'పుట్టబోయే బిడ్డ నీకంటే మంచి రంగు ఉండాలి, అందుకోసం..' | Masaba Gupta: People Advised Me to Eat rasgullas to Have Fairer Child | Sakshi
Sakshi News home page

Masaba Gupta: బిడ్డ తెల్లగా పుట్టడం కోసం చిట్కాలు.. వీళ్లనేమనాలి?

Sep 15 2024 5:38 PM | Updated on Sep 15 2024 6:01 PM

Masaba Gupta: People Advised Me to Eat rasgullas to Have Fairer Child

గర్భిణీ స్త్రీలు కనిపిస్తే చాలు ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తుంటారు. అందులో ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ ఎర్రగా, తెల్లగా ఉండాలంటే ఈ పండ్లు తినాలి, ఈ చిట్కాలు పాటించాలని ఏవేవో చెప్తుంటారు. ఫ్యాషన్‌ డిజైనర్‌, నటి మసాబా గుప్తాకు కూడా ఈ ఉచిత సలహాలు వస్తూనే ఉన్నాయట!

ఏం చేయాలి?
దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 'నిన్న నా దగ్గరకు వచ్చిన ఒకరు ప్రతిరోజు ఒక రసగుల్లా తింటే పుట్టబోయే బిడ్డ నాకంటే కొంత మెరుగైన రంగుతో పుడుతుందని చెప్పింది. అంతకుముందు మరొకరు కచ్చితంగా పాలు తాగాలని చెప్పారు. నా బిడ్డ నల్లగా పుట్టకూడదని ఆమె ఆకాంక్షించారు. తన అమాయక మాటలు విని నాకేం చేయాలో అర్థం కాలేదు. కోపంతో తనను కొట్టలేనుకదా..!

ఇప్పటికీ అదే ఘోరం..
ఈ నలుపు-తెలుపు విభేదాలు ఇప్పట్లో మారవు. నేను చేయాల్సిందల్లా ఒక్కటే! నా బిడ్డను స్ట్రాంగ్‌గా తయారుచేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది నల్లగా ఉన్నవారిని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. వారిని మానసికంగా ఓ మెట్టు కిందకు లాగుతారు. ఇదెంత ఘోరం.. 2024వ సంవత్సరంలోనూ ఇదే జరుగుతోంది. చదువుకున్నవారు, చదువుకోనివారు, ఉన్నవారు, విజ్ఞానులు.. ఇలా అందరి విషయాల్లోనూ ఇదే పునరావృతం అవుతూనే ఉంది' అని చెప్పుకొచ్చింది.

ఎవరీ  మసాబా గుప్తా
కాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్‌ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్‌ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా సిరీస్‌లో నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement