pistol
-
USA: సీక్రెట్ ఏజెంట్‌ను దోచుకున్న దొంగలు
కాలిఫోర్నియా: జేమ్స్‌బాండ్ సిరీస్ సినిమాల్లో హీరోల్లాంటి వాళ్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగంలో పనిచేసే ఏజెంట్లు. ఇలాంటి ఓ ఏజెంట్‌ను దొంగలు గన్‌తో బెదిరించి మరీ దోచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ విచిత్ర ఘటన లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. ఆదివారం(జూన్16) అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షుడు ఒబామా కలిసి లాస్ఏంజెల్స్లో డెమొక్రాట్ల ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఓ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడికి భద్రత కల్పించి తిరిగి వెళుతున్న ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ను టస్టిన్ ప్రాంతంలో దొంగలు అడ్డుకుని తుపాకీతో బెదిరించారు. అతని వద్దనున్న బ్యాగ్‌ను దోచుకొన్నారు. ఈ సమయంలో ఆ సీక్రెట్ ఏజెంట్ దొంగలపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సమాచారం టస్టిన్ పోలీసులకు అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. తమకు సీక్రెట్ ఏజెంట్ బ్యాగ్ దొరకలేదని, ఏజెంట్‌ను బెదిరించి దోచుకున్న వారి ఆచూకీ ఇంకా తెలియలేదని పోలీసులు సోమవారం చెప్పారు.‘మా సిబ్బంది ఒకరు కాలిఫోర్నియాలో దోపిడీకి గురయ్యారు. ఈ క్రమంలో అతడు తన సర్వీస్ గన్‌తో ఫైరింగ్ కూడా చేశాడు. దొంగల కోసం గాలిస్తున్నాం’అని సీక్రెట్ సర్వీసెస్ ప్రతినిధి ఆంటోనీ తెలిపారు. -
గన్ మిస్‌ఫైర్.. డీఎస్పీ మృతి
సాక్షి,భద్రాద్రికొత్తగూడెంజిల్లా: సీఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్‌ఫైర్ అయి డీఎస్పీస్థాయి అధికారి శేషగిరి మృతి చెందినట్లు తెలుస్తోంది. చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామంలోని క్యాంపులో బుధవారం(ఏప్రిల్24) ఈ ఘటన జరిగింది. పూసుగుప్ప సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ క్యాంపులో శేషగిరి విధులు నిర్వహిస్తున్నారు. ఛాతిలోకి బుల్లెట్ దూసుకెవెళ్లడంతో శేషగిరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇది మిస్‌ఫైరా లేక ఆత్మహత్యనా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు వివరాలు గోప్యంగా ఉంచడంతో ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
సీఎం సిద్ధరామయ్య ర్యాలీలో తుపాకీతో హల్చల్
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలో పాల్గొన్న లోక్‌సభ ఎన్నికల ర్యాలీ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నడుముకు తుపాకీ పెట్టుకొని సీఎం ప్రచార ర్యాలీ వాహనంపైకి ఎక్కి హల్చల్ చేశాడు. బెంగళూరులో రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి సౌమ్య రెడ్డి తరఫును సీఎం సిద్ధరామయ్య ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రచార ర్యాలీలో ఒక చోట ప్రచారం వాహనంపైకి ఎక్కి ఆ వ్యక్తి మంత్రి రామలింగారెడ్డి, లోక్‌సభ అభర్థి సౌమ్యరెడ్డికి పూలమాలలు వేశాడు. ఆ పక్కనే సీఎం సిద్ధరామయ్య కూడా ఉన్నారు. అయితే ఆ వ్యక్తి పూలమాల వేస్తున్న సమయంలో అతని నడుముకు తుపాకీ ఉండటం అందరినీ భయాందోళనకు గురిచేసింది. Major security breach. The man with the katta onboard the same vehicle as Karnataka CM Siddaramiah is a congress worker. The gun wielding man garlanded the Transport Minister Ramalinga Reddy standing next to him. pic.twitter.com/OnyK4gWH7R — Sneha Mordani (@snehamordani) April 9, 2024 అయితే గన్ ధరించిన వ్యక్తిని రియాజ్‌గా పోలీసులు గుర్తించారు. ఆత్మరక్షణ కోసమే అతను కొన్నేళ్ల నుంచి తుపాకీని వెంటపెట్టుకుంటున్నాడని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో లైసెన్సెడ్ గన్లను సైతం పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో సైతం గన్ పోలీసులకు అప్పగించకుండా మినహాయింపు పొందాడట. ‘బెంగళూరులోని విల్సన్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంతో రియాజ్‌పై పలు దాడులు జరిగాయి. ఈ నేపథ్యలోనే ఆత్మ రక్షణ కోసం అతను గన్ వెంటపెట్టుకుంటున్నాడు. ఆ తుపాకీ సంబంధించిన లైసెన్స్ కూడా ఉంది’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. సీఎం సిద్ధరామయ్యకు పోకిరిలు, రౌడీలు పూలమాలలు వేస్తారని చూపించేందుకే ఈ ఘటన జరిగిందని బీజేపీ దుయ్యబట్టింది. -
పిస్టల్‌తో పారిపోయిన రేపిస్టు... ఎట్టకేలకు అదుపులోకి
నోయిడా: ఒక కస్టమర్‌పై ఆమె ఫ్లాట్‌లో అత్యాచారానికి పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకున్న డెలివరీ బాయ్ ఆదివారం ఎట్టకేలకు మళ్లీ చిక్కాడు. నోయిడాకు చెందిన డెలివరీ బాయ్ సుమిత్ శర్మ శుక్రవారం ఒక స్థానిక అపార్ట్మెంట్లో పార్సిల్ డెలివరీ సందర్భంగా ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో పోలీసులు శనివారం అతన్ని ఖరీపుర్లో అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే దారిలో అతను పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని పారిపోయాడు. దాంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి అతనికోసం వేట సాగించారు. ఎట్టకేలకు వారి కంటబడ్డ సుమిత్ కాల్పులకు దిగాడు. పోలీసుల కాల్పుల్లో కాలికి తూటా దిగి పట్టుబడ్డాడు. అతనికి, సోదరునికి నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
పరకాలలో ఫైరింగ్ కలకలం
సాక్షి, హన్మకొండ జిల్లా: పరకాలలో ఫైరింగ్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన బిల్డర్ తిరుపతిరెడ్డి లైసెన్స్ తుపాకితో గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఐదురోజుల క్రితం కాల్పుల ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. తుపాకీని సీజ్ చేశారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లైసెన్స్ తుపాకీతో సంవత్సరికం పంక్షన్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి గాలిలోకి కాల్పులు జరిపాడని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. నిందితున్ని కోర్టులో హాజరుపర్చిగా న్యాయస్థానం రిమాండ్ విధించిందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం డాక్టర్ దుర్మరణం -
బైక్ డ్రైవింగ్ చేస్తూ.. పిస్టల్‌తో హల్చల్ చేసిన యువకులు..
యశవంతపుర(బెంగళూరు): పిస్టల్ చేతపట్టి బైక్‌పై వీలింగ్ చేస్తున్న ఇద్దరు యువకులను హాసన పోలీసులు అరెస్ట్ చేశారు. హాసన రింగ్‌రోడ్డులో ఇద్దరు యువకులు బుల్లెట్ బైకుపై వీలింగ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కాగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే ప్రీతంగౌడ మద్దతుదారులు సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్ పెట్టారు. చదవండి: పూణే రైల్వే స్టేషన్లో దారుణం.. కనుమరుగైన మానవత్వం.. -
సినిమా స్టైల్ క్రైం స్టోరీ : ‘ముక్కోటి’కి ముందురోజే ముహూర్తం..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/మానకొండూరు: కాల్పుల మోతతో మానకొండూరు ఉలిక్కిపడింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పల్లెలో తుపాకులు గర్జన విని జనం భీతిల్లారు. రౌడీషీటర్ అరుణ్‌పై కత్తులు, తుపాకులతో జరిగిన హత్యాయత్నం జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నేరచరిత్ర కలిగిన అరుణ్ ఆది నుంచి వివాదాస్పదుడే. వరుసగా ఇతనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గత సీపీ సత్యనారాయణ ఇతనికి కమిషరేట్ నుంచి బహిష్కరణ విధించారు. ఇటీవల కమిషనరేట్ బహిష్కరణ పూర్తిచేసుకుని వచ్చిన అరుణ్‌పై తుపాకులతో హత్యాయత్నం జరగడం గమనార్హం. వాస్తవానికి ఈ ఘటనకు బీజం ఇప్పుడు పడింది కాదు, పాత కక్షల నేపథ్యంలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశికి ముందురోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో ప్రధాన నిందితుడు సాయితేజ్ హనుమాన్ ఆలయంలోనే అరుణ్‌ని చంపుతానని ప్రతినబూనాడు. వస్తూనే దాడి.. కాల్పులు ● పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో ఉండే వీణవంక సాయితేజ్ ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ముందురోజు రాత్రి (నూతన సంవత్సరం రోజు) జీఎం కాలనీలోని హనుమాన్ గుడిలో తన సోదరి మరణానికి కారణమైన ‘మానకొండూరు అరుణ్ గాని తలకాయ కోసి.. జీఎం కాలనీ చౌరస్తాలో పెట్టకపోతే నేను సూరి కొడుకునే కాదు’ అని శపథం చేశాడు. ● ఈ విషయాన్ని పలువురు స్థానికులు వీడియో కూడా తీశారు. ఇప్పుడు ఈ వీడియో కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో ‘సాక్షి’ చేతికి చిక్కింది. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తున్న సాయి.. బుధవారం అర్ధరాత్రి తన మిత్రులు భువనగిరి జిల్లా దత్తారుపల్లికి చెందిన పాల మల్లేశ్, మానకొండూరు మండలం కెల్లెడ గ్రామానికి చెందిన బైరగోని మధు, గోదావరిఖనికి చెందిన చంటితో కలిసి రాత్రి 9 గంటల సమయంలో వాహనంలో మానకొండూరుకు వచ్చాడు. ● వెల్ది గ్రామానికి వెళ్లే మార్గం నుంచి వీరు గ్రామంలోకి తుపాకీ, కత్తులతో వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు 9.30 గంటల సమయంలో అరుణ్ తన ఇంటి ముందు సోదరులతో కలిసి మద్యం తాగుతుండగా.. వీరికి తారసపడ్డాడు. వారిని చూడగానే భయంతో అరుణ్ పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. ● అతడిని వెంబడించిన నలుగురు బీరు బాటిళ్లతో దాడిచేశారు. అడ్డువచ్చిన అరుణ్ భార్య సుమ, పెద్ద కూతురు వైష్ణవిని తుపాకీ చూపించి తీవ్రంగా కొట్టారు. పారిపోతున్న అరుణ్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరపగా గురితప్పాయి. ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నాడు. అరుణ్‌పై కోపంతో సదరు ఇంట్లోని ఐదుగురు కుటుంబసభ్యులను విచక్షణారహితంగా, రక్తాలు కారేలా కొట్టారు. ● వీరి అరుపులు విన్న స్థానికులు వచ్చారు. వచ్చిన వారిని తుపాకీ చేతబూనిన వ్యక్తి బెదిరించి పంపాడు. తరువాత చాలామంది రావడంతో సాయితేజ్ పరారు కాగా.. పాలమల్లేశ్, మధును పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. ● పేలని బుల్లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడింది కంట్రీమేడ్ తుపాకీ (తపంచా) అని తూటా ఆధారంగా నిర్ధరణకు వచ్చారు. మరో నిందితుడు చంటి కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడని సమాచారం. తనకు సంబంధం లేదంటున్న అరుణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నిందితులు గోదావరిఖనికి చెందిన సాయితేజ్, చంటి, మరో ఇద్దరు మిత్రులు అని వెల్లడించాడు. ఎందుకు దాడి చేశారు..? అని అడిగిన ప్రశ్నకు.. తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అని, తనకువారితో ఎలాంటి సంబంధమూ లేదని, వారు గంజాయి విక్రయిస్తారని తెలిపాడు. సంబంధం లేని వ్యక్తి చేసే పని, చిరునామా, పేరుతో సహా ఎలా తెలపగలిగాడు..? అన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు. అతనికి సాయితేజకు ఉన్న వైరం ఏంటీ..? అతని సోదరి మరణంలో అరుణ్ ప్రమేయం ఎంతవరకు ఉంది..? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నిందితులకు, బాధితుడికి నేరచరిత ఉన్న విషయం వాస్తవమేనని, అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ సీపీ ఎల్.సుబ్బారాయుడు ‘సాక్షి’కి తెలిపారు. నిందితుల కోసం మొత్తం మూడు బృందాలు సాయి కోసం గాలిస్తున్నాయి. ఇందులో రెండు హైదరాబాద్‌కు వెళ్లగా.. ఒక టీం గోదావరిఖనికి వెళ్లినట్లు సమాచారం. బిహార్ నుంచి ఆయుధం..? ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయికి ఆయుధం ఎక్కడిది..? అన్న విషయంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తుపాకీ కాల్చడంలో నిందితులకు అనుభవం లేదని తాజా ఘటనతో తేలిపోయింది. బుల్లెట్లు వేగంగా లోడు చేయలేకపోవడం.. గురిచూసి కాల్చలేకపోయిన విధానాన్ని బట్టి నిందితులు ఇటీవలే తుపాకీ కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చారు. రెండు నెలల క్రితం ఓ కేసు విషయంలో సాయి సెల్లోకేషన్ బిహార్‌లో చూపించిందని గోదావరిఖని పోలీసులు తెలిపారు. అదే సమయంలో అతను కాశీయాత్రకు వెళ్లి వచ్చాడని గుర్తుచేసుకుంటున్నారు. దీంతో సాయికి బిహార్‌లో మిత్రులు ఉండి ఉంటారని, వారి ద్వారానే ఆయుధం కొని ఉంటాడని అనుమానిస్తున్నారు. మాట్లాడకుండానే.. దాడి చేశారు.. మానకొండూర్‌లో ఉన్న మా అత్త గారింటికి నా పిల్లలను చూసేందుకు వచ్చాను. బుధవారం రాత్రి అన్నం తిని బయట ఉండగా గొడవ అవుతోంది. ఈ లోగానే అరుణ్ మా ఇంటి వైపు వచ్చాడని కొందరు మా ఇంటివైపు పరుగు తీసుకుంటూ వచ్చారు. వాడేడి అంటూ ఆగ్రహంతో నాపై స్టీలు ప్యాల క్యాన్‌తో దాడి చేశారు. తల పగిలి రక్తస్రావం జరిగింది. ఇంట్లో వాళ్లపై దాడి చేశారు. ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. తర్వాత భయాందోళనతో చాలా సేపు తలుపు వేసుకుని ఇంట్లోనే ఉన్నాం, పోలీసులు వచ్చాక బయటకు వచ్చా. – బీరం శ్రీనివాస్, గాయపడ్డ వ్యక్తి -
చిన్నారి హ్యాండ్ బ్యాగ్‌లో తూటా కలకలం
తిరువొత్తియూరు(చెన్నై): ఇజ్రాయేల్ పర్యాటనకు వెళ్లి బెంగళూరుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న విశ్రాంత యూనియన్ అధికారి మనవరాలి హ్యాండ్ బ్యాగ్‌లో తుపాకీ తూటాలు ఉండడం కలకలం రేపింది. కర్ణాటకకు చెందిన కృష్ణాదుబ్ (64) ప్రభుత్వ శాఖలో ఉన్నతాధికారిగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఇజ్రాయేల్ పర్యాటనకు వెళ్లి వచ్చారు. పలు ప్రాంతాలు చూసి దుబాయ్ మార్గంగా ఆదివారం ఉదయం చెన్నైకి వచ్చారు. అనంతరం బెంగళూరు వెళ్లడానికి చెన్నై స్వదీశీ విమానాశ్రయానికి వచ్చారు. భద్రతా అధికారులు తనిఖీ చేయగా అందులో తుపాకీ తూటా ఒకటి కనిపించింది. ఆ తూటాను స్వాధీనం చేసుకుని కృష్ణ దుబ్ ప్రయాణాన్ని రద్దు చేసి, అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆ తుపాకీ తూటా పెద్ద తుపాకీ 9 ఎంఎం రకంలో ఉపయోగించేదని తెలిసింది. వారిని హెచ్చరించి వదిలేయడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. చదవండి: Ashwini Dutt: మహానటిలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడానికి కారణం అదే.. -
గదిలో తల్లి శవం.. దోస్తులతో ఎగ్ కర్రీ దావత్
సమాజంలో మైనర్ సంబంధిత నేరాలు పక్కదోవ పట్టడానికి కారణాలు అనేకం. అందునా తల్లిదండ్రుల నిఘా లేకపోవడం వల్లే జరుగుతున్నాయంటూ విమర్శించేవాళ్లు లేకపోలేదు. కానీ, తల్లిదండ్రుల మంచి మాటల్ని పెడచెవిన పెట్టడమే కాదు.. మందలిస్తే వాళ్లపై దాడులకు తెగబడుతోంది ఇప్పటి యువతరం. తాజాగా ఆన్లైన్ గేమ్ ఆడొద్దు అన్నందుకు కన్నతల్లినే కడతేర్చాడు ఓ తనయుడు. యూపీ లక్నోలో జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లి మందలింపుతో క్షణికావేశంలో తండ్రి తుపాకీ తీసుకుని ఘాతుకానికి పాల్పడ్డాడు సదరు టీనేజర్. అయితే ఈ ఘటనలో.. విస్తుపోయే విషయాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మొబైల్లో పబ్జీ ఆడుతూ కనిపించాడు సదరు మైనర్(16). అది చూసి పట్టరాని కోపంతో తల్లి సాధన(40) మందలించింది. దీంతో అతనిలోనూ కోపం కట్టలు తెంచుకుంది. ఇంట్లో బీరువాలో ఉన్న తన తండ్రి సర్వీస్ రివాల్వర్‌తో తల్లిని కాల్చేశాడు. తల్లిని చంపాక ఓ గదిలో ఆమె శవాన్ని ఉంచి తాళం వేశాడు. ఆ శబ్దానికి నిద్రిస్తున్న అతని సోదరి(10) లేచింది. భయంతో అరిచే ప్రయత్నం చేసింది. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మరో గదిలో ఉంచి తాళం వేశాడు. ఆపై ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. ఆన్లైన్లో ఎగ్‌కర్రీ, ఫుడ్, కూల్డ్రింకులు ఆర్డర్ చేసుకుని.. సినిమాలు చూస్తూ దోస్తులతో దావత్ చేసుకున్నాడు. తల్లి గురించి అతని స్నేహితులు ఆరాతీయగా.. బంధువుల ఇంటికి వెళ్లిందని కహానీ చెప్పాడు. అలా రెండు రోజులు గడిచింది. మృతదేహాం దుర్వాసన వస్తుండడంతో రూమ్‌ఫ్రెష్‌నర్ స్ప్రే చేశాడు. అయినా కూడా కుళ్లిన కంపు పొరుగిళ్లకు చేరింది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఎంట్రీతో ఈ దారుణం బయటపడింది. గదిలో బంధించడంతో స్పృహ కోల్పోయిన మృతురాలి కూతురిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి బాగానే ఉంది. ఇదిలా ఉంటే.. ఆ కుర్రాడి తండ్రి ఆర్మీ అధికారి. ప్రస్తుతం బెంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే సర్వీస్ రివాల్వర్‌ను మాత్రం ఇంట్లోనే ఉంచి వెళ్లారాయన. చదవండి: గేమ్ ఆడొద్దు బిడ్డా అంటే.. -
పబ్జీ గేమ్ ఆడొద్దు బిడ్డా అంటే.. కోపంతో ఊగిపోయి, తండ్రి పిస్టల్ తీసుకుని
లక్నో: పిల్లలకి ఆటలంటే చాలా ఇష్టం. అయితే ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఆన్లైన్ ఆటలను పిల్లలు ఆడటమే కాదు వాటికి బానిసలా మారుతున్నారు. ఎంతలా అంటే వీటి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడకుండా అడ్డుకున్నందుకు ఏకంగా తన తల్లినే కాల్చి చంపాడు ఓ మైనర్ బాలుడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల కొన్ని నెలలుగా ఓ మైనర్ బాలుడు ఆన్లైన్ గేమ్ పబ్జీని ఆడటం ప్రారంభించాడు. అయితే రాను రాను అన్ని పనులను, చదువుని పక్కన పెట్టి ఈ గేమ్‌ను ఆడుతూ ఉండేవాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి అతడిని పబ్జీ ఆడవద్దని సూచించేది. అయితే బాలుడు ఆడుతున్న ప్రతి సారి తన తల్లి గేమ్ వద్దని వారించడంతో కోపంతో ఊగిపోయాడు. దీంతో బాలుడు క్షణికావేశంలో తన తండ్రి పిస్టల్ తీసుకుని తల్లిని కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: హైదరాబాద్ టెకీ పాడుపని.. ఇన్‌స్టాలో యువతులకు వీడియో కాల్ చేసి.. -
ఒంటరిగా ఉన్న యువతి ఇంట్లోకి వెళ్లి.. పిస్తోల్‌తో బెదిరించి..
బనశంకరి(బెంగళూరు): ఇంట్లో అద్దెకు ఉండే యువతిని పిస్తోల్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఇంటి యజమానిని ఆదివారం అశోక్‌నగర పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన అనిల్ రవి శంకర్‌ప్రసాద్ నిందితుడు. టైల్స్ వ్యాపారం కోసం ఇతను నగరంలో ఉంటున్నారు. ఇతని ఇంట్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి గత మార్చి నుంచి బాడుగకు ఉంటోంది. ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న యువతి ఇంటికి తరచూ స్నేహితులు వస్తుండటంతో అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిరోజుల క్రితం యువతి స్నేహితుడితో కలిసి ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని కేసు పెట్టిస్తానని బెదిరించాడు. ఏప్రిల్ 11న యువతి ఇంటిలోకి వచ్చిన అనిల్ తన లైసెన్స్ రివాల్వర్‌తో వచ్చి బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: ప్రేమను చంపుకోలేక.. ప్రాణం తీసుకుంది -
నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్‌లో పిస్టల్ కొన్న సురేష్‌రెడ్డి!
నెల్లూరు (క్రైమ్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తాటిపర్తిలో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో కావ్యారెడ్డిని పిస్టల్‌తో కాల్చి, ఆపై సురేష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సురేష్‌రెడ్డి బిహార్‌లో పిస్టల్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు నిమిత్తం మంగళవారం అక్కడికి వెళ్లారు. సురేష్‌రెడ్డి సెల్ఫోన్లను సీజ్చేసిన పోలీసులు అతడు మాట్లాడిన, చాటింగ్ చేసిన వారి వివరాలు, మెస్సేజ్‌లు సేకరించి ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. అతడి స్నేహితుల వివరాలు సేకరించి పిస్టల్‌పై ఆరాతీస్తున్నారు. çఏడాదిన్నరగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న అతడు గత ఏడాది డిసెంబర్లో సుమారు 20 రోజులు బిహార్‌లో ఉన్నాడని, ఆ సమయంలోనే పిస్టల్ కొనుగోలు చేశాడని గుర్తించినట్లు తెలిసింది. సాంకేతికతను వినియోగించి ఎవరివద్ద కొనుగోలు చేశాడో కూడా తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం బిహార్ వెళ్లారు. పిస్టల్ అమ్మిన వ్యక్తిని పట్టుకుని నెల్లూరు తీసుకొస్తారని తెలిసింది. కొందరు పోలీసులు ముంబై కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. ఐదోసారి తూటా పేలి.. సురేష్‌రెడ్డి వినియోగించిన పిస్టల్ 7.5 ఎంఎంగా గుర్తించారు. మ్యాగజిన్ సామర్థ్యం 9 బుల్లెట్లు. దా న్లో ఏడు బుల్లెట్లు మాత్రమే ఉంచి నట్లు పోలీసు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కావ్యారెడ్డిపై మొదటిసారి కాల్పులు జరపగా ఆమె తప్పించుకుందని, మరో మూడుసార్లు కాల్చినా తూటాలు పేలలేదని, అయిదోసారి కాల్చడంతో తూటాపేలి కావ్యారెడ్డి తలలోకి దూసుకూళ్లిందని భావిస్తున్నారు. మిస్సయిన, పేలని తూటాలను ఘటనాస్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సురేష్‌రెడ్డి ఆరో రౌండ్ కాల్చుకుని మృతిచెందాడు. ఏడో బుల్లెట్ పిస్టల్‌లోనే ఉంది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బుల్లెట్లపై నంబర్లను బట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం.. కావ్యారెడ్డి, సురేష్‌రెడ్డి మృతదేహాలకు నెల్లూరు జీజీహెచ్‌లో ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు శవపంచనామా, వైద్యులు పోస్టుమార్టం చేశారు. తాటిపర్తిలో రెండు కుటుంబాల నడుమ వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
Viral Video: రోడ్డుపై తుపాకీతో తిరుగుతోన్న మహిళా టీచర్.. అరెస్ట్
లక్నో: రోడ్డుపై తుపాకీ పట్టుకొని తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కరిష్మా సింగ్ యాదవ్ అనే మహిళా ఫిరోజాబాద్‌లోని పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. పని నిమిత్తం మంగళవారం ఆమె మెయిన్‌పురీకి వెళ్లింది. అయితే కొత్వాలీ ప్రాంతంలో మహిళ నాటు తుపాకీ జేబులో పెట్టుకొని తిరుగుతుండటం గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను పరీక్షించి ఆమె వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ మహిళా కానిస్టేబుల్.. కరిష్మా యాదవ్‌ను తనిఖీ చేసి ఆమె జీన్స్ జేబులో నుంచి 315 బోర్ కంట్రీ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తుంది. అనంతరం మహిళను అదుపులోకి తీసుకొని ఆమెపై కేసు నమోదు చేశారు. మహిళపై అక్రమాయుధాల కేసు నమోదు చేసినట్లు మెయిన్‌పురీ ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు. ఆమె తుపాకీతో ఎందుకు వెళ్తున్నది, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది, తుపాకీ ఎక్కడి నుంచి లభించిందనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: అదిరిన కోతి నడక.. అచ్చం మనిషిలాగే UP: Police caught a teacher walking around in #Mainpuri with a gun in jeans, video went viral #Bulldozer #BeastDisaster pic.twitter.com/7Op3C5Gydh — प्रिया यादव (@yadav4priya) April 13, 2022 -
తుపాకీ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
సాక్షి, మియాపూర్: ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తుపాకీ తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏసీపీ కృష్ణప్రసాద్ వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన గౌతమ్ కుమార్ ఠాకూర్ అమీన్పూర్లో ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బీహార్‌కు చెందిన వికాస్ అనే వ్యక్తి నుంచి రూ.20 వేలకు దేశీ తుపాకీ(7.65) తీసుకువచ్చి మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకునేందుకు పథకం పన్నాడు. దీనిపై సమాచారం అందడంతో మియాపూర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. బొల్లారం రోడ్డులో ఆటోలో వస్తున్న గౌతమ్‌కుమార్ ఠాకూర్‌ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి లైసెన్స్ లేని పిస్తొల్, మూడు బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సీఐ తిరుపతిరావు, ఎస్ఓటీ పోలీసులు నర్సింహారెడ్డి, ఎస్ఐ యాదగిరిరావు, డీఐ కాంతారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (చదవండి: కొలనుపాకలో నాలుగడుగుల జైన పాదం) -
నగర పోలీసు కమిషనరేట్‌లో కీలక నిర్ణయం.. ఇకపై ఆ లైసెన్సుల జారీ కఠినతరం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆయుధ లైసెన్సుల జారీ విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుదారుడిని ఇంటర్వ్యూ చేసిన తర్వాతే దరఖాస్తును ఆమోదించనున్నారు. లైసెన్సుల జారీలో లోపాలను సరిచేయడం, పారదర్శకత పెంచడం, దుర్వినియోగాన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. అనునిత్యం బిజీ షెడ్యూల్లో ఉండే కొత్వాల్ ఆనంద్ ఈ ఇంటర్వ్యూల కోసం ప్రతి రోజూ నిర్ణీత సమయాన్ని కేటాయిస్తున్నారు. మూడు కేటగిరీలుగా జారీ.. ►సాధారణంగా తుపాకీ ఖరీదు చేసుకోవడానికి, కలిగి ఉండటానికి లైసెన్సును మూడు కేటగిరీల్లో జారీ చేస్తుంటారు. వ్యక్తిగత భద్రత, సెక్యూరిటీ గార్డులు, ఫైరింగ్ వంటి క్రీడలకు సంబంధీకులకు వీటిని ఇస్తుంటారు. నగర పరిధిలో నివసిస్తున్న క్రీడాకారులతో పాటు వ్యాపారులు, ప్రముఖులు, సెక్యూరిటీ గార్డులకు వీటి జారీ అధికారి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న పోలీసు కమిషనర్‌కు ఉంది. ►ఆయుధ చట్టంలో 2020లో వచ్చిన సరవణ ప్రకారం వ్యక్తిగత భద్రత కేటగిరీలో గరిష్టంగా రెండు తుపాకులు మాత్రమే కలిగి ఉండాలి. అంతకుమించి ఉన్న వారి నుంచి నగర పోలీసులు రెండేళ్ల క్రితం డిపాజిట్ చేయించారు. వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఆయుధ లైసెన్సు తీసుకున్న కొందరు దాన్ని క్రీడలు లేదా సెక్యూరిటీ విధులు వంటి వాటికి వినియోగిస్తుంటారు. ఇలా చేయడం ఆయుధ చట్టం ప్రకారం నేరమే అవుతుంది. గతంలో ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర లేనివారికే.. ►ఆయుధ లైసెన్సు కోసం నగరవాసి చేసుకున్న దరఖాస్తు దస్త్రంపై పోలీసుస్టేషన్, ఏసీపీ కార్యాలయం, డీసీపీ కార్యాలయం, సంయుక్త పోలీసు కమిషనర్ కార్యాలయాలు తొలుత ఆమోదముద్ర వేస్తాయి. ఎలాంటి నేరచరిత్ర లేని వారికే మంజూరుకు అనుమతిస్తాయి. ఇప్పటి వరకు ఇలా వస్తున్న దరఖాస్తు ఫైళ్లపై కొత్వాల్ ప్రాథమిక పరిశీలన చేసి సంతకం చేస్తూ లైసెన్సు జారీ చేస్తారు. దీని ఆధారంగా అనుమతి పొందిన క్యాలిబర్, సంఖ్యలో ఆయుధాలను లైసెన్సుదారు ఖరీదు చేసుకుంటారు. ►ఇటీవల కాలంలో లైసెన్స్డ్ ఆయుధాలు కలిగి ఉడటమనేది అవసరమున్నా లేకపోయినా స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. ఇదే కొన్నిసార్లు అపశ్రుతులకు దారి తీస్తోంది. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు మాత్రమే ఈ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయుధ లైసెన్సులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో వివిధ స్థాయిల్లో పోలీసులపై ఒత్తిళ్లు, ప్రలోభాలకు ఆస్కారం ఏర్పడుతోంది. వీటిని అన్ని సందర్భాల్లోనూ కింది, మధ్య స్థాయి అధికారులు పట్టించుకోకుండా ఉండలేరు. ప్రలోభాల కంటే ఒత్తిళ్లే ఎక్కువగా పని చేస్తుంటాయి. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే.. ►ఇలాంటి అంశాలకు ఆస్కారం లేకుండా నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయుధ లైసెన్సు దస్త్రం వివిధ స్థాయిలను దాటి తన వద్దకు చేరాక దాన్ని పరిశీలించే సమయంలో దరఖాస్తుదారుడిని ముఖాముఖీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ►దరఖాస్తు చేసుకున్నది ఎవరు? ఏ అవసరం కోసం అప్లై చేశారు? నిజంగా వారికి ఆయుధం కలిగి ఉండాల్సిన అవసరం ఉందా? తదితర అంశాలను ఆయనే స్వయంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటున్నారు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే లైసెన్సు జారీ చేస్తున్నారు. ►నగరవాసులు పోలీసు కమిషనర్‌ను నేరుగా కలవడానికి ప్రతి రోజూ విజిటింగ్ అవర్స్ ఉంటాయి. వీటిని కొత్వాల్ సీవీ ఆనంద్ పక్కాగా అమలు చేస్తున్నారు. ఆ సమయంలోనే ఆయుధ లైసెన్స్ దరఖాస్తుదారులనూ ఇంటర్వ్యూ చేయడానికీ కొంత కేటాయిస్తున్నారు. -
తమ్ముడి నిర్వాకం... సొంత అక్కపైనే అఘాయిత్యం
18-year-old youth shoots sister: చెడు అలవాట్లకు బానిసైన వాళ్లను దారిలో పెట్టెందుకు కుటుంబ సభ్యులు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఒక్కసారి కౌన్సిలింగ్‌లకు పంపించి మరీ సరైన మార్గంలో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. అయితే వాళ్లు సహకరిస్తేనే ఏదైన చేయగలం. మరికొంత మందికి అవి చెవికి ఎక్కవు, పైగా కక్ష పెంచుకుని ఎంతటి దుర్మార్గానికైన ఒడికట్టేందుకు ప్రయత్నిస్తారు. అచ్చం అలాంటి ఘటనే గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో హర్ధోయి ప్రాంతంలోని 32 ఏళ్ల వివాహిత సోదరుడు తాగుడికి బానిసై అందర్నీ దూషించడం వంటి పనులు చేస్తుంటాడు. దీంతో విసిగిపోయిన ఆమె తన తమ్ముడుని తాగడం మానేయమని హితవు చెప్పింది. ఇలా అందర్నీ దూషించడం సరికాదని చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసలే తాగి ఉన్నాడమే ఆ మైకంలో ముందు వెనుక చూడకుండా పిస్టల్ తీసుకుని తన అక్కనే అతి దారుణంగా కాల్చి చంపి అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులకు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్నారు. ఈ మేరకు నిందుతుడిని షహబెరి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యోగేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
పాఠశాలలో పిస్తోల్ కలకలం.. తరగతి గదులను మాస్టారు ఆధీనంలోనే ఉంచుకుని..
భువనేశ్వర్: సంబల్పూర్ జిల్లా, జొమొనొకిరా సమితి, రెంగుముండా ప్రాథమికోన్నత పాఠశాలలోని ఓ తరగతి గదిలో నాటు పిస్తోలు లభించడం చర్చనీయాంశమైంది. సోమవారం ఉదయం తరగతి గది శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్యకర్తలకు అక్కడి పిస్తోలు కనిపించింది. వీరు ఈ విషయం ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీకాంత్ బాగ్ దృష్టికి తీసుకువెళ్లారు. నిన్నమొన్నటి వరకు ఈ పిస్తోలు లభించిన తరగతి గది సహాయ ఉపాధ్యాయుడు గోవిందు భొయి ఆధీనంలో ఉండేది. ఇక్కడి నుంచి బదిలీ అయ్యేంత వరకు పాఠశాలలో రెండు తరగతి గదులను ఆయన తన ఆధీనంలోనే ఉంచుకుని, వినియోగించారు. తనకు వేరే చోటుకు బదిలీ అయిన తర్వాత ఆ గది తాళాలు అప్పగించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాళాలు తెరిచి, గది శుభ్రం చేస్తుండగా ఈ పిస్తోలు తారసపడినట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. (చదవండి: పెద్దాయన పబ్లిసిటి పిచ్చి.. తిక్క కుదిర్చిన కన్సుమర్ కోర్టు ) -
నాది వాటర్ పిస్టల్ కాదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్సెస్ దోపిడి దొంగ
జైపూర్: జగన్ గుర్జార్ అనే దోపిడి దొంగ హత్య, అపహరణ, లూటీలు, దోపిడిలకు సంబంధించి సుమారు 120కి పైగా కేసులు ఎదుర్కొంటున్నాడు. అయితే ఇటీవలే ధోల్పూర్ ఎమ్మెల్యేను బెదిరించినందుకు గానూ రాజస్థాన్ పోలీసులు అతనిపై మరింత నిఘా పెట్టారు. గత నెల ధోల్పూర్లోని కొంతమంది దుకాణదారులతో గుర్జర్‌కు గొడవ జరిగినప్పుడు ఈ వివాదం ప్రారంభమైనట్లు సమాచారం. అంతేకాదు దుకాణదారులను భయపెట్టేందుకు గుర్జర్ గాల్లోకి కూడా కాల్పులు జరిపాడని స్థానికులు చెప్పారు. దీంతో వ్యాపారులు పోలీసులకు, గిరిరాజ్ మలింగకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తన గురించి వెతుకుతున్నారని తెలుసుకుని ఆగ్రహంతో ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగను బెదిరిస్తూ ఒక వీడియోని విడుదల చేశాడు. ఆ వీడియోలో.. "కాంగ్రెస్ నాయకుడిని దుర్భాషలాడుతూ కనిపించాడు. అంతేకాదు మలింగ ఒక వ్యక్తిని చంపమని తనను అడిగాడని పేర్కొన్నాడు. పైగా ఆ వ్యక్తిని జస్వంత్ ఎమ్మెల్యే అని, కానీ తాను అతన్ని చంపలేదని కూడా చెప్పాడు. అంతేకాదు తనను ఎటువంటి భద్రతా లేకుండా ఎదుర్కొవాలంటూ ఎమ్మెల్యేకి ఒక సవాలు కూడా విసిరాడు". అయితే బారీ ఎమ్మెల్యే ఆ ఆరోపణలను ఖండించాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కూడా ప్రతిస్పందనగా దోపిడి దొంగను ఉద్దేశించి ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో ఆ ఎమ్మెల్యే మాట్లాడుతూ...నేను ఎటువంటి పోలీసు రక్షణ తీసుకోలేదు. నేను అతని కోసం ఎదురుచూస్తున్నాను. అతను మగాడైతే నా ఇంటికి వచ్చి నన్ను ఎదుర్కోవాల అని ఒక కౌంటర్ వీడియో విడుదల చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మలింగ మాట్లాడుతూ...ఈ వ్యక్తులు స్థానిక గుండాలు. పైగా నా ప్రజలను బెదరిస్తూ ఉంటే చూస్తూ కూర్చోను. నా దగ్గర ఉన్నది వాటర్ పిస్టల్ కాదు అని ఆగ్రహంగా చెప్పారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు మాట్లాడుతూ..జగన్ గుర్జర్‌ను అరెస్టు చేసిన వారికి రూ. 50 వేల రివార్డ్‌ను ప్రకటించాం. మేము అతని ఆచూకి కోసం చంబల్, మోరెనాలో వెతుకుతున్నాము. అతన్ని త్వరలోనే అరెస్టు చేస్తాం. అని ధోల్పూర్ పోలీసు సూపరింటెండెంట్ శివరాజ్ మీనా చెప్పారు. (చదవండి: మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో) -
నేరాలు చేద్దామని తుపాకీ కొన్నాడు.. కానీ
సాక్షి, హైదరాబాద్: దినసరి కూలీతో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తుపాకీ కొనుగోలు చేశాడు. దాంతో దారినపోయే వారిని బెదిరించి దోపిడీలు చేయాలని పక్కా ప్రణాళిక వేశాడు. అయితే అతడి ప్లాన్‌ను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు పటాపంచలు చేశారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న మహ్మద్ హుస్సేన్‌ను గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 9 ఎంఎం పిస్టల్, ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చార్మినార్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఇటీవలే రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లిలోని రోషన్ కాలనీకి మకాం మార్చాడు. రోజు వారి కూలీ డబ్బులు చాలకపోవడంతో దోపిడీలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 9 ఎంఎం తుపాకీ, మేగజైన్, ఆరు బుల్లెట్లను కొనుగోలు చేశాడు. అయితే దోపిడీలకు పాల్పడక ముందే ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు అతడిపై సమాచారం అందింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలకుంట చెక్‌పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహ్మద్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకీ, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆయుధం ఎవరి నుంచి కొనుగోలు చేశాడు? హుస్సేన్ ప్రణాళికలేంటి తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: పోలీస్‌స్టేషన్ దగ్గర్లో జంట హత్యలు.. రోడ్డుపై ఒకరిని, ఇంటికెళ్లి మరొకరిని.. -
బాప్రే!.... నెపోలియన్ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!
Napoleon Sword And Pistol From 1799 Coup: చాలామంది రాజుల కాలం నాటి వస్తువులను సొంతం చేసుకువాలనే కాక వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అవి వేల ఏళ్ల నాటి చరిత్రకు అత్యంత విలువైన ఆనావాళ్లు. అలాంటి ఒక గొప్ప సైన్యాధ్యక్షుడు, ఫ్రాన్స్ చక్రవర్తి అయిన నెపొలియన్ 1799లో తిరుగుబాటు చేసినప్పుడు ఉపయోగించిన కత్తి, తుపాకులు తదితర వస్తువులు వేలంలో అత్యధిక ధర పలికాయట. (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) అసలు విషయంలోకెళ్లితే 1799లో తిరుగుబాటు జరిగినప్పుడు నెపోలియన్ బోనపార్టే తీసుకెళ్లిన ఖడ్గం అతని ఇతర ఐదు తుపాకీలు వేలంలో $2.8 మిలియన్ల(రూ.21 కోట్లు)కి అమ్ముడయ్యాయని యూఎస్ వేలందారులు ప్రకటించారు. ఈ మేరకు ఇల్లినాయిస్కు చెందిన రాక్ ఐలాండ్ వేలం కంపెనీ అమ్మకానికి ఉంచిన ఈ విలువైన వస్తువులను ఒక అజ్ఞాత వ్యక్తికి ఫోన్ ద్వారా విక్రయించినట్లు కంపెనీ అధ్యక్షుడు కెవిన్ హొగన్ తెలిపారు. పైగా ఆ వ్యక్తి నెపోలియన్ ధరించిన వస్తువులను కొనుగోలుచేసి చాలా అరుదైన చరిత్రను తన ఇంటికి తీసుకువెళుతున్నాడు అని హొగన్ అన్నారు. అయితే ఖడ్గం, ఐదు ఆభరణాలు కలిగిన తుపాకులు విలువ వేలం ప్రారంభంలోనే $1.5 మిలియన్(రూ. 11 కోట్లు) నుండి $3.5 మిలియన్(రూ. 28 కోట్లు)వరకు పలికింది. అంతే కాదు ఈ విలువైన ఆయుధాలను వెర్సైల్స్‌లోని రాష్ట్ర ఆయుధ కర్మాగారానికి డైరెక్టర్‌గా ఉన్న నికోలస్-నోయెల్ బౌటెట్ తయారు చేశారు. అయితే నెపోలియన్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన తర్వాత తన ఖడ్గాన్ని జనరల్ జీన్-అండోచే జునోట్‌కి అందించాడని, తదనంతరం జనరల్ భార్య అప్పులు తీర్చడానికి దానిని అమ్మవలసి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. పైగా ఈ ఏడాది మేలోనే ఫ్రాన్స్ నెపోలియన్ మరణ ద్విశతాబ్ది వేడుకలను జరుపుకోవడం విశేషం. (చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) -
అసలేం జరిగింది? సూసైడ్ నోట్ రాసి ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య
భోపాల్: ఈ రోజుల్లో కొందరు తొందరపడి క్షణికావేశంలో తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ తరహాలోనే ఓ 17 ఏళ్ల ఎమ్మెల్యే కుమారుడు తన తండ్రి లైసెన్స్డ్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైభవ్ యాదవ్ (17) గురువారం మధ్యాహ్నం 4 గంటలకు గోరఖ్‌పూర్ ప్రాంతంలోని వారి ఇంట్లో తన తండ్రి రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ఆస్పత్రికి హూటా హుటిన తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంజయ్ యాదవ్ జబల్పూర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న బార్గి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని అందులో రాసినట్లు ఎస్పీ తెలిపారు. చదవండి: హత్యాచార కేసు: 30 రోజుల్లోనే విచారణ పూర్తి.. సంచలన తీర్పు -
ఆయుధాలు స్మగ్లింగ్.. జాతీయ క్రీడాకారుడు అరెస్ట్
భోపాల్: ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న జాతీయ కబడ్డీ క్రీడాకారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనితోపాటు మరో ముగ్గురు కూడా పోలీసులకు చిక్కారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణలో చోటు చేసుకుంది. నిందితుల నుంచి 5 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన రింకు జాట్ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు. అతను గతంలో ప్రో కబడ్డీ లీగ్ టోర్నమెంట్లతో పాటు దబాంగ్ ఢిల్లీ జట్టు తరపున ఆడాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి క్రెటా కారులో గుణ వైపు నుంచి శివపురి వైపు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఓ బృందంగా ఏర్పడి మైనా ఓవర్ బ్రిడ్జికి చేరుకొని ఆ రూటును పోలీసులు బ్లాక్ చేశారు. కొంతసేపటికి నిందితులు కారు అటు వైపు రావడంతో ఆ కారుని ఆపి అందులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5 పిస్టల్ మ్యాగజైన్లతో సహా మూడు అదనపు మ్యాగజైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుర్హాన్‌పూర్‌కు చెందిన సిగ్లిగార్ల నుంచి పిస్టల్స్ తీసుకువచ్చినట్లు నిందితులు విచారణలో చెప్పారు. వీటిని సరఫరా చేసిన వ్యక్తి సమాచారం కూడా నిందితులు ఇవ్వడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు ఒక బృందాన్ని కూడా అక్కడకు పంపినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తనయుడి నిర్వాకం.. చీటింగ్ కేసు నమోదు -
పిస్టొల్తో గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్
-
వేడుకల్లో తల్వార్లు,పిస్టల్స్ తో హంగామా
-
వీడు మామూలోడు కాదు.. బొమ్మ తుపాకి చూపించి..
సాక్షి, శ్రీకాకుళం: ఇచ్ఛాపురం పట్టణం డైలీమార్కట్ వద్ద ఉన్న జీకే బంగారు దుకాణంలోకి సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి ప్రవేశించాడు. గొలుసు చూపించమని యజమాని జి.మిథున్ చక్రవర్తిని కోరాడు. దీంతో నిజమని నమ్మిన ఆయన గొలుసులు చూపిస్తుండగా సదరు వ్యక్తి దుస్తుల్లో ఉంచిన తుపాకీని బయటకు తీసి మిథున్ చక్రవర్తిని బెదిరించి మూడు గొలుసులను పట్టుకొని పారిపోయాడు. క్షణాల్లో తేరుకున్న అతను కేకలు వేస్తూ వెంబడించగా.. స్థానికులు కూడా జతకలిసి పరుగు పెట్టారు. నిందితుడు నర్మదేశ్వర ఆలయం వెనుక కోటీ కాంప్లెక్సు వద్ద పట్టబడ్డాడు. అతన్ని పట్టణ పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి రెండు తులాల బరువున్న మూడు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకొన్నారు. తుపాకీని కూడా స్వాధీనం చేసుకొని పరిశీలించగా అది బొమ్మదిగా నిర్ధారించారు. పట్టుబడిన వ్యక్తి ఒడిశాలోని రాయగడకు చెందిన రాఖీడిగాల్గా గుర్తించారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ వి సత్యనారాయణ కేసు నమోదు చేశారు. -
‘పిస్టల్’ పని చేయలేదు!
టోక్యో: తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న యువ షూటర్ మనూ భాకర్ గుండె పగిలింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో కచ్చితంగా పతకం సాధించగలదని భావించిన భాకర్, ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. తాను నమ్ముకున్న ‘ఆయుధం’ ఆమెను చివరకు దెబ్బ తీసింది. క్వాలిఫయింగ్ ఈవెంట్ సందర్భంగా భాకర్ పిస్టల్ సాంకేతిక లోపంతో పని చేయలేదు. పోటీ జరుగుతున్న వేదిక నుంచి కాస్త దూరంగా వెళ్లిన భారత షూటర్... దానిని సరి చేయించుకొని వచ్చి మళ్లీ బరిలోకి దిగే సరికే అమూల్యమైన సమయం వృథా అయింది. దాంతో 19 ఏళ్ల మనూ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. మొత్తం 6 రౌండ్లలో వరుసగా 98, 95, 94, 95, 98, 95 (మొత్తం కలిపి 575 పాయింట్లు) స్కోర్ చేసిన ఆమె 12వ స్థానంలో నిలిచి ఫైనల్ అవకాశాలు చేజార్చుకుంది. ఇదే విభాగంలో బరిలోకి దిగిన మరో భారత షూటర్ యశస్విని సింగ్ కూడా నిరాశపర్చింది. క్వాలిఫయింగ్‌లో 574 పాయింట్లు సాధించిన ఆమె 13వ స్థానంతో సరిపెట్టుకుంది. టాప్–8లో నిలిచిన వారే ఫైనల్‌కు చేరుకుంటారు. రెండో పిస్టల్ ఉన్నా కూడా... సాధారణంగా షూటర్లు ఈవెంట్ సమయంలో ‘స్పేర్ గన్’ను ఉంచుకుంటారు. పేరుకు ఇది కూడా గ్రిప్, ట్రిగ్గర్ తదితర అంశాల్లో దాదాపుగా మొదటి పిస్టల్‌లాగే ఉన్నా... సుదీర్ఘ కాలంగా మొదటి గన్‌తోనే ప్రాక్టీస్ చేసిన అలవాటు వల్ల కొత్త గన్ను అంత సమర్థంగా ఉపయోగించడం కష్టమవుతుంది. పైగా రెండో గన్ తీసుకుంటే ఎలా పని చేస్తుందో చూసేందుకు ‘సైటర్స్’ (షూట్ చేసి పరీక్షించడం) చేయాల్సి ఉంటుంది. మొత్తం పిస్టల్ చెడిపోవడంవంటి అత్యవసర పరిస్థితి అయితే తప్ప రెండో గన్ను బయటకు తీయరు. భాకర్ ఘటనతో కొత్త గన్ను పరీక్షించడంతో పోలిస్తే మొదటి గన్ను రిపేర్ చేయడానికే తక్కువ సమయం పడుతుంది కాబట్టి దానినే ఎంచుకున్నట్లు రోనక్ పండిట్ వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తూ ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా మనూ మంచి స్కోరు సాధించగలిగింది. ఇలాంటి స్థితిలోనూ ఆమె కుప్పకూలిపోలేదు. గన్లకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం కానీ అసలు లివర్ విరిగిపోవడం అనేది అనూహ్యం. మనూ ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా’ అని పండిట్ వ్యాఖ్యానించారు. టోక్యో ఒలింపిక్స్‌లో మరో రెండు ఈవెంట్లు (25 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్)లలో భాకర్ ఇంకా పోటీ పడాల్సి ఉంది. అసలేం జరిగింది? వేర్వేరు ప్రపంచకప్‌లలో 9 స్వర్ణాలు, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాలతో పాటు ప్రస్తుత వరల్డ్ నంబర్ 2 అయిన హరియాణా టీనేజర్ మనూ భాకర్‌పై ఒలింపిక్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మనూ కూడా అదే ఉత్సాహంతో బరిలోకి దిగింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్కోరు సాధించే మొత్తం 60 షాట్లు అందుబాటులో ఉంటాయి. ఆరు సిరీస్‌లలో కలిపి 75 నిమిషాల్లో వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. 16 షాట్లు ఆడిన తర్వాత ఆమె పిస్టల్ మొరాయించింది. ఈ 16 షాట్లను అద్భుతంగా వాడుకున్న భాకర్ స్కోరులో 10 పాయింట్ల షాట్లు 10... 9 పాయింట్ల షాట్లు 6 ఉండటం విశేషం. అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆమె సరైన దిశలోనే సాగింది. ‘పిస్టల్ కాకింగ్ లివర్ విరిగిపోయింది. ఇలాంటిది సాధారణంగా ఎప్పుడూ జరగదు. లివర్ మార్చాలంటే గ్రిప్, ట్రిగ్గర్ సర్క్యూట్ కూడా బయటకు తీయాల్సి ఉంటుంది. దీనిని సరి చేసిన తర్వాత సర్క్యూట్ పని చేయలేదు. దాంతో దానిని కూడా మార్చాల్సి వచ్చింది’ అని మనూ భాకర్ కోచ్ రోనక్ పండిట్ వివరించారు. నిబంధనల ప్రకారం షూటర్ల వ్యక్తిగత సమస్యకు ఎలాంటి అదనపు సమయం లభించదు. మనూ మళ్లీ తన స్పాట్ వద్దకు వచ్చి షూట్ చేసే సమయానికి మరో 38 నిమిషాలు మిగిలి ఉండగా, 44 షాట్లు పూర్తి చేయాల్సి ఉంది. దాంతో వేగం పెంచిన మనూ తన సామర్థ్యానికి తగినట్లుగా చివర్లో షూట్ చేయలేక 2 పాయింట్ల తేడాతో ఫైనల్ అవకాశం కోల్పోయింది. ముఖ్యంగా 60వ షాట్లో 10 పాయింట్లు స్కోర్ చేసి ఉంటే ముందంజ వేసే అవకాశం ఉండగా... 8 పాయింట్లు మాత్రమే సాధించింది. దీపక్, దివ్యాంశ్ విఫలం... పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు పేలవ ప్రదర్శన కనబర్చారు. బరిలోకి దిగిన ఇద్దరు షూటర్లు దీపక్ కుమార్, దివ్యాంశ్ సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. క్వాలిఫయింగ్‌లో దీపక్ 624.7 పాయింట్లతో 26వ స్థానంలో నిలవగా... 622.8 పాయింట్లు సాధించిన దివ్యాంశ్ సింగ్ పన్వర్ 32వ స్థానంతో సరిపెట్టుకున్నారు. స్కీట్‌లో అవకాశం ఉందా! పురుషుల స్కీట్ విభాగంలో ఇద్దరు భారత షూటర్లు తొలి రోజు ఫర్వాలేదనిపించే ప్రదర్శన కనబర్చారు. ఇదే పోటీ సోమవారం కూడా కొనసాగుతుంది. మొదటి రోజు అంగద్ సింగ్ అందుబాటులో ఉన్న 75 పాయింట్లలో 73 పాయింట్లు (24, 25, 24) సాధించి 11వ స్థానంలో ఉన్నాడు. మిగిలిన రెండు సిరీస్‌లలో నేడు పోరాడతాడు. మరో భారత షూటర్ మేరాజ్ 71 పాయింట్లు సాధించి 25వ స్థానంలో నిలిచాడు. మొత్తం ఐదు సిరీస్‌లు ముగిసిన అనంతరం టాప్–6 మాత్రమే ఫైనల్లోకి అడుగుపెడతారు. -
విదేశీ మద్యం అమ్మకంపై వివాదం.. రివాల్వర్‌తో యువకుడి హల్చల్!
జయపురం: విదేశీ మద్యాన్ని అధికధరకు అమ్మడంపై తలెత్తిన వివాదంలో ఒక యువకుడి నుంచి పిస్టల్‌ను స్వాధీనపరచుకున్నట్లు జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి అరూప్ అభిషేక్ బెహర తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. బొయిపరిగుడ వాసి ఉమాశంకర గౌడను అరెస్టు చేసినట్లు బెహర వెల్లడించారు. బొయిపరిగుడలో ప్రభుత్వ లైసెన్స్‌తో విదేశీ మద్యం దుకాణం ఉందని, 12వ తేదీన నిందితుడు ఉమాశంకర గౌఢతో పాటు అతని సహచరుడు అసమత్ఖాన్ ఉరఫ్ పప్పు విదేశీ మద్యం దుకాణానికి వెళ్లి ఒక మద్యం బాటిల్ అడిగినట్లు తెలిపారు. బాటిల్ ధర రూ.200 కాగా, సేల్స్‌మాన్ రూ.220 చెప్పాడని వాగ్వాదానికి దిగారు. దీంతో ఉమాశంకర్ రివాల్వర్ తీసుకొని సేల్స్‌మాన్ రామప్రసాద్ సాహు గురిపెట్టి చంపుతామని బెదిరించాడని వెల్లడించారు. రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఉమాశంకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు బెహర వెల్లడించారు. అతనితో పాటు వచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. -
సవతి తండ్రి నుంచి భర్తగా.. చెప్పలేని అకృత్యాలెన్నో!
వలెరీ బకోట్.. ఫ్రాన్స్‌తో పాటుగా ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న పేరు. మృగంలాంటి భర్త చేతిలో రెండు దశాబ్దాలపాటు ప్రత్యక్ష నరకం అనుభవించి.. చివరికి భరించలేక తుపాకీతో నేలకూల్చింది ఆ భార్యామణి. అయితే అది నేరమే అయినా.. లక్షల మందిని ఆమె కథ కదిలించింది. ఒక వ్యథలా ఆమె కథను కోర్టుకు చేర్చింది ప్రజాపోరాటం. ఫలితం.. న్యాయస్థానం ఆమెను క్షమించి వదిలేసింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించింది. ప్యారిస్: డేనియల్ పొలెట్టె.. ఛలోన్ సర్ సావన్‌లో ఉండే జోయిల్లె అవుబగే అనే ఆవిడతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటికే ఆవిడ విడాకులు తీసుకోవడంతో.. బాయ్‌ఫ్రెండ్‌గా ఆమెకు దగ్గరయ్యాడు. మగదిక్కు అవసరాన్ని ఆసరాగా తీసుకుని.. 1992లో వలెరీ బకోట్కు సవతి తండ్రి హోదాలో ఇంట్లో అడుగుపెట్టాడు. ఆపై మృగంగా మారి.. 12 ఏళ్ల వయసులో బకోట్పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అది రాను రాను అతనికి అలవాటుగా మారింది. ఆపై జోయిల్లే నోరు మూయించి.. తన కంటే వయసులో పాతికేళ్లు చిన్నదైన బకోట్కు ఏకంగా భర్తగా మారిపోయాడు. పిల్లలపై దాడి తట్టుకోలేక.. 17 ఏళ్ల వయసుకే గర్భం దాల్చింది బకోట్. పొలెట్టెకు భార్యగా మారాక ఆమె జీవితం మరింత నరకప్రాయంగా మారింది. ట్రక్కు డ్రైవర్ల దగ్గరికి పంపిస్తూ.. ఆమెనొక వేశ్యగా మార్చేశాడు. నలుగురు పిల్లల తల్లి కావడంతో ఆమె ఏనాడూ తెగించి నిర్ణయం తీసుకోలేదు. చివరికి.. 2016లో ఓ రాత్రి పిల్లల ముందే ఆమెను దారుణంగా హింసించాడు. అడ్డొచ్చిన పిల్లలను చంపే ప్రయత్నం చేశాడు. అది తట్టుకోలేక తుపాకీతో పొలెట్టె కాల్చిపడేసి పీడను వదిలించుకుంది ఆమె. ఆపై పోలీసులు, కోర్టు ముందు కూడా తానే నేరస్థురాలినని ఒప్పుకుంది కూడా! సెన్సేషన్ ఆటోబయోగ్రఫీ పొలెట్టె ఎంత నీచుడో అక్కడి ప్రజలకు తెలుసు. పద్దెనిమిదేళ్లపాటు ఆమెను ఘోరంగా హింసించాడు. అదే విషయాన్ని వివరిస్తూ వలెరీ తన ఆత్మకథను రాసింది. ‘‘టాట్ లె మోండే సావాయిట్(ఎవ్రీవన్ న్యు)’’ పుస్తకం ఈ మేలో పబ్లిష్ అయ్యింది. ‘‘నన్ను నేను, నా జీవితాన్ని, నా పిల్లల జీవితాన్ని రక్షించుకోవాలనుకున్నా. నేను అంతకన్నా ఎక్కువేం కోరుకోవట్లేదు’ అని ప్రకటించుకుందామె. ఆ బుక్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది. ఆమెపై సానుభూతి మొదలయ్యింది. ఆమెను రిలీజ్ చేయాలంటూ మొదలైన ఒక పిటిషన్‌పై ఏకంగా ఏడు లక్షల మంది సంతకాలు చేశారు. దేశం నుంచి ఖండం.. బాకోట్కు నిబంధనల ప్రకారం న్యాయస్థానం నాలుగేళ్ల శిక్ష విధించాలి. కానీ, ఆ శిక్షలో మూడేళ్లు కోత వేసింది. ఇక మిగిలిన ఏడాదికి కూడా.. ఆమె ఇది వరకే జైలు నిర్భంధాన్ని అనుభవించిన కాలాన్ని లెక్కగట్టారు. దీంతో అప్పటికప్పుడే ఆమెను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే.. బయట వందల మంది హర్షం వ్యక్తం చేశారు. సంబురంగా ఆమెను అభినందించారు. ‘‘ఆమె కథ ఫ్రాన్స్‌ను మాత్రమే కాదు.. యావత్ ఖండాన్ని కరిగించింది. గతంలో జాక్వెలిన్ సావేజ్ కేసు(బిడ్డను చంపిన భర్తను చంపేసింది.. శిక్షను తగ్గించి 2016లో క్షమాభిక్ష మీద విడుదల చేశారు).. ఈ కేసు ఒకేలా ఉండడం ఆమెకు కలిసొచ్చింది.’’ అని 40 ఏళ్ల బకోట్ తరపున పోరాడిన ఫ్లోరినా మెయిలీ చెబుతోంది. చదవండి: ఆ స్కూల్ కింద నిండా సమాధులే! -
పెళ్లి జరిగి 4 రోజులు.. భర్త ముందే మాజీ ప్రియుడు..
పట్నా: వివాహం జరిగిన 4 రోజులకే ఓ నవ వధువు దారుణ హత్యకు గురైంది. అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఆమె మాజీ ప్రేమికుడు నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో ఆమె మృతిచెందింది. ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బిహార్‌లోని నలంద జిల్లాలో భగాన్ బిఘా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కెవైది ప్రాంతానికి చెందిన సందీప్ కుమార్ కూతురు షబ్నం కుమారికి షాపూర్‌కు చెందిన వికాస్ కుమార్‌తో మే 26వ తేదీన వివాహం జరిగింది. షబ్నం భర్త తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం జరిగిన 4వ రోజు షబ్నం ఆమె భర్తతో కలిసి వాహనంలో పుట్టింటికి బయలుదేరింది. మార్గమధ్యంలో బైక్‌పై వచ్చిన ఆమె రాజ్‌పాల్ పాశ్వాన్ అలియాస్ రేహాన్ వారి వాహనాన్ని అడ్డుకున్నాడు. రాజ్‌పాల్ తనతో రావాలని ఆమెను బలవంతం చేయగా, ఆమె అందుకు అంగీకరించలేదని తెలిపాడు. వెంటనే కోపంతో రాజ్‌పాల్ షబ్నం పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకి పెట్టి కాల్పులు జరిపాడు. అనంతరం తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. ఇద్దరినీ జిల్లా సదర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు షబ్నం చనిపోయినట్లు ప్రకటించారు. అదే క్రమంలో రాజ్‌పాల్‌ను పరిస్థితి విషమంగా ఉండడంతో పాట్నాకు తరలించాలని సూచించారు. అయితే, అతను కూడా దారిలోనే మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: భూవివాదం.. యువకుడిని కొట్టి చంపిన దుండగులు -
వ్యాపారిని పిస్తోలుతో బెదిరించి
సాక్షి, హైదరాబాద్: పిస్తోలుతో బెదిరించి ఇద్దరు ఆగంతకులు ఓ మనీ ట్రాన్స్ఫర్ వ్యాపారి నుంచి రూ.1.95 లక్షలు దోచుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ బాలరాజు తెలిపిన వివరాల మేరకు..కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన రవికుమార్ మూడు సంవత్సరాలుగా అయోధ్యనగర్ చౌరస్తాలో ‘లక్ష్మి మనీ ట్రాన్స్ఫర్’ పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రవికుమార్ దుకాణం మూసేందుకు సిద్ధమై ఆరోజు వచ్చిన మొత్తం రూ.1.95 లక్షలు బ్యాగులో పెట్టుకున్నాడు. ఇంతలో షాపులోకి హెల్మెట్, మాస్కులు ధరించిన ఇద్దరు యువకులు చొరబడి తుపాకీ చూపించి..అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. భయపడిన రవికుమార్ మాట్లాడకుండా ఉండిపోయాడు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు బ్యాగులో ఉన్న డబ్బును తీసుకుని ఉడాయించారు. దీంతో రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు సెల్‌ఫోన్ లభించింది. ఇద్దరు యువకులు నెంబర్ ప్లేట్‌లేని తెల్లరంగు హోండా యాక్టివాపై వచ్చినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. పోలీసులు దొంగల వేలిముద్రలతో పాటు సీసీ పుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ఇది తెలిసినవారి పనేనా? ఇది తెలిసిన వారి పనేనా..? లేక కొత్త వ్యక్తులు ఎవరైనా దొంగతనానికి పాల్పడ్డారా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో త్వరలోనే దొంగలను పట్టుకుంటామని సీఐ తెలిపారు. ( చదవండి: బావ గొంతుకోసిన బావమరిది: అందుకే చంపేశానంటూ ) -
పాత కక్షలు.. వ్యాపారి దారుణహత్య
జయపురం: నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్‌లో శుక్రవారం రాత్రి తుపాకీ తూటాలు గర్జించాయి. ఆ తూటాలకు ఒక వ్యాపారి కుప్పకూలాడు. రాత్రి 10 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన పట్టణ ప్రజలలో భయాందోళన రేకెత్తించింది. వ్యాపార శతృత్వంతోనే ఈ సంఘటన జరిగి ఉండొచ్చని ప్రజలు అనుమానిస్తున్నారు. స్థానిక వ్యాపారి సంజీవ సుబుద్ధి రాత్రి 9 గంటలకు తన దుకాణం మూసివేసి ఇంటికి బయల్దేరాడు.దారిలో ఎలక్ట్రికల్ కార్యాలయం వద్ద టీ తాగి మిత్రులతో కాసేపు ముచ్చటించి రాత్రి 9.45 గంటలకు బైక్ నెమ్మదిగా నడుపుకుంటూ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో ముగ్గురు దుండగులు వ్యాపారిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పులకు గురైన సంజీవ్ సుబుద్ధి సంఘటనా స్థలంలోనే నేలకూలాడు. గమనించిన ఆ ప్రాంత ప్రజలు వెంటనే వ్యాపారిని ఉమ్మరకోట్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడినుంచి నవరంగపూర్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అయితే వ్యాపారి సుబుద్ధి మరణించినట్లు అక్కడి డాక్టర్లు ప్రకటించారు. కొద్ది రోజుల కిందట సంజీవ్ సుబుద్ధి కొంత మందితో గొడవ పడ్డాడు. ఆ సంఘటనపై ఉమ్మరకోట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల క్రితం ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు సంజీవ్ సుబుద్ధి ఫర్నిచర్ దుకాణానికి వచ్చారని అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదని చుట్టుపక్కల దుకాణదారులు చెబుతున్నారు. గత రాత్రి జరిగిన కాల్పుల సంఘటనను ఉమ్మరకోట్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దుండగుల ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తుపాకీ కాల్పుల్లో వ్యాపారి దుర్మరణం చెందిన సమాచారం తెలుసుకున్న నవరంగపూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మఝి హాస్పిటల్‌కు వెళ్లి మృతుని కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
దారుణం: గుట్కా కోసం తుపాకీతో కాల్చివేత
పాట్నా: పాన్ షాప్‌కు వచ్చిన ఓ వ్యక్తి పాన్ మసాలా (గుట్కా) అప్పుగా ఇవ్వాలని కోరగా దుకాణ యజమాని నిరాకరించాడు. దీంతో దుకాణ యజమానితో అతడు గొడవ పడ్డాడు. అప్పుగా పాన్ మసాలా ఇవ్వకపోవడంతో అతడిపై కోపం పెంచుకున్నాడు. ఈ సందర్భంగా అదే కోపంతో తెల్లారి వచ్చి ఆ దుకాణంపై దాడి చేశాడు. ఆ సమయంలో దుకాణంలో ఉన్న యజమాని కుమారుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బీహార్‌లోని సుపాల్ జిల్లాలో త్రివేణిగంజ్‌కు చెందిన అజిత్‌కుమార్ రౌడీ. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ పాన్ షాప్‌కు వచ్చాడు. బెదిరింపులకు పాల్పడుతూ రూ.20 విలువ చేసే పాన్ మసాలా అప్పుగా ఇవ్వాలని అడిగాడు. అయితే దుకాణంలో ఉన్న యజమాని ఇవ్వను అని తేల్చిచెప్పాడు. కొద్దిసేపు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతడితో వాగ్వాదం చేశాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు సర్ది చెప్పడంతో అజిత్ వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు సోమవారం తన అనుచరులతో దుకాణం వచ్చాడు. దుకాణంలో ఉన్న యజమాని చిన్న కుమారుడు మిథిలేశ్‌తో మళ్లీ పాన్ మసాలా కోసం గొడవ పడ్డాడు. ఈ సమయంలో క్షణికావేశానికి గురైన అజిత్ కుమార్ తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన మిథిలేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలిసి సమీపంలో ఉన్న మిథిలేశ్ అన్న పరుగెత్తుకుంటూ రావడంతో త్రివేణి సింగ్, అతడి అనుచరులు పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిందితులను తాము గుర్తించినట్లు.. త్వరలోనే వారిని పట్టుకుంటామని సుపాల్ జిల్లా పోలీస్ అధికారి షేక్ హసన్ తెలిపారు. -
సీటు కోసం గొడవ.. తుపాకీతో కాల్పులు
బులంద్‌షహర్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలోని ఓ స్కూల్లో.. తరగతి గదిలో సీట్ల విషయంలో వచ్చిన గొడవకు 10వ తరగతి చదివే సన్నీ (14)తన తోటి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపాడు. సెలవుల్లో ఆర్మీ నుంచి ఇంటికి వచ్చిన తన అంకుల్ లైసెన్స్ గన్‌తో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కాల్చిన అనంతరం పారిపోబోయాడు. అయితే అప్పటికే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గేట్లు మూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొరికాడు. కాగా పోలీసులు వివరాలు నమోదు చేసుకొని జువైనల్ హోమ్‌కు తరలించారు. -
సోషల్ మీడియా ఓ గన్నులాంటిది: సుప్రీం
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన చేతిలో తుపాకీని వాడినట్టుగానే సోషల్ మీడియాను వాడవచ్చునని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రిమినల్ కేసులు, బెయిల్ వంటి అంశాల్లో సోషల్ మీడియా ద్వారా చేసే పోస్టులపై మార్గదర్శకాలుండాలంది. కరోనా కట్టడి, లాక్డౌన్ వంటి అంశాల్లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలను లక్ష్యంగా చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఆరోపణలపై కాంగ్రెస్ నేత సచిన్ చౌధరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు సచిన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఏడాదిన్నర పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని షరతు విధించింది. దీంతో సచిన్ సుప్రీంను ఆశ్రయించారు. శుక్రవారం దీని విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బాబ్డే సోషల్ మీడియాకి సచిన్ దూరంగా ఉండాలన్న హైకోర్టు ఆదేశాలను సమర్థించారు. ఏదైనా కేసులో నిందితుడు తుపాకీకి దూరంగా ఉండాలని ఆదేశం ఇవ్వడం ఎలాంటిదో, సామాజిక మాధ్యమాలకి దూరంగా ఉండమని చెప్పడం అలాంటిదేనన్నారు. -
మద్యం మత్తు.. తల్లిని తుపాకీతో కాల్చి
న్యూఢిల్లీ : మద్యం మత్తులో ఓ యువకుడు తల్లిని హతమార్చిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని బవానా ప్రాంతంలో సూరజ్ అనే 26 ఏళ్ల యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తూ తన తల్లితో(60) కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి తప్పతాగి ఇంటికి చేరుకున్న యువకుడు ఓ విషయంపై తల్లితో వాగ్వాదానికి దిగాడు. నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ.. తల్లిపై చేయి చేసుకున్నాడు. అనంతరం తాగిన మత్తులో తల్లిని పిస్తోల్‌తో నిర్ధాక్షిణ్యంగా కాల్చాడు. మహిళకు ఎడమ కంటికి తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి పిస్తోల్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (మామ ఉద్యోగం కోసం బావమరిదిపై..) చదవండి: ఢిల్లీలో భూప్రకంపనలు -
నిర్మల్ జిల్లా: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తుపాకీ మిస్‌ఫైర్
-
కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తప్పిన ప్రమాదం
సాక్షి, నిర్మల్ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శంకర్‌గౌడ్ అనే వ్యక్తి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా ఆదివారం కార్యాలయంలో తుపాకీని శుభ్రం చేస్తున్న సమయంలో పొరపాటున ట్రిగ్గర్ తగిలి మిస్‌ఫైర్ అయింది. దీంతో బుల్లెట్ శంకర్‌గౌడ్ చాతి భాగం నుంచి బయటకు దూసుకెళ్లింది. గాయపడిన శంకర్ గౌడ్‌ను నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
తుపాకీ మిస్‌ఫైర్
-
వ్యక్తి చెవిలో నుంచి బుల్లెట్.. ఆపై భార్య మెడలోకి
గురుగ్రామ్/ఢిల్లీ : తుపాకీతో కాలిస్తే బుల్లెట్ శరీరంలోకి నుంచి బయటికి వచ్చి మరో వ్యక్తి శరీరంలోకి చొచ్చుకుపోవడం సినిమాల్లో చూస్తుంటాం. అయితే అది సినిమా కాబట్టి సరిపెట్టుకుంటాం.. కానీ నిజజీవితంలో మాత్రం అలా జరగడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్ పట్టణంలో ఒక వ్యక్తి తన తుపాకీతో చెవిలో కాల్చుకుంటే అది అతని తలలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న అతని భార్య మెడలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా, ఏడు నెలల గర్భవతి అయిన అతని భార్య మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడింది.(గొర్రెకుంట ఘటన: అసలేం జరిగింది?) డిసిపి దీపక్ సహరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ' ఫైరదాబాద్‌కు చెందిన ఆ వ్యక్తి ఐదు నెలల క్రితం గురుగ్రామ్‌లోని రామ్‌పురాకు వచ్చి అద్దెకు ఉంటున్నాడు. అయితే ఆ వ్యక్తికి ఇప్పటికే రెండుసార్లు పెళ్లయిందని, 2017లో మొదటి భార్యను విడిచిపెట్టిన అతను 2019లో మధురకు మకాం మార్చాడు. అక్కడ ఒక గ్రాసరీ స్టోర్‌లో పనిచేస్తూ మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఆ వ్యక్తి పని లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రస్తుతం ఆ వ్యక్తి రెండో భార్య ఐదు నెలల గర్భవతి కావడంతో గురుగ్రామ్‌లోని ఒక ఆసుపత్రిలో రెగ్యులర్‌గా చెకఫ్కు వెళుతుంటారు. శనివారం కూడా ఆ వ్యక్తి తన భార్యను తీసుకొని చెకప్కని ఆసుపత్రికని ఎస్యూవీ కారులో బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉద్యోగ విషయమై ఇరువరి మధ్య గొడవ జరిగింది. దీంతో సదరు వ్యక్తి ఆవేశంతో కారులో ఉన్న పిస్టోల్ తీసుకొని తన చెవిలో కాల్చుకున్నాడు. దీంతో అతని చెవిలో నుంచి బయటికి వచ్చిన బుల్లెట్ అతని భార్య మెడలోకి దూసుకెళ్లింది. కారులోనే ఇద్దరు రక్తపు మడుగులో అపస్మారకస్థితిలో ఉండిపోయారు. అయితే రోడ్డుపై అటుగా వెళుతున్న కారును పరిశీలించగా అప్పటికే వారిద్దరు సృహ లేకుండా ఉండడంతో మాకు సమాచారమందిండాని' తెలిపాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దంపతులిద్దరిని ఢిల్లీలోని సప్ధర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉండగా, అతని భార్య మాత్రం ప్రాణాల నుంచి బయటపడింది. గత నాలుగురోజులుగా ఉద్యోగ విషయమై తమ మధ్య గొడవ జరుగుతుందని వ్యక్తి భార్య తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఢిల్లీలోని కేరీదౌళా పోలీస్ స్టేషన్లో ఐపీసీ 309 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 7.62 ఎంఎం తుపాకీతో కాల్చుకున్న వ్యక్తికి లైసెన్స్ ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా తుపాకీతో కాల్చుకుంటే బుల్లెట్ బయటకు రావడమనేది అరుదుగా జరుగుతుంది. అతను పాయింట్ బ్లాక్‌లో చెవిలో కాల్చుకోవడంతోనే బుల్లెట్ బయటకు వచ్చిందని డిసిపి దీపక్ సహరణ్ వెల్లడించారు. -
మంగళగిరిలో తుపాకి కలకలం
సాక్షి, మంగళగిరి: రాజధాని ప్రాంతంలో కీలక పట్టణమైన మంగళగిరిలో తుపాకి కలకలం సృష్టించింది. తుపాకితో సంచరిస్తున్న వ్యక్తితో పాటు మారణాయుధాలు కలిగి ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను మంగళగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం పట్టణ సీఐ డి.నరేష్కుమార్ నిందితుల వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... మంగళగిరి పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, పట్టణ పరిధిలోని బాప్టిస్టుపేట ప్రాంత సమీపంలో గలాటా చేస్తున్నట్లు పోలీసులకు శుక్రవారం సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వారు భయపడుతుండటంతో వారిని తనిఖీ చేశారు. వారి వద్ద మారణాయుధాలు ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురిలో ఇద్దరు యువకులైన ఆకురాతి వెంకట శివ రాఘవ అలియాస్ ఏవీఎస్, బండారు రవి రౌడీషీటర్లు. వీరిద్దరితో పాటు ఉన్న మరో యువకుడు ఇళ్లా రవి వద్ద మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లా రవి వద్ద ఒక తుపాకి, ఏవీఎస్, బండారు రవి వద్ద రెండు కత్తులు ఉన్నాయి. నిందితులను వెంటనే పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ముగ్గురు నిందితుల్లో ఇళ్లా రవిపై కూడా రౌడీషీటు తెరవనున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన వారిలో ఎస్సై నారాయణ, క్రైమ్ సిబ్బంది నాగాంజనేయులు, శివప్రసాద్, శాంతకుమార్ తదితరులు ఉన్నారు. -
‘సల్మాన్’ ఉసురు తీసిన టిక్-టాక్
జిమ్మిక్కుల సెలెంట్ కిల్లర్, మొబైల్ యాప్ టిక్-టాక్ వీడియోల వెర్రి యువత ప్రాణాలు తీస్తోంది. సోషల్ మీడియాలోఈ వీడియోల మోజు వికటించి అనేక దుష్పరిణామాలకు దారితీస్తోంది. దీనిపై ఒకవైపు ఆందోళన కొనసాగుతుండగానే ఢిల్లీలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. టిక్‌టాక్ వీడియో తీస్తూ ప్రాణ స్నేహితుడి ఉసురు తీసిన వైనం కలకలం రేపింది. సల్మాన్, సొహైల్, అమీర్ ముగ్గురూ స్నేహితులు. ఆదివారం సాయంత్రం ముగ్గురు కారులో ఇండియా గేట్ వరకూ వెళ్లారు. అలా ఆ సాయంత్రం సరదాకి గడిపిన అనంతరం ముగ్గురూ తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఇంతలో టిక్-టాక్వీడియో తీసుకోవాలని కోరిక పుట్టింది సొహైల్‌కు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కారు డ్రైవ్ చేస్తున్న సల్మాన్ (19) పై గురిపెడుతూ.. టిక్-టాక్వీడియో తీయడానికి ప్రయత్నించాడు పక్క సీట్లో కూర్చున్న సొహైల్. కానీ దురదృష్టవశాత్తూ తుపాకి గుండు సల్మాన్ కుడి కణత భాగంలోకి చొచ్చుకుపోయింది. రక్తపు మడుగులో కుప్పకూలిన సల్మాన్‌ను చూసి వెనక సీట్లో అమీర్ సహా, సొహైల్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్నేహితుడికి ఇంటికి వెళ్లి రక్తపు మరకల బట్టలను మార్చుకుని.. సల్మాన్‌ను సమీపంలోని ఎల్ఎన్జెపీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఇంతలోనే సొహైల్, అతని స్నేహితులు అక్కడినుంచి పారిపోయారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అలా విషయం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ ఢిల్లీ బరఖాంబ రోడ్డుకు సమీపంలో ని రంజిత్ సింగ్ ఫ్లైఓవర్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందుకున్నపోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకోసం తరలించారు. సల్మాన్, అతని స్నేహితుడు షరీఫ్‌లను అదుపులోకి తీసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హత్య, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టామన్నారు. కాగా న్యూ జఫర్బాద్ ప్రాంతంలో నివసించే సల్మాన్ తండ్రి వ్యాపారవేత్త అని సల్మాన్ బంధువు తెలిపారు. అండర్-గ్రాడ్యుయేట్ విద్యార్థి సల్మాన్ కుటుంబంలో చిన్నవాడు. అతనికి సోదరుడు, సోదరి ఉన్నారు. టిక్-టాక్ వీడియోల క్రేజ్‌లో మునిగి, వీడియోలను అప్లోడ్ చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. -
పిల్లల చేతికి తుపాకీ
బెంగళూరు : పట్టణంలోని కొంగాడియప్ప కాలేజ్ రోడ్డులో ఉన్న నేషనల్ ప్రైడ్ స్కూల్ నిర్వాహకులు పిల్లలకు పోలీస్‌స్టేషన్‌ను ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతో ఆదివారం 50 పైగా పసి పిల్లలను (ఎల్కేజీ, యూకేజీ) ఇక్కడి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసికెళ్లారు. ఈ క్రమంలో డీవైఎస్పీ మోహన్ కుమార్ పిల్లలతో సరదాగా మాట్లాడుతూ... కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తన రివాల్వర్‌ను తెప్పించి అందులో మ్యాగజిన్ తీసేసి వట్టి రివాల్వర్‌ను ఒక పాప చేతికివ్వగా, ఆ రివాల్వర్‌ను స్కూల్ సిబ్బంది అక్కడున్న పిల్లలందరికీ చేతికిచ్చి తాకించారు. ఈ వీడియో కాస్త పాఠశాల సిబ్బంది ఫేస్బుక్లో లైవ్ ఇవ్వడంతో డీవైఎస్పీపై కామెంట్ల రూపంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పసి పిల్లల చేతికి రివాల్వర్ ఇవ్వడమేంటని, వారి చేతుల్లో ఆయుధాలు పెడితే మనసులపై ఎటువంటి ప్రభావం పడుతుందనే ఆలోచన లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రాణహాని ఉంది.. తుపాకీ కావాలి : ధోని భార్య
భారత్ క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి లైసెన్స్ రివ్వాలర్ ఇప్పించాలని కోరినట్లు సమాచారం. అంతేకాక తనకు ప్రాణ హాని ఉందని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఎంఎస్ ధోని మ్యాచ్‌ల దృష్ట్యా బీజీగా ఉంటారనే విషయం విదితమే. ‘ధోని ఇంట్లో చాలా తక్కువ సమయం ఉంటారు. నేను నా కూతురితో కలిసి ఒంటరిగానే ఇంట్లో ఉంటాను. తరచూ ఏదో ఒక పని మీద బయట తిరుగుతుంటాను. ఆ సమయంలో ఒంటరిగానే వెళ్తాను. నా భద్రతా దృష్ట్యా త్వరగా లైసెన్స్డ్ పిస్టల్ లేదా 0.32 రివాల్వర్ ఇప్పించండి’ అని సాక్షి పేర్కొన్నారు. గతంలో కూడా ఎంఎస్ ధోని కూడా లైఎస్స్ తుపాకీ కోసం అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ధోనికి 9ఎమ్ఎమ్ గన్‌కు కూడా అనుమతి ఇచ్చారు. టీమిండియా జట్టు త్వరలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. యో యో టెస్టు పాసైన ఎంఎస్ ధోని ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్స్‌లో ఉన్నాడు. -
సిగిరెట్ లెటర్
జపాన్ దేశంలో తయారైన సిగరెట్ లైటర్‌కి ఇంత శక్తి ఉంటుందని నేను ఊహించలేకపోయాను. విదేశంలో తయారైన సిగరెట్ లైటర్‌ను రాజాజీ నాకు కానుకగా ఇచ్చాడు. బంగారపు పూత పెట్టిన లైటర్ అది. లైటర్మీద రెండు సింహాలు చిత్రించబడి ఉన్నాయి. చేతిలో గరుకుతనంగా ఉంటుంది ఆ లైటర్.అద్దె ఇంట్లో తన గదిలో చనిపోయి కనిపించాడు రాజాజీ. అతడి గుండెలోకి ఒక బుల్లెట్ దూరింది. వెనక నుంచి బుల్లెట్ బయటపడి అతడు కూర్చున్న కుర్చీలో ఇరుక్కుంది. బుల్లెట్ కారణంగానే అతడు మరణించాడు. ఒంటరిగా ఉంటున్న రాజాజీ భార్య ఐదారు నెలల క్రితం జపాన్‌లో మరణించింది. ఆయనకు కొడుకు మాత్రమే ఉన్నాడు. అతడి పేరు వాసు. ఢిల్లీలో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. తన తండ్రి హత్యకు గురయ్యాడు అని తెలుసుకున్నాడు వాసు. పోలీసులు అతడికి ఫోన్ చేశారు. ఢిల్లీ నుంచి దిగబడ్డాడు వాసు. తన తండ్రి ఒక పిస్టల్‌తో కాల్చి చంపబడడం జీర్ణించుకోలేకపోతున్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత అతణ్ని నేను చేరదీశాను. రాజాజీని ఆ రాత్రివేళ చంపకుండా ఉండవలసింది. ఏమైనప్పటికీ రాజాజీ తక్కువవాడు కాదు.టోక్యో నగరంలో ఒక సివిల్ ఇంజనీరింగ్ కార్యాలయం తెరిచాను. విశాఖపట్నంలో ఉన్న నా ప్రధాన కార్యాలయానికి అనుబంధంగా టోక్యోలో శాఖా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాను. ఆ కార్యాలయాన్ని రాజాజీ చూసేవాడు. తన భార్యతో కలసి టోక్యోలో రాజాజీ ఉండడానికి తగినంత ఆదాయం, ఇతర వసతులు ఏర్పాటు చేశాను. కొంత కాలం క్రితం కార్యాలయాన్ని చూసుకోవడానికి టోక్యో చేరుకున్నాను.జమా ఖర్చులలో చాలా తేడాలు వచ్చాయి. రాజాజీని నిలదీశాను. ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. నా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను రహస్యంగా విచారించాను.ఒక గెయిషా వలలో చిక్కుకున్నాడు రాజాజీ. ఆయన సంపాదనను పూర్తిగా పీల్చేస్తోంది గెయిషా. ఆమె విషయంలోనే రాజాజీ దంపతులకు మధ్య విభేదాలు చెలరేగాయి.కార్యాలయం నష్టాల్లో పడింది. ఎనిమిది, పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితేనేగానీ కార్యాలయం పైకి లేవదు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు పెట్టుబడి పెట్టాలంటే నా వల్ల అయ్యే పరిస్థితి లేదు. భారతదేశంలో మారిపోయిన ద్రవ్యచెలామణి పరిస్థితుల దృష్ట్యా ఒడిదుడుకుల్లో పడ్డాను.నన్ను పాతాళలోకానికి తొక్కేశాడు రాజాజీ.ఏం జరిగిందో ఏమోగానీ, రాజాజీ భార్య ఆకస్మికంగా మరణించింది. జపాన్ ప్రభుత్వం ఆమె మరణం గురించి విచారణ చేపట్టింది. రాజాజీ భార్యకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వ్యవహారం ముదిరిపోకముందే జపాన్ దేశం నుంచి తన ప్రియురాలితో ఉడాయించాడు రాజాజీ.ఆయన నన్ను విశాఖపట్నంలో కలుసు కోవడానికి వచ్చేవరకూ రాజాజీ వ్యవహారం గురించి నాకు తెలియదు. గెయిషాను హోటల్ గదిలో ఉంచి ఆయన నా వద్దకు వచ్చాడు. ‘నా వెంట నా ప్రియురాలు కూడా వచ్చింది. ఆమెకు మన దేశపు పౌరసత్వం ఇప్పించాలి’ అన్నాడు రాజాజీ. ‘నీ అద్దె ఇల్లు ఉంది కదా! నీ ప్రియురాలిని అక్కడికి ఎందుకు తీసుకురాలేదు?’‘కొంతకాలం పాటు గెయిషాను ఎక్కడో ఓ చోట నువ్వే దాచి ఉంచాలి’ బ్రతిమిలాడాడు. ‘అదే. ఎందువల్ల?’అప్పుడు వివరంగా చెప్పాడు రాజాజీ. జపాన్ దేశంలో తాను వెలగబెట్టిన నిర్వాకం గురించి! జపాన్ దేశం నుంచి గూఢచారులు ఇక్కడికి తన కోసం వస్తారట. వాళ్ల కంట్లో తమ దేశస్తురాలు గెయిషా పడకూడదట. రాజాజీ భార్య చేత నిద్రమాత్రలు మింగించిన నేరస్తురాలు అతడి ప్రియురాలు గెయిషాయేనట. రాజాజీతో నా సాన్నిహిత్యం ఇక్కడ నా సొంత దేశంలో కూడా నా ఉనికిని ప్రశ్నార్థకం చేయనుంది. పథకం వేశాను.పాయింట్ త్రీటూ కాలిబర్ పిస్టల్‌ను సిద్ధం చేసుకున్నాను. పిస్టల్‌లో ఆరు బుల్లెట్లు నింపాను. అతడి అద్దె ఇంట్లో మద్యం సేవించడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాత్రివేళ ఇద్దరం కూర్చున్నాం.‘గెయిషాను అనవసరంగా చేరదీసి నీ మెడకు తగిలించుకున్నావు. ఆమెను ఇక్కడివరకూ వెంటబెట్టుకు వచ్చావు. ఒక అనుమానితురాలికి ఆశ్రయం ఇచ్చినవారు కూడా నేరస్తులు అవుతారు. ఆ సంగతితెలియదా నీకు?’ నిలదీశాను. రాజాజీ మాట్లాడలేదు. మద్యం సీసాలు తెరచి కాక్టైల్ కలిపాడు. తన కోసం బీర్ సీసా తెరిచాడు.‘అదేమిటి? నువ్వు ఇది తాగవా?’ అడిగాను. తన కోసం బీర్ సీసా ఏర్పాటు చేసుకున్నప్పుడు నా కోసం కూడా బీర్ మాత్రమే ఏర్పాటు చేయాలి కదా! కేవలం నాకు మాత్రమే కాక్టైల్ ఎందుకు కలుపుతున్నాడు? అదే ప్రశ్న అతణ్ని అడిగాను. తేలిగ్గా నవ్వేశాడు రాజాజీ. అతడివైపు మద్యం గ్లాసు జరిపి, బీర్ సీసా అందుకోవాలని చూశాను. అతడు నా చేయి పట్టుకుని కాక్టైల్ మాత్రమే సేవించ వలసిందిగా బలవంత పెట్టాడు. ‘నిజం చెప్పు! నా గ్లాసులో ఏం కలిపావ్?’ గద్దించాను.‘ఛ.. ఛ.. నా కోసం జపాన్ దేశంలో నువ్వు మంచి స్థితి ఏర్పాటు చేశావు. నేనే పాడుజేసుకున్నాను. నిన్ను ఎంత నాశనం చేయాలో అంతా చేశాను. ఇప్పుడు మద్యంలో కూడా ఏదో కలపాలా? ఎందుకు కలపాలి?’ ఆవేశంతో తడబడ్డాడువిశాఖపట్నంలో ఉన్న నా వ్యాపార కార్యాలయానికి నేను తప్ప వేరే యజమానులు లేరు. అందువల్ల ఇక్కడి కార్యాలయం తన గుప్పిట్లో పెట్టుకోవాలని రాజాజీ ఉద్దేశ్యమేమో! అందువల్లే కాబోలు, అప్పుడప్పుడు బహుమతులు ఇస్తూ ఉంటాడు. బంగారపు పూత పూసిన సిగరెట్ లైటర్ల వంటివి నాకు అంటగడుతూ ఉంటాడు.నాకు శరీరం జలదరించింది. అతణ్ని చంపాలని నేను పిస్టల్ తెచ్చాను. కానీ అంతకంటే ముందే నా మీద విష ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యాడు రాజాజీ. నా కంటే వయసులో పెద్దవాడు ఆయన. అందుకే ఆయనకు కావలసిన దానికంటే ఎక్కువే విలువిచ్చాను.నా సంస్థ మీద ఆయన కన్ను వేశాడా? పిస్టల్ తీసి సేఫ్టీ కాచ్ తప్పించాను. పిస్టల్ గొట్టం రాజాజీ ఛాతీకి నొక్కిపెట్టాను. నాలో ఆగ్రహం, ఆవేశం కట్లు తెంచుకున్నాయి. గెయిషా వంటి అనుమానితురాలికి నేను ఆశ్రయం కల్పించాలా? అసలు రాజాజీ ఉద్దేశ్యం ఏమిటి? ఆమె లేకుండా బతకలేడా? మధ్యలో నేనెవరిని?‘ఢాం..!’ గర్జించింది పిస్టల్. నా ప్రయత్నం లేకుండానే ట్రిగ్గర్‌ని లాగింది వేలు. లక్ష్యానికి రెండంగుళాల దూరంలోనే ఉన్నదేమో, పిస్టల్ గొట్టం నుంచి బుల్లెట్ రాజాజీ గుండెల్లోకి దూసుకుపోయి తర్వాత కుర్చీలో సెటిల్ అయింది. నిజం చెప్పొద్దూ..! చాలా గాభరా పుట్టింది. ఒక మనిషిని చంపేటంత కర్కశత్వం నాలో ఉన్నదని నాకు అంతవరకూ తెలియనే తెలియదు. ఆ ఇంట్లోంచి బయట పడ్డాను. నన్ను ఎవ్వరూ గమనించడం లేదు. పిస్టల్ పేలుడు శబ్దం కూడా ఎవర్నీ ఆకర్షించలేదు.రాజాజీ మరణం పోలీసులకు ఒక సవాలుగా మారింది. ఢిల్లీ నుంచి దిగబడిన అతడి కొడుకు వాసుకు ఏం చెప్పి అతణ్ని సముదాయించాలో కూడా వారికి అర్థం కావడంలేదు.నేనూ ఒంటరివాడినే కావడం వల్ల వాసును నేను చేరదీశాను. తన తండ్రిని ఎవరు చంపారో కంటే ఎందువల్ల చంపారో అనే ఆలోచనే వాసును ఆందోళనకు గురిచేస్తోంది.‘రాజాజీ హత్య తర్వాత గెయిషా వ్యవహారం మరుగున పడిపోయింది’ అన్నది నా అభిప్రాయం. కానీ అలా కాలేదు. గెయిషా విషయం వాసుకు పూర్తిగా తెలుసు. తండ్రే అతనికి ఆమె గురించి వివరంగా రాశాడు. రెండోనాటి సాయంకాలానికి కానీ ఈ విషయం నాకు అర్థమైంది కాదు. బీచ్ రోడ్లో కారు నడుపుతున్నాను. కురుసుర సబ్‌మెరైన్ వద్ద ఒక సైకిల్‌వాలా నా కారుకు అడ్డుగా వచ్చాడు. బ్రేక్ మీద కాలు తొక్కిపెట్టాను. కారు చక్రాలు కీచుమంటూ చప్పుడు చేసి కారు ఆగుతుందని ఆశించాను. కారు ఆగలేదు. బ్రేకులు వదులుగా కదులుతున్నాయి. ఉదయం అంతా కారును వాసు వాడాడు. ఆ సమయంలో కారును పాడుచేసి ఉంటాడు. ఏమీ తెలియనట్టు కారుని షెడ్లో పెట్టి ఉంటాడు. ఎందువల్ల?సైకిల్వాలాను ఢీకొట్టింది కారు. వాడు ఎగిరి గోడ అవతలికి పోయి ఇసుకలో పడ్డాడు. నా కారు ఆగడం లేదు. సైకిల్‌వాలాకు దెబ్బలు బలంగా తగిలాయా? అని ఆలోచించే వ్యవధి నాకు లేదు. ఆర్కే బీచ్‌వైపు దూసుకుపోతోంది కారు. పేవ్మెంట్ను రాసుకుంటూ పోయింది. జనంలో హాహాకారాలు చెలరేగుతున్నాయి. ఆ సమయంలో నా మొబైల్ ఫోన్ మోగింది. అవతలివైపు వాసు.ఫోన్ ఆన్ చేశాను. లౌడ్ స్పీకర్లోంచి మాటలు వినిపిస్తున్నాయి.‘మా నాన్నను చంపిన బుల్లెట్ పాయింట్ త్రీటూ కాలిబర్ది. అటువంటి పిస్టల్ నీ పేరున రిజిస్టరై ఉంది. నీ పిస్టల్ని పరిశోధించాను. టీపాయ్ మీద బంగారు పూత పూసిన సిగరెట్ లైటర్ ఉంది. అది మాత్రం నీదే. దాని మీద వేలిముద్రలు కూడా నీవే. ఆయనను చంపవలసిన అవసరం, అవకాశం నీకు మాత్రమే ఉన్నాయి...’ అతడి మాటలు కొనసాగుతూనే ఉన్నాయి.నా కారు అప్పటికే పోలీస్బీట్ను బలంగా ఢీకొట్టింది. కారు పల్టీలు కొడుతోంది. నాకు అంతే తెలుసు. - ఎం.వి.వి. సత్యనారాయణ -
బంజారాహిల్స్‌లో తుపాకీతో వ్యక్తి హల్ చల్
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ వ్యక్తి తుపాకీతో హల్చల్ చేశాడు. రోడ్ నెం-3లోని ఓ ప్రైవేట్ కంపెనీలో చొరబడిన సదరు వ్యక్తి నానా హంగామా చేశాడు. తనకు రూ.25 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. దీంతో కంపెనీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీలోకి చొరబడి బెదిరించడంతో పాటు హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లాడని సిబ్బంది పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తుపాకీతో హల్చల్ చేసిన వ్యక్తి జీడిమెట్లకు చెందిన అమన్ పంచల్ గా గుర్తించారు. -
మంజీరా’ వద్ద జింకల వేట
► నదీ పరీవాహక పరిధిలో పట్టుబడిన వేటగాళ్లు ► నిందితుల వద్ద రైఫిల్, పిస్టల్, కత్తులు స్వాధీనం మనూరు(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మంజీరా పరీవాహకంలో కర్ణాటకలోని బీదర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు వేటగాళ్లు జింకలను, ఇతర వన్యప్రాణులను వేటాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలు.. బీదర్ ప్రాంతం నుంచి డస్టర్ వాహనం (ఏపీ 11ఏఆర్ 3600)లో మోర్గి మీదుగా నాగల్గిద్ద వైపు ఓ వేటగాళ్ల ముఠా వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆ వాహనాన్ని మోర్గి మోడ్ వద్ద పోలీసులు తనిఖీ చేయగా పెద్దఎత్తున ఆయుధాలు లభించాయి. వాహనంలో ముగ్గురు వ్యక్తులతోపాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు. వారిలో బీదర్‌కు చెందిన సయ్యద్ ఓవైసీ ఖాద్రి (31), హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ నజీరుద్దీన్ తాపక్ (48), మహ్మద్ నయీమొద్దీన్ (40)ను విచారించి.. వణ్యప్రాణుల వేటకు వచ్చినట్టు నిర్ధారించారు. వాహనంలో 0.22 రైఫిల్, ఒక మ్యాగ్జిన్ తుపాకీ, పిస్టల్, టార్చిలైట్, రెండు కత్తులు, కటింగ్ ప్లేయర్, తదితర పరికరాలు లభించాయి. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ యాదగిరి రాజు ఆదివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ సైదానాయక్ మాట్లాడుతూ.. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులను వేటాడేందుకు కొందరు యత్నిస్తున్నారన్నారు. కాగా, నాగల్గిద్ద మండలం బీదర్‌కు సమీపంలో ఉండటంతో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
జేఎన్‌యూలో తుపాకి కలకలం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) క్యాంపస్ లో మారణాయుధంతో దొరికిన బ్యాగు కలకలం రేపింది. ఎమ్మెస్సీ బయెటెక్నాలజీ విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యం మిస్టరీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ బ్యాగును స్వాధీనం చేసుకోవడం ఆందోళన రేపుతోంది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఈ బ్యాగును గుర్తించిన యూనివర్సిటీ సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. నలుపు రంగులో ఉన్న ఈ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 7.65 పిస్టల్, ఏడు తూటాలు ఉన్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ బ్యాగు క్యాంపస్ లోకి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అక్టోబర్ 15 నుంచి కనిపించకుండాపోయిన నజీబ్ అహ్మద్ కోసం జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. నజీబ్ అదృశ్యంపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశించారు. -
తుపాకీతో సంచరిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఇచ్చోడ(ఆదిలాబాద్ జిల్లా): ఇచ్చోడ మండల కేంద్రంలో తుపాకీతో సంచరిస్తున్న పడ్వాల్ గోపాల్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇచ్చోడ పోలీసుస్టేషన్లో బోథ్ సీఐ నాగేంద్రచారి, ఎస్సై శంకర్‌నాయక్ వివరాలు వెల్లడించారు. బజార్హత్నూర్ మండలం గొకండ పంచాయతీ పరిధి దాబాడి గ్రామానికి చెందిన పడ్వాల్ గోపాల్ మధ్యప్రదేశ్‌లోని బోపాల్ కు చెందిన గంగారాం వద్ద రూ.15 వేలకు తుపాకి కొనుగోలు చేశాడు. శనివారం సాయంత్రం తుపాకితో గోపాల్ తన స్వగ్రామమైన దాబాడికి ఆటోలో వెళ్తున్నాడు. ఇచ్చోడ ఎస్సై శంకర్‌నాయక్ మండలంలోని అడేగామ కే వద్ద శనివారం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహిస్తూ వాహనాలు తనిఖీ చేశారు. ఆటోలో గోపాల్ వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా తుపాకి లభ్యమైంది. నిందుతుడిని అదుపులోకి తీసుకుని తుపాకి స్వాధీనం చేసుకున్నామని, రిమాండ్‌కు తరలించామని సీఐ, ఎస్సై వివరించారు. -
'భారత్.. హాట్ పిస్టల్ లాంటిది'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి ముందంజలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి భిన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, వియత్నాం, జపాన్ లతో పాటు మెక్సికో పై కూడా తనకు ఎలాంటి కోపం లేదంటూ తన వైఖరి మార్చుకున్నాడు. భారత్ పై కూడా తనకు కోపం లేదంటూనే తమ దేశ ఉద్యోగాలతో పాటు ఎన్నో విషయాల్లో అన్యాయం చేస్తుందంటూ ఆరోపించారు. 'చైనా తన అనుచిత వాణిజ్య విధానాలతో అమెరికాను అత్యాచారం చేస్తోంది. తాను అధికారంలోకి వస్తే చైనా అత్యాచారాలను కొనసాగనివ్వను' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. తనకు ఏ దేశంపైనా విముఖత లేదంటూ కొత్తతరహా ప్రచారానికి తెరతీశాడు. పేలడానికి సిద్ధంగా ఉన్న హాట్ పిస్టల్ లాగ భారత్ ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారత్ ను ఓ సందర్భంలో విమర్శించడం, మరోసారి తనకు ఆ దేశంపై కోపంగా ఉండటం లేదని అక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇండియానాలో ప్రచారంలో భాగంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించారు. ఒబామా ఆర్థిక, వ్యాపార విధానాల వల్ల తాను ప్రస్తావించిన దేశాలు తమ ఉద్యోగాలను కొల్లగట్టాయని పేర్కొన్నారు. 1990లో తలెత్తిన ఆర్థికమాంధ్యం కారణంగా మూడింట ఒక వంతు మంది ఉద్యోగాలు కోల్పోయారని తన ప్రసంగంలో వివరించారు. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చి మా ఉద్యోగాలు కొల్లగొట్టడమే వాళ్ల పని అంటూ భారత్, చైనా, జపాన్ దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు. -
ఫోటో క్లిక్ చేయబోయి.. ట్రిగ్గర్ నొక్కాడు
పటాన్ కోట్: సెల్ఫీల పిచ్చి రోజురోజుకు పరాకాష్టకు చేరుకుంటుంది. వినూత్నంగా సెల్ఫీ దిగాలనే ఓ అనాలోచిత ప్రయత్నం పంజాబ్ లోని పటాన్ కోట్ లోని ఓ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పాయింట్ బ్లాంక్ లో గన్ ను పెట్టుకొని సెల్ఫీ తీసుకోవాలనుకున్న అతని ప్రయత్నం బెడిసికొట్టింది. సెల్ఫీ క్లిక్ మనిపించే సమయంలో గన్ ట్రిగ్గర్ నొక్కడంతో బాలుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. వెంటనే అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. -
కారుకు సైడ్ ఇవ్వలేదని పిస్టల్‌తో..
సుల్తాన్‌బజార్: తన కారుకు సైడ్ ఇవ్వలేదని అసహనానికి గురైన ఓ వ్యక్తి పిస్టల్‌తో బెదిరించి ఓబైకిస్ట్ను చితకబాదిన సంఘటన సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శివశంకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... నారాయణగూడకు చెందిన శ్రీనివాస్(49) వాటర్‌వర్క్స్ ఉద్యోగి. తన మిత్రుడి తల్లి మరణించడంతో సోమవారం యాంజాల్ ప్రాంతానికి వెళ్లి వస్తున్నాడు. యాంజాల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఆర్టీసీ బస్సులో వచ్చిన శ్రీనివాస్, అక్కడ నుంచి ఒక ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగి వస్తున్నాడు. ఈ క్రమంలో కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా వద్ద వాహనం ఇంజన్ ఆగిపోయింది. దాని వెనకనే మలక్‌పేట్‌కు చెందిన హబీబ్(33) కారులో వస్తున్నాడు. ద్విచక్ర వాహనం అడ్డుగా ఉండడంతో హారన్ కొట్టసాగాడు. దీంతో శ్రీనివాస్ ఒక నిమిషం ఆగాల్సిందిగా సైగ చేశాడు. దీంతో అసహనానికి గురైన హబీబ్ కారు దిగివచ్చి తన జేబులో ఉన్న పిస్టల్‌ను తీసి శ్రీనివాస్ కణతకు గురిపెట్టి చంపుతానంటూ చితకబాదాడు. దీంతో చుట్టు పక్కల వారు గుమిగూడారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సుల్తాన్‌బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువురిని సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా హబీబ్ గురిపెట్టిన పిస్టల్‌కు లెసైన్స్ ఉందా.. లేదా.. అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ ఫిర్యాదుతో హబీబ్‌పై సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ కాదు.. స్మార్ట్ ‘గన్’
ఇదేదో కొత్త ‘స్మార్ట్’ ఫోన్లా ఉందని అనుకుంటున్నారా? చూడటానికి ఇది అచ్చు స్మార్ట్‌ఫోన్‌లాగే ఉంటుంది... కానీ నిజానికి ఇదో డబుల్ బ్యారెల్ .380 క్యాలిబర్ పిస్టల్. అమెరికాకు చెందిన ఐడియల్ కన్సీల్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. అచ్చు ఫోన్లా కనపడుతుంది. డమ్మీ కెమెరా, హెడ్‌ఫోన్ పోర్ట్ కూడా దీంట్లో పొందుపర్చారు. దాంతో దీన్ని చూసిన వారెవరూ గన్ అనుకోరు. భద్రతా వలయాలను దాటుకొని కూడా తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుందని... ప్రజా భద్రతకు ఇది తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే తుపాకీ సంస్కృతి బాగా పెరిగిపోయి తరచూ కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఇలాంటి గన్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళితే తీవ్ర ముప్పని గన్ కల్చర్ వ్యతిరేకులు పేర్కొంటున్నారు. అయితే దీన్ని తయారు చేసిన సంస్థ మాత్రం 2016 జూలైకల్లా మార్కెట్లోకి తీసుకొస్తామని చెబుతోంది. దీని ధరను కూడా 395 డాలర్లు (దాదాపు 26,000 రూపాయలు)గా ప్రకటించేసింది. -
ఇది స్మార్ట్ఫోనో, పిస్టలో తేల్చండి!
వాషింగ్టన్: ఇది అచ్చం నూటికి నూరుపాళ్లు స్మార్ట్‌ఫోన్‌లా ఉంది. ఏ ప్యాకెట్లో పెట్టుకున్నా, ఎక్కడికి తీసుకెళ్లినా ఎవరైనా సరే దీన్ని స్మార్ట్ఫోనే అంటారు. కాదన్నా ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా ఇది స్మార్ట్‌ఫోన్ ఎంతమాత్రం కాదు. అలా కనిపించేలా తయారు చేశారు. ఓ డమ్మీ కెమెరా లెన్స్‌ను, ఇయరింగ్ సాకెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇది డబుల్ బారెల్, 380 కాలిబర్ పిస్టల్. దీంతో ఎవరినైనా ఇట్టే షూట్ చేసి చంపొచ్చు. ఇది మూసి ఉన్నప్పుడు మాత్రమే స్మార్ట్‌ఫోన్‌లా ఉంటుంది. సేఫ్టీ లాక్ ఓపెన్ చేస్తే పిస్టల్లా తయారై ట్రిగ్గర్ బయటకు వస్తుంది. ఈ అత్యాధునిక పిస్టల్‌ను ‘ఐడియల్ కన్సీల్’ అనే కంపెనీ తయారు చేసింది. స్థానిక ఉత్పత్తులతోనే దీన్ని తయారు చేశామని, పేటెంట్ రాగానే దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ చెబుతోంది. దాదాపు 27వేల రూపాయలకు అమ్ముతామంటూ ధరను కూడా ప్రకటించేసింది. ఇదంతా బాగానే ఉందిగానీ అసలే తుపాకీ సంస్కృతి ఎక్కువగా ఉన్న అమెరికాలో ఇలాంటి పిస్టళ్లు అందుబాటులోకి వస్తే ఎంత ప్రమాదకరం? టెర్రరిస్టుల చేతుల్లో పడితే జరిగే విధ్వంసానికి అంతు ఉంటుందా? స్మార్ట్‌ఫోన్ లాంటి ఈ పిస్టల్‌ను బహిరంగంగా సెక్యూరిటీ చెకప్ గుండానే విమానాల్లోకి తీసుకుపోవచ్చు. అప్పుడు జరిగే విధ్వంసక పరిణామాలను సులభంగానే ఊహించవచ్చు. ఇలాంటి భయాందోళనలనే వ్యక్తం చేస్తున్నారు ‘కోయలిషన్ టు స్టాప్ గన్ వాయలెన్స్’ సంస్థ డిప్యూటి కమ్యూనికేషన్స్ డెరైక్టర్ ఆండ్రూ ప్యాట్రిక్. ఈ పిస్టల్కే గనుక పేటెంట్‌ను కల్పించినట్లయితే గన్ సంస్కృతి తీవ్రంగా పెరిగిపోతోందని ఆయన భయాందోళనలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా పిస్టల్ పెట్టుకున్న బ్యాడ్ బాయ్ ఎవరో, స్మార్ట్‌ఫోన్ పెట్టుకున్న గుడ్‌బాయ్ ఎవరో గుర్తుపట్టడం కూడా కష్టమని ఆయన అన్నారు. ఆ పరిస్థితే వస్తే, ఎవరూ జేబులోనుంచి స్మార్ట్‌ఫోన్ తీసినా అది పిస్టల్ అనుకొని భయపడాల్సి వస్తుందని ప్యాట్రిక్ వ్యాఖ్యానించారు. భద్రతా దళాల అధికారులు కూడా ఇలాంటి భయాందోళనలే వ్యక్తం చేస్తున్నారు. వారి భయాందోళనలను తాము అర్థం చేసుకున్నామని, శత్రువుల నుంచి ముప్పున్న వారికి కేవలం ఆత్మరక్షణార్థమే వీటిని విక్రయిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ పిస్టళ్లు వారికి మాత్రమే పరిమితమవుతాయన్న గ్యారెంటీ ఏమీ లేదుకదా! అయినా లెసైన్స్ తుపాకుల పట్ల మోజు చూపించేవారు మాత్రం ఈ పిస్టళ్లు ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తాయా! అని ఎదురుచూస్తున్నారు. -
పట్టుబడిన పిస్టళ్లు, బులెట్లు!
-
ఇంట్లో వాళ్లకు మత్తు మందిచ్చి...ఉడాయించింది
లక్నో: కుటుంబ సభ్యులకు మత్తుమందు ఇచ్చి భారీగా నగలు, నగదుతో పాటు తుపాకీతో ఓ మహిళ పరారైన వైనం ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్‌లో కలకలం రేపింది. ఫిరోజాబాద్ కు చెందిన సరిత సుమారు రూ.20 లక్షల నగదు, విలువైన బంగారు ఆభరణాలతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. గత రాత్రి కుటుంబ సభ్యులకు మత్తు మందు కలిపి ఇచ్చిన ఆమె వారు మత్తులోకి జారుకోగానే, ఇంట్లో ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో సహా ఉడాయించింది. తెల్లారి తేరుకున్న కుటుంబ సభ్యులు ...సరిత కనిపించకపోవడంతో పాటు ఇంట్లో విలువైన వస్తువులు మాయం కావడంతో స్థానిక కొత్వాల్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారణ నిమిత్తం ఒక కమిటీని నియమించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. యువతి పారిపోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నామని, ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. -
పిస్టల్ కలకలం...
పిస్టల్, ఐదు బుల్లెట్లతో ఇద్దరి అరెస్టు గంజాయి స్మగ్లర్లు ఇచ్చారంటున్న నిందితులు మావోలకు చేరవేస్తున్నారని అనుమానం పెదబయలు : మండలంలో ఆదివారం రాత్రి పోలీసులు ఇద్దరు గిరిజనులకు ఆదుపులో తీసుకుని వారి నుంచి పిస్టల్, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటన మండలంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం, పెదకోడాపల్లి పంచాయితీ కొత్తపోయిపల్లి గ్రామానికి చెందిన పాంగి భాస్కర్‌రావు, ఇదే గ్రామానికి చెందిన భాస్కర్‌రావుల నుంచి ఐదు నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన గంజా యి స్మగ్లర్ గంజాయి కొనుగోలు చేసి, కొంత సొమ్ము చెల్లించాడు. మిగతా డబ్బు కోసం పిస్టల్‌ను తనఖా పెట్టాడు. అయితే ఐదు నెలలు గడిచినా మహారాష్ట్ర స్మగ్లర్ రాకపోవడంలో పిస్టల్‌ను విక్రయించాలని భాస్కరరావులు ఇద్దరూ భావించారు. మారుమూల ప్రాంతంలో దానిని విక్రయించడానికి ఇద్దరూ కలిసి ఆదివారం పిస్టల్ పట్టుకుని వెళుతున్న సమయంలో పెదకోడాపల్లి లక్ష్మీపేట మార్గమధ్యంలో పోలీసులకు దొరికిపోయారు. పిస్టల్‌తో దొరికిన పాంగి భాస్కర్‌రావు గతంలో 15 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. పాడేరులో రెడ్డి జ్యూయలరీపై దాడి కేసులో నిందితుడు కావడంతో పోలీసులు అతను చెప్పినదానిపై ఆధారపడకుండా భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద నిజంగా గంజాయి స్మగ్లర్లు పిస్టల్, బుల్లెట్లు డబ్బు కోసం ఉంచి వెళ్లారా? లేక మావోయిస్టులకు చేరవేతకు తరలిస్తున్నారా? అనేది విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై పాడేరు సీఐ సాయిని ‘సాక్షి’ వివరణ కోరగా దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. -
లక్ష్మీపేటలో వ్యక్తి తుపాకీతో హల్చల్
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పెద్దబయిలు మండలం లక్ష్మీపేటలో ఓ వ్యక్తి సోమవారం తుపాకీతో హల్చల్ చేశాడు. దాంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. గ్రామస్థులంతా సదరు వ్యక్తిని బంధించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లక్ష్మీపేటకు చేరుకున్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని విచారిస్తుండగా.... అక్కడి నుంచి పరారైయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు, గ్రామస్థులు ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే పరారైయ్యాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కర్నూలులో పిస్టల్ కలకలం
కర్నూలు : పిస్టల్ చూపించి ఓ వ్యక్తిని బెదిరించిన సంఘటన కర్నూలు జిల్లా కల్లూరు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. కర్నూలుకు చెందిన ఇసాక్ అనే బంగారు వ్యాపారి, ఓ కొనుగోలు దారుడితో వ్యాపార లావాదేవీల్లో తేడా రావడంతో పిస్టల్‌తో బెదిరించినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని నుంచి పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పిస్టల్‌కు లెసైన్స్ లేనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇతనికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇసాక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రివాల్వర్ని మాయం చేసినపోలీసులు
-
కొవ్వూరు గౌతమిఘాట్‌లో తుపాకీ కలకలం
-
కొవ్వూరు గౌతమిఘాట్‌లో తుపాకీ కలకలం
కొవ్వూరు : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గౌతమి మహర్షి పుష్కరఘాట్‌లో గురువారం తుపాకీ కలకలం సృష్టించింది. గురవారం పుష్కరఘాట్‌లో పని చేసే కార్మికులు ఓ వ్యక్తి వద్ద తుపాకీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకొని, అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా, సీఎం చంద్రబాబు నేడు జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకొని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా తుపాకీ బయటపడటం కలకలం రేపుతోంది. -
వరంగల్ ఎంజీఎంలో తుపాకీ కలకలం
-
వరంగల్ ఎంజీఎంలో తుపాకీ కలకలం
వరంగల్: దుండగులు తుపాకీతో కలకలం సృష్టించారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలోకి చొరబడ్డారు. గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దొంగలా.. ఉగ్రవాదులా..?
నకిరేకల్ పట్టణంలో ఇద్దరు దుండగులు మంగళవారం పిస్టల్‌తో హల్చల్ సృష్టించారు. వారి సమాచారం అందుకుని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులపై పిస్టల్గురిపెట్టి బైక్‌పై పారిపోయారు. వీరు దొంగలా.. ఉగ్రవాదులా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమనుంచి తప్పించుకుని పారిపోయిన యువకులు దొంగలేనని పోలీసులు పేర్కొంటున్నారు. నకిరేకల్ :పట్టణంలో గుర్తుతెలియని దుండగులు పిస్టల్‌తో సంచరించడం సంచలనం సృష్టించింది. అయితే సదరు వ్యక్తులు దొంగలా..ఉగ్రవాదులా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం తమ నుంచి తప్పించుకుపోయిన ఇద్దరు యువకులు దొంగలేనని కొట్టిపారేస్తున్నారు. వివరాలు.. జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఇద్దరు యువకులు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని నకిరేకల్ వైపు వైట్ కలర్ అపాచీ బైక్‌పై పరారైనట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఉన్నతాధికారులు నకిరేకల్ పోలీసులను అప్రమత్తం చేశారు. చిక్కినట్టే చిక్కి.. దొంగల సమాచారం అందుకున్న నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు కేశవరెడ్డి, సతీష్‌లు బైక్‌పై సివిల్‌డ్రెస్‌లో మూసీ, హైవే రోడ్డు వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఆఫీసర్స్ కాలనీలో ఇద్దరు యువకులు వైట్‌కలర్ అపాచీపై సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో కానిస్టేబుళ్లు ఆ కాలనీ వైపు వెళ్లారు. ఆఫీసర్స్ క్లబ్ వెనుక సందులో నుంచి ఏపీ 13 ఆర్యూ 4379 నంబరు గల వైట్ కలర్ అపాచీపై వస్తున్న దుండగులను కానిస్టేబుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాలనీలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొడంతో కిందపడిపోయారు. అపాచీ బైక్ నడుపుతున్న ఓ దుండగుడి కాలు బైక్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే సివిల్ డ్రస్‌లో ఉన్న కానిస్టేబుళ్లు లేచి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లు, దుండగుల మధ్య పెనుగులాట కూడా జరిగింది. ఈ క్రమంలో బైక్‌పై వెనుక కూర్చొని వచ్చిన దుండగుడు తన జేబులో నుంచి పిస్టల్‌ను తీసి కానిస్టేబుళ్లకు ఎక్కుపెట్టాడు. ప్రాణభయంతో భీతిల్లిపోయిన కానిస్టేబుళ్లు కాలనీలోని గృహాల వైపు పరుగుతీశారు. అనంతరం సదరు దుండగులు బైక్ తీసుకుని సూర్యాపేట వైపు పారిపోయారు. మళ్లీ.. అదే తప్పు..! ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అనే నానుడిని పోలీసు శాఖ వంటపట్టించుకున్నట్టు కనిపించడం లేదు. నిందితులను పట్టుకోవడంలో ఆ శాఖ అధికారుల డొల్లతనం మరోసారి ప్రస్పుటంగా వెల్లడైంది. రెండు మాసాల క్రితమే సూర్యాపేట, అర్వపల్లిలో ఆయుధాలు లేని కారణంగా ఆ శాఖ అధికారులు భారీ మూల్యమే చెల్లించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ కూడా దుండగుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆయుధాలు లేకుండానే వారిని వెంబడించి ఖంగుతిని బతుకుజీవుడా అంటూ పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ సదరు దుండగుడు పిస్టల్‌ను చూపించి మాత్రమే బెదిరించాడు. గురిపెట్టి కాల్చి ఉంటే మరో ఇద్దరు ఖాకీల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవేనని స్థానికంగా చర్చజరుగుతోంది. ఈ ఘటన విషయం తెలుసుకుని ఆఫీసర్స్ కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. డీఎస్పీ సందర్శన నకిరేకల్‌లో ఇద్దరు దొంగలు పిస్టల్‌తో వచ్చిన సంఘటన తెలుసుకున్న నల్లగొండ డీఎస్పీ రాములు నాయక్, స్థానిక సీఐ బాలకృష్ణ తన పోలీసుల బలగాలతో ఆఫీసర్స్ కాలనీని సందర్శించారు. దొంగలు బైక్ నుంచి కింద పడి పారిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. బైక్‌పై పరారైన ఈ ఇద్దరు దొంగల గ్యాంగ్గానే నిర్ధారించినట్లు డీఎస్పీ రాములు నాయక్ తెలి పారు. మహిళల మెడలో నుంచి గొలుసులను చోరీ చేసేందుకు కత్తులు, బొమ్మ పిస్టల్‌తో సంచరిస్తున్నారని డీఎస్పీ వెల్లడించారు. ఈ విషయంపై విచారణ జరిపి పారిపోయిన దొం గల ముఠాను పట్టుకుంటామన్నారు. కాగా, నకిరేకల్ వైపు బైక్ పై వస్తున్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు నకిరేకల్ మండలం మర్రూర్‌కు చెందిన అన్నదమ్ములు షేక్ సయ్యద్‌మియా, షేక్ అబూ బఖర్ సూ ర్యా పేటలోని స్వరాజ్ట్రాక్టర్ షోరూంలో *26 వేలు చెల్లిం చేందుకు వస్తున్నారని తెలియడంతో విడిచిపెట్టారు. పట్టుకునే ప్రయత్నం చేశాం: కానిస్టేబుళ్లు కేశవరెడ్డి, సతీష్ నకిరేకల్‌లో బైక్‌పై ఇద్దరు దొంగలు సంచరిస్తున్నట్లు తమకు సమాచారం రావ డంతో వెంటనే బైక్‌పై గాలింపు చర్యలు చేపట్టాం. మధ్యాహ్నం 12:20నిమిషాల సమయంలో ఆఫీసర్స్ కాలనీలోని ఆఫీసర్స్ క్లబ్ వెనక సందులో వెళ్తుండగా వారికి ఎదురుగా వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేశాం. ఈ క్రమంలో దుండగులు, తాము బైక్‌లపై నుంచి కిందపడ్డాం. దొంగలను కూడా పట్టుకున్నాం. బైక్‌పై వెనక కూర్చున్న వ్యక్తి తన జేబులో నుంచి నల్లటి ఆకారంలో ఎదో బయటకు తీశాడు. వెంటనే మేము పక్కకు వెళ్లిపోయాం. ఆ తరువాత దొంగలు బైక్‌పై పరారయ్యారు. దుండగుల వయస్సు 30లోపే పట్టణానికి పిస్టల్‌తో వచ్చి పోలీసులపై గురి పెట్టి పరారైన దుండగులు 27-30 వయస్సు ఉన్నట్టు ఆఫీసర్స కాలనీవాసులు చెబుతున్నారు. దుం డగుల్లో ఒకరు జీన్స్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్ వేసుకుని గడ్డంతో ఉన్నాడని, మరొకరు బైక్ నడుపుతూ ముఖానికి ముసుగు కట్టుకున్నాడని తెలి పారు. వారిలో ఒకడు పోలీసులపై కాల్చడానికి గురి పెట్టాడని,అది పేల కపోవడంతో పరారయ్యారని కాలనీకి చెందిన ఓ మహిళ తెలిపింది. ఇద్దరు ఎదో భాషలో మాట్లాడుతున్నారని కాలనీవాసులు తెలిపారు. -
తుపాకీతో బెదిరించి బంగారం చోరీ
మేడ్చల్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలో గుర్తుతెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ మండలం పూడూరు చౌరస్తా వద్ద ఇద్దరు మహిళలను గుర్తుతెలియని దుండగులు వెంబడించారు. తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆ మహిళలను బెదిరించి వారి నుంచి 15 తులాల బంగారం దోచుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పిస్తోలు మిస్‌ఫైర్: హెడ్ కానిస్టేబుల్ మృతి
పిస్తోలు మిస్‌ఫైర్: హెడ్ కానిస్టేబుల్ మృతి విశాఖపట్నం: పిస్తోలు చెక్ చేసే ప్రయత్నంలో మిస్‌ఫైర్ కావడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ఒకరు మృతి చెందగా మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ రైల్వే డివిజనల్ కార్యాలయం వెనుక భాగాన ఆయుధాలను భద్రపరిచే గదిలో ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. రైల్వే డీజిల్ లోకోషెడ్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన రైల్వే బోర్డు సభ్యుడు (మెకానికల్) హేమంత్‌కుమార్ ఆదివారం ఉదయం అరకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఆయనకు ఎస్కార్ట్‌గా వెళ్లాల్సిన బృందంలోని వారికి కేటాయించిన 9 ఎమ్ఎమ్ పిస్తోలును అక్కడి సిబ్బంది అందజేశారు. ఇలా కానిస్టేబుల్ కె.సి.ప్రధాని తన పిస్తోలును చెక్ చేస్తుండగా మిస్‌ఫైర్ అయింది. పక్కనే ఉన్న హెచ్.సి. ధర్మాన ముసలయ్య (48) ఛాతీలోకి బుల్లెట్ దిగబడి, ముందుకు దూసుకుపోయి పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ ఎస్.మల్లికార్జునరావు ఛాతీ వెనుక భాగాన దిగబడింది. వీరిని పక్కనే ఉన్న రైల్వే ఆస్పత్రికి తరలిస్తుండగా ముసలయ్య మృతి చెందాడు. మల్లికార్జునరావుకు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారు. రైల్వే పోలీసులు, టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తూటాలతో ఆటలా!
ఏఆర్ కానిస్టేబుల్ నిర్వాకం సినీ ఫక్కీలో పిస్టల్ తిప్పిన వైనం దూసుకొచ్చిన తూటాతో తప్పిన ముప్పు విజయవాడ సిటీ : కమిషనరేట్ సాయుధ పోలీసుల క్రమశిక్షణ గాడితప్పుతోంది. జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆయుధాలను ఆకతాయితనంగా ఉపయోగిస్తున్నారు. దీంతో తరచూ తుపాకీ తూటాలు బయటకు దూసుకొస్తున్నాయి. మూడు రోజుల కిందట మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద తుపాకీ పేలిన విషయం మరిచిపోకముందే నగర సాయుధ విభాగంలో ఆదివారం రాత్రి మరో ఘటన చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ సినీ ఫక్కీలో పిస్టల్ తిప్పడంతో తూటా బయటకు దూసుకొచ్చి త్రుటిలో ప్రమాదం తప్పింది. రాష్ట్ర మంత్రి పీతల సుజాత ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో నగరానికి వచ్చారు. ఆమెకు ఎస్కార్టుగా ఓ ఆర్ఎస్ఐ సహా ఆరుగురిని పంపారు. తిరిగి వచ్చిన తర్వాత వీరు ఆర్మర్ విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ కుమారస్వామికి ఆయుధాలు అందజేశారు. వాటిని తీసుకున్న స్వామి తనకు ఏఆర్ ఎస్ఐ ఇచ్చిన 9 ఎంఎం పిస్టల్‌ను సినీ స్టైల్లో చేత్తో తిప్పారు. ప్రమాదవశాత్తు చే యి తగిలి బుల్లెట్ బయటకు దూసుకొచ్చింది. అక్కడున్న సిబ్బంది మధ్య నుంచి తూటా దూసుకెళ్లడంతో సిబ్బంది చాకచక్యంగా తప్పుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఏఆర్ అధికారులతో పాటు డీసీపీ (పరిపాలన) జి.వి.జి.అశోక్‌కుమార్ ఆయుధగారానికి చేరుకుని విచారణ జరిపారు. ఆ తర్వాత స్వామిని ఆర్మర్ విధుల నుంచి తప్పించారు. సమగ్ర విచారణ జరిపిన తర్వాత నిర్లక్ష్యం వెల్లడైతే శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవల వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై ఏఆర్ అధికారులపై కమిషనరేట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపులకు అలవాటుపడిన ఏఆర్ అధికారులు ప్రాధ్యాతన కలిగిన చోట్ల సైతం అనుభవం లేని వారిని నియమిస్తున్నారనే విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఏదో ఒక వంకతో ఏళ్లతరబడి ఉద్యోగులు ఇక్కడే తిష్ట వేస్తున్న విషయం అధికారులు గుర్తించారు. అవగాహన కల్పించాలి: డీసీపీ ఆయుధాల వాడకం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు నిర్ణయించినట్టు డీసీపీ అశోక్‌కుమార్ చెప్పారు. జరిగిన ఘటనపై ఆయన సాక్షితో మాట్లాడుతూ ఆదివారం రాత్రి కానిస్టేబుల్ తప్పిదం వల్ల తూటా బయటకు వచ్చిందని చెప్పారు. ఇటీవల మంత్రి దేవినేని ఇంట్లో కూడా ఇదే తరహాలో జరిగిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఆయుధాల వాడకం, శుభ్రం చేయడం వంటి అంశాలపై సిబ్బందికి అవగాహన కలిగించాల్సి ఉందని గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ నుంచి తగిన అనుమతి రాగానే కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. -
పిస్టల్‌తో బెదిరించి తాళితో పరారీ
శ్రీకాకుళం: టెక్కలి మండల కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీలో ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. తంగుడు స్వప్న అనే మహిళ మెడలో నుంచి తాళిని లాక్కుని వెళ్తుండగా.. ఆమె ప్రతిఘటించడంతో అతడు కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఆమె కాలుకి గాయమైంది. దుండుగుడు ఆమెను పిస్టల్‌తో బెదిరించి పుస్తెలతాడు తీసుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. (టెక్కలి) -
తుపాకీతో లోపలకు వెళ్లిన వ్యక్తిని గుర్తించలేకపోయారు!
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపలకు తుపాకీతో వెళ్లిన వ్యక్తిని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించలేకపోయింది. పోలీసుల డెకాయిట్ ఆపరేషన్‌లో ఆ వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని, రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. -
చెత్త కుప్పలో తుపాకీ
ఉలిక్కిపడిన విజయవాడ వాసులు * చెత్త కుప్పలో దొరికిన రివాల్వర్ * బొమ్మ తుపాకి అంటున్న పోలీసులు * పోలీసుల వైఖరిపై అనుమానాలు విజయవాడ సిటీ : నగరంలో మళ్లీ రివాల్వర్ కలకలం రేగింది. ఖరీదైన వ్యక్తులు తిరిగే ప్రాం తంలో రివాల్వర్ దొరకడం పోలీసు వర్గాలను ఉరుకులు పరుగులు పెట్టించగా.. స్థానికులను ఆందోళనకు గురి చేసింది. రివాల్వర్ స్వాధీనం చేసుకున్న నగర పోలీసు యంత్రాంగం పరిశీలన తర్వాత సిగరెట్ వెలిగించుకునేందుకు ఉపయోగించే బొమ్మ తుపాకీగా నిర్ధారించారు. అయితే దీనిని గోప్యంగా ఉంచడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనరేట్ ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడమే దీనిని బహిర్గతం చేయకపోవడానికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం లబ్బీపేట రెవెన్యూ కాలనీలోని కామినేని వెంకటేశ్వరరావు వీధిలో ఓ వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో చెత్త తరలిస్తుండగా రివాల్వర్ బయటపడింది. దీంతో చెత్త తరలింపుదారులు ఆందోళనకు గురై విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. టాస్క్‌ఫోర్స్, మాచవరం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. నగరవాసుల్లో ఆందోళన లబ్బీపేటలో రివాల్వర్ లభ్యమైందనే సమాచారం నగరవాసుల్లో ఆందోళన రేకెత్తించింది. గతంలో చోటు చేసుకున్న ఘటనలే నగరవాసులు ఉలిక్కిపడేందుకు కారణం. ఉంగుటూరు మండలం పెద అవుటపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ట్రిపుల్ మర్డర్, నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొగ్గవరపు శ్రీశైలవాసు హత్యల్లో అత్యాధునిక తుపాకులను నిందితులు ఉపయోగించారు. గత కొంతకాలంగా జిల్లాలో పెరిగిపోయిన గన్ కల్చర్ నగరవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే లబ్బీపేటలో రివాల్వర్ దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది. రివాల్వర్ దొరికినట్టుగా చెపుతున్న ప్రాంతానికి చేరువలో ఖరీదైన వ్యక్తులు బస చేసే స్టార్ హోటళ్లు ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు కూడా తరుచూ ఇక్కడ బస చేస్తున్నారు. రాజధాని ప్రకటన తర్వాత రాయలసీమ, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ బస చేస్తున్నారు. నగరం చుట్టు పక్కల భూములు కొనుగోలు చేసేవారి రాకతో ఇక్కడి ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. హోటల్ గదులు కూడా వీరి రాకతో ఖాళీ ఉండటం లేదు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతంలో రివాల్వర్ దొరికడం పలు అనుమానాలకు ఆస్కారం కలిగించింది. విషయం దావానంలా వ్యాపించడంతో పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ఆందోళన చెందారు. దొరికిన రివాల్వర్‌ను బొమ్మ తుపాకీగా పోలీసులు చెపుతున్నప్పటికీ ఇక్కడి వారిలో నెలకొన్న సందేహాలు వీడలేదు. గోప్యంగా ఉంచారు.. రివాల్వర్ దొరికిందనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. లబ్బీపేటలో వీరు రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్టు తెలి యగా.. మీడియా ప్రతినిథులు పోలీసులను ఆరా తీశారు. తొలుత.. ‘రివాల్వరా? దొరికిందా?’ అంటూ ఆశ్చర్యం నటించారు. చివరకు మీడియా ప్రతినిథులు గట్టిగా మాచవరం పోలీసులను నిలదీయడంతో.. కొంతసేపు టాస్క్‌ఫోర్స్‌లోనూ, మరికొంత సేసు సీసీఎస్లోను ఉందంటూ చెప్పా రు. మరికొంత సమయం తర్వాత దొరికింది సిగరెట్ లైటర్‌గా ఉపయోగించే బొమ్మ తుపాకీ అంటూ సెలవిచ్చారు. అది కూడా పై అధికారుల పరిశీలనలో ఉందని చెప్పి దాటవేశారు. ఈ హైడ్రామా మూడు నుంచి నాలుగు గంటల పాటు జరిగింది. నిజంగా బొమ్మ తుపాకీ కోసం ఇంతటి గోప్యత పాటించాల్సిన అవసరం లేదు. అది వెంటనే తెలిసి పోతుంది. నిజంగా బొమ్మ తుపాకీ కాబట్టి మీడియా సమక్షంలో ప్రదర్శిస్తే సరిపోయేది. అంతే తప్ప చివరి వరకు కూడా బొమ్మ తుపాకీగా చెపుతూ గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోంది. -
ఢిల్లీలో బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు
న్యూఢిల్లీ: షాదారా బీజేపీ ఎమ్మెల్యే జితేంద్రసింగ్ షంటీపై గుర్తుతెలియని వ్యక్తి బుధవారం పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. అరుుతే బుల్లెట్లు ఆయనకు చాలా సమీపం నుంచి మాత్రమే దూసుకుపోవడంతో షంటీ ఎలాంటి గాయూలూ కాకుండా తప్పించుకోగలిగారు. తూర్పు ఢిల్లీ వివేక్ విహార్ ప్రాంతంలోని ఎమ్మెల్యే ఇంటి బయట 5.30 సమయంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. సంఘటన సీసీ టీవీల్లో రికార్డయ్యిది. పోలీసుల కథనం ప్రకారం.. షంటీ నివాసానికి హెల్మెట్‌తో వచ్చిన ఓ వ్యక్తి.. అతి సమీపం నుంచి మూడు, నాలుగుసార్లు కాల్పులు జరిపి పరారయ్యూడు. అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేకు బుల్లెట్లు తగలకపోవటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. హెల్మెట్ ధరిం చి ఉండటంతో ఆ వ్యక్తి ఎవరో తాను గుర్తుపట్టలేక పోయూనని పోలీసులకు ఎమ్మెల్యే చెప్పారు. -
పేషెంట్‌నంటూ వచ్చి... పిస్టల్ చూపించి...
వైద్యురాలి నగల దోపిడి గోల్కొండ: రోగినంటూ ఆసుపత్రికి వచ్చిన యువకుడు పిస్టల్ చూపించి వైద్యురాలి ఆభరణాలను దోచుకుపోయాడు. షేక్‌పేట్ నాలా సమీపంలోని రెయిన్బో అపార్ట్మెంట్లో డాక్టర్ విజయలక్ష్మి డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి 8.30 సమయంలో క్లినిక్‌కు వచ్చిన ఓ యువకుడు (24) పంటి నొప్పి ఉందని చెప్పాడు. విజయలక్ష్మి చికిత్స చేస్తుండగానే, తన జేబులోంచి పిస్టల్ తీసి.. ఒంటిపై ఉన్న బంగారు నగల్ని టేబుల్‌పై పెట్టాలని బెదిరించాడు. డాక్టర్ మూడు జతల గాజులు, మూడు తులాల గొలుసు తదితర పది తులాల బంగారు ఆభరణాలను టేబుల్‌పై ఉంచారు. వాటిని జేబులో కుక్కుకుని యువకుడు పరారయ్యాడు. అనంతరం బాధితురాలు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పట్టపగలు దారుణం
మార్కాపురం, న్యూస్‌లైన్: స్నేహితుని ఇంటికి వెళ్లిన ఓ ఆటో యజమానిని పట్టపగలు పిస్టల్‌తో నుదుటిపై కాల్చి హత్య చేసిన సంఘటన మార్కాపురంలో మంగళవారం సంచలనం రేపింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మృతుడు నాగూర్‌వలికి రెండు ఆటోలున్నాయి. వాటిని బాడుగకు తిప్పుతుంటాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన నాగూర్వలి పట్టణంలోని విద్యానగర్ నాలుగో లైనులో నివాసం ఉంటున్న తన మిత్రుడు షేక్ మహబూబ్‌బాషా ఇంటికి వెళ్లాడు. మహబూబ్‌బాషా ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. 11.30 నుంచి 12 గంటల మధ్య బాషా ఇంట్లో నుంచి పిస్టల్ పేల్చిన శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా..నాగూర్వలి రక్తపు మడుగు మధ్య మృతిచెంది ఉండటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని నుదుటిపై బుల్లెట్ గాయం ఉంది. చెవులు, ముక్కు, తలలో నుంచి రక్తం కారింది. డీఎస్పీ జీ రామాంజనేయులు, సీఐ ఎ.శివరామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్సై దేవకుమార్‌లు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు నాగూర్‌వలికి సన్నిహితంగా ఉన్నవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని, ఆర్ధికపరమైన, అక్రమ సంబంధమైన కారణాలే హత్యకు కారణమై ఉండవచ్చునని భావించి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ఇంటి యజమాని మహబూబ్‌బాషా పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హంతకునికి పిస్టల్ ఎలా వచ్చిందనే అంశం చర్చనీయాంశమైంది. మృతుడు నాగూర్‌వలికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడు నాగూర్వలి తల్లి రోకాబి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరైంది. రోకాబికి ఇద్దరు కుమారులు కాగా..నాగూర్వలి పెద్ద కుమారుడు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో నాగూర్వలి తమ్ముడు నాగూర్బాషాతో పాటు అతని తల్లి, కుటుంబ సభ్యులు అంతా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘అన్యాయంగా నా కొడుకును మీ పొట్టన పెట్టుకున్నారు. మీకేం ద్రోహం చేశాడని కాల్చి చంపారయ్యా..’ అంటూ రోకాబి విలపించిన తీరు చూపరులను కలచివేసింది. -
ఖైదీ చేతికి తుపాకీ!
ఒంగోలు : ఒంగోలు జిల్లా జైలు నుంచి ఓ ఖైదీని వైద్య పరీక్షల కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించడానికి ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అయితే వాహనం నడిపే కానిస్టేబులు తన తుపాకీ (వెపన్)ని మధ్యలో కూర్చున్న ఖైదీ చేదికిచ్చాడు. ఖైదీలను కోర్టులకు, ఆస్పత్రులకు తరలించేటప్పుడు వారు పోలీసుల కళ్లుగప్పి పారిపోతున్న సంఘటనలు తరచూ సంభవిస్తున్నా ఖాకీల తీరు ఏమాత్రం మారలేదనడానికి ఈ చిత్రం ఓ నిదర్శనం. -
ఓబులవారిపల్లె మండలం జీవీపురంలో దారుణ హత్య
పుల్లంపేట(ఓబులవారిపల్లె),న్యూస్‌లైన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్న వారిపై మరోసారి తుపాకీ తూటా పేలింది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఉన్మాది ఈ సారి తోట సుబ్రమణ్యం(45) అనే వ్యక్తిని తన తూటాకు బలి తీసుకున్నాడు. గ్రామానికి చెందిన ఐదుగురిని లక్ష్యంగా చేసుకుని 2009లో ప్రారంభమైన హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఓబులవారిపల్లె మండలం గాదెల వెంకటాపురం (జీవీ పురం) గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పొలం పనులు చేసుకుంటున్న తోట సుబ్రమణ్యం (45) అనే వ్యక్తిపై పొదల మాటున దాక్కున్న వెంకటరమణ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో సుబ్రమణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. తన కుటుంబానికి దాయాదులు అన్యాయం చేశారనే కసితో ఉన్మాది వరుస హత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 2009 జూన్30వ తేదీన వెంకటరమణ, 2012 జూన్ 29న బండి. రామకృష్ణయ్య అనే వ్యక్తులు హతమయ్యారు. ప్రస్తుతం తోట సుబ్రమణ్యం కూడా ఇదే రీతిలో తుపాకీకి బలికావడం గమనార్హం. తోట సుబ్రమణ్యంకు ప్రాణ హాని ఉందనే కారణంగా గతంలో పోలీసులు ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఎస్కార్టు ఖర్చులు తాను భరించలేనని చెప్పడంతో పోలీసులు ఎస్కార్టును ఉపసంహరించారు. ఇదే అదనుగా భావించిన నిందితుడు పక్కా సమాచారం, ప్రణాళికతో హత్యచే సి పారిపోయినట్లు స్పష్టమవుతోంది. సంఘటన తెల్లవారుజామున జరిగితే ఉదయం 7 గంటల వరకు కూడా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో పోలీస్ పికెట్ ఉన్నప్పటికీ ఈ హత్య జరగడం పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. సంఘటన స్థలాన్ని రాజంపేట డీఎస్పీ అన్యోన్య, సీఐ రమాకాంత్, ఎస్ఐ మోహన్‌లు సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు .మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య,ఐదుగురు పిల్లలు ఉన్నారు. కాగా గ్రామానికి చెందిన గద్దె చిన్నవెంకటయ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్మాది హిట్ లిస్టులో ఉన్నట్లు సమాచారం. -
గోల్డ్ మెడల్లో భారత షూటర్ హీనా రికార్డ్