masaba gupta
-
నో బ్యూటీ పార్లర్.. నా అందం, ఆనందం రహస్యం అదే! నటి
ఈ విషయం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నీనా గుప్తాకు బ్యూటీ పార్లర్లకు వెళ్లే అలవాటు లేదు. ‘అవునా!! గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు తరచూ పార్లర్ లకు వెళ్తుంటారు కదా! అందమే కదా అసలు ఎవరికైనా ఆనందం?’ అని మీరు అడిగి చూడండి... నీనా చెప్పే సమాధానం మిమ్మల్ని మరింతగా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ‘నా కూతురే నా ఆనందం‘ అంటారు నీనా!ఆనందం అందాన్నిస్తుంది. ఆ ఆనందం కూతురు మసాబా రూపంలో నీనా కళ్లెదుట ఉంది. ఇక ఆమెకు ఫేషియల్స్ ఎందుకు? పార్లర్లు ఎందుకు? నీనా వయసు 65. సింగిల్ మదర్‌కి స్ట్రెస్ ఉంటుంది. కూతురు ఉన్న సింగిల్ మదర్‌కి మరింత స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్, మరింత స్ట్రెస్‌లను మించిన మూడోస్ట్రెస్ కూడా ఉండేది నీనాకు. అదేమిటో అందరికీ తెలిసిందే. ఆమె కూతురి తండ్రి ఇండియన్ కాదు. 1980ల నాటి వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్. నీనా, రిచర్డ్స్కు పుట్టిన అమ్మాయే మసాబా. రిచర్డ్స్ కు అప్పటికే పెళ్లి అయి ఉండటంతో ఆయన్ని పెళ్లి చేసుకోకుండా, మసాబా పెరిగి పెద్దయ్యే వరకు – ఒంటరిగానే ఉండిపోయారు నీనా. ప్రస్తుతం మసాబా వయసు 35 ఏళ్లు. ఇప్పటికీమసాబానే నీనా కంటి వెలుగు. మసాబానే ఆమె అందం, ఆనందం. ‘ఎదుగుతున్న వయసులో నా కూతురి కోసం నేను రెండు పనులు ఎప్పటికీ చేయకూడదు అని ఒట్టు పెట్టుకున్నాను. ఒకటి: ఆమె చదువు కోసం ‘ఎవరినీ డబ్బు సాయం అడగకూడదు.’ రెండు : తండ్రి (దగ్గర) లేని పిల్లగా ఆమె కోసం ‘ఎవరి ఎమోషనల్ సపోర్టూ తీసుకోకూడదు.’ ఈ రెండిటిపై గట్టిగా నిలబడ్డాను. మనం డబ్బు, సపోర్ట్ అడగం అని తెలిస్తే ఎవరైనా ధైర్యంగా మన దగ్గరకు వస్తారు. మనమూ అంతే.. ఎవరి దగ్గరకైనా ధైర్యంగా వెళ్లగలం అని ‘బ్రట్ ఇండియా’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కుషా కపిల్‌తో చెప్పారు నీనా గుప్తాకూతురు మాత్రమే కాదు, సింగిల్ మదర్‌గా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ రావటం కూడా నీనా అందానికి కారణం అయి ఉంటుంది -
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
బాలీవుడ్ ప్రముఖ నటి మసాబా గుప్తా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈనెల 11న మొదటి బిడ్డకు స్వాగతం పలికింది. ఈ విషయాన్ని మసాబా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సత్యదీప్ మిశ్రాను పెళ్లాడిన మసాబాకు ఇటీవలే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ జంటకు ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. రిచా చద్దా, శిల్పాశెట్టి, సమీరా రెడ్డి, బిపాసా బసు అభినందనలు తెలిపారు.మసాబా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మాకు చాలా ప్రత్యేకమైన రోజు. చిన్న అమ్మాయి మా జీవితంలోకి 11.10.2024న అడుగుపెట్టింది' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. మసాబా గుప్తా నటిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 18న మసాబా గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్త సత్యదీప్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది.ఎవరీ మసాబా గుప్తా..కాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా సిరీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
Masaba Gupta: మసాబా.. మసాబా..
మసాబా గుప్తా.. ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక వైబ్రెంట్ వేవ్! ఆమె రాకముందు మన ఫ్యాషన్‌లో బిగ్ అండ్ బోల్డ్ ప్రింట్స్ అంతగాలేవు! ఇప్పుడవి చాలామంది సెలబ్రిటీస్‌కి మోస్ట్‌వాంటెడ్ క్యాజువల్స్‌గా మారి, వాళ్ల స్టయిలింగ్ వార్డ్రోబ్స్కి చేరిపోతున్నాయి. క్రెడిట్ గోస్ టు ‘హౌస్ ఆఫ్ మసాబా!’ కుడోస్ టు క్రియేటర్ మసాబా గుప్తా!నా స్కిన్ కలర్, నా జుట్టు తీరుతో చాలా అవమానాలు ఎదుర్కొన్నా! అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఏ రంగంలో అయినా ప్రతికూలతలు ఉంటాయి. వాటిని మనకు అనుకూలంగా మలచుకోగలగడమే సక్సెస్! అంటుంది మసాబా గుప్తా.మసాబా గుప్తా ఎవరో సినీ,క్రికెట్ ప్రియులు చాలామందికి తెలిసే ఉంటుంది. నటి నీనా గుప్తా, క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ కూతురు. చిన్నప్పుడెప్పుడూ ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలకనలేదు ఆమె. తండ్రిలా ఆటల మీదే ఆసక్తి చూపింది. టెన్నిస్ ప్లేయర్ కావాలని కష్టపడింది. తనకు పదహారేళ్లు వచ్చేటప్పటికి ఆ ఆసక్తి, ప్రయత్నం మ్యూజిక్, డాన్స్ మీదకు మళ్లాయి. లండన్‌లో ఆ రెండిటిలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఒంటరిగా ఉండలేక వాటిని మధ్యలోనే వదిలేసి ముంబై చేరుకుంది.వచ్చాక, యాక్టింగ్ ఫీల్డ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించింది. అది గమనించిన నీనా గుప్తా, ‘ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసే సంప్రదాయ సౌందర్య ప్రమాణాలు వేరు. నువ్వు అందులో సెట్ కావు. సో.. ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేయ్’ అంటూ బిడ్డను వెనక్కి లాగింది. ఏమాత్రం నిరుత్సాహపడక, తన క్రియేటివిటీని తన కాలేజ్ ఈవెంట్స్‌లో ప్రదర్శించసాగింది మసాబా. ఆ సమయంలోనే ఆమెలోని ఈస్తటిక్ సెన్స్, ఫ్యాషన్ స్పృహను కనిపెట్టిన ఫ్యాషన్ డిజైనర్, ఆథర్.. వెండెల్ రోడ్రిక్స్ ఆమెను ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ప్రోత్సహించాడు. దాంతో మసాబా.. ముంబై, ఎస్ఎన్డీటీ యూనివర్సిటీ(శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాక్రసే మహిళా విశ్వవిద్యాలయ్)లో అపరెల్ మాన్యుఫాక్చర్ అండ్ డిజైన్‌ను అభ్యసించింది.తను పూర్తిస్థాయిలో ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టే టైమ్‌కి.. పెద్ద ప్రింట్లు, డార్క్ కలర్ల జాడ అంతగా కనపడలేదు ఆమెకు. దాంతో ఆ రెండిటినే తన యూఎస్పీగా మార్చుకుని ‘హౌస్ ఆఫ్ మసాబా’ లేబుల్‌ని ఆవిష్కరించింది. ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనం. లేత రంగులు, ప్లెయిన్, చిన్న చిన్న డిజైన్స్‌నే ఎంచుకుంటున్న సెలబ్రిటీలకు మసాబా ప్రింట్స్æ వైబ్రెంట్‌గా తోచాయి. ఆ లేబుల్‌కి మారారు. ఆ అవుట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల అపియరెన్స్ రేడియెంట్గా కనిపించసాగింది.ప్రత్యేక స్టయిల్‌గా గుర్తింపురాసాగింది. అంతే ‘హౌస్ ఆఫ్ మసాబా’ బాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరెట్ బ్రాండ్ అయిపోయింది. ఇంట్లో వేసుకోవడానికి మొదలు బీచ్‌లో వ్యాహ్యాళి, ప్రయాణాలు, సినిమాలు, పార్టీలు, ఫంక్షన్లు, అవార్డ్ ఈవెంట్స్ దాకా దేనికైనా మసాబా డిజైనర్ వేర్ కావాల్సిందే అని కోరుకునే స్థాయికి చేరుకుంది ఆ డిమాండ్! ఆ లిస్ట్‌లో సోనమ్ కపూర్, ప్రియంకా చోప్రా, కరీనా కపూర్ ఖాన్, కరిశ్మా కపూర్, కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, విద్యా బాలన్, సొనాక్షీ సిన్హా, మీరా రాజ్‌పుత్ కపూర్, మౌనీ రాయ్, కరణ్ జోహార్ లాంటి మహామహులంతా ఉన్నారు. ‘హౌస్ ఆఫ్ మసాబా’ వెడ్డింగ్, రిసార్ట్ వేర్‌లోనూ సిగ్నేచర్ డిజైనింగ్‌ను మొదలుపెట్టింది. అంతేకాదు స్విమ్ వేర్, మెన్స్ వేర్, ఫ్యాషన్ జ్యూల్రీలోనూ తన నైపుణ్యాన్ని చూపిస్తోంది.ఇవి చదవండి: Elnaaz Norouzi: పర్షయన్ ప్రజ్ఞ! -
80/20 నా డైట్ సీక్రెట్
నటి మసాబా గుప్తా జిహ్వచాపల్యం, తిండి పుష్టి గురించి అందరికీ తెలిసిందే! ఇంట్లో తయారు చేసే రకరకాల చిరుతిళ్లు అంటే ఆమెకు మహా మక్కువ. నోరూరించే రకరకాల తినుబండారాలకు నో చెప్పలేని బలహీనత ఆమెది. అయితే వాసికీ, రాశికీ మధ్య సమతూకాన్ని పాటించడం ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అనిపిస్తుంది. డైట్ విషయంలో తాను 80/20 సూత్రాన్ని పాటిస్తానని చెప్పిన మసాబా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో కరోసెల్ అనే క్యాప్షన్ కింద తన రోజువారీ డైట్ గురించిన వివరాలు ఇలా పంచుకుంది. ‘‘80/20 రూల్ అనేది నా పాలిట బంగారం లాంటిది. ఇక్కడ 80 అనేది ప్రోటీన్లతో కూడిన బలవర్థకమైన ఆహారాన్ని సూచిస్తే, 20 నాకు నచ్చిన ఆహారాన్ని సూచిస్తుంది. (పేస్ట్రీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా బర్గర్లను సూచిస్తూ ఇమోజీలు పెట్టింది) వారంలో ఆరు రోజులూ నేను నా శరీరానికి ఏది అవసరమో అది ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తాను. ఒకరోజు మాత్రం నా నాలుక ఏది కోరిందో అది తీసుకోవడానికే ప్రయత్నిస్తాను’’ అని చెప్పింది. తాను రోజువారీ తీసుకునే డైట్ గురించిన వివరాలు ఇలా పంచుకుంది మసాబా. ‘‘ఉదయం ఆరున్నరకు టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ సోంపు గింజలను బాగా నమిలి తిని గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగుతాను. నా దృష్టిలో ఇది అమృత జలం. తొమ్మిది గంటలకు పెద్ద కప్పు నిండా ముసేలీ, బెర్రీలు. దాంతోపాటు వీలయితే అత్తిపళ్లు (రాస్బెర్రీ), నేరేడు పళ్లు. వర్క్ అవుట్స్ చేసిన తర్వాత పెద్ద గ్లాసు నిండా ప్రోటీన్ షేక్ తీసుకుంటాను. నానబెట్టిన ఐదు బాదం, ఐదు వాల్నట్స్ తీసుకుంటా. మధ్య మధ్యలో చల్లటి మజ్జిగ పిప్ చేస్తుంటా. ఒంటిగంటకు ఆలూ లేదా బెండకాయ ఫ్రై, చికెన్ కర్రీ, రైస్, స్ప్రౌట్స్తో చేసిన సలాడ్‌తో సంతృప్తికరమైన లంచ్ చేస్తాను. 5 గంటలకు చికెన్ లేదా చీజ్, కూరగాయలతో టాపింగ్ చేసిన హోల్ వీట్ లేదా మల్టిగ్రెయిన్స్తో చేసిన పిజ్జా.. రెండు ఉడకబెట్టిన గుడ్లు, కొద్దిగా చికెన్ గ్రేవీతో ఏడింటికల్లా డిన్నర్ ఫినిష్ చేస్తాను. మొత్తం మీద నా డైట్లో కార్బ్స్ కంటే ్రపోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను’’ అంటూ ఆమె చేసిన పోస్టింగ్‌కు చాలా లైకులు వచ్చాయి. -
'పుట్టబోయే బిడ్డ నీకంటే మంచి రంగు ఉండాలి, అందుకోసం..'
గర్భిణీ స్త్రీలు కనిపిస్తే చాలు ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తుంటారు. అందులో ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ ఎర్రగా, తెల్లగా ఉండాలంటే ఈ పండ్లు తినాలి, ఈ చిట్కాలు పాటించాలని ఏవేవో చెప్తుంటారు. ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా గుప్తాకు కూడా ఈ ఉచిత సలహాలు వస్తూనే ఉన్నాయట!ఏం చేయాలి?దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 'నిన్న నా దగ్గరకు వచ్చిన ఒకరు ప్రతిరోజు ఒక రసగుల్లా తింటే పుట్టబోయే బిడ్డ నాకంటే కొంత మెరుగైన రంగుతో పుడుతుందని చెప్పింది. అంతకుముందు మరొకరు కచ్చితంగా పాలు తాగాలని చెప్పారు. నా బిడ్డ నల్లగా పుట్టకూడదని ఆమె ఆకాంక్షించారు. తన అమాయక మాటలు విని నాకేం చేయాలో అర్థం కాలేదు. కోపంతో తనను కొట్టలేనుకదా..!ఇప్పటికీ అదే ఘోరం..ఈ నలుపు-తెలుపు విభేదాలు ఇప్పట్లో మారవు. నేను చేయాల్సిందల్లా ఒక్కటే! నా బిడ్డను స్ట్రాంగ్‌గా తయారుచేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది నల్లగా ఉన్నవారిని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. వారిని మానసికంగా ఓ మెట్టు కిందకు లాగుతారు. ఇదెంత ఘోరం.. 2024వ సంవత్సరంలోనూ ఇదే జరుగుతోంది. చదువుకున్నవారు, చదువుకోనివారు, ఉన్నవారు, విజ్ఞానులు.. ఇలా అందరి విషయాల్లోనూ ఇదే పునరావృతం అవుతూనే ఉంది' అని చెప్పుకొచ్చింది.ఎవరీ మసాబా గుప్తాకాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా సిరీస్‌లో నటించింది. -
Masaba Gupta: బాలీవుడ్ నటి మసాబా సీమంతం (ఫోటోలు)
-
మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్
మసాబా గుప్తా ఫ్యాషన్ పరిశ్రమలో పెద్దగా పరిచయం అవసం లేదు. రెడ్ కార్పెట్ ఈవెంట్ల నుండి వివాహాలు , ఫోటోషూట్ల వరకు పాపులర్ డిజైనర్‌గా పాపులర్ అయింది. తన క్రియేటివిటీ అందర్నీ కట్టిపడేసింది. అంతేకాదు తన జీవిత కథ ఆధారంగా రూపొందించిన డాక్యు-సిరీస్ మసాబాతో నటిగా అవతరించింది. ఇటీవల నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. తాజాగా తాను తల్లికాబోతున్నానని ఇన్‌స్టా ద్వారా ప్రకటించింది. ‘‘మా జీవితాల్లోకి రెండు బుల్లి బుల్లి అడుగులు రాబోతున్నాయి.. మమ్మల్ని ఆశీర్వ దించండి, అలాగే మీ ప్రేమను, కొద్ది బనానా చిప్స్‌ను(plain salted ONLY)’’ అంటూ తాను తల్లికాబోతున్న విషయాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. అంటే తనకు బనానా చిప్ప్ తినాలనిపిస్తోందని చెప్పకనే చెప్పింది. కొన్ని ఎమోజీలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా గతంలో మసాబా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. చెప్పినట్టే చేసిందంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) సింగిల్ పేరెంటింగ్ అనే కాన్సెప్ట్ మోడ్రన్‌గా ఉన్నా, పెళ్లి కాకుండానే బిడ్డను కనడం నార్మల్‌గా మారినా, , తాను అలా చేయకూడదనుకుంటున్నానని ఆమె వెల్లడించింది. ‘ఆధునిక మహిళగా పెళ్లి చేసుకుని బిడ్డనుకనే ధైర్యం ఉందా? అంటే .అస్సలు లేదు. ఎందుకంటే అంత ఒత్తిడిని తీసుకోవాలని లేదు. అలాంటి వాతావరణంలో బిడ్డను ఉంచాలని తాను భావించడం లేదని గతంలో ఒక ఇంటర్వ్యలో పేర్కొంది. పెళ్లి కాకుండా పుట్టిన తనకి చాలా మోడ్రన్ అనే ట్యాగ్ వేశారు. ఆధునికంగా ఉండటం చాలా అద్భుతమే కానీ తాము చాలా అవమానాల్ని ఎదుర్కొన్నామని గుర్తు చేసుకుంది. కాగా బాలీవుడ్ నటి, నీనా గుప్తా , వెస్ట్ ఇండియన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రేమ కథ అందరికి సుపరిచితమే.ఈ జంటకు ప్రేమ ఫలితమే మసాబా గుప్తా. అయితే పెళ్లికాకుండానే నీనా బిడ్డను కనడం అప్పట్లో పెద్ద సంచలనం. నీనా, రిచర్డ్స్‌ని పెళ్లి చేసుకోలేదు. కానీ ఒంటరిగానే తన కుమార్తె మసాబాను పెంచి పెద్ద చేసి ప్రయోజకురాల్ని చేసింది. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ నటి కూతురు..!
ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురిగా మసాబా గుప్తా అందరికీ సుపరిచితమే. ప్యాషన్ డిజైనర్ కెరీర్ ప్రారంభించిన ఆమె నటిగాను గుర్తింపు తెచ్చుకుంది. 2023లో రెండోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన మసాబా.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మీ అందరీ ఆశీర్వాదాలు కావాలంటూ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ తారలు కరీనా కపూర్, షెహనాజ్ గిల్, కుషా కపిల, తాహిరా కశ్యప్, సారా టెండూల్కర్, బిపాసా బసు, పరిణీతి చోప్రా, అనన్య పాండే, కృతి సనన్ అభినందనలు తెలిపారు. కాగా.. మాసాబా గుప్తా, సత్యదీప్లు కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత 2023లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో వారి సన్నిహితులు, ఆమె తండ్రి మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. కాగా.. గతంలో టాలీవుడ్ నిర్మాత మధు మంతెనను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. సత్యదీప్ సైతం గతంలోనే అదితి రావు హైదరీని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ఆదితిరావు హైదరీ- సిద్ధార్థ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
'తప్పుడు మనుషులతో డేటింగ్ చేశా.. కూతురికి పెళ్లి చేయడం నా తప్పే'
పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు.. కానీ ఇప్పుడు పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలకడగా ఉండట్లేదు. కొంతకాలానికే విడాకులు ఇచ్చేసుకుంటున్నారు. కొందరైతే పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇచ్చుకోవడం దేనికని.. సహజీవనానికి జై కొడుతున్నారు. ఈ రెండు రకాల పరిస్థితులు బాలీవుడ్ నటి నీనా గుప్తాకు ఎదురయ్యాయి. నీనా గుప్తా.. భార్యాబిడ్డలున్న క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రేమించింది. వీరి ప్రేమకు గుర్తుగా 1989లో మసాబా పుట్టింది. వీరి బంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేకప్ అయింది. సింగిల్ పేరెంట్‌గా మసాబాను పెంచి పెద్ద చేసింది నీనా. ఆ తర్వాత 2008లో వివేక్ మెహ్రాను పెళ్లాడింది. సలహాలివ్వడానికి నేను కరెక్ట్ కాదు మసాబా 2015లో నిర్మాత మధు మంతెనను పెళ్లాడగా 2019లో విడాకులు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 27న నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది మసాబా. ఇతడికి కూడా ఇది రెండో పెళ్లే.. సత్యదీప్ గతంలో హీరోయిన్ అదితి రావును పెళ్లాడి, తర్వాత ఆమెకు విడాకులిచ్చేశాడు. అయితే మసాబా మొదటి పెళ్లి ఆమె తల్లి బలవంతం మీదే జరిగిందట. ఈ విషయాన్ని తాజాగా నీనా గుప్తా వెల్లడించింది. 'రిలేషన్షిప్ గురించి సలహాలివ్వడానికి నేను సరైన వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను ఎప్పుడూ తప్పుడు మనుషులతోనే డేటింగ్ చేశాను. కాబట్టి నేను మంచి సలహాలివ్వలేను. అయితే మసాబా విషయంలో మాత్రం ఓ పొరపాటు చేశాను. పెళ్లి చేసి తప్పు చేశా తను మొదట పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కాబోయే భర్తతో సహజీవనం చేయాలనుకుంది. అందుకు నేను ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకున్నాకే తనతో కలిసి ఉండాలని చెప్పాను. అదే నేను చేసిన తప్పు. పెళ్లయిన కొంతకాలానికి వారు విడాకులు తీసుకున్నారు. అప్పుడు నేను కుంగిపోయాను, జీర్ణించుకోలేకపోయాను. వాళ్ల జంటను చూసి మేము ముచ్చటపడేవాళ్లం. ఇప్పటికీ నా మాజీ అల్లుడి మీద నాకు అభిమానం ఉంది. విడాకుల వార్త చెప్పగానే నోట మాట రాలేదు. కానీ అది వారి జీవితం.. కాబట్టి నేను ఏమీ చేయలేకపోయాను' అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా. చదవండి: రైతు బిడ్డ సహా ఏడుగురు నామినేషన్స్‌లో.. ఆ ఒక్కరు మాత్రం సేఫ్! -
మోడర్న్ డ్రెసెస్ కంటే.. చీరకట్టు అంటేనే ఇష్టం: హీరోయిన్
‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా’ అనే క్రేజీ డైలాగ్‌తో అంతే క్రేజ్ సంపాదించుకున్న ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి. అంతటి అందానికి మ్యాచ్ అయ్యే స్టయిల్‌ను క్రియేట్ చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. ఆర్ట్ బై సియా.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ప్రముఖ డిజైనర్స్ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కి ప్రాముఖ్యతనివ్వడంతో, డిజైన్స్ అన్నింటిలోనూ న్యూ స్టయిల్ ప్రతిబింబిస్తోంది. అదే దీనికి యాడెడ్ వాల్యూ. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. మొదట ఆన్లైన్లోనే కొనే వీలుండేది. ఈ మధ్యనే హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో స్టోర్ ఓపెన్ చేశారు. మసాబా గుప్తా ఇప్పుడున్న టాప్ మోస్ట్ డిజైనర్స్‌లో మసాబా గుప్తానే ఫస్ట్. 2009లో ‘హౌస్ ఆఫ్ మసాబా’ పేరుతో బ్రాండ్‌ను ప్రారంభించింది. నాణ్యత, సృజన బ్రాండ్ వాల్యూగా సాగిపోతున్న ఆమె డిజైన్స్ అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. ప్రపంచ వ్యాప్త సెలబ్రిటీస్ ఆమె బ్రాండ్‌కు అభిమానులుగా మారారు. మసాబా ఎవరి కూతురో తెలుసు కదా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్‌ల తనయ. పేరెంట్స్ పేరు ప్రఖ్యాతులను తన కెరీర్‌కి పునాదిగా మలచుకోకుండా కేవలం తన క్రియెటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జించిన ఇండిపెండెంట్ డిజైనర్.. అంట్రపెన్యూర్ ఆమె! బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: మసాబా గుప్తా ధర: రూ. 18,000 జ్యూలరీ బ్రాండ్: ఆర్ట్ బై సియా ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మోడర్న్ డ్రెసెస్ కంటే, ట్రెడిషనల్ వేర్ అంటేనే ఎక్కువ ఇష్టం. అందులోనూ చీరకట్టు అంటే మరీనూ! – లావణ్య త్రిపాఠి -దీపిక కొండి -
అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..
హీరోయిన్ అదితి రావ్ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందామె. ప్రస్తుతం ఆమె అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై ఆమె సందడి కరువైంది. అయినప్పటికీ ఆమె హీరో సిద్ధార్థ్‌తో డేటింగ్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు ఇటీవల యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంతో సిద్ధార్థ్-అదితిలు జంటగా కనిపించారు. దీంతో వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే అప్పటికే అదితికి పెళ్లై విడాకులు అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను గతంలో ఆమె వివాహం చేసుకుంది. అయితే ఆ బంధం మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. 2009లో వీరి వివాహం జరగ్గా.. 2013లో వీరిద్దరూ విడిపోయారు. అయితే ఇటీవల ఆమె మాజీ భర్త సత్యదీప్ మిశ్రా బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు సత్యదీప్ మిశ్రా. ఈ సందర్భంగా తన మాజీ భార్య అదితిని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: నటుడిగా బ్రహ్మానందం ఎన్ని వందల కోట్లు సంపాదించాడో తెలుసా? ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘అదితితో నా రిలేషన్ కారణంగా ప్రేమపై నాకు విరక్తి కలిగింది. మరోసారి ప్రేమ, పెళ్లి అంటేనే భయం వేసింది. బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్లు మళ్లీ రిలేషన్, ప్రేమ అంటే భయపడతారు. కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే మనం కోల్పోయినవి పొందగలం’ అని మిశ్రా చెప్పుకొచ్చాడు. ఇక అనంతరం మసాబాతో ప్రేమ, రెండో పెళ్లిపై స్పందిస్తూ.. ‘మా పెళ్లి చాలా సింపుల్‌గా జరగాలని అనుకున్నాం. అందుకే కొద్ది మంది సన్నిహితులు, బంధువుల మధ్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఇండస్ట్రీ వాళ్ల కోసం చిన్న పార్టీ ఏర్పాటు చేశాం. ఎందుకంటే మా బంధాన్ని మేం రహస్యంగా ఉంచాలనుకోలేదు. ఎందుకంటే సీక్రెట్స్ అనేవి రిలేషన్స్‌ని ప్రభావితం చేస్తాయని నేను నమ్ముతాను. బంధాన్ని సొంతం చేసుకోవాలి.. ఒపెన్‌గా ఉండాలి’ అని పేర్కొంది. ఇక ఆయన సమాధానం విన్న కొందరు నెటిజన్లు ఇది పరోక్షంగా అదితిగా కౌంటర్ ఇచ్చాడా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రస్తుతం అదితి సిద్ధార్థ్‌తో సీక్రెట్ డేటింగ్లో ఉంది. ఇప్పటి వరకు తమ రిలేషన్‌ని అదితి కానీ, సిద్ధార్థ్ కానీ బయట పెట్టలేదు. ఇదిలా ఉంటే మసాబాకు కూడా ఇది రెండో వివాహమనే విషయం తెలిసిందే. చదవండి: యువత పాశ్చాత్య పోకడలపై కళాతపస్వీ విశ్వనాథ్ ఏమన్నారంటే.. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న నటి, ఫోటోలు వైరల్
నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా సీక్రెట్‌గా పెళ్లిపీటలెక్కింది. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న నటుడు సత్యదీప్ మిశ్రాను పెళ్లాడింది. తన సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేసి అభిమాలను సర్ప్రైజ్ చేసింది. శాంతస్వరూపుడైన సత్యదీప్‌తో నా వివాహం జరిగింది. లెక్కలేనంత ప్రేమ, శాంతి, సంతోషం అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ క్యాప్షన్ ఎంచుకోవడానికి అనుమతించినందుకు థ్యాంక్స్.. ఎందుకంటే ఇది చాలా బాగుంది అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దీనికి పెళ్లి ఫోటోలను జత చేసింది. ఇందులో మసాబా లైట్ పింక్ కలర్ కుర్తాలో మెరిసిపోతోంది. ఇక ఈ పోస్టుపై సెలబ్రిటీలు స్పందిస్తూ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విక్కీ కౌశల్, సోహా అలీ ఖాన్, శిబానీ దండేకర్ సహా పలువురు కంగ్రాచ్యులేషన్ చెప్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా బాలీవుడ్ ప్రముఖ నటి నీనా గుప్తా- క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ కూతురే మసాబా. సక్సెస్ఫుల్ డిజైనర్‌గా కొనసాగుతున్న ఆమె మసాబా 1,2 సీజన్స్‌తో పాటు మోడ్రన్ లవ్ ముంబై సిరీస్‌లోనూ నటించింది. గతంలో నిర్మాత మధు మంటేనాను పెళ్లాడిన ఆమె 2019లో అతడికి విడాకులు ఇచ్చింది. సత్యదీప్ మిశ్రా విషయానికి వస్తే.. అతడు నో వన్ కిల్ల్డ్ జెస్సికా సినిమాతో 2011లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. లా పూర్తి చేసిన అతడు కార్పొరేట్ లాయర్గానూ పని చేశాడు. ఇటీవలే ఆయన విక్రమ్ వేదాలో సీనియర్ ఇన్స్పెక్టర్గా, స్పైలో ముక్బీర్గా నటించాడు. ప్రస్తుతం ఆయన నటించిన తానవ్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీగా ఉంది. గతంలో ఇతడు హీరోయిన్ అదితి రావును పెళ్లాడాడు. కానీ వీరిద్దరి మధ్య పొరపచ్చాలు రావడంతో 2013లో విడిపోయారు. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Masaba (@masabagupta) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Bollywood News & Updates (@bollywoodcouch) చదవండి: మాస్ మహారాజ రవితేజ ఇల్లు ఎన్ని కోట్లో తెలుసా? మూడు రోజుల్లో మూడు వందల కోట్లు... షారుక్ రికార్డు -
నా కూతుర్ని సినిమాల్లోకి రానివ్వలేదు: బాలీవుడ్ నటి
మసాబా గుప్తా.. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న ఈమె మసాబా మసాబా, మోడర్న్ లవ్ ముంబై అనే వెబ్ సిరీస్‌లలో నటించింది. తల్లి నీనా గుప్తా బాలీవుడ్లో పేరు మోసిన నటి. తండ్రి రిచర్డ్స్ వెస్టిండీస్.. వీరికి గుర్తుగా జన్మించిన కూతురే మసాబా. అయితే రిచర్డ్ తనను పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పడంతో సింగిల్ పేరెంట్‌గానే మసాబాను పెంచి పెద్ద చేసింది నీనా. కానీ మసాబాను సినిమాల్లోకి రానివ్వలేదని అందుకు క్షమాపణలు కోరుతున్నానంటూ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'మసాబా మసాబా మొదటి సీజన్ చూసినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపోయా. నిజానికి మసాబాను నేను ఎప్పుడూ విమర్శిస్తూ ఉండేదాన్ని, అందువల్ల ఆమె బాధపడేది కూడా! కానీ తల్లిగా నేను చేయాల్సింది అదే.. కానీ ఆ సిరీస్ చూశాక ఆమె టాలెంట్‌కు అబ్బురపడ్డా. మొదట్లో తనను సినిమాల్లోకి రానివ్వలేదు.. అందుకు క్షమించమని కోరుతున్నా. నటిగా తనేంటో నిరూపించుకునే సత్తా ఆమెకుంది. తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ సిస్టమ్‌లా ఉండాలి. వారి సమస్యలను పేరెంట్స్ దగ్గర చెప్పుకునేలా ఉండాలి. ఇప్పుడు మసాబా నాతో మాట్లాడినట్లుగా నేను మా అమ్మతో మాట్లాడలేదు. పరిస్థితులు మారుతున్నాయి. కానీ చిన్నకుటుంబంలో మన సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు. అవి మనలోనే నలిగిపోయి కొన్నిసార్లు భయానక పరిస్థితులను సృష్టిస్తాయి' అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా. కాగా మసాబా మసాబా సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: దుస్తులు లేకుండా రణ్వీర్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కిడ్నీ ఫెయిలై మహాభారత్ నటుడు మృతి -
ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తరచుగా ట్రోలింగ్‌కు గురవతున్నారు. కొందరు విచిత్రమైన చేష్టలతో అభాసుపాలైతే మరికొందరు ఏం చేయకుండానే ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ట్రోలింగ్ బారిన పడింది. అయితే ఆమె ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి నోరు మూయించింది. మసాబా గుప్తా ఇటీవల తన పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్ 'నువ్ అంత అందంగా లేవు. ఘోరంగా ఉన్నావ్. ఈ ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ (సినిమా) రంగంలో నువ్ ఎలా ఉన్నావ్' అంటూ వ్యంగంగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ షేర్ చేస్తూ ''ఇది అందమైనది. కేవలం ప్రతిభ వల్లే ఏ పరిశ్రమలోనైనా నిలదొక్కుకోగలరనే విషయాన్ని నీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అమితమైన హార్డ్ వర్క్, భయంకరమైన క్రమశిక్షణ వల్లే అది సాధ్యం. ఇక నా ముఖం విషయానికొస్తే అది నాకొక బోనస్. (నా మైండ్, మనస్సు ఒక పదునైనా కత్తిలాంటింది. నువ్ ఎంత ప్రయత్నించినా నీ చెత్త మాటలు అందులోకి వెళ్లలేవు)'' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మసాబా గుప్తా. చదవండి: 'అవును, ఆ రూమర్ నిజమే' అంటున్న రష్మిక.. అతడితో.. ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు.. హీరోయిన్ పారితోషికంపై చర్చ ! మసాబా గుప్తా ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'మోడ్రన్ లవ్ ముంబై'లో నటించింది. అలాగే ఆమె తల్లి నీనా గుప్తాతో కలిసి నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'మసాబా మసాబా'లో కూడా యాక్ట్ చేసింది. ఈ సిరీస్‌ను మసాబా గుప్తా, ఆమె తల్లి, నటి నీనా గుప్తా జీవితాల నుంచి స్ఫూర్తిగా తీసుకుని సెమీ ఫిక్షన్‌గా తెరకెక్కించారు. త్వరలో ఈ సిరీస్‌కు రెండో సీజన్ కూడా రానుంది. 'ఎమ్‌టీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్' రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది మసాబా గుప్తా. కాగా మసాబా గుప్తా.. నీనా గుప్తా, క్రికెటర్ వివ్ రిచర్డ్‌ల సంతానం. తర్వాత నీనా గుప్తా చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకుంది. చదవండి: నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ -
Fashion: ‘హౌస్ ఆఫ్ మసాబా’ గ్రీన్ ఫ్లోరల్ సారీలో నిత్య.. చీర ధర ఎంతంటే!
ఈతరం సహజ నటి.. నిత్యా మీనన్. తెర మీద ఆమె కళ్లు.. నవ్వు.. నడక.. అన్నీ అభినయాన్ని ఒలకబోస్తాయి. ఏ భూమికను తీసుకుంటే ఆ భూమికే కనిపించేలా చేయడం ఆమె ప్రత్యేకత. అలాంటి స్పెషల్ స్టయిలే ఆమె అనుసరించే ఫ్యాషన్ విషయంలోనూ ఉందా? అంటే ఉంది మరి. సాక్ష్యం ఇదిగో.. మసాబా గుప్తా ఇప్పుడున్న టాప్ మోస్ట్ డిజైనర్స్‌లో మసాబా గుప్తానే ఫస్ట్. 2009లో ‘హౌస్ ఆఫ్ మసాబా’ పేరుతో బ్రాండ్‌ను ప్రారంభించింది. నాణ్యత, సృజనే బ్రాండ్ వాల్యూగా సాగిపోతోంది. అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. ఎందరో సెలబ్రిటీస్‌ను ఆమె డిజైన్స్‌కు అభిమానులుగా మారుస్తోంది. మసాబా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్‌ల కూతురు అని తెలుసు కదా! కానీ పేరెంట్స్ పేరుప్రఖ్యాతులను తన కెరీర్‌కు పునాదిగా మలచుకోలేదు. కేవలం తన క్రియెటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జిస్తోంది. బ్రాండ్ వాల్యూ చీర డిజైనర్ -మసాబా గుప్తా ధర: రూ. 10,500 మంగత్రాయ్ జ్యూయెలరీ ముత్యాలు, వజ్రాల వ్యాపారంలో వందేళ్లకు పైగా చరిత్ర గల సంస్థ మంగత్రాయ్ జ్యూయెలర్స్. దేశంలోనే కాదు గల్ఫ్, యూరోప్, అమెరికా దేశాల్లోనూ బ్రాంచ్‌లను నెలకొల్పింది. స్వచ్ఛత, నాణ్యత, నాజూకైన డిజైన్లే దీని బ్రాండ్ వాల్యూ. సామాన్యులకూ, సెలబ్రిటీలకూ అందుబాటులోనే ధరలు. జ్యూయెలరీ: పర్ల్ నెక్లెస్ ధర: రూ. 14,100 బ్రాండ్: మంగత్రాయ్ జ్యూయెలరీ బ్రేస్లెట్ ధర: రూ. 1,890 నిత్యం కొత్తగా ఉండాలనుకుంటాను. ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. సినిమా కెరీర్ నాకు బెస్ట్ టీచర్ అనే చెప్పాలి. చాలా నేర్పింది.. నేర్పిస్తూనే ఉంది. – నిత్యా మీనన్ -దీపిక కొండి చదవండి: Femina Miss India 2022: ఫెమినా మిస్ ఇండియాగా సినీ శెట్టి.. -
తల్లి ఓ స్టార్ నటి, తండ్రి ఓ స్టార్ ఆటగాడు.. కూతురు ఏమో ఇలా..
మసాబా గుప్తా... పేరు వినగానే ముందు వాళ్లమ్మ నీనా గుప్తా.. తర్వాత వాళ్ల నాన్న వివ్ రిచర్డ్స్‌ను గుర్తుచేసుకునేవాళ్లున్నారు. కానీ ఈ ఇద్దరు లెజెండ్స్ నీడను కాదని సొంత ఉనికిని చాటుకుంటోంది మసాబా. ఈ రోజు ఇక్కడ ఆమె గురించి రాస్తున్నామంటే కారణం.. భిన్న రంగాల్లో మసాబా సాధిస్తున్న విజయాలు.. తెచ్చుకుంటున్న ఐడెంటిటీయే! మసాబా పుట్టింది ఢిల్లీలో.. పెరిగింది ముంబైలో. తల్లి నీనా గుప్తా బాలీవుడ్ నటి. తండ్రి వివ్ రిచర్డ్స్ వెస్టిండీస్... క్రికెట్ స్టార్. కాస్త ఊహ తెలిసేప్పటికే తండ్రి లాగా ఆటల్లో రాణించాలనుకుంది. టెన్నిస్‌లో శిక్షణ కూడా తీసుకుంది. తనకు పదహారో యేడు వచ్చే వరకూ టెన్నిస్ ఆడింది. వాళ్లమ్మేమో మసాబా నటి కావాలని కోరుకుంది. ఆ రెండూ కాక మసాబా మ్యూజిక్ అండ్ డాన్స్ మీద ఆసక్తి పెంచుకుంది. లండన్ వెళ్లి ఆ రెండిటికీ సంబంధించిన కోర్స్ చేసింది. అప్పుడే.. తనకు పందొమ్మిదేళ్ల వయసప్పుడు లాక్మే ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఇక తను చేరుకోవాల్సిన గమ్యం అదే అని నిర్ణయించుకుంది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ తీసుకుంది. డిజైనర్‌గా ష్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అంతర్జాతీయ కీర్తిని ఆర్జించింది మసాబా. అప్పటి (2014) ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ‘బిజినెస్ ఎక్సలెన్స్ అండ్ ఇన్నోవేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్’ అవార్డ్‌ను అందుకుంది. తల్లి నీనా గుప్తా కోరుకున్నట్టుగా 2020లో నటనా రంగంలోకి ప్రవేశించింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ‘మసాబా మసాబా’ అనే వెబ్ సిరీస్‌తో నటిగా మారింది. ఒకరకంగా ఇది ఆమె జీవిత కథే. అందులో మసాబా నటనకు మంచి పేరు వచ్చింది. తండ్రిలా ఆటల్లో, తల్లిలా నటనారంగంలో.. తనకులా ష్యాషన్ రంగంలో ఎందులోనైనా రాణించగలను అని నిరూపించుకుంది. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారంలోకి వచ్చిన ‘మోడర్న్ లవ్ ముంబై’ అనే ఆంథాలజీలోనూ నటించింది. నటిగా మరోసారి తన ప్రతిభను చూపింది. ఈ సందర్భంగా ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన మాసాబా తన తల్లి నీనా గుప్తే తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా అమ్మను చూస్తే ఏజ్ అనేది ఓ నంబర్ మాత్రమే అనిపిస్తుంది. 67 ఏళ్ల వయసులో కూడా వర్క్ చేస్తూ స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తోంది. తను జీవితంలో చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. కానీ ఎప్పుడూ నిరాశను దరిచేరనివ్వలేదు. అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను.. కుంటున్నాను కూడా. తనే నాకు ఇన్స్పిరేషన్’ అని చెప్పుకొచ్చింది. -
పాచిపని అయినా చేద్దామనుకున్నా: నటి
కూతురిని ప్రయోజకురాలిని చేసి సింగిల్ మదర్‌గా జీవించగలనని నిరూపించింది బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా. అయితే ఇందుకు తన తల్లే కారణమంటోంది. స్వతంత్రంగా ఎలా బతకగలమనేది తల్లి నుంచే నేర్చుకున్నాననంటోంది. తనను పెంచి పెద్ద చేయడానికి పాచిపని చేసేందుకైనా సిద్ధపడ్డాను కానీ ఎవరినీ సాయం కోసం చేయి చాచి అడగలేదని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో నీనా గుప్తా మాట్లాడుతూ.. 'నేను ఎవరి మీదా ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాను. అది డబ్బు విషయమే కావచ్చు, మరేదైనా కావచ్చు. పొట్టకూటి కోసం ఏ పని చేసినా అందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని నా తల్లి దగ్గర నేర్చుకున్నాను. ఇళ్లు ఊడ్వడం, అంట్లు తోమడం సహా ఎలాంటి పనులు అయినా చేస్తాను కానీ ఎవరి దగ్గరా పైసా అడగకూడదనుకున్నా. ఆఖరికి నా కుటుంబం, స్నేహితుల దగ్గర నుంచి కూడా ఎప్పుడూ ఆర్థిక సాయం కోరలేదు' అని చెప్పుకొచ్చింది. నీనా కూతురు మసాబా గుప్తా ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. నీనా సినిమాల విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'గుడ్‌బై' సినిమాలో నటిస్తోంది. ఆమె చివరగా నటించిన 'సర్దార్ కా గ్రాండ్సన్' మూవీ ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. చదవండి: సర్దార్ కా గ్రాండ్సన్ రివ్యూ: నానమ్మ కోరికను హీరో నెరవేరుస్తాడా? -
అమ్మ ఆత్మకథ కలిచివేసింది: మసాబా
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ నీనా గుప్తాది విభిన్నమైన వ్యక్తిత్వం. తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడించేవారు. నీనా గుప్తా మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం చేయడం.. మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. కాగా నీనా ఆటో బయోగ్రఫీలోని ఓ ఆసక్తికర విషయాన్ని ఆమె కూతురు, ఫ్యాషన్ డిజైనర్ మసాబా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. రిచర్డ్స్‌తో విడిపోయాక.. మసాబా జన్మించే సమయానికి తన దగ్గర కేవలం 2000 రూపాయలు మాత్రమే ఉన్నాయని, దీంతో తాను సాధారణ ప్రసవం కోసం చూసినట్లు నీనా తన ఆత్మకథలో రాసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇప్పుడు తాజాగా మసాబా షేర్ చేస్తూ తన తల్లి ఆత్మకథ చదివానని, దానిని నుంచి చాలా విషయాలను నేర్చుకున్నానంటూ భావోద్యేగానికి లోనయ్యింది. బుక్‌లోని ఈ పేజీని షేర్ చేస్తూ.. ‘అమ్మ నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహున్ తో’లో.. మా అమ్మ నాకు జన్మనిచ్చే సమయంలో తన వద్ద కేవలం బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 2 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆమె సాధారణ డెలివరి కావాలని కోరుకుంది. ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ అంటే 10 వేల రూపాయలు కావాలని. లక్కీగా సమయానికి ట్యాక్స్ రీయింబర్స్మెంట్ పెరగడంతో తన ఖాతాలో 9 వేలు జమ అయ్యాయి. చివరకు తన డెలివరి సమయానికి బ్యాంకులో 12 వేల రూపాయలు అయ్యాయి. ఇప్పుడు నేను సీ-సెక్షన్ శిశువు. తన ఆత్మకథ చదివి చాలా విషయాలు నేర్చుకున్నాను. తను నన్ను ఈ భూమి మీదకు తీసుకువచ్చేందుకు ఎంతటి కష్టాలు భరించిందో తెలుసుకున్నాను. ఆ సంఘటన నన్ను కలిచివేసింది. అందుకే నా జీవితంలో ప్రతి రోజు.. ప్రతి క్షణం ఆమె రుణం తీర్చుకునేందుకే కష్టపడతాను’ అంటూ మసాబా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) -
క్రిస్మస్ రోజు నేను చనిపోయాననుకుంది
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా చేసిన పనికి ఆమె తల్లి, సీనియర్ నటి నీనా గుప్తాకు ఒక్క క్షణం గుండాగినంత పనైందట. ఇంతకీ ఆమె ఏం చేసిందనుకుంటున్నారు.. మరేం లేదు. పండగ పూట త్వరగా నిద్ర లేవాల్సింది పోయి బారెడు పొద్దెక్కినా ఆదమరిచి నిద్రపోయారట. దీంతో మసాబా చనిపోయిందా? ఏంటని ఆమె తల్లికి చెమటలు పట్టాయట. ఈ విషయాన్ని మసాబా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించారు. "శుభోదయం నీనాజీ. నాకసలు ఆలస్యంగా నిద్ర లేచే అలవాటే లేదు. కానీ క్రిస్మస్ రోజు ఆలస్యంగా తొమ్మిదిన్నర వరకు నిద్ర లేవలేదు. దీంతో భయపడిపోయిన అమ్మ నేను బతికున్నానా? లేదా? అని నా దగ్గరకు వచ్చి చెక్ చేసింది" అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు నీనా తన ఫోన్‌ను పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. అమ్మ కంగారును పోగొట్టేందుకు మసాబా త్వరగా రెడీ అయి పండగ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నారు. అయితే సత్యదీప్ మిశ్రాను మిస్ అవుతున్నానని బాధ పడ్డారు. కాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, నీనా గుప్తాల కూతురైన మసాబా నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'మసాబా మసాబా'తో నటనా రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో తల్లి నీనాతో కలిసి నటించారు. (చదవండి: ఈసారి ఫుల్ మీల్స్) మసాబా వ్యక్తిగత విషయానికి వస్తే.. 2015లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ మధు మంతెనను ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువకాలం నిలవలేదు. ఈ నేపథ్యంలో తామిద్దరం విడిపోతున్నామంటూ మధు, మసాబా 2018లో ప్రకటన విడుదల చేశారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె నటుడు సత్యదీప్ మిశ్రాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సత్యదీప్, మసాబా ఆ మధ్య ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు ఈ వదంతులకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక సత్యదీప్ సైతం తన భార్య, ప్రముఖ హీరోయిన్ అదితీ రావ్ హైదరీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. 2009లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట 2013లో తమ బంధానికి స్వస్తి పలికారు. (చదవండి: విడాకులు: మళ్లీ ప్రేమలో పడిన నటుడు!) -
నా పెళ్లి గురించి మసాబా ఏమన్నదంటే..
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ నీనా గుప్తాది విభిన్నమైన వ్యక్తిత్వం. తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడిస్తారు. యాభైలలో నీనా గుప్తా మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం చేయడం.. మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. రిచర్డ్స్‌తో విడిపోయిన తర్వాత 2008లో నీనా గుప్తా ఢిల్లీకి చెందిన వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్నారు. అప్పుడు మసాబాకు 19 సంవత్సరాలు. అయితే వివేక్‌ను వివాహం చేసుకోవాలనుకుంటున్న విషయం గురించి మసాబాతో చెప్పినప్పుడు తాను ఎలా స్పందించింది అనే విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నీనా గుప్తా. (చదవండి: విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..) ఈ సందర్భంగా నీనా గుప్తా మాట్లాడుతూ.. ‘వివేక్-నేను ఓ పదేళ్ల పాటు కలిసి తిరిగాము. తను నా కోసం ముంబై వచ్చేవాడు.. నేను అతడి కోసం ఢిల్లీ వెళ్లేదాన్ని. ఇవన్ని మసాబాకు తెలుసు. ఇక మేం పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు దీని గురించి మసాబాకు చెప్పాను. అప్పుడు తన వయసు 19 ఏళ్లు. పెళ్లి గురించి చెప్పగానే తను అడిగిన మొదటి ప్రశ్న.. ఎందుకు వివాహాం చేసుకోవాలనుకుంటున్నావు అని. అప్పుడు నేను ఈ సమాజంలో గౌరవంగా బతకాలంటే పెళ్లి తప్పని సరి అని చెప్పాను’ అన్నారు. అయితే దీని గురించి మసాబాతో చెప్పడానికి తాను కొంత ఇబ్బంది పడ్డానన్నారు నీనా గుప్తా. కానీ మసాబా నన్ను అర్థం చేసుకుంది. నా ఆనందం కోసం తను ఏమైనా చేస్తుంది. అది తనకు నచ్చినా.. నచ్చకపోయినా. కాబట్టి నేను ఆందోళన చెందలేదు అన్నారు. ఇక నీనా గుప్తా, వివేక్ మెహ్రాల వివాహం 2008లో జరిగింది. -
చేతిలో చీపురు.. ఈ సెలబ్రిటీ ఎవరు?!
‘‘ఏ పనీ చిన్నది కాదు. గ్లామర్వాలా అయినా సఫాయీ వాలా అయినా ఒకటే అని నీనా గుప్తా నాకు ఎప్పుడూ చెబుతూ ఉంటారు’’ అని ప్రముఖ ప్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా తన పెంపకంలో తల్లి అవలంబించిన విధానాన్ని అభిమానులతో పంచుకున్నారు. తల్లి నీనా గుప్తా చిన్నతనంలో తనను అందంగా ముస్తాబు చేసిన ఫొటోతో పాటు చేతిలో చీపురు పట్టుకుని ఉన్న ఫొటో షేర్ చేసి ఈ విధమైన క్యాప్షన్ జతచేశారు. కాగా బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా- వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌ల కూతురైన మసాబా గుప్తా ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనం కపూర్, ఆమె సోదరి, నిర్మాత రియా కపూర్ తదితర సెలబ్రిటీలకు ఆమె వైవిధ్యమైన, ట్రెండీ దుస్తులు డిజైన్ చేసి ఫ్యాషన్ ప్రియుల మన్ననలు అందుకున్నారు. (వారి విడాకుల విషయం కుంగదీసింది: నటి) కాగా వివాహితుడైన రిచర్డ్స్‌ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో మసాబాకు జన్మనిచ్చారు. సింగిల్ మదర్‌గా ఉన్నప్పటికీ తన తండ్రి సాయంతో బిడ్డకు ఎటువంటి లోటు రాకుండా అపురూపంగా పెంచుకున్నారు. ఇటీవల తన మనోభావాలను వెల్లడించిన నీనా... పెళ్లైన వ్యక్తి ప్రేమలో పడి తాను తప్పుచేశానని.. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొన్నానంటూ కూతురి పెంపకంలో తనకు ఎదురైన సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. ఇక 2015లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ మధు మంతెనను వివాహం చేసుకున్న మసాబా.. ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు విడాకుల విషయం తెలిసి తాను విషాదంలో మునిగిపోయానని.. తనపై తీవ్ర ప్రభావం చూపిన విషయం ఇదేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మసాబా ప్రస్తుతం ఆమె అదితీరావ్ హైదరీ మాజీ భర్త, నటుడు సత్యదీప్ మిశ్రాతో ప్రేమలో పడినట్లు బీ- టౌన్ టాక్. గోవాలోని సత్యదీప్ ఇంట్లో వీరిద్దరు లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి.(హీరోయిన్ మాజీ భర్త ప్రేమలో మసాబా!?) View this post on Instagram @neena_gupta used to tell me all the time - Koi kaam chhota nahin hota 🙏🏼 Na toh ‘Glamour’ wala na ghar ki safai wala A post shared by Mufasa✨🌙 (@masabagupta) on May 25, 2020 at 4:06am PDT -
హీరోయిన్ మాజీ భర్త ప్రేమలో మసాబా!?
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా మళ్లీ ప్రేమలో పడినట్లు బీ-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నటుడు సత్యదీప్ మిశ్రాతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు ముంబై మిర్రర్ ఓ కథనం ప్రచురించింది. విహార యాత్ర కోసం గోవాకు వెళ్లిన ఈ జంట లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారని.. అప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారన్నది ఆ వార్తల సారాంశం. ఇక సత్యదీప్, మసాబా ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు ఈ వదంతులకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇద్దరూ ఒకే విధమైన బ్యాక్‌గ్రౌండ్‌లో వివిధ భంగిమల్లో వేరవేరుగా నిల్చుని ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో వీరిద్దరూ సత్యదీప్ ఇంట్లోనే ఉన్నారంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. కాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, నీనా గుప్తాల కూతురైన మసాబా.. ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. (వారి విడాకుల విషయం కుంగదీసింది: నటి) ఈ క్రమంలో 2015లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ మధు మంతెనను ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువకాలం నిలవలేదు. ఈ నేపథ్యంలో తామిద్దరం విడిపోతున్నామంటూ మధు, మసాబా 2018లో ప్రకటన విడుదల చేశారు. కోర్టు మ్యారేజీ ద్వారా పెళ్లి చేసుకున్న తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకులకు దరఖాస్తు చేయగా.. బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఇటీవల వారికి విడాకులు మంజూరు చేసింది. ఇక సత్యదీప్ సైతం తన భార్య, ప్రముఖ హీరోయిన్ అదితీ రావ్ హైదరీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. 2009లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట 2013లో తమ బంధానికి స్వస్తి పలికారు. ఇక అదితి ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి సారించి వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. -
విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..
తన కూతురు మసాబా విడాకుల విషయం తెలిసి తాను విషాదంలో మునిగిపోయానని బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా అన్నారు. తనపై తీవ్ర ప్రభావం చూపిన విషయం ఇదేనని పేర్కొన్నారు. వెస్టిండీస్ క్రికెటర్, వివాహితుడైన వివియన్ రిచర్డ్స్‌ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమెకు మసాబాగా నామకరణం చేసి.. తల్లీతండ్రీ తానే అయి అపురూపంగా పెంచుకున్నారు. ఈ క్రమంలో మసాబా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా 2015లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ మధు మంతెనను వివాహం చేసుకున్న మసాబా.. రెండేళ్ల క్రితం వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. మధు, మసాబా ఈ మేరకు 2018 ఆగస్టులో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కోర్టు మ్యారేజీ ద్వారా పెళ్లి చేసుకున్న తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం వారికి విడాకులు మంజూరయ్యాయి.(వివాహితుడిని ప్రేమించకండి: నటి) ఈ విషయం గురించి తాజాగా మసాబా తల్లి నీనా గుప్తా మాట్లాడుతూ.. మధు, మసాబాల విడాకుల గురించి తెలిసి తాను దుఃఖ సాగరంలో మునిగిపోయానని తెలిపారు. ‘‘నిజానికి ఈ విషయం తెలిసిన తర్వాత బాధ నుంచి తేరుకోలేకపోయాను. అప్పుడు మసాబానే నాకు సహాయం చేసింది. నేను అస్సలు ఈ విషయాన్ని అంగీకరించలేకపోయాను. నాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది’’అని తన ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా... ‘‘నా కూతురి పెంపకంలో నా తండ్రి నాకు ఎంతగానో సహాయం చేశారు. నా కోసం ఆయన ముంబైకి షిప్ట్ అయ్యారు. నా కోసం అంతగా కష్టపడిన నాన్నకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. సింగిల్ పేరెంట్‌గా ఉన్న నాకు వెన్నెముకగా నిలిచారు’’ అని తన కూతురి పెంపకంలో ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకున్నారు. కాగా కూతురికి జన్మనిచ్చిన తర్వాత వివియన్ రిచర్డ్స్, నీనా విడిపోయారు. అనంతరం నీనా గుప్తా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. బదా యీ హో, సర్వమంగళ్ జ్యాదా సావధాన్ సినిమాలలో ఇటీవల తెరపై కనిపించారు. ఇక కొన్నిరోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేసిన నీనా గుప్తా.. పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడవద్దంటూ తన అనుభవాల గురించి పంచుకున్న సంగతి తెలిసిందే. -
విడాకుల విషయం విని షాక్ అయ్యా!
తమ కూతురి విడాకుల విషయం విని షాక్‌కు గురయ్యామని బాలీవుడ్ ప్రముఖ నటి నీనా గుప్తా అన్నారు. నీనా గుప్తా ఇటీవలే బదాయి హో చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాకుండా ఫిల్మ్ ఫేర్ (క్రిటిక్స్) బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురి విడాకులకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. కొన్ని రోజుల క్రితమే తమకు ఈ విషయం తెలిసిందని అన్నారు. తన కూతురు మసాబా గుప్తా, అల్లుడు మధు మంతెన మార్చిలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే.. మధు ఎంతో మంచి వాడని, ఇప్పటికీ తమకు అతనంటే ఎంతో ఇష్టమని, ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని తన కూతురితో చెప్పినట్లు వివరించారు. వాళ్లిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమేనని, బాగా ఆలోచించుకునే విడాకులు కోరుకుంటున్నారని అన్నారు. నీనా గుప్తా తాజాగా ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్‌లో నటించారు. కంగనా రనౌత్ ‘పంగా’లో కూడా నటించనున్నారు. -
పటాసులు అవసరమా?
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ క్యాపిటల్ రీజియన్, ఢిల్లీలో సుప్రీంకోర్టు బాణాసంచాను నిషేధించడాన్ని ప్రముఖ డిజైనర్ మసాబా గుప్త సమర్థించారు. సుప్రీంకోర్టు నిర్ణయంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు బిన్నరకాలుగా స్పందించారు. రెండు రోజుల కిందట సుప్రీం నిర్ణయంపై ప్రముఖ రచయిత చేతన్ భగత్ వ్యంగ్యంగా స్పందించిన విషయం తెలిసిందే. చేతన్ భగత్ వ్యాఖ్యలపై మసాబా గుప్త విభిన్నంగా స్పందించింది. ‘‘నేను దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. దేశాన్ని ప్రేమించే వాళ్లంతా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటే మసాబా ట్విటర్లో ట్వీట్ చేశారు. డిజైనర్ మసాబా గుప్త.. ప్రముఖ వెస్టిండీస్ క్రీడాకారుడు వివ్ రిచర్ట్స్, నీనా గుప్తల కుమార్తె. మసాబా ట్వీట్‌పై చేతన్ భగత్ వ్యంగ్య కామెంట్లు చేశారు. నేను అత్యంత స్ఫూర్తివంతమైన వ్యక్తిని నేడు కలిశాను అంటూ ట్వీట్ చేశారు. చేతన్ ట్వీట్‌కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. pic.twitter.com/VRwKk8sQPm — Masaba Mantena (@MasabaG) October 12, 2017