బంజారాహిల్స్‌లో తుపాకీతో వ్యక్తి హల్ చల్
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ వ్యక్తి తుపాకీతో హల్‌చల్ చేశాడు. రోడ్ నెం-3లోని ఓ ప్రైవేట్ కంపెనీలో చొరబడిన సదరు వ్యక్తి నానా హంగామా చేశాడు. తనకు రూ.25 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. దీంతో కంపెనీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కంపెనీలోకి చొరబడి బెదిరించడంతో పాటు హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లాడని సిబ్బంది పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తుపాకీతో హల్‌చల్ చేసిన వ్యక్తి జీడిమెట్లకు చెందిన అమన్ పంచల్ గా గుర్తించారు.