

ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురిగా మసాబా గుప్తా అందరికీ సుపరిచితురాలే!

ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ ఆరంభించిన మసాబా తర్వాత నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది.

మసాబా మసాబా అనే వెబ్ సిరీస్, మోడ్రన్ లవ్: ముంబై చిత్రంలో నటించింది.

గతంలో టాలీవుడ్ నిర్మాత మధు వంతెనను పెళ్లాడింది. కానీ, ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. కొంతకాలానికే విడిపోయారు.

ఆ తర్వాత సత్యదీప్ మిశ్రాతో ప్రేమలో పడింది.

గతేడాది వీరు రెండో పెళ్లి చేసుకున్నారు.

సత్యదీప్ గతంలో హీరోయిన్ అదితి రావు హైదరితో ఏడడుగులు నడిచాడు.

ఈ రిలేషన్‌షిప్ కొంతకాలానికే ముగిసిపోయింది.

మసాబా- సత్యదీప్ త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నారు

ఈ మేరకు మసాబా తన సీమంతం ఫోటోలను షేర్ చేసింది.

