USA: సీక్రెట్‌ ఏజెంట్‌ను దోచుకున్న దొంగలు | American Secret Agent Robbed At Gunpoint In America | Sakshi

అమెరికాలో విచిత్రం.. గన్‌తో బెదిరించి సీక్రెట్‌ ఏజెంట్‌ను దోచుకున్న దొంగలు

Jun 18 2024 4:36 PM | Updated on Jun 18 2024 5:47 PM

American Secret Agent Robbed At Gunpoint In America

కాలిఫోర్నియా: జేమ్స్‌బాండ్‌ సిరీస్‌ సినిమాల్లో హీరోల్లాంటి వాళ్లు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ విభాగంలో పనిచేసే ఏజెంట్లు. ఇలాంటి ఓ ఏజెంట్‌ను దొంగలు గన్‌తో  బెదిరించి మరీ దోచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. 

ఈ విచిత్ర ఘటన లాస్‌ ఏంజెల్స్‌లో జరిగింది. ఆదివారం(జూన్‌16) అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, మాజీ అధ్యక్షుడు ఒబామా కలిసి లాస్ఏంజెల్స్‌లో డెమొక్రాట్‌ల ఎన్నికల క్యాంపెయిన్‌ కోసం ఓ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడికి  భద్రత కల్పించి తిరిగి వెళుతున్న ఓ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ను టస్టిన్‌ ప్రాంతంలో దొంగలు అడ్డుకుని తుపాకీతో బెదిరించారు.  అతని వద్దనున్న బ్యాగ్‌ను దోచుకొన్నారు.  

ఈ సమయంలో ఆ సీక్రెట్‌ ఏజెంట్‌ దొంగలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సమాచారం టస్టిన్‌ పోలీసులకు అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. తమకు సీక్రెట్‌ ఏజెంట్‌ బ్యాగ్‌ దొరకలేదని,  ఏజెంట్‌ను బెదిరించి దోచుకున్న వారి ఆచూకీ ఇంకా తెలియలేదని పోలీసులు సోమవారం చెప్పారు.

‘మా సిబ్బంది ఒకరు కాలిఫోర్నియాలో దోపిడీకి గురయ్యారు. ఈ క్రమంలో అతడు  తన సర్వీస్‌ గన్‌తో ఫైరింగ్‌ కూడా చేశాడు. దొంగల కోసం గాలిస్తున్నాం’అని సీక్రెట్‌ సర్వీ‌సెస్‌ ప్రతినిధి ఆంటోనీ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement