Nithya Menon
-
వాళ్లు వదిలేశారు.. కీర్తి సురేశ్ స్టార్ అయ్యింది!
కష్టపడితే కొన్నిసార్లు అదృష్టం వరిస్తుంది. మరికొన్నిసార్లు అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఓ హీరో చేయాల్సిన మరో హీరో చేసి హిట్ కొట్టడం, ఓ హీరోయిన్ కి రావాల్సిన అవకాశం లాస్ట్ మినిట్ లో మరో బ్యూటీకి దక్కడం లాంటివి జరుగుతూ ఉంటాయి.ఇక కీర్తి సురేశ్ అదృష్టం విషయానికొస్తే.. బాలనటిగా మలయాళంలో సినిమాలు చేసిన ఈమె.. 'నేను శైలజ' అనే తెలుగు మూవీతో హీరోయిన్ అయింది. కానీ కీర్తి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రమంటే మాత్రం 'మహానటి' అని చెప్పొచ్చు. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. అంతలా పేరు తెచ్చిన ఈ సినిమాకు తొలి ఆప్షన్ కీర్తి సురేశ్ కాదని మీకు తెలుసా?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మహేశ్ డబ్బింగ్ చెప్పిన 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన)'మహానటి' కోసం నిత్యామేనన్ సహా తదితర హీరోయిన్ల పేర్లు పరిశీలించారు. కానీ చివరకు కీర్తి సురేశ్ దగ్గరకు వచ్చింది. అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంది. అలానే తమిళంలో విజయ్ తో చేసిన 'భైరవ'లో కూడా తొలుత త్రిషని అనుకున్నారు. కానీ కీర్తి సెట్ అయింది. హిట్ కొట్టేసింది.మహానటి తర్వాత చాన్నాళ్ల పాటు కీర్తి సురేశ్ కి సరైన మూవీస్ పడలేదు. దీంతో ఈమె పనైపోయిందనే కామెంట్స్ వినిపించాయి. అలాంటి టైంలో 'దసరా' సినిమా ఈమెకు కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇందులో తొలుత సమంతని తీసుకోవాలని అనుకున్నారు. కానీ అదృష్టం కీర్తిని వరించింది. అలా వేరే వాళ్లని అనుకుని వద్దనుకోవడం వాళ్లకు ఓ రకంగా బ్యాడ్ లక్ కాగా.. కీర్తి సురేశ్ కి విపరీతంగా కలిసొచ్చేసిందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
సినిమాలు మానేయాలనుంది, గతేడాదే ఈ పని చేయాలనుకున్నా!
మసాలా సినిమాల్లో నటించేదే లేదన్న నిత్యామీనన్ (Nithya Menen) ఇకమీదట అసలు సినిమాలే చేయనంటోంది. మొన్నటివరకు మంచి పాత్ర అయితే చాలు చిన్న సినిమా అయినా అంగీకరిస్తాన్న ఆమె ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక సినీ ఇండస్ట్రీని శాశ్వతంగా వదిలేస్తానంటోంది.అమ్మ వల్లే ఇదంతా..ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం కాదలిక్క నెరమిళ్లై (Kadhalikka Neramillai Movie) సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాడటం, డ్యాన్స్ చేయడం, యాక్ట్ చేయడం.. ఇవన్నీ కూడా మా అమ్మే చిన్నప్పటి నుంచి నాతో చేయించింది. నిజం చెప్పాలంటే నాకు సినిమా అంటే ఇష్టం లేదు. అయినా ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే ఉన్నాను.సినిమా నన్ను వదిలేలా లేదు!సినిమాలు మానేయాలని ఆలోచించిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. ఈసారి గప్‌చుప్‌గా పక్కకు వెళ్లిపోదామని ఆలోచిస్తున్నప్పుడే తిరుచిత్రంపళం మూవీకి జాతీయ అవార్డు వచ్చింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. నేను సినిమాలు మానేసినా.. సినిమా నన్ను వదిలేలా లేదు అని! ఇప్పటికిప్పుడు నాకు వేరే ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం వస్తే కచ్చితంగా దాంట్లోకి వెళ్లిపోతాను.(చదవండి: తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ల పెంపుపై విమర్శలు )అలాంటి జీవితం కావాలినాకు సాధారణ జీవితం గడపాలని ఉంది. నటిగా ఉన్నప్పుడు బయట స్వేచ్ఛగా జీవించలేం. నాకు పార్క్‌కు వెళ్లి వాకింగ్ చేయాలనుంటుంది. కానీ అది సాధ్యపడదు. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. పైలట్ అవ్వాలని కోరిక.. ఇలా ఎన్నో ఉంటాయి అని చెప్పుకొచ్చింది. నిత్య సినిమాలు మానేయాలనుకోవడం కొత్తేమీ కాదు..ఉత్తమ నటిగా జాతీయ అవార్డుకాగా తిరు సినిమాకుగానూ నిత్యామీనన్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించగా రాశీ ఖన్నా హీరోయిన్గా యాక్ట్ చేసింది. హీరో స్నేహితురాలిగా నిత్య ఆకట్టుకుంది. మిత్రన్ జవహర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇది 2022లో విడుదలైంది. నిత్య లేటెస్ట్ మూవీ కాదలిక్క నెరమిళ్లై విషయానికి వస్తే.. ఇందులో జయం రవి, వినయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. రెడ్ జియాంట్ సినిమా నిర్మిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.తెలుగులో..అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది.చదవండి: తిరుపతి తొక్కిసలాట: హృదయాన్ని కలిచివేసిందన్న మోహన్‌బాబు -
అలాంటి సినిమాల్లో నటించను : నిత్యా మీనన్
పాత్ర నచ్చితే చాలు చిన్న పెద్ద సినిమా అనే తేడా చూపకుండా నటిస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మీనన్. హీరో ఎవరైనా సరే నిత్యా మీనన్ పాత్ర మాత్రం చాలా ఆ సినిమాలో కీలకంగా ఉంటుంది. భారీ సినిమా, పారితోషికం ఎక్కువ అని సినిమాలు ఒప్పుకొదు. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలో నటిస్తుంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..తన సినిమాల ఎంపిక గురించి ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది.(చదవండి: అభిమానులకు విజయ్ పిలుపు.. మొదటి సభకు ఏర్పాట్లు)‘70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపిక అవుతానని ఊహించలేదు. అవార్డులు, రివార్డుల కోసం సినిమాల్లో నటించను. నేను పోషించిన పాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలనుకున్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొనే పాత్రలను ఎంపిక చేసుకుంటా. . భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో అవకాశం వచ్చినా నటించను. అలాంటి పాత్రలంటే నాకు ఆసక్తి ఉండదు. మంచి పాత్ర అయితే చిన్న సినిమా అయినా అంగీకరిస్తా’ అని నిత్యా మీనన్ అన్నారు. (చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి)కాగా, ‘తిరు’ సినిమాకుగాను నిత్యామీనన్‌కు జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా, రాఖీ ఖన్నా హీరోయిన్గా నటించింది. మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరో స్నేహితురాలిగా నిత్యమీనన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అలాగే ‘గోల్డెన్ వీసా’, ఇడ్లికడై అనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. -
70వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగు నుంచి ఒక్కటే
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 70వ నేషనల్ సినీ అవార్డ్స్ ప్రదానోత్సవం.. న్యూ ఢిల్లీలోని విజయ్ భవన్లో జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. విజేతలకు అవార్డులని ప్రకటించారు. ఈ వేడుకకు దాదాపు అన్ని సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు.తెలుగు నుంచి 'కార్తికేయ 2'కి ఉత్తమ ప్రాంతీయ చిత్ర కేటగిరీలో పురస్కారం దక్కింది. దర్శకుడు చందు మొండేటి దీన్ని అందుకున్నారు. 'తిరు' చిత్రానికి ఉత్తమ నటిగా నిత్యా మీనన్, 'కాంతార' మూవీకి గానూ ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టి అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రదానం చేశారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి అవార్డ్ ఇవ్వాలి. కానీ లైంగిక ఆరోపణల కేసు కారణంగా దీన్ని రద్దు చేశారు.ఎవరెవరికి ఏ విభాగాల్లో అవార్డులు? ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ) బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి) ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్మోహర్)ఉత్తమ ప్రాంతీయ సినిమాలుఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలుఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్- లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్) ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్) -
మత్తెక్కించేలా మాళవిక మోహనన్.. భర్తతో ప్రియాంక చోప్రా!
భర్తకి ముద్దులిచ్చేస్తున్న ప్రియాంక చోప్రాఇంకా పెళ్లి మూడ్‌లోనే హీరోయిన్ మేఘా ఆకాశ్విచిత్రమైన డ్రస్సులో జిగేలుమంటున్న జాక్వెలిన్బబ్లీ బ్యూటీ నిత్యా మేనన్ బ్లాక్ అండ్ వైడ్ పోజులుమేకప్ వీడియో పోస్ట్ చేసిన 'గుంటూరు కారం' మీనాక్షి చౌదరిమాళవిక మోహనన్ గ్లామర్ ట్రీట్.. చూపు తిప్పుకోలేం!మెరుపుల ఔట్ఫిట్లో శ్రియ.. ఇంత అందమేంటి బాబాయ్ View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sayani G (@sayanigupta) View this post on Instagram A post shared by Noorin Shereef (@noorin_shereef_) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ashrita Shetty (@ashritashetty_) View this post on Instagram A post shared by Raadhya (@raadhya33) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
చూసేందుకు సాధారణంగానే..!
కాస్త పొగరుబోతు నటిగా ముద్ర వేసుకున్న నటి నిత్యామీనన్. అది ఈమెలోని నటనా ప్రతిభ నుంచి వచ్చింది కావచ్చు. ఈమెను పొట్టి, బొద్దు అమ్మాయి అని కూడా అంటారు. అయితే వాటిని అస్సలు పట్టించుకోదు. అందుకే ఈ మలయాళ భామ తెలుగు, తమిళం భాషల్లోనూ కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. తిరుచ్చిట్రఫలం అనే తమిళ చిత్రంలోని నటనకుగానూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ అవార్డుల పట్టికలో ఉత్తమ నటి అవార్డుకు నిత్యామీనన్ పేరు చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ ‘‘చాలా సంతోషంగా ఉంది. ఇది నేను గెలుచుకున్న తొలి జాతీయ అవార్డు. చూడడానికి సాధారణంగా ఉన్నా, నటన వెనుక ఉన్న శ్రమ సాధారణం కాదని అర్థం చేసుకున్న జాతీయ అవార్డుల కమిటీకి ధన్యవాదాలు. ఉత్తమ నటన అనేది బరువు తగ్గడమో, పెరగడమో, సహజ సిద్ధమైన శరీరాకృతిని మార్చుకోవడంలోనే ఉండదు. అవంతా నటనలో ఒక భాగం మాత్రమే కానీ అవే నటన కాదు. దీన్ని నిరూపించడానికే నేను ప్రయతి్నస్తున్నాను. ఈ అవార్డు నాకు, దర్శకుడు భారతీరాజా, ప్రకాశ్‌రాజ్,ధను‹Ùకు చెందుతుంది. ఎందుకంటే ఒక చిత్రంలో నటుడికి సరిసమానంగా నటికీ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నేను ఇంతకు ముందెప్పుడూ నటించలేదు. అది తిరుచ్చిట్రంఫలం చిత్రంలో జరిగింది. మరో విషయం ఏమిటంటే నిజాల కంటే వదంతులు అధికంగా ప్రచారం అవుతుంటాయి. ఒక రంగంలో ఎదగడం చాలా కష్టం’’ అని నిత్యామీనన్ పేర్కొన్నారు. కాగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డును ప్రకటించిన విషయం ముందుగా ధనుష్ ఫోన్ చేసి చెప్పారన్నారు. ఆయన ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో విషయం ఏమిటని అడిగానన్నారు. అప్పుడు ఆయన ఈ అవార్డు గురించి వివరించారని నిత్యామీనన్ చెప్పారు. -
70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన భావోద్వేగానికి పట్టం
70వ జాతీయ అవార్డులకు గాను దేశవ్యాప్తంగా 28 భాషలకు చెందిన 300 చిత్రాల వరకూ పోటీ పడ్డాయి. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయిన చిత్రాలకు పోటీలో అవకాశం ఉంటుంది. అవార్డుల కోసం వివిధ విభాగాలకు సంబంధించిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి విజేతలను వెల్లడించింది. ఈసారి భావోద్వేగానికి పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధాన అవార్డులను పరిశీలిస్తే... ఎమోషనల్‌గా సాగే కథాంశాలకు, భావోద్వేగమైన నటనకు అవార్డులు దక్కినట్లుగా అనిపిస్తోంది. ఆ వివరాలు...ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడి కడియం కలియుగంలో అంతు చిక్కని సమ్యలకు ఎలా పరిష్కారం చూపించింది? అనే అంశంతో రూపొందిన డివోషనల్, ఎమోషనల్ తెలుగు మూవీ ‘కార్తికేయ 2’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. ఈ చిత్రంలో కనబర్చిన పవర్ఫుల్, ఎమోషనల్ నటనకుగాను రిషబ్ శెట్టి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించగా, సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానూ అవార్డు దక్కించుకుంది. ప్రేమ, ప్రేమలో విఫలం, కుటుంబ బంధాల నేపథ్యంలో మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబళమ్’లో కనబరిచిన గాఢమైన భావోద్వేగ నటనకు గాను నిత్యామీనన్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది.భర్త అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలుసుకున్నాక ఓ భార్య ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన గుజరాతీ చిత్రం ‘కచ్ ఎక్స్‌ప్రెస్’లో భార్య పాత్రలో కనబర్చిన భావోద్వేగానికి గాను ఉత్తమ నటిగా మానసీ పరేఖ్ అవార్డు అందుకోనున్నారు. ఓ నాటక రంగానికి సంబంధించిన ట్రూప్ నేపథ్యంలో ఆనంద్ ఇకర్షి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘ఆట్టమ్’కి ఉత్తమ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి. చనిపోయిన ఓ స్నేహితుడి చివరి కోరికను నెరవేర్చడానికి ముగ్గురు వృద్ధ స్నేహితులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి ట్రెక్కి వెళ్లే కథాంశంతో తెరకెక్కిన హిందీ చిత్రం ‘ఊంచాయి’. ఈ ఎమోషనల్ రైడ్‌ని అద్భుతంగా ఆవిష్కరించిన సూరజ్ బర్జాత్యా జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు సాధించారు. ఉత్తమ సంగీత దర్శకత్వం (పాటలు) అవార్డును హిందీ ‘బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ’కి సంగీత దర్శకుడు ప్రీతమ్, ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును తమిళ ‘΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్–1’కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దక్కించు కున్నారు.ఇక గత ఏడాది పది అవార్డులు దక్కించుకున్న తెలుగు పరిశ్రమ ఈసారి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సరిపెట్టుకుంది. ఇంకా పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.జాతీయ అవార్డులోని కొన్ని విభాగాలు.... ⇒ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ) ⇒నటీమణులు: నిత్యా మీనన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ – గుజరాతీ) ⇒చిత్రం: ఆట్టమ్ (మలయాళం)⇒దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఊంచాయి – హిందీ) ⇒దర్శకుడు (డెబ్యూ): ప్రమోద్ కుమార్ (ఫౌజా –హరియాన్వీ) సంగీత దర్శకత్వం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: శివ– హిందీ)⇒సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): ఏఆర్ రెహమాన్ (΄పొన్నియిన్ సెల్వన్ – 1, తమిళ్) నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ర– పార్ట్ 1: శివ – హిందీ) ⇒నేపథ్య గాయని: బాంబే జయశ్రీ (సౌదీ వెల్లక్క సీసీ 225/2009 – మలయాళం) ⇒సహాయ నటి: నీనా గు΄్తా (ఊంచాయి– హిందీ) ⇒సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి) ⇒బాల నటుడు: శ్రీపత్ (మాలికాపురమ్ – మలయాళం) ⇒సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (΄పొన్నియిన్ సెల్వన్ పార్ట్ – 1) ⇒కొరియోగ్రఫీ: జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ (తిరుచిత్రాంబళమ్ – తమిళ్) ⇒యాక్షన్ డైరెక్షన్: అన్బు–అరివు (కేజీఎఫ్ 2 – కన్నడ) ⇒విజువల్ ఎఫెక్ట్స్: బ్రహ్మాస్త్ర – పార్ట్ 1: శివ (హిందీ) ⇒మాటల రచయిత : అర్పితా ముఖర్జీ, రాహుల్ వి. చిట్టెల (గుల్మోహర్ – హిందీ) ⇒సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి – ΄పొన్నియిన్ సెల్వన్ – 1 (తమిళం) ⇒స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): ఆనంద్ ఏకార్షి (ఆట్టమ్ – మలయాళం) ⇒జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ్రపోత్సహించే చిత్రం: కచ్ ఎక్స్‌ప్రెస్ (గుజరాతీ) ⇒సంపూర్ణ వినోదాన్ని అందించి, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కాంతార (కన్నడ).ప్రాంతీయ ఉత్తమ చిత్రాలు⇒తెలుగు: కార్తికేయ–2 ⇒కన్నడ: కేజీఎఫ్ చాప్టర్–2 ⇒తమిళ్: ΄పొన్నియిన్ సెల్వన్ – 1 ⇒మలయాళం: సౌది వెళ్లక్క సీసీ 225/2009 ⇒హిందీ: గుల్మోహర్అవార్డు బాధ్యత పెంచింది – చందు మొండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సందర్భంగా చిత్రబృందం సమావేశం నిర్వహించింది. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ నేషనల్ అవార్డు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఓ మైల్స్టోన్ మూమెంట్. మా బ్యానర్‌కి తొలి జాతీయ అవార్డు ఇది’’ అన్నారు. ‘‘కృష్ణుడు నిజం అని ఈరోజు మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ అవార్డు కృష్ణుడే తీసుకొచ్చారని భావిస్తున్నాను’’ అని అభిషేక్ అగర్వాల్ చె΄్పారు.నిఖిల్ మాట్లాడుతూ – ‘‘కార్తికేయ 2’ విజయం సాధించడానికి, అవార్డు రావడానికి కారణం మా టీమ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చూసిన సినిమా ఇది. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజై, అద్భుతమైన విజయం సాధించింది. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు, అవార్డు ప్రకటించిన జ్యూరీకి థ్యాంక్స్’’ అన్నారు.కార్తికేయ కథేమిటంటే... ద్వాపర యుగంలో తనువు చాలించే ముందు శ్రీకృష్ణుడు తన కాలి కడియాన్ని ఉద్ధవునికి ఇచ్చి, ‘కలియుగంలో వచ్చే ఎన్నో అంతు చిక్కని సమస్యలకు ఈ కడియం పరిష్కారం చూపుతుంది’ అని చెబుతాడు. కలియుగంలో నాస్తికుడైన డాక్టర్ కార్తికేయ (నిఖిల్) తన తల్లి ఒత్తిడి మేరకు ఓ మొక్కు తీర్చుకోవడానికి ద్వారక నగరానికి వెళతాడు. అప్పటికే కడియానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించినప్రోఫెసర్ రంగనాథ రావ్‌ను హతమార్చడానికి ట్రై చేస్తుంటాడు సైంటిస్ట్ శాంతను. అతని మనుషుల చేతిలో హతమవ్వడానికి ముందు రంగనాథ రావ్ అనుకోకుండా కార్తికేయను చివరిసారి కలుస్తాడు. దాంతో శాంతను మనుషులతో పాటు శ్రీకృష్ణ భక్తులైన అధీరుల తెగకు చెందిన వ్యక్తులకు సైతం కార్తికేయ టార్గెట్ అవుతాడు. అయితే రంగనాథ రావ్ మనవరాలు ముగ్ధ (అనుపమ) సాయంతో వారందరి నుంచి డాక్టర్ కార్తికేయ ఎలా తప్పించుకున్నాడు? చంద్రశిల శిఖరంలోని శ్రీకృష్ణుడి కడియాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నదే కథ.ఆనంద్ ఇకర్షి దర్శకత్వం వహించిన ‘ఆట్టమ్’ కథేంటంటే.. ఓ నాటక బృందంలో 12 మంది నటులు, ఒక నటీమణి ఉంటారు. నటులుగా వినయ్ పాత్రలో వినయ్ ఫోర్ట్, అంజలిగా జరీన్ షిబాబ్, కళాభవన్ షాజాన్ హరి కీలక పాత్రలు పోషించారు. వీళ్ల నాటక ప్రదర్శన ఓ విదేశీ జంటకి నచ్చడంతో తమ రిసార్ట్‌లో వాళ్లకి ఆతిథ్యమిస్తారు. పార్టీ అనంతరం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోతారు. అయితే తన గదిలో కిటికీ పక్కన నిద్రపోతున్న అంజలితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి నాటక బృందంలోని 12 మందిలో ఒకరా? లేకుంటే బయటి వ్యక్తా? అనే విషయాన్ని అంజలి ఎలా బయటపెట్టింది? అన్నది ‘ఆట్టమ్’ కథ. హాలీవుడ్ మూవీ ‘12 యాంగ్రీమెన్’ (1954) ఆధారంగా ‘ఆట్టమ్’ రూపొందింది.కెరాడి టు పాన్ ఇండియాకర్ణాటకలోని కెరాడి అనే గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు రిషబ్ శెట్టి. చిత్ర పరిశ్రమలోకి రాకముందు పలు ఉద్యోగాలు చేశారు రిషబ్. డిగ్రీ చదివేటప్పుడు సినిమాలు చూసేందుకు డబ్బుల కోసం కూలి పనులు చేశారు. 2004 నుంచి 2014 వరకు (తొలి సారి డైరెక్షన్ చేసేవరకు) వాటర్ క్యా¯Œ లు అమ్మారు. రియల్ ఎస్టేట్ సంస్థలో, హోటల్స్‌లో పని చేశారు. క్లాప్ బాయ్‌గా ఇండస్ట్రీలో జర్నీ ్రపారంభించిన రిషబ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశారు.‘తుగ్లక్’ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘రికీ’ (2016). ఆ తర్వాతి సినిమా ‘కిరిక్ పార్టీ’తో దర్శకుడిగా రిషబ్ పేరు కన్నడనాట మార్మోగింది. హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో రిషబ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. -
ధనుష్ దర్శకత్వంలో నిత్యామీనన్
కోలీవుడ్‌లో తుళ్లువదో ఇళమై చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన నటుడు ధనుష్. తొలి చిత్రంతోనే విజయాన్ని ఎంజాయ్ చేసిన ఈయన ఆ తరువాత పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి స్టార్ నటుడిగా ఎదిగారు. అంతేకాదు తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో నటిస్తూ అరుదైన కథానాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు అంటే బహుముఖ ప్రతిభావంతుడిగా రాణిస్తున్న ధనుష్ 50 చిత్రాల మైలు రాయిని అధిగమించారు. ఈయన కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం రాయన్‌కు తనే దర్శకత్వం వహించారు. ఇది ఈ నెల 26న తెరపైకి రానుంది. అదే విధంగా ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. కాగా ప్రస్తుతం నిలవుక్కు ఎన్న ఎనమేల్ కోవం అనే మరో చిత్రాన్నీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం తరువాత 4వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని నటుడు ఎస్జే సూర్య ఇక భేటీలో పేర్కొన్నారు. ధనుష్ తనకు ఒక కథను చెప్పారని, అది అద్భుతంగా ఉందన్నారు. ఆ కథను ధనుష్‌నే తెరకెక్కించనున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని రాయన్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో నటుడు ప్రకాశ్‌రాజ్ వెల్లడించారు. ఈ చిత్రంలో తనతో పాటు నటి నిత్యామీనన్ నటించనున్నట్లు ఆయన చెప్పారు. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే ఇంతకు ముందు నటుడు ధనుష్‌కు జంటగా నిత్యామీనన్ నటించిన తిరుచిట్రఫలం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. -
విజయ్ సేతుపతి సరసన...
హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలన్... ఇలా విభిన్న పాత్రలతో విలక్షణ నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఇటీవల విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా తమిళ దర్శకుడు పాండిరాజ్ ఓ కథను రెడీ చేశారట. గతంలోనే ఈ కథను విజయ్ సేతుపతికి వినిపించారట పాండిరాజ్. ఈ సినిమాలో నిత్యా మీనన్‌ను హీరోయిన్గా అనుకుంటున్నారని కోలీవుడ్ సమాచారం. ఇదిలా ఉంటే... రెండేళ్ల క్రితం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డైరెక్ట్‌గా విడుదలైన ‘19 (1)(ఎ)’ సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఇద్దరూ పాండిరాజ్ సినిమా కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే చాన్స్ ఉంది. -
అలా ఆలోచించే వాడు దొరికితే పెళ్లి చేసుకుంటా: నిత్యామీనన్
నిత్యా మీనన్.. ఏ పాత్ర పోషించినా అందులో సహజత్వం ఉట్టి పడుతుంది. అలాగని ఏ పాత్ర పడితే ఆ పాత్రను ఒప్పుకోదు. నటనకు మాత్రమే అవకాశం ఉన్న పాత్రల్నే ఎంచుకుంటూ వెబ్ స్క్రీన్ మీదా అభినయిస్తున్న ఆమె గురించి కొన్ని వివరాలు.. నిత్యా మీనన్ వాళ్లది బెంగళూరులో స్థిరపడిన మలయాళీ కుటుంబం. ఎనిమిదేళ్ల వయసులోనే.. ఫ్రెంచ్–ఇండియన్ ఆంగ్ల చిత్రం ‘హనుమాన్’లో నటించింది. ‘స్టార్క్ వరల్డ్ కేరళ’ అనే టూరిజం మ్యాగజైన్లో నిత్యా ఫొటో చూసిన మోహన్ లాల్.. ఆమెకు ‘ఆకాశ గోపురం’ అనే సినిమాలో అవకాశం ఇచ్చి మలయాళ చిత్రసీమకు పరిచయం చేశారు. ఆ తర్వాత ‘జోష్’తో కన్నడంలో, ‘అలా మొదలైంది’ తో తెలుగులో, ‘నూట్రన్ బదు’ తో తమిళంలో, ‘మిషన్ మంగళ్’తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి అన్నీ భాషల్లోనూ సహజ నటిగా పేరొందింది నిత్యా. ఎన్నో అవార్డులూ అందుకుంది. పలు సినిమాల్లో పాటలు కూడా పాడి తన గాన ప్రతిభనూ చాటింది. సినిమాల్లోనే కాదు.. సిరీస్, టీవీ షో ల్లోనూ తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. ‘బ్రీత్: ఇన్ టు ద షాడోస్’, ‘మోడర్న్ లవ్ హైదరాబాద్’ వెబ్ సిరీస్‌లతో అంతర్జాతీయంగా వెబ్ వీక్షకులను అబ్బురపరచింది. తెలుగులో ఇండియన్ ఐడల్ షోకి హోస్ట్‌గానూ వ్యవహరించింది. ‘స్కైలాబ్’ అనే చిత్రంతో నిర్మాతగా మారింది. ఈ మధ్యనే ఓ యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించి యూట్యూబ్ వరల్డ్‌లోకీ ఎంటర్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతోన్న ‘కుమారి శ్రీమతి’ సిరీస్‌తో అలరిస్తోంది. ఆమె ప్రధాన భూమిక పోషించిన మలయాళ వెబ్ సిరీస్ ‘మాస్టర్ పీస్’ కూడా స్ట్రీమింగ్కి రెడీగా ఉంది. నేను పక్కా ట్రేడిషనల్. మన సంస్కృతిని చాలా గౌరవిస్తా. కానీ పెళ్లి విషయంలో నాకు స్థిరమైన అభిప్రాయం ఉంది. పెళ్లి.. సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడి ఉన్న సెటప్. నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. ఎవరైనా దానికి మించి ఆలోచించేవాళ్లు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. – నిత్యా మీనన్ -
ఆ సినిమా నా ఆల్ టైం ఫేవరెట్ మూవీ: నిత్యా మీనన్
-
అయినా నాకు దేవుడితో సమానం: నిత్యా మీనన్
-
ఓటీటీలో నిత్యామీనన్ మాస్టర్‌పీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా రాణించిన నిత్యామీనన్ ప్రస్తుత దృష్టంతా ఓటీటీల మీదే ఉన్నట్లు కనిపిస్తోంది. బ్రీత్ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన నిత్య అడపాదడపా సినిమాలు చేస్తోంది. ఈ హీరోయిన్ ఇటీవల ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ శ్రీమతి కుమారి. ఈ సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు డిజిటల్ ప్లాట్ఫామ్లో మంచి స్పందన లభిస్తోంది. ఇంతలోనే తను ప్రధాన పాత్రలో నటించిన మరో వెబ్ సిరీస్ నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. నిత్యామీనన్ హీరోయిన్గా నటించిన మలయాళ వెబ్ సిరీస్ మాస్టర్‌పీస్. ఈ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయడంతోపాటు స్ట్రీమింగ్ డేట్‌ను సైతం ప్రకటించారు. మాస్టర్‌పీస్ హాట్‌స్టార్‌లో అక్టోబర్ 25 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో నిత్య.. రియా అనే పాత్ర పోషించింది. ఆద్యంతం కామెడీగా సాగిపోతున్న ట్రైలర్ చూస్తుంటే ఫన్ గ్యారెంటీ అని తెలుస్తోంది. అయితే నిత్యామీనన్‌కు డబ్బింగ్ చెప్పిన వాయిస్ తనకు పెద్దగా నప్పలేనట్లు కనిపిస్తోంది. ఎన్. శ్రీజిత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మలయాళం, తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో అందుబాటులోకి రానుంది. చదవండి: నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం, ముందు సహజీవనం చేస్తా, అప్పుడే పచ్చబొట్టు వేయించుకుంటా! -
ప్రపంచం గురించి తెలుసుకొని ఏం చేయాలి: నిత్యా మీనన్
-
దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్ పోస్ట్
సౌత్ ఇండియాలో నిత్యా మీనన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు తను కూడా మంచి కథతో పాటు నటనకు స్కోప్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ వచ్చింది. అంతేకాకుండా వివాదాలకు కూడా దూరంగా ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా ఆమెపై పలు వార్తలు వైరల్ అయ్యాయి. తమిళ సినీ ఇండస్ట్రీపై ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. అయితే, నిత్య ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది. ఆ రూమర్స్ ఎంటి..? 'ఓ తమిళ హీరో నన్ను చాలా వేధించాడు.. షూటింగ్లో నన్ను ఇబ్బంది పెట్టాడు.. తమిళ ఇండస్ట్రీలో నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు.' అంటూ నిత్యా మీనన్ చెప్పినట్టుగా కొన్ని తమిళ మీడియా సంస్థలు ప్రచురించాయి. అవి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని నిత్యా మీనన్ కూడా ఖండించింది. ఇది అవాస్తవం.. జర్నలిజంలోని కొన్ని వర్గాలు ఇలా దిగజారడం చాలా బాధాకరం. ఇలాంటి చెత్తపనులు ఎలా చేస్తారు. 'నేను ఇప్పటి వరకు ఎక్కడా ఇంటర్వ్యూనే ఇవ్వలేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ఇవ్వకండి. దీని కంటే మెరుగ్గా ఉండండి. ఇలాంటివి పక్కన పెట్టి కాస్త మంచి పనులు చేయండి.' అని నిత్యా మీనన్ పోస్ట్ వేసింది. దొంగ దొరికాడు అంటూ నిత్యామీనన్ మరోక పోస్ట్ చేసింది. కొన్ని సోషల్ మీడియా ఖాతాలను స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది.. మనం అందరం ఈ భూమ్మీద తక్కువ సమయమే ఉంటాం. ఒకరికొకరం ఇలాంటి ఎంత పెద్ద తప్పులు చేస్తున్నామో అనుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నేను దీనిని ఎందుకు ఎత్తి చూపుతున్నాననంటే.. జవాబుదారీతనం మాత్రమే చెడు ప్రవర్తనను ఆపుతుంది. ఈ తప్పుడు ప్రచారం చేసిన వారు ఇప్పటికైన మారండి. ఇలాంటి వారిని అనుసరించిన వారు కూడా తప్పును తెలుసుకోండి.' అని నిత్యా మీనన్ చెప్పింది. (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల ఔట్.. క్రేజీ హీరోయిన్‌కు ఛాన్స్) ప్రస్తుతం నిత్యా మీనన్.. తన తరువాతి ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు వెబ్ సిరీస్‌లు చేయడానికి కూడా నిత్యా వెనకాడడం లేదు. అందుకే ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 28న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
కెన్యా వేకేషన్లో మెగా ఫ్యామిలీ.. క్వీన్‌లా మారిపోయిన నిత్యామీనన్!
►కెన్యా వేకేషన్లో చిల్ అవుతోన్న మెగా ఫ్యామిలీ! ►రెడ్ డ్రెస్‌లో ఐశ్వర్య రాజేశ్ లుక్స్! ►థాయ్‌లాండ్ వేకేషన్లో అవనీత్ కౌర్! ►రాణిలా మారిపోయిన నిత్యామీనన్! ►గ్రీన్ శారీలో నోరా ఫతేహీ హాట్ పోజులు! ► బ్లూ డ్రెస్‌లో ఏజెంట్ భామ సాక్షి వైద్య లుక్స్! View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Phani (@phanipoojitha__27) View this post on Instagram A post shared by Sakshi (@_vaidyasakshi) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) -
ముసలమ్మ పాటకు విశేష ఆదరణ.. ఎవరేమంటే నాకేంటి
నటి నిత్యామీనన్ది ప్రత్యేక బాణి. పాత్ర నచ్చితే చాలు అది హీరోయిన్ పాత్ర, గెస్ట్ పాత్ర అని చూడదు. నటించడానికి సై అంటుంది. పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద దర్శకుడి చిత్రమైనా నో చెప్పేస్తుంది. పదేళ్ల ప్రాయంలోనే బాల నటిగా రంగప్రవేశం చేసిన ఈ మలయాళీ బ్యూటీ, అంచలంచెలుగా ఎదిగి కథానాయకి స్థాయిలో రాణిస్తోంది. మొదట్లో మలయాళం, తెలుగు భాషల్లో నటించిన నిత్యామీనన్ తమిళంలో సిద్ధార్థ్‌కు జంటగా 108 చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. బహుబాషా నటిగా గుర్తింపు పొందిన ఈ అమ్మడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన కాదల్ కణ్మణి మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత రాఘవ లారెన్స్‌కు జంటగా కాంచన –2, విజయ్ సరసన మెర్సల్ వంటి చిత్రాలలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి గట్టిగా తనేంటో చాటుకుంది. అదే విధంగా తెలుగులో గీత గోవిందం చిత్రంలో కీలక పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకుంది. విషయం ఏంటంటే నిత్యామీనన్ విషయంలో పొట్టి, బొద్దు వంటివి ఆటంకం కాలేదు. వాటి గురించి వస్తున్న విమర్శలను ఆమె అసలు పట్టించుకోదు. తనకు నచ్చిన పాత్రలకు ఎలా న్యాయం చేయాలా అన్న విషయంపైనే దృష్టి పెడుతుంది. ఆమె ఇటీవల తమిళంలో ధనుష్‌కు జంటగా తిరుచిట్రంఫలం చిత్రంలో నటించి ఆ చిత్ర విజయానికి కీలకంగా మారింది. అందులో కూడా ఆమె ఆకారాన్ని వెటకారంగా చూపుతూ ఒక పాట కూడా ఉంటుంది. తాయ్ కెళవి (ముసలమ్మ) అంటూ సాగే ఆ పాట ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణ పొందింది. నిత్యామీనన్ వయసు 35 ఏళ్లు. ఇప్పటికీ ఆమె అవివాహితే అన్నది గమనార్హం. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న నిత్యామీనన్‌కు అవకాశాలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. -
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్.. ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో తెలుసా?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో ఎంట్రీ ఇచ్చి.. పలు మలయాళం సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో అలా మొదలైంది చిత్రంలో ఆరంగ్రేటం చేసింది ఆ ఫోటోలోని చిన్నారి. ఇంతకీ ఆమె ఎవరో మీకు గుర్తొచ్చిందా? టాలీవుడ్ అగ్ర హీరోలతో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తెలుగులో చివరిసారిగా పవన్ కల్యాణ్ చిత్రంలో కనిపించింది ఆ చిన్నారి. ఆ ఫోటోలో ముసిముసి నవ్వులు చిందిస్తున్న చిన్నారి దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్గా నటించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవేయండి. హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దక్షిణ భారత సినీరంగంలో అత్యధిక రేటింగ్ పొందిన హీరోయిన్లో ఒకరు. కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన నిత్యా విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఏ పాత్ర పోషించినా అందులో సహజత్వం ఉట్టి పడుతుంది. అలాగే ఏది పడితే ఆ పాత్ర ఒప్పుకోదు. అదే ఆమెలో ప్లస్, మైనస్ కూడా. నటనకు అవకాశం ఉన్న పాత్రలే అంగీకరించి పేరు తెచ్చుకుంటోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో 'ఒకే బంగారం' సినిమాలో కూడా నటించింది భామ. ఇటీవల ఆమె 'వండర్ ఉమెన్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఆమె నటించిన సోలో నటి చిత్రం 'ప్రాణ', బాలీవుడ్లో 'మిషన్ మంగళ్'లో విజయాన్ని సాధించాయి. ఆమె నటనకు పలు అవార్డులు కూడా సాధించింది. 2022లో తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన 'తిరుచిత్రంబళం'లో నిత్యా మీనన్ ప్రధాన పాత్ర పోషించింది, ఇందులో ధనుష్ నటించిన హీరోకి ప్రేమికురాలిగా మారిన చిన్ననాటి స్నేహితురాలి పాత్రలో ఆమె హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. తాజాగా ఆమె చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. నిత్యామీనన్ ప్రస్తుతం 'ఆరం తిరుకల్పన'లో నటిస్తోంది. త్వరలోనే పేరు పెట్టని అంజలీ మీనన్ చిత్రం షూటింగ్లో పాల్గొననుంది. -
టీచర్‌గా మారిపోయిన నిత్యామీనన్.. వీడియో వైరల్
హీరోయిన్ నిత్యామీనన్ ఇప్పుడు టీచర్‌గా మారిపోయింది. ఇదేదో సినిమా షూటింగ్ కోసం కాదండోయ్. నిజంగానే పంతులమ్మగా మారిపోయి పిల్లలకు పాఠాలు చెప్పిందీ అందాల తార. ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న నిత్యామీనన్ షూటింగ్ అనంతరం దగ్గర్లోని గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్లింది. అక్కడి పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడిన ఆమె ఆ తర్వాత వారికి పాఠాలు చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. కృష్ణాపురం గ్రామంలోని ఈ పిల్లలతో న్యూ ఇయర్ డే ఆనందంగా గడిచిందంటూ నిత్యామీనన్ తన పోస్టులో రాసుకొచ్చింది. పల్లెటూర్లలో ఉండే చిన్నారులు బాల్యాన్ని ఎంతో ఆనందంతో గడుపుతారని, వాళ్ల చుట్టూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటానంటూ పేర్కొంది. ఇక నిత్యామీనన్ టీచింగ్ క్లాసులు చూసి ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
గిరిజన బిడ్డను ఎత్తుకొని ఆడించిన నిత్యామీనన్..ఫోటో వైరల్
ప్రముఖ సినీ నటి, హీరోయిన్ నిత్యామీనన్ మంగళవారం తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ట్రస్టుకు చెందిన ఏకం ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వరదయ్యపాళెం మండలం కాంబాకం గిరిజనకాలనీలో పర్యటించారు. స్థానికులు, గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ఓ గిరిజన బిడ్డని ఎత్తుకొని ఆడించారు. పల్లెటూరి పాటలతో సరదాగా గడిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘వండర్ విమెన్’తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది నిత్యా. అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటిటీ సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసి షాకిచ్చిన హీరోయిన్, ఫొటోలు వైరల్
హీరోయిన్ నిత్యా మీనన్ వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తూ.. పాత్రలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది. అలా సక్సెస్‌తో కెరీర్లో దూసుకుపోతోంది నిత్యా మీనన్. ఇక ఈ ఏడాది స్కైలాబ్, భీమ్లానాయక్ వంటి చిత్రాలతో అలరించిన నిత్యా.. నటిగానే కాదు సింగర్‌గా కూడా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలు పక్కన పెట్టి కేవలం కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేస్తోంది. ఇదిలా ఉందే తాజాగా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేసి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. చదవండి: తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించిన హీరోయిన్ కొద్ది రోజులుగా ఆమె సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్స్ షేర్ చేస్తూ వస్తోంది. ఇటీవల ప్రెగ్నెన్సీ కిట్ ఫొటో ఒకటి షేర్ చేసి అందరిని డైలామాలో పడేసింది. దీంతో నిత్యా ప్రెగ్నెంటా? అని ఆమె ఫాలోవర్స్ అంతా సందేహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియో పోస్ట్ చేసింది.. ఇప్పుడు ఏకంగా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను పంచుకుంది. అయితే ఇదంత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రమోషన్లో భాగంగా అని తెలుస్తోంది. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘ప్రెగ్నెన్సీ ఎప్పుడూ అందంగా కనిపించదు. చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్, నడవలేని స్థితిలో.. కానీ నోరాగా పాత్ర పోషించడం నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని మంచి ఫొటోలను షేర్ చేస్తాను’ అంటూ ఇవి తెర వెనుక తీసిన ఫొటోలు అంటూ చెప్పుకొచ్చింది. ఇక చివరగా ‘గమనిక: నేను నిజంగా ప్రెగ్నెంట్ కాదు’ అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఏదేమైన నిత్యా తీరు చూసి ఆమె ఫాలోవర్స్ అంతా ఖంగుతింటున్నారు. తరచూ ఆమె ప్రెగ్నెంట్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు పోస్ట్ చేసి షాకిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదట ఆమె ఫొటోలు చూసి షాకవుతున్నప్పటికీ.. ఆ తర్వాత నోట్ చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. దీంతో ఆమె పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
ఇండస్ట్రీలో నాకు చాలామంది శత్రువులు ఉన్నారు: నిత్యామీనన్
తమిళసినిమా: తనకు శత్రువులు ఉన్నారు.. అని అంటున్నారు నటి నిత్యామీనన్. ఈ మాలీవుడ్ నటి టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకోలేకపోయినా, ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్న నటి అని పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా పొగరుబోతు అనే ముద్ర కూడా వేసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటించిన ఓకే కణ్మణి చిత్రం సక్సెస్ తరువాత ఆయన దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటించే అవకాశం వస్తే దాన్ని తిరస్కరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అదే విధంగా ఒక మలయాళ చిత్ర షూటింగ్లో ఉన్న నిత్యామీనన్‌ను కలవడానికి ఒక నిర్మాత రాగా ఆయన్ని కలవడానికి నిరాకరించిందనే ఘటన అప్పట్లో కలకలం రేకెత్తించింది. ఇక ఈ మధ్య నటి నిత్యామీనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వ్యక్తి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు మలయాళ చిత్ర పరిశ్రమ ఒక దశలో నిత్యామీనన్‌పై రెడ్ కార్డు విధించాలనే వరకూ వచ్చింది. ఇలాంటి వివాదాస్పద ఘటనలు నిత్యామీనన్ జీవితంలో చాలానే ఉన్నాయి. కాగా చాలా కాలం తరువాత ఈ సంచలన నటి కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా నటించిన తిరుచిట్రంఫలం చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఒక భేటీలో నటి నిత్యామీనన్ పలు విషయాల గురించి మనసు విప్పి చెప్పారు. అందులో ముఖ్యంగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ తనకు చాలా మంది శత్రువులు ఉన్నారని అన్నారు. మనం ఎదుగుతున్నప్పుడు గిట్టని వాళ్లు చాలా మంది కాళ్లు పట్టుకుని కిందకు లాగాలని భావిస్తారని అన్నారు. వాళ్ల మాట వినకపోతే వదంతులు ప్రచారం చేయడానికీ వెనుకాడరన్నారు. నిత్యామీనన్‌తో పని చేయడం చాలా కష్టం అంటారని, అయితే తాను చాలా మందితో కలిసి పని చేశానని, ఎవరూ అలా భావించలేదని అన్నారు. కారణం తాను ఎలాంటి వ్యక్తినో వారందరికీ తెలుసని స్పష్టం చేశారు. -
ఇండస్ట్రీలో అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నా : నిత్యామీనన్
హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ పెళ్లి వార్తలపై గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిపై ఆమె క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా దీనిపై స్పందించిన నిత్యామీనన్ తన పెళ్లి గురించి వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేసింది. చదవండి: కవల పిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్ నమిత.. 'కాలు బాలేక రెస్ట్ తీసుకుంటే.. పెళ్లి చేసుకుంటుంది కాబట్టే కథలు వినట్లేదు అని రూమర్స్ పుట్టించారు' అని తెలిపింది. మరి పెళ్లి చేసుకోమని దుల్కర్ మీకు సూచించారట కదా అని అడగ్గా..'తను నాకు మంచి ఫ్రెండ్. అందుకే పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సంతోషంగా ఉండమని నాకు చెబుతుంటాడు. ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదు కానీ భవిష్యత్తులో చేసుకుంటానేమో తెలీదు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవలి కాలంలో తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందిస్తూ..నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే..''నన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు పుట్టించారు. కావాలనే తప్పుగా ప్రచారం చేశారు. మనం మంచి స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కిందకి లాగాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. అందరి గురించి నేను ఆలోచిస్తూ పోతే నా పనులు చేసుకోవడానికి సమయం దొరకదు’’ అన్నారు.చదవండి: అందుకే నిత్యామీనన్‌ను వద్దనుకున్నారా? రివీల్ చేసిన నిర్మాత -
అందుకే నిత్యామీనన్‌ను వద్దనుకున్నారా? రివీల్ చేసిన నిర్మాత
దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ను తీసుకొచ్చింది. ఓవర్ నైట్ స్టార్డమ్తో కీర్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిందీ సినిమా. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డు కూడా దక్కింది. అయితే ఈ ప్రాజెక్ట్ కీర్తి సురేష్‌కి ముందు వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా వైజయంతీ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ వెల్లడించారు. ఓ ప్రముఖ షోలో పాల్గొన్న ఆయన మహానటి ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సినిమాకు కీర్తికి ముందు ఓ మలయాళ నటిని అనుకున్నాం. కానీ కథ చెప్పాక అందులో మద్యం తాగే సన్నివేశాలు ఉంటే నేను చేయను అంటూ కండిషన్స్ పెట్టింది. దీంతో ఆమెను తీసుకోవడానికి వీల్లేదు అని నేనే డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు చెప్పాను. కట్ చేస్తే కీర్తి సురేష్ చేతుల్లోకి ఈ సినిమా వెళ్లింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్ పేరు చెప్పడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు.అయితే మహానటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే మలయాళ హీరోయిన్ నిత్యామీనన్ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాకుండా సావిత్రి పాత్రలో ఆమె ఫోటోలు కూడా కొన్ని బయటికొచ్చాయి. ఏది ఏమైనా నిత్యామీనన్ ఓ మంచి సినిమాను దూరం చేసుకుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
నిత్యామీనన్‌ను చచ్చినా పెళ్లి చేసుకోను : సంతోష్ వర్కీ
ప్రేమిస్తున్నానంటూ సంతోష్ వర్కీ అనే వ్యక్తి తనను ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడని హీరోయిన్ నిత్యామీనన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన పెళ్లిపై జరిగిన ప్రచారంపై ఆమె స్పందించింది. సంతోష్ వర్కీ తనకు 30కి పైగా నంబర్స్ నుంచి కాల్ చేస్తూ విసిగించేవాడని పేర్కొంది. తాజాగా తనపై నిత్యామీనన్ చేస్తున్న ఆరోపణలపై సంతోష్ వర్కీ స్పందించాడు. ఇందులో వాస్తవం లేదని, ఒకే వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు కొనగలడో జనాలకే వదిలేస్తున్నాడని చెప్పాడు. నిత్యామీనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని వాళ్ల తల్లి చెబితే, జరగలేదని తండ్రి చెప్పారు. అంతేకాకుండా వాళ్లు నాపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టాలని చూస్తున్నారు. 'గతంలో నిత్యామీనన్ అంటే తనకు ఇష్టం ఉండేది. తనను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు చచ్చినా ఆమెను పెళ్లిచేసుకోను. అసలు నిత్యామీనన్ గురించి ఇవన్నీ ముందే తెలిస్తే ప్రేమించి ఉండే వాడినే కాదు'. అంటూ కామెంట్స్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అసలు నువ్వు నిత్యామీనన్‌ను రిజెక్ట్ చేయడమేంటి?నీకంత సీన్ ఉందా? అంటూ హీరోయిన్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఎవరీ సంతోష్ వర్కీ? నిత్యామీనన్ పెళ్లి వార్తలతో ఒక్కసారిగా పాపులర్ అయిన సంతోష్ వర్కీ ఓ యూట్యూబర్. సినిమాల రివ్యూస్ చెప్పడంలో మలయాళంలో గుర్తింపు పొందాడు. చదవండి: ఆ వ్యక్తి ఆరేళ్లుగా వేధించాడు.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ -
ఆ వ్యక్తి ఆరేళ్లుగా వేధించాడు.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సెలబ్రిటీస్ ఇందుకు అతీతం కాదు. నిత్యామీనన్ కూడా అలాంటి వేధింపులు ఎదుర్కొన్నారట. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఈ మలయాళ కుట్టి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ నటి అని చెప్పొచ్చు. ఏ విషయాన్ని అయినా కుండ బద్ధలు కొట్టినట్టు చెబుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. విజయ్ సేతుపతితో కలిసి నటించిన మలయాళ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా నిత్యామీనన్ తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంది. తనను ఒక వ్యక్తి గత ఆరేళ్లుగా వేధింపులకు గురి చేశారని చెప్పింది. నటుడు మోహన్‌లాల్ ఆరాట్టు సినిమా పేరుపై విశ్లేషణ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన సంతోష్ వర్గీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసి ఇబ్బందులకు గురి చేశాడని వాపోయింది. చాలా మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని, అయితే తాను మాత్రం అతన్ని క్షమించి వదిలేశానని తెలిపింది. సంతోష్ తనను చాలా రకాలుగా అన్ పాపులర్ చేశాడని, చివరకు తన తల్లిదండ్రులు కూడా ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసి అతన్ని గట్టిగా హెచ్చరించారని పేర్కొంది. తన గురించి సంతోష్ చెప్పేవన్నీ అసత్యాలని వాటిని ఎవరూ నమ్మవద్దని కోరింది. కాగా ప్రస్తుతం ఈమె తమిళంలో ధనుష్‌కు జంటగా నటిస్తున్న తిరు చిట్రంబలమ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
Fashion: ‘హౌస్ ఆఫ్ మసాబా’ గ్రీన్ ఫ్లోరల్ సారీలో నిత్య.. చీర ధర ఎంతంటే!
ఈతరం సహజ నటి.. నిత్యా మీనన్. తెర మీద ఆమె కళ్లు.. నవ్వు.. నడక.. అన్నీ అభినయాన్ని ఒలకబోస్తాయి. ఏ భూమికను తీసుకుంటే ఆ భూమికే కనిపించేలా చేయడం ఆమె ప్రత్యేకత. అలాంటి స్పెషల్ స్టయిలే ఆమె అనుసరించే ఫ్యాషన్ విషయంలోనూ ఉందా? అంటే ఉంది మరి. సాక్ష్యం ఇదిగో.. మసాబా గుప్తా ఇప్పుడున్న టాప్ మోస్ట్ డిజైనర్స్‌లో మసాబా గుప్తానే ఫస్ట్. 2009లో ‘హౌస్ ఆఫ్ మసాబా’ పేరుతో బ్రాండ్‌ను ప్రారంభించింది. నాణ్యత, సృజనే బ్రాండ్ వాల్యూగా సాగిపోతోంది. అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. ఎందరో సెలబ్రిటీస్‌ను ఆమె డిజైన్స్‌కు అభిమానులుగా మారుస్తోంది. మసాబా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్‌ల కూతురు అని తెలుసు కదా! కానీ పేరెంట్స్ పేరుప్రఖ్యాతులను తన కెరీర్‌కు పునాదిగా మలచుకోలేదు. కేవలం తన క్రియెటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జిస్తోంది. బ్రాండ్ వాల్యూ చీర డిజైనర్ -మసాబా గుప్తా ధర: రూ. 10,500 మంగత్రాయ్ జ్యూయెలరీ ముత్యాలు, వజ్రాల వ్యాపారంలో వందేళ్లకు పైగా చరిత్ర గల సంస్థ మంగత్రాయ్ జ్యూయెలర్స్. దేశంలోనే కాదు గల్ఫ్, యూరోప్, అమెరికా దేశాల్లోనూ బ్రాంచ్‌లను నెలకొల్పింది. స్వచ్ఛత, నాణ్యత, నాజూకైన డిజైన్లే దీని బ్రాండ్ వాల్యూ. సామాన్యులకూ, సెలబ్రిటీలకూ అందుబాటులోనే ధరలు. జ్యూయెలరీ: పర్ల్ నెక్లెస్ ధర: రూ. 14,100 బ్రాండ్: మంగత్రాయ్ జ్యూయెలరీ బ్రేస్లెట్ ధర: రూ. 1,890 నిత్యం కొత్తగా ఉండాలనుకుంటాను. ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. సినిమా కెరీర్ నాకు బెస్ట్ టీచర్ అనే చెప్పాలి. చాలా నేర్పింది.. నేర్పిస్తూనే ఉంది. – నిత్యా మీనన్ -దీపిక కొండి చదవండి: Femina Miss India 2022: ఫెమినా మిస్ ఇండియాగా సినీ శెట్టి.. -
కాలికి గాయం, నడవలేని స్థితిలో నిత్యామీనన్!
కథ నచ్చితేనే సినిమా ఓకే చేసే నిత్యామీనన్ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్, షోలు కూడా చేస్తోంది. ఆహాలో ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ షో జడ్జిగా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం మోడ్రన్ లవ్ హైదరాబాద్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా మోడ్రన్ లవ్ హైదరాబాద్ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్మీట్లో నిత్యామీనన్ కర్ర పట్టుకుని మరో ఇద్దరి సాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ నడిచింది. దీంతో నిత్యాకి ఏమైందా? అని అంతా కంగారుపడ్డారు. ఇక స్టేజీపైకి వచ్చిన నిత్య మాట్లాడుతూ.. ఇది యాక్టింగ్ కాదని క్లారిటీ ఇచ్చింది. సిరీస్‌లో ఇలానే నటించానని, రియల్ లైఫ్‌లో కూడా అదే జరిగి ఇప్పుడు అలాగే నడవాల్సి వస్తోందని పేర్కొంది. రెండు రోజుల క్రితం ఇంట్లో మెట్ల మీద నుంచి పడిపోయి కాలికి దెబ్బ తగిలిందని, అందుకే అలా కుంటుతూ నడిచానని తెలిపింది. నిత్యకు దెబ్బ తగిలినా కూడా పట్టించుకోకుండా ప్రమోషన్‌కు రావడంపై ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. చదవండి: అందుకు ఒప్పుకుంటేనే ఛాన్స్ ఇస్తానన్నాడు.. క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చెప్పిన నటి పెళ్లి పుకార్లపై స్పందించిన హీరో రామ్ -
యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన నిత్యా మీనన్
'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్. చేసినవి కొన్ని సినిమాలే అయినా అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నిత్యా మీనన్ రీసెంట్గా భీమ్లా నాయక్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ షోకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. ఇప్పుడీ మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ తాజాగా సొంతంగా యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. నిత్య అన్ఫిల్టర్డ్’(Nithya Unfiltered)పేరుతో యూట్యూబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. తన 12ఏళ్ల సినీ కెరీర్‌కి సంబంధించిన విషయాలను ఫస్ట్ వీడియోలో షేర్ చేస్తూ తన వ్యక్తిగత,వృత్తిపరమైన జీవిత విశేషాలపై మరిన్ని వీడియోలతో త్వరలోనే మీ ముందుకు రాబోతున్నానంటూ పేర్కొంది. ఇక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కాసేపటికే వేలమంది ఫాలోవర్లు వచ్చి చేరారు. -
‘భీమ్లా నాయక్’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్ క్లారిటీ
Samyuktha Menon Disappointed With Bheemla Nayak: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్ మంచి హిట్‌టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ హీరోయిన్లు అయిన నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు భీమ్లా నాయక్‌పై మూతి ముడుచుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణంగా సినిమా నిడివి తగ్గించేందుకు పాటలతో పాటు హీరోయిన్ల సన్నిశాల్లో కోతలు విధించడం. చదవండి: బాలీవుడ్‌పై నటి భాగ్యశ్రీ షాకింగ్ కామెంట్స్.. ఎంతో మంది సంగీత ప్రియుల ఆదరణ పొందిన ‘అంత ఇష్టం ఏందయ్యా..’ సాంగ్‌తో పాటు పలు సన్నివేశాలను చిత్ర బృందం తొలగించిన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో ఎంతోమందిని ఆకట్టుకున్న తన పాటను తొలగించడంపై నిత్యా మీనన్ హర్ట్ అయ్యిందని, అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాలేదని వార్తలు వినిపించగా.. రిలీజ్ అనంతరం తన సీన్లను తొలగించడంపై సంయుక్త మీనన్ సైతం చిత్రం బృందంపై కోపంతో ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై స్పందించింది సంయుక్త మీనన్. చదవండి: సమంతపై జిమ్ ట్రైనర్ జునైద్ ఆసక్తికర వ్యాఖ్యలు ‘అవును నేను చాలా హర్ట్ అయ్యాననే మాట నిజమే. అయితే నా పాత్ర గురించి కాదు .. దాని నిడివి గురించి కాదు. ఈ సినిమాను రెండోసారి థియేటర్లో చూద్దామనుకుంటే ఇంతవరకూ టిక్కెట్ దొరకలేదు .. అందుకు’ అంటూ చమత్కరించింది. తన కామెంట్స్ విన్న నెటిజన్లు సీన్స్ తొలగిస్తే ఎవరూ బాధపడకుండా ఉంటారని, కానీ ఆమె నిజం ఒప్పుకోవడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిత్యా మీనన్ మాత్రం తన పాట, సన్నివేశాలను తొలగించడం పట్ల మూవీ యూనిట్‌పై తీవ్ర అసహనంతో ఉందని, అందుకే ఆమె భీమ్లా నాయక్ సంబంధించిన ఏ ఈవెంట్లోను పాల్గొనడం లేదంటూ సినీ వర్గాలు నుంచి సమాచారం. ఈ మూవీ పవన్ కల్యాన్ భార్య నిత్యా మీనన్ నటించగా.. రానా భార్య సంయుక్తి మీనన్ కనిపించింది. -
ఓటీటీలో స్కైలాబ్, రిలీజ్ ఎప్పుడంటే?
Skylab Movie Confirms OTT Release Date: సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్కైలాబ్. 1979లో జరిగిన స్కైలాబ్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డా. రవికిరణ్ సమర్పణలో బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై పృథ్వీ పిన్నమరాజు, నిత్యామీనన్ నిర్మించారు. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందన్నప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారన్న విషయాలకు కొంత కామెడీ జోడించి సినిమాను తెరకెక్కించారు. డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ బాట పట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సోనీ లైవ్ ఓటీటీలో ప్రసారం కానుంది. ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి! Whatever the problem is Dr.Anand has a perfect solution for you. Get ready to meet him on his clinic in Skylab, streaming on Jan 14 only on SonyLIV.#SkylabOnSonyLIV #ThetaleofBandalingampalli@MenenNithya @ActorSatyaDev @eyrahul @VishvakKhander1 @prashanthvihari @javvadiAditya pic.twitter.com/oS1bXvGNJS — SonyLIV (@SonyLIV) January 11, 2022 -
అందుకే నిర్మాతగా మారాను: నిత్యా మీనన్
‘‘నిర్మాతగా ‘స్కైలాబ్’ నా తొలి చిత్రం. డబ్బులు సంపాదించడానికి నిర్మాతను కాలేదు. మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారాను. ‘స్కైలాబ్’ సినిమా ఆరంభం నుంచే నేను నిర్మాత కాదు. ఈ సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో భాగంగానే నిర్మాతగా నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను’’ అని నిత్యా మీనన్ అన్నారు. నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన తారాగణంగా డా. రవికిరణ్ సమర్పణలో బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖంతడేరాజు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన చిత్రం ‘స్కైలాబ్’. ఈ చిత్రం డిసెంబరు 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రకథానాయిక, నిర్మాత నిత్యా మీనన్ మాట్లాడుతూ – ‘‘స్కైలాబ్ గురించి దర్శకుడు విశ్వక్ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. స్కైలాబ్ గురించి మా తల్లిదండ్రులతో చర్చించగా, అప్పట్లో స్కైలాబ్ గురించిన భిన్నమైన కథనాలను చెప్పారు. స్కైలాబ్ భూమి మీద పడిపోతే చనిపోతామనే భ్రమలో చాలామంది తాము కూడబెట్టుకున్న ఆస్తులను ఖర్చు చేసేశారట. మరికొందరైతే బంగారు నాణేలు మింగేశారని చెబితే ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి అంశాలు నేనీ సినిమా చేసేందుకు దోహదం చేశాయి. బండిలింగంపల్లిలో ఉన్న ముగ్గురు వ్యక్తుల కథే ఈ చిత్రం. ఇందులో నేను జర్నలిస్టు గౌరి పాత్రలో కనిపిస్తాను. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణలతో నాకు పెద్దగా కాంబినేషన్ సీన్స్ లేవు. అయితే గౌరి పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. తెలంగాణ యాసలో మాట్లాడాను. అది చాలా బాగా అనిపించింది. ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇది థియేట్రికల్ సినిమా’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నందు వల్లే తెలుగులో సినిమాలు చేయలేకపోయాను. ఆరేళ్లుగా పని చేస్తూనే ఉన్నాను. లాక్డౌన్లో కాస్త బ్రేక్ దొరికింది. ప్రస్తుతం తమిళంలో ధనుశ్‌తో, మలయాళంలో 19(1)ఎ చిత్రాలతో పాటు హిందీలో ‘బ్రీత్ 3’ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నిర్మాతగా వినూత్న సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
పవన్ కల్యాణ్‌కు భార్యగా నిత్యా మీనన్!
వకీల్‌సాబ్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’. మలయాళ సూపర్ హిట్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటివరకు హీరోయిన్గా ఎవరు నటించనున్నారన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. మొదట సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నా తన డేట్స్ కుదరక పోవడంతో సెట్ కాలేదు. దీంతో మేకర్స్ నిత్యా మీనన్‌ను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. ఇప్పటికే పవన్ సినిమాలో నిత్య నటించనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే . తాజాగా ఈ సినిమాలో పవన్‌కు భార్యగా నిత్యా మీనన్ నటించనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఒక రకంగా ఈ సినిమా నిత్యామీనన్‌కు కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి (2015) తరువాత పెద్ద చిత్రాలకు ఆమె ఇంత వరకు సంతకం చేయలేదు. ఇక ఇదే సినిమాలో మరో యంగ్ హీరో రానా నటిస్తుండగా, అతడికి జోడీగా కోలివుడ్ నటి ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేశారు. ఇటవలె పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకోవడంతో త్వరలోనే ఈ మూవీ షూటింగులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. చదవండి : రీ ఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్.. బోల్డ్ పోస్టర్ రిలీజ్ Vakeel Saab: పవన్ సినిమాపై పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు -
నిత్యా మీనన్ ఫోటోషూట్.. మత్తెక్కిస్తున్న మలయాళీ కుట్టి..
-
‘గమనం’ ట్రైలర్‌ను విడుదల చేసిన పవన్ కల్యాణ్
-
పవన్ చేతుల మీదుగా ‘గమనం’ ట్రైలర్
దర్శకుడు సుజనారావు తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘గమనం’. మొత్తం అయిదు భాషల్లో(తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ) రూపొందుతున్న ఈ సినిమాలో శ్రియ శరణ్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టుర్లు గమనంపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా గమనం సినిమా తెలుగు ట్రైలర్‌ను ఈ రోజు(బుధవారం) ఉదయం 09.09 గంటలకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్‌తో కలిసి ట్రైలర్‌ను వీక్షించారు. ఇక మూడు విభిన్న కథలతో తెరకెక్కిన ‘గమనం’ ట్రైలర్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. చెవిటి యువతిగా చంటిబిడ్డతో శ్రియ పడే కష్టాలు, క్రికెటర్ కావాలనుకునే ఓయువకుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముస్లిం యువతి, రోడ్డుపై చెత్త కాగితాలు ఏరుకునే ఇద్దరు అనాథ పిల్లల జీవితం.. ఇలా మూడు కథలతో గమనం ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. చదవండి: ‘గమనం’ నుంచి నిత్య ఫస్ట్ లుక్... మొత్తం అయిదుభాషల్లో ఈ సినిమా రూపొందుతుండటంతో ట్రైలర్‌ను కూడా అయిదు భాషల్లో విడుదల చేశారు. ఇందులో భాగంగా తెలుగు ట్రైలర్‌ను పవన్ విడుదల చేశారు. హిందీలో సోనూసూద్, తమిళ్లో జయం రవి, కన్నడలో శివరాజ్ కుమార్, మలయాలళంలో ఫహద్ ఫసిల్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. కాగా గమనంలో నిత్యామీనన్ కర్ణాటక గాయకురాలు శైలపుత్రీ దేవి పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు సమకూర్తుండగా.. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. రమేష్ కరుటూరి, వెంకీ పుషడపులతో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. చదవండి: ఆ విషయం తెలిసి విస్తుపోయాం: పవన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Trailer looks promising says Power Star @PawanKalyan after watching the Telugu trailer of #Gamanam. 👉 https://t.co/iipMN1mtUV ⭐️ing @shriya1109 @iam_shiva9696@ItsJawalkar 🎬@sujanaraog 🎥@gnanashekarvs 💰@RameshKarutoori @Pushadapu@GamanamMovie #GamanamTrailer pic.twitter.com/LV105cIbVV — BARaju (@baraju_SuperHit) November 11, 2020 -
‘గమనం’ నుంచి నిత్య ఫస్ట్ లుక్ అవుట్
శ్రియ 'సరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గమనం. సునారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి శ్రియ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు క్రిష్ జాగర్లముడి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో శ్రియ చీర కట్టుకొని, మెడలో మంగళసూత్రం ధరించి ఓసాధారణ గృహిణిలా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నిత్యామీనన్ ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ నటుడు శర్వానంద్ ట్విటర్లో విడుదల చేశారు. ‘గమనం నుంచి శైలపుత్రీదేవి(నిత్యామీనన్)ను పరిచయం చేస్తున్నాను. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. (శ్రియ ‘గమనం’ ఎటువైపు..?) ఈ సినిమాలో నిత్యా కర్ణాటక గాయకురాలు శైలపుత్రీ దేవి పాత్రలో కనిపించనున్నారు. ఇక సంప్రదాయ లుక్‌లో చీర కట్టుతో ఉన్న నిత్యా మీనన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటు సమకూరుస్తుండగా.. జ్ఞానశేఖర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మేష్ కరుటూరి, వెంకీ పుషడపు లతో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో నిత్యామీనన్, ప్రియాంకా జవాల్కర్ శివ కందుకూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. (ఇది కామ్ టైమ్ఇది కామ్ టైమ్) చదవండి : సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే.. -
ఇది కామ్ టైమ్
‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల అందరం ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఖాళీ సమయాన్ని ఎక్కువగా మన గురించి మనం విశ్లేషించుకోవడానికి ఉపయోగిద్దాం. నేను అదే చేస్తున్నాను’’ అన్నారు నిత్యా మీనన్. లాక్డౌన్లో చేస్తున్న విషయాల గురించి, తదుపరి చిత్రాల గురించి నిత్యా మీనన్ మాట్లాడుతూ– ‘‘ఈ ఖాళీ సమయాన్ని ఉపయోగకరంగా వినియోగించుకుంటున్నాను. అలాగే దీన్ని నా ‘కామ్ టైమ్’గా మార్చుకున్నాను. నా గురించి నేను ఇంకా ఎక్కువ విశ్లేషించుకోవడానికి వీలు దొరికింది. ఇలాంటి సమయం మళ్లీ దొరకదు. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితి వల్ల అందరం మానసికంగా పోరాటం చేస్తున్నాం. ఎవరి ఫైట్ వాళ్లది. అలాగే ప్రస్తుతం డిజిటల్ నుంచి చాలా స్క్రిప్ట్ ఆఫర్స్ ఉన్నాయి. స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా కమిట్ అవుతాను. వెబ్‌లోనూ అదే పద్ధతిని పాటిస్తాను. ప్రస్తుతం జయలలిత బయోపిక్, తమిళంలో ధనుష్ తో ఓ సినిమా, తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
పెళ్లి చేసుకోవాలంటూ ఆ హీరో నన్ను..
ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్న నిత్యా మీనన్ తాజాగా తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. నిజానికి తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదని, కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ఈ విషయంలో తనకు ఓ కుటుంబ సభ్యుడిలా వ్యవహరిస్తున్నాడని పేర్కొంది. తెలుగు రీమేక్ ఓకె కాదల్ సహా దాదాపు ఐదు సినిమాల్లో నిత్యామీనన్, దుల్కర్ కలిసి నటించారు. దీంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని, చాలాసార్లు పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశాడని తెలిపింది. (చైనా మొబైల్ కంపెనీ డీల్‌ను వదులుకున్న హీరో! ) అంతేకాకుండా పెళ్లి చేసుకుంటే జీవితంలో వచ్చే మార్పులను కూడా వివరించాడని, కొన్నిసార్లు అయితే దుల్కర్ అంత గొప్పగా చెబుతుంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. ప్రముఖ నటుడు మమ్ముట్టి కుమారుడైన దుల్కర్ సల్మాన్ అమల్ సుఫియాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి అమీరా సల్మాన్ అనే కూతురు ఉంది. ఇక మణిరత్నం తెరకెక్కించిన సరే కాదల్ కన్మణి ( ఓకె కాదల్ ) సినిమాలోని తారా పాత్ర తనకు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందని నటి నిత్యా మీనన్ పేర్కొన్నారు. ఇటీవలె తమిళంలో మిస్కిన్ దర్శకత్వం వహించిన పిస్కో చిత్రంలో ఓ పోలీసు అధికారిగా నిత్యా మీనన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా బ్రీత్2 ఇన్ టూ ద షాడోస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. (ప్రభాస్ సాధించిన ఐదు అంశాలు) -
షూటింగ్లో సామాజిక దూరం కష్టమే!
రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడంతో చిత్రీకరణలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. అయితే కొందరు హీరో హీరోయిన్లు మాత్రం కరోనా ప్రభావ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు షూటింగ్స్‌కి వెళ్లకపోవడమే ఉత్తమమని ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షూటింగ్లో మీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? అనే ప్రశ్నను హీరోయిన్ నిత్యామీనన్ ముందుంచితే– ‘‘ప్రస్తుతం నా చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఏప్రిల్ నుంచి ఈ ఏడాది చివరి వరకు నేను షూటింగ్స్‌లో పాల్గొనాల్సింది. కానీ కరోనా వల్ల సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో షూటింగ్స్‌లో పాల్గొనకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం. ఎందుకంటే మాట్లాడుకోకుండా, చర్చించుకోకుండా వర్క్ చేయడం సినిమాల్లో కష్టం. అలాగే లొకేషన్లో సామాజిక దూరం పాటించడం అనే అంశం కూడా ఆచరణలో విజయవంతంగా కుదరకపోవచ్చు. అందుకే సెట్స్‌లో జాయిన్ అయ్యేందుకు నాకేం తొందరలేదు. కానీ ఒకటి రెండు రోజులు షూటింగ్స్ చేస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుందంటే అప్పుడు నేను షూటింగ్లో పాల్గొంటాను’’ అని పేర్కొన్నారు. అలాగే తాను ధనుష్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నానని కూడా నిత్యామీనన్ వెల్లడించారు. ఆశ చాలా ప్రమాదరకం: హీరోయిన్ నిత్యా మీనన్ నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’. ఇది బ్రీత్ సిరీస్‌లో రెండోవది. ఇందులోని నిత్యామీనన్ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘ముమ్మ అంత త్వరగా వదిలి పెట్టదు. సియా దొరుకుతుంది. ఆశ అనేది చాలా ప్రమాదరకరమైనది. జూలై 1న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. జూలై 10న ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ స్ట్రీమ్ అవుతుంది’’ అని పేర్కొన్నారు నిత్యామీనన్. -
ఇప్పుడప్పుడే షూటింగ్‌కు వెళ్లను
లాక్డౌన్ వల్ల సినిమాలు పక్కనపెట్టి కాస్త ప్రశాంతంగా గడిపిన సెలబ్రిటీలు ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకునే సమయం వచ్చేసింది. ఇప్పటికే సీరియల్స్ షూటింగ్‌లు ప్రారంభమగా సినిమా వాళ్లు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ అంటూ సెట్స్‌లో అడుగుపెడుతున్నారు. అయితే తనకు ఇప్పుడప్పుడే షూటింగ్లో పాల్గొనే ఆలోచన లేదంటోంది మలయాళ బ్యూటీ నిత్యామీనన్. సెట్స్‌లో భౌతికదూరం పాటించడం దాదాపు అసాధ్యమని, ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని పరిశీలించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసింది. అయినా దీనికంత తొందరేం లేదని తెలిపింది. మరోవైపు ఈ లాక్డౌన్ కాలాన్ని విపరీతంగా వాడేసుకున్నానంటోంది. బెంగళూరులో కుటుంబంతో కలిసి నివసించేందుకు అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేసింది. (ధనుష్‌తో మొదటిసారి... నిత్య ) ఈ సమయంలో రాయడం, చదవడం మళ్లీ మొదలెట్టానని, పనిలో పనిగా ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టినట్లు తెలిపింది. ముఖ్యంగా వీధులన్నీ నిర్మానుష్యంగా, నిశ్శబ్ధంగా ఉండటం ఎంతో ప్రశాంతతనిచ్చిందని పేర్కొంది. కాగా నిత్య చేతిలో నాలుగైదు ప్రాజెక్టులుండగా అటు వెబ్ సిరీస్‌కూ పచ్చజెండా ఊపేసింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న "బ్రీత్: ఇన్ టు ది షాడోస్" చిత్రంతో వెబ్ సిరీస్‌లో తెరంగ్రేటం చేయనుంది. ఇందులో అభిషేక్ బచ్చన్, అమిత్ సాధ్, సైయామీ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆమె చివరిసారిగా 'సైకో' చిత్రంలో కనిపించింది. (తను నీడలో ఉంది) -
తను నీడలో ఉంది
‘అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నిత్యా మీనన్. అంతేకాదు.. తన నటనతో మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ ప్రేక్షకుల హృదయాల్లోనూ చోటు సంపాదించుకున్న ఈ మలయాళ బ్యూటీ తొలిసారి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. మాధవన్, అమిత్ సాధ్ నటించిన సూపర్ హిట్ ‘బ్రీత్’ వెబ్ సిరీస్‌కి ఇది రెండవ సీజన్. రెండో సీజన్లో అమిత్ సాధ్ కూడా కీలక పాత్రలో నటించారు. జూలై 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ ప్రసారం కానుంది. కాగా అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్‌లకు ఇది తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం. ‘తను నీడలో ఉంది... కనుగొనబడటానికి వేచి చూస్తోంది’ అంటూ ఈ సిరీస్ తొలి పోస్టర్ని విడుదల చేశారు. -
సహాయం కోసం వేలం
కరోనా వల్ల ప్రపంచం ముందుకు వెళ్లకుండా ఆగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రభావం అందరి మీదా పడింది. ఈ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎవరికి తోచిన స్థాయిలో వారు సహాయం చేస్తున్నారు. సినిమా స్టార్స్ కుడా విరాళాలు ఇస్తూ, ఫ్యాన్స్‌ని సహాయం చేయమని పిలుపునిస్తూ ఉన్నారు. తాజాగా నిత్యా మీనన్ కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాలకు సహాయం చేయదలచుకున్నారు. అందుకోసం ఓ భిన్నమైన దారిని ఎంచుకున్నారు. గతంలో ఓ ఫ్యాషన్ షో కోసం తాను వేసుకున్న డిజైనర్ డ్రెస్‌ని వేలం వేస్తున్నారు నిత్య. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ఓ ఫౌండేషన్ ద్వారా పలు గ్రామాలకు సహాయం చేయాలనుకుంటున్నారు. (ఓ రైటర్ కథ) -
హీరోయిన్ నిత్యామీనన్ ఫోటోలు
-
ధనుష్‌తో నిత్యామీనన్ రొమాన్స్..!
చెన్నై : నటుడు ధనుష్‌తో ఫస్ట్‌టైమ్ రొమాన్స్ చేయడానికి నటి నిత్యామీనన్ రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. ధనుష్ సక్సెస్ బాటలోపడ్డారు. చిత్రాల వేగాన్ని పెంచారు. ఈ మధ్య నటించిన అసురన్ చిత్రం ధనుష్‌లో నూతనోత్సాహాన్ని పెంచిందని చెప్పవచ్చు. ఈ తరువాత నటించిన పటాస్ సక్సెస్ అయ్యింది. కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేశారు. దీనికి సురుళి అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. కాగా ధనుఫ్ ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను అవుతున్నారు. అవును షమితాబ్ చిత్రం తరువాత హిందీలో మరో చిత్రాన్ని చేయనున్నారు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించనున్న ఆట్రాంగి రే. అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇకపోతే ఆయన నటించనున్న 43వ చిత్రం గురించి ఇటీవల వార్త వెలువడింది. ఇంతకు ముందు పటాస్ చిత్రాన్ని నిర్మించిన సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ దీన్ని నిర్మించనుంది. దీనికి యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించనున్నారు. కాగా ధనుష్ నటించనున్న 44వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రంలో సంచలన నటి నిత్యామీనన్ నాయకిగా నటించనుందన్నది తాజా సమాచారం. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు నచ్చితే అది ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధం అంటుంది. అది రెండు మూడు సన్నివేశాల్లో కనిపించే పాత్ర అయినా సరే. నచ్చకపోతే అది మణిరత్నం చిత్రం అయినా నో చెప్పేస్తుంది. కాగా ఈమె మిష్కిన్ దర్శకత్వంలో ఉదయనిధిస్టాలిన్‌తో కలిసి నటించిన సైకో చిత్రం ఇటీవలే విడుదలైంది. కాగా జయలలిత బయోపిక్‌తో తెరకెక్కనున్న ది ఐరన్ లేడీ చిత్రంలో నిత్యామీనన్ నటించనున్న విషయం తెలిసిందే. అలాంటిది తాజాగా నటుడు ధనుష్‌తో రొమాన్స్ చేసే అవకాశం ఈ అమ్మడిని వరించింది. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కనున్న చిత్రం ఇదే అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. -
నా కెరీర్ అయిపోలేదు
సౌత్‌లో హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకున్న నిత్యామీనన్ పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఈ ఏడాది ‘మిషన్ మంగళ్’ సినిమాతో బాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇచ్చారు. నటిగా ఇప్పటివరకూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. అయితే జాతీయ అవార్డు మాత్రం పొందలేకపోయారు. ఈ విషయం గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ – ‘‘ఒక నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేక్షకులు మెచ్చిన మంచి సినిమాలో నేను భాగమై, అందులో నా నటనకు జాతీయ అవార్డు రావాలనుకుంటున్నాను. నాకు జాతీయ అవార్డు తెచ్చే సినిమా రొటీన్‌గా ఉండకూడదు. అలాంటి సినిమా అయితేనే చేస్తాను. అయినా నా కెరీర్ ఇంకా అయిపోలేదు. చాలా కెరీర్ ఉంది కాబట్టి తప్పకుండా ఏదో ఒక సినిమాకి జాతీయ అవార్డు సాధిస్తాననే నమ్మకం ఉంది. నన్ను నేను ఎప్పుడూ ఒక కొత్త హీరోయిన్‌లానే భావిస్తాను. యాక్టర్‌గా ఇక చాలు అని అస్సలు అనుకోను’’ అని పేర్కొన్నారు. ‘మిషన్ మంగళ్’ తర్వాత వేరే హిందీ చిత్రం కమిట్ కాలేదు ఎందుకు? అనడిగితే – ‘‘నాకు నచ్చే కథ కోసం ఎదురుచూస్తున్నా’’ అన్నారు నిత్యామీనన్. -
ఇది పెద్దలు నిశ్చయించిన పెళ్లి: నిత్యామీనన్
సాక్షి, చెన్నై : ఇది పెద్దలు నిశ్చియించిన పెళ్లి అని చెప్పారు నటి నిత్యామీనన్. ఏంటీ ఈ అమ్మడికి పెళ్లెప్పుడయ్యింది అని షాక్ అయ్యారా దటీజ్ నిత్యా. చెప్పేది హాట్‌గా చెప్పడం ఈ బ్యూటీ నైజం. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించడానికి తానే పర్ఫెక్ట్ అని చెప్పి చర్చల్లో నానిన ఆమె ఏదో ఒక విషయంతో సంచలనం సృష్టించడం పరిపాటే. బాలనటిగానే సినీ రంగప్రవేశం చేసిన నిత్యామీనన్ హీరోయిన్గా మాత్రం 2006లో కథానాయకిగా కన్నడ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. అయితే 31 ఏళ్ల నిత్యాకు ఇంకా పెళ్లి ఆలోచన రాలేదట. కాగా గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ఆమె అక్కడ జరిగిన చర్చా వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ తన క్యారెక్టర్ సినిమాకు అసలు సెట్ కాదని తెలిపారు. అడవులలో మృగాలను కెమెరాలో బంధించాలన్నది తన ఆశ అని తెలిపారు. పరిస్థితుల ప్రభావంతో అనుకోకుండా నటినయ్యాను అని తెలిపారు. అయితే సమీప కాలంగా తాను సినిమాను చాలా ప్రేమించడం మొదలెట్టానని చెప్పారు. ఇదో అందమైన రంగం అని, దీని ద్వారా తాను ప్రజల మనసుల్ని మార్చగలుగుతున్నాను. నా సినిమా జీవితం పెద్దలు నిశ్చయించిన పెళ్లి లాంటిది. ప్రేమ వివాహంలా వెంటనే భార్యభర్తల మధ్య అన్యోన్యత కలగదని వ్యాఖ్యానించారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి పోను పోను అందమయిన ప్రేమానురాగాలు కలుగుతాయని తెలిపారు. అలాంటిదే తనకిప్పుడు సినిమాపై కలుగుతున్న ప్రేమ అని వెల్లడించారు. మరో విషయం ఏమింటే తనకు మెథడ్ యాక్టింగ్ తెలియదని, అదే విధంగా తనతో ఎవరూ అధికంగా పనిచేయించలేరని చెప్పారు. సన్నివేశాలను చదివి, అర్థం చేసుకునే తారగానే నటిస్తానని తెలిపారు. అలా నటన వచ్చేస్తుందని నిత్యామీనన్ పేర్కొన్నారు. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్‌కు తెలుగులో ప్రస్తుతం ఒక చిత్రం కూడా లేదు. ఇకపోతే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన సైకో చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. మాతృభాష మలయాళంలో మాత్రం రెండు చిత్రాల్లోతో పాటు, తమిళంలో జయలలిత పాత్రలో ది ఐరన్ లేడీగా మారడానికి సిద్ధం అవుతున్నారు. -
ఆ పాత్రకు నేనే పర్ఫెక్ట్ : నిత్యామీనన్
చెన్నై : నేనే పర్ఫెక్ట్ అంటోంది నిత్యామీనన్. తనకు అనిపించింది మాట్లాడడం ఈమె స్వభావం. ఎవరేమనుకున్నా సరే తనకు రైట్ అనిపించుకుంది చేసేస్తుంది. అలా పలు విమర్శలకు గురైతుంది కూడా. అందుకే నిత్యామీనన్‌పై పొగరబోతు అనే ముద్ర ఉంది. అయితే నటిగా మంచి పేరే సంపాదించుకుంది. అలాగని కథానాయకి పాత్రలనే చేస్తానని గిర్ర గీసుకుని కూర్చోదు. తనకు నచ్చితే అది చిన్న పాత్ర అయినా చేసేస్తుంది. తాజాగా చాలా పెద్ద బాధ్యతను తీసుకుంది. అదే దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రకు జీవం పోసే బాధ్యత. జయలలిత బయోపిక్‌తో రెండు చిత్రాలు, ఒక వెబ్ సిరీస్ తయారవుతున్న విషయం తెలిసిందే. దీ క్వీన్ పేరుతో దర్శకుడు గౌతమ్‌మీనన్ రూపొందిస్తున్న వెబ్ సిరీస్‌లో నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇక సినిమాగా తెరకెక్కుతున్న తలైవి చిత్రానికి విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జయలలితగా బాలీవుడ్ నటి కంగనారనౌత్ నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, చిన్న టీజర్‌ను చిత్ర వర్గాలు ఇటీవల విడుదల చేశారు. జయలలితగా కంగనారనౌత్ నప్పలేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా జయలలిత బయోపిక్‌తో తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్న మరో చిత్రానికి ది ఐరన్ లేడీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కేరళా బ్యూటీ నిత్యా మీనన్ నటించనుంది. దీని చిత్రీకరణ ప్రారంభం కాకపోయినా, ఫస్ట్‌లుక్ పో స్టర్‌ను ఆ మధ్య విడుదల చేశారు. అయితే అందులో జయలలిత ఫొటో నూ మార్పింగ్ చేశారనే విమర్శలు వచ్చా యి. కాగా జయలలిత పాత్రలో నటించనుండడం గురించి నటి నిత్యామీనన్ చాలాసార్లు తన అభిప్రాయాలను మీడియాతో పంచుకుంది. కాగా తలైవి చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైన తరువాత నటి నిత్యామీనన్ మరో సారి స్పందించింది. ఒక భేటీలో ఈ అమ్మ డు మాట్లాడుతూ..జయలలితగా నటించడానికి తానే పర్ఫెక్ట్ అని చెప్పింది. జయలలిత మాదిరిగానే తాను నచ్చని విషయాల గురించి ముఖం మీదే చెప్పేస్తానని అంది. ఇప్పుడు జయలలిత పాత్రలో నటించనుండడంతో ఆమె గురించి పూర్తిగా తెలుసుకుంటున్నానని అంది. ఆమెలా నటించడానికి తనను తాను తయారు చేసుకుంటున్నానని చెప్పింది. జయలలిత పాత్రకు 100 శాతం శ్రమిస్తానని నిత్యామీనన్ అంటోంది. -
నిత్యా @ 50
గతంలో హీరోహీరోయిన్లు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసి యాభై, వంద, నూటయాభై మైలురాళ్లు సులువుగా దాటేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 50వ సినిమా మైలురాయిని అందుకున్నారు నిత్యామీనన్. మలయాళంలో నిత్యామీనన్ చేయబోతున్న ‘ఆరామ్ తిరుకల్పన’ తన 50వ సినిమా. ఈ సినిమాలో నిత్యా పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. సెప్టెంబర్ నెలాఖరున ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 1998లో ‘ది మంకీ హూ న్యూ టూ మచ్’ అనే ఇంగ్లీష్ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన నిత్యామీనన్ కథానాయికగా మారి, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. 2008లో హీరోయిన్గా మలయాళ సినిమా చేశారు. 2010లో ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగుకు పరిచయం అయ్యారు. ‘మిషన్ మంగళ్’తో ఈ ఏడాదే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. -
‘ఐ లవ్ యూ’ చెబితే లవ్ అయిపోతుందా?
ప్రేమించడానికి ఇంకొకరు అక్కర్లేదు. మనల్ని మనం ప్రేమతో నింపుకుంటే ప్రపంచం అంతా చాలా ప్రేమగా కనబడుతుంది. సంతోషంగా ఉన్న మనిషి సంతోషాన్ని పంచినట్లు..ప్రేమ నిండిని మనిషి ప్రేమను పంచుతాడు. ప్రేమ ఒక అనుభవంగా మిగిలిపోకూడదు. ఒక అనుభూతిగా నిలిచిపోవాలి.నిన్ను నువ్వు ప్రేమించుకో. నీకంటే మంచివాళ్లు లేరు అంటున్నారు నిత్యామీనన్. ‘మిషన్ మంగళ్’ పెద్ద విజయం సాధించింది. బాధ్యతాయుతమైన ఇలాంటి సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టినందుకు ఎలా అనిపిస్తోంది? నిత్యామీనన్: మార్స్ మీద మన స్పేస్ రీసెర్చ్ వాళ్లు చేసిన మిషన్కి సంబంధించిన సినిమా ఒకటి చేసే ప్లాన్ ఉందని బాల్కీ (బాలీవుడ్ దర్శకుడు, రచయిత) నాతో చెప్పారు. మన భారతదేశం సాధించిన ఘనతకు సంబంధించిన సినిమా ఇది. బాల్కీ చెప్పగానే చాలా మంచి విషయం అనిపించింది. ‘మంచి సినిమా చేయాలి’ అన్నది ఎప్పుడూ నా గోల్. అందుకే ‘మిషన్ మంగళ్’ ఒప్పుకున్నా. ఈ సినిమా చేసినందుకు గర్వంగా, ఇలాంటి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీ కథల ఎంపిక బావుంటుంది. అయితే ‘మిషన్ మంగళ్’ కథలో మరో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. మీ పాత్రకు ప్రాధాన్యం తగ్గుతుందేమో అనిపించలేదా? నేను వేరే హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. నాకిది కొత్త కాదు. ఒక సినిమా ఒప్పుకోవడానికి నేను పట్టించుకునే విషయాల్లో ఇది చాలా చిన్న విషయం. మనం యాక్టర్ అయ్యాక చాలా మందితో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే హీరోయిన్లతో కలసి నటించనప్పుడు మనం ఎలా యాక్టర్స్ అవుతాం? అన్ని సినిమాల్లో నేనే ఉండాలి, ప్రాముఖ్యతంతా నాకే ఉండాలి.. అన్నీ నేనే, అన్నీ నాకే అనుకుంటే కుదరదు. ఎంతోమంది కలసి కష్టపడి చేస్తేనే ఒక సినిమా పూర్తవుతుంది. అఫ్కోర్స్.. నా పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే నేను ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను. సాధారంగా బాలీవుడ్లో ఫస్ట్ సినిమా సైన్ చేసేటప్పుడు ‘సోలో’ హీరోయిన్ అయితే ఎక్కువ గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది కదా? అలా సోలో హీరోయిన్గా చేయాలంటే హిందీ నుంచి నాకు చాలా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ‘ఓకే బంగారం’ సినిమా తర్వాత పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు నాకు హీరోయిన్గా ఆఫర్స్ ఇచ్చాయి. ‘సోలోగా వెళ్తే బెటర్’ అని నేనెప్పుడూ అనుకోలేదు. అందుకే ఆ కథల్లో ఒకే హీరోయిన్ అయినా కథ, పాత్ర బాగా లేవని ఒప్పుకోలేదు. వేరే హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకోకూడదని ఆలోచించేదాన్నే అయితే తెలుగులో వేరే వేరే సినిమాలు చేసేదాన్ని. నా ఆలోచనా విధానం ఎప్పుడూ అలా లేదు. ‘మిషన్ మంగళ్’ అనే మంచి సినిమాను నా దగ్గరకు తీసుకొచ్చారు. నా యాక్టింగ్ స్కిల్స్ వాళ్లకు తెలుసు. నా గత సినిమాలు చూశారు. నా మీద చాలా గౌరవంతో వచ్చారు. కథ, పాత్ర నచ్చడంతో ఒప్పుకున్నాను. మహిళలు సాధించిన విజయాన్ని చూపించే చిత్రం ‘మిషన్ మంగళ్’. మరి ఇలాంటి సినిమాలో కూడా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ సపోర్ట్ ఉండాలంటారా? నేను అంత ఆలోచించలేదు. ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చాలా ఉన్నాయి. హిట్ అయ్యాయి కూడా. తెలుగు, తమిళం, హిందీలో అన్ని భాషల్లోనూ లేడీ ఓరియంటెడ్ మూవీస్ వస్తున్నాయి. ఈ సినిమాకి అక్షయ్‌కుమార్ ఓ నిర్మాత. చిత్రదర్శకుడు జగన్‌శక్తి అక్షయ్ కుమార్ చేస్తే బావుంటుంది అనుకున్నారు. చేయించారు. పోస్టర్లో హీరోయిన్ల బొమ్మలు చిన్నవి, అక్షయ్ కుమార్ ఫొటో పెద్దదిగా డిజైన్ చేయించారు. మహిళా ప్రాధాన్యంగా సాగే సినిమాకి హీరోని ఎలివేట్ చేశారంటూ సోషల్ మీడియాలో జరిగిన చర్చ గురించి? ఈ టాపిక్ గురించి కామెంట్ చేయడానికి నాకు ఇష్టం లేదు. ఒక టీమ్‌గా మాకందరికీ ఒకరంటే ఒకరికి చాలా గౌరవం. అక్షయ్ సార్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. అయితే జెండర్ డిస్కషన్ ఎక్కువే జరిగింది. మనం అందరం వీటి గురించి చర్చలు ఆపేసి మన పని మనం చేసుకుంటే మనకు కావాల్సిన గుర్తింపు అదే వస్తుందని నా అభిప్రాయం. అంతేకానీ మగవాళ్లు ఎక్కువ.. ఆడవాళ్లు కాదా? అంటూ ఊరికే పోలుస్తూ, అనవసరమైన చర్చలు జరపడం వేస్ట్. నెగటివిటి కంటే మనందరం కలసి ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోతే మంచిది అనే విషయాన్ని నమ్ముతాను. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ‘నేను ముందు యాక్టర్‌ని ఆ తర్వాతే హీరోయిన్ని’ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. రెగ్యులర్ హీరోయిన్గా మిమ్మల్ని మీరు భావించరా? నేను హీరోయిన్ని కాదు. తెలుగులో ఎలా స్టార్ట్ అయ్యానో (తొలి సినిమా ‘అలా మొదలైంది’) మీకు తెలుసు కదా. ఆ సక్సెస్‌తో రెగ్యులర్ హీరోయిన్ అయిపోవచ్చు. కానీ విభిన్నమైన మార్గంలో వెళ్లాను. అప్పుడూ ఇప్పుడూ అలానే ఉన్నాను. చిన్న పాత్ర అయినా సరే చేశాను. యాక్టర్‌గా అదే నా గుర్తింపు అనుకుంటాను. యాక్టర్ అనే వాళ్లు ‘సెల్ఫ్ సెంటర్డ్’ గా ఉండరు. అన్నింట్లో ప్రాధాన్యం, కథంతా తమ చుట్టే తిరగాలి అన్నట్టు ఉండరు. కథలో కీలకంగా ఉంటే చాలనుకుంటారు. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. ‘సెల్ఫ్ లవ్’ అని ఈ మధ్యన ఫొటోషూట్ చేసుకున్నారు. అసలా ‘సెల్ఫ్ లవ్’ కాన్సెప్ట్ ఏంటి? లవ్ అనేది చాలా తప్పుగా అర్థం చేసుకున్న పదం. లవ్ అంటే ‘ఐ లవ్ యూ’ అని చాలామంది అనుకుంటారు. ‘ఐ లవ్ యూ’ చెబితే లవ్ అయిపోతుందా? అవదు. వేరే వాళ్ల మీద చూపించేది లేదా మనల్ని మనం ప్రేమించుకునేది ప్రేమ.. ఇలా లవ్ గురించి ఏదేదో అనుకుంటున్నాం. లవ్ కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. రిలేషన్షిప్స్లో ఉన్న అసంతృప్తి ఎందుకంటే ప్రేమ కోసం చాలా ఆరాటపడుతూ వెతుకుతున్నారు. ప్రేమ అనేది ఈ లోకంలో లేదు. మన లోపల ప్రేమ ఉంటే బయట అంత ఆరాటపడుతూ వెతకం. లోపల ఉన్న ప్రేమను మనం వ్యక్తపరచగలం. అది ట్రూ లవ్. ప్రేమ అనేది ఎప్పుడూ మనతోనే మొదలవుతుంది. అది నీతో మొదలు కానప్పుడు అది ప్రేమే కాదు. అప్పుడు ప్రేమ అనేదే లేదు. నేను ఎప్పుడూ మనిషిగా ఎదుగుతుంటాను. నేర్చుకుంటూ ఉంటాను. అలాంటి సెల్ఫ్ రియలైజేషన్‌లో నేను గ్రహించింది ‘సెల్ఫ్ లవ్’. (మనల్ని మనం ప్రేమించుకోవడం). మనల్ని మనం ప్రేమించుకుంటే మనం ప్రేమను పంచగలుగుతాం. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్నాను. అందుకే ఫొటోషూట్ చేశాను. ఫొటోషూట్ అయ్యాక ‘సెల్ఫ్ లవ్’ అని పేరు పెడదాం అని మా కెమెరామేన్ అన్నారు. పర్ఫెక్ట్ ఇదే పెడదాం అన్నాను. మీరు ఇతరుల నుంచి ప్రేమను ఆశించి అది దొరకనందువల్లే ‘సెల్ఫ్ లవ్’ అంటున్నారా? నేనే కాదు మనమందరం ప్రేమను కోరుకుంటాం. అది మనిషి సహజ స్వభావం. అయితే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన లోపల ప్రేమ ఉండాలన్నది నా అభిప్రాయం. ఈ మధ్య ఆధ్యాత్మిక ఆశ్రమాలకు వెళుతున్నారని విన్నాం. దాని గురించి? అవును. వెళుతున్నాను. ఎక్కువగా ఆధ్యాత్మిక బాటలో వెళుతుంటాను. ఈ దారి గురించి బయటకు చెప్పలేను. అది ఎక్స్పీరియన్స్ చేసినవారికే అర్థమవుతుంది. ఇది సడెన్‌గా వచ్చిందా? చిన్నప్పటి నుంచేనా? స్పిరిచ్యువల్‌గా ఆలోచించడం అనేది చిన్నప్పటి నుంచే అలవాటు. రెలీజియస్‌గా కాదు (దేవుడు, మతం.. ). అయితే వీటన్నింటి కన్నా పెద్దది ఏదో ఉంది అని నమ్ముతాను. మీ పాయింటాఫ్ వ్యూలో స్పిరిచ్యువాలిటీకి, రెలీజియన్కి ఉన్న తేడా? రెలీజియస్ అనేది బయట నుంచి ఏర్పరుచుకున్నది. మనం నమ్మిన సిద్ధాంతం కోసం ఉండటం. స్పిరిచ్యువాలిటీ అనేది మొత్తం నీ గురించే. అంతా నువ్వే. నీకు, ఆ పవర్‌కు ఉన్న అనుబంధమే ఆధ్యాత్మికం. ఈ దారిలో వెళుతూ వెళుతూ ఫైనల్‌గా తెలుసుకునేది ఏంటంటే ‘నువ్వే ఆ సూపర్ పవర్’ అని. స్పిరిచ్యువాలిటీలో మనమే దేవుడు అనుకునే స్టేజ్ కూడా ఉంటుంది. దాని గురించి? దీని గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. దేవుడు, మనం వేరు కాదు అని చెబితే పూర్తిగా అర్థం కాదు. చెప్పిన దాన్ని సరిగ్గా తీసుకోకపోతే మొత్తం తప్పు అర్థం ధ్వనిస్తుంది. స్పిరిచ్యువాలిటీ గురించి మాట్లాడటం కష్టం. దీన్ని అనుభవించాల్సిందే. అది ఓ ఎక్స్పీరియన్స్. అందరికీ ఆ ఎక్స్పీరియన్స్ రావాలి. ఇప్పుడు ఎవరి జీవితంలో చూసినా ఒత్తిడే ఉంది. నేను అందరికీ ఏం చెబుదాం అనుకుంటున్నానంటే... మీరు స్ట్రెస్‌లో ఉంటే.. అది వృత్తిపరమైనది కావొచ్చు, వ్యక్తిగతమైనది కావొచ్చు.. ఒత్తిడిలో ఉన్నప్పుడు రాత్రి నిద్రపోయే ముందు రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఇలా చేయకుడదు, ఇలా అని ఉండకూడదు అని ఆలోచిస్తాం. ఆ ఆలోచన వచ్చిందంటే మనం ‘సఫరింగ్ స్టేజ్’లో ఉన్నాం అని అర్థం. అలా ఉన్నప్పుడు లైఫ్‌లో ఇది సాధారణమే అనుకుని వదిలేయకూడదు. ఇంతకంటే హ్యాపీగా ఉండొచ్చు అనే నమ్మకం పెంచుకోవాలి. ఆ నమ్మకం ఉంటే ఆనందం మన దగ్గరకు వచ్చేస్తుంది. ఆ మధ్య ‘కారు అనేది నా ఫ్రెండ్. నేను ఇండిపెండెంట్ అని అదే తెలియజేసింది’ అన్నారు. కారుతో ‘ఇండిపెండెంట్’ ఫీలింగ్ రావడం ఏంటి? కారు మాత్రమే కాదు. అది ఓ చెట్టు, ఇల్లు ఏదైనా అవ్వొచ్చు. నాకు సోల్ అటాచ్మెంట్ చాలా ఉంటుంది. ప్రతీదీ ఓ అనుభవమే. నేను ఫస్ట్ కారు కొన్నప్పుడు వ్యక్తిగతంగా ఏదో సాధించాననిపించింది. నా సొంత సంపాదనతో కొనుకున్నాను. నాకు స్వాతంత్య్రం వచ్చింది అనే భావన కలిగింది. ఎవరి మీదా ఆధారపడకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్లొచ్చు అనే ఫీలింగ్. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అప్పటి వరకూ వేరేవాళ్ల కారు తీసుకొని డ్రైవ్ చేసేదాన్ని. సొంత కారు కొనుక్కున్న తర్వాత స్వేచ్ఛ వచ్చిన ఫీలింగ్. జనరల్‌గా మనందరం ఏవేవో కొనుక్కుంటాం. ఉదాహరణకు కారుని తీసుకుందాం, అది కారు అనుకుంటే జస్ట్ కారు.. అంతే. అంతకుమించి అనుకుంటే దానితో సోల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే.. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ చేస్తున్నారు కదా? ఆ సినిమా విశేషాలు? ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం. దర్శకురాలు ప్రియదర్శిని ఏదో క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయాలనుకోవడంలేదు. ఎప్పుడు ఆరంభించాలి? ఎప్పుడు రిలీజ్ చేయాలనేది ముఖ్యమైన విషయంగా ఆమె అనుకోవడంలేదు. క్వాలిటీ ఫిల్మ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావొచ్చింది. బయోపిక్ చేయడం అనేది ఏదైనా ఒత్తిడిగా ఉంటుందా? రెగ్యులర్ చిత్రాలకు, బయోపిక్‌కి చాలా తేడా ఉంది. కల్పిత పాత్రలనుకోండి మన ఇష్టం వచ్చినట్లు మనం చేయొచ్చు. అదే నిజజీవిత పాత్రలనుకోండి.. వాళ్లు నడిచినట్లు నడవాలి, చూసినట్లు చూడాలి.. అంతా వాళ్లలా కనిపించాలి. అయితే నాకు ప్రెజర్ ఏమీ లేదు. ఏ క్రియేటివ్ పర్సన్ అయినా ఒత్తిడికి గురి కాకూడదని నా అభిప్రాయం. ఒకవేళ ప్రెజర్ ఫీలైతే సరిగ్గా వర్క్ చేయలేరు. ఈ సినిమా కమిట్ అయినవాళ్లందరం బాగా చేయగలుగుతామనే నమ్మకంతో ఉన్నాం. ఫైనల్లీ కాస్త బరువు పెరిగారని ఆ మధ్య సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ ‘వెయిట్ ఇష్యూస్’ గురించి? (నవ్వేస్తూ). అవతలివాళ్ల బరువు గురించి చర్చించుకోవడానికి మించిన మంచి విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాల గురించి చర్చించుకోవచ్చు. బరువుది ఏముంది? ఇవాళ ఉంటుంది. తగ్గిస్తే కొన్నాళ్లకు అదే తగ్గిపోతుంది. ఇదిగో ఆ మధ్య నేను కొంచెం లావుగా ఉన్నానా? ఆ తర్వాత తగ్గాను. అందరూ అన్నారని కాదు.. నాకే తగ్గాలనిపించి తగ్గాను. కొన్ని ‘నెగటివ్ మైండ్స్’ చుట్టూ ఉన్న పాజిటివిటీని పట్టించుకోకుండా నెగటివ్‌ని మాత్రమే మాట్లాడటానికి ఆసక్తి చూపిస్తాయి. ప్రపంచంలో చాలా పాజిటివిటీ ఉంది. దాని గురించి మాట్లాడుతూ హ్యాపీగా ఉండండి. మీ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. నిజానికి నేను విమర్శలను మనసుకి తీసుకోను. వాటిని పెద్దవిగా చేసి బాధపడిపోను. చాలా ‘లో థింకింగ్’ ఉన్నవాళ్లు మాట్లాడే మాటలకు ప్రాధాన్యం ఇవ్వను. నా చుట్టూ ఉన్న పాజిటివిటీని చూస్తాను. నేను చాలా ‘హ్యాపీయస్ట్ పర్సన్’ని. మీరు ఓ కీలక పాత్ర చేసిన ‘అ!’ సినిమాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. దాని గురించి? చాలా చాలా సంతోషంగా ఉంది. ‘అ!’ అనేది తెలుగులో చాలా ప్రయోగాత్మక చిత్రం అని చాలామంది అన్నారు. తెలుగులో ఇలాంటి భిన్నమైన సినిమాలు రావాలని, కొత్త కొత్త విషయాలు చెప్పాలని ఎప్పుడూ అనుకున్నాను. ‘అ!’ సినిమాకు నేను చాలా సపోర్ట్ చేశాను. మేమందరం ఓ ఫ్రెండ్షిప్తో చేశాం. ఆ సినిమా వర్కౌట్ అయింది. అందరం చాలా హ్యాపీ. ఇష్టపడి చేసిన సినిమాకి జాతీయ స్థాయి గుర్తింపు వస్తే ఆ హ్యాపీనెస్‌ని మాటల్లో చెప్పలేం.n ‘బ్రీత్ 2’తో వెబ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆ సిరీస్ విశేషాలు? సినిమాలకి, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి ఉన్న తేడా ఏంటంటే.. సినిమా ప్రేక్షకులు భారీగా ఉంటారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రేక్షకులను ఊహించగలుగుతాం. అందుకే వాళ్లని మాత్రమే టార్గెట్ చేసి, స్క్రిప్ట్ రాపే వీలుంటుంది. ఏ కథ అయినా చూపించే స్కోప్ ఉంటుంది. ‘సెన్సిబుల్ స్టోరీ’లో నటించే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంతకుముందు నాలుగైదు వెబ్ సిరీస్‌లు చేసే చాన్స్ వచ్చినా, కంటెంట్ సంతృప్తిగా అనిపించకపోవడంతో ఒప్పుకోలేదు. ‘బ్రీత్ 2’ నాకో మంచి అనుభూతి ఇచ్చింది. ప్రో కబడ్డీకి కామెంట్రీ చెప్పారు? ఆ ఎక్స్పీరియన్స్ గురించి? ‘మిషన్ మంగళ్’ ప్రమోషన్స్‌లో భాగంగా మూడు భాషల్లో ప్రో కబడ్డీకి కామెంట్రీ చెప్పాలన్నారు. ముందు తెలుగులో చెప్పాలని అడిగారు. కామెంట్రీ బాక్స్‌లో కూర్చుని గేమ్ చూస్తూ, చెప్పడం ఓ మంచి అనుభూతి. అప్పటివరకు నేను కామెంట్రీ బాక్స్‌లో కూర్చోలేదు. చాలా ఎంజాయ్ చేశాను. అందుకే మళ్లీ చెప్పించాలనుకుంటే పిలవండి అని చెప్పాను. – డి.జి. భవాని -
పవర్ఫుల్
ఓ నేరానికి సంబంధించిన ఆధారాల కోసం ఓ పోలీసాఫీసర్‌తో కలిసి వర్కవుట్ చేస్తున్నారు నిత్యామీనన్. విషయం ఏంటంటే.. ఆమె ఓ క్రైమ్ థ్రిల్లర్‌లో కథానాయికగా నటిస్తున్నారు. ‘ఆరమ్ తిరుకల్పన’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అజయ్ దేవలోక దర్శకుడు. షైన్ టామ్ చాకో ఈ చిత్రంలో హీరోగా నటిస్తారు. ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘‘ఈ సంఘటన గురించి షైన్‌తో మాట్లాడినప్పుడు చాలా కొత్తగా ఉందన్నాడు. స్క్రీన్‌ప్లే ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. షైన్ పోలీసాఫీసర్ పాత్రలో నటించనున్నారు. నిత్యామీనన్ పాత్ర స్ట్రాంగ్ అండ్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది’’ అని అజయ్ దేవలోక పేర్కొన్నారు. -
నా వల్లే ఆమె పెళ్లి జరిగింది!
తమిళసినిమా: నా వల్లే ఆమె పెళ్లి జరిగింది అంటోంది నటి నిత్యామీనన్. సినీ పరిశ్రమలో పొగరుబోతుగా ముద్ర పడిన నటి నిత్యామీనన్. తనకు నచ్చితే ఎలాంటి పాత్రనైనా చేయడానికి సై అనే ఈ కేరళా కుట్టి నచ్చకపోతే ఎంత పెద్ద దర్శకుడి చిత్రానైనా నిరాకరించేస్తుంది. అలా మాతృభాషలోనూ తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌లో టైటిల్ పాత్రను పోషిస్తున్న నిత్యామీనన్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. నటి నజ్రియా గుర్తుండే ఉంటుంది. తిరుమణం ఎన్నుం నిక్కా, రాజారాణి వంటి కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన ఈ మలయాళీ బ్యూటీ మాతృభాషలోనూ పలు చిత్రాలు చేసింది. కథానాయకిగా మంచి మార్కెట్ ఉండగానే నటుడు ఫాహత్ ఫాజిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా సినిమాలకు రీఎంట్రీ అవుతోందనుకోండి. అది వేరే విషయం. ఈమె పెళ్లికి తానే కారణం అంటోంది నటి నిత్యామీనన్. దీని గురించి ఈమె తెలుపుతూ బెంగళూర్ డేస్ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం తనకే వచ్చిందని చెప్పింది. అయితే తానప్పుడు ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆ చిత్రంలో నటించలేకపోయానని చెప్పింది. తాను వదులుకున్న అవకాశం ఆ తరువాత నటి నజ్రియాను వరించిందని చెప్పింది. ఆ చిత్ర షూటింగ్‌లోనే ఫాహత్ ఫాజిల్‌కు, నటి నజ్రియా మధ్య పరిచయం ప్రేమగా మారిందని, ఆ చిత్ర నిర్మాణం పూర్తి అయ్యేలోపే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారన్న రహస్యాన్ని నిత్యామీనన్ బయట పెట్టింది. అంతే కాదు ఏ కార్యక్రమంలో కలిసినా నీ వల్లే మా పెళ్లి జరిగిందని నటి నజ్రియా, ఫాహత్ ఫాజిల్ గొప్పగా అంటుంటారని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడమ్మా అంటే మాత్రం దానికి ఇంకా చాలా టైమ్ ఉంది అంటూ దాటేసే ధోర ణిలో మాట్లాడుతోంది. -
ఆ ఫీలింగ్ కలగలేదు!
ఇప్పటివరకు సౌత్‌లో సత్తా చాటి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కథానాయిక నిత్యామీనన్. ఈ ఏడాది ఆమె నార్త్ వైపు(బాలీవుడ్) కూడా దృష్టిసారించారు. ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్ ఆధారంగా తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘మిషన్ మంగళ్’ సినిమాలో నిత్యామీనన్ శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హిందీలో ఆమె ‘బ్రీత్ 2’ అనే వెబ్ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్‌కు జోడీగా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇన్ని రోజులు సౌత్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన మీరు ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారు అన్న ప్రశ్నను నిత్యామీనన్‌ను అడిగినప్పుడు–‘‘హిందీ పరిశ్రమలో నేను ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను కానీ ఇక్కడి వారికి నేను తెలుసు. నా సినిమాలు కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. న్యూ కమర్‌ని అని, అవుట్‌సైడర్‌ని అన్న ఫీలింగ్ కలగలేదు నాకు. తక్కువ కాలంలోనే స్నేహితులుగా కలిసిపోయాం. ఇప్పుడు నేను హిందీలో చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్‌కు కెమెరామెన్స్ తమిళులే. వారితో నేను తమిళంలోనే మాట్లాడుతున్నాను. అక్కడ కంఫర్ట్‌గానే ఉంది. ‘మిషన్ మంగళ్’ సినిమాలో నా షూటింగ్ పూర్తికావొచ్చింది. బ్రీత్ వెబ్‌సిరీస్ ‘బ్రీత్ 2’లో నటిస్తున్నా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘ఐరన్‌లేడీ’ సినిమాలో లీడ్ రోల్ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు. -
చైతూకి జోడిగా లక్కీ స్టార్
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కెరీర్ ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతుంది. ఒక హిట్ వస్తే రెండు వరుస ఫ్లాప్‌లు ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల సవ్యసాచి సినిమాతో నిరాశపరిచిన చైతూ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాతో సమంత హీరోయిన్గా నటిస్తున్నారు. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న తొలి సినిమా కావటంతో మజిలీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా చైతూ ఒకే చేసినట్టుగా తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు నాగచైతన్య ఓకె చెప్పాడట. ఈ సినిమాకు హీరోయిన్గా నిత్య మీనన్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. వరుస ఫ్లాప్‌లలో ఉన్న హీరోలు నిత్యాతో కలిసి నటిస్తే సక్సెస్ వస్తుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అందుకే చైతూ సినిమా కోసం నిత్యాను తీసుకునే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. -
మీటూ.. నా రూటే సపరేటు!
తమిళసినిమా: నా రూటే సపరేటు అంటోంది నటి నిత్యామీనన్. బహుభాషా నటి అయిన ఈ అమ్మడిప్పుడు ఒక సంచలన పాత్రలో నటించడానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది. అదేమిటో చాలా మందికి అర్థం అయ్యే ఉంటుంది. అవును. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగా మారడానికి నిత్యామీనన్ ఎదురుచూస్తోంది. జయలలిత బయోపిక్‌ను దర్శకులు భారతీరాజా, విజయ్, లింగుస్వామి, ప్రియదర్శిని మొదలగు నలుగురు తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో మహిళా దర్శకురాలు ప్రియదర్శిని మినహా ఏ దర్శకుడూ తమ చిత్రంలో జయలలిత పాత్రను పోషించే నటిని ఎంపిక చేయలేదింకా. ప్రియదర్శిని మాత్రం వేగం పెంచి తన చిత్రంలో నిత్యామీనన్ జయలలితగా నటించనున్నట్లు వెల్లడించారు. చిత్రానికి ది ఐరన్ లేడీ అని పేరు కూడా ఖరారు చేశారు. ఈ చిత్రం గురించి నిత్యామీనన్ ఒక భేటీలో పేర్కొంటూ ది ఐరన్ లేడీ చాలా పెద్ద చిత్రం అవుతుందని చెప్పింది. ప్రియదర్శిని కథ చెప్పగానే తనకు చాలా బాగా నచ్చేసిందన్నారు. ఒక బయోపిక్ చేస్తున్నప్పుడు అందులోని పాత్రకు అవసరమైన నటనను పూర్తిగా అందించాలని నిర్ణయించుకున్నానంది. సరైన మార్గంలో నమ్మకంతో ప్రయదర్శిని చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పింది. ఈ చిత్రంలో నటించడానికి తాను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాని తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న మీటూ గురించి స్పందించ మంటున్నారని, మీటూకు తాను వ్యతిరేకిని కానని స్పష్టం చేసింది. అయితే లైంగిక వేధింపులు, హద్దు మీరిన చర్యలను ఎదుర్కొనడానికి తన వద్ద వేరే మార్గం ఉందని చెప్పింది. అందువల్ల తాను ఆ గ్రూప్‌తో కలిసి పోరాడనని అంది. అలాంటి విషయాల గురించి స్పందించకపోయినంత మాత్రాన తాను మహిళలు ఎదుర్కొంటున్న అత్యాచారాలను సమర్థిస్తున్నానని భావించరాదని, అలాంటి సంఘటనలను తాను వేరే మార్గంలో ఎదుర్కొంటానని నిత్యామీనన్ చెప్పింది. -
ఇలా బతకాలి!
‘ఇలా బతకాలి’ అని కొందరికి లెక్కలుంటాయి. లెక్కలు కాదు కానీ కొందరికి ‘ఇలా బతకాలి’ అని కోరికలు ఉంటాయి. కోరికలు అనే కంటే ఆశలు అనాలి వాటిని. అందంగా ఉంటాయి ఆ ఆశలు. సౌతిండియన్ సినిమా స్టార్ హీరోయిన్లలో ఒకరైన నిత్యామీనన్‌కు కూడా కొన్ని ఇలాంటి అందమైన ఆశలు ఉన్నాయి. పిల్లలతో ఉండటమంటే ఆవిడకు చాలా ఇష్టం. పిల్లలతో కలిసి సరదాగా కబుర్లు చెప్పడం, ఆటలాడుకోవడం.. ఇలాంటివి నిత్యామీనన్‌కు ఎప్పుడూ ఒక ‘హై’ని ఇస్తాయట. తాజాగా ఈమధ్యే బిజీ షెడ్యూల్స్‌లో ఖాళీ దొరికిన ఒకరోజు, తనకు దగ్గర్లో ఉన్న ఉడిపిలోని ఒక చిన్న ఊర్లోని పిల్లలను కలుసుకున్నారు నిత్యా. వారితో కలిసి అదే ఊర్లో ఉన్న ఒక పెద్ద కొండ ఎక్కి, కొండపైన కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ, ‘పిల్లలతో కలిసి ఇలా కొండెక్కి, ఇక్కణ్నుంచి కిందనున్న ఊరిని చూస్తున్నాం. ఇది బాగుంది. నాకు ఇలా బతకడం ఇష్టం’ అన్నారు నిత్యామీనన్! -
స్క్రీన్ టెస్ట్
► ఈ నలుగురు హీరోల్లో అక్టోబర్ 23న పుట్టిన హీరో ఎవరో కనుక్కోండి? ఎ) ప్రభాస్ బి) యన్టీఆర్ సి) మహేశ్‌బాబు డి) రామ్‌చరణ్ ► ‘వర్షం’ సినిమాలో ఫేమస్ సాంగ్ ‘నువ్వొస్తానంటే నే వద్దంటానా...’ పాడిన సింగర్ ఎవరో తెలుసా? ఎ) కౌసల్య బి) గీతా మాధురి సి) సునీత డి) కేయస్ చిత్ర ► రామ్‌చరణ్–బోయపాటి సినిమాలో ఓ బాలీవుడ్ కథానాయకుడు విలన్‌గా నటిస్తున్నాడు. ఎవరా హీరో? ఎ) జాకీ ష్రాఫ్ బి) సైఫ్ అలీఖాన్ సి) వివేక్ ఒబెరాయ్ డి) షాహిద్ కపూర్ ► నాని గతంలో చాలామంది హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఓ పెద్ద హీరోతో కలిసి నటిస్తున్నాడు. ఎవరా పెద్ద హీరో? ఎ) బాలకృష్ణ బి) నాగార్జున సి) వెంకటేశ్ డి) రవితేజ ► ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో యన్టీఆర్ మరదలిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) నిత్యామీనన్ బి) హన్సిక సి) సమంత డి) కృతీ సనన్ ► ‘మక్కల్ నీది మయమ్’ అనే తమిళ పార్టీని ఓ ప్రముఖ నటుడు స్థాపించారు. ఆయనెవరు? ఎ) కమల్ హాసన్ బి) శరత్‌కుమార్ సి) విజయ్‌కాంత్ డి) విశాల్ ► యన్టీఆర్ నటించిన ‘బొబ్బిలి పులి’ చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) జయసుధ బి) సుజాత సి) శ్రీదేవి డి) జయప్రద ► శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన సిద్ధార్థ్ మొదట హీరో కాదు. అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన ఏ దర్శకుని శిష్యుడో తెలుసా? ఎ) బాపు బి) బాలచందర్ సి) భారతీరాజా డి) మణిరత్నం ► ట్వీటర్ ఖాతాలో తన ఖాతాదారుల సంఖ్య 70 లక్షలకు చేరుకున్న సందర్భంగా తన లక్కీ నంబర్ ‘7’ అని ఈ మధ్యే ఓ ప్రముఖ హీరోయిన్ చెప్పింది. ఎవరయ్యుంటారబ్బా? ఎ) శ్రుతీహాసన్ బి) తమన్నా సి) కాజల్ అగర్వాల్ డి) మెహరీన్ ► తమిళ దర్శకుడు ఏయల్ విజయ్ (‘నాన్న’ ఫేమ్)ని ఈ బ్యూటీ ప్రేమించి, పెళ్లాడింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆమె ఎవరు? ఎ) మమతా మోహన్‌దాస్ బి) అమలాపాల్ సి) మంజు వారియర్ డి) సౌందర్య రజనీకాంత్ ► ‘నా పాట నీ నోట పలకాల సిలక...’ అంటూ ‘మూగమనసులు’ చిత్రంలో అక్కినేని ఓ హీరోయిన్‌కి పాట పాడటంలో శిక్షణ ఇస్తాడు. ఎవరామె? ఎ) జమున బి) అంజలీ దేవి సి) కృష్ణకుమారి డి) సావిత్రి ► ‘మోసగాళ్లకు మోసగాడు’ కౌబాయ్ సినిమా. ఈ సినిమా కృష్ణ కెరీర్లోనే ట్రెండ్ సెట్టర్. ఆ చిత్ర దర్శకుడెవరో తెలుసా? ఎ) కోడి రామకృష్ణ బి) కేయస్సార్ దాస్ సి) పీసీ రెడ్డి డి) బి. గోపాల్ ► ‘జననీ జన్మ భూమిశ్ఛ స్వర్గాదపీ గరీయసీ..’ అనే పాట ర^è యిత ఎవరో కనుక్కోండి? ఎ) వేటూరి సుందరామ్మూర్తి బి) సిరివెన్నెల సి) సముద్రాల డి) దాసరి నారాయణరావు ► ‘పెదరాయుడు’ సినిమాలో పాపారాయుడు పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) రజనీకాంత్ బి) మోహన్‌బాబు సి) శ్రీహరి డి) బ్రహ్మానందం ► అనుష్కను మొదటిసారి తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) క్రిష్ జాగర్లమూడి బి) పూరి జగన్నాథ్ సి) గుణశేఖర్ డి) కోడి రామకృష్ణ ► ‘ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. ఎగిరిపోతే ఎంత బావుంటుంది’ అనే పాట ‘వేదం’ చిత్రంలోనిది. ఆ సినిమాకు పాటలు స్వరపరిచింది ఎవరో తెలుసా? ఎ) కల్యాణ రమణ బి) యం.యం. శ్రీలేఖ సి) మణిశర్మ డి) యం.యం. కీరవాణి ► సీతారామ్ చౌదరి పోతినేని అనేది ఈ హీరో అసలు పేరు. ఆ హీరో ఎవరు? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) శ్రీరామ్ డి) శ్రీకాంత్ ► ‘నీ స్నేహితుడెవరో తెలిస్తే నీ కేరక్టర్ తెలుస్తుంది... నీ శత్రువెవరో తెలిస్తే నీ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది’ అని హీరో రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ఏ సినిమా లోనిదో కనుక్కోండి? ఎ) మగధీర బి) ఆరెంజ్ సి) గోవిందుడు అందరి వాడేలే డి) ధృవ ► ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరో ఎవరు? ఎ) నాగార్జున బి) సుమంత్ సి) నాగచైతన్య డి) సుశాంత్ ► జయప్రద నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) సాగర సంగమం బి) సిరివెన్నెల సి) అంతులేని కథ డి) సీతా కల్యాణం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) సి 4) బి 5) సి 6) ఎ 7) సి 8) డి 9) ఎ 10) బి 11) డి 12) బి 13) డి 14) ఎ 15) బి 16) డి 17) ఎ 18) డి 19) ఎ 20) సి -
కోటికొక్కడు
కన్నడ స్టార్, ‘ఈగ’ ఫేమ్ సుదీప్, నిత్యామీనన్ జంటగా కేయస్ రవికుమార్ దర్శకత్వంలో కన్నడ, తమిళ్ భాషల్లో రూపొందిన చిత్రం ‘కోటిగొబ్బ–2’. ఈ సినిమాను దుహర మూవీస్ పతాకంపై నిర్మాత కల్యాణ్ ధూళిపాళ్ల ‘కోటికొక్కడు’ అనే టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రీసెంట్గా ‘రచయిత’ సినిమాను నిర్మించాను. మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చిపెట్టింది. రెండోది మాస్ కమర్షియల్ మూవీ చేయాలనుకుంటున్న టైమ్‌లో ‘కోటిగొబ్బ–2’ చుశాను. నాకు బాగా నచ్చింది. తమిళ్, కన్నడ భాషల్లో ఆల్మోస్ట్ 120కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. తెలుగులో కూడా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సుదీప్ చేసిన బెస్ట్ మూవీస్‌లో ‘కోటికొక్కడు’ పెద్ద హిట్ సాధించింది. ‘రచయిత’ చిత్రంతో మంచి నిర్మాతగా కల్యాణ్ పేరు తెచ్చుకున్నాడు. అతను రిలీజ్ చేస్తున్న ఈ సినిమా కూడా హిట్ సాధించాలి’’ అన్నారు దర్శకుడు సముద్ర. ‘‘కల్యాణ్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత మాత్రమే కాదు ప్యాషన్ ఉన్న నిర్మాత కూడా. కేయస్ రవికుమార్ పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. సుదీప్ యాక్టింగ్ సూపర్. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు ఎస్వీఆర్ మీడియా శోభారాణి. ప్రకాశ్‌రాజ్, నాజర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్. -
100 అవకాశాలొచ్చాయి.. కానీ : నటి
సాక్షి, చెన్నై: కమర్షియల్ కథా చిత్రాలు సక్సెస్ కావచ్చు. తద్వారా కలెక్షన్ల వర్షం కురిపించవచ్చు. అందులో నటించిన నటీనటులకు మరిన్ని అవకాశాలు రావడానికి కారణం కావచ్చు. అయితే నటీనటులు, సాంకేతిక వర్గాల ప్రతిభకు సాన పెట్టేవి, పేరు తెచ్చిపెట్టేవి, పది కాలాల పాటు గుర్తుండిపోయేవి ప్రయోగాత్మక కథా చిత్రాలే. అలాంటి కథా పాత్రలే నటీనటుల నట దాహార్తిని తీరుస్తాయి. అలాంటి ఒక చిత్రంలో హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తున్నారన్నది తాజా సమాచారం. పాత్ర నచ్చితేనే అంగీకరించే అతి కొద్దిమంది హీరోయిన్లలో ఈమె ఒకరు. నచ్చకపోతే నటించడానికి ససేమీరా అంటారు. ఇటీవల ఈ అమ్మడు ఒక భేటీలో తనకు 100 అవకాశాలు వచ్చాయని, అందులో నాలుగే నాలుగు చిత్రాలను అంగీకరించి నటించానని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఇటీవల తెరపైకి వచ్చిన తెలుగు చిత్రం ‘అ’లో వివాదాస్పద పాత్రలో నటించడానికి వెనుకాడలేదీ జాణ. ప్రస్తుతం తాను మాత్రమే నటించే ఒకే ఒక్క పాత్రతో కూడిన ప్రణా అనే చిత్రంలో నటిస్తున్నారట. ఈ విషయాన్ని ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్ తన ట్విటర్లో పేర్కొన్నారు. ఇది బహుభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. దీనికి వీకే.ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుందన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని ఛాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్ తెలిపారు. ఒక్క పాత్రతో తెరకెక్కుతున్న చిత్రం అంటే ప్రణా కచ్చితంగా వైవిధ్యంగానూ, ప్రయోగాత్మకంగానూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. అందులోనూ ఆ ఒక్క పాత్రను ప్రతిభాశాలి నిత్యామీనన్ పోషిస్తున్నారంటే అందులో విషయం ఉండే ఉంటుంది. -
విప్లవం రావాలి
‘‘తెలుగు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలు ఆదరిస్తున్నారు. వారి కోసం కొత్త తరహా సినిమాలు చేయాలి. తెలుగు సినిమాల్లో విప్లవం రావాలి. ‘అ!’ సినిమా ఇలాంటి కొత్తదనానికి దారి చూపించింది’’ అన్నారు నిత్యామీనన్. నానీ సమర్పణలో వాల్‌పోస్టర్ పతాకం పై కాజల్ అగర్వాల్, రెజీనా, నిత్యామీనన్, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘అ!’. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ప్రశాంతి త్రిపిరనేని నిర్మాత. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం పాత్రికేయులతో నిత్యామీనన్ పలు విశేషాలు పంచుకున్నారు. ∙ప్రశాంత్ ఈ కథ చెప్పగానే చాలా ఎగై్జట్ అయ్యాను. అన్ని క్యారెక్టర్స్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశాడు. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటాను. ఇలాంటి రోల్స్ చేస్తే కెరీర్ ఏమైపోతుందో అని ఆలోచించను. యాక్చువల్లీ ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేయడమే ఇష్టం. లేకపోతే బోర్ కొట్టేస్తుంది. ∙ఈ సినిమాను నానీయే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ‘అ’ చేసినవాళ్లందరం దర్శకుడు చెప్పిన కథ నచ్చే చేశాం. ముందు నన్ను కృష్ణవేణి కానీ రాధా (ఈషా) కానీ ఏదో పాత్ర చేయమని అడిగారు. కృష్ణవేణి పాత్ర కొత్తగా అనిపించడంతో అది చేశాను. ∙ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు ఎలాంటి సినిమా చేస్తున్నాను? వాళ్ల ఇన్టెన్షన్ ఏంటి? ఎలా చేయాలి? అని అలోచిస్తాను తప్పితే నా పాత్రకు స్క్రీన్ టైమ్ ఎంత? అని ఆలోచించను. అది సొసైటీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని కూడా ఆలోచించి ఒప్పుకుంటాను. ∙‘కాంచన’ సినిమాలో గంగ పాత్ర చేసేటప్పుడు చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో చేసిన కృష్ణవేణి పాత్ర విషయానికి వస్తే అంత చాలెంజింగ్‌గా ఏమీ అనిపించలేదు. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర మొదట నా దగ్గరకే వచ్చింది. కానీ అది వర్కవుట్ కాలేదు. ∙‘ప్రాణ ’ అనే సినిమా నాలుగు (తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ) భాషల్లో చేశాం. నాకు నాలుగు భాషలు వచ్చు కాబట్టి రైటింగ్ సైడ్ కూడా సహాయం చేశాను. ఈ సినిమా కేవలం ఒక్క పాత్రతోనే నడుస్తుంది. సింక్ సౌండ్‌లో, 23రోజుల్లో కంప్లీట్ చేశాం. ∙సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటాను అంటారు. సినిమాకంటే ముఖ్యమైనవి జీవితంలో చాలా ఉన్నాయి. సినిమా అనేది ఒక పార్ట్ మాత్రమే. నాకు సంతోషం కలిగించే పనే నేను చేస్తుంటాను. -
‘అ!’ మూవీ రివ్యూ
టైటిల్ : అ! జానర్ : థ్రిల్లర్ తారాగణం : కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీని అవసరాల, మురళీ శర్మ, ప్రగతి సంగీతం : మార్క్ కె రాబిన్ దర్శకత్వం : ప్రశాంత్ వర్మ నిర్మాత : నాని, ప్రశాంతి వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. అయితే నాని తొలి ప్రయత్నంగా ఎంచుకున్న సినిమా కథాంశం ఇండస్ట్రీ వర్గాలకు కూడా షాక్ ఇచ్చింది. డిఫరెంట్ కాన్పెప్ట్ తో ఇంట్రస్టింగ్ టేకింగ్‌తో తెరకెక్కించిన అ! సినిమాతో ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశాడు నాని. కేవలం కథ, దర్శకుడిని నమ్మి నాని చేసిన ప్రయత్నం ఫలించిందా..? దర్శకుడు నాని నమ్మకాన్ని నిలబెట్టాడా..? కథ : కళి (కాజల్).. జీవితంలో ఎన్నో చేదు అనుభావాలతో విసిగిపోయి తన పుట్టిన రోజున ఓ తీవ్ర నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. చివరి సారిగా చిత్ర (ప్రగతి) నిర్వహిస్తున్న ఫుడ్ కోర్ట్‌లో కూర్చోని తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అదే సమయంలో రాధమ్మ(ఈషా రెబ్బా)తను ప్రేమించిన క్రిష్ (నిత్యామీనన్)ను తన తల్లిదండ్రులకు పరిచయం చేయడానికి అదే ఫుడ్ కోర్ట్‌కు వస్తుంది. ఈజీ మనీకోసం తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఓ దొంగతనం ప్లాన్ చేసిన మీరా(రెజీనా) అదే ఫుడ్ కోర్ట్‌లో పనిచేస్తుంటుంది. తనకు తాను గ్రేటెస్ట్ మెజీషియన్ అనుకునే యోగి (మురళీశర్మ) రెస్టారెంట్ లో ఉన్న చిన్నపాప మ్యాజిక్ చేస్తుంటే ఆమెతో గొడవ పడతాడు. అక్కడే డోర్ బాయ్‌గా పనిచేస్తున్న శివ తన చిన్నప్పుడే దూరమైన అమ్మనాన్నలు చూడాలన్న కోరికతో టైం మెషీన్ తయారు చేసే పనిలో ఉంటాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్క చెఫ్ అని అబద్ధం చెప్పి నలభీమ (ప్రియదర్శి) అదే ఫుడ్కోర్ట్ లో ఉద్యోగంలో చేరతాడు. ఇలా ఒకే చోట చేరిన ఈ వ్యక్తలకు ఒకరితో ఒకరికి ఉన్న సంబంధం ఏంటి..? కళి తీసుకున్న నిర్ణయం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : నిడివి తక్కువే అయినా సినిమాలో కీలక పాత్ర కాజల్‌దే. అందుకు తగ్గ హవా భావాలతో కళి పాత్రకు ప్రాణం పోసింది కాజల్. కళి తరువాత ఆకట్టుకున్న మరో పాత్ర రెజీనా. మీరాగా కనిపించేందుకు చాలా కష్టపడ్డ రెజీనా పర్ఫామెన్స్తోనూ మెప్పించింది. డ్రగ్స్‌కు అలవాటు పడిన అమ్మాయిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. టామ్ బాయ్ తరహా పాత్రలో నిత్యామీనన్, ఆమె లవర్‌గా ఈషా రెబ్బాలు ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు లుక్స్ పరంగానూ మెప్పించారు. ఇక వంట రాని చెఫ్ పాత్రలో ప్రియదర్శి మంచి నటనతో పాటు కామెడీ కూడా పండించాడు. ముఖ్యంగా చేప, చెట్టు, ప్రియదర్శి కాంబినేషన్లో వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. మెజీషియన్‌గా మురళీశర్మ కూడా అద్భుతంగా నటించాడు. టైం మెషీన్ తయారు చేయాలని భావించిన సైంటిస్ట్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ కొత్తగా కనిపించాడు. ఇతర పాత్రలో ప్రగతి, రోహిణి, దేవదర్శిలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : మనిషి జీవితంలోని అనుభవాలు వాటి తాలుకా ప్రతిస్పందనల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక్కో ఎమోషన్‌ను ఒకో పాత్రలో చూపించే ప్రయత్నం చేశాడు. కోపం, బాధ, ప్రేమ, పగ, ఆవేశం లాంటి భావాలకు ప్రతీరూపాలుగా క్యారెక్టర్స్ వెండితెర మీద ఆవిష్కరించాడు. తొలి అర్థభాగం మొత్తం సినిమాలోని పాత్రల పరిచయానికే కేటాయించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లోనే అసలు కథ మొదలు పెట్టడం ఆడియన్స్ లో అసహనం కలిగిస్తుంది. అయితే ఆడియన్స్ బోర్ ఫీల్ అయిన ప్రతీసారి అ! అనిపించే ట్వీస్ట్ తో షాక్ ఇచ్చాడు డైరెక్టర్. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగా అవాక్కయ్యేలా చేసే ట్విస్ట్‌లు సినిమాలో చాలానే ఉన్నాయి. కానీ అవి రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కు ఏ మేరకు రీచ్ అవుతాయన్నదే చూడాలి. చేపకు నాని, చెట్టుకు రవితేజ చెప్పిన వాయిస్ ఓవర్ సినిమాలకు మరింత గ్లామర్ తీసుకువచ్చింది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. ఓ డిఫరెంట్ జానర్ తెరకెక్కిన సినిమాను అదే స్థాయి కెమెరా టెక్నిక్స్‌తో మరింత కొత్తగా మార్చాడు. మార్క్ కె రాబిన్ సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. టైటిల్ లో వచ్చే పాటతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనూ అ! అనిపించాడు రాబిన్. ఆర్ట్, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాతగా నాని ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించాడు. ప్రతీ ఫ్రేమ్‌ను కొత్తగా చూపించేందుకు యూనిట్ పడిన తపన తెర మీద కనిపిస్తుంది. అయితే రొటీన్ ఫార్ములా సినిమాలు ఇష్టపడే వారిని ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. ప్లస్ పాయింట్స్ : లీడ్ క్యారెక్టర్స్ నటన స్క్రీన్ ప్లే సంగీతం మైనస్ పాయింట్స్ : అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
నాని గట్స్‌కు హ్యాట్సాఫ్
సాక్షి, సినిమా : హీరోగా వరుస సక్సెస్‌లు అందుకుంటున్న నేచురల్ స్టార్ నాని.. అ! చిత్రంతో నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయాడు. టీజర్, ట్రైలర్, ప్రోమోలు, ప్రమోషన్లతో బాగానే హైప్ తీసుకొచ్చిన నాని.. ఇప్పుడు మౌత్ టాక్‌పై కూడా దృష్టిసారించాడు. అందుకే సినిమా విడుదలకు ముందే సెలబ్రిటీలకు ఇక్కడ ప్రత్యేక షో వేయించి వారితో అభిప్రాయాలను చెప్పిస్తున్నాడు. వెన్నెల కిషోర్, అనుపమ పరమేశ్వరన్, అడివి శేష్, దర్శకనిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, నటుడు శశాంక్, డిజైనర్ నీరజ్ కోన, రాహుల్ రవీంద్రన్ ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని వీక్షించి తమ ట్విటర్లో ట్వీట్లు చేశారు. ‘అ చిత్రం కొత్త తరహా కాన్సెప్ట్‌తో కూడిన చిత్రమని, అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటుందని, దర్శకుడు ప్రశాంత్ టేకింగ్ కొత్తగా.. ఆకట్టుకునేలా ఉందని, ముగింపు ఓ కవిత్వంలా ఆహ్లాదంగా అనిపించిందని చెబుతున్నారు. ముఖ్యంగా నిర్మాతగా ఇలాంటి చిత్రం నిర్మించాలంటే చాలా గట్స్ ఉండాలంటూ ప్రతీ ఒక్కరూ నానిని ప్రశంసిస్తున్నారు. కాజల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల, ఇషా రెబ్బా, మురళీ శర్మ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. మరి ఈ చిత్రం నానికి నిర్మాతగా సక్సెస్ అందిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది గంటలు ఆగితే చాలూ. #Awe creates a new genre of film making. It is a seamless blending of all genres..a film that encompasses the best aspects of each genre without being limited. No wonder @NameisNani bhayya backed this one😌🙏🏼 and @prasanthvarma gariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/x4M2tPtBbV — vennela kishore (@vennelakishore) 14 February 2018 Thanks & kudos to @NameisNani & @PrashantiTipirn for backing #Awe A true blue concept film with a poetic finish! — Adivi Sesh (@AdiviSesh) 14 February 2018 Watched a superb & out of the box movie #awe. @NameisNani proved to be an intelligent as a producer also. Needs lot of guts to produce this kind of intelligent THIKKA cinema 😃👏👏👏. Kudos to the director @prasanthvarma and his team for the brilliant technical work! Cheers guys! — Madhura Sreedhar Reddy (@madhurasreedhar) 14 February 2018 Awe : a feeling of reverential respect mixed with fear or wonder.😲🤯 Last night I experienced the same when I was watching #AWE .. truly inspiring... a new approach to cinema with good values.. @NameisNani @PrashantiTipirn @prasanthvarma good work 👌🏻👌🏻 — Anupama Parameswaran (@anupamahere) 15 February 2018 #AWEstruck What a crazy film 🤘🏻 Kudos to @NameisNani n @PrashantiTipirn for backing @prasanthvarma n his unique story #AWE Good luck guys..Wishing Huge Success 👍🏻👍🏻 Great job by entire cast n crew 👌🏻👌🏻 This is real Hatke — Shashank (@ActorShashank) 14 February 2018 #Awe pushes boundaries .. in every possible direction! One has to appreciate the amazing passion this team had to believe in something like this and make it come to life. @NameisNani Wishing u and ur team an amazing run starting Feb 16th ❤️👍🏻😊 — Neerajaa Kona (@NeerajaKona) 14 February 2018 -
ఈరోజు నేనో మాస్ మర్డర్ చేయబోతున్నా..
సాక్షి, హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘అ!’. వినూత్న కథాంశంతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ ను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయగా భారీ స్పందన వస్తోంది. ‘చేపలకు కూడా కన్నీళ్లుంటాయి బాస్.. నీళ్లల్లో ఉంటాయి కదా అందుకే కనబడవు అంతే..’ అంటూ చేపకు హీరో నాని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. దాంతో పాటు హర్రర్ బ్యాక్‌డ్రాప్ అన్నట్లుగా.. ‘నా డైరీలో లాస్ట్ ఎంట్రీ.. ఈరోజు నేనో మాస్ మర్డర్ చేయబోతున్నాను’ అంటూ వచ్చే డైలాగ్ సినిమాపై సస్పెన్స్ మొదలై భారీ అంచనాలను నెలకొనేలా చేస్తోంది. నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 16న విడుదల కానుంది. కాగా, ఈ సినిమాలో రెండు కీలక పాత్రలకు నాని, రవితేజలు డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మార్క్ కె రోబిన్ సంగీతమందిస్తున్న విషయం తెలిసిందే. -
నేనో మాస్ మర్డర్ చేయబోతున్నాను..
-
రిలీజ్ డేట్ అనౌన్స్.. చేపను చూసేందుకు సిద్ధమా..!
సాక్షి, హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘అ!’. నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ విడుదల తేదీని వాల్ పోస్టర్ సినిమా గ్రూప్ భిన్నంగా ప్రకటించింది. వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీని ఫిబ్రవరి 16న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘అన్ని సినిమాలయందు ‘అ!’- సినిమా వేరయా! విశ్వదాభిరామ ఫిబ్రవరి 16th రిలీజ్ రా మామా!!’ అంటూ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ట్వీటర్ లో పోస్ట్ చేశారు. చేప పాత్ర ఉందని చెప్పి అందరి దృష్టి ఆకర్షించిన యూనిట్, విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. చేప కథేంటో చూసేందుకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో రెండు కీలక పాత్రలకు నాని, రవితేజలు డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఒక్కో పోస్టర్ తో ఒక్కో పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చిన హీరో నాని, తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ను అదే తీరుగా పద్యరూపంలో వెల్లడించాడు. మార్క్ కె రోబిన్ సంగీతమందిస్తున్న విషయం తెలిసిందే. Here's an అ!some update you all have been waiting for! #AWEReleaseOnFEB16th pic.twitter.com/WxwSMErd5Z — Wall Poster Cinema (@walpostercinema) 29 January 2018 -
‘అ!’ టీజర్ రిలీజ్
-
కథే హీరో.. ‘అ!’ అదే టైటిల్..!
-
కథే హీరో.. ‘అ!’ అదే టైటిల్..!
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘అ!’. నిత్యామీనన్, కాజల్, రెజీనా, ఈషా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో రెండు కీలక పాత్రలకు నాని, రవితేజలు డబ్బింగ్ చెపుతున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒక్కో పోస్టర్ తో ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వచ్చిన నాని, తాజాగా ఆసక్తికరమైన టీజర్ ను రిలీజ్ చేశాడు. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్క్ కె రోబిన్ సంగీతమందిస్తున్నాడు. -
నిత్యా.. ఫిడేల్ వాయిస్తున్నావా!
శర్వానంద్ పక్కన కాజల్ కన్ఫర్మ్. రెండో హీరోయిన్ కోసం వెయిటింగ్. కొంచెం సెర్చింగ్ కూడా. హిట్ల మీద హిట్లు ఇస్తున్న ఎక్స్‌ప్రెస్ రాజా శర్వానంద్‌కి సింగిల్ హీరోయిన్ పోస్టర్ సరిపోదని డిసైడ్ చేసినట్లున్నారు. యాక్చువల్లీ రెండు సినిమాలు చేస్తున్నాడు. దాంట్లో ఒకటి పట్టాలెక్కింది. రెండో హీరోయిన్ పగ్గాలే దొరకలేదు. డిసెంబర్ 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా. ఇదో గ్యాంగ్‌స్టర్ సినిమా అట. ఈ సినిమాలో ఎక్స్‌ప్రెస్ రాజా, సూపర్ ఎక్స్‌ప్రెస్ రాజా ఇద్దరూ ఉంటారట. అదేనండీ... డబుల్ యాక్షన్. నిత్యా మీనన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. అందుకే ఆమె కోసం వెయిటింగ్. వేర్ ఆర్ యు నిత్యా? వాట్ ఆర్ యు డూయింగ్ మిస్ మీన? -
రైటర్ అండ్ ఫైటర్!
రైటర్ ఎవరు? ఫైటర్ ఎవరు? అంటే... రెండూ నిత్యా మీననే. బేసికల్లీ... ఆమె ఓ రైటర్. ఇంగ్లీష్‌లో ఏవేవో రాస్తుంటారు. బట్, రైటింగ్‌తో పాటు ఫైటింగ్ కూడా చేస్తుంటారామె. ఫైటింగ్ అంటే మనుషులను కొట్టడం వంటి రెగ్యులర్ ఫైటింగ్స్ కాదు. సొసైటీలోని అన్యాయాన్నీ (ఇన్జస్టిస్), అసహనాన్నీ (ఇన్టాలరెన్స్) తన రచనలతో ప్రశ్నిస్తూ, ఫైట్ చేస్తుంటారన్న మాట! క్లుప్తంగా కొత్త సినిమాలో నిత్యా మీనన్ పోషిస్తున్న పాత్ర తీరిది. ఓ రకంగా ఈ హీరోయిన్ ఒరిజినల్ క్యారెక్టర్‌కు దగ్గరగా ఉండే పాత్రే. మలయాళ దర్శకుడు వీకే ప్రకాశ్ తీస్తున్న ‘ప్రాణ’లో నిత్యా మీనన్ ఈ ‘రైటర్ అండ్ ఫైటర్’ క్యారెక్టర్ చేస్తున్నారు. నిత్యాకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మాట్లాడడం వచ్చు కనుక... ఈ నాలుగు భాషల్లోనూ థ్రిల్లర్ సినిమాగా ‘ప్రాణ’ను తెరకెక్కిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కేరళలో చిత్రీకరణ మొదలైంది. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి తదితర టాప్ టెక్నిషియన్లు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. -
మెర్శల్‌కు ట్రేడ్‌మార్క్
తమిళసినిమా: మెర్శల్ చిత్రం పలు విశేషాలతో అభిమానుల్లో జోష్ పెంచేస్తోంది. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మెర్శల్. ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్న ఇందులో సమంత, కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తెరి వంటి విజయవంతమైన చిత్రం తరువాత విజయ్ను అట్లీ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ నిర్మిస్తున్న భారీ చిత్రం మెర్శల్. సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఇటీవల ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మెర్శల్ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా ఇందులో మెజీషియన్ పాత్ర కోసం విజయ్ ప్రత్యేకంగా మ్యాజిక్‌ను నేర్చుకుని మరీ నటించారట. ఈ పాత్ర ఆయన అభిమానులను విశేషంగా అలరిస్తుందంటున్నారు. మరో విషయం ఏమిటంటే మెర్శల్ చిత్రం కోసం ట్విట్టర్లో ప్రత్యేక ఇమోజీలను ప్రవేశపెట్టారు. తాజాగా మరో విశేషాన్ని మెర్శల్ చిత్రం సంతరించుకుంది. మెర్శల్ పేరుకు ట్రేడ్‌మార్క్‌ను చిత్ర నిర్మాతలు పొందారు. ఇలా ట్రేడ్‌మార్క్‌ను చిత్ర టైటిల్‌కు పొందడం అన్నది దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రప్రథమం అవుతుంది. ట్రేడ్‌మార్క్ కారణంగా మెర్శల్ పేరును ఏ ఇతర వాణిజ్య ప్రకటనకు వాడినా వారు ఈ చిత్ర నిర్మాతకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా లక్షలాది రూపాయల లబ్ధి పొందడానికే శ్రీ తేనాండాళ్ ఫిలింస్ అధినేతలు మెర్శల్ చిత్రానికి ట్రేడ్‌మార్క్‌ను పొందినట్లు సమాచారం. -
డాక్టర్ కాజల్
యస్... ఇప్పుడు కాజల్ అగర్వాల్ డాక్టర్ అయ్యారు. ఇది గౌరవ డాక్టరేట్ కాదు. ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అంటారే... ఆ డాక్టరే. కానీ, కాజల్ ఎంబీబీఎస్ చదవలేదు. మరెలా డాక్టర్ అవుతున్నారు? అంటే... హీరోయిన్గా చేస్తున్నారు కదా! ఆ కోటాలో డాక్టర్ అయ్యారు. అదెలా? అంటే... తమిళ హీరో విజయ్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘మెర్సల్’. ఇందులో కాజల్ ఓ హీరోయిన్గా డాక్టర్ పాత్రలో నటిస్తున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి, వివేకం’... ఇటీవల చేసిన ఈ రెండు సిన్మాల్లోనూ ట్రెడిషనల్‌గా కనిపించారు కాజల్. ఇందులో మోడ్రన్‌గా కనిపిస్తారట! కాజల్‌తో పాటు సమంత, నిత్యా మీనన్ కూడా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనిపై కాజల్ స్పందిస్తూ... ‘‘గతంలోనూ నేను మల్టీ హీరోయిన్ ఫిల్మ్స్ చేశా. ఇప్పుడు కొత్తేం కాదు కదా! నా పాత్రకు సిన్మాలో మంచి ప్రాముఖ్యత ఉంటుంది’’ అన్నారు. -
విమర్శలను పట్టించుకోవద్దు
తమిళసినిమా: విమర్శలను పట్టిoచుకోవద్దని నటుడు విజయ్ తన అభిమానులకు హితవు పలి కారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మెర్శల్. విజ య్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఇందులో ఆయనకు జంటగా సమంత, కాజ ల్ అగర్వాల్, నిత్యామీనన్‌లు నటిస్తున్నా రు. తెరి చిత్రం తరువాత దర్శకుడు అట్లీ, విజయ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చి త్రం ఇది. శ్రీతేనాండాళ్ ఫిలింస్ పతాకంపై రామస్వామి, హేమ రుక్మిణిలు నిర్మిస్తున్న భారీ చిత్రం మెర్శల్. ఈ సంస్థలో రూపొందుతున్న 100వ చిత్రం కావడం విశేషం. దీనికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందించారు. నటుడిగా విజయ్, సంగీత దర్శకుడిగా ఏఆర్.రెహ్మాన్ 25వ వసంతంలోకి అడుగు పెట్టడం మరో విశేషం. కాగా మెర్శల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఆదివారం సా యంత్రం స్థానిక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అట్లీ మాట్లాడుతూ మెర్శల్ చిత్రంలో పని చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర కథ గురించి చెప్పాలంటే నాగరిక యుగంలో మనం మరచిపోయిన ప్రాచీన క్రీడ జల్లికట్టును వెలుగులోకి తెచ్చినట్లుగా మరో విషయం గురించి బలంగా చెప్పే చిత్రమే మెర్శల్ అని పేర్కొన్నారు. నా కొడుకే వినడు: చిత్ర కథానాయకుడు విజయ్ మాట్లాడుతూ తన భాణీలతో ప్రపంచాన్నే మెప్పించి ఆస్కార్ అవార్డులను గెలిచిన ఏఆర్.రెహ్మాన్ ఇప్పుడీ చిత్రానికి సంగీత భాణీలు కట్టి విస్మయ పరచారన్నారు. సంగీత దర్శకుడిగా 25వ వసంతంలోకి అడుగుపెట్టిన ఏఆర్.రెహ్మాన్‌కు, శత చిత్ర నిర్మాణ సంస్థ శ్రీతేనాండాళ్ ఫిలింస్‌కు అభినందనలు తెలిపారు. అభిమానులకు సూచి స్తూ.. విమర్శల గురించి పట్టించుకోవద్దన్నారు. ఏమీ లేనప్పుడు ఆత్మవిశ్వా సం, అన్నీ ఉన్నప్పుడు అణకువ ముఖ్యం అన్నారు. తానిలా నీతులు చెబితే తన కొడుకే వినడని, పాఠించాలా వద్దా అన్నది మీ ఇష్టం అని పేర్కొన్నారు.ఇక మెర్శల్ చిత్రం గురించి చెప్పాలంటే తుపాకీ ఉంటే తూటా ఉండాలి. కత్తికి షార్ప్ ఉండాలి. మెర్శల్ అదుర్స్‌గా ఉండాలి అని అన్నారు. కార్యక్రమంలో ఏఆర్. రెహ్మాన్ సంగీత కచేరీ, కళాకారుల ఆటా పాటా ఆహుతులను ఉర్రూతలూగించాయి. సమంత, కాజల్‌అగర్వాల్, ఎస్జే సూర్య, పార్తీపన్, ధనుష్, శాంతను, సుందర్. సీ, సీ.కల్యాణ్, ఎల్. సురేశ్, అభిరామి రామనాథన్, పన్నీర్‌సెల్వంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
మెర్సల్ ట్విట్టర్ రికార్డ్
తమిళసినిమా: ఇలయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మెర్సల్. ఈ చిత్రం గురించి రోజుకో కొత్త సమాచారం వెల్లడవుతోంది. ప్రస్తుతం విషయం ఏమిటంటే సామాజిక మాధ్యమాల్లో ప్రముఖమైన ట్విట్టర్ ఇండియా సంస్థ విజయ్ ‘మెర్సల్’ చిత్రానికి ఇమేజ్ గుర్తింపు నిచ్చింది. ఈ విషయం తెలిసి విజయ్ అభిమాలను ఎగిరి గంతులేస్తున్నారు. తెరి చిత్రం తర్వాత విజయ్ – అట్లీ బృందం రూపొందించిన చిత్రం మెర్సల్. మూడు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత, నిత్యామీనన్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఏఆర్.రెహ్మాన్ సంగీతం సమకూరుస్తుండగా, తేనాండాల్ ఫిలింస్ 100వ చిత్రంలో తయారువుతోంది. ఈ నెల 20వ తేదీ చెన్నై నెహ్రూ క్రీడా మైదానంలో ‘మెర్సల్’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించనున్నారు. ఇందుకుగాను ఏర్పాటు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ స్థితిలో మెర్సల్ విజయ్ స్టిల్స్‌తో కూడిన ఇమేజ్ను ట్విటర్ ఇండియా విడుదల చేసింది. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
విజయ్ అభిమానులకు గుడ్‌న్యూస్
తమిళసినిమా: ఇళయదళపతి విజయ్ కొత్త చిత్రం రావడమే ఆయన అభిమానులకు సంతోషకరమైన వార్త అవుతుంది. అదీ ఒక సక్సెస్ఫుల్ కాంబినేషనల్లో చిత్రం వస్తుందంటే మరీ ఆనందం. అలా త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న చిత్రం మెర్శల్. విజయ్ నటిస్తున్న 61వ చిత్రం ఇది. ఈ చిత్రం పలు ప్రత్యేకతలను సంతరించుకుందని చెప్పవచ్చు. ఇందులో విజయ్‌కు జంటగా కాజల్‌అగర్వాల్, సమంత, నిత్యామీనన్ ముగ్గురు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక వైగైపుయల్ వడివేలు, సత్యరాజ్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు కడుతుండడం మరో విశేషం. ఇక తెరి వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత విజయ్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం మెర్శల్. శ్రీతేనాండాళ్ ఫిలింస్ నిర్మిస్తున్న శత చిత్రం ఇది కావడం మరో విశేషం. ఇన్ని ప్రత్యేకతలతో కూడుకున్న ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అన్న ఆసక్తి ఆయన అభిమానుల్లోనూ, చిత్ర పరిశ్రమలోనూ నెలకొనడం సహజమే. అంతకన్నా ముందు చిత్ర ఆడియోను ఈ నెల 20వ తేదీన చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోందన్నది తాజా సమాచారం. కాగా ఈ వేడుకలో మరో విశేషం ఏమిటంటే సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత కచేరిని నిర్వహించనున్నారట. ఇది విజయ్ అభిమానులకు వీనులవిందైన వార్తే అవుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. -
ఆ లక్కీచాన్స్ ఎవరిదో?
తమిళసినిమా: రకుల్ప్రీత్సింగా? సోనాక్షినా? ఇళయదళపతితో జోడి కట్టే లక్కీచాన్స్ దక్కించుకునే ముద్దుగుమ్మ ఎవరో? విజయ్ అభిమానుల్లో ఆసక్తిగా మారిన అంశం ఇదే. విషయం ఏమిటంటే అట్లీ దర్శకత్వంలో మెర్సల్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ఇళయదళపతి విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించనున్నారు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే తుపాకీ, కత్తి వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయన్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ హ్యాట్రిక్‌కు రెడీ అవుతోంది. అయితే ఇందులో విజయ్‌తో జత కట్టే నటి ఎవరన్నది ఆసక్తిగా మారింది. విజయ్‌కు జంటగా ప్రస్తుతం ఉన్న ప్రముఖ నటీమణులందరూ నటించారు. కాబట్టి ఇప్పటి వరకూ ఆయనతో జత కట్టని హీరోయిన్ను నటింపజేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు ఏఆర్.మురుగదాస్ ప్రస్తుతం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా స్పైడర్ చిత్రాన్ని చేస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ముమ్మరంగా ఉంది. సెప్టెంబర్‌లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇందులో కథానాయకిగా నటించిన రకుల్‌ప్రీత్‌సింగ్ అయితే బాగుంటుందన్న అభిప్రాయానికి దర్శకుడు వచ్చినట్టు తెలుస్తోంది.రకుల్‌ప్రీత్‌సింగ్ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉంది. కోలీవుడ్‌లోనే ప్రస్తుతం కార్తీకి జంటగా ధీరన్ అధ్యాయం ఒండ్రు చిత్రంలో నటిస్తోంది. తాజాగా సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దీనితో పాటు ఒక హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. అలాంటిది విజయ్‌తో నటించడానికి కాల్షీట్స్ సర్దుబాటు చేయగలుగుతుందా అన్న సందేహం నెలకొంది. ఇదిలా ఉంటే దర్శకుడు ఏఆర్.మురుగదాస్ బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హాను తన తాజా చిత్రంలో నటింపజేయాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఇంతకు ముందు హిందీ చిత్రం అకిరలో వీరిద్దరు కలిసి పని చేశారన్నది గమనార్హం. సోనాక్షి సిన్హా ఇప్పటికే రజనీకాంత్‌కు జంటగా లింగా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యిందన్నది తెలిసిందే. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఈ భామ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విజయ్ 62వ చిత్రంలో నాయకిగా నటించే లక్కీఛాన్స్‌ను నటి రకుల్‌ప్రీత్‌సింగ్, సోనాక్షిలలో ఎవరు దక్కించుకుంటారన్నది కోలీవుడ్‌గా ఆసక్తికరమైన చర్చగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. దీనికి యువ సంగీతదర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
మాస్ చిత్రంగా మెర్సల్
తమిళసినిమా: మాస్ మమ్మం మాస్ అనగానే నాగార్జున నటించిన తెలుగు చిత్రం మాస్ గుర్తు కొస్తుందా? ఇప్పుడు నటుడు విజయ్ అభిమానుల నోటా ఇదే మాట. అవును ఇళయదళపతి విజయ్ అభిమానులు ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. అందుకు కారణం ఒకటి గురువారం విజయ్ పుట్టిన రోజు అయితే, మరొకటి ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరును ఖరారు చేయడంతో పాటు, చిత్ర ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేయడం. తెరి వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత విజయ్ను అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. తేనాండాళ్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో రూపొందుతున్న 100వ చిత్రం ఇదే. ఇప్పటికే 75 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ ఏమిటన్న ఆసక్తి, ఇందులో విజయ్ గెటప్ ఎలా ఉంటుందన్న కుతూహలం ఆయన అభిమానుల్లో చాలా కాలంటా నెలకొంది. కాజల్‌అగర్వాల్, సమంత, నిత్యామీనన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి మెర్సల్ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. అదే విధంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లో దుమ్మురేపుతున్న పందెపు ఎద్దుల ముందు గ్రామీణ యువకుడిగా నిలబడ్డ విజయ్ గెటప్ పక్కా మాస్‌గా ఉండడంతో ఆయన అభిమానులిప్పుడు మమ్మం మాస్ అంటూ ఆనందం పట్టలేక కేరింతలు కొడుతున్నారు. మెర్సల్ పక్కా కమర్షియల్ కథా చిత్రంగా ఉంటుందనే నిర్ణయానికి చిత్ర వర్గాలు వచ్చేశారు. దీంతో మెర్సల్ చిత్రంపై అంచనాలు పైపైకి పెరుగుతున్నాయి. -
ఆ పనిచేసే ఆలోచన లేదు: హీరోయిన్
నటీమణుల్లో నిత్యామీనన్‌కు ఓ ప్రత్యేకత ఉందనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతుంది. అయితే ఆ పాత్ర తనకు నచ్చితేనే ఒప్పుకుంటానని నిర్మొహమాటంగా చెప్పే నిత్య ఆ మధ్య మణిరత్నం అవకాశాన్ని కూడా నిరాకరించిందనే ప్రచారం జరిగింది. అయితే అమ్మడికి ఇటీవల అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అందుకు కారణం తనే అనే ప్రచారం కూడా చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. నిత్యామీనన్‌కు దర్శకత్వంపై మోజు పుట్టిందని, అందుకే నటిగా అవకాశాలను తిరస్కరిస్తోందనే ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇది ఆ నోటా ఈ నోటా అమ్మడి చెవిన పడింది. అంతే.. అయ్యయ్యో దర్శకత్వం చేస్తానని తానెప్పుడు ఎవరితో చెప్పాను. ఇలా కూడా వదంతులు పట్టిస్తున్నారా? అంటూ రియాక్ట్ అయ్యింది. నిజం చెప్పాలంటే నటిగా తనకింకా చాలెంజింగ్ పాత్రలు చాలా చేయాలని ఉన్నట్లు చెప్పింది. తనను దర్శకురాలిగా చూడటానికి చాలామంది ఎదురు చూస్తున్నారన్న విషయం ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొంది. అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, భవిష్యత్తులో దర్శకత్వం గురించి ఆలోచిస్తాను అని వివరించింది. ప్రస్తుతం విజయ్ 61వ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటిస్తున్నట్టు చెప్పింది. ఇందులో తండ్రి పాత్రలో నటిస్తున్న విజయ్‌కు జోడీగా నిత్యామీనన్ నటిస్తున్నట్లు సమాచారం. కాగా విజయ్ చాలా శాంత స్వభావి అని, ఆయనతో తొలిసారిగా నటిస్తున్నానని, అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందని నిత్యా తెలిపింది. -
అయ్యో అలా ఎప్పుడు చెప్పాను?
నటీమణుల్లో నిత్యామీనన్ది సపరేట్ బాణీ అనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతుంది. ఆ పాత్ర తనక నచ్చితేనే ఒప్పుకుంటానని నిర్మొహమాటంగా చెప్పే నిత్య ఆ మధ్య మణిరత్నం అవకాశాన్ని కూడా నిరాకరించిందనే ప్రచారం జరిగింది. అయితే అమ్మడికి ఇటీవల అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అందుకు కారణం కూడా తనేననే ప్రచారం చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. నిత్యామీనన్‌కు దర్శకత్వంపై మోజు పుట్టిందనీ,అందుకే నటిగా అవకాశాలను తిరస్కరిస్తోందన్న ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇది ఆ నోటా ఈ నోటా నిత్యామీనన్ చెవిన పడింది. అంతే అయ్యో దర్శకత్వం చేస్తానని నేనెప్పుడు ఎవరితో చెప్పాను?. ఇలా కూడా వదంతులు పుట్టిస్తున్నారా? అంటూ రియాక్ట్ అయ్యింది. దీని గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ నిజం చెప్పాలంటే నటిగానే తనకింకా సంతృప్తి కలగలేదని, ఛాలెంజింగ్ పాత్రలు చాలా చేయాలని ఆశ పడుతున్నట్లు తెలిపింది. తనను దర్శకురాలిగా చూడటానికి చాలా మంది ఎదురు చూస్తున్నారన్నది ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొంది. అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, భవిష్యత్‌లో దర్శకత్వం గురించి ఆలోచిస్తానని తెలిపింది. ప్రస్తుతం విజయ్ 61వ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటిస్తున్నాననీ నిత్యా చెప్పింది. కాగా విజయ్ చాలా శాంత స్వభావి అనీ, ఆయనతో తొలి సారిగా నటిస్తున్నాననీ చెప్పింది. అదే విధంగా అట్లీ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందని నిత్యామీనన్ పేర్కొంది. ఇందులో తండ్రి పాత్రలో నటిస్తున్న విజయ్‌కు జోడిగా నిత్యామీనన్ నటిస్తుందని సమాచారం. -
ఆమెది ఈమె.. ఈమెది ఆమె
మహానటి సావిత్రి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ మహానటి సినిమాలో నిత్యామీనన్ ఓ కీలకమైన పాత్ర పోషించనున్నట్టుగా గతంలో వార్తలొచ్చాయి. అయితే, అంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ... ఆమె స్థానంలో సమంత పేరు వచ్చింది. ఇదిలా వుండగానే సమంత చేయాల్సివున్న మరో సినిమా ఆఫర్ ఇప్పుడు నిత్యామీనన్ చేతి కెళ్లింది. కన్నడంలో 'యూ టర్న్' పేరిట తెరకెక్కిన ఓ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ సినిమాలో తొలుత పాత్ర చేయాలనుకున్న శామ్.. కొన్ని కారణాలతో వదిలేసుకుంది. దీంతో ఆ చాన్స్ నిత్యాకు దక్కింది. ఇప్పటికే నిత్యామీనన్ 'యూ టర్న్' తెలుగు రీమేక్‌కి సైన్ చేసినట్టు తెలుస్తోంది. -
ఒకరు మిస్... ఇంకొకరు యస్!
చేతిదాకా వచ్చింది.. ఇక సెట్లోకి వెళ్లడమే ఆలస్యం... ఇంతలోనో ఏదో అయింది.. వచ్చిన ఛాన్స్ చేజారింది.. ఒకరికి ‘మిస్’ అయిన ఛాన్స్ ఇంకొకరికి వెళితే.. ‘యస్’ చెప్పకుండా ఉంటారా? చెప్పినవాళ్లు సెట్లోకి.. మిస్సయిన వాళ్లు వేరే సెట్లోకి.. ఇంతకీ ఎవరు ‘మిస్’ చేసుకున్నారు? ఎవరు ‘యస్’ చెప్పారు? రండి... తెలుసుకుందాం. జస్ట్ మిస్! అనూహ్యంగా తుపాన్ వస్తే ఢిల్లీ–హైదరాబాద్ ఫ్లైట్ మధ్యలో గోవాలోనే ల్యాండ్ అయినట్టు, అనుపమా పరమేశ్వన్ ముహూర్తం కూడా జరగక ముందు చరణ్–సుక్కు ఫ్లైట్ నుంచి కిందకు దిగారు. ఇప్పుడిప్పుడే తెలుగు తెరపై మెల్లగా అడుగులు వేయడం ప్రారంభించారు అనుపమ. ‘అ ఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’... ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పటివరకూ తెలుగులో మూడు సినిమాలే చేసినా నటిగా మంచి గుర్తింపే వచ్చింది. అదే రామ్‌చరణ్ సినిమాలో ఛాన్స్ తెచ్చిపెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ హీరోగా మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించే సినిమాలో మొదట అనుపమను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇంకేముంది... అమ్మాయి ఎగిరి గంతేసింది. అంతలోనే పెద్ద కుదుపు. ఆమెను తప్పించి, కథానాయికగా సమంతను తీసుకున్నారు. పారితోషకం విషయంలో బెట్టు చేయడంతోనే అనుపమను సినిమా నుంచి తొలగించారనే వార్తలొచ్చాయి. వాటిని నిర్మాణ సంస్థ ఖండించింది. కారణాలు ఏవైనా అనుపమకు ఓ స్టార్ పక్కన నటించే ఛాన్స్ దూరమైంది. ఆమె స్థానంలో చరణ్–సుక్కు ఫ్లైట్ ఎక్కిన సమంతకు హీరో, దర్శకుడు ఇద్దరితోనూ ఇదే మొదటి సినిమా. ఈ సినిమా మిస్సయిన అనుపమ ఫీలింగ్ ఎలా ఉందంటే, ‘అవకాశం చేజారవచ్చు.. బయటవాళ్లు అనుకుంటున్నట్లుగా యూనిట్ సభ్యులతో నాకేం పొరపొచ్ఛాలు లేవు. మేం ఫ్రెండ్లీగానే ఉన్నాం’’ అని క్లారిఫై చేశారామె. జ్యోతిక తప్పుకుంటే నిత్యా ఒప్పుకున్నారు నిత్యా మీనన్ ఓ చిత్రానికి సంతకం చేసారంటే... అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఫిక్సవుతారు. లేదంటే కనీసం కుటుంబంతో కలసి చూసేలా ఉంటుందనుకుంటారు. రీ–ఎంట్రీ తర్వాత జ్యోతిక కూడా అచ్చంగా అటువంటి పేరే తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత నటనకు ఓ కామా పెట్టిన జ్యోతిక.. తన పిల్లలు కాస్త పెద్దవాళ్లయిన తర్వాత మళ్లీ సినిమాలు చేయాలనుకున్నప్పుడు... బోలెడంతమంది దర్శక, నిర్మాతలు ఆమెకు కథలు వినిపించారు. తొందరపడి ఏదొకటి చేయకుండా ‘36 వయదినిలే’, ‘మగళిర్ మట్టుమ్’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో విషయమున్న కథలకు ఓటేశారు జ్యోతిక. ఈ టైమ్‌లోనే అట్లీ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ చేస్తున్న సినిమాలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటించమని జ్యోతికను సంప్రదించారు. అంతే కాదు... ఆమె నటిస్తున్నట్టు ప్రకటించారు. విజయ్–జ్యోతికలది హిట్ కాంబినేషన్. తమిళ ‘ఖుషి’తో పాటు ఈ ఇద్దరూ మరో సినిమా చేశారు. కట్ చేస్తే... వారంలోపే జ్యోతిక నటించడం లేదనే వార్త బయటకొచ్చింది. ఆ వెంటనే నిత్యా మీనన్‌కి పిలుపొచ్చింది. విజయ్ సినిమా కావడంతో నిత్యా మీనన్ కూడా చకచకా సంతకం చేశారు. జ్యోతిక ఎందుకు నటించనన్నారో.. నిత్యా ఎందుకు అంగీకరించారో... ఆ పాత్ర ప్రాముఖ్యత ఏంటో... సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది. క్లాష్.. క్లాష్...! మామూలుగా దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమాలంటే హీరోయిన్లకు మంచి ప్రాముఖ్యం ఉంటుంది. అందుకే ఆయనతో సినిమా చేసే ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని కొంతమంది ఎదురు చూస్తారు. ఇక విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా ఛాన్స్ అంటే.. డబుల్ ధమాకానే. ‘ధృవ నక్షత్రం’తో అనూ ఇమ్మాన్యుయేల్‌కి ఆ డబుల్ ధమాకా వచ్చింది. విక్రమ్‌తో ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. కానీ, అప్పటికే అంగీకరించిన సినిమాలతో ‘ధృవ నక్షత్రం’ షెడ్యూల్స్ క్లాష్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా నుంచి తప్పుకున్నారామె. అదే టైమ్‌లో ‘పెళ్లి చూపులు’లో నటించిన తెలుగమ్మాయి రీతూ వర్మ దర్శకుడు గౌతమ్ మీనన్ చూపుల్లో పడడం.. ఆమెను హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగాయి. ఇందులో విక్రమ్, రీతూ వర్మలవి టిపికల్ హీరో హీరోయిన్ పాత్రలు కాదట. హాలీవుడ్ సై్టల్లో వాళ్ల క్యారెక్టర్లు డిఫరెంట్‌గా డిజైన్ చేశారట గౌతమ్ మీనన్. రీతూ వర్మకు తొలి భారీ చిత్రమిదే. సెట్స్‌ని టచ్ చేయకుండానే... ఓ అడుగు ముందుకు... మరో అడుగు వెనక్కి... కథానాయిక లావణ్యా త్రిపాఠి తీరిది. తెలుగులో తొలి సినిమా ‘అందాల రాక్షసి’తోనే ఈ ఉత్తరాది బ్యూటీ ప్రేక్షకుల మనసు దోచేశారు. ఆ తర్వాత కెరీర్లో కంటిన్యూ స్‌గా హిట్స్ పడ్డాయి. కానీ, ఎక్కువ సినిమాలు చేయడంలో ఇతర హీరోయిన్లతో పోలిస్తే... లావణ్యా త్రిపాఠి ఓ అడుగు వెనకే ఉన్నారు. తాజాగా రవితేజ ‘టచ్ చేసి చూడు’ ఛాన్స్ లావణ్య చేజారిందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త వినిపిస్తోంది. విక్రమ్ సిరిని దర్శకునిగా పరిచయం చేస్తూ, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ‘టచ్ చేసి చూడు’లో రాశీఖన్నా, లావణ్యా త్రిపాఠిలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ప్రస్తుతం రాశీఖన్నాతో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మరో కథానాయిక లావణ్యా త్రిపాఠి సీన్స్ ఏప్రిల్‌లో చిత్రీకరించడా నికి ప్లాన్ చేశారు. అప్పుడు లావణ్య చిత్రీకరణలో పాల్గొంటే ఫిల్మ్‌నగర్ టాక్ నిజం కాదని అర్థం. ఓ కథానాయిక స్థానంలో మరొకర్ని ఎంపిక చేయడం కొత్తేమీ కాదు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. రామ్‌చరణ్ ‘ఎవడు’లో ముందు సమంతను తీసుకుని, కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఏమైందో ఏమో.. చివరకు, ఆమె స్థానంలో శ్రుతీహాసన్ నటించారు. ఇలా శ్రుతి ఖాతాలో ఓ సినిమా చేరితే.. మరో సినిమా చేజారింది. అదే ‘ఊపిరి’. నాగార్జున, కార్తీ చేసిన ఈ చిత్రంలో ముందు శ్రుతీనే తీసుకున్నారు. నిర్మాతలతో ఏవో సమస్యలు రావడంతో శ్రుతీహాసన్ తప్పుకున్నారు. అప్పుడు తమన్నా ఆ సినిమాలో నటించారు. తమన్నా ఈ విధంగానే మరో తమిళ చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు. అదే ‘పెళ్లి చూపులు’ రీమేక్. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ నిర్మాత. ముందు తెలుగులో నటించిన రీతూ వర్మనే తమిళ రీమేక్‌లోనూ తీసుకోవాలనుకున్నారు. చివరకు తమన్నాను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం రీతూకి మంచి చేసింది. ఎలాగంటే.. ఈ సినిమాకి కేటాయించాలనుకున్న డేట్స్‌ను ఓ పెద్ద సినిమాకి ఇచ్చారు. అదే విక్రమ్–గౌతమ్‌ల ‘ధృవ నక్షత్రం’. కథానాయికలే కాదు... దర్శకులు, వాళ్ల కథలు కూడా ఓ హీరో నుంచి మరో హీరో దగ్గరికి వెళ్తుంటాయి. ఇదీ కొత్త విషయమేమీ కాదు. ప్రస్తుతం హీరోలు చేస్తున్న సినిమాలు కొన్నిటిని ఓ లుక్కేస్తే... ఎన్టీఆర్ 27వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టకముందు రవితేజ కోసం దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) ఓ కథ సిద్ధం చేశారు. ఆ కథతోనే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారా? లేక వేరే కథతోనా? అన్నది దర్శకుడే చెప్పాలి. రవితేజ నుంచి బాబీ.. ఎన్టీఆర్ దగ్గరికి వస్తే.. ఎన్టీఆర్ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి.. రవితేజ దగ్గరికి వెళ్లారు. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి తీస్తున్న ‘రాజా.. ద గ్రేట్’ కథ రామ్ నుంచి ఎన్టీఆర్, అక్కణ్ణుంచి రవితేజ దగ్గరకి వెళ్లింది. ఎన్టీఆర్ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకునిగా పరిచయం కావాలనుకున్నారు. ఆయన రెడీ చేసిన కథ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు అంతగా నచ్చకపోవడంతో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లారు. ఇక, గౌతమ్ మీనన్ ‘ధృవ నక్షత్రం’లోనూ ముందు అనుకున్న హీరో విక్రమ్ కాదు.. సూర్య. కథలో సూర్య చాలా మార్పులు చెప్పడంతో గౌతమ్ చేయనని చెప్పేశారట. రెండేళ్ల తర్వాత విక్రమ్‌తో అదే కథతో సినిమా తీస్తున్నారు. -
ఆడాళ్లూ..మరదల్ని చూడండి!
మీరు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆమె చెల్లెలు మీకు ఏమవుతుంది? వరుసకు మరదలే కదా! ఆ లెక్కన వెంకటేశ్‌కు తేజస్వి మరదలు అవుతోందిప్పుడు! ‘నేను.. శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటించనున్న చిత్రం ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’. ఇందులో హీరోయిన్ నిత్యా మీనన్ చెల్లెలి పాత్రలో తేజస్వి మదివాడ నటించనున్నారు. అగ్రిమెంట్ మీద ఇంకా సంతకం చేయలేదు గానీ... దర్శకుడు కథ చెప్పడం, ఆమె ఓకే చేయడం జరిగాయి. ఈ చిత్రంలో తేజస్వి పాత్ర ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!’ చిత్రంలో స్వాతి పాత్ర తరహాలో ఉంటుందట! ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’లో తేజస్వి పెంపుడు తల్లిగా నిత్య నటించారు. ఇప్పుడీ చిత్రంలో అక్కాచెల్లెళ్లుగా కనిపించనున్నారు. ఇక, ఈ చిత్రకథ విషయానికొస్తే... ‘ప్రేమకు వయసుతో పనేముంది? మనసుతోనే కదా. వయసులో వ్యత్యాసం ఉన్న ఇద్దరి మనసులు కలిస్తే.. ప్రేమలో పడితే?’ అనేది ముఖ్యాంశం. మల్టీ డైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. సమర్పణలో పీఆర్ సినిమాస్ పతాకంపై పూస్కూర్ రామ్మోహనరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుందట.ఈ చిత్రంలో తేజస్వి పాత్ర ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!’ చిత్రంలో స్వాతి పాత్ర తరహాలో ఉంటుందట! -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టగలరా?
అది.. 1998. అప్పుడామెకు 10ఏళ్లు. అంతా భారతీయులే రూపొందించిన ఇంగ్లీష్ సినిమా 'The Monkey Who Knew Too Much'లో హీరోయిన్ టబుకు చిన్న చెల్లిగా నటించింది. మరో ఏడేళ్ల తర్వాత.. 'సెవెన్ ఓ క్లాక్' అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే తన మాతృభాష మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా దిగ్గజ దర్శకుడు కె.పి.కుమారన్ తీసిన 'ఆకాశ గోపురం'లో నటించింది. జాతీయస్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టిన ఆ సినిమాతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.. మలయాళ, కన్నడలో వరుస సినిమాలు చేసింది. 2011లో టాలీవుడ్ లోకి ఎంటరైన ఆమె.. 'హైదరాబాదే ఈజ్ డెస్టినేషన్' అని చెప్పుకునేలా అభిమానాన్ని పంచారు తెలుగు ప్రేక్షకులు. అవును మనం చెప్పుకుంటున్నది బ్యూటిఫుల్ యాక్టర్ నిత్యా మీనన్ గురించే. 'జనతా గ్యారేజ్'తో హిట్ట్ కొట్టిన నిత్య ఇప్పుడు వెంకటేశ్ తో జోడీ కట్టి రాబోయే సినిమా అంచనాలను పెంచేసింది. తన 10వ ఏట నిత్యా మీనన్ 'The Monkey Who Knew Too Much'లో టబుకు చెల్లెలుగా నటించినప్పటి ఫొటోలివి. ఆ సినిమాలో నిత్య నటించిన సీన్లు వీడియోలో చూడొచ్చు. -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టగలరా?
-
స్త్రీ ఆటబొమ్మ కాదు... ఆది పరాశక్తి
- దర్శకురాలు శ్రీప్రియ ‘‘ఆడదంటే ఆటబొమ్మ కాదు.. ఆది పరాశక్తి అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. నిత్యా మీనన్ అద్భుతంగా నటించింది’’ అన్నారు దర్శకురాలు శ్రీప్రియ. క్రిష్ జె.సత్తార్, నిత్యా మీనన్ జంటగా ‘దృశ్యం’ ఫేమ్ శ్రీప్రియ దర్శకత్వంలో వీఆర్ కృష్ణ.యం నిర్మించిన సినిమా ‘ఘటన’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘22 ఫీమేల్ కొట్టాయం’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. శనివారం ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు. అతిథిగా హాజరైన నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ‘‘ఎవరూ స్పృశించని విభిన్నమైన కథ ఇది. నర్సు ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లే అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనే విషయాల ఆధారంగా శ్రీప్రియ ఈ సినిమా తీశారు. ఇటువంటి మహిళా సినిమాలు తీయడానికి మహిళా దర్శకురాలే కరెక్ట్’’ అన్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వీఆర్ కృష్ణ.యం తెలిపారు. నరేశ్, కోట శ్రీనివాసరావు, కోవై సరళ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: మనోజ్ పిళ్లై, పాటలు: అనంత శ్రీరామ్, సంగీతం: అరవింద్ శంకర్, సమర్పణ: బేబీ సంస్కృతి.యం, బేబీ అక్షర.యం. -
ఎంత ఘాటు ప్రేమయో..!
ఆ పేరుతో పిలిస్తే వెంకటేశ్‌కి పిచ్చ కోపం వస్తుంది. వయసును గుర్తు చేస్తూ పిలిస్తే మరి కోపం రాదూ! ఇంతకీ ఆ పేరేంటి అనుకుంటున్నారా..? ‘పెళ్లి కాని ప్రసాద్’. పైన చెప్పిన కోపమంతా తెరపైనే. ‘మల్లీశ్వరి’లో పెళ్లి వయసు దాటేసిన వ్యక్తిగా వెంకటేశ్ పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి అటువంటి పాత్రలోనే నటించనున్నారు. వెంకటేశ్, నిత్యా మీనన్ జంటగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’. ‘‘ప్రేమకు వయసుతో పనేముంది? మనసుతోనే కదా. వయసులో వ్యత్యాసం కల ఇద్దరి మనసులు కలిస్తే.. ప్రేమలో పడితే...’’ అనే వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. అంతే కాదండోయ్... వెంకీ, నిత్యా ఏజ్ గ్యాప్ మీద దర్శకుడు బోలెడన్ని వినోదాత్మక సన్నివేశాలు రాశారట. ఆ ఫన్నీ ప్రేమకథ, సెటైరికల్ డైలాగులు వెంకీకి బాగా నచ్చాయని సమాచారం. ఆయన కామెడీ టైమింగ్ సినిమాకి హైలైట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. సమర్పణలో పీఆర్ సినిమాస్ పతాకంపై పూస్కూర్ రామ్మోహనరావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘గురు’లో ఓల్డ్ ఏజ్డ్ బాక్సింగ్ కోచ్ పాత్రలో వెంకీ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, అందులో వెంకటేశ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సూపర్ అంటున్నారు ప్రేక్షకులు. -
సీనియర్ హీరోతో నిత్యామీనన్
బాబు బంగారం సినిమాతో సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్, వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సాలా ఖద్దూస్ రీమేక్‌గా తెరకెక్కుతున్న.. గురు(వర్కింగ్ టైటిల్) సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న వెంకీ, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ఇటీవల బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఓ యువ దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించాడు. రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన కిశోర్ తిరుమల, దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్కు అంగీకరించాడు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మలయాళి భామ నిత్యామీనన్‌ను హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన నిత్యా, వెంకటేష్‌తో కలిసి నటిస్తుండటపై ఆనందం వ్యక్తం చేసింది. -
గ్యారేజ్‌లో గణపతి పూజ
-
దృశ్యం డైరెక్టర్‌తో నిత్యామీనన్
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన మలయాళ రీమేక్ సినిమా దృశ్యంతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యింది సీనియర్ నటి శ్రీ ప్రియ. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె, తన రెండో ప్రయత్నంగా కూడా ఓ థ్రిల్లర్ సినిమానే ఎంచుకుంది. రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీ ప్రియ ప్రస్తుతం ఓ స్ట్రయిట్ సినిమాను రూపొందిస్తోంది. ఈ సినిమాలో లేడి ఓరియంటెడ్ సినిమాల కేరాఫ్ అడ్రస్ నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఘటన పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. లవ్ కం రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా తన మార్క్ థ్రిల్లర్ గా రూపొందిస్తోంది శ్రీ ప్రియ. సన్ మూన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఘటనను సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నిత్యా మీనన్‌తో పాటు క్రిష్, నరేష్, కోట శ్రీనివాసరావు, కోవై సరళలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
'మహానటి'గా మలయాళీ బ్యూటీ
-
మెగాఫోన్ పట్టనున్న అపరిచితుడు
సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరో విక్రమ్. సినిమా కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీగా ఉండే విక్రమ్.. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో, త్వరలో మెగాఫోన్ పట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల చెన్నై వరదల నేపథ్యంలో ఓ షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించిన విక్రమ్ త్వరలోనే పూర్తి స్థాయి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్న విక్రమ్ ప్రస్తుతం ఇతర విభాగాల మీద పట్టు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే షూటింగ్ సమయంలో తన షాట్ అయిపోయినా.. కెమరా, లైటింగ్ లాంటి విషయాల మీద అవగాహన కోసం సెట్స్‌లో ఉంటున్నాడు. అంతేకాదు తాను దర్శకత్వం వహించబోయే సినిమాలో తాను మాత్రం హీరోగా నటించకూడదని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఇరుముగన్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో ఇంకొకడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. విక్రమ్ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో నయనతార, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
'మహానటి'గా మలయాళీ బ్యూటీ
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు నాగ అశ్విన్ తన రెండో ప్రయత్నంగా ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు సినిమా ఖ్యాతిని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన మహానటి సావిత్రి జీవిత చరిత్రను వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు హీరోయిన్ వేట కూడా కొనసాగుతోంది. నటిగా ఎన్నో అద్భుత విజయాలను సాధించిన సావిత్రి పాత్రలో నటించేందుకు సరైన నటి ఎవరన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. తొలుత ఈ పాత్రకు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ను తీసుకుంటారన్న టాక్ వినిపించింది. అయితే దర్శకుడు ఈ వార్తలను ఖండించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. ఆ తరువాతే నటీనటుల ఎంపిక మొదలు పెడతామని ప్రకటించాడు. అయితే తాజాగా మహానటి పాత్రకు మరో హీరోయిన్ ను సంప్రదించారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నిత్యామీనన్ ను మహానటి సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు నాగ అశ్విన్, నిత్యా మీనన్ కు కథ కూడా వినిపించాడట.. అయితే నిత్యా నుంచి ఎలాంటి హామి రాలేదన్న టాక్ వినిపిస్తోంది. దీనిపై ఆమె త్వరలోనే తన నిర్ణయం ప్రకటించనుంది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. -
'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్
-
బహుశా... పుష్కరం తర్వాత నేనివ్వబోయే గొప్ప హిట్..!
- ఎన్టీఆర్ ‘‘ప్రతిసారి మీ (అభిమానుల) ఋణం తీర్చుకోవచ్చనుకుంటా. నాకు తెలిసి అది జరగదేమో. మీ ఋణం తీర్చుకోకుండానే వెళ్లిపోయి మళ్లీ పుడతానేమో. మీకోసం మళ్లీ మళ్లీ పుట్టాలనుంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. ఈ జన్మలో ఆ మహానుభావుడి (ఎన్టీఆర్)కి మనవడిగా పుట్టాను. ‘నాన్నకు ప్రేమతో’ విడుదల తర్వాత నా కటౌట్లకు పాలాభిషేకం చేయడం చూసి బాధపడ్డాను. నేను దేవుణ్ణి కాదు. ఓ నటుణ్ణి, మీ అన్నో, తమ్ముణ్ణో. మీ అభిమానాన్ని కాదనను. దయచేసి ఆ పాల ప్యాకెట్‌ను అనాధాశ్రమంలో పిల్లలకు ఇస్తే సంతోషిస్తా. సినిమా విడుదల సమయాల్లో మూగ జీవాలను బలి ఇవ్వడం మానేసి అన్నదానం చేయండి’’ అన్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మిస్తున్న సినిమా ‘జనతా గ్యారేజ్’. సమంత, నిత్యా మీనన్ కథానాయికలు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రధారి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - ‘‘పన్నెండేళ్లకోసారి పుష్కరాలొస్తాయి. చిన్న వయసులోనే ‘ఆది’, ‘సింహాద్రి’ దక్కాయి. సక్సెస్ ఇంతే అనుకున్నా. అర్థం కాలేదు. అప్పుడప్పుడు దేవుడు మొట్టికాయలు వేసి నువ్వు కిందకు పడరా.. జీవిత పరమార్థం అర్థమవుతుందని చెప్తాడు. కిందపడేలా చేసిన సినిమాలకు మీరెంత బాధపడ్డారో నాకు తెలుసు. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తానని ఎలా చెప్పాలో తెలియలేదు. బహుశా పుష్కరం తర్వాత నేను ఇవ్వబోయే గొప్ప హిట్ ఇది. నాకు ఆప్తమిత్రుడైన నా శివ ఇస్తాడేమో. సెప్టెంబర్ 2న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ - ‘‘అన్నయ్య (చిన్న ఎన్టీఆర్)తో నా అనుబంధం ప్రత్యేకం. రచయితగా పెద్దగా ఎదగనప్పుడు ‘బృందావనం’ రాశాను. ఆ సినిమా ఆడియో వేడుకలో నన్ను అభిమానులకు ఎన్టీఆర్ పరిచయం చేశారు. నా జర్నీ ఆరోజే మొదలైంది. ఆయన కోసం నా పెన్ను ఇంకొంచెం ఎక్కువ రాస్తుంది. అన్నయ్య ఎనర్జీ, ఎగ్జైట్మెంట్ మ్యాచ్ చేస్తూ రాసిన సినిమా ఇది. ‘జనతా గ్యారేజ్’తో బ్లాక్ బస్టర్ కొడతాను. సినిమా కోసం మా నిర్మాతలు ఎంతైనా ఖర్చుపెడతారు. ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు’’ అన్నారు. ‘‘తారక్‌తో వర్క్ చేయడం అల్లరిగా, సరదాగా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది’’ అని దేవిశ్రీప్రసాద్ అన్నారు. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, ప్రసాద్ వి పొట్లూరి, దర్శకుడు సుకుమార్, నటులు సాయికుమార్, ఉన్ని ముకుందన్, సినిమాటోగ్రాఫర్ తిరునావక్కరుసు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, రచయిత వక్కంతం వంశీ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
అతిథులుగా ఆ ముగ్గురు..
మూడు భాషలకు చెందిన యువ స్టార్ హీరోలు అతిథులుగా ఇరుముగన్ చిత్రం గీతాలావిష్కరణకు సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. సియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్. ఆయనతో తొలిసారిగా సంచలన నటి నయనతార జోడి కడుతున్నారు. మరో నాయకిగా నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని పులి చిత్ర నిర్మాతలో ఒకరైన శిబు తమీన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అరిమానంబి చిత్రంతో మెగాఫోన్ పట్టి మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు ఆనంద్‌శంకర్ తెరకెక్కిస్తున్న రెండో చి త్రం ఇది. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో రెండు కోణాల్లో సాగే విభిన్న పాత్ర లో విక్రమ్ నటిస్తున్నారు. దీనిపై ఆయన చా లా ఆశలు పెట్టుకున్నారు. కారణం విక్రమ్ మంచి విజయాన్ని చూసి చాలా కాలమైంది. శంకర్ దర్శకత్వంలో నటించిన ఐ చిత్రం నటుడిగా ఆయన శ్రమకు మంచి పేరు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక దాని తరువాత నటించిన 10 ఎండ్రదుక్కుళ్ చిత్రం విక్రమ్‌ను పూర్తిగా నిరాశపరచింది. తాజా చిత్రం ఇరుముగన్ విజయం తథ్యం అనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. ఇక ఈ చిత్రం విజయం నటుడు విక్రమ్‌కు చాలా అవసరం కూడా. హారీశ్జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నగరంలో ఆగస్టు రెండో తేదీన భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఆ కార్యక్రమానికి కోలీవుడ్‌కు చెందిన యువ నటుడు శివకార్తీకేయన్, టాలీవుడ్‌కు చెందిన టాప్ హీరో రామ్‌చరణ్, మాలీవుడ్‌కు చెందిన యువ నటుడు నవీన్ పాలీ అతిథులుగా పాల్గొన్ననున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించారు. వీరితో పాటు ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు విచ్చేయనున్నట్లు తెలిపారు. -
దేనికైనా కాలం కలిసి రావాలి
దేనికైనా కాలం కలిసిరావాలని అంటుంటారు. అలాగే ఒక్కోసారి ప్రయోగాలు బెడిసికొడుతుంటాయి. ఈ రెండింటిని దర్శకుడు, నటుడు చేరన్‌కు ఆపాదించవచ్చు. ఒకప్పుడు వరుస విజయాలతో ఓహో అని వెలిగారు. ఈయన చిత్రాలు తెలుగులోనూ పునర్నిర్మాణం, అనువాదాలు జరిగాయి. అలాంటి దర్శకుడు శర్వానంద్, నిత్యామీనన్ జంటగా తెరకెక్కించిన జేకే ఎనుమ్ నన్బనిన్ వాళ్కై చిత్రంపై ఆరంభంలో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే కారణాలేమైన చేరన్ ఆ చిత్రాన్ని ఒక ప్రయోగానికి వాడుకున్నారు. అదే చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయకుండా డీవీడీల ద్వారా ఇంటింట విక్రయించారు. ఇలాంటి ప్రయోగాన్నే అంతకు ముందు విశ్వనటుడు కమలహాసన్ విశ్వరూపం చిత్రానికి చేయాలని ప్రయత్నించి థియేటర్ల యాజమాన్యం వ్యతిరేకత కారణంగా దాన్ని విరమించుకోవలసి వచ్చింది. దర్శకుడు చేరన్ చేసిన ప్రయోగం ఎంత వరకు ఫలించిందోగానీ, ఆయన మాత్రం చాలా ఆర్థిక సమస్యలకు గురయ్యారు.ఈ సంగతలా ఉంచితే జేకే ఎనుమ్ నన్బనిన్ వాళ్కై చిత్రం తమిళనాడులో థియేటర్లలోకి రాకుండానే తెలుగులో రాజాధిరాజా పేరుతో అనువాదమై గత శుక్రవారం విడుదలైంది. అక్కడ చిత్రానికి మంచి స్పందన వస్తోందని దర్శకుడు చేరన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా మొదట తమిళనాడులో డీవీడీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పడు తెలుగులో విడుదలైంది. తదుపరి తమిళంలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చేరన్ తెలిపారు. జేకే ఎనుమ్ నన్బనిన్ వాళ్కై చిత్రాన్ని డీవీడీల ద్వారా కొందరు మాత్రమే చూడగలిగారని, మంచి చిత్రాన్ని అందరూ చూడాలన్న భావనతో థియేటర్ల యాజమాన్యం ప్రదర్శించడానికి ముందుకు రావడంతో జులై 15న చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చేరన్ వెల్లడించారు. ప్రస్తుతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన్ని జేకే ఎనుమ్ నన్బనిన్ వాళ్కై చిత్రం ఒడ్డున పడేస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు. -
టైటిల్ ఓకె, ట్యాగ్ లైనే..!
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఒక్క అమ్మాయి తప్ప. నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రోడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టైటిల్ వివాదానికి కారణమైంది. ఒక్క అమ్మాయి తప్ప అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ట్యాగ్ లైన్‌ను యాడ్ చేశారు. ఈ ట్యాగ్ లైన్‌పై వివాదం మొదలవ్వటంతో వెంటనే మేల్కొన్న చిత్ర యూనిట్ తాజా పోస్టర్స్, ట్రైలర్స్‌లో ఆ ట్యాగ్ లైన్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఒక్క అమ్మాయి తప్ప సినిమా.., టైటిల్ వివాదం నుంచి బయట పడినట్టే భావిస్తున్నారు. -
అభిమాన దర్శకుడికి షాక్ ఇస్తుందా..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో సావిత్రి, సౌందర్య లాంటి అతి కొద్ది మందినే గొప్ప నటీమణులుగా చెపుతుంటారు. చాలా వరకు హీరోయిన్లు గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా హీరోయిజం మీదే సినిమాలు నడుస్తున్న ప్రజెంట్ ట్రెండ్‌లో హీరోయిన్ల పాత్ర కేవలం పాటలకు గ్లామర్ షోకు మాత్రమే పరిమితమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన నటనతో ఆకట్టుకుంటున్న నటి నిత్యా మీనన్. క్యారెక్టర్ల విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉండే నిత్యా మీనన్, పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇండస్ట్రీలో మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్గా ఉన్న నిత్యామీనన్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమాన దర్శకుడు. అయితే ఈ వారం తన అభిమాన దర్శకుడితోనే పోటికి రెడీ అవుతోంది ఈ మళయాలి బ్యూటి. గత శుక్రవాం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేరే ఏ సినిమా పోటీ లేకపోవటంతో అ..ఆ.. మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. కానీ ఈ వారం రిలీజ్ అవుతున్న ఒక్క అమ్మాయి తప్ప, అ..ఆ.. కలెక్షన్లకు బ్రేక్ వేసేలా కనిపిస్తోంది. రోడ్ డ్రామాగా ఎక్స్ పరిమెంటల్ జానర్లో తెరకెక్కిన ఒక్క అమ్మాయి తప్ప సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సందీప్ కిషన్, నిత్యా మీనన్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ వస్తే భారీ వసూళ్లను సాధించటం కాయంగా కనిపిస్తోంది. అదే గనుక జరిగితే అ..ఆ.. హవాకు బ్రేక్ పడినట్టే అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి తన ఫేవరేట్ డైరెక్టర్‌కు నిత్యా మీనన్ ఎలాంటి షాక్ ఇస్తుందో చూడాలి. -
బాలయ్య పుట్టినరోజున.. యువహీరో సినిమా
నిత్యామీనన్‌తో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ హీరో సందీప్ కిషన్ రొమాన్స్ చేసిన సినిమా ఒక్క అమ్మాయి తప్ప. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమా విడుదల అవుతోందట. అయితే ఈ విషయాన్ని సినిమా వర్గాలు ఇంకా అఫీషియల్‌గా చెప్పాల్సి ఉంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. తాడినాడ రాజసింహ అనే కొత్త దర్శకుడి చేతిలో రూపొందిన ఈ సినిమాకు బోగాది అంజిరెడ్డి నిర్మాత. ఈ నెలాఖరులోనే సినిమా విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లింది. కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాలో బాలయ్య అభిమానిగా అలరించిన నాని.. తన తదుపరి సినిమా 'జెంటిల్మన్'ను అదే రోజు విడుదల చేస్తాడని తొలుత వినిపించినా.. అది మరో వారం రోజులకు వాయిదా పడింది. దాంతో ఆ అవకాశాన్ని సందీప్ కిషన్ అందుకున్నట్లయింది. ఈ సినిమాలో ఇంకా తనికెళ్ల భరణి, సప్తగిరి, తాగుబోతు రమేష్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, అలీ, అజయ్, బ్రహ్మాజీ లాంటి పలువురు నటిస్తున్నారు. -
నా కల నెరవేరింది
కలలు కనండి, వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయండి అన్న అబ్దుల్ కలాం మాటల ప్రభావం చాలా మందిపై పడిందని చెప్పవచ్చు. అలాగే సాధనతో ఏదైనా సాధ్యమేనని చాలా మంది నిరూపించారు. ఇక నటి నిత్యామీనన్ విషయానికి వస్తే ఆమె మంచి నటి అన్న విషయం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పాత్రగా మారిపోవడం అన్నది నిత్యామీనన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. అయితే ఆమెలో చక్కని గాయని ఉన్నారన్నది చాలా మందికి తెలియదు. ఇప్పటికే తమిళం, మలయాళం భాషలలో తన గాన ప్రతిభను బహిరంగ పరచారు. తాజాగా తను సూర్యకు జంటగా నటించిన 24 చిత్రం తెలుగు వెర్షన్‌కు పాడడం విశేషం. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీత దర్శకుడు. ఇందులో నిత్యామీనన్ లాలీజో అనే పాటను పాడారు. తమిళంలో ఇదే పాటను శక్తి శ్రీగోపాలన్తో పాడించారు. సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో పాడాలన్న తన కోరిక ఈ పాటతో నెరవేరిందని అన్నారు. నిజంగా ఇది తనకు దక్కిన అదృష్టంగానే భావిస్తున్నానన్నారు. మంచి అవకాశం వస్తే తమిళంలోనూ పాడాలని ఆశిస్తున్నట్లు నిత్య అన్నారు. కాగా ఒక మలయాళ నటి తెలుగు తదితర ఇతర భాషలలో పాడడం అరుదైన విషయమే అవుతుంది. ఇంతకు ముందు నటి మమతామోహన్ దాస్ తెలుగులో పలు పాటలు పాడారన్నది గమనార్హం. నటిగా తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం అంటూ దక్షిణాది భాషలన్నిటిలోనూ నటిస్తున్న నిత్యామీనన్ కన్నడంలో సుదీప్తో నటించిన ముడింజా ఇవనై పిడి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక తెలుగులో సందీప్ కిషన్‌కు జంటగా ఒక్క అమ్మాయి తప్ప చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో సూర్యతో నటించిన 24 చిత్రం ఆరవ తారీఖున విడుదల కానుంది. -
మే 6న సూర్య 24
తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న సైన్స ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 24. సూర్య మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. విడుదలకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న 24 టీం ఫైనల్‌గా మే 6న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ముందుగా ఏప్రిల్ నెలాఖరున సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేసినా టాలీవుడ్లో సరైనోడు రిలీజ్ ఉండటంతో వాయిదా వేసుకున్నారు. ఫైనల్‌గా సూర్య 24 రిలీజ్ కు మే 6న ముహుర్తం ఖరారు చేశారు. సూర్య సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకుడు. సూర్య తన సొంత నిర్మాణసంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించాడు. సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్‌పై చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. -
నిత్యలో మార్పునకు అదే కారణమా?
మనిషిలో మార్పు అనేది సహజం. అయితే ఒక్కసారిగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తే అందుకు బలమైన కారణం ఏదో ఉండే ఉంటుందని భావించాల్సి వస్తుంది. ప్రస్తుతం నటి నిత్యామీనన్‌లో అలాంటి మార్పే స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు చిత్ర వర్గాలు. ఎప్పుడూ కథలు వినడం, షూటింగ్‌లకు వెల్లడం అంటూ ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకునే నిత్య ప్రవర్తనలో ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తోందంటున్నారు. ఇంతకు ముందు పొగరుబోతుగా పట్టం కట్టించుకున్న నిత్యామీనన్‌లో ఇప్పుడు పూజలు, పునస్కారాలు అంటూ భక్తి భావం పెరిగిపోయిందట. తన స్నేహితురాళ్లతో కూడా వేదాంత ధోరణితో మాట్లాడుతోందట. ఇంకా చెప్పాలంటే ఇటీవల నిత్యామీనన్ దోషనివారణ పూజలు చేయించారట. ఆ పూజలో ఆమె బంధువర్గాలు కూడా పాల్గొన్నారని తెలిసింది. ఇంతలో ఆమెలో అంత మార్పునకు కారణం ఏమైఉంటుందన్నదే అందరిలో కుతూహలాన్ని పెంచుతున్న అంశం. నిత్యామీనన్ తాజాగా అప్పావిన్ ఆశై, 24,ముడింజా ఇవనై పిడి తదితర తమిళ చిత్రాలతో పాటు కన్నడం, తెలుగు భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. ముడింజా ఇవనై పిడి చిత్రంలో సుధీప్‌కు జంటగా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని, అది త్వరలో పెళ్లికి దారి తీయనుందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలాంటి ప్రచారానికి, నిత్యామీనన్ దోషనివారణ పూజలకు ఎమైనా సంబంధం ఉండి ఉంటుందా?అ న్న కూపీ లాగే పనిలో పడ్డారు ఒక వర్గం. -
24లో సూర్య సొంత గొంతు
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేసే సూర్య తదుపరి సినిమా 24 విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. అయితే ఇప్పటివరకు సూర్య సినిమాలకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించేవారు. తమ్ముడు కార్తీ తెలుగులో డబ్బింగ్ చెప్పటం ప్రారంభించినా సూర్య మాత్రం రిస్క్ తీసుకోలేదు. అయితే 24 చిత్రంలో ఆ రిస్క్‌కు రెడీ అవుతున్నాడు సూర్య. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై టాలీవుడ్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న సూర్య ఒక పాత్రకు తన సొంత గొంతుతో తెలుగు డబ్బింగ్ చెపుతున్నాడు. ఇదే వర్కవుట్ అయితే ఇక ముందు రాబోయే సినిమాలన్నింటిలో ఫ్యాన్స్ సూర్య సొంత గొంతు వినొచ్చు. -
మిక్కీ కోసం తమన్...
సందీప్‌కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. దీని కోసం సంగీత దర్శకుడు తమన్ ఓ పాట పాడారు. ఇందులో విశేషం ఏముంది అనుకోవచ్చు? ఈ చిత్రానికి స్వరకర్త మిక్కీ జె. మేయర్. ఒకరి స్వర సార థ్యంలో మరో సంగీత దర్శకుడు పాడడం అరుదు. కొన్నేళ్ల క్రితం ‘బృందావనం’ చిత్రం కోసం తమన్ ‘వచ్చాడురా...’ పాటను కోటి, కీరవాణిలతో పాడించారు. అయితే ఈ సారి తమన్ తన ఫ్రెండ్ మిక్కీ జె. మేయర్ కోసం పాట పాడారు. ‘‘హీరో పరిచయగీతం తమన్ పాడితే బాగుంటుందని అనుకుని అడిగాను. వెంటనే ఓకే అని పాడిన తమన్‌కు థ్యాంక్స్’’ అని మిక్కీ చెప్పారు. -
తెలివైన కాలేజీ కుర్రాడి కథ!
విలక్షణమైన చిత్రాలు, నటనతో యువతరంలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. గతంలో ‘సినిమా చూపిస్త మావ’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన బోగాది అంజిరెడ్డి ఈ చిత్రం ద్వారా రాజసింహ తాడినాడను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. సందీప్‌కు జోడీగా నిత్యామీనన్ నటించిన ఈ చిత్రం టాకీ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కొత్త నేపథ్యంలో నడిచే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. సందీప్ కొత్తగా కనిపిస్తాడు. ప్రముఖ భోజ్‌పురీ నటుడు రవి కిషన్ విలన్‌గా చేశారు. ఇందులో గంటా ముప్ఫై నిమిషాలు అధునాతన గ్రాఫిక్స్ ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘మూడు పాటలు తీయాల్సి ఉంది. ఒకటి ఇండియాలో, రెండు విదేశాల్లో చిత్రీకరిస్తాం. ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్’ అన్నది ఈ చిత్ర క్యాప్షన్. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత పేర్కొన్నారు. ‘‘ఇందులో తెలివైన కాలేజీ కుర్రాడి పాత్రలో కనిపిస్తా. నేను, నిత్యామీనన్ తొలిసారి కలిసి నటిస్తు న్నాం. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం నిలుస్తుంది’’ అని సందీప్ కిషన్ చెప్పారు. ఈ చిత్రానికి కెమేరామ్యాన్: ఛోటా కె.నాయుడు, సంగీతం: మిక్కీ జె.మేయర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆళ్ల రాంబాబు, సహ నిర్మాత: మాధవి వాసిపల్లి. -
జనతా గ్యారేజ్ రెడీ టు స్టార్ట్!
‘మిర్చి’లో ప్రభాస్‌ని చాలా డైనమిక్‌గా, ‘శ్రీమంతుడు’లో మహేశ్ బాబుని చాలా లవ్లీగా చూపించిన కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్‌ని డాషింగ్ మెకానిక్‌గా చూపించడానికి రెడీ అవుతున్నారు. సో.. ఎన్టీఆర్ పూర్తిగా డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని చెప్పొచ్చు. జనతా గ్యారేజీలో పని చేసే మెకానిక్‌గా, కాలేజ్ స్టూడెంట్‌లా ఈ చిత్రంలో యంగ్ టైగర్ టూ షేడ్స్ ఉన్న పాత్ర చేయనున్నారు. ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం జనతా గ్యారేజీ సెట్‌ని రెడీ చేయిస్తున్నారు. ఆర్ట్ డెరైక్టర్ ఏయస్ ప్రకాశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఈ సెట్ తయారవుతోంది. సెట్ వర్క్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ నెల 24న షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చే పనిలో ఉన్నారు. ఆ ముగ్గురిలో ఎవరు? ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు కథానాయికలు కనువిందు చేస్తారు. ఓ నాయికగా నిత్యామీనన్‌ని ఎంపిక చేశారు. మరో నాయిక పాత్ర కోసం శ్రుతీహాసన్, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్‌ల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురు నాయికలూ ఎన్టీఆర్‌తో ఆల్రెడీ జతకట్టినవారే. మరి.. మరోసారి ఎవరికి చాన్స్ దక్కుతుందో వేచి చూడాలి. పన్నెండేళ్ల తర్వాత దేవయాని! పవన్ కల్యాణ్ సరసన ‘సుస్వాగతం’లో నటించిన దేవయాని గుర్తున్నారు కదా. మహేశ్‌బాబుకి తల్లిగా ‘నాని’లో కూడా నటించారు. ఆ చిత్రం తర్వాత దేవయాని తెలుగు సినిమాల్లో నటించలేదు. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఆమె ‘జనతా గ్యారేజ్’లో నటించనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జతగానే దేవయాని కనిపించనున్నారట. మొత్తం మీద ఎన్టీఆర్ క్యారెక్టర్ పరంగా, క్యాస్టింగ్ పరంగా ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ సినిమా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. -
సీక్రెట్ ఏజెంటుగా నయనతార
గ్లామర్ రోల్స్‌ను పక్కన పెట్టి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న నయనతార మరో ఆసక్తికరమైన పాత్రకు రెడీ అవుతోంది. ఇప్పటికే అనామిక, మాయ, నానుమ్ రౌడీదాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నయన్, నెక్ట్స్ సినిమాలో సీక్రెట్ ఏజెంటుగా కనిపించనుంది. తమిళ్లో అజిత్ హీరోగా తెరకెక్కిన బిల్లా సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చేసిన నయన్ చాలాకాలం తరువాత అదే తరహా పాత్రలో కనిపించనుంది. విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఇరు మగన్ సినిమాలో నయనతార సీక్రెట్ ఏజెంట్గానటించడానికి రెడీ అవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌లో నటించనుంది ఈ బ్యూటి. తొలిసారిగా నయన్ విక్రమ్‌తో జోడీ కడుతున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. నిత్యామీనన్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. -
త్రిపాత్రాభినయంలో సోదరులు
ఒకే కుటుంబంలో సోదరులిద్దరూ ప్రముఖ కథానాయకులుగా రాణించడమే అరుదైన విషయం. ఇక ఈ సోదర ద్వయం ఏక కాలంలో త్రిపాత్రాభినయం చేయడం నిజంగా విశేషమే. యాదృచ్చికమే అయినా నటుడు సూర్య, కార్తీలు తాము నటిస్తున్న తాజా చిత్రాలలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రాల సంగతేమిటో చూద్దాం. నటుడు సూర్య నటిస్తున్న చిత్రం 24. మలయాళ దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూర్య సొంతంగా తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్ ఇటీవలే విడుదలై పెద్ద హైప్‌నే క్రియేట్ చేసింది. కాగా ఇందులో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ విషయం గురించి సూర్య తెలుపుతూ ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేయాలన్న ఆసక్తి తనకు లేదన్నారు. అసలు ద్విపాత్రాభినయమే వద్దనుకున్న తనను మాస్ చిత్రం అటువైపు లాగిందన్నారు. ఇక తాజా చిత్రం 24 విషయానికి వస్తే ద్విపాత్రాభినయం కంటే ఎక్కువ పాత్రలు చేయాలన్నది దర్శకుడు విక్రమ్‌కుమార్ కథ డిమాండ్ మేరకే జరిగిందని పేర్కొన్నారు. ఇక ఆయన సోదరుడు కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కాష్మోరా విషయానికి వస్తే ఇందులో ఆయన సరసన నయనతార, శ్రీదివ్య నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కార్తీ త్రిపాత్రాభినయం చేస్తున్నారన్నది గమనార్హం. దీని గురించి ఆయన మాట్లాడుతూ ఇది ఒక ఆత్మ ఇతివృత్తంతో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం అన్నారు. చాలా ట్విస్ట్‌లు, మలుపులతో కూడిన ఈ చిత్రంలో ఒక చారిత్రక అంశం కూడా చోటు చేసుకుంటుందన్నారు. ఈ కారణాలే ఇందులో తనను ఒకటి కంటే ఎక్కువ పాత్రలు పోషించడానికి దోహదం చేశాయని కార్తీ పేర్కొన్నారు. -
సమంతకు భయపడుతున్న ఎన్టీఆర్..?
టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో వరుస సూపర్ హిట్లు సాధించిన ఎన్టీఆర్, నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన జూనియర్, ప్రస్తుతం ఆ సినిమాకు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా మార్కెట్ రేంజ్‌ను మరింత పెంచుకునేందు పరభాష నటులను ఎక్కువగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో పాటు, ఫహాద్ ఫాజిల్‌ను కూడా ఈ సినిమాలో కీలక పాత్రలకు ఎంపిక చేశాడు. ఇద్దరు హీరోయిన్లు నటించనున్న ఈ సినిమాలో ఒక హీరోయిన్గా నిత్యామీనన్‌ను ఎంపిక చేయటంతో మాలీవుడ్‌లో కూడా జనతా గ్యారేజ్‌కు మంచి క్రేజ్ ఏర్పాడుతోంది. ఇక రెండో హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ముందుగా లీడ్ హీరోయిన్గా సమంతను ఫైనల్ చేసిన చిత్రయూనిట్, ఇప్పుడు మరోసారి ఆలోచనలో పడింది. గతంలో ఎన్టీఆర్, సమంత కాంబినేషన్లో బృందావనం, రామయ్యా వస్తావయ్య, రభస సినిమాలు వచ్చాయి. అయితే వీటిలో బృందావనం ఒక్కటే మంచి టాక్ సొంతం చేసుకోగా మిగతా రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. అందుకే సమంతతో సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. -
హిజ్రాగా నటిస్తున్న టాప్‌స్టార్
సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రయోగం చేయడానికైనా రెడీగా ఉండే టాప్ స్టార్ విక్రమ్. సేతు, శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి సినిమాలతో ప్రయోగాత్మక చిత్రాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ మరోసారి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఐ సినిమా ఫెయిల్యూర్‌తో.., ఇక విక్రమ్ ప్రయోగాల జోలికి వెల్లడని భావించారు. అయితే అందరిని ఆశ్యర్యపరుస్తూ మరోసారి ప్రయోగానికి రెడీ అవుతున్నాడు చియాన్. ఇటీవల టెన్ ఎన్రదుకుల్లా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో మరోసారి తన మార్క్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నెక్ట్స్ మూవీలో హిజ్రాగా నటించడానికి అంగీకరించాడు. ఈ సినిమాలో విక్రమ్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఒక పాత్రలో హీరోగా కనిపిస్తుండగా విలన్ పాత్రలో హిజ్రాగా నటిస్తున్నాడు. ఎక్కువగా భాగం మలేషియాలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో నయనతార, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా అలరించనున్నారు. -
ఎంట్రీ సాంగ్‌లో నిత్యామీనన్
సాధారణంగా చిత్రాల్లో ఎంట్రీ పాటతో బిల్డప్ ఇవ్వడం అనేది కథా నాయకులకే జరుగుతుంది. నాయికలకు అలా ఎంట్రీ పాటతో పరిచయం చేయడం అరుదే. అలాంటి అరుదైన నటీమణుల్లో తాజాగా నటి నిత్యామీనన్ చేరారు. పాత్రల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారించే ఈ మలయాళ కుట్టి బహు భాషా నటి అన్నది తెలిసిందే. తమిళం, మలయాళం, తెలుగు భాషలతో పాటు కన్నడంలోనూ మంచి ప్రాచుర్యం పొందారు. అయితే కన్నడంలో నిత్యామీనన్ నటిగా తొలుత పరిచయం అయ్యారన్న విషయం చాలా మందికి తెలియదు. 2006లో సెవెన్ ఓ క్లాక్ అనే చిత్రం ద్వారా ఎంట్రీ అయ్యారు. తాజాగా తమిళం, కన్నడం భాషలలో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ముడింజ ఇవనై పుడి అనే చిత్రంలో నటిస్తున్నారు. సుదీప్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని పెద్ద బిల్డప్ ఇచ్చేలా ఇంట్రో సాంగ్‌ను పొందుపరుస్తున్నారట. ఇంతకుముందు ఖుషీ చిత్రంలో మేగం కరుక్కుదు మిన్నల్ చిదిక్కుదు అనే పాట నటి జ్యోతికకు ఎంత పేరు తెచ్చిపెట్టిందో ముడింజ ఇవనై పిడి చిత్రంలో నిత్యామీనన్‌కు ఆ ఇంట్రో సాంగ్ అంత పేరు తెచ్చిపెడుతుందంటున్నారు చిత్ర యూనిట్. ఆ పాట యువతను గిలిగింతలు పట్టిస్తుందట. శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ముడింజా ఇవనై పిడి చిత్రంపై అంచనాలు పెరగడం గమనార్హం. -
సూర్య '24' కథ ఇదే..?
దక్షిణాది సినీరంగంలో కమల్ హాసన్ స్థాయిలో ప్రయోగాలు చేసే విలక్షణ నటుడు సూర్య. సక్సెస్ లతో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే చేస్తూ వస్తున్నాడు సూర్య. అదే వరుసలో మరో ఎక్స్పరిమెంటల్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు. 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '24' సినిమాను సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు. కమర్షియల్ హీరోగా భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన సూర్య, ప్రయోగాత్మక చిత్రాలతో మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. అందుకే '24' విషయంలో అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ ఎంతో ఆశించి వస్తారు. అయితే సినిమాలో ఆడియన్స్ ఆశించిన అంశాలు లేకపోవటంతో నిరాశపడతారు. ఈ ప్రభావం సినిమా టాక్ మీద కూడా పడుతుందని భావించిన 24 యూనిట్ చిత్రకథను ముందే లీక్ చేశారు. '24' సినిమాలో టైంమిషీన్ తరహా వాచ్ తయారు చేసిన సూర్య, దాని సాయంతో తన గతంలోకి వెళ్లి తాను చేసిన తప్పులను సరిద్దిదుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథ. ఈ సినిమాలో సైంటిస్ట్‌గా, అతని కొడుకుగా, ఆత్రేయ అనే విలన్‌గా మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
సందీప్ సరసన నిత్యా..?
ఆసక్తికరమైన కథలను ఎంచుకుంటూ యంగ్ జనరేషన్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ యంగ్ హీరో 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైన ఈ సినిమాకు ఇంత వరకు హీరోయిన్ను మాత్రం ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం సందీప్ కిషన్‌తో పాటు విలన్‌గా నటిస్తున్న రవికిషన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి స్టార్ హీరోయిన్ నిత్యామీనన్‌ను సంప్రదించారన్న టాక్ వినిపిస్తోంది. బడా బడా స్టార్ హీరోల సరసన వరుస సూపర్ హిట్స్‌లో నటిస్తున్న ఈ భామ, సందీప్ సరసన హీరోయిన్గా నటించడానికి అంగీరిస్తుందా లేదా చూడాలి. అయితే నిత్యామీనన్‌కు ఈ సినిమా కథ చాలా బాగా నచ్చిందని, సినిమాలో నటించటం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం చేయలేదు. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ రచయిత రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అంజి రెడ్డి నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. -
మగాళ్లు చెడ్డవాళ్లేం కాదు!
ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తుంది నిత్యామీనన్. దాపరికాలు లేకుండా ఏ రహస్యాన్నయినా విప్పి చెబుతుంది. నదురూ బెదురూ లేకుండా ఏ అభిప్రాయాన్నయినా కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంది. తన దగ్గర వేషాలేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తానంటూనే, మగవాళ్లందరూ చెడ్డవాళ్లేమీ కాదంటూ నమ్మకాన్ని వ్యక్తపరుస్తోన్న నిత్య మనోభావాలు... మొదటిసారి మేకప్ వేసింది..? ఎనిమిదేళ్ల వయసులో. మా ఇంటి పక్కన ఓ ఫొటోగ్రాఫర్ ఉండేవారు. ఆయన నా ఫొటో ఒకటి తీసుకుని తన యాడ్ ఏజెన్సీలో పెట్టారు. అది ఓ డెరైక్టర్ చూసి ఫోన్ చేశారు. తను తీయబోతోన్న ఇంగ్లిష్ సినిమాలో టబుకి చెల్లెలిగా నన్ను తీసుకుంటానన్నారు. మొదట ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు కానీ నేను సరదా పడటంతో ఓకే అన్నారు. అలా ‘హనుమాన్’ సినిమాతో యాక్టర్‌ని అయిపోయా! నటిగా సెటిలవ్వాలని అప్పుడే ఫిక్సైపోయారా? లేదు. మా కుటుంబాల్లో అందరూ బాగా చదువుకున్నవాళ్లే. అందుకే నా దృష్టీ చదువుపైనే ఉండేది. మాస్ కమ్యునికేషన్స్ చదివి కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేశా. కానీ ఆ ఫీల్డ్ నాకు సరిపడదనిపించి మానేశా. మరి ఈ ఫీల్డ్ మీకు సరిపడిందా? ఊహూ... నాకిది కరెక్ట్ ప్లేస్ కాదని ఎన్నోసార్లు అనిపించింది. ఈ ఫీల్డ్‌లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. ఓ మంచి పాత్ర చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ సెలెబ్రిటీ స్టేటస్ విసు గనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు దొంగచాటుగా ఫొటోలు తీయడం, మా గురించి ఏవేవో ఊహించి ప్రచారం చేయడం నాకు నచ్చదు. అలాగే మేము తమతో క్లోజ్‌గా ఉండాలని కొందరు ఆశిస్తారు. అలా చేయకపోతే మంచి అమ్మాయి కాదంటూ ముద్ర వేసేస్తారు. అయినా నేను నాకు నచ్చినట్టే ఉంటాను. మీరు యారొగెంట్ అనేది అందుకేనా? ఏమో. నిజానికి నేను పొగరుగా ఉండను. స్ట్రిక్ట్‌గా ఉంటాను. అమ్మ, నాన్న ఉద్యోగస్తులు. నాతో రాలేరు. నా మేనేజర్ కూడా నాతో ఉండడు. అలాంటప్పుడు నా గురించి నేనే జాగ్రత్త తీసుకోవాలి కదా! అందుకే ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే ఊరుకోను. లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. అది యారొగెన్సీ కాదు. మంచి విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా నిర్భయంగా చెప్పేయాలి. లేదంటే మనల్ని మనమే తక్కువ చేసుకున్నవాళ్లం అవుతాం. ఎక్కువగా లేడీ డెరైక్టర్స్‌తో పని చేస్తారు... సేఫ్టీ కోసమా? అంజలీ మీనన్, నందిని, అంజు, శ్రీప్రియ లాంటి మహిళా దర్శకురాళ్లతో పని చేసే చాన్స్ అనుకోకుండానే వచ్చింది తప్ప నేను కావాలని వాళ్లని ఎంచుకోలేదు. అయినా నేనింత వరకూ పనిచేసిన వాళ్లలో ఏ మేల్ డెరైక్టర్, యాక్టర్ నన్ను ఇబ్బంది పెట్టలేదు. మగాళ్లంతా చెడ్డవాళ్లు కాదుగా! గ్లామర్ పాత్రలు చేయరేం? నాకు సౌకర్యవంతంగా అనిపించనిదేదీ నేను చేయను. అందుకే కథ వినేటప్పుడే సీన్ల గురించి, కాస్ట్యూమ్స్ గురించి క్లియర్‌గా మాట్లాడేసుకుంటాను. అలా అయితే అవకాశాలు తగ్గవా? నాకు తగ్గలేదుగా! ఓ పాత్రకి నేనైతేనే సరిపోతాను అనుకున్నప్పుడు దర్శకులు నా దగ్గరకే వస్తున్నారు. వేరే వాళ్లకి ఇవ్వట్లేదుగా! లావుగా ఉంటారని... పొట్టి అని? (నవ్వుతూ) నేను ఫిజిక్‌ని మెయిం టెయిన్ చేయను. అందుకే కాస్త లావుగా ఉంటాను. నటన కోసం తిండిని త్యాగం చేయడం పిచ్చితనం అనిపిస్తుంది నాకు. ఇక హైట్ సంగతి. పొడవు, పొట్టి, అందం... ఇవన్నీ ఇచ్చేది దేవుడు. ప్రవర్తన సరిగ్గా లేకపోతే విమర్శించాలి గానీ, దేవుడు ఇచ్చినవాటిని విమర్శించకూడదు. పెళ్లెప్పుడు? ఇతనితో నా జీవితం ఇప్పటికంటే బాగుంటుంది అనుకోదగ్గ వ్యక్తి ఎదురు పడినప్పుడు. తగనివాణ్ని చేసుకుని బాధపడే బదులు, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడమే మంచిది. ఇంతవరకూ అలాంటి వ్యక్తి ఎదురు పడలేదా? లేదు. పద్దెనిమిదేళ్ల వయసులో ఓసారి ప్రేమలో పడ్డాను. కానీ అతనితో జీవితం అంత గొప్పగా ఉండదనిపించి విడి పోయాను. తర్వాత ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు. చూద్దాం... మళ్లీ నా మనసులో ప్రేమ ఎప్పుడు పుడుతుందో! ఫన్డే మీద మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి. ప్రియదర్శిని రామ్, ఎడిటర్, ఫన్డే, సాక్షి దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
మగాళ్లు చెడ్డవాళ్లేం కాదు!
ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తుంది నిత్యామీనన్. దాపరికాలు లేకుండా ఏ రహస్యాన్నయినా విప్పి చెబుతుంది. నదురూ బెదురూ లేకుండా ఏ అభిప్రాయాన్నయినా కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంది. తన దగ్గర వేషాలేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తానంటూనే, మగవాళ్లందరూ చెడ్డవాళ్లేమీ కాదంటూ నమ్మకాన్ని వ్యక్తపరుస్తోన్న నిత్య మనోభావాలు... మొదటిసారి మేకప్ వేసింది..? ఎనిమిదేళ్ల వయసులో. మా ఇంటి పక్కన ఓ ఫొటోగ్రాఫర్ ఉండేవారు. ఆయన నా ఫొటో ఒకటి తీసుకుని తన యాడ్ ఏజెన్సీలో పెట్టారు. అది ఓ డెరైక్టర్ చూసి ఫోన్ చేశారు. తను తీయబోతోన్న ఇంగ్లిష్ సినిమాలో టబుకి చెల్లెలిగా నన్ను తీసుకుంటానన్నారు. మొదట ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు కానీ నేను సరదా పడటంతో ఓకే అన్నారు. అలా ‘హనుమాన్’ సినిమాతో యాక్టర్‌ని అయిపోయా! నటిగా సెటిలవ్వాలని అప్పుడే ఫిక్సైపోయారా? లేదు. మా కుటుంబాల్లో అందరూ బాగా చదువుకున్నవాళ్లే. అందుకే నా దృష్టీ చదువుపైనే ఉండేది. మాస్ కమ్యునికేషన్స్ చదివి కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేశా. కానీ ఆ ఫీల్డ్ నాకు సరిపడదనిపించి మానేశా. మరి ఈ ఫీల్డ్ మీకు సరిపడిందా? ఊహూ... నాకిది కరెక్ట్ ప్లేస్ కాదని ఎన్నోసార్లు అనిపించింది. ఈ ఫీల్డ్‌లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. ఓ మంచి పాత్ర చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ సెలెబ్రిటీ స్టేటస్ విసు గనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు దొంగచాటుగా ఫొటోలు తీయడం, మా గురించి ఏవేవో ఊహించి ప్రచారం చేయడం నాకు నచ్చదు. అలాగే మేము తమతో క్లోజ్‌గా ఉండాలని కొందరు ఆశిస్తారు. అలా చేయకపోతే మంచి అమ్మాయి కాదంటూ ముద్ర వేసేస్తారు. అయినా నేను నాకు నచ్చినట్టే ఉంటాను. మీరు యారొగెంట్ అనేది అందుకేనా? ఏమో. నిజానికి నేను పొగరుగా ఉండను. స్ట్రిక్ట్‌గా ఉంటాను. అమ్మ, నాన్న ఉద్యోగస్తులు. నాతో రాలేరు. నా మేనేజర్ కూడా నాతో ఉండడు. అలాంటప్పుడు నా గురించి నేనే జాగ్రత్త తీసుకోవాలి కదా! అందుకే ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే ఊరుకోను. లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. అది యారొగెన్సీ కాదు. మంచి విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా నిర్భయంగా చెప్పేయాలి. లేదంటే మనల్ని మనమే తక్కువ చేసుకున్నవాళ్లం అవుతాం. ఎక్కువగా లేడీ డెరైక్టర్స్‌తో పని చేస్తారు... సేఫ్టీ కోసమా? అంజలీ మీనన్, నందిని, అంజు, శ్రీప్రియ లాంటి మహిళా దర్శకురాళ్లతో పని చేసే చాన్స్ అనుకోకుండానే వచ్చింది తప్ప నేను కావాలని వాళ్లని ఎంచుకోలేదు. అయినా నేనింత వరకూ పనిచేసిన వాళ్లలో ఏ మేల్ డెరైక్టర్, యాక్టర్ నన్ను ఇబ్బంది పెట్టలేదు. మగాళ్లంతా చెడ్డవాళ్లు కాదుగా! గ్లామర్ పాత్రలు చేయరేం? నాకు సౌకర్యవంతంగా అనిపించనిదేదీ నేను చేయను. అందుకే కథ వినేటప్పుడే సీన్ల గురించి, కాస్ట్యూమ్స్ గురించి క్లియర్‌గా మాట్లాడేసుకుంటాను. అలా అయితే అవకాశాలు తగ్గవా? నాకు తగ్గలేదుగా! ఓ పాత్రకి నేనైతేనే సరిపోతాను అనుకున్నప్పుడు దర్శకులు నా దగ్గరకే వస్తున్నారు. వేరే వాళ్లకి ఇవ్వట్లేదుగా! లావుగా ఉంటారని... పొట్టి అని? (నవ్వుతూ) నేను ఫిజిక్‌ని మెయిం టెయిన్ చేయను. అందుకే కాస్త లావుగా ఉంటాను. నటన కోసం తిండిని త్యాగం చేయడం పిచ్చితనం అనిపిస్తుంది నాకు. ఇక హైట్ సంగతి. పొడవు, పొట్టి, అందం... ఇవన్నీ ఇచ్చేది దేవుడు. ప్రవర్తన సరిగ్గా లేకపోతే విమర్శించాలి గానీ, దేవుడు ఇచ్చినవాటిని విమర్శించకూడదు. పెళ్లెప్పుడు? ఇతనితో నా జీవితం ఇప్పటికంటే బాగుంటుంది అనుకోదగ్గ వ్యక్తి ఎదురు పడినప్పుడు. తగనివాణ్ని చేసుకుని బాధపడే బదులు, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడమే మంచిది. ఇంతవరకూ అలాంటి వ్యక్తి ఎదురు పడలేదా? లేదు. పద్దెనిమిదేళ్ల వయసులో ఓసారి ప్రేమలో పడ్డాను. కానీ అతనితో జీవితం అంత గొప్పగా ఉండదనిపించి విడి పోయాను. తర్వాత ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు. చూద్దాం... మళ్లీ నా మనసులో ప్రేమ ఎప్పుడు పుడుతుందో! ఫన్డే మీద మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి. ప్రియదర్శిని రామ్, ఎడిటర్, ఫన్డే, సాక్షి దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
ఆలస్యం అవుతున్న మణి సినిమా
వరుస ఫ్లాప్‌ల తరువాత 'ఓకే బంగారం' సినిమాతో మంచి విజయం సాధించిన మణిరత్నం, తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న మణిరత్నం తన నెక్ట్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని భావిస్తున్నాడు. కార్తీ, దుల్కర్ సల్మాన్‌లు హీరోలుగా ఓ సినిమా చేస్తున్నట్టుగా మణిరత్నం ఇప్పటికే ప్రకటించాడు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తన గత సినిమాల మాదిరిగానే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలని భావించాడు. అయితే బిజినెస్ పరంగా తెలుగు హీరోలు నటిస్తే ఇంకా మంచి కలెక్షన్లు సాధిస్తుందని భావించిన యూనిట్. ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. తెలుగు వర్షన్లో నటించే హీరోలు ఇంకా ఫైనల్ కాకపోవటంతో సినిమాను వాయిదా వేశారు. త్వరలోనే తెలుగు నటీనటులనును ఎంపిక చేసి సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెండు వర్షన్లలోనూ నిత్యా మీనన్, కీర్తీ సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. -
మళ్లీ జతగా...!
ఏ హీరో, హీరోయిన్ మధ్య అయినా మంచి కెమిస్ట్రీ కుదిరితే అది సినిమాకి ప్లస్ అవుతుంది. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ అలాంటి జంటే. మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’లో, ఆ మధ్య విడుదలైన ‘ఓకే బంగారం’ చిత్రాల్లో వీళ్ల కెమిస్ట్రీ అదనపు ఆకర్షణ అయ్యింది. ఇప్పుడు ‘ఉస్తాద్ హోటల్’ ద్వారా మరోసారి తెలుగు తెరపై జతగా రానున్నారు. ఈ చిత్రాన్ని ‘జతగా...’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగులోకి అనువదించారు. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించడంతో పాటు మూడు జాతీయ అవార్డులు గెల్చుకుందని సురేశ్ కొండేటితెలిపారు. మరిన్ని విశేషాలను ఆయన చెబుతూ - ‘‘ఏ భాషకైనా నప్పే కథ. అందుకే తెలుగులో విడుదల చేస్తున్నాను. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. సాహితి రాసిన సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే, గోపీసుందర్ స్వరపరచిన పాటలు మరో హైలైట్. త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
నిత్యా మీనన్‌కు గోల్డెన్ ఆఫర్లు
-
సూర్యతో నిత్యామీనన్ రొమాన్స్
నటి నిత్యామీనన్ హీరోయిన్గా నటించడానికి అంగీకరించిందంటే ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉన్నట్లే. ఎందుకంటే ఈ కేరళ ఏ పాత్రకు ఒక పట్టాన ఒప్పుకోరనే పేరుంది. అంతేకాదు ఈ మధ్య హీరోయిజం ఉన్న పాత్రలనే అంగీకరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది నటుడు సూర్య చిత్రంలో రెండవ హీరోయిన్గా నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం. సూర్య ప్రస్తుతం 24 అనే చిత్రాన్ని తన సొంత సంస్థ 2డీ బ్యానర్లో నిర్మిస్తూ నటిస్తున్నారు. మలయాళం దర్శకుడు విక్రమ్‌కుమార్ ద ర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే నటి సమంత ఒక హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఇందులో సూర్య త్రిపాత్రాభిన యం చేస్తున్నారని తెలిసింది. ఆయన మ రో పాత్రతో నటి నిత్యామీనన్ రొమాన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమెతో చర్చలు జరుగుతున్నట్లు అయితే నిత్యామీనన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే పాత్రకు ప్రాధాన్యత ఉండటం, దర్శకుడు విక్రమ్‌కుమార్ కావడంతో నిత్యామీనన్ న టించడానికి పచ్చజెండా ఊపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా కాంచన-2 లో పాత్ర పరిధి తక్కువే అయినా అది నచ్చడంతో నటించిన విషయం గమనార్హం. షూటింగ్ జరుపుకుంటున్న 24 చిత్రానికి ఎ ఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు కడుతున్నారు. కాలం ఇతివృత్తంగా సాగే సోషియా ఫాంటసీ కథా చిత్రాన్ని దీపావళికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
నేను రెడీ మీరు రేడీనా?
తమిళసినిమా: ప్రజలకు కాలక్షేపం అయినా, సినిమా వ్యాపార మాద్యమమేనన్నది ఎవరూ కాదనలేరు. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ధోరణి బాగా పెరిగి పోతోందన్నది చర్చనీయాంశంగా మారింది. అలాంటి చాలా మంది తారల్లో నటి నిత్యామీనన్ పేరు చోటు చేసుకుందన్నది. కోలీవుడ్ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న మాట నటన,గానం ఈ రెండింటిలోనూ చక్కని ప్రావీణ్యం కలిగిన నిత్యామీనన్ నటనకే ప్రాముఖ్యత నిచ్చి మలయాళం, కన్నడం, తమిళ్, తెలుగు భాషల్లోనూ కథానాయికిగా పేరు తెచ్చుకున్నారు. దానితో పాటు పొగరుబోతు అనే అదనపు క్వాలిఫికేషన్ కూడా పెంచుకుంటూ వస్తున్నారు. ఆమె నటనను మెచ్చుకుంటున్నవారు, పొగరు కాస్త ఎక్కువనే తన ప్రవర్తనను కూడా బహిరంగంగానే ఎత్తి చూపిస్తూనే ఉన్నారు. అయినా నేనింతే. ఎవరి కోసమో మారాల్సిన అవసరం నాకు లేదు. అన్నట్లు నిత్యామీనన్ నడుచుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మణిరత్నం ఓ కాదల్ కణ్మణి,లారెన్స్ కాంచన-2 చిత్రాలతో కోలీవుడ్‌లో సక్సెస్ ఖాతా ప్రారంభించలేదన్న కొరత తీరిపోయింది. ముఖ్యంగా ఓ కాదల్ క న్మణి చిత్రంలో ప్రేమ సన్ని వేశాల్లో రెచ్చిపోయి నటించి కుర్రకారు గుండెల్ని బాగా టచ్ చేశారనే చెప్పాలి. విషయం ఏమిటంటే అయినా ఈ నయనానంద నటికి కోలీవుడ్ కొత్తగా అవకాశాలేవి రాలేదు. అలా అనడం కంటే ఆమె అంగీకరించలేదు అనడం సబబేమో. కారణం కథలు చెప్పడానికి వచ్చే దర్శక నిర్మాతతో హీరోకు సమానంగా నా పాత్ర ఉండాలి. అలాగే కథ చెప్పడానికి ముందే ఇంతకు ముందు కంటే నా పారితోషికం డబుల్. అందుకు మీరు రెడీ అంటే కథ వినడానికి నేను రెడీ అంటూ హడల్ కొడుతున్నారట. దీంతో దర్శకనిర్మాతలు నిత్యామీనన్ అంటేనే బెదిరిపోతున్నారని కోలీవుడ్ వర్గాల బోగట్టా. -
ఆ హోటల్లో....
ఓ డబ్బున్న యువ కునికి చెఫ్ కావాలని ఆశ. విదేశాల్లో ఉండే అతగాడు ఇండియా వస్తాడు. తన సొంత ఊరు వెళతాడు. అక్కడ తన తాతగారు నడుపుతున్న హోటల్‌కి వెళతాడు. ఆ హోటల్ కథ ఏంటి? చెఫ్ కావాలనుకునే ఆ యువకుడు ఆ హోటల్ యజమానిగా బాధ్యతలు చేపడతాడా? విదేశాలు తిరిగి వెళ్లిపోతాడా? అనుకోకుండా పరిచయమైన అమ్మాయి కారణంగా అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని సురేశ్ కొండేటి తెలుగులో విడుదల చేయనున్నారు. మణిరత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిత్యామీనన్ కథానాయిక. ‘‘దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్లది హిట్ పెయిర్. ఇప్పటికే వీరిద్దరూ కలిసి మూడు చిత్రాల్లో నటించారు. వాటిలో ‘ఓకే బంగారం’ ఒకటి. ‘ఉస్తాద్ హోటల్’లో వీరి కెమిస్ట్రీ ఓ హైలైట్. ప్రేమ, సెంటిమెంట్, కుటుంబ బాంధవ్యాలను స్పృశిస్తూ సాగే చిత్రం ఇది. వచ్చే నెల విడుదల చేయనున్నాం’’ అని సురేశ్ కొండేటి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్.లోకనాథన్. -
పద్ధెనిమిదేళ్లకే ప్రేమలో పడ్డా!
కొంతమంది అమ్మాయిల నయనాలు... చూసేకొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మరిపించేలా చేస్తాయి. సరిగ్గా నిత్యామీనన్ కళ్లు చూస్తే అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఆమె ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లోనే నటించారు. ప్రేమసన్నివేశాల్లో ఆమె హావభావాలు వీక్షకుల మనసులకు గిలిగింతలు పెడతాయి. ఇదే విషయాన్ని ఈ భామను చాలా మంది అడిగారట. ‘‘నాకు ఎలా చెప్పాల్లో అర్థం కావట్లేదు. నేను పద్ధెనిమిదేళ్ల్ల వయసులో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డాను. అందుకేనేమో ప్రేమ కథాచిత్రాల్లో ఇంతలా ఒదిగిపోగలుగుతున్నాను. ఆ ప్రేమ గురించి ఎక్కువ వివరాలు మాత్రం అడగొద్దు. ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు జరిగిన విషయం అది. ఇప్పుడు మాత్రం నేను సింగిల్‌గా..., చాలా సంతోషంగా ఉన్నా. ఏయే సందర్భాల్లో ఎలా ఉండాలో నా జీవితమే నాకు నేర్పింది. జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్నీ ప్రేరణగా తీసుకుని నటిస్తాను’’ అని నిత్యామీనన్ తన మనసులో భావాలను ఆవిష్కరించారు. -
విక్రమ్‌లా నటించాలని ఉంది
నా కళ్లు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని అనే సినీ గీతం నాటి తరం యువతను ఉర్రూతలూగించింది.అలాంటిది నా కళ్లు ఊసులాడతాయంటోంది నటి నిత్యామీనన్. గుండ్రటి కళ్లను చక్రాలా తిప్పుతూ అందమైన నగుమోముతో నిత్య ఒక్క నవ్వు నవ్వితే చాలు కుర్రకారు గుండెలు లబ్‌డబ్ అనడం మానేసి లవ్డబ్ అని చప్పుడు చెయ్యడం ఆరంభిస్తాయి. మొదట్లో మల యాళం ప్రేక్షకుల్నే అలరించడానికి పరిమితమైన ఈ కేరళ కుట్టి ఆ తరువాత క్రమంగా తమిళం,తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం మొదలెట్టిం ది. టోటల్‌గా నిత్య ఇప్పుడు దక్షిణాది క్రేజీ కథానాయికి అయిపోయింది. ముఖ్యంగా ఓ కాదల్ కణ్మణి, కాంచన 2 చిత్రాల విజయాలతో తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.ఈ సొగసు కళ్ల చిన్నదానితో చిన్న కబుర్లు. మీరు చాలా ముక్కోపి అటగా? అవునా?నాకే తెలియని విషయాల్ని తెలియ జేస్తున్నారు. తిండి, బస విషయంలో సర్దుకుపోయే అమ్మాయిని నేను.అయితే చాలా సెన్సిటివ్ని కూడా. ఎవరైనా అదేపనిగా నన్నే చూస్తుంటే నాకో మాదిరిగా ఉంటుంది. మీకు అత్యంత స్నేహితురాలెవరు? నటి రోహిణి. చెన్నై వస్తే వాళ్ల ఇంటిలోనే బస, భోజనం . అంత స్నేహం ఉంది ఆమెతో. నచ్చిన హీరో? విక్రమ్ సార్ అంటే చాలా ఇష్టం. నటన కోసం అం తలా అంకితమయ్యే నటుడ్ని ఎవర్నీ చూడలేదు. పాత్రగా మారడంలో ఆయన కిల్లాడి. ఆయన మాదిరి నటించాలని ఆకాంక్ష. మీరు దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం గురించి? ఇదే విషయాన్ని అందరూ అంటున్నారు. నేను మాత్రం ఎప్పుడూ,ఎక్కడా చెప్పలేదు.అయితే చాలా కథలు రాస్తుం టాను. కానీ దర్శకత్వం విషయం గురించి ఆలోచన లేదు.ఇం తకు ముందు చాయాగ్రహణం పై మోజు పడ్డాను. ఇప్పుడు అదీ లేదు. చేతినిండా చిత్రాలు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. నటిస్తున్నప్పుడు భాషా పరమైన సమస్యనెదుర్కొన్న సందర్భం ఉందా? నిజం చెప్పాలంటే మాతృభాషతోనే నాకు గొడవ. సరళంగా మాట్లాడడానికి తడబడతాను. చాలా సంవత్సరాలు బెంగళూర్‌లో నివసించడం వల్ల తమిళం, కన్నడ భాషలను ఫ్లూయంట్‌గా మాట్లాడగలను. మలయాళం,తెలుగే తడబడతాను.అయితే ఇప్పుడు నాలుగు భాషలు బాగా నేర్చుకున్నాను కాబట్టి భాషా పరమైన సమస్యల్ని అధిగమించాను. మీకు ప్లస్ మీ కళ్లే కదా? నా కళ్ల గురించి నేనే ఎలా చెప్పుకోను. నటిస్తున్నప్పుడే కాదు సాధారణంగా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడూ నా కళ్లు ఊసులాడతాయి. అది నాలో సహజ గుణమే. ఇంకో విషయం ఏమిటంటే నేను చాలా సింపుల్‌గా ఉంటాను. ఇంకా చెప్పాలంటే నేను నేనులానే ఉంటాను. తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయడం లేదే? చాలా సెలెక్టెడ్ చిత్రాలనే చేస్తున్నాను.చిత్ర కథ నన్ను టచ్ చేయాలి. అలాంటి చిత్రాలనే అంగీకరిస్తున్నాను.ఎన్ని చిత్రాలు చేశావన్నది ముఖ్యం కా దు.మంచి చిత్రాలెన్ని చేశామన్నదే నాకు ముఖ్యం. -
ఇళయరాజా చేతుల మీదుగా రుద్రమదేవి ట్రైలర్
అత్యంత భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో రుద్రమదేవి ఒకటి. చారిత్రక కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో కాకతీయ సామ్రాజ్యపు పట్టపురాణి రాణి రుద్రమదేవిగా వీరోచిత పాత్రలో నటి అనుష్క నటించారు. ఇతర ప్రముఖ పాత్రల్లో అల్లుఅర్జున్, రాణా, నిత్యామీనన్, క్యాథరిన్ ట్రెసా, సుమన్, విజయకుమార్ నటించిన ఈ చిత్రానికి సృష్టికర్త గుణశేఖర్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళనాడు హక్కులను శ్రీ తేనాండాల్ ఫిలింస్ సంస్థ పొందింది. సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి గీత రచయిత పా.విజయ్ సంభాషణ రాయడం విశేషం. అజయ్ విన్సెంట్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం స్టీరియో ఫోనిక్తో పాటు 3డీ ఫార్మెట్లో రూపొందిన తొలి భారతీయ చిత్రం కావడం మరో విశేషం. త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నైలో నిరాడంబరంగా నిర్వహించారు. చిత్ర ట్రైలర్‌ను సంగీత దర్శకుడు ఇళయరాజా ఆవిష్కరించారు. -
సహజీవనం చేస్తే తప్పేంటి !
వివాహానికి ముందే నచ్చిన వాడితో సహజీవనం చేయడం తప్పుకాదు అంటోంది నటి నిత్యామీనన్. ఓ కాదల్ కణ్మని, కాంచన-2, చిత్రాలతో కోలివుడ్లో విజయాన్ని అందుకున్న సంతోషంలో ఉన్న ఈ కేరళ కుట్టి ఓ కాదల్ కణ్మని చిత్రంలో ప్రేమించిన వాడితో పెళ్లికాకుండానే సహజీవనం చేసే ప్రేయసిగా నటించారనడం కంటే, జీవించారని చెప్పాలి. అయితే, అలా నటించిన ఆమెను నిజ జీవితంలో పెళ్లికాకుండా సహజీవనం తప్పు కాదా..? అన్న ప్రశ్నకు ఆమె అందులో తప్పేముంది అని సమాధానం ఇచ్చారు. దీని గురించి నిత్యామీనన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, మణిరత్నం దర్శకత్వంలో నటించడం గొప్పగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ముందుగా ఆయన ఓ కాదల్ కణ్మని చిత్రం కథ చెప్పినప్పుడు, ప్రేమ పెళ్లి విషయాల గురించి తాను ఎలా భావిస్తానో అలాగే చెప్పినట్టుందన్నారు. వివాహానికి ముందుకు సహజీవనం చేయడం అనేది, ఈ రోజుల్లో పెద్ద విషయమేమీ కాదని చెప్పింది. ఇలాంటి విషయాల్లో యువత స్వేచ్ఛ కోరుకుంటున్నదని, అందుకు తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారన్నారు. పెళ్లికి ముందే నచ్చిన వాడితో సహజీవనం చేయడం తప్పు అని తనకు అనిపించడం లేదని పేర్కొంది. వెనుకముందు తెలియని ఎవరో ఒకర్ని వివాహం చేసుకునేది తనకు సమ్మతం కాదంది. సర్దుకుపోయి జీవించడం కంటే, ముందే, సరైన నిర్ణయం తీసుకోవడం మంచిదని తన భావనను వ్యక్తం చేసింది. ఈ బ్యూటీ తన పేరు చివర ఉన్న మీనన్ పేరును తొలగించినట్టు పేర్కొంది. -
విశాల్‌తో నటించే భామ ఏవరో?
నటుడు విశాల్ ఇటీవల నటుడిగా, నిర్మాతగా వేగం పెంచారు. అలాగే వరుసగా విజయాలు సాధిస్తున్నారు. పాండియనాడు, నాన్ శివప్పు మనిదన్, పూజై, ఆంబళ ఈ చిత్రాలన్నీ విశాల్‌కు విజయాలను అందించిన వే. ప్రస్తుతం సుశీంద్రన్ దర్శకత్వంలో పాయుం పులిగా రాబోతున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. తదుపరి రెండు చిత్రాలకు విశాల్ కమిట్ అయ్యారు. వాటిలో ఆయన్ని యాక్షన్ హీరోగా నిలబెట్టగా సండకోళి చిత్రానికి సీక్వెల్, రెండవది పాండిరాజ్ దర్శకత్వంలో నటించే చిత్రం ఈ రెండు చిత్రాల షూటింగ్ ఏకకాలంలో జరగనున్నాయనే ప్రచారం జరిగింది. అయితే సండైకోళి-2 చిత్రం నిర్మాణం వాయిదా పడిందని పాండిరాజ్ దర్శకత్వం వహించే చిత్ర షూటింగ్ త్వరలో మొదలవుతుందని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ వర్గాలు సమాచారం. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు విశాల్‌తో నటించని హీరోయిన్ల కోసం అన్వేషణ జరుగుతోందట. ఆ పట్టికలో నటి సమంత, నిత్యామీనన్ ముందున్నారని తెలిసింది. వీరిలో ఎవరు ఓకే అవుతారన్నది త్వరలోనే వెల్లడి కానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి హిప్హాప్ తమిళం సంగీతాన్ని అందించనున్నారు. ఈయన ఇంతకుముందు విశాల్ నటించిన ఆంబళ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. -
ఆ చిత్రాలు చేసుంటే రికార్డ్ సాధించేదాన్ని
గ్లామరస్ పాత్రల అవకాశాలన్నీ అంగీకరించి చేస్తే నా బ్యాంక్ బాలెన్స్ ఎప్పుడో ఫుల్ అయ్యేది. పలు చిత్రాలు చేసిన నటిగా రికార్డ్ సాధించేదాన్ని అంటున్నారు నటి నిత్యామీనన్. కోలీవుడ్‌లో మొట్టమొదటిసారిగా ఒకేసారి ఓ కాదల్ కణ్మణి, కాంచన-2 చిత్రాలతో విజయాన్ని అందుకున్న నటి నిత్యామీనన్. అయితే ఈమె పలు షరతులు విధిస్తుందని, ఇంకా చెప్పాలంటే చాలా పొగరుబోతు అని ప్రచారంలో ఉంది. ఈ విషయంపై నిత్యామీనన్ స్పందిస్తూ సినిమాను ఒక కళగా భావిస్తానన్నారు . అంతేకాని డబ్బు సంపాదించే వృత్తిగా చూడనన్నారు. తాను నటించే పాత్ర తనలో ప్రవేశించాలని, అలా కాకుండా షూటింగ్ స్పాట్‌కు వచ్చామా? దర్శకుడు చెప్పిన సంభాషణలు బట్టీపట్టి ఆయన సూచనలు మేరకు నటించామా? వెళ్లామా? అన్నట్టు ఉండలేనన్నారు. తన కిచ్చిన పాత్రలో జీవించడానికి ప్రయత్నిస్తానన్నారు. కాంచన-2 చిత్రంలో వికలాంగురాలి పాత్రలో నటించమని లారెన్స్ కోరినప్పుడు తాను వెంటనే ఓకే చెప్పలేదన్నారు. ఆ పాత్రలో తాను నటించగలనా అని ప్రాక్టీస్ చేసి సంతృప్తి కలిగిన తరువాత నటిస్తానని చెప్పానన్నారు. తన కోసం లారెన్స్ రెండు నెలలు వేచి ఉన్నారని తెలిపారు. తన పాత్ర గురించి ముందుగా చాలా ప్రశ్నలు వేస్తానన్నారు. అంగీకరించిన తరువాత ఇక ప్రశ్నలే తావుండదని అన్నారు. మరో విషయం ఏమిటంటే తనను గ్లామర్ పాత్రల్లో నటించమని పలువురు అడిగారన్నారు. అవన్నీ ఒప్పుకుంటే తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడో ఫుల్ అయిపోయి ఉండేదని అలాగే పలు చిత్రాలు చేసిన నటిగా గుర్తింపు పొందేదాన్నని నిత్యామీనన్ అన్నారు. -
ఇద్దరం ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యాం!
‘‘అనుష్కతో కలిసి డాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఆమెకూ నాకూ చాలా హైట్ డిఫరెన్స్ ఉంది. దాంతో ఆ టైమ్‌లో చాలా ఇబ్బంది పడ్డాను కూడా. నా కష్టం చూసి ఆమె కూడా నాకు సహకరించింది. ‘రుద్రమదేవి’ సినిమాలో నాకూ, అనుష్కకూ ఓ పాట ఉంది. ఆ పాటను మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. అనుష్కకు సమానంగా ఉండటానికి నాతో బలవంతంగా హై హీల్స్ వేయించారు. దాంతో నా పాదాలకు గాయాలయ్యాయి. నా పాట్లు చూసి అనుష్క డాన్స్ చేసేటప్పుడు తన మోకాళ్లను వంచి నృత్యం చేసింది. నిజంగా ఆమె చాలా స్వీట్ పర్సన్. నేను చూసిన వాళ్లలో చాలా మంచి వ్యక్తి. ఈ సినిమా నుంచి ఆమెతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఇద్దరం చాలా ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యాం. నాకు యోగా అంటే చాలా ఇష్టం. యోగా టీచర్ అవ్వాలని అనుకునేదాన్ని. అనుష్క ఎలాగూ యోగా శిక్షకురాలిగా పనిచేశారు. దాంతో మేమిద్దరం కలిస్తే ఆధ్యాత్మిక విషయాలు, యోగా గురించి కూడా బాగా మాట్లాడుకుంటాం.’’ - నిత్యామీనన్ -
రియాలిటీ షో
‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘ఓకే బంగారం’, ‘గంగ’ చిత్రాల్లో నటించి మురిపించిన నిత్యామీనన్ కథానాయికగా మరో చిత్రం రానుంది. నిత్యామీనన్, ఉన్ని ముకుందం, శ్వేతా మీనన్, సిద్దిక్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రాన్ని ‘ఈ వేళలో’ పేరుతో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. టి.కె రాజీవ్ కుమార్ దర్శకుడు. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘టీవీ రియాలిటీ షో, రేటింగ్స్ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ప్రేమకథ ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శరత్, మాటలు- పాటలు: అంజలి గెర్రి, కెమెరా: వినోద్ ఇల్లంపల్లి. -
జెట్ స్పీడ్‌లో నిత్యామీనన్
ఏ నిముషానికి ఏమి జరుగునో.. అనే మాటలు చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి ఖచ్చితంగా సరిపోతాయి. ఎవరు ఎప్పుడు ఫాంలోకి వస్తారో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే సినిమాని రంగుల ప్రపంచం అంటారు. నిన్న మొన్నటి వరకు స్లోగా ఉన్న నిత్యా మీనన్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. 2015లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. నిత్యా మీనన్ హీరోయిన్గా 'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది . తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకున్న ఈ ముద్దుగుమ్మ సెలక్టీవ్‌గా సినిమాలు చేడంతో కాస్త తక్కువ గానే కనిపించింది. అయితే నితిన్‌తో నిత్య నటించిన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు హిట్టుకావడంతో నిత్య మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. 2015లో నాలుగు నెల్లోనే నిత్య నటించిన ఐదు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. శర్వానంద్‌తో కలసి నిత్య నటించిన మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు మంచి విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో పాత్ర ప్రాధాన్యత తెలుసుకొని కాస్త వయసు ఎక్కువగా కనిపించడానికి కూడా నిత్య ఏమాత్రం వెనుకాడలేదు . హీరోయిన్ క్యారెక్టర్సే కావలని పట్టుబట్టనని నిత్య స్వయంగా చెప్పింది. బన్నీతో కలసి S/O సత్యమూర్తిలో ఓ కీలక పాత్రలో నటించిది. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఒకే కణ్మణి తెలుగులో ఒకే బంగారం పేరుతో విడుదలయ్యింది. ఎలాంటి భావోద్వేగాన్నైనా అలవోకగా పలికించగల నిత్య ఒకే బంగారం మూవీలో తన నవ్వుతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తమిళంలో డ్యాన్స్‌మాస్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన కాంచన-2 గంగ చిత్రంలోనూ నిత్య తనదైన శైలీలో నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలో కనిపించింది. ఇక తన మాతృబాష మలయాలలోను మహామద్ దర్శకత్వంలో 100 డేస్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో అలరించింది. ఇలా నాలుగు నెలల్లోనే నిత్యా మీనన్ నటించి 5 సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చాయి. గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపిందిన రుద్రమదేవి మూవీలోను నిత్య ప్రధాన్యతగల పాత్రలో కనిపించనుంది. అలాగే బెంగూళుర్ డేస్ రీమేక్‌తోపాటు తమిళ క్వీన్ రీమేక్తోను అలరించనుంది. ఈ విధంగా ఈ ఏడాది నిత్య మాంచి దూకుడు మీదవుందనే చెప్పాలి. -
స్పీడ్ పెంచిన నిత్యా మీనన్
-
ఎవరి అభిప్రాయం వాళ్లది!
‘‘సహజీవనం నేపథ్యంలో ‘ఓకే బంగారం’ ఉంటుందని మణిరత్నం చెప్పినప్పుడు, ఆయన మీద నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకున్నా. నిజంగానే క్లాస్‌గా చూపించారు. సహజీవనంపై నాకు ప్రత్యేకమైన అభిప్రాయం అంటూ ఏదీ లేదు. సహజీవనం మంచిదని ఎవరైనా అంటే అది వాళ్ల అభిప్రాయం అనుకుంటా. చెడద్దని అన్నవాళ్లని కూడా వ్యతిరేకించను. నేను ఏ దర్శకుడితో సినిమా చేసినా ఎంతో కొంత నేర్చుకొంటా. ఒక్కోసారి చిన్నపిల్లల నుంచి కూడా నేర్చుకోదగ్గ విషయాలుంటాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘ఓకే బంగారం’ - ఇలా ఒకదానికి ఒకటి పోలిక లేని చిత్రాల ద్వారా కనిపించా’’. - నిత్యామీనన్ -
కోలీవుడ్‌లో డబుల్ ధమాకా
దేనికైనా సమయం రావాలంటారు. అందులో ఎంత నిజం ఉందో నిత్యామీనన్‌కు ఇప్పుడు అవగతమై వుంటుంది. ఈ మలయాళీ భామ సొంతగడ్డపై జయించారు. పొరిగింటి తెలుగు చిత్ర పరిశ్రమలోనూ విజయాలు అందుకున్నారు. అలాంటిది ఇరుగింటి లాంటిదైన తమిళ చిత్ర పరిశ్రమలో ఆశించిన పేరును పొందలేకపోయాననే కించిత్ చింత నిత్యామీనన్‌లా ఇప్పటి వరకు వెంటాడుతోంది. నిత్య ఇంతకుముందే కోలీవుడ్‌లో 180, జెకె ఎను ఒరు నన్భనిన్ కాదల్ తదితర చిత్రాల్లో నటించారు. అయితే అవేవీ నిత్యా కెరీర్‌కు కోలీవుడ్‌లో హెల్ప్ అవ్వలేదు. జెకె ఎను నన్భనిన్ కాదల్ చిత్రం అయితే తెరపైకే రాలేదు. డబుల్ ధమాకా : అలాంటిది తాజాగా నిత్యామీనన్ నటించిన రెండు తమిళ చిత్రాలు ఓ కాదల్ కణ్మణి, కాంచన -2 ఒకే రోజు విడుదలవ్వడం అరుదైన విషయం. ఈ రెండు తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ విడుదలై విజయవంతంగా ప్రదర్శించడం మరో విశేషం. ఇదలా ఉంచితే ఈ రెండు చిత్రాల్లో నిత్యామీనన్ నటనకు ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఓ కాదల్ కణ్మణి చిత్రంలో పెళ్లికి ఇష్టపడని ప్రేయసి పాత్రలో నిత్యామీనన్ రొమాంటిక్ నటన అటు ప్రేక్షకులను, ఇటు పరిశ్రమ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. గౌతమ్‌మీనన్ లాంటి ప్రముఖ దర్శకులు నిత్య నటనను అభినందించడం గమనార్హం. అదే విధంగా కాంచన-2లో వికలాంగ యువతిగా నిత్య నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. ఈ రెండు చిత్రాలు ఆమెకు డబుల్ ధమాకా ఆనందాన్ని ఇవ్వడంతో పాటు కోలీవుడ్ దృష్టి ఇప్పుడు నిత్యపై పడింది. తమిళ చిత్ర పరిశ్రమ తలుపులు ఆమె కోసం తెరచుకుంటున్నాయి. ఇక పిలుపు రావడమే ఆలస్యం అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
వెండితెర బంగారం
చిట్‌చాట్ నిత్య నూతన చిరునవ్వుతో.. టాలీవుడ్ జనాలకు దగ్గరైన నిత్యామీనన్.. చీరకట్టులో సింప్లీ సూపర్బ్ అనిపించింది. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో శనివారం జరిగిన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశంకర్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో... ఆయన కుంచె నుంచి జాలువారిన పెయింటింగ్స్‌ను చూసి అచ్చెరువొందింది. ఈ సందర్భంగా నిత్యామీనన్‌తో సిటీప్లస్ చిట్‌చాట్.. నేను పుట్టి పెరిగింది బెంగళూరులో. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి జర్నలిజం కోర్సు చేశా. హీరోయిన్ అవుతానని ఏనాడూ అనుకోలేదు. జర్నలిస్టుగా రాణించాలనుకున్నా. పరిస్థితులు అందుకు సహకరించలేదు. ఆ తర్వాత నా ఆలోచనలను సినిమా ద్వారా చెప్పేందుకు నిర్మాత కావడం కోసం పూణెలోని ఎఫ్టీఐలో సినిమాటోగ్రఫీలో ఎన్రోల్ చేసుకున్నా. ఈ ఎంట్రెన్స్ సమయంలోనే నందినిరెడ్డితో పరిచయం ఏర్పడింది. హీరోయిన్గా నటించాలని బ్రెయిన్ వాష్ చేసింది. అలా మొదలైంది నా సినిమా కెరీర్. చిన్నప్పటి నుంచీ చలాకీ... స్కూల్ డేస్ నుంచే చలాకీగా ఉండేదాన్ని. ఇంట్లో కూడా బాగా అల్లరి చేసేదాన్ని. నా ముసిముసినవ్వులు, వినసొంపైన మాటలతో పేరెంట్స్‌ను కూల్ చేసేదాన్ని. కోపమొచ్చినా మరుక్షణంలో మరిచేలా నటించేదాన్ని. అలా నాకు తెలియకుండానే నటన వచ్చేసింది. పదో తరగతిలో ఉండగానే ‘ద మంకీ హూ న్యూ టూమచ్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది. అలా మొదలైంది... నా కెరీర్‌కు దోహదపడిన ఈ భాగ్యనగరం అంటే నాకు ప్రత్యేక అభిమానం. అలా మొదలైంది సినిమా చాలా వరకు సిటీ లొకేషన్స్‌లోనే తీశారు. ఈ షూటింగ్ ిపీరియడ్లోనే సిటీలోని చారిత్రక కట్టడాలు చూసేశాను. నాకు డ్రెస్ వేసుకోవడం కంటే.. చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. చీరకట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా ఉంటాను. హైదరాబాదీ డిజైనర్స్ చేతిలో అట్రాక్షన్‌గా రూపుదిద్దుకున్న చీరలు భలేగా ఉంటాయి. అ మజానే వేరు.. సిటీఫుడ్ అంటే చాలా ఇష్టం. టైం దొరికినప్పుడల్లా బంజారాహిల్స్‌లోని తాజ్బంజారాకు వెళ్తుంటా. అక్కడ లేక్ పక్కన ఉన్న కుర్చీల్లో కూర్చొని బిర్యానీ తింటే ఆ మజానే వేరు. స్పైసీ ఫుడ్ కూడా నోరూరిస్తుంటుంది. సరికొత్తగా కనిపించిన ఏ వంటకాలనైనా టేస్ట్ చూడనిదే వదిలిపెట్టను. సినిమా పరంగా అయితే ఇష్క్, ఒక్కడినే, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. మంచి పేరునే తెచ్చిపెట్టాయి. సన్నాఫ్ సత్యమూర్తిలో చేసింది చిన్న రోల్ అయినా నటన సంతృప్తినిచ్చింది. ఓకే బంగారంలోని నా పాత్ర రియల్ లైఫ్‌కి అతికినట్టు సరిపోతుంది. సొంతూరు వెళ్తున్నా.... ఇన్నాళ్లు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నా. రెండు నెలల పాటు బ్రేక్‌ను ఇవ్వాలనుకుంటున్నా. బెంగళూరుకు వెళ్లి కుటుంబసభ్యులతో గడుపుదామనుకుంటున్నా. ఆ తర్వాత బెంగళూరు డేస్ రీమేక్ తెలుగు మూవీలో నటించబోతున్నా. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతుంటా. రాస్తుంటా. కూర్చొని ఆలోచిస్తుంటా. అయితే ఆర్ట్ వేయడమనేది ఓ విద్య. అంత కష్టమైన పనిని నేను చేయలేను. -
వీరిలో చెల్లెలు ఎవరు?
కథానాయకులకు చెల్లెల్లుగా నటించి పేరు తెచ్చుకున్న ప్రముఖ నటీ మణులు సినీ చరిత్రలో చాలా మందే ఉన్నారు. నాటి రక్త సంబంధం నుంచి ఈ మధ్య వచ్చిన పుట్టింటికి రా చెల్లి, అన్న వరం, ఇలా చాలా చిత్రాలు అన్నా చెల్లెల సెంటిమెంట్‌లో పండినవే. అలాంటి అన్నా చెల్లెళ్ల అనుబంధంతో కోలీవుడ్‌లో ఓ చిత్రం రూపొందనుంది. ఆ చిత్ర కథనాయకుడు అజిత్. దర్శకుడు శివ. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇటీవల వీరం చిత్రం విజయవంతమైన విషయం తెలిసిందే. మరో సారి వీరి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రాన్ని శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్‌కు చెల్లెలు పాత్ర కీలకంగా ఉంటుందన్నది సమాచారం. ఆ పాత్ర కోసం నటి నిత్య మీనన్, శ్రీ దివ్యలో ఎవరో ఒకరిని నటింప చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. వారితో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిసింది. నిత్యా మీనన్, శ్రీ దివ్య తమిళంతో పాటుగా తెలుగులోని ప్రాచుర్యం పొందిన నటీమణులే. ఈ రెండు భాషల్లోను వీరికి మార్కెట్ ఉండటం గమనార్హం. అలాంటి వాళ్లల్లో అజిత్‌కు చెల్లలుగా నటించే అవకాశం ఎవరిని వరిస్తుందో అన్నదే ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చ. అజిత్ వీరం చిత్రంలో నలుగురు తమ్ముళ్లకు అన్నగా నటించి హిట్ కొట్టారు. తాజా చిత్రంలో చెల్లమ్మ సెంటిమెంట్‌తో ఏ స్థాయిలో విజయం సాధిస్తారోనన్నది వేచి చూడాల్సిందే. -
సహజీవనం నేపథ్యంలో...
విదేశాలకు వెళ్లాలనుకునే ఓ అమ్మాయికీ, ఓ అబ్బాయికీ ముంబయ్‌లో పరిచయం ఏర్పడుతుంది. విదేశాలు వెళ్లేవరకూ ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు. చివరికి ఇద్దరి ప్రయాణానికి సమయం దగ్గరపడుతుంది. ఇన్నాళ్లూ కలిసి ఉన్న ఈ ఇద్దరూ ఎవరి దారిన వాళ్లు విదేశాలు వెళతారా? లేక జతగా వెళతారా? అసలు విదేశాలు వెళ్లాలనే నిర్ణయాన్ని మార్చుకుంటారా? తదితర అంశాల సమాహారంతో మణిరత్నం తీసిన చిత్రం ‘ఓకే బంగారం’. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించారు. మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్త్తున్నాయి. వచ్చే వారం ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత ‘దిల్’ రాజు చెబుతూ - ‘‘సహజీవనంపై హిందీలో చాలా సినిమాలొచ్చాయి. కానీ, తెలుగులో ఈ అంశం పూర్తిగా కొత్త. ఈ చిత్రం యువతకూ, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చే విధంగా ఉంటుంది. ఏఆర్. రహమాన్ స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీ ఓ హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. -
అచ్చమైన తెలుగు పాటల్లా ఉంటాయి : సిరివెన్నెల
‘‘మణిరత్నం గారి సినిమాలు చూసి ఆయనకు అభిమాని కాని వారు ఎవరూ ఉండరేమో... అందుకే ఆయన ఈ సినిమాకు పాటలు రాయమని అడగ్గానే కాదనలేకపోయాను. కానీ లిప్ సింక్‌తో సంబంధం లేకుండా పాటలు రాస్తానన్నా. దానికి ఆయన ఒప్పుకున్నారు కూడా. అందుకే అచ్చమైన తెలుగు పాటలు ఉన్నట్టే ఉంటాయి’’ అని ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ‘ఓకే కన్మణి’. ఈ చిత్రాన్ని ‘ఓకే బంగారం’ పేరుతో మద్రాస్ టాకీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ తెలుగులోకి విడుదల చేస్తున్నాయి. ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘ ‘అమృత’ సినిమాను తెలుగులో విడుదల చేసి, నిర్మాతగా మారాను. మళ్లీ 15 సంవత్సరాల తర్వాత ‘ఓకే బంగారం’ విడుదల చేస్తున్నాను. ఈ సినిమా కథ చదివి వెంటనే తెలుగులో విడుదల చేయాలనుకున్నాను. ఏప్రిల్ 17న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. నాని మాట్లాడుతూ - ‘‘నేను మణిరత్నంగారి అభిమానిని. ఈ సినిమాలో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. వీవీ వినాయక్, పైడిపల్లి వంశీ, నిఖిల్, సాయిధరమ్‌తేజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో అజిత్ చిత్రం
డెరైక్టర్ చేరన్ దర్శకత్వం వహించిన ‘జె కె’ అనే చిత్రం స్నేహితుని జీవితం కథాంశంతో రూపొందించారు. ఈ చిత్రంలో శర్వానంద్, నిత్యామీనన్, సంతానం తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా డీవీడీలుగా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశారు. దీని తర్వాత గౌతం మీనన్ దర్శకత్వంలో అజిత్, త్రిష, అనుష్క నటించి ఇటీవల తెరకెక్కిన ‘ఎన్నై అరిందాల్’ చిత్రం ఆన్లైన్లో విడుదలైంది. హెచ్డీ స్థాయిలో ఆంగ్ల టైటిల్‌తో ఇది విడుదలైంది. అయితే విదేశాల్లో వున్న అభిమానులు మాత్రమే దీన్ని చూసే వీలుంది. డీవీడీలోను, ఆన్లైన్లోను చిత్రాలు విడుదల కావడం కలకలం సృష్టించినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఇదేవిధంగా మరికొన్ని చిత్రాలు విడుదల కానున్నట్లు తెలియడంతో కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. -
క్వీన్ రీమేక్‌లో నిత్యామీనన్
-
అదే తరహాలో...: నిత్యామీనన్
ఈ తరం హీరోయిన్లు ట్రెండ్ ఫాలో అవ్వడంలేదు. ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అందాల ఆరబోతకు, గ్లామర్‌కే కాదు యాక్షన్‌కి సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు. పాత్ర, పాత్ర ప్రాధాన్యతను బట్టి హీరోయిన్‌గానే కాదు, హీరోకి చెల్లెలిగా కూడా నటిస్తున్నారు. లీడ్ రోల్స్‌తో సరిపెట్టకుండా కటెంట్ డిమాండ్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా కూడా మారుతున్నారు. స్టార్ రేంజ్లో ఉండగానే, క్యారెక్టర్ రోల్స్ చేసేందుకు ముందుకు రావడాన్ని సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే అలా నటించడం వాళ్ల కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్ల విషయంలో ఈ ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం తమ రూటే సెపరేట్ అంటున్నారు. హీరోల సరసన అక్కలుగా, చెల్లెలుగా కూడా నటించడానికి వెనుకాడంటంలేదు. అలా నటించి మెప్పిస్తున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ 'సన్ ఆఫ్ సత్యమూర్తి'. ఈ మూవీలో హీరోయిన్లుగా సమంత, అదాశర్మ నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు మల్లూ బ్యూటీ నిత్యామీనన్ కూడా యాక్ట్ చేస్తోంది. అయితే ఈమె బన్నీకి చెల్లెలుగా నటిస్తోంది. ఈ విషయంపై నిత్య స్పందిస్తూ, గతంలో ఎంతోమంది హీరోహీరోయిన్లు బద్రర్స్ అండ్ సిస్టర్స్‌గా నటించారని గుర్తు చేశారు. అదే తరహాలో బన్నీతో కలిసి తాను నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. జోష్ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన కార్తీక సైతం చెల్లెలుగా నటిచింది. అల్లరి నరేష్ పక్కన బొమ్మాళి సిస్టర్‌గా కనిపించి ప్రేక్షకుల్ని కవ్వించింది. ఆమె పాత్రకు మంచి పేరొచ్చినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ బోల్తాపడింది. మీరా జాస్మీన్ గోరింటాకు చిత్రంలో యాంగ్రీ యంగ్‌మేన్ రాజశేఖర్‌కి చెల్లెలుగా నటించి అలరించింది. వీరిద్దరి మధ్య నడిచే సెంటిమెంట్ సీన్లు మహిళ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ విజయంలో మీరాదే కీలక పాత్ర అంటూ క్రిటక్స్ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కీర్తిరెడ్డి, ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో నటించి సక్సెస్ ట్రాక్ మెయింటైన్ చేసింది. అయితే కెరీర్ ఎండింగ్లో మాత్రం అర్జున్ సినిమాలో మహేష్‌కి అక్కగా మెరిసింది. ఈ చిత్రం ఫలితం నెగిటివ్‌గా వచ్చినప్పటికీ, కీర్తి చేసిన పాత్రకి మాత్రం ప్రేక్షకుల బాగానే మార్కులు వేశారు. -
ఓకే కణ్మణి కాదా?
మణిరత్నం ఓకే కణ్మణి చిత్ర టైటిల్ ఓకే కాదా? కాదనే అంటున్నారు చిత్ర వర్గాలు. కడల్ చిత్రం తరువాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రానికి ఓకే కణ్మణి అనే టైటిల్ ప్రచారంలో నానుతోంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు వాయై మూడి పేసవుం, చిత్ర కథానాయకుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. ఆయనతో నిత్యామీనన్ జోడీ కడుతున్నారు. ఎ ఆర్రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం అలప్పాయుదే (తెలుగులో సఖి) చిత్రం తరహాలో రొమాంటిక్ లవ్‌స్టోరీతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. చిత్ర షూటింగ్‌ను మణిరత్నం చాలా ప్రొఫైల్‌లో వేగంగా పూర్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్గాని చిత్ర వివరాలను గానిచిత్ర యూనిట్ అధికార పూర్వకంగా వెల్లడించలేదన్నది నిజం. అయితే చిత్ర టైటిల్ ఓకే కణ్మణి గా ప్రచారంలో ఉంది. తాజాగా ఆ టైటిల్ మారనుందని ఓ కాదల్ కణ్మణి పేరును నిర్ణయంచినట్లు సమాచారం. ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోను ఏకకాలంలో అంటే ఏప్రిల్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీనికి తెలుగులో ఓకే బంగారం అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. -
అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లను
‘అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లను’ అంటోంది నటి నిత్యామీనన్. ఈమె నటనా శైలినే కాదు వ్యక్తిత్వం ప్రత్యేకం. తనకంటూ కొన్ని హ ద్దులు విధించుకుని నటించే నటి. పాత్రల డిమాండ్ మేరకు గ్లామర్‌గా నటించడానికి సిద్ధమే అయినా షరతులు వర్తిస్తాయి అం టూ మెలికపెట్టే నిత్యామీనన్‌ను పొగరుబోతు అని కూడా అంటుంటారు. అయినా అలాంటి వాటిని లెక్కచేయకుండా వచ్చిన అవకాశాల్లో నచ్చిన వాటిని మాత్రమే చేసుకుంటూపోతోంది కేరళ కుట్టి. తమిళం, మలయా ళం, తెలుగు తదితర భాషల్లో నాయకిగా గుర్తింపు పొందిన నిత్యామీనన్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న ఓకే కన్మణి చిత్రం ఒక్కటే ఆమె చేతిలో ఉంది. ఈ చిత్రం కూడా షూటింగ్ పార్టు పూర్తి చేసుకుంది. ఇలాంటి పరిస్థితిలోనూ నిత్యామీనన్ పలు కథలు వింటూ నటించడానికి నిరాకరిస్తుందనే ప్రచారం జరుగుతోంది. కారణం ఏమిటని అడిగితే ఇప్పటి వరకు తాను చేసిన చిత్రాలు గాని, వాటిలో నటించిన పాత్రలతో గానీ చాలా సంతృప్తిగా ఉన్నానంటోంది. ఒక చిత్రం పూర్తి చేసిన వెంటనే మరో చిత్ర అవకాశం రావాలని కోరుకోవడం లేదని అంటోంది. అదేవిధంగా అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం తనకు లేదని పేర్కొంది. పాత్ర నచ్చితే దానికి జీవం పోయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తానని నిత్యా అంటోంది. అందుకే ఈ 26 ఏళ్ల బ్యూటీ ఇప్పటి వరకు తమిళం, మలయాళం, తెలుగు తదితర 32 చిత్రాల్లోనే నటించింది. -
ఈ సినిమా ఓ అందమైన పూలగుత్తి
‘‘ఈమధ్యకాలంలో వచ్చిన ప్రేమకథలన్నింటి కన్నా గొప్ప ప్రేమకథ ఇది. అలా ఎందుకంటున్నానంటే ఈ మధ్య వచ్చే ప్రేమకథలు ఘాటుగా ఉంటున్నాయి. కానీ, ఈ కథ సున్నితంగా ఉండటంతో పాటు ఎంతో పవిత్రంగా ఉంటుంది’’ అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. ఆయన సమర్పణలో సీసీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎ. వల్లభ నిర్మించిన చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో కేయస్ రామారావు మాట్లాడుతూ -‘‘ఒక చక్కని పూలగుత్తి చూసినప్పుడు కలిగే మంచి భావన ఈ చిత్రం చూసినప్పుడు కలుగుతుంది. 1980లలో ‘రాక్షసుడు’ చిత్రానికి ఇళయరాజాగారు స్వరపరచిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..’ పాట ఇప్పటికీ అందరికీ గుర్తే. ఈ కథకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు..’ టైటిల్ నప్పుతుందని క్రాంతిమాధవ్, శర్వానంద్ సూచించారు. అంతకు మించిన మంచి టైటిల్ దొరక్కపోవడంతో దీన్నే ఖరారు చేశాం. కథ చెప్పినదాని కన్నా మించి క్రాంతి మాధవ్ అద్భుతంగా తీశాడు. శర్వానంద్, నిత్య పోటాపోటీగా నటించారు. ఈ సినిమాకి మరో ఆకర్షణ సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు. ఇద్దరు ప్రేమికులు ఎలా మాట్లాడుకుంటారో అలానే సహజంగా మాటలు ఉంటాయి. గుణశేఖర్ కెమెరా, గోపీసుందర్ స్వరపరచిన పాటలు, క్రాంతి మాధవ్ టేకింగ్... వెరసి ఈ చిత్రం ఓ ‘వెండితెర కావ్యం’లా తయారైంది’’ అని చెప్పారు. అన్ని పనులూ పూర్తయినప్పటికీ ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయకుండా వాయిదా వేయడానికి కారణం ‘గోపాల గోపాల’, ‘ఐ’ చిత్రాలేనా? అని ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు -‘‘అవును. రెండు పెద్ద చిత్రాల మధ్య ఈ చిత్రాన్ని విడుదల చేస్తే నలిగిపోతుందని బయ్యర్లు అన్నారు. పైగా థియేటర్లు దొరకవు. అందుకే, నా సినిమా మీద నాకు నమ్మకం ఉన్నా విడుదల చేయలేదు’’ అన్నారు. పండగకు రెండు భారీ చిత్రాలు విడుదల కావడంవల్ల మీ సినిమా అనే కాకుండా మరో ఐదారు చిత్రాల విడుదల వాయిదా పడింది కదా? అనే ప్రశ్నకు - ‘‘అవును. పెద్ద చిత్రాలకు థియేటర్లు కేటాయించడం వల్ల ఇతర చిత్రాలు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. పెద్ద చిత్రాలైతేనే ప్రేక్షకులు వస్తారనే నమ్మకం ఉంటుంది. అది కొంతవరకు వాస్తవం. పెద్ద సినిమాలైతే 75 థియేటర్లలో ఫుల్ అవుతుంది. అదే, నా ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి చిత్రాలైతే అన్ని థియేటర్లు ఫుల్ కావు. అందుకని, పెద్ద సినిమాలకే థియేటర్లు ఇస్తారు. ఏదేమైనా పండగకు విడుదలైన రెండు సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రం నాది. నాదో అందమైన ప్రేమకథా చిత్రం. పండగకు వచ్చి ఉంటే బాగానే ఉండేది’’ అని చెప్పారు. -
నట్టింటికి సినిమా వాయిదా
సీటూహెచ్ పేరుతో దర్శకుడు చేరన్ నట్టింటిలో కొత్త సినిమా చూపించే కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. గత కొంతకాలంగా ఇదే పనిలో ఉన్న ఈ దర్శకుడు ఈ ప్రయోగానికి తన చిత్రం జె కె ఎన్నుమ్ నన్బేవిన్ వాళ్కైతోనే శ్రీకారం చుట్టడానికి సిద్ధమయ్యారు. ఆ తరువాత పలు చిత్రాలకు వరుసగా సీడీల రూపంలో ఇంటింటికీ అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలి ప్రయత్నంగా శర్వానంద్, నిత్యామీనన్ నటించిన జె కె ఎన్నుమ్ నన్భనిన్ వాళ్కై చిత్రాన్ని ఈ నెల 15న సీడీల రూపంలో విక్రయించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ కొత్త ప్రక్రియను కొన్ని రోజులు వాయిదా వేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో చేరన్ పేర్కొంటూ నూతన చిత్రాలను సీడీల రూపంలో ఇంటికే అందించే విధానంతోపాటు థియేటర్లలోను విడుదల చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ఈ విషయమై థియేటర్ల యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయాలను తీసుకుని చిత్రాలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఓకే బంగారం!
మమ్ముట్టి తనయుడు డుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం తమిళంలో తీస్తున్న చిత్రం ‘ఓకే కణ్మణి’. ఇది తెలుగులో కూడా విడుదల కానుంది. దీనికి ‘ఓకే బంగారం’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. -
ఈ సినిమాకు ఏదీ పోటీ కాదు - కె.ఎస్. రామారావు
‘‘40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా. అన్ని రకాల సినిమాలూ తీసినా... ప్రేమకథలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. నిత్యామీనన్ ద్వారా ఈ కథ నా దగ్గరకొచ్చింది. క్రాంతిమాధవ్ కథను కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఎలా చెప్పాడో అంతకంటే అద్భుతంగా తెరకెక్కించాడు. జ్ఞానశేఖర్ కెమెరా, గోపీసుందర్ సంగీతం ప్రేక్షకులకు ఓ తీయని అనుభూతిని అందిస్తాయి’’ అని కె.ఎస్.రామారావు అన్నారు. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’. ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాలను రమేశ్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి ప్రధాన బలం స్క్రిప్ట్. సాయిమాధవ్ బుర్రా అద్భు తంగా సంభాషణలు రాశాడు. వెంకటేశ్, పవన్‌కల్యాణ్‌ల ‘గోపాల గోపాల’ చిత్రానికి కూడా ఆయనే సంభాషణలు అందిస్తున్నారు. పంపిణీదారులందరూ సహకరిస్తే... ఈ సినిమాను కూడా ‘గోపాల గోపాల’తోనే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తా. ఇది చక్కని ప్రేమకథ కాబట్టి, దీనికి ఏ సినిమా పోటీ కాదు’’ అని తెలిపారు. మనసుల్ని మెలిపెట్టే ప్రేమకావ్యంగా క్రాంతిమాధవ్ ఈ చిత్రాన్ని మలిచారని శర్వానంద్ అన్నారు. ఈ సినిమాకు పెట్టినంత ఎఫర్ట్ ఇంతవరకూ తాను ఏ సినిమాకూ పెట్టలేదని నిత్యామీనన్ తెలిపారు. తెలుగు భాషంటే తనకు ఇష్టమనీ, క్రాంతిమాధవ్, నిత్యామీనన్ వల్లనే తెలుగు సినిమా చేసే అవకాశం తనకు లభించిందనీ, సంగీత దర్శకుడు గోపీ సుందర్ చెప్పారు. -
మళ్లి మళ్లీ ఇది రాని రోజు మూవీ స్టిల్స్
-
వేగం పెంచిన మణి
దర్శకుడు మణిరత్నం చిత్రాలంటేనే కనీసం ఏడాదిన్నర, రెండేళ్లు నిర్మాణం జరుపుకుంటాయనే టాక్ ఉంది. విక్రమ్ హీరోగా నటించిన రావణన్ గానీ, ఆ తర్వాత తెరకెక్కించిన కడల్ చిత్రంగానీ నిర్మాణానికి చాలా రోజుల పట్టింది. అలాంటిది ఈ ప్రఖ్యాత దర్శకుడు వేగం పెంచారు. తాజా చిత్రం ఒకే కన్ముణి చిత్ర నిర్మాణాన్ని చాలా సెలైంట్‌గా ఫాస్ట్‌గా నిర్మాణం కావించడం విశేషం. ఇంకో విషయం ఏమిటంటే ఒకే కన్ముణి చిత్ర షూటింగ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది, ఎక్కడ చిత్రీకరణ జరుపుకుటోందన్న విషయాల్ని చాలా గోప్యం ఉంచారు. మలయాళ సూపర్‌స్టార్ ముమ్మట్టి కొడుకు, దుల్కల్ సల్మాన్ హీరోగాను నటి నిత్యామీనన్ హీరోయిన్‌గాను నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందన్నది తాజా సమాచారం. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడ మొదలయ్యాయట. ఏక బిగువన ఒకే కన్ముణి చిత్ర షూటింగ్‌ను పూర్తి చేస్తున్నట్లు తెలిసింది. ఫీల్ గుడ్ రొమాంటిక్ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం ఇంతకుముందు మణిరత్నం తెరకెక్కించిన అలప్పాయుదే చిత్రం తరహాలో ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో ఫైవ్‌స్టార్ చిత్రం ఫేమ్ కనిహ కీలక పాత్ర పోషిస్తున్నారట. ఈమెకు సంబంధించిన సన్నివేశాలను ప్యారిస్ కార్నర్ ప్రాంతంలో ఐదు రోజుల పాటు చిత్రీకరించారు. ఇది పట్టణ ప్రాంత ప్రేమ కథ చిత్రం అని తెలిసింది. ఇదే నేపథ్యంలో రూపొందిన అలప్పాయుదే చిత్రం మంచి విజయాన్ని సాధించింది. మరి ఈ ఒకే కన్ముణి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..!
నిత్యామీనన్ కు ఒకే సమయంలో రెండు సువర్ణావకాశాలు. ఒకటేమో మణిరత్నం సినిమాలో ఆఫర్. మరొకటి - త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీకి జోడీగా నటించే అవకాశం. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్క్వార్ సల్మాన్ హీరోగా మణిరత్నం భారీ ఎత్తున ఓ సినిమా చేస్తున్నారు. అలియా భట్‌లాంటి పాపులర్ బాలీవుడ్ కథానాయికలను అనుకుని, ఫైనల్‌గా నిత్యామీనన్‌ను ఎంపిక చేసుకున్నారు మణిరత్నం. త్రివిక్రమ్ సినిమాకూ అలాంటి పరిస్థితే. ఇందులో బన్నీ సరసన ముగ్గురు కథానాయికలుంటారు. సమంత, అదాశర్మను ఇప్పటికే ఎంపిక చేశారు. మరో నాయికగా ప్రణీత పేరు బాగా ప్రచారంలోకొచ్చింది. ఏమైందో ఏమో కానీ అకస్మాత్తుగా ప్రణీత స్థానంలో నిత్యామీనన్ వచ్చి చేరారు. బన్నీతో ఆమెకిదే తొలి కాంబినేషన్. మలయాళ అమ్మాయి అయినా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడే నిత్యా, త్రివిక్రమ్ మార్కు సంభాషణలను పలకడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత షూటింగ్ జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్లో నిత్యా ఎంటరవుతారని సమాచారం. -
‘ఓకే కన్మణి’ అంటున్న మణిరత్నం?
మణిరత్నం చిత్రం అంటేనే ఆటోమేటిక్‌గా ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఆయన దర్శకత్వ శైలినే అందుకు కారణాలు కావచ్చు. మౌనరాగం, దళపతి, నాయకన్, అగ్నినక్షత్రం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల సృష్టికర్త మణిరత్నం. ఈయన భారీ యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో ఎంత దిట్టనో, అందమైన ప్రేమ కథా చిత్రాలను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించడంలోనూ అంత సిద్ధహస్తుడు. మౌనరాగం, ఇదయత్తైతిరుడాదే (తెలుగులో గీతాంజలి), రోజా, అలప్పాయిదే వంటి ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయి. తాజాగా అలాంటి అద్భుత ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటి నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ చిత్ర కథ విని బల్క్ కాల్షీట్స్ను దుల్కర్ సల్మాన్ కేటాయించగా నటి నిత్యామీనన్ మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. చిత్ర కథను దర్శకుడు చెప్పగానే స్ఫెల్‌బౌండ్ అయిపోయానని నిత్యామీనన్ అన్నారు. కాగా ఈ చిత్రంలో ముఖ్యభూమికను పోషిస్తున్న ప్రకాష్‌రాజ్ చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రంలో నటిస్తున్నానంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మణిరత్నం ఆస్థాన విద్వాంసుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాలలో సెలైంట్‌గా జరుపుకుంటోం ది.