student unions
-
విశాఖ: ‘సీజ్ ద నారాయణ కాలేజ్’
విశాఖపట్నం, సాక్షి: సీజ్ ద నారాయణ కాలేజ్ నినాదంతో మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజ్ క్యాంపస్ మారుమోగుతోంది. యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడగా.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థి సంఘాలు ఈ ఉదయం ఆందోళనకు దిగాయి.ఒడిశా రాయ్‌పూర్‌కు చెందిన చంద్రవంశీ(17) అనే విద్యార్థి.. మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజీలో సెకండ్ఇయర్ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ.. కాలేజీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. కాలేజీ యాజమాన్యం నుంచి ఒత్తిడి భరించలేకనే అతను చనిపోయినట్లు విద్యార్థి సంఘాలు ఇప్పుడు ధర్నాకు దిగాయి.చంద్ర వంశీ ఆత్మహత్యపై కళాశాలలో నిన్న రాత్రి(బుధవారం) స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. గేట్లు వేసి, హాస్టల్ రూమ్‌లకు తాళాలు వేసి విద్యార్థులను లోపలే బంధించింది. ఆపై రంగ ప్రవేశం చేసిన పోలీసులు సైతం విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం.విషయం తెలిసిన ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు కాలేజ్ దగ్గరకు చేరుకుని ధర్నాచేపట్టాయి. చంద్ర వంశీ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, కాలేజీని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ అండదండలతో నారాయణ కళాశాల యాజమాన్యం రెచ్చిపోతుందని ఆరోపించాయవి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
కామారెడ్డి: ప్రైవేట్ స్కూల్ వద్ద ఉద్రిక్తత.. సీఐపై రాళ్ల దాడి
సాక్షి, కామారెడ్డి: జీవ్దాన్ ప్రైవేట్ స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థిని పట్ల పీఈటీ అసభ్యంగా ప్రవర్తించాడని.. రూమ్‌లో బంధించి విద్యార్థినిని వేధించాడంటూ పాఠశాల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి సంఘాల నాయకులు.. స్కూల్ అద్దాలను ధ్వంసం చేశారు.అడ్డుకున్న సీఐ చంద్రశేఖర్‌పై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. సీఐకి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పీఈటీ నాగారాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: హలో.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. -
వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం
తిరుపతి సిటీ: రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటును అడ్డుకున్న కూటమి ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. మంగళవారం తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 17 కొత్త మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం బడాబాబుల చేతుల్లో పెట్టేందుకు ప్రయతి్నస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యను కార్పొరేట్ విద్యగా మార్చి.. పేద విద్యార్థులకు అందకుండా చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో వచ్చే రెండేళ్లలో రాష్ట్ర విద్యార్థులు సుమారు 1,750 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. తక్షణమే పులివెందుల కాలేజీకి 50 సీట్లు దక్కేలా చర్యలు తీసుకోవాలని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను అడ్డుకోవద్దని డిమాండ్ చేశారు. ఈ నెల 19న నిర్వహించబోతున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్ఓ, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్ఓ, వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘాలు నేతలు పాల్గొన్నారు. పేద విద్యార్థుల కలలపై కూటమి కుట్ర: ఎంపీ డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకునేందుకు ఎంతో శ్రమిస్తున్న పేద విద్యార్థులపై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో వైద్య విద్యను ప్రైవేటుపరం చేసి సంపన్నులకే ఎంబీబీఎస్ చేసే అవకాశం కల్పించే విధంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేయడం దారుణం. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకతో పోల్చిచూస్తే.. ఏపీలో కేవలం 50 శాతం సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో సైతం కోత విధిస్తే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కలి్పంచడంతోపాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విద్యార్థి నేతలపై పోలీసుల అణచివేత
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులపై పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేసిన యువకులు, నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ ఒక ప్రకటనలో తప్పుపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగులతో రాహుల్‌గాంధీ ములాఖత్‌లు జరిపారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత అణచివేసే ప్రయత్నం చేస్తోందన్నారు.ఎన్నికలకు ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టి, నిరుద్యోగులను కాంగ్రెస్ వాడుకుందని చెప్పారు. కానీ ప్రస్తుతం వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. ప్రజాపాలన అంటూ పదేపదే చెబుతూ..నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన జాబ్ కేలండర్ తేదీల గడువు ఇప్పటికే తీరిపోయిందని తెలిపారు. నిరుద్యోగులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించేంతవరకు వదలం: హరీశ్‌రావు నిరుద్యోగుల సమస్యల పరిష్కారంతోపాటు డిమాండ్లు సాధించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున గొంతెత్తి నిరంతర పోరాటం చేస్తామన్నారు. టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండించారు. శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిని నిర్బంధించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు జరిగే అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తుతుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.అరెస్టులపై బీఆర్ఎస్ ఖండనఏడు నెలలుగా నిరుద్యోగ సమస్యలను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. కాంగ్రెస్‌పాలనలో అప్రకటిత ఎమర్జన్సీ అమలవుతోందని నిరంజన్‌రెడ్డి అన్నారు. నిరుద్యోగుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం తరపున ఎవరూ అందుబాటులో లేరని ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. -
ఎక్కడికక్కడే అరెస్టులు.. టీజీపీఎస్సీ వద్ద హైటెన్షన్
హైదరాబాద్, సాక్షి: నిరుద్యోగ జేఏసీ ఆందోళన నేపథ్యంలో నగరంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు డిమాండ్ల సాధనతో ఆందోళనకు దిగిన జేఏసీ కార్యకర్తలు.. టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. అయితే అప్పటికే నగరమంతా భారీగా మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడే వాళ్లను అరెస్ట్ చేశారు. బీజేవైఎం, బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర శివారుల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు.. ఎక్కడికక్కడే చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్లే యత్నం చేసిన విద్యార్థి సంఘం నేతల్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. -
‘నీట్’పై నోరు మెదపరేమి?
తిరుపతి సిటీ (తిరుపతి జిల్లా)/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నీట్ పేపర్‌లీక్ వల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, అయినా కేంద్రం నోరు మెదపకపోవడం దారుణమని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త విద్యార్థి సంఘాల పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. తిరుపతి ఎస్వీ వర్సిటీ ఏడీ బిల్డింగ్ వద్ద జిల్లా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.సంఘాల నేతలు మాట్లాడుతూ..లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆయోమయంలో ఉన్నా రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి నేతలు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించక పోవడం దారుణమన్నారు. ఎన్టీఏను రద్దు చేసి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు మోదీ సర్కార్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ, కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్దం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసు అడ్డుకుని దిష్టిబొమ్మలను లాక్కొన్నారు.ధర్నాలో విద్యార్థి సంఘాల నేతలు రవి, అక్బర్, నవీన్, ప్రవీణ్, మల్లి కార్జున, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నీట్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో భాగంగా విజయవాడ సిద్ధార్థ కళాశాల కూడలి వద్ద విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న నాయకులు కళాశాల లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు?
హైదరాబాద్‌లో గ్రూప్–2 విద్యార్థిని ప్రవల్లిక మరణం ఆత్మహత్యల అంశాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. పరీక్షల్ని ప్రభుత్వం వాయిదా వేయడం వల్లనే ఆమె నిరాశకు గురై చనిపోయిందని కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. పోలీసుల కథనం ప్రకారం శివరామ్ అనే మిత్రునితో ప్రవల్లిక కొన్నాళ్ళుగా ప్రేమలో వుంది. అతను మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమయ్యి, నిశ్చితార్థం చేసుకున్నాడు. అది ఆమె మనసును గాయపరిచింది. మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారూ? అనే ప్రశ్న ఇలాంటి సందర్భాల్లో ముందుకు వస్తుంటుంది. ప్రతి ఆత్మహత్యకూ ఏదో ఒక కారణం వుంటుంది. అలా అనుకుంటే ప్రతి ఆత్మహత్య ప్రత్యేక మైనదే అవుతుంది. వ్యక్తిగతం అవు తుంది. అప్పుడు ఆత్మహత్యలను సూత్రీకరించడం కుదరదు. చర్చించడమూ కుదరదు. ఆత్మహత్యలకు సమాజమే కారణం అని నిర్ధారించినవాడు ఫ్రెంచ్ సమాజ శాస్త్రవేత్త ఎమిలి డర్ఖేమ్ (1858 – 1917). సామాజిక సంక్షోభం కారణంగానే మను షులు ఆత్మహత్యలు చేసుకుంటారని నిర్ధారిస్తూ 1897లో ఆయన ‘లా సూసైడ్’ శీర్షికతో ఓ ఉద్గ్రంథాన్ని రాశాడు. మనుషులు ఏం కోరుకుంటారూ? అని అడిగితే ఒక్కొ క్కరూ ఒక్కో సమాధానం చెపుతారు. భారీ ఆదాయం వచ్చే ఉద్యోగం, విలాసవంతమైన ఇల్లు, అందమైన భార్య, మొన గాడైన భర్త, రాజ్యసభ సీటు, కేబినెట్లో స్థానం... ఇలా సాగుతుంది కోరికల జాబితా. వీటన్నింటినీ డర్ఖేమ్ కొట్టి పడేస్తాడు. ఈ కోరికలన్నీ పైకి కనిపించే అంశాలు; సారాంశంలో ప్రతి మనిషీ సంఘీభావాన్ని కోరుకుంటాడని చెబుతాడు. అదే మనిషి ప్రాథమిక కోరిక. సమాజంలో సంఘీభావం ఏ స్థాయిలో వుందో కొలవడానికి డర్ఖేమ్ ఒక పరికరాన్ని కనిపెట్టాడు. దానిపేరే ‘ఆత్మహత్య’. సంఘీభావానికీ ఆత్మ హత్యలకూ విలోమానుపాత సంబంధం వుంటుందని ఆయన తేల్చాడు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటే అక్కడ సంఘీభావం తక్కువగా వున్నట్టు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు తక్కువగా వుంటే ఆ సమాజంలో సంఘీభావం ఎక్కువగా వున్నట్టు భావించాలన్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాదీ దేశాల వారీగా ఆత్మహత్యల నివేదికను ప్రకటిస్తూ వుంటుంది. వివిధ దేశాల్లో ఏడాదికి లక్ష మందికి 10 నుండి 40 మంది వరకు ఆత్మ హత్యలు చేసుకుంటారు. అయితే ఈ గణాంకాలను కచ్చితమై నవని అనుకోలేము. అనేక కుటుంబాలు ఆత్మహత్యను సామా జిక అవమానంగా భావిస్తాయి. జీవిత బీమా తదితర టెక్నికల్ కారణాల వల్లనూ కొందరు ఆత్మహత్యల్ని దాచిపెడతారు. కొన్ని దేశాల్లో ఆత్మహత్య అనేది శిక్షించదగ్గ నేరం. ఇన్ని కారణాల వల్ల ఆత్మహత్యల గురించి కచ్చితమైన నివేదికలు రావు. అయితే, కొన్ని నిర్ధారణలు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు పనికి వస్తాయి. మహిళల్లో ఎక్కువ శాతం ఆత్మ హత్య చేసుకోవాలని అనుకుంటారు; కానీ పురుషులు ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకుంటారు. చదువుకోనివారికన్నా చదువుకున్నవారు, కుటుంబ వ్యవస్థలో వున్నవారికన్నా కుటుంబ వ్యవస్థలో లేనివారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసు కుంటారట! జంతువులు ఒంటరిగా జీవించగలవుగానీ మనుషులు ఒంటరిగా జీవించలేరు. యుద్ధ సమయాల్లో, ఉద్యమాల సందర్భాల్లో మనుషుల మధ్య సంఘీభావం వున్నత స్థాయిలో వుంటుంది. అప్పుడు ఆ సమాజాల్లో ఆత్మహత్యల రేటు చాలా తక్కువగా వుంటుంది. ఆ దశ దాటిపోగానే ఆ స్థాయి సంఘీభావాన్ని పొందలేక గొప్ప నైరాశ్యానికి గురయ్యి చని పోవాలనుకుంటారు. ఎమిలి డుర్ఖేమ్ దృష్టిలో ఆత్మహత్యలకు రెండే కారణాలుంటాయి. మొదటిది అనుబంధాలు; రెండోది ఆంక్షలు. అనుబంధాల వల్ల రెండు రకాలు ఆత్మహత్యలు, ఆంక్షల వల్ల మరో రెండు రకాల ఆత్మహత్యలు జరుగుతాయంటాడు. మొత్తం ఆత్మహత్యలు నాలుగు రకాలని ఆయన వర్గీకరించాడు. మను షుల మీద ప్రేమాభిమానాలు చాలా ఎక్కువయినపుడు వారి కోసం కొందరు స్వచ్ఛందంగా చనిపోవడానికి సిద్ధపడతారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి శ్రీరామరాజు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారూ, నక్సలైట్ ఉద్యమ అమరులూ ఈ కోవలోనికి వస్తారు. మనం ఇలాంటి చావుల్ని బలిదానాలు(ఆల్ట్రూయిస్టిక్ సూసైడ్) అంటాము. మనుషుల మీద ప్రేమాభిమానాలు బొత్తిగా లేన ప్పుడూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. మనుషుల మీద ప్రేమాభిమానాలు లేని మనిషి ఒక అహంతో బతుకుతుంటాడు. బయటి నుండి సంఘీభావం అందక చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి చావును అహంభావ ఆత్మహత్య (ఈగోయిస్టిక్ సూసైడ్) అంటారు. కొందరి మీద ఇంటాబయట ఆక్షలుంటాయి. బట్టలు ఎలా వేసుకోవాలి, తల ఎలా దువ్వుకోవాలి, ఎలా నడవాలి, ఏం చదవాలి, ఎవర్ని పెళ్ళి చేసుకోవాలి వరకు తల్లిదండ్రులే శాసిస్తుంటారు. కొందరిని ఆఫీసులో పైఅధికారులు వేధిస్తుంటారు. వీటిని తట్టుకోలేక కొందరు మరణానికి సిద్ధపడతారు. వీటిని నిర్బంధ మరణం (ఫాటలిస్టిక్ సూసైడ్) అంటారు. కొన్ని సందర్భాల్లో ‘ప్రభుత్వం చేసిన హత్య’ అంటుంటాం. ఇలాంటివి ఈ కోవలోనికే వస్తాయి. ఆంక్షల్ని, నియమ నిబంధనల్ని అస్సలు పట్టించుకోని వారు కొందరుంటారు. వీరిలోనూ ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటుంది. వీటిని క్రమ శిక్షణ రహిత ఆత్మహత్యలు (అనామిక్ సూసైడ్) అనవచ్చు. ఆత్మహత్యల్ని నివారించడానికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి కొన్ని యాప్‌లు కూడా వున్నాయి. ఆత్మహత్యల్ని నివారించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనది సంఘీభావం. అది వర్తమాన సమాజంలో క్రమంగా కను మరుగైపోతున్నది. ఇది అమానవీయమైన పరిణామం. మను షుల మధ్య సంఘీభావాన్ని నెలకొల్పడానికి అందరూ పూను కోవాల్సిన సందర్భం ఇది. డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు మొబైల్: 90107 57776 -
సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమేనా
కేయూ క్యాంపస్: కాకతీయ వర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులతో కొట్టించారని, పైగా తాము కొట్టలేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సమర్ధించుకోవటంపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై లైడిటెక్టర్ పరీక్షలు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు సిద్ధమేనా? అని సీపీకి సవాల్ విసిరారు. ఈ నెల 5న క్యాంపస్‌లోని ప్రిన్సిపాల్ ఆఫీస్ వద్ద విద్యార్థి నాయకులు ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో తమను పోలీసులు కొట్టారని విద్యా ర్థులు జడ్జి ఎదుట తెలిపారు. కాగా, ఆ విద్యార్థి నాయకులను శుక్రవారం రఘునందన్‌రావు కేయూ దూరవిద్య కేంద్రం ఆవరణలో పరామర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదై ఉన్న వీసీపై విచారణ జరపాల్సింది పోయి, ఆయనతో కలసి సీపీ ప్రెస్‌మీట్ నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. వీసీ, పీహెచ్డీ అవకతవకల వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పోలీసుల, ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12న వరంగల్ జిల్లా బంద్ చేపట్టినట్లు తెలిపారు. కాగా, పోలీసులు తమని అరెస్ట్‌చేసి టాస్క్‌పోర్స్ పోలీసులతో కొట్టించారంటూ విద్యార్థులు గవర్నర్ తమిళిసైని కలిసి ఫిర్యాదు చేశారు. -
యువజన, విద్యార్థి సమ్మేళనాలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా పార్టీ కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్).. వాటిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఉద్యమ సమయంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న యువజన, విద్యార్థి వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రత్యేక సమ్మేళనాలను నిర్వహించాలని భావిస్తోంది. విద్యార్థి, యువజన, ఉద్యోగ వర్గాలు తమకు అనుకూలంగా ఉన్నాయని బీజేపీ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ సమ్మేళనాల ద్వారా ఆయా వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మేలును వివరించేందుకు ప్రణాళిక రూపొందించింది. యువజన, విద్యార్థి సమ్మేళనాలతోపాటు వివిధ సామాజికవర్గాలతో ప్రత్యేక భేటీలు, సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 27న తెలంగాణ భవన్లో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఈ సమ్మేళనాలు, భేటీలకు సంబంధించిన షెడ్యూల్, విధి విధానాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా కమిటీలను పటిష్టం చేయడంపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ‘హైదరాబాద్ స్టేట్’ ప్రాంతాలపై నజర్ మహారాష్ట్రలో వరుస బహిరంగ సభలతో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలపై నెలకొన్న ఆసక్తిని అనువుగా మలుచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణతోపాటు పూర్వపు హైదరాబాద్ స్టేట్‌లో అంతర్భాగంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక జిల్లాల్లో బలం పెంచుకోవడంపై ఫోకస్ చేశారు. కనీసం 40 నుంచి 60 లోక్‌సభ నియోజకవర్గాల్లో అన్నిస్థాయిల్లో పార్టీ నిర్మాణం ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు ఈ నెల 25న రాష్ట్రంలోని 19వేల జనావాసాల్లో పార్టీ జెండా పండుగతోపాటు అదే రోజున అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 3వేల మందితో పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. -
టెన్త్ పేపర్ అవుట్
సాక్షి, హైదరాబాద్/ వికారాబాద్/ తాండూరు: టెన్త్ పరీక్షల తొలిరోజు.. పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. ఓ పాఠశాలలోని ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా మరో పాఠశాలలోని టీచర్‌కు పంపాడు. అతను ఇతర గ్రూపులకు పంపడంతో విషయం వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఇద్దరు ఉపాధ్యాయులు సహా నలుగురిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రైవేట్ స్కూళ్ల పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు విద్యాశాఖ ఆదేశించింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, వికారాబాద్ కలెక్టర్ వివరాలు వెల్లడించారు. అసలేం జరిగింది? పదవ తరగతి పరీక్షలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు తెలుగు పరీక్ష కోసం విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 9.30 నుంచి 12.30 గంటల వరకు జరిగే పరీక్ష కోసం 9.30కి ఇన్విజిలేటర్లు వారికి ప్రశ్నపత్రాలు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల–1లోని 5వ నంబర్ పరీక్ష హాల్లో కూడా అలాగే ఇచ్చారు. ఆ గదిలో శ్రీనివాసులు ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్నారు. అయితే అదే పాఠశాలలో రిలీవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బందెప్ప రూమ్ నంబర్ ఐదుకు వచ్చాడు. గైరుహాజరైన ఓ విద్యార్థికి చెందిన క్వశ్చన్ పేపర్ తీసుకుని శ్రీనివాసులుకు తెలియకుండా తన సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నాడు. తొలుత పొరపాటున ఓ వాట్సాప్ గ్రూప్‌కు పంపి వెంటనే డిలిట్ చేశాడు. 9.37 సమయంలో చెంగోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సమ్మప్పకు వాట్సాప్ ద్వారా పంపాడు. అతని ద్వారా ప్రశ్నపత్రం వేరే ఇతర వాట్సాప్ గ్రూపులకు, 11: 30 ప్రాంతంలో ఓ మీడియా వాట్సాప్ గ్రూప్‌కు వెళ్లింది. విలేకరులు కొందరు మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు అలాంటిదేమీ లేదని అన్నారు. కానీ పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థుల వద్ద ఉన్న పేపర్‌తో పోల్చి చూస్తే నిజమేనని తేలింది. దీంతో వారు అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రిమినల్ కేసుల నమోదు ఈ వ్యవహారంలో నలుగురిని సస్పెండ్ చేశామని, వీరిలో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారిస్తున్నామని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం సాయంత్రం విలేకరులకు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, విద్యాశాఖ అధికారులు, అదనపు కలెక్టర్‌ను రంగంలోకి దింపామని తెలిపారు. విచారణలో తాండూరు–1 స్కూల్ నుంచి పేపర్ లీకైనట్లు గుర్తించామన్నారు. పేపర్ ఫోటోలు తీసిన బందెప్పతో పాటు అతను పేపర్ సెండ్ చేసిన సమ్మప్పను విధుల నుంచి తొలగించి, క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించిన సెంటర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ శివకుమార్ (ముద్దాయిపేట, యాలాల మండలం), చీఫ్ సూపరింటెండెంట్ కె.గోపాల్ (తాండూరు హైస్కూల్–1)ను కూడా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రశ్నపత్రాన్ని ఫొటోలు తీసిన విషయాన్ని గమనించడంలో విఫలమైన శ్రీనివాస్‌ను ఇన్విజిలేషన్ విధుల నుంచి తొలగించటంతో పాటు అతనిపై కూడా తదుపరి విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించామని తెలిపారు. లీకైన పేపర్‌ను ఉపయోగించి మాస్ కాపీయింగ్ చేసినట్లుగా ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించలేదని కలెక్టర్ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్ ఫొటోలు తీసి మరో ఉపాధ్యాయుడికి పంపినప్పటికీ.. విద్యార్థులు ఆ పేపర్ ద్వారా కాపీయింగ్‌కు పాల్పడినట్టు తేలలేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రం బయటకు వాస్తవమే.. టెన్త్ ప్రశ్నపత్రం లీక్‌పై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన స్పందించారు. తాండూరు హైస్కూల్–1 నుంచి ప్రశ్నపత్రం మరో టీచర్‌కు వెళ్ళిన మాట వాస్తవమేనని ఆమె తెలిపారు. అయితే పరీక్ష సమయంలో ఇతరులెవరూ లోపలికి రాలేదని, లోపలి నుంచి ఎవరూ బయటకు వెళ్ళలేదని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపారని, బాధ్యులపై చర్యలు తీసుకున్నారని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. మిగతా పరీక్షలన్నీ యధాతథంగా జరుగుతాయని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లతో మిలాఖత్? ప్రశ్నపత్రం బయటకు వెళ్లిన వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు కూడా పరీక్ష హాల్లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్ళడం నిషేధం. అలాంటిది ఓ ఇన్విజిలేటర్ ఎలా తీసుకెళ్ళాడనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. అయితే అతని సెల్‌ఫోన్ ద్వారా వెళ్ళిన ప్రశ్నపత్రం ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులకు కూడా వెళ్ళినట్టు అనుమానిస్తున్న పోలీసు వర్గాలు ఈ దిశగా విచారణ చేపట్టాయి. ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి యత్నం టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీపై నిరసన వ్యక్తం చేస్తూ ఎన్ఎస్యూఐ ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి ప్రయత్నించింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్టేషన్‌కు తరలించారు. విద్యాశాఖ కార్యాలయం ఎదుట కూడా ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లీకేజీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ నేతలు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గతంలోనూ వివాదాస్పదుడే.. తాండూరు నంబర్–1 పాఠశాలలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న బందెప్పకు వివాదాస్పదుడిగా పేరుంది. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు స్కూల్ ఆవరణలోనే దేహశుద్ధి చేశారు. అప్పట్లో అతనిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. తాజాగా ప్రశ్నప్రతం లీక్ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
థాయ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం.. హిందీ నేర్పిస్తానని ఇంటికి..
గచ్చిబౌలి (హైదరాబాద్): హిందీ భాష నేర్చుకునేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి వచ్చిన థాయ్‌లాండ్ విద్యార్థినిపై ఒక ప్రొఫెసర్ అత్యాచార యత్నం చేశాడు. హిందీపాఠాలు నేర్పి స్తానంటూ తన ఇంటికి తీసుకెళ్లి.. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఇచ్చి లైంగికదాడికి ప్రయత్నించాడు. వర్సిటీలో బాధితురాలితోపాటు చదివే విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్లు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. వర్సిటీ అధికారులు సదరు ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ధర్నా విరమించారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌రావు వెల్లడించారు. హిందీ నేర్పిస్తానంటూ.. థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థిని (24) హెచ్‌సీయూలో ఎంఏ హిందీ చదువుతోంది. 25రోజులుగా హెచ్‌సీయూలోని ఇంటర్నేషనల్ స్టడీస్ హస్టల్లో ఉంటోంది. వర్సిటీ హిందీ విభాగం ప్రొఫెసర్ రవి రంజన్ ఆమెపై కన్నువేశాడు. హిందీ నేర్పిస్తానని, తన నివాసానికి రావాలని కోరాడు. శుక్రవారం క్లాసులు ముగిశాక సాయంత్రం 4 గంటల సమయంలో తన కారులో ఎక్కించుకుని మసీదుబండ ప్రాంతంలోని తన ఫ్లాట్‌కు తీసుకువెళ్లాడు. పాఠాలు చెప్తూ కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి థాయ్‌లాండ్ విద్యార్థినికి ఇచ్చాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె.. వెంటనే థాయ్‌లాండ్‌లోని ప్రొఫెసర్‌కు ఫోన్ చేసి రవి రంజన్ అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం చెప్పింది. థాయ్‌లాండ్ ప్రొఫెసర్ వెంటనే రవి రంజన్‌కు ఫోన్ చేసి విద్యార్థినిని వదిలేయాలని తీవ్రంగా మందలించాడు. దీనితో భయపడిన రవి రంజన్.. రాత్రి 9 గంటల సమయంలో విద్యార్థినిని వర్సిటీ హస్టల్ సమీపంలో వదిలివెళ్లిపోయాడు. బాధిత విద్యార్థిని ఈ విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పడంతో వెంటనే వర్సిటీ క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న అసొసియేట్ ప్రొఫెసర్ అలోక్ మరో ఇద్దరు హెల్త్ సెంటర్ వద్దకు వచ్చారు. అయితే థాయ్ విద్యార్థినికి హిందీ, ఇంగ్లిష్ రాకపోవడంతో ఏం జరిగిందో సరిగా చెప్పలేకపోయింది. దీనితో వారు థాయ్ ప్రొఫెసర్ సాయంతో ఆమెపై అత్యాచార యత్నం జరిగినట్టు తెలుసుకున్నారు. దీనిపై శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ 354, 354ఏ సెక్షన్ల కింద ప్రొఫెసర్ రవి రంజన్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. థాయ్ విద్యార్థిని స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, షాక్‌లో ఉన్న ఆమె తేరుకున్నాక మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని.. అవసరమైతే సెక్షన్లు మార్చుతామని మాదాపూర్ ఏసీపీ రఘునందన్‌రావు తెలిపారు. అట్టుడికిన క్యాంపస్ ప్రొఫెసర్ రవిరంజన్ ఘాతుకం తెలిసిన హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వర్సిటీ ప్రధాన ద్వారం లోపల స్టూడెంట్ యూనియన్, ఏబీవీపీ ధర్నాకు దిగాయి. ప్రొఫెసర్, యూనివర్సిటీ మేనేజ్మెంట్ తీరును నిరసిస్తూ ఆందోళన చేశాయి. హెచ్‌సీయూ రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్, వీసీ సర్రాజు, ఇతర అధికారులు విద్యార్థులతో చర్చలు జరిపారు. ప్రొఫెసర్ రవి రంజన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనపై వర్సిటీ స్వయంగా ఫిర్యాదు చేస్తుందని హమీ ఇచ్చారు. దీనితో విద్యార్థి సంఘాలు ధర్నా విరమించాయి. మహిళా సాధికారత ఉపన్యాసంతో! థాయ్ విద్యార్థినిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ప్రొఫెసర్ రవి రంజన్ ఇటీవల మహిళా సాధికారతపై ఉపన్యాసం ఇచ్చినట్టు విద్యార్థులు చెప్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదంటూ మండిపడ్డారు. పోలాండ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన రవి రంజన్.. 2018లో హెచ్‌సీయూలో చేరినట్టు చెప్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం హెచ్సీయూకు ఇప్పటివరకు మంచిపేరు ఉంది. కానీ ప్రొఫెసర్ రవి రంజన్ చర్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. థాయ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలి. అప్పటిదాకా పోరాడుతాం. – అభిషేక్ నందన్, హెచ్‌సీయూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు రవి రంజన్‌పై కఠిన చర్యలు చేపట్టాలి ప్రొఫెసర్లను తండ్రులుగా, అన్నలుగా భావిస్తారు. అలాంటి వారు కంచే చేను మేసినట్టుగా అత్యాచార యత్నం చేయడం సిగ్గుచేటు. ప్రొఫెసర్ రవి రంజన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. వర్సిటీలోని వేధింపుల సెల్లో మూడు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఇలాంటి వేధింపుల కేసులెన్నో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాలి. – మహేశ్ నమాని, ఏబీవీపీ నేషనల్ కన్వీనర్ -
Telangana: ఎంసెట్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తీవ్ర తర్జనభర్జనలు, విద్యార్థి సంఘాల నిరసనల నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్‌ను వాయిదా వేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఈమేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అయితే 14, 15 తేదీల్లో జరగాల్సిన వ్యవసాయ, మెడికల్ విభాగానికి చెందిన ఎంసెట్ మాత్రమే వాయిదా వేశామని, 18 నుంచి 20వరకూ జరిగే ఇంజనీరింగ్ విభాగం ఎంసెట్ యథావిధిగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వాయిదా పడ్డ ఎంసెట్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలి పారు. రాబోయే మూడు రోజులూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఐటీ కన్సల్టెన్సీ సంస్థ నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకున్న మండలి వర్గాలు కూడా వర్షాలున్నా ఎంసెట్‌ను నిర్వహించి తీరుతామని తొలుత స్పష్టం చేశాయి. విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో ఎంసెట్‌ను వాయిదా వేయడానికి ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. 16 వరకు ఓయూ పరీక్షలు వాయిదా: ఓయూ పరిధిలో ఈనెల 16 వరకు అన్ని పరీక్షలను వాయిదా వేసిన్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. ప్రధాన కార్యాలయాలు యథావిధిగా కొనసాగుతాయని సపోర్టింగ్ స్టాఫ్ విధులకు హాజరుకావాలన్నారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షలు వాయిదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈనెల 14, 15 తేదీల్లో జరగాల్సిన పీజీ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పరాంకుశం వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా పడ్డ పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. -
జేఎన్టీయూహెచ్లో విద్యార్థి సంఘాల ఘర్షణ
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): జేఎన్టీయూహెచ్లో విద్యార్థి సంఘాల నడుమ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణ గురువారం బహిర్గతమైంది. బుధవారం రాత్రి మెటలర్జీ విభాగానికి చెందిన ఓ విద్యార్థిని ఏబీవీపీ నాయకులు క్యాంటీన్ వద్దకు పిలిచి దాడి చేశారని, గురువారం ఉదయం జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దీంతో సదరు ర్యాలీలో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు పాల్గొన్నారని, బయటి వ్యక్తులను ఎలా రానిస్తారంటూ ఏబీవీపీ నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల నడుమ మరోమారు ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికే ర్యాలీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు సంఘాల నాయకులు ఘర్షణ పడకుండా అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఏబీవీపీ నాయకులు అక్కడి కొన్ని జెండాలను తొలగించి దగ్ధం చేసేందుకు యత్నిస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన మఫ్టీ పోలీసును తోసేశారు. దీంతో అప్పటికే అక్కడే ఉన్న ఇతర పోలీసులు వెంటనే తమ లాఠీలకు పని చెప్పారు. అక్కడి విద్యార్థులను జీపుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ ఘర్షణలో కొందరు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘర్షణకు కారమైన విద్యార్థి నాయకులు, విద్యార్థులపై కేసులు నమోదు చేస్తామని, మరోమారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని సీఐ కిషన్‌కుమార్ తెలిపారు. దాడిని ఖండిస్తూ ర్యాలీ... బుధవారం రాత్రి జరిగిన దాడిని ఖండిస్తూ జేఏసీ నాయకులు యూనివర్సిటీలోని అన్ని కళాశాల ముందు నుంచి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని, దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వీసీకి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లగా వీసీ లేకపోవడంతో రిజిస్ట్రార్‌కు, ఓఎస్డీకి వినతి పత్రం ఇచ్చి వెనుదిరిగారు. కాగా విద్యార్థులను నడుమ సఖ్యతను పెంచి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తోడ్పడాల్సిన విద్యార్థి సంఘాల వ్యవహారాలను చూసే అధికారి పేరుతోనే విద్యార్థులు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై పలువురు విద్యార్ధులు బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం యూనివర్సిటీ ఉన్నతాధికారులకు తలనొప్పి తెచ్చిపెడుతుండటం గమనార్హం. (క్లిక్: ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్) -
గిరిజన వర్సిటీ కావాలని..
ఆదిలాబాద్‌టౌన్: గిరిజన విశ్వవిద్యాలయాన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఆదిలాబాద్‌లో సోమవారం చేపట్టిన మహాధర్నాలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ధర్నాలో భాగంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వాహనాన్ని విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు నచ్చజెప్పినా విద్యార్థి నేతలు మాట వినకపోవడంతో లాఠీచార్జికి దిగారు. అప్పటికే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నా రు. ఆయన ఆదేశాల మేరకు ఆందోళనకారులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
ఐశ్వర్యది ప్రభుత్వ హత్యే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన విద్యార్థిని ఐశ్వర్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని లేడీ శ్రీరాం కళాశాల (ఎల్ఎస్ఆర్ ) స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఆరోపించింది. కళాశాల ఉదాసీన వైఖరి సరికాదని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 3న ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి నిరసనగా కేంద్ర సైన్స్, టెక్నాలజీ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ, జేఎన్‌యూ విద్యార్థి నేతలు ధర్నా నిర్వహించారు.జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ (టీఎస్ఏ), ఐద్వా–ఢిల్లీలు కూడా నిరసన గళం వినిపించాయి. జస్టిస్ ఫర్ ఐశ్వర్య నినాదంతో ఆందోళన చేశారు. ‘కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వైఫల్యం కారణంగా అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఉపకార వేతనం ఆలస్యం కావడం వల్లే ఐశ్వర్య ఆర్థిక ఒత్తిడికి గురైంది. కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి రాజీనామా చేయాలి. ఐశ్వర్య కుటుంబానికి ప్రభుత్వం పరిహారమివ్వాలి. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు తరగతులు బహిష్కరి స్తున్నాం’ అని ఎస్ఎఫ్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఐశ్వర్యకు చెల్లించాల్సిన ఉపకార వేతనంతో పాటు అదనంగా కొంత మొత్తాన్ని బాధిత కుటుం బానికి అందజేయాలి. విద్యార్థులందరి ఖాతా ల్లోనూ తక్షణమే ఉపకార వేతనాలు జమచేయాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులకు మద్దతుగా కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని ఐద్వా ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు మెమూనా మొల్లా, ఆశాశర్మ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ విద్యా విధానం బాగా సాగుతోందని కేంద్రమంత్రి భావిస్తున్నారని, కానీ విద్యార్థుల ఇబ్బందులు విస్మరిస్తున్నారని జేఎన్‌యూ ప్రతిని«ధులు పేర్కొన్నారు. ‘రాష్ట్రేతర వర్సిటీలు, విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానం తీసుకురావాలి. వేరే ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడమే ఐశ్వర్య ఆత్మహత్యకు కారణం. ఢిల్లీలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఐశ్వర్య కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి. ఐశ్వర్య చెల్లెల్ని ప్రభుత్వమే చదివించాలి’ అని టీఎస్ఏ ప్రతినిధి వివేక్ తెలిపారు. ఎల్ఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉన్నిమాయ, ఎస్ఎఫ్ఐ ఢిల్లీ సంయుక్త కార్యదర్శి మౌనిక శ్రీసాయి, జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్, అంబేడ్కర్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ కౌన్సిలర్ నవీన లాంబా, ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సంయుక్త కార్యదర్శి దీప్సిత ధర్, ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి, ఏపీ బాధ్యురాలు బూస అనులేఖ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. కాగా, కేంద్ర విద్యా మంత్రి పోఖ్రియాల్ నివాసం వద్ద ఎన్ఎస్యూఐ, తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ కార్యకర్తలు ఆందోళన చేయడానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్యక్రమాన్ని విరమించారు. ఒత్తిడికి లోనై.... ఎస్ఎఫ్ఐ ఢిల్లీ విభాగం నిర్వహించిన వెబ్ మీడియా సమావేశంలో ఐశ్వర్య తల్లి మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో ఇంటికి వచ్చిన ఐశ్వర్యకు వసతి గృహం ఖాళీ చేయాలని ఇటీవల సందేశం వచ్చిందన్నారు. మధ్యలో చదువు మానేస్తే నవ్వులపాలు అవుతామని తీవ్ర ఒత్తిడికి లోనయిందని చెప్పారు. ఉపకార వేతనం సకాలంలో అంది ఉంటే తమ కుమార్తె దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్య మృతికి రాహుల్ సంతాపం ఐశ్వర్వ ఆత్మహత్య పట్ల కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు, లాక్డౌన్ వంటి నిర్ణయాలతో లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసిందని, ఇది నిజమని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. -
పవన్ స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారు: విద్యార్ధి సంఘాలు
-
రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ మానవ హారాలు
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం నిర్వహించారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖపట్నం: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ ఏయు మెయిన్ గేట్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు కామనతారావు ఆధ్వర్యంలో విద్యార్ధులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, విశాఖ సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా తయారై రాష్ట్రాభివృద్దిని అడ్డుకుంటున్నారని.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే వికేంద్రీకరణ జరగాలని నాయకులు, విద్యార్ధి నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్సార్: జిల్లాలోని అంబెడ్కర్ కూడలి వద్ద ముడవ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల రిలే దీక్షలు కొనసాగుతున్నయి. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి, సుబ్బమ్మ ఆధ్వర్యంలో ఈ దీక్షలు జరుగుతున్నాయి. ‘ఒక రాజదాని వద్దు మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అడ్డుకున్న వారు చరిత్ర హీనులుగా మారుతారని పలువురు నేతలు హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా ఆధ్వర్యంలో విద్యార్ధులు మానవహారం చేపట్టారు. శ్రీహరి డిగ్రీ కళాశాల నుండి ఐటీఐ కూడలి వరకు భారీ ర్యాలీ జరిగింది. ఐటీఐ కూడలి లో మానవహారం నిర్వహించిన విద్యార్థులు.. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ నినాదాలు చేశారు. కృష్ణాజిల్లా: ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ విస్సన్నపేట పట్టణంలోవిద్యార్ధులు, ప్రజలు పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. ఈ మానవహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి సంఘీభావం తెలిపారు. విజయవాడ గన్నవరం వైఎస్సార్ సీపీ ఇంచార్జి, కేడీసీసీబీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో అభివృద్ధి వికేంద్రీకరణ మద్దతు ర్యాలీ జరిగింది. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో పెద్దెఎత్తున మానవహారంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు, విద్యార్ధులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడనే నమ్మకంతో 151 సీట్లు ఇచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. గతంలో రెండు లక్షల 20 వేల కోట్లు ఒకేచోట కుప్పపోసి నష్టపోయాయని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదే సీఎం జగన్ అన్ని ప్రాంతాలు అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పీఎం జగన్మోహన్రెడ్డి తలపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రజలు నుంచి భారీ మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డులో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకటరావు పాల్గొన్నారు. విజయనగరం: మూడు రాజధానులకు మద్దతుగా విజయనగరం కోట జంక్షన్లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ మానవహారంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్ధులు శృంగవపుకోట దేవిబొమ్మ కూడలిలో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజు, పినిశెట్టి వెంకటరమణ, రహిమాన్ పాల్గున్నారు. పాలన వికేంద్రీకరణకు మద్దతుగా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కోట జంక్షన్ నుంచి గంట స్థంభం వరకు కొనసాగిన ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు. కర్నూలు: అభివృద్ధి వికేంద్రీకరణ మద్దతుగా, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద మానవహరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్థన్ రెడ్డి, యువజన విభాగం నాయకులు అనిల్, కృష్ణకాంత్ రెడ్డి, ఆదిమోహన్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు రాయలసీమ ద్రోహి
-
రాహుల్, ప్రియాంకలను ఆపేశారు
న్యూఢిల్లీ/కోల్‌కతా/బిజ్నోర్/మీరట్: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో గత వారం ‘పౌర’ ఆందోళనల్లో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను మీరట్ పోలీసులు అడ్డుకున్నారు. ‘మీరట్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో నిషేధాజ్ఞలు విధించాం. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాం. దీంతో వారే వెనక్కి వెళ్లిపోయారు’ అని పోలీసులు తెలిపారు. ‘సంబంధిత ఉత్తర్వులను చూపాలని పోలీసులను అడిగాం. అవేమీ చూపకుండా వారు మమ్మల్ని వెనక్కి వెళ్లాలన్నారు’ అని రాహుల్, ప్రియాంక మీడియాతో అన్నారు. ‘పౌర’ చట్టంపై ఏకమైన విద్యార్థి సంఘాలు పౌరసత్వ చట్ట సవరణతోపాటు, కేంద్రం చేపట్టదలచిన జాతీయ పౌర పట్టిక, జనాభా పట్టిక సవరణలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న 70 యువ, విద్యార్థి సంఘాలు ఏకమయ్యాయి. నేషనల్ యంగ్ ఇండియా కో ఆర్డినేషన్ అండ్ కాంపెయిన్ (వైఐఎన్‌సీసీ) ఛత్రం కింద ఈ సంఘాలు మంగళవారం ఏకమయ్యాయి. 71వ గణతంత్ర దినోత్సవాలకు ముందుగానే కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని వైఐఎన్‌సీసీ సభ్యుడు సాయి బాలాజీ డిమాండ్ చేశారు. అతడు మా కాల్పుల్లోనే చనిపోయాడు ‘పౌర’ ఆందోళనల సందర్భంగా ఒక యువకుడి మృతికి తామే కారణమని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ పోలీసులు అంగీకరించారు. బిజ్నోర్‌లోని నహ్తౌర్లో హింసాత్మకంగా మారిన ఆందోళనలను అదుపు చేసేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎస్పీ విశ్వజీత్ శ్రీవాస్తవ మంగళవారం వెల్లడించారు. కాగా, ఎన్నార్సీపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా చేస్తున్న ప్రకటనలు పొంతనలేకుండా ఉన్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బెంగాల్ గవర్నర్‌కు చుక్కెదురు బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్ మరోసారి భంగపాటుకు గురయ్యారు. కోల్‌కతాలో జాదవ్‌పూర్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు బయలుదేరిన ఆయన్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న టీఎంసీ అనుబంధ విద్యార్థి సంఘం కార్యకర్తలు ఆయన వాహనం వర్సిటీలోకి ప్రవేశించకుండా మెయిన్ గేట్ వద్దే రోడ్డుపై బైఠాయించారు. గో బ్యాక్ అని నినాదాలు చేసుకుంటూ, నల్ల జెండాలు ప్రదర్శించారు. దీంతో యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ అయిన సురంజన్ దాస్‌కు గవర్నర్ ఫోన్ చేశారు. ఆందోళనకారులను శాంతింప జేయాలని సురంజన్‌ను కోరారు. ఫలితం లేకపోవడంతో గవర్నర్ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ధంకర్ మమత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. -
రాయలసీమలో చంద్రబాబుకు నిరసనల సెగ
కర్నూలు: జిల్లాలో పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించడానికి కర్నూలు చేరుకున్న చంద్రబాబు నాయుడుని వీజేఆర్ ఫంక్షన్ హాలు వద్ద రాయలసీమ విద్యార్థి సంఘాల నేతలు, జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఇటీవల రాష్ట్ర రాజధాని అమరావతిలో పర్యటన ముగించకున్న చంద్రబాబు.. సోమవారం కర్నూలుకు చేరుకున్న విషయం తెలిసిందే. పర్యటన గురించి తెలుసుకున్నవివిధ సంఘాల నేతలు వీజేఆర్ ఫంక్షన్ హాలు వద్దకు చేరుకొని.. చంద్రబాబు గో బ్యాక్ నినాదాలు చేస్తూ ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, జేఏసీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హైకోర్టు లేదా రాజధానిని రాయలసీమకు మార్చడానికి చంద్రబాబు అనుకూలంగా ప్రకటన చేస్తేనే ఆయనను కర్నూలు జిల్లాలో అడుగు పెట్టనిస్తామని విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. చదవండి: రాజధానిలో రక్తికట్టని వీధి నాటకం -
నైటీలు.. ముఖానికి చున్నీతో బాలికల హాస్టల్లోకి..
సాక్షి, బొబ్బిలి: మా వసతిగృహాలకు ప్రహారీ లేదు.. మేడపైకి సులువుగా ఎక్కే సన్‌షెడ్‌లు మీదుగా అర్ధరాత్రి పోకిరీలు లోనికి వచ్చేస్తున్నారు. అక్కడ మేం ఆరబెట్టుకున్న నైటీలు వేసుకుని బాలికల్లా లోనికి వచ్చేస్తున్నారు. మేం గట్టిగా కేకలు వేసేసరికి పారిపోతున్నారు. నిత్యం ఇదే యాతన... ఇప్పటికిలా ఆరుసార్లు వచ్చారు. మేం జిల్లా అధికారులు, పోలీసులకు కూడా పలుమార్లు చెప్పాం... అయినా చర్యల్లేవు. నిత్యం భయంగా వసతిగృహంలో గడుపుతున్నామని ప్రభుత్వ బీసీ కళాశాల, ప్రీమెట్రిక్ కళాశాల విద్యార్థినులు విలేకర్లు, విద్యార్థి సంఘాలతో చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి కూడా ఇలానే వచ్చేసరికి వారు ఎన్నాళ్లీ భయభ్రాంతులని అల్పాహారం తినకుండా నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులకు విషయం తెలిసి వారితో కలసి బైఠాయించారు. పట్టణ పరిధిలో ఐటీఐ కాలనీలో సమీకృత కళాశాల వసతి గృహం ఉండేది. ఇక్కడి వసతిగృహం గత ప్రభుత్వ హయాంలో విలీనం చేసి విద్యార్థులను పలు చోట్లకు తరలించారు. ఇదే వసతి గృహభవనాన్ని ప్రీమెట్రిక్, కళాశాల విద్యార్థినుల కోసం కేటాయించారు. దీనికి ప్రహరీ లేదు. పలుమార్లు అల్లరి మూకలు వసతిగృహంలోకి రాత్రి వేళల్లో లోనికి చొరబడుతున్నారని విద్యార్థినులు వాపోయారు. పలుమార్లు అధికారులకు కూడా తెలిపారు. శుక్రవారం కూడా ఇదే రీతిన రావడంతో వారు 100 నెంబర్‌కు కాల్ చేశామని చెప్పారు. మహిళా ఎస్ఐకు కూడా కాల్ చేశామన్నారు. కానీ ఎవరూ రాకపోవడంతో వేకువ జామున నాలుగు గంటల వరకూ బిక్కు బిక్కుమంటూ గడిపామన్నారు. గడచిన ఆదివారం ఓ అగంతకుడు తాము ఆరబెట్టుకున్న నైటీని ధరించి లోనికి వచ్చేశాడన్నారు. ముఖానికి చున్నీ వేసుకుని ఉన్నాడనీ, అయితే ఆ చున్నీ ఊడిపోవడంతో మీసాలు చూసి పెద్దగా కేకలు వేశామని విద్యార్థినులు చెప్పారు. వసతిగృహంలో జరిగిన ఘటనకు వార్డెన్, విద్యార్థినులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 120 మంది కళాశాల విద్యార్థినులు, మరో 60 మంది స్కూలు పిల్లలు ఉన్న ఈ వసతి గృహంలో నిత్యం ఏడు గంటలకు అల్పాహారం తినే విద్యార్థినులు ఈ ఘటనతో శనివారం టిఫిన్ చేయడం మానేశారు. మహిళా ఎస్ఐ కేటీఆర్ లక్ష్మీ, మహిళా రక్షక్ కోఆర్డినేటర్ మంగమ్మ వచ్చి విద్యార్థినులకు కౌన్సెలింగ్ చేశారు. అనంతరం టిఫిన్లు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ విలేకర్లతో మాట్లాడుతూ తమకు ఫోన్లు రాలేదన్నారు. సీఐ మాట్లాడుతూ 100కు డయల్ చేసినపుడు ఏ నంబరయినా రికార్డు అవుతుందనీ, కాల్ లిస్ట్ పరిశీలిస్తామని చెప్పారు. అనంతరం అక్కడకు వచ్చిన ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులను సీఐ కేశవరావు పిలిచి మాట్లాడారు. విద్యార్థినులు చేసిన నిరసనకు సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మద్దతుగా నిలిచారు. -
‘సచివాలయ’ నియామకాలపై విద్యార్థుల భారీ ర్యాలీ
సాక్షి, వైజాగ్ : సచివాలయ ఉద్యోగాల నియామకాలపై పలు ప్రాంతాలలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున అధ్యక్షతన విశాఖలోని అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నాగార్జున మాట్లాడుతూ.. సచివాలయ నియామకాలను ఓర్వలేక టీడీపీ, ఏబీఏన్ రాధాకృష్ణ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లోనే సీఎం జగన్ నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని ప్రశంసించారు. గత ఐదేళ్లో టీడీపీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, వీఎమ్‌ఆర్‌డీ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు బి కాంతారావు, విద్యార్థి నాయకులు మోహన్, కళ్యాణ్, క్రాంతి కిరణ్, ఎస్సీ సెల్ నాయకులు రొయ్య వెంకట రమణ పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగాలతో ఉపాధి కల్పించింనందుకు హర్షం వ్యక్తం చేస్తూ టెక్కలిలో యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం పై హర్షం వ్యక్తం చేస్తూ..వైఎస్సార్ జిల్లాలోని కోటిరెడ్డి కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎయిర్ బెలూన్లను ఎగురవేసి జై జగన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు నిత్యానంద రెడ్డి, పులి సునీల్ కుమార్, పాకా సురేష్ ఇతర నేతలు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రికి చేదు అనుభవం
కోల్‌కతా: కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబూల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుప్రియోను ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఐఏ, ఏఎఫ్‌ఎస్‌యూ, ఎఫ్‌ఈటీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు ఘెరావ్ చేశాయి. దీంతో ఆయన్ను కాపాడేందుకు సాక్షాత్తూ గవర్నర్ ధనకర్‌తో పాటు భారీగా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు హాజరైన సుప్రియో రాకను నిరసిస్తూ భారీసంఖ్యలో విద్యార్థులు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. సెమినార్ అనంతరం ఆయన తిరిగివెళుతుండగా కారును అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు తన జుట్టు పట్టుకుని లాగారనీ, దాడిచేశారని సుప్రియో ఆరోపించారు. అయితే సుప్రియో వర్సిటీ విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారని ఏఎస్‌ఎఫ్‌యూ నేత దెబ్రాజ్ దేబ్నాథ్ విమర్శించారు. ఈ ఉద్రిక్తత గురించి తెలుసుకున్న గవర్నర్ ధనకర్ హుటాహుటిన విశ్వవిద్యాలయానికి చేరుకుని సుప్రియోను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ఘటన అనంతరం ఏబీవీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. క్యాంపస్‌లోని ఏఎఫ్‌ఎస్‌యూ కార్యాలయంలోని కంప్యూటర్లు, సీలింగ్ ఫ్యాన్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. సుప్రియోపై దాడి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పశ్చిమబెంగాల్ సీఎస్‌ను గవర్నర్ ఆదేశించారు. -
రెండో రోజు ఇంటర్ బోర్డ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
తెలంగాణ ఇంటర్ బోర్డ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
ఇంటర్ బోర్డ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ మంటలు చల్లారడం లేదు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శిని కలవాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు. చదవండి : బయటపడుతున్న ఇంటర్ బోర్డు లీలలు.. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యవహించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డ్ వద్దకు భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని వేసిన సంగతి తెలిసిందే. -
నేడు విద్యా సంస్థలు బంద్
సాక్షి, అమరావతి బ్యూరో : విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైనా నేటికీ విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ పలు విద్యార్థి సంఘాలు మంగళవారం విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నది ఎస్ఎఫ్ఐ, వైఎస్సార్‌ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌ల ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో కేజీ టూ పీజీ వరకూ అన్ని విద్యాసంస్థలు బంద్‌కు సహకరించాలని ఆయా సంఘాల నాయకులు కోరారు. అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర కాగా, విద్యార్థి సంఘాల బంద్‌ను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు తప్పనిసరిగా పనిచేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రటరీ గిరిజాశంకర్ పేరిట ఆదివారం ఒక సర్క్యులర్ జారీ అయింది. బంద్‌ను విఫలం చేసే బాధ్యతను ఆర్జేడీ, డీఈఒలకు అప్పగించింది. మరోవైపు.. ప్రభుత్వ కుట్రను పిరికిపంద చర్యగా విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వం తన అణచివేత ధోరణిని వీడాలని.. విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ జేడీ రవీంద్రరెడ్డికి విద్యార్థి సంఘాలు వినతిపత్రం ఇచ్చాయి. విద్యా వ్యవస్థ నాశనం ఇదిలా ఉంటే.. టీడీపీ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని.. నాలుగేళ్ల పాలనలో సుమారు ఆరు వేల స్కూళ్లను మూసివేసిందని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ నేత డి. అంజిరెడ్డి విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క హామీ అమలుకాలేదన్నారు. మరోవైపు.. విద్యా సంస్థల బంద్‌ను ప్రభుత్వం అడ్డుకోవాలని చూడడం పిరికిపంద చర్యగా ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా అధ్యక్షులు కోటి అభివర్ణించారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే ఇలా వ్యవహరిస్తోందన్నారు. అలాగే, ప్రభుత్వం నిరంకుశ భావాలు వీడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర డిమాండ్ చేశారు. వారి ప్రధాన డిమాండ్లు ఇవీ.. - పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.. - కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం చేసి విద్యాహక్కు చట్టాన్ని పటిష్టం చేయాలి. - సంక్షేమ హాస్టళ్లలో మెనూను పూర్తిస్థాయిలో అమలుచేయాలి. మెస్ చార్జీలు పెంచాలి. - పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి - పెంచిన ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ కాలేజీల ఫీజులు తగ్గించాలి.. - ప్రతి మండలానికి జూనియర్ కాలేజీ, నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి.. - అన్ని యూనివర్సిటీల పరిధిలో మెగా సప్లిమెంటరీని నిర్వహించాలి. - జీఓ నం. 35ను రద్దుచేసి ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలి. - మూసివేసిన స్కూళ్లు, హాస్టళ్లను తిరిగి ప్రారంభించి, మౌలిక వసతులు కల్పించాలి.. - యూనివర్సిటీలలో ఖాళీ పోస్టులను భర్తీచేయాలి. పరిశోధన విద్యార్థులకు నెలకు రూ.8,000 ఇవ్వాలి. -
ఫీజు వేధింపులకు ఇంటర్ విద్యార్థిని బలి
హైదరాబాద్: ఫీజు వేధింపులకు ఓ ఇంటర్ విద్యార్థిని బలైంది. హాస్టల్ గదిలో ఉరేసుకుని విగతజీవిగా మారింది. ఈ సంఘటన హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రానికి చెందిన ధరణి సాయిలు, మంజుల దంపతులకు ముగ్గురు సంతానం. సాయిలు ఆర్టీసీ కండక్టర్. పెద్ద కూతురు అర్చన(15) చైతన్యపురిలోని శ్రీచైతన్య రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో బైపీసీ ఫస్టియర్ చదువుతోంది. రూ.లక్ష ఫీజుకుగాను సాయిలు రెండు నెలల క్రితం రు.50 వేలు చెల్లించారు. మిగతా ఫీజు చెల్లించాలని అర్చనపై యాజమాన్యం కొన్నిరోజులుగా ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలోనే రాఖీ పండుగ సందర్భంగా శనివారం అర్చన ఇంటికి వెళ్లి తిరిగి మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చింది. ఆమె నేరుగా హాస్టల్లోని తన గదికి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది.భోజన విరామ సమయంలో గదికి వచ్చిన సహ విద్యార్థినులు గమనించి వార్డెన్‌కు సమాచారమందించారు. వెంటనే వార్డెన్ వచ్చి సమీపంలోని ఓమ్నీ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అర్చన అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పడంతో మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాలేజీ నిర్వాహకులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసి కళాశాలను మూసేసి పారిపోయారు. పోలీసులు అర్చన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్య విషయం చెప్పారు. వెంటనే వారు కాలేజీకి వచ్చి బోరున విలపించారు. ‘యాజమాన్యం ఫీజుల వేధింపులతోనే మా కూతురు మృతి చెం దింది, వారంరోజుల్లో ఫీజు మొత్తం చెల్లించాలని అనుకున్నాం, ఫీజు చెల్లించే వరకు మా బిడ్డను కాలే జీకి పంపక పోయినా బాగుండేది’అని రోదించారు. దీంతో కళాశాల పరిసరాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి అర్చన తల్లిదండ్రులతో కలసి కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి: విద్యార్థి సంఘాలు అర్చన ఆత్మహత్యకు కారణమైన కళాశాల నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్, టీఆర్ఎస్వీ, టీఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ తదితర సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కళాశాల నిర్వాహకులు లక్షలాది రూపాయల ఫీజును ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఫీజుల పేరిట విద్యార్థులను వేధిస్తున్నారని అన్నారు. -
ఉక్కు ఉద్యమంపై విరిగిన లాఠీ
సాక్షి కడప/సెవెన్‌రోడ్స్ : వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ జాప్యానికి నిరసనగా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం.. పోలీసుల లాఠీచార్జితో ఉద్రిక్తంగా మారింది. ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అన్ని విద్యార్థి సంఘాల నాయకులు ప్లకార్డులు, జెండాలు పట్టుకుని ర్యాలీగా తరలివచ్చారు. సుమారు అరగంటపాటు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారిగా కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, సంఘాల నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విద్యార్థి సంఘాల నేతలను అదుపు చేయడం కష్టతరంగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. విద్యార్థి నాయకుడికి తీవ్ర గాయాలు విద్యార్థి నేతలందరినీ అరెస్టు చేసిన పోలీసులు.. విద్యార్థులను ఈడ్చి పడేశారు. లాఠీచార్జిలో వైవీయూకు చెందిన ఎస్ఎఫ్ఐ నాయకుడు నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. లేవలేని స్థితిలో ఉన్న అతన్ని వెంటనే కడప రిమ్స్ తరలించారు. తీవ్రంగా గాయపడి ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసుల లాఠీచార్జిని అధికార బీజేపీ, టీడీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలూ ఖండించాయి. ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఉక్కు పరిశ్రమ కోసం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాల ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా అక్కడే ఉద్యమబాటలో ఉండగా.. కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా ఆందోళనలో పాల్గొన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం జరిగే ప్రతి పోరాటానికి వైఎస్సార్ సీపీ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నా ఇప్పటి వరకూ ఏర్పాటు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, చంద్రబాబు ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజలను మోసగించారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా కేంద్రంతో కలిసి అధికారాన్ని పంచుకున్న టీడీపీ.. నేడు ఉక్కు పరిశ్రమ కోసమంటూ దొంగ ఆందోళనలు చేపడుతోందని ధ్వజమెత్తారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, వైఎస్సార్ స్టూడెంట్ ఫెడరేషన్, ఎన్ఎస్యూఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు విద్యా సంస్థల బంద్ ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై లాఠీచార్జిని నిరసిస్తూ శనివారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పాటించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
అసెంబ్లీ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును ఉపసంహరించుకోక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. మంగళవారం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ వామపక్ష విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడిని చేపట్టాయి. ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ముట్టడిలో పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. -
కరీంనగర్లో వామపక్ష విద్యార్థి సంఘాల ఆందోళన
-
'ఈ టెన్షన్ నా వల్ల కాదు'.. ఓయూ విద్యార్థి సూసైడ్ నోట్
సాక్షి, హైదరాబాద్: ఒత్తిడి తట్టుకోలేక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓయూ వసతి గృహంలోని బాత్రూమ్లో ఉరేసుకుని ఎంఎస్సీ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్‌కు చెందిన మురళి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను చదవలేకపోతున్నానని, పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసి ఉన్న ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో వర్సిటీ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. షూ లేస్.. ప్లాస్టిక్ తాడు.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్‌కు చెందిన ఈరమైన మల్లేశం, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి లక్ష్మి కూలి పని చేసి రెండో కుమారుడు మురళిని చదివించింది. మురళి దౌలాపూర్‌లో ప్రైమరీ, జగదేవ్‌పూర్‌లో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. 2017 –18లో సైన్స్ కాలేజీలో ఎంఎస్సీ ఫిజిక్స్ (నానో సైన్స్) ఫస్టియర్‌లో అడ్మిషన్ పొందాడు. క్యాంపస్‌లోని మానేరు హాస్టల్ రూం నంబర్ 159లో వసతి పొందుతున్నాడు. ఆదివారం ఉదయం విద్యార్థులు స్నానాల గది తలుపు తెరిచి చూడగా షూ లేస్, దుస్తులు ఆరేసుకునే ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకుని మురళి విగత జీవిగా కనిపించాడు. విషయం తెలుసుకున్న వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం మురళి మృతదేహాన్ని చూసి విచారం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అక్కడికి భారీగా చేరుకున్న విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ వీసీని ఘెరావ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ‘మురళి చదువులకు తల్లి లక్ష్మి కూలి డబ్బులే ఆధారం. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నానని, డీఎస్సీ కోసం ఇప్పటికే చాలా అప్పులు చేశానని ఆవేదన చెందేవాడు. ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలని తపన పడేవాడు’అని మురళి స్నేహితులు అశోక్, రవి తెలిపారు. విద్యార్థుల అడ్డగింత మురళి మృతదేహాన్ని రాత్రి 10:30 గంటల వరకు పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. మురళీ ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ఎదుట పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీలోనే బైఠాయించారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు మృతదేహాన్ని బయటకు వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న జేఏసీ చైర్మన్ కోదండరాం మురలికి నివాళి అర్పించారు. మురళి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకోవద్దని, పోరాడి సాధించాలని పిలుపు నిచ్చారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్యాణ్ తెలిపారు. నేడు ఓయూ బంద్ చేపట్టనున్నట్లు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ తెలిపారు. మరోవైపు క్యాంపస్‌లో శాంతి భద్రతల కోసం ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. ఇంతలోనే ఎంత పని చేశాడు: సోదరి ‘వారం రోజుల్లో ఇంటికి వస్తానన్నాడు.. ఇంతలోనే ఎంత పనిచేశాడు’అంటూ మురళి సోదరి కవిత కన్నీటి పర్యంతమైంది. ఈసీఐఎల్‌లో నివాసముంటున్న ఆమె.. తమ్ముడి మరణవార్త తెలిసి వెంటనే క్యాంపస్‌కు వచ్చింది. తమ్ముడి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైంది. ‘నిన్ననే ఫోన్లో మాట్లాడాడు. ఇంటికి రమ్మని అడిగితే.. పరీక్షలు ఉన్నాయి.. వారం రోజుల్లో వస్తానని చెప్పాడు’అని పేర్కొంది. ‘ఈసారి నోటిఫికేషన్ వస్తే ఉద్యోగం తప్పక సంపాదిస్తానన్నాడు. ఇంతలోనే ఇలా చేస్తాడని ఊహించలేక పోయా’అంటూ ఆమె రోదించింది. బతుకులు మారుస్తనంటివి గద బిడ్డా.. గజ్వేల్/జగదేవ్‌పూర్: మురళి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియగానే అతడి తల్లి లక్ష్మి కుప్పకూలిపోయింది. ‘ఎంత పని జేస్తివిరా బిడ్డ.. కడుపుకోత మిగిలిస్తివా. చిన్నతనంలోనే అయ్య సచ్చిపోయిండు. మంచిగ సదువుకొని మన బతుకులు మారుస్తనంటివి. ఏ కష్టమొచ్చిందని గిట్ల చేస్తివిరా. దేవుడా నేనేమి పాపం చేసిన. నాకు శోకమే పెట్టిస్తున్నవ్’అంటున్న ఆమె రోదనలు కంటతడి పెట్టించాయి. మురళి బలవన్మరణంపై ఓయూలో విద్యార్థుల ఆందోళన -
విద్యార్ధుల ఆత్మహత్యలపై రౌండ్‌టేబుల్ సమావేశం
-
‘గురుకుల’ మెయిన్ పరీక్షల తేదీల్లో మార్పులు
షెడ్యూలులో మార్పులు చేసిన టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెయిన్ పరీక్షల తేదీల్లో టీఎస్పీఎస్సీ మార్పులు చేసింది. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీ టీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పరీక్షలు ఈ నెల 29, 30 తేదీల్లో, వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వచ్చే నెల 18 నుంచి నిర్వహిం చనున్నట్లు ప్రకటించింది. గత నెల 31న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టు ఫైనల్ కీలను ఇటీవల ప్రకటించి మెయిన్ పరీక్ష తేదీల ను కూడా ప్రకటించింది. అయితే ఇంత త్వరగా మెయిన్ పరీక్షలకు సిద్ధం కావడం కష్టమని, కొంత గడువు ఇవ్వాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తి చేశాయి. దీంతో మరో 15 రోజులు గడువు ఇవ్వాలని కమిషన్ నిర్ణయించింది. పీజీటీ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 18, 19 తేదీల్లో, టీజీటీ మెయిన్ పరీక్షలను 20 నుంచి 22 వరకు, పీడీ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 18న నిర్వహిస్తామని ప్రకటించింది. (ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్–1 పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు–2 పరీక్షలు ఉంటాయి. ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు పేపరు–1 ఒకటే ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది). -
రసాభాస
– విద్యార్థి సంఘాలు, ప్రైవేటు స్కూళ్ల కరస్పాండెంట్లతో అధికారుల సమావేశం - విద్యార్థి సంఘాల ప్రశ్నలకు నీళ్లు నమిలిన కరస్పాండెంట్లు – చందాలు ఇస్తున్నామంటూ ఎదురుదాడి – అర్ధంతరంగా సమావేశం రద్దు చేసిన జేసీ-2 కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై జేసీ–2 రామస్వామి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రైవేట్ స్కూళ్ల కరస్పాండెంట్లు, హెచ్ఎంలు, విద్యార్థి సంఘాల సమావేశం రసాభాసగా మారింది. డీఈఓ తాహెరా సుల్తానా అధ్యక్షతన ముందుగా అధికారులు విద్యార్థి సంఘాల నాయకులు వై.ఓబులేసు(ఎస్సీ, ఎస్టీ విద్యార్థి పరిషత్), శ్రీరాములు(ఆర్పీఎస్ఎస్ఎఫ్), నాగమధు యాదవ్(ఎన్ఎస్యూఐ), రవికుమార్(ఆర్వీఎస్ఎఫ్), అక్బర్(ఎస్ఎఫ్ఐ) చంద్రప్ప(టీఎస్ఎఫ్)లతో సమావేశం అయ్యారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన జీఓలు 1, 42, 37, 99 లను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. దూసుకొచ్చిన విద్యార్థి సంఘాల నేతలు ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ నాయకులు జి.పుల్లయ్య, కట్టమంచి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కార్పొరేట్ పాఠశాలల హెచ్ఎంలతో సమావేశమైన జేసీ–2 అధికంగా ఫీజులను వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ నాయకులు స్పందిస్తూ కార్పొరేట్ స్కూళ్లలోనే అధికంగా ఫీజులను వసూలు చేస్తున్నారని, ఆయా పాఠశాలల యాజమాన్యాలను పిలిపించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. మరో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని కూడా పిలిపిస్తామని అధికారులు పేర్కొంటుండగా విద్యార్థి సంఘాల నాయకులు సమావేశంలోకి దూసుకొచ్చి నగరంలోని కొన్ని ప్రైవేట్‌పాఠశాలల్లో ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారో వివరించారు. ముఖ్యంగా రిడ్జ్, కట్టమంచి, అథెనా తదితర స్కూళ్లు ఒక్కో ఏడాదికి రూ.లక్ష వసూలు చేస్తున్నాయన్నారు. అందుకు వారు ప్రతిగా సంఘాల పేరుతో చందాలు వసూలు చేయడం లేదా అని ప్రశ్నించారు. ఇందుకు ఎవరికీ చందాలు ఇచ్చారో చెప్పాలని విద్యార్థి సంఘాలు పట్టుబట్టాయి. విద్యార్థి సంఘాల నాయకులు, ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వావాదం చోటుచేసుకోవడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు జేసీ–2 ప్రకటించి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా డీఈఓ మాత్రం సమావేశంలో నోరు మెదకపోవడం గమనార్హం. -
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత
విజయవాడ : విజయవాడలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీ మైదానంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ప్రభుత్వ కాలేజీలో రాజకీయ నేత విగ్రహ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో టీడీపీ కార్యకర్తలకు, విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురు విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
జూనియర్ కాలేజీల బంద్ విజయవంతం
– కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ – బంద్‌లో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ సంఘాలు కర్నూలు (సిటీ): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఒకేషనల్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని కోరుతూ మంగళవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన కాలేజీల బంద్ విజయవంతమైంది. పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులు వేర్వేరుగా బృందాలుగా ఏర్పడి నగరంలోని ప్రభుత్వ కాలేజీలను బంద్ చేయించారు. ఈ సందర్బంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయకపోవడం, కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయకపోవడంతో పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందనా్నరు. తమకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మె చేస్తే వారిని పట్టించుకోవడం లేదనా్నరు. ఈనెల చివరిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయని, అధ్యాపకులు సమ్మెలో ఉంటే వారి పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మతో ప్రభుత్వ జూనియర్ (టౌన్ మోడల్) కాలేజీ నుంచి రాజ్‌విహార్ వరకు శవయాత్ర నిర్వహించారు. పోలీసులు శవయాత్రను అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాలు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా కాలేజీల బంద్ చేయించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆందోళన కార్యక్రమాల్లో పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి భాస్కర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, ఇతర నాయకులు అక్బర్, శివ, రమణ, వినోద్, మోహన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బీచ్ ఫెస్టివల్‌కు వ్యతిరేకంగా పోరాటం
విజయవాడ : పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం వైగాగ్లో ఏర్పాటు చేయదలచిన బీచ్ ఫెస్టివల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ బాలికల విభాగం నగర కమిటీ తీర్మానించింది. ఆదివారం యూటీఎఫ్ భవన్లో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు హాజరై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ అధ్యక్షుడు టి. కోటి, బాలికల విభాగం రాష్ట్ర కో–కన్వీనర్ టి. రాణి పాల్గొన్నారు. -
ర్యాగింగ్ వద్దు..
వైవీయూ : విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ అనే ఆధిపత్య సంస్కృతిని బహిష్కరించి, ప్రజాస్వామ్య సంస్కతిని పెంపొందించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం యోగివేమన విశ్వవిద్యాలయంలో ఆర్ఎస్ఎఫ్, పరిశోధక విద్యార్థి సంఘం, వైవీయూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సెమినార్‌హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యవక్తగా హాజరైన విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ ర్యాగింగ్‌ను నిరోధించడంలో విశ్వవిద్యాలయ విఆ్యర్థులు ప్రగతిశీలభావాలు కలిగి ఉండి సమాజ అభివద్ధిలో క్రియాశీలకపాత్ర పోషించాలని సూచించారు. సమాజంలో ఉండే ఆధిపత్యాన్ని యూనివర్సిటీల్లో కూడా అసంబద్ధంగా అమలు అవుతోందని, విద్యాబోధన కూడా ఇందుకు అనుగుణంగా ఉందని విమర్శించారు. రాయలసీమ విద్యార్థి వేదిక (ఆర్ఎస్ఎఫ్) కన్వీనర్ మల్లెల భాస్కర్, కో కన్వీనర్ దస్తగిరి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు హక్కుల కోసం ఉద్యమించే సంస్కతి పెంపొందించుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యూనివర్సిటీలో విద్యార్థి హక్కుల నుంచి సమాజంలోని ప్రజల హక్కుల వరకు విద్యార్థులే ఉద్యమించాలన్నారు. విద్యార్థులు సామాజిక బాధ్యతతో ఉద్యమించాలని కరారు. ప్రగతి విరోధక విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలని కోరారు. ర్యాగింగ్ సంస్కతిని విడనాడి నిరుద్యోగ సమస్య వంటి సామాజిక సమస్యలపై పోరాడేందుకు అందరూ కలిసిరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు భరత్, రమేష్, విద్యార్థి నాయకలు గోపాల్, ప్రవీణ్, శ్యామిల్, శ్యాంసుందర్‌రెడ్డి, గురుప్రసాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెల1 నుంచి ధర్నాలు, బంద్‌లు
విజయవాడ(గాంధీనగర్): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఉద్యమబాట పట్టనుంది. ఫిబ్రవరి ఒకటిన అన్ని జిల్లా కేంద్రాల్లో రాస్తారొకోలు, 2న ధర్నాలు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని, 3న విద్యాసంస్థల బంద్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఐక్యకార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు పి.రాజీవ్త్రన్, ఎ.రవిచంద్ర మాట్లాడుతూ రోహిత్ మరణానికి కారకులైన కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, దత్తాత్రేయలను క్యాబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నా కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మాత్రమే చేసి రోహిత్ విషయాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెచ్చరిల్లుతోందని, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తుల దాడులు పెరిగాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. దాడులను అరికట్టి అన్నివర్గాల విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెంట్రల్ యూనివర్సిటీని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. రోహిత్ తమ్ముడికి పర్మినెంట్ ఉద్యోగంతోపాటు ఆ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఐ.బయ్యన్న (ఏఐఎస్ఎఫ్), డి. నారాయణరెడ్డి (వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్), కరీముద్దీన్ (స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్) పాల్గొన్నారు. -
హోదాతోనే అభివృద్ధి సాధ్యం
ఏపీకి ప్రత్యేక హోదా సాధించకుంటే ఇబ్బందులు తప్పవని వివిధ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. హోదా విషయంలో టీడీపీ, బీజేపీలు భిన్నమైన ప్రకటనలు చేస్తూ ప్రజల్ని గందరగోళపరుస్తున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ చేస్తున్న దీక్షకు మద్దతు తెలియజేసిన వారు హోదాపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అవి వారి మాటల్లోనే.... - గుంటూరు వెస్ట్ హోదాతో కొత్త పరిశ్రమలు వస్తాయి ప్రత్యేక హోదా వలన అనేక రకాల రాయితీలు వస్తాయి. తద్వారా కొత్తపరిశ్రమలు ఏర్పడుతాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు, కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోడీ గానీ ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. విదేశాలు తిరిగి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నా స్పందనలేదు. విదేశాలు తిరిగి ప్రజాధనం దుర్వినియోగం చేసేకన్నా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి చూడాలి. దాని ద్వార అనేక పరిశ్రమలు, కొత్త కోర్సులు వస్తాయి. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంపొందించే కేంద్రాలు వెలుస్తాయి. - ఎం.సూర్యారావు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు ప్రత్యేక హోదా వస్తే విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. నూతన పరిశ్రమలు వచ్చే సమయంలో, ఆ పరిశ్రమలకు అవసరమైన కోర్సులకు డిమాండ్ ఉంటుంది. విద్యార్థుల నుంచి కూడా నూతన పరిశ్రమలను, కొత్త టెక్నాలజీని ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యా సంస్థలలో సైతం పరిశోధనలు జరిగి, రాష్ట్ర భవిష్యత్‌కు అవసరమైన కోర్సులు, పరిశోధనలు పెరగడానికి అవకాశం ఉంది. ప్రత్యేక హోదాతో కొత్తగా నిధులు వస్తాయి కాబట్టి విద్యారంగం నిధుల కొరతతో కునారిల్లుతోంది. - వి.భగవాన్‌దాస్, ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి అన్యాయానికి హోదా తోనే పరిష్కారం ఐదు కోట్ల మంది ఆంధ్రులు ముక్త కంఠంతో వ్యతిరేకించిన విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేసేందుకుకు ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారం. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులకు ఎన్నికల్లో విచ్చలవిడిగా హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని విస్మరించి, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ జగన్‌కు విద్యార్థులు, యువత, నిరుద్యోగులు అండగా నిలవాలి. - లగుడు గోవిందరావు, ఏపీ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు హోదా విషయంలో సీఎం చేతులెత్తేశాడు చంద్రబాబు 600కు పై చిలుకు వాగ్దానాలు చేశారు. వాటన్నింటిని నెరవేర్చలేక అసమర్థుడుగా నిలబడ్డాడు. విభజన చట్టం అంశాల్లో చంద్రబాబు ఏం సాధించాడో తెలియజేయాలి. కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా సాధించడంలో చేతులెత్తేశాడు. జనాగ్రహం చవి చూస్తూనే కళ్ళు మూసుకుని పిల్లి పాలుతాగుతున్నట్లు తాను ఏదో సాధించబోతున్నట్లు చంద్రబాబు కబుర్లు చెబుతున్నాడు. జగన్ దీక్షకు అందరూ మద్దతు పలికి ఉద్యమం ఉధృతం చేసి చంద్రబాబు దిగి వచ్చేలా చేయాలి. - డేవిడ్ విజయకువూర్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర న్యాయవాదుల కార్యదర్శి చంద్రబాబు కొడుకును ప్రమోట్ చేస్తున్నారు.. చంద్రబాబు ప్రజాధనంతో కుమారుడిని ప్రమోట్ చేస్తున్నారు. సొంత డబ్బులతో చేసుకోవాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పు ఒప్పుకొని ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. లేదంటే 22వ తేదీ ప్రజలందరూ మోదీముందు తమ శక్తి ఏమిటో చూపిస్తారు. - హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ పార్టీ జనరల్ సెక్రటరీ టీడీపీ నేతలు కూడా మద్దతు పలకాలి.. వై.ఎస్.జగన్ వరుస ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజలు అశేషంగా తరలి వచ్చి తమ మద్దతు తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదు. భవిష్యత్తు తరాల కోసం జగన్ చేస్తున్న ఉద్యమాన్ని ఇప్పటికైనా టీడీపీ ప్రజాప్రతినిధులు మద్దతు పలకాలి. - మధుసూదనరెడ్డి, శ్రీకాళహస్తి సమన్వయకర్త రైతన్న వెన్ను విరిచేస్తున్నారు.. చంద్రబాబు తెలంగాణలో రైతుల రుణమాఫీ చేయాలని కేకలు పెడతారు. ఇక్కడ పది శాతం రుణమాఫీ చేసి మొత్తం చేశామని పచ్చి అబద్ధాలు చెబుతాడు. అతనికి ప్రజల శ్రేయస్సు అక్కర్లేదు. రైతులు, గిరిజనులు, కార్మికుల దయనీయ స్థితి అంతకన్నా పట్టదు. మాట్లాడితే చైనా, సింగపూర్, జపాన్, జర్మనీ అంటూ పరుగులు తీస్తాడు. అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్ రైతన్న వెన్ను విరిచేస్తున్నాడు. మూడు పంటలు పండే భూమిలో భవనాలు కట్టి తన కోటరికి శాశ్వత ఆస్తులుగా కట్టబెట్టడానికే తన శక్తి అంతా ధార పోస్తున్నాడు. ముక్కలైన మన రాష్ట్రంలో ప్రజలంతా అతన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని బాధపడుతున్నారు. చంద్రబాబు నీ పాలనలో ప్రత్యేక హోదా రానివ్వవా? పైగా ఉద్యమం చేస్తున్న వై.ఎస్.జగన్‌ను విమర్శిస్తావా...నీ చేష్టలకు ప్రజలు విసిగిపోయి తీర్పు చెప్పడానికి ఎదురు చూస్తున్నారు. - బత్తుల బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జగన్ ఉద్యమం ఎంతో గొప్పది.. జగన్‌కు జైజైలు... ఆయన ఉద్యమ స్ఫూర్తికి దండాలు... యువత భవిష్యత్తు కోసం ఉద్యమిస్తున్న పోరాట యోధుడు వై.ఎస్.జగన్. దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజ్యాంగంలోని ఎస్సీ, ఎస్టీ చట్టాలు గొప్పగా అమలు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం జగన్ చేస్తున్న ఈ ఉద్యమం ఎంతో గొప్పది. ప్రత్యేక హోదా వస్తే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి. అందరూ ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలి. - రామావత్ కృష్ణా నాయక్, బంజారా నగరభేరి రాష్ట్ర అధ్యక్షుడు ప్రజా ఘోష వినబడటం లేదా? యువత కోసం, ప్రజల కోసం అందరూ బాగుండాలని వై.ఎస్.జగన్ దీక్ష చేస్తుంటే ప్రజాప్రతినిధులు అయి ఉండి దొంగ దీక్ష అనడం నీతిబాహ్యం. చంద్రబాబుకు ఈ ప్రజా ఘోష వినబడడం లేదా. ఆయన థ్యాసంతా ఎలా దోచుకోవాలనే దానిమీద ఉంది. విదేశాలకు తిరగడానికి తీరిక ఉంది గానీ, ప్రజా సమస్యలు పట్టించుకోవడానికి లేదు. టీడీపీ శ్రేణులు ఇసుక, మట్టి, భూములు దోచుకుని పందికొక్కుల్లా తింటున్నారు. వీళ్లను ఎప్పుడు తరిమి కొడదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. బాబు చేసే పాపం అతనికే చుట్టుకుంటుంది. - కారుమూరి నాగేశ్వరరావు,తణుకు, మాజీ ఎమ్మెల్యే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ప్రత్యేక హోదా రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. ప్రభుత్వ విద్యావ్యవస్థలో మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. హోదా రాకుంటే రానున్న తరాల భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోదా విషయంలో మిన్నకుండిపోవడం బాధాకరం. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాలి. జగన్ చేస్తున్న దీక్షకు తమ సంఘం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. - ఎన్.ఝాన్సీ, పిడిఎస్యు జిల్లా అధ్యక్షురాలు హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే హోదా ఒక్కటే మార్గం. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితులలో హోదా లభించకుంటే ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. టీడీపీ, బీజేపీలు ఎన్నికల సమయంలో రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చారు. వాటిని ఇంతవరకు నెరవేర్చలేదు. హోదా మాటను పక్కనపెట్టి ప్రత్యేక ప్యాకేజీలు అంటున్నారు. ప్యాకేజీలతో పెద్దగా ఉపయోగం ఉండదు. - ఎ.అయ్యస్వామి, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ -
సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం
-
'బాబూరావును ఏ-1 ముద్దాయిగా చేర్చాలి'
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ విచారణ రెండో రోజు కూడా కొనసాగింది. ఇందులో భాగంగా ఈ కమిటీ గురువారం ఉదయం విద్యార్థులు, అధ్యాపకులు, యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సభ్యులతో సమావేశం అయింది. ప్రిన్సిపల్ బాబూరావును వెంటనే అరెస్ట్ చేసి, ఏ-1 ముద్దాయిగా చేర్చాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. బాబూరావు ఎదుర్కొంటున్న ఇతర అభియోగాలపై కూడా విచారణ జరపాలని పట్టుబట్టారు. గతంలో ముగ్గురు మహిళా అధ్యాపకులు అకారణంగా యూనివర్శిటీని ఎందుకు వదిలి వెళ్లిపోయారో వెలికితీయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. సెలవులు రద్దు చేసి వెంటనే తరగతులు నిర్వహించాలని, విద్యార్థులతో బహిరంగ విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మరో వైపు రెండో రోజు విచారణకు రిషితేశ్వరి హాస్టల్ విద్యార్థులు, ఆర్కిటెక్చర్ కాలేజీ విద్యార్థులు హాజరుకాలేదు. మధ్యాహ్నం తర్వాత విచారణ కమిటీని ప్రిన్సిపల్ బాబూరావు అనుకూల విద్యార్థులు కలిశారు. రిషితేశ్వరి తల్లిదండ్రులను రెండుగంటలసేపు కమిటీ విచారించింది. -
బడ్జెట్ కేటాయింపులపై నిరసనలు
తెలంగాణ తొలి బడ్జెట్లో విద్యారంగానికి సరైన కేటాయింపులు జరపలేదని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించాయి. ఈమేరకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బడ్జెట్ ప్రతులను తగులబెట్టారు. ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఓయూకు తీరని అన్యాయం జరిగిందని ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన చేపట్టారు. గురువారం ఆర్ట్స్ కళాశాల ఎదుట రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను వేర్వేరుగా దహనం చేశారు. వర్సిటీల నిధులను పెంచి ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. టీటీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి తీరని ద్రోహం చేసిందని, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను, విద్యార్థి అమరుల కలలను కల్లలు చేశారని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు ఆంజనేయగౌడ్ విమర్శించారు. ఈమేరకు తెలంగాణ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య పార్కు వద్ద టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక, బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు విద్యారంగానికి 16 శాతం నిధులు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం 10 శాతమే కేటాయించిందని విమర్శించారు. కార్యక్రమంలో టీటీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ గౌడ్, రాష్ట్ర నాయకులు సాయి, కిరణ్, రఘుకిరణ్, శ్రావణ్, శరత్ చంద్ర, సుశాంత్, పృథ్వీ, సాయినాథ్‌రెడ్డి, అర్జున్, వర్ధన్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో... చిక్కడపల్లి : బడ్జెట్లో విద్యారంగానికి అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌నాయక్, కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ విద్యారంగానికి ఇంత తక్కువగా నిధులిస్తే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. విద్య, ఉపాధికి ప్రాధాన్యతలేని బడ్జెట్ వృధా అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోట రమేష్, సహాయ కార్యదర్శి జగదీష్, నాయకులు గణేష్, జావిద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో..... హిమాయత్‌నగర్ : బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో గురువారం నారాయణగూడలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ, సహాయ కార్యదర్శి ఎం.వేణు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు సత్యప్రసాద్, నగర నాయకులు కృష్ణనాయక్, చైతన్య, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ మర్చిపోవడం దారుణమని వారు విమర్శించారు. -
ప్రచారానికి వస్తే పవన్ కళ్యాణ్‌ను తరిమికొడతాం
ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ: మెదక్ పార్లమెంట్ సీటుకు జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తే తరిమి కొడతామని ఓయూలోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. గురువారం ఓయూ జేఏసీ నేత కందుల మధు అధ్యక్షతన క్యాంపస్‌లో టీ-జాక్, ఓయూ జాక్, టీఆర్ఎస్వీ, టీఎంఎస్వై, బీఎస్ఎఫ్, టీఎంఎస్, ఎస్టీ,ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఇందులో మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీమాంధ్రుల ఏజెంట్, తెలంగాణ ఉద్యమ ద్రోహి జగ్గారెడ్డికి బీజేపీ సీటు ఇవ్వడం సిగ్గు చేటని విమర్శించారు. ఆయన తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే భౌతిక దాడులు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో విద్యార్థి జేఏసీ నాయకులు పిడమర్తి రవి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకట్, మర్రి అనిల్, విక్రమ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
'విఎన్ఆర్' ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన
బియాస్ దుర్ఘటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి విఎన్ఆర్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాలేజీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. దాంతో కాలేజీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు గత నెలలో విజ్ఞాన యాత్రలో భాగంగా ఉత్తర భారతంలో పర్యటించారు. అందులోభాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలోకి దిగిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయి మరణించిన సంగతి తెలిసిందే. అయితే కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థులకు నష్టపరిహారం ఇస్తామని ప్రకటించి కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తు శుక్రవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ర్యాగింగ్‌పై విద్యార్థి సంఘాల ఆగ్రహం
కొండపాక, న్యూస్‌లైన్ : మండలంలోని వెలికట్ట శివారులో గల ఫార్మసీ కళాశాల సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారని బీజేపీ, టీఆర్ఎస్వీ నేతలు శనివారం కళాశాల ప్రిన్స్‌పాల్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె కుమార్ యాదవ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కాట రమేష్‌ల ఆధ్వర్యంలో పలువురు యువకులు కళాశాలకు రావడంతో క ళాశాల సిబ్బంది గేట్లు మూసేశారు. దీంతో ఆగ్రహించిన సం ఘాల నేతలు కళాశాల వద్ద ఉన్న బెం చీలను కిందకు పడేయడంతో సిబ్బంది గేటు తీశారు. లోపలికి వెళ్లిన సంఘాల నాయకులు ప్రిన్స్‌పాల్ కార్తికేయన్‌ను కలిసి నిలదీశారు. కళాశాల సమీపంలో ఉన్న వెలికట్ట చౌరస్తా వద్ద తరచూ సీ నియర్ విద్యార్థుల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. ర్యాగి ంగ్‌తో విద్యార్థులు ఆత్మహత్యలకు పా ల్పడితే బాధ్యులెవరని ప్రశ్నించారు. ర్యాగింగ్‌ను పూర్తిస్థాయిలో అరికట్టాలనీ లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కళాశాల ప్రిన్స్‌పాల్ కా ర్తికేయన్ స్పందిస్తూ తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ర్యాగింగ్‌ను నిరోధించడానికి కాలేజీలో కమిటీ ఉందని చెప్పారు. ఇందుకు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్లకు భయపడి జూనియర్లు ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. కమిటీ ఏం చేస్తుందనీ, ర్యాగింగ్‌ను నిరోధించకపోతే తీవ్ర పరి ణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాల నాయకులు వెనుతిరిగారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆరెపల్లి లింగం, వడ్లకొండ శ్రీహరి, పంజ కుమార్, కాట మల్లేశంలతో పాటు దుద్దెడకు చెందిన యువకులు పాల్గొన్నారు.