Neena Gupta
-
ఈ వయసులో షార్ట్స్ ఎందుకు?.. సీనియర్ నటి అదిరిపోయే సమాధానం!
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా పేరు అందరికీ పరిచయమే. గతేడాది లస్ట్ స్టోరీస్-2తో అలరించిన నీనా.. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో కనిపించింది. మలయాళంలో తెరకెక్కించిన 1000 బేబీస్ సిరిస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఇటీవల ఆమె టాక్ షోలో పాల్గొన్నారు. కరీనా కపూర్ ఖాన్ చాట్ షో రాబోయే ఎపిసోడ్లో కనిపించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఈ వయసులో మీరు ఎందుకు షార్ట్స్ వేసుకుంటారని చాలామంది అడుగుతున్నారని కరీనా ప్రశ్నించింది. దీనికి నీనా గుప్తా స్పందిస్తూ.. మీ నాన్న డబ్బులతో అయితే వేసుకోవడం లేదు కదా? అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. ఈ షోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. కాగా.. నీనా గుప్తా ఇటీవలే ఉంచాయి మూవీలో తన నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. -
నో బ్యూటీ పార్లర్.. నా అందం, ఆనందం రహస్యం అదే! నటి
ఈ విషయం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నీనా గుప్తాకు బ్యూటీ పార్లర్లకు వెళ్లే అలవాటు లేదు. ‘అవునా!! గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు తరచూ పార్లర్ లకు వెళ్తుంటారు కదా! అందమే కదా అసలు ఎవరికైనా ఆనందం?’ అని మీరు అడిగి చూడండి... నీనా చెప్పే సమాధానం మిమ్మల్ని మరింతగా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ‘నా కూతురే నా ఆనందం‘ అంటారు నీనా!ఆనందం అందాన్నిస్తుంది. ఆ ఆనందం కూతురు మసాబా రూపంలో నీనా కళ్లెదుట ఉంది. ఇక ఆమెకు ఫేషియల్స్ ఎందుకు? పార్లర్లు ఎందుకు? నీనా వయసు 65. సింగిల్ మదర్‌కి స్ట్రెస్ ఉంటుంది. కూతురు ఉన్న సింగిల్ మదర్‌కి మరింత స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్, మరింత స్ట్రెస్‌లను మించిన మూడోస్ట్రెస్ కూడా ఉండేది నీనాకు. అదేమిటో అందరికీ తెలిసిందే. ఆమె కూతురి తండ్రి ఇండియన్ కాదు. 1980ల నాటి వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్. నీనా, రిచర్డ్స్కు పుట్టిన అమ్మాయే మసాబా. రిచర్డ్స్ కు అప్పటికే పెళ్లి అయి ఉండటంతో ఆయన్ని పెళ్లి చేసుకోకుండా, మసాబా పెరిగి పెద్దయ్యే వరకు – ఒంటరిగానే ఉండిపోయారు నీనా. ప్రస్తుతం మసాబా వయసు 35 ఏళ్లు. ఇప్పటికీమసాబానే నీనా కంటి వెలుగు. మసాబానే ఆమె అందం, ఆనందం. ‘ఎదుగుతున్న వయసులో నా కూతురి కోసం నేను రెండు పనులు ఎప్పటికీ చేయకూడదు అని ఒట్టు పెట్టుకున్నాను. ఒకటి: ఆమె చదువు కోసం ‘ఎవరినీ డబ్బు సాయం అడగకూడదు.’ రెండు : తండ్రి (దగ్గర) లేని పిల్లగా ఆమె కోసం ‘ఎవరి ఎమోషనల్ సపోర్టూ తీసుకోకూడదు.’ ఈ రెండిటిపై గట్టిగా నిలబడ్డాను. మనం డబ్బు, సపోర్ట్ అడగం అని తెలిస్తే ఎవరైనా ధైర్యంగా మన దగ్గరకు వస్తారు. మనమూ అంతే.. ఎవరి దగ్గరకైనా ధైర్యంగా వెళ్లగలం అని ‘బ్రట్ ఇండియా’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కుషా కపిల్‌తో చెప్పారు నీనా గుప్తాకూతురు మాత్రమే కాదు, సింగిల్ మదర్‌గా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ రావటం కూడా నీనా అందానికి కారణం అయి ఉంటుంది -
నటి నీనాగుప్తా ఇష్టపడే రెసిపీలు ఇవే..!
బాలీవుడ్ నటి, దర్శకురాలు అయిన నీనా గుప్తా సినీ కెరీర్లో ఎన్నో విజయాలను అందుకుంది. మంచి నటిగా పేరుతెచ్చుకోవడమే గాక ఎన్నో అవార్డులు, పురస్కారాలను దక్కించుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటుంది. అలానే తాజాగా తనకిష్టమైన బ్రేక్‌ఫాస్ట్ గురించి షేర్ చేసుకుంది. ఇన్‌స్టాలో తనికష్టమైన పరాటా ఫోటోని షేర్ చేసింది. 'ఆలూ పనీర్ ప్యాజ్ పరాఠా' బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అని పేర్కొంది. అలాగే తనకిష్టమైన వివిధ అల్పాహారాల కూడా గురించి వెల్లడించింది. సౌత్ ఇండియన్ వంటకమైన ఊతప్పం అంటే మహా ఇష్టమని అన్నారు. కొబ్బరి చట్నీతో ఊతప్పం తింటుంటే ఆ రుచే వేరేలెవెల్ అని చెబుతున్నారు. అలాగే తనకు సుజీ (గోధుమ రవ్వ)తో చేసిన అట్లు అంటే మహా ఇష్టమని తెలిపింది. ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పుకొచ్చింది. దీన్ని రైతాతో తింటే టేస్ట్ మాములుగా ఉండదట.(చదవండి: అత్యంత స్పైసీ హాట్ సాస్..జస్ట్ మూడు నిమిషాల్లో..!) -
తెలుగులోకి మరో క్రేజీ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
థియేటర్లలో సినిమాలు వచ్చినట్లే.. ఓటీటీలో కొత్త కొత్త వెబ్ సిరీసులు కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. తెలుగులో స్ట్రెయిట్‌గా తీయనప్పటికీ.. ఇతర భాషల్లో తీసిన సిరీస్‌లని డబ్ చేసి మరీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలా ఇప్పుడు ఓ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)'1000 బేబీస్' పేరుతో తీసిన ఈ సిరీస్‌ని సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఓ పోలీస్ టీమ్ దేనికోసమే సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు అడవి మధ్యలో ఓ ఇంట్లో ముసలావిడ. ట్రైలర్లో పెద్దగా కథని రివీల్ చేయలేదు గానీ చూస్తుంటే ఇదేదో మంచి థ్రిల్లర్‌లా అనిపిస్తుంది.మలయాళంలో తీసినప్పటికీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ డబ్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అక్టోబరు 18న అంటే వచ్చే శుక్రవారం ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. మీరు ట్రైలర్‌పై ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!) -
డబ్బు కోసం ఏదిపడితే అది చేశా.. తర్వాతేమో దేవుడిని ప్రార్థించేదాన్ని: నటి
సినిమాల్లో కనిపించాలని కలలు కనడం బాగుంటుంది కానీ దాన్ని నిజం చేసుకునే క్రమంలో ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా అలవాటు లేని ప్రదేశానికి వెళ్లి.. అక్కడ అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. తాను కూడా కొత్తలో ముంబై నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని చెప్తోంది బాలీవుడ్ నటి నీనా గుప్తా.వెళ్లిపోదామనుకున్నా..తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాది ఢిల్లీ. సినిమా కోసం అక్కడి నుంచి ముంబైకి వచ్చాను. కానీ ఈ వాతావరణానికి అలవాటు పడలేక ఎన్నోసార్లు వెళ్లిపోవాలనుకున్నాను. ప్రతి మూడు నెలలకోసారి బ్యాగు సర్దుకునేదాన్ని. ముందు పీహెచ్డీ చేసి ఆ తర్వాత వచ్చేద్దాం అనుకునేదాన్ని. కానీ ఈ సిటీ మనల్ని వెళ్లనివ్వదు.దేవుడిని మొక్కేదాన్నిఅయితే మొదట్లో నాకు డబ్బు అవసరం చాలా ఉండేది. అందుకోసం నాకు నచ్చని పాత్రలు కూడా చేసేదాన్ని. తర్వాత ఆ సినిమాలు రిలీజవకూడదని దేవుడిని ప్రార్థించేదాన్ని. అప్పుడు దేనికీ నో చెప్పకపోయేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా తిరస్కరిస్తాను. నాకు నచ్చిన స్క్రిప్టునే ఎంచుకుంటాను. నచ్చనివాటిని ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పుకొచ్చింది. గ్లామర్ రోల్స్ చేయనుతనను రెబల్ స్టార్ అని పిలవడంపై స్పందిస్తూ.. ఎందుకు నన్ను రెబల్ అని పిలుస్తారో అర్థం కాదు. పైగా నేను చాలా అమాయక పాత్రలు పోషించాను. పెద్దగా గ్లామర్ పాత్రలు, శక్తివంతమైన రోల్స్ కూడా చేయలేదు. నేను సింగిల్ మదర్ అని మీడియానే నాకు రెబల్ అన్న ట్యాగ్ ఇచ్చింది. నేను పోయినప్పుడు కూడా బోల్డ్ నీనా గుప్తా ఇక లేరు అనే రాస్తారు. నేను చనిపోయినా కూడా అలాంటి ట్యాగులు అంటగట్టడం ఆపరు. సరే, ఇంక దాన్ని నేను ఏం చేయలేను అని నీనా గుప్తా తెలిపింది. కాగా ఈమె ముఖ్య పాత్రలో నటిస్తున్న పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 28 నుంచి ప్రసారం కానుంది. -
మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్
మసాబా గుప్తా ఫ్యాషన్ పరిశ్రమలో పెద్దగా పరిచయం అవసం లేదు. రెడ్ కార్పెట్ ఈవెంట్ల నుండి వివాహాలు , ఫోటోషూట్ల వరకు పాపులర్ డిజైనర్‌గా పాపులర్ అయింది. తన క్రియేటివిటీ అందర్నీ కట్టిపడేసింది. అంతేకాదు తన జీవిత కథ ఆధారంగా రూపొందించిన డాక్యు-సిరీస్ మసాబాతో నటిగా అవతరించింది. ఇటీవల నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. తాజాగా తాను తల్లికాబోతున్నానని ఇన్‌స్టా ద్వారా ప్రకటించింది. ‘‘మా జీవితాల్లోకి రెండు బుల్లి బుల్లి అడుగులు రాబోతున్నాయి.. మమ్మల్ని ఆశీర్వ దించండి, అలాగే మీ ప్రేమను, కొద్ది బనానా చిప్స్‌ను(plain salted ONLY)’’ అంటూ తాను తల్లికాబోతున్న విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. అంటే తనకు బనానా చిప్ప్ తినాలనిపిస్తోందని చెప్పకనే చెప్పింది. కొన్ని ఎమోజీలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా గతంలో మసాబా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. చెప్పినట్టే చేసిందంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) సింగిల్ పేరెంటింగ్ అనే కాన్సెప్ట్ మోడ్రన్‌గా ఉన్నా, పెళ్లి కాకుండానే బిడ్డను కనడం నార్మల్‌గా మారినా, , తాను అలా చేయకూడదనుకుంటున్నానని ఆమె వెల్లడించింది. ‘ఆధునిక మహిళగా పెళ్లి చేసుకుని బిడ్డనుకనే ధైర్యం ఉందా? అంటే .అస్సలు లేదు. ఎందుకంటే అంత ఒత్తిడిని తీసుకోవాలని లేదు. అలాంటి వాతావరణంలో బిడ్డను ఉంచాలని తాను భావించడం లేదని గతంలో ఒక ఇంటర్వ్యలో పేర్కొంది. పెళ్లి కాకుండా పుట్టిన తనకి చాలా మోడ్రన్ అనే ట్యాగ్ వేశారు. ఆధునికంగా ఉండటం చాలా అద్భుతమే కానీ తాము చాలా అవమానాల్ని ఎదుర్కొన్నామని గుర్తు చేసుకుంది. కాగా బాలీవుడ్ నటి, నీనా గుప్తా , వెస్ట్ ఇండియన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రేమ కథ అందరికి సుపరిచితమే.ఈ జంటకు ప్రేమ ఫలితమే మసాబా గుప్తా. అయితే పెళ్లికాకుండానే నీనా బిడ్డను కనడం అప్పట్లో పెద్ద సంచలనం. నీనా, రిచర్డ్స్‌ని పెళ్లి చేసుకోలేదు. కానీ ఒంటరిగానే తన కుమార్తె మసాబాను పెంచి పెద్ద చేసి ప్రయోజకురాల్ని చేసింది. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ నటి కూతురు..!
ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురిగా మసాబా గుప్తా అందరికీ సుపరిచితమే. ప్యాషన్ డిజైనర్ కెరీర్ ప్రారంభించిన ఆమె నటిగాను గుర్తింపు తెచ్చుకుంది. 2023లో రెండోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన మసాబా.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మీ అందరీ ఆశీర్వాదాలు కావాలంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ తారలు కరీనా కపూర్, షెహనాజ్ గిల్, కుషా కపిల, తాహిరా కశ్యప్, సారా టెండూల్కర్, బిపాసా బసు, పరిణీతి చోప్రా, అనన్య పాండే, కృతి సనన్ అభినందనలు తెలిపారు. కాగా.. మాసాబా గుప్తా, సత్యదీప్లు కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో వారి సన్నిహితులు, ఆమె తండ్రి మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. కాగా.. గతంలో టాలీవుడ్ నిర్మాత మధు మంతెనను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. సత్యదీప్ సైతం గతంలోనే అదితి రావు హైదరీని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఆదితిరావు హైదరీ- సిద్ధార్థ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ రెడీ.. అదిరిపోయే టైటిల్ ఫిక్స్
'ముచ్చటగా మూడోసారి కూడా భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం' అనే అంచనాల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. 'విశ్వనేత' పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి యువ ప్రతిభాశాలి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. 'వందే మీడియా ప్రయివేట్ లిమిటెడ్' పతాకంపై కాశిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో అభయ్ డియోల్, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో సెట్స్‌కు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆర్టికల్ 370 రద్దు, డిమోనిటైజేషన్, జీ.ఎస్.టీ, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సంచలనాలతో కోట్లాది భారతీయుల గుండెల్లో కొలువుదీరి.. "యూనిఫామ్ సివిల్ కోడ్" అమలు దిశగా అడుగులు వేస్తున్న నరేంద్రుడి బయోపిక్‌లో చాయ్ వాలా స్థాయి నుంచి "విశ్వనేత" గా ఎదిగిన ఆయన మహాప్రస్థానానికి దృశ్యరూపం ఇవ్వనున్నామని సినిమా యూనిట్ చెబుతోంది!! -
'తప్పుడు మనుషులతో డేటింగ్ చేశా.. కూతురికి పెళ్లి చేయడం నా తప్పే'
పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు.. కానీ ఇప్పుడు పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలకడగా ఉండట్లేదు. కొంతకాలానికే విడాకులు ఇచ్చేసుకుంటున్నారు. కొందరైతే పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చుకోవడం దేనికని.. సహజీవనానికి జై కొడుతున్నారు. ఈ రెండు రకాల పరిస్థితులు బాలీవుడ్ నటి నీనా గుప్తాకు ఎదురయ్యాయి. నీనా గుప్తా.. భార్యాబిడ్డలున్న క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రేమించింది. వీరి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా పుట్టింది. వీరి బంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేకప్ అయింది. సింగిల్ పేరెంట్‌గా మసాబాను పెంచి పెద్ద చేసింది నీనా. ఆ తర్వాత 2008లో వివేక్ మెహ్రాను పెళ్లాడింది. సలహాలివ్వడానికి నేను కరెక్ట్ కాదు మసాబా 2015లో నిర్మాత మధు మంతెనను పెళ్లాడగా 2019లో విడాకులు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 27న నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది మసాబా. ఇతడికి కూడా ఇది రెండో పెళ్లే.. సత్యదీప్ గతంలో హీరోయిన్ అదితి రావును పెళ్లాడి, తర్వాత ఆమెకు విడాకులిచ్చేశాడు. అయితే మసాబా మొదటి పెళ్లి ఆమె తల్లి బలవంతం మీదే జరిగిందట. ఈ విషయాన్ని తాజాగా నీనా గుప్తా వెల్లడించింది. 'రిలేషన్షిప్ గురించి సలహాలివ్వడానికి నేను సరైన వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను ఎప్పుడూ తప్పుడు మనుషులతోనే డేటింగ్ చేశాను. కాబట్టి నేను మంచి సలహాలివ్వలేను. అయితే మసాబా విషయంలో మాత్రం ఓ పొరపాటు చేశాను. పెళ్లి చేసి తప్పు చేశా తను మొదట పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కాబోయే భర్తతో సహజీవనం చేయాలనుకుంది. అందుకు నేను ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకున్నాకే తనతో కలిసి ఉండాలని చెప్పాను. అదే నేను చేసిన తప్పు. పెళ్లయిన కొంతకాలానికి వారు విడాకులు తీసుకున్నారు. అప్పుడు నేను కుంగిపోయాను, జీర్ణించుకోలేకపోయాను. వాళ్ల జంటను చూసి మేము ముచ్చటపడేవాళ్లం. ఇప్పటికీ నా మాజీ అల్లుడి మీద నాకు అభిమానం ఉంది. విడాకుల వార్త చెప్పగానే నోట మాట రాలేదు. కానీ అది వారి జీవితం.. కాబట్టి నేను ఏమీ చేయలేకపోయాను' అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా. చదవండి: రైతు బిడ్డ సహా ఏడుగురు నామినేషన్స్‌లో.. ఆ ఒక్కరు మాత్రం సేఫ్! -
నవ్వించడంతో పాటు థ్రిల్ చేస్తానంటున్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ నవ్వించడానికి, థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు. ఆమెతో పాటు నీనా గుప్తా కూడా చేతులు కలిపారు. ఈ ఇద్దరూ కలిసి చేసే కామెడీ, థ్రిల్‌ని వచ్చే ఏడాది వెండితెరపై చూడొచ్చు. రకుల్, నీనా గుప్తా లీడ్ రోల్స్‌లో ఓ చిత్రం రూపొందనుంది. కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు ఆశిష్ ఆర్. శుక్లా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ కేతర్పాల్ నిర్మించనున్నారు. రకుల్ ఓ లీడ్ రోల్లో నటించిన ‘ఐ లవ్ యు’కి కూడా కేతర్పాల్నే నిర్మాత. ఈ ఏడాది జూన్‌లో ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. అయితే తాజా చిత్రాన్ని మాత్రం థియేటర్స్‌లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ని అక్టోబర్‌లో ఆరంభించి, డిసెంబర్‌కల్లా పూర్తి చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం విడుదలయ్యే చాన్స్ ఉంది. -
భయం వద్దు మిత్రమా... కూల్‌గా తినుమా! సీనియర్ నటి సలహాలు
డైనింగ్ ఎటికేట్లో భాగంగా కొన్ని రెస్టారెంట్లలో, ఫంక్షన్లలో ఫోర్క్, నైఫ్‌లతో తినడం తప్పనిసరి అవుతుంది. అయితే అది అందరికీ సులభం కాకపోవచ్చు. పొరపాట్లు దొర్లవచ్చు. ఎవరైనా గమనిస్తున్నారేమో... అనే ఆలోచనతో కూడా భోజనాన్ని సరిగ్గా తినలేకపోవచ్చు. ‘ఇదంతా ఎందుకు... ఫోర్క్, నైఫ్‌లతో సరిౖయెన పద్ధతిలో ఎలా తినాలో నేర్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అంటూ ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ట్యుటోరియల్ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఫోర్క్, నైఫ్‌లతో ఎలా తినాలో చూపించింది నీనా గుప్తా. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లితే... ఒకప్పుడు నీనా కూడా ఫోర్క్, నైఫ్‌లతో తినడం రాక చాలా ఇబ్బంది పడేది. దీంతో పట్టుదలగా తినే పద్ధతిని నేర్చుకుంది. ‘నాకైతే చేతులతో తినడమే ఇష్టం’ అని నీనా గుప్తా చెప్పడం కొసమెరుపు. -
'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)
టైటిల్: లస్ట్ స్టోరీస్ 2 నటీనటులు: తమన్నా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకుర్, కాజోల్ తదితరులు నిర్మాణ సంస్థ: RSVP & ఫ్లయింగ్ యూనికార్న్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాత: ఆషీ దువా, రోనీ స్క్రూవాలా దర్శకత్వం: ఆర్. బాల్కీ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్, కొంకణ్ సేన్ శర్మ సినిమాటోగ్రఫీ: ఆనంద్ బన్సాల్ ఎడిటర్: సన్యుక్త కజా ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ విడుదల తేదీ: 29 జూన్ 2023 ఓటీటీలు వచ్చిన కొత్తలో 'లస్ట్ స్టోరీస్' ఓ సెన్సేషన్. ఎంతలా అంటే ఈ ఆంథాలజీ దెబ్బకు కియారా అడ్వాణీ తెగ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'లస్ట్ స్టోరీస్ 2' తీసుకొచ్చారు. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్ లో తమన్నా చేస్తున్న హడావుడి, ట్రైలర్లో ఆమె సీన్స్ వల్ల.. ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం... అంచనాల్ని అందుకుందా? ఫస్ట్ పార్ట్ కంటే మెప్పించిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) కథేంటి? ఇందులో నాలుగు కథలుంటాయి. మొదట దానిలో వేద(మృణాల్ ఠాకుర్), అర్జున్ (అంగద్ బేడీ) పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లి పనుల్లో పెద్దలు బిజీగా ఉంటారు. వేద బామ్మ (నీనా గుప్తా) మాత్రం.. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనాలని వేద, అర్జున్ కి సలహా ఇస్తుంది. రెండో దానిలో ఇషిత (తిలోత్తమ షోమీ) ముంబయిలో జాబ్ చేస్తూ ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుంది. ఓ రోజు కాస్త త్వరగా ఇంటికొచ్చేసరికి.. తన బెడ్ పై పనిమనిషి సీమ(అమృత సుభాష్) తన భర్తతో కలిసి బెడ్ పై శృంగారంలో బిజీగా ఉంటుంది. మూడో దానిలో విజయ్ చౌహాన్ (విజయ్ వర్మ)కు మహిళలంటే తెగ మోజు. ఓ రోజు లవర్ తో వీడియో కాల్ మాట్లాడుతూ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. దగ్గరలోని ఓ ఊరికి వెళ్తే అక్కడ తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా) కనిపిస్తుంది. నాలుగో దానిలో బిజోక్పుర్ అనే ఊరిలో రాజకుటుంబీకుడు (కుముద్ మిశ్రా).. భార్య దేవయాని(కాజోల్), కొడుకు అంకుర్ (జీషాన్ నదఫ్)తో కలిసి జీవిస్తుంటాడు. ఈయన కూడా ఆడవాళ్లని చూస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. ఈ నాలుగు స్టోరీల్లోనూ చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? బామ్మ.. పెళ్లీడుకు వచ్చిన తన మనవరాలిని దగ్గర కూర్చోబెట్టుకుని, శృంగారం గురించి చాలా ఓపెన్ గా చెబుతుంటుంది. 'మీ తాతగారిని దేవుడు తీసుకెళ్లిపోయాడు. లేకపోయింటే ఈ గది తలుపులకు ఈ పాటికే గొళ్లెం పెట్టి ఉండేవి' అని అంటుంది. ఈ సీన్ లో ఆ మనవరాలు నవ్వుతూ ఉంటుంది గానీ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. బోల్డ్నెస్ లో మరీ హద్దులు దాటేశారు బాబోయ్ అనిపిస్తుంది. ఇదే కాదు 'లస్ట్ స్టోరీస్ 2'లో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' టైటిల్ తో తీసిన తొలి స్టోరీలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకుర్ నటించింది. పెళ్లికి ముందు శృంగారం అనే షాకింగ్ కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించారు. ఇది నిజంగా భారతీయ సంస్కృతిలో వర్కౌట్ కాదు. ఈ ఎపిసోడ్ అంతా బామ్మ పాత్ర చుట్టూనే ఉంటుంది. ఆమె మాటలు విన్న అర్జున్, వేద ఏం చేశారనేది స్టోరీ. చాలా సింపుల్, ఫ్లాట్ గా దీన్ని తీశారు. యూత్ ని ఆకట్టుకోవడం తప్పితే పెద్దగా ఏం లేదు. 'ద మిర్రర్' పేరుతో తీసిన రెండో స్టోరీ ఓ శృంగార నవల చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో చూపించిన పాయింట్.. ప్రస్తుతం సమాజంలో ఒంటరి మహిళలు లేదా అమ్మాయిల జీవితాలని ప్రతిబింబించేలా అనిపిస్తుంది! ఇందులో పదేపదే 'ఆ' సీన్సే చూపిస్తుంటారు. దీని వల్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. నిడివి కూడా కాస్త ఎక్కువే. అసలు విషయం బయటపడిన తర్వాత మనుషుల మనస్తత్వాలు ఎలా మారిపోతాయి అనే పాయింట్ కూడా ఇందులో చూపించారు. (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) 'సె*క్స్ విత్ ఎక్స్' పేరుతో తీసిన మూడో స్టోరీలో రియల్ లైఫ్ కపుల్ తమన్నా, విజయ్ వర్మ జంటగా కనిపించారు. ఈ ఎపిసోడ్ మొదటంతా రొమాంటిక్ వేలో వెళ్తుంది. చివరకొచ్చేసరికి మిస్టరీ తరహాలో మారిపోతుంది. తమన్నా అయితే రెచ్చిపోయి మరీ అలాంటి సీన్స్ చేసింది. యూత్ ని టార్గెట్ చేయడం కోసం ఈ ఎపిసోడ్ లో ముద్దు, శృంగారం సన్నివేశాల గాఢత పెంచిన ఫీలింగ్ కలుగుతుంది. చివరి సీన్ మాత్రం మనల్ని అవాక్కయ్యేలా చేస్తుంది. 'టిల్చట్టా(బొద్దింక)' పేరుతో నాలుగో ఎపిసోడ్.. పైవాటితో పోలిస్తే చాలా నిదానంగా సాగుతుంది. చివరి సీన్ కి వస్తే గానీ అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాదు. క్లైమాక్స్ పాయింట్ బాగున్నప్పటికీ.. దానికోసం ఎపిసోడ్ ని అరగంటపాటు సాగదీయడం బోర్ కొట్టిస్తుంది. ఇందులో కాజోల్ లాంటి స్టార్ యాక్టర్ ఉన్నప్పటికీ ఆమె పాత్రని సరిగా డిజైన్ చేయలేదు. మొత్తంగా చూసుకుంటే 'లస్ట్ స్టోరీస్' చిత్రంలో విభిన్న వ్యక్తుల భావోద్వేగాలని చూపిస్తే... ఇప్పుడీ సీక్వెల్ లో శృంగారమే ప్రధానం అన్నట్లు తీశారు. కథ కన్నా 'కామం' అనే పాయింట్ నే హైలెట్ చేశారు. దీంతో ఇది సినిమాలా కాకుండా ఓటీటీ కోసం తీసిన సెమీ బూతు చిత్రంలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు.. ఈ ఆంథాలజీ చిత్రాన్ని పొరపాటున కూడా ఓపెన్ చేయొద్దు. ఎవరెలా చేశారు? మృణాల్ ఠాకుర్.. డిఫరెంట్ గా కనిపించింది. తిలోత్తమ షోమీ కూడా ఉన్నంతలో పర్లేదు. తమన్నా, విజయ్ వర్మ అయితే రెచ్చిపోయి నటించారు. ముద్దు, శృంగారం సన్నివేశాల్లో హద్దులు దాటేశారు. కాజోల్ తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. సీనియర్ నటి నీనా గుప్తా అయితే ప్రతిఒక్కరినీ తన యాక్టింగ్, డైలాగ్స్ తో ఆశ్చర్యపరిచింది. చెప్పాలంటే ఈమె రోల్ అందరికీ పెద్ద షాక్. టెక్నికల్ గా నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ.. స్టోరీ, మిగతా విషయాల్లో దర్శకనిర్మాతలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. -చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ) -
మొదటి ముద్దు.. డెటాల్‌తో నోరు కడుక్కున్నా: ప్రముఖ నటి
పలువురు లేడీ యాక్టర్స్.. కొన్ని విషయాలు బయటపెట్టడానికి అస్సలు మొహమాటపడట్లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పేస్తున్నారు. బాలీవుడ్ నటి నీనా గుప్తా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ తెగ పాపులర్ అవుతోంది. కొన్నిరోజుల ముందు యువతని ఉద్దేశించి బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడేమో తన తొలిముద్దు అనుభవం గురించి షేర్ చేసుకుని, అందరికీ షాకిచ్చింది. అసలు అప్పుడు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు బయటపెట్టింది. రాత్రంతా నిద్రపోలే..! 'ఓ యాక్టర్ గా మనం అన్ని రకాల సీన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బురదలో దిగాలి. మరికొన్నిసార్లు ఎండలో గంటల తరబడి నిలబడాలి. సరే ఇది పక్కనబెడితే చాలా ఏళ్ల క్రితం దిలీప్ ధావన్ తో కలిసి నేను ఓ సీరియల్ చేశాను. మనదేశ చరిత్రలోనే అదే తొలిసారి ఓ సీరియల్ లో కిస్ సీన్ ఉండటం. అందులో నటించిన తర్వాత రాత్రంతా నాకు నిద్రపట్టలేదు' అని నీనా గుప్తా చెప్పింది. (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) డెటాల్ తో కడుక్కున్నా! 'అతడు(దిలీప్ ధావన్) చూడటానికి బాగానే ఉంటాడు. కానీ అలాంటి పరిస్థితిలో అదేం గుర్తుకురాదు. ఆ సీన్ జరిగే సమయానికి మానసికంగా నేను రెడీగా లేను. చాలా టెన్షన్ వచ్చేసింది. కానీ నాకు నేను చెప్పుకొని ఆ ముద్దు సన్నివేశాన్ని పూర్తిచేశాను. కొందరు నటులు కామెడీ చేయలేరు. కొందరు కెమెరా ముందు ఏడవలేరు. నేను మాత్రం చేసేయాలి అని అనుకుని ఆ సీన్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మాత్రం డెటాల్ తో నోరు బాగా కడుక్కున్నాను. తెలియని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఏదేమైనా చాలా కష్టం' అని నీనా అన్నారు. సీక్వెల్లో బామ్మగా! 2018లో విడుదలైన 'లస్ట్ స్టోరీస్' ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. శృంగారం, దానికి సంబంధించిన చాలా విషయాల్ని ఓపెన్ గా మాట్లాడుకోవడం, చూపించడం లాంటివి అప్పట్లో ప్రేక్షకుల్ని నోటమాట రానీయకుండా చేశాయి. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా 'లస్ట్ స్టోరీస్ 2'ని సిద్ధం చేశారు. జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ పాత్రకు బామ్మగా నీనా గుప్తా నటించింది. 'పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్‌కి వెళ్లండి' లాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పి ఓరి బాబోయ్ అనుకునేలా చేసింది. ఇప్పుడు ఈమెనే తన తొలి ముద్దు గురించి బయటపెట్టి షాకిచ్చింది. (ఇదీ చదవండి: నిధి అగర్వాల్‌కు కొత్త కష్టాలు.. అన్నీ ఉన్నాసరే!) -
యూత్‌ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసిన నటి
నీనా గుప్తా, కాజోల్, మృణాల్ ఠాకూర్, తమన్నా,విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లస్ట్ స్టోరీస్-2. ఈ వెబ్ సీరిస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సీరిస్‌లో నీనా గుప్తా 'డాడీ మా' రోల్లో నటించింది. కొన్నాళ్లుగా సినిమాల్లో వయసుకు తగిన పాత్రలు రాకపోవడంతో ఆమె దూరంగానే ఉంటూ వచ్చింది. లస్ట్ స్టోరీస్- 2తో నీనా గుప్తా తిరిగి టెలివిజన్ స్క్రీన్లలోకి వచ్చింది. ఈ సీరిస్ ట్రైలర్లో శృంగార సన్నివేశాలతో పాటు బోల్డ్ సంభాషణలు ఉన్నాయి. ఇదే విషయంపై తాజాగా ఆమె పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. (ఇదీ చదవండి: మద్యం తాగుతారా? నెటిజన్ ప్రశ్నకు శ్రుతీహాసన్ సమాధానమిదే!) శృంగారం గురించి యువత తెలుసుకోవడం చాలా ముఖ్యమైనదని నీనా చెప్పింది. కాలేజీకి వెళ్లే రోజుల్లో అమ్మాయిలు ముద్దులు పెట్టుకోవడం ద్వారా గర్భం దాల్చుతారని అప్పట్లో నమ్మేదానినని నీనా తెలిపింది. తన మదర్ ఎంతో స్ట్రిక్ట్ అంటూ తన గతానికి సంబంధించిన కొన్ని అనుభవాలను ఇలా పంచుకుంది. 'నాకు పన్నెండు, పదమూడు సంవత్సరాలు వచ్చే వరకు కూడా.. నా తల్లిదండ్రులు ప్రత్యేక బెడ్రూమ్లో పడుకోలేదు. మేము అందరం ఒకే గదిలో పడుకునేవాళ్లం. నేను, నా సోదరుడు మంచం ప్రక్కన క్రింద పడుకునేవాళ్లం. కానీ కొన్నిసార్లు నేను నా తల్లిదండ్రుల మధ్య పడుకుంటాను. అప్పటికి మాకు శృంగారం గురించి ఏమీ తెలియదు. మా అమ్మ నాకు శృంగార అంటే ఏమిటో చెప్పలేదు, పీరియడ్స్ అంటే ఏమిటో కూడా చెప్పలేదు. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మా అమ్మ ఎంత కఠినంగా ఉండేదంటే, నన్ను నా స్నేహితురాళ్లతో కలిసి సినిమా చూడటానికి కూడా వెళ్లనివ్వదు.' 'నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ముద్దు పెట్టుకోవడం ద్వారా గర్భవతి అవుతారని నమ్మేదాన్ని. అప్పట్లో ఇలాంటి విషయాలు తల్లులు కూడా తమ కుమార్తెలతో చెప్పడానికి భయపడతారు. పూర్వ కాలంలో, పెళ్లికి ముందు శృంగారంపై అమ్మాయికి కొంత సమాచారం ఇచ్చేవారు. ఎందుకంటే.. పెళ్లి తర్వాత మొదటి రాత్రి ఏం జరుగుతుందో చెప్పేవారు. ఆ సమయంలో అబ్బాయితో ఎలా ఉండాలో చెప్పేవారు. ఇలా ఎందుకు చేసేవారంటే? శృంగారం విషయంలో కొత్తజంట మధ్య గొడవలు రాకూడదని.. శృంగారం కోసం భర్త అడిగినప్పుడు అమ్మాయి 'కర్తవ్యం' ఎలా నెరవేర్చాలో అప్పటి తల్లులు చెప్పేవారు.' అని నీనా గుప్తా అన్నారు. (ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి) ఇది నేటికీ కొన్నిచోట్ల జరిగే విషయమేనని, పరిస్థితులు పెద్దగా మారలేదని ఆమె అన్నారు. అందుకే ఇలాంటి విషయాలకు లస్ట్ స్టోరీస్- 2 ముఖ్యమైనదని తెలిపింది. ఈ సీరిస్‌లో శృంగార సన్నివేశాలు ఉంటాయి. తప్పేముంది? మనిషి జీవితంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయాన్నే ఒక సినిమా ద్వారా తెలుపుతున్నామని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా ఎంతగానో తోడ్పడుతుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొంది. View this post on Instagram A post shared by Neena Gupta (@neena_gupta) -
Lust Stories 2 teaser: కారు కొనడానికేమో టెస్ట్ డ్రైవ్, మరీ పెళ్లికి ..?
నీనా గుప్తా, కాజోల్, మృణాల్ ఠాకూర్, తమన్నా, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం లస్ట్ స్టోరీస్-2. ఈ మూవీకి అమిత్ రవీందర్నాథ్ శర్మ, కొంకణ సెన్ శర్మ, ఆర్ బాల్కీ, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. (ఇది చదవండి: చిన్న సూట్‌కేసుతో ముంబై వచ్చా.. చేతిలో డబ్బుల్లేక: నటి) ఈ చిత్రంలో సీనియర్ నటి నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటించారు. టీజర్ ప్రారంభంలో నీనా గుప్తా మాటలు టీజర్‌పై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఒక కారు కొనడానికి ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తాం.. మరీ పెళ్లికి ముందు ఇలాగే చేయకూడదా అని అడిగింది. నీనా మాటలకు కాజోల్ నవ్వుతూ కనిపించింది. కాగా.. ఈ చిత్రంలో అంగద్‌కు జోడీగా మృణాల్, విజయ్ వర్మకు జంటగా తమన్నా నటిస్తున్నారు. ఈ టీజర్లో విజయ్, తమన్నా కూడా రొమాంటిక్‌గా కనిపించారు. కాగా.. విశాల్ భరద్వాజ్ వెబ్ సిరీస్ చార్లీ చోప్రా & ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీలో కూడా నీనా నటిస్తున్నారు. కాజోల్ కూడా ది గుడ్ వైఫ్ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. (ఇది చదవండి: లలితా జ్యువెలరీలో దోపిడి, చివరకు ఎయిడ్స్‌తో.. ఆ దొంగ కథే జపాన్?) Love or lust… you decide. #LustStories2 Coming soon, only on @NetflixIndia! 🤩 #LustStories2OnNetflix#RBalki @konkonas @sujoy_g @iAmitRSharma @Neenagupta001 @mrunal0801 @Imangadbedi @TillotamaShome @AmrutaSubhash @itsKajolD #KumudMishra @RSVPMovies… pic.twitter.com/bo7tq7R3kr — Tamannaah Bhatia (@tamannaahspeaks) June 6, 2023 -
గర్భంతో ఉన్న నటిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన దర్శకుడు!
ప్రముఖ దర్శకుడు సతీశ్ కౌశిక్ మరణంతో బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. హోలీ వేడుకల్లోనూ సంతోషంగా పాల్గొన్న ఆయన బుధవారం గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్తను అభిమానులు, సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నటి నీనా గుప్తా సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించింది. 'బాధాకరమైన వార్తతో నిద్రలేచాను. ఈ ప్రపంచంలో నన్ను నాన్సీ అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే! నేను తనను కౌశిఖాన్ అని పిలిచేదాన్ని. మా స్నేహం కాలేజీలో మొదలైంది, మేము తరచూ కలుసుకునేవాళ్లం. కానీ ఇప్పుడాయన లేరు. ఇది నన్నెంతో భయానికి గురి చేస్తోంది. అదే సమయంలో బాధిస్తోంది కూడా! తన భార్యాపిల్లలు శశి, వంశికలకు ఇదెంతో కష్టకాలం. వారికి ఏ అవసరం వచ్చి నేనెప్పుడూ అండగా ఉంటాను. ఆ భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చింది. కాగా గతంలో సతీశ్.. నీనాను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని నీనా తన ఆత్మకథ 'సచ్ కహో తో'లో రాసుకొచ్చింది. నీనా గర్భంతో ఉన్న సమయంలో సతీశ్ ఆమెకు ఎంతగానో అండగా నిలబడ్డారు. 'ఒకవేళ పుట్టబోయే పాప ఛామనచాయతో ఉంటే అది నా బిడ్డే అని చెప్పు. మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు నిన్నెవరూ అనుమానించరు' అని సతీశ్ చెప్పినట్లు పుస్తకంలో రాసుకొచ్చింది నీనా. ఇకపోతే సతీశ్ చివరగా ఎమర్జెన్సీ అనే చిత్రంలో కనిపించారు. View this post on Instagram A post shared by Neena Gupta (@neena_gupta) -
సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న నటి, ఫోటోలు వైరల్
నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా సీక్రెట్‌గా పెళ్లిపీటలెక్కింది. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లాడింది. తన సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేసి అభిమాలను సర్ప్రైజ్ చేసింది. శాంతస్వరూపుడైన సత్యదీప్‌తో నా వివాహం జరిగింది. లెక్కలేనంత ప్రేమ, శాంతి, సంతోషం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ క్యాప్షన్ ఎంచుకోవడానికి అనుమతించినందుకు థ్యాంక్స్.. ఎందుకంటే ఇది చాలా బాగుంది అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దీనికి పెళ్లి ఫోటోలను జత చేసింది. ఇందులో మసాబా లైట్ పింక్ కలర్ కుర్తాలో మెరిసిపోతోంది. ఇక ఈ పోస్టుపై సెలబ్రిటీలు స్పందిస్తూ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విక్కీ కౌశల్, సోహా అలీ ఖాన్, శిబానీ దండేకర్ సహా పలువురు కంగ్రాచ్యులేషన్ చెప్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా బాలీవుడ్ ప్రముఖ నటి నీనా గుప్తా- క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ కూతురే మసాబా. సక్సెస్ఫుల్ డిజైనర్‌గా కొనసాగుతున్న ఆమె మసాబా 1,2 సీజన్స్‌తో పాటు మోడ్రన్ లవ్ ముంబై సిరీస్‌లోనూ నటించింది. గతంలో నిర్మాత మధు మంటేనాను పెళ్లాడిన ఆమె 2019లో అతడికి విడాకులు ఇచ్చింది. సత్యదీప్ మిశ్రా విషయానికి వస్తే.. అతడు నో వన్ కిల్ల్డ్ జెస్సికా సినిమాతో 2011లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. లా పూర్తి చేసిన అతడు కార్పొరేట్ లాయర్గానూ పని చేశాడు. ఇటీవలే ఆయన విక్రమ్ వేదాలో సీనియర్ ఇన్స్పెక్టర్గా, స్పైలో ముక్బీర్గా నటించాడు. ప్రస్తుతం ఆయన నటించిన తానవ్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీగా ఉంది. గతంలో ఇతడు హీరోయిన్ అదితి రావును పెళ్లాడాడు. కానీ వీరిద్దరి మధ్య పొరపచ్చాలు రావడంతో 2013లో విడిపోయారు. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Bollywood News & Updates (@bollywoodcouch) చదవండి: మాస్ మహారాజ రవితేజ ఇల్లు ఎన్ని కోట్లో తెలుసా? మూడు రోజుల్లో మూడు వందల కోట్లు... షారుక్ రికార్డు -
Neena Gupta: అందమైన అంకెల లోకంలో అపురూప విజేత ఆమె
National Mathematics Day 2022: చిన్నప్పుడు బొమ్మలతో కాదు లెక్కలతో ఆడుకుంది నీనాగుప్తా. జటిలమైన గణిత సమస్యల పరిష్కారంలో తనదైన ప్రతిభ చూపి యువతరానికి ఆదర్శంగా నిలుస్తుంది. ‘గణితంలో నైపుణ్యం సాధించడానికి ఒక జీవితకాలం చాలదు’ అంటున్న నీనాగుప్తా గణితంపై ఆసక్తి, పరిశోధనలనే తన జీవనవిధానంగా మార్చుకుంది... చాలామంది పిల్లల మాదిరిగా చిన్నప్పుడు లెక్కలు అంటే భయపడేది కాదు నీనాగుప్తా. లెక్కలతోనే ఆడుకునేది. పాడుకునేది. తల్లిదండ్రులకు గణితం అంటే ఇష్టం. నీనాకు చిన్నవయసులోనే గణితంలో మెలకువలు నేర్పించి, ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టమయ్యేలా చేశారు. స్కూల్లో మ్యాథ్స్‌లో ఎప్పుడూ తానే మొదటి స్థానంలో నిలిచేది. గణితశాస్త్రవేత్త ఆస్కార్ జరిస్కి లెక్క ఒకటి 65 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉంది. ఈ సమస్యను పరిష్కరించి 2014లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డ్ అందుకుంది నీనా. 2019లో ‘శాంతిస్వరూప్ భట్నాగర్’ అవార్డ్ అందుకుంది. గత సంవత్సరం అత్యున్నత పురస్కారం అయిన ‘రామానుజన్ ప్రైజ్’ కు ఎంపికైంది. ‘నీనాగుప్తా పరిశోధనలు బీజగణితానికి సంబంధించి ఆమె నైపుణ్యానికి అద్దం పడతాయి. భావితరాలకు ఉపయోగపడతాయి’ అని గుప్తాను కొనియాడింది రామానుజన్ అవార్డ్ కమిటీ. ‘మ్యాథ్స్‌లో ఒక సవాలు మనకు స్వాగతం పలుకుతుంది. ఆ సవాలును స్వీకరించి విజయం సాధించినప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది’ అంటుంది నీనా. ‘చదివించింది చాలు. పెద్ద చదువులు ఎందుకు’ అని నీనా గురించి ఇరుగు,పొరుగు మాటలను తల్లి లెక్క చేయలేదు. కూతురుకు అన్ని విధాలుగా అండగా నిలబడింది. ‘ఒక మహిళకు మరో మహిళ అండగా ఉంటే, ధైర్యం ఇస్తే ఎన్నో విజయాలు సాధించవచ్చు’ అని తల్లిని ఉద్దేశించి అంటుంది నీనా. ‘నీనా పనితీరును పదిహేను సంవత్సరాలుగా గమనిస్తున్నాను. ఎప్పటికప్పుడు తన ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకుంటూనే ఉంది. ఆమెకు గణితమే ప్రపంచం’ అన్నారు ఐఎస్ఐ, కోల్‌కతా ప్రొఫెసర్ అమర్త్య కుమార్ గుప్తా. ‘అభిరుచిగా మొదలైన గణితం ఇప్పుడు నా జీవనవిధానంగా మారింది’ అంటున్న 38 సంవత్సరాల నీనాగుప్తా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ), కోల్‌కతాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుంది. తాజాగా ఫోర్బ్స్ ఇండియా ఉమెన్–పవర్ (సెల్ఫ్‌మేడ్ ఉమెన్–2022) జాబితాలో చోటు సంపాదించింది. ‘ఈ గుర్తింపు నా బాధ్యతను మరింత పెంచింది’ అంటున్న నీనాగుప్తా గణింతపై భయాలను తొలిగించి, అందరికీ చేరువ చేయడానికి అవసరమైన భవిష్యత్ ప్రణాళికకు రూపకల్పన చేసుకుంది. చదవండి: క్రిస్మస్ వేళ.. మమ్మీ.. శాంటా ఏమిచ్చాడో చూడు.. Sudheera Valluri: మన వృత్తే మన గుర్తింపు -
నా కూతుర్ని సినిమాల్లోకి రానివ్వలేదు: బాలీవుడ్ నటి
మసాబా గుప్తా.. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న ఈమె మసాబా మసాబా, మోడర్న్ లవ్ ముంబై అనే వెబ్ సిరీస్‌లలో నటించింది. తల్లి నీనా గుప్తా బాలీవుడ్లో పేరు మోసిన నటి. తండ్రి రిచర్డ్స్ వెస్టిండీస్.. వీరికి గుర్తుగా జన్మించిన కూతురే మసాబా. అయితే రిచర్డ్ తనను పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పడంతో సింగిల్ పేరెంట్‌గానే మసాబాను పెంచి పెద్ద చేసింది నీనా. కానీ మసాబాను సినిమాల్లోకి రానివ్వలేదని అందుకు క్షమాపణలు కోరుతున్నానంటూ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'మసాబా మసాబా మొదటి సీజన్ చూసినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపోయా. నిజానికి మసాబాను నేను ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేదాన్ని, అందువల్ల ఆమె బాధపడేది కూడా! కానీ తల్లిగా నేను చేయాల్సింది అదే.. కానీ ఆ సిరీస్ చూశాక ఆమె టాలెంట్‌కు అబ్బురపడ్డా. మొదట్లో తనను సినిమాల్లోకి రానివ్వలేదు.. అందుకు క్షమించమని కోరుతున్నా. నటిగా తనేంటో నిరూపించుకునే సత్తా ఆమెకుంది. తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ సిస్టమ్‌లా ఉండాలి. వారి సమస్యలను పేరెంట్స్ దగ్గర చెప్పుకునేలా ఉండాలి. ఇప్పుడు మసాబా నాతో మాట్లాడినట్లుగా నేను మా అమ్మతో మాట్లాడలేదు. పరిస్థితులు మారుతున్నాయి. కానీ చిన్నకుటుంబంలో మన సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. అవి మనలోనే నలిగిపోయి కొన్నిసార్లు భయానక పరిస్థితులను సృష్టిస్తాయి' అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా. కాగా మసాబా మసాబా సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: దుస్తులు లేకుండా రణ్వీర్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కిడ్నీ ఫెయిలై మహాభారత్ నటుడు మృతి -
ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తరచుగా ట్రోలింగ్‌కు గురవతున్నారు. కొందరు విచిత్రమైన చేష్టలతో అభాసుపాలైతే మరికొందరు ఏం చేయకుండానే ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ట్రోలింగ్ బారిన పడింది. అయితే ఆమె ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి నోరు మూయించింది. మసాబా గుప్తా ఇటీవల తన పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్ 'నువ్ అంత అందంగా లేవు. ఘోరంగా ఉన్నావ్. ఈ ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ (సినిమా) రంగంలో నువ్ ఎలా ఉన్నావ్' అంటూ వ్యంగంగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ షేర్ చేస్తూ ''ఇది అందమైనది. కేవలం ప్రతిభ వల్లే ఏ పరిశ్రమలోనైనా నిలదొక్కుకోగలరనే విషయాన్ని నీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అమితమైన హార్డ్ వర్క్, భయంకరమైన క్రమశిక్షణ వల్లే అది సాధ్యం. ఇక నా ముఖం విషయానికొస్తే అది నాకొక బోనస్. (నా మైండ్, మనస్సు ఒక పదునైనా కత్తిలాంటింది. నువ్ ఎంత ప్రయత్నించినా నీ చెత్త మాటలు అందులోకి వెళ్లలేవు)'' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మసాబా గుప్తా. చదవండి: 'అవును, ఆ రూమర్ నిజమే' అంటున్న రష్మిక.. అతడితో.. ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు.. హీరోయిన్ పారితోషికంపై చర్చ ! మసాబా గుప్తా ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'మోడ్రన్ లవ్ ముంబై'లో నటించింది. అలాగే ఆమె తల్లి నీనా గుప్తాతో కలిసి నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'మసాబా మసాబా'లో కూడా యాక్ట్ చేసింది. ఈ సిరీస్‌ను మసాబా గుప్తా, ఆమె తల్లి, నటి నీనా గుప్తా జీవితాల నుంచి స్ఫూర్తిగా తీసుకుని సెమీ ఫిక్షన్‌గా తెరకెక్కించారు. త్వరలో ఈ సిరీస్‌కు రెండో సీజన్ కూడా రానుంది. 'ఎమ్‌టీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్' రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది మసాబా గుప్తా. కాగా మసాబా గుప్తా.. నీనా గుప్తా, క్రికెటర్ వివ్ రిచర్డ్‌ల సంతానం. తర్వాత నీనా గుప్తా చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకుంది. చదవండి: నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ -
తల్లి ఓ స్టార్ నటి, తండ్రి ఓ స్టార్ ఆటగాడు.. కూతురు ఏమో ఇలా..
మసాబా గుప్తా... పేరు వినగానే ముందు వాళ్లమ్మ నీనా గుప్తా.. తర్వాత వాళ్ల నాన్న వివ్ రిచర్డ్స్‌ను గుర్తుచేసుకునేవాళ్లున్నారు. కానీ ఈ ఇద్దరు లెజెండ్స్ నీడను కాదని సొంత ఉనికిని చాటుకుంటోంది మసాబా. ఈ రోజు ఇక్కడ ఆమె గురించి రాస్తున్నామంటే కారణం.. భిన్న రంగాల్లో మసాబా సాధిస్తున్న విజయాలు.. తెచ్చుకుంటున్న ఐడెంటిటీయే! మసాబా పుట్టింది ఢిల్లీలో.. పెరిగింది ముంబైలో. తల్లి నీనా గుప్తా బాలీవుడ్ నటి. తండ్రి వివ్ రిచర్డ్స్ వెస్టిండీస్... క్రికెట్ స్టార్. కాస్త ఊహ తెలిసేప్పటికే తండ్రి లాగా ఆటల్లో రాణించాలనుకుంది. టెన్నిస్‌లో శిక్షణ కూడా తీసుకుంది. తనకు పదహారో యేడు వచ్చే వరకూ టెన్నిస్ ఆడింది. వాళ్లమ్మేమో మసాబా నటి కావాలని కోరుకుంది. ఆ రెండూ కాక మసాబా మ్యూజిక్ అండ్ డాన్స్ మీద ఆసక్తి పెంచుకుంది. లండన్ వెళ్లి ఆ రెండిటికీ సంబంధించిన కోర్స్ చేసింది. అప్పుడే.. తనకు పందొమ్మిదేళ్ల వయసప్పుడు లాక్మే ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఇక తను చేరుకోవాల్సిన గమ్యం అదే అని నిర్ణయించుకుంది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ తీసుకుంది. డిజైనర్‌గా ష్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ కీర్తిని ఆర్జించింది మసాబా. అప్పటి (2014) ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ‘బిజినెస్ ఎక్సలెన్స్ అండ్ ఇన్నోవేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్’ అవార్డ్‌ను అందుకుంది. తల్లి నీనా గుప్తా కోరుకున్నట్టుగా 2020లో నటనా రంగంలోకి ప్రవేశించింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ‘మసాబా మసాబా’ అనే వెబ్ సిరీస్‌తో నటిగా మారింది. ఒకరకంగా ఇది ఆమె జీవిత కథే. అందులో మసాబా నటనకు మంచి పేరు వచ్చింది. తండ్రిలా ఆటల్లో, తల్లిలా నటనారంగంలో.. తనకులా ష్యాషన్ రంగంలో ఎందులోనైనా రాణించగలను అని నిరూపించుకుంది. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారంలోకి వచ్చిన ‘మోడర్న్ లవ్ ముంబై’ అనే ఆంథాలజీలోనూ నటించింది. నటిగా మరోసారి తన ప్రతిభను చూపింది. ఈ సందర్భంగా ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన మాసాబా తన తల్లి నీనా గుప్తే తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా అమ్మను చూస్తే ఏజ్ అనేది ఓ నంబర్ మాత్రమే అనిపిస్తుంది. 67 ఏళ్ల వయసులో కూడా వర్క్ చేస్తూ స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తోంది. తను జీవితంలో చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. కానీ ఎప్పుడూ నిరాశను దరిచేరనివ్వలేదు. అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను.. కుంటున్నాను కూడా. తనే నాకు ఇన్స్పిరేషన్’ అని చెప్పుకొచ్చింది. -
Panchayat season 2: మంచి మనుషులకు గట్టి దెబ్బలు
కోట్లాది అభిమానులు ఎదురు చూస్తూ వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ వచ్చేసింది. ‘ఫులేరా’ అనే పల్లెటూళ్లో పంచాయతీ ఆఫీసులో ఆ ఆఫీసు ఉద్యోగికి, ఊళ్లోని వారికి మధ్య స్నేహంతో మొదటి సీజన్ సాగితే ఇప్పుడు ముఖ్యపాత్రలకు గట్టి విరోధులు ఈ సీజన్లో కనిపిస్తారు. సహజత్వం, హాస్యం, అనుబంధంతో ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ అమేజాన్‌లో మళ్లీ ఒకసారి ప్రేక్షకులను బింజ్ వాచింగ్ చేయిస్తోంది. 8 ఎపిసోడ్ల సెకండ్ సీజన్ పరిచయం ఈ ఆదివారం. అదే ఊరు. అదే పంచాయతీ ఆఫీసు. వేరే గది తీసుకోకుండా ఆ పంచాయతీ ఆఫీసులోనే నివసించే ఉద్యోగి అభిషేక్. అతన్ని అభిమానంగా చూసుకునే పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆఫీసు అసిస్టెంట్ వికాస్... 2020లో ‘పంచాయత్’ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు పాత దూరదర్శన్ సీరియల్స్‌లా అనిపించి దేశమంతా చూసింది. పంచాయత్ వెబ్ సిరీస్‌కు విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. సెకండ్ సీజన్ కోసం విన్నపాలు, ఒత్తిళ్లు తెచ్చారు. లాక్డౌన్ వల్ల ఆ పనులన్నీ ఆగిపోయి ఇప్పుడు పూర్తయ్యి ‘పంచాయత్ సీజన్ 2’ స్ట్రీమ్ అవుతోంది. మళ్లీ అభిమానులను అలరిస్తోంది. ఫులేరాలో ప్రత్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని ‘ఫులేరా’ అనే కల్పిత ఊరిలో జరిగినట్టుగా చెప్పే ఈ కథలో అందరూ మంచివాళ్లే. అమాయకులే. ఒకరికొకరు సాయం చేసుకునేవారే. కాని ఆ ఊరికి గ్రామ సచివాలయ ఉద్యోగిగా వచ్చిన అభిషేక్‌కు ఎం.బి.ఏ చదివి వేరే ఉద్యోగం చేయాలని ఎంట్రన్స్ టెస్ట్‌కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఈ లోపల అతనికి ఆ ఊరి సర్పంచ్‌తో, ఉప సర్పంచ్‌తో, అసిస్టెంట్‌తో మంచి స్నేహం ఏర్పడుతుంది. నిజానికి ఆ ఊరి సర్పంచ్ స్త్రీ (నీనా గుప్తా) అయినా సర్పంచ్ భర్త (రఘువీర్ యాదవ్) వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. అభిషేక్ (జితేంద్ర కుమార్) వారి ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. మొదటి సిరీస్‌లో సర్పంచ్ కూతురు ఉంటుంది కాని ఎక్కడా కనిపించదు. కాని ఈ సిరీస్‌లో ఆ కూతురు కనిపిస్తుంది. అభిషేక్‌తో స్నేహం చేస్తుంది. అయితే ఊరన్నాక ఒకరో ఇద్దరో ప్రత్యర్థులు ఉండకపోరు. ఈ ఊళ్లో కూడా ఒక ప్రత్యర్థి తయారవుతాడు. అతడే ఆ ఊరి టెంట్ హౌస్ ఓనర్. రాబోయే ఎన్నికలలో తన భార్యను నిలబెట్టి సర్పంచ్ భర్తగా చలాయించాలనుకుంటున్న ఆ టెంట్ హౌస్ ఓనర్ సర్పంచ్‌ను, సచివాలయ ఉద్యోగులను పరేషాన్ చేస్తుంటాడు. మరోవైపు ఆ నియోజక వర్గ ఎం.ఎల్.ఏ కూడా సర్పంచ్‌ని అవమానిస్తుంటాడు. సర్పంచ్ తన కుమార్తె కోసం సంబంధం చూస్తే ఆ పెళ్లికొడుకు సైకోలాగా మారి ఆ అమ్మాయికి తెగ ఫోన్లు చేస్తుంటాడు. వీళ్లందరూ ప్రత్యర్థులే అయినా అభిషేక్, సర్పంచ్, ఉప సర్పంచ్, అసిస్టెంట్ నలుగురూ కలిసి ఆ సమస్యలను ఎలా దాటారు అనేవే ఈ ఎపిసోడ్స్. నవ్వొచ్చే ఎపిసోడ్స్ గత సిరీస్లోలానే ఈ సిరీస్‌లో కూడా నవ్వొచ్చే ఉదంతాలు ఎన్నో ఉంటాయి. ఊరికి మరుగుదొడ్లు అలాట్ అయినా కొందరు ఉదయాన్నే బయటకు వెళుతుంటారు. అలా కనిపిస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ విజిట్‌కు వస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ముందు ఊరి సర్పంచ్‌ను ఎలాగైనా బద్నామ్ చేయాలని టెంట్ హౌస్ ఓనర్ ఒకతణ్ణి నువ్వు ఎలాగైనా చెంబు పట్టుకుని పొద్దున్నే కలెక్టరుకు కనిపించు అంటాడు. కలెక్టరు విజిట్‌కు వస్తే కనిపించాలని అతను, అతణ్ణి ఎలాగైనా ఆపాలని మిత్రబృందం చేసే ప్రహసనాలు చాలా నవ్వు తెప్పిస్తాయి. గుడిలో టెంట్ హౌస్ ఓనర్ భార్య చెప్పులను పొరపాటున సర్పంచ్ భార్య తొడుక్కుని ఇంటికి వస్తుంది. తన చెప్పులు కనిపించని టెంట్ హౌస్ ఓనర్ భార్య సిసి టీవీలో చూసి సర్పంచ్ భార్యే దొంగ అని తెలుసుకుని పోలీస్ కేస్ పెడతానంటుంది. ఆ చెప్పులు ఆమె ఇంట్లో పడేయడానికి హీరో నానా విన్యాసాలు చేస్తాడు. అదీ నవ్వే. ఊరి రోడ్డు కోసం నిధులకు ఎంఎల్ఏ దగ్గరకు వెళితే ఆ ఎంఎల్ఏ ముందు ఎక్స్‌ప్రెస్ రైలును ఆపడానికి ధర్నా చేయమని పంపిస్తాడు. అక్కడ సర్పంచ్‌ను, ఉపసర్పంచ్‌ను పోలీసులు పట్టుకెళతారు. అదంతా చాలా సరదాగా ఉంటుంది. హీరోయిన్ను పెళ్లికొడుకు వేధిస్తూ ఉంటే ఆమె హీరో సాయం కోరుతుంది. అలాగే హీరోయిన్, హీరో పరిచయం పెంచుకునే సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. గంభీరమైన ముగింపు సాధారణంగా పంచాయత్ ఎపిసోడ్స్ అన్నీ సరదాగా ఉంటాయి. కాని ఈ సిరీస్‌లో చివరి ఎపిసోడ్‌ను ఒక ఉదాత్త సన్నివేశంతో గంభీరం చేశాడు దర్శకుడు. ఆ సన్నివేశంతో ప్రేక్షకులందరూ కన్నీరు కారుస్తారు. మనసులు బరువెక్కుతాయి. సంతోషంతోపాటు దుఃఖమూ మనుషుల జీవితాల్లో ఉంటుందని చెప్పడానికి కాబోలు. ఇంకా పాత్రలు, వాటి గమ్యం పూర్తిగా తేలకుండానే ఈ సిరీస్ కూడా ముగుస్తుంది. అంటే సీజన్ 3కు కథ మిగిలించుకున్నారన్న మాట. ‘పంచాయత్’ బలం అంతా దాని సహజత్వం. సున్నితత్వం. హాస్యం. మానవ నిజ ప్రవర్తనలు. వీటిని దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా, రచయిత చందన్ కుమార్ గట్టిగా పట్టుకోవడంతో సిరీస్ నిలబడింది. కథ ఉత్తరప్రదేశ్‌లో జరిగినా లొకేషన్ అంతా భొపాల్కు దగ్గరగా తీశారు. ఆ ఊరి వాతావరణమే సగం ఆకట్టుకుంటుంది. థియేటర్ చేసిన నటులు కావడం వల్ల అందరూ పాత్రలను అద్భుతంగా పండిస్తారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం. ఇలాంటి జీవితాలు, పాత్రలు తెలుగు పల్లెల్లో ఎన్నెన్నో ఉంటాయి. గతంలో తెలుగులో కూడా మంచి సీరియల్స్ వచ్చేవి. ఇలాంటి కథలతో తెలుగులో కూడా వెబ్ సిరీస్ వస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. పంచాయత్ చూడని వాళ్లు మొదటి సిరీస్, రెండో సిరీస్ హాయిగా చూడొచ్చు. హిందీలో మాత్రమే లభ్యం. -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: పిల్లలకు బంధాలు కావాలి
‘ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎవ్వరి మాటా వినం. కాని పిల్లలు పుట్టాక అన్నీ మెల్లగా అర్థమవుతాయి. పిల్లలకు బంధాలు కావాలి. తల్లీ తండ్రీ ఇద్దరూ కావాలి. తల్లి తరఫు ఉన్నవారూ తండ్రి తరఫు ఉన్నవారూ అందరూ కావాలి. బంధాలు లేని పిల్లలు చాలా సఫర్ అవుతారు’ అంది నీనాగుప్తా. జీవితం ఎవరికైనా ఒక్కో దశలో ఒక్కోలా అర్థం అవుతుంది. క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో కుమార్తెను కన్న నీనా పిల్లల గురించి చెబుతున్న మాటలు వినదగ్గవి. ఆమె తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ గురించి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడింది. ‘వివ్ రిచర్డ్స్ (క్రికెటర్)తో నేను ప్రేమలో ఉన్నాను. పెళ్లితో సంబంధం లేకుండా బిడ్డను కనాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు ఎందరో మిత్రులు ఎన్నో రకాలుగా నాకు సలహాలు ఇచ్చారు. కాని నేను ఎవ్వరి మాటా వినలేదు. ముందుకే వెళ్లాను. మసాబా పుట్టింది. కాని సింగల్ పేరెంట్‌గా పిల్లల్ని పెంచడం చాలా చాలా కష్టం. ఆ విధంగా నేను మసాబాకు అన్యాయం చేశాను అని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు బంధాలు కావాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి. వారి వైపు ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులు అందరూ కావాలి. మసాబాకు ఆ విధంగా తండ్రి వైపు నుంచి పెద్ద లోటును మిగిల్చాను’ అంది నటి నీనా గుప్తా. ఆమె రాసిన ‘సచ్ కహూ తో’ ఆత్మకథ మార్కెట్లో ఉంది. దాని గురించి మాట్లాడటానికి ఆమె ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’కు హాజరయ్యింది. ‘మాది తిండికి హాయిగా గడిచే కుటుంబం. కాని మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. దాని వల్ల పిల్లలుగా మేము ఎదుర్కొన్న ఇబ్బంది పెద్దగా లేకపోయినా మా అమ్మ చాలా సతమతమయ్యేది. ఆమె బాధ చూసి నాకు చాలా బాధ కలిగేది. బాల్యంలో అలాంటి ప్రభావాలు గాఢమైన ముద్ర వేస్తాయి’ అందామె. నీనా గుప్తా నటిగా పూర్తిగా నిలదొక్కుకోని రోజులవి. హటాత్తుగా వివ్ రిచర్డ్స్‌తో గర్భం దాల్చాను అని పత్రికలకు చెప్పి సంచలనం సృష్టించింది. 1989లో కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఎలా ఉంటుందో అని చాలా మంది ఆందోళనగా, కుతూహలంగా గమనించారు. ఇప్పుడు ఆమె నటిగా, కుమార్తె ఫ్యాషన్ డిజైనర్‌గా సక్సెస్‌ను చూస్తున్నారు. కాని ఈలోపు ఎన్నో జీవితానుభవాలు. ‘మసాబాను నెలల బిడ్డగా ఇంట్లో వదిలి నేను పనికి వెళ్లాల్సి వచ్చేది. ఒక్కోసారి షూటింగ్‌కి కూడా తీసుకెళ్లి షాట్‌కు షాట్‌కు మధ్యలో పాలు ఇచ్చేదాన్ని. ఆమె రంగు, రూపం... వీటిని చూసి పిల్లలు కామెంట్లు చేసేవారు. తండ్రి కనిపించేవాడు కాదు. నా కూతురుకు ఏది ఎలా ఉన్నా ‘యూ ఆర్ ది బెస్ట్’ అని చెప్తూ పెంచుకుంటూ వచ్చాను. కాని మనం ఎంత బాగా పెంచినా బంధాలు లేకుండా పిల్లలు పెరగడం ఏమాత్రం మంచిది కాదని చెప్పదలుచుకున్నాను’ అందామె. అలాగే ఒంటరి స్త్రీని సమాజం ఎంత అభద్రతగా చూస్తుందో కూడా ఆమె వివరించింది. ‘సింగిల్ ఉమెన్‌గా ఉండటం వల్ల నేను ఇబ్బంది పడలేదు కానీ నా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏదైనా పార్టీకి వెళ్లి ఏ మగాడితోనైనా ఐదు నిమిషాలు మాట్లాడితే ఆ మగాడి భార్య తుర్రున పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చేసేది. సింగిల్ ఉమెన్ అంటే పురుషులను వల్లో వేసుకునేవారు అనే ఈ ధోరణి అన్యాయం’ అని నవ్వుతుందామె. స్త్రీలను వారి దుస్తులను బట్టి జడ్జ్ చేయడం అనే మూస నుంచి బయడపడాలని నీనా గట్టిగా చెబుతుంది. ‘నేను ఢిల్లీలో ఎం.ఏ సంస్కృతం చదివాను. కాలేజ్‌కు చాలా మోడ్రన్ బట్టలు వేసుకుని వెళ్లేదాన్ని. సంస్కృతం చదువుతూ ఇలాంటి బట్టలు వేసుకుని వస్తుంది ఏమిటి అని ఏ ఆడపిల్లా నాతో మాట్లాడేది కాదు. నేను ఆ పక్కనే ఉండే మరో కాలేజ్‌కు వెళ్లి క్యారెమ్స్ ఆడుతూ కూచునేదాన్ని. చివరకు ఫస్ట్ ఇయర్లో నాకు మంచి మార్కులు రావడం చూసి అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు’ అందామె. ఇంకో ఉదాహరణ కూడా చెప్పింది. ‘ముంబైలో నా కెరీర్ మొదలులో రచయిత గుల్జార్, నేను రోజూ బాడ్మింటన్ ఆడటానికి కారులో వెళ్లేవాళ్లం. ఇద్దరం షార్ట్స్ వేసుకుని పక్కపక్కన కూచుని వెళ్లేవాళ్లం. ఇన్నేళ్ల తర్వాత మొన్న నేను షార్ట్స్‌లో ఆయన ఇంటికి వెళ్లి నా ఆత్మకథ కాపీ అందించాను. అది నెట్లో చూసి ‘హవ్వ.. గుల్జార్ గారిని కలవడానికి వెళ్లి ఈ వయసులో షార్ట్స్ వేసుకుంటావా’ అని ట్రోలింగ్. అరె.. ఏమిటిది? ఎండగా ఉంది వేసుకున్నాను... లేదా కాళ్లు బాగున్నాయని వేసుకున్నాను. మీకేంటి నొప్పి’ అంటుందామె. నీనా గుప్తాకు నటిగా ఎంత ప్రతిభ ఉన్నా ఆమెకు కమర్షియల్ సినిమాల్లోకాని పార్లల్ సినిమాల్లో కాని లీడ్ రోల్స్ రాలేదు. ‘షబానా ఆజ్మీ తన సినిమాల్లో వేసిన పాత్రలన్నీ వేయాలని నాకు ఉంటుంది. ఆర్ట్ సినిమాల్లో కూడా అన్నీ హీరోయిన్ పాత్రలు షబానా, స్మితా పాటిల్, దీప్తికి దక్కాయి. అది నాకు బాధే. కాని ఇప్పుడు నేను లీడ్ రోల్స్ చేసి హిట్స్ కొడుతున్నాను. అది ఆనందం’ అంటుందామె. నీనా గుప్తా అమెరికాలో తీస్తున్న ఒక బాలీవుడ్ సినిమాలో తెలుగు పనిమనిషిగా నటిస్తోంది. ఆమె నటించిన ‘పంచాయత్’ వెబ్ సిరీస్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ‘స్త్రీలుగా మీరు ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకండి. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది గమనించుకుని యూ ఆర్ ది బెస్ట్ అనుకోండి. అదే మీ సక్సెస్‌మంత్ర’ అందామె. ఆమె నిజమే చెబుతోంది. అందుకే ఆమె పుస్తకం పేరు ‘సచ్ కహూ తో’. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఆమె... అగణిత మేధావి
గణితశాస్త్రంలో డెబ్భై యేళ్లుగా ప్రపంచానికి అంతుపట్టకుండా ఉన్న అత్యంత క్లిష్టమైన జరిస్కి క్యాన్సిలేషన్ ప్రాబ్లమ్‌కు పరి ష్కారం సూచించారు 32 ఏళ్ల నీనా గుప్తా. అందుకుగాను ఆమె 2021 డిసెంబర్లో, ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘ది రామానుజన్ ప్రైజ్’ పురస్కారానికి ఎంపికయ్యారు. కోల్‌కతాలో జన్మించిన నీనా గుప్తా , బెతున్ కళాశాల నుండి గణిత శాస్త్ర ఆనర్స్‌లో పట్టా తీసుకున్నారు. ఇప్పుడు తాను పాఠాలు బోధిస్తున్న ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ (ఐఎస్ఐ) సంస్థ నుంచే పీహెచ్డీ తీసుకున్నారు. తన పరిశోధనలకు గాను ఆమె ఇప్పటికే డజను అవార్డులు పొందారు. 40 ఏళ్ల లోపు ఉండే యువ గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన రామానుజన్ అవార్డును ఇటీవలే నీనా గుప్తాకు ఇచ్చారు. అకడమిక్ రంగంలో గౌరవనీయమైన అవార్డును గెలుచుకున్న నాల్గవ భారతీయురాలు ఆమె. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె అఫైన్ ఆల్జీబ్రాక్ జ్యామితిలో, కమ్యుటేటివ్ ఆల్జీబ్రాలో చేసిన అత్యుత్తమ కృషికి, ప్రత్యేకించి అఫైన్ స్పేస్‌ల కోసం జారిస్కీ రద్దు సమస్యపై కనిపెట్టిన పరిష్కారం కోసం ఈ విశిష్ట బహుమతిని అందుకున్నారు. జారిస్కీ రద్దు సమస్యకు ఆమె చూపిన పరిష్కారం తనకు గతంలోనే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ 2014 యంగ్ సైంటిస్ట్స్ అవార్డును సంపాదించి పెట్టింది. 2019లో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకున్నారామె. గణితం అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది అని వేద గణితం చెబుతుంది. సంఖ్యామానానికి పట్టుగొమ్మ అయిన సున్నా ఆవిష్కరణే దీనికి నిదర్శనం. ఇది ప్రపంచ గణిత శాస్త్రా నికి భారతీయుల అద్భుత కానుక. గణితం కష్టం కాదు. ఇతర సబ్జెక్టులులాగా దీన్ని కంఠస్థం చేయలేరు. మీకు గణిత భావనపై స్పష్టత ఉంటే, మీరు కూడా క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించగలరు. ప్రాక్టీస్ కీలకం, అది మినహా వేరే మంత్రం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 32 ఏళ్ల నీనా గుప్తా. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరు. తనకు పదేళ్ల వయసులోనే గణితశాస్త్రంతో అనుబంధం ఏర్పడింది. పదమూడేళ్లు నిండేసరికల్లా ఎస్.ఎల్. లోనీ... త్రికోణమితి మీద రాసిన పుస్తకాలను ఆపోశన పట్టడమే కాకుండా సొంతంగా సిద్ధాం తాలు కూడా రూపొందించడం ప్రారంభించాడు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ, అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించారు. శుద్ధ గణితంలో నంబర్ థియరీలోని ఇతని పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాలలో ఉపయోగపడుతూ ఉన్నాయి. రామానుజన్ చివరిదశలో మ్యాక్–తీటా ఫంక్షన్స్‌పై చేసిన పరిశో ధనలు చాలా ప్రసిద్ధమైనవి. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరైన శ్రీనివాసన్ రామానుజన్ పేరు మీద ఉన్న ‘రామానుజన్ అవారు’్డ నీనా గుప్తాకు రావడం పట్ల దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారు. డాక్టర్ టి. నాగయ్య వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ మొబైల్ : 97012 75354 (నేడు జాతీయ గణిత దినోత్సవం) -
Neena Gupta: లెక్కలంటే నీనాకు బొమ్మలను చూసినంత సంబరం! అందుకే ఇలా
Neena Gupta: లెక్కలు అంటే భయపడని పిల్లలు తక్కువ. అయితే తన బాల్యంలో లెక్కలు అంటే నీనాకు బొమ్మలను చూసినంత సంబరం. ఆ సంబరమే ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చింది. ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థం ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన ‘ది రామానుజన్ ప్రైజ్’ పురస్కారానికి ఎంపికైంది. ప్రతి సంవత్సరం నలభై ఐదేళ్ల వయసులోపు వారికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ–ఇండియా), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియెరిటికల్ ఫిజిక్స్ (ఐసీటిపి)లు ఈ పురస్కారం అందజేస్తాయి. మన దేశం నుంచి ఈ పురస్కారం అందుకుంటున్న నాలుగో వ్యక్తి, మహిళలలో మూడో వ్యక్తి నీనా గుప్తా. 2014లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డ్, 2019లో శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకుంది నీనా. ఆమె బడిరోజుల్లోకి వెళదాం. ఖాల్సా హైస్కూల్లో చదువుకునే రోజుల్లో తన అద్భుతమైన గణితప్రతిభ తో టీచర్లను ఆకట్టుకునేది నీనా. ‘ఈ ప్రాబ్లమ్ ఎవరు సాల్వ్ చేస్తారు?’ అని టీచర్ పిల్లల వైపు చూసేవారు. పిల్లలు మాత్రం నీనా వైపు చూసేవారు. ‘నీనా సంగతి సరే మీ సంగతి ఏమిటి?’ అడిగేవారు టీచర్. అలా అని తల గర్వంగా ఎగరేసేది కాదు నీనా. డౌట్ల మీద డౌట్లు వచ్చే పిల్లల దగ్గరకు వెళ్లి వారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పేది. జూనియర్స్ కూడా రకరకాల ‘ప్రాబ్లమ్స్’తో ఆమె దగ్గరికి వచ్చేవారు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులభంగా వారికి చెప్పేది. తరాలు మారుతున్నా... సాంకేతిక జ్ఞానం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా... చాలామంది పిల్లల్లో ‘మ్యాథ్స్ ఫోబియా’ పోవడం లేదు. ఒక వైపు తన పరిశోధనలకు టైమ్‌ను వెచ్చిస్తూనే అలాంటి పిల్లల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది ‘ది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్–కోల్‌కతా’ ప్రొఫెసర్ అయిన నీనా. ‘ఈ అంకెలను చూడండి....ఎంత అమాయకంగా ఉన్నాయో. మరి మీరు ఎందుకు భయపడుతున్నారు!’ అని అడుగుతుంది ఆమె. పిల్లలు గట్టిగా నవ్వుతారు. ‘ఈ ప్రాబ్లమ్‌ను ఎంత ఈజీగా సాల్వ్ చేయవచ్చో ఒకసారి చూడండి’ అని బ్లాక్‌బోర్డ్ వైపు వెళుతుంది. పిల్లలో ఎక్కడిలేని ధైర్యం వస్తుంది! ‘మ్యాథ్‌మెటిక్స్ ఎడ్యుకేషన్ ఇన్ టైమ్స్ ఆఫ్ కోవిడ్’పై జరిగిన ఆన్లైన్ చర్చా వేదికలో విలువైన సూచనలు ఇచ్చింది. ‘ఇండియన్ వుమెన్ అండ్ మ్యాథమెటిక్స్’ అంశంపై అద్భుత ప్రసంగం చేసింది. 70 సంవత్సరాలుగా పరిష్కారం కాని ఒక గణితసమస్యను పరిష్కరించి ‘భేష్’ అనిపించుకుంది. అయితే గణితాన్ని చూసి గజగజలాడుతున్న పిల్లలు, గణితాన్నే పెద్ద సమస్య అనుకుంటున్న పిల్లలు ఉన్నారు. వారి భయాలను తొలగించి గణితం అంటే అంతులేని ప్రేమను కలిగించే పుస్తకం ఒకటి రాస్తే... తనలాంటి జీనియస్‌లు మరెంతోమంది వస్తారనడంలో సందేహం లేదు కదా! చదవండి: Health Tips: వాతం ఎక్కువైందా? నిద్ర పట్టడం లేదా? అయితే..