్ మాట్లాడుతూ.. "ఇది మొత్తం మనం చూసే ఆలోచన విధానంపై ఆధారపడి ఉంది. లైంగికతను మానవ అనుభవంగా మనం చూడం. ఇలాంటి సీన్స్ తెరపై ఉంచే ముందు మనం దానిని మరింతగా లోతుగా చూడటం, గౌరవించడం ప్రారంభించాలి. ఇదే నా నమ్మకం," అని ఆమె అన్నారు. అలాంటి సన్నివేశాల్లో నటించడానికి మీరెందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించగా.. కరీనా కపూర్ స్పందించింది. కథను అలా ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం కాదని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా.. కథ పరంగా అయితే అది తప్పనిసరి అని నేను నమ్మను.. ఎందుకంటే అలా చేయడం సౌకర్యంగా ఉండదని నాకు తెలుసు. నేను ఎప్పుడూ అలా చేయలేదు' అని తెలిపింది.
(ఇది చదవండి: సీక్రెట్‌గా పెళ్లి.. 4 నెలలకే విడాకులు తీసుకున్న నటి!)
కాగా.. కరీనా కపూర్ తన 25 ఏళ్ల సినీ కెరీర్‌లో తెరపై ఎప్పుడూ లైంగిక సన్నివేశాల్లో నటించలేదు. 2003లో వచ్చిన 'చమేలి' సినిమాలో కపూర్ ఒక సెక్స్ వర్కర్ పాత్ర మాత్రమే పోషించింది. ఈ సినిమాలో నటించడంపై కరీనా మాట్లాడుతూ..ఈ సినిమా ద్వారా నేను చాలా విషయాలను గ్రహించానని తెలిపింది. స్త్రీ తత్వం, అందంగా ఉండటం వంటి సాంప్రదాయ భావనలకు అనుగుణంగా ఉండవలసిన అవసరం లేదని అనిపించింది. ఈ సినిమా నా కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అని వివరించింది. అది చిన్న వయసులో నా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. ఆ పాత్ర పోషించినందుకు నేను సంతోషంగా అనిపించిందని తెలిపింది. కాగా.. కరీనా కపూర్ కభీ ఖుషీ కభీ ఘమ్, ఐత్రాజ్, చుప్ చుప్ కే, గోల్మాన్ రిటర్న్స్, జబ్ వి మెట్, ఉడ్తా పంజాబ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment