secret agent
-
USA: సీక్రెట్ ఏజెంట్‌ను దోచుకున్న దొంగలు
కాలిఫోర్నియా: జేమ్స్‌బాండ్ సిరీస్ సినిమాల్లో హీరోల్లాంటి వాళ్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగంలో పనిచేసే ఏజెంట్లు. ఇలాంటి ఓ ఏజెంట్‌ను దొంగలు గన్‌తో బెదిరించి మరీ దోచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ విచిత్ర ఘటన లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. ఆదివారం(జూన్16) అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా కలిసి లాస్ఏంజెల్స్లో డెమొక్రాట్ల ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఓ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడికి భద్రత కల్పించి తిరిగి వెళుతున్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ను టస్టిన్ ప్రాంతంలో దొంగలు అడ్డుకుని తుపాకీతో బెదిరించారు. అతని వద్దనున్న బ్యాగ్‌ను దోచుకొన్నారు. ఈ సమయంలో ఆ సీక్రెట్ ఏజెంట్ దొంగలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సమాచారం టస్టిన్ పోలీసులకు అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. తమకు సీక్రెట్ ఏజెంట్ బ్యాగ్ దొరకలేదని, ఏజెంట్‌ను బెదిరించి దోచుకున్న వారి ఆచూకీ ఇంకా తెలియలేదని పోలీసులు సోమవారం చెప్పారు.‘మా సిబ్బంది ఒకరు కాలిఫోర్నియాలో దోపిడీకి గురయ్యారు. ఈ క్రమంలో అతడు తన సర్వీస్ గన్‌తో ఫైరింగ్ కూడా చేశాడు. దొంగల కోసం గాలిస్తున్నాం’అని సీక్రెట్ సర్వీసెస్ ప్రతినిధి ఆంటోనీ తెలిపారు. -
రష్యా ప్లాన్లన్నీ లీక్.. పుతిన్ సీరియస్.. ఆ 150 మంది పరిస్థితేంటి?
కీవ్: యుద్ధ సమాచారాన్ని పాశ్చాత్య దేశాలకు లీక్ చేశారనే ఆరోపణలపై ఏకంగా 150 మందికి పైగా సైనిక, నిఘా ఉన్నతాధికారులను రష్యా అదుపులోకి తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన గంటల వ్యవధిలోనే ఆ దేశ యుద్ధ ప్రణాళికను ఇంగ్లండ్ ట్విట్టర్లో పెట్టింది. సేనలు ఏయే మార్గాల్లో వెళ్తున్నదీ ఎప్పటికప్పుడు కచ్చితంగా అంచనా వేస్తూ వచ్చింది. ఈ పరిణామాలపై పుతిన్ అగ్గిమీద గుగ్గిలమయ్యారని సమాచారం. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ విదేశీ విభాగాధిపతి సెర్గీ బెసెడాతో పాటు 150 మందిని అరెస్టు చేశారు. వీరందరినీ మాస్కోలో స్టాలిన్ హయాంనాటి అత్యంత కట్టుదిట్టమైన లెఫొర్టోవ్ జైలుకు తరలించారు. మొత్తం వ్యవహారంపై మిలిటరీ కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం ద్వారా దర్యాప్తుకు పుతిన్ ఆదేశించారు. వాస్తవ పరిస్థితిని చెప్పకపోగా, రష్యా సైన్యాన్ని స్వాగతించేందుకు ఉక్రేనియన్లు సిద్ధంగా ఉన్నారంటూ తప్పుదోవ పట్టించినందుకే వారిని అదుపులోకి తీసుకున్నారని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. యుద్ధంలో రష్యా ఘోరంగా దెబ్బ తినడానికి నిఘా విభాగం వైఫల్యం, లీకేజీలే కారణమని పుతిన్ భావిస్తున్నట్టు సమాచారం. (చదవండి: యుద్ధం కొనసాగుతుంది.. స్పష్టం చేసిన పుతిన్) -
పాక్ ఏజెంట్లకు రహస్య సమాచారం.. నలుగురు డీఆర్డీఓ ఉద్యోగుల అరెస్టు
సాక్షి, బాలాసోర్(భువనేశ్వర్): పాకిస్తాన్ ఏజెంట్లకు రహస్య సమాచారం అందిస్తున్న నలుగురు డీఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. బాలాసోర్‌జిల్లా డీఆర్డీఓ ఇంటిగ్రేటెడ్ రేంజ్లో పనిచేస్తున్న వీరిని తొలుత ప్రశ్నించి అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్రన్ రేంజ్ ఐజీ హిమాంన్షు కుమర్ చెప్పారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి తమకు రహస్య సమాచారం వచ్చిందన్నారు. కొందరు వ్యక్తులు రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు అందించేందుకు యత్నిస్తున్నారని, వీరికి పలు ఐఎస్డీ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయని సమాచారం అందిందన్నారు. వెంటనే నలుగురు డీఎస్పీలతో ఏర్పాటైన పోలీసు టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు ఆరంభించామని చెప్పారు. ఈ టీములు జరిపిన దాడుల్లో నలుగురు ఉద్యోగులు దొరికినట్లు వెల్లడించారు. అనైతికంగా రహస్య సమాచారం అందించి నిధులు పొందుతున్న ఆరోపణపై వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి నుంచి నేరాలు రుజువు చేసే పలు ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. వీరిపై చాందీపూర్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయమై డీఆర్డీఓ స్పందించేందుకు నిరాకరించింది. 2014లో కూడా బాలాసోర్ నుంచి రహస్య సమాచారం విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. చదవండి: క్రిమినల్ కేసుల వివరాల్లేవ్.. మమత నామినేషన్ తిరస్కరించండి -
నగరంలో వరుస హత్యలు.. రావాలి ఓ గూఢచారి
నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి... హంతకుడిని పట్టుకోవాలంటే రావాలి ఒక గూఢచారి. పిల్లలు మాయమవుతుంటారు... కిడ్నాప్ చేసిందెవరో కనిపెట్టాలంటే రావాలి ఒక గూఢచారి. ప్రపంచ వినాశనానికి ఓ గ్యాంగ్ ప్లాన్ చేస్తుంది. గ్యాంగ్‌ని పట్టుకోవడానికి రావాలి ఓ గూఢచారి. ఈ నిందితులను పట్టుకోవడానికి గూఢచారి వేసే ప్లాన్లు భలే ఆసక్తిగా ఉంటాయి. అందుకే వెండితెరపై గూఢచారి కథలకు భలే క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ‘గూఢచారి’ పాత్ర చేస్తున్న కొందరు తారల గురించి తెలుసుకుందాం... పోలీసాఫీసర్ పాత్రలు నాగార్జునకు కొత్తేం కాదు.. ఒకప్పటి హిట్ ‘శివమణి’, రీసెంట్గా వచ్చిన ‘ఆఫీసర్’ వరకు వీలైనప్పుడల్లా నాగార్జున లాఠీ పట్టారు. కానీ కాస్త రూటు మార్చి ‘వైల్డ్‌డాగ్’లో సీక్రెట్ ఏజెంట్‌గా డ్యూటీ చేశారు నాగార్జున. మళ్లీ ‘ది ఘోస్ట్’ మిషన్ కోసం సీక్రెట్ ఏజెంట్‌గా చార్జ్ తీసుకుని ముష్కరుల వేట ప్రారంభించారు. ఈ మిషన్‌ను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఘోస్ట్ మిషన్‌లోనే మరో సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తారు కాజల్ అగర్వాల్. ఈ సినిమా కోసం నాగార్జున, కాజల్ యాక్షన్ సీక్వెన్సెస్‌కు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. తండ్రి నాగార్జున గూఢచారి పాత్ర చేస్తుంటే మరోవైపు తనయుడు అఖిల్ కూడా ఆ పాత్ర చేస్తుండటం విశేషం. ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ గూఢచారి పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ప్యాక్లోకి మారారు. అంతేకాదు.. యాక్షన్ సీక్వెన్స్, గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. మరోవైపు నిఖిల్ కూడా గన్ పట్టుకుని గూఢచారి అవతారం ఎత్తనున్నారు. ఈ మిషన్‌కు గ్యారీ బి హెచ్ డైరెక్టర్. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇక కల్యాణ్ రామ్ తాజాగా మిస్టరీ మూవీ ‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ సైన్ చేశారు. ఇందులో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నారు కల్యాణ్ రామ్. బ్రిటిష్ ఇండియా మద్రాస్ ప్రెసిడెన్సీ 1945 కాలంనాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. ఇప్పటికే ‘గూఢచారి’ చిత్రంలో సక్సెస్ఫుల్ సీక్రెట్ ఏజెంట్‌గా మెప్పించిన అడివి శేష్ మరోసారి ఆ పాత్రలో కనిపించనున్నారు. ‘గూఢచారి’కి సీక్వెల్‌గా ‘గూఢచారి 2’ చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ‘హిట్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘హిట్2’లో శేష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తారట. ‘హిట్’ తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన శైలేష్ కొలనుయే ‘హిట్ 2’ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. వీరే కాకుండా మరికొంతమంది హీరో హీరోయిన్లు కూడా సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించేందుకు సీక్రెట్‌గా కొత్త కథలు వింటున్నారు. -
'ఆమె ఓ సీక్రెట్ ఏజెంట్.. మేం వదలం'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియాన్ సామాజిక అనుసంధాన వేధిక ఇన్స్టాగ్రామ్ సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుందని ఇరాన్‌కు చెందిన నైతిక విలువల సంస్థ ఒకటి ఆరోపించింది. ఇస్లాం మతాన్ని దెబ్బతీసేలా యువకులను ఆకట్టుకునేందుకు ఆమె పలు అసభ్యకరమైన ఫొటోలను అందులో పెడుతోందంటూ ఆ సంస్థ మండిపడింది. ఈ వ్యవహారాన్ని తాము అంత తేలికగా తీసుకోవాలని అనుకోవడం లేదని కూడా స్పష్టం చేసింది. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ కు చెందిన ది ఆర్గనైజడ్ సైబర్ స్పేస్ క్రైమ్స్ విభాగం ఈ మేరకు వివరాలు తెలియజేస్తూ ఒక అజెండాలో భాగంగానే కిమ్ కార్దర్షియాన్ ఇన్ స్టాగ్రామ్ కోసం సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తుందని.. తన ఫొటోల ద్వారా యువకులను, మహిళలను ఆకర్షించడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తోందని.. ఇందుకుగాను ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా అందుతున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. ఇరాన్లో ఇన్ స్టాగ్రమ్, ఫేస్ బుక్ వాడకంపైన ఇప్పటికీ పరిమితులు ఉన్నాయి. -
సీక్రెట్ ఏజెంటుగా నయనతార
గ్లామర్ రోల్స్‌ను పక్కన పెట్టి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న నయనతార మరో ఆసక్తికరమైన పాత్రకు రెడీ అవుతోంది. ఇప్పటికే అనామిక, మాయ, నానుమ్ రౌడీదాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నయన్, నెక్ట్స్ సినిమాలో సీక్రెట్ ఏజెంటుగా కనిపించనుంది. తమిళ్లో అజిత్ హీరోగా తెరకెక్కిన బిల్లా సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చేసిన నయన్ చాలాకాలం తరువాత అదే తరహా పాత్రలో కనిపించనుంది. విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఇరు మగన్ సినిమాలో నయనతార సీక్రెట్ ఏజెంట్గానటించడానికి రెడీ అవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌లో నటించనుంది ఈ బ్యూటి. తొలిసారిగా నయన్ విక్రమ్‌తో జోడీ కడుతున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. నిత్యామీనన్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది.