కొండపాక, న్యూస్‌లైన్ : మండలంలోని వెలికట్ట శివారులో గల ఫార్మసీ కళాశాల సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారని బీజేపీ, టీఆర్‌ఎస్వీ నేతలు శనివారం కళాశాల ప్రిన్స్‌పాల్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీఆర్‌ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె కుమార్ యాదవ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కాట రమేష్‌ల ఆధ్వర్యంలో పలువురు యువకులు కళాశాలకు రావడంతో క ళాశాల సిబ్బంది గేట్లు మూసేశారు. దీంతో ఆగ్రహించిన సం ఘాల నేతలు కళాశాల వద్ద ఉన్న బెం చీలను కిందకు పడేయడంతో సిబ్బంది గేటు తీశారు. లోపలికి వెళ్లిన సంఘాల నాయకులు ప్రిన్స్‌పాల్ కార్తికేయన్‌ను కలిసి నిలదీశారు. కళాశాల సమీపంలో ఉన్న వెలికట్ట చౌరస్తా వద్ద తరచూ సీ నియర్ విద్యార్థుల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. ర్యాగి ంగ్‌తో విద్యార్థులు ఆత్మహత్యలకు పా ల్పడితే బాధ్యులెవరని ప్రశ్నించారు.
ర్యాగింగ్‌ను పూర్తిస్థాయిలో అరికట్టాలనీ లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కళాశాల ప్రిన్స్‌పాల్ కా ర్తికేయన్ స్పందిస్తూ తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ర్యాగింగ్‌ను నిరోధించడానికి కాలేజీలో కమిటీ ఉందని చెప్పారు. ఇందుకు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్లకు భయపడి జూనియర్లు ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. కమిటీ ఏం చేస్తుందనీ, ర్యాగింగ్‌ను నిరోధించకపోతే తీవ్ర పరి ణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాల నాయకులు వెనుతిరిగారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆరెపల్లి లింగం, వడ్లకొండ శ్రీహరి, పంజ కుమార్, కాట మల్లేశంలతో పాటు దుద్దెడకు చెందిన యువకులు పాల్గొన్నారు.
ర్యాగింగ్‌పై విద్యార్థి సంఘాల ఆగ్రహం
Published Sun, Dec 22 2013 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement
Advertisement