సీక్రెట్ ఏజెంటుగా నయనతార
గ్లామర్ రోల్స్ను పక్కన పెట్టి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న నయనతార మరో ఆసక్తికరమైన పాత్రకు రెడీ అవుతోంది. ఇప్పటికే అనామిక, మాయ, నానుమ్ రౌడీదాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నయన్, నెక్ట్స్ సినిమాలో సీక్రెట్ ఏజెంటుగా కనిపించనుంది. తమిళ్లో అజిత్ హీరోగా తెరకెక్కిన బిల్లా సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చేసిన నయన్ చాలాకాలం తరువాత అదే తరహా పాత్రలో కనిపించనుంది.
విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఇరు మగన్ సినిమాలో నయనతార సీక్రెట్ ఏజెంట్గానటించడానికి రెడీ అవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్లో నటించనుంది ఈ బ్యూటి. తొలిసారిగా నయన్ విక్రమ్తో జోడీ కడుతున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. నిత్యామీనన్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది.