![One Person Arrest In Banjara Hills police](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/132323.jpg.webp?itok=s6SkAMW8)
ఆమె కూతురిపై లైంగికదాడి
బంజారాహిల్స్(హైదరాబాద్): అక్కా అంటూ పిలుస్తూ ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో ఆమె కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మోతీనగర్‌లో నివసించే బత్తుల శివ (33) కారు డ్రైవర్‌గా జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ వద్ద పనిచేస్తున్నాడు.
అదే కంపెనీ బిల్డింగ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మహిళను పరిచయం చేసుకుని అక్కా అంటూ తరచూ ఇంటికి వెళ్తూ ఆమె భర్తతో కలిసి మద్యం తాగేవాడు. శనివారం రాత్రి బాధిత యువతి తండ్రి తీర్థయాత్రలకు వెళ్లగా, తల్లి అదే బిల్డింగ్ మొదటి అంతస్తులో పని కోసం వెళ్లింది. బాధితురాలి సోదరుడు కూడా అదే బిల్డింగ్‌కు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా మొదటి అంతస్తులో ఉన్నాడు. రాత్రి 8 గంటల సమయంలో బాధిత యువతి ఇంట్లో ఉండగా బత్తుల శివ వచ్చాడు. రాత్రి 11.30 గంటల వరకు ఇద్దరు మాట్లాడుకున్నాక..ఇక తాను వెళ్తానని శివ చెప్పగా యువతి బెడ్‌పై నిద్రకు ఉపక్రమించింది.
అరగంట తర్వాత ఆమె మేల్కొనగా..శివ కదలికలు కనిపించడంతో ఒక్కసారిగా అరవాలని ప్రయత్నించింది. దిండుతో ఆమె నోరు నొక్కేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, నువ్వు ప్రేమించిన యువకుడితో పెళ్లి చేస్తానని నమ్మించాడు. అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంట్లో నుంచి వెళ్లిపోగా జరిగిన ఘటనపై బాధిత యువతి తీవ్రంగా రోదిస్తూ తల్లికి విషయం చెప్పింది. ఈ మేరకు పోలీసులు బత్తుల శివపై బీఎన్‌ఎస్ సెక్షన్ 64 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment