private school
-
యూపీలో ఘోరం.. స్కూల్ బాగుండాలని 2వ తరగతి విద్యార్థి బలి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. క్షుద్ర పూజల పేరిట హథ్రాస్‌లో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారు. విద్యార్ధి చదువుతున్న పాఠశాల అభివృద్ధి చెందాలని స్కూల్ హాస్ట్‌లోనే బాలుడిని హత్య చేశారు. వారం కిందట జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాఠశాల యజమాని జసోదన్ సింగ్‌తో, అతని కుమారుడు దినేష్ భఘేల్ పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.విచారణలో భాగంగా వెలువడిన పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు... 11 ఏళ్ల కృతార్థ్ హథ్రాస్ జిల్లాలోని రస్‌గవాన్‌లోని డీఎల్ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో గతవారం తన కొడుకు ఆరోగ్యం బాగోలేదని సోమవారం ఆయనకు కాల్ వచ్చింది. దీంతో తండ్రి స్కూల్ వద్దకు వెళ్లగా.. బాలుడిని పాఠశాల డైరెక్టర్ తండ్రి తనక ఆరులో ఆసుపత్రికి తీసుకెళ్లాడని వార్డెన్ చెప్పాడు. దీంతో హాస్టల్ దగ్గరే వేచి ఉన్న కృష్ణన్‌కు మీ కొడుకు చనిపోయాడని దినేశ్ బాఘెల్ చెప్పాడు. తన కారులో ఉన్న మృతదేహాన్ని అప్పగించాడు. అయితే కొడుకు మరణంపై అనుమానంతో కృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.స్కూల్ డైరక్టర్ తండ్రి దినేశ్ బఘేల్‌కు క్షుద్రపూజల మీద నమ్మకం ఉందని పోలీసులు తెలిపారు. బాలుడిని తొలుత స్కూల్ బయట ఉన్న గొట్టపు బావి దగ్గర చంపాలని భావించారు. కానీ హాస్టల్ నుంచి బయటకు తీసుకువెళుతుండగా బాలుడు గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఫలితంగా అక్కడే, అతడి గొంతు నులిమి చంపేశారు.స్కూల్‌కు సమీపంలో క్షుద్రపూజలకు సంబంధించిన కొన్ని వస్తువులు పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. అయితే స్కూల్ సక్సెస్ కోసం క్షుద్రపూజలు చేయాలని నిందితులు గతంలో కూడా ప్లాన్ వేశారు. సెప్టెంబర్ 6వ 9వ తరగతి స్టూడెంట్‌ని బలి ఇవ్వాలని చూశారు. కానీ విఫలం అయ్యారని తేలింది. -
కామారెడ్డి: ప్రైవేట్ స్కూల్ వద్ద ఉద్రిక్తత.. సీఐపై రాళ్ల దాడి
సాక్షి, కామారెడ్డి: జీవ్దాన్ ప్రైవేట్ స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థిని పట్ల పీఈటీ అసభ్యంగా ప్రవర్తించాడని.. రూమ్‌లో బంధించి విద్యార్థినిని వేధించాడంటూ పాఠశాల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి సంఘాల నాయకులు.. స్కూల్ అద్దాలను ధ్వంసం చేశారు.అడ్డుకున్న సీఐ చంద్రశేఖర్‌పై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. సీఐకి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పీఈటీ నాగారాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: హలో.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. -
ఢిల్లీలోని పాఠశాలకు మరోసారి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా సౌత్ ఢిల్లీలోని ఓ పాఠశాలకు బెదిరింపులు అందడం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ కైలాష్‌లోని ప్రైవేటు పాఠశాలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబు అమర్చినట్లు గురువారం అర్థరాత్రి ఈ మెయిల్ రాగా.. పాఠశాల అధికారులు 10 నిమిషాల్లోనే విద్యార్థులను ఖాళీ చేయించారు.బాంబు డిటెక్షన్ టీమ్, డాగ్ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. వారు పాఠశాల మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేయగా.. ఎలాంటి అనుమానాస్పదంగా ఏమీ కనుగొనలేదని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అయితే ఈ బెదిరింపు బూటకమని అధికారులు ధృవీకరించారు. కాగా ఇటీవలే రాజధాని నగరంలోని పలు పాఠశాలలకు (వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. -
సమాజంలో మా గౌరవం పెరిగింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. భయం పోయి ప్రశాంతంగా చదువుకుంటున్నా.. నేను కర్నూలు కృష్ణానగ ర్లో మా తాత, అమ్మ సంరక్షణలో ఉంటున్నా. అమ్మ షేక్ స్వాలేహా బేగం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. నెలకు రూ.10 వేలు వేతనం. తాత షేక్ సర్దార్ పటేల్ రిటైర్డు ప్రైవేటు ఉద్యోగి. అమ్మ ఆదాయంతో ఇల్లు గడవడం కష్టమే. ఈ పరిస్థితుల్లో నా చదువుపై బెంగ పెట్టుకున్నా. ఇంటరీ్మడియట్‌లో 93 శాతం మార్కులు, ఏపీ ఈఏపీ సెట్లో 15వేల ర్యాంకు సాధించా. ఇంటి ఆరి్థక పరిస్థితుల దృష్ట్యా పై చదువులు ఎలా చదవాలో అర్థం కాలేదు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేవుడిలా ఆదుకుంది. స్థానిక రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్‌లో బీటెక్(సీఎస్ఈ)లో జాయిన్ అయ్యా. ఫీజు రీయింబర్స్మెంట్ నాకు వర్తించింది. జగనన్న విద్యా దీవెన కింద మూడేళ్ళకు రూ.1.05 లక్షలు, వసతి దీవెన కింద రూ.30 వేలు విడుదలయ్యాయి. ఫీజుల భయం పోయింది. ప్రశాంతంగా చదువుకుంటున్నాను. ఇప్పుడు ఫైనలియర్ బీటెక్. క్యాంపస్ సెలక్షన్లో అసెంచర్ కంపెనీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యా. ఏడాదికి రూ.6.5లక్షల వేతనం. మా అమ్మగారికి వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ. 18,750లు వంతున వచ్చింది. ప్రభుత్వం మాలాంటి పేద, మధ్య తరగతి విద్యార్థులను ఇలా ఆదుకోవడంతో చాలా మందికి మంచి ఉద్యోగావకాశాలు లభించాయి. నేను, కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. సీఎం సర్‌కు ధన్యవాదాలు. – తయ్యిభా ఫాతిమా, బీటెక్ విద్యారి్థ, క్రిష్ణానగర్ (జి.రాజశేఖర్‌నాయుడు, విలేకరి, కర్నూలు అర్బన్) సమాజంలో మా గౌరవం పెరిగింది నే ను టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం భాసూరు గ్రామంలో భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమారులతోపాటు, వృద్ధురాలైన తల్లితో కలసి జీవిస్తున్నాను. రోజురోజుకూ రెడీమేడ్ దుస్తులు మార్కెట్లో విరివిగా లభిస్తున్న పరిస్థితుల్లో టైలరింగ్‌కు ఆదరణ తగ్గిపోయింది. దానివల్ల మాకు వచ్చే అరకొర ఆదాయం కూడా తగ్గిపోయింది. కుటుంబ పోషణ మరీ కష్టంగా తయారైంది. గత టీడీపీ హయాంలో రేషన్ బియ్యం పథకం తప్ప ఇంకేమీ వర్తించలేదు. ఈ తరుణంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలు మమ్ములను ఆదుకున్నాయి. మా అమ్మకు వృద్ధాప్య పింఛన్ అందుతోంది. నా భార్యకు చేయూత కింద ఏటా రూ. 18,750లు వస్తోంది. నా మనవడు చదువుకుంటుండటంతో పెద్దకోడలు రాజ్యలక్ష్మి ఖాతాకు అమ్మఒడి డబ్బులు జమవుతున్నాయి. కొడుకు ఈశ్వరరావుకు సర్వేయర్‌గా గ్రామ సచివాయంలో ఉద్యోగం వచి్చంది. ఆరి్థకంగా చేయూత లభిస్తుండడంతో కష్టాలు ఒక్కొక్కటి గెట్టెక్కాయి. సహచరులు, బంధువుల మధ్య కుటుంబానికి గౌరవం పెరిగింది. ఈశ్వరరావు సార్ ఉన్నారా... అంటూ నా కొడుకు కోసం వచ్చేవారు మాకు ఇస్తున్న మర్యాద వెలకట్టలేనిది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మాకు సొంత ఇల్లు వచి్చంది. ఆయన బిడ్డ జగన్ ప్రభుత్వంలో సమాజంలో మరింత గౌరవం పెరిగింది. – కడారు మోహనరావు, భాసూరు (మారోజు కళ్యాణ్‌కుమార్, విలేకరి, పాలకొండ) ఖర్చు లేకుండా రెండుసార్లు శస్త్రచికిత్స నే ను సాధారణ రైతును. నాకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకలాంలో నాకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అన్నీ అనుకూలిస్తే నాలుగు వేళ్లు నోటికెళ్లేవి. లేకుంటే అప్పులు చేయాల్సి వచ్చేది. కునికిన నక్కపై తాటిపండు పడ్డట్టు నాలుగేళ్ల క్రితం కిడ్నీలో రాళ్లు చేరాయి. తెలియక అశ్రద్ధ చేయడంతో కిడ్నీలు మరింత పాడయ్యాయి. వైద్యులకు చూపిస్తే ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీలు పోయే ప్రమాదం ఉందన్నారు. చికిత్సకు రెండు లక్షల వరకూ ఖర్చవుతుందన్నారు. అంత మొత్తం వెచి్చంచలేక సతమతమయ్యాను. అయితే నాకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆరోగ్యమిత్ర చెప్పడంతో వారి ద్వారా విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరా. పైసా ఖర్చు లేకుండా చికిత్స చేశారు. ప్రస్తుతం నయం అయింది. ఇప్పుడు ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాను. గడిచిన ఏడాదిలో మళ్లీ రాళ్లు చేరితే ఆరోగ్యశ్రీ ద్వారానే ఆపరేషన్ చేయించుకున్నా. నాలాంటి వారికి ఎందరికో ఈ పథకం ప్రాణదానం చేసినట్టయింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్సార్ పేరును నా కుడిచేయిపై పచ్చబొట్టు వేయించుకున్నా. కొడుకు, కూతురికి పెళ్లిళ్లయ్యాయి. వారు వేరేగా ఉంటున్నారు. జగనన్న అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా ఠంఛన్‌గా రూ. 13,500లు చొప్పున వస్తోంది. నా భార్య రమణమ్మకు వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా రూ. 45 వేలు వచి్చంది. చేయూత పథకం ద్వారా ఏటా రూ. 18,750 వంతున వచి్చంది. మా ఆరి్థక పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది. – శానాపతి సూర్యనారాయణ(రోహిణి) లుకలాం (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట) -
ప్రైవేటు టీచర్ అదృశ్యం.. చివరిసారి కాల్ చేసిన యువకుడు
కర్ణాటక: మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకా మేలుకోటె దగ్గర మాణిక్యనహళ్ళికి చెందిన వి. దీపిక గౌడ (28) అనే ప్రైవేటు స్కూలు టీచర్ అదృశ్యమై, ఆపై హత్యకు గురికావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మేలుకోటెలో ప్రసిద్ధ యోగ నరసింహ స్వామి కొండ కింద పూడ్చిపెట్టిన ఆమె మృతదేహం సోమవారం సాయంత్రం బయటపడింది. ఫోన్ రాగానే స్కూలు నుంచి వెళ్లి.. వివరాలు.. మానిక్యనహళ్ళిలో వెంకటేష్ కుమార్తె అయిన దీపికకు అదే గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకునితో పెళ్లయింది, వారికి 8 ఏళ్ల కూతురు ఉంది. మేలుకోటెలోని ఎస్‌ఈటి పబ్లిక్ స్కూల్లో టీచర్‌గా ఆమె పనిచేసేది. గ్రామం నుంచి రోజూ తన డియో స్కూటర్లో స్కూలుకు వెళ్లి వచ్చేది. ఈ నెల 20వ తేదీన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్కూలు అయిపోగానే ఆమెకు ఒక ఫోన్ కాల్ రావడంతో స్కూటర్లో వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆమె జాడ లేదు. ఆమె శవం దొరికిన చోటుకు కొంతదూరంలో స్కూటర్ పార్క్ చేసింది. సోమవారం కూడా స్కూటర్ అక్కడే ఉండడం చూసి స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి స్కూటర్ వివరాలను బట్టి దీపకదిగా గుర్తించి ఆమె తండ్రి వెంకటే‹Ùను కలిసి మాట్లాడారు. ఈ నెల 20వ తేదీనే తమ కూతురు మిస్సింగ్ అని మేలుకోటె పీఎస్‌లో ఫిర్యాదు చేశానని ఆయన చెప్పాడు. చివరకు స్కూటర్ చుట్టుపక్కల ప్రజలతో కలిసి గాలించగా పూడ్చిపెట్టిన ఆమె మృతదేహం లభ్యమైంది. టిక్‌టాక్ వీడియోలు దీపిక సినిమా హీరోయిన్‌కు తీసిపోని అందంతో ఆకట్టుకునేది. ఇన్‌స్టా, యూట్యూబ్‌తో పాటు గతంలో టిక్‌టాక్‌లో సినిమా పాటలు, డైలాగుల వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేది. ఆమెకు ఎంతోమంది ఫాలోయర్లు కూడా ఉన్నారు. దీంతో ఆమె టిక్‌టాక్ దీపికగా స్థానికంగా ఎంతో పేరుపొందింది. పరారీలో యువకుడు పోలీసులు మృతదేహాన్ని వెలిసితీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శవంపై ఎలాంటి గాయాలు లేవని, ఎవరో దుండగులు చంపి పూడ్చిపెట్టారని తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు పోలీస్ బృందాలు ఏర్పాటయ్యాయి. ఆమెకు చివరిసారి కాల్ చేసింది నితిన్ అనే యువకుడు అని, అతడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కరీంనగర్లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం
కరీంనగర్‌రూరల్: కరీంనగర్‌లోని విద్యారణ్యపురి కాలనీకి చెందిన ఓ బాలిక అదృశ్యమైంది. రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. కనుకుంట్ల స్వప్న–నరసింహ దంపతుల కూతురు వశిష్టకృష్ణ(12) కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం పెద్దపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. తిరిగి కరీంనగర్‌కు వచ్చేందుకు వశిష్టకృష్ణను ఆమె తాతయ్య బుధవారం ఉదయం పెద్దపల్లిలో బస్సు ఎక్కించాడు. ఆ బస్సును ఫొటో తీసి, నరసింహకు ఫోన్లో పంపించాడు. దీంతో ఆయన కరీంనగర్‌లోని మంచిర్యాల చౌరస్తాలో ఎదురుచూశా డు. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన బస్సులో నుంచి వశిష్టకృష్ణ దిగలేదు. కండక్టర్‌ను అడిగితే బొమ్మకల్ బ్రిడ్జి వద్ద దిగినట్లు చెప్పా డు. వెంటనే అక్కడికి వెళ్లి వెతికినా కనిపించకపోవడంతో నరసింహ కరీంనగర్‌రూరల్ పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారు అదృశ్యం కేసు నమోదు చేసుకొని, బాలిక ఆచూకీ వెతుకుతున్నారు. -
జామెట్రీ కంపాస్‌తో 108 సార్లు దాడి
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థులు తోటి విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. జామెట్రీ కంపాస్‌తో విచక్షణారహితంగా 108 సార్లు దాడి చేసి గాయపరిచారు. నవంబర్ 24వ తేదీన ఇండోర్ నగరంలోని ఏరోడ్రోమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల దాడి ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(డబ్ల్యూసీ) తీవ్రంగా స్పందించింది. ఘటనపై వెంటనే తమకు నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ‘‘ గొడవ సందర్భంగానే చిన్నారులు ఇలా ప్రవర్తించారని వార్తలొచ్చాయి. నిందితులైన విద్యార్థులకు హింసాత్మకమైన సన్నివేశాలున్న వీడియో గేమ్స్ ఆడే అలవాటు ఉందా? నాలుగో తరగతి విద్యార్థుల్లో ఇంతటి హింసాప్రవృత్తి ఎలా సాధ్యం? దీనికి కారణాలేంటి? ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తాం. పోలీసుల నివేదిక కోరాం’’ అని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ పల్లవి చెప్పారు. ‘‘ మా అబ్బాయి రక్తమోడుతూ ఇంటికొచ్చాడు. అసలేం జరిగిందో తెలీడం లేదు. తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీ ఇచ్చేందుకు స్కూల్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. వారు బహుశా తమ తప్పును కప్పిపుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారేమో’’ అని బాధిత విద్యార్థి తండ్రి వాపోయాడు. ‘‘ బాధిత విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. నిందితులైన విద్యార్థుల వయసు పదేళ్లలోపే. సంబంధిత చట్టాల ప్రకారం కేసు దర్యాప్తు జరుగుతోంది’’ అని నగర అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వివేక్ సింగ్ చౌహాన్ చెప్పారు. ‘‘కొంతకాలంగా స్కూలు చిన్నారుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. దీనిపై అందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరముంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఫోర్త్ క్లాస్ విద్యార్థుల హింస..
ఇండోర్: నాల్గవ తరగతి చదువుతున్న పదేళ్ల విద్యార్థిపై అతని క్లాస్‌మెట్స్ ముగ్గురు కలిసి పదునైన వృత్తలేఖినితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఒకటి, రెండుసార్లు కాకుండా ఏకంగా 108 సార్లు అతన్ని పొడిచారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది. ఘటనను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సుమోటోగా తీసుకుని నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ‘ఈ ఘటన షాకింగ్‌గా ఉంది. ముగ్గురు స్టూడెంట్స్ కలిసి ఒక విద్యార్థిని 108 సార్లు పొడిచి గాయపరిచారు. దీనిపై ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు విచారణపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఏయిరోడ్రోమ్ పోలీసులను కోరాం. ఇంత చిన్న వయసులో ఆ ముగ్గురు విద్యార్థులు ఎందుకంత హింసాత్మక ప్రవర్తించారనేది పోలీసులు తేల్చాలి’ అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వ్యాఖ్యానించారు. నా కొడుకు స్కూల్ నుంచి వచ్చినపుడు అతని ఒంటిపై చాలా గాయాలున్నాయి. గాయాల గురించి అడిగితే జరిగిన ఘటనను అతడు వివరించాడు. అసలు వాళ్లెందుకంత హింసాత్మకంగా దాడి చేశారో అర్థం కావడం లేదు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ అడిగితే స్కూల్ మేనేజ్మెంట్ ఇవ్వడం లేదు’అని గాయపడిన విద్యార్థి తండ్రి చెప్పారు. ఇదీచదవండి..ట్రాక్ దాటుతుండగా..ఆ ఏనుగులను -
బర్డ్ అంబులెన్స్
చండీగఢ్‌కు చెందిన మన్జిత్సింగ్ ఒక ప్రైవేట్ స్కూల్లో డ్రాయిగ్ టీచర్. పర్యావరణ కార్యకర్త. పక్షుల ప్రేమికుడు. ఏదో పనికోసం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పట్టణానికి వెళ్లిన సింగ్ అక్కడ ఒకచోట ఒక దృశ్యాన్ని చూశాడు. స్వీపర్ ఊడుస్తున్న చెత్తలో చనిపోయిన పావురం కనిపించింది. ‘ఎలా చనిపోయింది?’ అని అడిగాడు సింగ్. కరెంట్‌షాక్‌కు గురై చనిపోయినట్లు చెప్పింది ఆమె. ‘ఇలా చాలా పావురాలు చనిపోతాయి’ అని కూడా చెప్పింది. ఈ సంఘటనను సింగ్ మరిచిపోలేకపోయాడు. ఆ సమయంలో రెండు నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకటి...వ్యాధులు వ్యాపించకుండా చనిపోయిన పక్షులను ఖననం చేయడం, రెండు...ప్రమాదం బారిన పడిన పక్షులకు చికిత్స అందించడం. దీని కోసం తన సైకిల్‌ను ‘బర్డ్ అంబులెన్స్’గా మార్చి వీధులు తిరుగుతుంటాడు సింగ్. ‘మీకు సమీపంలో పక్షులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడి ఉంటే దయచేసి నాకు వెంటనే ఫోన్ చేయండి’ అంటూ వీధుల్లో కరపత్రాలు పంచుతుంటాడు. ‘ఖాళీ సమయంలో పెయింటింగ్స్ వేసి వాటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. కాని నాకు అది ఇష్టం లేదు. ఏ మాత్రం సమయం దొరికినా పక్షుల బాగు కోసం ఉపయోగిస్తాను’ అంటున్నాడు మన్జిత్సింగ్. -
‘కాసులిస్తే’ అన్నీ ఓకే.. లేదంటే 'నో పర్మిషన్'!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహణ కొనసాగిస్తోంది. ఈ విషయం విద్యా శాఖాధికారులకు తెలిసినప్పటికీ మామూలుగా వ్యవహరిస్తున్నారు. పాఠశాల యాజమాన్యానికి రాజకీయ అండదండలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో సంబంధాలు ఉండడంతో జిల్లా విద్యాశాఖాధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో గల ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు నిర్వహిస్తున్నారు. అనుమతుల కోసం అక్టోబర్ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో వీరు ఆన్లైన్ చేసుకోలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకున్నప్పటికీ ఆన్లైన్లో మాత్రం ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం నిబంధనలు మాత్రం పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాఠశాలకు అనుమతి లేదని విద్యానగర్‌కు చెందిన యువజన సంఘాలు, కాలనీవాసులు డీఈవోకు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఇదిలా ఉండగా పాఠశాల యాజమాన్యానికి చెందిన పలువురు డీఈవో కార్యాలయానికి వెళ్లి త్వరగా అనుమతులు ఇవ్వాలని ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాసులిస్తే’ అన్నీ ఓకే.. గతంలో విద్యానగర్‌లోని ఇదే పాఠశాల భవనంలో ఓ ప్రైవేట్ పాఠశాల కొనసాగేది. ఆ భవనానికి ఫైర్ అధికారులు ఫైర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. పాఠశాల భవనం చుట్టూ వెళ్లే విధంగా లేదని, ఫైర్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఆ యాజమాన్యం మరోచోట పాఠశాల నిర్వహణ కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భవనంలోనే కొనసాగుతున్న ఓ పాఠశాల యాజమాన్యానికి మాత్రం ఫైర్ అధికారులు అనుమతినివ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాసులిస్తే ఎలాంటి పనులైనా చేసుకోవచ్చనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ పాఠశాలకు ఫైర్ సర్టిఫికెట్ ఏ నిబంధనల మేరకు ఇచ్చారని ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ కోరిన ఉన్నతాధికారులు జిల్లాకు చెందిన పలువురు ఫైర్ అధికారులకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయమై స్టేషన్ ఫైర్ అధికారి శివాజీని వివరణ కోరగా ఉన్నతాధికారి సెలవులో ఉన్నారని, తనకు ఈ విషయం తెలియదని వివరించారు. తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం.. అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహణ కొనసాగించరాదు. ఆ పాఠశాల యాజమాన్యం గడువు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నతాధికారులతో ప్రత్యేక అనుమతి పొందారు. అయినప్పటికీ ఇంతవరకు ఆన్లైన్లో ప్రక్రియ పూర్తి కాలేదు. మాకు ఎలాంటి పత్రాలు సమర్పించలేదు. పాఠశాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. – ప్రణీత, డీఈవో -
నాణ్యమైన చదువులు, స్మార్ట్క్లాస్లు, ఐఐటీల పేరిట.. ఫీజుల మోత..
మహబూబ్‌నగర్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు అడ్డు, అదుపు లేకుండాపోతోంది. నాణ్యమైన చదువులు, స్మార్ట్క్లాస్లు, ఐఐటీల పేరిట తల్లిదండ్రులను మభ్యపెట్టి.. ఎల్కేజీ, యూకేజీల నుంచే ఫీజుల మోత మోగిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకుని తక్కువలో తక్కువ రూ.20 వేల నుంచి మొదలుకొని రూ.లక్ష వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇంత పెద్దఎత్తున ఫీజులు వసూలు సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం తమ కేమి సంబంధం లేదనట్లుగా వ్యవహరించడం గమనార్హం. ప్రతిఏటా పెరుగుదల.. వాస్తవానికి ఫీజుల పెంపు వ్యవహారం పాఠశాల సొసైటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల కమిటీ సమన్వయంతో ప్రతి సంవత్సరం పెంచాల్సిన ఫీజులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలోని ఏ పాఠశాలలో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే ఎన్నో రెట్ల ఫీజులు పెంచుకుంటున్నారు. ఎల్కేజీ నుంచి ఎస్సెస్సీ వరకు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన కొన్ని పాఠశాలల్లో 6 నుంచి 7వ తరగతి వరకు రూ.40– 50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక 8, 9, 10వ తరగతుల వారికి రూ.50– 70 వేలకుపైగా రాబడుతున్నారు. వీటిలో కొన్ని పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తూ ప్రతి సంవత్సరం అదనంగా రూ.50 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. రెండు చేతులా సంపాదన.. విద్యార్థికి ఫీజుల చెల్లింపు ఒక ఎత్తయితే.. పుస్తకాలు, నోట్‌బుక్స్, టై, బెల్టులు, షూ, యూనిఫాంలు, రికార్డులు, బస్సు ఫీజుల వంటివి మరో ఎత్తు అవుతున్నాయి. బయటి నుంచి విద్యార్థులు ఏం కొన్నా.. వాటిని అనుమతించని పాఠశాలలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇందులో ముఖ్యంగా 6– 8వ తరగతుల పుస్తకాల కోసం రూ.6,500 తీసుకుంటున్నారు. ఇందులో ఐఐటీ వంటి ప్రత్యేక సంస్థల కరిక్యూలం ఉన్న పుస్తకాలకు రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. నోట్‌పుస్తకాలు ఏకంగా పాఠశాల పేరు మీదనే ముద్రిస్తున్నారు. యూనిఫాం రూ.2,800, షూ, బెల్టులు రూ.1,200, బస్సు ఫీజు రూ.15– 18 వేల వరకు వసూలు చేస్తున్నారు. చాలా వరకు పాఠశాలల్లోనే అమ్ముతుండగా.. కొన్ని మాత్రం తెలిసిన బుక్సెంటర్ల ద్వారా విక్రయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. -
పర్మిషన్ లేని పాఠశాలలపై చర్యలు
పరిగి: ప్రైవేటు విద్యాలయాలపై మండల విద్యాధికారి కొరడా ఝుళిపించారు. అకాస్మాత్తుగా సోదాలు నిర్వహించి అనుమతి లేని, పుస్తకాలు, బ్యాగులు విక్రయించిన పాఠశాలలు మూసివేయాలని ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం పట్టణ కేంద్రంలోని పలు ప్రైవేటు పాఠశాలలను మండల విద్యాధికారి హరిశ్చందర్ తనిఖీ చేశారు. న్యూబ్రిలియంట్ టెక్నో స్కూల్లో పాఠ్యపుస్తకాలు ఉండటంతో గదిని సీజ్ చేశారు. లిటిల్ బడ్డీ స్కూల్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వెంటనే మూసి వేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలో ఎలాంటి వాణిజ్యపరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్మ్, స్కూల్ బ్యాగ్స్ ఏ వస్తువులు అమ్మినా పాఠశాల పర్మిషన్ రద్దు చేస్తామని చెప్పారు. ఫీజులు ఎక్కువ వసూలు చేయరాదని, విద్యాహక్కు చట్టం ప్రకారం గతేడాది వసూలు చేసిన విధంగానే.. ఇప్పుడు తీసుకోవాలని సూచించారు. రాతపూర్వకంగా.. గతేడాది కంటే ఇప్పుడు ఎవరైనా అధిక ఫీజులు వసూలు చేసినట్లయితే.. విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అండర్ టేకింగ్ సర్టిఫికెట్ ఇవ్వాలని, బడిలో ఎలాంటి పుస్తకాలు, దుస్తులు, బ్యాగులు విక్రయించమని రాతపూర్వకంగా రెండు రోజుల్లో మండల విద్యావనరుల కేంద్రంలో ఇవ్వాలని హెచ్చరించారు. ఇప్పటికే రెండు పాఠశాలల్లో దుస్తులు, పాఠ్యపుస్తకాలు విక్రయించినట్లు తెలిసిందని, వాటిని సీజ్ చేశామని, త్వరలో మళ్లీ సోదాలు చేస్తామని చెప్పారు. -
చదువు కోనుడే
కరీంనగర్: విద్యావ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రైవేట్ దోపిడీ మితిమీరుతోంది. డొనేషన్లు, ఫీజులే కాదు.. పాఠ్యపుస్తకాలు, టైలు, బెల్ట్‌లు, బ్యాడ్జిలన్నీ తమవద్దే కొనాలని గిరి గీయడంతో తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. ప్రైవేట్ స్కూళ్లపై అధికారుల నియంత్రణ కొరవడడంతో ఇష్టారాజ్యం మారింది. జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల గుండెల్లో దడ మొదలవుతుంది. గతేడాది కంటే ఈసారి 10 నుంచి 30 శాతం వరకు ఫీజులను ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. తోక పేర్లు, వసతుల పేరిట దోపిడీ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు నయా దోపిడీకి శ్రీకారం చుట్టాయి. ఒక్కప్పుడు జిల్లా కేంద్రాలకే పరిమితమైన సాధారణ, కార్పొరేట్ విద్యాసంస్థలు నేడు పట్టణాలు, పల్లెల్లో సైతం పాగా వేశాయి. ఈ–స్మార్ట్, ఈ–గ్లోబల్, ఈ–టెక్నో తదితర అందమైన పేర్లను ముందుకు తగిలిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కాగా పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు వారి వద్ద పనిచేస్తున్న ఉపాధ్యాయులనే రంగంలోకి దింపడంతో పాటు పీఆర్ఓలను నియమించుకొని అడ్మిషన్‌కు ఇంత ఇస్తామంటూ ఆశ చూపుతూ విద్యావ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. ఈ తతంగాన్ని అడ్డుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడంతో యాజమాన్యాల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. విద్యా హక్కు చట్టానికి తూట్లు ప్రైవేటు స్కూళ్లు విద్యాహక్కు చట్టం అమలుకు తూట్లు పొడుస్తున్నాయి. చట్ట ప్రకారం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాల్సి ఉన్నా... అలా చేయడం లేదు. ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం విద్యార్థులకు ఉచిత విద్య అమలయ్యేలా కృషి చేస్తామంటున్న విద్యాశాఖ అధికారులు స్పష్టమైన విధి విధానాలు లేక చేతులేత్తయడం వరకే పరిమితమవుతున్నారు. జిల్లాలో ప్రైవేటు యాజమాన్యాల కింద ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 698 పైగా ఉండగా వీటిలో ప్రస్తుతం 2లక్షల వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. చట్ట ప్రకారం వీరిలో నాలుగో వంతు మందికి ఉచిత విద్య అందించాలి. కానీ యాజమాన్యాలు బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నాయి. సీట్ల భర్తీకి రిజర్వేషన్ ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాలని చట్టం నిర్దేశించింది. అనాథలు, ఎయిడ్స్ బాధితులకు 5 శాతం, ఎస్సీలకు 10, గిరిజనులకు 4, బీసీలకు 6 శాతం సీట్లను కేటాయించాలి. కానీ వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు దీనిని పట్టించుకోవడం లేదు. చట్టప్రకారం సీట్ల భర్తీ జరిగితే బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మంచి విద్య దొరుకుతుంది. అధిక ఫీజు వసూలు చేస్తే చర్యలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆకర్షణీయమైన పేర్లతో తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం చట్టవిరుద్ధం. నిబంధనలు పాటించని విద్యాసంస్థల గుర్తింపును జీవో 1 ప్రకారం రద్దు చేస్తాం. ప్రతీ పాఠశాలలో ఫీజుల వివరాలు నోటీసుబోర్డుపై ప్రదర్శించాలి. – సీహెచ్ జనార్దన్‌రావు, డీఈవో తీరు మారాలి ప్రైవేట్ విద్యాసంస్థల పట్ల విద్యాశాఖ తీరు మారాలి. ఫీజుల దోపిడీని అరికట్టాలి. విద్యాహక్కు చట్టాన్ని ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే. విద్యను వ్యాపారం చేస్తూ సంపన్నుల కొమ్ము కాస్తున్న సర్కార్ విద్యాహక్కు చట్టంపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటించాలి. – మచ్చ రమేశ్, -
హైదరాబాద్: స్కూల్లో క్షుద్రపూజల కలకలం!
సాక్షి, రంగారెడ్డి: హైదరాబాద్ నగర పరిధిలో తాజాగా.. క్షుద్ర పూజల కలకలం రేగింది. అదీ ఏకంగా ఒక పాఠశాలలో కావడం గమనార్హం. రాజేంద్ర నగర్ పరిధిలోని ఓ స్కూల్లో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు బయటపడ్డాయి. స్కూల్లోని సైన్స్ ల్యాబ్‌తోపాటు స్టోర్ రూమ్‌లో క్షుద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి టీచర్లు, విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. మరోవైపు స్కూల్లో సీసీ ఫుటేజ్‌లు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దర్యాప్తు ద్వారా ఈ విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
బయటపడ్డ వాస్తవాలు.. పేరుకే ప్రిన్సిపాల్.. పెత్తనమంతా డ్రైవర్‌దే
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్– 14లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌కు బంజారాహిల్స్ పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న స్కూల్లో పని చేస్తున్న డ్రైవర్ రజనీకుమార్ నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత చిన్నారి వయసు ధ్రువీకరణ పత్రాలతోపాటు అడ్మిషన్ ఎప్పుడు పొందింది? తదితర వివరాలతో కూడిన పత్రాలను పోలీస్ స్టేషన్లో అందించాల్సిందిగా సూచిస్తూ నోటీసుల్లో పేర్కొన్నారు. డీఏవీ స్కూల్లో పనిచేస్తున్న పరిపాలన సిబ్బంది, టీచర్లు ఈ నెల 25 నుంచి సఫిల్‌గూడలోని డీఏవీ స్కూల్లో హాజరవుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని డీఏవీ స్కూల్ అనుమతులు రద్దు చేయడంతో ఈ స్కూల్‌కు చెందిన సిబ్బంది, టీచర్లు తమ హాజరును సఫిల్‌గూడ డీఏవీ స్కూల్లో వేయిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న బంజారాహిల్స్ స్కూల్‌ను బుధవారం డీఏవీ స్కూల్ డైరెక్టర్ నిషా తనిఖీలు చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. పాఠశాలలో 30 సీసీ కెమెరాలు ఉండగా అందులో వీరు చేసిన తనిఖీల్లో 12 కెమెరాలు పని చేస్తున్నట్లు తేలింది. చాలా కెమెరాలకు వైర్లు తెగి పడి ఉండటాన్ని గుర్తించారు. ఇదేమిటని ఆరా తీయగా వీటి నిర్వహణ మొత్తం అత్యాచార నిందితుడు రజనీకుమార్‌దేనని సిబ్బంది ఆమె దృష్టికి తీసుకొచ్చారు. సీసీ కెమెరా నిర్వహణ మొత్తం తన చేతుల్లోనే ఉంచుకున్నాడని ఆరోపించారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరగాలన్నా పెత్తనమంతా రజనీకుమార్‌దేనని సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పేరుకు మాత్రమే ప్రిన్సిపాల్ ఉండగా పెత్తనమంతా రజనీకుమార్‌దేనని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. బాత్రూంల వద్ద సీసీ కెమెరాలు సైతం పని చేయడం లేదని తనిఖీల్లో తెలుసుకున్నారు. మరో నాలుగైదు రోజుల్లో స్కూల్ ప్రారంభం కానుండగా ఇక్కడ మార్పులు చేయాల్సిన అవసరముందని గుర్తించారు. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు -
Banjara Hills: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై విద్యాశాఖ అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచారు. వీరి ఆందోళనకు విద్యార్థి సంఘాల నుంచి మద్దతు పెరిగింది. మరోవైపు పాఠశాల యాజమాన్యం కూడా గుర్తింపు రద్దు అంశంపై విద్యాశాఖ అధికారులతో భేటీకి సిద్ధమైంది. జరిగిన ఘటన సహించరానిదైనప్పటికీ పాఠశాల గుర్తింపు రద్దు సమంజసం కాదని విద్యావేత్తలు సైతం పేర్కొంటున్నారు. దీంతో విద్యాశా«ఖ పాఠశాలకు ఎన్ఓసీ విత్‌డ్రాపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. పాఠశాలను తెరిపించాల్సిందే.. డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు రద్దును వెనక్కు తీసుకొని స్కూల్‌ను తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ పెరిగింది. అవసరమైతే ప్రభుత్వం స్కూల్‌ను స్వాధీనం చేసుకోవాలని, పాఠశాలలో సీసీ కెమెరాలు, కమిటీని ఏర్పాటు చేసి పూర్తి రక్షణ కల్పించి స్కూల్ కొనసాగించాలని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఇచ్చి ఆప్షన్ల ప్రకారం మరో పాఠశాలలో చేరడం తల్లిదండ్రులకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నారు. ఇది తల్లిదండ్రులపై ఆర్థిక భారంతో పాటు దూరాభారం కూడా అవుతుందని వారంటున్నారు. బ్యాలెట్ బాక్స్ ద్వారా అభిప్రాయాలు బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌ను కొనసాగించాలంటూ సఫీల్‌గూడలోని డీఏవీ స్కూల్లో ఓ బ్యాలెట్ బాక్సు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కొనసాగాలని అభిప్రాయాలతో ఈ బ్యాలెట్ బాక్సులో వేస్తున్నారు. ఢిల్లీ నుంచి స్కూల్ యాజమాన్యం రెండు రోజుల్లో న్యూఢిల్లీ నుంచి డీఏవీ స్కూల్ ప్రధాన కార్యాలయం అధికారులు హైదరాబాద్‌కు రానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. విద్యాశాఖ అధికారులతో సైతం సమావేశమై వినతి పత్రం సమరి్పంచనుంది. విద్యాశాఖ మంత్రి, కమిషనర్లను బుధవారం తల్లిదండ్రులు కలిసి డీఏవీ స్కూల్ ఇక్కడే కొనసాగించాలని వినతిపత్రం సమర్పించనున్నారు. మూసివేత వద్దు పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డీవైఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీల కార్యదర్శులు కె.అశోక్‌రెడ్డి, కె.నాగలక్ష్మి, జావిద్‌లు మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. స్కూల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని యథావిధిగా నడపాలని కోరారు. మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం సమర్పిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు -
డీఏవీ స్కూల్ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డీఏవీ స్కూల్ నిర్వహణలో మరో ఉల్లంఘన వెలుగు చూసింది. పాఠశాలకు కేవలం 5వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నట్లు విద్యాశాఖాధికారుల పరిశీలనలో వెల్లడైంది. సఫిల్‌గూడ బ్రాంచి పేరుతో ఆరు, ఏడు తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సఫిల్‌గూడకు చెందిన విద్యార్థులకు బంజారాహిల్స్‌లోని పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపిందని అధికారులు పేర్కొంటున్నారు. సీబీఎస్ఈ సిలబస్ నిర్వహణలోనూ డొల్లతనం కనిపిస్తోంది. పాఠశాల మూసివేతతో విద్యార్ధుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో తల్లిదండ్రులు ఆందోళన సాగిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటేనే మిగతా స్కూళ్లు నిబంధనలు పాటిస్తాయని విద్యాశాఖ చెబుతోంది. ఇదిలా ఉండగా డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును తెలంగాణ విద్యాశాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పాఠశాల ప్రిన్సిపాల్‌కు డ్రైవర్‌గా పనిచేసే రజినీకుమార్.. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతన్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు సంబంధించి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: ‘మా పిల్లల్ని మరో స్కూల్‌కు పంపించం.. డీఏవీ పాఠశాలనే రీ ఓపెన్ చేయాలి’ -
హైదరాబాద్: విద్యార్థినిని వేధిస్తున్న ప్రిన్సిపాల్ కారు డ్రైవర్.. చితకబాదిన పేరెంట్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థినికి వేధింపులు ఎదురయ్యాయి. విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. చిన్నారిని వేధిస్తున్న వ్యక్తిని చితకొట్టారు. వివరాలిలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్న బీఎస్‌డీ డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న బాలికను ప్రిన్సిపాల్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రజినీకుమార్ గత రెండు నెలలుగా వేధిస్తున్నాడు. ఓపిక నశించిన ఆమె తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని రజినీకుమార్‌ను నిలదీశారు. కోపంతో రగిలిపోయి దేహశుద్ధి చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించామని తెలిపారు. చిన్నారికి వేధింపుల విషయంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి ప్రమేయం ఉందని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో పోలీసులు ప్రిన్సిపాల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్‌ను చితకబాదుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ముంబై: స్కూల్ లిఫ్ట్‌లో ఇరుక్కొని టీచర్ మృతి
ముంబై: స్కూల్ లిఫ్ట్‌లో ఇరుక్కొని 26 ఏళ్ల మహిళా టీచర్ మృతి చెందింది. ఈ విషాద ఘటన మహరాష్ట్ర రాజధాని ముంబై నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నార్త్ ముంబై శివారు ప్రాంతమైన మలాడ్‌లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్లో జెనెల్ ఫెర్నాండేజ్ టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆరో అంతస్తులో క్లాస్ పూర్తి చేసుకున్న జెనెల్.. రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ కోసం వేచి ఉంది. లిఫ్ట్‌లోకి ఎక్కి రెండో ఫ్లోర్ బటన్ నొక్కింది. అయితే లిఫ్ట్ పపైకి వెళ్లడం గమనించిన జెనెల్ అప్పటికీ లిఫ్ట్ తలపులు మూసుకోకపోవడంతో వెంటనే బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. బయటకు వస్తుండగా ఆమె బ్యాగ్ లిఫ్ట్‌లో చిక్కుకుంది. బ్యాగ్‌ను తీసుకునేందుకు టీచర్ ప్రయత్నించగా.. లిఫ్ట్‌లో ఆమె తల ఇరుక్కుపోయింది. లిఫ్ట్ డోర్స్ మధ్యలో చిక్కుకొని జెనెల్ తల నుజ్జునుజ్జైంది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన టీచర్ కేకలు విన్న పాఠశాల అధికారులు, సహోద్యోగులు ఆమెకు సాయం చేసేందుకు పరుగెత్తుకొచ్చారు. సుమారు 20 నిమిషాలు కష్టపడి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన యువతిని బయటకు తీశారు. వెంటనే ఆమెను గోరేగావ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుర్ఘటనపై మృతురాలి భర్తకు సమాచారం అందించారు పోలీసులు. ఫెర్నాండెజ్ ఈ ఏడాది జూన్‌లోనే ప్రైమరీ విభాగంలో అసిస్టెంట్ టీచర్‌గా చేరింది. మృతురాలి బంధువుల్లో ఒకరు కూడా అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. చదవండి: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి.. 40 మందికి గాయాలు -
ఇది ‘పది’ చోరీల కథ.. చివరికి ప్రిన్సిపాల్ ఇంటిమందున్న వాహనాన్ని కూడా
సాక్షి, వరంగల్: దొంగతనాలు జరిగాయంటే దాని వెనుకాల వయస్సును బట్టి పరిస్థితులు ఉంటాయి. అందులోనూ పదోతరగతి విద్యార్థులు పలు చోరీలకు పాల్పడ్డారంటే.. అందరూ ఉలిక్కిపడే పరిస్థితి.. నర్సంపేట నియోజకవర్గంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన పదిమంది పదో తరగతి విద్యార్థులు చోరీలకు పాల్పడుతూ కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు చిక్కారు. ఈ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వివరాల ప్రకారం.. నియోజకవర్గంలోని ఓ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పది మంది విద్యార్థులు ఆ విద్యాసంస్థలోని హాస్టల్లో ఉంటున్నారు. డబ్బుల కోసం.. హాస్టల్ సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ప్రహరీ దూకి వైన్‌షాపుల్లో, ఇళ్ల ముందు ఉన్న వాహనాలను, పెట్రోల్ బంకుల్లో ఉన్న వస్తువులను చోరీ చేస్తున్నారు. చివరికి పాఠశాల ప్రిన్సిపాల్ ఇంటిముందు ఉన్న వాహనాన్ని కూడా దొంగిలించారు. గమనించిన పాఠశాల యాజమాన్యం నర్సంపేట పోలీసులకు తెలియజేసింది. ఎస్హెచ్ఓ పాఠశాలను మంగళవారం సందర్శించి ఆరా తీశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారిని రహస్యంగా విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. చదవండి: గణేష్ ఉత్సవాలు షురూ.. ఈ జాగ్రత్తలు, సూచనలు మర్చిపోకండి! -
వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు
-
మహబూబ్‌నగర్.. వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు..
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి మహబూబ్‌నగర్ మండలం కోడూరు దగ్గర ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో శుక్రవారం ఉదయం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. దాదాపు 30 మంది విద్యార్థులతో వెళుతున్న భాష్యం టెక్నో స్కూల్‌కు చెందిన బస్సు నీటిలో చిక్కుకుంది. రాంచంద్రపూర్, మాచన్‌పల్లి, సూగురుగడ్డ తాండా నుంచి విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న బస్సు వరద నీటిలోకి రాగానే ఆగిపోయింది. చూస్తుండగానే బస్సులోకి నీరు చేరడంతో దీనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. విద్యార్దులంతా క్షేమంగా బయటపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ట్రాక్టర్ సహాయంతో నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు లాగారు. అయితే బస్సు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే పూర్తిగా నీటిలో మునిగిపోయేదని, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదవండి: భారీ వర్షాలు.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి -
మాల వేసుకున్నారని తరగతిలోకి రానివ్వలేదు!
బోథ్: హనుమాన్ దీక్షలో ఉన్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం తరగతిలోకి అనుమతించిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చరలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సోమవారం జరిగింది. బోథ్ మండలంలోని పొచ్చర క్రాస్ రోడ్డు వద్ద గల సెయింట్ థామస్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న వినయ్, 7వ తరగతి చదువుతన్న రోహిత్ ఇటీవల హనుమాన్ దీక్ష తీసుకున్నారు. రోజూ లాగానే సోమవారం వారు పాఠశాలకు వచ్చారు. యాజమాన్యం వారిని అడ్డుకుని కాషాయ దుస్తులు తీసి యూనిఫాంలో రావాలని ఆదేశించింది. యూనిఫాం లేకపోతే పరీక్షలు రాయనివ్వమని స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. వెంటనే వారి తల్లిదండ్రులకు, హనుమాన్ దీక్షాపరులకు సమాచారం అందించారు. విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు, హనుమాన్ దీక్షాపరులు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయులు ఇమన్యూయల్‌ను నిలదీశారు. ఆందోళన నిర్వహించారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. క్రిస్టియన్ పాఠశాల అయినందునే దీక్షలో ఉన్న హిందూ విద్యార్థులను రానివ్వలేదని ఏబీవిపీ నాయకులు ఆకాశ్ ఆరోపించారు. డీఈవో ప్రణీతకు ఫోన్ చేసి పాఠశాలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాషాయ జెండాలను పాఠశాలపై ఎగురవేశారు. పాఠశాలపై చర్య తీసుకుంటామని డీఈవో చెప్పడంతో విద్యార్థులను తరగతిలోకి అనుమతించారు. ఈ విషయమై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాçపురావ్ స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా విద్యాధికారి ప్రణీతను కోరారు. మరోసారి ఇలాంటి సంఘటనలు çపునరావృతం కాకుండా చూడాలని సూచించారు. -
ప్రైవేట్ స్కూల్లో దారుణం..పిడిగుద్దులతో విద్యార్థిపై దాడి..చివరికి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. డిజిటల్ క్లాస్‌లో అల్లరి చేస్తున్న సహవిద్యార్థిని వారించడమే అతడికి శాపమైంది. ఆ విద్యార్థితోపాటు అతడి స్నేహితుడూ తరగతి గదిలోనే దాడి చేశారు. గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. శ్రీకృష్ణానగర్‌లోని బీ బ్లాక్‌కు చెందిన సయ్యద్ మంజూర్ (15) స్థానికంగా ఉన్న సాయికృప హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు వెళ్లిన ఇతడు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో డిజిటల్ క్లాస్ వింటున్నాడు. ఆ సమయంలో తరగతి గదిలో టీచర్లు లేరు. హైలం కాలనీకి చెందిన సహవిద్యార్థి క్లాస్ వినకుండా కాగితాలతో రాకెట్లు, పడవలు చేసి గాల్లోకి విసురుతున్నాడు. ఇది గమనించిన మంజూర్ అతడిని వద్దంటూ వారించాడు. నన్నే నిలదీస్తావా? అంటూ అతడు రెచ్చిపోయాడు. మంజూర్ కాలర్ పట్టుకుని కొట్టాడు. అతడి స్నేహితుడు కూడా కలగజేసుకుని మంజూర్‌పై దాడి చేశాడు. ఇద్దరూ పిడిగుద్దులు కురిపించారు. మంచినీటి బాటిల్, స్కేల్‌తో కొట్టారు. ఈ దెబ్బల తాకిడికి మంజూర్ క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు మంజూర్‌ను కృష్ణానగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి గమనించిన వైద్యులు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేశారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు గుండె కొట్టుకునే వేగం అంతకంతకూ మందగిస్తోందని గుర్తించారు. దీంతో అపోలో ఆస్పత్రికి తరలించగా, మంజూర్ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే కన్నుమూశాడు. ఫుటేజీ పరిశీలించిన పోలీసులు మంజూర్ తండ్రి హబీబ్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు సేకరించారు. స్కూలు, క్లాసుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీలను జూబ్లీహిల్స్ డీఐ రమేష్, ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. స్కూల్ ప్రిన్సిపల్ అంజనారావు నుంచి వివరాలు సేకరించారు. డిజిటల్ క్లాస్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉపాధ్యాయులు లేకపోవడంపై ఆరా తీశారు. నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంజూర్ తండ్రి నిరుద్యోగి కాగా.. తల్లి ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. దాడి చేసిన విద్యార్థి కుటుంబమూ దిగువ మధ్యతరగతి వర్గానికి చెందినదేనని పోలీసులు చెప్తున్నారు. -
పాఠశాలలో గోడ కూలి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
చెన్నై: పాఠశాలలో వాష్‌రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తిరునెల్వేలిలో ఉన్న షేఫర్ హయ్యర్ సెకండరీ బాయ్స్ ప్రైవేట్ పాఠశాలలో శుక్రవారం ఉదయం సంభవించింది. విద్యార్ధులు మూత్ర విసర్జను వెళ్లగా మరుగుదొడ్డి గోడ కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో మరణించిన ముగ్గురు చిన్నారులు అన్బళగన్ (9వ తరగతి), విశ్వరంజన్ (8వ తరగతి), సుతేష్ (6వ తరగతి)గా గుర్తించినట్లు స్కూల్ యాజమాన్యం పేర్కొంది. గాయపడిన విద్యార్థులను సంజయ్ (8వ తరగతి), ఇసాకి ప్రకాష్ (9వ తరగతి), షేక్ అబూబకర్ కిదానీ (12వ తరగతి), అబ్దుల్లా (7వ తరగతి)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన విద్యార్థుల మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిని వారికి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సానుభూతి తెలిపారు. అలాగే మరణించిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు ప్రకటించింది. చదవండి: ప్లీజ్ సార్, వెళ్లొద్దు.. బోరున విలపిస్తు రోడ్డెక్కిన విద్యార్థులు కాగా ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని, అప్పుడే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని తిరునెల్వేలి పోలీసులు తెలిపారు. మరోవైపు గోడ కూలిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళన చేశాయి. పాఠశాలలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశాయి. అయితే స్కూల్ భవనం పాతబడిందని, కరోనా కారణంగా ఏడాదిన్నరపాటు అది మూతపడి ఉండగా.. ప్రభుత్వం అనుమతివ్వడంతో ఇటీవల స్కూల్‌ను తెరిచారని పోలీసులు తెలిపారు. అయితే, స్కూళ్లు తెరిచే ముందు పాఠశాలల పరిస్థితిని చెక్ చేసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ముందే సూచించిందని తెలిపారు. చదవండి: ఆమె సంకల్పానికి సలాం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకి.. -
స్వల్పంగా పెరిగిన విద్యార్థుల హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమైన రెండోరోజు గురువారం విద్యార్థుల హాజరు స్వల్పంగా పెరిగింది. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా హాజరయ్యారు. అధిక శాతం ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ పాఠాలకే మొగ్గు చూపాయి. ఆన్లైన్ పాఠాలకు ప్రభుత్వం అనుమతించడంతో విద్యార్థులు దీన్నే ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఫలితంగా ప్రైవేటు సంస్థల్లో విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు ఎక్కువగా హాజరవుతుండటం గమనార్హం. మహబూబాబాద్ జిల్లాల్లో 50 శాతం మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు హాజరయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గురువారం ప్రభుత్వ స్కూళ్ళలో 38.82 శాతం, ప్రైవేటు స్కూళ్ళలో 21.74 శాతం, ఎయిడెడ్ పాఠశాలల్లో 15.04 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లు కలిపి సగటు హాజరు శాతం 25.2గా నమోదైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. బుధవారం సగటున 21.77 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య 52,22,174 మంది కాగా గురువారం 14,76,874 మంది హాజరయ్యారు. హాజరు క్రమంగా పెరిగే అవకాశం! పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలోని ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల హాజరు శాతం ఆశాజనకంగా ఉంది. తల్లిదండ్రుల నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సీజనల్ జ్వరాలు, ఇతరత్రా అస్వస్థతతో ఉన్న వాళ్ళను మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు కట్టడి చేశారు. విద్యార్థుల హాజరు శాతం క్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. టీచర్‌కి కరోనా.. పాఠశాల మూసివేత ►వారం రోజులు సెలవులు ప్రకటించిన ఎంఈవో పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోవిందాపు రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధారణైంది. బుధవారం విధులకు హాజరై న ఆమెకు గురువారం నలతగా ఉం డటంతో పరీక్ష చేయించుకున్నారు. అం దులో కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఆమె వెంటనే ఎంఈవో వీరస్వామికి సమాచారమిచ్చారు. దీంతో పాఠశాలకు వారంరోజులు సెలవులు ప్రకటించినట్లు వీరస్వామి తెలిపారు. పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలుంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. -
Telangana: తొలిరోజున విద్యార్థుల హాజరు నామమాత్రమే..!
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైనా.. తొలిరోజున విద్యార్థుల హాజరు నామమాత్రంగా నమోదైంది. బుధవారం చాలావరకు ప్రభుత్వ, ప్రైవేటు బడులన్నీ బోసిపోయి కనిపించాయి. విద్యార్థులను బడులకు రప్పించేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రయత్నించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారులు కూడా రంగంలోకి దిగారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. కానీ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి కనిపించింది. ఇంకొన్ని రోజులు వేచిచూద్దామని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రభుత్వం ఆన్లైన్ బోధనకు వెసులుబాటు ఇవ్వడంతో.. పాఠశాలలతో పాటు విద్యార్థులు కూడా ఆన్లైన్నే ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఫలితంగా ప్రైవేటు సంస్థల్లో విద్యార్థుల హాజరు తక్కువగా నమోదైంది. బుధవారమే మొదటి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని, కొద్దిరోజుల్లోనే పుంజుకుంటుందని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. సగటున 22 శాతం మించలేదు గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు మినహా అన్ని విద్యాసంస్థలను పునః ప్రారంభించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తొలిరోజున ప్రభుత్వ స్కూళ్లలో 27.45 శాతం, ప్రైవేటు బడుల్లో 18.35 శాతం విద్యార్థుల హాజరునమోదైంది. మొత్తంగా సగటు హాజరుశాతం 22కు మించలేదని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 405 ఇంటర్ కాలేజీల్లో ఫస్టియర్ విద్యార్థులు 97,520 మందికిగాను 16,907 మంది.. సెకండియర్‌లో 84,038 మందికిగాను 12,687 మంది హాజరయ్యారు. సగటున 15 శాతమే హాజరు నమోదైంది. భయం భయంగానే.. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఎక్కువ మంది బడికి వచ్చారు. గ్రామాల్లో తల్లిదండ్రుల నుంచి పెద్దగా అభ్యంతరాలు కన్పించలేదని ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే సీజనల్ జ్వరాలు, ఇతర అనారోగ్యం ఉన్నవారిని బడులకు రాకుండా చూశారు. వ్యవసాయ పనులకు వెళ్లే విద్యార్థుల్లో చాలా వరకు పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపలేదు. పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. తల్లిదండ్రులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారని, క్రమంగా హాజరు పుంజుకుంటుందని అధికారులు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు స్కూళ్లలో హాజరు కాస్త మెరుగ్గా ఉంది. కానీ సమీపంలోని పట్టణాలు, వేరే ఊర్లలో చదువుతున్న విద్యార్థులు మాత్రం వెళ్లలేదు. పాఠశాలల వాహనాలు గ్రామాలకు వచ్చినా తల్లిదండ్రులు పిల్లలను పంపలేదు. పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లలో హాజరుశాతం తక్కువగా కనిపించింది. ఏడాదిన్నరగా బడులు లేకపోవడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో చాలామంది తల్లిదండ్రులు సొంతూర్లకు వెళ్లారు. వారు ఇప్పటికిప్పుడు పట్టణాలకు వచ్చే పరిస్థితి లేదు. దానికితోడు ఆన్లైన్ బోధన ఉండటంతో.. దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చాలా వరకు ఆన్లైన్ బోధనకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. చిన్నగదుల్లో ప్రత్యక్ష బోధన వల్ల సమస్యలు రావొచ్చనే ఆలోచనతో ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంతకాలం పరిస్థితిని గమనించాకే స్కూళ్లకు పంపాలని భావిస్తున్నారు. బుధవారం స్కూళ్లు, విద్యార్థుల పరిస్థితి ఇదీ.. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో మొత్తం విద్యార్థులు: 52,22,174 తొలిరోజు హాజరైన విద్యార్థుల సంఖ్య: 11,37,095 (21.77 శాతం) ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు: 19,66,234 హాజరైన విద్యార్థులు: 5,39,674 (27.45 శాతం) ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు: 32,55,940 హాజరైన విద్యార్థులు: 5,97,421 (18.35 శాతం) బడికి రెడీ.. సైకిలే రిపేర్.. ఖమ్మం జిల్లా కేంద్రంలో పాఠశాలకు వెళ్లేందుకు బయలుదేరిన విద్యార్థి ఇతను. సైకిల్ మొరాయించడంతో మధ్యలో ఆగి మరమ్మతు చేయించుకున్నాడు. చిన్న పిల్లలు రాలే.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఉన్న అంగన్వాడీ కేంద్రం ఇది. బుధవారం ఈ కేంద్రాన్ని తెరిచినా.. పిల్లలెవరూ రాక టీచర్ ఖాళీగా కూర్చున్నారు. బడికి కొందరు.. చెత్త ఏరుతున్న మరికొందరు ప్రత్యక్ష బోధన ప్రారంభం కావడంతో.. కొందరు పిల్లలు బడిబాట పట్టినా, మరికొందరు పనులకు వెళ్లారు. భువనగిరి పట్టణంలో కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా.. ఆ ప్రాంతంలోనే మరికొందరు పిల్లలు చెత్త పేపర్లు సేకరిస్తున్న దృశ్యమిది. తొలిరోజే.. తృటిలో తప్పిన ప్రమాదం నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని తిమ్మాపూర్ అంగన్వాడీ కేంద్రంలో తొలిరోజు అపశ్రుతి చోటు చేసుకుంది. ఇక్కడి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న పాత గదుల్లో కొన్నేళ్లుగా అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. బుధవారం ఈ కేంద్రానికి వచ్చిన గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ హెల్పర్ మౌనిక సరుకులు అందజేస్తుండగా.. భవనంపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా అందరూ బయటికి పరుగెత్తారు. భవనం పాక్షికంగా దెబ్బతింది. ఇద్దరు విద్యార్థులు.. పది మంది లెక్చరర్లు మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 350 మంది విద్యార్థులు ఉండగా.. బుధవారం ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు కాలేజీలోని పది మంది లెక్చరర్లు విధులకు వచ్చారు. మంగళ హారతులిచ్చి.. మెదక్ జిల్లా కుర్తివాడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు వీరు. విద్యార్థులను శుభ సూచకంతో స్వాగతించాలని ఇలా చేసినట్టు వారు చెప్పారు. బురదలో నడుచుకుంటూ.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని బాలుర ఉన్నత పాఠశాల వద్ద బురదలో నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థులు. పాఠశాలకు వెళ్లే దారి సరిగా లేకపోవడంతో ఇటీవలి వర్షాలకు నీళ్లు నిలిచి బురదగా మారింది. డప్పులతో విద్యార్థులకు స్వాగతం చాలా రోజుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థులకు డప్పు చప్పుళ్లతో స్వాగతం పలుకుతున్న దృశ్యమిది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ పాఠశాలలో అక్కడి సర్పంచ్ నర్సాగౌడ్, ఉపాధ్యాయులు ఇలా స్వాగతం పలికారు. గదులు లేక.. వరండాలో చదువులు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వరండాలో కూర్చుని చదువుకుంటున్న విద్యార్థులు వీరు. మొత్తంగా 142 మంది విద్యార్థులు ఉండగా.. మూడే తరగతి గదులు ఉన్నాయి. దీనితో 7, 8వ తరగతుల విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. బడి కూలిపోయేలా ఉంది సార్.. మంత్రి కేటీఆర్‌కు జనగామ ఉపాధ్యాయుల ట్వీట్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు! జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో సిద్దిపేట రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది. 160 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో తరగతి గదుల పైకప్పు దెబ్బతింది. ఇటీవలి వర్షాలతో గోడలు తడిసి, గదుల్లోకి నీరు వస్తోంది. ఉపాధ్యాయులు దీనిపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘‘జనగామలో బాలికల ఉన్నత పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులతోపాటు వరండా పైకప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. బడి కోసం కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. పాఠశాల తరలింపు, కొత్త భవన నిర్మాణానికి సంబంధించి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. బడిలో విద్యాశాఖ కమిషనర్.. బీబీనగర్, భూదాన్ పోచంపల్లి: పాఠశాలలు పునః ప్రారంభం అవుతుండటంతో విద్యా శాఖ కమిషనర్ దేవసేన.. బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి స్కూళ్లను సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాయరావుపేట, జామీలపేట, పడమటి సోమవారం గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను, భూదాన్ పోచంపల్లి పట్టణంలోని మోడల్ స్కూల్‌ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులకు సూచించారు. -
Telangana: అయ్యో..మూత ‘బడి’
ఇది నల్లగొండ పట్టణం శివాజీనగర్లోనిసెయింట్ ఆంథోనీస్ స్కూల్.. అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని టులెట్ బోర్డు పెట్టారు. ఇదే పట్టణంలోని క్రాంతినగర్‌లో మమత స్కూల్ నిర్వాహకులు భవనం అద్దె చెల్లించలేక చేతులెత్తేశారు. దాని యజమాని.. స్కూళ్లకు భవనాన్ని అద్దెకిస్తే లాభం లేదని ఏకంగా భవనాన్నే అమ్మకానికి పెట్టారు. సాక్షి, నెట్వర్క్: కరోనా దెబ్బకు ప్రైవేటు రంగంలోని చిన్నాచితకా బడ్జెట్ స్కూళ్లు చతికిలబడ్డా యి. పల్లెలు, మాదిరి పట్టణాల్లోని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండి పిల్లలకు కాన్వెంట్ తరహా విద్యాబుద్ధులు నేర్పిన ఇలాంటి స్కూళ్లు రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో మూతపడ్డాయి. రెండు, మూడు దశాబ్దాలుగా నడుస్తున్నవీ కనిపించకుండాపోతున్నాయి. కొన్ని స్కూళ్లు ఫంక్షన్‌హాళ్లుగా మారి పోగా, మరికొన్ని ‘కార్పొరేట్’చేతుల్లోకి వెళ్లిపోయాయి. మరికొన్నింటిని యాజమాన్యాలు అమ్మకానికి పెట్టాయి. ఫలితంగా వీటిపై ఆధారపడిన వేలసంఖ్యలోని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. యాజమాన్యాలతో పాటు ఇన్నాళ్లూ వీటిపై ఆధారపడి, గౌరవప్రదంగా బతికిన టీచర్లు జీవనోపాధికి చిన్నాచితకా పనులు, ఇతర వృత్తులు చేపడుతున్నారు. ఫీజులు రాక.. చెల్లింపులు భారమై కరోనా, లాక్డౌన్ పరిణామాలతో పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సమాంతరంగా నడిచిన చిన్నపాటి ప్రైవేట్ స్కూళ్లలో ఆన్లైన్లో బోధించేంత సాంకేతికత లేకపోయింది. మరోపక్క కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న మధ్యతరగతి వర్గాలు పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో మాన్పించి ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు. ఈ పరిణామాలతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి. స్కూళ్లు నడవకున్నా సిబ్బంది జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు, ఆస్తిపన్నులు, స్కూల్ బస్సులపై ఈఎంఐలు చెల్లించక తప్పని పరిస్థితి.. గత విద్యా సంవత్సరం ఏదోలా నెట్టుకొచ్చినా.. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలో కరోనా సెకండ్‌వేవ్ విజృంభణతో పాఠశాలలు మళ్లీ మూతపడ్డాయి. బోధన చాలావరకు ఆన్లైన్లోనే సాగటంతో పూర్తిస్థాయిలో ఫీజలు రాబట్టుకోలేక, అద్దెలు, పన్నులు, వాయిదాలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక, సిబ్బందికి జీతాలివ్వలేక చిన్న పాఠశాలల యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. అద్దె చెల్లించాలని లేదా ఖాళీచేయాలని భవన యజమానులు ఒత్తిడి చేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో కొన్ని యాజమాన్యాలు స్కూళ్లను మూసేశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ప్రైవేటు స్కూళ్లు 10,912 ఉంటే, వీటిలో 960 వరకు బడ్జెట్ స్కూళ్లు మూతపడ్డాయి. మరికొన్నిటిని యాజమాన్యాలు అమ్మకానికి పెడుతున్నాయి. ఇంకొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో విలీనమవుతున్నాయి. సొంతంగా భవనాలున్న యాజమాన్యాలు.. స్కూలు మూసేసి భవనాన్ని ఇతర వ్యాపారాలకు లీజుకిస్తున్నాయి. ఫలితంగా ఆయా స్కూళ్లలోని బోధన, బోధనేతర సిబ్బంది రోడ్డునపడ్డారు. వీటిల్లో చదివే విద్యార్థులు చెల్లాచెదురైపోయారు. అయితే అమ్మకం.. లేదంటే అద్దెకు – కరోనా దెబ్బకు కుదేలైన కామారెడ్డి జిల్లాలోని 9 ప్రైవేటు పాఠశాలల్ని వాటి యాజమాన్యాలు అమ్మకానికి పెట్టాయి. కామారెడ్డిలోని ఓ కార్పొరేట్ స్కూలు.. ఏదోలా నెట్టుకొచ్చే యత్నంలో స్కూలు నడవక అద్దె చెల్లించలేని పరిస్థితి నెలకొందని, దీనిపై ఆలోచించాలంటూ కోర్టుకెళ్లింది. దీంతో స్కూళ్లు తెరిచేదాకా అద్దె అడగొద్దని భవన యజమానికి కోర్టు సూచించింది. – భద్రాద్రి జిల్లా పాతకొత్తగూడెంలోని అరుణాచలేశ్వర ప్రైవేటు పాఠశాల యాజమాన్యం స్కూలును మూసేసి భవనాన్ని గిరిజన సంక్షేమ శాఖకు లీజుకిచ్చింది. విద్యార్థుల నుంచి రూ.12 లక్షల వరకు ఫీజుల రూపేణా రావాల్సి ఉందని యాజమాన్యం వాపోయింది. – బాన్సువాడలోని అక్షర స్కూలులో 280 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులున్నారు. వీరి నుంచి ఫీజులు వసూలు కాకపోవడంతో నెలనెలా బస్సుపై వాయిదా రూ.15 వేలు. భవనం అద్దె నెలకు రూ.30 వేలు చెల్లించడం గగనమైంది. దీంతో స్కూలు యజమాని ఫణీంద్ర కులకర్ణి 80 శాతం వాటాను అమ్మేశారు. – పాల్వంచలోని కేఎల్ఆర్ కిడ్స్ పాఠశాల యాజమాన్యం.. కరోనా పరిస్థితుల్లో నిర్వహణ భారమై ఓ కార్పొరేట్ విద్యాసంస్థతో కలిసి స్కూలు నడపడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇవీ ప్రైవేటు యాజమాన్యాల విన్నపాలు – ఈ రెండేళ్ల ఆస్తిపన్నును పూర్తిగా రద్దుచేయాలి – ఆస్తిపన్నును వాణిజ్య కేటగిరీ నుండి శాశ్వతంగా సేవా కేటగిరీలోకి మార్చాలి. – విద్యుత్ బిల్లును వాణిజ్య కేటగిరీ నుండి సాధారణ కేటగిరీకి మార్చాలి – పాఠశాల బస్సుల రవాణా పన్నును రద్దుచేయాలి. – ఏప్రిల్, మే, జూ¯న్ నెలల్లో ఇచ్చినట్లుగా ఉపాధ్యాయులకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఈ విద్యా సంవత్సరమంతా ఇవ్వాలి. ఇది 35 ఏళ్ల చరిత్ర కలిగిన గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఎస్వీవీ పాఠశాల. వేలాదిమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఈ స్కూలు మొన్నటివరకు 1,500 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులతో కళకళలాడింది. కరోనా దెబ్బకు విద్యార్థుల సంఖ్య 120కి పడిపోయింది. ఫీజులు వసూలుకాక, జీతాలివ్వలేక స్కూలు భవనాన్ని ఫంక్షన్‌హాలుగా మార్చేసినట్టు కరస్పాండెంట్ సర్వోత్తమరెడ్డి చెప్పారు. ‘టులెట్’బోర్డు కనిపిస్తున్న ఈ భవనంలో శ్రీవాణి ప్రైవేటు పాఠశాల (సంగారెడ్డి) 18 ఏళ్లుగా నడిచింది. కరోనాతో రెండేళ్లుగా బోధన లేదు. ఫీజులూ వసూలుకాలేదు. విధిలేని పరిస్థితుల్లో యాజమాన్యం అద్దె భవనాన్ని ఖాళీచేసింది. దీంతో భవనం యజమాని టులెట్ బోర్డు పెట్టారు. అద్దె ఇవ్వలేం.. ఫర్నిచర్ అమ్ముకోండి ఇది నల్లగొండలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. తరగతులు నడవక, ఫీజులు కట్టలేక 200 మంది విద్యార్థులు మానేశారు. దీంతో ఆదాయంలేక గతేడాది మార్చి నుంచి స్కూలు యాజమాన్యం భవన యజమానికి రూ.8 లక్షల అద్దె బకాయిపడింది. చేసేదిలేక అద్దె కింద సరిపెట్టుకోవాలంటూ ఫర్నిచర్‌ను వదిలేసింది. మూతపడిన స్కూలు కార్పొరేట్ వశం ఐరిష్ ఎడ్యూవ్యాలీ వరల్డ్ స్కూల్.. యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్పూర్లో మూడేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా తదనంతర పరిణామాలతో గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు పిల్లల్లేక, ఫీజులురాక మూతపడింది. దీంతో యాజమాన్యం.. ఈసీఐఎల్‌లోని కాల్ పబ్లిక్ స్కూల్ అనే కార్పొరేట్ సంస్థకు అమ్మేసింది. అపార్ట్మెంట్లోవాచ్మన్గా టీచర్ ఈయన పేరు బాల్‌రాజు (మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్). పీజీ, బీఈడీ చేసిన ఈయన స్థానిక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేసేవాడు. భార్య సైతం పీజీ, బీఈడీ పూర్తిచేసి అదే స్కూల్లో పాఠాలు చెప్పేవారు. కరోనా పరిస్థితుల్లో స్కూలు మూతపడింది. ఇద్దరి ఉద్యోగాలూపోయాయి. దీంతో బాల్‌రాజు మహబూబ్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా చేరాడు. కులవృత్తి అయిన లాండ్రీ పని కూడా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. -
‘కార్పొరేట్’కు దీటుగా..
కెరమెరి (ఆసిఫాబాద్): కడెర్ల రంగయ్య.. సావర్‌ఖెడా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 2010లో ప్రధానోపాధ్యాయుడిగా చేరారు. అదే గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో సహా ఉంటున్నారు. పాఠశాలలో చేరినప్పుడు 48 మంది విద్యార్థులు ఉండేవారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి చాలా మంది పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. దీంతో ప్రస్తుతం 280 విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు తీసిపోని స్కూల్‌ను తీర్చిదిద్దారు. ఈ పాఠశాలలో చదివిన 70 మంది విద్యార్థులు గురుకులాల్లో, ఆరుగురు చుక్కా రామయ్య ట్రస్ట్‌లో సీట్లు సాధించారు. ప్రొజెక్టర్ ద్వారా తరగతులు చెబుతారు. సావర్‌ఖెడాలో ఎఫ్ఎం సావర్‌ఖెడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుడిలో మైక్ పెట్టి రోజూ పాఠాలు బోధిస్తున్నారు. ఘర్ బన్‌గయా విద్యాలయ, ప్రేయర్ ఎట్ చౌరస్తా వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 9 గంటలకు ఇళ్లల్లోనే విద్యార్థులు నిల్చుని ప్రార్థన చేస్తుంటారు. గ్రామంలో మద్యపాన నిషేధం కోసం రంగయ్య ఒక రోజు నిరాహర దీక్ష చేపట్టి మద్యపాన నిషేధం అమలయ్యేలా చూశారు. డ్రాపౌట్లు తగ్గడంతో బాల్యవివాహాలు తగ్గాయి. రంగయ్య సతీమణి వీణ కూడా గ్రామంలో రెండేళ్ల పాటు విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన చేశారు. రంగయ్య కూతురు అక్షర అదే పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదువుకుంది. కుమారుడు అభిరాం ఇదే పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. డ్రాయింగ్ షీట్లపై పాఠాలు రాసి గ్రామంలోని ఇళ్ల గోడలపై అతికించారు రంగయ్య. ఉదయం లేవగానే విద్యార్థులు గోడపై ఉన్న పాఠాలను చదువుకుంటున్నారు. మరింత ఉత్సాహం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు, స్నేహితుల సహకారంతో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. ఈ అవార్డు వారికే అంకితం. మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఈ అవార్డు ఎంతో దోహదపడుతుంది. – కడెర్ల రంగయ్య, ప్రధానోపాధ్యాయుడు -
వివాదంగా మారుతున్న నీరజ్ స్కూల్ వ్యవహారం
-
అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు : మంత్రి సురేష్
-
ప్రభుత్వం చెప్పినా వినట్లే.. ‘ప్రైవేటు’ రూటే సపరేటు..
సాక్షి, వెంగళరావునగర్: ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేస్తామని లైసెన్స్‌లు తీసుకున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు మచ్చుకైనా పాటించడం లేదు. ఖైరతాబాద్ విద్యాశాఖ పరిధిలోని యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, బోరబండ, రహమత్‌నగర్, ఎర్రగడ్డ డివిజన్లలో 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 50 లోయర్‌క్లాస్, 190 ప్రైవేటు స్కూల్స్ ఉన్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందులో మొత్తం 1 నుంచి 10 తరగతుల వరకు 95,913 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాగా ప్రభుత్వం గత రెండ్రోజుల కిందట 1 నుంచి 9 తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా పదో తరగతి విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హమ్మయ్య... అంటూ కరోనా నుంచి తమను తప్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రైవేటు’ రూటే సపరేటు.. ఖైరతాబాద్ విద్యాశాఖ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల రూటే సపరేటుగా నడుస్తుంది. ఆయా డివిజన్ల పరిధిల్లోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో (10వ తరగతి మినహా) ఇంకా పరీక్షలను కొనసాగిస్తున్నారు. దీంతో అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొత్తం 95 వేల మంది వరకు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఉండగా, ఇప్పటికే లోయర్ క్లాస్ పిల్లలకు పరీక్షలను పూర్తి చేయగా, ప్రస్తుతం హైస్కూల్ విద్యార్థులకు పరీక్షలను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తమ పిల్లలను ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ వార్షిక పరీక్షలను పెట్టడం విడ్డూరంగా ఉందంటూ కొంతమంది తల్లిదండ్రులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రైవేటు స్కూల్స్ కనుక ఏమీ అనలేకపోతున్నామని వారు పేర్కొంటున్నారు. సోమవారం వరకు స్కూల్స్‌లో ఈ వార్షిక పరీక్షలను నిర్వహించగా మంగళవారం సైతం కొన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రశ్నా పత్రాలను ఇచ్చి ఇంటి వద్ద జవాబులు రాసుకుని రావాలని సూచించారు. దీంతో ఇళ్ల వద్ద కుస్తీలు పడుతూ పరీక్షలను ముగించి ప్రశ్నా, జవాబుల పత్రాలను ఆయా పాఠశాలల్లో అప్పజెప్పడం జరిగింది. ఇంకా మరో మూడు పరీక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని కూడా పూర్తి చేయాల్సి ఉందని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు. (చదవండి: 1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరూ ప్రమోట్ ) -
బతుకు దెరువుబాటలో.. చదువు చెప్పిన సారు
బన్సీలాల్‌పేట్: కరోనా కాటుకు ఎన్నో జీవితాలు కకావికలం అయ్యాయి. పలువురు ఉపాధి కోల్పోయి వీధి పాలయ్యారు. ఇదే కోవలో ప్రైవేటు టీచర్ల పరిస్ధితి దయనీయంగా మారింది. విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బడి పంతుళ్లు రోడ్ల పాలయ్యారు. కొందరు కూరగాయలు అమ్ముతుంటే.. మరికొందరు చిరు వ్యాపారులుగా మారి పొట్టపోసుకుంటున్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ బోలక్పూర్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ స్కూల్ అధినేత శివరామకృష్ణ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. బతుకు దెరువు కోసం తప్పనిసరి అయిందని బోలక్పూర్ సెయింట్ సాయి హైస్కూల్ అధినేత శివరామకృష్ణ్ణ సాక్షితో వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ప్రైవేటు టీచర్లపై సీఎం కేసీఆర్ వరాల జల్లు) -
ప్రైవేటు స్కూళ్లపై విద్యాశాఖ కొరడా
-
మమ్మల్ని ఆదుకోండి
ఏలూరు (మెట్రో): ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినా.. సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ప్రైవేటు టీచర్లు, లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దిద్దే అంబేడ్కర్ కోరారు. కలెక్టరేట్లో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు, తానేటి వనితలను కలిసి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ మాట్లాడుతూ రవీంద్రభారతి వంటి యాజమాన్యాలు జనవరి నెల నుంచి కూడా సిబ్బందికి జీతాలు ఇవ్వలేదన్నారు. మిగతా యాజమాన్యాలు మార్చి, ఏప్రిల్, మే నెలల జీతాలు ఇవ్వకుండా సిబ్బందిని వేధిస్తున్నారని, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు సిబ్బందికి సగం జీతం మాత్రమే ఇస్తున్నారన్నారు. అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సిబ్బందిని అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని.. ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ సమాజానికి సేవ చేస్తున్న సుమారు 5 లక్షల ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. విద్యాసంస్థలు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితులవల్ల సిబ్బందికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మంత్రులను కోరారు. దీనిపై మంత్రి రంగనాథరాజు స్పందిస్తూ.. యాజమాన్యాలు ఈ సమయంలో సిబ్బందిని ఆదుకోవాలన్నారు. తమ విద్యా సంస్థల్లో సిబ్బందికి మే జీతాలు ఇచ్చామని.. మిగతా యాజమాన్యాలు కూడా స్పందించాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. తానేటి వనిత మాట్లాడుతూ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుగ్గిరాల కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు జయ ప్రకాష్ , పట్టణ జనరల్ సెక్రటరీ దాసు, ఇతర ప్రైవేటు టీచర్లు పాల్గొన్నారు. -
ఆన్లైన్ క్లాస్.. ట్రాన్స్పోర్ట్, యాక్టివిటీస్, స్నాక్స్ ఫీజు
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో పలు ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ క్లాసులకు శ్రీకారం చుట్టాయి. అయితే.. ఈ –క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ సహా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధిక ఫీజుల వసూలును నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముందుగా వసూలు చేసే తొలి త్రైమాసిక ఫీజులో ట్యూషన్ ఫీజు మినహా ఇతరాలను మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీజుల్లో కోతలతో పాఠశాలల నిర్వహణ కష్టతరమవుతుందని పాఠశాలల యాజమాన్యాలు చెబుతుండడం గమనార్హం. తల్లిదండ్రుల వాదన ఇదీ.. ప్రస్తుతం నగరంలో ఆన్లైన్ విధానంలో బోధన కొనసాగిస్తున్న పలు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ బోధిస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు సహా, ఇతర యాక్టివిటీస్, ఫుడ్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. అంటే ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి వార్షిక ఫీజు లక్ష రూపాయలు అయితే.. ఇందులోనే ట్యూషన్, యాక్టివిటీస్, ఫుడ్, స్నాక్స్, ట్రాన్స్ పోర్ట్ తదితర ఫీజులు కలిపి ఉంటాయి. ఈ లక్ష రూపాయలను నాలుగు త్రైమాసికాల్లో రూ.25 వేల చొప్పున విడతలవారీగా వసూలు చేయడం పాఠశాలల ఆనవాయితీ. ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్, ఫుడ్, స్నాక్స్, యాక్టివిటీస్ లేకుండా కేవలం ఆన్లైన్ విధానంలో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి త్రైమాసికంలో వసూలు చేసే రూ.25 వేలలో సుమారు 50 శాతం మినహాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ కలకలం నేపథ్యంలో తిరిగి పాఠశాలలను ఎప్పుడు తెరుస్తారో స్పష్టత లేని నేపథ్యంలో పూర్తిస్థాయిలో పాఠశాలలు పనిచేసే పరిస్థితి లేదు. తిరిగి స్కూల్స్ పునః ప్రారంభమైన సమయంలో మిగితా త్రైమాసిక ఫీజులను పాత పద్ధతిలో వసూలు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పలు పాఠశాలలు ఉపాధ్యాయుల వేతనాల్లో కోత విధించాయని.. ఇతర నిర్వహణ ఖర్చులు అంతగా ఉండవని.. ఈ నేపథ్యంలోనే తొలి త్రైమాసిక ఫీజులను తగ్గించాలని కోరుతున్నారు. పాఠశాలల వాదన ఇలా.. విద్యార్థుల నుంచి తాము వసూలు చేసే ఫీజుల్లో రాయితీ ప్రకటిస్తే తాము తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటామని ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయుల వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు, వాహనాల మరమ్మతులు, వాటి ఈఎంఐలు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది జీతభత్యాలు తడిసి మోపడవుతున్న నేపథ్యంలో ఫీజుల్లో రాయితీలు ఇవ్వలేమని చెబుతుండడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయమే కీలకం.. విద్యార్థుల తల్లిండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ఎవరి వాదన వారు వినిపిస్తున్న నేపథ్యంలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే కీలకం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ తక్షణం రంగంలోకి దిగి ఫీజుల వివాదాన్ని పరిష్కరించాలని ఉభయ పక్షాలు కోరుతుండడం గమనార్హం. -
కరోనా కలకలంతో స్కూల్ మూసివేత..
సాక్షి, న్యూఢిల్లీ : ఓ విద్యార్థి తండ్రికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో నోయిడాలోని ఓ ప్రైవేట్ స్కూల్ మూడు రోజుల పాటు మూతపడింది. గత శుక్రవారం ఆగ్రాలో ఆ వ్యక్తి ఇచ్చిన బర్త్‌డే పార్టీలో స్కూల్ విద్యార్ధులకు సంబంధించిన పలు కుటుంబాలు పాల్గొనడంతో కరోనా వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. సదరు వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో హైస్కూల్ విద్యార్ధులకు పరీక్షలను రద్దు చేసిన పాఠశాల యాజమాన్యం స్కూల్ పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేసింది. కాగా బర్త్‌డే పార్టీలో పాల్గొన్న వారిలో ఆరుగురికి జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ కోసం వారి రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. మరోవైపు ఆ ఆరుగురితో సన్నిహితంగా మెలిగిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యారోగ్య అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, చైనాతోపాటు ప్రపంచ దేశాలను భయపెడుతున్న కోవిడ్-19 (కరోనా వైరస్) బాధితులు లక్షకు చేరువవడంతో డెడ్లీ వైరస్ వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2019, డిసెంబర్ 31వ తేదీన చైనాలో తొలి కేసు బయట పడగా, నేటికి ఒక్క అంటార్కిటికా మినహా ప్రతి ఖండానికి వైరస్ విస్తరించింది. చదవండి : అక్కడ తప్ప.. అంతా ‘కరోనా కల్లోల్లం’ -
కరెస్పాండెంట్ కుమారుల లైగింక వేధింపులు
కర్నూలు, బొమ్మలసత్రం: స్టడీ క్లాస్‌ల పేరుతో విద్యార్థులను ఇంటికి పిలిపించుకుని ఓ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ కుమారులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడడంతోపాటు వాటిని సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. బాధితులైన విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇవీ.. నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీలో ఓ ప్రైవేట్ పాఠశాలను కరెస్పాండెంట్ కుమారులు యశ్వంత్ , కార్తీక్ నిర్వహిస్తున్నారు. వీరి స్నేహితుడు చరణ్ అదే పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. పాఠశాలలో చదువుతున్న 9,10 వ తరగతిచదువుతున్న కొందరు విద్యార్థులు స్కూల్ ఎదురుగా ఉన్న కరెస్పాండెంట్ ఇంటికి స్టడీక్లాస్‌ల కోసం రాత్రి వెళ్లేవారు. మద్యం సేవించిన యశ్వంత్, కార్తీక్, చరణ్‌లు.. విద్యార్థులను వేధింపులకు గురిచేసేవారు. లోడ్రాయర్ వేసుకురాని వారిని వరుసగా నిలబెట్టి వారి మర్మాంగాన్ని స్కేలుతో కొలిచేవారు. ఈ దృశ్యాన్ని సెల్ఫోన్లతో చిత్రీకరించి తోటి విద్యార్థులకు చూపించి వేధించేవారు. విద్యార్థులు ఎదురుతిరిగితే గొడ్డును బాదినట్లు బాదేవారు. విద్యార్థులు భయపడి ఈ విషయంపై ఎక్కడా నోరుమెదిపేవారు కాదు. రోజురోజుకు వేధింపులు ఎక్కువ కావటంతో భరించలేని విధ్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు నేరుగా నంద్యాల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు..యశ్వంత్, కార్తీక్, చరణ్‌ల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు. పాఠశాలలో చదువుతున్న బాలికలపై కూడా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు రావటంతో దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ స్కూల్లో పిల్లలు లేకుండా రిపబ్లిక్ డే
సాక్షి, మేడ్చల్: భారతదేశం అంతటా నేడు గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడంలో తలమునకలవుతుంది. దేశ ప్రథమ పౌరుడు సైతం జెండా ఎగురవేసి నమస్కరిస్తారు. ఇక పాఠశాల పిల్లలు ఒకరోజు ముందునుంచే హడావుడి చేస్తూ రిపబ్లిక్‌డే కోసం సిద్ధమవుతుంటారు. అయితే మేడ్చల్‌లోని అత్వెల్లి గ్రామంలో హైటెక్ వ్యాలీ అనే ప్రైవేటు పాఠశాల మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఆదివారంనాడు స్కూలుకు సెలవు ప్రకటించింది. కానీ ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మాత్రం ఆదివారం స్కూలుకు వచ్చి విద్యార్థులు లేకుండానే జాతీయ జెండాను ఎగురవేశాడు. ఇక ఈ ఘటననపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన పిల్లలకు రిపబ్లిక్ డే వంటివి ఎంతగానో తోడ్పడుతాయని అభిప్రాయపడ్డారు. దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే వేడుకలను పిల్లల నుంచి దూరం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
పాఠశాలల్లో ‘పబ్లిక్ సేఫ్టీ క్లబ్బులు’
సాక్షి, హైదరాబాద్: నేటి బాలలే రేపటి పౌరులు.. వారికి నేడు కల్పించే అవగాహన జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే, అన్ని రకాల భద్రతపై వారికి అవగాహన వచ్చేలా వినూత్న కార్యక్రమానికి తెలంగాణ పోలీసులు శ్రీకారం చుట్టారు. అందుకే, పాఠశాల విద్యార్థులకు ‘భద్రత’పై అవగాహన కల్పించడం, ప్రతీ పాఠశాలలో విద్యార్థులతో కొన్ని క్లబ్బులు నిర్వహించడం, భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారిచేతే వివరింపజేయడం, వారి నుంచి వచ్చే వినూత్న సలహాలు, సూచనలు తీసుకోవడం.. ఇదీ తెలంగాణ పోలీసుల సరికొత్త కార్యాచరణ. చికిత్స కంటే నివారణ మేలు అన్న నినాదంతో తెలంగాణ పోలీసులు ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. రోజుకోరకం కొత్త కేసులు వెలుగు చూస్తోన్న నేపథ్యంలో నేరాలు, భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ విధానం అమలుకు సంకల్పించారు. తమిళనాడు స్ఫూర్తిగా.. వాస్తవానికి ఇలాంటి విధానం అమలు ఇదే తొలిసారి కాదు. తమిళనాడు పోలీసులు దీన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ‘నేరాలు– భద్రత’పై వారు చేపట్టిన ప్రతీ అవగాహన కార్యక్రమం అక్కడ సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో తెలంగాణ పోలీసులు గతేడాదే దీనిపై అధ్యయనం చేశారు. అందులో పలు అంశాలకు డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. అనంతరం కొత్త సంవత్సరం నుంచి మన రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులతో కూడిన గ్రూపులను ఏర్పాటు చేస్తారు. వీరికి రోడ్డుభద్రత (డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ వినియోగం, సీటుబెల్టు), మహిళా భద్రత, మానవ అక్రమరవాణా, చిన్నారుల భద్రత, వేధింపులు, డయల్ 100, షీటీమ్స్, హాక్ ఐ అంశాలలో వీరికి తొలుత శిక్షణ ఇస్తారు. తరువాత వీరు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తారు. వీరి నుంచి వచ్చే సృజనాత్మక ఆలోచనలనూ పోలీసులు స్వీకరించి ఇతరప్రాంతాల్లోనూ అమలుచేస్తారు. ఆపద ఎదురైతే.. ఎలా వ్యవహరించాలి? ఎవరిని సంప్రదించాలి? పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వాలి? అన్నది ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం. ప్రతీ ఠాణాలోనూ విధుల విభజన.. ఈ అవగాహన కార్యాక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి దాకా విధుల విభజన జరిగింది. రోడ్డుభద్రత, మహిళా భద్రత, మానవ అక్రమరవాణా, చిన్నారుల భద్రత, డయల్ 100, షీటీమ్స్, హాక్–ఐ అంశాలలో అవగాహన కార్యక్రమాలు ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరుగుతాయి. ప్రతీ పోలీస్స్టేషన్లోనూ సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ దాకా అందరికీ ఒక్కోఅంశాన్ని అప్పగించారు. వారు తమకు అప్పగించిన ప్రచార, అవగాహన కార్యక్రమాలను అమలు చేయాలి. వీటితోపాటు కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ‘ఈచ్‌వన్ –టీచ్‌వన్’కార్యక్రమం కూడా పోలీసులు స్వీకరించారు. వీరు స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థ, మహిళాసంఘాల సాయంతో భద్రత, ఈచ్‌వన్–టీచ్‌వన్‌పై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వీటి పురోగతిని ఠాణా పరిధిలో ఎప్పటికపుడు పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
ఆటవిడుపేది?
ఇబ్రహీంపట్నంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో 1,100 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల అనుమతి పొందేటప్పుడు ఆట స్థలం ఉన్నట్టు పత్రాలు సమర్పించారు. అయితే గత నెల 30వ తేదీన డీఈఓ రాజ్యలక్ష్మి స్కూల్‌ను తనిఖీ చేయగా అసలు విషయాలు బహిర్గతమయ్యాయి. ఆ పాఠశాలకు ప్లే గ్రౌండ్ లేదు. రోడ్డుపైనే పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు. ఇదేంటి అనుమతి పొందిన సమయంలో మీకు ఆట స్థలం ఉన్నట్టు రికార్డుల్లో ఉంది కదా.. అని డీఈవో సమగ్రంగా విచారించగా.. స్కూల్‌కు ఆనుకొని ఉన్న రహదారినే ఆట స్థలంగా చూపి అనుమతి పొందినట్లు తేలింది. విజయవాడ కృష్ణలంకలోని ఓ కార్పొరేట్ స్కూల్ బ్రాంచ్‌లో చదువుతున్న విద్యార్థులు ఆటలు ఆడాలన్నా, మానసిక ఉల్లాసం కోసం మరేదైనా చేయాలన్నా కనకదుర్గ వారధి నుంచి విజయవాడ బస్టాండ్‌కు ఉన్న సర్వీస్ రోడ్డు ఎక్కాల్సిందే. ఈ పాఠశాలకు ప్లే గ్రౌండ్ కాదు కదా కనీసం ప్రార్థన చేయటానికి పది అడుగుల స్థలం కూడా లేని దుస్థితి. జిల్లాలో వందలాది ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల పరిస్థితి ఇదే.. స్కూల్ ప్రారంభించేటప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి అనుమతులు పొందుతూ..ఆ తర్వాత విద్యార్థులను ర్యాంకుల ఫ్యాక్టరీల్లో మార్కుల యంత్రాల్లా మార్చేస్తూ.. అమూల్యమైన బాల్యాన్ని హరించేస్తున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో: ప్రైవేట్, కార్పొరేట్ విద్యార్థులను కేవలం ర్యాంకులు తెచ్చే సాధనాలుగానే యాజమాన్యాలు చూస్తున్నాయి. వారిలో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించే పరిస్థితి కనబడటం లేదు. దీంతో పిల్లల్లో మానసికోల్లాసం కరువైంది. నిత్యం ఒత్తిడితోచిత్తు అవుతున్నారు. పాఠశాల స్థాయిలో జోనల్, మండల క్రీడా పోటీలు నిర్వహిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రమే పాల్గొని విజేతలవుతుంటారు. కార్పొరేట్ పాఠ శాలల్లో చదివే విద్యార్థులకు క్రీడల్లో పాల్గొనాలని ఉన్నా అవకాశమివ్వరు. వారి దృష్టంతా చదువుల మీదే ఉంచాలంటారు. దీనికి తోడు కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులను నిత్యం హోంవర్కు, స్లిప్ టెస్ట్‌ల పేరుతో కట్టడి చేస్తున్నారు. తప్పుడు పత్రాలతో అనుమతులు...? జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు 1,342 ఉండగా.. వాటిల్లో 4,10,705 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో క్రీడా మైదానం తప్పని సరి అని ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కి తప్పుడు పత్రాలతో ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. పాఠశాలలు ప్రారంభించే వారు అనుమతుల కోసం వెళ్లేటప్పుడు అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా చూడాలి. ఉన్నతాధికారులు వీటిని చూసి అనుమతులు మంజూరు చేయాలి. కానీ పాఠశాలలు తనిఖీ చేసేటప్పుడు గమనించిన దాఖలాలు లేవు. మరికొన్ని అనుమతుల సమయంలో దగ్గర్లో ఖాళీగా ఉన్న మైదానాలను చూపి పర్మిషన్లు పొందుతున్నారు. అనుమతులు ఇచ్చిన తర్వాత ఆవేవి కనిపించడం లేదు. -
స్టీరింగ్ విరిగి.. పక్కకు ఒరిగి
కర్నూలు, ఆదోని రూరల్: మండల పరిధిలోని నెట్టేకల్ సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. పట్టణంలోని శారదానికేతన్ పాఠశాలకు చెందిన బస్సు (ఏపీ21టీ జెడ్0898) బుధవారం డి.కోటకొండ, చిన్నపెండేకల్, సాంబగల్, నెట్టేకల్ గ్రామాలకు చెందిన 60 మందికి పైగా విద్యార్థులను తీసుకుని ఆదోనికి బయలుదేరింది. మార్గమధ్యంలోని నెట్టేకల్ సమీపంలో స్టీరింగ్ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి కొద్దిదూరం ముందుకెళ్లి ఓ పక్కకు ఒరిగింది. అందులో ప్రయాణిస్తున్న విద్యార్థుల్లో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. బస్సు ఆగిన స్థలానికి పది అడుగుల దూరంలోనే విద్యుత్ స్తంభం ఉంది. పొరపాటున దాన్ని ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి సంఘాల నాయకులు సంఘటన స్థలంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
సాంబారు పాత్రలో పడి విద్యార్థి మృతి
పాణ్యం: కర్నూలు జిల్లా పాణ్యంలోని విజయానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం సాంబారు పాత్రలో పడి పురుషోత్తంరెడ్డి (6) అనే చిన్నారి మృత్యువాత పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన శ్యామ్‌సుందర్‌రెడ్డి, కల్పన దంపతులకు కుమారుడు పురుషోత్తంరెడ్డితో పాటు కుమార్తె ఉంది. కల్పన రెండేళ్ల క్రితమే మృతి చెందడంతో పురుషోత్తంరెడ్డిని తండ్రి విజయానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్లో యూకేజీలో చేర్పించాడు. రోజూ లాగానే బుధవారం మధ్యాహ్నం భోజనానికి క్యూలైన్లో నుంచున్న విద్యార్థులు వెనుక నుంచి నెట్టేయడంతో.. ముందున్న పురుషోత్తంరెడ్డి పెద్ద సాంబారు పాత్రలో పడిపోయాడు. అక్కడే ఉన్న ఆయా పీరమ్మ వెంటనే అతన్ని బయటకు తీయగా..పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే పురుషొత్తంరెడ్డి చర్మంపై బొబ్బలు రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. విద్యార్థి తండ్రికి సమాచారం అందించిన యాజమాన్యం పాఠశాలకు తాళాలు వేసి కర్నూలు ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ పురుషోత్తంరెడ్డి చనిపోయాడు. పాణ్యం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి సంఘం నిరసన.. పాఠశాలలో సరైన సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థి మృతికి కారణమైన విజయానికేతన్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు పలువురు బుధవారం రాత్రి పాఠశాల వద్ద నిరసనకు దిగారు. విద్యార్థి మృతి చెందినా పట్టించుకోకుండా..కరస్పాండెంట్, డైరెక్టర్లు సెల్ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నారని ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారు ఆందోళన విరమించారు. -
స్కూల్లో అగ్ని ప్రమాదం; చెలరేగిన మంటలు
-
గౌతమ్ మోడల్ స్కూల్లో అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని పాయకరావుపేట గౌతమ్ మోడల్ స్కూల్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇన్వర్టర్లో అనూహ్యంగా మంటలు చెలరేగడంతో ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా గురువారం నాగుల చవితి రోజున విద్యార్థులకు సెలవు కావడంతో ప్రమాదం తప్పింది. అయితే స్కూల్ వాతావరణాన్ని పరిశీలించిన అధికారులు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు సరిగ్గా లేవని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘చదువులు చారెడు బుక్స్ బారెడు’
నేహాంత్ తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. తన కుమారుడిని గొప్ప వాడిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యంతో ఓ కార్పొరేట్ పాఠశాలలో చేర్పించాడు. కానీ తన కొడుక్కి మోయలేని పుస్తకాల భారాన్ని చూసి చలించిపోతున్నాడు. ఆరో తరగతి చదువుతున్న నేహంత్ ప్రతి రోజు కేజీల కొద్ది పుస్తకాలను మోయడం వల్ల భవిష్యత్తులో తన ఎదుగుదలపై ఎంత ప్రభావం చూపుతుందో అని ఆ తండ్రి భయపడి పోతున్నాడు. ఈ సమస్య ఒక్క నేహాంత్‌దే కాదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్య. ప్రభుత్వ నిబంధనలను చాలా పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోకపోవడమే దీనికి కారణం. సాక్షి, మహబుబ్‌నగర్ : ప్రభుత్వం చిన్నారులకు ఎక్కువ సంఖ్యలో బరువైన పుస్తకాలను మోయకుండా ఉంచేందుకు తరగతుల వారీగా బరువులను నిర్ణయించింది. కానీ వాటిని యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోకుండా ఇష్టరీతిగా పిల్లలతో పుస్తకాలను మోయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరక బరువుతో ఇబ్బందులు పడుతుండగా, భవిష్యత్తు వారి ఎత్తు పెరుగుదల వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. బడి బ్యాగు మోయలేక చిన్నారులు నీరసించి పోతున్నారు. బాధను చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. ‘చదువులు చారెడు బుక్స్ బారెడు’ అన్న చందంగా మారింది ప్రవేటు పాఠశాలల తీరు. నర్సరీ, ఎల్కేజీ నుంచి బాల్యంలో బండెడు బరువు మోస్తూ ఆపసోపాలు పడుతున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు వారిని పాఠశాలకు పంపామని సంబురపడుతున్నారే తప్ప వారు మోస్తున్న పుస్తకాల బరువు ఎంత... అంత బరువును చిన్నారులు మోయడం వల్ల వచ్చే సమస్యలు, వారు పడుతున్న బాధను పట్టించుకోవడంలేదు. ఎన్ని పుస్తకాలు బ్యాగ్‌లో ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా చదువుతున్నారనే దోరణిలో ఉంటున్నారు. మార్గదర్శకాలు పట్టవా..? ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో చదువుతున్న విద్యార్థులు ఎంతబరువుల పుస్తకాలు మోయాలన్న విషయంలో స్పష్టంగా వివరిస్తూ గత విద్యాసంవత్సరంలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో 1, 2వ తరగతి విద్యార్థులకు 1.5 కేజీల బరువు, 3, 5 తరగతులకు 2 నుండి 3 కేజీలు, 6, 7 తరగతులకు చదువుతున్న విద్యార్థులు కేవలం 4 కేజీలు, 8,9 తరగతుల వారికి 4.50 కేజీలు, పదవ తరగతి విద్యార్థులకు కేవలం 5 కేజీల పుస్తకాలను మాత్రమే కేజీల పుస్తకాలను మాత్రమే మోయాలని పేర్కొంది. కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఒక్కో విద్యార్థి 8కేజీల నుండి 10 కేజీలకు పైగానే బరువును మోస్తున్నట్లు తెలుస్తుంది. ఈ బరువు ప్రభుత్వ బడుల్లో తక్కువగానే ఉన్నప్పటికీ ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఇందుకు సంబంధించి పుస్తకాలపై విద్యాశాఖ అధికారుల పర్యావేక్షణ కూడా ఉండాల్సి ఉంది. కానీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిçస్తుండడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ఇష్టారీతిగా పుస్తకాల మోతలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం సూచించిన పుస్తకాలను మాత్రమే వినియోగించాల్సి ఉంది. ఇందులో స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్‌కు సంబంధించినవి మాత్రమే వినియోగించాల్సి ఉంది. కానీ ప్రైవేటు పాఠశాలలు అడ్డగోలుగా పుస్తకాలను వినియోగిస్తున్నారు. అయితే సబ్జెక్టుల వారిగా స్టేట్, సెంట్రల్ సిలబస్‌కు సంబంధించినవి కాకుండా ఇతర పుస్తకాలను కూడా విద్యార్థులతో చదివిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఐఐటీ, నీట్, ఇంజనీరింగ్, అంటూ చదివే సబ్జెక్టులకు అధనంగా ఈ పుస్తకాలను విద్యార్థులతో చదివిస్తున్నారు. అంతేకాకుండా హోంవర్క్, ప్రాజెక్టులు, ప్రాక్టీస్, గైడ్లు, టెస్టు పేపర్లు అంటూ అదనపు బరువు పడుతుంది. సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్సు వంటి సబ్జెక్టులకు సంబందించి ఒక్కో పాఠశాల ఒక్కో మెటీరియల్‌ను అనుసరిస్తూ విద్యార్థుల చదువులను గందరగోళంలో పడేస్తున్నారు. అనేక పుస్తకాలను విద్యార్థులకు అధనంగా చేరడంతో బరువులు అమాంతం పెరిగిపోతున్నాయి. -
ప్రైవేట్ విద్యా సంస్థలకు ముకుతాడు
-
పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్
-
సర్కారు స్కూళ్లకు పోటెత్తిన అడ్మిషన్లు
ప్రైవేటు పాఠశాలల్లో చదువు కోసం భారీగా ఖర్చు చేసినా..ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం... ప్రభుత్వ పాఠశాలలల్లో క్వాలిఫైడ్ టీచర్లతో ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన, ఉచిత పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, ఎలాంటి ఫీజులు లేకపోవడంతో ఈ ఏడాది వేలాది మంది విద్యార్థులు ప్రైవేటును వీడి ప్రభుత్వ బడిబాటపడుతున్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయాలు మెరుగుపడటంతోనగరంలోని అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆయా పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా గ్రేటర్‌లోని పలు ప్రభుత్వపాఠశాలలు ఇప్పుడు విద్యార్థులతోకళకళలాడుతున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: సర్కారు బడులకు ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు పోటెత్తాయి. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి పదిశాతానికి పైగా అడ్మిషన్లు పెరిగాయి. పెరిగిన ఫీజుల భారాన్ని తట్టుకోలేక ప్రైవేటు స్కూళ్లను వీడి ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం విశేషం. హైదరాబాద్‌లో కొత్త గా 14,533, రంగారెడ్డిలో 20,548 అడ్మిషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రైవేటు పాఠశాలలో చదువుకుని..తాజాగా హైదరాబాద్ జిల్లాలో 5053 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరగా, రంగారెడ్డి జిల్లాలో 5572 మంది విద్యార్థులు చేరడం గమనార్హం. ఇదిలా ఉంటే గవర్నర్ పర్యవేక్షణలో కొనసాగుతున్న రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి మించి అడ్మిషన్లు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ విద్యార్థులను ఇక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీపడ్డారు. సీటు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఒత్తిళ్లు రావడం విశేషం. ఒక్కో తరగతిలో1:30 చొప్పున విద్యార్థులు ఉండాల్సి ఉంది కానీ...ప్రస్తుతం 45 నుంచి 60 మంది వరకు ఉన్నారు. బోరబండ ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంతే పోటీ ఉండటం విశేషం. ఇప్పటికీ కొత్తగా అడ్మిషన్ల కోసం అనేక మంది వస్తున్నప్పటికీ..... ఖాళీలు లేక పోవడంతో వచ్చిన వాళ్లను తిప్పిపంపుతున్నట్లు ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు చెబుతుండటం కొసమెరుపు. ఆయా పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో నాణ్యమైన బోధన అందుతుండటమే ఇందుకు కారణం. అక్కడితో పోలిస్తే..ఇక్కడే ఫలితాలు మెరుగు జిల్లాలో మొత్తం 710 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో ఇప్పటికే సుమారు లక్ష మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. 2019–20 విద్యా సంవత్సరం లో కొత్తగా 14, 533 మంది విద్యార్థులు చేరారు. వీరిలో 6990 మంది అబ్బాయిలు కాగా, 7543 మంది అమ్మాయిలు ఉన్నారు. తరగతుల వారీగా పరిశీలి స్తే...1వ తరగతిలో 4264 మంది విద్యార్థులు చేరగా, 2వ తరగతిలో 1524 మంది, 3వ తరగతిలో 1228 మంది, 4వ తరగతిలో 870 మంది, 5వ తరగతితో 751మం ది, 6వ తరగతిలో 4617 మంది, 7వ తరగతిలో 588 మంది, 8వ తరగతిలో 473 మంది, 9వ తరగతిలో 176 మంది, 10వ తరగతిలో 42 మంది కొత్తగా చేరారు. ఒకటి, ఆరో తరగతిలో చేరిన వారిని మినహాయిస్తే...మిగిలిన వారంతా ఇప్పటి వరకు ఆయా ప్రైవేటు స్కూళ్లలో చదువుకుని, అక్కడి ఫీజుల భారం మోయలేక ప్రభుత్వ స్కూళ్లకు వచ్చినవారే. 10వ తరగతి వార్షిక ఫలితాల్లో ప్రైవేటు స్కూళ్ల కంటే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యా ర్థులే ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. గ్రేడింగ్‌లోనూ వీరే ముందున్నారు. అంతేకాదు...గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరగుప డ్డాయి. ఇంగ్లీషు మాధ్యమంలో బోధన, ఉచితంగా పుస్తకాలు, డ్రెస్సులు ఇవ్వడమే కాదు...మధ్యాహ్న భోజనం పథకంలో ఫౌష్టికాహారం అందజేస్తుండటం కూడా మరో కారణమని అధ్యాప కులు అభిప్రాయపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 20,548 అడ్మిషన్లు జిల్లాలో మొత్తం 1304 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2018–19 విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలల్లో 1,46,407 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1,46,505 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నెలాఖరు వరకు అడ్మిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జిల్లాలో 479 పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుండగా, వీటిలో 45 వేలమందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో వరుసగా గత మూడేళ్ల నుంచి అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అంతేకాదు జిల్లా పరిధిలో వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో 13వేల కుపైగా చిన్నారులు చదువుతుండగా, వీరందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. కానీ వీరిలో ఇప్పటి వరకు 3764 మంది పిల్లలను మాత్రమే చేర్పించారు. -
పుస్తకాలు, యూనిఫామ్స్ తమ వద్దే
సాక్షి, సిటీబ్యూరో: జూన్ వచ్చిందంటే చాలు విద్యార్థుల తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుడుతోంది. వేసవి సెలవుల్లో పిల్లలతో గడిపిన ఆనందం క్షణాల్లో ఆవిరవుతోంది. ఏటా భారీగా పెరుగుతున్న ఫీజులతో పేద, మధ్య తరగతి వర్గం చితికిపోతోంది. ట్యూషన్ ఫీజుల పేరుతో ఇప్పటికే భారీగా వసూలు చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు... పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్, స్టేషనరీ సైతం తమ వద్దే కొనాలని కొత్తగా నిబంధనలు పెడుతుండడం, వాటి ధరలు బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే రెట్టింపు ఉండడంతో తల్లిదండ్రులకు పిల్లల చదువు భారమవుతోంది. విద్యార్థులకు మంగళవారంతో వేసవి సెలవులు ముగుస్తాయి. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తమ విద్యార్థులను బడికి పంపే ఏర్పాట్లలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. పుస్తకాలు, డ్రెస్సులు, షూస్ కొనుగోళ్లపై దృష్టిసారించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు ఎక్కువగా ఉండడం, ఫీజు మొత్తం ప్రారంభంలోనే చెల్లించాల్సి వస్తుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితే ఇలా ఉంటే.. అతి తక్కువ వేతనాలతో కాలం వెల్లదీస్తున్న సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, చిరుద్యోగుల పరిస్థితి మరింత దయానీయంగా మారింది. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున 60,000 నుంచి 80,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక ఇద్దరు/ముగ్గురు పిల్లలున్న తల్లిదండ్రుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఒక్కసారిగా ఖర్చులన్నీ మీద పడడంతో సగటు మధ్య తరగతి కుటుంబం ఆర్థికంగా చితికిపోతోంది. నిబంధనలకు నీళ్లు.. 1994 జీఓ నంబర్ 1 ప్రకారం పాఠశాలలు 5శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి. వసూలు చేసిన ఫీజుల్లోంచి 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి. ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రయోజనాలకు 15 శాతం, పాఠశాల నిర్వహణకు, అభివృద్థికి 15 శాతం చొప్పున ఖర్చు చేయాలి. కేవలం 5 శాతం మాత్రమే యాజమాన్యం లాభంగా ఆశించాలి. కానీ 80 శాతం ఆదాయాన్ని లాభంగా తీసుకుంటూ, కేవలం 20 శాతం మాత్రమే ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం వెచ్చిస్తున్నారు. అంతేకాదు పాఠశాల ఆదాయ, వ్యయాలపై ప్రతి ఏటా వార్షిక నివేదికలు, ఆడిట్ రిపోర్ట్‌లను ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ ఏ ఒక్క స్కూలు కూడా సమర్పించడం లేదు. ఒకవేళ ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనుమతి తీసుకోవాలి. పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్‌లను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కొనాలన్న కచ్చితమైన నిబంధనలు పెట్టరాదు. వీటి అమ్మకాలకు పాఠశాలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చిన షాపులో కొనుగోలు చేయొచ్చు. పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటీ, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈ–టెక్నో తదితర పేర్లు ఉండకూడదు. కేవలం పాఠశాల పేరు మాత్రమే పేర్కొనాలి. కానీ నగరంలో చాలా పాఠశాలలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకర్షించేందుకు టెక్నో, ఐఐటీ, ఒలింపియాడ్, కాన్సెప్ట్, ఈ–టెక్నోతో ప్రచారం చేసుకుంటున్నాయి. అజమాయిషీ కరువు... గ్రేటర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న పలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వ అధికారుల అజమాయిషీ కొరవడుతోందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. విద్యాసంస్థ ఏర్పాటు నుంచి నిర్వహణ వరకు చాలా అంశాల్లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను చాలా విద్యాసంస్థలు పట్టించుకోకపోవడం గమనార్హం. వీటిపై కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో మిగతా విద్యాసంస్థలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వివరిస్తున్నారు. క్రీడా ప్రాంగణం, విశాలమైన తరగతులు, విద్యార్హతలున్న ఉపాధ్యాయుల భర్తీ, విద్యార్థుల సంఖ్యకు తగినట్లు మరుగుదొడ్లు, మూత్రశాలల ఏర్పాటు చేయాలనే నిబంధనను చాలా విద్యాసంస్థలు అమలు చేయట్లేదనే ఆరోపణలున్నాయి. డిజిటల్ తరగతి గదులు, ఏసీ ప్రాంగణాల పేరుతో ఫీజులు భారీ స్థాయిలో వసూలు చేయడంపై కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా నిర్ణయించిన ఫీజులను సకాలంలో చెల్లించకపోతే అపరాధ రుసుం కలిపి వసూలు చేస్తున్నాయని పేర్కొంటున్నారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అడ్డూఅదుపు లేకుండా వసూళ్లు చేస్తున్న ఫీజులపైనా విద్యాశాఖ నియంత్రణ ఉండాలని కోరుతున్నారు. ఇంత ఫీజులు వసూళ్లు చేస్తున్న చాలా విద్యాసంస్థల్లోనూ కనీస వసతులు, క్రీడా మైదానాలు ఉండట్లేదని వివరిస్తున్నారు. ఖర్చులు ఇలా... (సుమారు) స్కూల్ ఫీజు రూ.40,000–60,000 పుస్తకాలకు రూ.4,500–6,500 ట్రాన్స్‌ఫోర్ట్ ఫీజు రూ.6,000–8,000 రెండు జతలయూనిఫామ్ రూ.3,500–4,000 రెండు జతల షూలు రూ.800–1200 టై, బెల్ట్స్ రూ.150–500 బ్యాగులు రూ.500–1500 ఇంటి అద్దె రూ.6,000–12,000 కిరాణ సామాను రూ.4,000–6,000 పాలు, కూరగాయాలు,ఇతర ఖర్చులు రూ.5,000 -
గుర్తింపు లేని విద్య!
సాక్షి, సిటీబ్యూరో: ఇతర వ్యాపారాలతో పోలిస్తే ప్రైవేట్ పాఠశాల విద్య లాభసాటిగా మారింది. తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించి పెడుతోంది. అందుకే చాలామంది ప్రైవేట్ పాఠశాలలపై దృష్టిసారించారు. కాలనీల మధ్య ఖాళీ స్థలం ఉంటే చాలు ఎంచక్కా ఓ భవనం నిర్మించి స్కూల్ పెట్టేస్తున్నారు. లేకపోతే ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని ఓ బోర్డు తగిలించేస్తున్నారు. ఎలాగూ ఇంటి పక్కనే స్కూలు ఉండడంతో తల్లిదండ్రులు కూడా మంచీచెడు ఆలోచించకుండా పిల్లలను వాటిలో చేర్పిస్తున్నారు. యాజమాన్యం అడిగినంత ఫీజూ చెల్లిస్తున్నారు. తీరా వాటికి గుర్తింపు లేదని తెలిసి తాము మోసపోయామంటూ ఆందోళనకు దిగుతున్నారు. అంతేకాదు నగరంలోని 50 శాతానికి పైగా ప్రైవేట్ పాఠశాలల్లో ఫైర్‌సేఫ్టీ లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక క్రీడా మైదానాల సంగతీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీసం గాలి కూడా దూరనంత ఇరుకైన గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఏదైనా విపత్తులు జరిగినప్పుడు భారీ మూల్యమే చెల్లించుకోక తప్పదు. కొన్ని యాజమాన్యాలు స్టేట్ సిలబస్‌కు గుర్తింపు తీసుకొని, గుట్టుచప్పుడు కాకుండా ఐఐటీ లాంటి కోర్సులు నిర్వహిస్తూ.. ఆ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. హైదరాబాద్‌లో 175 స్కూళ్లు... హైదరాబాద్ జిల్లా పరిధిలో గుర్తింపు లేని ప్రాథమిక పాఠశాలలు 86 ఉండగా.. ప్రాథమికోన్నత పాఠశాలలకు అనుమతి తీసుకొని ఉన్నత పాఠశాల తరగతులు నిర్వహిస్తున్నవి 89 ఉన్నాయి. నాంపల్లి మండలంలో 6 ఉండగా, అమీర్‌పేట మండలంలో 14, బహదూర్‌పురా మండలంలో 17, బండ్లగూడలో 3, సైదాబాద్‌లో 5, ముషీరాబాద్‌లో 4, షేక్‌పేటలో 5, ఖైరతాబాద్‌లో 1, అసిఫ్‌నగర్‌లో 16, గోల్కొండలో 5, సికింద్రాబాద్‌లో 6, మారేడుపల్లిలో 4 ప్రైమరీ/అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు గుర్తింపు లేనట్లు విద్యాశాఖ గుర్తించింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీకి గుర్తింపు తీసుకొని ఉన్నత పాఠశాలలు నడుపుతున్నవి భారీగానే ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా షేక్‌పేట మండలంలో 22 పాఠశాలలు ఉండగా, ఖైరతాబాద్‌లో 19, బహదూర్‌పురాలో 12, గోల్కొండ, ముషీరాబాద్ మండలాల్లో 15 పాఠశాలల చొప్పున ఉన్నట్లు గుర్తించారు. గుర్తింపు లేని ప్రైమరీ పాఠశాలల్లో ప్లేస్కూళ్లు, కిండర్ గార్డెన్ స్కూళ్లు ఎక్కువగా ఉంటే... ఆ తర్వాతి తరగతులకు అనుమతి లేని వాటిలో క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేకపోయినా ఆయా పాఠశాలల్లో యథేచ్ఛగా అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, గుర్తింపు లేని వాటిని సీజ్ చేయాల్సిన జిల్లా విద్యాశాఖ కేవలం నోటీసుల జారీతో సరిపెడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డిలో 40 స్కూళ్లు... రంగారెడ్డి జిల్లాలో సుమారు 40 పాఠశాలలకు గుర్తింపు లేనట్లు విద్యాశాఖ గుర్తించింది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఈ గుర్తింపు లేని పాఠశాలలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. జిల్లాలో అత్యధికంగా ఒక్క సరూర్‌నగర్ మండలంలోనే ఎనిమిది పాఠశాలలు ఉన్నట్లు గుర్తించి, వాటికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. ఇక మేడ్చల్ జిల్లాలోనూ 20 స్కూళ్లకు పైగా గుర్తింపు లేనట్లు సమాచారం. నోటీసుల తర్వాత కొన్ని యాజమాన్యాలు గుర్తింపు కోసం జిల్లా విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. ఫైర్‌సేఫ్టీ, క్రీడలు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అధికారులు అనుమతికి నిరాకరించినట్లు తెలిసింది. కానీ ఆయా పాఠశాలల్లో యథేచ్ఛగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. అధికారికంగా ఒక బ్రాంచ్‌కి గుర్తింపు తీసుకొని, అనధికారికంగా అదే పేరుతో మరో చోట మరో బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఆసక్తికరమైన అంశమేమిటంటే చాలా పాఠశాలలు స్టేట్ సిలిబస్‌కు అనుమతులు తీసుకొని ఐఐటీ, ఐసీఎస్సీ, సీబీఎస్సీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇలా స్టేట్ సిలబస్ బోధించే పాఠశాలల్లో నేషనల్, ఇంటర్నేషనల్ సిలబస్‌ను ప్రవేశపెట్టి, కనీస అనుభవం, అవగాహన లేని ఉపాధ్యాయులతో బోధిస్తున్నాయి. పాఠశాల ఆవరణలోనే స్టేషనరీని తెరిచాయి. బుక్స్, షూస్, డ్రెస్‌లు, బ్యాగులు, లంచ్‌బాక్స్‌ల వరకు అన్ని యథేచ్ఛగా విక్రయిస్తున్నాయి. అంతే కాకుండా ఇక్కడ విక్రయించే వస్తువులకు బిల్లులు ఇవ్వడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసి, వాటికి బిల్లులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే మేనేజ్మెంట్ ఆదేశాలు అంటూ సిబ్బంది సమాధానమిస్తున్నారు. -
బోగస్ ఉపాధ్యాయులకు చెక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లోని బోగస్ టీచర్లకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించాలని నిర్ణయించింది. పాఠశాలలవారీగా ‘ఆధార్’అనుసంధానంతో టీచర్ల వివరాల సేకరణను వచ్చే వారంలో ప్రారంభించి, నెల రోజుల్లోగా పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అర్హత లేనివారు కూడా టీచర్లుగా ఉన్నారని, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొంతమంది రెగ్యులర్ టీచర్లకు బదులుగా ఇతరులు పాఠాలు చెబుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా వాటికి అడ్డుకట్ట పడుతుందని విద్యాశాఖ భావిస్తోంది. మరోవైపు పాఠశాలలవారీగా టీచర్ల సమగ్ర వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఒక పాఠశాలలో పనిచేసే టీచర్‌ను మరో పాఠశాలలో చూపించకుండా అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40,821 పాఠశాలలుండగా, అందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలలు 28,582, ఎయిడెడ్ పాఠశాలలు 742, సెంట్రల్ స్కూళ్లు 47, ప్రైవేటు పాఠశాలలు 11,470 ఉన్నాయి. 28,582 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు, 1.30 లక్షల మంది టీచర్లు ఉన్నారు. అయినా ఇంకా టీచర్ల కొరత ఉంది. 11,470 ప్రైవేటు పాఠశాలల్లో 30 లక్షల మంది విద్యార్థులు ఉండగా, టీచర్ల సంఖ్య విషయంలో గందరగోళం నెలకొంది. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల సంఖ్య ఉందని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే, ఆ లెక్క తేల్చేందుకు విద్యాశాఖ ఇప్పుడు సిద్ధమైంది. ఆధార్ అనుసంధానంతో వారి వివరాలను తీసుకోవడం ద్వారా తప్పుడు లెక్కలను అరికట్టవచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
కశ్మీర్ పాఠశాలలో పేలుడు
శ్రీనగర్: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పేలుడు సంభవించింది. జిల్లాలోని నర్బల్ గ్రామంలో ఈ ఘటనలో పదో తరగతి చదివే 12 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. గాయపడిన విద్యార్థులందరినీ హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి బాగుందని ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. పోలీసు అధికారులు పాఠశాలలో ఘటనాస్థలికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం రాష్ట్రంలోని బుద్గామ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు హిజ్బుల్ మొజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఛాదూరాలోని గోపాల్పురా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే పక్క సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చేపట్టగా, వీరిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే తేరుకుని భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో హిలాల్ అహ్మద్ వనీ, షోయబ్ మొహమ్మద్ లోన్ అనే ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి ఉగ్రసాహిత్యం, ఆయుధాలు, మందుసామగ్రిని సైన్యం స్వాధీనంచేసుకుంది. -
విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి
కృష్ణాజిల్లా, కంచికచర్ల (నందిగామ) : టీడీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ కళాశాలలు, స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుపుతున్న స్కూల్స్‌ను తక్షణమే రద్దు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మొండితోక అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కంచికచర్లలో మంగళవారం శ్రీ చైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 8వ తరగతి చదువుతున్న శీలం నాగార్జున సాయిరెడ్డి (14) ఆతహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు 65వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. విద్యార్థి మృతికి కారణమైన స్కూల్ యాజమాన్యంపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్, స్కూల్ డీన్, లెక్కల టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షలు, స్కూల్ యాజమాన్యం రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ముందుగా సబ్ కలెక్టర్ మీషాసింగ్, నందిగామ ఇన్చార్జి డీఎస్పీ హరి రాజేంద్రబాబు, సీఐ కే సతీష్, ఇన్చార్జి తహసీల్థార్ రామకృష్ణతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి పరామర్శ.. కాగా, మృతి చెందిన విద్యార్థి నాగార్జున సాయిరెడ్డి తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి, మంగమ్మలను డాక్టర్ అరుణ్‌కుమార్ పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు రాయల నరసింహారావు, వేల్పుల శ్రీనివాసరావు మాగంటి వెంకటరామారావు (అబ్బాయి), కాలవ వెంకటేశ్వరరావు, మన్నం శ్రీనివాసరావు, మార్త శ్రీనివాసరావు, బొల్లినేని శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. స్కూల్‌ను సీజ్ చేసిన డీవైఈఓ డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మీ ఆదేశాల మేరకు స్కూల్‌ను డీవైఈఓ చంద్రకళ సీజ్ చేశారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థి నాగార్జున సాయిరెడ్డి ఇబ్రహీంపట్నం శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాడని, అతనితో పాటు మరో 26 మంది పేర్లు కూడా అక్కడ నమోదయ్యాయని చెప్పారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి కంచికచర్లలోని శ్రీ చైతన్య స్కూల్లో చదివిస్తుండటంతో పాఠశాలను సీజ్ చేస్తున్నామన్నారు. 7వ తరగతికి మాత్రమే అనుమతులు ఇచ్చామని, అయితే 8, 9 తరగతులు కూడా నిర్వహిస్తున్నారని సమాచారం వచ్చిందన్నారు. ఇప్పటి వరకు చదువుతున్న విద్యార్థులను ఇతర ప్రైవేట్ స్కూల్లో చేర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కడుపు కోత మిగిలింది.. కృష్ణాజిల్లా, కంచికచర్ల : ‘మాకున్న ఒక్కగానొక్క కొడుకు పెద్ద చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉంటాడని కూలీ నాలీ చేసుకుంటూ చదివిస్తున్నాం. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా మేం మా కొడుకును కోల్పోయాం. చదువులమ్మ తల్లి మాకు కడుపు కోతను మిగిల్చింది..’ అని సాయిరెడ్డి తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి, మంగమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడి మృతికి స్కూల్ ప్రిన్సిపల్ దుగ్గిరాల ప్రసాద్, స్కూల్ డీన్, మరో ఉపాధ్యాయుడి నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు. రోజూ స్కూల్‌కు వెళ్లి బస్సులో ఇంటికి వచ్చేవాడన్నారు. అటువంటి తమ బిడ్డను స్కూల్ టీచర్లు అన్యాయం చేశారన్నారు. అనేకసార్లు ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది తమ ఇంటికి వచ్చి వత్తిడి చేస్తేనే చేర్పించామని చెప్పారు. ఫీజ్ ఒక్క పైసా కూడా తగ్గించలేమన్నారని, దీంతో రూ.40 వేలు ముందుగానే చెల్లించామని తండ్రి తిరుపతిరెడ్డి బోరున విలపించారు. కొడుకును పెద్ద చదువులు చదివిద్దామని కూడా మద్యాన్ని కూడా మానేశానని చెప్పారు. తమ కుటుంబ వంశోద్ధారకుడిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని విద్యార్థి నాయనమ్మ బోరున విలపించింది. స్కూల్ గుర్తింపు రద్దు మచిలీపట్నం : కంచికచర్ల మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి విజయలక్ష్మి వెల్లడించారు. శ్రీచైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్. సాయిబాబా నాగిరెడ్డి అనే విద్యార్థి మంగళవారం తరగతులు జరుగుతున్న సమయంలోనే భవనంపై నుంచి కాలు జారి పడిపోవటంతో మృతి చెందాడు. విద్యార్థి మృతికి నిరసనగా బంధువులతో పాటు, వైఎస్సార్ సీపీ, ఇతర పార్టీలు, విద్యార్థి సంఘాల వారు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న డీఈవో విజయలక్ష్మి స్పందించారు. విద్యార్థుల రక్షణకు పాఠశాల యాజమాన్యం తగిన రక్షణ చర్యలు తీసుకోవటంలో విఫలమైనట్లుగా గుర్తించారు. ఈ మేరకు శ్రీ చైతన్య ప్రాథమికోన్నత పాఠశాల గుర్తింపును రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. -
ప్రైవేటు ఫీజులుం
శ్రీకాకుళం: జిల్లాలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు పరీక్ష ఫీజుల పేరుతో దోపిడీకి తెరతేశాయి. ప్రతి విద్యార్థికి పదో తరగతి కీలకం కావడంతో తల్లిదండ్రులు కూడా ఆయా పాఠశాలల యాజమాన్యాలు చెప్పినంత ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. వీరి బలహీనతను గుర్తించిన యాజమాన్యాలు పదో తరగతి పరీక్ష ఫీజులను తమకు అనుకూలంగా మలచుకొని తల్లిదండ్రుల జేబులను గుల్లచేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకు ఎనిమిది నుంచి పది రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.125 లు మాత్రమే కాగా, పలు పాఠశాలలు వెయ్యి రూపాయలు నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారు. పరీక్ష ఫీజు మొత్తం ఎంతో తెలియని తల్లిదండ్రులు వారు అడిగినంత ఇచ్చేస్తున్నారు. కొందరు తెలిసిన వారు మాత్రం అంత మొత్తం ఎందుకని అడిగినప్పుడు పరీక్షల సమయంలో సహకరించేందుకు విద్యాశాఖలోని పలువురికి చెల్లింపులు జరపాల్సి ఉంటుందని చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా మౌనం వహించడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యా సంవత్సరంలో ప్రారంభంలో ట్యూషన్ ఫీజుతో పాటు, పుస్తకాలు, యూనిఫాం అంటూ వేల రూపాయల్లో వసూళ్లు చేసిన కొన్ని యాజమాన్యాలు వార్షికోత్సవాల ను సైతం విద్యార్థుల నుంచి వసూళ్లు చేసే నిర్వహిస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఫీజు దందాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. -
పది పరీక్ష ఫీజు పేరుతో అదనపు వసూలు
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న ప్రైవేటు స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు ఓ విద్యార్థి. పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లించాలని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి రూ. 125 ఇచ్చారు. కుదరదని వారి నుంచి రూ. 400 వసూలు చేశారు. ఈ అదనపు ఫీజు వసూలుపై వారు తర్వాత డీఈఓ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదని వాపోతున్నారు నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలో బుధవారపేటకు చెందిన చిరుద్యోగి కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు. పరీక్ష ఫీజు కట్టేందుకు వచ్చిన ఈ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రూ.1000 వసూలు చేశారు. ఫీజు 125 రూపాయలే కదా అని అడగగా ఫీజుతో పాటు అన్ని రకాల ఖర్చులుంటాయని స్కూల్ హెచ్ఎం సమాధానం చెప్పినట్లు తెలిపారు. జిల్లాలో ఈ రెండు స్కూళ్లలోనే కాదు. దాదాపు అన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన ఫీజుల కంటే అదనంగా పదోతరగతి విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. కర్నూలు సిటీ: వచ్చే ఏడాది మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాలని విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాల యాజమాన్యాలు అదనంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా, జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిర్ణీత ఫీజుల కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పినా వారు ఆయా స్కూళ్లపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. అదనపు వసూళ్లపై అడిగేవారేరీ? జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన ఉన్నత పాఠశాలలు 934 ఉన్నాయి. ఇందులో 431 కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లో పబ్లిక్ పరీక్షలకు సుమారు 30 వేల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. వారి తల్లిదండ్రులు పరీక్షల ఫీజు రూ. 125 చెల్లించేందుకు స్కూళ్లకు వెళ్లితే అదనంగా డిమాండ్ చేస్తున్నారు. తాము నిర్ణీత పరీక్ష ఫీజులు మాత్రమే చెల్లిస్తామని చెబితే అధికారులకు ఇచ్చుకోవాల్సి ఉంటుందని ఆయా స్కూళ్ల హెచ్ఎంలు వాదిస్తున్నారు. అడిగిన మేరకు ఇవ్వని తల్లదండ్రుల పిల్లలకు ఏదో ఓ సాకు పెట్టి తోటి విద్యార్థుల ముందు అవమానాలకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కొంత మంది పేరెంట్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు చూస్తాం...చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే వసూలు చేయాలి పదవ తరగతి పరీక్షలకు విద్యాశాఖ నిర్ణయించిన రూ.125 మాత్రమే అన్ని పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేయాలి. అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నగరంలోని ఓ స్కూల్లో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటాం. అదనపు ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి. – తహెరా సుల్తానా, డీఈఓ -
సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్చల్
మడికొండ నల్గొండ: సెల్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్ చేసిన సంఘటన మడికొండలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... మడికొండ గ్రామానికి చెందిన తాటి బద్రి అనే వ్యక్తి మడికొండ శివారులోని ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తూ జీవనం కొసాగిస్తున్నాడు. పాఠశాల విధులకు సరిగా హాజరుకాకపోవడంతో యజమాన్యం బద్రిని విధుల నుంచి తొలగించారు. నాలుగు నెలల క్రితం ఇదే సెల్ టవర్ ఎక్కి పాఠశాల యజమాన్యం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో స్థానిక్ ఇన్స్పెక్టర్ సంతోష్ మాట్లాడి ఇప్పిస్తానని హమీ ఇవ్వడంతో టవర్ దిగాడు. గత వారం రోజుల క్రితం కూడా టవర్ ఎక్కి బెదిరించడంతో స్థానికులు వారించి కిందకు దింపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఎవరికి చెప్పకుండా మడికొండ జాతీయ రహదారి పక్కన లోతుకుంట వద్ద ఉన్న సెల్ టవర్ ఎక్కడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని బద్రితో మాట్లాడినా... కిందకు దిగకపోవడంతో చేసేది లేక అక్కడే కాపాలా ఉన్నారు. సెల్ టవర్‌పై నిలబడుతూ.. కూర్చుంటూ రాత్రి 8 గంటల వరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానికులు, వాహనదారులు భారీగా తరలివచ్చారు. అయితే స్థానికులను చూసి సెల్ టవర్‌పై ఇంకా ఎక్కువ చేస్తున్నాడని పోలీసులు అందరిని పంపించారు. ఇంట్లో ఏమైనా గొడవ అయిందా అని అడుగగా ఏమి గొడవ లేదు.. ఇంతకు ముందు ఇలాగే రెండు, మూడు సార్లు చేశాడని, మా పరువు తీసున్నాడని బద్రి భార్య రాధ భోరున విలపించింది. కాగా స్థానికులు, పోలీసులు దిగమని కోరడంతో శనివారం రాత్రి 9.50 గంటలకు బద్రి కిందికి దిగాడు. -
ఫీ జులూం ఇంకెన్నాళ్లు ?
-
కూకట్‌పల్లిలో కుప్పకూలిన పాఠశాల స్టేజీ
-
అపహరణకు గురైన చిన్నారి
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని నందిపేట్ మండల కేంద్రంలో ఓ పాప అపహరణకు గురైంది. ప్రైవేట్ పాఠశాల నుంచి ఓ మహిళ వచ్చి ఆ పాపను తీసుకెళ్లినట్లు అక్కడి సిబ్బంది తెలిపింది. అనంతరం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్కూల్ సిబ్బందిని విచారించినట్టు తెలుస్తోంది. ఆ మహిళ ఏవరో తెలియదని, ఆమె వచ్చి పాపను తీసుకెళ్లిందని సిబ్బంది తెలపగా.. ఆ గుర్తు తెలియని మహిళ ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
స్కూల్లో గోడ కూలి.. ఇద్దరు చిన్నారుల మృతి
-
కూకట్‌పల్లిలో విషాదం
సాక్షి, హైదరాబాద్: అప్పటివరకు కరాటే కసరత్తులో మునిగిన ఆ చిన్నారులకు అవే చివరి క్షణాలయ్యాయి. చిరునవ్వులొలికే పిల్లలను మృత్యువు స్టేజీ రూపంలో కబళించింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ పాఠశాల ఆవరణలో ఉన్న వేదిక (స్టేజీ) బీములు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బీములు కూలి.. కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌లో ఉన్న న్యూ సెంచరీ స్కూల్ ఆవరణలో గురువారం మధ్యాహ్నం నాలుగో తరగతి విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తున్నారు. స్కూలు ఆవరణలోని స్టేజీపై 25 మంది కసరత్తు చేస్తున్నారు. పాతబడిన ఆ స్టేజీ కూలి కింద ఉన్న చిన్నారులపై పడింది. శకలాల కింద రక్తపు మడుగుల్లో ఉన్న విద్యార్థులను సమీపంలోని అను పమ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహి కీర్తన (9), చందన (8) మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నరేశ్ (11), సందీప్ (10), నిఖిత (9), దేవిశ్రీ (10)లకు గాయాలవగా.. నరేశ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం నరేశ్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. తల్లడిల్లిన తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన వెంకటేశం, స్వర్ణలత దంపతులు తమ కూతురు మహి కీర్తనను ఇటీవలే న్యూ సెంచరీ స్కూల్లో చేర్పించారు. మరికొద్ది సేపట్లో చిరునవ్వుతో తిరిగి రావాల్సిన చిన్నారి ఆస్పత్రిలో విగతజీవిగా ఉందన్న విషయం తెలుసుకొని కుప్పకూలిపోయారు. ఆల్విన్ కాలనీకి చెందిన నాగబాబు, వెంకటేశ్వరమ్మల కుమార్తె చందనను మృత్యువు స్టేజీ రూపంలో కబళించడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. కూతురుకు ప్రమాదం జరిగిందని తెలుసుకుని ఆస్పత్రికి వచ్చిన తల్లిదండ్రులు.. చందన మరణించిందని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. సీజ్ చేయాలి: ఎమ్మెల్యే కృష్ణారావు సంఘటన స్థలాన్ని పరిశీలించిన మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు.. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పిల్లల మృతికి కారణమైన పాఠశాలను సీజ్ చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. పాఠశాల నిర్లక్ష్యం వల్ల చిన్నారులు మృతి చెందడాన్ని నిరసిస్తూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు శుక్రవారం ప్రైవేట్ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రమాదానికి కారణం ఇదేనా? పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల కోసం 18 ఏళ్ళ క్రితం వేదిక ఏర్పాటు చేశారు. నలువైపులా 4 బీములు మినహా స్లాబ్ వేయలేదు. బీములకు ఇనుప రాడ్లు వేసి కాంక్రీట్ మిక్చర్ వేయకుండా సిమెంట్ ప్లాస్టరింగ్ మాత్రమే చేశారు. కాలం చెల్లిన బీములు ఇటీవలి వర్షాలకు నాని సామర్థ్యం కోల్పోయాయి. కరాటే శిక్షణ తీసుకుంటున్న చిన్నారులను బలిగొన్నాయి. బెంగళూరు పెంకులతో నిర్మించిన ఆ పాఠశాల భవనం కూడా శిథిలావస్థలో ఉండటం గమనార్హం. -
మరింత ‘బెస్ట్’గా..
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ విద్యార్థులకు శుభవార్త. ఎక్కువ మంది నిరుపేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత వసతితో బోధన అందించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకానికి మరిన్ని హంగులు అద్దుతోంది. పరిమిత స్థాయిలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని భావిస్తోంది. ఏటా గరిష్టంగా 5 వేల మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలని యోచిస్తోంది. కేజీ టు పీజీ విద్యలో భాగంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలకు క్రేజ్ పెరగడం.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ సీట్లు ఇవ్వడం కష్టమవడంతో ఈ ప్రత్యామ్నాయ పద్ధతికి శ్రీకారం చుట్టింది. బీఏఎస్ ద్వారా మరింత మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ఉపక్రమించింది. ఒకటో తరగతి నుంచే.. రాష్ట్రంలో 185 పాఠశాలలను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లుగా ఎస్సీ అభివృద్ధి శాఖ గుర్తించింది. పదేళ్లలో వచ్చిన ఫలితాలు, పాఠశాలల నిర్వహణ, బోధన సిబ్బంది సామర్థ్యం ఆధారంగా ఈ పాఠశాలలను ఎంపిక చేస్తారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత నుంచి ఇప్పటివరకు ఈ పథకం కింద 8,390 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వివిధ తరగతుల్లో రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యను అభ్యసిస్తున్నారు. 2017–18లో 785 మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. 91.97 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 27 మంది 9.5 కంటే ఎక్కువ జీపీఏ సాధించారు. బీఏఎస్ పథకం సత్ఫలితాలు ఇస్తుండటంతో మరింత విస్తృతం చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఏటా 5 వేల మందికి అవకాశం ఇచ్చేలా స్కూళ్ల సంఖ్య పెంచాలని భావిస్తోంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన పాఠశాలల గుర్తింపునకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఐదో తరగతి నుంచే రెసిడెన్షియల్ పద్ధతిలో ప్రవేశాలు కల్పించారు. తాజాగా ఒకటో తరగతి నుంచే ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థికి ఏటా రూ. 35 వేలు బీఏఎస్ స్కూళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థికి ఏటా రూ. 35 వేలు సర్కారు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు తీసుకోవాలని భావిస్తుండటంతో ఫీజుల పైనా పరిశీలన చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీ పాఠశాలల వివరాల సేకరణతో పాటు అక్కడి ఫీజులను అంచనా వేస్తోంది. జిల్లాలో విద్యార్థి చెల్లిస్తున్న సగటు ఫీజులు అంచనా వేసి నిపుణుల కమిటీ సూచనల ప్రకారం ఫీజు ఖరారు చేయనుంది. -
ఫీజు కట్టలేదని నర్సరీ విద్యార్థులను..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలకు ఉపక్రమించినా ప్రైవేట్ పాఠశాలల దోపిడి మాత్రం ఆగడం లేదు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలను అతిక్రమిస్తూనే ఉన్నాయి. పైగా సకాలంలో ఫీజులు చెల్లించడంలేదని దాష్టీకానికి పాల్పడుతున్నాయి. ఫీజు కట్టలేదని విద్యార్థులను ఇంటికి పంపేయడం, తరగతి గదిలోకి అనుమతించకపోవడం, గదిలో బంధించడం లాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటననే ఒకటి చోటు చేసుకుంది. ఫీజు చెల్లించలేదని దాదాపు 59మంది నర్సరీ విద్యార్థులను బేస్మెంట్లో బంధించింది ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం. ఢిల్లీకి చెందిన రబియా గర్ల్స్ పబ్లిక్ స్కూల్లో ఫీజు చెల్లింలేదని 59 నర్సరీ విద్యార్థులను పాఠశాల బేస్మెంట్లో బంధించి తాళం వేశారు. దాదాపు ఐదు గంట తర్వాత విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని తమ పిల్లను గది నుంచి విడిపించారు. అనంతరం యాజమాన్యంపై విరుచుపడ్డారు. చిన్న పిల్లలనే మానవత్వం లేకుండా కిటికీలు లేని చీకటి గదిలో బంధించారని మండిపడ్డారు. పాఠశాల యాజమాన్యంపై ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫీజు విషయాన్ని తమకు తెలియజేయలేదని ఆరోపించారు. తమ పిల్లల ఫీజులు అడ్వాన్స్‌గా చెల్లించినా కూడా గదిలో బంధించారని కొంతమంది తల్లిదండ్రులు ఫిర్యాదులో తెలిపారు. వెంటిలేటర్లు, ఫ్యాన్లులేని గదిలో చిన్న పిల్లలను బంధించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజులు కూడా అధికంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొ నర్సరీ విద్యార్థికి దాదాపు రూ.2500 నుంచి రూ.2900 వరకూ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కాగా పాఠశాల యాజమాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకుంది. పాఠశాల నిబంధనల మేరకే విద్యార్థులను తరగతి గదిలోని అనుమతించలేదని తేల్చిచెప్పింది. వారిని చీకటి గదిలో బంధించలేదని, ఆట గదిలో ఉంచామని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. -
మైనర్ బాలికపై కీచకపర్వం
ఛప్రా: బిహార్‌లోని సరన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై స్కూల్లోని 16 మంది విద్యార్థులతో పాటు పిన్సిపల్, ఇద్దరు ఉపాధ్యాయులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాల్ని బెదిరించిన నీచులు 7 నెలల పాటు ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధితురాలు తండ్రి సాయంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పర్సాగఢ్ గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాధితురాలి(13)పై ముగ్గురు తోటి విద్యార్థులు గతేడాది డిసెంబర్లో వాష్‌రూమ్‌లో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ఫోన్లలో చిత్రీకరించిన నిందితులు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్లో ఉంచుతామని హెచ్చరించారు. ఇలా బెదిరించి బాధితురాలిని పలుమార్లు రేప్‌చేసి ఈ వీడియోను తోటి విద్యార్థులకు పంపారు. దీంతో 16 మంది విద్యార్థులు బాలికను రేప్‌చేశారు. చివరికి బాధితురాలు ఈ దారుణంపై పాఠశాల ప్రిన్సిపల్‌కు చెప్పగా.. ‘నీ కుటుంబం పరువే పోతుంది’ అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆపాడు. అతనూ బెదిరించి, మరో ఇద్దరు టీచర్లతో కలసి బాధితురాలిని లోబర్చుకుని ఏడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. గత 7 నెలలుగా తండ్రి జైలులో ఉండటంతో నిస్సహాయురాలిగా మిగిలిపోయిన బాధితురాలు.. ఇటీవల తండ్రి విడుదల కావడంతో శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటుచేశారు. ప్రిన్సిపల్, టీచర్, నలుగురు విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి విద్యార్థుల్ని రిమాండ్ హోమ్‌కు, ప్రిన్సిపల్, టీచర్‌ను జైలుకు పంపారు. -
దినకరన్‌కు రూ.20నోటుసెగ
టీ.నగర్: ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు వచ్చిన టీటీవీ దినకరన్‌కు ప్రజలు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఆ సమయంలో అతని మద్దతుదారులకు దేహశుద్ధి జరిగింది. చెన్నై తండయార్‌పేట–ఎన్నూరు హైరోడ్డులో ఉన్న ప్రైవేటు పాఠశాల నుంచి గత 23వ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం పుణెకు విహార యాత్రగా వెళ్లిన విద్యార్థులు ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన విద్యార్థులు ఆర్కేనగర్ నియోజకవర్గానికి చెందినందున ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ మంగళవారం ఉదయం అక్కడికి వెళ్లారు. ఇందిరానగర్‌కు చెందిన విద్యార్థి రజాక్, నేతాజి నగర్‌కు చెందిన శరవణకుమార్, నావలర్ ప్రాంతానికి చెందిన సంతోష్ కుటుంబాలకు తలా లక్ష రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో దినకరన్ మాట్లాడారు. ఇలావుండగా టీటీవీ దినకరన్ వస్తున్నట్లు తెలియగానే ఎన్నికల్లో గెలిస్తే నగదు అందిస్తానని తెలిపి అందజేసిన 20 రూపాయల నోట్లను చేతిలో ఉంచుకుని ప్రజలు నిరసన తెలిపారు. అక్కడ భద్రతకు ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో టీటీవీ అనుచరులు అసభ్యంగా మాట్లాడడంతో ప్రజలు వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు టీటీవీ అనుచరులను అరెస్టు చేసి వ్యానులో తీసుకెళ్లారు. -
నవ వధువు అదృశ్యం
పీఎం పాలెం(భీమిలి): సుమారు 20 రోజల కిందట వివాహమైన నవ వధువు అదృశ్యంపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో మంగళవారం సా యంత్రం కేసు నమోదయింది. ఇందుకు సం బంధించి స్థానిక సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... బోరవానిపాలెంకు చెందిన గొట్టాపు పావని (24)కి ఈ ఏడాది ఏప్రిల్ 18న విజయనగరం జిల్లా బాడంగికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. బీఎస్సీ వరకూ చదుకున్న ఆమె వివాహానికి ముందు స్థానికంగా ఓ ప్రైవేటు స్కూలులో టీచరుగా పని చేసేది. మంగళవారం ఉదయం 11 గంటలకు తాను పని చేసిన స్కూలుకు సోదరుడి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. ఆమెను అక్కడ దించేశాక సోదరుడు వెళ్లిపోయాడు. అనంతరం సాయంత్రం వరకూ పావని ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. స్నేహితురాళ్లను వాకబు చేశారు. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. యువతి తండ్రి శివున్నాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తే తెల్లరేషన్‌కార్డు, పింఛన్ల రద్దు
పుత్తూరు రూరల్ : ప్రైవేట్ పాఠశాలల్లో తమ చిన్నారులను చదివిస్తే కుటుంబసభ్యులకు తెల్లరేషన్‌కార్డు, పింఛన్లను రద్దు చేయడంతో పాటు సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని ఎంపీపీ గంజి మాధవయ్య స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఇషా విద్య ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్తోమత ఉన్నప్పుడు ఆ కుటుంబానికి సంక్షేమ పథకాల అవసరం ఎందుకని ఆయన ప్రశ్నించారు. విద్య కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, దుస్తులను ఉచితంగా అందించడంతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన చేస్తున్నట్లు ఆయన వివరించారు. అయినప్పటికీ ప్రైవేట్ విద్యాసంస్థల వైపు చూడడం తగదని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. ఎంపీడీఓ నిర్మలాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక విలువలతో కూడిన విద్యను బోధిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ఇషా కోఆర్డినేటర్ వీరమంగళం వెంకటరమణ మాట్లాడుతూ అంగన్వాడీల్లో ఐదేళ్లు పూర్తయిన చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలన్నారు.ఇషా విద్య అమలులో ఉండడంతో ఆటపాటలతో కూడిన అత్యున్నత విద్యాబోధన అందిస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు వివరించి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ఎంఈఓ తిరుమలరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఇందిరా ప్రియదర్శిని, రోజారమణి, షామిని పాల్గొన్నారు. -
పాఠశాలకు బొట్టు, పూలు పెట్టుకెళ్లారని..
తిరువణ్ణామలై: ఓ ప్రైవేట్ పాఠశాలకు బొట్టు, పూలు పెట్టుకెళ్లిన విద్యార్థినులను మోకాళ్లపై నిలబెట్టడాన్ని ఖండిస్తూ తల్లిదండ్రులు, హిందూ మున్నని కార్యకర్తలు ఆ పాఠశాల ముందు శుక్రవారం రాస్తారోకో చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపంలోని దేవికాపురంలో ఓ ప్రైవేట్ క్రైస్తవ మెట్రిక్ పాఠశాల ఉంది. ఇక్కడ సుమారు ఐదు వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలకు పూలు, బొట్టు పెట్టుకోవద్దని నిబంధనలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దేవికాపురానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గురువారం ఉదయం బొట్టు, పూలు పెట్టుకొని పాఠశాలకు వెళ్లారు. గమనించిన టీచర్ వాటిని తొలగించాలని తెలిపడంతో వారు పూలు, బొట్టును తొలగించారు. దీంతో వారిని పాఠశాల ఆవరణంలో మోకాళ్లపై నిలబెట్టారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. నిబంధనలు పాటించనందుకే దండన.. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా రావడంతోనే ఇలా చేశామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. దీంతో పాఠశాల యాజమాన్యంతో తల్లిదండ్రులు వాగ్వాదం చేశారు. విషయం తెలుసుకున్న హిందూ మున్నని కార్యకర్తలు పాఠశాల వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలూరు డీఎస్పీ చిన్నరాజ్, పోలీసులు తల్లిదండ్రులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు. పోలీసులు పాఠశాల యాజమాన్యం వద్ద విచారణ చేస్తున్నారు. -
బాలికకు వేధింపులు..తాళిబొట్టు కట్టబోయాడు..
తాడేపల్లిగూడెం రూరల్ : బాలికను ప్రేమించమంటూ బెదిరించిన నేరంపై వ్యాన్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి తెలిపారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఉంగుటూరు మండలం వీఏ పురం అగ్రహారం గ్రామానికి చెందిన బాలిక (15) పట్టణంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. రోజు స్కూలుకు వస్తున్న బాలికను స్కూల్ వ్యాన్ డ్రైవర్ కూనా తారక్ నారాయణమూర్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల బాలికను పెళ్లి చేసుకుంటానంటూ తాళిబొట్టు కట్టబోయాడు. దీంతో బాలిక దానిని బయటకు పారేయడంతో వ్యాన్ నడుపుతున్న మరో డ్రైవర్ వ్యాన్‌ను ఆపివేశాడు. అక్కడ నుంచి నారాయణమూర్తి పారిపోయే ప్రయత్నంలో బాలికను చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో మంగళవారం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో–2012 చట్టం కింద పట్టణ ఎస్సై కేవీ రమణ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా వ్యాన్ డ్రైవర్ కూనా తారక్ నారాయణమూర్తిని బుధవారం కాకర్లమూడి గ్రామంలో అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు సీఐ మూర్తి చెప్పారు. పాఠశాల యాజమాన్యంఅప్రమత్తంగా ఉండాలి పాఠశాల బస్సుల్లో పిల్లల్ని తరలించే సమయంలో స్కూల్ యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మూర్తి సూచించారు. అపరిచిత వ్యక్తులను వ్యాన్ డ్రైవర్లుగా నియమించవద్దని, అందులోనూ బాలికలను వేధిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ నుంచి ఆదేశాలు ఉన్నాయన్నారు. వ్యాన్ డ్రైవర్ వయసు, వ్యక్తిత్వం పరిగణనలోకి తీసుకుని డ్రైవర్లుగా నియమించాలన్నారు. ఎస్సై కేవీ రమణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వాట్సాప్‌లో ‘పది’ప్రశ్నపత్రం
ఖానాపూర్: పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్‌లో బయటకు వచ్చింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం వెలుగు చూసింది. సీఐ ఆకుల అశోక్, ఎస్ఐ కొల్లూరి వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదో తరగతి ఫిజికల్ సైన్స్ పేపర్–1 పరీక్ష ప్రారంభం అయిన గంటకే వాట్సాప్‌లో బయటకు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో మాస్‌కాపీయింగ్ కోసం ఉపాధ్యాయులు, సిబ్బంది జవాబు పత్రాలను సిద్ధం చేస్తుండగా వారిని గుర్తించారు. ఈ మేరకు యాజమాన్యాన్ని విచారించగా.. మరో ప్రైవేట్ పాఠశాలలో చదివే ప్రముఖ వ్యాపారి రమణప్రశాంత్ కూతురు కోసం జవాబు పత్రాలు సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. సంబంధిత వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన మిత్రుడైన లక్ష్మణచాంద మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయుడు సద్దు మన్మథరెడ్డి ద్వారా తనకు వాట్సాప్ ప్రశ్నపత్రం వచ్చిందని తెలిపాడు. వెంటనే వాట్సాప్ ద్వారా ఆ పేపర్‌ను ప్రైవేట్ పాఠశాల పీఈటీ గంగాధర్‌కు షేర్ చేసినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం మన్మథరెడ్డి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకొని అసలు సూత్రధారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, అలాగే రమణ ప్రశాంత్‌తో పాటు పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది గంగాధర్, ఎస్.రవికుమార్, ఇప్ప సాయన్న, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఒకరి సస్పెన్షన్: డీఈవో ఈ ఘటనపై ఉపాధ్యాయుడు మన్మథరెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈవో ప్రణిత తెలిపారు. ప్రశ్నపత్రం లీక్ అయిందని తన దృష్టికి రాగానే.. ఎంఈవో గుగ్లావత్ రాంచందర్‌తో కలసి పరీక్ష కేంద్రాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. ఇందులో ఏమైనా ప్రైవేట్ పాఠశాలల భాగస్వామ్యం ఉందా అనే కోణంలో సైతం విచారణ చేస్తామన్నారు. -
ఉపాధ్యాయుడి వేధింపులకు విద్యార్థిని బలి
మొయినాబాద్ (చేవెళ్ల): ప్రైవేటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడి వేధింపులతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరుకు చెందిన కుమ్మరి యాదయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు పూజిత ఇంటర్ చదువుతుండగా చిన్న కూతురు తేజస్విని (15) అదే గ్రామంలో శివసాయి ఇంటర్నేషన ల్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. అదే స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బొల్లు ప్రశాంత్, తేజస్వినిని వేధిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం ఆమెకు ప్రశాంత్ సెల్‌ఫోన్ ఇచ్చాడు. ఆమె ఫోన్ తిరిగి ఇచ్చేయడంతో మరింత వేధించసాగాడు. మనస్తాపా నికి గురై శనివారం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలార్పే క్రమంలో తల్లిదం డ్రులకీ గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో తేజస్విని ఇంట్లోనే మృతి చెందింది. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాక... తేజస్విని మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పోలీసులకు విషయం తెలియడంతో సీఐ సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహంతో ఆందోళన... తేజస్విని ఆత్మహత్యకు కారణమైన టీచర్, పాఠశాల యాజమాన్యంపై చర్య లు తీసుకోవాలని గ్రామస్తులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం అనంతరం శనివారం సాయంత్రం మృతదేహాన్ని తీసుకొచ్చి పాఠశాల ఎదుట పెట్టి ఆందోళన చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి వరకు ఆందోళన కొనసాగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
ప్రయివేటు పాఠశాల మోసం
చైతన్యపురి: వారిద్దరూ కష్టపడి చదివారు.. పాఠశాల నుంచి పదో తరతగి హాల్ టికెట్ తీసుకున్నారు.. గంట ముందే పరీక్షా కేంద్రానికి వెళ్లి హాల్‌టికెట్ నంబర్ చూసుకుని మరీ సీట్లో కూర్చున్నారు.. ఇన్విజిలేటర్ ఆన్సర్ షీట్, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు.. పరీక్ష రాస్తుండగా వచ్చిన స్క్వాడ్.. ‘మీ హాల్‌టికెట్లు ఫేక్‌వి.. పరీక్ష రాయటానికి వీల్లేదు’ అంటూ పేపర్ తీసేసుకున్నారు. దీంతో ఎంతో ఆశలు పెట్టుకున్న ఆ పదో తరగతి విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఈ సంఘటన గురువారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ♦ ఉదయ్‌కుమార్, ఏదులకంటి అశ్విన్‌కుమార్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సరూర్‌నగర్ ఓల్డ్ పోస్టాఫీస్ సమీపంలోని న్యూ రెయిన్బో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో చదివారు. అయితే, ఈ స్కూలుకు పదో తరగతికి అర్హత లేదు. కానీ స్కూలు యాజమాన్యం మాత్రం పదోతరగతి విద్యార్థులను నగరంలోని వివిధ స్కూళ్ల విద్యార్థులుగా ఫీజులు కట్టించి పరీక్షలకు పంపిస్తుంటారు. ♦ ఈ క్రమంలోఏదులకంటి అశ్విన్‌కుమార్, ఉదయ్‌కుమార్‌ను ‘అల్కాపురి శ్రీద్వారకామయి ఎంహెచ్ఎస్ పాఠశాల’ విద్యార్థులుగా ఫీజులు కట్టించారు. వీరిలో అశ్విన్‌కుమార్‌కు మన్సూరాబాద్‌లోని జడ్పీహెచ్ స్కూల్ సెంటర్ కేటాయించారు. ఉదయ్‌కుమార్‌కు రామకృష్ణాపురంలోని సెయింట్ మార్టిన్ స్కూల్ సెంటర్ ఇచ్చారు. వాస్తవానికి అల్కాపురి శ్రీ ద్వారకామయి ఎంహెచ్ఎస్ పాఠశాల’ మూడేళ్ల క్రితమే మూతపడింది. ♦ న్యూ రెయిన్బో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి మాత్రం విద్యార్థుల హాల్‌టికెట్లపై ‘న్యూ మారుతీనగర్ శ్రీ ద్యారకామాయి స్కూల్ స్టాంపు’ వేసి పరీక్షకు పంపించారు. చదివిన స్కూల్‌కు అనుమతిలేక పోవడం.. లేని స్కూల్ నుంచి ఫీజుల కట్టడం, సంబంధం లేని స్కూల్ స్టాంపులు వేసి అటెస్ట్ చేసి ఇవ్వడంతో చివరి క్షణంలో బోర్డు అధికారులు గుర్తించి ఇద్దరు విద్యార్థులను ‘ఫేక్’గా తేల్చి పరీక్షలు రాయనీకుండా బయటకు పంపించివేశారు. పోలీస్ స్టేషన్లో పిర్యాదు... హాల్‌టికెట్ ఉన్నా పరీక్షలేక పోయిన విద్యార్థులు అశ్విన్‌కుమార్, ఉదయ్ కుమార్ తల్లిదండ్రులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో న్యూరెయిన్బో ఇంటిగ్రేటెడ్ స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. తమ పిల్లల జీవితాలతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన సంఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనుమతిలేని పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని టీఆర్ఎస్వీ నాయకులు మహేందర్‌యాదవ్, శివరామకృష్ణ, ప్రవీణ్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రయివేటు విద్యాసంస్థలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయని, ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పరీక్షల్లో పాస్ చేయిస్తానంటూ..
చండీగఢ్: హరియాణాలో దారుణం జరిగింది. పాఠాలు బోధించాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పదోతరగతి పరీక్షల్లో పాస్ చేయిస్తానని మభ్యపెట్టి 16 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని పసిగట్టిన బాధితురాలి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గోహానా పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ తన స్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలికను సమీపంలోని బంధువుల ఇంటికి పిలిపించాడు. పరీక్షలు చాలా కఠినంగా ఉండబోతున్నాయని విద్యార్థిని భయపెట్టి.. పాస్ అయ్యేందుకు తాను సాయం చేస్తానని నమ్మబలికాడు. తాను చెప్పినట్టు వింటే.. వేరొక బాలికతో పరీక్షలు రాయిస్తానని చెప్పి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధిత విద్యార్థిని తండ్రిని పిలిచి రూ.10వేలు ఇస్తే వేరొక అమ్మాయితో పరీక్షలు రాయిస్తానని ప్రిన్సిపాల్ నమ్మబలికారు. పరీక్షల అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక తండ్రితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆయన బాధితురాలితో కలిసి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్, మరో ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పాఠ‘శాలసిద్ధి’
జగదేవ్‌పూర్(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలైనా, ప్రైవేట్దైనా కావాల్సినవి వసతులు, వనరులు. ఈ విషయంలో తేడాలొస్తే ఇబ్బంది పడేది విద్యార్థులే. దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో వనరుల వినియోగం ఒకేలా ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల శాఖ ‘శాలసిద్ధి’ కార్యక్రమం చేపట్టింది. దేశంలోని అన్ని పీఎస్‌లు, యూపీఎస్‌లు, హైస్కూళ్ల సమగ్ర స్వరూపం క్షణాల్లో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. త్వరలో దీన్ని ప్రైవేట్ పాఠశాలలకూ వర్తింపచేయాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పాఠశాలల సమగ్ర అభివృద్ధి పథకాన్నే ఆంగ్ల అక్షర క్రమంలో సంక్లిప్తంగా ‘శాలసిద్ధి’ అని పిలుస్తున్నారు. పథకంలో భాగంగా పాఠశాలల హెచ్ఎంలు శాలసిద్ధి ఆన్లైన్ పోర్టల్‌లో తొలుత యూపీఎస్‌లు, హైస్కూళ్ల సమగ్ర సమాచారాన్ని అప్లోడ్ చేయాలి. ఇందుకోసం స్కూల్ యూడైస్ కోడ్ ప్రకారం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. శాలసిద్ధిలో వివరాలు అప్లోడ్ చేయడానికి ఇప్పటికే హెచ్ఎంలకు శిక్షణనిచ్చారు. ఇదే పనిలో హెచ్ఎంలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రాథమిక పాఠశాల సమాచారం కూడా అప్లోడ్ చేస్తున్నారు. నివేదికపై కేంద్ర బృందం ప్రత్యేక పరిశీలన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో వివరాలు పంపిన తర్వాత ఆ నివేదికలను జాతీయస్థాయిలో పరిశీలిస్తారు. వాస్తవాలపై ఆరా తీసేందుకు కేంద్ర బృందం ప్రత్యేక పరిశీలనకు వస్తుంది. పాఠశాలలో వనరుల వినియోగం ఒకేలా ఉండాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం శాలసిద్ధి కార్యక్రమం చేపట్టింది. అన్ని రాష్ట్రాల్లోని పీఎస్, యూపీఎస్, హైస్కూళ్ల స్థితిగతులు, వనరులపై అంచనాకు వచ్చేందుకు ఈ వివరాల సేకరణ దోహదం చేస్తుంది. నిధుల మంజూరుకు సమాచారమే ప్రామాణికం శాలసిద్ధి ద్వారా ప్రతి పాఠశాల పూర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో ఇక ఏ పాఠశాల సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. అప్పుడే వసతులు, వనరులు, సమస్యలు, అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై స్పష్టత వస్తుంది. భవిష్యత్‌లో పాఠశాలల అవసరాల మేరకు ప్రభుత్వం నిధుల మంజూరుకు ఈ సమాచారం దోహదపడుతుంది. – ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, ఎంఈఓ -
‘ప్రైవేట్’కు దీటుగా..
మందమర్రిరూరల్ : మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల దీటుగా ఉపాధ్యాయులు విద్యబోధన చేస్తున్నారు. వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మండలంలో మొత్తం తొమ్మిది పాఠశాలలున్నాయి. ఐదు జిల్లా పరిషత్ హైస్కూల్స్ కాగా, రెండు ఎయిడెడ్, ఒకటి మోడల్æస్కూల్, ఒకటి కస్తూర్బా పాఠశాల. మొత్తం 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశాల్లో సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. గత సంవత్సరం వార్షిక ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణత సాధించగా, మోడల్ స్కూల్ విద్యార్థిని జిల్లా టాపర్‌గా నిలిచింది. ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధ విద్యార్థులు ‘పది’లో ఉత్తీర్ణత శాతం సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడినవారిపై శ్రద్ధ తీసుకుంటున్నారు. వీరికి సులభపద్ధతిలో బోధన చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం పది పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయ బృందం కృషిచేస్తోంది. సులభ పద్ధతిలో బోధన నేను పొన్నారం జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి చదువుతున్నా. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను సులభపద్ధతిలో అర్ధమయ్యే విధంగా బోధిస్తున్నారు. చదువులో వెనుకబడినవారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. – నెండుగురి సాయినికిత్,పదోతరగతి పొన్నారం పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తాం మండలంలోని తొమ్మిది పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత శాతం సాధించే దిశగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. త్రీఆర్స్ బోధన పద్ధతి ద్వారా విద్యార్థులకు అర్దమయ్యేలా పాఠాలు చెప్పించాం. – జాడి పోచయ్య,ఎంఈవో, మందమర్రి -
ఫీజులు పెంచొద్దు!
వనపర్తి విద్యావిభాగం : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదేశాలు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికఫీజులు వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా పదిశాతం ఫీజులు పెంచుకోవచ్చని ఇచ్చిన తిరుపతిరావు కమిటీ నివేదిక పరిశీలనలోనే ఉందని తెలిపింది. ఫీజుల పెంపు విషయంలో ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు గతేడాది ఫీజులనే కొనసాగించాలని స్పష్టంగా ఆదేశించింది. నిబంధనలు తూచ్! జిల్లాలో ఉన్న 110ప్రైవేట్ పాఠశాలల్లో 50వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే టెక్నో, టాలెంట్, ఒలంపియాడ్ తదితర పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనికితోడు పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, టై, బెల్ట్, బ్యాడ్జ్‌ల పేరుతో ఫీజుల భారం మోపుతున్నారు. తిరుపతిరావు కమిటీ నివేదికపై నిరసనలు కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని పేరెంట్స్ కమిటీల పోరాటాలతో ప్రభుత్వం తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరిశీలన అనంతరం ప్రైవేట్ పాఠశాలలు ప్రతి సంవత్సరం 10శాతం ఫీజులు పెంచుకోవచ్చని ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే ఫీజుల భారంతో ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు తిరుపతిరావు కమిటీ నివేదికపై మండిపడుతున్నారు. తిరుపతిరావు కమిటీ నివేదికను అమలు చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోసారి ఆదేశాలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు పెంచొద్దని ఇదివరకే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని బుకాయిస్తున్నాయి. దీంతో తాజాగా ప్రభుత్వం మంగళవారం మరోసారి ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఫీజులు పెంచొద్దని గతేడాది వసూలుచేసిన పాత ఫీజుల ప్రకారం అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ అధిక0గా వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
సీఎం టూర్.. ఆదివారం తెరిచిన ప్రైవేటు బడులు
-
పాఠశాలలో అగ్నిప్రమాదం: మూడు బస్సులు దగ్ధం
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ జనప్రియ నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించి మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం సెలవు దినం కావడంతో జనప్రియ స్కూల్‌కు చెందిన బస్సులన్నిటినీ పాఠశాల ఆవరణలో ఒకేచోట నిలిపి ఉంచారు. ఎలా జరిగిందో కానీ అగ్నిప్రమాదం సంభవించి వీటిల్లోని మూడు బస్సులు దగ్ధమయ్యాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సిగరెట్ తాగి పడేయడం వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నారు. కాగా, గత ఏడాదికూడా ఇదేవిధంగా పాఠశాలకు చెందిన రెండు బస్సులు దగ్ధం అయ్యాయి. -
సీఎం టూర్.. వెస్ట్‌లో సర్వత్రా విమర్శలు
ఏలూరు, సాక్షి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం కూడా ప్రైవేటు పాఠశాలలు తెరిచి ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రైవేటు పాఠశాలలు నడుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకొని సోమవారం ప్రైవేటు పాఠశాలలకు యాజమన్యాలు సెలవు ప్రకటించాయి. సోమవారం పోలవరం, వేగేశ్వరపురంలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా జన్మభూమి సభలకు ప్రజలను తరలించేందుకు ప్రైవేటు స్కూల్ బస్సులను వినియోగించాలని అధికార టీడీపీ నేతలు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఆదివారం ప్రైవేటు పాఠశాలలు నడుపుతున్న యాజమాన్యాలు.. సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించి మరీ సీఎం సభకు తమ బస్సులను సమకూరుస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కార్యక్రమం కోసం ఇలా ఆదివారం పాఠశాలలు నిర్వహించడం, సోమవారం సెలవు ఇవ్వడం, పిల్లల స్కూల్ బస్సులను సీఎం సభల కోసం ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల తీరు, ప్రైవేటు స్కూళ్ల నిర్వాకంపై జిల్లా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
బాలికను చిదిమేసిన కాలేజీ బస్సు
హైదరాబాద్: అదుపుతప్పిన ఓ కళాశాల బస్సు బాలికను చిదిమేసింది. శుభకార్యానికి వెళ్తున్న బాలిక కాలేజీ బస్సు కారణంగా తిరిగిరాని లోకాలకు వెళ్లింది. బుధవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేటకు చెందిన బొడ్డుపల్లి బాలకిషన్ కూతురు మధుశాలిని (12) చైతన్యపురిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని తమ బంధువుల ఇంట్లో జరిగే ఓ శుభకార్యానికి వెళ్లే క్రమంలో తన బాబాయ్ వెంకటేశ్‌తో కలసి బైకుపై వెళ్తుండగా.. పెద్దఅంబర్‌పేట గ్రామం నుంచి ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతుండగా నగరం వైపు నుంచి వస్తున్న సెయింట్‌మేరీస్ కాలేజీకి చెందిన బస్సు ఢీ కొట్టింది. దానిని తప్పించే క్రమంలో కాలేజీ బస్సు వెంకటేశ్ బైకును వెనుకనుంచి ఢీ కొట్టింది. దీంతో బైకు వెనుకసీటులో కూర్చున్న మధుశాలిని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో వెంకటేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య
కాకినాడ: ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల సమక్షంలో సహచర విద్యార్థి తల్లిదండ్రులు కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన అతడి బంధువులు స్కూల్‌పై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. చివరకు దిగివచ్చిన యాజమాన్యం రూ.5.50 లక్షలు పరిహారంగా చెల్లించడంతో వివాదానికి తెరపడింది. తల్లిదండ్రుల సమాచారం ప్రకారం.. కాకినాడ శశికాంత్ నగర్ సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో కనపర్తి యువకిషోర్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఏడో తరగతి విద్యార్థితో వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యువకిషోర్ను మరో విద్యార్థి తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం పాఠశాల ఆవరణకు పిలిపించి గట్టిగా మందలించి చేయి చేసుకొన్నారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు కూడా అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకిషోర్ మంగళవారం ఉదయం స్కూల్‌కు వెళ్లకుండా రాజేశ్వరినగర్‌లోని ఇంటి దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సమాచారం తెలుసుకొన్న తల్లి సత్యవేణి, తండ్రి రాంబాబులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే విద్యార్థి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో విషయం తెలుసుకున్న బంధు మిత్రులు మృతదేహంతో స్కూల్ ఆవరణకు చేరుకొని ఆందోళనకు దిగారు. అక్కడ ఫర్నిచర్‌ను మరికొన్ని వస్తువులను దగ్ధం చేశారు. పోలీసులు విద్యాశాఖాధికారులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. వివాద సమాచారం తెలుసుకొన్న యాజమాన్యం విద్యార్థులను ఇళ్లకు పంపింది. సిబ్బంది కూడా గైర్హాజరయ్యారు. విషయం తెలుసుకొన్న యాజమాన్యం అక్కడికి చేరుకొని విద్యార్థి బంధువులతో చర్చించింది. జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పి రూ. 5.50 లక్షలు పరిహారంగా అందజేసి వివాదానికి ముగింపు పలికింది. వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో విద్యలో రాణించలేక మనస్తాపంతో ఉరివేసుకొన్నట్టుగా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
'మీ రొమాన్స్‌తో కష్టం.. మీరొద్దు.. పెళ్లి రోజే షాక్'
సాక్షి, శ్రీనగర్ : ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లను వారి పెళ్లి రోజే ఆ స్కూల్ యాజమాన్యం అనూహ్యంగా తొలగించి షాకిచ్చింది. వాళ్ల రొమాన్స్ స్కూల్ విద్యార్థులకు ఇబ్బందిని కలిగిస్తుందని ఆ కారణంతోనే వారిని తొలగిస్తున్నామంటూ పేర్కొంది. దీంతో కెరీర్ ప్రారంభం సమయంలో వారికి ఉద్యోగం లేకుండా పెళ్లి సంతోషం కూడా మిగలకుండా చేసిన ఆ స్కూల్ యాజమాన్యంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే తారిఖ్ భట్, సుమయా భషీర్ అనే ఇద్దరు పులువామా జిల్లాలోని ట్రాల్ టౌన్ ప్రాంత వాసులు వారిద్ద పాంపౌర్లోని ఓ ముస్లిం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో గత కొన్నేళ్లుగా టీచర్లుగా పనిచేస్తున్నారు. వారిద్దరు వేర్వేరుగా బాయ్స్, గర్ల్స్ క్యాంపస్‌లలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరికి ఇటీవల నిశ్చితార్ధం కూడా జరిగింది. దాంతో వారిద్దరు కాస్త చనువుగా ఉండటం మొదలుపెట్టారు. గత నెల(నవంబర్) 30న వారి వివాహం ఉండగా అందుకోసం స్కూల్లో సెలవులకోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, సెలవులు మాత్రం ఇచ్చిన స్కూల్ యాజమాన్యం సరిగ్గా పెళ్లి రోజు వారిని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. దీంతో వారు పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ సంతోషమే లేకుండా పోయింది. దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించినప్పటికీ ఎలాంటి బదులు ఇవ్వలేదు. అయితే, స్కూల్ చైర్మన్ బషీర్ మసూది మాత్రం బదులిస్తూ 'వాళ్లిద్దరు రొమాన్సాలో ఉన్నారు. అది మా స్కూల్లో చదువుతున్న, పనిచేస్తున్న 2000మంది విద్యార్థులకు మంచిదికాదు. 200మంది స్టాఫ్‌కు మంచిది కాదు. వీరి మధ్య ఉన్న విషయం విద్యార్థులకు ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది' అని బదులిచ్చారు. -
బ్యాగు బరువు తగ్గాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు తగ్గించేందుకు పక్కా చర్యలు చేపట్టాల్సిందేనని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ డీఈవోలను ఆదేశించారు. ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలని స్పష్టం చేశారు. బ్యాగు బరువు తగ్గించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని, ఎంఈవోల నేతృత్వంలో అధికారులు బృందాలుగా ఏర్పడి బ్యాగు బరువుపై తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారులతో బుధవారం హైదరాబాద్‌లో కిషన్ సమీక్ష నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం కోసం అవసరమైన పాఠ్య పుస్తకాల వివరాలను ఇప్పటివరకు 21 జిల్లాలే అందజేయాలని, మిగతా జిల్లాల డీఈవోలు కూడా ఆ వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు. విద్యార్థినిలపై వేధింపులకు సంబంధించి పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు, టీచర్లకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో 10వ తరగతి విద్యార్థులకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహణకు పక్కా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
రాజంపేటలో బ్లూవెల్‌గేమ్ కలకలం..?
సాక్షి, రాజంపేట :ప్రపంచంలో ఎంతోమంది విద్యార్థులను, యువకులను పొట్టనపె ట్టుకున్న బ్లూవెల్‌గేమ్ భారతదేశంలోకి వ్యాపించింది. ఇప్పుడు రాజంపేట పట్టణంలో కలకలం రేపినట్లు సమాచారం. రాజంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్ వల్ల పరస్పరం బ్లేడ్స్‌తో కోసుకున్నారని తెలిసింది. కాగా ఈ వార్తలు.. పుకార్లు షికార్లు చేశాయి. ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్ ఆడి అందులో వచ్చిన మెసేజ్‌చూసి బ్లేడ్స్‌తో కోసుకున్నారని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విద్యార్థుల చేతులను పరిశీలించిన ఉపాధ్యాయులు వారిని మందలించినట్లు తెలిసింది. వెంటనే ఆ ఇద్దరినీ తల్లిదండ్రులతో ఇంటికి పంపించినట్లు మిగతా పిల్లలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంపై పాఠశాల యాజమాన్యాలు ధృవీకరించడంలేదు. -
విద్యార్థి అల్లరి చేశాడని..
గద్వాల క్రైం: తరగతి గదిలో అల్లరి చేశాడని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి చేయి విరగ్గొట్టాడు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. గద్వా లకు చెందిన సత్యరెడ్డి, పుష్పలత కుమారుడు తేజవర్ధన్‌రెడ్డి స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని విశ్వభారతి హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం తరగతి గదిలో గణితం ఉపాధ్యాయుడు నరేందర్ విద్యార్థులకు పాఠం చెబుతున్నాడు. ఇంతలో అల్లరి చేశాడనే కోపం తో తేజవర్ధన్రెడ్డిపై సదరు ఉపాధ్యాయుడు భుజంపై తన మోచేతితో బలంగా బాదాడు. సాయంత్రం ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. మంగళవారం రాత్రి కొడుకును కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు చేయిస్తు న్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జోగుళాంబ గద్వాల జిల్లా డీఈఓ వేణు గోపాల్, పోలీసులు విచారణ చేపట్టారు. -
బడుగుల గుడి.. సర్కారీ బడి
► 11.86 లక్షల మంది ఓసీల్లో 1.86 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో ► 28.72 లక్షల మంది బీసీల్లో 15.15 లక్షల మంది చదువులు ప్రైవేటు స్కూళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న ఎస్సీ విద్యార్థులు 6,60,000 ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న ఎస్టీ విద్యార్థులు 4,75,000 సాక్షి, హైదరాబాద్: దుర్భరమైన ఆర్థిక పరిస్థితులతో నిరుపేద కుటుంబాలు తమ పిల్లలను సర్కారు బడుల్లో చదివిస్తుంటే.. కొంత మేరకు ఆప్పు చేసే స్తోమత కలిగిన కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్సీల్లో 61.68%, ఎస్టీల్లో 72.99% విద్యార్థులు ప్రభుత్వ బడుల్లోనే చదువుతుండగా, 15.68 శాతం నిరుపేద ఓసీ (జనరల్) కుటుంబాలకు చెందిన పిల్లలు సర్కారు బడికే వెళ్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్న వారిలో ఎక్కువ శాతం ఓసీ విద్యార్థులుండగా, తక్కువ శాతం మంది ఎస్సీ, ఎస్టీల పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. ఇక 47% మంది బీసీ విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుండగా 53 శాతం బీసీ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. 2016–17 విద్యా సంవత్సరంలో విద్యాశాఖ సేకరించిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇపుడు మరోసారి 2017–18 విద్యా సంవత్సరం లెక్కల సేకరణపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఈసారి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి సామాజిక వర్గాల వారీగా వివరాలను సేకరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. బీసీ కమిషన్ ఆదేశాలతో.. రాష్ట్రంలో బీసీ విద్యార్థులు, వారి కులాలకు సంబంధించిన వివరాలు సమగ్రంగా కావాలని ఇటీవల రాష్ట్ర బీసీ కమిషన్ విద్యాశాఖను కోరింది. దీంతో ఆ వివరాల సేకరణపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ మేరకు జిల్లాల్లోని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్ల సామాజిక వివరాలను కూడా అందజేయాలని ఆదేశించింది. ఏటా సెప్టెంబర్‌లో జిల్లాల వారీగా విద్యార్థుల సమగ్ర వివరాలను (యు–డైస్) విద్యాశాఖ సేకరిస్తోంది. అయితే ఇప్పటివరకు సామాజిక వర్గాలను జనరల్, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనారిటీలుగానే పేర్కొనేది. కానీ ఈనెలలో ప్రారంభించనున్న వివరాల సేకరణలో సదరు విద్యార్థి ఏ సామాజిక వర్గానికి చెందినవాడు అన్న వివరాలను కూడా ప్రత్యేకంగా సేకరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 40,091 పాఠశాలల్లో (అన్ని రకాల మేనేజ్మెంట్లలో) 65,00,128 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలల్లో 29,20,683 మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో 35,79,445 మంది చదువుతున్నారు. ఇప్పుడు వారందరి వివరాలను సేకరించనున్నారు. రిజర్వేషన్ కేటగిరీల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల శాతం మేనేజ్మెంట్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు ప్రభుత్వ 15.68 68.61 72.99 47.23 29.24 ప్రైవేటు 84.32 31.39 27.01 52.77 70.76 ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది? రాష్ట్రంలోని 28,829 ప్రభుత్వ పాఠశాలల్లో 1,86,064 మంది ఓసీ విద్యార్థులు చదువుతుం డగా, ఎస్సీ విద్యార్థులు 6,60,277 మంది చదువుతున్నారు. ఇక ఎస్టీ విద్యార్థులు 4,75,932 మంది చదువుతుండగా, బీసీ విద్యార్థులు 13,56,630 మంది చదువుతున్నారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులు 2,41,780 మంది ఉన్నారు. ‘ప్రైవేటు’లో సామాజిక వర్గాల వారీగా రాష్ట్రంలోని 11,262 ప్రైవేటు స్కూళ్లలో ఓసీ విద్యార్థులు 9,99,999 మంది ఉండగా, ఎస్సీ విద్యార్థులు 3,02,214 మంది చదువుకుంటున్నారు. ఎస్టీ విద్యార్థులు 1,76,189 మంది మాత్రమే ప్రైవేటు స్కూళ్లలో చదువుతుండగా, బీసీలు 15,15,715 మంది వాటిల్లో చదువుకుంటున్నారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులు 5,85,328 మంది ప్రైవేటు స్కూళ్లలోనే చదువుతున్నారు. బీసీ–‘ఏ’కేటగిరీలో అనాథ పిల్లలు అనాథ పిల్లలను బీసీ–‘ఏ’కేటగిరీగా పేర్కొం టూ పాఠశాలల్లో చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. అనాథ బాలల కోసం ఏర్పాటు చేస్తున్న 31 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించే క్రమంలో ఈ పిల్లలను బీసీ–‘ఏ’కేటగిరీ రిజర్వేషన్ కింద పేర్కొనాలని విద్యాశాఖ ఆదేశించింది. -
ప్రభుత్వ బడుల్లోనే ఆడపిల్లలు
♦ పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య ♦ సమాన అవకాశాలు నామమాత్రమే నిజామాబాద్‌అర్బన్: ఆడపిల్లల సంఖ్య నానాటికి పెరుగుతుంది. విద్యాబోధనలో వీరికి అవకాశాలు ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 1015 ప్రభుత్వ పాఠశాలలు, 545 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 2,55,245 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. ఇందులో బాలురలు–13,0947 ఉండగా బాలికలు–124298 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు బాలికలు 50,433 ఉండగా, బాలికలు–52,674 మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి నుండి బాలురు –75003 మంది ఉండగా, బాలికలు–60,953 మంది ఉన్నారు. జిల్లా జనాభా 2011 సంవత్సరం ప్రకారం 15,71,022 ఉన్నారు. ఇందులో మగవారు–76,8477 ఉండగా మహిళలు–802545 మంది ఉన్నారు. స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి వెయ్యి మందికిగాను 1044 గా ఉంది. ఆరు సంవత్సరాలలోపు పిల్లలు మొత్తం 1,69,621 మంది ఉండగా ఇందులో మగవారు–86,867, ఆడపిల్లలు–82,754 ఉన్నారు. అక్షరాస్యత శాతం పరిశీలిస్తే చదువుకున్న మగవారు–5,04,933 ఉండగా ఆడవారు–3,95,503 మంది ఉన్నారు. నిరక్షరాస్యులను పరిశీలిస్తే మగవారి శాతం 74.08 , ఆడవారు 54.95 శాతం నమోదు ఉన్నారు. నిజామాబాద్‌అర్బన్ పరిధిలో..... మొత్తం జనాభా –464750 ఉన్నారు. ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 53587 మంది ఉన్నారు. ఇందులో నిజామాబాద్ అర్బన్ పరిధిలో 42 ప్రాథమిక పాఠశాలలు, 10 ప్రాథమికోన్నత పాఠశాలలు, 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 150 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 42 వేల మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మురికివాడల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఉర్ధూ మీడియం పాఠశాలల్లో సుమారు 40 శాతం బాలికల కంటే బాలురలే పాఠశాలలకు వస్తున్నారు. ధర్మపురిహిల్స్, పూలాంగ్, కోటగల్లి, చంద్రశేఖర్‌కాలనీ,కోజాకాలనీ, మాలపల్లి, వినాయక్‌నగర్, పాములబస్తీ పాఠశాలల్లో బాలురలే ఎక్కువగా ఉన్నారు. -
టీచర్ దెబ్బలకు విద్యార్థి ఆస్పత్రిపాలు
♦ మెడ నరాలు దెబ్బతిన్నాయంటున్న తల్లిదండ్రులు ♦ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే దాడి.. ♦ ఉపాధ్యాయుడిపై బంధువుల ఎదురుదాడి ♦ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరువర్గాలు రాయదుర్గం: ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు ఓ విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. దీన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన విద్యార్థి తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యం దాడికి దిగగా.. బాధితులు ఉపాధ్యాయుడిపై ఎదురుదాడి చేశారు. బాధిత విద్యార్థి తండ్రి కథనం మేరకు.. గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం గ్రామానికి చెందిన గోవిందరాజులు తన కుమారుడు లోకేష్‌సాయిని రాయదుర్గం పట్టణంలోని సెయింట్ థామస్ ఇంగ్లిష్ మీడియం ప్రైవేటు స్కూల్లో ఈ ఏడాది ఎనిమిదో తరగతిలో చేర్పించాడు. పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు లోకేష్‌సాయిని ఎగతాళి చేస్తూ వేధింపులకు గురిచేసేవారు. హెచ్ఎం లైట్‌గా తీసుకోవడం వల్లే.. హెచ్ఎం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లినా.. ముగ్గురిలో ఒక విద్యార్థి పాఠశాల భవనం యజమాని కుమారుడు కావడంతో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో భవనం యజమాని కుమారుడు మరింత రెచ్చిపోయాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరని, నేను తలుచుకుంటే టీచర్‌కు చెప్పి నిన్నే కొట్టిస్తా అంటూ బాధిత విద్యార్థిని బెదిరించాడు. నెలరోజుల కిందట ఉన్నవీ లేనివీ చెప్పడంతో సోషియల్ టీచర్ వెంకటస్వామి పూర్తిగా తెలుసుకోకుండా లోకేష్‌సాయిని చితకబాదాడు. అయితే దీని గురించి ఆ విద్యార్థి ఇంట్లో చెప్పలేదు. తనలో తానే కుమిలిపోతూ.. భయంతో పాఠశాలకు సక్రమంగా వెళ్లలేకపోయాడు. జ్వరం వస్తుందని చెప్పడంతో తల్లిదండ్రులు రాయదుర్గంలో ప్రైవేటు వైద్యుల చేత చికిత్సలు చేయించారు. అయినా తగ్గకపోవడం, మెడ వంకర్లు పోతుండడంతో బళ్లారి, కర్నూలు వైద్యులతో చూపించారు. చికిత్సకోసం సుమారు రూ.80 వేల దాకా ఖర్చు అయింది. మెడ నరాలు దెబ్బతిన్నాయని, మూడునెలల పాటు మాత్రలు తప్పనిసరిగా వాడాలని, నెలకోమారు పరీక్షలకు రావాలని వైద్యులు చెప్పారు. వైద్యం చేయించుకువచ్చిన తరువాత కూడా స్కూల్‌కు వెళ్లమంటే విద్యార్థి భయపడే వాడు. తండ్రి ఒట్టుతో బయటపడ్డ నిజం.. మూడు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లి తండ్రి టీసీ తీసుకువచ్చాడు. ఎందుకు వెళ్లనంటున్నావో కారణం చెప్పు అని తండ్రి ఒట్టు వేయించుకోవడంతో ఆ విద్యార్థి జరిగిందంతా చెప్పాడు. శుక్రవారం రోజు ఈ ఘటనపై ఉపాధ్యాయులను అడిగేందుకు బంధువులతో కలిసి వచ్చాడు. విద్యార్థిదే తప్పు అంటూ యాజమాన్యం దాడికి యత్నించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి లోకేష్‌సాయి కుటుంబ సభ్యులు సోషిల్ టీచర్‌ను పటుకుని లాగారు. తమ కుమారుడిని కొట్టి, ఆస్పత్రిపాలు చేసి, ప్రశ్నించిన తమపై దాడికి యత్నించారని గోవిందరాజులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇదిలా ఉండగా తాను లోకేష్‌సాయిని మందలించాను తప్ప కొట్టలేదని సోషియల్ టీచర్ వెంకటస్వామి తెలిపాడు. విద్యార్థి తండ్రికి, హెచ్ఎంకు మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ తనను అనవసరంగా కొట్టారని వాపోయాడు. లోకేష్సాయికి ఆరోగ్యం బాగలేదని టీసీ తీసుకెళ్లిన మూడు రోజుల తర్వాత గొడవకు వచ్చారని, దీనిపై తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని హెచ్ఎం ప్రభాకర్ తెలిపారు. తమ పాఠశాల ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
-
ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని శెట్టి షాలిని(11) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన శెట్టి సంగీత, శ్రీశైలంలకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు షాలిని పిట్లంలోని ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. హోంవర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయుడు మందలించడం, ఇంట్లో అన్నయ్య తరచూ కొడుతుండడం, తల్లిదండ్రుల మందలింపులతో మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల వేడిని తాళలేక ఇంట్లోనుంచి బయటికి పరుగెత్తుకు వచ్చింది. స్థానికులు దీనిని గమనించి మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన షాలినిని కుటుంబ సభ్యులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడినుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. కాగా సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు తెలుస్తోంది. హోంవర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయుడు మందలించి, ప్రిన్సిపాల్‌కు చెబుతానని బెదిరించారని, ఇంట్లో అన్నయ్య కొడుతున్నాడని అందులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే కూతురి ఆర్యోగ పరిస్థితి బాగాలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి శ్రీశైలం ఫిర్యాదు చేశారని నిజాంసాగర్ ఏఎస్సై గాంధీ గౌడ్ తెలిపారు. -
స్కూల్ బస్సు ఢీ కొని చిన్నారి మృతి
-
ఫీజుల వివరాలు ఆన్లైన్లో స్వీకరణ
వెబ్ పోర్టల్ రూపొందించిన తిరుపతిరావు కమిటీ - వెబ్సైట్ ద్వారా ప్రైవేటు స్కూళ్ల ఆదాయ వ్యయాల వివరాలు సేకరణ - త్వరలో అందుబాటులోకి వెబ్సైట్.. - ఆ తర్వాతే నియంత్రణ చర్యలపై పరిశీలన - ఫీజుల నియంత్రణపై ఇతర రాష్ట్రాల్లోనూ అధ్యయనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను ఆన్లైన్లో స్వీకరించాలని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నిర్ణయించింది. యాజమాన్యాల నుంచి తీసుకోవాల్సిన వివరాలతో కూడిన వెబ్ పోర్టల్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించింది. లింకును పాఠశాల విద్యా డైరెక్టర్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టింది. యాజమాన్యాలు సీడీఎస్ఈ వెబ్సైట్లోకి వెళ్లి పాఠశాలలకు సంబంధించిన వివరాలు, ఫీజుల వివరాలు, ఆదాయ వ్యయాలను ఆన్లైన్లోనే పొందుపరిచేలా రూపొందించింది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు పొందుపరిచేందుకు యాజమాన్యాలకు 15 నుంచి 20 రోజుల సమయం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆ తర్వాత వాటిని పరిశీలించి ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఓ అంచనాకు రానుంది. మరోవైపు గుజరాత్, కేరళ, తమిళనాడు తదిరత రాష్ట్రాల్లోనూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చేపట్టిన చర్యలపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. యాజమాన్యాల నుంచి లభించని స్పందన రాష్ట్రంలో 11 వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను ఖరారు చేసేందుకు ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ పలు దఫాలుగా తల్లిదండ్రులతో, యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు సమావేశాలు నిర్వహించి చర్చించింది. ఇటు యాజమాన్యాలు, అటు తల్లిదండ్రుల కమిటీలు తమ వాదనలు వినిపించాయి. ఏఎఫ్ఆర్సీ తరహా విధానం ఉండాలని తల్లిదండ్రులు, కనీస, గరిష్ట ఫీజుల విధానం ఉండాలని యాజమాన్యాలు చెప్పుకొచ్చాయి. ఆ సమావేశాల వల్ల తల్లిదండ్రుల వైఖరి, యాజమాన్యాల తీరు తెలిసిందే తప్ప నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ ఓ అంచనాకు రాలేకపోయింది. పైగా ప్రస్తుతం పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల విధానం ఎలా ఉందో తెలుసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో మూడేళ్లకు సంబంధించి స్కూళ్ల ఆదాయ వ్యయాల స్వీకరణకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. అయితే యాజమాన్యాల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. అయినా విద్యా శాఖ ఫీజుల నియంత్రణ కోసం కాకపోయినా నిబంధనల ప్రకారం పాఠశాలల వార్షిక ఆదాయ వ్యయాల వివరాలను ఇవ్వాల్సిందేనని యాజమాన్యాలకు స్పష్టం చేసింది. స్పష్టత కోసం.. మరోవైపు తాజాగా ఆన్లైన్లో వివరాల సేకరణకు చర్యలు చేపట్టిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ.. అవి వస్తేనే ఫీజుల విధానం ఎలా ఉంది, పాఠశాలల ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, నియంత్రణకు ఎలాంటి సిఫారసులు చేయాలి, అన్న అంశంపై ఓ స్పష్టతకు రావచ్చని భావిస్తోంది. హడావుడిగా నివేదికలు ఇచ్చి, ఆ తర్వాత కోర్టు కేసులతో ఆగిపోయే పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో కొంత సమయం పట్టినా పక్కాగా చర్యలు చేపట్టేందుకు వీలుగా సిఫారసులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని భావిస్తోంది. అయితే ఆన్లైన్లో వివరాల సమర్పణకు ఎన్ని పాఠశాలలు ముందుకు వస్తాయో వేచి చూడాల్సిందే. -
బ్యాగు బరువు తగ్గేదెలా?
నిబంధనలు పాటించని స్కూళ్లపై ఏం చర్యలు తీసుకుంటారు? - కార్యాచరణ లేకుండానే ప్రభుత్వ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులపై స్కూల్ బ్యాగు బరువు తగ్గించేందుకు ఇటీవల మార్గదర్శకాలు (జీవో 22) జారీ చేసిన ప్రభుత్వం.. వాటిని పక్కాగా అమలు చేసేందుకు కార్యాచరణ మాత్రం ప్రకటించలేదు. దీంతో బ్యాగు బరువు తగ్గింపు అమలుకు నోచుకునే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం పాఠశాల విద్యాశాఖ అయినా ఆ మార్గదర్శకాల అమలుకు పక్కాగా చర్యలు చేపట్టలేదు. బ్యాగు బరువు తగ్గించేందుకు చర్యలు చేపట్టని పాఠశాలలపై ఎలాంటి చర్యలు చేపడతారన్న అంశంలో స్పష్టమైన విధానం ప్రకటించలేదు. పిల్లల బ్యాగు బరువు తగ్గించేందుకు యాజమాన్యాలు చర్యలు చేపట్టాయా.. లేదా అన్న అంశాన్ని పరిశీలించేందుకు జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు తనిఖీలు చేయాలంటూ విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు ఇచ్చి వదిలేసింది. బ్యాగు బరువును తగ్గించే ఏర్పాట్లు చేయని పాఠశాలలపై ఎలాంటి చర్యలు చేపట్టాలో స్పష్టం చేయకపోవడంతో యాజమాన్యాలు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. మంత్రిదో మాట.. అధికారులదో బాట.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా పాఠ్య పుస్తకాలను వినియోగిస్తున్నాయి. తమకు నచ్చిన పబ్లిషర్ పుస్తకాలను అమలు చేస్తున్నాయి. వాటికి తోడు పదుల సంఖ్యలో నోటు పుస్తకాలతో విద్యార్థులకు మోత తప్పడం లేదు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) నిర్దేశిత పుస్తకాలను ఏమాత్రం అమలు చేయడం లేదు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా.. మీ ఇష్టం ఉన్న పుస్తకాలను వినియోగించుకోం డని, ఎస్సీఈఆర్టీ నిర్దేశించిన పుస్తకాలనే వినియోగించాల్సిన అవసరమే లేదని హామీ ఇచ్చినట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యా లు చెబుతున్నాయి. అంతేకాదు గతేడాది ఈ విషయంలో కఠినంగా వ్యవహరించిన విద్యాశాఖ.. ఈసారి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే స్కూల్ బ్యాగు బరువు తగ్గించేందుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం కచ్చితంగా ఎస్సీఈఆర్టీ నిర్దేశిత పుస్తకాలనే వినియోగించాలని స్పష్టం చేసింది. ఏ తరగతికి ఎంత బరువు? ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 5 నుంచి 7 కిలోలు ఉంటోంది. రెండో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 9 కిలోలు, 5వ తరగతి విద్యార్థి బ్యాగు బరువు 10 కిలోలు, 7వ తరగతి విద్యార్థి బ్యాగు బరువు 12 కిలోలు ఉంటుండగా, పదో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 17 కిలోల వరకు ఉంటోందని విద్యాశాఖ తనిఖీల్లో వెల్లడైంది. ఫలితంగా విద్యార్థుల వెన్ను వంగిపోతోందని, శారీరక ఎదుగల దెబ్బతింటోందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకే ఎస్సీఈఆర్టీ నిర్దేశిత పుస్తకాలను వాడాలని, పైగా బ్యాగుతో సహా 1, 2 తరగతులకు 1.5 కిలోల బరువే ఉండాలని, 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోలు, 6, 7 తరగతుల బరువు 4 కిలోలకు మించకూడదని, 8, 9, 10 తరగతులకు 4.5 నుంచి 5 కిలోల లోపే ఉండాలని స్పష్టం చేసింది. అయితే వీటిని పాటించని స్కూళ్లపై ఎలాంటి చర్యలు చేపట్టాలి? కేసులు నమోదు చేయాలా? పాఠశాల గుర్తింపు రద్దు చేయాలా? వంటి అంశాలేవీ ఆ ఉత్తర్వుల్లో లేకపోవడంతో అవి బుట్టదాఖలు అయ్యే పరిస్థితి నెలకొంది. -
మెరుగైన విద్య పేరుతో మోసం
- స్కూల్ మూసివేసి ఫీజులతో ఉడాయించిన ఘనుడు - టంగుటూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన బనగానపల్లె రూరల్ : ఎక్కడో గుంటూరు నుంచి వచ్చాడు.. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు స్కూలును లీజ్‌కు తీసుకున్నాడు. మెరుగైన విద్యనందించి మీ పిల్లలను అన్ని విధాలా తీర్చిదిద్దుతామంటూ నమ్మబలికాడు. ఆయన మాటలు నమ్మి బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామస్తులు వాసులు సుమారు 65 మంది వరకు పిల్లలు చేర్పించారు. అడ్మిషన్ ఫీజుతోపాటు మొదటి విడత స్కూలు ఫీజులు కూడా చెల్లించారు. అంతా వసూలు చేసిన సదరు వ్యక్తి స్కూలు వదిలి ఉడాయించాడు. స్థానికుల వివరాల మేరకు..టంగుటూరుకు చెందిన సుబ్బరాముడు గతంలో గ్రామంలో ప్రతిభ ఇంగ్లీషు మీడియం స్కూల్ ప్రారంభించాడు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాదరెడ్డి ఈ ఏడాది పాఠశాలను తీసుకున్నాడు. జూన్ నెలలో అడ్మిషన్లు ప్రారంభించారు. నర్సరి నుంచి 5వ తరగతి వరకు సుమారు 65 మంది పిల్లలను చేర్పించుకునిఅడ్మిషన్ ïఫీజు రూ.500, టర్మ్ ఫీజు కింద రూ. 2వేల నుంచి రూ. 3 వేల ప్రకారం రూ.2.50 లక్షల వరకు వసూలు చేశాడు. పలుకూరులో మరో బ్రాంచి ఏర్పాటు చేస్తున్నామంటూ గురువారం స్కూల్లోని పర్నీచర్, ఇంటి సమాన్లను ఆటోల్లో తరలించారు. సాయంత్రం స్కూల్ వదలిన తరువాత ప్రసాదరెడ్డి భార్య కూడా పలుకూరుకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయింది. శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రసాదరెడ్డి, ఆయన భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. 24న పాఠశాల తనిఖీ టంగుటూరులోని ఈ పాఠశాలను ఎంఈఓ స్వరూప గత నెల 24న తనిఖీ చేశారు. గుర్తింపు లేనట్లు నిర్ధారించి హెచ్చరించి వెళ్లారు. దీంతో ప్రసాద్‌రెడ్డి పాఠశాల గుర్తింపు కోసం ప్రయత్నించి కుదరకపోవడంతో వెళ్లిపోయి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డికి ఫిర్యాదు చేశారు. గతంలో ఇక్కడ స్కూల్ నడిపిన సుబ్బరాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రసాదరెడ్డి ఆచూకీ విచారిస్తున్నట్లు తెలిసింది. -
వామ్మో ప్రై‘వేటు’
► అదుపులేకుండా ఫీజుల వసూలు ► ప్రతిదీ ఇక్కడే కొనాలని హుకూం ► అడ్డగోలు రేట్లతో అమ్మకం ► తడిసిమోపెడవుతున్న వైనం ► దడ పుట్టిస్తున్న పాఠశాలలు ► స్పందించని విద్యాశాఖ కరీంనగర్‌ఎడ్యుకేషన్: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రుల్లో దడ పుట్టిస్తున్నాయి. నియంత్రణ లేకుండా ఫీజులు వసూలు చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాణ్యమైన విద్య అందుతుందనే అభిప్రాయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తుండడాన్ని అవకాశంగా తీసుకుంటూ.. అడ్మిషన్.. మెయింటనెన్స్.. స్పెషల్ ఫీజుల పేరిట దోపిడీకి తెరలేపాయి. పెన్సిల్ నుంచి నోట్బుక్కుల వరకు ప్రతిదీ సదరు పాఠశాలల్లోనే కొనాలని హుకూం జారీ చేస్తున్నాయి. ఈ ఖర్చులు సామాన్యుడికి తడిసి మోపెడవుతున్నాయి. తమ పాఠశాల పేర్లతో ఉన్న బ్యాగులను అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నాయి. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభమై వారం కావస్తోంది. ప్రైవేటు పాఠశాలలు నియంత్రణ లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సిన విద్యాశాఖ నిద్రపోతోంది. ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖరిపై సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు లేకున్నా.. కార్పొరేట్ లేబుల్ పెట్టుకుని వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. టెక్ట్స్, నోట్‌బుక్స్ మొదలు పెన్సిల్వరకు అన్నీ తమ పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టాయి. దీంతో ఆ స్కూల్లోనే అన్ని వస్తువులు కొనుగోలు చేయడం అనివార్యమైంది. బ్యాగులు, టై, బూట్లకు విపరీతంగా ధరలు వసూలు చేస్తున్నాయి. పుస్తకాల ధరలు పైపైకి... బయట షాపుల్లో రూ.15 ఉన్న పుస్తకాన్ని ప్రైవేటు పాఠశాలల్లో రూ.18 నుంచి రూ.20కి విక్రయిస్తున్నారు. ‘కార్పొరేట్’గా చెప్పుకునే ఇంకొన్ని పాఠశాలల్లో అయితే.. ఆ ధర రూ.30కి పైగా ఉంటోంది. ఒకటో తరగతి సంబంధించి 11 టెక్టŠస్‌బుక్స్‌కు రూ.915 వసూలు చేస్తున్నారు. ఇక 13 నోట్బుక్కులకు రూ.260, రెండో తరగతి 11 టెక్టŠస్‌బుక్స్‌కు రూ.1450, 21 నోట్బుక్కులకు రూ.420, మూడో తరగతి 10 టెక్టŠస్‌బుక్స్‌కు రూ.1128, 22 నోట్‌బుక్స్‌కు రూ.240 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రభుత్వం సరఫరా చేసే టెక్టŠస్‌బుక్ కాకుండానే. వీటికి తోడు పెన్నులు, పెన్సిళ్లు, కవర్లు అంటూ రెట్టింపు ధరలకు అంటగడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల యజమానులకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సంబంధాలు ఉండడంతో ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆకాశంలో బ్యాగుల ధరలు నర్సరీ నుంచి పదో తరగతి వరకే కాకుండా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సైతం చదువు‘కొనా’లంటే బ్యాగు తప్పనిసరైంది. ప్రస్తుతం చాలా కంపెనీలు విద్యార్థులను ఆకర్షించేలా వారి అవసరాలకు తగ్గట్టుగా అనేక మోడల్స్‌లో బ్యాగులను విడుదల చేస్తున్నాయి. కళ్లు చెదిరే డిజైన్లు, రంగులతో చాలారకాల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ఎల్కేజీ నుంచి ఐదో తరగతి వరకు కొన్నిపుస్తకాలే ఉంటాయి. కానీ ఆరో తరగతి నుంచి పదోతరగతి వారికి నాణ్యమైన బ్యాగు లేనిదే ముందుకు కదలని పరిస్థితి. చిన్నపిల్లల బ్యాగులు దాదాపు రూ.120 నుంచి రూ.500 వరకు, ఆరో తరగతి చదివే పిల్లలకు రూ.వెయ్యి వరకు ఉన్నాయి. మోడల్స్, నాణ్యతను బట్టి ధరలు పెంచుతున్నారు. ప్రస్తుతం బ్యాగుల ధరలు గతంలో పోల్చితే రూ.100 నుంచి రూ.120 వరకు పెరిగాయి. మండుతున్న బూట్ల ధరలు పాఠశాల విద్య అంటేనే క్రమశిక్షణతో కూడుకున్నది. ప్రతి పాఠశాలలో యూనిఫాం.. దానికి తగ్గట్టు బూట్లు (బ్లాక్, వైట్ కలర్) తప్పనిసరి. వీటి రేట్లు ఏటా పరుగులు తీస్తూనే ఉన్నాయి. పలు పాఠశాలలు తప్పనిసరిగా బ్రాండెడ్వే కొనాలని చెబుతున్నాయి. గతేడాది పలు కంపెనీలకు చెందిని బూట్లు రూ.250 నుంచి రూ.300వరకు ఉండగా.. ఇప్పడు 20శాతం పెరిగి రూ.500కు చేరాయి. యూనిఫాంలూ అంతే.. జిల్లా కేంద్రంలో దాదాపు వందల సంఖ్యలో పాఠశాలలు వీధికొకటి ఏర్పడ్డాయి. విద్యార్థులు తప్పనిసరిగా యాజమాన్యం సూచించిన యూనిఫాంలనే ధరించాల్సి ఉంటుంది. ఏటా తప్పనిసరిగా కొత్త యూనిఫాం ఉండాల్సిన అవసరం ఉంది. వీటి ధరలూ గతేడాదితో పోల్చితే చాలా పెరిగాయి. నర్సరీ పిల్లలకు కావాల్సిన స్కూల్ యూనిఫాం గతేడాది రూ.300 నుంచి రూ.350 ఉండగా.. ఇప్పుడవి రూ.400 నుంచి రూ.450 చేరాయి. అబ్బాయిల ప్యాంట్‌షర్ట్, అమ్మాయిల యూనిఫాంలు ఒకే ధరకు లభిస్తున్నాయి. ఒక్కో విద్యార్థికి కనీసం రెండు యూనిఫాంలు లేకుంటే ఇబ్బందే. జిల్లా కేంద్రంలో చాలా దుకాణాల్లో రెడీమేడ్ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. కొంత మంది రెడీమేడ్ దుస్తులను వాడితే మరి కొంత మంది కొనుక్కొని కుట్టించుకుంటున్నారు. -
ఫీజుకోసం అక్కాచెల్లెళ్ల బట్టలూడదీసి తోసేశారు
పట్నా: బిహార్‌లో ఓ ప్రైవేట్ స్కూల్ దారుణం చేసింది. తండ్రి ఫీజు కట్టలేదని కూతుర్లకు అమానవీయ రీతిలో శిక్ష వేసింది. వారిద్దరు దుస్తులు విప్పించి అందరి ముందు నిలబెట్టింది. వీధుల్లో నడిపించింది. ఈ ఘటన బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపట్ల సభ్య సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. చున్చున్షా అనే వ్యక్తికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారికి మంచి విద్య దొరుకుతుందనే ఆశతో ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్చించాడు. వారిద్దరిలో ఒకరు ఒకటో తరగతి చదువుతుండగా మరొకరు నర్సరీ విద్యార్థిని. అయితే, వారి స్కూల్ యూనిఫాం, షూ, స్కూల్ ఫీజుల డబ్బులు చెల్లించడంలో కాస్త ఇబ్బంది ఎదురైంది. వారు పలుమార్లు అడిగిన చెల్లించే స్తోమత లేక కాస్త సమయం కోరడంతో కుదరదన్న స్కూల్ యాజమాన్యం అమానుష చర్యకు దిగింది. అందరూ చూస్తుండగానే ఆ స్కూల్లోని ఓ టీచర్ ఆ ఇద్దరు పిల్లల దుస్తులు విప్పించేసి బయటకు తోసేశాడు. ఏడుస్తూ వీధుల వెంట నడుస్తున్న ఆ చిన్నారులను అక్కున చేర్చుకొని ఓ వ్యక్తి వారికి వస్త్రాలు ఇచ్చాడు. ఈ ఘటనపై వారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్కూల్ ప్రిన్సిపాల్‌ను, టీచర్‌ను మరో వ్యక్తిని అరెస్టు చేశారు. బిహార్‌లో ఇలాంటి ఘటనలు కోకొల్లలు కాగా అప్పుడప్పుడు ఆత్మహత్యలు కూడా చోటు చేసుకుంటుంటాయి. -
ఆంగ్ల బోధన అక్కర్లేదా..?
► ముందుకు రాని గురువులు ► ప్రైవేటు వైపు తల్లిదండ్రుల చూపు ► నియోజకవర్గంలో దరఖాస్తులు చేసుకున్నది రెండు పాఠశాలలు ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో విద్యాబోధన సాగుతోందని ప్రభుత్వం ప్రచారానికి పోవడమే తప్పా అమలులో మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్ల విద్య బోధించాల్సి ఉన్నప్పటికీ కొందరు గురువులు ముందుకు రావడం లేదు. దీంతో ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువు ప్రారంభించేందుకు ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. నియోజకవర్గంలో కేవలం రెండు పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేందుకు దరఖాస్తులు చేసుకోవడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గుతుండడం, పలుచోట్ల మూతపడటం, తల్లిదండ్రుల డిమాండ్ నేపథ్యంలో సర్కారు బడులు కాపాడేందుకు ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గతేడాది ఒక్క ప్రభుత్వ పాఠశాలకు కూడా ఆంగ్ల మధ్యమం కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ సంవత్సరం కేవలం రెండు పాఠశాలలు మాత్రమే ముందుకొచ్చాయి. ఆంగ్ల బోధన చేసేందుకు గురువులు ముందుకు రాకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ముందుకురాని గురువులు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం బోధించి సర్కారు బడులు కాపాడుకోవాల్సి ఉండగా, ఆ దిశగా ఉపాధ్యాయులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. ఇతర జిల్లాల్లో ఆంగ్ల మాధ్యమం పాఠశాలలు ప్రారంభమవుతుండగా, ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇంగ్లిష్ మీడియం కోసం ప్రతిపాదనలు రావడం లేదని విద్యాశాఖ అధికారులు ³ర్కొంటున్నారు. ఇప్పటికైనా అవకాశం విద్యా సంవత్సరం పున:ప్రారంభానికి మరో వారం రోజుల గడువు ఉంది. ప్రభుత్వం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలనే నిబంధన లేనప్పటికీ సర్కారు బడులు కాపాడుకోవాల్సిన ఉపాధ్యాయులు ఇప్పటికైనా ముందడుగు వేయాలని పలువురు పేర్కొంటున్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ, జీపీల తీర్మానాలు వేర్వేరుగా చేసి విద్యా శాఖకు పంపించాల్సి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంపై ఉపాధ్యాయులు ఔత్సాహికంగా లేకపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. తీర్మానం పంపిన పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించుకోవచ్చు. పై తరగతులు వెళ్లిన కొద్ది ఇంగ్లిష్ మీడియంలో చదువుతారు. మూతబడుతున్న సర్కారు బడులు ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగడం, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆంగ్ల విద్యనందించాలనే ఉద్దేశంతో రోజురోజుకు సర్కారు బడుల పరిస్థితి దారుణంగా మారుతోంది. కారణం ఏదైనా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కార్ బడులకు పంపడానికి మొగ్గు చూపడం లేదు. ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్లమాధ్యమం లేకపోవడమే కారణం. నియోజకవర్గంలో విద్యార్థుల సంఖ్య పది కంటే తక్కువగా ఉన్న పాఠ శాలలు 10 వరకు ఉన్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోనే ఒక్క విద్యార్థి లేకపోవడంతో రెండు పాఠశాలలు ఇప్పటికే మూతపడ్డాయి. భవిష్యత్‌లో సర్కారు బడులకు తాళాలు పడే పరిస్థితులు లేకపోలేదని పేర్కొంటున్నారు. -
జూన్ నుంచి స్కూల్ ఫీజుల నియంత్రణ
29న స్కూల్ ఫీజుల కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటినుంచే ఫీజుల నియంత్రణను అమలు చేసేలా ప్రభుత్వానికి సిఫా రసు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం పాఠ శాల విద్యాశాఖ కార్యాలయంలో యాజమాన్యాలు, తల్లి దండ్రులతో కమిటీ సమావేశం నిర్వహించింది. యాజమాన్యాలు తాము మరిన్ని ప్రతిపాదనలు అందజేస్తామని, ఇందుకు సమయం కావాలని కోరాయి. ఈ నెల 25న సాయంత్రం 4లోగా ప్రతిపాదనలు అందజేయాలని కమిటీ యాజమాన్యాలకు సూచించింది. ఈ నెల 29న నివేదిక ను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. యాజమాన్యాలు ఇప్పటికే ఎక్కువ ఫీజులను వసూలు చేసి ఉంటే వాటిని తర్వాత సర్దుబాటు చేసేలా చర్యలు చేపట్టాలన్న ఆలోచనకు వచ్చింది. జిల్లా స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీని (డీఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా రిటైర్డ్ జడ్జి లేదా ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి లో పని చేసిన రిటైర్డ్ అధికారిని డీఎఫ్ఆర్సీ చైర్మన్‌గా నియమించేలా సిఫారసు చేస్తున్నట్లు తెలిసింది. -
విద్యార్థులపై ‘ప్రత్యేక’ ఒత్తిడి
సూర్యాపేట : రవికృష్ణ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు రావడంతో అమ్మమ్మ ఊరికి వెళ్లాలని ఫోన్ చేశాడు. ఇంతలోనే స్కూల్ నుంచి రవికృష్ణ తల్లికి ఫోన్వచ్చింది. వేసవి సెలవుల్లోనే పదో తరగతికి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతున్నాయి. ఫలానా తేదీ నుంచి పంపండి.. మీ పిల్లాడు రాకపోతే వెనుకబడిపోతాడు. మీ ఇష్టం అంటూ చెప్పారు. తల్లిదండ్రులు కుమారుడ్ని ఊరికి పంపకుండా పాఠశాలకు పంపేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది రవికృష్ణ ఒక్కడిదే బాధే కాదు.. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట పట్టణాల్లోని చాలా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పిల్లల పరిస్థితి ఇదే. మానసిక ఆనందాన్ని కోల్పోతున్న పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన పోటీతత్వం పెరగడంతో రోజూ తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు చదువు అంటూ పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మానసిక ఆనందాన్ని కోల్పోతూ యాంత్రికంగా మా రిపోతున్నారు. కనీసం సెలవు రోజుల్లోనైనా ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపే అవకాశాలు కూడా కరువవుతున్నాయి. పాఠశాల యజమాన్యాలు చెప్పిన విధంగానే తల్లిదండ్రులు మద్దతిస్తూ.. పిల్లలను ఆటపాటలకు దూరం చేస్తున్నారు. పట్టింపులేని అధికారులు మామూలుగానే సెలవు రోజుల్లో విద్యాశాఖాధికారులు, ఇటు ఇంటర్ అధికారులకు తెలిసినా స్పందించిన దాఖలాలు లేవు. పేరుకే సెలవులు కానీ పనిచేస్తున్న పాఠశాలలే ఎక్కువగా ఉన్నాయి. జూనియర్ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి జూనియర్ కళాశాలల విద్యార్థులకు మే 31 వరకు సెలవులు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని ప్రభుత్వం జీఓ కూడా విడుదల చేసింది. ఈ నిబంధనలను ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలు బుట్టదాఖలు చేస్తున్నాయి. -
నో బెస్ట్ ఫ్రెండ్స్.. ప్రైవేటు స్కూల్‌కు ప్రిన్స్!
బ్రిటన్ బుజ్జీ రాకుమారుడు జార్జ్ త్వరలో ప్రైవేటు పాఠశాలలో చేరబోతున్నాడు. ఈ పాఠశాల ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ తమ విద్యార్థులు ఉత్తమ మిత్రులను కలిగి ఉండటాన్ని నిరుత్సాహపరుస్తారు. 'దయతో ఉండాలన్నది' ఈ స్కూల్ మొదటి నిబంధన కాగా.. బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోవడమే మంచిది అనేది ఇక్కడి సిద్ధాంతం. బ్రిటన్ రాజవంశం నివాసముండే కేన్సింగ్టన్ ప్యాలెస్‌కు కొద్దిమైళ్ల దూరంలో ఉన్న థామస్ బ్యాటర్‌సీ పాఠశాలలో ప్రిన్స్ జార్జ్ చేరబోతున్నాడు. వచ్చే సెప్టెంబర్ నుంచి అతను బడికి వెళ్లబోతున్నాడని ఇప్పటికే కేన్సింగ్టన్ ప్యాలెస్ ట్విట్టర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ స్కూల్లో నాలుగు నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన 540 మంది బాలబాలికలు చదువుతున్నారు. పిల్లల సత్ప్రవర్తనపై ప్రధానంగా శ్రద్ధ పెట్టే ఈ స్కూల్లో విద్యార్థులు బెస్ట్ ఫ్రెండ్స్ కలిగి ఉండటాన్ని మాత్రం నిరుత్సాహ పరుస్తారు. బెస్ట్‌ఫ్రెండ్స్‌గా ఉండి.. ఉన్నత చదువుల కోసం వారి నుంచి వెళ్లిపోయే సమయంలో చిన్నారుల హృదయాలలో వెలిభావన ఏర్పడి.. గాయపడుతాయనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. -
ఫీజు కట్టలేదని ప్రైవేట్ స్కూల్ అరాచకం
-
‘ఫీజుల నియంత్రణ’ గాలికి?
♦ రెండు నెలలు దాటినా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ప్రతిపాదనలు ♦ ప్రైవేట్ పాఠశాలల్లో కొనసాగుతున్న ప్రవేశాలు ♦ 20 శాతం వరకు ఫీజులు పెంపు ♦ పట్టించుకోని అధికారులు.. ఈనెల 21 నుంచే స్కూళ్లు సాక్షి, హైదరాబాద్: అంగట్లో సరుకైన అక్షరం.. ఫీజుల దందాలో చదువుల తల్లి బందీ.. ప్రైవేట్ పాఠశాలల ఫీ‘జులుం’... విద్యార్థులు చదువు‘కొనలేక’ విలవిల... తల్లిదండ్రుల అగచాట్లు... కొత్త ఆశలు, కొంగొత్త ఆకాంక్షలతో ఏర్పడిన కొత్త రాష్ట్రంలోనూ కనుమరుగుకాని కష్టాలివీ. ఏటా ప్రవేశాల సమయం రాగానే యాజమన్యాలు భారీగా ఫీజులు పెంచడం.. తల్లిదండ్రులు ఆందోళన చేయడం పరిపాటిగా మారింది. ఫీజుల నియంత్రణకు ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయ వివాదాలతో సంవత్సరాలు గడిచిపోతు న్నాయి. ఈ నెల 21 నుంచి 2017–18 విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈసారి వృత్తి విద్యా కాలేజీల తరహాలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆమోదానికి రెండు నెలల కిందటే పంపించింది. ఫైలు కదలదు. సర్కార్‌లో ఉలుకూపలుకూ ఉండదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులపై యాజమాన్యాలు మళ్లీ భారాన్ని మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అనేక పాఠశాలలు 10 శాతం నుంచి 20 శాతం ఫీజులను పెంచుతున్నామని తల్లిదండ్రులకు సమాచారమిచ్చాయి. మరోవైపు విద్యాశాఖ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేయకముందే ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యంగా ప్రవేశాలను చేపడుతున్నాయి. తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి డొనేషన్ల వసూళ్లను ప్రారంభించాయి. నియంత్రణ ఉత్తర్వులు వస్తే... రాష్ట్రంలో 42 వేల పాఠశాలల్లో 60.61 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, 11,470 ప్రైవేటు స్కూళ్లలో 31.28 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇప్పటివరకు వారినుంచి ప్రైవేటు పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులకు శాస్త్రీయత అంటూ లేదు. యాజమాన్యాలు చెప్పిందే ఫీజు. ఇస్తేనే సీటు అన్న తీరు కొనసాగుతోంది. కిందటి సంవత్సరంలో పాఠశాల యాజమాన్యం టీచర్లు, సిబ్బందికి ఇచ్చిన వేతనాలు, టీచర్ల సంక్షేమం, సదుపాయాలు, నిర్వహణకు వెచ్చించిన ఖర్చుల ఆధారంగా స్కూల్ ఫీజులను ఖరారు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. తద్వారా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజులు భారం తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు.. ⇔ ఏ రకమైన పేరుతోనూ యాజమాన్యం డొనేషన్, వన్‌టైం ఫీజు వసూలు చేయడానికి వీల్లేదు. ⇔ వన్‌టైమ్ ఫీజు కింద దరఖాస్తు ఫీజు రూ.100 లోపు ఉండాలి. ⇔ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 లోపే ఉండాలి. ⇔ తిరిగి చెల్లించే (రిఫండబుల్) విధానం కింద రూ. 5 వేలలోపే కాషన్ డిపాజిట్ ఉండాలి. ⇔ ఆ మొత్తాన్ని కూడా పాఠశాల యాజమాన్యం డీఎఫ్‌ఆర్‌సీకి సమర్పించాలి. వాస్తవానికి ఫీజులను ఖరారు చేసేందుకు టీచర్లు, సిబ్బంది వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, నిర్వహణ ఖర్చులు, వసతులు, సదుపాయాలు, స్పెషల్ ఫీజులకు సంబంధించిన ప్రతిపాదనలు యాజమాన్యాలు జిల్లా ఫీజుల నియంత్రణ (డీఎఫ్ఆర్సీ)కమిటీకి అందజేయాలి. వాటిని డీఎఫ్ఆర్సీ పరిశీలించిన 60 రోజుల్లోగా ప్రభుత్వానికి సిఫారసులు చేయాలి. ప్రభుత్వం జనవరి కల్లా వాటిని ఖరారు చేస్తుంది. మార్చి 21 నుంచి ప్రారంభం అయ్యే విద్యా సంవత్సరంలో ఆ ఫీజులనే వసూలు చేయాలి. ప్రభుత్వ నిర్దేశిత ఫీజుకు మించి వసూలు చేస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తారు. -
ఒకే ఒక్కడు...!
రాజు తలచుకుంటే... అన్నట్లుగా తయారైంది జిల్లా విద్యాశాఖ తీరు. జిల్లాలోని కీలకనేత అండతో విద్యాశాఖపై ఓ అధికారి సర్వం తానై చక్రం తిప్పుతున్నారు. పదోన్నతిపై బదిలీ అయినా, ఇక్కడ కుర్చీని మాత్రం వదలకుండా వ్యవహారం నడుపుతున్నారు. అప్పుడప్పుడు కీలక నేతకు‘ముట్టజెబుతూ’... సీఎం పాల్గొనే కార్యక్రమాలకు విద్యార్థులను బలవంతంగా తరలిస్తూ చక్రం తిప్పుతున్నారు. డైరెక్టరేట్‌కు బదిలీ అయినా నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు జిల్లా బాధ్యతలూ కట్టబెట్టేశారు. సాక్షి, అమరావతి బ్యూరో : ఆ అధికారి ఇటీవల వరకు జిల్లా విద్యాశాఖలో రెండు పోస్టులు నిర్వహించారు. ఓ కీలక రెగ్యులర్ పోస్టుతోపాటు మరో పోస్టుకు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఇటీవల రాష్ట్రస్థాయి అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ చేసిన బదిలీల్లో ఆ అధికారికి స్థానం లభించింది. కాకపోతే కాకినాడలో కీలక పోస్టింగు ఆశించారు. ఆ పరిధిలో ఐదు జిల్లాలు ఉండటంతో చక్రం తిప్పొచ్చని భావించారు. అందుకు జిల్లాలో పెత్తనం చెలాయిస్తున్న ప్రభుత్వ పెద్ద ద్వారా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. విద్యాశాఖలో కీలక నేత అండదండలతో ఉత్తరాంధ్రకు చెందిన ఓ అధికారి ఆ పోస్టు దక్కించుకున్నారు. దాంతో జిల్లాలోని అధికారికి విజయవాడలోని విద్యాశాఖ డైరెక్టరేట్‌లో పోస్టింగు ఇచ్చారు. పదోన్నతిపై డైరెక్టరేట్‌లో విధుల్లో చేరినప్పటికీ అది లూప్‌లైన్ పోస్టింగుగానే భావించారు. ఎందుకంటే కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలతో నేరుగా వ్యవహారాలు సాగించడానికి అవకాశం లేని పోస్టు అది. మరోవైపు ఓ మహిళా అధికారిని జిల్లా విద్యాశాఖ లో ఇన్చార్జిగా నియమించారు. దాంతో ఆ అధికారి కలవరపడ్డారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు, అదనపు సెక్షన్లు, ఇతరత్రా కీలక ఫైళ్లు కదిలే తరుణమిదే... ఇలాంటి సమయంలో లూప్లైన్కు పరిమితమైపోయి జిల్లా కార్యాలయంలో లేకుంటే ఎలా అని ఆయన ఆందోళన చెందారు. కీలక నేత అండదండలు ఆ అధికారి వెంటనే జిల్లాలో కీలక నేతను ఆశ్రయించారు. తనకు కాకినాడలో కోరుకున్న పోస్టింగు ఇవ్వ లేదు... కాబట్టి తనకు కనీసం జిల్లా విద్యా శాఖపై పట్టు సడలకుండా చూడాలని కోరారు. తను ఏటా ఆయన్ని తగినరీతిలో ‘సంతృప్తిపరుస్తున్న’ విధానాన్ని కొనసాగిస్తానని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి జిల్లాలో తరచూ పాల్గొనే కార్యక్రమాలకు అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులను తరలిస్తూ సహకరిస్తున్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. దాంతో కీలక నేత పునరాలోచనలో పడ్డారు. అన్ని కార్యక్రమాలకు విద్యార్థుల తరలింపు, ప్రైవేటు పాఠశాలల నుంచి వాహనాలు సమకూర్చడం వంటి పనులన్నీ చేస్తున్న ఆయన పట్ల సానుకూలంగా స్పందించారు. సీఎం చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలకు భారీగా విద్యార్థులు లేకపోతే తాను మాట పడాల్సి వస్తుందని కూడా భావిం చారు. మరోవైపు తనను ‘సంతృప్తి’పరుస్తునే ఉన్నారు కదా అని అనుకున్నారు. ఆమె విధుల్లో చేరనే లేదు... మళ్లీ ‘సారు’కే పెత్తనం కీలక నేత వెంటనే జిల్లా ఇన్చార్జి అధికారిగా నియమితులైన మహిళా అధికారిని విధుల్లో చేరవద్దని సమాచారం పంపారు. ఆపై రెండురోజులకే తనను సంతృప్తి పరుస్తున్న ఆ అధికారినే జిల్లాలో ఇన్చార్జిగా కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. విద్యాశాఖ డైరెక్టరేట్‌కు పదోన్నతిపై వెళ్లిపోయిన తరువాత జిల్లా కార్యాలయంలో బాధ్యతలు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. మరో అధికారిని రెగ్యులర్‌గా కానీ, ఇన్చార్జిగా గానీ నియమించడం సంప్రదాయం. అందుకు విరుద్ధంగా ఆ అస్మదీయ అధికారికే పెత్తనం కట్టబెట్టేశారు. దీనిపై విద్యాశాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
పెరిగిన పాఠ్య పుస్తకాల ధరలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల్లోని 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సేల్ పాఠ్య పుస్తకాల ధరలు పెరిగాయి. పుస్తకాల ముద్రణకు వినియోగించే పేపరు ధరలు పెరగడంతోనే పుస్తకాల ధరలు పెంచాల్సి వచ్చిందని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సేల్ పుస్తకాల ముద్రణ ప్రారంభమైందని, వచ్చే నెల 21 నుంచి పైతరగతుల బోధన ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈ నెల 15 లోగా మార్కెట్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గతేడాది ముద్రించిన పుస్తకాల్లో 9 లక్షల వరకు మిగిలిపోవడంతో, సోషల్ స్టడీస్ (ఈసారి సోషల్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని పాఠాలు, భౌగోళిక స్వరూపాలు మార్పు చేశారు) మినహా మిగతా పాఠ్య పుస్తకాలను విక్రయించేందుకు విద్యా శాఖ అనుమతిచ్చినట్లు తెలిసింది. -
ప్రైవేట్ స్కూల్లో ర్యాగింగ్ భూతం
-
స్కూల్లో కొడుకు మృతి.. పేరెంట్స్ ఆత్మహత్య
గుంటూరు: కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన ఆదివారం గుంటూరులో చోటుచేసుకుంది. గుంటూరు పట్టణం పట్టాభిపురానికి చెందిన చంద్రశేఖర్, నవీన దంపతుల కుమారుడు వంశీ శ్రీ చైతన్య టెక్నోస్కూల్లో చదువుతున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట జ్వరం రావడంతో పాఠశాలలోనే మృతిచెందాడు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం చాలా ఆలస్యంగా పేరెంట్స్‌కు తెలియజేసింది. వంశీ మృతికి కారణాలు తెలియకపోవడం, మరోవైపు కుమారుడు లేడన్న బాధతో మనస్తాపానికి లోనైన వారు జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు చిన్న వయసులో మృతిచెందడంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వంశీ తల్లిదండ్రుల మరణవార్తను తెలుసుకున్న విద్యార్థి సంఘాలు న్యాయం కోసం ఆందోళన చేపట్టాయి. వంశీ మృతితో పాటు అతడి పేరెంట్స్ బలవన్మరణానికి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యమే కారణమని, వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని విద్యార్థి డిమాండ్ చేశాయి. అకారణంగా కొడుకు మరణించడంతో జీవితంపై విరక్తి చెందిన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. విద్యార్థి సంఘాలు చేపట్టిన ఈ ఆందోళనకు వైఎస్ఆర్సీపీ నేతలు, సీపీఎం నేతలు మద్ధతు తెలిపారు. -
స్కూల్లో కొడుకు మృతి.. పేరెంట్స్ ఆత్మహత్య
-
7నుంచి ఏపీ స్కూళ్లకు సంక్రాంతి సెలవులు!
అకడమిక్ క్యాలెండర్‌కు స్వల్ప మార్పు సాక్షి, హైదరాబాద్: ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు జనవరి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. అధికారవర్గాల సమాచారం ప్రకారం 2016–17 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌కు స్వల్ప మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం 2017 సంవత్సరానికి సంబంధించిన సెలవులను ఇటీవల అధికారికంగా ప్రకటించడంతో దీనిపై పాఠశాల విద్యాశాఖ అకడమిక్ వింగ్ కసరత్తు చేస్తున్నట్లు అధికారవర్గాలు వివరించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం జనవరి 7 నుంచి 15 వరకు సెలవులు ప్రకటించే అవకాశముందని విద్యాశాఖవర్గాలు తెలిపాయి. -
బంజారాహిల్స్ ప్రైవేటు స్కూల్లో విషాదం!
హైదరాబాద్: బంజారాహిల్స్‌కు చెందిన ఓ ప్రైవేటు పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూలు విద్యార్తులు అనంతగిరికి విహారయాత్రకు వెళ్లగా.. తొమ్మిదో తరగతి చదువుతున్న సర్ఫరాజ్ అనే విద్యార్థి నీళ్లలో మునిగి ప్రాణాలు విడిచాడు. ఆసల్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సర్ఫరాజ్‌ది బంజారాహిల్స్ జహీరానగర్. అతని మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై మండిపడుతున్నారు. -
‘స్కూళ్లను స్వాధీనం చేసుకున్నా అభ్యంతరం లేదు’
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ ప్రత్యక్ష, పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశా లల యాజమాన్యాల సంఘాలు శుక్రవారం విడుదల చేసిన ఓ సం యుక్త ప్రకటనలో పే ర్కొన్నాయి. గురువారం ఫీజల నియంత్రణ విషయంపై నిర్వహించిన సమా వేశంలో కిషన్ బెదిరింపు ధోరణిని ప్రదర్శించారని యాజమాన్య సంఘాల ప్రతినిధులు ఎస్.శ్రీని వాస్‌రెడ్డి, శేఖర్‌రావు, ఎస్‌ఎన్‌రెడ్డి, పాపిరెడ్డి తెలిపారు. నోట్లరద్దుతో ఎదురవుతున్న సమస్యలతోపాటు ఆర్థిక సమస్యలతో పలు ఇబ్బందు లు పడుతున్నామని డైరెక్టర్‌కు మనవి చేశామని అయితే, ఈ సందర్భం గా ‘మీరు నడపలేకపోతే మీ బడుల ను స్వాధీన పరచుకొని నేనే నడపుతాన’ని తమను బెదిరిం చినట్లు పేర్కొన్నారు. మా బడులను స్వాధీ న పరుచుకుంటే తమకేం అభ్యంతరం లేదని తెలిపారు. విద్యారంగంలో అనుభవంలేని కిషన్ వల్ల విద్యారంగానికి పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని నిరసిస్తున్నామని తెలిపారు. -
అక్టోబర్ 27 నుంచి ఎస్ఏ-1 పరీక్షలు
- 29వ తేదీ నాటి పరీక్ష 31న నిర్వహణ - ఎస్ఏ-1 పరీక్షల్లోనూ 9, 10 తరగతులకు 11 పేపర్లు - పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వచ్చే నెల 27 నుంచి నవంబర్ 3 వరకు సంగ్రహణాత్మక మూల్యాంక నం (ఎస్ఏ-1) పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 29 న నరక చతుర్దశి (ఐచ్ఛిక సెలవు) అయినందున 29న నిర్వహించాల్సిన పరీక్షను 31వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు. మారిన షెడ్యూల్ ప్రకా రం పరీక్షలు నిర్వహించాలని డీఈవోలను ఆదేశించారు. 5వ తేదీన కచ్చితంగా ఫలితాలను విద్యార్థులకు వెల్లడించాలని చెప్పారు. అదేరోజు తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలతో సమావేశాలు నిర్వహించి ప్రోగ్రెస్ కార్డులను (క్యుములేటివ్ రికార్డులు) అందజేయాలని సూచించారు. విద్యార్థులు ప్రోగ్రెస్ కార్డులపై సంతకాలు తీసుకొని 7లోగా టీచర్లు లేదా ప్రధానోపాధ్యాయులకు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వారికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6,7,8 తరగతుల వారికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలని వివరించారు. ఒకటి నుంచి 7వ తరగతి వారికి మొదటి రోజు ప్రథమ భాషతో పరీక్షలు ప్రారంభించాలని, 8, 9, 10 తరగతుల వారికి గణితంతో పరీక్షలు ప్రారంభించాలని చెప్పారు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో(సీసీఈ) భాగంగా ఎస్ఏ-1 పరీక్షల్లోనూ 9, 10 తరగతుల విద్యార్థులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
వాగు దాటితేనే చదువు..
వేమనపల్లి: ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన విద్యార్థులు చదువు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వీరు చదువుకోవాలంటే నీల్వాయి వాగు దాటాల్సివస్తోంది. నీల్వాయిలో ప్రాథమిక పాఠశాల ఉన్నా.. ఉపాధ్యాయుల పనితీరు సరిగా లేదు. దీంతో సుమారు 26 మంది పిల్లలు నీల్వాయి వాగు అవతలి వైపు ఉన్న గొర్లపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీల్వాయివాగులో తాత్కాలిక వంతెన కోతకు గురైంది. మూడు రోజులుగా నాటు పడవలతో వాగు దాటారు. శుక్రవారం వాగులో నీటి ప్రవాహం కొంత మేరకు తగ్గింది. పిల్లలు దీంతో మోకాలు లోతు నీటిలో వాగు దాటి పాఠశాలకు వెళ్లారు. ప్రతిరోజు మార్గమధ్యలో ఉన్న నీల్వాయి వాగు దాటి మూడు కిలోమీటర్ల దూరంలోకి గొర్లపల్లికి వెళ్లాల్సి వస్తోంది. వాగు వద్ద ఎవరైనా ఒకరు ఉండి పిల్లలను తీసుకెళ్లడం, తీసుకురావడం మామూలే. -
'రాజస్థాన్‌లో స్కూల్ టీచర్ల దాష్టీకం'
-
మాక్ ఒలంపిక్స్
రామచంద్రాపురం: రియో ఒలింపిక్స్ సందర్భంగా తీసుకొని మండల పరిధిలోని వెలిమెల గ్రామంలోని గాడియం ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం మాక్ ఒలింపిక్స్ క్రీడాపోటీలను నిర్వహించారు. కార్యక్రమాన్ని పాఠశాల అడ్మిన్ సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్ కీర్తిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పలు పోటీలు నిర్వహించారు. ఒలింపిక్స్‌కు సంబంధించిన విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారిణి అర్చన మాట్లాడుతూ రియో ఒలింపిక్స్ ఎలా ప్రారంభమయ్యాయే అదే మాదిరిగా ఇక్కడ కూడా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ కీర్తిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. క్రీడల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఒలింపిక్స్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఒలింపిక్స్ జ్యోతిని సీఎస్ రెడ్డి వెలిగించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమ తదితరులు పాల్గొన్నారు. (ఒక్కటే ఫొటో) రియో ఒలంపిక్స్, మాక్ ప్రోగ్రామ్, రామచంద్రాపురం 06పీటీసీ24: క్రీడాకారి అర్చనకు పుష్పగుచ్చం అందజేత -
‘ప్రైవేటు’కు పంపితే పథకాలు కట్
మద్దూరు: గ్రామంలో ఎవరైనా ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తే.. వారి ఇంటికి నల్లా కనెక్షన్ తొలగించడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందకుండా చూడాలని వరంగల్ జిల్లా మద్దూరు మండలం లింగాపూర్ గ్రామస్తులు నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం కోసం స్వచ్ఛందంగా ఏడాదికి రూ.3 వేల చొప్పున విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గ్రామస్తులు సర్పంచ్ సందిటి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశమయ్యారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌మీడియం లేనందున పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నామని, ఇంగ్లిష్ మీడియం ఉంటే ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. సుమారు 40 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఏడాదికి రూ. 3 వేల చొప్పున విరాళం ఇవ్వాలని, ఆ మొత్తంతో ఇంగ్లిష్ మీడియం బోధనకు విద్యావలంటీర్‌ను నియమించాలని తీర్మానించారు. -
‘ఏకరూప’త ఏదీ?
♦ యూనిఫారాలకు పంపని ప్రతిపాదనలు ♦ పాత దుస్తులతోనే విద్యార్థుల బడిబాట ♦ ప్రైవేటుతో పోటీ అంటే ఇదేనా? ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. ఫలితాలే కాదు వసతులు, పాఠ్యాంశాల బోధన.. ఇలా ఎందులోనూ తేడా రాకుండా చూస్తాం... అంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పించింది. అయితే ఇవన్నీ ఒట్టిమాటలేనని తేలిపోయింది. పాఠశాలలు పునఃప్రారంభమైనా ఇప్పటివరకు యూనిఫారాలకే దిక్కులేదు. క్రమశిక్షణతోపాటు పాఠశాలలో చదివే పిల్లలంతా సమానమని తెలియజేసే ఏకరూప దుస్తుల పంపిణీ ముచ్చటే లేదు. ఇప్పటివరకు ప్రతిపాదనలే సిద్ధం కాలేదంటే అవి ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియని పరిస్థితి. యూనిఫారాల వద్దే విద్యాశాఖ బోల్తా పడిందంటే మిగతా విషయాల్లో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు ఎక్కడ పోటీపడుతుందో పాలకులకు, అధికారులకే తెలియాలి. సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందుకుగాను 7 లక్షల యూనిఫారాలు అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా జూన్ 12లోగా స్కూల్ యూనిఫారాల వివరాలను తీసుకునేది. కానీ తొలిసారిగా జూన్ ఒకటి నుంచే స్కూలు యూనిఫారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు గతంలో రెండోతరగతి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రం స్కూలు యూనిఫారాలను ప్రభుత్వం ఇచ్చేది. కానీ తాజాగా ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫారాలను ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారనే విషయమై అధికారులు ఇంతవరకు అంచనాకు రాలేకపోయారు. ఎన్ని యూనిఫారాలు అవసరమో కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది 2.54 లక్షల మంది విద్యార్థులకు 5.09 లక్షల యూనిఫారాలు అందజేయడానికి అవసరమైన క్లాత్ సరఫరా కోసం ఆప్కోకు అనుమతి ఇచ్చింది. క్లాత్‌ను సరఫరా చేసిన అనంతరం స్థానిక మహిళా సంఘాలు, పలు ప్రైవేటుఏజెన్సీలకు కుట్టడానికి ఇచ్చారు. కానీ ఈ విద్యా సంవత్సరం మాత్రం అధికారులు కనీసం యూనిఫారాలకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు?, క్లాత్ ఎంత అవసరం అనే ప్రతిపాదనలు సిద్ధం చేయలేకపోయారు. మరో వైపు గత ఏడాది మాదిరిగానే రెండోతరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2.17 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వారికి స్కూలు యూనిఫారాలు సరఫరా చేయడం కోసం ప్రతిపాదనలు తయారు చేసిన ప్రభుత్వం ఈసారి ఒకటో తరగతి విద్యార్థులకు కూడా యూనిఫారాలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపాదనలు పంపలేకపోయామని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా ఏటా పాఠశాలలు పునఃప్రారంభం కాగానే కొత్త పాఠ్యపుస్తకాలతోపాటు స్కూల్ యూనిఫారాలు అందజేసేది. ఈ సారి మాత్రం కనీసం ఎన్ని యూనిఫారాలు అవసరమున్నాయో కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేకపోయారు. దీంతో పాత దుస్తులతోనే విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ విషయంపై ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాషాను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేకపోయారు. -
బడి బస్సు.. తుస్సు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రయివేట్ పాఠశాలలంటే రవాణా శాఖకు ఎనలేని ప్రేమ. విద్యా సంవత్సరం ప్రారంభమయిందంటే బస్సుల విషయంలో ఎక్కడలేని హడావుడి చేసే ఈ శాఖ అధికారులు.. అసలు విషయం గాలికొదిలేస్తున్నారు. చేయి తడిపితే చాలు.. బస్సును చూడకుండానే ఫిట్నెస్ ముద్ర పడిపోతోంది. గతంలో చోటు చేసుకున్న స్కూల్ బస్సుల ప్రమాదాల దృష్ట్యా కూడా అధికారుల వైఖరిలో మార్పు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా కార్పొరేట్ పాఠశాలల బస్సులను చూసీచూడనట్లుగా వదిలేస్తున్న అధికారులు.. చిన్న పాఠశాలల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిట్నెస్ లేదని.. కొన్ని మరమ్మతులు చేయించుకు రావాలని అధికారులు చెప్పినప్పటికీ చాలా వరకు యాజమాన్యాలు పెడచెవిన పెడుతున్నాయి. ఇలాంటి బస్సుల్లో విద్యార్థులను ఎక్కించుకుని తిప్పుతున్నా రవాణా శాఖ మొద్దునిద్ర పోతోంది. జిల్లాలో ఇప్పటికీ 313 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లను పొందలేదంటే పరిస్థితి అర్థమవుతోంది. కనిపించని దాడులు జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి మొత్తం 1,092 బస్సులు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 779 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాయి. ఇందులో సగం బస్సుల్లో కూడా నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు సక్రమంగా లేని పరిస్థితి నెలకొంది. ఇక మిగిలిన 313లోనూ చాలా వరకు 15 సంవత్సరాలు దాటినవి.. కాలం చెల్లినవిగా గుర్తించారు. అయినప్పటికీ ఈ బస్సులు కూడా రోడ్లపై విద్యార్థులను ఎక్కించుకుని చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ బస్సులు పాఠశాలలకు విద్యార్థులకు తరలిస్తున్నాయా? లేదా అనే విషయంపై అధికారులు ఆరా తీయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫిట్నెస్ లేని బస్సులపై దాడుల విషయంలోనూ కొద్ది మంది అధికారులు ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు చేయలేదంటే.. సదరు అధికారులకు ప్రైవేటు బస్సులపై మోజుకు నిదర్శనంగా చెప్పవచ్చు. సహాయకుడు ఏడీ? రవాణా శాఖ నిబంధనల మేరకు ప్రతి పాఠశాలకు చెందిన బస్సులో ఒక సహాయకుడు ఉండాలి. అయితే, ఏ స్కూల్ బస్సులో చూసినా డ్రైవర్ మాత్రమే ఉంటున్నారు. సహాయకుడు లేకపోవడంతో బస్సు స్టేజీ వద్దకు వచ్చినప్పుడు భారీగా బరువున్న స్కూలు బ్యాగులతో చిన్న చిన్న తరగతులకు చెందిన పిల్లలు దిగలేకపోతున్నారు. ఒక్కోసారి బస్సులో నుంచి కిందపడిన సందర్భాలూ ఉంటున్నాయి. అదేవిధంగా పాఠశాల బస్సుతో పాటు ప్రతి రోజూ ఒక టీచర్ తోడుగా ఉండాలి. ఈ నిబంధన కూడా ఎక్కడా అమలుకు నోచుకోని పరిస్థితి. అయినప్పటికీ రవాణా శాఖ అధికారులు నోరుమెదపకపోవడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో కొద్ది మంది అధికారులకు మామూళ్లు ముడుతుండటమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడి బస్సుల విషయంలో ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఇంగ్లిష్ బాటలో సర్కారు బడి!
- ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలుకు సర్కారు చర్యలు - ఎల్కేజీ, యూకేజీ ఏర్పాటుకు ‘వయసు’ నిబంధన అడ్డు - ఈ ఏడాది ఒకటో తరగతిలో మాత్రమే.. ఏటా ఒక్కో తరగతి పెంపు - త్వరలో ప్రారంభించేందుకు విద్యాశాఖ సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రారంభించేందుకు సర్కారు చర్యలు చేపడుతోంది. ఎల్కేజీ(ప్రీపైమరీ) నుంచే ఇంగ్లిష్ మీడియం కావాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నా.. పిల్లల్ని బడిలో చేర్చుకునే వయసు నిబంధన నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి ప్రారంభిం చేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా ఒకేసారి ఇం గ్లిషు మీడియం ప్రవేశపెట్టకుండా.. ఈ ఏడాది ఒకటో తరగతిలోనే ప్రారంభించనుంది. వచ్చే ఏడాది రెండో తరగతిలో, ఆ తర్వాత మూడో తరగతిలో ఇలా ఏటా పెంచుకుం టూ అమలు చేయనుంది. మరోవైపు ఇంగ్లిష్ మీడియం బోధన కోసం మూడు దశల్లో తీర్మానం చేసి పంపితేనే ప్రారంభిస్తామన్న విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాల్లో డీఈవోలు చర్యలు చేపట్టారు. ‘సాక్షి’ జిల్లాల వారీగా సేకరించిన సమాచారం ప్రకారం... 3 వేలకు పైగా స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని డీఈవోలు లెక్కించారు. తల్లిదండ్రుల్లో నిరాశ: ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయం తల్లిదండ్రుల్లో నిరాశ నింపుతోంది. ఇంగ్లిష్ మీడియంను ఎల్కేజీ నుంచే (మూడేళ్ల వయసు నుంచే) ప్రారంభించాలని వారు కోరుతున్నారు. ‘బడి బాట’ సందర్భంగా క్షేత్రస్థాయిలో టీచర్లు అదే హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తామని బడిబాట కార్యక్రమంలో టీచర్లు హామీలు ఇచ్చారు. ఈ మేరకే వారు, తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు తీర్మానాలు చేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. ఇప్పుడు ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతోంది. తీర్మానాల మేరకే..: ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే తాము బోధిస్తామని టీచర్లు, ప్రధానోపాధ్యాయుడు... తమ పిల్లలను స్కూళ్లకు పంపిస్తామని తల్లిదండ్రులు.. ఇంగ్లిష్ మీడియం బోధనకు సిద్ధంగా ఉన్నామని, తగిన వనరులు, వసతులు ఉన్నాయని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు తీర్మానం చేయాల్సిందేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలని మూడు దశల్లో తీర్మానం చేయాలని, ఆ ప్రతిపాదనలు కూడా జిల్లా కలెక్టర్ల ద్వారా వస్తేనే... ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభిస్తామని నిబంధన విధించింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు వేలకు పైగా పాఠశాలల్లో తల్లిదండ్రులు, టీచర్లు, కమిటీలు తీర్మానాలు చేశారు. డీఈవోలు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రతిపాదనలను పాఠశాల విద్యా డెరైక్టర్ ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. అక్కడ ఆమోదం వచ్చాకే ఆయా పాఠశాలల్లో అధికారికంగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైనట్లు లెక్క. కొన్ని చోట్ల ఇతర తరగతుల్లోనూ.. కొన్ని చోట్ల ఒకటో తరగతిలో కాకుండా ఇతర తరగతుల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల 6వ తరగతిలో, మరికొన్ని చోట్ల 7వ తరగతిలో ఇంగ్లిష్ మీడియం కోసం చర్యలు చేపట్టారు. అయితే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు డెరైక్టరేట్‌కు అందలేదు. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియడం లేదు. గతంలోనూ విద్యాశాఖకు తెలియకుండా ఇంగ్లిష్ మీడియం బోధనను కొన్ని పాఠశాలల్లో ప్రారంభించారు. దీంతో టీచర్ల సమస్య తలెత్తింది. ఈసారి ఏం చేస్తారన్నది త్వరలోనే తేలనుంది. ప్రీప్రైమరీ సిలబస్‌పై దృష్టి ప్రైవేటు స్కూళ్లలో ప్రీప్రైమరీ విద్య ఉన్నందున ఆ సిలబస్‌ను రూపొందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అలాగే ప్రీప్రైమరీలో ఉపాధ్యాయ విద్యా కోర్సు ప్రారంభం, దాని సిలబస్ ఖరారుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 263 ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రీప్రైమరీ కోసం విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. ఏటా ఒక్కో తరగతిలో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ఒకేసారి అన్ని తరగతుల్లో కాకుండా ఏటా ఒక్కో తరగతిలో ప్రారంభిస్తూ వెళ్లాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 2016-17 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించనుంది. వచ్చే ఏడాది 2వ తరగతిలో, ఆపై మూడో తరగతిలో.. క్రమంగా ఇంగ్లిష్ మీడి యంను అన్ని తరగతులకు వర్తింపజేయాలని భావిస్తోంది. తల్లిదండ్రులు డిమాం డ్ చేస్తున్న ప్రీప్రైమరీ సెక్షన్ల ఏర్పాటు విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రైవేటు పాఠశాలల తరహాలో మూడేళ్ల వయసులోనే పిల్లలను స్కూల్లో చేర్చుకునేలా ఎల్కేజీ, యూకేజీ నుంచే కావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వ స్కూళ్లలో ప్రీప్రైమరీ ప్రారంభించాలంటే.. పిల్లలను బడిలో చేర్చుకునే వయసు నిబంధనను మార్పు చేయాలని, అది ఇప్పటికిప్పుడు సాధ్యం కానందునే ఒకటో తరగతి నుంచి ప్రారంభానికి చర్యలు చేపడుతున్నామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. -
ఏబీసీడీ.. ఫీజుల దాడి!
- ప్రైవేటు స్కూళ్లలో అడ్డగోలు ఫీజులు - శాస్త్రీయ విధానం లేకుండా ఏటేటా పెంపు - ఇష్టారాజ్యంగా కేపిటేషన్, డొనేషన్ల వసూళ్లు - ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ-టెక్నో పేర్లతో దందా - పట్టించుకోని విద్యాశాఖ.. కానరాని నియంత్రణ చర్యలు - జీవోలన్నీ బుట్టదాఖలు - యాజమాన్యాలకు ముకుతాడు వేసేదెప్పుడు: తల్లిదండ్రులు సాక్షి, హైదరాబాద్: సురేశ్‌కుమార్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగి. తన కొడుకు విశ్వాస్ను బాగా చదివించాలన్న కోరికతో గతేడాది ఓ కార్పొరేట్ స్కూల్లో చేర్పించాడు. రూ.65 వేల ఫీజు. యూనిఫారం, షూస్, పుస్తకాలు, రవాణా, ఇతరత్రా ఖర్చులన్నింటికీ మొత్తం లక్ష వరకు వెచ్చించాడు. ఈ ఏడాది విద్యార్థి పైతరగతికి వెళ్లాడు. ఫీజు రూ.85 వేలు చేశారు. అన్ని ఖర్చులు కలిపి రూ.1.35 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది! ► వరంగల్‌లో కాస్త పేరున్న ఓ ప్రైవేటు స్కూల్లో సుధీర్ తన కొడుకును గతేడాది ఒకటో తరగతిలో చేర్చాడు. రూ.25 వేల ఫీజు కట్టాడు. ఇప్పుడు రెండో తరగతికి వచ్చేసరికి స్కూలు యాజమాన్యం ఫీజు కింద రూ.35 వేలు చెల్లించాలంటోంది. ► కరీంనగర్‌లోని మరో ప్రైవేటు స్కూలు యాజమాన్యం గతేడాది మూడో తరగతికి రూ.22 వేలు వసూలు చేసింది. ఇప్పుడు రూ.30 వేలు కట్టాలంటోంది! ..ఒకట్రెండు కాదు.. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లన్నింటిదీ ఇదే దారి! ఏటేటా భారీగా ఫీజులు పెంచేస్తూ తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నాయి. అయినా పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఆశతో అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. ఒక విధానం అంటూ లేకుండా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ప్రతి సంవత్సరం అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నా వాటిని నియంత్రించే చర్యలు కానరావడం లేదు. ఫీజులపై అనేక ఫిర్యాదులు అందుతున్నా ఉన్నతాధికారులు ఒక్క స్కూల్‌పైనా చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు! ఇక ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి పేర్లతో ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షల్లో కేపిటేషన్ ఫీజులు, డొనేషన్లు గుంజుతున్నాయి. ‘మీ అబ్బాయికి సీటిస్తాం.. డొనేషన్ ఎంతిస్తారు..?’ అంటూ బేరమాడుతున్నాయి. స్కూళ్ల ఆగడాలు ఏటేటా పెరిగిపోతున్నా విద్యాశాఖకు పట్టడం లేదు. ప్రభుత్వమో, ఉన్నతాధికారులో.. చర్యలు చేపట్టాలని ఆదేశించినప్పుడే జిల్లా, క్షేత్రస్థాయి అధికారులు హడావుడి చేస్తున్నారు. వారైనా కఠినంగా వ్యవహరిస్తున్నారా అంటే అదీ లేదు! తనిఖీల పేరుతో పాఠశాలలకు వచ్చి యాజమాన్యాల వద్ద వసూళ్ల దందాకు దిగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజులపై నియంత్రణ ఏదీ? తెలంగాణలో 14,250 ప్రైవేటు పాఠశాలలున్నాయి. అందులో 32.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఇతర పట్టణ ప్రాంతాల్లోనే 9 వేల స్కూళ్లు ఉండగా.. వాటిలో 20 లక్షల మంది వరకు చదువుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో 91ని జారీ చేసింది. దాని ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో గవర్నింగ్ బాడీలను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డీఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేయాలి. పాఠశాల గవర్నింగ్ బాడీలు ప్రతిపాదించే ఫీజులను డీఎఫ్ఆర్సీ పరిశీలించి తుది ఫీజులను ఖరారు చేయాలి. వాటినే స్కూళ్లలో వసూలు చేయాలి. అందులోనూ గరిష్టంగా వసూలు చేయాల్సిన ఫీజులను పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏటా గరిష్టంగా రూ.24 వేలు, ఉన్నత పాఠశాలల్లో రూ.30 వేల ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులపై ప్రైవేటు పాఠశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. డీఎఫ్ఆర్సీల ఏర్పాటు సరిగ్గా లేదని 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం జీవో 91న పక్కన పడేసి జీవో 41, 42ను జారీ చేసింది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే ఏడాదికి గరిష్టంగా రూ.9 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,800 వసూలు చేయాలని పేర్కొంది. అలాగే ఉన్నత పాఠశాలల్లో పట్టణాల్లో రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10,800కు మించి వసూలు చేయవద్దని పేర్కొంది. అయితే ఆ జీవోపైనా యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో వాటి అమలు కూడా ఆగిపోయింది. దీంతో ఫీజుల నియంత్రణ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారింది. ఫీజులు ఆకాశంలో.. వసతులు పాతాళంలో.. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా.. చాలా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు, వసతులు అంతంతే ఉంటున్నాయి. అపార్ట్మెంట్లలో స్కూళ్ల నిర్వహణ, అగ్గిపెట్టెల్లాంటి తరగతి గదులు, శిక్షణ లేని ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాల కొరత మధ్య స్కూళ్లు సాగుతున్నాయి. 1 నుంచి ఐదో తరగతి క్లాసులు కూడా 2, 3, 4వ అంతస్తుల్లో నిర్వహిస్తుండడంతో బ్యాగుల మోతతో మెట్లెక్కలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. లంచ్ టైం కేవలం 30 నిమిషాలు ఇస్తున్నారు. మెట్లెక్కి, దిగే సరికే సగం టైం అయిపోతుండడంతో పిల్లలు సరిగా భోజనం చేయడం లేదు. నర్సరీ నుంచే ఐఏఎస్ పాఠాలా? నర్సరీ నుంచే ఐఏఎస్ శిక్షణ? అదేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే. వరంగల్‌లోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఐఐటీకే కాదు.. ఐఏఎస్‌కు సైతం నర్సరీ నుంచే శిక్షణ ఇస్తామంటూ ఫీజులు గుంజాయి. ఒక్కో విద్యార్థి నుంచి ఇందుకు రూ.2 వేల చొప్పున వసూలు చేశాయి. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ శాఖ ఇటీవల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ప్రముఖ పాఠశాలల్లో తనిఖీలు చేసింది. ఇందులో విస్తుగొలిపే వాస్తవాలు బయట పడ్డాయి. ఏసీ క్లాస్ రూమ్‌లు, ఐఐటీ ఫౌండేషన్ శిక్షణల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నట్లు తేలింది. వసూలు చేస్తున్న ఫీజులకు, విద్యాబోధనకు సంబంధం లేదని స్పష్టమైంది. ఆకర్షణీయమైన పేర్లతో గాలం ఐఐటీ ఫౌండేషన్ గతంలో ఆరో తరగతి నుంచి మొదలైతే ఇప్పుడు ఒకటో తరగతి నుంచే చెబుతామంటూ అనేక స్కూళ్లు వెలిశాయి. ఆడుతూ పాడుతూ ఓనమాలు దిద్దాల్సిన ప్రాయంలో వారి మానసిక స్థాయితో సంబంధం లేకుండా లక్షల ఫీజులు వసూలు చేస్తూ కోచింగ్‌లు మొదలుపెడుతున్నాయి. ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి ఆకర్షణీయమైన పేర్లతో తల్లిదండ్రులకు గాలమేస్తున్నాయి. ఇలా ఆకర్షణీయ పేర్లు పెట్టడానికి వీల్లేదని, వాటిని వెంటనే తొలగించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ గతంలో ఆదేశించినా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఆ జీవో అమలు ఎక్కడ? ప్రభుత్వం 1994లో జీవో నంబర్ 1 జారీ చేసింది. దీని ప్రకారం.. పాఠశాలకు ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం మొత్తాన్ని 100 శాతం అనుకుంటే.. అందులో 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయుల వేతనాలకు వెచ్చించాలి. మరో 15 శాతం నిధులను పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పనకు ఉపయోగించాలి. మరో 15 శాతం నిధులను పాఠశాల నిర్వహణకు వెచ్చించాలి. మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమం కోసం ఉపయోగించాలి. యాజమాన్యం కేవలం 5 శాతం నిధులను మాత్రమే లాభంగా తీసుకోవాలి. కానీ ఈ జీవో అమలు అటకెక్కింది. అసలు ఆ జీవోను పట్టించుకునేవారే లేరు. ఫలితంగా ఫీజులకు ఏటేటా రెక్కలు వస్తూనే ఉన్నాయి. అడ్డగోలు ఫీజుల ను నియంత్రించి, యాజమాన్యాలకు ముకుతాడు వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అనుమతి లేకుండా స్కూలు నడిపితే జైలుకే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేటు స్కూళ్లు నడిపినా.. ప్రీ ప్రైమరీ, కిండర్‌గార్టెన్, ప్లేస్కూల్ తరగతులను నిర్వహించినా ఆయా పాఠశాలలను సీజ్ చేస్తామని విద్యాశాఖ మరోసారి స్పష్టం చేసింది. దీనిని అతిక్రమిస్తే యాజమాన్యాలకు 6 నెలల జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. అనుమతి లేకుండా విద్యా సంస్థలు తరగతులను నిర్వహిస్తే విద్యా హక్కు చట్టం సెక్షన్ 18 ప్రకారం జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారని పేర్కొంది. ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు ప్రైవేటు పాఠశాలలకు జారీ చేసిన నోటీసుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అనుమతి కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన గడువు ఆదివారంతో ముగియనుంది. వారం రోజుల్లో విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు ప్రైవేటు యాజమాన్యాలు, ఇటు విద్యాశాఖ మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. స్పందన నామమాత్రమే.. ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, కిండర్ గార్టెన్, ప్లేస్కూల్ తరగతుల నిర్వహణకు అనుమతి తప్పనిసరని విద్యాశాఖ ఎన్ని హెచ్చరికలు చేసినా.. యాజమాన్యాల నుంచి నామమాత్రపు స్పందనే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 14,500 ప్రైవేటు పాఠశాలలుండగా.. అందులో ప్రీ ప్రైమరీ, కిండర్‌గార్టెన్ కోసం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నది 263 స్కూళ్లే. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 121 పాఠశాలలు నమోదు చేసుకోగా... విద్యాశాఖను పర్యవేక్షించే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సొంతజిల్లా వరంగల్ నుంచి ఒక్క పాఠశాల కూడా దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులకు అనుమతి తప్పనిసరి చేయొద్దని ప్రైవేటు యాజమాన్యాలు కోరుతుండగా... విద్యాహక్కు చట్టం ప్రకారం అనుమతి తప్పనిసరని సర్కారు పట్టుదలగా ఉంది. దీంతో అనుమతి కోసం రిజిస్ట్రేషన్ చేసుకోని పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యా శాఖాధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రస్థాయిలో ఆందోళన చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రైవేటు యాజమాన్యాల సంఘాలు నిర్ణయించాయి. చట్టాన్ని గౌరవించాల్సిందే.. ‘‘విద్యాహక్కు చట్టంలోని అంశాలను అన్ని పాఠశాలల యాజమాన్యాలు గౌరవించాల్సిందే. అనుమతి లేకుండా ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. నిబంధనల అమలుకు ప్రైవేటు యాజమాన్యాలు సహకరించాలి. ఇప్పటికే 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని అనుమతులు పొందిన పాఠశాలలు పాత అనుమతి పత్రాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. జీవో 91 ప్రకారం ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు, కరిక్యులం సిద్ధంగా ఉంది..’’ - కిషన్, పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ కొత్తగా అనుమతులెందుకు..? ‘‘ప్రైవేటు పాఠశాలల నిర్వహణ యాజమాన్యాలకు ఇప్పటికే భారంగా మారింది. ఒకసారి అనుమతి తీసుకున్న విద్యా సంస్థలు కింది తరగతుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనడం ఎంత మాత్రం సబబు కాదు. ప్రీప్రైమరీ తరగతులకు అనుమతి తప్పనిసరని భావిస్తే.. ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపుతో నడుస్తున్న పాఠశాలలన్నింటికీ దరఖాస్తు లేకుండానే అనుమతులు జారీ చేయాలి. అంతేగానీ జైలుకు పంపుతామని బెదిరిస్తే వెనుకాడం..’’ - ఎన్.శ్రీనివాస్‌రెడ్డి, గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) అధ్యక్షుడు -
సర్కారు టీచర్.. ప్రైవేట్‌కు ప్రచారం
- సొంత పాఠశాల ఫ్లెక్సీలు కడుతూ దొరికిన సారు - బడిబాట ప్రారంభం రోజే నిర్వాకం సిరిసిల్ల రూరల్: ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపించాలని కోరాల్సింది పోయి తనకు సంబంధించిన ప్రైవేట్ పాఠశాలకు ప్రచారం నిర్వహిస్తున్నాడు. అదీ కూడా ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం ముష్టిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణ భగవాన్‌కు సిరిసిల్లలో ఒక ప్రైవేట్ పాఠశాల ఉంది. తన భార్యను కరస్పాం డెంట్‌గా పేర్కొంటూ మొత్తం వ్యవహారాన్ని తానే నడిపిస్తుంటాడు. ముష్టిపల్లి, రాజీవ్‌నగర్‌లోని విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు రావాలని శనివారం ప్రచారం నిర్వహి స్తూ గ్రామంలో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా గ్రామస్తులు సెల్ఫోన్లో ఫొటోలు తీశారు. దీంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నాడు. కృష్ణభగవాన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని సర్పంచ్ గొల్లపల్లి బాలగౌడ్, ఎంపీటీసీ సభ్యుడు బుర్ర మల్లికార్జున్, విద్యా కమిటీ చైర్పర్సన్ లావణ్య తది తరులు ఎంఈవో రామచందర్‌రావుకు ఫొటోలను జతపరిచి ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయునికి ఎంఈవో షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఉపాధ్యాయుని తీరుపై నివేదిక అందించాలని డీఈవో ఆదేశించారు. ఈ విషయంపై కృష్ణభగవాన్‌ను ‘సాక్షి’ సంప్రదించగా, తాను ప్రచారం నిర్వహించలేదని, వార్తా రాయొద్దని కోరడం కొసమెరుపు. -
పాఠశాలల్లో ప్రవేశాలకు షెడ్యూలు జారీ
- ఫీజులపై మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి - పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థలు, ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ బుధవారం షెడ్యూలు జారీ చేశారు. 2016-17 విద్యా సంవత్సరంలో భాగంగా వేసవి సెలవులు ముగించుకుని ఈ నెల 13 నుంచి స్కూళ్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పాఠశాలలు ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరించాలని స్పష్టంచేశారు. 21వ తేదీన పాఠశాలల్లో సీట్లు పొందిన వారి వివరాలను ప్రకటించాలని, 22వ తేదీ నుంచి తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. విద్యా సంవత్సరంలో జూన్ 13 నుంచి ఆగస్టు 31వరకు ప్రవేశాలు చేపట్టవచ్చని, పాఠశాలల ప్రారంభం నుంచి 3 నెలల్లోగా ప్రవేశాలను ముగించాలన్నారు. ఇక ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల స్కూళ్లలో విద్యార్థులను తల్లిదండ్రులు తీసుకువచ్చిన రోజే ప్రవేశాలు చేపట్టాలని సూచించారు. కాగా ఈ నెల 3 నుంచి 12 వరకు నిర్వహించే బడిబాట తర్వాతే హేతుబద్ధీకరణపై దృష్టి సారించాలని విద్యా శాఖ నిర్ణయించింది. గవర్నింగ్ బాడీ ఉండేలా చర్యలు రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచి వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ తెలిపారు. ఫీజుల విషయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, అందుకు అనుగుణంగానే ఫీజులను నిర్ణయించాలని సూచించారు. డీఈవోలు, ఆర్జేడీలు ప్రైవేటు పాఠశాలలపై నిఘా పెట్టాలని, నిబంధనలు అమలయ్యేలా చూడాలన్నారు. ► తల్లిదండ్రులు సభ్యులుగా ప్రతి స్కూల్‌కు గవర్నింగ్ బాడీ ఉండాలి. గవర్నింగ్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 13లోగా ఫీజులను నిర్ణయించాలి. ఆ కాపీని డీఈవోకు అందజేయాలి. ► పాఠశాలలు వివిధ రకాల పేర్లతో ఫీజులను వసూలు చేయవద్దు. దరఖాస్తు ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, కాషన్ డిపాజిట్ రూ. 5 వేలకు మించడానికి వీల్లేదు. ► జూన్ 13న పాఠశాల నోటీసు బోర్డులో ఫీజుల వివరాలు, యూజర్ చార్జీల వివరాలను ప్రదర్శించాలి. పాఠశాలల ఫీజుల వివరాలతో పాటు పాఠశాలల వివరాలను యాజమాన్యాలు స్కూల్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ► ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్రా వంటి పేర్లను స్కూళ్లకు పెట్టరాదు. వీటితోపాటు ప్రవేశాల షెడ్యూలును అమలు చేయని స్కూళ్లపై చర్యలు చేపడతారు. ఈ నెల 22లోగా తమ పరిధిలోని పాఠశాలల్లో ప్రవేశాల వివరాలను డిప్యూటీడీఈవోలు, ఎంఈవోలు డీఈలోలకు అందజేయాలి. -
ప్రైవేటు సీటు.. భారీ రేటు!!
►ఇళ్లిళ్లూ తిరుగుతున్న ప్రైవేటు స్కూళ్ల సిబ్బంది ►సౌకర్యాలు, వసతుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం ►అడ్మిషన్లు పెంచుకోవడమే లక్ష్యంగా ్రప్రచారం ►టెక్నో, ఈ-టెక్నో, ఒలంపియాడ్ పేర్లు తీసేసినా ►భారీగా ఫీజులు వసూలు ►కనీస విద్యార్హత లేని టీచర్లతో బోధన ► చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువు సాక్షిప్రతినిధి, అనంతపురం ప్రైవేటు పాఠశాలల ఫీజులు రెట్టింపయ్యాయి. టెక్నో, ఈ-టెక్నో, ఒలంపియాడ్, స్మార్ట్ లాంటి పేర్లను రెండేళ్ల కిందట తొలగించినా ఫీజుల్లో మాత్రం ఎలాంటి తేడా లేదు. మరో వారం రోజుల్లో ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఎలాగైనా సరే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకునేందుకు ప్రైవేటు స్కూళ్ల సిబ్బంది పిల్లల కోసం వీధివీధీ, ఇళ్లిళ్లూ తిరుగుతూ అడ్మిషన్ల ప్రక్రియలో తలమునకలవుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు ఏమాత్రం ఏమరపాటు వహించినా పిల్లలు లేరనే సాకుతో మరోసారి సర్కారుబళ్లు మూతపడే ప్రమాదముంది. స్కూల్ ప్రచారంలో టీచర్లు ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ ఇటు ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు కత్తిమీదసాముగా మారింది. మరో వారంలో ప్రైవేటు పాఠశాలలు...ఆపై వారం తర్వాత సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి, ఈ క్రమంలో ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులు అడ్మిషన్లపై దృష్టి సారించారు. విద్యాసంస్థల్లోని టీచర్లు గ్రూపులుగా ఏర్పడి రాజకీయ ప్రచారాన్ని తలపించేలా ఇళ్లిళ్లూ చుట్టేస్తున్నారు. తమ పాఠశాలలోని ప్రత్యేకతలను గొప్పగా చెబుతున్నారు. విద్యార్థులను రప్పించడమే ధ్యేయంగా టీచర్లు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పైగా ఒక్కో టీచరు కనీసం పదిమంది విద్యార్థులనైనా చేర్పించాలని యాజమాన్యాలు హుకుం జారీ చేయడం, ఎక్కువ మందిని చేర్పిస్తే మంచి వేతనాలు ఇస్తామని హామీలు ఇవ్వడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పేరొందిన రెండు ప్రముఖ కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు అయిపోయాయని చెబుతూ డిమాండ్ పెంచి ఫీజులు పెంచుతున్నారు. విధిలేక తల్లిదండ్రులు కూడా అడిగినంత చెల్లిస్తున్నారు. భారీగా ఫీజులు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైైవేటు పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. కానీ జిల్లాలో ఇది చాలా స్కూళ్లలో అమలు కావడం లేదు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు గుంజుతున్నారు. విద్యాబోధనతో పాటు ఐఐటీ కోచింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లిష్, కరాటే, డ్రాయింగ్, బాక్సింగ్, ఇతర టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నామంటూ పలు రకాల ఫీజులతో పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నారు. వీటికి తోడు పాఠశాలల్లోనే యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, సాక్సులు టై అంటూ ఇష్టమెచ్చిన ధరలను యాజమాన్యాలే నిర్ణయించి, తప్పనిసరిగా వారి వద్దనే తీసుకోవాలంటూ నిబంధన విధిస్తున్నారు. దీంతో ఫీజులతో పాటు వీటి భారం కూడా తల్లిదండ్రులపై పడుతోంది. ఎల్కేజీ విద్యార్థికే ఏడాదికి 25 వేల రూపాయలు ఖర్చవుతోంది. 5-10 తరగతి వరకైతే స్కూళ్లను బట్టి 30-70వేల రూపాయల వరకు ఖర్చవుతోంది. వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా, కనీస సౌకర్యాలు కల్పించడంలో కొన్ని సూళ్లు విఫలమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధం: విద్యాహక్కు చట్టం ప్రకారం ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరే విద్యార్థుకు ప్రవేశ పరీక్ష పెట్టరాదు. కానీ చాలా స్కూళ్లు ప్రవేశపరీక్ష ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. దీంతో సీటు రాని విద్యార్థులు చిన్న వయస్సులోనే మానసికగా కుంగిపోయి చదువుపై ఏకాగ్రత సాధించలేకపోతున్నారు. పైగా అర్హత లేని టీచర్లతో బోధన చేయిస్తున్నారు. వీటిపై అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రైవేటు పాఠశాలలు ఇంటింటికీ వచ్చి గద్దల్లా పిల్లలను ఎగరేసుకుపోవడం, ప్రైవేటు వేగాన్ని ప్రభుత్వాధికారులు అందుకోకపోవడంతో ఏటేటా సర్కారు స్కూళ్లలో పిల్లల సంఖ్య క్షీణిస్తోంది. పిల్లలు తక్కువగా ఉన్నారనే సాకుతో ఇప్పటికే దాదాపు 179 ప్రాథమిక, 225 ప్రాథమికోన్నత పాఠశాలలను జిల్లాలో మూసేశారు. ఈ క్రమంలో పిల్లల సంఖ్యను అధికారులు పెంచకపోతే మరిన్ని పాఠశాలలు మూతపడే ప్రమాదముంది. -
ప్రశాంతంగా టెట్
- పేపర్-1కు 87.10 శాతం,పేపర్-2కు 91.83 శాతం హాజరు - నిజామాబాద్ జిల్లాలో అత్యధికం,రంగారెడ్డి జిల్లాలో అత్యల్ప హాజరు - నేడు ‘కీ’ విడుదల చేయనున్న విద్యా శాఖ - {పశ్నలు తేలిగ్గా ఉన్నాయంటున్న అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా శాఖ ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. పేపర్-1పరీక్షకు 1,01,213 మంది దరఖాస్తు చేసుకోగా 88,158 మంది (87.10 శాతం) హాజరయ్యారు. పేపర్-2 పరీక్షకు 2,74,339 మందికి గాను 2,51,924 మంది(91.83 శాతం) హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక హాజరు శాతం, రంగారెడ్డి జిల్లాలో అత్యల్ప హాజరు శాతం నమోదైంది. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నతాధికారులు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అరగంట ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పిన అధికారులు ముందుగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి కూడా అనుమతించలేదు. దీంతో మండుటెండలో పరీక్ష కేంద్రం బయటే నిల్చోవాల్సి వచ్చిందని కొందరు అభ్యర్థులు, వారి వెంట వచ్చిన వారు వాపోయారు. ప్రైవేటు పాఠశాలల బంద్ కారణంగా టెట్‌ను వాయిదా వేసిన విద్యా శాఖ ఈసారి పరీక్ష కేంద్రాలను అభ్యర్థుల నివాస ప్రాంతాలకు దూరంగా కేటాయించడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష నిర్వహించడంతో ఆయా కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందుల వసతులు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందంటున్నారు. అలాగే, హాల్‌టికెట్‌పై ఫొటో అతికించని అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి సిబ్బంది అనుమతించలేదు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన ఎంతోమంది వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సారి ప్రశ్నలు చాలా తేలిగ్గా వచ్చాయని, ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందని పరీక్షలు రాసి వచ్చిన అభ్యర్థులు పేర్కొన్నారు. కాగా, సోమవారం ప్రశ్నపత్రం కీని విద్యా శాఖ విడుదల చేయనుంది. -
బడులను ఎందుకు మూస్తున్నారు?
► రంగారెడ్డి జిల్లాలో పలు పాఠశాలలను పరిశీలించిన సుప్రీంకోర్టు బృందం ► విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వివరాల సేకరణ కందుకూరు/ మంచాల: స్కూళ్ల మూసివేతపై ఆరా తీసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించింది. కందుకూరు మం డలం పులిమామిడిలోని అంబేద్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాల, నేదునూరు ఉర్దూ పాఠశాలలను కమిటీ చైర్మన్ అశోక్‌గుప్తా, సభ్యులు వెంకటేశ్వరరావు, రత్నం, తెలంగాణ పేరెంట్స్ ఫౌండేషన్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ సందర్శించారు. గ్రామంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నారు? ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంది ఉన్నారు? ప్రైవేట్ పాఠశాలల్లో ఎంత మంది ఉన్నారని బృందం ఆరా తీసింది. ఇక్కడ ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండడంతో పిల్లల్ని ఇతర పాఠశాలల్లో చేర్పించామని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై కమిటీ సభ్యులు అధికారుల్ని ప్రశ్నించగా తక్కువ సంఖ్య ఉండటంతో ఇక్కడివారిని అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రభు త్వపాఠశాలలో కలిపామని చెప్పారు. మళ్లీ ఉపాధ్యాయుల్ని నియమించి తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులు చేరతారా అని ప్రశ్నించగా సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడే చది విస్తామని తల్లిదండ్రులు బదులిచ్చారు. నేదునూరులోని ఉర్దూ మీడియం పాఠశాల టీచర్ మెటర్నటీ సెలవుపై వెళ్లడంతో ఇక్కడ చదివే పిల్లలు ఇతర పాఠశాలల్లో చేరడంతో పాఠశాల బంద్ అయిందని తల్లిదండ్రులు తెలిపారు. సమయాభావం వల్ల దాసర్లపల్లి, కటికపల్లిలోని పాఠశాలలను సందర్శిం చకుండానే వారు వెనుదిరిగారు. అనంతరం మంచాల మండలం ఆరుట్ల దళితవాడ-2, బుగ్గ తండా పాఠశాల, కొర్రం తండా ప్రాథమిక పాఠశాలను కమిటీ సందర్శించగా టీచర్లు సకాలంలో రావడంలేదని, ఏకోపాధ్యాయులు ఉన్న చోట ఇబ్బందులున్నాయని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. -
ప్రైవేటు పుస్తకాల నిషేధంపై హైకోర్టు స్టే
స్కూళ్లను సీజ్ చేయొద్దని విద్యాశాఖకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో సర్కారు ముద్రించిన పాఠ్యపుస్తకాలను వినియోగించాలని విద్యాశాఖ గతేడాది ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. అలాగే ప్రైవేటు పుస్తకాలు ఉన్నాయంటూ ఆయా స్కూళ్లను సీజ్ చేయొద్దని విద్యాశాఖ ఉన్నతాధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ప్రైవేటు పుస్తకాలను నిషేధిస్తూ విద్యాశాఖ గతేడాది మేలో జారీ చేసిన ఉత్తర్వులపై తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) హైకోర్టును ఆశ్రయించింది. ట్రస్మా ఫిర్యాదుపై స్పందించిన న్యాయస్థానం... ప్రైవేటు పుస్తకాల నిషేధానికి సంబంధించి తగిన కారణాలు తెలపాలని విద్యాశాఖ కమిషనర్, ముఖ్య కార్యదర్శి, రాజీవ్ విద్యామిషన్ డెరైక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ పాత ఉత్తర్వులను నిలిపేయాలని సూచించింది. గత్యంతరం లేకనే కోర్టుకెళ్లాం ఈ ఏడాది మార్చి 21 నుంచే కొత్త విద్యా సంవత్సరం అమలు చేసే నిమిత్తం ప్రభుత్వ సూచనల మేరకు పరీక్షలను కూడా త్వరితగతిన ముగించాం. కానీ ప్రైవేటు ముద్రణ సంస్థలు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సకాలంలో పాఠ్యపుస్తకాలను అందించలేమని విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో విద్యా సంవత్సరం ప్రారంభాన్ని జూన్ 13కు వాయిదా వేసింది. ప్రభుత్వం పుస్తకాలను సకాలంలో అందించలేక పోయినందున 1 నుంచి 5 తరగతుల వరకు ప్రైవేటు పుస్తకాలను అనుమతించాలని విద్యాశాఖను కోరినా ఫలితం లేకనే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. -నీవూరి శ్రీనివాసరెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు -
ప్రైవేట్ ఫీజులకు కళ్లెం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే పిల్లలను చదివించడం తల్లిదండ్రులకు గుదిబండగా మారుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఫీజులే కాకుండా రవాణా, పుస్తకాలు, యూనిఫాం, షూలు విహార యాత్రలు తదితర పేర్లతో తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలను రాజకీయ పార్టీల నాయకులే ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు. పాఠశాల విద్యకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం రూ. 8,500 కోట్లు కేటాయిస్తుండగా అంతకు మించి ప్రైవేట్ పాఠశాలలు వ్యాపారం చేస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లు ఏటా సుమారు రూ. 11 వేల కోట్లు వసూలు చేస్తున్నాయి. కేజీ టు పీజీ విద్య పథకం అమలుకు నోచుకోకపోవడంతో పుట్టగొడుగుల్లా కార్పొరేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. స్కూళ్లలో ఫీజులను నియంత్రించేందుకు పకడ్బందీగా చట్టాన్ని తీసుకురావాలి. ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను నిరుపేద పిల్లలకు కేటాయించాలి. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి. ప్రైవేట్ పాఠశాల ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కామిడి సతీష్ రెడ్డి, పరకాల, వరంగల్ జిల్లా -
విద్యార్థినిని వీడియో తీసిన పాఠశాల టీచర్
ఇదేం వైపరీత్యం.. ⇒ విద్యార్థినితో కరస్పాండెంట్ కుమారుడి అసభ్య ప్రవర్తన ⇒ వీడియో తీసిన పక్క పాఠశాల టీచర్ దాన్ని షేర్ చేసిన కరెస్పాండెంట్ ⇒ బెదిరింపులకు పాల్పడ్డ మీడియా ప్రతినిధులు కేపీహెచ్‌బికాలనీ: ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినితో మరో విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ను వీడియో తీసి ఇతరులకు షేర్ చేసిన ఉదంతంలో బాలానగర్ పోలీసులు నిందితులైన ఇద్దరు పాఠశాల కరెస్పాండెంట్లను, విద్యార్థిని అరెస్ట్ చేశారు. సీఐ బిక్షపతిరావు తెలిపిన మేరకు.. గత నెల 30న కోమటిబస్తీకి చెందిన ఓ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని అదే పాఠశాల కరస్పాండెంట్ కుమారుడు భవనంపైకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తిం చాడు. ఈ విషయాన్ని పక్కనే ఉన్న మరో ప్రైవేటు స్కూల్ టీచర్ గమనించి సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసింది. ఆ వీడియోను పాఠశాల కరస్పాండెంట్‌కు చూపించడంతో అతను తన ప్రత్యర్థి పాఠశాల కరస్పాం డెంట్‌పై ఉన్న కోపంతో వీడియోను ఇతరులకు షేర్ చేసి ప్రచారంలో పెట్టాడు. దీంతో ఇద్దరు స్థానిక మీడియా ప్రతినిధులు పాఠశాల కరస్పాండెంట్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఈ విషయాన్ని ఈనెల 6న తెలుసుకున్న విద్యార్ధిని కుటుంబీకులు, స్థానిక బస్తీవాసులు ఆగ్రహాంతో ఇరు పాఠశాలల కరస్పాండెంట్లను, మీడియా ప్రతినిధులను నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమో దు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులైన ఇద్దరు కరస్పాండెంట్లు సురేష్, విజయ్‌కుమార్‌లతో పాటు ఇద్దరు మీడియా ప్రతినిధులను, విద్యార్ధినితో అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్ధిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పదో తరగతి పేపర్ లీక్
అరగంటలోనే ప్రశ్నలు రాసి బయటకు ప్రైవేటు పాఠశాలతో ఇన్విజిలేటర్లు కుమ్మకు? సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శుక్రవారం పదో తరగతి జీవశాస్త్రం పేపర్ లీక్ అయ్యింది. ఈ కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన అరగంటలోనే తెల్లకాగితంపై ప్రశ్నలు రాసి బయటకు పంపించారు. ఈ కేంద్రంలోని ఇన్విజిలేటర్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై ప్రశ్నలు బయటకు పంపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఓ పేరున్న ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ఈ కేంద్రం వద్ద తచ్చాడుతూ ఇన్విజిలేటర్ల సహాయంతో విద్యార్థులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు చేరవేస్తున్నట్లు మరో పాఠశాల యాజమాన్యం గమనించింది. శుక్రవారం తెల్లకాగితంపై రాసి ప్రశ్నలు బయటకు రాగానే మీడియాకు, అధికారులకు సమాచారం అందించారు. వెంటనే తహశీల్దార్ రజిత, సీఐ తులాశ్రీనివాస్రావు, ఎంఈవో నర్సింగం వచ్చి పరిశీలించారు. పేపర్ లీక్‌కు కారణమైన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
చదువు సరిగా రావడం లేదంటే.. టీసీ ఇచ్చారు
బెల్లంపల్లి (ఆదిలాబాద్): తమ పిల్లలకు చదువు సరిగా రావడం లేదని ఓ మహిళ స్కూల్ టీచర్‌ను నిలదీయడంతో... ఆ టీచర్ ఏకంగా టీసీ ఇచ్చి విద్యార్థులను ఇంటికి పంపించేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. సుబ్బరావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మేకల రాధిక కుమారుడు వినయ్ (3వ తరగతి), హిమబిందు (5వ తరగతి) చదువుతున్నారు. వీరితో పాటు పాఠశాలలో మొత్తం ఆరుగురు విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. తమ ఇద్దరు పిల్లలకు చదువు సరిగా రావడం లేదని, కనీసం జాతీయ గీతం కూడా పాడలేకపోతున్నారని ఉపాధ్యాయురాలిని శారద అడిగింది. ఇందుకు ప్రతిగా స్పందించిన ఉపాధ్యాయురాలు 'మీ పిల్లలను మీ ఇష్టం ఉన్న స్కూల్లో చదివించండని' ఏకంగా ఇద్దరు విద్యార్థులకు టీసీ ఇచ్చి ఇంటికి పంపించింది. విద్యా సంవత్సరం ముగింపు దశలో టీసీ ఇవ్వడం వల్ల తమ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలమైన తాము ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను చదివించే స్థోమత లేకనే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు రాధిక పేర్కొన్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ ఘటనపై బెల్లంపల్లి ఎంఈఓ మోహన్‌ను వివరణ కోరగా పక్షం రోజుల క్రితం రాధిక పిల్లలకు టీచర్ టీసీ ఇచ్చారని తెలిపారు. ఆ పిల్లల తల్లి కోరిక మేరకే టీసీ ఇచ్చినట్లు టీచర్ చెప్పారని పేర్కొన్నారు. సదరు విద్యార్థులను స్కూల్లో చేర్చుకోవాలని టీచర్‌ను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. -
విద్యార్థుల కిడ్నాప్‌నకు టీచర్ యత్నం
అచ్చంపేట: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలోని ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ నలుగురు విద్యార్థినుల కిడ్నాప్‌కు యత్నించాడు. పోలీ సుల కథనం ప్రకారం.. అచ్చంపేటలో ఎంఎస్ఎన్ స్కూల్‌కు చెందిన టీచర్ జీవన్ అలియాస్ బాలకుమార్ స్కూల్లోనే ట్యూషన్ ఉందని నాలుగో తరగతికి చెందిన నలుగురు అమ్మాయిలను ఆదివారం సాయంత్రం వారి ఇళ్ల వద్ద నుంచి కారులో ఎక్కించుకుని వెళ్లాడు. అయితే, పాఠశాలకు వెళ్లకుండా దారి మారడంతో గమనించిన ఓ విద్యార్థిని తన తల్లికి సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులతో కలసి గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని జేఎంజే పాఠశాల పక్కన గెస్టుహౌస్ వద్ద కారు కనిపించింది. అక్కడ సదరు ఉపాధ్యాయుడు, నలుగురు విద్యార్థినులు ఉన్నారు. కారులో బిర్యానీ ప్యాకెట్లు, ప్యాక్ ముక్కలు, కురుకురేలు, ల్యాప్‌టాప్, యేసుక్రీస్తు బొమ్మలు లభ్యమయ్యాయి. వెంటనే అతనిని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మతమార్పిడికి వచ్చినట్లు అతని మాటలబట్టి తెలిసిందని ఎస్ఐ అనుదీప్ విలేకరులకు తెలిపారు. -
పాఠశాల ఎదుట విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన
ఒక విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాష్టీకం అతడి తల్లిదండ్రులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వివరాలివీ... మిర్యాలగూడ మండలం తుంగపాడు పంచాయతీకి చెందిన ఓ బాలుడు మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. తెలుగు రాయటం సరిగా రావటం లేదని ఆగ్రహం చెందిన ఉపాధ్యాయుడు సదరు బాలుడిని శనివారం కర్రతో కొట్టాడు. శరీరంపై వాతలు రావటం చూసి ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు, బంధువులు సోమవారం పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. నిర్వాహకులు వారికి సర్దిచెప్పటంతో ఆందోళన విరమించారు. -
విద్యార్థి ఆచూకీ లభ్యం
♦ తీవ్ర గాయాలతో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యక్షం ♦ కిడ్నాప్ చేసి.. కాల్చారని వాంగ్మూలం హుజూర్నగర్: నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతూ అదృశ్యమైన విద్యార్థి నాగార్జునరెడ్డి ఆచూకీ లభించింది. శనివారం కాలిన గాయాలతో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మేళ్లచెరువు మండలం తమ్మారం కొత్తూరుకు చెందిన గాయం నాగార్జునరెడ్డి హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యనభ్యసిస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. నాగార్జునరెడ్డి రూ. 500 దొం గిలించాడని సహచర విద్యార్థులు ఆరోపిం చారు. తాను ఆ చోరీ చేయలేదని, తనపై నింద వేయడంతో పురుగుమందు తాగి చని పోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. తనను కిడ్నాప్ చేసి తగులబెట్టారని న్యాయమూర్తికి నాగార్జునరెడ్డి వాంగ్మూ లం ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. 18న పాఠశాల వద్ద ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేశారని, శనివారం ఉదయం చిల్లకల్లు పెట్రోల్‌బంక్ సమీపంలో తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపాడు. అనంతరం వారే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో విడిచి వెళ్లారన్నాడు. పోలీసుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలివెళ్లారు. పాఠశాల వద్ద ఉద్రిక్తత.. హుజూర్‌నగర్‌లో నాగార్జునరెడ్డి చదువుకుంటున్న ప్రైవేట్ పాఠశాల వద్ద బంధువులు, గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా అక్కడకు చేరుకొన్నారు. కాగా, నాగార్జునరెడ్డి అదృశ్యం మిస్టరీగానే మారింది. -
టెన్షన్..!
నిజాంసాగర్ : విద్యార్థుల భవితకు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షల కాలం దగ్గరపడుతోంది. పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ ప డుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల కీలక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు. అయినా డిప్యూటేషన్ పద్ధతిన బోధిస్తున్నారు. రెండు నెలలుగా ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీ సుకుంటున్నారు. గ్రేడింగ్ పాయింట్లు ఎన్ని ఎక్కువ వస్తే అంత మంచిదన్న ధోరణితో ప్రైవేట్ విద్యాసంస్థలు ముందుకు వె ళ్తున్నా యి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అత్యధిక గ్రేడింగ్ ను సాధించేందుకు పొటాపోటీగా సాగుతున్నాయి. విద్యార్థులతో రివ్యూలు.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పదికి పది గ్రేడింగ్ పా యింట్ల కోసం ఉపాధ్యాయులు, యాజమాన్యాలు, వి ద్యార్థుల ప్రత్యేక తరగతులపైనే దృష్టి సారించారు. స బ్జెక్టులవారీగా వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి న ఉపాధ్యాయులు వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గత నవంబర్ నుంచి పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు సాగుతున్నాయి.డిసెంబర్ నెలాఖరువరకు సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను పూర్తి చేశారు. దీంతో ప్రత్యేక తరగతులపై మరింత పదను పెట్టారు. అటు వెంటనే ఉ పాధ్యాయులు విద్యార్థులతో రివ్యూ చేయిస్తు న్నారు. పాఠశాలల సెలువు దినాల్లో సైతం విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. బట్టీ విధానానికి స్వస్తీ... జిల్లాలో 515ప్రభుత్వ, 280 ప్రైవేట్ ఉన్నత పాఠశాలలున్నాయి. వాటి ద్వారా 33,519మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. గతేడాది నుంచి పదో తరగతి విద్యార్థులకు బట్టీ విధానం కాకుండా నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) పద్ధతిలో పరీక్షలు సాగుతున్నాయి. దీంతో ఉపాధ్యాయులకు బోధన తలకు మించిన భారంగా మారింది. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను గుర్తించలేకపోతున్నారు. ఏదేమైనా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తర్ణత కోసం ఉపాధ్యాయులు, విద్యార్థులు కుస్తీ పడుతున్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు... సిలబస్ విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఫలి తంగా టెన్త్ విద్యార్థులకు పరీక్షల ఫీవర్ పట్టుకుంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌ను ‘నిఘానేత్రం’ బట్టబయలు చేయనుంది. మార్చి 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు గురువారం డీఈవో నుంచి పరీక్షా కేంద్రాల హెచ్ఎంలకు ఆదేశాలు అందాయి. జిల్లాలోని 194 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
హెచ్ఐవీ ఉందని స్కూల్ నుంచి తరిమేశారు
బిష్ణుపూర్ (పశ్చిమ బెంగాల్) : హెచ్ఐవీతో బాధపడుతున్న ఓ ఏడేళ్ల చిన్నారిని పాఠశాల నుంచి బహిష్కరించారు. సమాజానికి అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులే పసివాడి పట్ల అమానుషంగా వ్యవహరించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాలు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బిష్ణుపూర్ గ్రామానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఏడేళ్ల చిన్నారి హెచ్ఐవీ బాధితుడు. ఈ విషయం తెలిసిన సదరు పాఠశాల యాజమాన్యం విద్యార్థిని స్కూలుకు రావద్దంటూ హుకూం జారీ చేసింది. పిల్లాడిని ఎందుకు స్కూల్ నుంచి బహిష్కరించారో తెలుసుకునేందుకు వెళ్లిన విద్యార్థి నానమ్మతో కూడా దురుసుగా వ్యవహరించింది. పరుషమైన పదజాలం ఉపయోగించడంతో పాటు ముందు 'ప్యూరిటీ టెస్ట్' చేయించుకుని రావాల్సిందిగా అదే పాఠశాలకు చెందిన మరో టీచర్ శెలవిచ్చారు. అయితే మీడియా ద్వారా విషయం బహిర్గతమవడంతో తెలుసుకున్న మానవహక్కుల కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించి.. నాలుగు వారాల్లో పూర్తి సమాచారంతో కూడిన నివేదిక అందించాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ప్రజల్లో అవగాహనా రాహిత్యం వలనే ఇటువంటివి జరుగుతున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. నిజానిజాలు తెలుసుకుని బాధితుడికి న్యాయం చేస్తామని, బాలుడి హక్కులను కాపాడుతామని కమిషన్ స్పష్టం చేసింది. ఐదు నెలల క్రితం హెచ్ఐవికి గురైన బాలుడి ఆరోగ్యం గురించి పక్కా సమాచారం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం.. మిగతా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల బలమైన అభ్యర్థన మేరకు నవంబరు 20వ తేదీన బాలుడిని స్కూలు నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరింది. కాగా బాలుడి తల్లిదండ్రులిద్దరు హెచ్ఐవీ బాధితులే. -
స్కూలు సెప్టిక్ ట్యాంకులో మృతదేహం
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగంపేట్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూలు సెప్టిక్ ట్యాంకులో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. పాఠశాల వాచ్‌మన్ బుధవారం ఉదయం సెప్టిక్ ట్యాంకు మూత తెరిచి చూడగా దుస్తులు లేని స్థితిలో మృతదేహం కనిపించింది. సుమారు ఇరవై రోజుల క్రితం చంపి అందులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమ పేరుతో వంచన
పోలీసుల అదుపులో నిందితుడు బొల్లారం: ప్రేమ పేరుతో ఉపాధ్యాయురాలిని మోసం చేసేందుకు యత్నించిన స్కూలు మాజీ ఇన్చార్జిని బొల్లారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు మహిళలతోనూ ఫేస్బుక్, వాట్సాప్‌ల ద్వారా చాటింగ్ చేస్తూ ప్రేమ పేరుతో వల వేస్తున్నట్టు అతడి సెల్‌ఫోన్ డేటా ఆధారంగా గుర్తించారు. వివరాలు... బొల్లారం ఠాణా పరిధిలోని ప్రైవేటు పాఠశాలలో లోతుకుంటకు చెందిన యువతి (22) టీచర్‌గా పని చేస్తోంది. ఖమ్మంజిల్లా పాల్వంచకు చెందిన వాసిం అక్రం గతంలో ఈ పాఠశాలలో ఇన్చార్జిగా వ్యవహరించాడు. ఇతను ఆ యువతికి ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని వల వేశాడు. వివాహం చేసుకుంటానని ఆమెను ఈనెల 4న ఖమ్మంలో ఉండే స్నేహితుడి ఇంటికి పంపాడు. అయితే, విధులకు వెళ్లిన కూతురు స్కూల్ నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా 4వ తేదీన ఆమెకు సెలవు ఇచ్చామని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు సెల్‌ఫోన్ కాల్ డేటా, సిగ్నల్స్ ఆధారంగా వసీం అక్రంను అదుపులోకి తీసుకొని విచారించగా...యువతిని ఖమ్మంలో ఉండే తన మిత్రుడి ఇంటికి పంపానని చెప్పాడు. తాను తర్వాత వస్తానని చెప్పి వ సీం నగరంలోనే ఉండిపోయాడని తేలింది. బొల్లారం పోలీసులు అక్కడి పోలీసుల సహాయంతో బాధిత టీచర్‌ను నగరానికి రప్పించారు. వసీం అక్రం ఇతర మహిళలకు కూడా ప్రేమ, పెళ్లి అంటూ ఫోన్ చాటింగ్ ద్వారా వల వేస్తున్నట్టు గుర్తించారు. మరింత వివరాలు రాబట్టేందుకు అతడిని విచారిస్తున్నారు. -
చేతికి గోరింటాకు.. అయితే స్కూలుకు రాకు!
ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినులకు చేదు అనుభవం హైదరాబాద్: చేతులకు గోరింటాకు పెట్టుకొని వచ్చిన విద్యార్థినులకు స్కూల్లో చేదు అనుభవం ఎదురైంది. స్కూల్లోకి రాకుండా యాజమాన్యం అడ్డుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో సోమవారం జరిగింది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా పలువురు విద్యార్థినులు చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. సెలవులు ముగిసిన అనంతరం సోమవారం హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ స్కూల్‌కు వెళ్లారు. విద్యార్థినుల చేతులకున్న గోరింటాకును గమనించిన యాజమాన్యం వారిని స్కూల్లోకి రానివ్వకుండా బయటకు పంపించి వేసింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఏఐఎస్ఎఫ్ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు, నగర కార్యదర్శి శ్రీమాన్లతోపాటు పలువురు విద్యార్థి నాయకులు స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డిని నిలదీశారు. గోరింటాకు పెట్టుకోవడం స్కూల్ రూల్స్‌కు వ్యతిరేకమని, అందువల్లే బయటకు పంపించామని ప్రిన్సిపల్ సమాధానమిచ్చారు. గోరింటాకు పెట్టుకుంటే తప్పేంటని విద్యార్థి నాయకులు ప్రిన్సిపల్‌ను గట్టిగా నిలదీశారు. దీంతో ఆ విద్యార్థినులను స్కూల్లోకి అనుమతించారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈవోకు ఫిర్యాదు చేశామని, ఈ సమస్యను డీఈవో, బాలల హక్కుల కమిషన్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్తామని విద్యార్థి నేతలు చెప్పారు. -
చదువుకోవాలంటే పడవ ఎక్కాల్సిందే..
వేమనపల్లి : ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కొందరు గొర్లపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. అయితే.. ఐదు రోజులుగా నీల్వాయి వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలా పడవను ఆశ్రయిస్తున్నారు. నీల్వాయికి కూతవేటు దూరంలోనే గొర్లపల్లి ఉంటుంది. కానీ.. మార్గమధ్యలో వాగు ఉంది. ఏటా వర్షాకాలం వచ్చిందంటే మండల వాసులకు ఈ కష్టాలు తప్పవు. శనివారం కూడా సుమారు 28 మంది చిన్నారులు ప్రమాదకరంగా పడవలో ప్రయాణం సాగించారు. -
విద్యార్థిని వాతలు తేలేలా కొట్టిన టీచర్
- యాజమాన్యాన్ని నిలదీసిన విద్యార్థి తండ్రి ప్రత్తిపాడు: మాట వినలేదనో, పాఠం చెప్పలేదనో పసిపిల్లాడిని ఇంత కర్కశంగా వాతలు తేలేలా కొడతారా? మీకు చేతులెలావచ్చాయి.. అంటూ ఓ విద్యార్థి తండ్రి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ప్రత్తిపాడుకు చెందిన శ్రీనివాసరెడ్డి తన కుమారుడిని ప్రత్తిపాడులోని సరోజిని విద్యాలయంలో రెండవ తరగతి చదివిస్తున్నాడు. బుధవారం పాఠం సక్రమంగా చెప్పలేదని క్లాస్ టీచర్ స్కేల్‌తో రెండుకాళ్లపై కొట్టడంతో విద్యార్థికి ఎర్రగా వాతలు తేలాయి. పాఠశాల ముగిసిన తరువాత విద్యార్థి ఇంటకివెళ్లి ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు అడిగారు. పిల్లవాడు వాతలు చూపంచి టీచర్ కొట్టిందని చెప్పడంతో తలిదండ్రులు వచ్చి ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యానికి వాతలు చూపించారు. స్పందించిన యాజమాన్యం పొరపాటు జరిగిందని, ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తామని చెప్పడంతో శ్రీనివాసరెడ్డి శాంతించారు. -
ప్రభుత్వ విద్య పనికిరాదా?
ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సరిగా చెప్పరనే అపవాదు చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే చీకటిని నిందిస్తూ కాలం గడప టం కన్నా చిన్న దీపం వెలిగించే ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుందని గ్రహించాలి. ఇది తెలియకనే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివిస్తూ వేల రూపాయల ఫీజులు చెల్లి స్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో బట్టీ చదువులు తప్ప జ్ఞానవంతమైన విద్యను అందించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో సమర్థమైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారి కృషి ఫలి తంగానే ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధి స్తున్నాయి. ఈ తరుణంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడానికి విద్యాశాఖ ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి. వేల రూపాయలను గుమ్మరించి విద్యను కొనుక్కునే క్రమంలో తమను తాము దూషించుకుంటూ, ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టడం కన్నా మన పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందడానికి ప్రభుత్వంపై ఉమ్మడిగా ఒత్తిడి పెంచడమే సరైన పని అవుతుంది. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించే జ్ఞాన కేం ద్రాలుగా ప్రభుత్వ విద్యాసంస్థలు ఎదగడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. - జి. అశోక్ గోదూర్, కరీంనగర్ జిల్లా -
బంద్ పాటించలేదని పాఠశాలపై దాడి
సూర్యాపేట (నల్లగొండ): తమ పిలుపు మేరకు బంద్ పాటించకపోవడంతో ఓ పాఠశాలపై విద్యార్థి సంఘం నాయకులు దాడి చేసిన ఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పీడీఎస్‌యూ(విజృంభణ) విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం పాఠశాలల బంద్‌కు పిలుపు నిచ్చింది. అయితే, పట్టణంలోని నవోదయ ఉన్నత పాఠశాల యథావిధిగా నడిపించారు. దీంతో పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు పాఠశాలకు చేరుకొని... తాము రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుంటే పాఠశాల ఎందుకు నడిపిస్తున్నారంటూ దాడి చేశారు. ఫర్నిచర్, అద్దాలు, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. -
సంగారెడ్డిలో ఫీజుల కలకలం..
మెదక్ జిల్లా సంగారెడ్డిలో కలకలం రేగింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు తగ్గించాలంటూ ఆందోళన చేస్తున్న బీసీ సంఘం నేత సిరిబాబు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. దాంతో ఆయనకు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సిరిబాబు.. ఉన్నట్టుండి వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. దాంతో ఆయన కాళ్ల నుంచి పైన పొట్ట వరకు శరీరం కాలిపోయింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిరిబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనను హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విలేకరులతో మాట్లాడిన సిరిబాబు ప్రవైవేటు పాఠశాలల తీరుపై విరుచుకుపడ్డారు. నర్సరీకి కూడా 45 వేలు వసూలు చేస్తూ స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రుల్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఇక భర్తలు లేని మహిళలైతే తమ పిల్లల్ని చదివించుకునేందుకు పడుతున్న బాధలు చెప్పరానివన్నారు. అధిక ఫీజులపై ఎంఈవో, డీఈవోలకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే ఆందోళనను ఉదృతం చేసే క్రమంలో తాను ఆత్మహత్యాయత్నం చేయాల్సి వచ్చిందన్నాడు. -
ఫుడ్ పాయిజన్: 60 మంది విద్యార్థులకు అస్వస్థత
చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. ఆదివారం రాత్రి భోజనం అనంతరం వాంతులు, విరేచనాలతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.పాఠశాల సిబ్బంది వారిని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. -
స్కూల్లో విద్యార్థినులతో అసభ్యకర నృత్యాలు
-
గుర్రు..వు
భయం నుంచి వచ్చేది నిస్పృహ... నిస్పృహ పెంచేది అచేతనం. గౌరవం నుంచి పుట్టేది భక్తి... భక్తి నుంచి పెరిగేది శ్రద్ధ. స్కూలు పిల్లలకు కావలసింది టీచర్లంటే భయం కాదు... భక్తి. చదువులపై అనాసక్తి కాదు... శ్రద్ధ. రోజూ స్కూలుకు వెళ్లాలనిపించే చదువులు... రోజూ చదువుకోవాలనిపించే స్కూళ్లు. తల్లిదండ్రులను మించిన దైవం గురువు అంటారు. శిక్షకు, శిక్షణకు తేడా తెలియనివారు గురువులెలా అవుతారు? దైవం ఎలా అవుతారు? దండించకుండానే మార్పు తేవచ్చు - పోటీని తట్టుకోవాలంటే పిల్లలు చదువులో ముందుండాలి. వారు మనసుపెట్టి చదువుకోవాలంటే పాఠశాల వాతావరణమూ బాగుండాలి. - పిల్లలను ప్రశంసించడం నేర్చుకోండి. ఎంత చిన్న ఘనత సాధించినా చిన్న చిన్న కానుకలు ఇస్తూ విద్యార్థుల అభివృద్ధికి మైలురాళ్లు వేయండి. - తప్పులు చేయడం సహజం. వాటిని దిద్దుకున్న మేధావుల గురించి చెప్పండి. ఇలా దండన అవసరం లేకుండానే చదువు చెప్పవచ్చు. - విద్యార్థి తప్పు చేస్తే దాన్ని నలుగురి ముందు ఫోకస్ చేయకండి. అలాగని ‘నాకెందుకు’ అని వదిలేయకుండా సరిదిద్దండి. మీపై గౌరవం పెరుగుతుంది. - అస్సలు చదవని పిల్లవాడినైనా ‘బాగా చదవగలవు’ అనే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండండి. - శారీరక, మానసిక దండన అనేది పిల్లలను స్కూల్ నుండి, నేర్చుకోవడం నుండి దూరం చేస్తుందని గమనించండి. కిందటి విద్యా సంవత్సరం: పిఠాపురంలోని ఓ ప్రైవేటు స్కూల్లో లెక్కల టీచర్ విచక్షణ కోల్పోయి విద్యార్థిపై విరుచుకుపడ్డాడు. ఐదవ తరగతి చదువుతున్న కామేష్ అనే విద్యార్థి తలపై ఆ టీచర్ కర్రతో బలంగా కొట్టడంతో అతడికి తీవ్ర గాయమై, ఆసుపత్రి పాలయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టెన్త్ చదువుతున్న ఇస్మాయిల్ తరగతి గదిలో స్నేహితులతో మాట్లాడుతుండగా టీచరమ్మకు విపరీతమైన కోపం వచ్చింది. పనిష్మెంటుగా అతడిని స్కూల్ నాలుగు అంతస్తులలోని అన్ని తరగతులకు తిప్పి, గుంజీలు తీయించింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఇస్మాయిల్ తీవ్ర అస్వస్థతకు లోనై ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు. విశాఖపట్టణంలోని ఓ మాంటిస్సోరి స్కూల్లో సూర్యతేజ, దిలీప్‌కుమార్ అనే ఐదవ తరగతి విద్యార్థులు హోమ్‌వర్క్ చేసుకురాలేదని టీచర్ మూడుగంటల పాటు వాళ్ల బట్టలు విప్పించి, ఎండలో నిలబెట్టింది. ఈ నాలుగు సంఘటనలే కాదు... బడికి ఆలస్యంగా వచ్చాడనే కోపంతో ఒక టీచర్, హోంవర్క్ చేయలేదన్న కారణంతో మరో టీచర్, డిక్టేషన్ సరిగా రాయలేదన్న చిరాకుతో ఇంకో టీచర్, క్లాస్ రూములో గుసగుసలు చెప్పుకుంటున్నందుకు ఇంకో టీచర్, జుత్తు సరిగ్గా దువ్వుకోనందుకు, దుస్తులు సరిగా వేసుకోనందుకు, బ్యాడ్జీ పెట్టుకోనందుకు, బాక్స్‌లో అన్నం పూర్తిగా తిననందుకు.. ఇలా ఏదో ఒక కారణంతో స్కూల్లో టీచర్ల చేత దెబ్బలు తినని పిల్లలు లేరు. మానసిక హింస టీచర్లు విధించే ఇలాంటి చాలా శిక్షలు స్కూల్ గేట్ దాటి బయటపడవు. అందులోనూ మానసిక వేధింపుల శిక్షలైతే ఎప్పటికీ బయటపడవు. ‘పాఠశాలల్లో మానసిక వేధింపులు కూడా ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి’ అంటున్నారు సైకాలజిస్టులు. 8వ తరగతి చదువుతున్న పూర్ణిమ ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతూ ఉండేది. అకస్మాత్తుగా నవ్వడమే మర్చిపోయింది. ఒక సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో ‘నువ్వు నవ్వితే అసహ్యంగా’ ఉంటుందని తిట్టాడట టీచర్. నవ్వడమే తప్పు అన్న భావనలోనే ఆ అమ్మాయి కొన్నేళ్లుగా ఉండిపోయింది. అంతేకాదు శారీరక లోపాలను, ప్రవర్తనను, చదువులో వెనుకబాటుతనాన్ని కారణంగా చూపుతూ విద్యార్థులను తోటి విద్యార్థుల ముందు అవమానించడం అతి పెద్ద హింస’ అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే ఒంటిమీద కన్నా మనసు మీద పడిన దెబ్బ తాలూకు గాయం అతి పెద్దది. అది పిల్లల్లో ఆ టీచర్ పట్ల, ఆ టీచర్ చెప్పే చదువు పట్ల ఏహ్యభావనకు దారి తీస్తుంది. మీరూ టీచరేనా? అయితే... సర్వేపల్లి రాధాకృష్ణ, రవీంద్రనాథ్ టాగూర్, సావిత్రీబాయి పూలే... ఇలా ఎంతో మంది టీచర్ల గురించి నేటికీ గొప్పగా చెప్పుకుంటున్నాం. వారిలా రేపటి తరం మనసుల్లో తమ అభిమాన టీచర్ ఓ రోల్‌మోడల్‌గా మీరూ కొలువుదీరాలి. - విద్యార్థులు టీచర్నే ప్రధానంగా గమనిస్తారు. మీరు క్రమశిక్షణతో నడుచుకుంటే మిమ్మల్ని అనుసరించే విద్యార్థులు తమ ప్రవర్తనను తామే సరిదిద్దుకునే శక్తిని పెంచుకోగలరు. - శుభ్రమైన డ్రెస్, హుందాగా నడక.. మీ పూర్తి ఆహార్యమూ చూడ్డానికి బాగుండాలి. - ఇటీవల కాలంలో టీచర్- స్టూడెంట్స్ మధ్య కమ్యూనికేషన్ ఉండటం లేదు. అందుకని రెగ్యులర్ టైమ్‌లో కుదరకపోయినా, స్కూల్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు పిల్లల కోసం సమయం కేటాయించండి. పాఠ్యాంశాలు బోధించడానికి కాదు ఓ చిన్న కథతోనో, వారి సమస్యలు వినడం వల్లనో ఆకట్టుకోండి. - ‘టీచర్‌కి అన్నీ తెలుసు’ అని మాత్రమే కాదు ‘నా గురించి మా టీచర్‌కు అన్నీ తెలుసు’ అని పిల్లవాడికి నమ్మకం కుదిరితే, కుదురుగా మీరు చెప్పింది తప్పక వింటాడు. - టీచర్‌పై అభిమానం పెంచుకున్న విద్యార్థి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా తన మార్గానికి సోపానంగా నిలిచిన వారికి ఎప్పుడూ అభివాదం చేస్తూనే ఉంటాడు. ముందుతరాలకూ ఆ టీచర్ గొప్పతనాన్ని చాటుతూనే ఉంటాడు. విద్యార్థి తన జీవితకాలపు ‘వరం’గా ఉపాధ్యాయుడు తనను తాను మార్చుకోవాల్సిన అవసరం నేడు తప్పనిసరి. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి యాక్షన్ తీసుకుంటాం శిక్షణ పొందిన టీచర్లే బడిలో ఉండాలి కానీ, శిక్షలను అమలు చేసేవారు కాదు. ఏ పాఠశాల అయినా అర్హత కలిగిన టీచర్లనే నియమించుకోవాలి. పిల్లలను శిక్షించే టీచర్‌కు సంబంధించిన సమాచారం రుజువులతో సహా ఉంటే, సదరు టీచర్‌ను తొలగించమని ఆ స్కూల్కునోటీసులు ఇస్తాం. సరైన యాక్షన్ తీసుకుంటాం. - ఆర్.పి.సిసోడియా, ఐ.ఎ.ఎస్, ప్రభుత్వ కార్యదర్శి, విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ సహనం తప్పనిసరి.... శిక్షలు అమలు చేసే టీచర్ల పట్ల బాలల హక్కు చట్టం ప్రకారమే కాకుండా శాఖాపరమైన చర్యలంటూ ఉంటాయి. మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రవైట్ స్కూళ్ల తనిఖీ చేయడం మా విధి. పిల్లలను శిక్షిస్తున్నారని నిర్ధారణ అయితే ప్రాధమిక నివేదక ఆధారంగా తొలత ఆ ఉద్యోగిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తాం. - కొల్లి తవిటినాయుడు, ఎంఈఓ, భోగాపురం మండలం, విజయనగరం. నిశితంగా గమనించాలి తల్లిదండ్రులతో ‘తరగతి గదిలో మీ అబ్బాయి/అమ్మాయి మిస్‌బిహేవ్’ చేస్తున్నారు అనే కంప్లైంటు చేస్తుంటారు టీచర్లు. పిల్లల ప్రతి ప్రవర్తనకు ఒక కారణం ఉంటుంది. వారిలో అల్లరినే కాదు, ఏదైనా అటెన్షన్ డిజార్డర్ ఉందా, అకడమిక్‌లో లోపమా... అనేది కూడా చూడాలి. ప్రవర్తనలో లోపాన్ని మూలం నుంచి మార్చుకురావాలి కానీ, శిక్షల వల్లకాదు. - డా.గీతాచల్లా, సైకాలజిస్ట్ అనుబంధం బలపడుతుంది అర్హత కలిగిన టీచర్లనే ఎంపిక చేస్తాం. వారానికి ఒకసారైనా విద్యార్థులకు జీవనైపుణ్యాలను సంబంధించిన తరగతులను నిర్వహిస్తాం కాబట్టి, టీచర్‌కి-స్టూడెంట్‌కి మధ్య అనుబంధం బలపడుతుంది. దీంతో దండన అనే సమస్యే లేదు. ఈ తరహా పద్ధతి వల్ల విద్యార్థుల ప్రవర్తనలో మంచి మార్పులు చూస్తున్నాం. - జయంతి వెంకటరామన్, ప్రిన్సిపల్, సిస్టర్ నివేదిత స్కూల్, హైదరాబాద్ -
ఫుట్‌పాత్‌పై పాఠశాల సీజ్..వెంటనే వెనకడుగు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 24లో మున్సిపల్ పార్కును ఆనుకొని ఫుట్‌పాత్‌పై గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రై వేట్ పాఠశాలను విద్యాశాఖాధికారులు బుధవారం సీజ్ చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు షేక్‌పేట మండల విద్యాశాఖ అధికారులు అక్కడకు చేరుకుని సీజ్ చేశారు. అయితే, తమకు ఈ స్కూల్ తప్పితే అందుబాటులో మరొకటి లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాంతో వారు వెనక్కి తగ్గారు. డిప్యూటీ డీఈవో వెంకటేశ్వర్లు అప్పటికప్పుడే ఆ పాఠశాలను ప్రభుత్వానికి చెందినదిగా గుర్తించారు. ఇద్దరు ప్రభుత్వ టీచర్లను అపాయింట్ చేశారు. ఇక నుంచి ప్రభుత్వ టీచర్లే ఇక్కడ విద్యార్థులకు పాఠాలు చెప్తారని చెప్పి వెళ్లడం విశేషం. -
అప్పుల బాధతో వాచ్‌మన్ ఆత్మహత్య
చేవెళ్ల రూరల్: అప్పుల బాధ తాళలేక ఓ ప్రైవేట్ పాఠశాల వాచ్‌మన్ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెద్దనందిపాడు గ్రామానికి చెందిన జి. వరప్రసాద్ కొంతకాలంగా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. పదిహేనేళ్ల క్రితం కుటుంబంతో సహా చేవెళ్లకు వలస వచ్చాడు. ఇటీవలే చేవెళ్లలో కొత్తగా ఇల్లు నిర్మించుకున్నాడు. వరప్రసాద్‌కు భార్య ప్రమీల, కూతుళ్లు శ్వేత, అనూషలు ఉన్నారు. కుటుంబ పోషణకు, ఇంటి నిర్మాణానికి ఆయన తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. వాటికి వడ్డీలు పెరిగిపోయాయి. కుమార్తెలు పెళ్లీడుకు రావడం, అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో వరప్రసాద్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆయన పనిచేస్తున్న పాఠశాలలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహానికి చేవెళ్ల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చింది. వరప్రసాద్ భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బడి నుంచి తప్పించుకుని... గుడిలో ఆశ్రయం
యాచారం(రంగారెడ్డి జిల్లా): రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి విద్యార్థులు తప్పించుకు పోవడం తీవ్ర కలకలం రేపింది. సదరు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న యాజమాన్యం, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు మండల కేంద్రంలో ఉన్న ఓ మత సంస్థ నడుపుతున్న రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. అయితే, క్రమశిక్షణ విషయంలో యాజమాన్యం నిక్కచ్చిగా ఉండటంతో నలుగురు విద్యార్థులు పారిపోవాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఆ నలుగురూ సోమవారం రాత్రి 8.30 గంటల తర్వాత భోజనం చేసి పాఠశాల ప్రహరీ దూకి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత వారు లేకపోవటాన్ని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తప్పించుకున్న సదరు బాలురు సోమవారం రాత్రి కాలినడకన నందివనపర్తి గ్రామం చేరుకున్నారు. పాఠశాలలో చదివే గ్రామానికి చెందిన పవన్ ఇంటికెళ్ల్లి భోజనం చేసి అక్కడే నిద్రించారు. ఉదయం నిద్ర లేచిన విద్యార్థులు గ్రామంలోని నందీశ్వరాలయంలో తల దాచుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి వారికి కౌన్సిలింగ్ చేశారు. అయితే, వారు తిరిగి స్కూలుకు వెళ్లటానికి ఇష్టపడకపోవటంతో తల్లిదండ్రులను రప్పించి, వారి ఇళ్లకు పంపించారు.