బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేరు అందరికీ పరిచయమే. గతేడాది లస్ట్ స్టోరీస్-2తో అలరించిన నీనా.. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో కనిపించింది. మలయాళంలో తెరకెక్కించిన 1000 బేబీస్ సిరిస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే ఇటీవల ఆమె టాక్ షోలో పాల్గొన్నారు. కరీనా కపూర్ ఖాన్ చాట్ షో రాబోయే ఎపిసోడ్‌లో కనిపించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఈ వయసులో మీరు ఎందుకు షార్ట్స్ వేసుకుంటారని చాలామంది అడుగుతున్నారని కరీనా ప్రశ్నించింది. దీనికి నీనా గుప్తా స్పందిస్తూ.. మీ నాన్న డబ్బులతో అయితే వేసుకోవడం లేదు కదా? అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. ఈ షోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. కాగా.. నీనా గుప్తా ఇటీవలే ఉంచాయి మూవీలో తన నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment