ప్రధాన వార్తలు

ఇంటింటా నిజం.. తల్లికి మోసం
ఈమె పేరు కొండేటి మరియమ్మ. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు. ఈమె కుమారుడు అవినాష్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం ద్వారా కేవలం రూ.8,850 మాత్రమే ఆమె ఖాతాలో పడ్డాయి. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని, త్వరలో కేంద్ర ప్రభుత్వ వాటా జమ అవుతుందని సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని ఆమె చెబుతోంది. అందరితోపాటు తనకూ సమానంగా డబ్బులు పడ్డాయంటోంది. ఇప్పుడు రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇలా చేశారేమిటని ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాక్షి, అమరావతి : ‘అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్‌ను అమలు చేసి పేదరికాన్ని పారదోలుతాం.. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం..’ అని చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు కూటమి సర్కారు ఆ తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ప్రధానంగా తల్లికి వందనం పథకం గురించి చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీ శ్రేణులు ఊరూరా, ఇంటింటా ఊదరగొట్టాయి. అధికారం చేపట్టాక తొలి ఏడాది ఈ పథకాన్ని అమలు చేయకుండా మోసం చేయడం ఒక ఎత్తు అయితే.. రెండో ఏడాది అరకొరగా అమలు చేస్తూ.. చాలా గొప్పగా అమలు చేశామని డప్పు కొట్టు కోవడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి.. అమలు దశకు వచ్చే సరికి రూ.13 వేలే అన్నారు. వివిధ సాకులు చూపి ఏకంగా 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. తీరా మిగిలిన లబ్ధిదారుల్లో కొంత మందికి కేవలం రూ.8–9 వేలు మాత్రమే ఖాతాల్లో వేసి.. అంతా ఇచ్చేశామంటున్నారు. ఇదొక్కటే కాదు.. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేశామని, ఇక వీటి గురించి ఎవరైనా మాట్లాడితే వారి నాలుక మందమే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దబాయిస్తూ మాట్లాడారు. ‘తల్లికి వందనం’ అమలుతో చంద్రబాబు చేస్తున్న దగాపై ఊరూరా మహిళలు, విద్యార్థులు రగిలిపోతున్నారు. కొన్ని ఊళ్లలో అయితే ఏకంగా స్కూలు మొత్తం మీద ఒక్కరికి కూడా ఇవ్వలేదు. నిరుపేదలకు సైతం ఎగనామం పెట్టేశారు. చెప్పిందేమిటి.. చేసిందేమిటి.. అంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెడ్మాస్టర్లు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమకెందుకు డబ్బులు పడలేదంటూ నిలదీస్తున్నారు. ‘మేమేం చేయలేం. అలా ఎందుకు జరిగిందో మాకు తెలీదు’ అంటూ వారు చేతులెత్తేస్తున్నారు. కనీసం ఇస్తామన్న రూ.13 వేలు కూడా ఎందుకు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతుంటే సమాధానం చెప్పేవారే లేరు. నష్టపోయిన వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్హం. నగదు జమ కాకుండానే మెసేజ్‌లు రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు యూడైజ్‌లో నమోదైన విద్యార్థులు 87.42 లక్షల మంది ఉంటే తొలి ఏడాది అందరికీ తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టింది. రెండో ఏడాది లబ్ధిదారుల్లో 30 లక్షల మందిని తప్పించింది. మిగిలిన వారికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పినా.. ఆ తర్వాత రూ.13 వేలే అంది. తర్వాత సాకు దొరికిన చోటల్లా నిధుల్లో కోతపెట్టింది. కొందరికి రూ.9 వేలు, ఇంకొందరికి రూ.8 వేలు, మరికొందరికి రూ.8,800 చొప్పున ఇచ్చి, మిగిలిన డబ్బును ఎగవేసింది. ఇలా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన లబ్ధిదారుల్లో కొందరికి నగదు జమ కాగా, ఇంకొందరికి నగదు జమ కాకుండానే నిధులు జమ చేశామని వారి ఫోన్లకు సంక్షిప్త (ఎస్ఎంఎస్) సందేశాలను పంపిస్తోంది. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పథకం ఎగవేతకు అనేక సాకులుగతంలోనూ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను ఎగ్గొట్టిన టీడీపీ ప్రభత్వం.. ఇప్పుడు కూటమి సర్కారులోనూ అదే పంథాను అనుసరిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్–6 హామీలు అమలు చేయకుండానే అన్నీ చేసేసినట్టు ప్రచారం చేసుకుంటోంది. తల్లికి వందనం పథకం అమలులో ప్రతి దశలోనూ ప్రజలను దగా చేస్తోంది. అర్హుల ఎంపికలోనూ, నిధుల మంజూరులోనూ కోతలు పెట్టింది. దీనికి వీలైనన్ని కారణాలను వెతుకుతూ విద్యార్థుల సంఖ్యను నానాటికీ తగ్గించేస్తోంది. ఇంకా తల్లికి వందనం పడని విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉండడం గమనార్హం. వచ్చే ఏడాది దీన్ని మరింత కుదించేందుకు ఇప్పటి నుంచే పథకం రూపొందించారు. ముగ్గురికీ డబ్బులు పడలేదు మా పిల్లలు రిషికుమార్, పూజిత, జాహ్నవిలు ముగ్గురూ తల్లికి వందనం పథకానికి అర్హులని ఆన్లైన్లో వచ్చింది. అందరికీ పడినట్లే మాకు ముగ్గురు పిల్లలకూ కలిపి రూ.45 వేలు పడతాయని ఎదురు చూశాం. కానీ పడలేదు. అధికారులను అడిగితే తమ చేతుల్లో లేదని, ప్రభుత్వం వెయ్యాలని అంటున్నారు. ఆన్లైన్లో చూస్తే ‘పేమెంట్ హోల్డ్ బై డిపార్టుమెంట్ ఆర్టీఈ’ అని చూపిస్తోంది. ఇలా ఎందుకు వచ్చిందని, అసలు డబ్బులు పడతాయా, లేదా అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. రెండు వారాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. గతంలో ఎప్పుడూ సమయానికి అమ్మ ఒడి డబ్బులు పడేవి. గత సంవత్సరం ఎలాగూ ఇవ్వలేదు. ఈ ఏడాది ఇలా మెలిక పెట్టి ఆపేశారు. అర్హత ఉన్నా మాలాంటి చాలా మంది డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారు. – నూజివీడు దేవి, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం అర్హులను తగ్గించేందుకు తంటాలు ఈ ఏడాది రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే పిల్లలు యూడైజ్‌లో 87.42 లక్షల మంది నమోదై ఉంటే 67,27,164 మందికే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అందరికీ తల్లికి వందనం ఇస్తామన్న హామీకి తూట్లు పొడిచింది. ఆ తర్వాత 54,94,703 మందికే పథకం ఇస్తున్నట్టు జీఓ విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపికలో భారీగా కోత పెట్టింది. ఏటా విద్యుత్ బిల్లు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని సగటున నెలకు 300 యూనిట్లు లోపు వినియోగించే వారికి మాత్రమే పథకం ఇస్తామని మెలిక పెట్టింది. కానీ ఆరు నెలల కాలాన్ని సగటున పరిగణనలోకి తీసుకోకుండా చాలా మందికి అన్యాయం చేసింది. తొలుత మున్సిపల్ కారి్మకులకూ పథకం వర్తింపజేస్తున్నట్టు ప్రకటించిన సర్కారు.. తర్వాత కేవలం శానిటేషన్ వర్కర్లకు మాత్రమే పరిమితం చేసింది. వారిలోనూ సగం మందికి డేటా సరిగా లేదని ఎగనామం పెట్టింది. పచ్చి మోసం.. దగా.. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం హైసూ్కల్లో 300 మంది విద్యార్థులు చదువుతుంటే ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం ఇవ్వలేదు. ఇలాంటి ఘటనలు ప్రతి జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి. ఎలిజిబుల్ జాబితాల్లో మాత్రం పెయిడ్ అని చూపిస్తోందని, అకౌంట్లో మాత్రం డబ్బులు జమ కాలేదని అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మంగళవారం విద్యార్థులు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు లెక్కలేనన్ని కనిపిస్తున్నాయి. డబ్బులు రాకపోయినా వచ్చాయంటూ మెసేజ్‌లు పంపించడంపై ప్రజలు మండిపడుతున్నారు. వీటిపై ఇటు అధికారులు, అటు బ్యాంకర్లు, హెడ్మాస్టర్లు అక్కచెల్లెమ్మలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. సీఎం చంద్రబాబు మాత్రం సూపర్ సిక్స్ సహా అన్ని హామీలూ నెరవేర్చామని కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. వీటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. వారి నాలుకే మందం అంటూ హూంకరిస్తున్నారు. కూటమి సర్కారు తీరు చూస్తుంటే.. ‘ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఒడ్డు చేరాక బోడి మల్లన్న’ అన్నట్లుందని మహిళలు, విద్యార్థులు రగిలిపోతున్నారు. ఇంత పచ్చిగా మోసం చేస్తారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘హరి హర వీరమల్లు’ ట్విటర్ రివ్యూ
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వంలో ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు నిర్మించిన ఈ సినిమా మొదటి భాగం ‘హరిహర వీరమల్లు: స్పిరిట్ వర్సెస్ స్వార్డ్’ నేడు(జులై 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న అర్థరాత్రే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. అలాగే ఓవర్సీల్‌లోనూ ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. హరిహర వీరమల్లు కథేంటి? పవన్ కల్యాణ్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. Horse Scenes Ee laptop Lone edit Chesaru Anukunta 🤣🤣Jyothi Krisna Em Direct Chesinav..Worst vfx in second half #hariharaveeramallu pic.twitter.com/SyOypIQTPh— News Telugu (@neduru_thiru) July 23, 2025 హరిహర వీరమల్లు చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే..బాగోలేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. సినిమాలోని వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. పవన్ గుర్రపు స్వారీ సన్నివేశాలపై పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అభిమానుల సైతం ఆట్టుకునేలా సినిమా లేదని కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. ఉన్నంత ఫస్టాఫ్ బాగుందని చెబుతున్నారు. సెకండాఫ్ మొత్తం చెడగొట్టారని, క్రిష్ ఎందుకు బయటకు వచ్చాడు ఇప్పుడు అర్థమైందని పలువురు నెటిజన్స్ సెటైరికల్ ట్వీట్స్ పెడుతున్నారు.#HariHaraVeeraMallu is a lackluster period action drama, weighed down by an outdated and incoherent screenplay, further hampered by subpar technical quality! The first half is somewhat tolerable and includes a few well-executed sequences, such as the introductory block and the…— Venky Reviews (@venkyreviews) July 23, 2025 హరిహర వీరమల్లు ఒక పేలవమైన పిరియాడికల్ యాక్షన్ డ్రామా. రొటీన్ స్క్రీన్‌ప్లే, టెక్నికల్‌గా చాలా పూర్‌గా ఉందంటూ ఓ నెటిజన్ కేవలం 2 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు.Nenu fan ne but aa graphics kosam aa ra 5y teesukunnaru hatsoff to krish🙏🙏Andhariki ante best ichindhi ante kreemdifferences endhuku vachayo ardham ayindhi.Story complete ga change chesi Padesaru 2nd half...1st half ayyaka movie hit ayipoyindhi anukunna #HariHaraVeeraMallu— loki (@loki88255310283) July 23, 2025 నేను పవన్ కల్యాణ్ అభిమానినే.కానీ ఆ గ్రాఫిక్స్ కోసం 5 ఏళ్లు తీసుకున్నారంటేనే బాధగా ఉంది. క్రిష్‌కి హ్యాట్సాఫ్. అందరి కంటే ఆయనే బెస్ట్ ఇచ్చాడు. ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు అర్థం అయింది. సెకండాఫ్ కథ మొత్తం మార్చిపడేశారు. ఫస్టాఫ్ అయ్యాక మూవీ హిట్ అనుకున్నా.. అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడుVery good first half Second half first 40 mins avrg Last 40 mins are good !! Keeravani’s score is the heart of the film 🔥🔥🔥🔥 Kusthi fight & pre climax fights stand out ,Songs are good Vfx is below par !! Overall a good film with bad vfx #HariHaraVeeraMallureview pic.twitter.com/OirpOZznM7— HHVM Vinny 🦅🔥 (@Vinny_tweetz) July 23, 2025 ఫస్టాఫ్ బాగుంది.సెకండాఫ్ మొదటి 40 నిమిషాలు యావరేజ్. చివరి 40 నిమిషాలు బాగుంది. కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. కుస్తీ ఫైట్, ప్రీక్లైమాక్స్ యాక్షన్ సీన్ బాగుంది. పాటలు బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ పని తీరు దారుణంగా ఉంది. ఓవరాల్‌గా ఇది పేలవమైన వీఎఫ్ఎక్స్ ఉన్న మంచి సినిమా అంటూ మరో నెటిజన్ కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.#HariHaraVeeraMallu Strictly Mediocre 1st Half! Apart from PKs presence, a few blocks came out well mainly the intro block from the title cards to PKs introduction sequence. Keervanis bgm is the lifeline so far. However, the screenplay has an outdated feel to it in many places.…— Venky Reviews (@venkyreviews) July 23, 2025 ఫస్టాఫ్ మాములుగానే ఉంది. పవన్ పాత్రతో పాటు, కొన్ని సన్నివేశాలు బాగా వచ్చాయి, ముఖ్యంగా టైటిల్ కార్డ్స్ నుండి పీకే పరిచయ సన్నివేశం వరకు బాగుంది. కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. అయితే, స్క్రీన్‌ప్లే చాలా చోట్ల పాత అనుభూతిని కలిగిస్తుంది. వీఎఫ్ఎక్స్ దారుణంగా ఉంది. చాలా పాత్రలకు సరైన లిప్ సింక్ లేదు. పవన్ పాత్ర డబ్బింగ్ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.VFX and CG are worst to the core 😤🤮🤣Ela ra asala ila, mari intha darunam ah 🫢🫣#HariHaraVeeraMalluPremiers #HHVM #hariharaveeramallu— Chay Reviews (@chay_reviews) July 23, 2025

బిహార్ ఎన్నికల దిక్సూచి ఎటువైపు?
దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్ రాజకీయాలది ఎప్పుడూ ప్రత్యేకతే! రెండు వేల యేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటి పాటలీపుత్ర, నేటి పట్నా రాజధానిగా గల బిహార్... సంకీర్ణ ప్రభుత్వాలకు పుట్టినిల్లు. 1990లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తర్వాత రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా! రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలుండటంతో దేశ వ్యాప్తంగా బిహార్‌పై ఆసక్తి నెలకొంది. అస్థిర ప్రభుత్వాల రాష్ట్రంబిహార్ రాజకీయాల్లో కుల ప్రభావం ఎక్కువ. రూ. 28,485 తలసరి ఆదాయంతో దేశంలోనే పేద రాష్ట్రంగా నిలిచిన బిహార్ అస్థిరమైన ప్రభుత్వాలతో మరింత వెనుకబడింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ) కొద్ది కాలం తర్వాత మహాఘట్ బంధన్‌తో చేతులు కలిపింది. అనంతరం తిరిగి ఎన్డీఏతో జత కట్టింది. తొమ్మిది సార్లు బిహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీశ్ కుమార్ పలుమార్లు కూటములు మారడం రాజకీయ అస్థిరతకు నిదర్శనం. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటముల కూర్పు కూడా ఆసక్తి కలిగిస్తోంది. నితీశ్ నేతృత్వంలో ఎన్డీఏ ఎన్నికలకు సిద్ధమవుతున్నా, కూటమిలోని బీజేపీ ఎత్తుగడలను అంచనా వేయలేము. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న మహాఘట్ బంధన్ కూటమిలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌దే ఆధిపత్యం. ఈ రెండు కూటములకు పోటీగా బరిలోకి దిగుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బీజేపీ, జేడీ (యూ) సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉండటంతో పాటు దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రచారం కలిసి వచ్చే అంశం. గత ఎన్నికల్లో 115 స్థానాల్లో పోటీ చేసిన జేడీ(యూ) 43 స్థానాల్లో గెలవగా, 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో తామే అధిక స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ చెబుతుంటే, 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూపుతూ, సమ స్థానాల్లో పోటీ చేయాలని జేడీ(యూ) వాదిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో, జేడీ (యూ) 16 స్థానాల్లో పోటీ చేయగా ఈ రెండు పార్టీలు చెరో 12 చోట్ల గెలిచాయి. ఎన్డీఏ కూటమికి హిందువుల్లోని అగ్రవర్ణాలు, యాదవేతరుల ఓబీసీ వర్గాలు ఓటు బ్యాంకుగా ఉన్నాయి. సీఎం నితీశ్ బిహార్ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు ఇటీవల ప్రకటించడంతో ఎన్డీఏకు మహిళల మద్దతు రెండింతలైంది. దీంతోపాటు రోడ్ల నిర్మాణం, మద్య నిషేధం, సంక్షేమ పథకాలు కూడా ఎన్డీఏకు లబ్ధి చేకూర్చనున్నాయి. నితీశ్ రాష్ట్రంలో నిర్వహించిన కులగణనతో ఓబీసీలు ఎన్డీఏకు సానుకూలంగా ఉన్నారు. పార్టీల బలాబలాలుబలం సంగతి అలా ఉంటే, నిజానికి పాలక ఎన్డీఏ కూటమికి బిహార్‌లో ఆశించినంత సానుకూలత లేదు. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ఎన్డీఏ ఓట్లు చీలే ఆస్కారముంది. మరో పార్టీ హిందుస్థాని అవామ్ మోర్చ (హెచ్ఏఎమ్) ఎక్కువ స్థానాలు కోరుతుండటంతో గందరగోళం నెలకొంది. అలాగే 20 ఏళ్లుగా జేడీ (యూ) అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత గుదిబండగా మారనుంది. ప్రభుత్వోద్యోగాల భర్తీ ఆశించిన మేర జరగకపోవడంతో యువత అసంతృప్తిగా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడాన్ని మహాఘట్ బంధన్ సానుకూలంగా మలచుకుంటే ఎన్డీఏకు తిప్పలు తప్పవు. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ ఆశలన్నీ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు ప్రజాదరణ ఉందని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. నిరుద్యోగం, ఉపాధి కోసం బిహారీ యువత వలసలు, ద్రవ్యోల్బణంతో నిత్యావసర ధరలు పెరగడం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వంటి అంశాలను యువనేత తేజస్వీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు. వామపక్ష పార్టీలు కూటమికి అదనపు బలం. మైనారిటీ, ఓబీసీ ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్న ఈ కూటమి భవితవ్యం ముస్లిం, యాదవ సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)ల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య పైనే మహాఘట్ బంధన్ విజయావకాశాలు ఆధారపడ్డాయి. 2020 శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ గెలుపు 19 చోట్లకు పరిమితం అవడం వల్లే అధికారానికి దూరమయ్యామనే భావన ఉంది. ఆ ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఈసారి జాగ్రత్త పడుతోంది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు ప్రజాదరణ ఉన్నా, ఆయన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ హయాంలో అవినీతి, శాంతి భద్రతల వైఫల్యంతో ‘జంగల్ రాజ్’గా ముద్రపడటం ఆర్జేడీకి నష్టం చేకూర్చే అంశం. జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహకర్తగా పేరు గడించిన ప్రశాంత్ కిశోర్ బిహార్‌లో రాజకీయ అదృష్టంపై దేశ వ్యాప్త రాజకీయ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జన్ సురాజ్ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో, యువతలో ఆదరణ ఉన్నా రాష్ట్ర కుల రాజకీయాలు, పొత్తు జిత్తుల మధ్య ఆయన వ్యూహాలు ఫలించడం అంత తేలిక కాదు. సోషల్ మీడియా వేదికలపై జన్ సురాజ్ బలంగా కనిపిస్తున్నా, సంస్థాగతంగా బలహీనంగా ఉంది. జన్ సురాజ్ గెలుపు కంటే, ఆ పార్టీ చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాఘట్ బంధన్ కూటమి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయడం ఖాయం.‘సర్’ వివాదంఅసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు వ్యూహరచనలు, ప్రణాళికలు రూపొందిస్తుంటే బిహార్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం... బిహార్‌లో 40 లక్షలకుపైగా ఓటర్లపై అనుమానాలున్నాయి. వీటిలో 14 లక్షలకుపైగా మృతుల పేర్లు జాబితాలో ఉన్నాయంటున్నారు. 19 లక్షలకు పైగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. 7 లక్షల మంది ఇతర చోట్ల కూడా ఓటర్లుగా నమోదయ్యారు. 11 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఓటర్లలో బంగ్లాదేశ్, మయాన్మార్, నేపాల్ దేశస్థులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఏడాది కిందటి లోక్‌సభ ఎన్నికలప్పుడు రాని ఈ అంశాలన్నీ ఇప్పుడే రావడం వివాదాస్పదమవుతోంది. ((నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పార్లమెంట్లో జేడీ(యూ) మద్దతు కీలకమైన నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.)) ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. తేడావస్తే మాత్రం నితీశ్ వైఖరిలో మార్పు వచ్చినా ఆశ్చర్యం లేదని గత అనుభవాలే చెబుతున్నాయి. ఎన్డీఏకు మెజారిటీ వచ్చినా నితీశ్ విషయంలో బీజేపీ వైఖరి మారితే కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం పడుతుంది. ఈ సమీకరణాల దృష్ట్యా బిహార్ ఎన్నికల రాజకీయ దిక్సూచి ఎటు వైపు మళ్లేనో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.దిలీప్ రెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్

గాజాలో అన్నమో రామచంద్రా!
కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎటు చూసినా మనసును కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కఠిన ఆంక్షలతో ఆహారం, మానవతా సాయం అందక పాలస్తీనా పౌరుల డొక్కలెండిపోతున్నాయి. రోజుల తరబడి తిండి లేక నీరసించి, ప్రాణాలు విడిచేస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలోనే కనీసం 15 మంది మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు గాజా అరోగ్య శాఖ ప్రకటించింది. ఆకలి చావులు ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత గాజాలోని పాలస్తీనా పౌరులకు ఒక్కసారిగా కష్టాలు వచ్చిపడ్డాయి. కనీస సౌకర్యాల సంగతి పక్కనపెడితే కడుపునిండా తిండి దొరకడమే గగనంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారమే ఇప్పటివరకు 111 ఆకలి చావులు సంభవించాయి. వీరిలో 80 మందికిపైగా చిన్నారులే ఉండడం గమనార్హం. గాజాలో అత్యంత భయానక వాతావరణం కనిపిస్తోందని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. నిత్యం ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక జనం బలైపోతున్నారని వెల్లడించింది. ఆకలి చావులు సంభవిస్తుండడం ఇటీవలి కాలంలో అతిపెద్ద సంక్షోభమమని స్పష్టంచేసింది. ప్రాణాలకు తెగిస్తేనే.. ఉత్తర గాజాలోని ఓ ఆసుపత్రిలో ఆరేళ్ల బాలుడు యూసుఫ్ అల్–సఫాదీ మరణించాడు. తల్లి పాలు అందక అతడు మృతిచెందినట్లు బంధువులు చెప్పారు. యూసుఫ్ తల్లికి కొన్ని నెలలుగా సరైన పౌష్టికాహారం దొరకడం లేదు. అనారోగ్యం బారినపడింది. తన బిడ్డకు స్తన్యం ఇవ్వడానికి ఆమె వద్ద పాలు లేకుండాపోయాయి. చివరకు యూసుఫ్ ప్రాణమే పోయింది. బయట ఆవు పాలు, గేదె పాలు కొందామన్న ఎక్కడా లేవు. ఒకవేళ దొరికినా లీటర్ 100 డాలర్లు(రూ.8,639) చెబుతున్నారు. 13 ఏళ్ల బాలుడు అబ్దుల్ హమీద్ అల్–గల్బాన్ది మరో వ్యధ. అతడికి చాలా రోజులుగా తిండి లేదు. చివరకు మృత్యువు కబళించింది. గాజాలో ఆకలి చావులుగా గత ఐదు నెలలుగా కొనసాగుతున్నాయి. గాజాలోకి మానవతా సాయం సరఫరా కాకుండా ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. విదేశాల నుంచి ఆహారం, నీరు, ఇంధనం, ఔషధాలు, నిత్యావసరాలు రానివ్వడం లేదు. ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి మేరకు మే నెలలో ఆంక్షలు కొంత సడలించింది. మానవతా సాయాన్ని పరిమితంగానే అనుమతిస్తోంది. ఐక్యరాజ్యసమితి మద్దతున్న గాజా హుమానిటేరియన్ ఫౌండేషన్(జీహెచ్ఎఫ్) గాజా ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడం లేదు. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరిన జనంపై ఇజ్రాయెల్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో 1,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. కడుపు నింపుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి దాపురించింది. అభాగ్యుల ఎదురుచూపులు ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజా స్ట్రిప్‌లో 20 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఒకవైపు ఆహార లేమి, మరోవైపు పౌష్టిహాకార లోపం జనాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆహారం దొరకడం ఒక ఎత్తయితే, అది నాణ్యంగా లేకపోవడం మరో సవాల్‌గా మారింది. చాలినంత తిండి లేక అల్లాడుతున్నారు. చాలామంది అర్ధాకలితో కాలం గడపాల్సి వస్తోంది. ఆకలి భూతం ప్రతి ఇంటి తలుపును తడుతోంది. ఆదుకొనే ఆపన్నహస్తాల కోసం అభాగ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్ దయ తలిస్తే తప్ప గాజా పౌరులు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వ్యాఖ్యానించారు. నిండిపోయిన ఆసుపత్రులు పౌష్టికాహార లోపంతో అనారోగ్యం పాలై ఆసుపత్రు ల్లో చేరుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. బాధితులకు చికిత్స చేయడానికి సరైన సదుపాయాలు కూడా లేవని, వారు తమ కళ్ల ముందే మరణిస్తున్నారని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సెంట్రల్ గాజాలోని అల్–అక్సా హాస్పిటల్ వైద్యుడు ఖలీల్ అల్–డక్రాన్ తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో గాయపడినవారితో ఆసుపత్రులో నిండిపోయాయని, ఇతర రోగులను చేర్చులేకపోతున్నామని మరికొందరు డాక్టర్లు వెల్లడించారు. గాజాలో ప్రస్తుతం 6 లక్షల మందికిపైగా జనం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో 60 వేల మంది గర్భిణులే కావడం గమనార్హం. ఆహార లేమికి తోడు డీహైడ్రేషన్, రక్తహీనతతో గర్భిణులు మరణం అంచులకు చేరుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా ఖాళీ చేయించే పనిలో నిమగ్నమైంది.ప్రపంచ దేశాలు స్పందించాలి గాజా పరిణామాలపై 100కిపైగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఆకలి చావులు ఆపడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, తక్షణమే కాల్పుల విరమణ పాటించేలా ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. టన్నుల కొద్దీ ఆహారం, నీరు, ఔషధాలు గాజా బయటే ఉండిపోయాయని, ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా అవి పాలస్తీనా పౌరులకు అందడం లేదని మెర్సీ కారప్స్, నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ తదితర సంస్థలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ దమనకాండ వల్ల గాజాలో మృత్యుఘోష మొదలైందని, ఆకలి చావులు పెరిగిపోతున్నాయని వెల్లడించాయి. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా స్పందించాలని, గాజా ప్రజల ప్రాణాలు కాపాడాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం ఉమ్మడిగా లేఖ విడుదల చేశాయి. సాక్షి, నేషనల్ డెస్క్

పట్టువీడని ప్రతిపక్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో వరుసగా మూడో రోజు బుధవారం సైతం విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు కొనసాగాయి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఢిల్లీలో మురికివాడల కూల్చివేత, బెంగాలీ వలస కారి్మకుల పట్ల వివక్ష వంటి అంశాలపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. సభకు సహకరించాలని కేంద్రం పదేపదే విజ్ఞప్తి చేసినా వినిపించుకోకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకొచ్చి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నాయి. వారిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సభలో ఎంపీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల ఆకాంక్షలను వెల్లడించాలి. ఇలా నిరసనలతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదు. ఇది పార్లమెంటరీ విధానం కాదు. ఎంపీల ప్రవర్తనను దేశమొత్తం గమనిస్తోంది. సభా మర్యాదను కాపాడండి. వీధుల్లో చేయాల్సిన ప్రదర్శనలు సభలో చేస్తున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించే సభ్యులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభ తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ అదే తీరు రాజ్యసభలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సహా పలు కీలక అంశాలపై చర్చకు ఇచి్చన వాయిదా తీర్మానాలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని కోరినా విపక్షాలు వినిపించుకోలేదు. దాంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమయ్యాక ప్రశ్నోత్తరాలు చేపట్టినా విపక్షాల ఆందోళన, నిరసనలతో 2 గంటల వరకు, తర్వాత గురువారానికి వాయిదా పడింది. నల్ల దుస్తులతో నిరసన తమ డిమాండ్లపై పార్లమెంట్లో చర్చ చేపట్టాల్సిందేనని తేల్చిచెబుతూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ సహా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన(ఉద్ధవ్), జేఎంఎం, ఆర్జేడీ, వామపక్ష పారీ్టల ఎంపీలు పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి‘, ‘ఓటు బందీని ఆపండి‘ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చాలామంది ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఆపరేషన్ సిందూర్‌పై 28న ప్రత్యేక చర్చ ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంట్లో ప్రత్యేక చర్చకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 28న లోక్‌సభలో, 29న రాజ్యసభలో చర్చ జరిగే అవకాశం ఉంది. దిగువ సభలో ఈ అంశంపై 16 గంటలపాటు చర్చ జరపడానికి ఈ నెల 21న జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బుధవారం జరిగిన రాజ్యసభ బీఏసీ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణలో భారత సైన్యం దాదాపు ఆరు యుద్ధ విమానాలు కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు బహిర్గతం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో తొలుత లోక్‌సభలో సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని, ఆ తర్వాత రాజ్యసభలో చర్చ ప్రారంభిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. బుధవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన మోదీ ఈనెల 28వ తేదీ కల్లా స్వదేశానికి తిరిగివస్తారు.

నమ్మిన పాపానికి నట్టేట ముంచేస్తారా?
సాక్షి, అమరావతి: ఎన్నికలప్పుడు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేశ్.. తదితర కూటమి పార్టీల నేతలు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి నిలువునా మోసపోయామని మహిళలు మండిపడుతున్నారు. ‘అప్పుడు.. టీడీపీ నేతలు ఇంటింటికీ వచ్చి, మనిషి మనిíÙని చూపిస్తూ ఆడబిడ్డ నిధి పథకంలో ఏడాదికి నీకు రూ.18,000.. నీకు రూ.18,000 అని చెబితే నిజమేనేమోనని నమ్మాం. అధికారంలోకి వచ్చాక కూటమి పార్టీల నేతల నిజ స్వరూపం బయట పడుతోంది’ అని దుయ్యబడుతున్నారు. మహిళలకు ప్రతి నెలా రూ.1,500 చొప్పున అందజేస్తామన్న అడబిడ్డ పథకం అమలు చేయాలంటే మన ఆంధ్ర రాష్ట్రాన్నే అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మిమ్మల్ని నమ్మిన పాపానికి మహిళలందరినీ నట్టేట ముంచేస్తారా? అని నిప్పులు చెరుగుతున్నారు. ఇచ్చిన హామీ అమలు చేయండని అడిగితే రాష్ట్రాన్ని అమ్మాలంటారా.. అంటూ ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికలప్పుడు ఇదే హామీని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామంటూ ప్రతి బహిరంగ సభలో చెబుతూ ఓట్లు అడిగారు కదా.. ఈ లెక్కలు అప్పుడు తెలియవా? అని తూర్పారపడుతున్నారు. ఏకంగా మేనిఫెస్టోలో కూడా పెట్టి ఇలా మోసం చేయడం దుర్మార్గం అని ధ్వజమెత్తుతున్నారు. వీళ్ల మాయ మాటలు నమ్మి, గత ప్రభుత్వంలో వచ్చిన చేయూత, ఆసరా, సున్నా వడ్డీ.. వంటి పలు పథకాల డబ్బులను పొగొట్టుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో కరోనా ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు అమలు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఆ పథకాలేవీ ఆపమని చెబుతూ.. ఇంకా ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి ఇలా మోసం చేయడం తగదని, మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 13 నెలలు పూర్తయినందున రూ.19,500 బకాయిని వడ్డీతో సహా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు? ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 19 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1500 అందజేస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చినప్పుడు ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా? అంటే ఎలాంటి లెక్కలేసుకోకుండానే మేనిఫెస్టో తయారు చేశారా? ఇలా సాకులు చెప్పడం మాని ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే. ఈ పథకం ద్వారా ఏటా రూ.18000 అందుతాయన్న ఆశతో మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలన్నింటినీ అడియాశలు చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందేనంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బహిరంగంగా ప్రకటించటం మహిళలను మోసగించటమే. ఒక మంత్రిగా ఆయన ఈ మాటలు ఎలా మాట్లాడతారు? ఎన్నికలప్పుడు మీరు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? – షేక్ నసీరున్నీసా బేగ్, రేపల్లె, బాపట్ల జిల్లాప్రతి మహిళకు రూ.19,500 బాకీ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళకు చంద్రబాబు బాకీ ఉన్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తానని చెప్పి 13 నెలలు పూర్తయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మొత్తం కలుపుకుని రూ.19,500 ప్రతి మహిళకు చంద్రబాబు బాకీ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిపేశారు. మహిళలకు అనేక హామీలను ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయని దుస్థితిలో కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ఇంత దారుణంగా మోసం చేయడం ఎక్కడా ఉండదు. ఈ బాకీ వడ్డీతో సహా ఇవ్వాల్సిందే. – తోటకూర స్వర్ణలత, పాత గుంటూరు ఇచ్చిన హామీలు విస్మరించడం దారుణం గత ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్‌తోపాటు అనేక హామీలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. ముఖ్యంగా ప్రతి నెలా రూ.1,500 ఆడబిడ్డ నిధిపై మాలాంటి పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆర్థికంగా తోడ్పాటు లభిస్తుందని, రేపో మాపో ఇచ్చిన హామీ అమలు అవుతుందని భావించాం. అయితే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని వ్యాఖ్యానించడం దారుణం. రాష్ట్రంలోని మహిళలను మోసగిస్తూ ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. – సునీత, రెడ్డి కాలనీ, కడప, వైఎస్సార్ కడప జిల్లా వైఎస్ జగన్ మాటలు నిజమయ్యాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి పలుమార్లు, ప్రతి సభలోనూ గణాంకాలతో సహా వివరించారు. బాబు మేనిఫెస్టో బూటకమని చెప్పారు. ఇవాళ అదే నిజమైంది. బాబు మహిళల ఓట్ల కోసం అబద్ధపు హామీలు గుప్పించి అధికారం చేపట్టి మహిళలను నట్టేట ముంచారు. ఇది కూటమి కుట్రలో భాగమే. ఆడబిడ్డ నిధి అంతా బూటకమేనన్న నిజాన్ని మంత్రి తేల్చి చెప్పేశారు. మొన్నామధ్య ముఖ్యమంత్రి సైతం ఇదే అర్థం వచ్చే రీతిలో మాట్లాడారు. దీంతో కూటమి కుట్ర మహిళలకు అర్థమైంది. ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా మోసం చేస్తుందని అనుకోలేదని ప్రజలు బాహాటంగా మాట్లాడుకుంటున్నారు. – ప్రసన్న కుమారి, పరిశోధక విద్యారి్థని, తిరుపతి ఆడబిడ్డలకు అన్యాయం చేస్తారా? ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు నోటితో ఈ పథకాన్ని అమలు చేయలేమని చెప్పించడం దుర్మార్గం. ఎవరైనా ఆడబిడ్డలను నమ్మించి మోసం చేస్తారా? చంద్రబాబు మాటలు నమ్మి రాష్ట్రంలోని మహిళలంతా మోసపోయామని ఇప్పుడు బాధ పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో రెట్లు మేలు చేసింది. – కుమారి, గృహిణి, సత్యనారాయణపురం, నెల్లూరు మీరు చేసిన వాగ్దానమే కదా.. ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1,500 ఇస్తామని మీరు చేసిన వాగ్దానమే కదా మేం అడుగుతున్నది.. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఓ వ్యూహం ప్రకారం ఆయన ఇలా మాట్లాడారని అర్థం అవుతోంది. అది ఈ పథకాన్ని ఎగ్గొట్టడానికే అని తెలుస్తోంది. ఏమి అమ్మి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 ఇస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేశారో చెప్పాలి. ఆడబిడ్డ నిధి వాగ్దానాన్ని అమలు చేయకపోతే రాబోయే ఎన్నికల్లో మహిళల చేతుల్లో తీవ్ర పరాభవం తప్పదు. – బందెల ప్రమీల, చెరుకువాడ, ఉండి మండలం, పశ్చిమగోదావరి జిల్లామరోసారి మోసపోయాం చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలకు మరోసారి మోసపోయాం. 2014లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడంతో 2019లో ఓడిపోయారు. 2024 ఎన్నికలలో హామీలు అమలు చేస్తామని బాండ్లు ఇచ్చారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్, బీజేపీ కూడా ఉండటంతో హామీలు అమలు జరుగుతాయని నమ్మాం. అయితే మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన విన్నాక ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామనే హామీ అమలు కాదని స్పష్టమవుతోంది. దీనిపై సీఎం చంద్రబాబు నోరు విప్పలేదంటే ఆయనే ఈ మాటలు మాట్లాడించారని తెలుస్తోంది. – పోలగల జయ, గృహిణి, సామర్లకోట మహిళలకు కూటమి ప్రభుత్వం టోపీ 2019 ఎన్నికలప్పుడు వైఎస్సార్సీపీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసింది. అర్హత కలిగిన మహిళలందరికీ చేయూత, ఆసరా, సున్నావడ్డీ తదితర పథకాల ద్వారా లబ్ధి కలిగింది. అయితే 2024 ఎన్నికల ముందు కూటమి నేతలు అంతకు మించి ఇస్తామని మహిళలను నమ్మించారు. పైగా ఈ పథకాలన్నీ కొనసాగుతాయని కూడా చెప్పారు. వారి మాయ మాటలకు మోసపోయి అందరూ ఓట్లేశారు. తీరా గద్దెనెక్కాక వారి ప్రతాపం చూపిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తామని హామీ ఇవ్వడం నిజం కాదా? ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలని మంత్రి మాట్లాడటం మరోమారు మహిళలకు టోపీ పెట్టడమే. – బంక లక్ష్మి, వేములవలస, విశాఖ జిల్లా

దర్యాప్తు ప్రశ్నార్థకం కారాదు!
అంతా ఎప్పటిలాగే గడిచిపోతున్నదనుకునే వేళ హఠాత్తుగా సంభవించిన పేలుడు జనాన్ని భయకంపితుల్ని చేస్తుంది. తేరుకున్న వెంటనే అది మిగిల్చిన ప్రాణనష్టాన్నీ, విధ్వంసాన్నీ కళ్లారా చూశాక ఆ భయాందోళనలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. తీవ్ర గాయాలై కాళ్లూ చేతులూ తెగిపడినవారి ఆర్తనాదాలు మిన్నంటుతాయి. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. నేరగాళ్లను పట్టి బంధించాలన్న డిమాండు ఊపందుకుంటుంది. తీరా దీర్ఘకాలం గడిచాక నిందితులు నిర్దోషులనీ, దర్యాప్తు లోపభూయిష్టమనీ తేలితే ప్రజానీకంలో నిరాశా నిస్పృహలు ఆవరించవా? బాధిత కుటుంబాలు మరోసారి రోదించవా? 189 మంది మరణానికీ, 816 మంది క్షతగాత్రులు కావటానికీ కారణమైన 2006 నాటి పేలుళ్ల ఘటనల్లో బొంబాయి హైకోర్టు దాదాపు 20 యేళ్లు కావస్తుండగా వెలువరించిన తీర్పు అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. పోలీసులు ఈ కేసులో వెనువెంటనే 13 మందిని అరెస్టు చేశారు. వారంతా ప్రధాన నిందితులని, మరో 15 మంది పరారీలో వున్నారని తేల్చారు. నిషేధిత ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన ఈ నిందితులకు పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాతో సంబంధ బాంధవ్యాలున్నాయని ఆరోపించారు. పేలుళ్ల ఘటనలు జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులను అరెస్టు చేయటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యేక కోర్టు 2015 సెప్టెంబర్‌లో ఒకరు మినహా మిగిలిన 12 మందినీ దోషులుగా నిర్ధారించింది. వారిలో అయిదుగురికి ఉరిశిక్ష, మిగిలినవారికి వేర్వేరు రకాల శిక్షలు పడ్డాయి. 2021లో ఒకరు కోవిడ్ వ్యాధితో మరణించారు. జనం కిక్కిరిసి ప్రయాణించే సాయంత్రం సమయాన్ని పేలుళ్లకు ఎంచుకుని ఏడు లోకల్ రైళ్లలో బాంబులుంచి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.తమ ముందు విచారణకొచ్చిన కేసుల్లో న్యాయస్థానాలు సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలిస్తాయి. నిందితులుగా చూపించిన వారికి ఆ ఘటనలతో వున్న సంబంధం ఏమిటో, ఏ ప్రాతిపదికన వారే కారకులని పోలీసులు నిర్ధారణకొచ్చారో తరచి చూస్తాయి. ఎంతమంది దోషులైనా తప్పించుకోవచ్చుగానీ, ఒక్క నిరపరాధికి కూడా శిక్షపడరాదన్న సూత్రమే దానికి మూలం. ఉగ్రవాదం మన దేశానికి కొత్తగాదు. దశాబ్దాలుగా అడపా దడపా ఏదో ఒక మూల అది తలెత్తుతూనే వుంది. వివిధ సంఘటనల్లో పదులకొద్దీ మంది మరణిస్తున్నారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికన్నట్టు కొత్త చట్టాలు వస్తున్నాయి. ఉన్న చట్టాలు మరింత కఠినతరమవుతున్నాయి. కానీ చాలా సందర్భాల్లో జరుగుతున్నదేమిటో 2006 నాటి ముంబై పేలుళ్ల ఉదంతమే తార్కాణం. 671 పేజీల తీర్పులో ముంబై హైకోర్టు ధర్మాసనం ప్రస్తావించిన లోటుపాట్లు గమనిస్తే ఇంత నాసిరకంగా దర్యాప్తు జరిగిందా అనిపిస్తుంది. నిందితుల ప్రమేయాన్ని సందేహాతీతంగా నిరూపించాలన్న కర్తవ్యం కన్నా, ఏదో అయిందనిపిద్దామన్న ధోరణే ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) దర్యాప్తులో కనబడిందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. పేలుళ్ల ఉదంతాలప్పుడు పౌరుల్లో ఆగ్రహావేశాలు కలుగుతాయి. ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతుంది. రాజకీయ పక్షాల, ఇతర సంస్థల ఆరోపణలు సరేసరి. అందువల్ల దర్యాప్తు చేసేవారిపై ఒత్తిళ్లు పెరుగుతాయన్నది కూడా వాస్తవం. కానీ ఇవేవీ వారిని ప్రభావితం చేయకూడదు. ఘటనాస్థలిలో దొరికిన చిన్న చిన్న ఆధారాలతో అల్లుకుపోతూ ఒక పెద్ద కుట్రను ఛేదించినప్పుడే, నిజమైన నిందితులను పట్టుకున్నప్పుడే సమాజం సురక్షితంగా వుంటుంది. ధర్మాసనం వ్యాఖ్యానించినట్టు నిందితులను పట్టుకున్నామని, అంతా పరిష్కరించామన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించటం వల్ల సమాజానికి ఒరిగేదేమీ వుండదు. తప్పించుకున్న అసలు నిందితులు మరో దురంతానికి పథక రచన చేస్తారు. నిందితులుగా ముద్రపడినవారి కుటుంబాలు దిక్కుతోచక అల్లాడతాయి. జనానికి కావాల్సింది ఆ దారుణానికి పాల్పడ్డ నేరగాళ్లను పట్టుకోవటం తప్ప ఆ పేరిట ఎవరో కొందరిని నిందితులుగా చూపటం కాదు. దేశం మొత్తాన్ని పట్టికుదిపిన కేసులో సాదాసీదా దర్యాప్తు సరికాదని పోలీసు ఉన్నతాధికారులకు అనిపించకపోవటం ఆశ్చర్యం. ఎన్నో కేసుల దర్యాప్తులో పాలుపంచుకొని, ఎంతో అనుభవాన్ని గడించిన వారంతా తమ స్థాయిలోనే ఈ లోటుపాట్లను పట్టుకోవటం అసాధ్యం కాదు. కనీసం న్యాయస్థానం ముందుకెళ్తే ఎలాంటి సందేహాలు ఎదురవుతాయోనన్న బెరుకు ఎవరిలోనూ లేకపోవటం విస్మయం కలిగిస్తుంది. సాంకేతిక కారణాలతోనే ఈ కేసు కొట్టేశారని, సుప్రీంకోర్టుకు వెళ్లి దోషులకు శిక్షపడేలా చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. సాంకేతిక కారణాల సంగతలా వుంచి నిందితుల ఒప్పుకోలు పత్రాలన్నీ దాదాపు ఒకే మాదిరి వుండటం, పొంతన లేని సాక్ష్యాలు నిందితుల అపరాధత్వంపై సందేహాలు కలిగించాయి. తాము నిర్దోషులమని నిరూపించుకునే బాధ్యత నిందితులపైనే వుండేలా చట్టాలు పదునెక్కాయి. కానీ పోలీసులు సక్రమంగా వ్యవహరించి నేరాంగీకారంతో సరిపోలే విధంగా తిరుగులేని సాక్ష్యాధారాలు చూపలేకపోతే ఆ నిబంధన కొరగానిదవుతుంది. దర్యాప్తు ప్రక్రియకు అవరోధంగా మారుతుంది. కనీసం పేలుళ్లలో వాడిన బాంబులేమిటో ఏటీఎస్ నికరంగా చెప్పలేకపోయింది. రేపు సర్వోన్నత న్యాయస్థానం ఏం నిర్ధారిస్తుందో చెప్పలేం. ఇప్పటికైతే బాధిత కుటుంబాలకు ఖేదం మిగిలింది. ఈ తీర్పు దర్యాప్తు సంస్థల తీరుతెన్నులను మరింత పదునెక్కించగలగాలి. నిజమైన నేరగాళ్లను బోనెక్కించాలి.

కేంద్రం మెడలు వంచుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం మెడలు వంచి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ అంశంలో కేంద్రాన్ని ఒప్పించేలా కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఇండియా కూటమి పక్షాల నేతల మద్దతును సైతం కూడగడతామని చెప్పారు. తద్వారా ఒత్తిడి పెంచుతామని, ఒత్తిళ్లకు లొంగని పక్షంలో ప్రధాని మోదీని కుర్చీ దింపి, తమ నేతను కుర్చీలో కూర్చోబెట్టి బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలని, ఓబీసీ నేత బండారు దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ విచారణకు పిలిస్తే వెళ్తానని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి బుధవారం రాష్ట్ర ఎంపీలతో కలిసి ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రెండు బిల్లులు పంపించాం.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే పూర్తి చేసింది. అందులో వెల్లడైన వివరాల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఆ మేరకు రిజర్వేషన్ల కోసం ఒకటి, స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కోసం ఒకటి..ఇలా శాసనసభలో రెండు బిల్లులు చేసి కేంద్రానికి పంపించాం. ఈ విషయంలో సహకరించాలని, సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్రం తాత్సారం చేస్తోంది.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తున్నాం. అయితే కేంద్రం ఆమోదించకుండా తాత్సారం చేస్తోంది. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెస్తే, కాంగ్రెస్ అనేక పోరాటాలు చేసి వాటిని వెనక్కి తీసుకునేలా చేసింది. కులగణనను చేయబోమన్న కేంద్రాన్ని జనగణనలో కులగణనను భాగం చేసేలా ఒప్పించింది. అదే మాదిరి ఇప్పుడు కూడా కేంద్రం మెడలు వంచుతాం. మా అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, మల్లికార్జున ఖర్గేలను కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చేయాలన్న ఉద్దేశంతో నేను, మా ఎంపీలు, మంత్రులు ఢిల్లీకి వచ్చాం. వారిని కలవడంతో పాటు కాంగ్రెస్ ఎంపీలందరినీ కలిసి రాష్ట్రంలో నిర్వహించిన సర్వే గురించి వివరిస్తాం. అలాగే ఇండియా కూటమిలోని ఇతర సభ్యులను కలుస్తాం. సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. గురువారం కాంగ్రెస్ ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకురావాలని అంటున్నరు. అసలు అఖిల పక్షం ఎక్కడుంది? ప్రధాన ప్రతిపక్ష నేత నిద్రపోతున్నడు. ఆయన పిల్లలు కొట్లాడుకుంటున్నరు. తాను చెడిన కోతి వనమెల్లా చెరిచినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకేం అఖిలపక్షం. బీజేపీ రిజర్వేషన్లు వద్దంటోంది. ఎంఐఎం మద్దతిస్తోంది. బీజేపీది వితండ వాదం.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ వితండ వాదం చేస్తోంది. ఏకగ్రీవ తీర్మానానికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతిస్తే, కొత్త అధ్యక్షుడు రాంచందర్‌రావు మాత్రం వితండ వాదం చేస్తున్నారు. బీజేపీకి ఒకటి, కాంగ్రెస్‌కు మరొక రాజ్యాంగం లేదు. అంబేడ్కర్ రాజ్యాంగమే అందరికీ అమలవుతోంది. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తే మద్దతు ఇస్తామని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అంటున్నారు. వాళ్లకు కనీస అవగాహన లేదు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రల్లో ముస్లిం రిజర్వేషన్లు 50 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మీకు ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు తొలగించిన తర్వాత తెలంగాణకు అలా సూచించండి. గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్న అమిత్ షాను బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తారా? మొండి, తొండి వాదనను పక్కనబెట్టాలి. బలహీన వర్గాలకు న్యాయం చేయాలి. వచ్చే ఎన్నికలు లిట్మస్ టెస్టువంటివి 2029 లోక్‌సభ ఎన్నికలు ఓబీసీ రిజర్వేషన్లకు లిట్మస్ టెస్ట్ వంటివి. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కడా ఇవ్వలేదు. కేవలం వెనుకబాటుతనంలో ఉన్నవారికే రిజర్వేషన్ ఇస్తున్నాం. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను మొదట మంత్రివర్గంలో చర్చించి త్వరలో శాసనసభలో ప్రవేశపెడతాం. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు తర్వాత మొత్తం 50 శాతం రిజర్వేషన్లే అనేది ఎప్పుడో పోయింది. కొందరు వితండవాదులు చేసే వాదనలకు కోర్టులే సమాధానం చెబుతాయి. మొదట రిజర్వేషన్లు అమలు అయిన తర్వాత సబ్ కేటగిరైజేషన్ గురించి ఎక్స్పర్ట్ కమిటీ చర్చిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. తప్పులు సరిదిద్దుకోవాలంటే దత్తాత్రేయకు చాన్స్ ఇవ్వాలి ఉప రాష్ట్రపతి పదవి తెలంగాణకు ఇవ్వాలి. గతంలో వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనను రాష్ట్రపతి చేసే అంశంపై చర్చ జరిగింది. ఆయనను ఢిల్లీ నుంచి వెనక్కి పంపించేశారు. తెలుగు మాట్లాడే ఆయనను ఘర్‌వాపసీ చేయించారు. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి తెలంగాణ నేత, సౌమ్యుడైన బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. గవర్నర్‌గా ఆయన పదవీకాలం పూర్తయింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఆ పదవి నుంచి తొలగించి కిషన్‌రెడ్డికి ఇచ్చారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను తొలగించారు. ఇప్పుడు ఆ పదవి బ్రాహ్మణుడైన ఎన్.రామచందర్‌రావుకు ఇచ్చారు. బీజేపీ తెలంగాణలోని ఓబీసీ నేతల గొంతు కోసింది. ఈ తప్పులన్నింటినీ క్షమించాలంటే దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. తెలంగాణ ప్రజల తరపున దత్తాత్రేయకు, ఓబీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నా. దత్తాత్రేయ అభ్యర్థిత్వానికి అందరి ఆమోదం ఉంటుంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ గౌరవించాలి. సొంత ఇంటివాళ్ల ఫోన్లే ట్యాప్ చేశారంట.. మీడియా సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్‌పై మాట్లాడారు. ‘ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణ జరుగుతోంది. సొంత ఇంటివాళ్ల ఫోన్లే ట్యాప్ చేశారని తెలుస్తోంది. సొంతింటి వాళ్లవి చేసేకన్నా ఆత్మహత్య చేసుకోవడం నయం. నా ఫోన్ ట్యాప్ అయిందో? లేదో నాకు తెలియదు. నా ఫోన్ ట్యాప్ అయ్యుంటే నన్ను విచారణకు పిలిచివారు కదా. ఒకవేళ సిట్ విచారణకు పిలిస్తే కచ్చితంగా వెళతా. మా ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్‌లు చేసే ఉద్దేశం లేదు. దానివల్ల ఒనగూరేది లేదు. ఇది గత ఎన్నికల్లోనే రుజువైంది..’అని అన్నారు. నిబంధనల మేరకే సీఎం రమేశ్ కంపెనీకి కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీలో రోడ్ల కాంట్రాక్టు టెండర్‌ను బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు ఇవ్వడంపై ప్రశ్నించగా.. ‘రూ.1,600 కోట్ల ఈ–టెండర్‌ను నిబంధనల మేరకే వారి కంపెనీ దక్కించుకుంది. ఎల్అండ్టీ సైతం ఈ–టెండర్లో పాల్గొంది. నా మిత్రుడని ఈ టెండర్ కట్టబెట్టలేదు. ఓపెన్ టెండర్లోనే వారికి దక్కింది..’అని రేవంత్ వివరించారు. కంచ గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి ఎక్కడా రుణాలు తీసుకోలేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వ సావరిన్ బాండ్లను వేరే కంపెనీలు కొనుక్కున్నాయని స్పష్టం చేశారు.

ENG VS IND 4th Test: తొలి రోజు మెరుగైన స్థితిలో ముగిసిన ఆట
తొలి సెషన్లో ఒక్క వికెట్ కోల్పోకుండా ఓపెనర్ల పట్టుదల... ఆపై తక్కువ వ్యవధిలో మూడు వికెట్లు... కీలక సమయంలో రిషభ్ పంత్‌కు గాయం... చివరకు సంతృప్తిగా ముగింపు! మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు పరిస్థితి ఇది. టాస్ ఓడినా సానుకూల ఆటతో భారత బ్యాటింగ్ కొనసాగింది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ అర్ధ సెంచరీలతో ఆకట్టుకోగా, ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ బంతితో రాణించాడు. ఇంకా లోతైన బ్యాటింగ్ ఉండటంతో రెండో రోజు టీమిండియా ఎంత భారీ స్కోరు నమోదు చేస్తుందనేది చూడాలి. మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును భారత్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (151 బంతుల్లో 61; 7 ఫోర్లు), యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 58; 10 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. రిషభ్ పంత్ (48 బంతుల్లో 37 రిటైర్డ్‌హర్ట్; 2 ఫోర్లు, 1 సిక్స్) గాయంతో మైదానం వీడాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (19 బ్యాటింగ్), శార్దుల్ ఠాకూర్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం చరిత్రలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్టు ఒక్కసారి కూడా మ్యాచ్ గెలవలేదు. అయినా సరే, స్టోక్స్ మరోసారి టాస్ గెలిచి అలాంటి సాహసం చేశాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ నాలుగు టాస్‌లూ గెలవగా... అంతర్జాతీయ క్రికెట్లో భారత్ వరుసగా 14 టాస్‌లు ఓడిపోయింది! ఓపెనర్ల శుభారంభం... భారత్‌కు మరోసారి ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (98 బంతుల్లో 46; 4 ఫోర్లు) మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. లంచ్ సమయానికి జట్టు వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. అయితే రెండో సెషన్లో పరిస్థితి మారింది. తక్కువ వ్యవధిలో పదునైన బంతితో రాహుల్‌ను అవుట్ చేసి వోక్స్ జట్టుకు తొలి వికెట్ అందించాడు. 96 బంతుల్లో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్న తర్వాత డాసన్ బౌలింగ్‌లో జైస్వాల్ వెనుదిరగ్గా... గత టెస్టు వైఫల్యాన్ని శుబ్‌మన్ గిల్ (12) ఇక్కడా కొనసాగించాడు. స్టోక్స్ బంతిని ఆడకుండా వదిలేసిన గిల్ రివ్యూ కోరినా లాభం లేకపోయింది. అంతకుముందు భారత్ కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొంది. స్టోక్స్ బౌలింగ్‌లో 20 పరుగుల వద్ద సుదర్శన్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్ స్మిత్ వదిలేయడం కాస్త కలిసొచ్చింది. కీలక భాగస్వామ్యం... టీ విరామం తర్వాత సుదర్శన్, పంత్ చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. సుదర్శన్ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగా, పంత్ కూడా సంయమనం ప్రదర్శిస్తూ పరుగులు రాబట్టాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 72 పరుగులు జోడించిన తర్వాత గాయంతో పంత్ తప్పుకోవాల్సి వచ్చింది. 134 బంతుల్లో కెరీర్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం సుదర్శన్‌ను స్టోక్స్ వెనక్కి పంపాడు. ఈ దశలో జడేజా, శార్దుల్ కలిసి జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు 55 బంతుల్లో అభేద్యంగా 29 పరుగులు జత చేసి తొలి రోజును ముగించారు. చివర్లో వెలుతురు మందగించడంతో అంపైర్ల సూచనతో ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్‌కే పరిమితమైంది. దాంతో 80 ఓవర్ల తర్వాత కూడా జట్టు కొత్త బంతి తీసుకునే ప్రయత్నం చేయలేదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బ్రూక్ (బి) డాసన్ 58; రాహుల్ (సి) క్రాలీ (బి) వోక్స్ 46; సుదర్శన్ (సి) కార్స్ (బి) స్టోక్స్ 61; గిల్ (ఎల్బీ) (బి) స్టోక్స్ 12; పంత్ (రిటైర్డ్‌హర్ట్) 37; జడేజా (బ్యాటింగ్) 19; శార్దుల్ (బ్యాటింగ్) 19; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 264. వికెట్ల పతనం: 1–94, 2–120, 3–140, 3–212 (రిటైర్డ్ నాటౌట్), 4–235. బౌలింగ్: వోక్స్ 17–4–43–1, ఆర్చర్ 16–2–44–0, కార్స్ 16–1–60–0, స్టోక్స్ 14–2–47–2, డాసన్ 15–1–45–1, రూట్ 5–0–19–0.అన్షుల్ కంబోజ్ @ 318పేస్ బౌలర్ అన్షుల్ కంబోజ్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన 318వ ఆటగాడిగా అతను నిలిచాడు. హరియాణాకు చెందిన 24 ఏళ్ల అన్షుల్ 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 22.88 సగటుతో 79 వికెట్లు పడగొట్టాడు. లార్డ్స్ టెస్టులో ఆడిన జట్టు నుంచి మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. గాయాలతో దూరమైన నితీశ్, ఆకాశ్‌దీప్‌కు బదులుగా అన్షుల్, శార్దుల్‌లను ఎంపిక చేయగా...కరుణ్ నాయర్‌ను తప్పించి సాయి సుదర్శన్‌కు అవకాశం కల్పించారు. రిషభ్ పంత్‌కు గాయం!భారత్‌ను ఈ టెస్టులో ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉన్న ఘటన తొలి రోజే చోటు చేసుకుంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. వోక్స్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడబోగా బంతి నేరుగా అతని కుడి పాదంపై పడింది. ఎల్బీడబ్ల్యూ అప్పీల్‌కు అంపైర్ స్పందించకపోవడంతో ఇంగ్లండ్ రివ్యూ కోరింది. బంతి కాలికి తగిలే ముందే బ్యాట్‌ను తాకుతూ వెళ్లడంతో అతను నాటౌట్‌గా తేలాడు. అయితే బంతి బలంగా తాకడంతో పంత్ తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. సహచరుల అండతో ఒంటికాలిపై అడుగు వేయాల్సి వచ్చింది. చివరకు కార్ట్‌లో అతడిని మైదానం బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎలాంటిదనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ తర్వాత ఈ టెస్టులో అతని పరిస్థితి ఏమిటనేది తేలుతుంది.

రాత్రికి రాత్రే అడవులపై బుల్డోజర్లు ఎందుకు?: సుప్రీంకోర్టు
రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేయాల్సిన అవసరం ఏమొచ్చింది?. అభివృద్ధి కోసం అడవులను నరకడం సమంజసం కాదు. అడవులను సంరక్షించాలా? లేదా మీ అధికారులను జైలుకు పంపాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోండి. ..: సీజేఐ జస్టిస్ గవాయ్ :.. సాక్షి, న్యూఢిల్లీ: రాత్రికి రాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి అడవుల్లో చెట్లను నరికించేసి సుస్థిర అభివృద్ది కోసమేనని సమర్థించుకోలేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న అటవీ భూమిని అంత అత్యావశ్యకంగా ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ సున్నితంగా హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ జోమలయ బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషనర్ తరపున ఎస్.నిరంజన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. తాజా నివేదికను దాఖలు చేశాం ప్రస్తుతం కంచ గచ్చిబౌలిలో అన్ని పనులను నిలిపివేసినట్లు ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. అక్కడ ఎటువంటి పనులు జరగట్లేదని, కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర అంశాలతో కూడిన నివేదికను కోర్టులో దాఖలు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌ను పరిశీలించేందుకు తమకు సమయం కావాలని అమికస్ క్యూరీ పరమేశ్వర్, దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు, ఎస్.నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే వారం వాదనలు వింటామని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. దీనిపై స్పందించిన... ప్రతివాదులు మరింత సమయం కావాలని కోరగా.. ఆగస్టు 13కు తదుపరి విచారణను వాయిదా వేశారు. పర్యావరణ అంశాలపై సుప్రీంకోర్టుకు సహాయం చేసేందుకు కేంద్ర సాధికారక కమిటీ (సీఈసీ) స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి తమకు నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. మేం అడవులను కాపాడాం ‘సరే ప్రస్తుతానికైతే అటవీ భూమిని కాపాడారు కదా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ధర్మాసనం అడిగింది. అది అటవీ భూమా.. కాదా?’అనే అంశంపై మరోసారి విచారణ జరగాల్సిన అవసరం ఉందని సింఘ్వీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ‘ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఆ స్థలంలో చెట్లు సంరక్షించబడ్డాయి. అభివృద్ధి కోసం అడవులను నరకడం అనేది సమంజసం కాదు. సుస్థిర అభివృద్ధిని నేను వ్యక్తిగతంగా సమర్థిస్తాను. అంటే దానర్థం రాత్రికిరాత్రి 30–40 బుల్డోజర్లను పెట్టి మొత్తం అడవిని ధ్వంసం చేయడాన్ని సమర్థిస్తానని మాత్రం కాదు’అని అన్నారు. అటవీ భూమిని కాపాడకపోతే అధికారులను అక్కడే టెంపరరీ జైలుకు పంపుతామని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడవులను సంరక్షించాలా లేదా మీ అధికారులను జైలుకు పంపాలా అనే దానిపై నిర్ణయం తీసుకోండి అని అని జస్టిస్ గవాయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పట్టువీడని ప్రతిపక్షాలు
మసాజు మాటున 'గలీజు'
అల్పపీడనం.. ఆలస్యం
రెండో ఏడాదీ మొండిచెయ్యే!
నమ్మిన పాపానికి నట్టేట ముంచేస్తారా?
ఇంటింటా నిజం.. తల్లికి మోసం
టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం.. ఎమ్మెల్సీ తూమాటిపై దాడికి యత్నం
నిలువునా దోచేయ్ తమ్మి..
పురుగుల అన్నం ఎలా తినాలి?
నెల్లూరులో ఆర్టీసీ బస్సు చోరీ
తల్లి సమాధి దగ్గర మంచు లక్ష్మి.. వీడియో
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన
లిక్కర్ కేసు సంగతి చూడమంటే తిరిగి తిరిగి మళ్లీ నా దగ్గరికే వచ్చారేంటయ్యా!!
బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ‘విఫా’.. ఏపీలో భారీ వర్షాలు
రష్యాతో శాంతి చర్చలకు సిద్ధం - ఉక్రెయిన్
ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటుకు చర్చలు ప్రారంభం
తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?
చట్టాలు చేసే వారికి సదుపాయాలు ఇవ్వాలి కదా!: ఏసీబీ కోర్టు
వృత్తిపరంగా ఇబ్బందుల్లో ఉన్నా.. యాంకర్ రష్మీ పోస్ట్
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఓటీటీలో 'మార్గన్'.. ట్విస్ట్ ఇస్తూ ప్రకటన
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పలుకుబడి పెరుగుతుంది
రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే?
వరుణ్ సందేశ్ బర్త్ డే.. సతీమణి సర్ప్రైజ్ గిఫ్ట్ చూశారా..!
.. నొక్కకుండా ఉండటానికట!
రోజూ ఆ అరెస్టు వీడియోను చూస్తేకానీ నిద్రపోరు!
నువ్వు ఊ అంటే అన్నివిధాలా చూసుకుంటా..
అతడిని కాదని అన్షుల్‌ను ఎలా ఎంపిక చేస్తారు?: సెలక్టర్లపై ఫైర్
ఫ్యాటీ లివర్.. పారాహుషార్!
ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. డైలాగ్స్ ఆడియో రిలీజ్
పట్టువీడని ప్రతిపక్షాలు
మసాజు మాటున 'గలీజు'
అల్పపీడనం.. ఆలస్యం
రెండో ఏడాదీ మొండిచెయ్యే!
నమ్మిన పాపానికి నట్టేట ముంచేస్తారా?
ఇంటింటా నిజం.. తల్లికి మోసం
టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం.. ఎమ్మెల్సీ తూమాటిపై దాడికి యత్నం
నిలువునా దోచేయ్ తమ్మి..
పురుగుల అన్నం ఎలా తినాలి?
నెల్లూరులో ఆర్టీసీ బస్సు చోరీ
తల్లి సమాధి దగ్గర మంచు లక్ష్మి.. వీడియో
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన
లిక్కర్ కేసు సంగతి చూడమంటే తిరిగి తిరిగి మళ్లీ నా దగ్గరికే వచ్చారేంటయ్యా!!
బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ‘విఫా’.. ఏపీలో భారీ వర్షాలు
రష్యాతో శాంతి చర్చలకు సిద్ధం - ఉక్రెయిన్
ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటుకు చర్చలు ప్రారంభం
తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?
చట్టాలు చేసే వారికి సదుపాయాలు ఇవ్వాలి కదా!: ఏసీబీ కోర్టు
వృత్తిపరంగా ఇబ్బందుల్లో ఉన్నా.. యాంకర్ రష్మీ పోస్ట్
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
ఓటీటీలో 'మార్గన్'.. ట్విస్ట్ ఇస్తూ ప్రకటన
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. పలుకుబడి పెరుగుతుంది
రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇదెలా సాధ్యమైందంటే?
వరుణ్ సందేశ్ బర్త్ డే.. సతీమణి సర్ప్రైజ్ గిఫ్ట్ చూశారా..!
.. నొక్కకుండా ఉండటానికట!
రోజూ ఆ అరెస్టు వీడియోను చూస్తేకానీ నిద్రపోరు!
నువ్వు ఊ అంటే అన్నివిధాలా చూసుకుంటా..
అతడిని కాదని అన్షుల్‌ను ఎలా ఎంపిక చేస్తారు?: సెలక్టర్లపై ఫైర్
ఫ్యాటీ లివర్.. పారాహుషార్!
ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. డైలాగ్స్ ఆడియో రిలీజ్
సినిమా

నాది దొంగ ఏడుపు కాదు, నేనేం పిచ్చిదాన్ని కాదు.. కాపాడండి: హీరోయిన్
ఇంట్లో వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ బోరున ఏడ్చేసింది హీరోయిన్ తనుశ్రీదత్తా. నాలుగైదేళ్లుగా ఈ బాధను భరిస్తున్నా.. 2018లో మీటూ ఉద్యమం అప్పటినుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది అంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన అభిమానులు, నెటిజన్లు.. హీరోయిన్‌కు ఏమైందని కంగారుపడ్డారు. తను క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.పబ్లిసిటీ స్టంటా?అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే తనుశ్రీ దత్తా.. తను మామూలుగా ఉన్న వీడియోలు షేర్ చేసింది. ఇది చాలామందికి మింగుడుపడలేదు. అప్పుడే ఏడ్చింది, ఇంతలోనే మళ్లీ నార్మల్‌గా వీడియోలు పెడుతోంది.. తన బాధ నిజమా? లేక పబ్లిసిటీ స్టంటా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి అయితే.. నేను తనుశ్రీ మేడమ్‌కు అభిమానిని. కానీ, ఈసారి తననిలా చూస్తుంటే లైమ్‌లైట్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. బహుశా నా ఆలోచన తప్పు కావచ్చు, కానీ చూడటానికి మాత్రం అలాగే ఉంది. మీ వీడియో చూస్తే అలాంటి అభిప్రాయమే కలుగుతోంది. నా మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి అని రాసుకొచ్చాడు. నాటకాలు ఆపేయ్అందుకు తనుశ్రీ స్పందిస్తూ.. అవునా? ఇప్పుడే నీ ప్రొఫైల్ చెక్ చేశా! ఈ రోజే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశావ్.. ఈ కామెంట్ పెట్టడానికేనా? అని కౌంటర్ ఇచ్చింది. పనికిమాలిన వ్యక్తుల కోసం ఎన్నిరోజులు ఏడుస్తూ కూర్చోవాలని ప్రశ్నించింది. మరో వ్యక్తి.. మీ నాటకాలు ఆపండి. మీ డ్రామా చూసీచూసీ విసిగిపోయాం. నిజంగా మీరన్నట్లు ముంబై మీకు సురక్షితం కాకపోతే అమెరికాకు వెళ్లిపోవచ్చుగా.. తెలిసి తెలిసి ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో పెట్టడం? నానా పటేకర్ మంచి మనిషి, బాలీవుడ్లో బెస్ట్ యాక్టర్. అతడి పరువు తీయడానికి ప్రయత్నించకండి. ఇకనైనా డ్రామాలు ఆపేయండి, మాకు నిజమేంటో తెలుసు. మీరెంత చేసినా బాలీవుడ్లో మీకు సినిమాలు రావు అని కామెంట్ పెట్టాడు.నానా పటేకర్, తనుశ్రీ దత్తాహీరో, నటుడు కలిసే..నెగెటివ్ కామెంట్లతో విసిగిపోయిన తనుశ్రీ దత్తా (Tanushree Dutta).. మీటూ ఉద్యమం తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని బయటపెట్టింది. నానాపటేకర్ ఇదంతా చేయిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఎన్జీవోలో జరుగుతున్న కార్యకలాపాలను బయటపెడతానన్న భయంతో చుల్మాన్ భాయ్ (సల్మాన్ ఖాన్)కు రూ.5 కోట్లిచ్చి తనకు బ్రేకులు వేయమని చెప్పాడంది. దాంతో చుల్మాన్ ఇలా కొందరు మనుషులను పెట్టించి.. రాత్రిపూట తన ఇంటి ఎదుట ఏవేవో శబ్ధాలు చేయిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది.పిచ్చిదాన్ని కాదుమధ్యలో సల్మాన్ ఎందుకు వచ్చాడో అర్థం కాక తలపట్టుకున్న నెటిజన్లు.. ఆమెను మంచి సైకియాట్రిస్ట్‌ను కలవమని సలహా ఇచ్చారు. అందుకు తనుశ్రీ.. నేనేమీ పిచ్చిదాన్ని కాదు. వాళ్ల బండారం బయటపెట్టినందుకు పిచ్చిదాన్ని చేస్తారా? నాలాగా టార్చర్ ఫేస్ చేస్తున్న అందరూ ఇలాగే ఆడియో, వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టండి. అప్పుడుకానీ వారి ఆటలు సాగవు అని ఘాటుగా రిప్లై ఇచ్చింది. అంతలోనే తనను వారి నుంచి కాపాడమంటూ అభ్యర్థించింది.అసలేం జరిగింది?మీటూ ఉద్యమంలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన వేధింపులను బయటపెడుతూ సంచలనాలకు తెరలేపింది హీరోయిన్ తనుశ్రీ దత్తా. నానా పటేకర్ (Nana Patekar) తనను లైంగికంగా వేధించాడంటూ 2018లో మీడియా ముందుకు వచ్చింది. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా కోసం ఓ పాట షూట్ చేస్తున్న సమయంలో నానా పటేకర్ సహా మరో ముగ్గురు తనను వేధించారని ఆరోపించింది. చట్ట ప్రకారం మూడేళ్ల లోపు ఫిర్యాదు చేస్తేనే విచారణకు అర్హత ఉందని, పదేళ్ల నాటి ఘటనని విచారించడం కుదరదని న్యాయమూర్తి కేసు కొట్టివేశారు. కాగా హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన తనుశ్రీ.. తెలుగులో 'వీరభద్ర' మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial)చదవండి: ఛత్రపతి శివాజీ బయోపిక్ లేనట్లే.. ఇండస్ట్రీలో ఇంత దారుణమా?

తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?
తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే మహాప్రేమ. భాషతో సంబంధం లేకుండా ఏ మాత్రం బాగున్నా ఏ మూవీనైనా చూసి పడేస్తారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్నారో ఏమో గానీ కొందరు దక్షిణాది దర్శకనిర్మాతలు మనోళ్లని మరీ లైట్ తీసుకుంటున్నారే అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నాళ్ల నుంచి దాదాపు ఒకేలాంటి తప్పు మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?ఒకప్పుడు ఏ భాషకు చెందిన సినిమా అయినా సరే తెలుగులో డబ్ చేస్తున్నారంటే కనీస జాగ్రత్తలు తీసుకునేవారు. సినిమాలో తమిళ పదాలకు బదులు తెలుగు ఉండేలా చూసుకునేవారు. టైటిల్‌తోపాటు మూవీలోని పాత్రలకు కూడా తెలుగు పేర్లే పెట్టేవారు. గత కొన్నేళ్లలో మాత్రం అలాంటిది అస్సలు పాటించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలావరకు తమిళ దర్శకనిర్మాతలు యధాతథంగా తమ టైటిల్స్ తెలుగులోనూ అలానే ఉంచేస్తున్నారు. వేట్టయాన్, పొన్నియిన్ సెల్వన్, కంగువ, మార్గన్, తుడరుమ్.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడు ఉదాహరణలు.(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))అంతెందుకు ఇప్పుడు సూర్య కొత్త సినిమాకు 'కరుప్పు' టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి తెలుగులో నలుపు అని అర్థం. ఎంత సూర్య అయినా సరే పేరు కాస్త తెలుగులో ఉంటేనే కదా.. మూవీ జనాలకు రీచ్ అవుతుంది. అలా కాదని చెప్పి యధాతథంగా టైటిల్స్ పెట్టుకుంటే పోతే ఇది మనం చూసే సినిమా కాదేమో మనవాళ్లు లైట్ తీసుకునే అవకాశముంది. చూడాలి మరి భవిష్యత్తులోనైనా ఈ తీరు మార్చుకుంటారా లేదా అనేది?సూర్య పుట్టినరోజు సందర్భంగా 'కరుప్పు' సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ ఆన్ యాక్షన్‌తో పాటు మాస్ సీన్స్ బాగానే ఉన్నాయి. వింటేజ్ చిత్రాలైన 'గజిని', 'భాషా' సినిమాల్ని గుర్తుచేసే కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయండోయ్. అంతా బాగానే ఉంది గానీ టీజర్లోనూ తమిళ ఫ్లేవర్ కాస్త గట్టిగానే కొట్టింది. మరి దీన్ని మన ఆడియెన్స్ ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి? దీపావళికి ఈ సినిమా థియేటర్లలోకి రావొచ్చని టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన)

శ్రీలీల వైరల్ వయ్యారి సాంగ్.. స్టూడెంట్ డ్యాన్స్‌కు హీరో ఫిదా!
ఇటీవల సినీ ప్రియులను ఓ రేంజ్లో ఊపేస్తోన్న హీరోయిన్ శ్రీలీల. గతేడాది పుష్ప-2 చిత్రంలో కిస్సిక్ సాంగ్‌తో అలరించిన ముద్దుగుమ్మ.. మరోసారి అలాంటి ఊపున్న సాంగ్‌తో మెప్పించింది. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా వచ్చిన జూనియర్ మూవీలో వైరల్ వయ్యారి అంటూ అభిమానుల ముందుకొచ్చింది. ఈ మాస్ సాంగ్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. నెట్టింట ఎక్కడ చూసినా వైరల్ వయ్యారి అంటూ రీల్స్‌తో అదరగొట్టేసింది.అంతలా క్రేజ్ దక్కించుకున్న ఈ పాటకు కర్నాటకకు చెందిన ఓ విద్యార్థిని చేసిన డ్యాన్స్ నెట్టింట వైరలవుతోంది. హీరో కిరిటీ సమక్షంలోనే ఆ బాలిక అద్భుతంగా డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను హీరో కిరిటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థినికి హీరో కిరిటీ చిరుకానుక అందించారు. ఇది చూసిన నెటిజన్స్ విద్యార్థిని టాలెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతంగా చేశావంటూ కితాబిస్తున్నారు.కాగా.. కిరిటీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం జూనియర్. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ జూలై 18 తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తోంది. The super talented V. Pooja from Kurugodu, a beautiful village in my hometown Ballari, dancing her heart out to #ViralVayyari. Blessings to you, little star! #Junior pic.twitter.com/FITaWGU6ra— Kireeti (@KireetiOfficial) July 23, 2025

దక్షిణాది సినీ అవార్డుల పండుగ.. నామినేషన్స్‌లో పుష్పరాజ్‌దే హవా!
దక్షిణాది సినీ అవార్డుల పండుగ సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనుంది. ఇప్పటికే వేదికతో పాటు తేదీలను నిర్వాహకులు ప్రకటించారు. తాజాగా ఈ అవార్డులకు ఎంపికైన నామినేషన్స్ జాబితాను వెల్లడించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన దక్షిణాది సినిమాలు ఈ అవార్డుల కోసం పోటీపడుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఎంపికైన చిత్రాల జాబితాను తాజాగా సైమా అవార్డుల కమిటీ ప్రకటించింది.తెలుగు సినిమాల విషయానికొస్తే అత్యధికంగా పుష్ప-2 చిత్రం నామినేషన్స్ దక్కించుకుంది. ఏకంగా 11 విభాగాల్లో ఎంపికైంది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ పది నామినేషన్స్‌తో రెండో ప్లేస్‌లో నిలిచింది. అంతేకాకుండా తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ చిత్రం హను మాన్ కూడా 10 విభాగాల్లో నామినేషన్స్ సొంతం చేసుకుంది. కాగా... గతేడాదిలో రిలీజైన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.ఇక కోలీవుడ్ విషయానికొస్తే శివ కార్తికేయన్- సాయిపల్లవి జంటగా వచ్చిన అమరన్ 13 నామినేషన్స్ దక్కించుకుంది. లబ్బర్ పందు 8, వాజై 7 విభాగాల్లో నిలిచాయి. ఇక శాండల్‌వుడ్‌లో భీమా, కృష్ణ ప్రణయ సఖి చిత్రాలు తొమ్మిది విభాగాల్లో నామినేషన్స్ సాధించాయి. ఇబ్బని తబ్బిడ ఇలియాలి - 7 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. అలాగే మలయాళం పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా వచ్చిన ది గోట్ లైఫ్(ఆడుజీవితం) అత్యధికంగా 10 విభాగాలకు ఎంపికైంది. ఆ తర్వాత ఏఆర్ఎమ్ 9, ఆవేశం 8 నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఈ 13వ సైమా అవార్డుల వేడుక దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 5,6 తేదీల్లో జరగనుంది.The Stage Is Set. The Stars Are Ready.Presenting the Top Nominated Films at SIIMA 2025 🌍🏆From powerful performances to cinematic brilliance, these films captured hearts and headlines across languages. And now… they lead the race for the most coveted awards in South Indian… pic.twitter.com/Vx2dLOOGLO— SIIMA (@siima) July 23, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

ENG VS IND 4th Test: ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్న సాయి సుదర్శన్, పంత్
మాంచెస్టర్ టెస్ట్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 200 పరుగుల మార్కును దాటింది. 46 పరుగుల వ్యవధిలో కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58), శుభ్‌మన్ గిల్ (12) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను సాయి సుదర్శన్ (46), రిషబ్ పంత్ (28) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు అజేయమైన 61 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు.సాయి సుదర్శన్ ఎంతో ఓపికగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తుండగా.. పంత్ తనదైన శైలిలో ధాటిగా ఆడుతున్నాడు. 65 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 201/3గా ఉంది. భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్‌కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్‌కు.. శుభ్‌మన్ గిల్ వికెట్ బెన్ స్టోక్స్‌కు దక్కింది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్‌కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఘోరంగా విఫలమైన వైభవ్ సూర్యవంశీ
ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఘోరంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డై గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా వైభవ్ నిరాశపరిచాడు. కేవలం 20 పరుగులకే ఔటయ్యాడు.ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో కూడా వైభవ్ ఓ మోస్తరు ప్రదర్శనలకే పరిమితమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులే చేసి నిరాశపరిచిన వైభవ్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ద సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. టెస్ట్ సిరీస్‌లో వైభవ్‌పై భారీ అంచనాలు ఉండటానికి కారణం అంతకుముందు ఇంగ్లండ్‌తోనే జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్. ఆ సిరీస్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. చివరి వన్డేలో శాంతించిన వైభవ్.. ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో (42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు) సరిపెట్టాడు.వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ధాటికి భారత్ ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై 3-2 తేడాతో ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. వైభవ్ వన్డేల్లో ప్రదర్శించిన జోరును కొనసాగిస్తాడని అనుకుంటే మమ అనిపించి నిరాశపరిచాడు.టెస్ట్ సిరీస్ విషయానికొస్తే.. తొలి టెస్ట్ డ్రా కాగా.. రెండో టెస్ట్‌లో ఇవాళ (జులై 23) చివరి రోజు ఆట కొనసాగుతుంది. టీ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. వైభవ్ గోల్డెన్ డకౌటై నిరాశపరిచినా కెప్టెన్ ఆయుశ్ మాత్రే అజేయ అర్ద సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అభిగ్యాన్ కుందు (19) క్రీజ్‌లో ఉన్నాడు.ఈ మ్యాచ్‌లో భారత్ 355 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 223 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.స్కోర్ వివరాలు..ఇంగ్లండ్ అండర్-19: 309 (ఎకాన్ష్ సింగ్ 117) & 324/5 (డాకిన్స్ 136)భారత్ అండర్-19: 279 (విహాన్ మల్హోత్రా 120) & 131/2 (ఆయుశ్ మాత్రే 80 నాటౌట్)

ENG VS IND 4th Test Day 1: కష్టాల్లో భారత్
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. 140 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) శుభారంభాన్ని అందించి ఔట్ కాగా.. శుభ్‌మన్ గిల్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. 46 పరుగుల వ్యవధిలో భారత్ 3 కీలకమైన వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సాయి సుదర్శన్ (26), రిషబ్ పంత్ (3) భారత్‌ను పటిష్ట స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్‌కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్‌కు.. శుభ్‌మన్ గిల్ వికెట్ బెన్ స్టోక్స్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్‌కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ENG VS IND 4th Test: సచిన్ రికార్డును సమం చేసిన జైస్వాల్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేసి ఔటైన జైస్వాల్.. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌పై 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 20వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ఈ ఘనత సాధించిన రెండో వేగవంతమైన భారత బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్, మొహమ్మద్ అజహారుద్దీన్ రికార్డును సమం చేశాడు. సచిన్, అజహార్, జైస్వాల్ ఇంగ్లండ్‌పై తలో 16 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఇంగ్లండ్‌పై అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. ద్రవిడ్ కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 47 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (46), యశస్వి జైస్వాల్ (58) ఔట్ కాగా.. సాయి సుదర్శన్ (20), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (11) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ కోల్పోయిన వికెట్లలో రాహుల్ వికెట్ క్రిస్ వోక్స్‌కు.. జైస్వాల్ వికెట్ లియామ్ డాసన్‌కు దక్కింది. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. భారత్ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ భారత్‌కు డు ఆర్ డైగా మారింది.తుది జట్లు..ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.భారత్: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
బిజినెస్

ముంబైలో అల్ట్రా లగ్జరీ ఇళ్ల జోరు
ముంబై నగరంలో లగ్జరీ ఇళ్లకు (రూ.10 కోట్లు, అంతకుమించిన బడ్జెట్లోనివి) డిమాండ్ బలంగా పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాల విలువ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 20 శాతం పెరిగి రూ.14,751 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాల విలువ రూ.12,285 కోట్లుగా ఉండడం గమనార్హం.సంఖ్యా పరంగా చూస్తే అల్ట్రా లగ్జరీ ఇళ్ల విక్రయాలు 11 శాతం పెరిగి 692 యూనిట్లకు చేరాయి. ఈ వివరాలను ఇండియా సోథెబిస్ ఇంటర్నేషనల్ రియల్టీ (ఐఎస్‌ఐఆర్), సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్త నివేదిక వెల్లడించింది. కొత్తగా నిర్మించిన ఇళ్లు, మెరుగైన వసతులతో ఉన్న వాటికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రైమరీ మార్కెట్లో (మొదటిసారి విక్రయించే కొత్త ఇళ్లు) ఇళ్ల అమ్మకాలు 422 యూనిట్ల నుంచి 501 యూనిట్లకు పెరిగాయి. సెకండరీ మార్కెట్లో విక్రయాలు (రీసేల్) 200 యూనిట్ల నుంచి 191కు తగ్గాయి. ప్రైమరీ మార్కెట్లో అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాల విలువ రూ.8,752 కోట్ల నుంచి రూ.11,008 కోట్లకు పెరిగింది. సెకండరీ మార్కెట్లో అమ్మకాల విలువ రూ.3,533 కోట్ల నుంచి రూ.3,743 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: చందా కొచ్చర్‌పై ఆరోపణలు.. నిజం బట్టబయలు‘ముంబై లగ్జరీ ఇళ్ల మార్కెట్ కీలక తరుణంలో ఉంది. ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో రికార్డు స్థాయి అమ్మకాలు అల్ట్రా ప్రీమియం ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది. ముఖ్యంగా వర్లి, ప్రభాదేవి, మలబార్ హిల్, బాంద్రా వెస్ట్ వంటి సూక్ష్మ మార్కెట్లలో డిమాండ్ ఎక్కువగా ఉంది’ అని ఐఎస్‌ఐఆర్ ఈడీ సుదర్శన్ శర్మ తెలిపారు.

చందా కొచ్చర్‌పై ఆరోపణలు.. నిజం బట్టబయలు
వీడియోకాన్ గ్రూపునకు రూ.300 కోట్ల రుణాన్ని మంజూరు చేసినందుకు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ రూ.64 కోట్లు లంచం తీసుకున్నట్లు తేలింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ జులై 3న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. వీడియోకాన్‌కు సంబంధించిన కంపెనీ ద్వారా చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ నుంచి ఈ డబ్బును తరలించినట్లు ట్రిబ్యునల్ తెలిపింది.ఈ చెల్లింపు క్విడ్ ప్రోకో(పరస్పర ప్రయోజనాలు) కేసు అని ట్రిబ్యునల్ పేర్కొంది. దాంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుకు బలం చేకూరింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 50 కింద నమోదైన డాక్యుమెంటరీ సాక్ష్యాలు, వాంగ్మూలాలను ఈడీ అందించిందని, వీటిని చట్టపరంగా ఆమోదించినట్లు అప్పిలేట్ తెలిపింది. రుణ ఆమోదం కోసం ఐసీఐసీఐ బ్యాంక్ అంతర్గత నిబంధనలను ఉల్లంఘించించారని ఇవి స్పష్టంగా చూపుతున్నట్లు పేర్కొంది.వీడియోకాన్ గ్రూప్ కంపెనీ ఎస్ఈపీఎల్ నుంచి దీపక్ కొచ్చర్ నేతృత్వంలోని నూపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఆర్పీఎల్)కు రూ.64 కోట్లు పంపినట్లు ట్రిబ్యునల్ వివరించింది. తర్వాతి రోజే వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.300 కోట్ల రుణాన్ని మంజూరు చేసినట్లు తేలింది. ఎన్ఆర్పీఎల్ యాజమాన్య బాధ్యతలు మొదట వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ వద్ద ఉన్నట్లు చూపించినప్పటికీ, నిజమైన నియంత్రణ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన దీపక్ కొచ్చర్ వద్ద ఉందని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. రుణాన్ని ఆమోదించేటప్పుడు చందా కొచ్చర్ ఈ సంబంధాలను ప్రకటించనందున నేరానికి పాల్పడినట్లు స్పష్టమవుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..చందా కొచ్చర్, ఆమె కుటుంబానికి చెందిన అటాచ్ చేసిన ఆస్తులను విడుదల చేయడానికి అనుమతిస్తూ 2020 నవంబర్‌లో అడ్జుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన తీర్పును ట్రిబ్యునల్ తప్పుబట్టింది. ఆస్తులకు సంబంధించి తగిన ఆధారాలు లేవని అథారిటీ గుర్తించింది. కానీ ట్రిబ్యునల్ దీన్ని తీవ్రంగా విభేదించింది. అప్పటి అథారిటీ కీలక విషయాలను విస్మరించిందని పేర్కొంది. ‘న్యాయనిర్ణేత కీలకమైన భౌతిక వాస్తవాలను విస్మరించి, రికార్డులకు విరుద్ధంగా నిర్ధారణకు వచ్చింది. అందువల్ల, దాని ఫలితాలను మేము సమర్థించలేం’ అని ట్రిబ్యునల్ తెలిపింది.

బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

‘డబ్బా ట్రేడింగ్’ చట్ట విరుద్ధం
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా డబ్బా ట్రేడింగ్ చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ అంశంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండవలసిందిగా హెచ్చరించింది. చట్ట విరుద్ధంగా జరిగే ట్రేడింగ్ సర్వీసుల ద్వారా ఎలాంటి లావాదేవీలు చేపట్టవద్దని సూచించింది. ఈ విషయంలో జాగరూకతతో వ్యవహరించవలసిందిగా పేర్కొంది.స్టాక్ మార్కెట్లకు సమాంతరంగా నియంత్రణలులేని ఆఫ్మార్కెట్లో నిర్వహించే అక్రమ లావాదేవీలకు దూరంగా ఉండమంటూ హెచ్చరించింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంబంధం లేకుండా నిర్వహించే ఇలాంటి లావాదేవీలు భారీ రిస్క్‌లతో కూడి ఉంటాయని తెలియజేసింది. అంతేకాకుండా సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టంలోని పలు నిబంధనల ఉల్లంఘనకు సైతం దారితీస్తాయని హెచ్చరించింది. వెరసి డబ్బా ట్రేడింగ్ చట్ట విరుద్ధమేకాకుండా.. రిస్క్‌లను సైతం ఎదుర్కోవలసి ఉంటుందని వివరించింది. నియంత్రణ, అవగాహన, చట్టబద్ధ సంస్థల సహకారంతో సెబీ ఇన్వెస్టర్ల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసింది.ఇదీ చదవండి: రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలాఏమిటీ డబ్బా ట్రేడింగ్..సెబీ నిర్వచించిన విధంగా డబ్బా ట్రేడింగ్ అనేది చట్టవిరుద్ధమైన, క్రమబద్ధీకరించని ఆఫ్ మార్కెట్ ట్రేడింగ్. ఇది గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నియంత్రణలో ఉండదు. సెబీ గుర్తింపు పొందిన ఏ ఎక్స్ఛేంజ్లోనూ ఈ ట్రేడులు నమోదు అవ్వవు. వ్యాపారులు, డబ్బా ఆపరేటర్ల మధ్య నగదు రూపంలో సెటిల్మెంట్లు జరుగుతాయి. ప్రధానంగా స్టాక్ ధర కదలికలపై బెట్టింగ్ వేస్తారు. సెక్యూరిటీల వాస్తవ కొనుగోలు లేదా అమ్మకం ఉండదు. వీటిని అనుసరించడం సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్, 1956, సెబీ యాక్ట్ 1992, భారతీయ న్యాయ్ సంహిత 2023ను ఉల్లంఘించడం అవుతుందని గుర్తుంచుకోవాలి.
ఫ్యామిలీ

నో జిమ్, నో ట్రైనర్.. 46 రోజుల్లో 11 కిలోలు ఉఫ్..!
అమెరికాకు చెందిన ప్రముఖ యూ ట్యూబర్ కేవలం 46 రోజుల్లో 11 కిలోల బరువు తగ్గడం విశేషంగా నిలుస్తోంది. అదీ 56 ఏళ్ల వయసులో జిమ్‌కు వెళ్లకుండానే, ఎలాంటి ట్రైనర్ లేకుండానే దీన్ని సాధించాడు. అన్నట్టు ఎలాంటి ఫ్యాషన్ డైట్ కూడా పాటించలేదు. మరి అతని వెయిట్ లాస్ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా.పసిఫిక్ నార్త్వెస్ట్లోనివసిస్తున్న 'మిస్టర్ రాంగ్లర్ స్టార్'గా పాపులర్ అయిన అమెరికన్ కోడి క్రోన్ తన వెయిట్ లాస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. చాట్ జీపీటీ వంటి ఏఐ సాయంతో తన బరువు తగ్గే ప్లాన్‌ను పక్కాగా అమలు చేశాడు. విజయం సాధించాడు. తన 56వ పుట్టిన రోజునాడు ఆరోగ్యం , ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడుకోడి క్రోన్. బరువు తగ్గాల్సిందే అని తీర్మానించుకున్నాడు. ఇందుకోసం AI ని ఆశ్రయించాడు. తన బరువు, ఎత్తు, జీవనశైలి, శారీరక స్థితిగతులను బట్టి చాట్ జీపీటీ సహాయంతో ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించుకున్నాడు. (6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!)అలా చాట్‌జీపీటి సాయంతో 95 కిలోల నుండి 83 కిలోలకు బరువు తగ్గించుకున్నాడు కోడి. కేవలం ఒకటిన్నర నెలల్లో 25.2 పౌండ్లు (సుమారు 11.4 కిలోలు) కోల్పోయాడు. ఇందుకోసం అతను ఓజెంపిక్ లాంటి బరువు తగ్గించే మందులను ఉపయోగించ లేదు, వ్యక్తిగత కోచ్‌ను నియమించుకోలేదు. దీనికి బదులుగా ఇంట్లోనే చేయగలిగే సాధారణ వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి మార్పులకు ప్రాధాన్యత ఇచ్చాడు. క్రమశిక్షణ, క్లీన్ ఈటింగ్, స్మార్ట్ సప్లిమెంటేషన్, వ్యాయామాలు ఇవే అతని సీక్రెట్స్.కోడి క్రోన్ పాటించిన నియమాలుపోషకాహారం & ఉపవాసం : లాంగ్ ఫాస్టింగ్ తరువాత రోజుకు రెండు సార్లు సంపూర్ణ భోజనాలు. సాయంత్రం 5 గంటల తరువాత నో ఫుడ్అల్పాహారం: 4 గుడ్లు, అర పౌండ్ లీన్ గ్రాస్-ఫెడ్ బీఫ్, స్టీల్-కట్ ఓట్స్ (తీపి లేనివి), ఆకుకూరల సప్లిమెంట్. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, స్నాక్స్ . సీడ్ ఆయిల్స్ , పాల ఉత్పత్తులకు పూర్తిగా దూరం.రాత్రి భోజనం: 1/3 కప్పు జాస్మిన్ రైస్, సుమారు 225 గ్రా. లీన్ స్టీక్, ఆలివ్ ఆయిల్ లేదా సగం అవకాడో.సప్లిమెంట్లు: క్రియేటిన్, బీటా-అలనైన్, వె ప్రోటీన్, కొల్లాజెన్, మెగ్నీషియం మరియు ఇతర క్లీన్-లేబుల్ పెర్ఫార్మెన్స్ బూస్టర్లువర్కౌట్స్: ఇంట్లోనే పుల్-అప్ బార్, రెసిస్టెన్స్ బ్యాండ్లు, కెటిల్‌బెల్స్, డిప్ బార్ లాంటి వ్యాయామాలు చేసేవాడు. వారానికి ఆరు రోజులు, ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వ్యాయామం.గంట నుంచి గంటన్నర పాటు ఎక్సర్పైజ్లు స్లీప్: 7–8 గంటల నిద్ర. మంచి నిద్ర కోసం నిద్రవేళకు ఒక గంట ముందు స్క్రీన్స్ ఆఫ్. గది అంతా చీకటిగా ఉండేలా ఏర్పాటు.రోజువారీ 4 లీటర్ల నీళ్లు తాగడం. అలాగే జీవక్రియ శక్తిని పెంచడానికి ప్రతిరోజూ ఉదయం 15–20 నిమిషాలు ఉదయం పూట సూర్యరశ్మి తగిలేలా చూసుకునేవాడు.ట్రాకింగ్ ప్రోగ్రెస్: ప్రతి ఉదయం తన ఉపవాస బరువును చెక్ చేసుకునేవాడు. దీన్ని బట్టి AI ప్లాన్‌ను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రణాళికను సర్దుబాటు చేసుకునేవాడు. దీంతో బరువు తగ్గడమే కాకుండాకీళ్ల నొప్పులు తగ్గాయి, మంచి నిద్ర, శక్తి వీటన్నిటితోపాటు, స్పష్టమైన ఆలోచన, మెరుగైన మానసిక ఆరోగ్యం కూడా లభించిందని చెప్పుకొచ్చాడు. 46 రోజుల్లో 11 కజీల బరువు తగ్గడం అనేది సాధారణ విషయం కాదు దీనికి ఎంతో పట్టుదల శ్రమ, ఉండాలి అంటున్నారు నెటిజన్లు. ఖరీదైన జిమ్‌లు, ట్రైనర్లు లేకుండానే సరైన సమాచారంతో ఇంట్లోనే ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చని కోడి క్రోన్ నిరూపించాడు. దీనికి సంబంధించి తన అనుభవాలను యూట్యూబ్ వీడియోల ద్వారా పంచుకుంటూ, ఇతరులకూ స్ఫూర్తినిస్తున్నాడునోట్: అంతర్లీనంగా మరేతర ఆరోగ్య సమస్యలు లేనపుడు బరువు తగ్గే విషయంలో అనుకున్న ఫలితాలు సాధించాలంటే ముందు నిబద్ధత అవసరం. పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, మంచి నిద్ర, రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తదితర సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే శారీరక ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమే.

పాపులర్ ట్రెక్కింగ్ డెస్టినేషన్ : నిశానబెట్ట గురించి తెలుసా?
బనశంకరి: దట్టమైన అడవులు, ఎత్తైన వృక్షాలు, పచ్చదనం పరుచుకున్న కొండలు, నయన మనోహరమైన సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలతో ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకా నిశానబెట్ట (Nishani Betta) పర్యాటకులను రా రమ్మని ఆహ్వానం పలుకుతోంది. ప్రకృతి ప్రేమికులు, పర్వతారోహకులకు నూనెబెట్ట స్వర్గధామంగా మారింది. ఉత్తరకన్నడ నుంచి వానల్లి-కక్క మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో నిశాన బెట్ట ఉంది. ప్రసిద్ధ ట్రెక్కింగ్ గమ్యస్థానం నిశాని బెట్ట, నిశాన మొట్టే అని కూడా పిలుస్తారు, ఇది కర్ణాటకలోని కొడగు (కూర్గ్) జిల్లాలో ఉన్న ఒక శిఖరం. సముద్ర మట్టం నుంచి 783మీటర్ల ఎత్తులో ఉన్న నిశాన బెట్టి ప్రకృతి అందాలతో రంగా ఉంటుంది. లోయలతో కూడిన ఈ కొండపైకి ట్రెక్కింగ్ చేయడం జీవితంలో మరచి పోలేని అనుభవం. గ్రామపంచాయతీ పరిదిలోని వాన నుంచి కక్కళ్లి మార్గంలో 5కిలోమీటర్లు ప్రయాణించాలి. కాలినడకన అరకిలోమీటర్ నడవాలి. కొద్దిదూరం దట్టమైన అడవిలో ప్రయాణించాలి. అడవి దాటగానే తగ్గుప్రదేశం నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఇది జారుడుగా ఉండటం వల్ల ప్రమాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో ట్రెక్కింగ్ కష్టసాధ్యం. వర్షాకాలం అనంతరం ట్రెక్కింగ్ చేయడం ఉత్తమం. ఆ పేరు ఎలా వచ్చిందంటేయాత్రను గుర్తించడానికి నిశానెబెట్టపై సైనికులు సహారా కాసేవారు. ఎదురుదాడి చేయడానికి సైన్యం వస్తుందని తెలియగానే నిశానెబెట్టపై నుంచి జెండా ఊపి విషయం చేరవేసేవారని, అందుకే ఈ బెట్టకు ని నెబెట అని పేరు వచ్చిందని చెబుతారు. వీకెండ్ సమయంలో పర్యాటకుల సందడి నిశానెబెట్టకు వీకెండ్ సమయంలో పర్యాటకులు, పర్వతారోహకులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రకృతి అం దాలను ఆస్వాదిస్తారు. సూర్యోదయం, సూర్యాస్థ మయం అద్భుతంగా ఉంటుంది. ఈ నయన మనోహర దృశ్యాన్ని కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీ పడతారు. నిశానెబెట్ట వీక్షణకు వచ్చే వారు పరిసరాల శుభ్రత పాటించాల్సి ఉంటుంది. సోందా అరసరపాలన కాలంలో శత్రువులు దండ తినుబండారాల కవర్లను, ఖాళీ వాటర్ బాటిల్స్ ను ఇష్టారాజ్యంగా పడేయరాదు. నిర్ణీత స్థలంలో ఉంచిన చెత్త బుట్టలో వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనల వల్లనే నిశానెబెట్ట ప్లాస్టిక్, చెత్త రహితంగా గుర్తింపు పొందింది.సాంస్కృతిక కార్యక్రమాలునినెబెట్ట కేవలం ట్రెక్కింగు కాకుండా సాంస్కృ తిక వైభవానికి వేదికగా మారింది. ఇక్కడ శివరాత్రి జాగరణ నిమిత్తం వైవిధ్యమైన సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహిస్తారు. స్థానికులతో కలిసి ఇక్కడ జాగరణ చేస్తారు. నిశానెబెట్టలో సాంస్కృతిక సంఘాలు నిర్వహించే కార్యక్రమాలు ప్రజాదరణ పొందాయి. నిశాన బెట్ట నైసర్గికంగా దట్టమైన అడవు లతో కూడుకుని ఉండటంతో అంతగా అభివృద్ధి కనబడలేదని స్థానికులు అంటారు.ఇదీ చదవండి: మునుపెన్నడూ ఎరుగని ఉల్లాస యాత్ర : పురాతన ఆలయాలు, సరస్సులు

ఈ కేసులో నిర్దిష్టమైన ఆధారాలు తప్పనిసరి
నాకు గత కొంత కాలంగా విపరీతమైన నడుము నొప్పి వస్తుండటంతో ఒక సర్జన్ వద్దకు వెళ్ళాను. ఆయన సర్జరీ చేస్తే తగ్గుతుంది అని చెప్పి, నమ్మించి సర్జరీ చేశారు. కానీ నొప్పి పోలేదు. ఇప్పుడేమో నడుము కింది భాగంలో ఒక డిస్క్ సర్జరీ చేయాలని అంటున్నారు. ముందే ఎందుకు చెప్పలేదు అంటే, ఇంతవరకు వస్తుంది అనుకోలేదు అంటున్నారు. గూగుల్‌లో చూస్తే మొదట చేసిన సర్జరీ అంత ఫలితాలు ఇవ్వదు, అసలు చేసింది కూడా దండగే అని ఉంది. ఆ సర్జన్ నా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డబ్బు కోసమే చేశాడు అనుకుంటున్నాను. ఎలాంటి కేసులు వేయాలి? – విక్రమ్, తిరుపతి ఏంటండీ విక్రమ్ గారూ.. చాలా అక్రమంగా ఉన్నారే! ఒక అర్హత కల్గిన డాక్టరు అనుభవాన్ని, నిర్ణయాన్ని గూగుల్‌లో ఏదో చదివి తప్పు అని తేల్చేస్తారా? పోనీ అదే గూగుల్, యూట్యూబ్‌లో చూసి మీ సర్జరీ మీరే చేసుకోకపోయారా? ఒక క్వాలిఫైడ్ (అర్హులైన) డాక్టరు ఇచ్చే సలహాపై మీకేదైనా సందేహం ఉంటే మరొక డాక్టరు వద్ద అభిప్రాయం తీసుకోవాలి. అంతేగానీ గూగుల్ చెప్పింది అని కేసులు వేస్తాననుకోవటం సబబేనా? మీ సమస్యకి డాక్టరు నిర్లక్ష్యమే కారణమని చెప్పే నైపుణ్యం మీకుందా?ఏది ఏమైనా, మీరు అడిగారు కనుక చట్టం మాత్రమే చెబుతాను. అలా చేయమని సలహా మాత్రం ఇవ్వను.1) భారత వినియోగదారుల సంరక్షణ చట్టం 2019 ప్రకారం, వైద్యసేవలు కూడా ‘సేవలు’ కిందికి వస్తాయి. ఒక వైద్యుని నిర్లక్ష్యం వల్ల మీరు శారీరక నష్టం అనుభవించి ఉంటే, మీరు కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ (కన్స్యూమర్ కోర్టు)లో కేసు వేయవచ్చు. అక్కడ మీరు నష్టపరిహారం, వైద్య ఖర్చులు, భవిష్యత్తు చికిత్సల ఖర్చులు సైతం కోరవచ్చు) 2) భారత న్యాయ స్మృతి కోడ్ (భారతీయ న్యాయ సంహిత) ప్రకారం, డాక్టర్ నిర్లక్ష్యం క్రిమినల్ బాధ్యతకు దారి తీయవచ్చు. ప్రస్తుత చట్టం ప్రకారం, సెక్షన్ 106 (డాక్టరు నిర్లక్ష్యం వలన ప్రాణ నష్టం) – సెక్షన్ 125 (నిర్లక్ష్యంతో ప్రాణాపాయ స్థితి కల్పించటం) వంటి సెక్షన్ల కింద కేసు వేసే అవకాశం ఉంది. కానీ, దీనికి తగినంత పటిష్టమైన మెడికల్ ఆధారాలు ఉండాలి. కేవలం అనుమానాల ఆధారంగా క్రిమినల్ కేసులు వేయటం , అవి నిలబడటం కష్టం.ప్రతి వైద్యలోపం లేదా ప్రతికూల ఫలితాన్ని వైద్యుడి నిర్లక్ష్యంగా పరిగణించలేము. చికిత్సలు కొన్ని రిస్క్‌లతో ఉంటాయి. కాపాడాలని ప్రయత్నించే వైద్యులు కూడా ఎప్పుడో అపరాధులుగా/నిందితులుగా మారిపోతే, మన వైద్య వ్యవస్థ స్తంభించిపోతుంది.అమెరికా వంటి దేశాల్లో, వైద్యులు కేసుల ఉచ్చులో పడిపోతారనే భయంతో అవసరమైన చికిత్సలు ఇవ్వకుండా డిఫెన్సివ్ మెడిసిన్స్ పాటిస్తున్నారు. అంటే రోగికి కావాల్సింది కాకుండా, చట్టపరమైన సమస్యలు రాకుండా చికిత్స అందిస్తున్నారు! మన దేశం కూడా అదే దిశగా పోతే, ప్రజలే నష్టపోతారు.మీకు నిజంగా అన్యాయం జరిగిందని మీరు భావిస్తే... మొదట వైద్య నిపుణుల సలహా తీసుకోండి (ఇంకొక నిపుణుడి లిఖిత పూర్వక మెడికల్ అభిప్రాయం). అనంతరం ఒక న్యాయవాది ద్వారా సరిగా మీ కేసు గమనించి, ఏ మార్గం మీకు సరైందో నిర్ణయించండి.నిర్దిష్టమైన ఆధారాలతో మాత్రమే ముందుకెళ్లండి. ఎందుకంటే ఒక వైద్యుని ప్రొఫెషనల్ జీవితాన్ని కేవలం అనుమానాలతో లేక ఉద్దేశపూర్వకంగా అభాసుపాలు చేస్తే, అందుకు తగిన చర్యలు సదరు వైద్యులు కూడా తీసుకోవచ్చని మరువకండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. )

డాక్టర్... ట్రీట్మెంట్..! కార్చిచ్చుకి సమూలంగా చెక్..
డాక్టర్ మేఘా సక్సేనా.. ఉత్తరాఖండ్ నివాసి. అక్కడి అల్మోరా జిల్లా గవర్నమెంట్ కాలేజ్‌లో పనిచేసేవారు. ప్రజారోగ్యం నుంచి పర్యావరణం వైపు మళ్లారు. ఆమె మెడికల్ ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడే అల్మోరాలో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్న ఓ క్లిష్టమైన సమస్యను పరిశీలించారు. అదేంటంటే.. అల్మోరాను ఆనుకుని ఉన్న అడవిలోని దేవదారు వృక్షాల మీద పండి రాలిపడి ఎండిన ఆకులు. ఎండిన ఆకులతో సమస్యేంటి అని విస్తుపోయే ముందు ఉత్తరాఖండ్ భౌగోళిక స్వరూపం తెలుసుకోవాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 71 శాతం అడవే! అందులో పదహారు శాతం దేవదారు వృక్షాలు! స్థానికంగా వాటిని చిర్ కా పేడ్ అంటారు. ఆ అడవిలో తరచు కారుచిచ్చు రగులుతూ ఉంటుంది. దీనివల్ల 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 54, 801 హెక్టార్ల అడవి తగలబడిపోయింది. కార్చిచ్చు వ్యాపించడానికి కారణం.. పండిపోయి నేలరాలి ఎండిపోయిన దేవదారు ఆకులు! ఇవి అగ్నికి ఆజ్యంలా పనిచేసి అడవిని బూడిదచేస్తూ కర్బన ఉద్గారాలకు తోడవుతున్నాయి. జీవవైవిధ్యానికి ప్రమాదకారిగా మారుతున్నాయి. దీన్ని గ్రహించిన డాక్టర్ మేఘా సిరంజి సూది మీద నుంచి సూదుల్లాంటి దేవదారు ఆకుల మీద దృష్టిపెట్టారు. అదీగాక తన మెడికల్ ప్రాక్టీస్‌లో.. రసాయన ఎరువులు ప్రజల ఆరోగ్యం మీద చూపుతున్న దుష్ప్రభావాల కేసులనూ చూశారు. ఎండిపోయిన దేవదారు ఆకులతో ఇటు సాగుకు, అటు పర్యావరణానికి ఉపయోగపడే ప్రయోగాలేమైనా చేయొచ్చా అని ఆలోచించసాగారు.బయోచార్.. ఎకోచార్ఆలోచన రాగానే రంగంలోకి దిగారు మేఘా. అది 2019 సంవత్సరం. అప్పటికి ఆమె గర్భవతి. మెటర్నిటీ లీవ్ తీసుకున్నారు. ఆ సెలవులను తన ప్రయోగానికి వాడుకోవాలనుకున్నారు. కొంతమంది నిపుణులతో కలిసి ప్రయత్నం మొదలుపెట్టారు. 2021లో ఫలితం వచ్చింది. అది పర్యావరణ ప్రమాదానికి పరిష్కారాన్నే కాదు, తనను ఆంట్రప్రెన్యూర్‌గానూ నిలిపింది. అదే బయోచార్ (కట్టెబొగ్గు). ఆ స్టార్టప్ పేరు ‘ఎకోచార్’. ఎండిపోయిన ఆకులన్నిటినీ ఏరేయడం వల్ల కార్చిచ్చు వ్యాప్తిని సాధ్యమైనంత వరకు అరికట్టడమే కాకుండా వాటినుంచి తయారైన బయోచార్ చక్కటి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతోంది. ఇది నేల సారాన్ని పెంచుతోంది. అంతేకాదు దీన్నుంచి పాలీఫామ్లోని కోళ్లకు, చేపల చెరువుల్లోని చేపలకూ కావల్సిన సేంద్రియ దాణానూ తయారు చేశారు. ఒక కిలో బయోచార్.. పదహారు వందల గ్రాముల కార్బన్‌డయాక్సైడ్‌ను నిరోధిస్తుంది. దీనికి ఉత్తరాఖండ్‌లోనే కాదు ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ‘నేను పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్న రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం చూడాలని మాత్రమే అనుకున్నాను. ఆ దిశగా వర్క్ చేశాను. దాని ఫలితం ఈ రెండిటికి పరిష్కారాన్నే కాదు నన్ను అంట్రప్రెన్యూర్గానూ మార్చింది. ఈ ఉత్సాహంతో స్థానికంగా దొరికే వనమూలికలు, వ్యవసాయ వ్యర్థాలతో పశువుల మేతనూ తయారుచేయాలనుకుంటున్నాను. నా ప్రస్తుత లక్ష్యం అదే’ అని చెబుతుంది డాక్టర్ మేఘా సక్సేనా.(చదవండి: డిజిటల్ వేదికపై ఓ నారి పోరు! సామాన్యురాలి విజయగాథ)
ఫొటోలు
అంతర్జాతీయం

‘మీ ఎకానమీని కూల్చేస్తాం’.. భారత్, చైనాలకు అమెరికా వార్నింగ్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యుడు లిండ్సే గ్రాహం భారత్, చైనాతో పాటు ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ధర తక్కువగా ఉందని రష్యా వద్ద క్రూడాయిల్‌ను కొనుగోలు చేయాలని చూస్తే మీ ఆర్ధిక వ్యవస్థను నిట్ట నిలువునా కూల్చేస్తామని ఆయా దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.ఇంతకు ముందు గ్రాహం రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం టారిఫ్ విధించాలనే ప్రతిపాదనలు తెచ్చారు. ఈ క్రమంలో మరోసారి టారిఫ్ ధరల్ని ప్రస్తావిస్తూ ఆయా దేశాలపై విమర్శలు గుప్పించారు. ఫాక్స్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రష్యా వద్ద తక్కువ ధరకే ఆయిల్ దొరుకుతుందని కొనుగోలు చేస్తున్న బ్రెజిల్,చైనాతో పాటు భారత్‌కు నేను చెప్తున్నది ఒకటే. కీవ్ వద్ద ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలతో ఈ యుద్ధం(టారిఫ్) కొనసాగుతుంది. ఈ యుద్ధంలో సంబంధిత దేశాల్ని చీల్చి చెండాడుతాం. ఆర్ధిక వ్యవస్థను కూల్చేస్తామని పునరుద్ఘాటించారు. మీరు (భారత్,చైనా, బ్రెజిల్) చేస్తున్నది రక్తపాతం. ఎవరైనా అతన్ని ఆపే వరకు అతను (పుతిన్) ఆగడు అంటూనే.. రష్యాపై ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగారు. ట్రంప్‌తో ఆటలాడుకోవాలని చూస్తే ప్రమాదాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే. మీ చేష్టల ఫలితంగా మీ దేశ ఆర్ధిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ధ్వజమెత్తారు. కాగా, ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపేలా చర్చలకు రావాలని ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆదేశించారు. ఈ బెదిరింపుల్ని రష్యా ఖండించింది. అమెరికా మాపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. Lindsey Graham: Here’s what I would tell China, India and Brazil. If you keep buying cheap Russian oil… we will tariff the hell out of you and we’re going to crush your economy pic.twitter.com/x05J3G8oOk— Acyn (@Acyn) July 21, 2025

నదిలో లైవ్ రిపోర్టింగ్.. వెన్నులో వణుకుపుట్టించే వీడియో
నిజంగానే.. ఆ న్యూస్ రిపోర్టర్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఘటనే ఇది. ఓ బాలిక మిస్సింగ్ కేసులో లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా భయానక అనుభవం ఎదురైంది అతనికి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటకు చేరింది. బ్రెజిల్‌లోని బాకబాల్ రీజియన్ మారాన్యో ప్రాంతంలో రయిస్సా అనే 13 ఏళ్ల బాలిక జూన్ 30వ తేదీన అదృశ్యమైంది. మియరిమ్ నదిలో స్నేహితులతో ఈతకు వెళ్లి కొట్టుకుపోయింది. గత ఈతగాళ్లు ఎంత గాలించిన ఫలితం లేకుండా పోయింది. అయితే పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఆమె ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈలోపు.. టీవీ రిపోర్టర్ లెనిల్డో ఫ్రాజావో నీళ్లలోకి దిగి బాలిక మిస్సింగ్ కేసు వార్తకు సంబంధించి రిపోర్టింగ్ చేస్తూ కనిపించాడు. ఇంతలో అతని కాళ్లకు ఏదో తాకింది. తీరా చూస్తే అది ఆ బాలిక మృతదేహం!!. దీంతో ఒక్కసారిగా వణికిపోయిన అతను.. ఇక్కడేదో తాకుతుందంటూ తన టీంనుఅప్రమత్తం చేసే ప్రయత్నం చేశాడు. మళ్లీ లోపలకు వెళ్లను.. అక్కడేదో తాకుతోంది. బహుశా చెయ్యి అనుకుంటా అంటూ వణికిపోతున్న గొంతుతో చెప్పాడు.వెంటనే ఆ బృందం పోలీసులకు సమాచారం అందించింది. వాళ్లు ఆ బాలిక మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. నీట మునిగే ఆమె చనిపోయిందని.. బహుశా ఆ మృతదేహం నది అడుగుభాగంలోని మట్టిలో ఇంతకాలం కూరుకుపోయి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆ రిపోర్టర్‌కు భయానక అనుభవం మిగిల్చిన వీడియో కిందే ఉంది! చూసేయండి.. A Brazilian TV reporter may have stumbled onto the body of a missing 13-year-old girl during a live segment from the very river she vanished inLenildo Frazão was waist-deep in the Mearim River, demonstrating the water’s depth on camera in Bacabal, Maranhão — the last place the… pic.twitter.com/0i3y13fsZ9— Re:Flex (@re_flex_world) July 21, 2025

ఆయన నన్ను అదోలా చూస్తూ ఉండిపోయాడు
అమెరికాను కుదిపేసిన లైంగిక కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. అమెరికా విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలకు దిగారు. ఈ వ్యవహారంలో ట్రంప్ పాత్రపైనా ఎఫ్‌బీఐ దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారామె.1996లో మరియా ఫార్మర్ ఫిర్యాదుతోనే జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రముఖ ఫైనాన్షియర్ ఎప్స్టీన్తో పాటు అతని సన్నిహితురాలైన గిస్లేన్ మాక్స్‌వెల్‌పై కేసులు నమోదు అయ్యాయి. అటుపై ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులు ఉన్నారన్న ఆరోపణల నడుమ.. అగ్రరాజ్యంలో ఈ కేసు సంచలనాత్మకంగా మారింది.తాజాగా.. న్యూయార్క్ టైమ్స్‌కి మరియా ఫార్మర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్‌నూ ఎఫ్‌బీఐ విచారించాలని కోరారామె. అది 1995లో ఓ అర్ధరాత్రి. నేను మాన్‌హట్టన్‌లోని ఎప్స్టీన్ ఆఫీస్‌లో ఉన్నా. కాస్త కురచైన దుస్తులే నేను వేసుకుని ఉన్నా. ఇంతలో సూట్లో ఓ వ్యక్తి వచ్చారు. నా కాళ్ల వంకే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఎప్స్టీన్ లోపలికి నడుచుకుంటూ వచ్చారు. ‘‘లేదు.. లేదు.. ఆమె నీకోసం రాలేదు’’ అంటూ ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ సమయంలో ‘‘ఆ పిల్లకి 16 ఏళ్లు ఉంటుందా?’’ అని ఆయన ఎప్స్టీన్ను అడగడం నేను విన్నాను అని ఫార్మర్ చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి ఎవరో కాదని.. డొనాల్డ్ ట్రంప్ అని ఆమె బాంబ్ పేల్చారు.అయితే ఎప్స్టీన్తో ఉండగా ట్రంప్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఏనాడూ తాను చూడలేదని, కానీ, ఆరోజు జరిగింది మాత్రం తాను జీవితాంతం గుర్తు పెట్టుకున్నానని అన్నారామె. ‘‘ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే విషయాన్ని నేను 1996, 2006లో ఎఫ్‌బీఐ ముందు చెప్పాను. కానీ, ఇప్పటిదాకా ఆయన్ని దర్యాప్తు సంస్థ విచారించలేదు. ఎందుకు?’’ అని ప్రశ్నించారామె. అయితే..ఎప్స్టీన్ వ్యవహారంలో(ఫైల్స్‌లోనూ) ఇప్పటిదాకా ట్రంప్ పాత్ర ఉన్నట్లుగానీ, కనీసం అనుమానితుడిగానైనా ఆయన పేరు ఉన్నట్లుగానీ ఏ దర్యాప్తు సంస్థ చెప్పలేదు. ఇక మరియా ఫార్మర్ తాజా ఆరోపణలను వైట్‌హౌజ్ వర్గాలు కొట్టిపారేశాయి. ‘‘ఎప్స్టీన్ ఆఫీస్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఏనాడూ వెళ్లింది లేదు. పైగా అతని(ఎప్స్టీన్)పై ఆరోపణలు రాగానే తన క్లబ్ నుంచి ట్రంప్ బయటకు పంపించేశారు కూడా’’ అని కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ షెవుంగ్ మీడియాకు తెలిపారు. ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లీవిట్ న్యూయార్క్ టైమ్స్ కథనాలను తీవ్రంగా తప్పుబట్టారు. జెఫ్రీ ఎప్స్టీన్కు ట్రంప్ నడుమ మధ్య సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకు.. తిరగదోడి మరీ చెత్తను ప్రచురిస్తున్నారంటూ మండిపడ్డారు.ట్రంప్-ఎప్స్టీన్ మధ్య సంబంధాల గురించి చర్చ దశాబ్దాలుగా నడుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి పలు పార్టీల్లో పాల్గొన్న ఫొటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ విషయంలో ట్రంప్ మద్దతుదారులే తరచూ ఆయన్ని తరచూ విమర్శిస్తుండడం గమనార్హం. అయితే ట్రంప్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. లైంగిక ఆరోపణల తర్వాత అతనికి(ఎప్స్టీన్) దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.2003లో ఎప్స్టీన్కు ట్రంప్ బర్త్‌డే విషెస్.. అది కూడా విచిత్రంగా చెప్పారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ఇచ్చింది. ఈ కథనంపై భగ్గుమన్న ట్రంప్.. సదరు వార్తా సంస్థపై 10 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ మరియా ఫార్మర్ ఇంటర్వ్యూను ప్రచురించడంపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ఈ స్కామ్‌కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి.ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్‌వెల్‌పై.. అమ్మాయిలను, బాలికలను సరఫరా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. చైల్డ్సెక్స్ ట్రాఫికింగ్ కేసులో 2021లో ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తోంది. ఈ కేసులో ఉపశమనం కోసం ఆమె సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా.. అది విచారణ దశలో ఉంది.

‘అతిథే కాదు లగేజీ దేవోభవ’.. 30 ఏళ్లలో ఒక్క బ్యాగూ మిస్సవని విమానాశ్రయం
టోక్యో: ప్రపంచంలోని ఏ విమానాశ్రయానికీ దక్కని ఘనతను జపాన్‌లోని ఆ విమానాశ్రయం సొంతం చేసుకుంది. అదే కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (కిక్స్). గడచిన 30 ఏళ్లలో ఈ విమానాశ్రయంలో ఒక్క లగేజీ కూడా మిస్ కాలేదంటే ఒక పట్టాన నమ్మలేం.. కానీ ఇది ముమ్మాటీకీ నిజం. 2024లో ఈ విమానాశ్రయం ప్రపంచంలోని ఉత్తమ లగేజీ డెలివరీ విమానాశ్రయంగా గుర్తింపు పొందుతూ మరోమారు ‘స్కైట్రాక్స్’ అవార్డును దక్కించుకుంది.ఒసాకాలోని ఈ కన్సాయ్ విమానాశ్రయం 1994లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటివరకు ఇది ఏటా మూడు కోట్ల ప్రయాణికులకు సేవలు అందిస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ విమానాశ్రయం ఎనిమిది సార్లు ‘స్కైట్రాక్స్’ అవార్డును గెలుచుకుంది. లగేజీ పికప్‌కు ముందు వేచి ఉండే సమయం, లగేజీ డెలివరీ సామర్థ్యం, పోగొట్టుకున్న లగేజీల ఆధారంగా వివిధ గణాంకాలు సేకరించి, ఈ అవార్డును అందజేస్తారు. ఈ విమానాశ్రయం 2023 ఆర్థిక సంవత్సరంలో సుమారు కోటి లగేజీలను అందజేసింది.కిక్ విమానాశ్రయం ట్రాక్ రికార్డ్ ఇంత విజయవంతం కావడానికి కారణం ఇక్కడి ‘మల్టీలేయర్డ్ చెకింగ్ వర్క్’. ప్రతి బ్యాగేజీని పరిరక్షించేందుకు విమానాశ్రయ విభాగం ముగ్గురు సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించింది. తప్పులను, పొరపాట్లను నివారించేందుకు బహుళ సిబ్బంది సమాచారాన్ని పంచుకోవడం చాలా ముఖ్యమని లగేజీ కార్యకలాపాలను పర్యవేక్షించే సుయోషి హబుటా నిక్కీ తెలిపారు. విమానం వచ్చిన 15 నిమిషాలలోపు ప్రయాణికుల లగేజీలను వారికి అందించడం వారి లక్ష్యంగా ఈ విమాశ్రయ సిబ్బంది పనిచేస్తుంటారు. జపాన్ ప్రజలు అనుసరించే ఆతిథ్య కళ ‘ఓమోటేనాషి’ని ఇక్కడి సిబ్బంది ఆకళింపు చేసుకున్నారు. ప్రయాణికుల లగేజీని వారికి అందించడమనేది ఒక హామీ అని వారు నమ్ముతారు. ఇక్కడి ప్రతి సూట్‌కేస్‌ను ఇటు డిజిటల్ పద్దతిలో, అటు భౌతికంగానూ డ్యూయల్ ట్యాగింగ్ సిస్టమ్‌తో ట్రాక్ చేస్తారు. ఫలితంగా ఏ బ్యాగు కూడా మిస్సయ్యే అవకాశం ఉండదు. ఇక్కడి సిబ్బందికి లాజిస్టిక్స్‌లో మాత్రమే కాకుండా మానవ తప్పిదాలను ఊహించడంలోనూ శిక్షణ అందిస్తారు. బ్యాగేజీ విషయంలో అవకతవకలు జరిగితే, బ్యాగ్ విమానం నుండి బయటకు వెళ్లే ముందే హెచ్చరిక వ్యవస్థ అప్రమవుతుంది. పర్యాటకులు ఈ విమానాశ్రయాన్ని ‘ప్రయాణికులతో పాటు వారి లగేజీని కూడా గౌరవించే విమానాశ్రయం’ అని ప్రశంసిస్తుంటారు.
జాతీయం

498(ఏ) కేసుల్లో హడావుడి అరెస్ట్‌లు వద్దు: సుప్రీం
వరకట్న వేధింపుల కేసుల విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ 498 (ఏ) కేసు దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా 2022లో అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థించింది. వరకట్న వేధింపుల కేసుల్లో భర్త లేదా అతడి కుటుంబ సభ్యులను తొందరపడి అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది.దేశంలో ఇటీవలి కాలంలో వరకట్న వేధింపుల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం ఒకటైతే.. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భర్త, అత్తమామలు, ఇతర బంధువులపై 498 (ఏ) కేసులు వేయడమూ మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇవి తప్పుడు కేసులని న్యాయస్థానాల్లో తేలడం, పిటిషనర్లకు హెచ్చరికలు, జరిమానాలు విధించడమూ వినే ఉంటాం. దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం 498 (ఏ) దుర్వినియోగమవుతోందని, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది కూడా. ఈ నేపథ్యంలో మంగళవారం చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ ఎ.జి.మసీహలతో కూడిన బెంచ్ కొన్ని కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి ప్రకారం..- ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత కనీసం రెండు నెలలపాటు ఎలాంటి అరెస్ట్‌లు చేయకూడదు. ఈ సమయం వివాద పరిష్కారానికి అవకాశం కల్పిస్తుంది.- ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత ఫిర్యాదులను ముందుగా ప్రతి జిల్లాలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలకు రిఫర్ చేయాలి. ఈ కమిటీలో శిక్షణ పొందిన మధ్యవర్తులు, న్యాయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు లేదా వారి సహచరులు ఉండాలి.- ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ సభ్యులను సాక్షులుగా న్యాయస్థానాలు పిలవకూడదు.- వివాద పరిష్కారానికి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలో జరిగే చర్చల్లో ఇరు పక్షాల వారు కనీసం నలుగురు బంధువులు (పెద్దవాళ్లు)లను భాగస్వాములుగా చేయాలి. ఆ తరువాత ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ తదుపరి చర్యల కోసం పోలీసులు, మేజిస్ట్రేట్లకు వివరణాత్మకమైన నివేదిక సమర్పించాలి. (ఇదంతా రెండు నెలల్లోపు పూర్తి కావాలి)- ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ చర్చలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడరాదు. అయితే సాధారణ విచారణను మాత్రం పోలీసులు కొనసాగించవచ్చు. - కమిటీ సభ్యులకు, విచారణ అధికారులకు ప్రత్యేకమైన శిక్షణ కల్పించాలి.- వివాదం ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలోనే సమసిపోతే జిల్లా జడ్జీలు క్రిమినల్ కేసులను మూసివేయవచ్చు.దుర్వినియోగం తగ్గుతుందా?498(ఏ) దుర్వినియోగం తగ్గేందుకు ఈ కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఏమాత్రం సంబంధం లేని కుటుంబ సభ్యులు తగిన పద్ధతి లేకుండానే అనవసరమైన వేధింపులకు గురవుతూంటారని, అలాంటి వాటిని ఈ మార్గదర్శకాల అమలుతో అరికట్టవచ్చునని వారు వివరిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సుప్రీంకోర్టు తాజా నిర్ణయానికి దారి తీసిన కేసులో భర్తతోపాటు అతడి తండ్రిని కూడా సుమారు వంద రోజులపాటు జైలు నిర్బంధం అనుభవించాల్సి వచ్చింది. వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భార్య వేసిన కేసులో హత్యాయత్నం, మానభంగం వంటి ఆరోపణలూ చేయడంతో ఆ పరిస్థితి ఏర్పడింది.

జస్టిస్ వర్మ కోసం టాప్ లాయర్లు.. విచారణకు సీజేఐ దూరం
జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల ఆరోపణల వ్యవహారంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు పార్లమెంట్లో ఆయన్ని అభిశంసించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు.. సుప్రీం కోర్టులో ఆయన వేసిన పిటిషన్‌పై ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం వైదొలిగారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయిస్తామని తెలిపారాయన. ‘‘బహుశా ఈ పిటిషన్‌ను నేను విచారణ చేయలేనుకుంటా. ఎందుకంటే.. జస్టిస్ సంజీవ్ ఖన్నా(మాజీ సీజేఐ) నేతృత్వంలో జరిగిన విచారణలో నేను భాగమయ్యాను. కాబట్టి దీన్ని వేరొక బెంచ్‌కు బదిలీ చేస్తా’’ అని పిటిషన్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్‌కు సీజేఐ స్పష్టం చేశారు. మార్చి 14వ తేదీన ఢిల్లీ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక బంగ్లాలో అగ్నిప్రమాదం సంభవించి.. కాలిన స్థితిలో నోట్ల కట్టలు కనిపించాయి. ‘న్యాయవ్యవస్థలో అవినీతి..’ అంటూ ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు.. ఆయన్ని హుటాహుటిన అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది. అదే సమయంలో ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు జడ్జిల కమిటీని ఏర్పాటు చేయించింది. ఆ కమిటీ తన నివేదికను అప్పటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించగా.. ఆయన దానిని లేఖ రూపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు పంపారు. ఆ నివేదిక ప్రకారం.. జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతికి పాల్పడ్డారని, స్వచ్ఛందంగా రాజీనామాకు ఆయన అంగీకరించలేదని, కాబట్టి ఆయన్ని తొలగించాలని ఇన్-హౌజ్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే తన వాదన వినకుండానే చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టులో జడ్జి యశ్వంత్ వర్మ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఇవాళ(బుధవారం) ఆయన తరఫు లాయర్ కపిల్ సిబాల్ సీజేఐ బెంచ్‌ను కోరారు. జస్టిస్ వర్మ తరఫున కపిల్ సిబాల్‌తో పాటు ముకుల్ రోహత్గి, రాకేష్ ద్వివేది, సిద్ధార్థ్ లూథ్రాలాంటి టాప్ లాయర్లు వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ పార్లమెంట్ సెషన్లోనే ఆయనపై అభిశంసనకు చర్యలు నడుస్తున్నాయి. ఇలాంటి అభిశంసన తీర్మానం కోసం లోక్‌సభలో కనీసం 100 మంది, రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యులు అభిశంసన నోటీసుపై సంతకం చేయాలి. అయితే జస్టిస్ వర్మ కేసులో ఇప్పటికే 145 మంది లోక్‌సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఇప్పటికే అభిశంసన నోటీసుపై సంతకం చేశారు. జడ్జి తొలగింపు కోసం భారత రాజ్యాంగంలోని 124, 217, 218 ఆర్టికల్స్ ప్రకారం నోటీసు దాఖలైంది. అయితే.. ఎంపీలు ఇచ్చిన అభిశంసన నోటీసును స్వీకరించిన కొన్ని గంటలకే రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి అయిన జగ్దీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.నెక్ట్స్ ఏంటంటే.. లోక్‌సభ స్పీకర్ , రాజ్యసభ ఛైర్మన్ సంయుక్తంగా ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఒకరు, ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఓ ప్రఖ్యాత న్యాయవేత్త ఉంటారు. ఈ కమిటీకి నివేదిక సమర్పించడానికి మూడు నెలల గడువు ఇస్తారు. అయితే ఈ కమిటీ ముందు తన వాదనలు వినిపించేందుకు జస్టిస్ యశ్వంత్ వర్మకు అవకాశం(మూడుసార్లు) ఉంటుంది. గతంలో త్రీజడ్జి కమిటీ సమర్పించిన నివేదికతో పాటు జస్టిస్ వర్మ వాదనలు, సాక్ష్యాలను పరిశీలించాకే స్పెషల్ కమిటీ ఒక నివేదికను సమర్పిస్తుంది. ఈపై ఇరు సభల్లో ఆ నివేదికపై చర్చ జరిగాక.. అభిశంసన తీర్మానాన్నిప్రవేశపెడతారు. దానిని 2/3 మెజారిటీతో సభ్యులు ఆమోదించాక రాష్ట్రపతికి పంపిస్తారు. అప్పుడు ఆయన తొలగింపుపై రాష్ట్రపతి సంతకం చేసి ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. అదే సమయంలో ఆయన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆగష్టు 21వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ తరుణంలో ఆయన్ని తొలగించడం ఈ సెషన్లో సాధ్యం కాకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీలో కుంభవృష్టి.. నీట మునిగిన రోడ్లు.. అంతటా ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో నేటి(బుధవారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. వరుసగా రెండవరోజు కూడా ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం కూడా రాజధానిలో వర్షాలు పడతాయని అంచనా వేసింది. #WATCH | Delhi: Rain lashes parts of the national capital. (Visuals from Rao Tula Ram Marg) pic.twitter.com/V3AlLZAAcE— ANI (@ANI) July 23, 2025భారీ వర్షానికి నోయిడాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రుతుపవనాలు తీవ్రతరం కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలోని కురిసిన వర్షానికి ఎక్స్ ప్రెస్ ఎన్క్లేవ్ రోడ్దు, కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ సమీపంలోని అనువ్రత్ మార్గ్‌లోని రెండు క్యారేజ్‌వేలలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఢిల్లీ వాతావరణ బేస్ స్టేషన్ అయిన సఫ్దర్జంగ్లో మంగళవారం ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:30 గంటల మధ్య 8.8 మిమీ వర్షపాతం నమోదైంది. ఉత్తర ఢిల్లీలోని రిడ్జ్‌లో 22.4 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు ఢిల్లీలో 136.3 మి.మీ వర్షపాతం నమోదైంది. Very heavy #rain in #Noida Filmcity #Monsoon#Delhirain#Raining#WeatherUpdate pic.twitter.com/RVR099hdSj— Shweta (@imshwetta) July 23, 2025

డిపాజిట్లు.. నామినీ ఉంటే బ్యాలెన్స్ మొత్తం వారికేనా?
ఒక లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు! మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఎల్ఐసీ, ఈపీఎఫ్, బ్యాంకు డిపాజిట్లలో మూలుగుతున్న మొత్తమిది. ఈ సొమ్ము మాది అని ఎవరూ అడక్కపోవడంతో అవి అలాగే పడి ఉన్నాయి. పైగా ఈ లెక్క మార్చి 2024 నాటిది. అప్పటికి బ్యాంకుల్లో రూ.62 వేల కోట్ల డిపాజిట్లు అన్క్లెయిమ్డ్గా ఉంటే ఏడాది తరువాత ఈ మొత్తం రూ.78 వేల కోట్లకు చేరుకుంది. ఎప్పటికైనా అవసరం పడుతుందని పెట్టిన ఈ పెట్టుబడులను ఎందుకిలా అనాథల్ని చేస్తున్నారు? అనూహ్యంగా మరణించారా? అలాంటప్పుడు వారసులైన ఎందుకు క్లెయిమ్ చేయలేదు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దామా?.మన ఇళ్లల్లో పెద్దవారు కొడుకులు, మనవళ్లు, మనవరాళ్లపై ప్రేమతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. భవిష్యత్తు అవసరాల కోసం తమ పేర్లపై డిపాజిట్లు చేసుకునేవారూ ఉంటారు. అయితే.. చాలా సందర్భాల్లో తాము ఫలానా వారి పేరుపై డిపాజిట్లు చేశామని చెప్పేవాళ్లు తక్కువ. తమ తదనంతరం మాత్రమే వారికి తెలియాలని ఆశిస్తూంటారు. అయితే.. ఏదైనా ఒక డిపాజిట్ పదేళ్లపాటు ఆక్టివ్‌గా లేదనుకోండి.. బ్యాంకు దాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్‌కు బదిలీ చేసేస్తుంది. ఆర్బీఐ నిర్వహిస్తున్న ఈ ఫండ్ డిపాజిట్‌దారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు పనిచేస్తోంది. ఆర్బీఐ వేర్వేరు బ్యాంకుల ద్వారా వచ్చి చేరే అన్క్లెయిమ్డ్ డిపాజిట్ మొత్తాలపై కొంత వడ్డీ కూడా చెల్లిస్తూంటుంది. భవిష్యత్తులో ఎవరైనా క్లెయిమ్ చేస్తే వారికి వడ్డీతోసహా చెల్లిస్తారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చాలా డిపాజిట్లకు సంబంధించి నామినీలు ఉంటారు కానీ.. మరణానంతరం వీరికి ఆ మొత్తం దక్కుతుందన్న గ్యారెంటీ ఉండదు. మరణించిన వారు విల్లు రాయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అంటే.. డిపాజిట్లపై నామినీగా మీ పేరు ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి మరణించిన తరువాత ఆ మొత్తం మీకు దక్కదన్నమాట. డిపాజిట్ చేసిన వ్యక్తికి చట్టపరంగా ఎంతమంది వారసులు ఉంటే అంత మందికి సమానంగా పంచాలని చట్టం చెబుతోంది. కాబట్టి... ఎవరైనా మరణానంతరం తమకిష్టమైన వారికి ఆస్తులు ఇవ్వాలని అనుకుంటే అందుకు మేలైన మార్గం విల్లు రాయడమే అంటున్నారు ఆర్థిక నిపుణులు...మీ పెద్దవారు ఎవరైనా మీ పేరుతో డిపాజిట్ చేసి మరణించారని అనుకుంటున్నారా? ఆ మొత్తం అన్క్లెయిమ్డ్గా ఉందని భావిస్తున్నారా?. అయితే ఆర్బీఐ నిర్వహిస్తున్న https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఫోన్ నెంబరు, కొన్ని ప్రాథమిక వివరాలు నమోదు చేసుకుని పాన్, ఓటర్ ఐడీ వంటి వివరాల ద్వారా ఎవరైనా మీ పేరుతో డబ్బు డిపాజిట్ చేశారా? అన్నది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ పేరుతో ఏదైనా డిపాజిట్ ఉండి అది అన్క్లెయిమ్డ్గా ఉంటే అకౌంట్ ఉన్న బ్యాంకు ద్వారా ఆ మొత్తాన్ని పొందవచ్చు. - గిళియారు గోపాలకృష్ణ మయ్యా.
ఎన్ఆర్ఐ

అమెరికా స్టోర్‌లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్ : నెట్టింట చర్చ
భారతదేశానికి చెందిన మహిళను దొంగతనం ఆరోపణల కింద అమెరికాలో అరెస్ట్ చేశారు. ఇల్లినాయిస్ లోని టార్గెట్ స్టోర్ నుండి 1,300 డాలర్ల (సుమారు రూ.1.11 లక్షలు) విలువైన వస్తువులను దొంగిలించినట్టు ఆరోపణలు నమోదైనాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైఐరల్గా మారింది. తీవ్ర చర్చకు దారితీసింది.స్టోర్ ఉద్యోగుల ప్రకారం, విలువైన వస్తువులను కొట్టేసే ఆలోచనతోనే ఆ మహిళ ఏడు గంటలకు పైగా స్టోర్‌లో సంచరిస్తూ, తన ఫోన్‌ను నిరంతరం తనిఖీ చేసుకుంటూ కనిపించింది. చివరికి డబ్బు చెల్లించ కుండానే పశ్చిమ గేటు నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నించిందని దీంతో వారు పోలీసులకు సమాచారం అందించించారు. దీంతో ఆమెను అమెరికా పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె చేతికి సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై నేరపూరిత దొంగతనం అభియోగం మోపారు. అయితే దీనిపై డబ్బులు చెల్లిస్తానంటూ క్షమాపణలు చెప్పిన మహిళ తాను ఇక్కడికి చెందిన దాన్ని కాదని, తన ఫ్యామిలీ ఇండియాలో ఉంది, వాళ్లకి ఫోన్ చేయాలి లేకపోతే నేను ఎక్కడ ఉన్నానో వారికి తెలియదు.. అమెరికాకు ఒంటరిగా వచ్చాను.. ఇంట్లో 20 ఏళ్ల కూతురు ఉంది అంటూ దీనంగా చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు. చదవండి: Vidya Balan మైండ్ బ్లోయింగ్.. గ్లామ్ అవతార్, అభిమానులు ఫిదా!ఈ ఏడాది మే 1న జరిగినట్టుగా చెబుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో చర్చకు దారి తీసింది. అలా ఎలా చేసింది? అని కొంతమంది ప్రశ్నించగా, మరికొంతమంది దేశం పరువుతీసింది అంటూ విమర్శించారు. ఈ ఘనకార్యం కోసమేనా పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వెళ్లింది. ఇలాంటి వారి వల్లనే అమెరికా సోషల్ మీడియా భారతీయుల పట్ల ద్వేషం, అసహ్యంతో నిండిపోయింది అని మరొకరు కమెంట్ చేశారు."ప్రపంచ వేదికపై భారతదేశానికి తలవంపులు తెచ్చి పెడుతోంది. విదేశాలలో దేశానికి అవమానం తీసుకురావద్దు. గౌరవంగా ప్రవర్తించండి అని మరొకరు హితవు పలకడం విశేషం. నోట్: అయితే ఆ మహిళ ఏ ప్రదేశానికి చెందినవారు, ఎవరు? అనే వివరాలేవీ అందుబాటులో లేవు.

నిమిషా ప్రియను క్షమించలేం
సనా: తన సోదరుడు తలాల్ అబ్దో మెహదీని దారుణంగా హత్య చేసిన కేరళ నర్స్ నిమిషా ప్రియను క్షమించలేమని అబ్దెల్ ఫతాహ్ మెహదీ తేల్చిచెప్పారు. ఆమె నుంచి క్షమాపణ గానీ, నష్టపరిహారం(బ్లడ్ మనీ) గానీ తాము కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలని అన్నారు. యెమెన్‌లో నిమిష తల్లి ప్రేమకుమారియెమెన్లో మాజీ వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మెహదీని 2017లో విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినందుకు నిమిషా ప్రియకు స్థానిక కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆమెకు బుధ వారం శిక్ష అమలు చేయాల్సి ఉండగా, చివరి నిమి షంలో వాయిదా పడింది. బాధితుడి సోదరుడు అబ్దెల్ ఫతాహ్ మెహదీ బీబీసీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఖిసాస్’ తప్ప ఇంకేమీ కోరుకోవడం లేదని చెప్పారు. షరియా చట్టం ప్రకారం తమకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. తన సోదరుడిని చంపినందుకు నిమిషా ప్రియను ఉరి తీయాల్సిందేనని, అంతకుమించి ఇంకేదీ అక్కర్లే దని వెల్లడించారు.

నిమిష మరణశిక్ష వాయిదా
యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్‌కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంతో శిక్ష వాయిదా పడినట్లు సమాచారం.నిమిష శిక్ష వాయిదా పడ్డ విషయాన్ని యెమెన్‌లో ‘‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’’ సభ్యుడు శ్యామూల్ జోరెమ్ భాస్కరన్ ధృవీకరించారు. అయితే.. బాధిత కుటుంబం బ్లడ్‌మనీ(పరిహారం సొమ్ము)కుగానీ, శిక్షరద్దుకుగానీ అంగకరించలేదని ఆయన తెలిపారు. చర్చల్లో ఇంకా పురోగతి రావాల్సి ఉందని అంటున్నారాయన.కేరళకు చెందిన ఇండియా గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు తమ ప్రతినిధులతో క్షమాభిక్ష కోసం రాయబారం జరుపుతున్నారు. తలాల్ అబ్దో మహ్దీ కుటుంబంతో మతపెద్దలు ఉత్తర యెమెన్‌లో అత్యవసర భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిక్ష వాయిదా పడడం గమనార్హం. మరోవైపు.. నిమిషా ప్రియ విషయంలో భారత విదేశాంగశాఖ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంఈఏ అక్కడి జైలు అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హౌతీ నియంత్రణలోని యెమెన్‌తో భారతకు అంతగా దౌత్యపరమైన సత్సంబంధాలు లేవు. ఈ తరుణంలో తామ చేయగలిగినదంతా చేశామని, ఇంతకు మించి చేయలేమని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. అయితే.. నిమిష కేసును బాధాకరంగా పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అనధికారిక మార్గాలను పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్‌పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్‌డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. అయితే తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహ్దీని హత్య చేసిన నేరంలో నిమిషా ప్రియాకు మరణశిక్ష పడింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. కేరళ ప్రభుత్వం సైతం కేంద్రానికి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ వచ్చినా.. కేంద్రం యెమెన్ న్యాయవిభాగానికి విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. భర్తతో నిమిషఇంకోవైపు క్షమాభిక్షపైగానీ, బ్లడ్‌మనీపైగానీ చర్చించేందుకు సైతం తలాల్ కుటుంబం ఇంతకాలం ముందుకు రాలేదు. అయితే తాజా భేటీలో ఆయన సోదరుడు, ఇతర కుటుంబ సభ్యలు మొదటిసారి పాల్గొన్నట్లు తెలస్తోంది. ఈ పురోగతితో నిమిష శిక్ష రద్దయ్యే అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి.

Dallas: డాలస్‌లో ఘనంగా “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం
డాలస్‌లో ఆదివారం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్య్వర్యంలో ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం కన్నుల పండుగగా జరిగింది.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి అతిథులకు ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ కూచిపూడి నాట్య రంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన నాట్య గురు, శ్రీకాకుళం జిల్లాలో నెలకొనిఉన్న ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’ డైరెక్టర్ అయిన స్వాతి సోమనాథ్ తన శిష్యులైన కొర్రా బలరాం, నిమ్మల అంజలి లు చేసిన వివిధ నృత్య ప్రదర్శనలు రెండు గంటలపాటు ఆహుతులను అలరించాయి అన్నారు.స్వాతి సోమనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనలమేరకు శ్రీకాకుళం జిల్లాలో 11 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొల్పబడిన ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’ ప్రపచంలోనే తొలి కూచిపూడి గురుకులం అని, వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది విద్యార్ధినీ, విద్యార్ధులు శ్రద్ధాసక్తులతో నాట్యం నేర్చుకుంటూ కూచిపూడి నాట్యంలో డిగ్రీలు సంపాదించుకుని, దేశ విదేశాలలో తమ ప్రతిభా పాటవాలను చూపుతున్నారని, ఇటీవల డిట్రాయిట్ లో జరిగిన తానా మహా సభలకు ఆహ్వానం అందుకుని తొలిసారి అమెరికాలో అడుగుపెట్టిన పిల్లలకు డాలస్ నగరంలో డా. ప్రసాద్ తోటకూర, వారి బృందం చూపిన ఆదరణ ఎన్నటికీ మరువలేనిది అంటూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు గంటల పాటు కన్నుల పండుగగా సాగిన నాట్యవిభావరి లో “శ్రీ గణనాధం” - త్యాగరాజ కృతి కనకాంగి రాగం, ఆది తాళంలో ఉన్న వినాయకుడి స్తుతితో ప్రారంభమైంది. “ఒక పరి ఒక పరి” – ఖరహర ప్రియ రాగం, ఆది తాళంలో అన్నమాచార్య కీర్తన శ్రీ వేంకటేశ్వర స్వామి అందాన్ని వర్ణిస్తుంది. ముదురు రంగులో అలమేలుమంగ సరసమైన ఛాయతో మెరుపుల పరంపరతో ఆలింగనం చేయబడిన చీకటిమేఘంతో పోల్చబడింది. “క్షీర సాగర శయన” – దేవ గాంధారి రాగం, ఆది తాళాల్లో ఉన్న ఈ త్యాగరాజ కృతి - గజేంద్ర మోక్షం, ద్రౌపది వస్త్రాపహరణం అంశాలలో చక్కగా చూపబడింది. “అద్వైతం - యోగా నృత్యం” - ప్రపంచ శాస్త్రీయ నృత్యాల చరిత్రలో మొదటిసారిగా యోగా, భారతీయ శాస్త్రీయసంగీతం యొక్క ఏడు స్వరాలు, ఆ స్వర చిహ్నాల కలయిక ఈ అంశంలో వినూత్నంగా చూపబడింది. మానవ శరీరంలో మూలాధారంతో ప్రారంభమై సహస్రారంతో ముగుస్తుంది. 7 శక్తి కేంద్రాలు నాట్యశాస్త్రం యొక్క వివిధ నృత్య భంగిమలతో చూపించబడ్డాయి.“తెలుగు కవన నర్తనం” - తెలుగు భాషా సాహిత్యం, కవిత్వం, సంగీతానికి ముఖ్యమైనది. త్యాగరాజస్వామి కృతి ‘ఎందరో మహానుభావులు’, ‘ఎంకి నాయుడు బావ’ యుగళగీతం, అన్నమయ్య 'బ్రహ్మం ఒక్కటే’, విశ్వనాథ వారి ‘కిన్నెరసాని’, మంగళంపల్లి బాలమురళి గారి ‘తిల్లానాతో’ మొదలై భక్త రామదాసు పాటలతో తెలుగుసాహిత్యంలోని వాగ్గేయకారులకు, కవులకు నివాళితో గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలి లు చేసిన కూచిపూడి నృత్యహేల అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ “మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, సాహిత్యం, కళలను నిరంతరం ప్రోత్స హిస్తున్న డా. తోటకూర ప్రసాద్ నేతృత్వంలో యింతటి గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసినందులకు వారిని, మహాత్మాగాంధీ మెమోరియల్, తానా, ఆటా, టిపాడ్, ఇండియా అసోసియేషన్, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సభ్యులను ప్రత్యేక అభినందనలు అన్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న పిల్లలను చేరదీసి కూచిపూడి నాట్యంలో ఎంతో అకుంటిత దీక్షతో ఆణిముత్యాలను తయారుచేస్తున్న స్వాతి సోమనాథ్ కృషి ఎంతో కొనియాడదగ్గది అని ప్రశంసించారు. ప్రముఖ కూచిపూడి నాట్యగురు కళారత్న కె.వి సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతి సోమనాథ్ తో చిరకాల పరిచయం అని, ఇద్దరం కలసి కొన్ని ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశామని, ఈ రోజు డాలస్ లో కలుసుకోవడం ఆనందంగా ఉందని, కూచిపూడి నాట్యాన్ని ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళే ఆమె కృషి సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.గౌరవ అతిథులుగా విచ్చేసిన బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, నాట్యగురు కె.వి సత్యనారాయణలు వివిధ సంఘాల నాయకులతో కలసి నాట్య గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలిలలను ఘనంగా సన్మానించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంఘ నాయకులు – డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వల, తయాబ్ కుండావాల, బి ఎన్ రావు, మహేంద్ర రావు, మురళి వెన్నం, అనంత్ మల్లవరపు తో పాటు ఐఎఎన్టి నాయకులు షబ్నం మాడ్గిల్, సుష్మా మల్హోత్రా, డా. జే పి, ముర్తుజా, ఆటా, టి పాడ్ నాయకులు రఘువీర్ బండారు, వేణు భాగ్యనగర్, శారదా సింగిరెడ్డి, పాండు పాల్వాయి, సత్య పెర్కారి, తానా నాయకులు లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, టాన్ టెక్స్ నాయకులు చంద్ర పొట్టిపాటి, సుబ్బు జొన్నలగడ్డ, భీమ పెంట, ఆనందమూర్తి, లలిత మూర్తి కూచిభొట్ల, చిన సత్యం వీర్నపు, నరసింహా రెడ్డి ఊరిమిండి, పుర ప్రముఖులు లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, చంద్రహాస్ మద్దుకూరి, జాకీర్ హుస్సేన్, మడిసెట్టి గోపాల్, అత్తలూరి విజయలక్ష్మి, భార్గవి పేరి, నాగరాజు నలజుల, పూర్ణా నెహ్రు మొదలైన వారు హాజరై ఈ కార్యక్రమాన్ని ఆసాంతం ఆస్వాదించారు.బి.ఎన్ రావు తన వందన సమర్పణలో ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన కాక తీయహాల్ నిర్వాహకులకు, డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి, ఫన్ ఏషియా, సురభి రేడియో యాజమాన్యాలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు, హాజరైన కళాపోషకులకు, అద్భుతమైన నాట్య ప్రదర్శనలు చేసిన కళాకారులు నాట్య గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలిలకు, గౌరవ అతిథులుగా విచ్చేసిన బిజెపి నాయకులు పాతూరి నాగభూషణం, నాట్యగురు కె.వి సత్యనారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్

బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!
చిత్తూరు అర్బన్: అతడికి 19 ఏళ్లు. ఆమెకు 38 ఏళ్లు. అయినా వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సమాజం తమ పెళ్లిని అంగీకరించదని భావించి ఎవరికీ కనిపించనంత దూరానికి వెళ్లిపోదామనుకున్నారు. కానీ.. విధి అడ్డు తగలడంతో చేసేదేమీలేక ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ ఘటన జరిగింది.వివరాల ప్రకారం.. చిత్తూరుకు చెందిన యువకుడు(19) ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కళాశాలలో నాన్–టీచింగ్ స్టాఫ్‌గా మహిళ(38) పనిచేస్తోంది. ఈమెకు వివాహమవ్వగా.. భర్తతో విడిపోయి జీవనం సాగిస్తోంది. రోజూ కాలేజీకి వెళుతున్న విద్యార్థికి, ఆ మహిళతో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. వీరిరువురి వయసు తేడా దాదాపు 20 ఏళ్లు ఉండటంతో తమ పెళ్లికి సమాజం ఒప్పుకోదని భావించిన వీరు మూడు రోజుల క్రితం ఎవ్వరూ తమకు అభ్యంతరం చెప్పని ఓ ప్రదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే వెళ్లిపోయారు.కానీ, ఇంతలో తమ కుమారుడు మూడు రోజులుగా కనిపించడంలేదని యువకుడి తల్లిదండ్రులు చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. వీరి ప్రేమ విషయం బయటపడింది. సాంకేతిక ఆధారంగా వీరు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. అక్కడి నుంచి ఇరువురినీ చిత్తూరుకు తీసుకువచ్చి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. సీఐ నెట్టికంటయ్య కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో యువకుడిని ఇంటికి పంపించారు. ఆ మహిళ కూడా తన ఇంటికి వెళ్లిపోయింది.

మహిళా వీవోఏపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
ఇబ్రహీంపట్నం: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులపై నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా దళిత మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మహిళపై చిలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కాటేపల్లి సుబ్బారావు ఏడాదిగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని వేధింపులు భరించలేక గత శనివారం తెల్లవారు జామున అధిక మొత్తంలో నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యశాలకు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సుబ్బారావుపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎస్సీ కులానికి చెందిన తనను ఏడాది కాలంగా మానసికంగా వేధిస్తున్నాడని, అసభ్యపదజాలంతో అశ్లీల సూచనలు చేస్తూ తనను ఒంటరిగా ఇంటి వద్ద కలవాలని మానసికంగా హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ప్రభుత్వం మాది, నీ ఉద్యోగం ఉండాలంటే నాతో ఇంటి వద్ద రాత్రి ఒంటరిగా కలవాలని, నేను చెప్పినట్లు వినాలి’ అని బెదిరించినట్టు వివరించారు. ఆరు నెలల క్రితమే విషయాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయన స్పందించకపోవడంతో ఈ మధ్య సుబ్బారావు ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా నరకం అనుభవించానని, గత్యంతరం లేక ఆత్మహత్యా యత్నం చేశానని గోడు వెళ్లబోసుకున్నారు. విషయం పక్కదారి పట్టించే యత్నం.. అసలు విషయం పక్కదారి పట్టించేందుకు సుబ్బారావు పలువురు డ్వాక్రా సభ్యులను ఆటోల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్త్రీ నిధి డబ్బులు వసూలు చేసి బ్యాంకులో జమ చేయకుండా నిధులు స్వాహా చేసిందని బాధితురాలి మీద ఆరోపణలు చేయించారు. సుబ్బారావు తమ తరఫున ఉన్నందున ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని డ్వాక్రా సభ్యులు పదేపదే ఆయనకు అండగా నిలిచే యత్నం చేశారు. శనివారం తెల్లవారు జామున బాధితురాలు నిద్రమాత్రలు మింగిన విషయం తెలుసుకున్న వీరు సోమవారం ఉదయం నగదు స్వాహా చేసిందని వెలుగు కార్యాలయంలో అధికారులకు డ్వాక్రా సభ్యులతో చెప్పించే యత్నం చేయడం గమనార్హం. స్త్రీ నిధి నగదు కొంత తన వద్ద ఉన్న మాట వాస్తవమే అని, వాటిని తిరిగి సంస్థకు జమ చేస్తానని బాధితురాలు మీడియాకు తెలిపారు. తన వ్యక్తిగత సమస్యకు డ్వాక్రా నిధులకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేశారు. సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రెక్కీ చేసి.. పక్కా స్కెచ్ గీసి..
సూర్యాపేటటౌన్: ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ జరిగింది. 8 కిలోల బంగారం, ఆభరణాల తోపాటు రూ.18 లక్షల నగదును దొంగలు అపహరించారు. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ రూ.7.20 కోట్లు ఉంటుందని యజమాని అంటున్నారు. సూర్యాపేటకు చెందిన తెడ్ల కిషోర్ పట్టణంలోని ఎంజీ రోడ్డులో శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. కిషోర్ సోమవారం ఉదయం 9 గంటలకు దుకాణం తెరిచి లాకర్ గదిలోకి వెళ్లి చూడగా గోడకు పెద్ద రంధ్రం చేసి ఉంది. లాకర్ రూంకు ఉన్న షట్టర్ కట్ చేసి ఉంది. దీంతో దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చాడు.తెలిసినవారా.. ప్రొఫెషనల్ ముఠానా?దొంగలు పక్కా స్కెచ్‌తో బంగారం షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. బంగారం దుకాణం మెయిన్ రోడ్డుకు ఉంటుంది. దొంగలు షాపు వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో నుంచి వచ్చి బాత్రూంలోకి వెళ్లి తలుపును కట్ చేసి అందులో నుంచి లాకర్ రూంలోకి వెళ్లారు. లాకర్ రూం షట్టర్‌ను గ్యాస్ కట్టర్‌తో తొలగించి లోనికి ప్రవేశించి బీరువాలో ఉన్న 8 కిలోల బంగారం, ఆభరణాలతోపాటు రూ.18 లక్షల నగదు అపహరించారు. ఈ చోరీని ప్రొఫెషనల్ దొంగల ముఠా చేసిందా లేక తెలిసిన వ్యక్తులే చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పకడ్బందీగా.. బాత్రూం నుంచి వెళితే లాకర్ గది వస్తుందని దొంగలకు ఎలా తెలుస్తుందని పోలీసులు ఆరా తీస్తున్నారు. బాత్రూంలో నుంచి లోపలికి ప్రవేశించే ముందు అక్కడున్న జగ్గుతో సీసీ కెమెరాను మూసేశారు. లాకర్ గదిలోని రెండు బీరువాల్లో ఒక్కోదాంట్లో 8 కిలోల చొప్పున 16 కిలోల బంగారం ఉండగా.. ఒక బీరువాలోని 8 కిలోల బంగారాన్ని మాత్రమే ఎత్తుకెళ్లారు. దొంగలు గ్యాస్ కట్టర్, రెండు సిలిండర్లను అక్కడే వదిలేశారు. సిలిండర్‌పై ఉన్న నంబర్ ఆధారంగా దాన్ని కోదాడలో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బంగారం షాపు వెనకాల ఖాళీ స్థలంలో రెండు తులాల రింగ్, చెవి దుద్దులు పడిపోగా వాటిని స్వాధీనం చేసుకున్నారు.మూడు రోజులుగా రెక్కీముగ్గురు వ్యక్తులు మూడు రోజుల క్రితం దుకాణం పక్క సందులో ఉన్న బాలాజీ గ్రాండ్ హోటల్ సమీపంలో రూంను అద్దెకు తీసుకున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురు బంగారు షాపులో దొంగతనం చేసేందుకు మూడు రోజులుగా రెక్కీ నిర్వహించినట్టు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆదివారం రాత్రి కూడా ఈ ముగ్గురు వ్యక్తులు రెండు గ్యాస్ సిలిండర్లు, కట్టర్ పట్టుకొని బాలాజీ గ్రాండ్ హోటల్ సందులో నుంచి నడుచుకుంటూ వెళ్లినట్టు తెలుస్తోంది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అక్కడ ఆధారాలను సేకరించాయి. దొంగలు ఆదివారం రాత్రి 12.09 గంటలకు షాపులోపలికి వచ్చినట్టుగా సీసీ కెమెరాల్లో రికార్డయింది. బంగారు షాపును సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం పరిశీలించారు. కేసును ఛేదించడానికి ఐదు పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దొంగలను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.సెక్యూరిటీ ఎందుకు లేదు..బంగారు షాపు యజమాని అంత పెద్ద మొత్తంలో షాపులో బంగారాన్ని పెట్టి కనీసం సెక్యూరిటీ గార్డ్‌ను కూడా పెట్టకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. లాకర్‌కు అలారం సిస్టం కూడా ఏర్పాటు చేసుకోలేదు. జ్యువెలరీ షాపు యజమాని కిషోర్ అక్కడికి సమీపంలో మరో దుకాణాన్ని ఏర్పాటుచేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అందులో భాగంగానే పెద్దమొత్తంలో బంగారం, ఆభరణాలు తీసుకొచ్చి ప్రస్తుత షాపులో పెట్టాడని అంటున్నారు.

రాత్రి 11కి ఎవరితో మాట్లాడుతున్నావ్..!
వికారాబాద్: ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నా వని ప్రశ్నించినందుకు భర్తను గొంతు నులిమి చంపేసిందో భార్య. కూతురుకు మంచీచెడు చెప్పాల్సిన తండ్రి ఇందుకు సహకరించడం గమనార్హం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ నగేశ్, స్థానికుల వివరాల ప్రకారం.. మల్కాపూర్‌కు చెందిన రెడ్డిపల్లి వెంకటేశ్ (33)కు ఇదే మండలం కోత్లాపూర్ గ్రామానికి చెందిన జయశ్రీతో 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఈశ్వర్ ప్రసాద్ (10), సుకుమార్ (7) కుమారులు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సంసారంలో ఓ ఫోన్ కాల్ చిచ్చురేపింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో నాలుగేళ్లు దూరంగా ఉన్నారు. ఇటీవలే నచ్చజెప్పిన ఇరుకుటుంబాల వారు దంపతులిద్దరినీ కలిపారు. జయశ్రీ తండ్రి పండరి సైతం వీరితో పాటే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆదివారం బోనాల పండుగ నేపథ్యంలో రాత్రి 11గంటల వరకు వెంకటేశ్ బయటే గడిపాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లగా భార్య ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం వెంకటేశ్ నిద్రపోయాడు. పక్క వీధిలో ఉండే మృతుడి సోదరులు శ్రీనివాస్, కృష్ణ సోమవారం ఉదయాన్నే వచ్చి తమ్ముడిని నిద్రలేపే ప్రయత్నం చేయగా చలనం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేశ్, ఎస్ఐలు రాథోడ్ వినోద్, సాజిద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ నాన్నను అమ్మ, తాత కలిసి గొంతు నులిమి చంపేశారని మృతుడి కుమారులు డీఎస్పీకి చెప్పారు. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.