ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ నటి కూతురు..! | Masaba Gupta Satyadeep Mishra Announced Pregnancy | Sakshi
Sakshi News home page

Masaba Gupta: రెండో భర్తతో ప్రెగ్నెన్సీ ప్రకటించిన నటి!

Published Fri, Apr 19 2024 12:58 PM | Last Updated on Fri, Apr 19 2024 2:43 PM

Masaba Gupta Satyadeep Mishra Announced Pregnancy - Sakshi

ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురిగా మసాబా గుప్తా అందరికీ సుపరిచితమే. ప్యాషన్‌ డిజైనర్‌ కెరీర్ ప్రారంభించిన ఆమె నటిగాను గుర్తింపు తెచ్చుకుంది. 2023లో రెండోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన మసాబా.. తాజాగా అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మీ అందరీ ఆశీర్వాదాలు కావాలంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ తారలు కరీనా కపూర్, షెహనాజ్ గిల్, కుషా కపిల, తాహిరా కశ్యప్, సారా టెండూల్కర్, బిపాసా బసు, పరిణీతి చోప్రా, అనన్య పాండే, కృతి సనన్ అభినందనలు తెలిపారు. 

కాగా.. మాసాబా గుప్తా, సత్యదీప్‌లు కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో వారి సన్నిహితులు, ఆమె తండ్రి మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. కాగా.. గతంలో టాలీవుడ్ నిర్మాత మధు మంతెనను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. సత్యదీప్ సైతం గతంలోనే అదితి రావు హైదరీని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఆదితిరావు హైదరీ- సిద్ధార్థ్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement