Nithya Menon Fashion: Fabulous Look In Masaba Gupta 10k Green Saree - Sakshi
Sakshi News home page

Nithya Menon: ‘హౌస్‌ ఆఫ్‌ మసాబా’ గ్రీన్‌ ఫ్లోరల్‌ సారీలో నిత్య.. ఈ బ్రాండ్‌ ప్రత్యేకత?

Published Mon, Jul 4 2022 3:24 PM | Last Updated on Mon, Jul 4 2022 4:01 PM

Fashion: Nithya Menon Fabulous Look In Masaba Gupta 10k Green Saree - Sakshi

ఈతరం సహజ నటి.. నిత్యా మీనన్‌. తెర మీద ఆమె కళ్లు.. నవ్వు.. నడక..  అన్నీ అభినయాన్ని ఒలకబోస్తాయి. ఏ భూమికను తీసుకుంటే ఆ భూమికే కనిపించేలా చేయడం  ఆమె ప్రత్యేకత. అలాంటి స్పెషల్‌ స్టయిలే ఆమె అనుసరించే ఫ్యాషన్‌ విషయంలోనూ ఉందా? అంటే ఉంది మరి. సాక్ష్యం ఇదిగో.. 

మసాబా గుప్తా
ఇప్పుడున్న టాప్‌ మోస్ట్‌ డిజైనర్స్‌లో మసాబా గుప్తానే ఫస్ట్‌. 2009లో ‘హౌస్‌ ఆఫ్‌ మసాబా’ పేరుతో బ్రాండ్‌ను ప్రారంభించింది. నాణ్యత, సృజనే బ్రాండ్‌ వాల్యూగా సాగిపోతోంది. అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. ఎందరో సెలబ్రిటీస్‌ను ఆమె డిజైన్స్‌కు అభిమానులుగా మారుస్తోంది.

మసాబా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్‌ లెజెండ్‌ వివియన్‌ రిచర్డ్స్‌ల కూతురు అని తెలుసు కదా! కానీ పేరెంట్స్‌ పేరుప్రఖ్యాతులను తన కెరీర్‌కు పునాదిగా మలచుకోలేదు.   కేవలం తన క్రియెటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జిస్తోంది.  

బ్రాండ్‌ వాల్యూ
చీర డిజైనర్‌ -మసాబా గుప్తా
ధర: రూ. 10,500

మంగత్రాయ్‌ జ్యూయెలరీ
ముత్యాలు, వజ్రాల వ్యాపారంలో వందేళ్లకు పైగా చరిత్ర గల సంస్థ మంగత్రాయ్‌ జ్యూయెలర్స్‌. దేశంలోనే కాదు గల్ఫ్, యూరోప్, అమెరికా దేశాల్లోనూ బ్రాంచ్‌లను నెలకొల్పింది. స్వచ్ఛత, నాణ్యత, నాజూకైన డిజైన్లే దీని బ్రాండ్‌ వాల్యూ.  సామాన్యులకూ, సెలబ్రిటీలకూ అందుబాటులోనే ధరలు. 

జ్యూయెలరీ: పర్ల్‌ నెక్లెస్‌ 
ధర: రూ. 14,100

బ్రాండ్‌: 
మంగత్రాయ్‌ జ్యూయెలరీ
బ్రేస్లెట్‌ ధర: రూ. 1,890

నిత్యం కొత్తగా ఉండాలనుకుంటాను. ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. సినిమా కెరీర్‌ నాకు బెస్ట్‌ టీచర్‌ అనే చెప్పాలి. చాలా నేర్పింది.. నేర్పిస్తూనే ఉంది.
– నిత్యా మీనన్‌
-దీపిక కొండి

చదవండి: Femina Miss India 2022: ఫెమినా మిస్‌ ఇండియాగా సినీ శెట్టి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement