
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థినికి వేధింపులు ఎదురయ్యాయి. విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. చిన్నారిని వేధిస్తున్న వ్యక్తిని చితకొట్టారు. వివరాలిలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్న బీఎస్‌డీ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న బాలికను ప్రిన్సిపాల్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రజినీకుమార్ గత రెండు నెలలుగా వేధిస్తున్నాడు. ఓపిక నశించిన ఆమె తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని రజినీకుమార్‌ను నిలదీశారు.
కోపంతో రగిలిపోయి దేహశుద్ధి చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించామని తెలిపారు. చిన్నారికి వేధింపుల విషయంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి ప్రమేయం ఉందని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసులు ప్రిన్సిపాల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్‌ను చితకబాదుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment