
సాక్షి, కామారెడ్డి: జీవ్‌దాన్ ప్రైవేట్ స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థిని పట్ల పీఈటీ అసభ్యంగా ప్రవర్తించాడని.. రూమ్‌లో బంధించి విద్యార్థినిని వేధించాడంటూ పాఠశాల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి సంఘాల నాయకులు.. స్కూల్ అద్దాలను ధ్వంసం చేశారు.
అడ్డుకున్న సీఐ చంద్రశేఖర్‌పై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. సీఐకి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పీఈటీ నాగారాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇదీ చదవండి: హలో.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో..
Comments
Please login to add a commentAdd a comment