raging
-
ఖమ్మం: అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం.. విద్యార్థికి గుండు కొట్టించి...
సాక్షి, ఖమ్మం: ఖమ్మం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మెడికల్ విద్యార్థి హెయిర్ స్టయిల్‌పై వివాదం తలెత్తింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలలో ఓ విద్యార్థి భిన్నంగా హెయిర్ కట్ చేయించుకున్నాడని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు.సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడం గమనార్హం. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరి కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఇలా వ్యవహరించొద్దని సూచిచడంతో ఆ విద్యార్థి సెలూన్‌కి వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు.కాగా, ఈ విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జన్)కు తెలియడంతో ఆగ్రహించిన ఆయన విద్యార్థిని సెలూను తీసుకెళ్లి ఏకంగా గుండు గీయించాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. కాగా, ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడమే కాక విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని తెలిపారు. -
విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖమ్మం వైద్యవిభాగం/ నల్లగొండ టౌన్: ఖమ్మం మెడికల్ కళాశాలలో ఓ విద్యార్థి భిన్నంగా హెయిర్ కట్ చేయించుకున్నాడని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏకంగా విద్యార్థికి గుండు కొట్టించాడు. దీనిపై విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. ఇక నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనలో విద్యార్థులతో పాటు జూనియర్ డాక్టర్‌ను సైతం సస్పెండ్ చేశారు. వివరాలు.. ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థికి ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ కావడం గమనార్హం. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది చేరిన ములుగుకు చెందిన విద్యార్థి ఒకరు చైనా దేశస్తుల మాదిరి కటింగ్ చేయించుకున్నాడు. దీన్ని గమనించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తూ ఇలా వ్యవహరించొద్దని సూచించడంతో ఆ విద్యార్థి సెలూన్‌కు వెళ్లి జుట్టు ట్రిమ్ చేయించుకున్నాడు. కాగా, ఈ విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జన్)కు తెలియడంతో ఆగ్రహించిన ఆయన విద్యార్థిని సెలూన్‌కు తీసుకెళ్లి ఏకంగా గుండు గీయించాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను హాస్టల్ విధుల నుంచి తప్పించారు. కాగా, ఈ విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లడమే కాక విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని తెలిపారు. నల్లగొండ కాలేజీలో ర్యాగింగ్ కలకలం!నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థినులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో ముగ్గురు సీనియర్ విద్యార్థులను, ఒక జూనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. సీనియర్ మెడికోలతో పాటు జూనియర్ డాక్టర్ కూడా విద్యార్థినులను ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులకు గురిచేశారన్న ఫిర్యాదుతో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం విద్యార్థిని నెల రోజులు, ఇద్దరు నాలుగో సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే మొదటిసారి ర్యాగింగ్ విషయం బహిర్గతం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ర్యాగింగ్ విషయంపై కళాశాల ప్రిన్సిపల్‌ను వివరణ కోరడానికి ‘సాక్షి’ప్రయత్నించగా స్పందించలేదు. -
రంగరాయలో ర్యాగింగ్ కలకలం
కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్యకళాశాల (ఆర్ఎంసీ)లో ర్యాగింగ్ కలకలం రేపింది. హౌస్ సర్జన్ తన జూనియర్లకు ర్యాగింగ్ పేరుతో శనివారం అర్ధరాత్రి ప్రత్యక్ష నరకం చూపాడు. శ్రీకాకుళానికి చెందిన జగదీశ్ ఆర్ఎంసీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇంటర్న్ చేస్తున్నాడు. ఆర్ఎంసీ పీజీ హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. శనివారం అర్ధరాత్రి మద్యం తాగి ఆర్ఎంసీ మెన్స్ హాస్టల్లోకి చొరబడ్డాడు. రాత్రి ఒంటిగంటకు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి, రెండో సంవత్సరం చదువుతున్న పలువురు వైద్య విద్యార్థులను నిద్ర లేపాడు. 10 మంది విద్యార్థులను బలవంతంగా కారిడార్లోకి తీసుకొచ్చి, నిలబడాలని ఆదేశించాడు. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 5 వరకూ ప్రత్యక్ష నరకం చూపించాడు. వికృత చేష్టలు చేయాలంటూ వేధించాడు. వారిలో ఎదురు తిరిగిన ముగ్గురు జూనియర్లపై చేయి చేసుకున్నాడు. బాధిత విద్యార్థుల్లో పలువురు ఆదివారం తల్లిదండ్రులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారు కళాశాల యాజమాన్యానికి ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆదివారం సెలవు అయినప్పటికీ ఈ ఫిర్యాదుపై యాజమాన్యం స్పందించింది. మద్యం తాగి, హాస్టల్లోకి చొరబడి ర్యాగింగ్ పేరుతో జూనియర్లను వేధించిన విద్యార్థిని జగదీశ్‌గా గుర్తించింది. ఈ విషయాన్ని యాంటీ ర్యాగింగ్ కమిటీకి నివేదించింది. జగదీశ్‌పై సోమవారం చర్యలు తీసుకోనుంది. -
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం ..
-
మీసాలు, గెడ్డాలు పెంచొద్దు.. కేఎంసీలో రాగ్యింగ్ కలకలం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఇటీవల కళాశాలలో చేరిన జూనియర్ (ఫ్రెషర్స్)ను సీనియర్లు వేధించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు కొందరు తమ తల్లిదండ్రుల ద్వారా కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. దీనిపై అధికారులు అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఈ నెల 14వ తేదీ నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. తరగతి గదుల్లోకి కొందరు సీనియర్ విద్యార్థులు గుంపులుగా వచ్చి ర్యాగింగ్ చేస్తున్నట్లు సమాచారం. ‘జూనియర్ విద్యార్థులు బూట్లు వేసుకురాకూడదు. మీసాలు, గెడ్డాలు పెంచుకోవద్దు. మేం చెప్పిన యాప్‌లనే స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవాలి. మేము చెప్పినట్లు నడుచుకోవాలి...’ అని వివిధ రకాలుగా బెదిరించినట్లు తెలిసింది. కళాశాలలోని హాస్టల్లో సైతం మెస్‌కు వెళ్లి తమకు భోజనం తీసుకురావాలని, ప్లేట్లు కడగాలని హుకుం జారీ చేస్తున్నట్లు సమాచారం. కొందరు సీనియర్ వైద్య విద్యార్థులు హాస్టల్లోనే సిగరెట్లు, మద్యం తాగుతున్నారని తెలిసింది. ఈ విషయాలపై విచారణ చేసేందుకు అధికారులు హాస్టల్ గేటు వద్దకు వెళ్లగానే వారికి సమాచారం అందుతుందని, అప్రమత్తం అవుతున్నారని తెలుస్తోంది. -
నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్! విద్యార్థి ఆత్మహత్య
సాక్షి,నెల్లూరుజిల్లా: నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌కు విద్యార్థి బలయ్యాడు. తోటి విద్యార్థుల లైంగిక వేధింపులతో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు అంతస్తు నుంచి దూకి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. విద్యార్థి మృతిని నారాయణ కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం, స్టూడెంట్స్ ర్యాగింగ్ వల్లే ప్రదీప్ చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మెడికల్ కాలేజీల్లో ఆగని ర్యాగింగ్ !
సాక్షి, హైదరాబాద్:మెడికల్ కాలేజీల్లో జూనియర్లపై సీనియర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఫస్టియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను ర్యాగింగ్ పేరిట సీనియర్లు వేధిస్తున్నారు. మొదటి ఏడాది తరగతులు ప్రారంభమైన వారం పది రోజుల్లోనే గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు సీనియర్లు ఫస్టియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్ గదులకు రప్పించి బలవంతంగా మద్యం, సిగరెట్ తాగించినట్లు తేలింది. దీంతో మానసిక వేదనకు గురైన బాధిత విద్యార్థులు అధికారులకు తాము పడిన హింసను వివరించారు. కొందరితో దుస్తులు విప్పించి డ్యాన్స్‌లు చేయించారని జూనియర్లు వాపోయారు. కొందరు విద్యార్థినులపై కూడా ర్యాగింగ్ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో 10 మంది సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులపై వేటు పడింది. అయినా అక్కడ ర్యాగింగ్ ఆగడం లేదు. ఇటీవల కూడా మరికొందరు జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీంతో మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. అధికారులు చర్యలు తీసుకుంటున్నా కొందరు సీనియర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా ర్యాగింగ్ సంఘటనలు జరుగుతున్నా అవి బయటకు పొక్కడం లేదని, ఇతర ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ ర్యాగింగ్ జరుగుతోందని విద్యార్థులు చెబుతున్నారు. కాకతీయ మెడికల్ కాలేజీ, మహబూబాబాద్ మెడికల్ కాలేజీలోనూ ర్యాగింగ్ సంఘటనలు వెలుగుచూశాయి. కొన్నిచోట్ల మందలించి వదిలేయగా, కొన్నిచోట్ల సీనియర్లను సస్పెండ్ చేశారు. అయినా ర్యాగింగ్ ఆగడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. నిఘా వ్యవస్థ కరువు రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిరోజుల నుంచే ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి రావడం ప్రారంభమయ్యింది. యూజీసీ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్ సెల్‌కు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో యూజీసీ స్పందించింది. ర్యాగింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీని ఆదేశించింది. మరోవైపు స్థానిక పోలీసులకూ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ర్యాగింగ్‌కు పాల్పడొద్దని అన్ని తరగతుల విద్యార్థులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తీసేయాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ తాము విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సస్పెన్షన్ వరకే పరిమితం అవుతున్నామని వైద్య విద్య వర్గాలు హెచ్చరించాయి. కానీ ర్యాగింగ్‌ను నివారించేందుకు, వైద్య కళాశాలల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వీలుగా సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ర్యాగింగ్ జరుగుతున్నా కొన్ని కాలేజీలు డీఎంఈ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంలేదని తెలిసింది. గాంధీ, కాకతీయ సహా పలు కాలేజీల్లో సీసీ కెమెరాలు లేవన్న విమర్శలు విన్పిస్తున్నాయి. యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఉన్నా అవి అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయని అంటున్నారు. కాగా డీఎంఈ కార్యాలయం మాత్రం ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాలేజీలను ఆదేశించింది. ర్యాగింగ్ నిరోధక కమిటీలను పటిష్టం చేయాలని, ఎక్కడైనా కమిటీలు లేకపోతే తక్షణమే ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని స్పష్టం చేసింది. -
ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యార్థి ఏడాది సస్పెన్షన్
గాంధీఆస్పత్రి : ర్యాగింగ్ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు అడపాదడపా వెలుగుచూస్తున్నాయి. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌కు పాల్పడిన వైద్య విద్యారి్థని ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, గాంధీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్‌రెడ్డి నేతృత్వంలో గురువారం కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై తీర్మానాలు చేశారు. అనాటమీ విభాగంలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్‌లో ర్యాగింగ్‌కు సంబంధించి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా 2020 బ్యాచ్‌కు చెందిన ఓ విద్యార్థి పలుమార్లు జూనియర్లను ర్యాగింగ్ చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో సదరు విద్యారి్థని ఏడాది పాటు హాస్టల్‌తోపాటు కళాశాలను నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. గతంలో ర్యాగింగ్‌కు పాల్పడి సస్పెన్షన్‌కు గురైన విద్యార్థులు, వారి తల్లితండ్రులు యాంటి ర్యాగింగ్ కమిటీని కలిసి మరోమారు ర్యాగింగ్‌కు పాల్పడమని, సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరగా, కమిటీ వారి అభ్యర్థనను ఏకగ్రీవంగా తిరస్కరించింది. క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. యాంటీ ర్యాగింగ్ చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని, ఇకపై ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. గాం«దీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, కాలేజీకి చెడ్డపేరు తెచ్చెవారిని ఉపేక్షించరాదని తీర్మానించి, ర్యాగింగ్ నిరోధానికి పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో గాంధీ వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ రాజారావులతోపాటు పలు విభాగాలకు చెందిన హెచ్ఓడీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్!
ఎంజీఎం: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. ఈ కళాశాలలో పీజీ వైద్యవిద్య చదువుతున్న ప్రీతి మృతి చెందిన విషయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న క్రమంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేఎంసీలో రాజస్తాన్‌కు చెందిన మనోహర్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న కళాశాల లైబ్రరీలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు చదువుకుని హాస్టల్ గదికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఓ సీనియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న 15 మంది విద్యార్థుల కళ్లు మనోహర్‌పై పడ్డాయి. అతడిని దగ్గరికి పిలిచి మద్యం తాగించి, నృత్యాలు చేయించారు. సీనియర్లు ఎంతకీ వదలకుండా వేధిస్తుండగా ఎదురుతిరిగాడు. దీంతో అతడిని వారు దారుణంగా చితకబాదారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి ఈ నెల 15న తల్లిదండ్రుల సహాయంతో ప్రిన్సిపాల్‌కు, మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ ర్యాగింగ్ ఘటనలో గాయపడ్డ మనోహర్‌ను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. ర్యాగింగ్ విషయాన్ని ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ డీఎంఈకి వివరించగా కళాశాల అంతర్గత కమిటీతో విచారణ చేపట్టారు. 10 మంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు విచారణలో నిర్ధారించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సదరు విద్యార్థులను సంవత్సరంపాటు సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేఎంసీ అధికారులపై ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తోంది. ఘటనపై అంతర్గత విచారణ చేస్తున్నామని, ర్యాగింగ్ జరిగినట్లు రుజువైతే ఆ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు. -
మద్యం పోసి... సిగరెట్లు తాగించి
సాక్షి, హైదరాబాద్: గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి 10 మంది ఎంబీబీఎస్ విద్యార్థులను సస్పెండ్ చేయడంతో వైద్య విద్యార్థి లోకం ఉలిక్కిపడింది. ర్యాగింగ్ పేరిట కొందరు సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులు ఇటీవల జూనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్ రూములకు రప్పించి వారికి బలవంతంగా మద్యం పోసి... సిగరెట్లు తాగించినట్లు తేలింది. దీంతో మానసిక వేదనకు గురైన బాధిత విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయ అధికార వర్గాలు చేపట్టిన విచారణలో విస్మయకర నిజాలు వెలుగుచూశాయి. కొందరిని బట్టలు విప్పించి డ్యాన్స్‌లు చేయించారని కూడా అంటున్నారు. బూతులు తిడుతూ, బాధితులతో కూడా బూతులు మాట్లాడించారని తేలింది. కాగా, కొందరు విద్యార్థినులను కూడా ర్యాగింగ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవమేనా కాదా అన్న దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. కాగా ఈ ర్యాగింగ్ ఉదంతంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అన్ని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ర్యాగింగ్ నిరోధక కమిటీల పటిష్టం... రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో కొన్నిచోట్ల కొందరు సీని యర్ విద్యార్థులు మొదటి ఏడాది విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడుతున్న ఘటనలు అధికా రుల దృష్టికి వచ్చాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీ ల్లోనూ ఇలాంటివి జరుగుతున్నట్లు తెలిసింది. అయితే ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్న భావనతో చూసీచూడనట్లుగా వదిలేశారు. కానీ గాంధీ ఘటన నేపథ్యంలో ఇకపై ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంఈ కార్యాలయం ఆదేశించింది. అన్ని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలను పటిష్టం చేయాలని, ఇప్పటికీ లేకుంటే తక్షణమే ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, హాస్టళ్ల వద్ద రాత్రి వేళ నిఘా పెంచాలని సూచించింది. మరోవైపు ర్యాగింగ్‌కు గురైన విద్యార్థుల ఫిర్యాదు నిమిత్తం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు, ఈ మెయిల్ ఐడీని రూపొందించాలని కూడా డీఎంఈ కార్యాలయ అధికారులు యోచిస్తున్నారు. -
పూరీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథ్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఈ మేరకు కళాశాల డీన్ మరియు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మాయా పాఢి పెంటకోట మైరెన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థి అభిషేక్ మీనా కళాశాల సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌కు గురయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ ప్రారంభం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ర్యాగింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు. ఈ విచా రకర సంఘటనకు పాల్పడిన విద్యార్థులను గుర్తించే దిశలో విచారణ చేపట్టారు. క్యాంపస్‌లో ర్యాగింగ్ నివారణపై చైతన్యం, అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వర్గం పని చేస్తుంది. ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ ప్రత్యక్షంగా ఈ వ్యవహారం పర్యవేక్షిస్తుందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మాయ పాఢి తెలిపారు. ర్యాగింగ్ ఇలా... ఈనెల 17న మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ సంఘటన చోటు చేసుకుంది. మొదటి సంవత్సరం చదువుతున్న అభిషేక్ మీనాపై రెండో సంవత్సరం చదువుతున్న కొందరు విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. సీనియర్లు బలవంతంగా అభిషేక్ గడ్డం, మీసాలు తీసేసి అతనితో అసభ్యంగా ప్రవర్తించి ర్యాగింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. దీంతో అభిషేక్ కళాశాల అధికారులకు ఫిర్యాదు చేయగా, ర్యాగింగ్ నిరోధక కమిటీతో చర్చించిన అనంతరం డీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ ఆరోపణ తలెత్తితే సత్వర చర్యలు చేపట్టడం అనివార్యం. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మార్గదర్శకాల మేరకు చర్యలు చేపట్టి తక్షణమే తెలియజేయాల్సి ఉంటుందని డీన్ వివరించారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుంది. స్థానిక ఎస్పీ క్యాంపస్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పూరీ ఎస్డీపీవో తెలిపారు. ఇదిలా ఉండగా ముగ్గురు నిందిత విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్‌కు క్షమాపణ లేఖను సమర్పించినట్లు తెలిసింది. -
నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
డిచ్పల్లి(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ జిల్లాలోని ఓ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. డిచ్పల్లి మండలం బర్థిపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ కాలేజీలో బీఫార్మసీ తృతీయ సంవత్సరం విద్యార్థులు తమను ర్యాగింగ్ చేస్తున్నారని సెకండియర్ విద్యా ర్థి నులు ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు జూనియర్లు తమ తల్లి దండ్రులకు తెలియజేయడంతో వారు కాలేజీ వద్దకు వచ్చి మేనేజ్మెంట్ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రెషర్స్ పార్టీ చేసుకుంటుండగా సీనియర్ విద్యార్థులు ఫ్లెక్సీ చించివేశారని, అడ్డుకున్న తమను కొట్టారని జూనియర్లు ఆరోపించారు. నలుగురు బయట వ్యక్తుల్ని కాలేజీకి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు. విషయం తెలుసుకున్న డిచ్పల్లి ఎస్సై గణేశ్ కాలేజీకి చేరుకుని ఇరువర్గాలకు నచ్చచెప్పారు. జూనియర్లు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తృతీయ సంవత్సరానికి చెందిన ఇద్దరు విద్యార్థులు, సెకండియర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. సీనియర్లను పోలీసులు తీసుకెళ్తుండగా కొందరు జూనియర్లు వారిపైకి చెప్పులు విసిరారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థు లపై చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇ వ్వడంతో జూనియర్లు శాంతించారు. అయితే జూనియర్లను తాము వేధించలేదని సీనియర్లు చెప్పడం కొసమెరుపు. దీనిపై కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించేందుకు ‘సాక్షి’ప్రయత్నించగా వారు స్పందించలేదు. -
అయితే హింస.. లేదంటే కుంగుబాటు!
తాను ప్రేమించిన యువతిని ప్రేమిస్తున్నాడనే కక్షతో హైదరాబాద్‌లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి తన స్నేహితుడిని ఇటీవల అత్యంత కిరాతకంగా హతమార్చాడు... సీనియర్ పీజీ వైద్య విద్యార్థి వేధింపులు, ర్యాగింగ్‌ను తాళలేక, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తగిన స్పందన రాక తాజాగా ఓ పీజీ వైద్య విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటుచేసుకుంటుండటం దేనికి సంకేతం? ఇందుకు కారణం ఏమిటి? సాక్షి, హైదరాబాద్ : నేటి ఉరుకుల పరుగుల జీవనంలో విద్యార్థులపై చదువుల ఒత్తిడి పెరగడం, వారి సమస్యలు ఏమిటో ఎవరూ అడిగి తెలుసుకొనే పరిస్థితి లేకపోవడం, సెల్ఫోన్లు, ఇంటర్నెట్టే ప్రపంచంగా మారడం, మద్యం, డ్రగ్స్ వాడకం తదితర కారణాలతో కొంత మంది చెడుదారుల్లో పయనిస్తున్నారు. ఫలితంగా చిన్నచిన్న కారణాలు, సమస్యలనే తట్టుకోలేని పరిస్థితికి చేరుకుని విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏం చేయాలి? సమాజంలో నెలకొన్న పరిస్థితులు, వాటి వల్ల ఎదురుకాబోయే పరిణామాలపై విద్యార్థులకు శాస్త్రీయంగా అవగాహన కల్పించాలని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వారు మానసికంగా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెంపొందించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వివిధ పరిస్థితులు, జీవితంపై పడబోయే ప్రభావాలను తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలని చెబుతున్నారు. ఏదో జరిగిపోతుందనే భయం కంటే భవిష్యత్తులో ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కోగలిగే మనోస్థైర్యాన్ని, విశ్వాసాన్ని వారిలో కలిగించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగితేలకుండా ఇతర సామాజిక అంశాలపై వారికి అవగాహన కల్పించాలని చెబుతున్నారు. ఇన్స్టంట్ పరిష్కారాలే అసలు సమస్య.. ఇప్పుడు యువత ఇన్ స్టంట్ పరిష్కారాలు కోరుకుంటోంది. ఏవైనా సవాళ్లు ఎదురైనప్పుడు ఒత్తిళ్లను తట్టుకొనే శక్తి కొరవడటం, సంయమనం పాటించలేకపోవడం వారిలో సమస్యగా మారింది. ఓపికతో వ్యవహరించలేకపోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇవే హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. పశ్చిమ దేశా ల్లో పిల్లలకు లైఫ్‌స్కిల్ ట్రైనింగ్‌లో వీటన్నింటిపై అవగాహన కల్పిస్తారు. మన దేశంలోనూ అలాంటి శిక్షణనివ్వాలి. ఒంటరిగా డిజిటల్ పరికరాలతో ఎక్కువ సమయం గడిపే బదులు మిత్రులతో ఆటపాటలు, మాటల వల్ల సోషల్ స్కిల్స్ పెరుగుతాయి. – డాక్టర్ నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్ షైన్, చేతన హాస్పిటల్స్ వ్యక్తిత్వ లోపాలతోనే అలాంటి నిర్ణయాలు.. ప్రేమికుల్లో లేదా యువతలో క్రూరమైన ఆలోచనలు, కిరాతకంగా హత్యలకు పాల్పడాలనే ధోరణులు ఉత్పన్నమయ్యాయంటే వారిలో ‘సైకో పాథాలజీ’ లక్షణాలున్నట్లుగానే భావించాలి.వ్యక్తిత్వ లోపాలు ఉండటం వల్లే వారు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇళ్లలోనూ పిల్లలకు సమస్యలపై సరైన అవగాహన కల్పించకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితులకు కారణం. ఇలాంటి వారికి ఎమోషనల్ అవేర్నెస్ కల్పించాలి. ప్రభుత్వాలు, యూనివర్సిటీలు, విద్యాసంస్థలు ప్రతి కాలేజీలో కమ్యూనికేషన్, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలి, ప్రతికూల భావోద్వేగాలను ఎలా అధిగమించాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. చిన్నప్పటి నుంచే బోధన పద్ధతుల్లో వాటిని భాగం చేయాలి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ ఒత్తిడిని దూరం చేసుకోవాలిలా ♦ ఏవైనా సంక్షోభ పరిస్థితులు ఎదురైతే మానసిక ప్రశాంతతను పాటిస్తూ ఒత్తిళ్లను దరిచేరనీయరాదు. ♦ కష్టకాలంలో మనకు చేదోడువాదోడుగా నిలుస్తారనే విశ్వాసం, నమ్మకం ఉన్న వారితో మాట్లాడుతుండాలి. ♦ మనకు ఆప్తులుగా ఉన్నవారితో మనలోని భావాలు పంచుకుంటూ రోజువారీ జీవితం ఆహ్లాదంగా గడిపేలా చూసుకోవాలి. -
గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందని ఫిర్యాదులు రావడంతో శుక్రవారం వైద్య కళాశాల అధికారులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ మహిళా వైద్యులను పిలిపించి విచారణ చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో హౌస్ సర్జన్‌గా (ఇంటర్నీ) విధులు నిర్వహిస్తున్న ఓ వైద్య విద్యార్థిని తనను పీజీ విద్యార్థినులు వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసింది. ఎన్ఎంసీ అధికారులు సదరు ఘటనపై తక్షణమే విచారణ నిర్వహించాలని ఆదేశిస్తూ శుక్రవారం వైద్య కళాశాల అధికారులకు మెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చాగంటి పద్మావతీదేవి ఆధ్వర్యంలో పలువురు యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ మహిళా వైద్యులను పిలిపించి విచారించారు. కాగా, ఏప్రిల్‌లో మెన్స్ హాస్టల్లో సీనియర్ వైద్య విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ వైద్య విద్యార్థులు ఎన్ఎంసీకి ఫిర్యాదు చేశారు. నాడు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతీదేవి సీనియర్ వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ర్యాగింగ్ విష సంస్కృతిని అనుసరించవద్దని, ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా మళ్లీ కళాశాలలో ర్యాగింగ్ జరగడం గమనార్హం. -
మూసీ ముంచేసి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ భాగ్యరేఖ చారిత్రక మూసీనది ఉగ్రరూపం దాల్చింది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో జలమండలి అధికారులు వరుసగా జలాశయాల గేట్లను తెరచి మూసీలోకి వరద నీటిని వదిలిపెడుతున్నారు. బుధవారం ఏకంగా గండిపేట్‌కు 13, హిమాయత్‌సాగర్‌కు 8 గేట్లను ఎత్తివేశారు. దీంతో మూసీలో వరదనీటి ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది. నగరంలో మూసీ ప్రవహించే బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ)మార్గంలో మూసీ మునుపెన్నడూ లేనివిధంగా పరవళ్లు తొక్కుతోంది. ఇదే క్రమంలో చాదర్‌ఘాట్ మూసీ చిన్న వంతెనపై నుంచి వరద ప్రవాహం పెరగడంతో ట్రాఫిక్పోలీసులు ఈ బ్రిడ్జీని మూసివేశారు. మూసారాంబాగ్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. నగరంలో బుధవారం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. మూసారాంబాగ్ వంతెన మూసివేయడంతో అంబర్పేట్ కొత్త బ్రిడ్జీపైనుంచి వాహనాల రాక పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక మూసీ పరివాహక ప్రాంతమైన మూసానగర్, కమలానగర్ పరిసరాలను మూసీ వరదనీరు చుట్టేసింది. మన్సూర్‌నగర్, చాదర్నగర్ సమీపంలోని ఇళ్లలో చేరిన నీరు అంబర్పేట్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. రత్నానగర్, పటేల్‌నగర్, గోల్నాక ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మదర్సా, శంకర్‌నగర్, మూసానగర్ నుంచి సుమారు రెండు వేల మందిని ఈ కేంద్రాలకు తరలించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో బాధితులకు ఆహారం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. జంట జలాశయాలకు వరద ప్రవాహం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఇన్‌ఫ్లో భారీగా పెరుగుతుండడంతో రెండు జలాశయాల గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు. బుధవారం ఉస్మాన్ సాగర్‌కు 13 గేట్లు, హిమాయత్ సాగర్ 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. భారీగా వరద చేరుతున్న జంట జలాశయాలను బుధవారం ఉదయం జలమండలి ఎండీ దానకిశోర్ సందర్శించారు. వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్షించారు. రెండు జలాశయాల వద్ద భద్రత మరింత పెంచాలని పోలీసులకు సూచించారు. సామాన్య ప్రజలు, సందర్శకులు జంట జలాశయాల వద్దకు రావొద్దని ఆయన కోరారు. మూడు పోలీస్ కమిషనరేట్లతో జలమండలి నిరంతరం సమన్వయం చేసుకుంటుందని తెలిపారు. జాతీయ రహదారి జలదిగ్బంధం జియాగూడ/దూద్‌బౌలి/అఫ్జల్‌గంజ్: జంట జలాశయాల గేట్లను ఎత్తివేయడంతో పురానాపూల్ పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారి పూర్తిగా మునిగాయి. పురానాపూల్ వంతెన, సమాంతర వంతెనలు శిథిలావస్థకు చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపై వరదనీరు పొంగిపొర్లుతుండగా అర్ధరాత్రి ప్రాంతంలో జియాగూడ దుర్గానగర్ నుండి జాతీయ రహదారి పైకి వెళ్లిన లారీ, పురానాపూల్ నుండి అత్తాపూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు నీట మునిగాయి. పురానాపూల్ లోతట్టు ప్రాంతం కావడంతో వంతెన కానాలు సగానికి పైగా మునిగాయి. అలాగే జాతీయ రహదారి పక్కనే ఉన్న నివాసాలు, చాకిరేవులు నీట మునిగాయి. మూసీ సమీపంలోని మన్సూర్‌నగర్‌లో నీట మునిగిన ఇళ్లు కాలనీని ముంచెత్తిన వరద నీరు వ్యక్తిని కాపాడిన పోలీసులు అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో పురానాపూల్ ఇక్బాల్‌గంజ్ నుండి మూసీనదిలోకి ఓ వ్యక్తి మద్యం మత్తులో జాతీయ రహదారికి రాగా అప్పటికే పొంగిపొర్లుతున్న నీటిలోకి పడిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదబాబు, మంగళ్‌హాట్ ఎస్.ఐ రాంబాబు ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని రక్షించారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పురానాపూల్ మూసీనది పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ మేరకు ఆయన మూసీనది పరివాహక ప్రాంతం జాతీయ రహదారిని సందర్శించారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలన బండ్లగూడ: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిమాయత్‌సాగర్ జలాశయాన్ని బుధవారం సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మంగళవారం హిమాయత్‌సాగర్ సరీ్వస్ రోడ్డులో వరదలో చిక్కుకుపోయిన యువకుడిని కాపాడిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ హెచ్ కానిస్టేబుల్ బేగ్, డ్రైవర్ మల్లాంగ్షా, హెల్పర్స్ రాకేష్, విజయ్‌లను సీపీ స్టీఫెన్ రవీంద్ర, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్‌రావు, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లవకుమార్రెడ్డిలు అభినందించారు. సహాయక చర్యలకు సిద్ధం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మూసీ, ఈసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకా‹Ùగౌడ్ సూచించారు. జంట జలాశయాల గేట్లను ఎత్తడంతో బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టిప్పుఖాన్ బ్రిడ్జీ, హైదర్షాకోట్, గంధంగూడ, కాలనీలు, బస్తీలు, ఈసీ,మూసీ వాగులను ఆయన సందర్శించారు. సహాయక చర్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సందర్శకులకు అనుమతి లేదు.. రాజేంద్రనగర్ నుంచి హిమాయత్‌సాగర్‌కు వెళ్లే ఓఆర్ఆర్ సబ్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అంధకారంలో పరీవాహక ప్రాంతాలు మూసీ ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని పలు సబ్స్టేషన్లకు వరద ముప్పు ఏర్పడింది. సబ్‌స్టేషన్లలోకి నీరు చేరడం, డిస్ట్రబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునగడంతో ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇబ్రహీంబాగ్ డివిజన్ నార్సింగ్ సెక్షన్ పరిధిలోని 11 కేవీ గండిపేట ఫీడర్ సహా 33/11 కేవీ సీబీఐటీ స బ్స్టేషన్లోకి గండిపేట చెరువు నీరు వచ్చి చేరింది. మెహిదీపట్నం డివిజన్ లంగర్‌హౌస్ సెక్షన్ పరిధిలోని బాపూఘాట్, లంగర్‌హౌస్ టుప్ఖాన్ బ్రిడ్జ్‌పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో దాని కింద ఉన్న ఆరు ఎల్టీ విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి ంది. పురానాపూల్, కుల్సుంపుర, రహీంపుర ఫీడర్ల పరిధిలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్మాన్‌ఘడ్, చాదర్ఘట్, వెంకట్‌నగర్, శంకర్‌నగర్, మూసా నగర్, యశోద ఆస్పత్రి, హనుమాన్‌నగర్ ఫీడర్ల పరిధిలోని 12 గంటల పాటు సరఫరా నిలిచిపోయింది. సరూర్‌నగర్ ఆర్కేపురం ప్రజయ్‌నివాస్ అపార్ట్మెంట్స్ ఫేజ్–1 మూడు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నీటమునిగాయి. వీటిలో రెండు డీటీఆర్లను పునరుద్ధరించారు. పురానాపూల్ బ్రిడ్జి వద్ద నీటిలో మునిగిన లారీ,సాలార్జంగ్ బ్రిడ్జి వద్ద నీటిలో మునిగిన ఆలయం ఆలయంలోకి నీరు.. దూద్‌బౌలి పరిధిలోని శివాలయఘాట్ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. నవగ్రహాల గుడి నీటిలో మునిగిపోయింది. పక్కనే ఉన్న నివాసితులు భయాందోళనకు గురయ్యారు. పురానాపూల్ శ్మశాన వాటికలో వరదనీరు పూర్తిగా నిండిపోవడంతో బుధవారం చనిపోయిన వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. దహన సంస్కారాలకు ఎలాంటి స్థలం లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదకరంగా ఎంజీబీఎస్ ప్రహరీ నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఎంజీబీఎస్ వరద నీటిలో మునిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల గేట్లు ఎత్తడంతో మూసీ పరిహక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో మూసీ నది దారి మధ్యలో ఉండే ఎంజీబీఎస్ సైతం నీట మునిగింది. ఎంజీబీఎస్ చుట్టూ రహదారుల వెంట ఉన్న ప్రహరీ ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు కూలుతుందో ఏమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. (చదవండి: గాడి తప్పిన ‘గ్యాస్’!) -
సైకిల్ రైడర్లపై ఘోరంగా దాడి చేసిన ఎద్దు!: వైరల్ వీడియో
Cyclist Tossed In The Air By Raging Bull: ఇంతవరకు ఎద్దు దాడికి సంబంధించిన వీడియోలను చూశాం. సాధారణంగా ఎద్దు దాడి చేయదు. తన దారికి అడ్డు వచ్చినప్పుడో లేక మరే ఏ ఇతర కారణాల వల్లనే ఒక్కోసారి చాలా భయంకరంగా దాడి చేస్తుంది. అచ్చం అలానే ఒక సైకిల్ రైడర్ పై ఎద్దు ఘెరంగా దాడి చేసింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...అమెరికాలోని కాలిఫోర్నియాలో రేస్‌లో పాల్గొంటున్న సైక్లిల్ రైడర్ల పై ఎద్దు దాడి చేసింది. ముగ్గురు వ్యక్తులు సైకిల్ రేసింగ్ చేస్తుండగా ఒక ఎద్దు అనుహ్యంగా ఒక సైకిల్ రైడర్ పై దారుణంగా దాడి చేసింది. ఆ వ్యక్తిని అమాత్తంగా గాల్లోకి ఎత్తిపడేసింది. అక్కడ ఉన్న మిగతా వాళ్ల పై కూడా దాడి చేసేందుకు కూడా యత్నించింది. అదృష్టవశాత్తు వారికి ఏం కాలేదు ముగ్గురు సురక్షితంగానే ఉన్నారు. అయితే వారు రేసింగ్ మొదలు పెట్టినప్పుడు ఎద్దు యజమాని దానిని గడ్డి ఉన్న బీడుభూమి వైపుకి చాలా దూరం తీసుకువెళ్లాడు. అయినప్పటికీ అది తిరిగి వచ్చి మరీ వాటి పై దాడి చేసింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Sam Ames (@therockcobbler) (చదవండి: హైహీల్స్‌తో జంప్ చేసి గిన్నిస్ రికార్డు సాధించిన మహిళ!.. ఫిదా అవుతున్న నెటిజన్లు!) -
జేఎన్టీయూఏలో ర్యాగింగ్ వికృతరూపం
అనంతపురం విద్య: జేఎన్టీయూ (అనంతపురం) ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ రక్కసి వికృతరూపం దాల్చింది. సీనియర్ విద్యార్థులు అర్ధరాత్రి దాకా వెకిలిచేష్టలు.. అలసిపోయేదాకా డ్యాన్సులు.. అడ్డూఅదుపూలేని అకృత్యాలకు పాల్పడటంతో జూనియర్ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వీరి ఆగడాలు మితిమీరుతుండటంతో భరించలేకపోయిన బాధితులు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది కెమికల్, కంప్యూటర్ సైన్సెస్ గ్రూప్ సెకండియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుజాత శనివారం ఉత్తర్వులిచ్చారు. జేఎన్టీయూ(ఏ) చరిత్రలో ఒకేసారి 12 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటుపడటం ఇదే తొలిసారి. సీనియర్, జూనియర్ విద్యార్థుల హాస్టళ్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ ర్యాగింగ్ పేరిట వికృత క్రీడ సాగిస్తున్నారు. జూనియర్లను సీనియర్ విద్యార్థుల హాస్టల్‌కు రప్పించి అర్ధరాత్రి దాకా అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించడంతో పాటు సిగరెట్లు, మద్యం తీసుకొచ్చి ఇవ్వాలని పురమాయిస్తున్నారు. గంటల తరబడి నిల్చునే ఉండాలని కోరడంతో పాటు సీనియర్లు చెప్పింది వినాలంటూ ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం ర్యాగింగ్ జరిగినట్లు తెలియగానే శుక్రవారం రాత్రి హాస్టల్‌కు వెళ్లి ఆరా తీశాం. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉండి విద్యార్థులతో మాట్లాడాం. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు. ర్యాగింగ్‌కు పాల్పడితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ పి.సుజాత, ప్రిన్సిపాల్, జేఎన్టీయూఏ ఇంజనీరింగ్ కళాశాల -
సీనియర్ల ర్యాగింగ్.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
సాక్షి, చెన్నై: ర్యాగింగ్ భూతం ఇద్దరు విద్యార్థులను బలి తీసుకుంది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఇద్దరు విద్యార్థులు కళాశాల ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధురైలోని బలితెప్పకులంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. సీనియర్ల ర్యాగింగ్‌ను తట్టుకోలేక భరత్, ముత్తుకుమార్ అనే డిగ్రీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నిట్ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం
-
నోట్స్ రాయలేదని
మేడ్చల్: నోట్స్ రాయలేదనే కారణంగా జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ మండలం గౌడవెళ్లి గ్రామ పరిధిలోని హితం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నగరానికి చెందిన ఓ విద్యార్థి హితం ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈ మొదటి సంవత్సరం చదవుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం కొంతమంది సీనియర్ విద్యార్థులు తమ నోట్స్ రాసిపెట్టాలని జూనియర్‌కు హుకుం జారీ చేశారు. పరీక్షలు దగ్గరపడుతున్నందున తాను చదుకోవాలని, ఎవరి నోట్స్‌ను తాను రాయనని జూనియర్ సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన సీనియర్ విద్యార్థులు జూనియర్‌ను కళాశాల క్యాంటీన్‌కు రప్పించి వెకిలి చేష్టలతో ర్యాగింగ్ చేశారు. జూనియర్ ఎదురుతిరగడంతో అతనిపై దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం ఇద్దరినీ పిలిచి మందలించి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. గురువారం కొంతమంది మీడియాకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. ర్యాగింగ్ కాదు.. చిన్న గొడవ తమ కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్ ఘటనా జరగలేదని, ర్యాగింగ్ నిరోధానికి తాము గట్టి చర్యలు తీసుకున్నామని హితం కళాశాల ప్రతినిధి మిజాబ్ తెలిపారు. బుధవారం కళాశాల క్యాంటీన్లో జూనియర్ విద్యార్థికీ, సీనియర్ విద్యార్థులకూ మధ్య చిన్న గొడవ జరిగిందని, ఇద్దరితో మాట్లాడి విషయాన్ని సెటిల్ చేశామని తెలిపారు. కాగా, హితం కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధం
అనంతపురం అర్బన్: జిల్లాలోని విద్యాసంస్థలు అన్నింటిలో రాగ్యింగ్ నిషేధిస్తున్నామని కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ జి.వి.జి.అశోక్‌కుమార్ తెలిపారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కి పాల్పడిన వారిపైనే కాకుండా ఇకపై యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా కేసులు నమోదవుతాయన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కలెక్టర్ అధ్యక్షతన ఆర్డీఓలు, విద్యాసంస్థల ప్రినిపాళ్లు, యూనివర్సిటీల రిజిస్ట్రార్, రెక్టార్లతో సమావేశం నిర్వహించారు. గజల్ శ్రీనివాస్ ఆలపించిన ‘ఆటకాదురా ఆటవికమురా... వద్దురా ర్యాగింగ్’ అనే వీడియోని సమావేశంలో ప్రదర్శించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంస్థలలో విద్యార్థులను ఇబ్బందికి గురిచేసే చర్యలు చోటు చేసుకోకుండా యాజమాన్యాలు నిఘా ఉంచాలన్నారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై మాత్రమే ఇప్పటి వరకు చర్యలు ఉండేవన్నారు. ఇకపై విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపైనా కేసులు నమోదవుతాయన్నారు. ర్యాగింగ్ నిరోధానికి జిల్లా యంత్రాగం చేసే సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 2014లో వైద్య కళాశాలలో నమోదైన క్రిమినల్ కేసు మినహా ఇప్పటి వరకు ఎలాంటి ర్యాగింగ్ కేసులు జిల్లాలో నమోదు కాలేదన్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు జరిగే వరకు కళాశాలల్లో సీసీ కెమెరాల ద్వారా, కమిటీల ద్వారా విద్యార్థులపై నిఘా ఉంచాలన్నారు. ఎస్కేయూ రిజిస్ట్రార్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు పెడదారిన పట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. విద్యాసంస్థల్లో సందేశాత్మక, స్ఫూర్తిదాయక గేయాలను, మహనీయుల సత్సంగాలు, ప్రబోధాలు ఇప్పించాలన్నారు. డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి మాట్లాడుతూ కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ వైస్ చైర్మన్‌గా, ఆర్డీఓలు, ఎస్డీపీఓలు, కళాశాల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ ర్యాగింగ్ నిరోధక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సుప్రీంకోర్టు ద్వారా మాజీ సీబీఐ డైరెక్టర్ ఆర్.కె.రాఘవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ విద్యాసంస్థల్లో ర్యాగింగ్ జరకుండా నిర్దేశించిన మార్గదర్శకాలను యాజమాన్యాలు పాటించాలన్నారు. యాంటీ ర్యాగింగ్‌పై ఎస్కేయూనివర్సిటీ రూపొందించిన ‘ర్యాగింగ్ చేస్తే ఇక జైలుకే’ పోస్టర్లను అధికారులు విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓలు మలోలా, రామారావు, బాలానాయక్, డీఎస్పీ మల్లికార్జున వర్మ, సదానందరెడ్డి, జేఎన్టీయూ రెక్టార్ సుబ్బారావు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు పి.రాజారాం, తదితరులు పాల్గొన్నారు. -
కేఎంసీలో ర్యాగింగ్ కలకలం
–అర్ధరాత్రి జూనియర్లను గదుల్లోకి పిలుస్తున్న సీనియర్లు –రాత్రి 10 నుంచి 2 గంటల వరకు ర్యాగింగ్? –ర్యాగింగ్ సెల్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థులు –విచారణకు ఆదేశించిన ప్రిన్సిపల్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో మళ్లీ ర్యాగింగ్ భూతం బుసలుకొడుతోంది. 8 ఏళ్ల క్రితం జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో ముగ్గురు విద్యార్థులకు జైలుశిక్ష పడింది. వారిని కళాశాల నుంచి సైతం డీబార్ చేశారు. ఆ తర్వాత కళాశాలలో ర్యాగింగ్ నిరోధానికి అధికారులు చర్యలు తీసుకోవడంతో కాస్త సద్దుమణిగింది. ఇటీవల కాలంలో ర్యాగింగ్ భూతం మళ్లీ పడగవిప్పుతోంది. అర్ధరాత్రి వేళ జూనియర్లను సీనియర్లు గదుల్లోకి పిలిచి ర్యాగింగ్ చేస్తున్నట్లు ర్యాగింగ్ సెల్‌కు విద్యార్థులు మంగళవారం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.నగరంలోని రాజ్‌విహార్ వద్ద ఉన్న మెన్స్ మెడికల్ హాస్టల్లో ర్యాగింగ్ జరుగుతున్నట్లు పలువురు జూనియర్లు మంగళవారం ర్యాగింగ్ నిరోధక సెల్‌కు ఫిర్యాదు చేశారు. తమను అర్ధరాత్రి వేళ సీనియర్లు వారి గదుల్లోకి పిలిచి ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రాత్రి 10 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు గదుల్లో బట్టలు విప్పదీసి నిల్చోబెట్టడం, బాత్రూమ్లు క్లీన్ చేయించడం, బట్టలు ఉతికించడం వంటివి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ విచారణకు హాస్టల్ వార్డెన్ డాక్టర్ రంగనాథ్‌ను ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయమై బుధవారం ఆయన విచారణ చేసే అవకాశం ఉంది. కాగా.. 2008–09 విద్యాసంవత్సరంలోనూ ర్యాగింగ్ చేయడంతో ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసి జైలుకు పంపించి, వారిని కళాశాల నుంచి డిస్మిస్ చేశారు. ఆ తర్వాత సీనియర్ ప్రొఫెసర్లతో ర్యాగింగ్ నిరోదక కమిటీలు వేసి, సెల్లు, ఫిర్యాదుబాక్స్లు ఏర్పాటు చేశారు. అయినా మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేయడం మానడం లేదు. పలు విధాలుగా తమను ర్యాగింగ్ చేస్తున్నట్లు ప్రొఫెసర్లకు జూనియర్లు విన్నవించినా ఫలితం ఉండటం లేదన్న విమర్శలున్నాయి. ర్యాగింగ్ విషయమై ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్‌ను వివరణ కోరగా.. ర్యాగింగ్ జరుగుతున్నట్లు కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారని, ఈ విషయమై విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
ట్రిపుల్ ఐటీలో 15 మంది సీనియర్లపై వేటు
-
నూజివీడు ట్రిపుల్ ఐటీ సంచలన నిర్ణయం
కృష్ణా : నూజివీడు ట్రిపుల్ ఐటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ర్యాగింగ్‌కు పాల్పడ్డ మొత్తం 54 మంది విద్యార్థులపై సస్పెన్షన్ విధించారు. వీరిలో 15 మంది విద్యార్థులపై ఏడాది పాటు, ఆరుగురిపై శాశ్వతంగా వేటు పడింది. 'తలెత్తుకుని ఎందుకు వెళ్తున్నావు.. ఫోన్ లో వాట్సాప్ ఎందుకు వాడటం లేదు. కొడితే ఏడుస్తావా?.. ఇవన్నీ బయటకు చెబితే ప్రాణాలు తీస్తామంటూ' ట్రిఫుల్ ఐటీలోని నాల్గో సంవత్సరం విద్యార్థులు థర్డ్ ఇయర్ విద్యార్థులను బెదిరించిన తీరిది. దీంతో పాటు క్రమశిక్షణ కమిటీ సభ్యులకు ఈ3 కి చెందిన కొందరు విద్యార్థులు ఇన్ఫార్మర్లుగా ఉన్నారని ద్వేషం పెంచుకున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు గత నెల 29న అర్ధరాత్రి దాటిన తర్వాత 20 మందికి పైగా జూనియర్లను ఒక్కొక్కరినీ గదిలోకి రప్పించి కొట్టి బయటకు పంపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ జూనియర్లు భయంతో కాలేజీని వదిలిపెట్టేందుకు సిద్దపడ్డారు. దీంతో ర్యాగింగ్ ఘటన పై ప్రత్యేక కమిటీని నియమించారు. దర్యాప్తులో సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తేలడంతో మొత్తం 54 మంది విద్యార్థులపై సస్పెన్షన్ విధించారు. -
కళాశాల బస్సులో ర్యాగింగ్
- టీడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల సీనియర్ల దుశ్చర్య - పోలీసుల అదుపులో నిందితులు బీబీనగర్ (భువనగిరి): బీబీనగర్‌లోని టీడీఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి గురువారం ర్యాగింగ్‌కు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని లింగోజిగూడేనికి చెందిన విద్యార్థి గిరిధర్ టీడీఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం కళాశాల బస్సులో హైదరాబాద్‌కు వెళ్తుండగా అదే బస్సులో ఉన్న డిప్లొమా మూడో సంవత్సరం విద్యార్థులు సమీర్, నర్సింహ, శశికాంత్‌లు గిరిధర్‌పై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. బాధితుడు తమ కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్ఐ సురేష్‌కుమార్ తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలితే సదరు విద్యార్థులను కళాశాల నుంచి సస్పెండ్ చేస్తామని కరస్పాండెంట్ దినేశ్‌రెడ్డి చెప్పారు. ఇదిలా ఉంటే ర్యాగింగ్‌ను నిరసిస్తూ కళాశాల ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. -
రెండేళ్లైనా.. మాయని మచ్చ!
► రిషితేశ్వరి కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటులో జాప్యం ► అమలుకు నోచుకోని చంద్రబాబు హామీ ► ఇప్పటివరకు ర్యాగింగ్ దోషులకు పడని శిక్ష సాక్షి, వరంగల్: ర్యాగింగ్ పేరిట వేధించి తమ కూతురు మరణానికి కారణమైన వ్యక్తులు ఏవేని కారణాలతో శిక్ష నుంచి తప్పించు కుం టారేమోనని రిషితేశ్వరి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2017 జూలై 14తో రిషితే శ్వరి మరణించి రెండేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆవేదనను రిషితేశ్వరి తల్లి దం డ్రులు ఎం.మురళికృష్ణ, దుర్గాబాయి ‘సాక్షి’కి తెలిపారు. ఆవేదన వారి మాటల్లోనే.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి నాగా ర్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి 2015 జూలై 14న క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకుంది. జూలై 30న ఏపీ సీఎం చంద్రబాబును కలి శాం. ‘దోషులకు శిక్ష పడాలి. మరొకరు ర్యా గింగ్ పేరుతో జూనియ ర్లను వేధించకూడదు. క్యాంపస్‌లో తొలి ఏడాది విద్యార్థులు నవ్వుతూ చదువుకోవాలి’ అని మేం చంద్ర బాబుకు చెప్పాం. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేసు నీరుగారిపోతోంది రిషితేశ్వరి కేసులో ముగ్గురు సీనియర్లు ముద్దాయిలుగా ఉన్నారు. ఆమె స్నేహితులు సాక్షులుగా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం మూడో ఏడాది రెండో సెమిస్టర్లో ఉన్నారు. మరో రెండునెలల్లో ఫైనల్ ఇయర్లోకి వెళ్తారు. సాధారణంగా బీఆర్క్ చేసిన విద్యా ర్థులు విదేశాల్లో ఎంఆర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. సాక్షులుగా ఉన్న వ్యక్తులు విదే శాలకు వెళితే కోర్టు విచారణకు హజరు కావడం కష్టం. సాక్షులు లేకపోతే ఈ కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ పూర్తిచేసి దోషులను శిక్షించాలి. మిడిల్ మేనేజ్మెంట్తో సమస్య రిషితేశ్వరి మరణం తర్వాత నాగార్జున క్యాంపస్‌లో సీసీ కెమెరాలు పెట్టారు, ర్యాగింగ్ నిరోధానికి టోల్‌ఫ్రీ నంబరు అందు బాటులోకి తెచ్చారు. పై స్థాయిలో ఎన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నా.. క్షేత్ర స్థాయిలో ఫలితాలు రావాలంటే మిడిల్ మేనేజ్మెంట్ సరిగా ఉండాలి. రిషితేశ్వరి చనిపోయాక తొలి వర్దంతికి నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా సదస్సు పెడతామని కోరాం. అధికారులు కేవలం బ్యా చిలర్ ఆఫ్ ఆర్కి టెక్చర్ విద్యార్థుల (200)తో సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. రిషితేశ్వరి కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు సంతోషంగా తిరుగుతున్నారు. మేం అనాథల్లా బతుకుతున్నాం. నిన్న విజయ వాడలో ర్యాగింగ్ వల్ల తొమ్మిదో తరగతి విద్యార్థి చనిపోయిందన్న వార్త టీవీల్లో చూసి తల్లడిల్లిపోయాం. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాం. మా రిషితేశ్వరి కళ్ల ముందు కని పించింది. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అప్పుడే ఇతరుల్లో మార్పు వస్తుంది. తప్పు చేసినా తప్పించుకోవచ్చులే అనే భావన సమాజంలో పెరగడం మంచిది కాదు. -
ర్యాగింగ్‌తో జీవితాలు నాశనం
కర్నూలు సిటీ: సీనియర్, జూనియర్ విద్యార్థులు కళాశాలల్లో స్నేహపూరిత వాతావరణంలో విద్యను అభ్యసించాలని, ర్యాగింగ్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దని జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి అన్నారు. బుధవారం నగర శివారులోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తల్లిదండ్రులు పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తుంటారని.. భవిష్యత్తుపై ఎన్నో కలలు ఉంటాయన్నారు. అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివినప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలరన్నారు. సరదాల కోసం ర్యాగింగ్‌కు పాల్పడితే తల్లిదండ్రుల ఆశలన్నీ వమ్ము అవుతాయన్నారు. జూనియర్, సీనియర్ విద్యార్థులు అన్నదమ్ముల్లా కలిసిపోవాలన్నారు. అనంతరం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్వప్నరాణి మాట్లాడుతూ ర్యాంగింగ్కు పాల్పడితే చట్ట ప్రకారం కఠినంగా శిక్షలు ఉంటాయని.. అందువల్ల విద్యార్థులు కళాశాలల్లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సోమశేఖర్, సీనియర్ న్యాయవాది నిర్మల, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు
- జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ పాణ్యం: ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. పాణ్యం సమీపంలోని ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలను బుధవారం ఆయన సందర్శింశారు. ఐటీ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్యపై కళాశాల యాజమాన్యాన్ని విచారించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కళాశాలలో ఫిర్యాదుల పెట్టెలను బహిరంగ ప్రదేశాల్లో ఉంచారని.. వీటిని గోప్యంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలిని సూచించారు. హాస్టళ్లలో ప్రతిగదిలో, బహిరంగ స్థలాల్లో పోలీస్ హెల్పలైన్ నంబర్లు రాయాలని తెలిపారు. అక్కడున్న విద్యార్థినులతో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్‌తో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, ఉషారాణి ఘటన ఎంతో బాధ కల్గించిందన్నారు. అనంతరం కాన్ఫరెన్స్హాల్లో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఉషారాణి మృతికి నివాళులర్పించారు. కేసును ప్రభుత్వం సీబీసీఐడికి అప్పగించినందున పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఎస్పీ వెంట నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారినికి కఠినమైన శిక్ష విధించాలని ఎపీఎస్‌ఎప్ నాయకులు డిమాండ్ చేశారు. -
ర్యాగింగ్‌కు పాల్పడితే... బహిష్కరణ
అంబేడ్కర్ వర్సిటీ ఇన్చార్జి వీసీ చంద్రయ్య ఎచ్చెర్ల క్యాంపస్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, దాని అనుబంధ కళాశాలల్లో ఎవరైనా ర్యాగింగ్‌పై పాల్పడితే బహిష్కరిస్తామని వర్సిటీ ఇన్చార్జి వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య అన్నారు. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు వర్సిటీ చేపట్టిన ర్యాగింగ్ నిర్మూలన చర్యలు, భవిష్యత్‌లో ర్యాగింగ్ పట్ల వ్యవహరించే విధానాలను అధికారులు పరిపాలనా కార్యాలయంలో మంగళవారం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. నేరం ఎక్కువగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, విద్యార్థులపై ర్యాగింగ్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం వర్సిటీలో తరగతి గదులు, వసతి గృహం, క్యాంపస్ ప్రాంగణంలో నిఘా పెట్టామని, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు వినియోగిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు తమ బాధ్యతలు విస్మరిస్తే విలువైన జీవితం కోల్పోతారని అన్నారు. ప్రతి విభాగంలో ప్రత్యేక ర్యాగింగ్ అవగాహన సదస్సులు న్యాయ నిపుణలతో పెట్టామన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులు పట్ల ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యా మండలి సైతం తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాయని చెప్పారు. రాత్రులు సైతం వసతి గృహం పరిశీలిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు నియమావళి మేరకు ర్యాగింగ్ కేసులు క్రిమినల్ కేసులు కంటే తీవ్రంగా పరిగణించబడతాయని తెలిపారు. యూనివర్సిటీలో పటిష్టమైన యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ వ్యవస్థ ఉందని వివరించారు. రిజస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై కేసు నమోదు
కర్నూలు సిటీ: శ్రీచైతన్య కాలేజీలో సీనియర్ ఇంటర్ విద్యార్థి లోక్‌నాథ్ చౌదరి మృతికి ముగ్గురు విద్యార్థుల వేధింపులే కారణమని తండ్రి ఉమాపతి పిర్యాదు మేరకు తాలూకా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. కాలేజీ యాజమాన్యంతోపాటు అనురాగ్‌రెడ్డి, గోవర్దన్, మనీష్‌క్రాంత్ అనే విద్యార్థుల వేధింపుల వల్లే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 306 కింద కేసు నమోదు చేశారు. -
ర్యాగింగ్‌పై ఉక్కుపాదం
- డీఐజీ రమణకుమార్ మద్దికెర: విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని డీఐజీ బీవీ రమణకుమార్ అన్నారు. ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ర్యాగింగ్‌తో ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. జీవితం ఎంతో విలువైనదని, ‡ క్షణికావేశానికి లోనై ప్రాణాలు తీసుకోవడం తగదన్నారు. సమస్య వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కొని అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలపై ఆయా పోలీస్స్టేషన్లలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డీఐజీ వెంట డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, సీఐ విక్రమసింహ, ఎస్ఐ అబ్దుల్ జహీర్ ఉన్నారు. -
స్టాప్ డెత్ ఆఫ్ డెమోక్రసీ
ఇది గూండా రాజ్యం అనుకోవాలా? రౌడీ రాజ్యం అనుకోవాలా? ర్యాగింగ్ చేసి చంపినా పట్టించుకోరా? మోటర్‌బైక్‌తో గుద్దేసి ఉసురు తీసినా బేఖాతరా? వేధించి, సాధించి ప్రాణాలు పిండేసినా జాన్తానహీనా? మొన్న రిషితేశ్వరి... నిన్న లావణ్య... నేడు సంధ్యారాణి. కుమిలిపోతోంది... ప్రజాస్వామ్యం కుమిలిపోతోంది. కుళ్లిపోతోంది... వ్యవస్థ కుళ్లిపోతోంది. కుంగిపోతోంది... యువత మనోధైర్యం కుంగిపోతోంది. పాలక వ్యవస్థ కీచకపర్వాన్ని చూస్తూ ఊరుకుంటే... పోతున్న మానం, ప్రాణం మన బిడ్డలదే కాదు, భరతమాత గౌరవం కూడా! దిస్ ‘డెత్ ఆఫ్ డెమోక్రసీ’ హ్యాజ్ టు బి అరెస్టెడ్. సంధ్యారాణిని పొట్టన పెట్టుకున్న ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చెయ్యాలి. లేకపోతే... ఈ పర్వానికి పాలక అండ ఉందని నమ్మక తప్పదు. ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీత లోకంలో ప్రజాకాంక్షల హత్య... ప్రజాశయాల ఖూనీ... ప్రజాస్వామ్యం మర్డర్... నహీ చలేగా... నహీ చలేగా... నహీ చలేగా. హత్య... సంధ్యది. ఖూనీ... ఆమె కడుపులోని రెండు నెలల బిడ్డది. మర్డర్.. చావు బతుకుల్లో ఉన్న ఆమె భ ర్త జీవితేచ్ఛది. స్టాప్ ది డెత్ ఆఫ్ డెమోక్రసీ. నిలదీసినా... పట్టించుకోరా? ఏ ప్రభుత్వమైనా ఏం చేయాలి? కష్టం ఉందని ప్రజలు మొర పెట్టుకొంటే, కన్నీళ్ళు తుడవాలి. కష్టాల్ని తీర్చాలి... సమస్యల్ని పరిష్కరించాలి... కానీ, ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ పని చేస్తోందా? కాలేజీ స్టూడెంట్ల నుంచి కష్టాల్లో ఉన్న రైతుల దాకా ఎవరి గోడు అయినా పట్టించుకుంటోందా? ర్యాగింగ్ చేస్తున్నారన్నా... వేధింపులు వెంటాడుతున్నాయన్నా... ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... గద్దెనెక్కిన పెద్దలకు చీమ కుట్టినట్టయినా ఉండట్లేదు. విద్యార్థులు, ప్రతిపక్ష నాయకుడు ఉద్యమబాట పడితే కానీ... చలనం రావట్లేదు గత ఏడాది నాగార్జున యూనివర్సిటీ ర్యాగింగ్‌కు బలైన రిషితేశ్వరి ఆత్మకథ... ఇదే! గుంటూరు ఆసుపత్రిలో... ఎలుకలు కొరికిన పసికందు ఆత్మఘోష... ఇదే! విశాఖలో అధికార మదాంధులు వెంటపడి, బైకును ఢీ కొట్టడంతో... ప్రాణం పోయిన లావణ్య విషాదగాథ... ఇదే! అదే గుంటూరు ఆసుపత్రిలో... తాజాగా లేడీ ప్రొఫెసర్ వేధింపులకు బలైన సంధ్యారాణి వ్యధ... ఇదే! వైజాగ్‌లో ప్రేమించిన నేరానికి కుర్రాడి ప్రాణాలు తీసిన అధికార పార్టీ గూండాల అండదండల కథా... ఇదే! ప్రజల కష్టాలకు స్పందించాల్సిన ప్రభుత్వం, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పాలకులు... ఇవాళ పోరాటం చేస్తే కానీ పట్టించుకోని పరిస్థితి. జనం, జననేత వై.ఎస్. జగన్ గొంతెత్తితే కానీ, కాలు కదపని ఈ సర్కార్ గుడ్లప్పగించి చూసిన కొన్ని తాజా విషాదకథలపై ‘సాక్షి’ ఫోకస్. దోషులకే బాబు మంత్రుల వత్తాసు! నా కొడుక్కి పెళ్లయి పదినెలలైనా కాలేదు. మరో నాలుగు మాసాల్లో కోర్సు పూర్తి చేయాల్సిన మా కోడలు సంధ్యారాణి ప్రొఫెసర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. భార్యను చాలా ప్రేమగా చూసుకునే మా అబ్బాయి రవి ఆత్మహత్యాయత్నం చేశాడు. మా కోడలు ఆత్మహత్య చేసుకొని ఇన్ని రోజులైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు. కాలేజ్ విద్యార్థులంతా ప్రొఫెసర్ లక్ష్మి వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌రావుకు కూడా చెప్పారు. అయినా, కఠిన చర్యలు తీసుకోవడం లేదు. మంత్రి కామినేని, ప్రొఫెసర్ లక్ష్మి భర్త స్నేహితులని తెలిసింది. అందుకే వారిపై కఠినచర్యలు తీసుకోవడం లేదని అనుమానం. ఆంధ్రప్రదేశ్ మంత్రులు సామాన్యులమైన మాకు కాకుండా బలవంతులైన దోషులకు అండగా నిలిచారు. - ఈశ్వరమ్మ, సంధ్యారాణి అత్త నా కొడుకు, కోడలు సంతోషంగా ఉండేవారు! నా కొడుకు రవి, కోడలు సంధ్యారాణి చాలా సంతోషంగా ఉండేవారు. గుంటూరులో కోడలు పీజీ పూర్తి కాగానే కొడుకు, కోడలు మిర్యాలగూడలో ఆసుపత్రి పెట్టుకొని సంతోషంగా జీవిస్తారని ఆశించాం. ఇంతలోనే ఇలా అయిపోయింది! - చిట్టిపోలు సత్యనారాయణ, సంధ్యారాణి మామ, మిర్యాలగూడ న్యాయం జరగలేదు! గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజీ స్టూడెంట్ డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్య కేసులో మాకు న్యాయం జరగలేదు. ‘ప్రభుత్వ జనరల్ హాస్పిటల్’ (జి.జి.హెచ్)కు వచ్చే పేద రోగుల వైద్యసేవలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే మేము విధుల్లో చేరాం. కానీ సమ్మెకు మేము ఫుల్ స్టాప్ పెట్టలేదు. కామా పెట్టాం... అంతే. ప్రొఫెసర్ లక్ష్మి వల్ల భవిష్యత్తులో ఏ ఒక్క స్టూడెంట్ కూడా వేధింపులకు గురవకుండా ఆమెను ప్రభుత్వ సర్వీస్ నుండి తొలగించి, వైద్యవృత్తి చేసేందుకు అనర్హురాలిగా ప్రకటించాలి. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ సంధ్యారాణి కేసు విషయంలో న్యాయం జరగడం లేదనిపిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని జూనియర్ డాక్టర్లనూ కలుపుకొని మళ్ళీ సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. - డాక్టర్ పి. నాగేశ్వరరావు, జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షులు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల విచారణ... అన్నారు! అతీ లేదు... గతీ లేదు! డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య కేసును మెజిస్ట్రేట్‌తో విచారణ చేయిస్తామని జిల్లా కలెక్టర్ మాకు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు మెజిస్ట్రేట్ విచారణ జరుగుతున్నట్లు ఆర్డర్ కాపీ విడుదల కాలేదు. ముగ్గురు వైద్యులతో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ... తమ నివేదికను జూడాల సంఘానికి తెలియజేయకుండా నేరుగా ప్రభుత్వానికి అందజేయడం అనుమానాలు రేపుతోంది. గతంలో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులపై ఆస్పత్రి అధికారులకు పలుమార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. రెండు నెలల క్రితం రోగులు సైతం ఆమె ప్రవర్తనపై ఫిర్యాదులు చేశారు. అయినా, ఆమెకు ఉన్న రాజకీయ బలంతో ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. హైపవర్ కమిటీకి 100 మందికి పైగా నర్సులు, 40 మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు, 20 మందికి పైగా పీజీ వైద్యులు ఫిర్యాదు చేశారు. గతంలో గైనకాలజీ డిపార్ట్మెంట్లో పీజీ కోర్సు పూర్తిచేసి వెళ్ళినవాళ్ళు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఇప్పుడు మాకు ఫోన్లు చేసి, ప్రొఫెసర్ చేతిలో తాము గతంలో ఎదుర్కొన్న వేధింపులను వివరిస్తున్నారు. మాకు మద్దతు తెలియజేస్తున్నారు. బహిరంగ విచారణకైనా వచ్చి, వేధింపులపై సాక్ష్యం చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. వేధింపులకు పాల్పడ్డ ప్రొఫెసర్ లక్ష్మిని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి, విద్యార్థులలో మనోధైర్యం దెబ్బతినకుండా చూడాలి. - డాక్టర్ సంధ్యారాణి సహ విద్యార్థులు కాలేజీలో చేరినప్పటి నుంచి వేధింపులే! మా అమ్మాయి, ప్రొఫెసర్ లక్ష్మి వాళ్లమ్మాయి ఎంబీబీఎస్‌లో క్లాస్మేట్స్. గైనకాలజీ కోసం ఇద్దరూ ప్రిపేరయ్యారు. మా అమ్మాయికి సీట్ వచ్చింది. లక్ష్మిగారమ్మాయికి రాలేదు. పైగా మా అమ్మాయికి ఆ లక్ష్మి పని చేసే గుంటూరు మెడికల్ కాలేజ్‌లోనే వచ్చింది. కాలేజ్‌లో చేరినప్పటి నుంచి మా అమ్మాయిని ప్రొఫెసర్ వేధించేది. ‘హైదరాబాద్ నుంచి ఎందుకొస్తారే ఇక్కడికి? ఈ సీట్‌కి మేము మూడు కోట్లు పెట్టినా దొరకలేదు. మీకెందుకే?’ అంటూ అందరి ముందు తిట్టేదట. మా అమ్మాయి ఫోన్ చేసి ఏడ్చేది. మా అమ్మాయిని ఇబ్బంది పెట్టవద్దని బతిమిలాడుకుందామని ప్రొఫెసర్ లక్ష్మిని కలిశాం. సంధ్య, అల్లుడు, నేను పండ్లు, స్వీట్లు తీసుకుని లక్ష్మి ఇంటికి వెళ్లాం. ‘మా అమ్మాయి కూడా మీ అమ్మాయి లాంటిదే కదా! ఆమె ఏమన్నా తప్పు చేస్తే సర్ది చెప్పండి’ అని వేడుకున్నాం. ఆమె మా మాటలకు అడ్డు తగిలి, గట్టిగా మా అమ్మాయి మీద కేకలేసింది. సర్దిచెప్పడానికి ట్రై చేసినా వినిపించుకోలేదు. ఆ తర్వాత మా అమ్మాయికి ఫోన్ చేసి, ‘నువ్విట్లా మీ వాళ్లను తీసుకొస్తే నా గురించి అందరూ ఏం అనుకుంటారు? నువ్వు ఎలా పాసవుతావో చూస్తా’ అని బెదిరించిందట. టార్చర్ పెంచిందట. - బాల సత్తయ్య, సంధ్యారాణి తండ్రి పెళ్లి చేసుకున్నావ్... కానీ ప్రెగ్నెంట్ కావద్దు! లక్ష్మి వేధింపులకు భయపడిన బిడ్డ కాలేజ్‌కి వెళ్లాలంటేనే భయపడ్డది. పోయినేడాది డిసెంబర్లో పెళ్లి చేశాం. పెళ్లి కోసం 20 రోజులు లీవ్ అడిగితే నరకం చూపించింది. అందరి ముందరే ‘పెళ్లికి నీకు 20 రోజులు సెలవు అవసరమా? నా పెళ్లికైతే నేను అయిదు రోజులే లీవ్ తీసుకున్నా. నీకెందుకే 20 రోజులు? ఇదిగో.. పెళ్లయితే చేసుకున్నావ్ కాని ప్రెగ్నెంట్ కావద్దు’ అని బెదిరించిందట. ఇట్ల మా బిడ్డ ఏం చేసినా తప్పు పట్టేదట. ఆ భయంతోనే అది ప్రెగ్నెంట్ అయినా మాకు చెప్పలేదు. బ్యాగ్‌లో గర్భం పోవడానికి వాడే మాత్రలు దొరికాయి. అప్పటికే ఒకటి మింగినట్లుంది. లక్ష్మి మాటలకు భయపడే గర్భాన్ని పోగొట్టుకోవాలనుకుంది. ప్రతి విషయం నాకు ఫోన్లో చెప్పేది. కానీ ఈ సంగతి దాచింది. - బాల ప్రమీల, సంధ్యారాణి తల్లి, హైదరాబాద్ కఠినంగా శిక్షించాలి మా అన్న వదినలు అన్యోన్యంగా ఉండేవారు. వదిన పీజీ చదువు పూర్తయ్యాక ఇద్దరూ కలిసి క్లినిక్ నడపాలనుకున్నారు. ప్రొఫెసర్ వేధిస్తున్నట్టుగా వదిన మా అందరితోనూ చెప్పింది. వదిన మృతితో అన్నయ్య తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉరేసుకోవడంతో మెడ నరాలు తిన్నాయనీ, మెదడు సమస్యలొచ్చే ముప్పుందనీ డాక్టర్లన్నారు. ఎంతో ఆనందంగా ఉండే మా కుటుంబం అన్యాయమైపోయింది. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి. - మురళి, సంధ్యారాణి మరిది రెండు రోజుల దాకా నో ఎఫ్ఐఆర్! మా చెల్ల్లెలికి చదువు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. రోజుకు పదహారు గంటలు చదివేది. గైనకాలజీ తనకిష్టమైన కోర్స్. గైనకాలజిస్ట్‌గా గ్రామీణ మహిళలకు హెల్త్ సర్వీస్ ఇవ్వాలని ఆశయం. ఆ కల తీరకుండానే పోయింది. ఇన్ని రోజులవుతున్నా దీనికి కారణమైన ప్రొఫెసర్ లక్ష్మి ఆచూకీ తెలుసుకోలేకపోయారంటేనే తెలుస్తోంది ఆమెకెంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో! మా చెల్లి పోయిన రెండు రోజుల వరకు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయనే లేదు. - బాల రవికుమార్, సంధ్యారాణి అన్నయ్య మూడేళ్ళుగా కంప్లయింట్స్! ప్రొఫెసర్ లక్ష్మి పెట్టే టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకోవాలని మా అక్క అక్టోబర్ 6నే డిసైడ్ చేసుకుంది. డైరీలో రాసింది. ఆ ప్రొఫెసర్‌పై మూడేళ్ళుగా కంప్లయింట్స్ ఉన్నాయి. ‘మీ స్టూడెంట్ సూసైడ్‌తో ఆమె పేరెంట్స్ వచ్చారు’ అని పోలీసులు ఆమెకు చెబితే, ‘వాళ్ల వల్ల ఏమవుతుంది! ఏదో ఒకటి చెప్పి పంపేయండి’ అందట. ఆమె ఇన్ఫ్లుయెన్స్కు ఇదే ఉదాహరణ. - బాల ప్రవీణ్, సంధ్యారాణి తమ్ముడు నిన్న రిషితేశ్వరి... గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణ విషాదం ఇంకా మరువనన్నా లేదు. ఇప్పుడు డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య ఉలిక్కిపడేలా చేసింది. వ్యవస్థలో సామాన్య పౌరుల గోడు వినేవారు ఎవరూ లేరని తేలింది. విద్యార్థుల ర్యాగింగ్‌కీ, కష్టం చెప్పుకున్నా స్పందించని ప్రిన్సిపాల్ చర్యలకూ రిషితేశ్వరి బలైతే, సంధ్య సాక్షాత్తూ లేడీ ప్రొఫెసర్ వేధింపులకు బలైంది. రిషితేశ్వరి చనిపోయి ఏడాది దాటుతున్నా ఆ కాలేజ్ ప్రిన్సిపాల్‌పై చర్యలు అంతంతే. ఇప్పుడు డాక్టర్ సంధ్య చావుకి కారణమైన ప్రొఫెసర్ లక్ష్మి ‘కనిపించడం లేదు’ట! విద్యార్థులే మన సమాజ భవిష్యత్తు. ఆ భవిష్యత్ ఇలా నేల రాలుతున్నా, రాజకీయ అండతో నిందితులు తప్పించుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు! -
అమ్మా మేమిక్కడ చదవలేం..!
♦ రిమ్స్‌లో ర్యాగింగ్ భూతం! ♦ గుంటూరు తరహా ఘటనలు జరగకుండా నివారణ చర్యలేవీ? ♦ ర్యాగింగ్ నిరోధక కమిటీల జాడ ఏదీ? ♦ ఫ్రెషర్స్‌డే రోజు వరకు వేధింపులు తప్పవా? సమాజంలో ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి వైద్యుడు. ప్రజలు దేవుడితో సమానంగా వారిని చూస్తారు. అలాంటి వృత్తిలోకి త్వరలో వారంతా అడుగుపెట్టేవారే.. కానీ ఆ విలువలను కాలరాస్తూ తమ తర్వాత వచ్చేవారికి ఆదర్శంగా ఉండటం మాని వారితో వికృతంగా ప్రవర్తిస్తున్నారు. జూనియర్లను వేధిస్తూ వికృతానందం పొందుతున్నారు.. ఇటీవల కాలంలో రిమ్స్‌లో జరుగుతున్న ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి రాకపోరుునా.. బాధిత విద్యార్థులతల్లిదండ్రుల ద్వారా వినతులు మీడియాకు చేరుతున్నారుు. గుంటూరు లాంటి ఘటనలు చోటుచేసుకోకముందే అధికారులు మేల్కోవాల్సి ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నారు. ముఖ్యం గా రూమ్‌లో, బయట తరగతులకు వెళ్లేటపుడు, అధ్యాపకులు రాని సమయంలో ర్యాగింగ్ చేస్తున్నారు. మొదటిరోజు తనతోపాటు మరో ఇద్దరిని కూడా బహిరంగంగా హాస్టల్ వద్ద నిలిపి ఇబ్బందికరంగా ప్రవర్తించమని వేధించారు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏడ్చాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని దంత వైద్య కళాశాలలో ఇటీవలే చేరారు. ఆమెకు కేటారుుంచిన మంచాన్ని ఇవ్వకుండా సీనియర్ విద్యార్థులు ఇబ్బందులు పెట్టి, తాము చెప్పినట్లు చేయాలని వేధిస్తున్నారు. సదరు విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి బోరుమంది. తాను ఇక్కడ చదవలేనని, ఇంటికి వచ్చేస్తానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రు లు ’సాక్షి’కి ఫోన్ చేసి తమ ఆవేదన వ్యక్తం చేశా రు. పోలీసులు, కేసులు అంటే తమ కుమార్తె భయపడుతోందని, సున్నితంగా వ్యవహరించి ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టాలని వారు విజ్ఞప్తిచేశారు. ఇలా బయటకు చెప్పుకోలేక పలువురు జూని యర్ విద్యార్థులు లోలోన కుమిలిపోతున్నారని తెలిసింది. కడప అర్బన్: కడప రిమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రజల వైద్య కలల ప్రాకారం. 2006 నుంచి వైద్య విద్య కోర్సును అభ్యసించేందుకు 150మంది విద్యార్థులు వచ్చారు.. వస్తున్నారు. 2016-17 బ్యాచ్‌లో కూడా 150మంది విద్యార్థులు మొదటి సంవత్సరంలో అడుగుపెట్టారు. రిమ్స్‌లో తరగతులు ప్రారంభమయ్యేరోజు డెరైక్టర్, ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది, వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించాలని ఆహ్వానాలు పలుకుతూ సమావేశాలు నిర్వహించారు. కానీ ఇటీవల ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లాంటి భూతాలు మొదటి సంవత్సరం విద్యార్థులను పట్టిపీడిస్తున్నారుు. తమను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని బాధితులు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాము ఇక్కడ చదవలేమని రోదిస్తున్నారు. ఈ వ్యవహారం బయటకు వెళితే తర్వాత భరతం పడతామని కూడా సీనియర్ విద్యార్థులు బెదిరిస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నారుు. దసరా, దీపావళి సెలవులకు వెళ్లకముందే నూతనంగా రిమ్స్ కళాశాల ఆవరణలోకి అడుగుపెట్టిన వైద్య విద్యార్థులకు చేదు అనుభవాలు ఎదురయ్యారుు. ఈ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చారుు. గుంటూరు తరహా దురదృష్ట ఘటనలు చోటుచేసుకోకముందే అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని కొందరు జూనియర్ విద్యార్థులు కోరుతున్నారు. కళాశాల అధికారులు, అధ్యాపకులు, మరోవైపు పోలీసు యంత్రాంగం వారు కూడా అప్రమత్తమై విద్యార్థులకు అవగాహన కల్పించాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. కనిపించని కమిటీలు రాష్ట్రంలో వైద్య కళాశాలల్లోగానీ, ఇతర కళాశాలల్లోగానీ ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ల ద్వారా నష్టం జరిగినపుడు మాత్రమే ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌ల కమిటీలు గుర్తుకొస్తారుు. అలాకాకుండా ప్రతి కళాశాలలోనూ ఈ కమిటీలను ఏర్పాటుచేసి ఫిర్యాదులను రహస్యంగా బాక్సుల్లో వేసేలా చర్యలు చేపట్టాలి. బాధితులు ఎవరైనా ఉంటే ఆ బాక్సులో ఫిర్యాదులు వేయవచ్చు. దంత వైద్య కళాశాలలో.. దంత వైద్య కళాశాలలో కూడా సీనియర్ విద్యార్థులు జూనియర్లపై జులుం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు. జూనియర్ విద్యార్థులకు కేటారుుంచిన మంచం, ఇతర వస్తువులను ఉపయోగించుకోకుండా సీనియర్ విద్యార్థినులు వేధిస్తున్నట్లు, సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తున్నట్లు బాధితులు తమ తల్లిదండ్రులకు చెప్పుకొని వాపోతున్నారు. ఫ్రెషర్స్‌డే రోజున అవగాహన కల్పిస్తాం రిమ్స్‌లో త్వరలో ఫ్రెషర్స్‌డే నిర్వహించనున్నాం. ఆకార్యక్రమంలో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌లపై అవగాహన కల్పిస్తాం. పోలీసు అధికారులతో కూడా చర్చించి తగిన ఏర్పాట్లు చేస్తాం. - డాక్టర్ మాజేటి శశిధర్, రిమ్స్ డెరైక్టర్, కడప ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం రిమ్స్ వైద్య కళాశాలలోగానీ, దంత వైద్య కళాశాలలోగానీ ర్యాగింగ్లు, ఈవ్‌టీజింగ్‌లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. తర్వాత కూడా మార్పురాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - మోహనప్రసాద్, రిమ్స్ సీఐ -
‘ర్యాగింగ్‌పై చర్యలు తీసుకోండి’
సాక్షి, హైదరాబాద్: ర్యాగింగ్‌ను అరికట్టేందుకు యూనివర్సిటీలు, కళాశాలల యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ఆదేశించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు ప్రతి విద్యా సంస్థలో ర్యాగింగ్ నిరోధక కేంద్రాలు తెరవాలని శనివారం పేర్కొన్నారు. ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసి, తనిఖీ బృందాలన ు ఏర్పాటు చేయాలని సూచించారు. కమిటీలు క్రమం తప్పకుండా సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. సహాయ కేంద్రాలు, అత్యవసర సర్వీసులు ఏర్పాటు చేయాలని, క్యాంపస్‌లోని ముఖ్య ప్రాంతాల్లో సీసీటీవీలు అమర్చి, అలారం బెల్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్‌పై తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కార్యాచరణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని వైస్ చాన్స్లర్లను ఆదేశించారు. -
పెట్రేగిన ర్యాగింగ్ రక్కసి
నాగార్జున యూనివర్శిటీలో మరోమారు వెలుగులోకి గురువారం అర్ధరాత్రి హాస్టలులో ఘటన జూనియర్లను వేధించిన సీనియర్లు ఐదుగురి సస్పెన్షన్ సాక్షి, గుంటూరు : మొన్న రిషితేశ్వరి.. నిన్న సునీత, తిరుపతమ్మ.. ఇలా జిల్లాలో అభంశుభం తెలియని ఎంతోమంది విద్యార్థినులు పోకిరీల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతూ తల్లిదండ్రులను శోకసంద్రంలోకి నెడుతున్నారు. తాజాగా శుక్రవారం నాగార్జున యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థి జయంత్‌ను ఐదుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేసిన విషయం వెలుగుచూసింది. ఈ ఘటనలో ఐదుగురు సీనియర్ విద్యార్థులను ఏఎన్‌యూ అధికారులు సస్పెండ్ చేశారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, ఆశయాలతో కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు అక్కడ కీచక ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో పెడుతున్న చిత్రహింసలు భరించలేక, లైంగిక వేధింపులు తట్టుకోలేక అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు. ఏడాది కాలంలో ముగ్గురు విద్యార్థినులు ర్యాగింగ్, వేధింపులు తట్టుకోలేక బలయ్యారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రిషితేశ్వరి సంఘటన తరువాత ఏఎన్‌యూలో మూడు ర్యాగింగ్ సంఘటనలు జరిగాయి. కళాశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లోని కొందరు ఆకతాయిలు నిత్యం పెడుతున్న చిత్రహింసలు, లైగింక వేధింపులు భరిస్తూ కళాశాలలకు వెళ్లలేక.. ఈ విషయాన్ని ఇళ్లలో తల్లిదండ్రులకు చెప్పి వారిని బాధపెట్టలేక నలిగిపోతున్నారు. ఎంత ఓపిక పట్టినా వీరి వేధింపులు ఆగకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల పొరపాటో, కళాశాలల్లో ఉపాధ్యాయుల పొరపాటో తెలియదు కానీ నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతం కాబోతున్న గుంటూరు జిల్లాలో వరుస సంఘటనలు జరగడానికి కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణమైతే.. పోలీసుల ఉదాసీన వైఖరి కూడా కారణంగా చెప్పవచ్చు. కొన్ని కళాశాలల్లో ఇప్పటికీ యాంటీ ర్యాగింగ్ కమిటీలు సక్రమంగా పనిచేయడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం
చోడవరం : ర్యాంగింగ్కు పాల్పడడం చట్టరీత్యా నేరమని చోడవరం సివిల్ జడ్జి లక్ష్మి అన్నారు. చోడవరం కలాసీల కల్యాణ మండపంలో విద్యార్థి జూనియర్ కాలేజీ విద్యార్థులకు న్యాయవిజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలేజీ వయస్సు మనిషి ఎదుగుదలకు చాలా కీలకమన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ చేయడం, తోటి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం చట్టరీత్యా నేరమని ఆమె అన్నారు. ఇంటర్మీడియట్ చదువు జీవితంలో ఎదుగుదలకు ఎంతో కీలకమన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యశించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మూర్తి, గోతిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు. -
ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదు
– యాజమాన్యాలు స్పందించకున్నా శిక్షార్హులే – విద్యార్థులు ఆత్మన్యూతనకు లోనుకాకూడదు – అవగాహన సదస్సులో అర్బన్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి తిరుపతి ఎడ్యుకేషన్ : ర్యాగింగ్‌కు పాల్పడితే ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి హెచ్చరించారు. రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం విద్యార్థులకు ర్యాగింగ్, దాని పర్యవసనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపైనే దష్టి సారించాలన్నారు. సరదా కోసం తోటి విద్యార్థిని మానసికంగా, శారీరకంగా బాధపెడితే ఉన్నతమైన జీవితాన్ని కోల్పోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల విజయవాడలో 7వ తరగతి విద్యార్థి ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న ఘటనను గుర్తు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడితే వెంటనే తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యం దష్టికి తీసుకెళ్లాలని సూచించారు. యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు ఆత్మన్యూనతకు గురికాకూడదని, ఎటువంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి డాక్టర్ చదలవాడ సుచరిత మాట్లాడుతూ దేశంలో మహిళా సాధికారతను పెంపొందించడానికి విద్యార్థినులు ధైర్యంగా ముందుకు సాగాలని తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.మల్లికార్జునయ్య, ఆర్ అండ్ డి సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.మోహన్, టెక్నికల్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ పి.జయచంద్రారెడ్డి, ప్రొఫెసర్ రామమూర్తి, ప్రొఫెసర్ నాగమునెయ్య పాల్గొన్నారు. -
ర్యాగింగ్ భూతాన్ని తరిమివేద్దాం
– చైతన్యానికి శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం – యాంటీ ర్యాగింగ్ పోస్టర్ విడుదల చేసిన గౌరు వెంకటరెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ర్యాగింగ్ భూతాన్ని తరిమివేద్దామని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విద్యార్థి విభాగం నాయకులతో కలిసి యాంటీ ర్యాగింగ్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది విద్యార్థి పాలిట యమపాశం లాంటిదన్నారు. నూతనంగా కాలేజీల్లో చేరే విద్యార్థుల పట్ల సీనియర్లు అసభ్యంగా ప్రవర్తించడంతో మనో వేదనకు గురై చివరికు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఇలాంటి దురాచారాన్ని రూపుమాపాలని పిలుపునిచ్చారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రై వేటు, ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులను చైతన్యపరిచే కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ర్యాగింగ్ నష్టాలను వివరించి, విద్యార్థుల మధ్య స్నేహ పూర్వక వాతావరణం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు టి.అనిల్ కుమార్, నగర అధ్యక్షుడు పి.జి. గోపినాథ్ యాదవ్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, సతీశ్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, సంజు, అశోక్, ప్రత్యూష్, సురేంద్ర, రాజు, కొండ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యనిర్ధేశం ఉంటే ర్యాగింగ్‌కు దూరం
ఇన్చార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య ఎచ్చెర్ల: లక్ష్యం ఉన్న విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉంటారని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య అన్నారు. ‘వర్సిటీలో విద్యార్థులపై ర్యాగింగ్ మానసిక ప్రభావం’ అనే అంశంపై ఒక రోజు అవగాహన తరగతి గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్సిటీలో విద్యార్థులు ఎందుకు అడుగుపెట్టారు, తల్లిదండ్రులు పిల్లలను ఏ ఆశయంతో చదివిస్తున్నారు అనే అంశాలపై సంపూర్ణ అవగాహన అవసరమన్నారు. ర్యాగింగ్ చేయడం సైతం ఒక మానసిక రోగంగా చెప్పారు. నిర్థిష్ట లక్ష్యంతో కళాశాలల్లో చేరే విద్యార్థులపై ర్యాగింగ్ ప్రభావం చూపుతుందని తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడే వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి చేరలేడని, ర్యాగింగ్ బాధిత వ్యక్తి మానసికంగా చదువుపై దృష్టి పెట్టలేడన్నారు. బీఆర్‌ఏయూ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అని చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడే వ్యక్తులను క్షమించేది లేదని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ పెద్దకోట చిరంజీవులు మాట్లాడుతూ వర్సిటీలో ర్యాగింగ్‌కు తావు లేకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థుల మానసిక పరిస్థితి, బాధితుల మానసిక సంఘర్షణపై విద్యా విభాగం మానసిక శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జేఎల్ సంధ్యారాణి విద్యార్థులకు వివరించారు. -
ర్యాగింగ్‌తో భవిష్యత్తు నాశనం
వెఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పట్నంబజారు : ప్రపంచంలోనే అణుబాంబు కన్నా విద్యార్థులే శక్తివంతులని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో బుధవారం చుట్టుగుంట సెంటర్లో యాంటీ ర్యాగింగ్ పోస్టర్లును ఆవిష్కరించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. చదువుతో పాటు విద్యార్థుల సమస్యలపై పోరాడి వాటిని పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న చంద్రబాబు సర్కార్‌పై పోరాడాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము) మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేదని విద్యార్థి, యువజనుల బలం వైఎస్సార్ సీపీకి ఉందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన పథకాలకు తిలోదకాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. చైతన్య మాట్లాడుతూ ప్రతి కళశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ.. ర్యాగింగ్‌తో జరిగే అనర్థాలు వివరిస్తున్నట్లు తెలిపారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా కమిటీ నేతలు విఠల్, వినోద్, పేటేటి బాజి, నాని, పవన్, వెంకట్, శివ, సాయిగోపి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 13 నుంచి రిషితేశ్వరి కేసు విచారణ ప్రారంభం
దోషులకు శిక్ష పడినప్పుడే ఆమె ఆత్మకు శాంతి సీనియర్ న్యాయవాది వైకే గుంటూరు (లక్ష్మీపురం) : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ మహమ్మారికి బలైన ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి కేసులో దోషులకు శిక్ష పడినప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని సీనియర్ న్యాయవాది వై. కోటేశ్వరరావు (వైకే) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సహ విద్యార్థుల అమానుష చర్యల కారణంగా బలవన్మరణానికి పాల్పడి గురువారానికి ఏడాది పూర్తవుతున్న దృష్ట్యా ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబూరావుతో సహా మరో ముగ్గురు విద్యార్థులు నిందితులుగా ఉన్న ఆ కేసు విచారణ ప్రక్రియ గుంటూరు 4వ అదనపు అసిస్టెంట్ సెషన్స్ మహిళా న్యాయమూర్తి కమలాదేవి కోర్టులో ఆగస్టు 13 నుంచి ప్రారంభం కానున్నదని వెల్లడించారు. ఈ మేరకు నలుగురు నిందితులు కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారని వివరించారు. యావజ్జీవ కారాగార శిక్ష పడే ర్యాగింగ్ నిరోధక చట్టం ఐపీసీలోని 306 తదితర సెక్షన్ల కింద కేసు విచారణ జరగనున్నదని తెలిపారు. కేసు విచారణ అసిస్టెంట్ సెషన్సు జడ్జి కాకుండా, సెషన్స్ జడ్జితో చేపట్టాలని కోరుతూ ఫిర్యాదిదారు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తరఫున కోర్టులో పిటిషన్ వేసే అంశం పరిశీలనలో ఉందని తెలిపారు. మృతురాలి తండ్రి మురళీకృష్ణ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, ఆర్కిటెక్చర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డిని కలిసి గురువారం రిషితేశ్వరి సంస్మరణను విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వ్యతిరేక దినంగా నిర్వహించాలని కోరారని తెలిపారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
గుర్తుకొస్తున్నావు మర్చిపోము
రిషితేశ్వరి జననం: 22 ఏప్రిల్ 1997 మరణం: 14 జూలై 2015 మర్చిపోము. నీ మరణానికి కారణం మర్చిపోము. నీవు పడ్డ వేదనను మర్చిపోము. నీ త్యాగం మర్చిపోము. స్ట్రెచర్ మీద నిన్ను నిర్జీవంగా పడేసిన రోజును మర్చిపోము. దశదిశలా పెల్లుబికిన ఆక్రోశాన్ని మర్చిపోము. కంట తడి పెట్టిన ప్రతి కన్నునూ మర్చిపోము. మండిన ప్రతి గుండెనూ మర్చిపోము. అంతిమంగా... ‘ఇంకో అమ్మాయికి ఇలా జరగకూడదు’ అన్న నీ దీక్ష మర్చిపోము. పువ్వులా, అప్పుడే విరిసిన హరివిల్లులా సప్త వర్ణాలను విరజిమ్మే నవ్వును హత్య చేశారు! విశ్వవిద్యాలయం అంటే సరస్వతి గుడి, చదువుల ఒడి అనే నమ్మకాన్ని హత్య చేశారు! ఆచార్యులు అంటే విద్యాబుద్ధులనే కాదు, జాగ్రత్తల్నీ చెప్తారనే భరోసాను హత్య చేశారు! సీనియర్లంతా జూనియర్లను చేరదీసి, స్నేహం కలుపుకుంటారనే ఆశను హత్య చేశారు! క్యాంపస్‌లో, క్యాంటీన్లో, హాస్టల్లో స్నేహం గుబాళిస్తుందన్న అమాయకత్వాన్ని హత్య చేశారు! ఫ్రెషర్ అనే కైండ్‌నెస్ కూడా లేకుండా ర్యాగింగ్ చేసీ చేసీ మానవత్వాన్ని హత్య చేశారు! కనిపెంచిన అమ్మపై, నాన్నపై, చదువుతున్న చదువుపై పెంచుకున్న ప్రేమను హత్య చేశారు! బాగా చదివి, అమ్మానాన్నల్ని గొప్పగా చూసుకోవాలన్న ఆశయాన్ని హత్య చేశారు! ప్రేమదారిలోకి రానందుకు... తిరిగిరానిలోకాలకు తరలిపోయేలా వ్యక్తిత్వాన్ని హత్య చేశారు! కష్టమొస్తే చెప్పుకోలేనంతగా, కన్నీళ్లొస్తే మనసు విప్పుకోలేనంతగా ధైర్యాన్ని హత్య చేశారు! యూనివర్శిటీ అంటే నరకం తప్ప ఇంకోటి కాదు అనిపించేలా ఆత్మవిశ్వాసాన్ని హత్య చేశారు! ఉసురు తీసుకుంటూ కూడా సీనియర్స్‌ని ఒక్క మాటా అనని మంచితనాన్నీ హత్య చేశారు! రిషితేశ్వరిని ఇన్ని విధాలుగా హత్య చేశారు! కాలేజీలు తెరిచారు. రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలలో మన పిల్లలు... పరాయి రాష్ట్రాల పిల్లలు మెల్లమెల్లగా క్లాసులకు హాజరవుతున్నారు. సీనియర్లు ఉత్సాహపడే సమయమిది. ఫ్రెషర్స్‌ని ర్యాగింగ్ చేద్దామని ఉబలాటపడే సమయం. ఇప్పుడే అప్రమత్తతతో ఉండాలి. ప్రభుత్వాలు ఆయా సంస్థలకి తన శాఖల ద్వారా తాఖీదులు అందించాలి. ప్రతి విద్యాసంస్థా అంతర్గతంగా ర్యాగింగ్‌ని నిరోధించే కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఇది కేవలం విద్యార్థుల సమస్య మాత్రమే కాదు... తమది కూడా అని చైతన్యపరిచే కార్యక్రమం చేపట్టాలి. తల్లితండ్రులు తాము ఏ విద్యాసంస్థల్లో పిల్లల్ని చేర్చారో, ఆ సంస్థల్ని ర్యాగింగ్ పట్ల జాగ్రత్తలు తీసుకునేలా హెచ్చరికలు చేయాలి. ఇవన్నీ సక్రమంగా జరిగితే, మరో రిషితేశ్వరి ఘటన జరగదు. ఈ విద్యా సంవత్సరం మరో కొత్త బలిని కోరదు. ‘సాక్షి’ ఉంది. ఆడపిల్లలపై అకృత్యాలు సాగితే, చూస్తూ ఊరుకోదు. పోరాడుతూనే ఉంటుంది. రిషితేశ్వరి సాక్షిగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. నువ్వు రాసిన ఉత్తరం చదివి ఏడాదయ్యింది. నిన్న చదివినట్టుగానే అనిపిస్తోంది. ఆ ఉత్తరంలో నీ ఆవేదన... నీపై క్రూరమైన చర్య చేసినవాడి పట్ల నువ్వు చూపిన సింపథీ... గుర్తు చేసుకుంటున్నాం. నీ నవ్వు, నీ ధ్యేయం... నీ లక్ష్యం, నీ ప్రేమ... నీ పరిణతి... గుర్తు చేసుకుంటున్నాం. నాన్న దగ్గర డబ్బు తీసుకుని స్నేహితుడికి పుస్తకాలు కొనిపెట్టిన నీ ఔదార్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం. చదువుల తల్లిని చిదిమేశారు. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో యూనివర్సిటీకి చదువుకోవడానికి వచ్చిన ఆ అమ్మాయి హాస్టల్లో ర్యాగింగ్ భూతానికి బలైంది. స్నేహభావం చూపాల్సిన తోటి విద్యార్థులు సీనియర్లే యమభటులై, ర్యాగింగ్ చేసి తీవ్ర మానసిక వ్యధ అనుభవించేలా చేయడంతో నిండు ప్రాణం తీసుకుని కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ఇది గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మృతి చెందిన ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషితేశ్వరి దయనీయ కథ. ఆర్కిటెక్చర్‌పై మక్కువ పెంచుకున్న రిషితేశ్వరి ఎంట్రన్స్‌లో 112వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లో అయితే హాస్టల్ సౌకర్యం సరిగా ఉండదు, నాగార్జున యూనివర్సిటీలో భద్రతతో కూడిన హాస్టల్ ఉంటుందని వరంగల్ నుంచి గుంటూరు వచ్చి నాగార్జున యూనివర్సిటీలో చేరింది. కాని అక్కడ నిత్యం ఆమెను ర్యాగింగ్ వెంటాడింది. మానసిక క్షోభకు గురి చేసింది. వరంగల్‌కు చెందిన మురళీకృష్ణ, దుర్గాబాయిల దంపతుల ఏకైక కుమార్తె అయిన ఆ బంగారు తల్లి తన బతుకును బలి ఇచ్చింది. ఫ్రెషర్స్ డే నుంచే మొదలు ఫ్రెషర్స్ డే నుంచే రిషితేశ్వరి వేధింపులు మొదలయ్యాయి. ఆ రోజునే సీనియర్ విద్యార్థి ఒకడు రిషితేశ్వరితో అమర్యాదగా ప్రవర్తించాడు. మళ్ళీ అదే విద్యార్థి మరుసటి రోజు క్లాసుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ప్రవర్తన మార్చుకోమని రిషితేశ్వరి గట్టిగానే చెప్పింది. ఆ తరువాత తరచూ సీనియర్ల నుంచి ఇబ్బందులు కొనసాగాయి. అలాగే హాస్టల్లో చేరిన మొదటి రోజే సీనియర్లు రూమ్ ఖాళీ చేయమంటూ ఒత్తిడి చేశారు. మరుసటి రోజు ఖాళీ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ, ప్రిన్సిపాల్ బాబూరావు తమ వర్గం వ్యక్తేననీ, తమనేమీ చేయడనీ రిషితేశ్వరిని హెచ్చరించారు. ఇలా ప్రతి సందర్భంలోనూ వేధింపులు కొనసాగుతూనే ఉన్నా అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగింది. ఈ క్రమంలో 2015 జూలై 13వ తేదీన సాయంత్రం రిషితేశ్వరి తోటి విద్యార్థులతో కలిసి మంగళగిరిలో సినిమాకు వెళ్ళింది. హాలులో ఓ సీనియర్ విద్యార్థి నడుముపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పట్టరాని కోపంతో ఏం చేయాలో పాలుపోక కొంతసేపు విలపించింది. ఆ తరువాత అదే రోజు రాత్రి సీనియర్ విద్యార్థుల వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. రిషితేశ్వరిని సీనియర్ విద్యార్థినులు అర్ధనగ్నంగా నడిపించి, అదంతా వీడియో తీశారు. తమ తోటి విద్యార్థులకు చూపించారు. దీంతో మరింత కలత చెందిన రిషితేశ్వరి జూలై 14వ తేదీ ఉదయం చివరిసారిగా తండ్రితో మాట్లాడింది. 14వ తేదీ ఉదయం తండ్రి మురళీకృష్ణకు ఫోన్ చేసి ‘బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళుతున్నా నాన్నా’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అదేరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ‘ ఐ లవ్ యూ నాన్నా’ అని వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టింది. ఆ తరువాత ఆత్మహత్యకు పాల్పడింది. మెసేజ్ వచ్చిన కొద్దిసేపటికే రిషితేశ్వరి చనిపోయిందన్న ఫోన్ కాల్ మురళీకృష్ణ, దుర్గాబాయి దంపతుల గుండె పగిలేలా చేసింది. బ్రేక్‌ఫాస్ట్‌కు వచ్చిన రిషితేశ్వరి మెస్‌లో కనబడకపోయేసరికి, స్నేహితులు రూమ్‌కు వెళ్ళి చూశారు. అప్పటికే, రిషితేశ్వరి మృతి చెంది ఉంది. జీవితంలో జరిగే ప్రతి మంచి, చెడులను రిషితేశ్వరికి డైరీలో రాసుకోవడం అలవాటు. అలాగే చనిపోయే ముందు డైరీలో మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. యూనివర్సిటీ జీవితం నరకప్రాయమైందనీ, నవ్వాలంటే భయపడే పరిస్థితి ఇక్కడ ఉందనీ సూసైడ్ నోట్లో పేర్కొంది. ప్రిన్సిపాల్ బాబూరావు వల్లే ... ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు నిర్లక్ష్యం వల్లే రిషితేశ్వరి మరణించిందనే ఆరోపణలున్నాయి. వర్సిటీలో జరిగే ప్రతి ఘటననూ ఆయన దృష్టికి రిషితేశ్వరి తీసుకెళ్ళినప్పటికీ ఒక్కదానికి కూడా ఆయన స్పందించలేదు. పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడడం, తరచూ హాస్టల్స్‌లో పరిస్థితులు చూడడం - ఇలాంటివేవీ చేసి, గాడిలో పెట్టిన దాఖలాలు లేవు. చివరకు తన సామాజిక వర్గ విద్యార్థులకు కొమ్ముకాస్తూ మిగిలిన సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇబ్బందులు పెట్టారనే ఆరోపణలూ ఉన్నాయి. హాయ్ లాండ్ రిసార్ట్స్‌లో జరిగిన ఫ్రెషర్స్‌డే పార్టీలో విద్యార్థులతో కలిసి బాబూరావు నృత్యాలు చేశారు. రిషితేశ్వరి కేసులో బాబూరావుతోపాటు మరో ముగ్గురు సీనియర్ విద్యార్థులు దుంబా హనీసా, నరాల శ్రీనివాస్, ధరావత్ జయచరణ్లపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం రిషితేశ్వరి మరణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు, విద్యార్థి, యువజన సంఘాలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డాయి. ఫేస్బుక్లో నెటిజన్లు 13 వేల మంది రిషితేశ్వరి మరణానికి సంతాపం తెలిపారు. ప్రభుత్వానికి మాయనిమచ్చగా మారిన ఈ ఘటనకు స్పందనగా ఆఘమేఘాల మీద వర్సిటీ వైస్‌చాన్సలర్‌గా ఉన్న సాంబశివరావును తప్పించి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎం.ఉదయలక్ష్మిని ఇన్చార్జి వీసీగా నియమించారు. బాబూరావును సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం నేపథ్యంలో ర్యాగింగ్‌పై నిర్భయ చట్టం తెస్తామనీ, ప్రతి యూనివర్సిటీలో, కాలేజీల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేస్తామనీ, యూనివర్సిటీ బయట పోలీసు అవుట్‌పోస్టు ఏర్పాటు చేస్తామనీ, ఎక్కడా ఇటువంటి మరణాలు లేకుండా చర్యలు తీసుకుంటామనీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనలో ఏ ఒక్కటి అమలులోకి రాకపోవడం దారుణం. నిందితులైన విద్యార్థులకు అరెస్టు చేసిన కొద్ది రోజులకే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసులో కీలక నిందితుడైన ప్రిన్సిపాల్ బాబూరావు జిల్లా కోర్టులో లొంగిపోయి, బెయిల్‌కు దాఖలు చేశాడు. జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించడంతో, హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. బెయిల్‌పై ప్రస్తుతం బయటే ఉన్నారు. రిషితేశ్వరి తల్లితండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి దంపతులకు రాజమండ్రిలో 500 గజాల స్థలం, రూ.10 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది. కేసు ఇప్పటికీ తేలకుండా మిగిలిపోయింది. రిషితేశ్వరి రాసిన అప్పటి సూసైడ్ నోట్ ►నవ్వు!!! నవ్వు!!! నవ్వు!! ఈ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారు నాన్న. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వరంగల్ వదిలి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. ఇలా వచ్చిన నన్ను నా సీనియర్స్‌లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. దాంతో నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అవి వింటేనే నా మొహంలో నవ్వు మాయం అయిపోయేది. ఏడుపు కూడా వచ్చేది. నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చాక దాయాల్సి వస్తోంది. ►చెప్తే ఏమైపోతారో అని భయంతో దాయాల్సి వస్తుంది. అలా నేను దాచినప్పుడల్లా నాకు నరకయాతన కనిపిస్తుంది. సీనియర్స్‌లో దీప, అవినాష్, లావణ్య, ప్రసాద్ వీళ్లు చేసిన హెల్ప్స్ నేను ఎప్పటికీ మరిచిపోలేను. నాన్నా వీళ్లకి ఒక్కసారి థాంక్స్ చెప్పండి. ఎప్పుడూ వీళ్లతో కాంటాక్ట్‌లో ఉండండి. నా ఆఖరి కోరిక ఒక్కటే... నా చావుకి కారణం ఎవరో వాళ్లకి తెలుసు. వాళ్లు వాళ్ల తప్పు తెలుసుకుంటే చాలు. ఇంక ఎవ్వర్నీ ఇలా (నాలా) బాధపెట్టకపోతే చాలు. ఏ అమ్మాయీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉండదు అని అనుకోవద్దు. యూనివర్సిటీ అంటేనే ఒక పెద్ద నరకం లాంటిది. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచరు. మీకు చెప్పలేక వాళ్లలో వాళ్లు దాచుకోలేక, వాళ్లకి నరకం కనిపిస్తుంది. ►అమ్మా నాన్న జాగ్రత్త. నాన్న ప్లీస్ ఏడవకండి. నేనెప్పుడూ మీ దగ్గరలోనే ఉంటాను. అమ్మా నువ్వు కూడా జాగ్రత్త డిప్రెషన్ ఈజ్ నాట్ ఏ సైన్ ఆఫ్ వీక్నెస్. ఇట్ మీన్స్ యు స్టేయ్డ్ స్ట్రాంగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఐ లవ్ యు మామ్. ఐ లవ్ యు డాడ్. ట్రై టు డొనేట్ మై ఆర్గాన్స్... ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ కండీషన్. డాడ్! నేను చేయవలసిన పనులు ఉన్నాయి. కొన్ని మీరు చేసేయండి. సీనియర్ లావణ్యకి ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ బుక్ కొనివ్వండి.రాజుకి రూ.350 ఇవ్వండి టి స్కేల్‌కి.. ప్రసాద్ సార్, ఇంకా జితేంద్రకి థాంక్స్ చెప్పండి. బై... ఫర్ ఎవర్ అండ్ ఎవర్. భయమే ఈ ప్రభుత్వ సందేశమా? సాక్షి, హైదరాబాద్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి రాసిన ఆత్మహత్య లేఖ ఉన్నప్పటికీ.. ఈ ఘటనకు బాధ్యులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టకుండా అటకెక్కించటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో.. విద్యార్థులు, వారి తల్లితండ్రులు భయం భయంగా బతకాల్సిందేనన్నదే ఈ ప్రభుత్వం ఇస్తున్న సందేశమా? అని ప్రశ్నించారు. ‘‘మన నాగరిక సమాజానికి, మన భవిష్యత్తు తరాల వారికి, మన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న సందేశం ‘భయమే’నా? రిషితేశ్వరి ఉదంతంలో విస్పష్టమైన సూసైడ్ నోట్ (ఆత్మహత్య లేఖ) ఉన్నా కూడా.. ఈ ఘోరమైన సంఘటనను కోల్డ్ స్టోరేజీకి పంపించటం చాలా బాధాకరం.. చాలా దుఃఖకరం’’ అంటూ జగన్ ట్విటర్ వ్యాఖ్యల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఫాస్ట్ ట్రాక్ వేయమంటే పట్టించుకోవట్లేదు! మా పాప మరణించి ఏడాది అయినా ఇప్పటికీ తన జ్ఞాపకాల నుంచి బయటకి రాలేకపోతున్నాం. నిత్యం వేదన అనుభవిస్తున్నాం. కానీ మా వేదన ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు పరిధిలోకి చేర్చాలని మేం గతంలో ప్రభుత్వాన్ని కోరాం. కానీ పట్టించుకోలేదు. మా పాప కేసులో పోలీసులు చార్జిషీటు మాత్రమే వేశారు. అదింకా కోర్టులో విచారణ, వాయిదాల వరకు రాలేదు. మొదటి వాయిదాకు సంబందించి బుధవారం సాయంత్రమే న్యాయవాది సమాచారం ఇచ్చారు. ఇలా అయితే నా కూతురికి న్యాయం ఎలా జరుగుతుంది? కేసును త్వరగా విచారించి, దోషులకు శిక్ష పడేలా చేయాలి. మా పాపలాగా ఇంకెవరికీ జరగకూడదు. ఆ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. విద్యావ్యవస్థలోను, యూనివర్సిటీల్లోనూ ఇలాంటి సంఘటనలు జరక్కుండా కట్టుదిట్టం చేయాలి. - రిషితేశ్వరి తల్లి దుర్గాబాయ్ ఏ ఒక్కరినీ వదలకూడదు! ర్యాగింగ్ అనే రాక్షసత్వం నా కూతుర్ని మింగేసింది. ఇప్పుడు నేను మనిషిగా లేను. నాకు ఆశలు లేవు. ఆశయాలు లేవు. నా కూతురితోనే అన్నీ పోయాయి. నాకసలు జీవితమే లేదు. ఇలాంటి ఘోరం ఎక్కడా ఎవరికీ జరక్కూడదు. నా కూతురి మరణానికి కారణమైన వారిని శిక్షించాలి. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలకూడదు. అందరికీ శిక్షపడాలి. - రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ఎక్కడ చూసినా అవే... ఢిల్లీలోని మోడల్ టౌన్‌లోని ఇరవయ్యొక్కేళ్ల ఆర్జూ హత్యకు గురయ్యింది. ఓ ఫ్లాట్‌లో శిథిలావస్థలో ఆమె మృతదేహం దొరికింది. తన ప్రేమికుడు నవీన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి నిలదీసిందామె. దాంతో ఆమెని చంపేశాడు. మృతదేహాన్ని ఎక్కడ పడేయాలో తెలీక ఇంట్లోనే ఓ చోట దాచిపెట్టాడు. కేరళలోని పెరుంబవూర్. అదొక పేద ఇల్లు. తల్లీకూతురు మాత్రమే ఉంటారు. తల్లి కష్టపడి, ఇళ్లలో పాచిపని చేసి కూతుర్ని లా చదివిస్తోంది. ఆరోజు సాయంత్రం ఆమె పనినుంచి వచ్చేసరికి కూతురు రక్తపు మడుగులో పడివుంది. దారుణాతి దారుణంగా హింసించి, అత్యాచారం చేసి, ముప్ఫై సార్లకు పైగా కత్తితో పొడిచి పొడిచి చంపారామెని. నిర్భయ తర్వాత అంత దారుణంగా జరిగిన సంఘటన ఇదేనని పలువురు వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని నాన్పరా. కొన్ని నెలల క్రితం ఓరోజు ఉదయం ఊరి మధ్య ఉన్న చెట్టును చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. ఓ పదిహేనేళ్ల అమ్మాయి శవం చెట్టుకు వేళ్లాడుతోంది. అందరూ ఆమె ఆత్మహత్య చేసుకుందనుకున్నారు. కానీ అది నిజం కాదని, ఎవరో రేప్ చేసి చంపేసి చెట్టుకు వేళ్లాడదీశారని పోలీసులు వస్తేకానీ తెలియలేదు. చెన్నైలోని నుంగంబాక్కం. ఆఫీసుకు వెళుతున్న స్వాతిని రామ్‌కుమార్ అనే యువకుడు దారుణంగా చంపేశాడు. తన ప్రేమను ఆమె అంగీకరించకపోవడమే అందుక్కారణం. అదింకా మరవకముందే ఆదిలాబాద్‌లోని ఓ పట్టణంలో ఓ ఉన్మాద ప్రేమికుడు పద్దెనిమిదేళ్ల అమ్మాయిని నరికి చంపాడు. ఇవన్నీ రిషితేశ్వరి మరణం తర్వాత సంభవించిన దారుణాలు. ఆడపిల్లల పట్ల జరుగుతున్న అకృత్యాలకు సాక్ష్యాలు. ఇవన్నీ ఓ పక్క... రిషితేశ్వరి మాదిరిగా కేవలం ర్యాగింగ్ భూతానికే బలైపోతున్న సంఘటనలు మరోపక్క. ఢిల్లీకి చెందిన ఓ బీటెక్ విద్యార్థిని కాలేజీలో సీనియర్ల వేధింపులు భరించలేక విషయం తాగి ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలో బీటెక్ చదువుతోన్న హైదరాబాద్ యువకుడు కృష్ణచైతన్య కూడా ర్యాగింగ్ కారణంగా ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు. అనంతపురం జిల్లా, దొన్నికోటవారిపల్లెకు చెందిన మధువంతరెడ్డి (16)ని కూడా ర్యాగింగ్ రక్కసి మింగేసింది. రిషితేశ్వరి సున్నిత మనస్కురాలు రిషితేశ్వరి చాలా సున్నిత మనస్కురాలు. బాగా చదివే తెలివైన అమ్మాయి. క్లాసులో లెక్చరర్ చెప్పేది వెంటనే అర్థం చేసుకోవడంతోపాటు, సాయంత్రం హాస్టల్లో దాని గురించే చర్చించేది. చాలా కలుపుగోలుగా ఉండే రిషితేశ్వరి ఆకస్మికంగా మరణించడం నన్ను బాగా కలిచి వేసింది. గత ఏడాది తను నా రూమ్మేట్. దీంతో ఇద్దరం చాలా సన్నిహితంగా మెలిగేవాళ్లం. రిషితేశ్వరి లేని లోటు మమ్మల్ని చాలా వెంటాడుతోంది. నేను రిషితేశ్వరిని బాగా మిస్సవుతున్నా. - రిషితేశ్వరి రూమ్మేట్ కీర్తన చాలా మిస్సవుతున్నాం రిషితేశ్వరి చాలా మంచి అమ్మాయి. చాలా తెలివిగా, చురుగ్గా ఉండే రిషితేశ్వరి మరణాన్ని మా క్లాస్మేట్స్ అందరూ జీర్ణించుకోలేకపోతున్నాం. మేము రిషితేశ్వరిని చాలా మిస్సవుతున్నాం. సెమిస్టర్ ఎగ్జామ్స్ సమయంలో ఏదైనా కార్యక్రమం అప్పుడు రిషితేశ్వరిని గుర్తుచేసుకుని బాధపడుతున్నాం. తను బతికి ఉంటే మంచి ఆర్కిటెక్ట్ అయి ఉండేది. మంచి పేరు సంపాదించుకుని తల్లిదండ్రులకు పేరు తేవాలని ఎప్పుడూ చెబుతుండేది. - రిషితేశ్వరి క్లాస్మేట్ పవన్ కల్యాణ్ సీనియర్లకు అవగాహన కల్పించాలి జూనియర్ విద్యార్థులు తరగతుల్లోకి ప్రవేశించక ముందే సీనియర్లకు ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాల గురించి సదస్సు ఏర్పాటు చేసి ర్యాగింగ్ చేస్తే జరిగే చెడు పరిణామాల గురించి అర్థమయ్యేలా వివరించాలి. వీలైతే ర్యాగింగ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారిగురించి వీడియో రూపొందించి లేదా, పత్రికల్లో వచ్చిన కథనాలు చూపించి ఇలాంటి మరణాలు జరుగకుండా ఉండాలంటే ర్యాగింగ్ నిరోధమే ముఖ్యమనే విషయం అర్థమయ్యేలా తెలియజేయాలి. ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి ప్రభుత్వ పరంగా, చట్టపరంగా పడే శిక్షలు, జరిమానాల గురించి వివరించి, వాటిని అన్ని చోట్ల బోర్డుల్లో అందరికీ కనిపించేలా ప్రదర్శింప చేయాలి. ప్రతి కళాశాలలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఎవరైనా హెల్ప్‌లైన్ ద్వారా మాట్లాడి తమ సమస్య చెప్పుకునే వీలు లేని పక్షంలో గ్రీవెన్స్ బాక్సు ఏర్పాటు చేసి అందులో ఫిర్యాదులు వేసేలా చూడాలి. తల్లిదండ్రులు ప్రతి మూడు నెలలకొకసారి విద్యార్థుల సమస్యలపై కళాశాల యాజమాన్యం, బోధనా సిబ్బందితో చర్చించి విద్యార్థులకు అండగా నిలవాలి. ప్రతి కళాశాలలో మానసిక వైద్య నిపుణులను ఏర్పాటు చేసి విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా, వికృత చేష్టల బారిన పడకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలి. - డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మానసిక వ్యాధుల వైద్య విభాగం, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జరుగుతున్నాయి కానీ... నమోదవడం లేదు!! ర్యాగింగ్... ఇవాళ్టికీ కాలేజీలు, యూనివర్సిటీలతో సహా పలు విద్యాసంస్థల్లో విజృంభిస్తున్న భూతం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యు.జి.సి) దగ్గర లభిస్తున్న దేశవ్యాప్త డేటా ప్రకారం చూస్తే మన రాష్ట్రం సహా ప్రతి రాష్ట్రం ర్యాగింగ్ ఫిర్యాదులతో అపకీర్తిని మూటగట్టుకుంటోంది. నిజానికి, ర్యాగింగ్‌ను నిషేధిస్తూ, చాలా ఏళ్ళ క్రితమే 1997లో అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అటుపైన దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉత్తర్వుల రూపంలో నియమ నిబంధనలూ జారీ చేస్తూ వచ్చింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లోని పలు కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ర్యాగింగ్ భూతం ఇప్పటికీ తిష్ఠ వేసుకొనే ఉంది. చాలా సంస్థల్లో జరుగుతున్న సంఘటనలు ఇప్పటికీ అధికారుల నోటీసుకు రావడం లేదు. అందుకే, ఇక్కడ యాంటీ - ర్యాగింగ్ సెల్స్‌లో నమోదవుతున్న కేసులు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ తెలుగునాట ఒక్క 2015లోనే 90కి పైగా ర్యాగింగ్ ఫిర్యాదులు నమోదవడం గమనించాల్సిన విషయం. కొత్తగా విద్యాసంస్థల్లోకి చేరిన విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి భయపడుతూ ఉంటారు. దాంతో, కేసులు తక్కువ నమోదవుతుంటాయని పేరు ప్రచురించడానికి ఇష్టపడని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నారు. ఈ పరిస్థితుల్లో ర్యాగింగ్ గురించి విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తే, ఈ సంస్కృతికి వీలైనంత అడ్డుకట్ట వేయగలుగుతామని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మీ విద్యాసంస్థలో ర్యాగింగ్ జరుగుతోందా? అయితే, ఫిర్యాదు చేయండి... నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్ : 24గీ7 టోల్‌ఫ్రీ నంబర్ - 1800-180-5522 మెయిల్ ఐడి: helpline@antiragging.in అసలు ఏమైందంటే... ఫ్యాషన్ డిజైనర్ కావాలన్నది రిషితేశ్వరి కల. అయితే, తల్లి అభ్యంతరం చెప్పడంతో దాన్ని విరమించుకున్నారు. ఆ తరువాత ఎయిర్‌హోస్టెస్, మెరైన్ ఇంజనీర్ - ఇలా రకరకాల కలలు కన్న ఈ విద్యార్థిని చివరకు నాగార్జున యూనివర్సిటీలో ‘కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్’లో చేరారు. 2015 ప్రథమార్ధం ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్‌లో రిషితేశ్వరికి 112వ ర్యాంకు. హైదరాబాద్‌లో హాస్టల్ వసతి లేదని, నాగార్జున యూనివర్సిటీలో భద్రతతో కూడిన హాస్టల్ ఉంటుందని వరంగల్ నుంచి గుంటూరు వచ్చి ఆమెను చేర్పించిన అమ్మానాన్న దుర్గాబాయి, మురళీకృష్ణ. 2015 ఏప్రిల్ 18... యూనివర్సిటీలో ఫ్రెషర్స్ డే పార్టీ తొలి రోజునే రిషితేశ్వరికి ఎదురైన ర్యాగింగ్. పార్టీ ముగిసే టైమ్‌లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒకరు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించడం. ‘ఆ రోజే నాకు చనిపోవాలనిపించింది’ అని రాసుకున్న రిషితేశ్వరి. ఆ తరువాతా సీనియర్ల నుంచి వేధింపులు. హాస్టల్లో చేరిన తొలి రోజే రూమ్ ఖాళీ చేయమంటూ సీనియర్ల ఒత్తిడి. అదేమంటే, ప్రిన్సిపాల్ బాబూరావు తమ వర్గం వాడేనంటూ హెచ్చరిక! ఏప్రిల్ - జూలై మధ్య మూడు నెలల్లో... వివిధ సందర్భాల్లో... జీవితంలో జరిగిన మంచీ, చెడూ అంతా డైరీలో రాసుకోవడం రిషితేశ్వరి అలవాటు. ఆ డైరీల్లోని అంశాలను బట్టి... ఒకసారి ఆమె స్పృహలో లేనప్పుడు ఒక సీనియర్ అసభ్యంగా ప్రవర్తించారు. అలాగే, మరోసారి ఒక సీనియర్ వాట్సప్‌లో ఆమెకు ప్రేమ ప్రతిపాదన చేశారు. ఇలాంటి సంఘటనలతో మానసికంగా చిత్రవధ అనుభవించి, చనిపోవాలని ఉందని పదే పదే పేర్కొన్న రిషితేశ్వరి. జూలై 13... సాయంత్రం తోటి విద్యార్థులతో కలసి మంగళగిరిలో ఫస్ట్‌షో సినిమాకు వెళ్ళిన రిషితేశ్వరి. సినిమా హాలులో చాలా అసభ్యంగా ప్రవర్తించిన సీనియర్. జూలై 13... రాత్రి తారస్థాయికి చేరిన సీనియర్ల వేధింపులు. తోటి అమ్మాయి అని కూడా చూడకుండా రిషితేశ్వరిని అర్ధనగ్నం చేసి నడిపించి, వీడియో తీసి, చూపిన సీనియర్ విద్యార్థినులు. జూలై 14... ఉదయం తండ్రి మురళీకృష్ణకు ఫోన్ చేసి, ‘బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళుతున్నా నాన్నా’ అని చెప్పి, ఫోన్ పెట్టేసిన రిషితేశ్వరి. మధ్యాహ్నం ఒంటి గంట... ‘ఐ లవ్ యూ నాన్నా’ అని తండ్రికి వాట్సప్‌లో మెసేజ్ పెట్టిన రిషితేశ్వరి. ఆ తరువాత కాసేపటికే హాస్టల్ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరిపోసుకొని, రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లితండ్రులకు సమాచారం. 2015 జూలై 16 రిషితేశ్వరిని ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించారంటూ భారత శిక్షా స్మృతిలోని 306వ సెక్షన్, ర్యాగింగ్ నిరోధక చట్టంలోని 4వ సెక్షన్ కింద ముగ్గురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు, అరెస్టు. 2015 జూలై ద్వితీయార్ధం రాష్ట్రంలోనే కాక, దేశమంతటా చర్చ రేపిన రిషితేశ్వరి ర్యాగింగ్ మరణం. చనిపోయే ముందు డైరీలో రిషితేశ్వరి రాసిన ఆత్మహత్య లేఖతో సంచలనం. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు. నిందితులైన ముగ్గురు విద్యార్థులకు 75 రోజుల రిమాండ్ తరువాత 2015 అక్టోబర్ 1న కోర్టు బెయిల్. 2016 జనవరి 1 రిషితేశ్వరి కేసులో దర్యాపు మొదలైన దాదాపు అయిదు నెలల తర్వాత, ఛార్జ్‌షీట్‌కు ఎక్కిన ప్రిన్సిపాల్ బాబూరావు పేరు. 2016 జూలై 13 ఇప్పటికీ తేలని రిషితేశ్వరి కేసు. కోర్టులో కొనసాగుతున్న పోరాటం. బెయిల్‌పై బయటే ఉన్న అప్పటి ప్రిన్సిపాల్ బాబూరావు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి, న్యాయం చేయాలని మొర పెట్టుకుంటున్న తల్లితండ్రులు. జూలై 14 ఉదయం... ప్రభుత్వం, బాధ్యులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా? దేవుడా! ఈ పాలకులను మేల్కొలుపు... పుట్టక ముందే ఆడపిల్లను కనిపెట్టి కడతేర్చే పరిస్థితులు ప్రజలకు వద్దని చెప్పే, పుస్తకాలు అబ్బాయికి ఇచ్చి వంట పాత్రలు అమ్మాయికి ఇచ్చే వివక్ష వద్దని తల్లితండ్రులకి చెప్పే, బడిలో మరుగుదొడ్లు లేక ఆ అవసరాలను కూడా బిగదీసుకుని కూర్చునే నిస్సహాయ స్థితి లేదని చెప్పే, కాలేజీలలో వెంటపడి వేధించే పోకిరీలు ఉండరని చెప్పే, కొంగు పట్టుకుని లాగే వెధవలు ఉండరని చెప్పే, యాసిడ్లు పోసే రాక్షసులను తుద ముట్టించామని చెప్పే.... ప్రతి ఆడ శిశువు ఊపిరికీ మేమున్నామని చెప్పే ప్రతి బాలిక వికాసానికీ ముందుకు కదులుతామని చెప్పే ప్రతి యువతి రక్షణకూ అన్నలా నిలుస్తామని చెప్పే అలాగని చెప్పేలా... ఓ దేవుడా... ఈ పాలకులను నిద్ర మేల్కొలుపు. -
వీడియోకోసం గంగలో దూకాడు..
సెల్ఫీలు, వీడియోల పిచ్చి మరోప్రాణాన్ని బలిగొంది. ప్రతి విషయాన్నీ తమ స్మార్ట్ ఫోన్, కెమెరాల్లో బంధించాలన్న వేలం వెర్రితో తాజాగా గంగానదిలో దూకుతూ స్నేహితులతో వీడియో తీయించుకున్నఓ వ్యక్తి.. ఏకంగా కనిపించకుండానే పోవడం ఆందోళన కలిగించింది. ప్రతి విషయాన్ని రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకుంటున్న నేపథ్యంలో జరిగిన ఘటన వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. హరిద్వార్ కు దగ్గరలోని గంగానదిలో దూకిన వ్యక్తి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. స్నేహితుడి వీడియోను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేయాలన్న తపనే తప్పించి, అతడేమయ్యాడో పట్టించుకునే పరిస్థితి వారిలో కనిపించకపోవడం ఆందోళన నింపుతోంది. బాగా మద్యం సేవించిన 27 ఏళ్ళ వ్యక్తి గంగా నదిలో దూకుతూ వీడియో తీయించుకోడానికి ముందుగా కాస్త ఆలోచించినా.. తర్వాత స్నేహితుల ప్రోత్సాహంతో అనుకున్నంతపనీ చేశాడు. ఈతకొట్టుకుంటూ తిరిగి బయటకు వద్దామనుకొని గంగానదిలో దూకిన వ్యక్తి , నీటిలో మునిగి కనిపించకుండా పోయాడు. స్నేహితులు తీసిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భద్రాబాద్ గాంధ్ మిర్పూర్ కు చెందిన 27 ఏళ్ళ ఆశిష్ చౌహాన్ గంగ్ నహర్ లోని గంగా నదిలో మునిగిపోయి 48 గంటలు దాటినా బాడీ దొరకలేదు. తన స్నేహితులు అశ్విని చౌహాన్, బాలరాజ్ కుమార్ లతో కలసి ఎప్పట్లాగే గంగా నది ప్రాంతానికి వెళ్ళిన ముగ్గురూ అక్కడి గట్టుపై కూర్చున్నారు. ముందు బాగానే ఉన్నా ఆ స్నేహితులంతా కలసి మద్యం సేవించిన అనంతరం చౌహాన్ నదిలో దూకి ఈత కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు ఆ దృశ్యాన్ని రికార్డు చేయాలని ఆదేశించాడు. ముందు కొంత ఆలోచించినా.. చౌహాన్ చివరికి నదిలో దూకడానికి సిద్ధమయ్యాడు. స్నేహితులు వీడియో తీస్తూ ఉండిపోయారు. అయితే దూకిన వ్యక్తి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళనలో పడ్డారు. అతడి జాడ తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వారిద్దరూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, సహాయక సిబ్బందితో సహా నదిలో గాలించినా ఫలితం కనిపించకపోవడంతో చౌహాన్ స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా కలసి ఎన్నోసార్లు గంగానదిలో ఈత కొడుతుంటామని, చౌహాన్ మంచి ఈతగాడని చెప్తున్నారు. చౌహాన్ నదిలో దూకే సమయంలో స్నేహితులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా... కొన్ని టీవీ ఛానెల్స్ కూడ ప్రసారం చేశాయి. నీటి ప్రవాహంలో చౌహాన్ శరీరం కొట్టుకుపోయి ఉండొచ్చని అది ఎక్కడో ఓచోట బయటకు వస్తుందని భద్రాబాద్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అమర్ చంద్ర శర్మ తెలిపారు. చౌహాన్ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదని, విషయంపై చౌహాన్ కుటుంబానికి సమాచారం అందించగా.. ఎవ్వరిపైనా అనుమానం వ్యక్తం చేయడం గాని, ఆరోపించడం గాని చేయలేదని తెలిపారు. ఇది ప్రమాద వశాత్తు జరిగిన ఘటనగానే కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు పోలీస్ అధికారులు వివరించారు. -
చేర్యాల గురుకులంలో ర్యాగింగ్
విద్యార్థి కిరణ్‌కు గాయాలు గొడవను ఆపబోయిన వైస్ ప్రిన్సిపాల్‌ను పక్కకు నెట్టేసిన సీనియర్లు చేర్యాల : పట్టణంలోని సాంఘిక సంక్షేమ గు రుకుల పాఠశాలలో సీనియర్ విద్యార్థులు జూ నియర్లను ర్యాగింగ్ చేసిన ఘటనలో ఓ విద్యార్థికి తీవ్ర గాయూలయ్యూరుు. స్థానికుల కథనం ప్రకారం..జూనియర్ విద్యార్థి టి.కిరణ్ పాఠశా ల ఆవరణలో నడుచుకుంటూ వెళ్తుండగా సీని యర్ విద్యార్థులు పృథ్వి, అనిల్, శ్రీధర్, శ్యాం లు పిలిచి ర్యాగింగ్ చేశారు. వీపుపై కొట్టడంతో కిరణ్‌కు గాయూలయ్యూరుు. వీరి గొడవను ఆపడానికి యత్నించిన వైస్ ప్రిన్సిపాల్ వి.శ్రీనివాస్‌ను విద్యార్థులు పక్కకు నెట్టివేశారు. కిరణ్‌ను కొట్టొదంటూ అడ్డుకోబోరుున మరో ఇద్దరు విద్యార్థులను సైతం గాయపరిచారు. గాయూలపాలైన కిరణ్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేరుుంచారు. అతడిని ఎమ్మార్పీఎస్ నాయకులు మాదాసు యాదగిరి, తెలంగాణ షెడ్యూల్డ్ కులాల హ క్కుల పరిరక్షణ సమితి నాయకులు బుట్టి భిక్షపతి, కాటం శ్రీనివాస్‌లు పరామర్శించారు. విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్న సీనియర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ర్యాగింగ్ వేధింపులకు విద్యార్థిని బలి
కేకే.నగర్(చెన్నై): ర్యాగింగ్ వేధింపులకు ఓ విద్యార్థిని బలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల కథనం మేరకు.. తమిళనాడు, నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని చిన్నకరుంపాళం ప్రాంతానికి చెందిన రాజా, జయలక్ష్మి దంపతుల కుమార్తె ప్రీతి(17). ఈరోడ్ జిల్లా సత్యమంగళం ప్రైవేటు కళాశాలలో సీఏ కోర్సులో గత నెల 22న చేరింది. అదే నెల 25న కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ విషయమై ప్రీతి తల్లిదండ్రులు గురువారం సత్యమంగళం పోలీసులు, ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణమని, హాస్టల్లో ఆమెను అన్నం తిననివ్వకుండా, నిద్ర పోనివ్వకుండా హింసించారని, రాత్రి రెండు గంటలకు తల స్నానం చేసి రమ్మని, తడిగుడ్డలతో వానలో నిలబెట్టి చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. ఈ విషయాలు ఆమె స్నేహితుల ద్వారా తెలిశాయన్నారు. గతనెల 25వ తేదీన చలి, జ్వరం ఉందంటూ హాస్టల్ నిర్వాహకులు ప్రీతిని కోయంబత్తూరు సత్యమంగళం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారని, తాము బయలుదేరిన కొంత సేపటికే హాస్టల్ వార్డెన్ కోయంబత్తూరు వైద్య కళాశాలకు రమ్మని ఫోన్ కట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రీతి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, దీనిపై విచారణ చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు. ఆర్డీవో స్పందిస్తూ.. విచారణ కమిటీ వేసి, నిజాలు నిగ్గుతేల్చుతామని హామీ ఇచ్చారు. -
ర్యాగింగా? బెట్టింగా?
పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య వలిగొండ: ఓ పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వలిగొండ మండలం గోకారంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పాలకూర్ల భాస్కర్ కుమారుడు భానుప్రసాద్ (17) అబ్దుల్లాపూర్‌మెట్టు సమీపంలోని అర్జున్ కళాశాలలో పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన అతని సోదరుడు 108కు సమాచారం ఇవ్వగా.. పరీక్షించిన సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే, భానుప్రసాద్ మృతికి ర్యాగింగా, లేక క్రికెట్ బెట్టింగ్ కారణమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమ కుమారుడిని అతడి స్నేహితులు మారుతి, కార్తీక్, మరికొందరు బెదిరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భానుప్రసాద్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వరంగల్ బిట్స్ లో ర్యాగింగ్ కలకలం
-
వరంగల్ బిట్స్ లో ర్యాగింగ్ కలకలం
వరంగల్: వరంగల్ జిల్లా న ర్సంపేటలో ర్యాగింగ్ కలకలం రేగింది. స్థానిక బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సినియర్ విద్యార్థులు దాడి చేయడంతో ఓ జూనియర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతిన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బిట్స్‌లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆదిత్య అనే విద్యార్థిపై కొందరు సీనియర్ విద్యార్థులు బుధవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అధర్వ ర్యాగింగ్ చేశారు
నటుడు అధర్వ తనను ర్యాగింగ్ చేశారని పేర్కొన్నారు నటి ఆనంది. నటిగా పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తెలుగింటి ఆడపడుచు అన్న విషయం తెలిసిందే. అయినా తమిళంలో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఆనంది కయల్ చిత్రంతో ఇక్కడ మంచి స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో తనను అశ్లీలంగా నటింపచేశారంటూ ఆరోపణలతో కాస్త కలకలం సృష్టించిన ఆనందితో చిట్‌చాట్. ప్ర: మీ గురించి చెప్పండి? జ: ప్లస్‌టూ చదువుతుండగానే చిత్ర రంగప్రవేశం చేశాను. నేను నటిని కాక ముందు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. అదంటే నాకు చాలా ఆసక్తి. అయితే చదువు పూర్తి చేయమని అమ్మ హితవు పలకడంతో బీబీఏ కోర్స్‌లో చేరాను. ప్రభుసాలోమన్ దర్శకత్వంలో నటించిన కయల్ చిత్రం నా జీవితాన్ని మార్చేసింది. ఆ చిత్రం తరువాత పలు మంచి అవకాశాలు వరిస్తున్నాయి. కయల్ చిత్రం 2014 చివరిలో విడుదలైంది. 2015లో అధర్వ, దినేశ్, జీవీ ప్రకాశ్‌కుమార్‌లతో నటించిన చిత్రాలు విజయం సాధించాయి. 2016 నూతన సంవత్సరాన్ని జీవీ ప్రకాశ్‌కుమార్‌తో జత కడుతున్న తాజా చిత్ర షూటింగ్‌లోనే జరుపుకున్నాను. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది విజయవంతంగా సాగుతుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు పండిగై, పైసల్, జీవీతో చిత్రం అంటూ బిజీగా ఉన్నాను. అలాగే బీబీఏ రెండవ ఏడాది చదువుతున్నాను. ప్ర: ఒక పక్క నటిస్తూనే బీబీఏ చదువుతున్నారు. కళాశాలలో ర్యాగింగ్‌ను ఎదుర్కొన్నారా? జ: లేదు. కళాశాలలో ర్యాగింగ్‌ను ఎదుర్కొన్న సందర్భాలు ఎదురవ్వలేదు. అయితే మూడవ ఏడాదిలోకి అడుగు పట్టిన తరువాత నేనే ర్యాగింగ్ చేయాలని అనుకుంటున్నాను. ఇక కళాశాలలో నాకు ర్యాగింగ్ అనుభవం లేదు గానీ చండీవీరన్ చిత్ర షూటింగ్ సమయంలో హీరో అధర్వ, ఆ చిత్ర టీమ్ నన్ను ర్యాగింగ్‌తో అల్లరి పెట్టేవారు. ప్ర: విచారణై చిత్రంలో నటించడానికి సందేహించారట? జ: నిజమే. కారణం ఆ చిత్రంలో నా పాత్ర పరిధి చాలా తక్కువ. అందుకే అమ్మ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చారు. దీంతో కయల్ చిత్రంతో నాకు మంచి లైఫ్ ఇచ్చిన దర్శకుడు ప్రభుసాలోమన్ సలహా అడిగాను. అప్పుడాయన ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అని హితవు పలికారు. ఆ చిత్రంలో తెలుగమ్మాయిగానే నటించాను. అందువల్ల నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఇక పండిగై చిత్రంలో కృష్ణకు జంటగా నటిస్తున్నా ను. నటి విజయలక్ష్మి నిర్మాత. ఆమె భర్త ఫి రోజ్ దర్శకుడు. చిత్ర టైటిల్ మాదిరిగానే షూటింగ్ అంతా ఒక ఫెస్టివల్‌లాను జరుగుతోంది. మరో చిత్రం పైసల్. ఇది హారర్ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం. తా జాగా జీవీ ప్రకాశ్‌కుమార్‌తో నటిస్తున్నాను. ప్ర: త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం తరువాత జీవీతో కాంప్రమైజ్ అయినట్లున్నారే? జ: హలో సార్ త్రిష ఇల్లన్నా నయనతార చిత్రానికి సంబంధించి జీవీ ప్రకాశ్‌కుమార్‌తో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. ఆ చిత్ర దర్శకుడిపైనే నాకు ఇప్పటికీ కోపం. జీవీ నాకు మంచి ఫ్రెండ్. సాధారణంగా నేనెవరితోనూ స్నేహం చేయను. జీవీ షూటింగ్ స్పాట్లో చాలా జాలీగా ఉంటారు. నాకు చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. ప్ర: నటి శ్రీదివ్య మీకు పోటీ అట? జ: శ్రీదివ్య నేను ఒక తెలుగు చిత్రంలో కలిసి నటించాం. తను నాకు మంచి స్నేహితురాలు. ఇక నటనా పరంగా ఆరోగ్యకరమైన పోటీ ఉండడం మంచిదేగా. -
రిషితేశ్వరి కేసులో ఏ4 నిందితుడిగా బాబురావు
* రిషితేశ్వరి కేసులో చార్జిషీటు దాఖలు * ర్యాగింగ్‌ను ప్రోత్సహించాడని తేల్చిన పోలీసులు * వివిధ సెక్షన్ల కింద శిక్షించాలని కోర్టుకు నివేదన * చార్జిషీట్ వివరాలను గోప్యంగా ఉంచిన వైనం * జనవరి నాలుగో తేదీన తదుపరి విచారణ సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆరు నెలలుగా కేసు దర్యాప్తు చేస్తున్న ఏపీ పోలీసులు ఎట్టకేలకు బాబూరావు పాత్రపై నిగ్గు తేల్చగలిగారు. సుమారు 70 మందిని విచారించగా కళాశాలలో ర్యాగింగ్, హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఫ్రెషర్స్‌డే వేడుకల్లో రిషితేశ్వరిపై లైంగిక వేధింపులు జరిగినట్లు తెలి సినా ఆయన పట్టించుకోలేదని వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు 15 రోజుల క్రితం గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిసింది. ర్యాగింగ్ విషయంలో బాబూరావు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని పోలీసుల విచారణలో నిర్ధారణ కావడంతో ఆయనపై ర్యాగింగ్ యాక్ట్ నమోదు చేసినట్టు తెలిసింది. అయితే ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సమయానికి రిషితేశ్వరి మేజర్ అయినప్పటికీ హాయ్ ల్యాండ్‌లో ఫ్రెషర్స్‌డే పార్టీ జరిగే సమయానికి ఆమె మైనర్ కావడం గమనార్హం. ఈ విషయాన్ని సైతం పోలీసులు చార్జిషీట్లో ప్రస్తావించినట్లు తెలిసింది. 2014 జూన్ 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా ఆరు నెలల సమగ్ర విచారణ తరువాత పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ర్యాగింగ్‌ను ప్రోత్సహించాడు... న్యాయవాది వై.కె. శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ రిషితేశ్వరి కేసులో బాబూరావును 4వ నిందితుడిగా చేరుస్తూ మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారని చెప్పారు. ర్యాగింగ్ నేరాన్ని చూస్తూ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడమేకాక, నేరాన్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించాడని, దీనిపై విచారించి ఆయనను శిక్షించాలని పోలీసులు చార్జిషీట్లో కోరారని తెలిపారు. నిందితులపై గతంలో నమోదైన ఐపీసీ 306, ర్యాగింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 4తోపాటు, బాలికలపై లైంగిక అత్యాచారాల రక్షణ చట్టంలోని 7, 8, 11, 12 సెక్షన్ల కింద కూడా విచారించి శిక్షించాలని పోలీసులు చార్జిషీట్ ద్వారా కోర్టును కోరారని ఆయన చెప్పారు. దీనిపై కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించడానికి జనవరి 4వ తేదీకి కేసును వాయిదా వేసిందని తెలిపారు. ఈ కేసులో పోలీసుల తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తరఫున తానూ వాదనలు వినిపించనున్నట్లు చెప్పారు. బాబూరావును నిందితుడిగా చేర్చినప్పటికీ ఆయన్ను అరెస్ట్ చేయకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారని, చార్జిషీట్‌తో సంబంధం లేకుండానే నిందితులను అరెస్ట్ చేయవచ్చని వై.కె. అన్నారు. కాల్‌మనీ కేసులో నిందితుడు సత్యానందంలాగా బాబూరావు కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకునే అవకాశం పోలీసులే ఇస్తున్నట్లు భావించాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు. బాబూరావును వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి ఆరోపణలకు తెరదించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. -
రిషితేశ్వరి కేసులో ఏ4 నిందితుడిగా బాబురావు
-
కక్షలు కన్నీళ్లు
గుంటూరు జిల్లాలో ఘటనలు రాజధానిగా రూపాంతరం చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గతించిపోతున్న 2015 నేరపరంగా చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది మృతిచెందడం, సంవత్సరం మొదట్లోనే విజయవాడలోని భవానీపురంలో విద్యుత్ షాక్‌కు గురై ఐదుగురు మృతిచెందడం, కల్తీ మద్యం తాగి మరో ఐదుగురు ప్రాణాలొదలడం, కాల్‌మనీ ఉచ్చులో చిక్కుకుని ఎంతోమంది అష్టకష్టాలు పడటం, ఏఎన్‌యూలో ర్యాగింగ్ భూతానికి రిషితేశ్వరి బలి, పలుచోట్ల జరిగిన ప్రమాదాల్లో జిల్లావాసులు కన్నుమూయడం కన్నీటి జ్ఞాపకాలే. ఇక చోరీలు ఈ ఏడాది విచ్చలవిడిగా జరిగాయి. మన రాష్ర్ట దొంగలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు చెలరేగిపోయాయి. చైన్‌స్నాచింగ్‌లు ఊహకందనంత రీతిలో జరిగాయి. గ్రూపు తగాదాలు, ముఠా కక్షలు పెచ్చుమీరాయి. ఇక రాజధాని నేపథ్యంలో ఏర్పడిన భూతగాదాలు రక్త సంబంధీకుల మధ్య చిచ్చురేపి అన్నదమ్ములను కోర్టుకు లాగాయి. ెుుత్తంమీద 2015 సంవత్సరం కృష్ణా, గుంటూరు జిల్లాలపై రక్తచరిత్రనే లిఖించింది. గుంటూరు : గుంటూరు, కృష్ణాజిల్లాల్లో గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య తక్కువగానే ఉన్నా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నేరాలు అనేకం జరిగాయి. హత్యలు, ఆత్మహత్యలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, మోసాలు, మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపులు, నమ్మక ద్రోహాలు, భూ వివాదాలు, రోడ్డు ప్రమాదాలతో 2015లో రాజధాని రక్తసిక్తంగా మారింది. తుళ్లూరులో భూ కబ్జాలు పెరిగి వివాదాలు చెలరేగాయి. రక్తసంబంధాలు కూడా చూడకుండా దాడులకు దిగారు. గుంటూరు జిల్లాలో రిషితేశ్వరి, జీజీహెచ్‌లో ఎలుకల దాడిలో చిన్నారి మృతి వంటి సంఘటనలు, విజయవాడలో కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, కాల్‌మనీ సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దొంగల హల్చల్ గత రెండేళ్లతో పోలిస్తే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దొంగల ముఠాలు స్వైర విహారం చేశాయి. చైన్‌స్నాచింగ్, ఇళ్లల్లో జరిగే దొంగతనాలకు లెక్కే లేకుండాపోయింది. ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన పెట్టి పక్కకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా ఇరాని, పార్ధివ్, బిహారీ ముఠాలు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ►చిలకలూరిపేటలో శంకర్ అనే విలేకరిపై మంత్రి అనుచరులు దాడిచేసి హతమార్చిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ►గుంటూరు జీజీహెచ్‌లోని శిశు శస్త్రచికిత్స విభాగంలో వైద్యం కోసం చేరిన పదిరోజుల పసికందును ఎలుకలు కొరికి చంపాయి. సూపరింటెండెంట్, ఆర్ఎంవో, వైద్య అధికారి, ఇద్దరు స్టాఫ్ నర్సులు, పారిశుధ్య కాంట్రాక్టర్లపై వేటు పడింది. ►తుళ్లూరులో చంద్రశేఖర్ అనే రైతుకు చెందిన చెరుకు పంటను గుర్తుతెలియని దుండగులు దగ్ధం చేశారు. ►లింగాయపాలెంలో రాజేష్ అనే రైతుకు చెందిన ఏడు ఎకరాల భూమిలో వేసిన అరటి తోటను సీఆర్డీఏ అధికారులు పొక్లెయిన్లతో ధ్వంసం చేశారు. ►మంగళగిరిలో రెండు వర్గాల ఘర్షణలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన సంచలనం కలిగించింది. ►మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి, మాచర్ల, వెల్దుర్తి మండలాల పరిధిలోని 15 గ్రామాల్లో మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు మావోయిస్టుల పేరుతో వాల్ పోస్టర్లు వెలిసిన సంఘటన ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. ►ఏసీబీ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి వీరయ్యచౌదరి ఇంటిపై దాడులు నిర్వహించి రూ.1.5 కోట్లకుపై అక్రమ ఆస్తులను గుర్తించి ఆయన్ను అరెస్టు చేసిన సంఘటన సంచలనం కలిగించింది. ► గుంటూరు నగరంలో ఒకేరోజు గంట వ్యవధిలో ఎనిమిది చైన్‌స్నాచింగ్‌లు జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ► గుంటూరు-విజయవాడల్లో సిమీ ఉగ్రవాదులు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు సూర్యాపేట ఎన్కౌంటర్ ఉదంతంతో బయటకు రావడంతో అంతా హడలిపోయారు. ►గుంటూరు జీజీహెచ్‌లో సిబ్బంది అవినీతి వల్ల ఇద్దరు తల్లులు తనకు మగబిడ్డ పుట్టాడంటూ గొడవకు దిగి ఆడశిశువును పట్టించుకోకపోవడంతో మృతిచెందిన దారుణ సంఘటన సంచలనం కలిగించింది. ►బాపట్ల మండలం చుండూరుపల్లిలో సాంబశివరావు అనే ఎన్ఆర్ఐ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.3.5 కోట్ల సొత్తు చోరీకి గురికావడం సంచలనం కలిగించింది. దొంగను పట్టుకుని చోరీ సొత్తును పోలీసులు వారం వ్యవధిలోనే రికవరీ చేయడం మరో సంచలనం. ఏఎన్‌యూలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం కలిగించింది. రిషితేశ్వరి సంఘటన జరిగిన నాలుగు రోజులకే వట్టిచెరుకూరు మండలంలో ఓ కళాశాలలో సునీత అనే విద్యార్థిని ర్యాగింగ్ విషయంలో తనపై చర్యలు తీసుకుంటారేమోననే భయంతో కళాశాల భవనం పై నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది. వెల్దుర్తి మండలానికి చెందిన తిరుపతమ్మ అనే విద్యార్థిని తనపై కొంతమంది విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు నగరంలోని మహిళా డిగ్రీ కళాశాల వద్ద వెంకటరమణ అనే విద్యార్థినిపై ఓ ఉన్మాది సుత్తితో దాడిచేసి తలపై కొట్టడంతో తీవ్రగాయాల పాలైంది. -
కోఠి మెడికల్ కాలేజీలో మళ్లీ ర్యాగింగ్
జూనియర్ల దుస్తులు విప్పించిన సీనియర్లు నలుగురు సీనియర్ విద్యార్థుల అరెస్టు.. విడుదల హైదరాబాద్: రాష్ట్రంలోనే పేరొందిన కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరోమారు పడగవిప్పింది. ఇటీవల ఈ వైద్య కళాశాలలో హౌస్ సర్జన్లపై లైంగిక వేధింపులు మరువకముందే మరోమారు అదే దారుణం చోటుచేసుకుంది. తమకు మర్యాద ఇవ్వడం లేదని జూనియర్ విద్యార్థుల దుస్తులు విప్పించి మోకాళ్లపై నిలబెట్టి సీనియర్ విద్యార్థులు ఘోరంగా ర్యాగింగ్ చేశారు. దీనిపై బాధిత విద్యార్థులు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ శివశంకర్ కథనం ప్రకారం... కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల సీనియర్ విద్యార్థులు తమకు జూనియర్లు మర్యాద ఇవ్వడంలేదనే అక్కసుతో ఈ నెల 9వ తేదీన వారిని కళాశాలలోని హాస్టల్‌కు పిలిపించారు. అనంతరం వారి దుస్తులు విప్పించి రెండు గంటలపాటు మోకాళ్లపై నిల్చోబెట్టి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే బాగుండదని హెచ్చరించారు. దీంతో బాధిత విద్యార్థులు ర్యాగింగ్ విషయాన్ని బయటకు వెల్లడించలేదు. కాగా వారిలో కొందరు బుధవారం ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో సుల్తాన్‌బజార్ పోలీసులు ఉస్మానియా మెడికల్ కళాశాల హాస్టల్‌కు వెళ్లి నలుగురు సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది సీనియర్ విద్యార్థులున్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పాలిటెక్నిక్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
విశాఖపట్నం: నాగార్జునా యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ మూలాన రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాగింగ్ కు వ్యతిరేకంగా దుమారం రేగుతున్నా ర్యాగింగ్ ఘటనలు మాత్రం ఆగడం లేవు. తాజాగా విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. కొందరు సీనియర్ విద్యార్థులు తమను వేధించారంటూ జూనియర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కాలేజీ యాజమాన్యం శుక్రవారం ఐదుగురు విద్యార్థులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది. -
మోసపోయాం..న్యాయం చేయండి
మంత్రికి విన్నవించిన డీఎడ్ విద్యార్థులు ఏఎన్‌యూ : తమకు అవగాహన లేక ప్రభుత్వ అనుమతి లేని కళాశాలల్లో చేరి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని డీఎడ్ విద్యార్థులు రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావును కోరారు. ర్యాగింగ్‌పై సమీక్ష జరిపేందుకు మంగళవారం ఏఎన్‌యూకు వచ్చిన మంత్రిని డీఎడ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిశారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ జీవితాలు ప్రశ్నార్థకంగా మారామని, దయ చేసి న్యాయం చేయాలని మంత్రి కాళ్లు పట్టుకుని కన్నీరు పెట్టారు. ఒక్కొక్కరం రూ.లక్షా ముప్పై వేల నుంచి లక్షా ఎనభై వేల వరకు కళాశాలల యాజమాన్యాలకు చెల్లించామని మంత్రికి తెలిపారు. డీఎడ్ కోర్సు రెండో సంవత్సరంలో ఉన్నామని ఇప్పుడు పరీక్షలు రాయనీయకపోతే మా జీవితాలు ప్రశ్నార్థకంగా మారతాయని వివరించారు. పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ అనుమతి లేని కళాశాలల్లో చదివే విద్యార్థులను పరీక్షకు అనుమతించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కానీ డీఎడ్ విద్యార్థుల జీవితాలు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఏం చేస్తే బాగుంటుందనే దానిపై న్యాయ సలహా అడిగామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో డీఎడ్ విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని వివరించారు. -
కమిటీలతో కాలక్షేపం!
ఏఎన్‌యూలో విద్యార్థి సంఘాల మండిపాటు ర్యాగింగ్‌పై కఠిన చర్యలకు పూనుకోవడం లేదని ఆవేదన వ్యవస్థలో లోపాలు సరిదిద్దకుండా ర్యాగింగ్‌ను నిరోధించలేమని స్పష్టీకరణ ఇవే విషయాలపై మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశ్నించిన సంఘాల నేతలు గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్‌యూ)లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకోని ప్రభుత్వం కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు మండి పడుతున్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి బలవన్మరణంపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చినప్పటికీ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, తాజాగా అదే కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ద్విసభ్య కమిటీని వేస్తున్నట్టు ప్రకటించడాన్ని విద్యార్థి సంఘాలు ఆక్షేపించాయి. ఏఎన్‌యూ ఆర్కిటెక్చర్ కళాశాలలో తాజాగా సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనపై మంత్రి గంటా స్పందించి మంగళవారం వర్సిటీకి విచ్చేసి అధికారులతో సమావేశమ య్యారు. దీనిపై శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, తిరుపతి పద్మావతి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉదయలక్ష్మిలతో ద్విసభ్య కమిటీ వేస్తున్నట్టు చెప్పి, నివేదిక ఇవ్వాలంటూ మంత్రి ఆదేశించారు.అయితే , కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి, పదే పదే ర్యాగింగ్‌కు కారణాలు ఏమిటి? అనే విషయాలను పరిశీలించకుండా కేవలం కమిటీలు వేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం చెందుతున్నాయి. వీటివల్ల బాధితులకు న్యాయం జరగడం లేదని, బాధ్యులపై కేసులు నమోదు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక మేరకు వర్సిటీలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి సీసీ కెమెరాలు, విద్యార్థులకు ఐడీ కార్డులు, ర్యాగింగ్ నిరోధక బోర్డులు ఏర్పాటు చేశారే తప్ప, వ్యవస్థలో ఉన్న లోపాలపై దృష్టి సారించలేదంటున్నారు. ఈ కారణంగానే ర్యాగింగ్ పునరావృతమవుతోందని చెపుతున్నారు. యూనివర్సిటీలో కనిపించని ఇన్చార్జి వీసీ విద్యార్థిని రిషితేశ్వరి ఘటన అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి సీనియర్ ఐఏఎస్ అధికారి బి.ఉదయలక్ష్మిని ఇన్చార్జి వీసీగా నియమించారు. మొదట్లో రెండు, మూడు రోజులపాటు హడావుడి చేసిన ఆమె ఆ తరువాత వర్సిటీలో కనిపించ లేదు. వారంలో మూడు రోజులు ఏఎన్‌యూలో ఉండి ర్యాగింగ్ వంటి కార్యకలాపాలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన ఆమె ఈ వంద రోజుల్లో పట్టుమని పది రోజులు కూడా వర్సిటీకి రాలేదు. ఇన్చార్జి వీసీ సక్రమంగా రావడం లేదని, కొత్త వీసీని నియమించాలని కొందరు విద్యార్థులు ఈ సందర్భంగా మంత్రి గంటా దృష్టికి తెచ్చారు. ర్యాగింగ్‌పై నోరు మెదపని మంత్రి ... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అధికారులు, విద్యార్థులతో సమావేశమైన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ జరుగుతున్న ర్యాగింగ్‌పై మాత్రం నోరు మెదపలేదు. పైగా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరిగిందని, ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నేతలు కొందరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ర్యాగింగ్ ఆగదని, వ్యవస్థలో లోపాలను సరిదిద్దకుండా ర్యాగింగ్‌ను ఎలా నిరోధిస్తారంటూ మంత్రిని ప్రశ్నించారు. ర్యాగింగ్ జరిగినప్పుడల్లా కమిటీల పేరిట కాలయాపనచేయడం మినహా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రిషితేశ్వరి కేసు విచారణకు ద్విసభ్య కమిటీ
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణకు ద్విసభ్య కమిటీని నియమించామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన ఏఎన్‌యూ పర్యటనలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణమోహన్, తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య విజయలక్ష్మిలతో కూడిన కమిటీ విచారణ చేపడుతుందన్నారు. ఆర్కిటెక్చర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై విచారణ జరిపి ఘటనకు దారితీసిన కారణాలు, రాష్ట్రవ్యాప్తంగా ర్యాగింగ్ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సూచనలు చేస్తుందని తెలిపారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై గతంలో విచారణ జరిపిన కమిటీ కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యంను కూడా వీరిద్దరితోపాటు ఏఎన్‌యూలో పర్యటించాలని కోరుతున్నామన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత ఏఎన్‌యూతోపాటు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు. పూర్తిస్థాయి వీసీ, రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కనీసం 50శాతం భర్తీ చేసుకునే అవకాశం ఇవ్వాలని హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 5 కొత్త విద్యాలయాలు ప్రారంభమైయ్యాని.. వచ్చేఏడాది మరో 3 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చేఏడాది ఒంగోలు ట్రిపుల్ ఐటీని ప్రారంభిస్తున్నామని అన్నారు. -
NUలో మరోసారి ర్యాగింగ్.. ఐదుగురు విద్యార్ధులు సస్పెన్షన్
-
ప్రెసిడెన్సీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
పాతబస్తీ ఫలక్ నుమా పీఎస్ పరిథిలోని ప్రెసిడెన్సీ కాలేజీలో గురువారం ర్యాగింగ్ కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే.. ప్రెసిడెన్సీ జూనియర్ కాలేజీలో ఓ యువతిని సీనియర్స్ ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేశారు. తన చెల్లెల్ని ఎందుకు ర్యాగింగ్ చేస్తున్నారని యువతి సోదరుడు ప్రశ్నించగా.. అతడి మీద దాడికి దిగారు. దీంతో బాధిత విద్యార్థిని కుటుంబం ఫలక్ నుమా పోలీసులను ఆశ్రయించారు. ఘనటకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆనంద్‌కుమార్‌కు అవమానం
నిజాం కళాశాలలో జూనియర్, సీనియర్ల మధ్య చలరేగిన వివాదంతో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఆనంద్‌కుమార్ కు అవమానం జరిగింది. నిజాం కాలేజీలో బీఏ చదువుతున్న ఆనంద్ కుమార్‌ను మంగళవారం లైబ్రరీ వద్ద ఫైనల్ ఇయర్ విద్యార్థులు భరత్, మోహన్ బయోడేటా చెప్పాలని అవమానించారు. దీంతో అతను వారిపై తిరగబడడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో మనస్థాపానికి లోనైన ఆనంద్‌కుమార్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టీఎల్ఎన్ స్వామికి ఫిర్యాదు చేశారు. దీం తో బుధవారం ఆయన భరత్, మోహన్‌లను పిలిపించి మందలించారు. దీనిపై సమాచారం అందడంతో అబిడ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కళాశాలకు వెళ్లి వివరాలు సేకరించడమేగాక, ఆనంద్‌కుమార్‌తో పాటు మోహన్, భరత్‌లను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. -
ఏయూ క్యాంపస్ లో మంత్రి గంటా తనిఖీలు
ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతోందంటూ మీడియాలో ఆరోపణలు రావడంతో.. ఆంధ్ర ప్రధేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపస్ లో తనిఖీలు నిర్వహించారు. ర్యాగింగ్ ఆరోపణలపై వర్సిటీ అధికారులు, విద్యార్థుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ర్యాగింగ్ చట్టాన్ని పటిష్టం చేశామని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ను ర్యాగింగ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా.. సీనియర్ ల నుంచి వేధింపులు ఎదుర్కొన్న విధ్యార్థులు మీడియాను ఆశ్రయించినట్లు తెలిసిందని.. వారు తమకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు చేపడతాం అని గంటా తెలియజేశారు. -
ఏయూ లో ర్యాగింగ్ కలకలం
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ క్యాంపస్ లో సోమవారం ర్యాగింగ్ కలకలం రేగింది. క్యాంపస్ లో ర్యాగింగ్ పై అధికారులు కఠినంగా ఉండటంతో.. క్యాంపస్ బయట .. గ్యాలరీ పార్టీలతో సీనియర్లు కొత్త సంప్రదాయానికి తెరతీశారు. జూనియర్లను గ్రూపులుగా విభజించి పార్కులకు రావాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు హాస్టళ్లను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ర్యాగింగ్ లాంటిదేమీ జరగలేదనీ.. తాను విద్యార్థులతో మాట్లాడానని ఉమామహేశ్వరరావు మీడియాతో తెలిపారు. -
పాలిటెక్నిక్ విద్యార్థిపై బ్లేడ్‌తో దాడి
విశాఖ నగరంలోని పీఎంపాలెంలో ఉన్న సాంకేతిక విద్యా పరిషత్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థిపై బ్లేడ్‌తో అగంతకుడు దాడి చేశాడు. ఈ దాడిలో రాజస్థాన్‌కు చెందిన విద్యార్థికి గాయాలు అయ్యాయి. జైపూర్‌కు చెందిన రాజు అనే విద్యార్థి పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్లో ఉంటున్నాడు. అయితే, సోమవారం సాయంత్రం ఓ అగంతకుడు బ్లేడ్‌తో వచ్చి రాజు పొట్ట, చేతిపై గాయపరిచి వెళ్లాడు. చికిత్స కోసం అతడ్ని పీఎంపాలెం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాత్రి 10 గంటల సమయంలో విద్యార్థులందరూ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ర్యాగింగ్ జరిగి ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ర్యాగింగ్‌పై విశాఖలో అవగాహన ర్యాలీ
-
ప్రిన్సిపాల్ ప్రోద్బలంతోనే ర్యాగింగ్
సాక్షి, హైదరాబాద్: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే వారిని కంటికి రెప్పలా కాపాడుతోంది. దోషులెవరో తేల్చినా చర్యలకు సిద్ధంగా లేదు. రిషితేశ్వరి మరణంపై విచారణ చేపట్టిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ కాలేజీ ప్రిన్సిపాల్ బాబూరావు వ్యవహారశైలిని తప్పుపట్టింది. ఆయనపై విచారణ జరపాలని ప్రభుత్వానికి నివేదించింది. బాబూరావు వల్లే విశ్వవిద్యాలయంలో సంస్కృతి చెడిపోయిందని, ర్యాగింగ్ వంటి అనేక దుస్సంఘటనలకు అతడే కారణమని తేల్చింది. కమిటీ తేల్చిన అంశాల్లో కొన్ని... వర్సిటీలో సంస్కృతిని చెడిపోవడానికి ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రిన్సిపాల్ జి.బాబూరావు కారణం. బాబూరావు ర్యాగింగ్‌కు వీలుగా సీనియర్ విద్యార్థులను ప్రోత్సహించే వారు. బాబూరావు తమతో చనువుగా ఉండడం వల్లే సీనియర్ విద్యార్థులు జూనియర్లపై చెలరేగిపోయారు. దుస్తులు లేకుండా తమ ముందు డ్యాన్స్ చేయాలంటూ సీనియర్లు జూనియర్లను వేధించేవారు. జూనియర్ విద్యార్థినుల ఫోన్‌నంబర్లను సీనియర్ విద్యార్థినులు సహచర సీనియర్ విద్యార్థులకు ఇచ్చేవారు. రాత్రిపూట వారితో మాట్లాడాలంటూ జూనియర్లను వేధించేవారు. బస్టాండ్లలో, ఆర్టీసీ బస్సుల్లో ర్యాగింగ్ పెచ్చుమీరింది. రిషితేశ్వరితో సహ ఆమె సహచర జూనియర్ విద్యార్థినులను సీనియర్ విద్యార్థినులు రూ ములు ఖాళీ చేయాలంటూ బయటకు గెంటేసి రాత్రి వేళల్లో ఆరుబయటే నిల్చోబెట్టేవారు. ఫ్రెషర్స్ డే (18-4-2015)ను వర్సిటీలో కాకుండా బయట హాయ్లాండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బాబూరావు మద్యం సేవించి, విద్యార్థినులతో కలసి చిందులేశాడు. (కమిటీ వద్ద వీడియో ఫుటేజీని ఉంది) రిషితేశ్వరి ఆత్మహత్య గురించి ఉన్నతాధికారులకు తెలియచేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం కాలేజీ ప్రిన్సిపాల్ బాధ్యత కాగా బాబూరావు వాటిని విస్మరించాడు. బాబూరావు ప్రవర్తనపై విచారణ జరపాలి. ఆయనపై ర్యాగింగ్ నిరోధక చట్టం పరిధిలో కేసు నమోదు చేసి విచారించాలి. ఈ కేసును ర్యాగింగ్ చట్టాల పరిధిలోనే కాకుండా క్రిమినల్ లా, మహిళా వేధింపుల చట్టాల కింద విచారణ చేపట్టాలి. ఈ కేసు ప్రాధాన్యత దష్ట్యా విచారణను త్వరితంగా పూర్తిచేసేందుకు ట్రయల్ కోర్టును, స్పెషల్ పీపీని నియమించాలి. -
ప్రిన్సిపల్ ప్రోద్బలంతోనే ర్యాగింగ్
-
పాలిటెక్నిక్ హాస్టల్లో ర్యాగింగ్
హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా ర్యాగింగ్‌కు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా సీనియర్ విద్యార్థుల వికృత చేష్టలకు రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లోని జూనియర్ విద్యార్థులు బలయ్యారు. తమ గదికి రావాలంటూ వేధించిన సీనియర్ విద్యార్థులు అందుకు నిరాకరించిన వారిపై దాడికి దిగారు. కర్రలతో చితకబాదారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, ఎలక్ట్రికల్ మెకానికల్ బ్రాంచ్‌కు చెందిన విద్యార్థులు క్రాంతికుమార్, హరిచరణ్, అనిల్, వెంకటస్వామి, జ్యోతి కిరణ్, సందీప్‌లను అదే కళాశాలలో ఫైనల్ ఇయర్ మెటలర్జీ కెమికల్స్ చదువుతున్న సీని యర్ విద్యార్థులు చందు, జానకిరామ్, రాకేశ్, అశోక్, సాగర్, నాగరాజు, సాయి ప్రసన్న, రంజిత్‌లు కొంత కాలంగా వేధిస్తున్నారు. రాత్రివేళ తమ గదికి రావాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. దీంతో బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌కు, హాస్టల్ వార్డెన్‌ను తెలియజేశారు. అయినా వారు పట్టించుకోలేదు. శుక్రవారం సాయంత్రం సీనియర్ విద్యార్థులు హాస్టల్ మొదటి అంతస్తులో ఉన్న జూనియర్ల వద్దకు వచ్చి తమ గదికి రావాలని బెదిరించారు. అందుకు నిరాకరించిన వారిని కర్రలతో చావబాదారు. ఈ సంఘటనలో జూనియర్ విద్యార్థి క్రాంతికుమార్ స్పృహ కోల్పో యాడు. మరికొంత మంది జూనియర్ విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సహచర విద్యార్థులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు ర్యాగింగ్‌పై విచారణ చేపట్టారు. -
నెల్లూరులో ర్యాగింగ్ కలకలం
-
ర్యాగింగ్ చేస్తే క్రిమినల్ చర్యలు
-
ర్యాగింగ్ చేస్తే క్రిమినల్ చర్యలు
► వర్సిటీల రిజిస్ట్రార్లతో ఉన్నత విద్యామండలి భేటీలో నిర్ణయం ► ప్రతి కాలేజీలో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు ► పోలీసు పెట్రోలింగ్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ► హాస్టళ్లలో సీసీ కెమెరాలు.. వర్సిటీల్లో ప్రతివారం అవగాహన సమావేశాలు ► ర్యాగింగ్ చేస్తే వెంటనే కాలేజీ నుంచి సస్పెన్షన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ర్యాగింగ్ నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశం జరిగింది. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ర్యాగింగ్ నిరోధానికి చేపడుతున్న చర్యలు, చేపట్టాల్సిన కార్యాచరణపై ఇందులో చర్చిం చారు. ర్యాగింగ్ ఎక్కువగా క్యాంటీన్లు, హాస్టళ్లలో, జనావాసాలకు దూరంగా కాలేజీలు, హాస్టళ్లు ఉన్న చోట బస్సుల్లో వె ళ్లివచ్చేప్పుడు జరుగుతోందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా హాస్టళ్లపై దృష్టిసారించాలని నిర్ణయించారు. ప్రతి కాలేజీలో ర్యాగింగ్ నిరోధానికి తల్లిదండ్రులు, సీనియర్ విద్యార్థులు, కాలేజీ యాజమాన్య ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, పోలీసులతో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించా రు. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా... తమను ఎవరైనా ఇబ్బంది పెడితే కాలేజీ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు వెంకటాచలం, మల్లేష్, కార్యదర్శి శ్రీనివాసరావు, యూనివర్సిటీల రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. నిరోధానికి కఠిన చర్యలు.. - ప్రస్తుతం వ్యవసాయ వర్సిటీలో అమలుచేస్తున్న విధంగా ఇద్దరు టీచర్లు ప్రతి రోజూ రాత్రి హాస్టళ్లలో నిద్రించేలా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం షెడ్యూల్ రూపొందించుకుని అమలు చేయాలి. కేర్ టేకర్లు, సెక్యూరిటీ సిబ్బంది కూడా వారితో ఉంటూ ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపట్టాలి. - ర్యాగింగ్ నిరోధానికి కాలేజీల యజమాన్యాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. పోలీసుల సహాయం కోరుతూ లేఖలు రాయాలి. రాత్రివేళలో హాస్టళ్లు ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించేలా, పోలీసులు మఫ్టీలో ఉండి ర్యాగింగ్‌కు పాల్పడే వారిని గుర్తించే చర్యలు చేపట్టాలి. - హాస్టళ్లలో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. - ర్యాగింగ్‌కు పాల్పడిన వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు క్రిమినల్ చర్యలు చేపట్టాలి. - అన్ని వర్సిటీల్లో ప్రతివారం ర్యాగింగ్ నిరోధంపై సమావేశాలు నిర్వహించాలి. - ఆ సమావేశాల్లో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు పాల్గొని సమీక్షించాలి. - ప్రతి కాలేజీలో ర్యాగింగ్‌కు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు ఫిర్యాదుల బాక్స్‌లను ఏర్పాటు చేయాలి. రోజుకు రెండుసార్లు వాటిని తెరిచి ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టాలి. - విపరీత ప్రవర్తన కలిగిన వారిని ముందే గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలి. కాలేజీలు ప్రత్యేకంగా కౌన్సెలర్‌ను నియమించి ర్యాగింగ్ నిరోధంపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలి. -
వాళ్లకు భయపడొద్దు... - రాశీ ఖన్నా
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో రాశీఖన్నా తెలుగువారిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘జిల్’ సినిమాలో గోపీచంద్ పక్కన మార్కులు కొట్టేసింది. ఇప్పుడు రామ్‌తో ‘శివమ్’లోనూ, రవితేజతో ‘బెంగాల్ టైగర్’లోనూ నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ సినిమాలో కూడా కనిపించనుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న రాశీఖన్నాతో ‘సాక్షి’ చిట్‌చాట్... ♦ ఫస్ట్ ఓ జనరల్ క్వశ్చన్. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుని విద్యార్థులు చనిపోతున్నారు. ఈ సంఘటనల గురించి మీరు విన్నారా? రిషితేశ్వరి గురించి విన్నాను. టీవీ చానల్స్‌లో న్యూస్ చూశాను. చాలా బాధ అనిపించింది. ర్యాగింగ్ అనే పేరు ఎత్తడానికి వీల్లేనంతగా కఠినమైన నిబంధనలు విధించాల్సిన బాధ్యత కళాశాలలదే. అలాగే, ఫ్రెషర్స్ భయపడకూడదు. యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. ప్రతి కళాశాలలోనూ ఓ ఫోరమ్ ఉంటుంది. ఆ ఫోరమ్‌కి కంప్లయింట్ చేయాలి. ♦ ఆత్మహత్యే సమస్యకు పరిష్కారం అంటారా? కానే కాదు. అది పిరికితనం. మనం లేకపోతే మనవాళ్లు ఏమైపోతారు? అని ఆలోచించాలి. ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చేసి మన దారి మనం చూసుకోవడం సరి కాదు. జీవితం ఎంతో విలువైనది. ♦ అత్యాచారం చేసేసి, ఆ తర్వాత అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయే అబ్బాయిలను ఊరికే వదలొచ్చా? ఇదే విషయమై సుప్రీం కోర్టు ‘పెళ్లి చేసుకున్నా.. దోషి శిక్ష అనుభవించాల్సిందే’ అని తీర్పు ఇచ్చింది.. మీరేమంటారు? ఈ తీర్పుని పూర్తిగా ఆమోదిస్తున్నాను. ‘ఎ రేపిస్ట్ ఈజ్ ఎ రేపిస్ట్’. అత్యాచారం చేసినవాణ్ణిచ్చి పెళ్లి చేస్తే అంతకన్నా ఘోరమైన పరిష్కారం మరోటి ఉండదు. ఆ అమ్మాయిని కూపంలోకి నెట్టినట్లే. ♦ సినిమాల విషయానికొస్తే... దాదాపు హీరోయిన్లే హీరోల చుట్టూ తిరుగుతారు. సో.. అమ్మాయిలను తక్కువ చేస్తున్నారేమో అంటే మీరు ఒప్పుకుంటారా? ఆడవాళ్లు ఆర్ట్లాంటి వాళ్లు. వాళ్ల అందాన్ని ఆవిష్కరించడం తప్పు కాదు. కానీ అభ్యంతరకరంగా చూపించడం తప్పు. అలాగే ప్రతి సినిమాలోనూ అమ్మాయిలు హీరోల చుట్టూ తిరుగుతారంటే నేనొప్పుకోను. పరిస్థితుల్లో మార్పొస్తోంది. సో.. కథానాయికలను గ్లామర్ డాల్స్‌లా మాత్రమే చూసే పరిస్థితి పోతుంది. ♦ పదే పదే ఓ అబ్బాయి వెంటపడితే కనికరించి ఐ లవ్ యూ చెప్పాలనిపించిన సందర్భాలేమైనా ఉన్నాయా? (నవ్వుతూ) లక్కీగా అలా ఇబ్బందిపడిపోయే సందర్భాలేవీ రాలేదు. ♦ ఇవాళ కథానాయికలు ముప్పై ఏళ్ల తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ మారుతున్నారు లేకపోతే అవకాశాల్లేకుండా మిగిలిపోతున్నారు. కథానాయికల కెరీర్‌కి లాంగ్విటీ తక్కువనే విషయంపై మీ అభిప్రాయం? ఒక్కసారి గ్లామర్ డాల్ ఇమేజ్ నుంచి బయటపడి పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తే అప్పుడు హీరోల్లా హీరోయిన్స్ కెరీర్‌కి కూడా లాంగ్విటీ ఉంటుంది. కథల్లో మార్పు రావాలి. అప్పుడు మొత్తం ఫిలిం కమ్యూనిటీలో మంచి మార్పొస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్లో ఈ మార్పు మొదలైంది. ఇక్కడ కూడా ఆ మార్పు వస్తుందనే నమ్మకం ఉంది. ♦ మీరు ఎవరి ముందు తలవంచాలనుకుంటారు.. అమ్మ, నాన్న, గురువు, దైవం...? నన్ను ఇన్‌స్పయిర్ చేసే వ్యక్తుల ముందు నేను తలవంచడానికి వెనకాడను. అలాగే ఎవరి దగ్గరైనా మంచి విషయాలు నేర్చుకునే వీలు ఉంటే వాళ్లకు తల వంచుతాను. నాకన్నా చిన్నవాళ్లయినా సరే బెండ్ కావడానికి రెడీ అవుతాను. ♦ ఇప్పుడు మీరు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాబట్టి కోట్లు సంపాదించే అవకాశం ఉంది. మరి.. పేదవాళ్లను చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? విధి నిర్ణయం మేరకు అందరూ పుడతారు. హార్డ్ వర్క్‌తో దాన్ని మార్చుకోవచ్చు. స్వతహాగా నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా హార్డ్‌వర్కే నన్నీ స్థాయికి తీసుకొచ్చింది. పేదవాళ్లని చూసినప్పుడు జాలి కలుగుతుంది. ధనవంతులందరూ తమ సంపాదనలో ఐదు శాతం డొనేట్ చేస్తే చాలు.. పేదరికం అనే మాట వినపడదు... మెల్ల్ల మెల్ల్లగా పేదవాళ్లు కనపడరు. ♦ మరి.. మీ సంగతేంటి? సామాజిక సేవ చేస్తుంటారా? తప్పకుండా. కానీ, దాని గురించి చెప్పను. ఎందుకంటే, మనం కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదని మా అమ్మ అంటుంది. ♦ అది సరే.. తెలుగు భాష తెలియకుండా ఎలా మ్యానేజ్ చేస్తున్నారు? నాకు తెలుగు తెలియదని ఎందుకు అనుకుంటున్నారు? భాష తెలియకుండా నటించడం ఈజీ కాదు. అందుకే నా మొదటి సినిమా అప్పుడే నేర్చుకున్నాను. తెలుగు మాట్లాడతాను కానీ, బోల్డన్ని తప్పులొస్తాయి. కాకపోతే బాగా అర్థమవుతుంది. అందుకని, కష్టంగా లేదు. ♦ హిందీలో మీ ఫేవరెట్ హీరో? రణ్‌బీర్ కపూర్.. ♦ తెలుగు ఏ దర్శకుడితో సినిమా చేయాలని ఉంది? రాజమౌళి. ♦ మీరు చేయబోయే పాత్రలు... త్వరలో మీరు నన్ను పోలీసాఫీసర్‌గా చూడబోతున్నారు. ఓ చిత్రంలో ఆ పాత్ర చేస్తున్నా. నాకెప్పుడూ నాన్-గ్లామరస్ రోల్స్ అంటే ఇష్టం. ఒకవేళ గ్లామరస్ రోల్ అయితే అందులో విషయం ఉండాలి. నేను చేసే గ్లామరస్ రోల్స్‌లో విషయం ఉంటుంది. నా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ప్రేక్షకుల ప్రేమాభి మానాలు కూడా నా సక్సెస్‌కి కారణం. - డి.జి. భవాని -
ర్యాగింగ్‌కు మరో విద్యార్థి బలి
► ‘ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్’ అంటూ సూసైడ్ నోట్ ► వరంగల్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సాయినాథ్ మేడ్చల్/మేడ్చల్ రూరల్/కాజీపేట రూరల్/రామకృష్ణాపూర్(ఆదిలాబాద్): భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కళాశాలలో అడుగుపెడుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పెనుభూతం బలి తీసుకుంటూనే ఉంది! రిషితేశ్వరి ఘటన మరవకముందే ర్యాగింగ్ కోరల్లో చిక్కి మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ‘ప్లీజ్ స్టాప్ ది ర్యాగింగ్.. ఆ రోజు సీనియర్స్ అలా చేయకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు..’ అని సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ కాలేజీలో వండ్లకొండ సాయినాథ్(18) ఇంజనీరింగ్ (ఈసీఈ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జూలై 28న కాలేజీలో చేరిన సాయినాథ్.. కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లిలోని రాంరితేష్ అనే ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. నాలుగు రోజుల క్రితం రాఖీ పౌర్ణమి సందర్భంగా బోరబండలోని తన సోదరి ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకున్నాడు. అక్కడ్నుంచి ఆదివారం హాస్టల్‌కు చేరుకున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్ జిల్లాలోని తన సొంతూరు రామక్రిష్ణాపురానికి బయలుదేరి వెళ్లాడు. ఇంటికని వెళ్లిన సాయినాథ్ సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు వరంగల్-కాజీపేట్ మధ్య వడ్డేపల్లి చెరువు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జేబులో ‘‘ప్లీజ్ స్టాప్ ది ర్యాగింగ్.. ఆ రోజు సీనియర్స్ అలా చేయకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు’’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించింది. విచారణ చేపట్టిన పోలీసులు సాయినాథ్ ఆత్మహత్య వార్త తెలుసుకున్న బాలానగర్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, మేడ్చల్ సీఐ శశాంక్‌రెడ్డి కాలేజీకి వెళ్లి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ర్యాగింగ్‌పై కూపీ లాగుతున్నారు. ఈ కాలేజీ మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డికి చెందినది కావడం గమనార్హం. విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో మంగళవారం సాయంత్రం కాలేజీ నిర్మానుష్యంగా కనిపిం చింది. విద్యార్థులు, సిబ్బంది ఎవరూ కని పించలేదు. దీంతో పోలీసులు ఫోన్ల ద్వారా కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించారు. కాసేపటికి కాలేజీ ప్రిన్సిపల్ జంగారెడ్డి అక్కడికి చేరుకుని తమ కాలేజీలో ర్యాగింగ్ చోటు చేసుకోలేదని చెప్పారు. సాయినాథ్ హాస్టల్‌కు కూడా వెళ్లిన పోలీసులు ఆయన పుస్తకాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కూలిన ఆశల సౌధం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం వెంకట్రావుపల్లెకు చెందిన వడ్లకొండ కనకయ్య, అరుణ దంపతుల చిన్న కుమారుడు సాయినాథ్. వీరిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు మట్టి కూలీ పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. కూతురిని ఏంబీఏ చదివించారు. పెద్ద కుమారుడు రఘునందన్ హైదరాబాద్‌లోనే బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సాయినాథ్‌ను కూడా ఇంజనీర్ చేయాలని తల్లిదండ్రులు కలలుగన్నారు. కానీ ర్యాగింగ్ రక్కసి వారి కలలను కల్లలు చేసింది. వీరు కొన్నేళ్ల క్రితం మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు వలస వచ్చారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సాయినాథ్ మృతదేహాన్ని వెంకట్రావుపల్లెకు తరలించారు. మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘‘రెలైక్కిపోయావా కొడుకా... మల్లెప్పుడు వస్తావనుకోవాలె కొడుకా.. ర్యాగింగ్ భూతం నాకు కడుపు కోత విధించిందిరా కొడుకా...’ అంటూ తల్లి అరుణ గుండెలవిసేలా విలపించింది. -
ర్యాగింగ్ ఫ్రీ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం
వీసీలతో సమీక్షలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్: ఆంధ్రప్రదేశ్‌ను ర్యాగింగ్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలో శనివారం ఆయన వీసీలు, రిజిస్ట్రార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడితే గతంలో టీసీ ఇచ్చి పంపేసేవారని, ఇప్పుడైతే శాశ్వతంగా విద్యకు దూరం చేస్తారని చెప్పారు. విద్యాసంస్థల అధిపతుల్ని బాధ్యుల్ని చేస్తామన్నారు. వైస్చాన్స్లరే యూనివర్సిటీకి కింగ్ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో యూనివర్సిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీల్లో విద్యావిధానాన్ని అధ్యయనం చేయడం కోసం త్వరలోనే సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఫిన్‌ల్యాండ్ దేశాలతో పాటు దేశంలోని తమిళనాడు, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు వివరించారు. తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్ యూనివర్సిటీల విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మంత్రి గంటా అన్నారు. నారాయణను టార్గెట్ చేస్తారు : నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, కడపలో నారాయణ విద్యాసంస్థలో విద్యార్థిని మృతిపై అసెంబ్లీలో ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు అన్ని రకాలుగా సమాధానం చెప్పేలా రికార్డులు సిద్ధం చేయాలని ఆయన వీసీలకు సూచించారు. నారాయణ క్యాబినెట్లో మంత్రిగా ఉండటంతో పాటు తన బంధువు కూడా కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్షం టార్గెట్ చేస్తోందన్నారు. -
సింగరేణి పాలిటెక్నిక్‌లో ర్యాగింగ్
జూనియర్ విద్యార్థిపై సీనియర్ల దాడి ఏడుగురిని సస్పెండ్ చేసిన కాలేజీ యాజమాన్యం శ్రీరాంపూర్: ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీకి ర్యాగింగ్ భూతం పట్టింది. ర్యాగింగ్‌కు గురైన విద్యార్థి సీసీసీ నస్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. సీసీసీలోని పాలిటెక్నిక్ కళాశాల సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ నెల 2న జూనియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. కోపంతో జూనియర్ విద్యార్థి అక్కడే ఉన్న ట్రంక్ బాక్సును కాలితో తన్నాడు. ట్రంకు బాక్సుకు సంబంధించిన విద్యార్థి, జూనియర్ మధ్య మాటలు పెరిగాయి. విషయం తెలుసుకున్న సీనియర్లు వచ్చి జూనియర్ విద్యార్థిపై హాస్టల్ గదిలోనే దాడి చేశారు. సీనియర్లంటే భయంలేదా? అంటూ కొట్టారు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు సీనియర్ విద్యార్థులు పాల్గొన్నారు. దాడికు గురైన విద్యార్థి ఈ ఘటనను ఎవరికీ చెప్పలేదు. మిగితా విద్యార్థులు కూడా భయపడి ఎవరికి చెప్పలేదు. దెబ్బలు తిన్న ఆ విద్యార్థికి జ్వరం రావడంతో ప్రిన్సిపల్ అనుమతితో ఈనెల 14న గోదావరిఖనిలోని తన ఇంటికి వెళ్లాడు. తండ్రికి 2వ తేదీన జరిగిన ర్యాగింగ్ గురించి చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు సోమవారం సీసీసీ నస్పూర్ పోలీసులకు దాడికి పాల్పడిన ఆరుగురు విద్యార్థులపై ఫిర్యాదు చేశారు. తరువాత కాలేజీ ప్రిన్సిపల్ రామారావును కూడా కలిసి రాత పూర్వక ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రమే ఎస్సై ప్రమోద్‌రావు కాలేజీకి వచ్చి విచారించారు. ఈ ఘటనే కాకుండా తనతో సీనియర్ విద్యార్థి ఒకరు బట్టలు ఉతికించారని ఓ జూనియర్ వాపోయాడు. పలుసార్లు ర్యాగింగ్ చేశారని తెలిపాడు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చర్యలు.. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై యాజమాన్యం సీరియస్ అయ్యింది. ర్యాగింగ్‌కు పాల్పడినందుకు మొత్తం ఏడుగురు విద్యార్థులను 10 రోజులపాటు కాలేజీ, హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు. కాలేజీలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నామని ప్రిన్సిపాల్ డి.రామారావు తెలిపారు. హాస్టల్లో సీసీ కెమెరాలు కూడా పెట్టామని, కేర్ టేకర్‌తోపాటు సెక్యూరిటీ గార్డును కూడా పెట్టి పగలు, రాత్రి తేడా లేకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు మారో మారు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. -
నేరం వారిదే..తప్పు అందరిదీ..!
సాక్షి, గుంటూరు : కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో సుహృద్భావ వాతావరణానికి దారితీయాల్సిన పరిచయ కార్యక్రమాలు వికృత రూపం దాలుస్తున్నాయి. తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాల్సిన సీనియర్లు అందుకు భిన్నంగా ర్యాగింగ్ కు పాల్పడడం విద్యార్థి జీవితానికి ముగింపు పలుకుతోంది. ర్యాగింగ్‌కు గురైన వారు ఆత్మహత్యలకు పాల్పడి తమ జీవితాలను అర్ధంతరంగా ముగించుకుంటుంటే, ర్యాగింగ్‌కు పాల్పడినవారు జైలుపాలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇందుకు అనేక కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా విద్యార్థుల్లో మానసిక స్థైర్యం పెంపొందించటంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు సరైన శ్రద్ధ చూపకపోవడం ఒకటైతే, ర్యాగింగ్ చట్టాలపై విద్యార్థులకు అవగాహన లేకపోవటం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. కళాశాలలు విద్యా ప్రమాణాలను పాటించకపోవటం కూడా ఇలాంటి అనర్థాలకు అవకాశం ఇస్తున్నాయి. జూనియర్లకు బాసటగా నిలవాలన్నదే లక్ష్యం: యూనివర్సిటీలు, కళాశాలల్లో చేరే జూనియర్ విద్యార్థుల్లో ఉండే భయాలను పోగొట్టి ఆ విద్యా సంస్థలోని వాతావరణాన్ని అలవాటు చేయటం, విద్యాపరమైన అనుమానాలుంటే వాటిని తీర్చడం. ఇంటి బెంగతో, ఒంటరితనంతో బాధపడుతుంటే మేమున్నామంటూ భరోసా కల్పించటం, భవిష్యత్ పట్ల సరైన అవగాహనం కల్పించటం, కుల, మతాలకు దూరంగా ఉండే విధంగా సీనియర్లు దిశానిర్ధేశం చేయాలి. అయితే దీనికి భిన్నంగా జరగడం విచారకరం. అలంకారప్రాయంగా మారిన యాంటీర్యాగింగ్ కమిటీలు : ర్యాగింగ్‌ను తీవ్రమైన విషయంగా పరిగణించాల్సిన కళాశాలల యాజమాన్యాలు పట్టీపట్టనట్లు వ్య వహరిస్తున్నాయి. ప్రతి విద్యాసంస్థలో యాంటీర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయాలి. మొదట్లో జూనియర్లు, సీనియర్లు కలవకుండా కళాశాల వేళల్లో మార్పు చేయటం, వసతి గృహాల్లో వేర్వేరుగా వసతి కల్పించటం, అధ్యాపకుల పర్యవేక్షణలో విద్యార్థులు ఉండేలా చూడటం, ర్యాగింగ్ వల్ల కలిగే దుష్పరి ణామాలు, శిక్షలను తెలియజేయటం, తల్లిదండ్రులతో సంవత్సరానికి కనీసం రెండు సార్లు సమావేశాలు నిర్వహించటం వంటివి చేయాలి. అయితే అనేక విద్యాలయాల్లో యాంటీర్యాగింగ్ క మిటీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ర్యాగింగ్‌కు పాల్పడితే పడే శిక్షలు: ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ వ్యతిరేక చట్టం (1997) ప్రకారం ర్యాగింగ్ చేసేవారికి, ప్రోత్సహించేవారికి అనేక శిక్షలు అమల్లో ఉన్నాయి. విద్యార్థులను వేధింపులకు గురిచేస్తే ఆరు నెలలు జైలు శిక్ష, శారీరక హింస, నేరపూరిత చర్యలకు పాల్పడితే ఏడాది జైలు, ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధిస్తే రెండేళ్ల జైలు , మాన మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలు, బలవంతంగా ఎత్తుకుపోవటం, దాచిపెట్టటం, మాన భంగం, అసహజమైన మనస్థాపం కలిగించటం వంటివి చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, మరణానికి కారణ భూతులైతే పది సంవత్సరాల జైలు శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధిస్తారు. ఇవి కాకుండా విద్యాలయం నుంచి శాశ్వతంగా తొలగించటం, ఇకపై ఏ విద్యాలయంలోనూ ప్రవేశం లేకుండా అనర్హత వేటు వేస్తారు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్లే అనర్థాలు ఉమ్మడి కుటుంబాలు ఉంటే కలిసి మెలిసి ఉండటం, అమ్మమ్మ, తాతయ్య చెప్పే మంచి బుద్ధులు నేర్చుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళుతుంటే పిల్లలకు మంచి చెప్పే వారే కరువయ్యారు. ఆలోచించే ఓపిక లేక తాము అనుకుంది జరగకపోతే చావడమో, చంపడమో వంటివి చేస్తున్నారు. - డాక్టర్ ఉమా జ్యోతి, మానసిక వైద్యురాలు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి .. ర్యాగింగ్ నిర్మూలనకు కమిటీలు, చట్టాలు తెస్తే ఉపయోగం లేదు. వాటి అమలు, పర్యవేక్షణలో అధికారులు బాధ్యాతాయుతంగా వ్యవహరించాలి. విద్యా సంస్థల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాల వల్ల ర్యాగింగ్ నిరోధానికి ఉపయోగం ఏమీ ఉండదు. ర్యాగింగ్ జరిగిన తరువాత ఎవరు చేశారనేది గుర్తించడానికి మాత్రమే సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. ర్యాగింగ్ జరిగిన విద్యాసంస్థలో ర్యాగింగ్ చేసిన వారితోపాటు యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు, అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. - మొండి మురళీకృష్ణ, రిషితేశ్వరి తండ్రి. -
నేడు ర్యాగింగ్‌పై రౌండ్‌టేబుల్ సమావేశం
♦ సమాజంలో మార్పు కోసం సాక్షి, సాక్షి టీవీ ప్రయత్నం ♦ అన్ని వర్గాల ప్రజలు పాల్గొని అభిప్రాయాలు వెల్లడించే అవకాశం సాక్షి, గుంటూరు : రాష్ట్రంలో ర్యాగింగ్ సంఘటనలు వరసగా జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మానసిక ఎదుగుదల లేక కొందరు, చట్టాలపై అవగాహన లేక మరికొందరు. తల్లిదండ్రుల పర్యవేక్షణ కరువై ఇంకొందరు.. ర్యాగింగ్‌కు పాల్పడుతూ ఎదుటివారి జీవితాలతోపాటు తమ జీవితాలనూ బలి చేసు కొంటున్నారు. దీనికి జిల్లాలో ఇటీవల జరిగిన విద్యార్థినులు రిషితేశ్వరి, సునీత ఘటనలే ప్రత్యక్ష ఉదహరణలు. ర్యాగింగ్ మహమ్మారికి రిషితేశ్వరి బలై తల్లిదండ్రులకు కడుపుకోతను మిగల్చగా.. తానే ర్యాగింగ్‌కు పాల్పడి ప్రిన్సిపల్ మందలించారనే మనస్థాపంతో సునీత బలవన్మరణానికి పాల్పడి తన తల్లిని ఒంటరిని చేసింది. ర్యాగింగ్‌కు ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇద్దరు విద్యార్థినులు బలికాగా, మరో ముగ్గురు కటకటాల పాలై తమ జీవితాలను అంధకారం చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తన వంతుగా ‘సాక్షి’ స్పందించింది.ర్యాగింగ్‌పై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు, సమాజంలో కూడా మార్పు రావాలనే తలంపుతో సాక్షి, సాక్షి టీవీ ఆధ్వర్యంలో బుధవారం ర్యాగింగ్‌పై రౌండ్ టేబుల్ సమావేశం జరగనున్నది. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి సారధ్యంలో ఈ రౌండ్‌టేబుల్ సమావేశం జరుగుతుంది. గుంటూరు రూరల్ సీసీఎస్ ఏఎస్పీ శోభామంజరి, ఏఎన్‌యూ మాజీ వీసీ వియన్నరావు, సీనియర్ న్యాయవాది వై.కోటేశ్వరరావు (వైకే), జీజీహెచ్ మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ మురళీకృష్ణ, పీడీఎస్ఓ రాష్ట్ర కమిటీ నాయకురాలు వెన్నెల, ఐద్వా నాయకురాలు వరలక్ష్మిలు ముఖ్య అతిథులుగా పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఈ సమావేశానికి సామాజిక వేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నేతలు, అన్ని వర్గాల ఔత్సాహికులు హాజరై తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. -
'ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు'
తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉదంతంపై వర్సిటీ, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. యూనివర్సిటీలోని డీ బ్లాక్‌ను అధికారులు సందర్శించారు. ఎస్వీయూలో ర్యాగింగ్ జరిగిన విషయం వాస్తవమేనని రిజిస్ట్రార్ దేవరాజులు, ఆర్డీవో వీరబ్రహ్మయ్య చెప్పారు. ఎస్వీయూలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడినట్టు గుర్తించామని, ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని రిజిస్ట్రార్ దేవరాజులు, ఆర్డీవో వీరబ్రహ్మయ్య తెలిపారు. ర్యాగింగ్ ఘటనపై విచారణ చేయడానికి ఏడుగురితో కమిటీ వేశామని వెల్లడించారు. -
ర్యాగింగ్‌పై విచారణ ప్రారంభం
యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై ఆదివారం అధికారులు విచారణ ప్రారంభించారు. ఎస్వీయూలో ర్యాగింగ్ అంశంపై ఆదివారం సాక్షి దినపత్రికలో సోమవారం నుంచి సినిమా చూపిస్తాం అన్న శీర్షికతో కథనం వెలువడింది. దీనికి అధికారులు స్పందించారు. మధ్యాహ్న సమయంలో రెక్టార్ జయశంకర్, ప్రిన్సిపాల్ భగవాన్ రెడ్డి, డెప్యూటీ వార్డన్ రమేష్‌బాబు డి.బ్లాక్‌ను సందర్శించారు. ఘటనపై విద్యార్థులను విచారించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
గ్యాంగ్‌వార్!
పిడుగురాళ్ల : పిడుగురాళ్ల పట్టణంలో గ్యాంగ్‌లు తయారయ్యాయి. కొందరు యువకులు ప్రాంతానికి రెండు గ్రూపులుగా ఉంటున్నారు. ఈ గ్రూపులో వ్యక్తి మరో గ్రూపునకు దొరికి వెంటనే ప్రత్యేక ప్రదేశాలకు తీసుకెళ్లి చితకబాదేస్తున్నారు. తరచూ ఆడపిల్లల విషయంలో పోటీ పడుతూ పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. రాత్రిళ్లు ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేసుకుంటున్నారు. ఇటీవల ఒకటి, రెండు కేసులు స్టేషన్ వరకు వెళ్లడంతో పోలీసులు వార్నింగ్‌లు ఇచ్చి పంపారు. ప్రధాన కూడళ్లలో హడావుడి : పట్టణంలోని నలంద కళాశాల కూడలి, జిల్లా పరిషత్ హైస్కూల్ , గణపతి కాంప్లెక్స్ వెనుక, గంగమ్మ గుడి సెంటర్ , రైల్వేస్టేషన్ రోడ్డు, జమునా స్కూల్ సమీపంలో, బిలాల్ మసీద్ సెంటర్లో ఇలా ఆయా కూడళ్లలో గుంపులు గుంపులుగా ఏర్పడి అమ్మాయిలను ఏడిపించడం, ర్యాగింగ్ చేయడం వంటి విషయాలపై గ్రూపులు గొడవలు పడి కొట్టుకోవడం జరుగుతుంది. ఫైట్ ప్రదేశాలు ... రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫామ్ చివర , మార్కెట్ యార్డు గోడౌన్ వెనుక , జమునా స్కూల్ వెనుక , పట్టణానికి చివర హైవేపై ఈ గ్రూపులు ఫైటింగ్‌కు దిగుతుంటారు. ఇటీవల పట్టణానికి చెందిన ఓ ఆర్టీసీ ఉద్యోగి కుమారుడిని కొట్టి గాయపరిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఎవరైనా గొడవలు ఎందుకని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే వారిపై కూడా దాడులు చేసేం దుకు వెనుకాడటం లేదు. దీంతో ఇది తప్పని చెప్పాలంటే భయపడుతూ ఎవరికి వారు మిన్నకుంటున్నారు. నిఘా ఏర్పాటు చేస్తాం ... ఈ విషయాన్ని సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదనరావు దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా పట్టణాల్లో పెడదారి పడుతున్న యువతపై పోలీసు నిఘాను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నామని, వారికి కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. -
ర్యాగింగ్ చేస్తే రౌడీషీట్
-
ర్యాగింగ్ చేస్తే రౌడీషీట్
* యోచిస్తున్న రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు * ర్యాగింగ్ ఫ్రీ ఏపీపై త్వరలో నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న ర్యాగింగ్ ఘటనల్ని పోలీసు విభాగం సీరియస్‌గా తీసుకుంది. ర్యాగింగ్ చేసిన వారిపై రౌడీషీట్ తెరవడంతో పాటు ఆ యా కళాశాలల యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయాలని భావిస్తోంది. ర్యాగింగ్ వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేయడంతో పాటు రిషీ వ్యాలీ వంటి ప్రఖ్యాత స్కూళ్లలో ఉన్న మెంటారింగ్ విధానంపై కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కల్పించాలని యోచిస్తోంది. ర్యాగింగ్ ఫ్రీ ఏపీ స్థాపన కోసం రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకూ సమన్లు జారీ చేయడం, భవిష్యత్తులో వీరికి పాస్‌పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగం రాకుండా నివేదిక రూపొందించడం వంటి కఠిన నిర్ణయాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. తీవ్రమైన స్థాయిలో ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థిని కాలేజీ నుంచి బహిష్కరించడం, మరోచోట అడ్మిషన్ లభించకుండా సర్టిఫికెట్లపై ‘ర్యాగర్’ స్టాంప్ వేయడం వంటి అంశాలనూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని పోలీసు విభాగం నిర్ణయించింది. -
ర్యాగింగ్ మానవ ప్రవృత్తికాదు
న్యాయమూర్తి నిరంజన్ వన్‌టౌన్ : ర్యాగింగ్ లాంటి చర్యలు మానవ ప్రవృత్తి కాదని వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని అదనపు మెట్రోపాలిటిన్ సెషన్స్ జిల్లా న్యాయమూర్తి ఆర్.నిరంజన్ అన్నారు. కేబీఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘ర్యాగింగ్ రహిత విద్యావ్యవస్థ’పై అవగాహన సదస్సును ఆ కళాశాల ప్రాంగణంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హజరైన న్యాయమూర్తి ఆర్.నిరంజన్ మాట్లాడుతూ ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రతి చర్య చట్టవ్యతిరేకమేనన్నారు. ఒక విద్యార్థి ఆరు మాసాల కన్నా అధికంగా శిక్ష అనుభవిస్తే ఏ విద్యాసంస్థలోనూ చదువుకోవడం కుదరదన్నారు. కొత్తపేట సీఐ ఎన్.దుర్గారావు మాట్లాడుతూ ర్యాగింగ్‌కు పాల్పడటం వల్ల విద్యార్థులు జీవితాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ వంటి చర్యలను నిర్మూలించేందుకు విద్యార్థులు పోలీసుశాఖతో కలిసి నడవాలని కోరారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్.రజిత్‌కుమార్ మాట్లాడుతూ కళాశాలలో 60 శాతం విద్యార్థినులే ఉన్నారని, వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.కృష్ణమూర్తి , వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు మాట్లాడుతూ కళాశాలలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ప్రొగ్రామ్ ఆఫీసర్ వి.శేషగిరిరావు నిర్వహించగా తెలుగు విభాగాధిపతి డాక్టర్ చలపతిరావు వందన సమర్పణ చేశారు. అధ్యాపకులు జే.పాండురంగారావు, ఎం.సాంబశివరావు పాల్గొన్నారు. -
కళాశాలలో స్నేహగీతం..
-
ర్యాగింగ్‌ను అరికట్టండి
వాల్మీకిపురం: కళాశాలల్లో జరుగుతున్న ర్యాగింగ్‌ను అరికట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ నాయకులు బుధవారం ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని వాల్మీకిపురంలోని ఆయన స్వగృహం లో క లుసుకున్నారు. స్టాప్ ర్యాగింగ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ కళాశాలల్లో మొదటి సంవత్సరం చేరే విద్యార్థులను పరిచయం చేసుకోవాలని, సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. పరిచయాల సాకుతో ర్యాగింగ్‌కు పాల్పడడం సబబుకాదన్నారు. ఇటీవల నాగార్జున యూనివ ర్సిటీలో ర్యాగింగ్ భూతానికి ఓ అమ్మాయి బలికావడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సెక్రటరీ చక్రధర్, జిల్లా సెక్రటరీ కుమార్, విద్యార్థులు ఇంతియాజ్, శ్రీనాధ్, శ్రీకాంత్, పవన్, నాగ, ప్రశాంత్, చరణ్, హరి, ప్రసాద్, జగదీష్ పాల్గొన్నారు. -
ర్యాగింగ్‌కు దూరంగా ఉండండి
- భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు - పోస్టర్‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే కిడారి పాడేరు రూరల్ : ర్యాగింగ్ పెనుభూతమని, అందులో చిక్కుకొని భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు విద్యార్థులకు సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆశ్రమ పాల్టెక్నిక్ కళాశాలలో బుధవారం వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్టాప్ ర్యాగింగ్‌పై ముద్రించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే విడుదల చేశారు. అనంతరం విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థి దశ భవిష్యత్‌ను తీర్చిద్దుకోవడానికి మంచి ప్లాట్ఫారంలాంటిందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థి దశలో చేసిన తప్పులు భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయన్నారు. చెడు అలవాట్లు, వ్యవసనాలకు దూరంగా ఉండి మంచి జీవితాన్ని నిర్దేశించుకోవాలన్నారు. సమస్య వచ్చినప్పుడే స్పందించకుండా ముందుగానే యాజమన్యాలు కళాశాలలో చేరినప్పుడే విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. పాడేరు సీఐ ఎన్. సాయి మాట్లాడుతూ విద్యార్థులకు ర్యాంగింగ్ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగానైన విద్యార్థికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడితే ఆరు నెలల జైలుతోపాటు రూ. 2వేల జరిమాన విధించి కళాశాల నుంచి సస్పెండ్ చేస్తారన్నారు. కళాశాలల్లో ఎవ రైనా ఇబ్బందులకు గురిచేస్తే తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఎస్.సూర్యప్రకాశ్, కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తడబారికి సురేష్‌కుమార్, హుకుంపేట జెడ్పీటీసీ సభ్యురాలు సాగర వసంతకుమారి, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
ర్యాగింగ్‌ను నిరోధిద్దాం
జడలు విప్పుతున్న భూతం ఆందోళనలో తల్లిదండ్రులు కట్టడిలో కళాశాలల పాత్ర కీలకం త్వరలో ఇంజినీరింగ్ కాలేజీలు షురూ.. పరిచయ కార్యక్రమాలు పక్కదారి పడుతున్నారుు.. అండగా ఉండాల్సిన వారే అఘాతంలోకి తోస్తున్నారు. వికృతక్రీడతో విషాన్ని చిమ్ముతున్నారు. ఇలా.. విద్యా సమూపార్జన దశలో కొందరు విగతజీవులవుతున్నారు. అవమానభారంతో చనిపోయే విద్యార్థి ప్రాణాన్ని కోల్పోతుండగా, దీనికి బాధ్యులు ఉజ్వల భవిష్యత్‌ను పణంగా పెట్టాల్సివస్తోంది. ర్యాగింగ్ భూతం దుష్పరిణామాలివీ. మొన్న హన్మకొండకు చెందిన రిషితేశ్వరి నాగార్జున యూనివర్సిటీలో బలవన్మరణం.. నెల్లూరులో ఇంటర్ విద్యార్థి కె. మధువర్ధన్‌రెడ్డి మృతి నేపథ్యంలో అందరూ గుణపాఠాలు నేర్చుకోవాలి. పోచమ్మమైదాన్: మొదట్లో కళాశాలలకు కొత్తగా వచ్చే విద్యార్థులను సీనియర్లు పరిచయం చేసుకునేందుకు ఫ్రెషర్స్ పార్టీలు జరిగేవి. ఇవి రానురాను ర్యాగింగ్‌గా మారారుు. కొందరి వ్యవహార శైలి అందరికీ చేటు తెస్తోంది. సామరస్య పూర్వక వాతావరణంలో జరగాల్సిన పరిచయ కార్యక్రమాలు రాత్రివేళల్లో గదుల్లో.. అమాయకులను భయపెట్టేలా, బాధపెట్టేలా వికృతరూపం దాల్చుతున్నారుు. ఈ కారణంగా పలువురు ఆత్మన్యూనతభావంతో కళాశాలలను వీడుతున్నారు. మరికొందరు సున్నిత మనస్కులు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ నెల 6న ఇంజినీరింగ్ కళాశాలల ప్రారంభం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఉంది. మరేం చేయాలి? కళాశాలల్లో విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పుడే యాంటీ ర్యాగింగ్ కమిటీలను నియమించాలి. ఇందులో అధ్యాపకులతో పాటు సీనియర్లు, జూనియర్ విద్యార్థులను భాగస్వాములను చేస్తే ఫలితం ఉంటుంది. ర్యాగింగ్ చేస్తే విధించే జరిమానా, పడే శిక్షలు, విద్యాసంవత్సరం నష్టపోయే తీరు.. తల్లిదండ్రులకు కలిగే దుఖం తదితర అంశాలు అందరికీ తెలిసేలా తరగతి గదులు, హాస్టళ్ల ఆవరణల్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలి. పోలీసు అధికారులు, మానసిక నిపుణులు, గతంలో ర్యాగింగ్ వల్ల నష్టపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పలు సమావేశాల్లో చెప్పించాలి. విద్యార్థులు కళాశాలలో చేరినప్పుడే స్టాంప్ పేపర్‌పై బాండ్లు రాయించుకోవాలి. ర్యాగింగ్ బాధ్యులుగా తేలితే ఫీజు వాపస్ ఇవ్వబోమని, సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేయూలి. కళాశాల నుంచి డిబార్ తదితర చర్యలు తీసుకున్నా ఒప్పుకుంటామని తల్లిదండ్రులు, విద్యార్థులతో సంతకాలు చేయించుకుంటే కొంత వరకు కట్టడి చేయొచ్చు. ఈ విధానాన్ని నగరంలోని చాలా కళాశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లోనే మార్పు రావాలి తాము గతంలో జూనియర్లమేననే స్పృహ సీనియర్లకు ఉండాలి. తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వారసత్వంగా జూనియర్లకు ఆపాదించొద్దు. అజమారుుషీకి ప్రయత్నించొద్దు. పెద్ద మనిషి తరహాలో, మార్గదర్శిగా మాత్రే ఉంటేనే హుందాతనం. ఎక్కువగా మహిళ హాస్టళ్లలో ర్యాగింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ మాత్రం క్షేమకరం కాదు. ఇబ్బంది ఎదురైతే.. ర్యాగింగ్‌కు గురికాకుండా విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాంపస్‌లో కానీ హాస్టళ్లలో కానీ ఒంటరిగా కాకుండా తోటి వారితో కలిసి ఉండాలి. ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీ, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం, పోలీసులు లేదా తల్లిదండ్రులకు సమాచారమివ్వాలి. ప్రతి కళాశాలలో సమీప పోలీస్ స్టేషన్ వారు హెల్ప్‌లైన్ బాక్స్‌ను ఏర్పాటు చేయాలి. నిత్యం అందులో విద్యార్థులు వేసే విజ్ఞాపన పత్రాలను పరిశీలించాలి. సాంకేతికంగా అభివృద్ధి చెందడమేనా? ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యలు పెరిగిపోవడానికి సాంకేతికంగా అభివృద్ధి చెందడమూ కారణమని పలువురి అభిప్రాయం. ఇప్పుడంతా ఇంటర్నెట్ హల్చల్ చేస్తున్న రోజులు. ర్యాగింగ్ దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించి సామాజిక వెబ్సైట్లలోకి పంపడాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ అవమాన భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యా సంస్థల బాధ్యత విద్యా సంస్థలలో తెలంగాణ ప్రొబిషన్ యాక్ట్ 1997/26 ప్రకారం కి ంది చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.విద్యాసంస్థలో ఏ రూపంలో ర్యాగింగ్ జరిగినట్లు దృష్టికి వస్తే విస్మరించొద్దు. ర్యాగింగ్ చేస్తూ దొరికిన,ర్యాగింగ్‌ను ప్రో త్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. యూజమాన్యం వారు ఆడియో విజువల్ ద్వారా ర్యాగింగ్ నిషేధిత, బాధ్యులపై తీసుకునే చర్యలను ప్రసారం చేయూలి. యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేసి అందులో సీనియర్లు, జూనియర్లు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌ను చేర్చాలి. వారి ఫోన్ నంబర్లు, సమీప ఠాణా సీఐ, ఎస్సై ఫోన్ నంబర్లు రాసి ఉంచాలి.అడ్మిషన్ తీసుకునే సమయంలోనే విద్యార్థితో వాంగ్మూల పత్రం తీసుకోవాలి. మరోక వాంగ్ముల పత్రం తల్లితండ్రుల నుంచి సైతం తీసుకోవాలి. విద్యార్థి ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారమివ్వాలి. ర్యాగింగ్ చేస్తే శిక్షలు తోటి విద్యార్థిని వేధించినా, ఆత్మన్యూనతకు గురిచే సినా ఆర్నెల్ల జైలు, రూ. వెరుు్య జరిమానా.దాడి , క్రిమినల్ చర్యలకు ఏడాది జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా.అక్రమ నిర్బంధం, గాయపరచడం చేస్తే రెండేళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా. తీవ్రంగా గాయపరచడం, లైంగికదాడి, కిడ్నాప్ వంటి అసాధారణ చర్యలకు పాల్పడితే ఐదేళ్ల జైలు, రూ. 10 వేల జరిమానా. హత్య చే సినా, ఆత్మహత్యకు పురిగొల్పినా పదేళ్ల జైలు, రూ. 50 వేల వరకు జరిమానా. రెండూ విధించవచ్చు. అకడమిక్ చర్యలు చట్టం నిర్దేశించిన శిక్షలే కాదు.. మరికొన్ని శిక్షలూ పడతారుు.ర్యాగింగ్ చేసిన విద్యార్థి తరగతులకు రానివ్వకుండా నిషేధించాలి. అడ్మిషన్ రద్దు చేయాలి. బాధ్యుడు పరీక్ష రాసి ఉంటే ఫలితాలను ఆపివేయాలి. అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం వరంగల్‌లోని అన్ని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, మెడికల్ కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. ర్యాగింగ్ చేస్తే తీసుకునే చర్యల తీవ్రత ఏ స్థారుులో ఉంటుందో సీనియర్ విద్యార్థులకు వివరిస్తాం. ఆయూ కళాశాలల్లో ర్యాగింగ్ వ్యతిరేక బ్యానర్లు కట్టిస్తాం. కుటుంబం నుంచే విద్యార్థులపై ర్యాగింగ్ వ్యతిరేక భావన అలవర్చాలి. -సురేంద్రనాథ్, వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీనియర్లకు అవగాహన కల్పిస్తున్నాం ఏటా కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ర్యాగింగ్ చేస్తే ఊరుకునేది లేదు. తరచూ సీనియర్లకు ఈ మేరకు అవగహన కల్పిస్తున్నాం. త్వరలో మా కళాశాలకు జూనియర్లు రానున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే సీనియర్లను మోటివేట్ చేస్తున్నాం. కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా చుస్తున్నాం. -డాక్టర్ శ్యామల, అనంతలక్ష్మి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల కఠినంగా శిక్షించాలి ర్యాగింగ్ చేస్తే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారినైనా కఠినంగా శిక్షించాలి. కళాశాలల యూజమాన్యాలు ఈ విషయంలో సీరియస్‌గా ఉండాలి. పోలీసులు సైతం నిఘా పెట్టాలి. విద్యార్థులకు అవగహన సదస్సులు ఏర్పాటు చేయాలి. పిల్లల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు కదా! -కూనురు శ్రీమతి- శేఖర్ గౌడ్ ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలి ర్యాగింగ్ భూతాన్ని విద్యార్థులు తరిమికొట్టాలి. కేయూలో క్యాష్(కమిటీ అగెనెస్ట్ సెక్స్‌వల్ హరాస్మెంట్) కమిటీని ఏర్పాటు చేయాలి. యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి అందులో విద్యార్థులు, అధ్యాపకులను, విద్యార్థి సంఘాలను సభ్యులుగా చేర్చాలి. కళాశాలల యూజమాన్యాలు ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పనిచేయూలి. - చిలువేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అలాంటి వారితో జాగ్రత్త విద్యార్థుల్లో 3 నుంచి 5 శాతం మంది సంఘ వ్యతిరేక విధానాలకు పాల్పడే ఆలోచనతో ఉంటారు. అలాంటి వారే ర్యాగింగ్‌కు పాల్పడుతుంటారు. యుక్త వయస్సులో కీజోఫియా అనే వ్యాధి కూడా వీరిని అలా ప్రేరేపిస్తుంది. వీళ్లు వ్యక్తిత్వం, సంబంధాలను అర్థం చేసుకోలేరు. కొత్త ఫ్రెండ్స్‌ను పరిచయం చేసుకోలేరు. మద్యం, డ్రగ్స్‌కు బానిసవుతారు. ఇలాంటి వారితో జూనియర్లు జాగ్రత్తగా ఉండాలి. -డాక్టర్ యైశ్రీధర్ రాజు, సైక్రియూట్రిస్టు -
దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేయూలి
‘ఎర్రబెల్లి’ బఫూన్లా వ్యవహరిస్తున్నారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు కల్మశం లేని ఈ నవ్వులు వసివాడారుు. కపటుల దాడితో గాయపడ్డారుు. ర్యాగింగ్ భూతం వికృత చేష్టలకు విసిగివేశారారుు. తుదకు ఉసురుతీసుకున్నారుు. హన్మకొండకు చెందిన దుర్గాబారుు, మురళీకృష్ణ దంపతుల గారాల పట్టి రిషితేశ్వరి.. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ రూపంలో శ్రుతిమించిన సీనియర్ల రాక్షసత్వాన్ని తాను కనుమూయడం ద్వారా ప్రపంచం కళ్లకు కట్టింది. ఇది మనం మేల్కొనే సమయం. ర్యాగింగ్‌ను అంతం చేయూల్సిన తరుణం హన్మకొండ: టీడీపీకి దమ్ముంటే వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీచేయూలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు సవాల్‌విసిరారు. టీడీపీ ఎల్పీ నేత ఎర్రబెల్లి బఫూన్ల వ్యవహరిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రవీందర్రావు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎంత వెలిగిపోతుందో ఆపార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంతో తెలిసిపోరుుందన్నారు. దయాకర్‌రావు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన అక్రమాలు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బయటపెట్టారని తెలిపారు. కడియం రాజీనామా చేస్తే టీఆర్ఎస్లో చేరొచ్చని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆత్రుతతో ఉన్నారని, ఆయన టీఆర్ఎస్లోకి రావడం ఎన్నటికీ కుదరదన్నారు. పేదలకు మంజూరైన ఇళ్ల బిల్లులు కాజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బిల్లులు ఇవ్వాలని ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఎక్కడ పుట్టగతులు లేకుండా పోతాయోమోనని టీడీపీ విమర్శలు చేస్తుందని అన్నారు. సమావేశంలో నాయకులు గుడిమల్ల రవికుమార్, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్రావు, మరుపల్లి రవి, చింతల యాదగిరి. నయిముద్దీన్, ఎల్లావుల లలితా యాదవ్, ఎడవెల్లి కృష్ణారెడ్డి, జన్ను జకార్యా, కె.వాసుదేవరెడ్డి, పోగుల రమేష్ పాల్గొన్నారు. -
ర్యాగింగ్ వ్యతిరేక ప్రచారం చేయాలి
♦ వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్‌కు జగన్ సూచన ♦ ‘స్టాప్ ర్యాగింగ్’ పోస్టర్ ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్ : విద్యా సంస్థల్లో ర్యాగింగ్ రక్కసి చెలరేగి రిషితేశ్వరి, మధువర్ధన్‌రెడ్డి లాంటి అమాయకులు బలవుతున్న తరుణం లో ర్యాగింగ్‌పై పోరాటానికి వైఎస్సార్ స్టూడెం ట్స్ యూనియన్ ఏపీ విభాగం నడుంకట్టింది. ‘స్టాప్ ర్యాగింగ్’ శీర్షికతో ఒక పోస్టర్‌ను రూపొందించింది. ‘ర్యాగింగ్ శిక్షార్హమైన నేరం’ అనే నినాదాన్ని ప్రధానంగా ముద్రించిన ఆ పోస్టర్‌ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తన నివాసంలో ఆవిష్కరించారు. కళాశాలల్లో ర్యాగింగ్ వల్ల అమాయకులు బలికాకుండా కృషి చేయాలని విద్యార్థి నేతలను జగన్ కోరారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ విద్యార్థులను చైతన్య పర్చాలని ఆయన సూచించారు. వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు, ఇతర విద్యార్థి నేతలు ఆర్.రాకేష్‌రెడ్డి, బి.కాంతారావు, పి.చైతన్య, టి.అనిల్‌కుమార్, వై.నాగార్జున యాదవ్, సురేష్, వి.శ్రీకాంత్, డి.రవీంద్ర, డి.పూర్ణసాగర్, కె.నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. -
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
-
బలికోరుతున్న వికృతక్రీడ
నెల్లూరు (టౌన్) : నాగార్జున యూనివర్సిటీలో ఘటన మరువక ముందే నెల్లూరులో ర్యాగింగ్‌కు మరో విద్యార్థి బలయ్యాడు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలలు గన్న విద్యార్థులు ర్యాగింగ్ భూతంలో చిక్కుకుంటున్నారు. తాజాగా నెల్లూరులోని పిడతపోలూరు శ్రీగాయత్రి జూనియర్ కళాశాలలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఏఎన్‌యూలో ఆర్కిటెక్ విద్యార్థిని రుషితేశ్వరి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంది. దీనిపై ప్రభుత్వం చర్యలు నామమాత్రంగా ఉండటంతో ర్యాగింగ్‌కు అడ్డుకట్ట పడటం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి చేరుతుంటారు. కళాశాలల్లో ఆధిపత్యం సాధించేందుకు కొంతమంది వింత పోకడలకు పాల్పడుతుంటారు. వారిని మొదటలోనే కళాశాలల యాజమాన్యం అడ్డుకట్ట వేస్తే అనర్థాలు జరిగే అవకాశం ఉండదు. కళాశాలల్లో సీనియర్లు జూనియర్లను స్నేహపూర్వకంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ర్యాగింగ్ పేరుతో వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ప్రధానంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు వివిధ ప్రైవేటు కళాశాలల్లో ర్యాగింగ్ కనబడుతుంది. ర్యాగింగ్ విషయాన్ని పోలీసులకు తెలియనీయకపోవడంతో కొంతమంది ఆగడాలు మితిమీరుతున్నాయి. గతంలో ర్యాగింగ్ మీదు కేసులు నమోదైన చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. దీంతో ర్యాగింగ్‌కు విచ్చలవిడిగా పాల్పడుతున్నారు. కొన్ని సమయాల్లో యాజమాన్యాలు జోక్యం చేసుకుని సర్ధిచెప్పడంతో ర్యాగింగ్ వ్యవహారం బయటకు రావడంలేదు. కొత్త విద్యార్థులు స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చట్టంలో ఏముంది.... ►1997లో ర్యాగింగ్ చట్టం అమలులోకి వచ్చింది. యాంటీ ర్యాగింగ్ సెక్షన్-4 ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడ్డా, ప్రోత్సహించినా 6నెలలు జైలు, 1,000లు జరిమానా విధిస్తారు. ►ర్యాగింగ్ సమయంలో భయబ్రాంతులకు గురిచేస్తే ఏడాది జైలు, రూ.2 వేలు జరిమానా. ►ర్యాగింగ్ సమయంలో తీవ్రంగా గాయపరిచినా, అత్యాచారానికి పాల్పడినా ఐదేళ్లు జైలుశిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తారు. ►ర్యాగింగ్ సమయంలో మరణించినా, ఆత్యహత్య చేసుకునేలా ప్రేరిపించినా జీవిత శిక్ష, రూ.50వేలు జరిమానా ఉంటుంది. ►కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోకపోయినా, కాలయాపన చేసినా నేరతీవ్రతను బట్టి శిక్షను అమలు చేస్తారు. ►ర్యాగింగ్ సందర్భాల్లో ఎవరికైనా శిక్షపడ్డ వారిని కళాశాలల్లో చేర్చుకోవడం నేరంగా పరిగణిస్తారు. ర్యాగింగ్‌పై అందని ఫిర్యాదులు కళాశాలల్లో ర్యాగింగ్‌లకు పాల్పడ్డా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదులు అందడం లేదు. కళాశాలల్లోనే విద్యార్థులను సమావేశపరిచి యాజమాన్యాలు సర్ధిచెబుతున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న కొంతమంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండు నెలల పాటు కళాశాలలపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ర్యాగింగ్ సమస్యను ఎదుర్కొన్నా బయటకు చెప్పలేని విచిత్ర పరిస్థితి కొన్ని కళాశాలల్లో నెలకొంది. యాజమాన్యాలు మాత్రం ఫీజులపై పెట్టిన దృష్టి విద్యార్థుల ప్రవర్తనలపై పెట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తొలుత ఫిర్యాదందినప్పుడే చర్యలు తీసుకుంటే మున్ముందు ఎలాంటి సంఘటనలు జరగవంటున్నారు. ఇప్పటికైనా ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులకు కళాశాలల ప్రవేశాలను బహిష్కరించాలని పలువురు కోరుతున్నారు. విద్యాసంస్థలు ప్రోత్సహించకూడదు -మురుగయ్య, వీఎస్‌యూ ప్రిన్సిపాల్ కళాశాలల్లో సీనియర్లు, జూనియర్లు అంటూ వ్యత్యాసం ప్రదర్శిస్తున్నారు. ర్యాగింగ్‌ల పేరుతో ప్రాణాలు మీదకు తెస్తున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి టీసీలు ఇచ్చి పంపించాలి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ర్యాంగింగ్ నిషేధం బోర్డులను ఏర్పాటు చేయాలి -శివకుమార్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ర్యాగింగ్ నిషేధం అని బోర్డులను ఏర్పాటు చేయాలి. ర్యాంగింగ్కు పాల్పడితే అమలయ్యే చట్టాలపై అవగాహన కల్పించాలి. ర్యాగింగ్‌లో ఒకరిపై అపవాదు మోపినా తీవ్ర నేరం. అవగాహన కల్పిస్తున్నాం -తిరుమలనాయుడు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షలు ఏవిధంగా అమలువుతయో తెలియజేస్తాం. ర్యాగింగ్‌కు పాల్పడితే విద్యార్థులు జీవితాలు నాశనమవుతాయి. కఠిన చర్యలు తీసుకోవాలి - శ్రవణ్‌కుమార్, వైసీపి విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు ర్యాగింగ్‌కు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కళాశాలలపై కూడా చర్యలు తీసుకోవాలి. కళాశాలల్లో ర్యాంగింగ్‌పై అవగాహన కల్పించాలి. -
బాబు ముఖం చాటేస్తున్నారెందుకు?
రిషితేశ్వరి మరణంపై రోజా ప్రశ్న మహిళలను వేధిస్తే 3 నిమిషాల్లో ఆదుకుంటామన్నారుగా.. ఇపుడు నోరెందుకు మెదపలేదు? హైదరాబాద్: ప్రతిదానికీ మీడియా ముందుకొచ్చి ప్రచారంకోసం తాపత్రయపడే ఏపీ సీఎం చంద్రబాబు నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి విషయంలో ఎందుకు ముఖం చాటేస్తున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా నిలదీ శారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థిని ఆత్మహత్య కేసును నీరుగార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలబడాల్సిందిపోయి నిందితులైన విద్యార్థులకు అధికారపక్షం అండగా ఉందన్నారు. మహిళలను వేధిస్తే 3 నిమిషాల్లో వచ్చి ఆదుకుంటామని ఎన్నికల ముందు బాబు విపరీతంగా ప్రచారం చేసుకున్నారని, అలాంటిదిపుడు నోరెందుకు మెదపలేదని ప్రశ్నిం చారు. రిషితేశ్వరి కేసులో నిందితుల్ని శిక్షించేలా చర్యలు తీసుకునేలా కోరడానికి ఆమె తల్లిదండ్రులు ఏపీ సీఎం వద్దకు వెళితే ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. న్యాయం చేయాలని కోరుతూ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలవడానికి వెళ్లిన విద్యార్థులపై లాఠీచార్జి చేయించడం దారుణమన్నారు. అసలిలాంటి విద్యా మంత్రి, సీఎం రాష్ట్రంలో ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వర్సిటీకి వెళ్లిన విచారణ కమిటీ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడిస్తున్నారని ఆమె తప్పుపట్టారు. అక్కడ వ్యవహారమంతా కులాల కుంపటిగా చేశారని దుయ్యబట్టారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిని నిందితులుగా చేశారని, వాస్తవానికి వర్సిటీ వైస్‌చాన్సలర్‌ను తొలి ముద్దాయిగా, ప్రిన్సిపల్‌ను రెండో ముద్దాయిగా చేయాలని రోజా డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోరాడుతున్న మహిళాసంఘాలు, విద్యార్థులపై టీడీపీ మద్దతుదారులు దాడులు చేసి ఉద్రిక్తతలకు కారణమైనందునే ఆ పార్టీ ప్రమేయముందని తాము చెబుతున్నామన్నారు. ర్యాగింగ్‌ను నివారించడానికి 2009, మే 8న సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసిందని, వాటిని వర్సిటీ అధికారులు పాటించలేదన్నారు. నిజనిర్ధారణ చేసి రిషితేశ్వరి కుటుంబం తరఫున పోరాడేందుకు వైఎస్సార్సీపీ మహిళా, విద్యార్థి విభాగం, ఎమ్మెల్యేలు ఆగస్టు 6న నాగార్జున వర్సిటీకి వెళుతున్నామని వెల్లడించారు. జర్నలిజానికే మచ్చ..: పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన అనని మాటల్ని అన్నట్లుగా ఓ పత్రిక రాయడం జర్నలిజానికే మచ్చని రోజా దుయ్యబట్టారు. రిషితేశ్వరి ఆత్మహత్య, ఏపీకి ప్రత్యేక హోదాపై కార్యాచరణ వంటి అంశాల్ని చర్చించాంగానీ ఆ పత్రికలో రాసినట్లుగా మరే చర్చా జరగలేదన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ హైదరాబాద్: నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై నిగ్గు తేల్చడానికి వైఎస్సార్సీపీ ఆరుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కె.పార్థసారథి, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్.కె.రోజా, మేరుగు నాగార్జున, వంగవీటి రాధాకృష్ణ, గొట్టిపాటి రవికుమార్ ఇందులో ఉన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య, ప్రిన్సిపల్, ఇతర నిందితుల ప్రమేయం, కులవివక్ష, దర్యాప్తులో ప్రభుత్వ వైఫల్యం, వర్సిటీలో బోధన సిబ్బంది కొరత తదితర అంశాలపై ఈ కమిటీ పరిశీలన జరిపి పార్టీ అధ్యక్షునికి నివేదిక సమర్పిస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
చెట్టుకు ఉరివేసుకున్న ‘అనంత’ విద్యార్థి నెల్లూరులోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న మధువర్దన్‌రెడ్డి కదిరి: ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరి పేరు ఇంకా అందరి మదిలో మెదులుతూనే ఉంది... ఏపీలోని పొట్టి శ్రీరా ములు నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి మధువర్దన్‌రెడ్డి అదే భూతానికి బలయ్యాడు. పదోతరగతిలో 10కి 10 పాయింట్లు సాధించిన మధువర్దన్ను తమ కళాశాలలో చేరమని యాజమాన్యం కోరడంతో అక్కడ తనకు ఏ లోటూ ఉండదని భావించి చేరాడు. నెల రోజులు కూడా తిరక్కుండానే ర్యాగింగ్ భూతానికి బలయ్యాడు. ఆ విద్యార్థి తండ్రి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. అనంతపురం జిల్లా దొన్నికోటవారిపల్లికి చెందిన కాలువ రాజేశ్వరి, బ్రహ్మానందరెడ్డి దంపతుల రెండో కుమారుడు మధువర్దన్‌రెడ్డి టెన్త్‌లో 10కి 10 పాయింట్లు సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న నెల్లూరులో కళాశాల యాజమాన్యం... తమ కళాశాలలో ఇంటర్ చేరమని ఫోన్ చేసి కోరడంతో ఆ విద్యార్థి తండ్రి జూన్ 14న మధువర్దన్రెడ్డిని అక్కడ చేర్పించారు. అక్కడ స్లిప్ టెస్టుల్లో మధువర్దన్‌రెడ్డి టాపర్‌గా నిలవడం కొందరిని అసూయకు గురి చేసింది. ఈ విషయం వారు సీనియర్ విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లడంతో... జూలై 11న అర్ధరాత్రి సమయంలో మధును రక్తం కారేలా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. మధువర్దన్‌రెడ్డి ఈ విషయాన్ని కళాశాల క్యాంపస్ ఇన్చార్జ్ శ్రీరాములురెడ్డి, ప్రిన్సిపల్ కిరణ్‌ల దృష్టికి తీసుకెళ్లాడు. ఇలాంటివన్నీ లైట్ తీసుకోవాలని చెప్పి హాస్టల్ గదికి పంపేశారు. అయితే దీనిని అవమానంగా భావించిన మధు 12వ తేదీనే ఇంటికి వచ్చేశాడు. తండ్రి బ్రహ్మానందరెడ్డి ఫోన్‌చేసి అడిగితే యాజమాన్యం నుండి సరైన సమాధానం రాలేదు. కొత్తలో ర్యాగింగ్ లాంటివి మామూలే.. కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి.. అని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఇక ఆ కాలేజ్‌కు వెళ్లకూడదని, మరో కాలేజీలో చేరాలని మధు నిర్ణయించుకున్నాడు. అయితే 30వ తేదీన కళాశాల క్యాంపస్ ఇన్చార్జ్ శ్రీరాములురెడ్డి మధు తండ్రికి ఫోన్ చే సి.. ఇంకోసారి అలా జరక్కుండా జాగ్రత్త పడతాం. మీ అబ్బాయిని పంపండని కోరారు. అయితే మీరే మాట్లాడండని ఆయన ఫోన్ మధుకి ఇచ్చారు. సిగ్నల్స్ సరిగా రాకపోవడంతో మిద్దెపై కెక్కి మధు ఏం మాట్లాడాడో తెలీదు.. అరగంటకే తాను కాలేజ్‌కి వెళ్లేందుకు బట్టలు ఇస్త్రీ చేయించుకొస్తానని వెళ్లాడు. రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోయేసరికి రాత్రంతా గాలించారు. శుక్రవారం ఉదయాన్నే వారి మామిడితోట సమీపంలోనే ఆ విద్యార్థి తీసుకెళ్లిన ద్విచక్ర వాహనం నిలిపి ఉండటం గమనించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చుట్టూ వెదికితే సమీపంలోని మామిడిచెట్టుకు మధువర్దన్‌రెడ్డి ఉరేసుకొని వేలాడుతూ కన్పించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కుప్పకూలారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, నెల్లూరు జిల్లా పిడతాపోలూరులో ఉన్న ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి మధువర్ధన్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి శుక్రవారం ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సందర్శకుల గది, కళాశాల కిటికీలు, తలుపుల అద్దాలు ధ్వంసం చేశారు. కళాశాలకు సంబంధంలేదు: ప్రిన్సిపల్ మధువర్ధనరెడ్డి కళాశాలలో చేరినప్పటి నుంచీ ముభావంగా ఉన్నాడని, ఇక్కడ చదువుకోవడమే ఇష్టం లేదన్నట్టు వ్యవహరించాడని ప్రిన్సిపల్ కిరణ్ చెప్పారు. ఈ నెల 28న తండ్రితోపాటు కళాశాలకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చదువుకోనని గట్టిగా చెప్పాడని, కళాశాలను, గదిని ఖాళీ చేసి, ల గేజ్తోపాటు వెళ్లిపోయారని, ఈ ఘటనతో తమకు సంబంధం లేదన్నారు. -
'కీలక సమాచారం సేకరించాం'
గుంటూరు: ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో సమాచారం సేకరిస్తోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ బుధవారం యూనివర్సిటీ లో విచారణ ప్రారంభించింది. ఈ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం విద్యార్థులు, అధ్యాపకులు, యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సభ్యులతో సమావేశం అయింది. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విచారణను అవసరమైతే మరో 2 రెండు రోజులు పొడిగించే విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు.బుధవారం అధికారులతో మాట్లాడినపుడు కొంత కీలక సమాచారం సేకరించామన్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి రిషతేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు. ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తమను నేరుగా సంప్రదించవచ్చన్నారు. కాగా రెండోరోజు జరుగుతున్న విచారణకు పీడీఎస్‌యూ, ఎంఎస్ఎఫ్ ప్రతినిధులు హాజరయ్యారు. యూనివర్సిటీకి సెలవులు ప్రకటించి...విద్యార్థులు ఎవరూ లేకుండానే విచారణ పేరుతో అధికారులు కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కొన్ని విద్యార్థి సంఘాలు విచారణను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. -
‘‘నాన్నా ప్లీజ్ ఏడవకండి!’’
పోగొట్టుకున్న ఈ బంగారుతల్లి కోసం మనం... పోరాటం చేయలేమా! ► పువ్వులా, అప్పుడే విరిసిన హరివిల్లులా సప్త వర్ణాలను విరజిమ్మే నవ్వును హత్య చేశారు! ► విశ్వవిద్యాలయం అంటే సరస్వతి గుడి, చదువుల ఒడి అనే నమ్మకాన్ని హత్య చేశారు! ► ఆచార్యులు అంటే విద్యాబుద్దులనే కాదు, జాగ్రత్తల్నీ చెప్తారనే భరోసాను హత్య చేశారు! ► సీనియర్లంతా జూనియర్లను చేరదీసి, స్నేహం కలుపుకుంటారనే ఆశను హత్య చేశారు! ► క్యాంపస్‌లో, క్యాంటీన్లో, హాస్టల్లో స్నేహం గుబాళిస్తుందన్న అమాయకత్వాన్ని హత్య చేశారు! ► ఫ్రెషర్ అనే కైండ్‌నెస్ కూడా లేకుండా ర్యాగింగ్ చేసీ చేసీ మానవత్వాన్ని హత్య చేశారు! ► కనిపెంచిన అమ్మపై, నాన్నపై, చదువుతున్న చదువుపై పెంచుకున్న ప్రేమను హత్య చేశారు! ► బాగా చదివి, అమ్మానాన్నల్ని గొప్పగా చూసుకోవాలన్న ఆశయాన్ని హత్య చేశారు! ► ప్రేమదారిలోకి రానందుకు... తిరిగిరానిలోకాలకు తరలిపోయేలా వ్యక్తిత్వాన్ని హత్య చేశారు! ► కష్టమొస్తే చెప్పుకోలేనంతగా, కన్నీళ్లొస్తే మనసు విప్పుకోలేనంతగా ధైర్యాన్ని హత్య చేశారు! ► యూనివర్శిటీ అంటే నరకం తప్ప ఇంకోటి కాదు అనిపించేలా ఆత్మవిశ్వాసాన్ని హత్య చేశారు! ► ఉసురు తీసుకుంటూ కూడా సీనియర్స్‌ని ఒక్క మాటా అనని మంచితనాన్నీ హత్య చేశారు! ► రిషితేశ్వరిని ఇన్ని విధాలుగా హత్య చేశారు! నవ్వు!!! నవ్వు!!! నవ్వు!! ఈ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారు నాన్న. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వరంగల్ వదిలి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. ఇలా వచ్చిన నన్ను నా సీనియర్స్‌లో కొంతమంది చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. దాంతో నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేశారు. అవి వింటేనే నా మొహంలో నవ్వు మాయం అయిపోయేది. ఏడుపు కూడా వచ్చేది. నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు. కానీ ఇక్కడికి వచ్చాక దాయాల్సి వస్తోంది. చెప్తే ఏమైపోతారో అని భయంతో దాయాల్సి వస్తుంది. అలా నేను దాచినప్పుడల్లా నాకు నరకయాతన కనిపిస్తుంది.సీనియర్స్‌లో దీప, అవినాష్, లావణ్య, ప్రసాద్ వీళ్లు చేసిన హెల్ప్స్ నేను ఎప్పటికీ మరిచిపోలేను. నాన్నా వీళ్లకి ఒక్కసారి థాంక్స్ చెప్పండి. ఎప్పుడూ వీళ్లతో కాంటాక్ట్‌లో ఉండండి. నా ఆఖరి కోరిక ఒక్కటే... నా చావుకి కారణం ఎవరో వాళ్లకి తెలుసు. వాళ్లు వాళ్ల తప్పు తెలుసుకుంటే చాలు. ఇంక ఎవ్వర్నీ ఇలా (నాలా) బాధపెట్టకపోతే చాలు. ఏ అమ్మాయీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉండదు అని అనుకోవద్దు. యూనివర్సిటీ అంటేనే ఒక పెద్ద నరకం లాంటిది. ఏ తల్లిదండ్రులు పిల్లల్ని ఇంత ప్రేమగా పెంచరు. మీకు చెప్పలేక వాళ్లలో వాళ్లు దాచుకోలేక, వాళ్లకి నరకం కనిపిస్తుంది. అమ్మా నాన్న జాగ్రత్త. నాన్న ప్లీస్ ఏడవకండి. నేనెప్పుడూ మీ దగ్గరలోనే ఉంటాను. అమ్మా నువ్వు కూడా జాగ్రత్త డిప్రెషన్ ఈజ్ నాట్ ఏ సైన్ ఆఫ్ వీక్నెస్. ఇట్ మీన్స్ యు స్టేయ్డ్ స్ట్రాంగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఐ లవ్ యు మామ్. ఐ లవ్ యు డాడ్. ట్రై టు డొనేట్ మై ఆర్గాన్స్... ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ కండీషన్. డాడ్! నేను చేయవలసిన పనులు ఉన్నాయి. కొన్ని మీరు చేసేయండి. సీనియర్ లావణ్యకి ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ బుక్ కొనివ్వండి. రాజుకి రూ.350 ఇవ్వండి టి స్కేల్‌కి.. ప్రసాద్ సార్, ఇంకా జితేంద్రకి థాంక్స్ చెప్పండి. బై... ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ర్యాగింగ్ ఉరి బిగించింది! నిర్జీవమైన చదువుల తల్లి రిషితేశ్వరి గళ్ల చొక్కాలో ఉన్న ఆ అమ్మాయి కళ్లు పూర్తిగా మూత పడలేదు. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలని, అద్భుతంగా ఉండబోయే తన భవిష్యత్తును దర్శించాలని ఆశ పడుతున్న వాటిలా సగం సగంగా తెరుచుకునే ఉన్నాయి. ముగ్ధంగా అమాయకంగా ఉన్న ముఖం... కన్నవారు అపురూపంగా పెంచుకోవడం వల్ల వచ్చిన లావణ్యమైన రూపం... అవన్నీ జీవాన్ని కోల్పోయి కదలికను మానేసి తమ అచేతన నుంచి ఒక చేతనను లేవదీయడానికి సిద్ధమైనట్టుగా ఉన్నాయి. పద్దెనిమిదేళ్ల విద్యార్థిని రిషితేశ్వరి తను ప్రాణాలు కోల్పోయి... లక్ష ప్రాణాలతో వికటాట్టహాసం చేస్తున్న ఒక దుష్ట సంస్కృతి సంహారానికి పిలుపునిస్తూ ఉంది. దీనిని ఇంతటితో ఆఖరు చేయండి అని విన్నవిస్తూ ఉంది. చనిపోయే చివరి క్షణాలలో కూడా... తనకు అన్యాయం జరిగిందని తెలిసీ కూడా... ఆ పిలుపులో ద్వేషం లేదు. ప్రేమ ఉంది. సంస్కారం ఉంది. మనసులు, మనుషులు మారాలి అన్న కన్సర్న్ ఉంది. రిషితేశ్వరి మరణం ఈ వ్యవస్థను బోనులో నిలబెట్టింది. కుప్ప కూలిన పునాది! ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అంటే నిర్మాణ శాస్త్రం. తన భవిష్యత్తును ఆ చదువుతో నిర్మించుకుందామని నాగార్జున యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో చేరింది రిషితేశ్వరి. యూనివర్సిటీ అంటే చదువుల ఆలయం అనీ అక్కడ అందరూ చదువులో నిమగ్నమై ఉంటారని అనుకుంది. కాని మొదటి రోజే చేదు అనుభవం! హాస్టల్లో చేరిన రోజు రాత్రే కొంత మంది అమ్మాయిలు వచ్చి రూమ్ ఖాళీ చేయాలని అన్నారు. ఇది తమ రూమ్ అనీ తెల్లారే సరికల్లా ఖాళీ చేయకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని భయపెట్టారు. ‘వాళ్లు బెదిరించిన రోజే రిషి మాకు ఫోన్ చేస్తే తెల్లారే సరికల్లా వరంగల్ నుంచి గుంటూరు (పెదకాకాని)కి చేరుకున్నా’ అని చెప్పారు తండ్రి మురళీకృష్ణ. ‘ఇక్కడ ప్రిన్సిపాల్ తాము చెప్పిందే చేస్తాడు. స్టూడెంట్స్ తమ వర్గం వారే ఉంటారు. తమని కాదని ఎవరూ ఏమి చేయలేరు అని సీనియర్లు మా అమ్మాయిని భయపెట్టారు’ అని కూడా చెప్పారు. అయితే ఆ తండ్రి అప్రమత్తమైనట్టుగా ఆ యాజమాన్యం అప్రమత్తం కాలేదు. ఇలాంటి ర్యాగింగ్ పద్ధతులను నివారించడానికి ప్రయత్నించలేదు. ‘నేను మౌఖికంగా ఫిర్యాదు చేస్తే ప్రిన్సిపాల్‌గారు చూస్తామండీ అన్నారు. ఆయన దృష్టిలో చూస్తాను అంటే మీడియాలో రాకుండా చూస్తాను అని అర్థం. లోపల ఏం జరిగినా ఆయనకు పట్టదు. బయట గోల జరక్కుండా మీరు ఏదైనా చేసుకోండి అని ఒక వర్గం విద్యార్థులను ఇతర విద్యార్థుల మీదకు వదిలేసినట్టుగా అనిపించింది’ అని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ఆవేదనగా అన్నారు. పేరెంట్స్ మీటింగ్ లేదు! ఫ్రెషర్స్ వచ్చాక కాలేజ్‌లో అధికారికంగా ప్రెషర్స్ మీటింగ్ జరగాలి. రిషితేశ్వరి చేరాక అలాంటిదేమీ జరగలేదు. రిషితేశ్వరి చనిపోయాక ప్రిన్సిపాల్ హడావిడిగా కొంతమంది పేరెంట్స్‌నీ టెంపరరీ ఫ్యాకల్టీని పిలిపించి ఏదో అయ్యిందంటే అయ్యింది అనిపించారు. ‘ఆ మీటింగ్ గురించి నాకు చెప్పకపోయినా నేను వెళ్లాను. యూనివర్సిటీలో ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉందో, మా అమ్మాయి ఎలా ఆ నరకం అనుభవించిందో చెప్పాను. టెంపరరీ ఫ్యాకల్టీ దీనిని ఖండించారు. అయితే నేను పర్మినెంట్ ఫ్యాకల్టీలో ఉన్న ఒక అధ్యాపకుణ్ణి పిలుచుకువస్తే ఆయన నా వాదనను సమర్థించి తన ఉద్యోగం పోయినా సరే రిషితేశ్వరికి న్యాయం జరగాలని అందరి ముందూ ప్రకటించారు. ఆ తర్వాత ఆ అధ్యాపకుణ్ణి టెర్మినేట్ చేసినట్టు పేపర్లో చదివాను. ఇంత దారుణంగా సత్యాన్ని తొక్కేయడం ఎక్కడా చూడలేదు’ అని మురళీకృష్ణ అన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌కు ఉంది... భోజనానికి లేదు... మురళీకృష్ణ, దుర్గాబాయి దంపతులకు రిషితేశ్వరి ఒక్కర్తే అమ్మాయి. పిల్లలు తల్లిదండ్రుల్లో ఒకరితో ఎక్కువగా చనువుగా ఉంటారు. అలా రిషితేశ్వరికి తండ్రి దగ్గర చనువు ఎక్కువ. ప్రతిదీ తండ్రితో పంచుకునేది. ఆయన గొంతు వినకుండా ఏ రోజూ రిషితేశ్వరికి గడవలేదు. జూలై 14న ఉదయం కూడా తండ్రికి కాల్ చేసింది. బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళుతున్నా నాన్నా... అని చెప్పింది. అవే ఆమె ఆఖరి మాటలు అని తండ్రి ఊహించలేదు. ఆయన ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఒంటిగంట ప్రాంతంలో వాట్సప్‌లో మెసేజ్ వచ్చింది. కూతురి నుంచే. అలా ఎప్పుడూ ఆ టైమ్‌లో రిషితేశ్వరి మెసేజ్ పెట్టి ఎరగలేదు. ఓపెన్ చేస్తే ‘ఐ లవ్ యూ నాన్నా’... అని ఉంది. మరికొద్ది సేపటికే యూనివర్సిటీ నుంచి ఫోన్. రిషితేశ్వరి చనిపోయిందని. రోజూ భోజనానికి మెస్‌లో కనిపించాల్సిన రిషితేశ్వరి కనిపించకపోయేసరికి రూమ్మేట్స్ రూమ్‌కి వెళ్లి చూశారు. అప్పటికే ఆ నిండు ప్రాణం... స్నేహం, సామరస్యం, సమభావన అనే క్షుద్బాధను అనుభవిస్తూ లోకం నుంచి వీడ్కోలు తీసుకుంది. ఏం జరిగింది? ఒక స్నేహితురాలు ఇద్దరు అబ్బాయిలను పరిచయం చేసింది. పరిచయం చేసిన ఆ అబ్బాయిలు ఎప్పుడూ ప్రిన్సిపల్ వెంట కనిపించేవారని తెలుస్తోంది. వారితో స్నేహం రానురాను ఇబ్బందిగా భారంగా మారిందని, ఆ ఒత్తిడి భరించలేకే రిషితేశ్వరి ప్రాణం తీసుకుందని స్నేహితుల ద్వారా తెలుస్తోంది. చివరి క్షణాలు రిషితేశ్వరికి డైరీ రాయడం అలవాటు. ఆమె తనకు నచ్చిన, నచ్చని విషయాలు డైరీ రాసుకుంటుంది. చనిపోయే ముందు కూడా ‘మై లాస్ట్ నోట్స్’ పేరుతో ఆ డైరీలోనే మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. ‘నవ్వడం నాకు ఇష్టం. నవ్వుతూ ఉండటం నాకు ఇష్టం’ అని మొదలయ్యే ఆ నోట్... యూనివర్సిటీ జీవితం నరకప్రాయం అయ్యి నవ్వాలంటే భయపడే స్థితికి ఆమె ఎలా చేరుకుందో తెలుపుతోంది. తల్లినీ తండ్రినీ ఉద్దేశిస్తూ వాళ్లేమేం పనులు చేయాలో రాసిన రిషితేశ్వరి... తండ్రి తన ముగ్గురు ప్రాణమిత్రులకు చేయవలసిన సాయాన్ని కూడా తెలిపింది. అయితే ఆమె తన చావుకు కారణమైనవారి పేర్లను రాయలేదు. ‘ఈ పరిస్థితికి కారకులెవరో వారికి నా చావు కనువిప్పు కావాలి’ అని రాసింది. పాఠ్యాంశాలను రాయాల్సిన చేతులు మరణవాంగ్మూలాన్ని రాయాల్సి రావడమే అతి పెద్ద విషాదం. ఆత్మహత్య... కాదు హత్య... ఇది ఆత్మహత్య అని భావిస్తున్నవారు ఎందరున్నారో, హత్య అని అనుమానపడుతున్నవారు కూడా అంతేమంది ఉన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించినవారు అక్కడ అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదనీ, గది ఎత్తునూ, ఫ్యాన్ వేలాడుతున్న ఎత్తునూ పరిశీలిస్తే అంత ఎత్తున ఉన్న ఫ్యాన్‌కు చున్నీని వేలాడగట్టుకోవడం చాలా కష్టమనీ అభిప్రాయపడుతున్నారు. మెడపై చున్నీ నలిగిన గుర్తులు కూడా లేవని చెబుతున్నారు. రిషితేశ్వరి రాసే డైరీ తప్ప ఆమె పుస్తకాలు కూడా అదృశ్యమయ్యాయి. ‘సూసైడ్ నోట్లో ఉన్న రాత మా అమ్మాయిదే. అయితే మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు’ అని తండ్రి మురళీకృష్ణ అంటున్నారు. ‘హత్య అయినా ఆత్మహత్య అయినా నా కూతురి ప్రాణం పోయింది మాత్రం ర్యాగింగ్ వల్లనే. ముందు అది చావాలి. తర్వాత నా కూతురి చావుకు కారణమైనవారికి శిక్ష పడాలి’ అని ఆయన అన్నారు. ఆ మాట అన్నప్పుడు ఆయన కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. అయితే అవి పోయిన తన కూతురి కోసం మాత్రమే అనిపించలేదు. ఇప్పుడు చదువుతున్న లక్షలాదిమంది ఆడపిల్లల కోసం కూడా అనిపించాయి. కలిసిన గొంతులు రిషితేశ్వరి మరణం అప్పటికప్పుడు దావానలంలా వ్యాపించలేదు. కార్చిచ్చులా సమస్తాన్ని దహించేయలేదు. కానీ అది మెల్లమెల్లగా రాజుకున్న మహా అగ్నిధారలా ఇవాళ సమస్త సమాజిక అంతరాల్లో ప్రశ్నను లేవదీస్తోంది. ‘ఇవాళ రిషితేశ్వరి... రేపు మన ఇంటి ఆడపిల్లే కావచ్చు’ అనే నినాదంతో ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో విపరీతమైన నిరసన కొనసాగుతూ ఉంది. ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ రిషితేశ్వరి మరణానికి జవాబు అడిగేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ ఉంది. - సాక్షి ఫ్యామిలీ టీమ్ మిస్ పర్ఫెక్ట్: ‘‘రిషితేశ్వరి మంచి స్టూడెంట్. తన పనేదో తాను చూసుకొనేది. ప్రతిభ, నిజాయతీ లాంటి గుణాలను ఆమెలో చూసిన సీనియర్లు రిషితేశ్వరికి ఈ ఏడాది ‘మిస్ పర్ఫెక్ట్’ టైటిల్ కూడా ఇచ్చారు.’’ - జి. సాయిదీప, బీఆర్క్ సెకండియర్, రాజమండ్రి ఆ అమ్మాయికి నాన్నే సర్వస్వం: ‘‘రిషితేశ్వరిది ఫ్రెండ్లీ నేచర్. ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళ నాన్నకు చెప్పుకొనేది. ఎవర్నీ హర్ట్ చేయదు. ఏదన్నా అంటే, గట్టిగా జవాబిచ్చే ఆమె ఆత్మహత్య చేసుకుందంటే, నమ్మశక్యం కావడం లేదు.’’ - పి. అవినాశ్, బీఆర్క్ థర్డ్ ఇయర్, రాజంపేట చాలా సెన్సిటివ్: ‘‘రిషితేశ్వరి చాలా సెన్సిటివ్. ర్యాగింగ్‌తో ఇబ్బంది పడుతున్నానని మాతో అన్నప్పుడు చాలా సింపుల్‌గా తీసుకున్నాం. ఇలా అవుతుందనుకోలేదు. క్యాంటీన్‌కు వెళ్ళినప్పుడు తాను తినకుండా మా కోసం ఎదురుచూసిన రోజులు గుర్తొస్తున్నాయి.’’ - దుర్గాప్రసాద్, బీఆర్క్ సెకండ్ ఇయర్, కర్లంపూడి భయమే ఈ ప్రభుత్వ సందేశమా? రిషితేశ్వరి ఆత్మహత్య లేఖ ఉన్నా కేసును అటకెక్కించారు: జగన్ హైదరాబాద్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రిషితేశ్వరి రాసిన ఆత్మహత్య లేఖ ఉన్నప్పటికీ.. ఈ ఘటనకు బాధ్యులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టకుండా అటకెక్కించటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో.. విద్యార్థులు, వారి తల్లితండ్రులు భయం భయంగా బతకాల్సిందేనన్నదే ఈ ప్రభుత్వం ఇస్తున్న సందేశమా? అని ప్రశ్నించారు. ‘‘మన నాగరిక సమాజానికి, మన భవిష్యత్తు తరాల వారికి, మన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఇస్తున్న సందేశం ‘భయమే’నా? రిషితేశ్వరి ఉదంతంలో విస్పష్టమైన సూసైడ్ నోట్ (ఆత్మహత్య లేఖ) ఉన్నా కూడా.. ఈ ఘోరమైన సంఘటనను కోల్డ్ స్టోరేజీకి పంపించటం చాలా బాధాకరం.. చాలా దుఃఖకరం’’ అంటూ జగన్ ట్విటర్ వ్యాఖ్యల్లో ఆవేదన వ్యక్తం చేశారు. బాబుగారూ... ఎక్కడున్నారు? నాడు ఇదే నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో భారీగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ నవ్యాంధ్రను నిర్మిస్తానని నారా చంద్రబాబు నాయుడు ప్రతిన చేశారు. నేడు అదే నాగార్జున యూనివర్సిటీలో భవిష్యత్తును నిర్మించుకోడానికి ఆర్కిటెక్చర్ కోర్సులో చేరి, ర్యాగింగ్ భూతానికి బలైపోయిన రిషితేశ్వరి మరణంపై స్పందించకపోగా, ఆమె తల్లితండ్రులకు కనీస సానుభూతిని కూడా ప్రకటించలేకపోయారు చంద్రబాబు! ⇔ఆమె డైరీ వెల్లడిస్తున్న గుండెను పిండేసే అంశాలు... రిషితేశ్వరి డైరీ అందరి గుండెలను పిండి వేసే అంశాలను వెల్లడించింది. పోలీసులు ఆ డైరీని ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. పాఠకులకు ‘ది హిందూ’ దినపత్రిక ఈ విషయాలను ప్రత్యేకంగా అందించింది. రిషితేశ్వరి రాసిన ప్రకారం విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న పార్టీలో ఫైనల్ ఇయర్ విద్యార్థి మద్యం తాగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థి ధోరణి ఎంతగా బాధించిందంటే ‘‘అప్పుడే నాకు చచ్చిపోవాలనిపించింది’’ అని ఆమె రాసుకుంది. - ‘ది హిందూ’ కథనం, 25 జూలై 2015 ⇔ఆత్మహత్య కేసుపై ఆగని నిరసనలు... రిషితేశ్వరి ఆత్మహత్యతో సంబంధం ఉందనే ఆరోపణపై కాలేజ్ ప్రిన్సిపాల్ జి. బాబూరావు సస్పెండ్ అయినా క్యాంపస్‌లో నిరసనల వెల్లువ ఆగలేదు.ఆత్మహత్యకు కారకులైన వారి మీద ఇంకా చర్యలు తీసుకోనందుకు యూనివర్శిటీ అధికారులకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ శుక్రవారం నాడు స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు వైస్ చాన్సలర్ చాంబర్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్చేస్తేనో.. అతని రాజీనామా అంగీకరిస్తేనో సరిపోదని... ఇంతటి హేయమైన నేరానికి పాల్పడిన అతనిని జైలుకి పంపాలని డిమాండ్ చేశారు. - ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం, 25 జూలై 2015 ⇔ర్యాగింగ్ శక్తులపై నిరసన... ‘‘...నిరసనలు పెరగడంతో, పరిస్థితిని అదుపులో ఉంచడం కోసం నాగార్జున విశ్వవిద్యాలయం అధికారులు పది రోజులు సెలవులు నిర్ణయించారు. ...ర్యాగింగ్ కేసులో నిందితులైన విద్యార్థులనూ, అధికారులనూ కాపాడడం కోసమే తరగతులు రద్దు చేసి, సెలవులు ప్రకటించారని పి.డి.ఎస్.ఒ. రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె. బాజీ సైదా, ఎస్.ఎఫ్.ఐ. నాగార్జున యూనివర్సిటీ కమిటీ ప్రెసిడెంట్ డి.ఏసురాజు తదితర నేతలు ఆరోపించారు...’’ - ‘దక్కన్ క్రానికల్’ కథనం, 26 జూలై 2015 ⇔ రిషితేశ్వరి మరణం: ఆత్మహత్యా? హత్యా? ‘‘రిషితేశ్వరి డైరీని బట్టి... సీనియర్లు రెగ్యులర్‌గా రిషితేశ్వరిని హింసించేవారని అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ...విద్యార్థుల నుంచి డబ్బులు పోగుచేసి, ప్రిన్సిపాల్ క్రమం తప్పకుండా పార్టీలు నిర్వహిస్తుంటారని యూనివర్సిటీ స్టూడెంట్లు ఆరోపించారు. విద్యార్థినులతో కలసి ప్రిన్సిపాల్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాల వీడియోను వారు అందించారు. రిషితేశ్వరి వ్యవహారం గురించి చాలాసార్లు ఆయనకు చెప్పినా, స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు.’’ - ‘మెట్రో ఇండియా’ కథనం, 26 జూలై 2015 విద్యార్థులు లేకుండా విచారణలా? రిషితేశ్వరి చనిపోయాక విద్యార్థులకు పదిరోజులు సెలవులిచ్చి ఆ తరువాత కమిటీలు వేశారు. విద్యార్థులు లేకుండా కమిటీ ఎవరిని విచారిస్తుంది? కళాశాలలు మళ్లీ మొదల య్యాక విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక అందించాలి. గతంలోనూ యూనివర్సిటీలో అనేక కమిటీలేశారు. ఏ కమిటీ ద్వారా సక్రమంగా న్యాయం జరిగిన దాఖలాలు లేవు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి. - పవన్, ఎస్ఎఫ్ఐ నాయకుడు ప్రిన్సిపాల్‌ను రక్షించే ప్రయత్నం రిషితేశ్వరిది ఆత్మహత్యేనని యూనివర్సిటీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఘటన వెనుక కారణాలను కప్పిపుచ్చేందుకే కమిటీ ఇలా నివేదికలు ఇస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. యూనివర్సిటీ ప్రక్షాళన పేరుతో ఈ కేసులో వాస్తవాలు చెబుతున్నవారిని బెదిరిస్తున్నారు. సస్పెండ్ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. - వెన్నెల, విద్యార్థి జేఏసీ నాయకురాలు మాట్లాడితే బెదిరిస్తున్నారు ప్రభుత్వం నియమించిన కమిటీ తనకు అనుకూల వర్గాల వాదనను విని, అదే ప్రభుత్వానికి నివేదించే కుట్ర జరుగుతోంది. ఈ కమిటీతో మృతురాలికీ, న్యాయం కోసం పోరాడుతున్న స్టూడెంట్స్‌కూ ఎలాంటి న్యాయమూ జరగదు. కమిటీ ముందు ఎవరైనా మాట్లాడుతుంటే వారిని వివిధ రకాలుగా బెదిరిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును ఎందుకు అరెస్టు చేయరో చెప్పాలి. బహిరంగంగా న్యాయ విచారణ జరపాలి. - షేక్ బాజీసైదా, విద్యార్థి జేఏసీ కన్వీనర్ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. నాతోపాటు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించి, క్షుణ్ణంగా విచారణ జరిపి ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రెవెన్యూ, పోలీసు, యూనివర్సిటీ అధికారులతో సమావేశమై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తాం. - బాలసుబ్రహ్మణ్యం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ -
ర్యాగింగ్ రోగ్ గేమ్
ఒక స్టూడెంట్‌ని ఎవరైనా కొడితే మొత్తం స్టూడెంట్ ప్రపంచం తిరగబడుతుంది. అదీ యూత్‌లో ఉన్న యూనిటీ. ఒకరికోసం ఒకరు ప్రాణం కూడా ఖాతరు చేయకుండా ఫైట్ చేస్తారు. మరి ఆ స్టూడెంట్సే... ఫ్రెషర్స్ మీద రెచ్చిపోతుంటే..! కాపాడాల్సిన చేతులే గొంతు పిసికేస్తుంటే... ఏం చెయ్యాలి? పేరెంట్స్ ఏం చెయ్యాలి? సీనియర్లను పేరెంట్స్ మందలించాలా? ఫ్రెషర్లకు పేరెంట్స్ ధైర్యం చెప్పాలా? ర్యాగింగ్ ఆటగా మొదలైనా... క్రైమ్ గానే ఎండ్ అవుతుంది. ర్యాగింగ్ ఈజ్ ఫర్ క్రిమినల్స్. నాట్ ఫర్ స్టూడెంట్స్. శృతి మించి ఇటీవల విశాఖ నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో సీనియర్, జూనియర్ విద్యార్థులు అర్ధరాత్రి కొట్లాటకు దిగారు. ఈ గొడవ మొదట ఓ సీనియర్ విద్యార్థి జూనియర్ని ర్యాగింగ్ చేయడంతో మొదలైంది. ఈ ఘటనలో పదిమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. అంతకు మించి వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రిషితేశ్వరి గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్శిటీలో డిగ్రీ (ఆర్కిటెక్చర్) ఫస్టియర్‌లో చేరింది. ఇద్దరు తోటి విద్యార్థినులతో కలిసి వర్సిటీలోని హాస్టల్లోనే ఉంటోంది. కాలేజీకి వెళ్లి వచ్చే సమయంలో సీనియర్ స్టూడెంట్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తట్టుకోలేక ఎదురు తిరిగింది. సీనియర్‌కు ఎదురు తిరిగినందుకు అదే గ్రూప్‌లో ఉన్న ఓ సీనియర్ విద్యార్థిని ఆమెకు సరైన పనిష్మెంట్ ఇవ్వాలనుకుంది. హాస్టల్ గదిలో రిషితేశ్వరిని అర్ధనగ్నంగా తిప్పి, ఆ దృశ్యాలను వీడియో తీసిందని, వాటిని సీనియర్స్‌కి చూపించిందని, ఆ అవమానం భరించలేకే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ర్యాగింగ్ చేసినవారికి తన మరణం కనువిప్పు కావాలని సూసైడ్ నోట్లో పేర్కొంది రిషితేశ్వరి. నిన్నమొన్న జరిగిన ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను, తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. రాష్ట్రవ్యాప్త నిరసనలూ మొదలయ్యాయి. కాలేజీ వర్సెస్ కాలేజీ పది రోజుల కిందట విశాఖలో రెండు ప్రైవేట్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈవ్‌టీజింగ్ ఇష్యూతో రోడ్డు మీదకెక్కారు. మా కాలేజీవారినే ర్యాగింగ్ చేస్తారా...!! అంటూ గొడవకు దిగారు. పరిచయాలతో మొదలైన ర్యాగింగ్... చివరికి వేర్వేరు కళాశాలల విద్యార్థుల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. నిజానికి విద్యాలయాలలో ర్యాగింగ్ అన్నది కొన్నేళ్లుగా కనుమరుగైందని అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులూ నిశ్చింతగా ఉన్నారు. కానీ, తాజాగా ఇప్పుడు చోటుచేసుకున్న ఈ సంఘటనలు అందరినీ మళ్లీ భయంలో, ఆవేదనలో ముంచెత్తాయి. ఆ రోజుకు కాలేజీ నుంచి తమ బిడ్డ క్షేమంగా ఇంటికి చేరుకుంటే చాలని ఫ్రెషర్స్ పేరెంట్స్ భయపడే పరిస్థితి మళ్లీ వచ్చింది! పలకరింపులు... పరిచయాలు ఫ్రెషర్స్ వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వారికీ, సీనియర్లకు సమన్వయం ఉండాలని అధ్యాపకులు చెప్పే సూచనల మేరకు పరిచయాలు, పలకరింపులు ఒక సంప్రదాయం అయ్యాయి. ఇంజినీరింగ్ విద్యా సంస్థలు పెరిగిన తర్వాత ఈ సంప్రదాయం మరింత విస్తరించింది. సీనియర్లకి జూనియర్లు ఇచ్చే గౌరవం క్రమంగా వారికి అవకాశంగా మారింది. దీంతో కొందరు ఆకతాయి సీనియర్లు అసభ్యంగా ప్రవర్తించడం, జూనియర్లతో అన్ని పనులు చేయించుకోవడం, చెప్పినట్టు వినకుంటే బెదిరించడం చేస్తున్నారు. చివరికి మానసికంగా, శారీరకంగా హింసించే స్థాయికీ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఎదురయ్యే వేధింపులు భరించలేక ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. పదేళ్లుగా... సీరియస్ యాక్షన్! కేంద్ర ప్రభుత్వం కళాశాలలో జరిగే అకృత్యాలను సీరియస్‌గా తీసుకొని ర్యాంగింగ్ నిరోధక చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ర్యాగింగ్ భూతం తన ఉనికి కోల్పోతూ వచ్చింది. చట్టానికి భయపడి సీనియర్లు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లు చేయడం తగ్గించారు. అయితే, మళ్లీ కొన్ని రోజుల కిందట తెలుగు రాష్ట్రాలలో ర్యాగింగ్ రూపం మార్చుకొని కలత చెందేలా చేస్తోంది. తిరుగుబాటు... పరిచయాల పేరుతో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తే కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులు భరించే స్థితిలో లేరు. సీనియర్లు అయితే ఏంటి? వేధిస్తే సహించాలా? అని ఎదురు తిరుగుతున్నారు. దీనిని భరించలేని సీనియర్లు వారి మీద దాడులకు దిగుతున్నారు. అదే సమయంలో జూనియర్స్ కూడా సీనియర్స్ మీద తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. కొన్ని ప్రాంతాలలో అయితే కాలేజీలు ఒకే చోట ఉంటున్నాయి. దీంతో వేర్వేరు కళాశాల విద్యార్థుల మధ్య మాటల యుద్ధం, ఈవ్ టీజింగ్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల్లో కళాశాల విద్యార్థులు గొడవలకు దిగుతూ రోడ్ల మీదనే కొట్లాడుకుంటున్నారు. మా కాలేజీ అమ్మాయిని కామెంట్ చేసావని ఒకరు, మా కాలేజీ స్టూడెంట్‌ని కొడతావా అంటూ మరొకరు... గొడవలకు దిగుతూ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇవన్నీ ‘రోగ్ గేమ్’లో భాగమే ► అశ్లీల పాటలు పాడించడం, అశ్లీల నృత్యాలు చేయించడం, ముద్దుపెట్టుకోమనడం... వంటివి. ► శారీరకంగా, మానసికంగా హింసించడం.. హింసకు సహ విద్యార్థులను ప్రేరేపించడం. ► విద్యార్థి చదువుపై ప్రభావం చూపిస్తూ అకడమిక్ యాక్టివిటీస్‌కు అంతరాయం కల్గించడం. ► జూనియర్స్ని సీనియర్ విద్యార్థులు తమ అకడమిక్ టాస్క్‌ని పూర్తి చేయాలని బలవంతం చేయడం. ► బలవంతంగా ఆర్థిక భారం పడేట్టు చేయడం. ► మాటల ద్వారా గానీ, మెయిల్స్, సందేశాల రూపంలోగాని, ఫోన్ ద్వారా గానీ టార్చర్ పెట్టడానికి ప్రయత్నించడం. పేరెంట్స్... ఇవి మీ కోసం ►ఇంట్లో సీనియర్ విద్యార్థి ఉంటే కాలేజీ అడ్మిషన్స్‌కు నెల రోజుల ముందు నుంచే వారితో- వేధించడం వల్ల జూనియర్స్‌కి కలిగే ఆవేదన, దాని వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించాలి. ►కొత్తగా కాలేజీకి వెళ్లే విద్యార్థి ఉంటే సీనియర్స్ నుంచి ఎదురయ్యే పరిణామాలు, వాటి నుంచి ఎలా బయటపడాలో జాగ్రత్తలు తెలియజేయాలి. ►సినిమాలలో ర్యాగింగ్ సన్నివేశాలు ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ నిజజీవితాల్లో మాత్రం అలాంటి ఆనందాలు విషాదాలు నింపుతున్నాయి. చదువు మనిషిని ఉన్నతంగా మార్చాలి. అందుకు ఆటంకంగా నిలిచే ర్యాగింగ్ విషసంస్కృతికి నేడే చెక్ పెడదాం. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి రేప్‌తో సమానమైన కేసు! 1980 నుంచి ర్యాగింగ్ కేసులు నమోదు అవుతున్నా 1995 తర్వాత ఎక్కువ అవడంతో... డాక్టర్ రాఘవన్, యు.జి.సి ప్రొఫెసర్ కె.టి.ఎస్ ఉన్ని కమిటీ ఆధ్వర్యంలో... రేప్, అట్రాసిటీకి సమానమైన కేసుగా ర్యాగింగ్‌ను పరిగణించాలన్నారు. కోర్టులో నేరం రుజువైతే ఆ నేరాన్ని బట్టి 3 ఏళ్లకు పైగా జైలు శిక్ష, 25 వేల రూపాయలు ఆపైన జరిమానా ఉంటాయి. ఏడాది-నాలుగేళ్ల వరకు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడం, ఇతర కాలేజీలలో ఎక్కడా అడ్మిషన్ ఇవ్వకపోవడం జరుగుతుంది. స్కాలర్షిప్ కూడా రద్దు చేస్తారు. పాస్‌పోర్ట్, వీసా.. వంటివీ క్యాన్సిల్ చేస్తారు. - నిశ్చల సిద్ధారెడ్డి, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ విజిలెన్స్ కమిటీలు జూనియర్లను స్వాగతించే సంస్కృతి సీనియర్ విద్యార్థుల్లో పెరగాలి. తోటి విద్యార్థులను గౌరవించడం నేర్చుకోవాలి. ర్యాగింగ్ నిరోధించేందుకు మా కళాశాల ప్రాంగణంలో, ప్రతి బ్లాక్‌లో కంట్రోల్ రూమ్ ప్రారంభించాం. హాస్టళ్ల వద్ద విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేశాం. ప్రత్యేక విచారణ కమిటీ వే శాం. ర్యాగింగ్‌కు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. నిత్యం పర్యవేక్షిస్తున్నాం. - జి. ఏసురత్నం, ప్రిన్సిపాల్ జేఎన్‌టియూ, విజయనగరం కౌన్సెలింగ్ మేలు! గతంలో సీనియర్స్ చేత వేధింపబడిన, మానసిక అపసవ్యత కలిగిన విద్యార్థులు తమకంటే చిన్నవారిని వేధించి, ఆనందించాలనుకుంటారు. వారు పెరిగిన వాతావరణం కూడా ఇందుకు దోహదం చేస్తుంది. ర్యాగింగ్ చేస్తారేమో అని జూనియర్స్ భయపడకుండా, ర్యాగింగ్ చేయాలనే తలంపు సీనియర్స్‌లో కలగకుండా కౌన్సెలింగ్ ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చు. - డా. సూర్యనారాయణ, సైకాలజిస్ట్ మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారా? కళాశాలలో ర్యాగింగ్ కారణంగా ఎన్నో దారుణ సంఘటనలు, మరణాలను గుర్తించిన సుప్రీం కోర్టు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో 2009లో నేషనల్ యాంటీ-ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ర్యాగింగ్‌కు గురయ్యే విద్యార్థులు... helpline@antiragging.in కు లాగిన్ అయ్యి, కంప్లైంట్ చేయవచ్చు. హెల్ప్‌లైన్ నెంబర్: 1800-180-5522 {పతి 15 నిమిషాలకు ఒక ఫిర్యాదు అందుతున్నట్టు హెల్ప్‌లైన్ ద్వారా తెలుస్తోంది. 2012లో antiragging.in అనే మరో పోర్టల్‌ను ప్రారంభించారు. ిఫిర్యాదు అందిన 24 గంటల నుంచి 48 గంటల్లోగా సదరు విద్యార్థికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతారు. ఉన్నత విద్యాసంస్థల బాధ్యతలు ► {పతి కళాశాల యాజమాన్యం విద్యార్థిని చేర్చుకునేముందు తప్పక ఇన్స్ట్రక్షన్ బుక్లెట్/బ్రోచర్ అందజేయాలి. ► యాంటీ-ర్యాగింగ్ హెల్ప్‌లైన్ నెంబర్, మెయిల్ ఐడి, ఇతర ఫోన్ నెంబర్లు విధిగా ఆ నిబంధనల బుక్‌లెట్‌లో ఉండాలి. ► ఆ నెంబర్లను బుక్‌లో నోట్ చేసుకోమని విద్యార్థులకు తెలియజేయాలి. ఏ చిన్న అవాంతరం ఎదురైనా సమాచారాన్ని చేరవేయమని సూచించాలి. ► ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్య తీసుకోవచ్చని విద్యార్థి తల్లిదండ్రుల చేత ఒక అఫిడవిట్‌ను తీసుకోవాలి. ► ర్యాగింగ్‌కు పాల్పడితే జరగబోయే నష్టాలు, తీసుకునే చట్టపరమైన శిక్షలను సూచిస్తూ కాలేజీల్లో డిస్ప్లే పోస్టర్లను అతికించాలి. ► కాలేజీల్లోనూ, హాస్టళ్లలోనూ ముందు కొన్ని నెలల పాటు యాంటీ-ర్యాగింగ్ స్క్వాడ్‌ను తప్పక నియమించాలి. తప్పనిసరి... ► జూనియర్స్-సీనియర్స్‌కి మధ్య కాలేజీ టైమింగ్స్ కనీసం 30 నిమిషాలైనా తేడా ఉండాలి. బస్‌స్టాప్స్, టీ స్టాల్స్ దగ్గర విద్యార్థులు గుమికూడుతుంటారు. కాలేజీ స్టార్ట్ అవడానికి అరగంట ముందు, కాలేజీ వదలిన అరగంట వరకు స్క్వాడ్స్ అక్కడ ఉండాలి. ► ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ గుమిగూడకుండా చూడాలి. ► కాలేజీలో డ్రాప్‌బాక్స్ తప్పక ఉంచాలి. ► {పతి ఐదుగురికి ఒక లీడర్ని పెట్టి, వారితో ఫ్యాకల్టీ టచ్‌లో ఉండాలి. ► వేధింపులకు లోనైన సీనియర్స్ చేత జూనియర్ మీట్ పెట్టించాలి. ర్యాగింగ్ కమిటీలో సీనియర్ లీడర్స్, జూనియర్ లీడర్స్ తప్పక ఉండాలి. ► హాస్టల్లో అయితే సీనియర్స్ ప్రమేయం లేకుండా ఫ్రెషర్స్ కోసం సెపరేట్ బ్లాక్‌ను కేటాయించాలి. -
ర్యాగింగ్ అంతంతోనే ఆమె ఆత్మకు శాంతి
ఏఎన్‌యూ (గుంటూరు జిల్లా): విద్యార్థుల జీవితాలను బలి చేస్తున్న ర్యాగింగ్, వేధింపులపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు కదం తొక్కారు. యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వారు భారీ ర్యాలీ నిర్వహించారు. రిషితేశ్వరి ఆత్మహత్యనూ, తమలో ఒకరిగా ఆ విద్యార్థిని గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తీవ్ర ఆవేదన, ఆగ్రహాలు వ్యక్తం చేశారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘాలన్నీ కలిసి విద్యార్థి జేఏసీగా ఏర్పడి తరగతులను బహిష్కరించారు. యూనివర్సిటీలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి, రిషితేశ్వరి మృతికి కారకులైన వారందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ర్యాగింగ్‌ను అంతమొందిస్తామని, అలా రిషితేశ్వరికి ఆత్మకు శాంతి కలిగిస్తామని నినదించారు. ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేయాలని, వసతి గృహాల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల డిమాండ్ మేరకు వారి వద్దకు వచ్చిన ఇన్చార్జి వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ.. ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి పూర్తిగా తప్పించామని తెలిపారు. ఘటనపై న్యాయవిచారణ జరపడం, ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయటంపై ప్రభుత్వాన్ని సంప్రదించి వచ్చే సూచనల మేరకు నడుచుకుంటామని తెలిపారు. దీనికి సంతృప్తి చెందిన విద్యార్థులు వీసీ వీటిపై నిర్ణయం చెప్పిన తరువాత తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పి వెనుదిరిగారు. స్పందించిన న్యాయసేవాసాధికార సంస్థ.. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై న్యాయసేవా సాధికార సంస్థ స్పందించింది. సంస్థ కార్యదర్శి జి.లక్ష్మీనరసింహారెడ్డి ఈ కేసును సుమోటోగా తీసుకొని విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విభాగం ప్రిన్సిపాల్, వార్డెన్లకు నోటీసులు జారీ చేశారు. రిషితేశ్వరి మృతిపై వివరణ ఇచ్చేందుకు వారిద్దరూ ఆగస్టు 1న సంస్థ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నిజనిర్ధారణ కమిటీతో మాట్లాడటానికి ఇష్టపడని రిషితేశ్వరి తల్లిదండ్రులు.. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై నాగార్జున యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీతో మాట్లాడటానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు. కూతురిని కోల్పోయిన ఆవేదనలో ఉన్నవారికి వర్సిటీ కమిటీపై విశ్వాసం లేనట్టుగా తెలుస్తోంది. ఇలాంటి కమిటీలతో ప్రయోజనం ఉండదని తమ కుమార్తె మృతిపై న్యాయ విచారణ జరగాలని వారు కోరుతున్నారు. వర్సిటీ ఏర్పాటు చేసే కమిటీలు నిజాలను నీరుగారుస్తాయి తప్ప వాటితో మరో ప్రయోజనం ఉండదని ఏఎన్‌యూ పోకడలను పరిశీలిస్తున్న వారు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. -
వేదన..రోదన !
♦ కళాశాలల్లో మళ్లీ ర్యాగింగ్ మహమ్మారి ♦ విద్యార్థిని రిషికేశ్వరి మృతితో బహిర్గతం ♦ కాగితాలకే పరిమితమైన యాంటీ ర్యాగింగ్ కమిటీలు ♦ ఉదాశీనంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు సాక్షి, గుంటూరు : జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతోపాటు పలు కళాశాలల్లో ర్యాగింగ్ మహమ్మారి తిరిగి జడలు విప్పుతోంది. తాము చెప్పినట్టు వినాల్సిందేనంటూ సీనియర్లు వేధింపులకు దిగుతుండటంతో జూని యర్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల నుంచి వస్తున్న నిరుపేద విద్యార్థులు సీనియర్ల వేధింపులకు తట్టుకోలేకపోతున్నారు. సీనియర్ల చేష్టలు తమ తల్లిదండ్రులకు తెలిస్తే చదువు మానిపిస్తారనే భయంతో వారికి చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నారు. సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడకుండా ప్రతి నెలా కళాశాలలో సమావేశమై దీనిపై చర్చించి చర్యలు తీసుకొనేందుకు యాంటీ ర్యాగింగ్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. అయితే ఈ కమిటీలు నిర్వీర్యంగా మారాయని చెప్పవచ్చు. వీరి సమావేశాలు, తీసుకుంటున్న చర్యలు కాగితాలకే పరిమితమవుతుండటంతో అల్లరిమూకలు మరింత రెచ్చిపోతూ ర్యాగింగ్‌కు పాల్పడుతున్నాయి. ర్యాగింగ్ అనేది సీనియర్ విద్యార్థులకు సరదాగా, జూనియర్లకు ప్రాణ సంకటంగా మారుతోంది. విద్యార్థులపై చర్యలు తీసుకుంటే వారి భవిష్యత్ పాడవుతుందనే ఉద్దేశంతో పోలీస్ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. సున్నిత మనస్థత్వం ఉన్న విద్యార్థులు మనోస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించకపోతే ర్యాగింగ్ భయంకర రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. యూనివర్సిటీలో వేధింపులు కొత్తేమీకాదు ... ఇప్పటి వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బయటకు పొక్కకుండా లోలోపల జరుగుతున్న ఈవ్‌టీజింగ్ వ్యవహారం రిషికేశ్వరి మృతితో బహిర్గతమైంది. వర్శిటీలో ర్యాగింగ్ జరగడం లేదనే భావన సరైంది కాదని, తనలా ఎంతో మంది విద్యార్థులు ర్యాగింగ్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని మృతురాలు తన సూసైడ్ నోట్లో పేర్కొనడంతో అధికారులు, పోలీసులు ఉలిక్కిపడ్డారు. వేధింపులు తట్టుకోలేక, ఆ విషయాన్ని తన తండ్రితో చెప్పుకోలేక మనోవేదనకు గురై ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటే యూనివర్సిటీలో ఈవ్‌టీజింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులను వేధింపులకు గురిచేసే వారికి తన లేఖతోనైనా కనువిప్పు కలగాలని, ర్యాగింగ్ వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి రాకూడదంటూ రిషికేశ్వరి రాసిన సూసైడ్ నోట్ ఆమె మానసిక క్షోభకు అద్దం పట్టింది. ఈ సంఘటనకు ముందు మార్చి నెలలో మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని సైతం ఇలాంటి వేధింపులకు గురై హాస్టల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తనపై ఐదుగురు సీనియర్ విద్యార్థులు వేధింపులకు పాల్పడడమే కాకుండా దాడి చేసి కొట్టారని మార్చి 16న ఫిర్యాదు చేసింది. తాజాగా రిషికేశ్వరి ఉదంతంతోనైనా వర్సిటీ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు మేలుకొని ర్యాగింగ్‌పై పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉంది. -
విద్యార్థినిని మింగేసిన ర్యాగింగ్ భూతం
ఏఎన్‌యూ : తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక వరంగల్‌కు చెందిన రిషికేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సు ప్రథమ సంవత్సరం విద్యార్థిని మొండి రిషికేశ్వరి (18) మంగళవారం వర్సిటీ వసతి గృహంలో తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. ‘మై లాస్ట్ నోట్’ పేరుతో సూసైడ్ నోట్లో ఆమెపై తోటి విద్యార్థులు చేసిన ఆరోపణలు, వేధింపులు, వర్సిటీలో ర్యాగింగ్ భూతాన్ని ప్రస్ఫుటం చేశాయి. సీనియర్ విద్యార్థుల వేధింపులు, అవమానాలు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు అర్థమవుతుంది. తన అవయవాలను దానం చేయాలని నోట్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఇది ఆ విద్యార్థిని ఔన్నత్యానికి నిదర్శనమని కళాశాల సిబ్బంది పేర్కొన్నారు. రిషికేశ్వరి మృతదేహాన్ని చూసిన తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ర్యాగింగ్ భూతానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చదువులో ముందే.. రుషికేశ్వరి చదువులో మెరిట్ విద్యార్థినిగా కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థినులు చెబుతున్నారు. బీఆర్క్ మొదటి సెమిస్టర్లో 1200 మార్కులకు 799 మార్కులు సాధించింది. చదువులో చురుగ్గా, మిత్రులతో చలాకీగా ఉండేదని పేర్కొన్నారు. కళాశాలలో ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పి బాధపడేదని తెలిసింది. తన బిడ్డ పరిస్థితి తెలుసుకున్న తండ్రి పది రోజుల క్రితం యూనివర్సిటీకి వచ్చి రుషి కేశ్వరికి నచ్చజెప్పి, కళాశాల అధికారులతో మాట్లాడి వె ళ్లారని సిబ్బంది పేర్కొన్నారు. బోరున విలపించిన తండ్రి ... వరంగల్ నుంచి వచ్చి కుమార్తె మృతదేహాన్ని చూసిన రిషికేశ్వరి తండ్రి మురళీకృష్ణ బోరున విలపించారు. ఒకే ఒక సంతానమైన తన కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. తన కుమార్తె తనతో సంభాషించిన విషయాలను గుర్తుకు తెచ్చుకుని కుమిలిపోయారు. ఈ సందర్భంగా మురళీకృష్ణను ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. బాబురావు తదితరులు ఓదార్చేందుకు ప్రయత్నించారు. నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు... విద్యార్థిని మృతిపై వాస్తవాలను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకొనేందుకు వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివ రావు మంగళవారం సాయంత్రం నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన అనంతరం యూనివర్సిటీ ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్స్, యూనివర్సిటీ బాలుర, బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్లు, విద్యార్థినుల ప్రతినిధులుగా వి. జ్యోతి ( జర్నలిజం), కె. నిర్మల (పరిశోధకురాలు), డాక్టర్ కె. వీరయ్య (జువాలజీ), డాక్టర్ జిమ్మీరాణి ( యూనివర్సిటీ మెడికల్ ఆఫీసర్)తో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా నివేదిక ఇస్తుందని తెలిపారు. కొవ్వొత్తుల ర్యాలీ .. విద్యార్థిని మృతికి సంతాపసూచకంగా, ర్యాగింగ్ భూతానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి విద్యార్థినీవిద్యార్థులు యూనివర్సిటీలో కొవొత్తుల ర్యాలీ చేశారు. తొలుత ఇండోర్ స్టేడియం వద్ద మౌనం పాటించి విద్యార్థిని మృతికి నివాళులర్పించారు. ఆమ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ర్యాలీలో ఇన్చార్జి వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, యూనివర్సిటీ ఇంక్యుబేషన్ సెంటర్ డెరైక్టర్ ఆచార్య పి. శంకర పిచ్చయ్య, న్యాయవాది వై. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ర్యాగింగ్‌కు అడ్డుకట్ట పడేనా?
అదో పైచాచిక క్రీడ.. సైకోయిజం..ఇలా ఎన్ని పేర్లు పెట్టినా ర్యాగింగ్‌కు సరిపోవు. ఎందుకంటే తోబుట్టువుల్లా కలసి మెలసి ఉండాల్సిన విద్యార్థులు జూనియర్లు..సీనియర్లు అన్న తేడా చూపి, ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్నారు. ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఉంది. కళాశాలల యాజమాన్యాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. త్వరలో ఐసెట్, ఎంటెక్, బీఈడీ, ఎంబీబీఎస్ తదితర కోర్సులకు కౌన్సెలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అక్కడడక్కడ ర్యాగింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ర్యాగింగ్‌పై ప్రత్యేక కథనం. యూనివర్సిటీ క్యాంపస్: వృత్తి విద్యా కళాశాలల్లో ర్యాగింగ్ అధికంగా జరుగుతోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, ర్యాగింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చట్టాలు అమలు పరుస్తున్నా యి. ర్యాగింగ్ నిరోధం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1997లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. విద్యార్థులు కళాశాలలో చేరే సమయంలోనే తాము ఎలాంటి ర్యాగింగ్ కార్యకలాపాలకు పాల్పడబోమని హామీ పత్రాలను కళాశాల యా జమాన్యాలు తీసుకుంటున్నాయి. అయినా ఈ విష సంస్కృతికి పూర్తిగా అడ్డుకట్ట పడలేదు. కళాశాల యాజమాన్యాలు దీని నిరోధానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సివుంది. విద్యార్థులకు కౌన్సెలింగ్ విద్యార్థుల్లో మానసిక పరివర్తన కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కమిటీలో సభ్యురాలుగా ఉన్నాను. అన్ని కళాశాలలో సందర్శిస్తూ ర్యాగింగ్ నిరోధక చర్యలను తీసుకుంటున్నాం. మహిళా యూనివర్సిటీ, పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థులకు పలుమార్లు అవగాహన సదస్సులునిర్వహించాం. - సీహెచ్. అంజూయాదవ్, సీఐ, వెస్ట్ పోలీస్ స్టేషన్ రహస్య నిఘా విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి ప్రత్యేక బృందాలను నియమించి నిఘా ఏర్పాటు చేశాం. ర్యాగింగ్ బాధితులు సమాచారం ఇవ్వడానికి వీలుగా అన్నిచోట్లా పోలీస్ అధికారుల ఫోన్‌నంబర్లను అందుబాటులో ఉంచాం. ర్యాగింగ్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. - ఎం. శ్రీనివాసులు, సీఐ, క్యాంపస్ పోలీస్ స్టేషన్ అవగాహన సూచికలు క్యాంపస్‌లో ర్యాగింగ్‌పై అవగాహన కల్పిస్తూ సూచికలు ఏర్పాటు చేశాం. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలు, శిక్షలపై అవగాహన కల్పిస్తున్నాం. అధ్యాపకులు, సీనియర్, జూనియర్ విద్యార్థులతో నిరోధక కమిటీ వేశాం. వారి మధ్య సమన్వయం కోసం ప్రారంభంలోనే స్పోర్ట్స్ మీట్ పెడుతున్నాం. - ఎస్. రవీంద్రనాథ్, పరిపాలనాధికారి, సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల జూనియర్లకు ప్రత్యేక హాస్టల్ శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ నిరోధ చర్యల్లో భాగంగా జూనియర్లకు ప్రత్యేక హాస్టల్ వసతి కల్పిస్తున్నాం. స్వర్ణముఖి హాస్టల్‌ను పూర్తిగా జూనియర్లకే కేటాయించాం. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. అడ్మిషన్ సమయంలో అండర్‌టేకింగ్ తీసుకుంటున్నాం.-సీ ఈశ్వర్‌రెడ్డి, శ్రీపద్మావతి మహిళా వర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాల డెరైక్టర్ ఇలా చేయాలి... - ర్యాగింగ్ నిరోధానికి కళాశాలలు, ప్రత్యేక బాధ్యత వహించాలి. - కళాశాలలో చేరే సమయంలో అండర్ టేకింగ్ తీసుకోవాలి. - సీనియర్లు, జూనియర్లు కలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వారికి విడివిడిగా హాస్టల్ వసతి కల్పించాలి. - సదస్సుల ద్వారా చట్టాలపై అవగాహన కల్పించాలి. చట్టాలు ఏమి చెబుతున్నాయంటే... - జూనియర్లను టీజ్ చేయడం, అవమానిం చడం చేస్తే ఏడాది జైలు, రూ.వెయ్యి జరి మానా. - దాడి చేసి గాయపరిస్తే ఏడాది జైలు, రూ.2 వేల జరిమానా. - బలవంతంగా నిరోధించడం, గాయపరచ డం చేస్తే 2ఏళ్లు జైలు, రూ.5 వేల జరిమానా - జూనియర్లను అపహరించడం, లైంగికం గా వేధిస్తే ఐదు సంవత్సరాల జైలు, 10 వేలు జరిమానా. - ఆత్మహత్యకు కార ణం అయితే 10 ఏళ్లు జైలుశిక్ష, రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు జరిమానా. -
ర్యా గింగ్ రూపం మార్చింది?
నచ్చిన కళాశాలలో సీటు దొరికిందని.. కొత్త స్నేహాలు చిగురిస్తాయని.. ఓ కొత్త లోకంలో విహరించ వచ్చని.. ఇలా కొత్త కొత్త ఆశలతో కళాశాలకు అడుగుపెడతాడు విద్యార్థి.. పల్లెటూరు నుంచి పట్నానికి వచ్చినా.. పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌లో చేరినా.. ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల్లో సీటు పొందినా.. అతనిలో ఎక్కడో తెలియని బెరుకు.. బెంగ.. భయం ఉంటాయి. అలాంటి వారిని సహృదయంతో సీనియర్లు ఆదరించి.. వారిలో ఆ భయాన్ని పొగొట్టాలి. ఎందుకంటే సీనియర్లు.. గతంలో జూనియర్లు కాబట్టి.. కానీ సీనియర్లలో కొందరు ఆకతాయిలు జూనియర్ పట్ల వికృత చేష్టలకు పాల్పడి వారి భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారు. ర్యాగింగ్ చట్టంతో ఇది కొంత తగ్గినా.. ఇప్పుడా రాక్షస క్రీడ రూపం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. సీనియర్లు, జూనియర్ల మధ్య ఆధిపత్య పోరు దిశగా, వేర్వేరు కళాశాలల మధ్య చిచ్చురేపుతూ.. తన విస్తృతిని పెంచే దిశగా పయనిస్తోంది. మరి ఇది నియంత్రణ సాధ్యమా? - విజయనగరం అర్బన్ ఇటీవల విశాఖ నగరానికి దూరంగా ఉన్న ఓ కార్పొరేట్ విద్యా సంస్థలో 15 రోజుల కిందట ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అర్థరాత్రి సమయంలో కొట్లాటకు వెళ్లారు. ఈ గొడవ మొదటిగా ఓ సీనియర్ విద్యార్థి జూనియర్ని ర్యా గింగ్ చేయడంతో మొదలైంది. ఈ ఘటనలో ప దుల సంఖ్యలో విద్యార్థులకు గాయాలయ్యాయి. వారం రోజుల కిందట నగరంలో ప్రైవేట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ఈవ్ టీజింగ్‌లతో గొడవలకు దిగారు. ఈ ఘటనతో ఆ పరిసరాల్లో కొద్దిసేపు తీవ్ర అలజడి నెలకొంది. పరిచయాలతో మొదలైన ర్యాగింగ్ ఇప్పుడు సీనియర్లు, జూనియర్లు, వేర్వేరు కళాశాలల విద్యార్థుల మధ్య ఆధిపోత్య పోరుగా మారింది. పరిచయాలతో మొదలై.. కళాశాలకు వచ్చే విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. కొత్తగా వచ్చే వారికి సీనియర్ల సమన్వయంతో ఉండాలని ఉపాధ్యాయులు చెప్పే సూచనలతో పరిచయాలు పెంచుకోవడానికి పలకరింపులు మొదలుపెడతారు. ఇంజినీరింగ్ విద్యా సంస్థలు పెరిగిన తర్వాత ఈ సంస్కృతి మరింత విస్తరించింది. సీనియర్లకి జూనియర్లు ఇచ్చే గౌరవం కాస్తా వారికి అవకాశంగా మారింది. దీంతో కొందరు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించడం, జూనియర్లతో అన్ని పనులు చేయించుకోవడం, చెప్పిన మాట వినకుంటే బెదిరించడం, చెబితే వింటున్నారనే ఉద్దేశంతో మరింత దారుణంగా పనులు చేయిస్తూ.. మానసికంగా, శారీరకంగా హింసించేవారు. ఈ నేపథ్యంలో ఎదురయ్యే వేధింపులు భరించలేక ఎంతో మంది విద్యార్థులు తమ జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై సీరియస్‌గా యాక్షన్ తీసుకొని ర్యాగింగ్ నిరోధక చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ర్యాగింగ్ భూతం తన ఉనికి కోల్పోతూ వచ్చింది. చట్టానికి భయపడి సీనియర్లు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లు చేయడం చాలా వరకు తగ్గించారు. అయితే మరల కొద్ది రోజుల కిందట నగరంలో చోటుచేసుకున్న సంఘటనలతో ర్యాగింగ్ రూపం మార్చుకొని కలత చెందిస్తోంది. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్.. ప్రస్తుతం సీనియర్స్ పరిచయాల పేరుతో ర్యాగింగ్ చేస్తే కొత్తగా కళాశాలల్లో చేరే విద్యార్థులు భరించే స్థితిలో లేరు. సీనియర్లు అయితే ఏంటి? వేధిస్తే సహించలా? అని ఎదురు తిరుగుతున్నారు. దీనిని భరించ లేని సీనియర్లు వారి మీద దాడులకు దిగుతున్నారు. అదే సమయంలో జూనియర్స్ కూడా సీనియర్స్ మీద తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. అదే సమయంలో నగరంలో ప్రైవేట్ కళాశాలన్నీ ఒకే చోట ఉండటంతో వేర్వేరు కళాశాల విద్యార్థుల మధ్య మాటల యుద్ధం, ఈవ్ టీజింగ్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనల్లో కళాశాల విద్యార్థులు గొడవలకు దిగుతూ రోడ్ల మీదనే కొట్లాడుకుంటున్నారు. కళాశాలల్లో నాలుగు గోడల మధ్య జరిగే ర్యాగింగ్లు, టీజింగ్‌లు ఇప్పుడు ఆధిపత్య పోరుగా మారి రోడ్ల మీదకు వచ్చింది. మా కాలేజీ అమ్మాయిని కామెంట్ చేసావని ఒకరు, మా కాలేజీ స్టూడెంట్‌ని కొడతావా అంటూ మరొకరు.. ఇలా గొడవలకు దిగుతూ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇవన్నీ ర్యాగింగ్‌లో భాగమే. జూనియర్లను, ఇతర విద్యార్థులను మాటల ద్వారా గాని, చేతల ద్వారాగాని వే ధిస్తే.. క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తిస్తూ, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ, విద్యార్థులను శారీరకంగా హింసించినా.. అటుగా ప్రోత్సహించినా.. విద్యార్థి చదువులపై ప్రభావం చూపిస్తూ.. అకాడమిక్ యాక్టివిటీస్‌కు అంతరాయానికి.. జూనియర్స్‌కి సీనియర్ విద్యార్థులు వారి అకాడమిక్ టాస్క్‌ని పూర్తి చేయాలని బలవంతం చేసినా.. విద్యార్థులైపై బలవంతంగా ఆర్థిక భారం పడేట్లు చేసినా.. శారీరక హింస, మానసిక హింసకు విద్యార్థిని గురిచేసినా.. మాటల ద్వారా గాని, ఈ-మెయిల్స్ రూపంలో గాని, సందేశాల రూపంలో గాని, ఫోన్ ద్వారా గాని హింసించడానికి ప్రయత్నించినా.. ఆలోచనలు ప్రభావితం చేస్తూ వారి మానసిక సామర్థ్యాన్ని తగ్గించే విధంగా ప్రవ ర్తించినా.. ర్యాగింగ్ కింద పరిగణిస్తారు. -
మిస్సింగ్ కథ సుఖాంతం!
►అదృశ్యమైన ఇంజినీరింగ్ విద్యార్థిని తిరిగొచ్చిన వైనం ►ముగ్గురు సీనియర్ల సస్పెన్షన్ ►ర్యాగింగ్‌కు తెరపడేనా? శ్రీకాకుళం క్రైం : సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణంగా తాను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నానంటూ డైరీలో పేర్కొని అదృశ్యమైన విద్యార్థిని తిరిగి తల్లి చెంతకు చేరింది. ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌ను తట్టుకోలేక బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోవడం, రాత్రి ఆమె తణుకులో ఉన్నట్టు సమాచారం అందిన విషయం పాఠకులకు విదితమే. గురువారం ఉదయం తణుకు నుంచి ఆ విద్యార్థిని వచ్చి తల్లి చెంతకు చేరింది. దీంతో మహిళా పోలీసు స్టేషన్లో ఆమెపై నమోదైన మిస్సింగ్ కథ సుఖాంతమయ్యింది. తిరిగి వచ్చిన విద్యార్థిని మీడియాతో మాట్లాడుతూ సీనియర్ల ర్యాగింగ్ కారణంగానే తాను చనిపోవాలనుకున్నానని తెలిపింది. తణుకు వరకు వెళ్లిన తనను ఒకతను అనుమానంతో ఆపి కౌన్సిలింగ్ చేసి పంపారని చెప్పింది. దీనిపై డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ మిస్సింగ్ కేసు ఛేదించి, కేసు తొలగించామని తెలిపారు. అమ్మాయిని సీనియర్లు ర్యాగింగ్ చేశారన్నదానిపై విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తమ కళాశాలలో ర్యాగింగ్ లేదని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజులు మీడియాకు తెలిపారు. అయితే విద్యార్థినిని వేరే కారణాలతో వేధిస్తున్నట్టు కూడా ఇంత వరకు తమ దృష్టికి రాలేదని, ఇప్పుడు రావటంతో వెంటనే సీనియర్ విద్యార్థులైన పవన్, నగేష్, గణపతిలను కళాశాల నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు. -
ర్యాగింగ్‌కు పాల్పడితే ఐదేళ్లపాటు అడ్మిషన్ రద్దు
సభలో వెల్లడించిన సర్కారు సాక్షి, ముంబై: కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇకనుంచి ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే ఐదేళ్ల పాటు అడ్మిషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఉన్నత సాంకేతిక విద్యా శాఖ సహాయ మంత్రి రవీంద్ర వైకర్ వెల్లడించారు. ‘విద్యార్థుల మధ్య సరదాగా సాగాల్సిన ర్యాగింగ్ రోజురోజుకూ శృతిమించుతోంది. ఈ అవమానాన్ని భరించలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది మృతుల తల్లిదండ్రులకు పుత్రశోకం మిగులిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిబంధనలను మరింత కఠినం చేయాలని నిర్ణయించాం’అని మంత్రి చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక నుంచి కళాశాలల్లో ర్యాగింగ్ ఘటనలు జరిగితే సంబంధిత విద్యార్థులతోపాటు విద్యాసంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వచ్చే విద్యా సంవత్సరం ఒక్క ర్యాగింగ్ మరణం కూడా నమోదు కాకుండా చూస్తామన్నారు. ప్రవర్తనా నియమావళి అమలు శాసనసభ్యులకు ఎమ్మెల్యేలకు ప్రవర్తన నియమావళిని అమలు చేశారు. ఇక నుంచి ఎక్కడ సమావేశాలు జరిగినా ఈ నియమావళి అమల్లో ఉంటుంది. సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగించడం, వాట్స్ అప్ ద్వారా చాటింగ్ చేయడం, ఫేస్ బుక్ తదితరాలు పరిశీలించడం లాంటి వాటిని పూర్తిగా నిషేధించారు. నూతన సభ్యులతోపాటు కొత్త మంత్రులు సభామందిరంలో క్రమశిక్షణ పాటించడం లేదు. ఇలా చేయడం సభను అవమానించడమేనని ఎన్సీపీ సభ్యులు అజిత్ పవార్, ఛగన్ భుజబల్ పేర్కొన్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సభా జరుగుతుండగా తమ మొబైల్ ఫోన్లను నిశ్శబ్ద మోడ్‌లో ఉంచి ఇంటర్నెట్ ద్వారా చాటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలా చేయడం సభా మర్యాదను ఉల్లంఘించడమేనంటూ స్పీకర్ హరీభావు బాగ్డే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఇక నుంచి క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని బాగ్డే పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీ గుర్తులున్న ఎలాంటి వస్తువులుగాని, కండువాలుగాని, ప్ల కార్డులు గాని సభ ప్రాంగణంలోకి తీసుకు రాకూడదంటూ అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరికీ సూచించారు. విపక్షం వాకౌట్ కేల్కర్ కమిటీ నివేదిక మీడియాకు లీకవడంపై విధానమండలిలో సోమవారం గందరగోళం చెలరేగింది. దీనిపై ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మాణిక్‌రావ్ ఠాక్రే సభనుద్దేశించి మాట్లాడుతూ విదర్భ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కేల్కర్ కమిటీ నివేదికను ఎట్టి పరిస్థితుల్లోనూ సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకు ఇతర పార్టీల సభ్యులు మద్దతు పలికారు. ఈ విషయమై ఎన్సీపీ సభ్యుడు అమర్‌సింగ్ పండిట్ మాట్లాడుతూ కేల్కర్ కమిటీ నివేదిక మీడియాలో ప్రచురితమైందని పేర్కొన్నారు. ‘అసలేమి జరుగుతోంది. కేల్కర్ కమిటీ నివేదిక మీడియా ఓ పత్రికలో ఎలా ప్రచురితమైంది. ఈ విషయంపై మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు’అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కేల్కర్ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా పరిగణిస్తున్నాం ఈ విషయమై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ మునగంటివార్ మాట్లాడుతూ కేల్కర్ కమిటీ నివేదిక మీడియాకు లీకవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ నివేదికలో మొత్తం 700 పేజీలు ఉన్నాయని, అయితే సభా కార్యకలాపాలు మరో రెండు మాత్రమే జరగనున్నందువల్ల ఈ అంశంపై చర్చించడం కష్టసాధ్యమన్నారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు వాకౌట్ చేశాయి. -
బ్రేక్‌ఫాస్ట్ షో : ఇంకెన్నాళ్ళీ ర్యాగింగ్..?!
-
అరచేతిలో స్వర్గం చూపే రాజకీయాలు మానుకోండి
తిరుపతి కార్పొరేషన్ : ఏప్రభుత్వం వచ్చినా జూనియర్ డాక్టర్లను వాడుకుని వదిలేస్తున్నారని, ఇప్పటికైనా అరచేతిలో స్వర్గం చూపే రాజకీయాలు మానుకోవాలని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. ఏపీ జూడాలు చేపట్టిన సమ్మె బుధవారానికి మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున రుయా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. జూడాలను ప్రభుత్వం చర్చలకు పిలవనందుకు నిరసనగా జూడాలు నోటికి నల్ల రిబ్బను కట్టుకుని, మానవహారంగా రుయా సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. జూడాలు మాట్లాడుతూ ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల సహనాన్ని పరీక్షిస్తోందన్నారు. కేరళలో జూనియర్ డాక్టర్లకు వేతనాలు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఇస్తున్నారని తెలిపారు. ఒక సంవత్సరం రూరల్ సర్వీసుకు గుర్తింపునిస్తూ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తారని, మన రాష్ట్రంలో అలాంటి గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. పైగా ‘కంపల్సరి బాండెడ్ లేబర్ సర్వీస్’ పేరుతో వైద్య విద్యార్థులను ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోందన్నారు. తమ ఉద్యమాన్ని పరీక్షిస్తే అవసరమైతే అత్యవసర సేవలను కూడా నిలిపేస్తామని వారు హెచ్చరించారు. సమ్మెకు పిలిస్తే ర్యాగింగ్ కేసులు? వైద్యవిద్యా ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రమణ్యం జిల్లాలో సోమ, మంగళవారాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో జూడాల సమ్మెను అడ్డుకోవడానికి తిరుపతి ఎస్వీ మెడికల్ కళాళాశాల ఉన్నతాధికారి తీవ్ర ప్రయత్నాలు చేశారు. సమ్మెలో పాల్గొనవద్దంటూ ఆయన అన్ని విభాగాల హెచ్వోడీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. బుధవారం ఉదయం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులను తన చాంబర్‌కు పిలుపించుకున్న సదరు ఉన్నతాధికారి సమ్మెకు వెళ్లకూడదని, వెళ్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని చెప్పినట్టు సమాచారం. సమ్మెకు రావాలని సీనియర్లు పిలిస్తే మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారంటూ తమకు ఫిర్యాదు చేయాలని వారికి చెప్పినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ వైద్యులు సదరు ఉన్నతాధికారిని నిలదీసినట్టు సమాచారం. -
అదనపు నైపుణ్యాల కోసం ఆన్లైన్ కోర్సులు
మై క్యాంపస్ లైఫ్ కాశీ.. దేశంలో పరిచయం అక్కర్లేని ఊరు. ఒకవైపు కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి చల్లని చూపులతో.. మరోవైపు పవిత్ర గంగానది ప్రవాహ హోయలతో విలసిల్లుతున్న ఈ నగరం.. ప్రాచీనకాలం నుంచే భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఇక్కడ కొలువుదీరిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎందరో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోంది. ఇక్కడ బీటెక్.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న భువనగిరి పవన్ ప్రియతమ్ తన క్యాంపస్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారిలా.. ఎక్కువమంది తెలుగు విద్యార్థులే క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. ర్యాగింగ్ జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఐఐటీ-బెనారస్‌లో నాలుగేళ్ల బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లు కలిపి 300 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు ఉన్న సమయంలో తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. బోధనలో భాగంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్, ఐసీటీలను వినియోగిస్తారు. ఫ్యాకల్టీ ఎలాంటి సందేహాలు ఎదురైనా నివృత్తి చేస్తారు. వారంలో మూడు రోజులు గంట చొప్పున ట్యుటోరియల్ సెషన్స్ ఉంటాయి. అధ్యాపకులతోపాటు ప్రతి ఫ్యాకల్టీకి నలుగురు టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు. వీరు ట్యుటోరియల్ సెషన్లో విద్యార్థుల సందేహాలకు సమాధానాలిస్తారు. ల్యాబ్ ప్రాక్టికల్స్‌లో కూడా సహాయం చేస్తారు. వివిధ పరిశ్రమలు, విద్యా సంస్థల నుంచి గెస్ట్ లెక్చరర్స్ కూడా వచ్చి వివిధ అంశాలపై ఉపన్యసిస్తారు. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్‌ను అధ్యయనం చేశా సెమిస్టర్‌కు అన్ని ఫీజులు కలుపుకుని దాదాపు రూ.75,000 వరకు ఖ ర్చు అవుతుంది. ప్రతి సెమిస్టర్లో పరీక్షలు ఉంటాయి. సెమిస్టర్ మధ్యలో రెండుసార్లు పీరియాడికల్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. సాధారణంగా ప్రతి సెమిస్టర్‌కు ఆరు సబ్జెక్టులు, మూడు ల్యాబ్స్ ఉంటాయి. మొదటి ఏడాదిలో ఇంజనీరింగ్ సబ్జెక్టులతోపాటు తప్పనిసరిగా ప్రొఫెషనల్ కమ్యూనికేషన్‌ను అధ్యయనం చేయాలి. ప్రస్తుతం మొదటి ఏడాది విద్యార్థులకు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ బదులుగా హ్యుమానిటీస్‌ను ప్రవేశపెట్టారు. నేను ఇప్పటివరకు 10కి 8.08 సీజీపీఏ సాధించాను. ఆన్లైన్లో కోర్సులు అందించే ఎడెక్స్, కోర్సెరా వెబ్‌సైట్స్‌లో లైనక్స్, నెట్వర్కింగ్ కోర్సులు పూర్తి చేశాను. మైక్రోసాఫ్ట్ నుంచి డేటా స్ట్రక్చర్స్ కోర్సును తప్పకుండా పూర్తి చేయాలి. దేశంలో అన్ని ఐఐటీలు కలిసి ప్రారంభించిన ఎన్పీటీఈఎల్ వెబ్‌సైట్‌ను కూడా చూస్తుంటాను. ఇంక్యుబేషన్ సెంటర్ అందించే సేవలెన్నో విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ కంటే స్టార్టప్స్‌ను నెలకొల్పడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. విద్యార్థుల ఐడియాస్‌ను స్వీకరించి ఉత్తమమైనవాటిని ఎంపిక చేస్తారు. తర్వాత ఫండింగ్ సదుపాయం కూడా కల్పిస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు కూడా అందిస్తారు. పరిశ్రమల నుంచి నిపుణులను ఆహ్వానించి స్టార్టప్స్‌పై అవగాహన కూడా కల్పిస్తారు. ల్యాబ్‌లు మినహా ప్రత్యేకంగా ప్రతి విద్యార్థికీ ఈమెయిల్ ఇస్తారు. క్యాంపస్‌లో జరిగే ఈవెంట్స్‌ను, ముఖ్య విషయాలను మెయిల్ ద్వారా తెలియజేస్తారు. క్యాంపస్‌లో అత్యుత్తమ వసతులు ఉన్నాయి. లేబొరేటరీలు మాత్రం కొంచెం పాతవి. బాస్కెట్‌బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్, హ్యాండ్‌బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ మైదానాలు ఉన్నాయి. లైబ్రరీలో వై-ఫై సౌకర్యం ఉంది. అన్ని గ్రంథాలు, జర్నల్స్, మ్యాగజైన్స్ లైబ్రరీలో లభిస్తాయి. ఇక దక్షిణ భారత, ఉత్తర భారత వంట కాలను అందించే క్యాంటీన్లు క్యాంపస్‌లో ఉన్నాయి. ఆహారం రుచికరంగా ఉంటుంది. కలర్‌ఫుల్ ఈవెంట్స్ క్యాంపస్‌లో ప్రతి ఏటా మూడు ఫెస్ట్‌లు నిర్వహిస్తారు. అవి.. టెక్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్. కల్చరల్ ఫెస్ట్‌లో భాగం గా డ్యాన్సులు, పాటలు, డ్రామాలు.. టెక్ ఫెస్ట్‌లో రోబో కాంపిటీషన్స్ ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ సాధించి రెండేళ్లు ఏదైనా కంపెనీలో పనిచేస్తాను. తర్వాత జీఆర్ఈ రాసి విదేశాల్లో ఎంఎస్ చదువుతా. -
కొత్త ఎమ్మెల్యేలకు.. ర్యాగింగ్ బెడద
తెలంగాణ తొలి శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన ఆనందం కూడా కొందరు కొత్త ఎమ్మెల్యేలకు మిగలడం లేదు. సభలో తమకు రాక రాక అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే తమ వెనకాలే ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు గేలి చేస్తున్నారని, కామెంట్లతో బెదరగొడుతున్నారని వారు వాపోతున్నారు. ‘కాలేజీల్లోనే నయంలా ఉంది. అసెంబ్లీ హాలులో సీనియర్ ఎమ్మెల్యేల ర్యాగింగ్‌తో గొంతు పెగలడం లేదు. ఇంకేం మాట్లాడుతాం..’ అని ఓ కొత్త ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. ఓ మాజీ ఎమ్మెల్యే తనయుడైన ఈ తాజా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను కూర్చుంటున్న సీటు వెనకాలే గతంలో మా నాన్న కూర్చునేవాడు. నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనకనుంచి హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. -
ర్యాగింగ్ వల్లే ప్రమాదం: ప్రశాంత్ తండ్రి
విశాఖపట్నం: ర్యాగింగ్ కారణంగా జరిగిన ప్రమాదం వల్లే తమ అబ్బాయి భవనంపై నుంచి కిందపడ్డాడని విద్యార్థి ప్రశాంత్ తండ్రి చెప్పారు. తగరపువలస ఎన్ఆర్ఐ కాలనీ హాస్టల్ 4వ అంతస్తుపై నుంచి నిన్న ప్రశాంత్ కింద పడ్డాడు. ర్యాగింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నానని, బయట వేరే రూమ్‌లో ఉంచి చదివించాలని తన కొడుకు ఫోన్లో చెప్పినట్లు ఆయన చెప్పారు. సీఎం పాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ** -
ర్యాగింగ్‌పై ఆరా తీసిన ఎస్వీయూ రిజిస్ట్రార్
తిరుపతి : ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు మంగళవారం ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపూ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బాలుర హాస్టల్లోని డి-బ్లాక్‌లో నిన్న ర్యాగింగ్ జరిగిన విషయం తెలిసిందే. మొదటి ఫ్లోర్‌లోని సీనియర్ల గదిలోకి జూనియర్లను పిలిపించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. పరిచయం పేరిట సీనియర్ విద్యార్థులు ....నృత్యాలు చేయాలంటూ జూనియర్లను ర్యాగింగ్ చేసిన విషయం తెలిసిందే. -
'పిలుస్తుంటే రావడం లేదు.. ఏం బలుపా'
యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుకుంది. బాలుర హాస్టల్లోని డి-బ్లాక్‌లో సోమవారం ర్యాగింగ్ చోటుచేసుకుంది. మొదటి ఫ్లోర్‌లోని సీనియర్ల గదిలోకి జూనియర్లను పిలిపించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. ‘ఏంటి గెట్క్లాస్లకు వారం నుంచి పిలుస్తుంటే రావడం లేదు. ఏం బలుపా’ అని ఒక సీనియర్ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏంటి సీనియర్లకు విష్ చేయడం లేదు’ ‘మీకు క్యాంపస్‌లో ఉండాలని లేదా’ అంటూ మరో సీనియర్ హుకుం జారీ చేశాడు. ఎంబీఏ అయ్యాక ఏమి చేస్తావని సీనియర్ అడిగిన ప్రశ్నకు మొక్కల బిజినెస్ అని చెప్పిన జూనియర్‌ను క్యాంపస్‌లో ఎన్ని మొక్కలు ఉన్నాయో లెక్కించాలని ఆర్డర్ వేశారు. మందుల వ్యాపారం అని చెప్పిన వారికి క్యాంపస్‌లో ఎంతమందికి రోగాలున్నాయో కనుక్కొని చెప్పాలని’ హుకుం జారీ చేశారు. సినిమా అంటే ఇష్టమని చెప్పిన వారితో డ్యాన్స్ చేయించారు. ఇలా సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఎస్వీయూ లో గతనెల 13 నుంచి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కొత్తగా చేరిన వారికి తరగతులు మొదలయ్యాయి. డి-బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో జూనియర్లకు, మొదటిఫ్లోర్‌లో సీనియర్లకు గదులు కేటాయించారు. కొత్త విద్యార్థులు వచ్చాక ర్యాగింగ్ జరిగే అవకాశమున్నా నిరోధానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు, రాత్రి 8 నుంచి 2 గంటల వరకు సీనియర్ విద్యార్థులు తమ గదులకు పిలిపించుకుని ఇంటరాక్షన్ పేరిట వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు కొందరు జూనియర్లు సాక్షికి తెలియజేశారు. జూనియర్ల సమావేశం: సీనియర్ల ఆగడాలతో మనస్తాపానికి గురైన జూనియర్లు ఎస్వీయూలో ఆడిటోరియం వద్ద సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. సీనియర్లు పెడుతున్న ఇబ్బందులపై తీవ్రంగా చర్చించారు. మరో రెండు రోజులు చూసి సీనియర్ల ప్రవర్తన మారకపోతే పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు సంవత్సరాల క్రితం ఇదే బ్లాక్‌లో ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థులను పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. మరోసారి ఇలాంటి ఘటన జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
క్యాంపస్ అంబాసిడర్స్ - పల్లా హర్షవర్ధన్
ఐఐటీ -ఖరగ్‌పూర్.. ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. ఇంజనీరింగ్ విద్యలో దేశానికి నిష్ణాతులైన విద్యార్థులను అందిస్తున్న ఈ సంస్థ పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్‌లో కొలువుదీరింది. ఇక్కడ బీటెక్+ఎంటెక్ (డ్యుయెల్ డిగ్రీ) కెమికల్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నారు పల్లా హర్షవర్థన్. క్యాంపస్ తనకెంతో నచ్చిందంటున్న హర్ష క్యాంపస్ కబుర్లు.. దేశంలో మొట్టమొదటి ఐఐటీ.. ఖరగ్‌పూర్ ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్ కొన్ని వందల ఎకరాల్లో ఉంటుంది. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. సబ్జెక్టులు, పరీక్షలు, ఇతర అన్ని విషయా ల్లో సీనియర్లు సహాయం చేస్తారు. ప్రవేశం లభించిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్యాంటీన్లో దక్షిణాది వంటకాలన్నీ లభిస్తాయి. కూరలు మాత్రం కొంచెం తియ్యగా ఉంటాయి. ఇక.. క్యాంపస్ అంతా వై-ఫై ఉంది. లైబ్రరీ, ఆడిటోరియం, లేబొరేటరీలు, ప్లే గ్రౌండ్స అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. నిపుణులైన ఫ్యాకల్టీ: సాధారణంగా ఉదయం 7.30 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు క్లాసులుంటాయి. ఈ సమయంలో కోర్సును బట్టి, షెడ్యూల్‌ను బట్టి తరగతులకు హాజరు కావాలి. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా ఉంటా యి. ఏవైనా సందేహాలు వస్తే వెంటనే నివృత్తి చేస్తారు. మెయిల్ ద్వారా వారిని సంప్రదించే అవకాశం ఉంది. ఆన్లైన్లో కూడా కొన్ని కోర్సులను చేస్తాం. శని, ఆదివారాలు సెలవు. ఇంజనీరింగ్ కోర్సులతోపాటే హ్యుమానిటీస్ సబ్జెక్టులను కూడా అధ్యయనం చేయాలి. సైకాలజీ, ఎకనామిక్స్, ఆంత్రోపాలజీ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సెమిస్టర్లో 4 కోర్సులు, 1 ల్యాబ్ కోర్సు, 1 హ్యుమానిటీస్ కోర్సుపై పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సెమిస్టర్లో మిడ్ సెమిస్టర్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. నేను పరీక్షలో ఇప్పటివరకు పదికి 7.2 సీజీపీఏ సాధించాను. మూడో ఏడాది వేసవిలో రెండు నెలలపాటు ఇంటర్న్‌షిప్ చేయాలి. ఇందుకోసం వివిధ కంపెనీలు క్యాంపస్‌కు వస్తాయి. అకడమిక్ రికార్డ్, బృంద చర్చలు, మౌఖిక పరీక్షల ద్వారా ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. 40 శాతం తెలుగు విద్యార్థులే: క్యాంపస్‌లో తెలుగు విద్యార్థులే ఎక్కువ. తెలుగు విద్యార్థుల సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి, దీపావళి, వినాయకచవితి వంటి పండుగలను బాగా చేస్తాం. ప్రతి ఏటా టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్‌లను కూడా విద్యార్థులే కమిటీలుగా ఏర్పడి నిర్వహిస్తారు. టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా వివిధ పోటీలు, గెస్ట్ లెక్చర్స్ వంటివి ఉంటాయి. దేశ,విదేశాల్లోని ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, వివిధ కంపెనీల హెడ్లు, స్టార్టప్స్ సీఈవోలు క్యాంపస్‌కు విచ్చేస్తారు. కల్చరల్ ఫెస్ట్‌లో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయి. డిపార్ట్మెంటల్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి. మా హాస్టల్లో మొత్తం 550 మంది విద్యార్థులు ఉంటారు. వారందరికీ నేను జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. అంతేకాకుండా స్పోర్ట్స్ సెక్రటరీ బాధ్యతలు కూడా చేపట్టాను. క్యాట్ రాస్తా: ప్రాంగణ నియామకాల్లో ఏడాదికి కనీసం రూ.6.5 లక్షలు, గరిష్టం రూ.36 లక్షల వరకు అందుతు న్నాయి. నా కోర్సు పూర్తయ్యాక మంచి ఉద్యోగం సాధించి.. పెట్రోలియం కం పెనీల్లో రెండేళ్లపాటు పనిచేయాలను కుంటున్నా. ఆ తర్వాత కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసి.. ఐఐఎంల్లో ఎంబీఏ చేస్తా. -
మెడికల్కలం
అనంతపురం మెడికల్ : అనంతపురం వైద్య కళాశాలలో ర్యాగింగ్ వికృత చర్యలు పరాకాష్టకు చేరాయి. 15 రోజుల క్రితం ఒక ఏఎస్ఐ కుమారుడు తాగిన మత్తులో జూనియర్లపై వికృత చర్యలకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం జరిగిన మరో ఘటనలో జూనియర్ల దుస్తులు విప్పించి నృత్యం చేయించిన వ్యవహారం కలకలం రేపింది. ఈ రెండు సంఘటనలతో వైద్య కళాశాల పరువు బజారునపడింది. సీనియర్ల చర్యలతో జూనియర్ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. తమను ఏ విధంగా ర్యాగింగ్ చేసిందీ బాధితులు శనివారం ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సభ్యులకు వివరించారు. 15 రోజుల క్రితం... వైద్య కళాశాలలో ఒక సీనియర్ విద్యార్థి (ఏఎస్ఐ కుమారుడు) తప్పతాగి జూనియర్ విద్యార్థులను ఒక గదిలోకి పిలిపించి వారి ప్యాంట్లు విప్పించాడు. అందరినీ వరుసగా నిల్చోబెట్టి వారి పిరుదులపై ఈత దబ్బలతో కొట్టి, అలాగే నృత్యం చేయించాడు. అరికాలిలో ఆనె ఆపరేషన్ చేయించుకున్న విద్యార్థిని కూడా వదల్లేదు. ఈత దబ్బ దెబ్బలు తట్టుకోలేక అరికాలులో ఆపరేషన్ జరిగిన ప్రదేశం నుంచి రక్తం కారుతున్నా బాధను అనుభవిస్తూ నృత్యం చేశాడు. ఈ విషయం బయటికి చెబితే మీరే ఇబ్బంది పడతారని, మా నాన్న డీఎస్పీ అని, సెల్‌ఫోన్ దొంగతనం చేశారని కేసులు పెట్టిస్తానని సీనియర్ విద్యార్థి భయపెట్టాడు. అంతే కాకుండా హాస్టల్ వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఇదే తరహాలో బెదిరించాడు. ఈ విషయాన్ని అప్పట్లోనే సర్వజనాస్పత్రి అధికారుల దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. అయితే విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తపడిన అధికారులు ర్యాగింగ్ చేసిన విద్యార్థిని పిలిపించి మందలించి పంపించే సినట్లు తెలిసింది. మరో అకృత్యం.. నలుగురు సీనియర్ విద్యార్థులు చిత్తుగా తాగేసి బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో జూనియర్ విద్యార్థుల గదులకు వెళ్లి వారి బట్టలు విప్పించి నృతం చేయించారు. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు ఎలా వేదించినదీ గురువారం ఉదయం అధికారుల దృష్టికి బాధిత విద్యార్థులు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. అయితే ర్యాగింగ్ చేసిన విద్యార్థుల వివరాలను పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీసులకు కమిటీ ఫిర్యాదు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నీరజ శనివారం తన చాంబర్లో ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సభ్యులైన ప్రొఫెసర్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, చిట్టినరసమ్మ, మహేశ్, మధు, నాగరాజు, రాధిక, వరలక్ష్మిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాగింగ్ ఘటనపై సమావేశంలో టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన బాధిత విద్యార్థులను విచారించారు. ఆ సందర్భంలోనే 15 రోజుల క్రితం జరిగిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. రెండు సార్లు జరిగిన ఘటనల గురించి సీఐకి బాధిత విద్యార్థులు వివరించారు. దీంతో వారి స్టేట్మెంట్ని ఆయన రికార్డు చేశారు. బుధవారం రాత్రి విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులను విచారించి వేర్వేరుగా వారి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఆ తరువాత ప్రిన్సిపాల్ నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. ఘటనకు బాధ్యులైన నలుగురు సీనియర్ విద్యార్థులను ప్రిన్సిపాల్ చాంబర్‌కు పిలిపించి విచారించారు. ఆ రోజు వారు ఏమి చేశారో లిఖితపూర్వకంగా తీసుకున్నారు. అందరి స్టేట్మెంట్లు రికార్డు చేశామని, వాటి ఆధారంగా సమగ్ర విచారణ చేస్తామని ఆయన తెలిపారు. ప్రిన్సిపాల్‌ని అడ్డగించిన విద్యార్థులు సమావేశం ముగించుకుని తన చాంబర్ నుంచి బయటకు వస్తున్న ప్రిన్సిపాల్ నీరజను సీనియర్ విద్యార్థులు అడ్డగించారు. అందరూ అనుకుంటున్నట్లు ర్యాగింగ్ చేయలేదని చెప్పారు. ఈ అంశాన్ని ఇంత సీరియస్‌గా తీసుకోవడం ఏమిటిని ప్రశ్నించారు. దీనిపై ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పోలీసులు విచారణ చే సి వాస్తవాలు నిర్ధారిస్తారని చెప్పారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ హౌస్సర్జన్ల అరెస్టు వైద్య కళాశాలలో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడ్డ హౌస్‌సర్జన్లను శనివారం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. హౌస్సర్జన్లు వెంకటరాముడు, నరేంద్ర, లక్ష్మణ్, మల్లికార్జున్‌పై ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి వెల్లడించారు. -
మహిళలపై వేధింపులను ఉపేక్షించం
►ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగం ►దొంగనోట్ల చలామణి అరికడతాం ►పోలీసులు సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దు ► పెట్రోలింగ్ ముమ్మరం చేస్తాం ►కొత్త ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నిజామాబాద్ క్రైం : జిల్లాలో మహిళలపై వేధింపులు, నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీ సుకోనున్నట్లు జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెరిగిన టెక్నాలజీ వల్ల మహిళలు ఎక్కువగా వేధింపుల కు గురవుతున్నారని, వారి కి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మహిళలు స్వేచ్ఛగా పోలీసులను ఆశ్రయించవచ్చని అన్నారు. మహిళల ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విభాగంలో అందరూ మహిళ అధికారులనే నియమిస్తామన్నారు. ఫిర్యాదులు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. చైన్ స్నాచింగ్‌లను నిరోధించేదుకు శ్రద్ధ పెడతామన్నారు. ఈ తరహా చోరీలపై మహిళలను చైతన్య పరుస్తామన్నారు. జిల్లాలో మహిళ పోలీస్స్టేషన్లు పెంచేందుకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పెట్రోలింగ్ ముమ్మరం చేసి జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షిస్తామన్నారు. పాత నేరస్తులపై నిఘా పెడతామన్నారు. జిల్లాలో ఆటోడ్రైవర్ల ఆగడాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసిందని, అటువంటి వారి ఆటలు కట్టించేందుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో నకిలీ నోట్ల చెలమణి ఎక్కువ ఉందని తెలిసిందన్నారు. పోలీస్స్టేషన్లలో ఎస్సైలు సివిల్ తగాదాలు, సెటిల్మెంట్లు చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. న్యాయం కోసం పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులతో పోలీసులు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామన్నారు. మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాపై అవగాహన ఉంది మెదక్ జిల్లా రామచంద్రపురం డీఎస్పీగా, ఆదిలాబాద్ జిల్లా ఓఎస్డీగా విధులు నిర్వహించే సమయంలో తనకు జిల్లా గురించి కొంత అవగాహన ఏర్పడిందన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, తమ పరిధి అతిక్రమించకుండా విధులు నిర్వహిస్తానన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం తిర్మారాస్‌పల్లి గ్రామానికి చెందిన తాను పుట్టి పెరిగింది పల్లె ప్రాంతంలోనేన్నారు. 10వ తరగతి వరకు గ్రామంలోనే చదివాను, గ్రామీణ ప్రజల బాధలు తనకు తెలుసన్నారు. పేదలకు న్యాయం జరిగేలా కృషిచేస్తానన్నారు. అంతకుముందు ఎస్పీ తరుణ్‌జోషీ కొత్త ఎస్పీకి పూల బొకేతో స్వాగతం పలికి బాధ్యతలు అప్పగించారు. -
ర్యాగింగ్‌కు పాల్పడితే జీవిత ఖైదు
శ్రీకాకుళం: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ర్యాగింగ్‌కు గురైన బాధితుడు చనిపోతే బాధ్యులైన వారికి జీవిత ఖైదు లేదా పదేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.అన్నపూర్ణ అన్నారు. అభ్యుదయ డిగ్రీ కళాశాలలో బుధవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చట్టపరమైన, న్యాయపరమైన అవగాహన కలిగి ఉండాలన్నారు సీనియర్లు జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ పాల్పడితే కఠిన శిక్షలు ఉన్నాయని, విద్యార్థుల జీవితం పాడవతుందన్నారు. విద్యాసంస్థల్లో చేరేటప్పుడు తల్లిదండ్రుల నుంచి ర్యాగింగ్‌కు పాల్పడరని హామీ పత్రం, కాలేజీలో ర్యాగింగ్ నిషేధం బోర్డులు పెట్టాలన్నారు. జిల్లా వినియోగదారుల ఫోరం పూర్వపు అధ్యక్షుడు పప్పల జగన్నాథరావు మాట్లాడుతూ హిందూ, ముస్లిం వివాహం, విడాకులు, స్త్రీ గౌరవం, వరకట్నం, అవినీతి నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సభ్యుడు పాలిశెట్టి మల్లిబాబు, కళాశాల కరస్పాండెంట్ పి.భూషణ దేవ్, డెరైక్టర్ ఎం.శంకరరావు, న్యాయవాదులు కిల్లి పాపినాయుడు, జి.ఇందిరా ప్రసాద్, ప్రిన్సిపాల్ బాలముకుందరావు తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ల పైశాచికం.. జూనియర్లకు ప్రాణ సంకటం
- కళాశాలల్లో జడలు విప్పుతున్న ర్యాగింగ్ భూతం - ఫిర్యాదు అందితే సీనియర్లు జైలుకే.. వరంగల్‌క్రైం : కళాశాలలో కొత్తగా అడుగుపెట్టేవారికి అదొక కొత్తబంగారు లోకం. మెడికల్ .. ఇంజనీరింగ్.. డి గ్రీ.. పీజీ.. ఇలా కోర్సులేవైనా కావొచ్చు. క్లాస్మేట్స్ పరిచయూలు.. కలుపుగోలు మాటలు.. అంతా కలర్ఫుల్గా ఉంటుంది. కానీ జూనియర్లకు వచ్చిన సమస్యల్లా సీనియర్లతోనే. ఐసీ(ఇంటర్డక్షన్) క్లాస్‌తో మెుదలయ్యే వేధింపులు.. దాడుల వరకు వెళుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో జూనియర్లను సీనియర్ విద్యార్థులు పరిచయం చేసుకునే కార్యక్రమాన్ని ర్యాగింగ్ అనేవారు. కాలక్రమంలో దాని అర్థం మారి.. వేధించడంగా స్థిరపడిపోరుయింది. ఒక మనిషిని.. ఇంకొక మనిషి మానసికంగా, శారీరకంగా వేధిస్తూ పైశాచికానందం పొందే అమానవీయ సంస్కృతిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎంత కఠినమైన చట్టాలు చేసినా.. అది చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. తమ సీనియర్లు తమను ర్యాగింగ్ చేశారు కాబట్టి.. మేం కూడా అలాగే చేస్తామనే ధోరణిలో విద్యార్థులు ప్రవర్తిస్తున్నారు. ఈ ర్యాగింగ్ రక్కసి బారినపడి ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు. ఇది వరకు ఇంజినీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులుండే కళాశాలలకే పరిమితమైన ర్యాగింగ్ విషసంస్కృతి కొన్నేళ్లుగా యూనివర్సిటీల్లోని సోషల్‌సెన్సైస్ విభాగాలకు విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయం హిస్టరీ విభాగంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన కారాగారమే.. ►తోటి విద్యార్థులను సూటిపోటి మాటలతో వేధించడం, తమ చేతల ద్వారా పీడించడం, కలవరపెట్టడం, ఉద్దేశపూర్వకంగా వారిని బాధించడం, కుల, మతాల పేరుతో దూషించడంలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఆరు నెలల జైలు లేదా రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండు శిక్షలు విధించే అవకాశముంది. ►తాము సీనియర్లమని, చెప్పిన విధంగా నడుచుకోవాలని జూనియర్లను భయపెట్టడం, బెదిరించడం, దౌర్జన్యం చేయడంలాంటి చర్యలకు పాల్పడితే ఏడాది జైలు శిక్ష లేదా రూ.రెండు వేల జరిమానా ఉంటుంది. ఒక్కోసారి రెండూ విధించవచ్చు. ►విద్యార్థికి అపకారం చేయడం, బలవంతంగా వస్తువులు లాక్కుని వాడుకోవడం, వారితో కావాల్సిన వస్తువులు తెప్పించుకోవడం తదితర చర్యలకు రెండే ళ్ల జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా, లేదా ఒక్కోసారి రెండు శిక్షలూ పడవచ్చు. ►విద్యార్థులను కిడ్నాప్ చేయడం, అనవసరంగా అపరాధం చేయడం, శృతిమించిన టార్చర్ పెడితే ఐదేళ్ల జైలు లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ►విద్యార్థి మృతికి ర్యాగింగ్ దారి తీసినా.. ఆత్మహత్యకు పురిగొల్పినా పదేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 వేల జరిమానా, లేదా రెండు శిక్షలు విధించవచ్చు. ఫిర్యాదు చేయండిలా.. ర్యాగింగ్ విష సంస్కృతిని నిర్మూలించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో విద్యా సంస్థల్లో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధానికి 1997లో చట్టం తీసుకొచ్చింది. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన సీనియర్ అధ్యాపకులతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేయూలి. ర్యాగింగ్‌ను సాధారణ చర్యగా భావించకుండా దీనిపై వెంటనే పోలీసు శాఖకు సమాచారమివ్వాలి. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ సరిగా స్పందించని పక్షంలో బాధిత విద్యార్థులు పోలీసు శాఖకు, జిల్లా న్యాయసేవాధికార సంస్థకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ►కళాశాలల్లో ఏర్పాటు చేసే ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలను జిల్లాస్థాయిలో కలెక్టర్ పర్యవేక్షిస్తారు. ►ర్యాగింగ్ విషయంలో స్పందించని కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్‌కు ఉంది. ►ర్యాగింగ్‌కు పాల్పడితే విధించే శిక్షలు తెలిపే బోర్డులను ప్రతి కళాశాలలో అందరికి క నిపించే ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలి. ►ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులు భవిష్యత్‌లో చదువును కొనసాగించేందుకు అవకాశం ఉండదు. వారి పేర్లను ప్రభుత్వ విద్యాశాఖ రికార్డుల్లో నమోదు చేసి భవిష్యత్తులో ఏ విద్యాసంస్థల్లోనూ ప్రవేశం పొందేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటుంది. ►అప్పటికే ఉన్న విద్యార్హతలతో ప్రభుత్వ ఉద్యోగంతోపాటు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కోల్పోతారు. ►ఇలాంటివారికి ప్రభుత్వం పాస్‌పోర్టు జారీ చేయకుండా నిలిపివేస్తుంది. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థుల సర్టిఫికెట్ల వెనుక ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థి అని స్టాంప్ వేస్తారు. ఫలితంగా దేశ, విదేశాల్లోనూ ఏ యూనివర్సిటీల్లో కూడా అడ్మిషన్ ఇవ్వరు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయూలి ర్యాగింగ్‌ను నివారించేందుకు విద్యాసంస్థల్లో ప్రచారం చేయాలి. అడ్మిషన్ల ప్రక్రియ ముగియగానే సదస్సులు ఏర్పాటుచేసి జూనియర్లకు మనోధైర్యం కల్పిస్తూ.. ర్యాగింగ్ కేసు నమోదైతే జరిగే నష్టాన్ని సీనియర్లకు వివరించాలి. ఫిర్యాదు చేయూల్సిన ఫోన్‌నంబర్లు జూనియర్లకు కనిపించేలా ప్రదర్శించాలి. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి. - చెలమల్ల వీరన్న, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు క్షణికానందం కోసమే ర్యాగింగ్ క్షణికానందం కోసమే ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. తమను తమ సీనియర్లు ర్యాగింగ్ చేశా రు కాబట్టి.. మేము అలాగే చేస్తామనే ధోరణితో ప్రవర్తించడం సరికాదు. ర్యాగింగ్‌కు భయపడి అడ్మిషన్ తీసుకున్నాక కళాశాలకు రాని విద్యార్థులు కూడా ఉన్నారు. సీనియర్లపై ఫిర్యాదు చేయడానికి కూడా వారు ధైర్యం చేయడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -తూము మనోహర్, ఎమ్మెస్సీ(మ్యాథ్స్) -
వరంగల్‌లో పడగ విప్పిన ర్యాగింగ్ భూతం
వరంగల్: వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్శిటీ క్యాంపస్‌లో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. స్థానిక గణపతి దేవా హాస్టల్లో హిస్టరీ డిపార్ట్మెంట్లోని సీనియర్ విద్యార్థులు... గత రాత్రి జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. దీంతో బాధితులైన జూనియర్లు గురువారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మీడియాకు సమాచారం అందింది. దీంతో మీడియా క్యాంపస్‌కు చేరుకుని యూనివర్శిటీ అధికారులను ర్యాగింగ్‌పై వివరణ కోరింది. క్యాంపస్‌లో ర్యాగింగ్ జరిగినట్లు తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. దీంతో పోలీసులను సంప్రదించగా ర్యాగింగ్ ఘటనపై విచారణ చేస్తున్నామని యూనివర్శిటీ ఎస్ఐ దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. -
ర్యాగింగ్‌ను నిరోధిద్దామిలా
నాగపూర్ : రోజురోజుకూ మహిళలు, విద్యార్థినులపై దాష్టీకాలు పెరిగిపోతున్నాయి. కళాశాలల్లో ర్యాగింగ్భూతం వెంటాడుతోంది. యువత పెడతోవన పడుతోంది. సభ్యసమాజం తలదించుకొనేలా వికృత చేష్టలతో మహిళలను కించపర్చే పాశ్చాత్య సంస్కృతిని ఒంటబట్టించుకున్న కొందరు యువకులు చదువులమ్మ ఒడిని భ్రష్టుపట్టిస్తున్నారు. విషసంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఈ సంస్కృతికి బీజం స్కూలు, కాలేజీల్లోనే పడుతోంది. చదువుకోవడానికి కొత్తగా వచ్చే వారిని సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధించడం మామూలైంది. అమానుషమైన ర్యాగింగ్ రక్కసిని తరిమి వేయడానికి జిల్లా న్యాయ సేవా అథారిటీ (డీఎల్ఎస్ఏ) నడుం బిగించింది. యువతను గాడిలో పెట్టేందుకు ర్యాగింగ్ నిరోధించడానికి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. కళాశాలలను వేదికగా చేసుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నగరంలోని వైద్యకళాశాల, ఇంజినీరింగ్ కళాశాలలో విజయవంతంగా పూర్తి చేసింది. అదేవిధంగా ఎన్‌కేపీ సాల్వ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రిసెర్సీ సెంటర్లోని సీనియర్ ఎంబీబీఎస్ విద్యార్థులకు, విశ్వేశ్వరయ్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని సీనియర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలపై డీఎల్ఎస్ఏ అవగాహన కల్పించింది. జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని, ర్యాగింగ్‌లాంటి వికృత చేష్టలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని ర్యాగింగ్ నిర్మూలన రూపకర్త డీఎల్ఎస్ఏ సెక్రటరీ కిషోర్ జైస్వాల్ అన్నారు. జూనియర్ విద్యార్థులు ‘సర్’ లేదా మేడమ్ అని పిలువాలని సూచించడం కూడా నేరమేనని చెప్పారు. పకడ్బందీ చర్యలు సెషన్స్‌కోర్టు సివిల్ జడ్జి జైస్వాల్ మాట్లాడుతూ ‘2009లో కాంగ్రా(హెచ్‌పీ)లోని రాజేంద్రప్రసాద్ మెడికల్ కాలేజీలో అమన్ అనే మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ భూతానికి బలైందని, ఈ చర్యతో దేశం దిగ్భ్రాంతికి గురైందని చెప్పారు. అప్పటి నుంచి ప్రభుత్వం ర్యాగింగ్ నిరోధానికి పక్బడందీ చర్యలు చేపట్టి అమలు చేస్తోందని వివరించారు. ర్యాగింగ్ విషసంస్కృతిని అరికట్టేందుకు తప్పుచేసిన వ్యక్తులు ఎవరైనా, ఎంతటి వారైనా విచారణకు అర్హులేనని పేర్కొన్నారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. నేరపూరితమైన చర్యను ఉపేక్షించొద్దు మాజీ ప్రభుత్వ ప్లీడర్, న్యాయవాది, డీఎల్ఎస్ఏ టీం మెంబర్ సత్యనాథన్ మహరాష్ట్ర ర్యాగింగ్ నిరోధక చట్టం-1999 గురించి వివరించారు. ర్యాగింగ్ పాల్పడిన వారిని ఉపేక్షించవద్దని కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. ర్యాగింగ్ పాల్పడడం నేరపూరితమైన చర్య అని, రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 10,000 విధించే అధికారం చట్టం కల్పించిందని పేర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలలకు వచ్చే కొత్త విద్యార్థులను ర్యాగింగ్ ద్వారా సీనియర్ విద్యార్థులు శారీరక, మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది సరైన చర్య కాదని అన్నారు. మెడికల్ కాలేజీల్లోనే ర్యాగింగ్ తీవ్రంగా ఉంటుందన్నారు. సీనియర్ల చేతిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న బాధితులు ఫిర్యాదు చేయాలని, ఈ మేరకు నేరం చేసినవారిపై కఠిచర్యలు తీసుకొనే అవకాశం చట్టం కల్పించిందని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో సెప్టెంబర్‌లో చట్టంపై అవగాహన కల్పించడానికి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. జాతీయ హెల్ప్‌లైన్ : విద్యార్థుల మనోభావాల, ఆత్మగౌరవాన్ని ర్యాగింగ్ తీవ్ర విఘాతం కల్గిస్తోందని, దీన్ని నిరోధించడానికి సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. జాతీయ ర్యాగింగ్ వ్యతిరేక హెల్ప్‌లైన్‌ను కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. -
మాదకద్రవ్యాల జోలికెళ్లం
60 వేల మంది డీయూ విద్యార్థుల ప్రతిన న్యూఢిల్లీ: ప్రాంగణంలో మాదకద్రవ్యాలు, ర్యాగింగ్ జోలికెళ్లబోమంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 60 వేల మంది విద్యార్థులు ప్రతినబూనారు. నగర పోలీసుల సహకారంతో ఓ స్వచ్ఛంద సంస్థ డీయూలో విద్యార్థులకోసం ప్రత్యేకంగా రెండురోజుల శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. ‘లీడర్స్ ఫర్ టుమారో (ఎల్ఎఫ్టీ)’ అనే స్వచ్ఛంద సంస్థ ....‘ది యాంటీ డ్ర గ్స్, యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్ (అడార్)’ పేరిట ఈ శిబిరం నిర్వహించింది. ఈ శిబిరంలో పాల్గొన్నవారిలో ఎనిమిది వేలమంది విద్యార్థులు ఎల్ఈటీలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయమై ఎల్ఈటీ దక్షిణ విభాగం అధిపతి సిద్ధార్థ్ జైన్ మాట్లాడుతూ యువనాయకత్వాన్ని ప్రోత్సహించడమే తమ సంస్థ ముఖ్యోద్దేశమని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై కొత్తగా ఆయా కళాశాలల్లో చేరేవారితోపాటు ప్రస్తుత విద్యార్థులకు అవగాహన పెంపొందించడంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేవిధంగా తాము ప్రోత్సహిస్తామన్నారు. ఇదే విషయమై ఎల్ఈటీ దక్షిణ ప్రాంగణం క్యాంపస్ మేనేజర్ ఉత్కర్ష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, ర్యాగింగ్‌లకు దూరంగా ఉంటామంటూ 60 వేల మంది విద్యార్థులు ఈ శిబిరంలో ప్రతినబూనారన్నారు. మూడు విడతలుగా నగరంలోని మరో 150 కళాశాలల్లో ఈ తరహా శిబిరాలను నిర్వహిస్తామన్నారు. తొలి విడతలో డీయూలో ఈ శిబిరాన్ని నిర్వహించామని, మరో రెండు శిబిరాలను కూడా నిర్వహిస్తామన్నారు. అవి ఇంద్రప్రస్థ, జామియామిలియా విశ్వవిద్యాలయాల్లో జరుగుతాయన్నారు. -
లోక్‌అదాలత్‌లో సత్వర పరిష్కారం
నందిగామ జిల్లా న్యాయమూర్తి గూడూరు రామకృష్ణ జగ్గయ్యపేట అర్బన్ : దీర్ఘకాలంగా కోర్టుల్లో అపరిష్కృతంగా నిలిచిపోయిన కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని 16వ అదనపు కోర్టు నందిగామ జిల్లా న్యాయమూర్తి గూడూరు రామకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని కొత్త వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో కళాశాలల విద్యార్థినీ విద్యార్థులకు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ తదితర అంశాలపై శుక్రవారం రాత్రి సెమినార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కళాశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు బోధన చేయాలని, బోధన పట్లే కాకుండా ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్ చేస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ముఖ్యంగా మహిళలు ఇటువంటి వారి పట్ల చాలాజాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోక్‌అదాలత్‌లో న్యాయశాస్త్ర కోవిదులు, అధికార, అనధికార ప్రముఖుల సమక్షంలో స్నేహపూర్వక వాతావరణంలో ఉభయపక్షాలకు ఆమోదయోగ్యమైన తీర్పుద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. చిన్న చిన్న వివాదాల్లో కోర్టులకు వెళ్లకుండా పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటే ఎటువంటి ఇబ్బందులూ ఉండవన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తవన్నారు. విద్యార్థినీలు కుంగ్‌ఫూ, కరాటేలు నేర్చుకోవాలన్నారు. జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు, సెకండ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ వెన్నబోయిన నరసింహారావు, సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్, వత్సవాయి, జగ్గయ్యపేట, చిల్లకల్లు ఎస్ఐలు షణ్ముఖసాయి, నాగరాజు, చార్టెడ్ అకౌంటెంట్ పెనుగొండ బదిరినారాయణ పాల్గొన్నారు. -
జూనియర్లపై రెచ్చిపోయిన సీనియర్లు
దివాన్‌చెరువు (రాజానగరం), న్యూస్‌లైన్ : ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ మహమ్మారి విజృంభించింది. సీనియర్ల ధాటికి సుమారు 20 మంది జూనియర్ విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి కేంద్రంగా నారాయణ జూనియర్ కాలేజి నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఎంఈసీ బ్రాంచిని దివాన్ చెరువులో ఏర్పాటు చేసిన రెండు భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఓ భవనంలో తరగతులు, మరో భవనాన్ని విద్యార్థుల హాస్టల్‌గా వాడుతున్నారు. హాస్టల్ పైఅంతస్తులో జూనియర్లు, గ్రౌండ్ ఫ్లోర్లో సీనియర్లు ఉంటున్నారు. కొందరు సీనియర్లు కొంతమంది జూనియర్లను ర్యాగింగ్ చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. అర్ధరాత్రి నీళ్లు తీసుకురావాలని, వారి ఎంగిలి కంచాలు కడగాలని, మోకాళ్లపై కుర్చోమని చెప్పి పిడిగుద్దులు కురిపించడం వంటి చేష్టలకు సీనియర్లు పాల్పడుతున్నారు. ఒకరిద్దరు అధ్యాపకులు సీనియర్లను మందలించేందుకు ప్రయత్నించినప్పటికీ, వారిపై కూడా తిరగబడడంతో అధ్యాపకులు మిన్నకుండిపోయారు. దీంతో సీనియర్ల వేధింపులపై బాధితులు కళాశాల ప్రిన్సిపాల్‌కి, ఇతర అధ్యాపకులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల్లో కళాశాలను వదిలి వెళ్లనున్న సీనియర్ విద్యార్థులు.. సుమారు 60 మంది జూనియర్లపై శనివారం రాత్రి జులుం ప్రదర్శించారు. డూప్లికేట్ తాళంతో గేటు తెరిచి, పైఅంతస్తులో ఉన్న జూనియర్లను నిద్ర లేపి, గోడ కుర్చీలు, మోకాళ్లపై నిలబడాలంటూ హుకుం జారీ చేశారు. సీనియర్లంటే చులకనగా ఉందా అంటూ దుర్భాషలాడుతూ.. జూనియర్లపై పిడిగుద్దులు కురిపించి, కాళ్లతో తన్నారు. అంతటితో ఆగకుండా తెల్లారిన తర్వాత కూడా గొడవకు రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సుమారు 20 మంది జూనియర్ విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో.. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న సీనియర్లు తమపై అమానుషంగా ప్రవర్తించేవారని జూనియర్లు ఆరోపించారు. ‘ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేస్తే ఏం చేస్తారు, హాల్ టికెట్ ఇవ్వరు, అంతేకదా!’ అంటూ కాళ్లతో తన్నేవారన్నారు. పరీక్షలు వస్తున్నాయని, కొట్టకండని జూనియర్లు ప్రాథేయపడినా, వైద్య చేయించుకుని పరీక్షలు రాయవచ్చులే అని సీనియర్లు దౌర్జన్యం చేసే వారన్నారు. ఐదు, పది రూపాయలు అప్పు తీసుకోవడం, తిరిగి అడిగితే దుర్భాషలాడి, కొట్టేవారన్నారు. విషయం తెలుసుకున్న బొమ్మూరు పోలీసులు సంఘటన ప్రాంతానికి వచ్చి, ఐదుగురు విద్యార్థులను తమ వెంట తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఈ కళాశాల ప్రాంగణంలో ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందనడానికి నిదర్శనంగా.. హాస్టల్లోని కొన్ని గదుల్లో రక్తపు మరకలు, చెల్లాచెదురైన పుస్తకాలు, దుస్తులు, సామగ్రి దర్శనమిచ్చాయి. విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి కళాశాలకు, హాస్టల్‌కు చేరుకుని, తమ పిల్లల యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కళాశాలను నిర్వహించాలని, లేకుంటే వేరే కళాశాలలో తమ పిల్లలను చేర్పించాల్సి వస్తుందని ప్రిన్సిపాల్‌ని హెచ్చరించి నట్టు తెలిసింది. ర్యాగింగ్ కాదు.. అల్లరే.. : ప్రిన్సిపాల్ ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ వెంకట్రామరెడ్డిని వివరణ కోరగా, ఇది ర్యాగింగ్ కాదంటూ కొట్టివేశారు. విద్యార్థుల మధ్య ఉన్న శత్రుత్వమే ఈ అల్లరికి కారణమన్నారు. ర్యాగింగ్‌పై విద్యార్థులను చైతన్యపరుస్తూ సదస్సులు నిర్వహించే అవసరం తమకు రాలేదన్నారు. దీనిపై బొమ్మూరు సీఐ సాయిరమేషన్ను వివరణ కోరగా కళాశాల వార్షికోత్సవం రోజున విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణే ఇందుకు కారణమని, ఇది పెద్ద విషయం కాదన్నారు. ఎన్నికల హడావుడిలో తాము బిజీగా ఉన్నామన్నారు. -
ఆడపిల్లల రక్షణలో ఆప్తమిత్రులు
యువ ప్రతిభ ఆడపిల్లలను ఏడిపించే యువకుల్ని చూశాం. ప్రేమ అంటూ వెంటపడే కుర్రాళ్లని చూశాం. ర్యాగింగ్ అంటూ అల్లరి పెట్టే అబ్బాయిల్నీ చూశాం. కానీ పృథ్వీరాజ్ రామ్‌రాఖ్యానీ అలాంటివాడు కాదు. హైదరాబాద్‌లోని ‘ఐసీఎఫ్ఏఐ’ విద్యార్థి అయిన ఈ పద్దెనిమిదేళ్ల కుర్రాడు... ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన చెందాడు. వారి కోసం తనవంతుగా ఏదైనా చేయాలని ఆరాటపడ్డాడు. తన స్నేహితుడు అక్షయ్ రేతాతాతో కలిసి మహిళలకు మేలు చేసే ఓ చక్కని ఆవిష్కరణకు ఊపిరి పోశాడు. నిర్భయ ఉదంతం యావత్ దేశాన్నీ కుదిపేసింది. ఆ ఉదంతం పృథ్వీని కూడా కదిలించింది. ఆ తరువాత వరుసగా జరిగిన కొన్ని అత్యాచార ఉదంతాలు కూడా అతడి మనసును చలింపజేశాయి. సంఘటన జరిగిన ప్రతిసారీ అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటివి జరగడానికి వీల్లేదు అంటున్నారు. కానీ అలా జరగకుండా ఉండేందుకు మాత్రం ఎవరూ ఏమీ చేయడం లేదు. అది అతడిని ఎంతో బాధించింది. క్యాండిల్స్ వెలిగించడం వల్లనో, వీధుల్లో చేరి నినాదాలు చేయడం వల్లనో ఏదైనా ఉపయోగం ఉందా అని ఆలోచించాడు. తమ వంతుగా స్త్రీల సంరక్షణ కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. అలా అతడి వేదనలోంచి, తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి చేసిన మేథో మథనంలోంచి పుట్టుకొచ్చిందే... నాగా చిల్లీస్ పెప్పర్ స్ప్రే. ఇప్పటికే మార్కెట్లో చాలా పెప్పర్ స్ప్రేలు ఉన్నాయి. కానీ వాటి ఖరీదు కాస్తంత ఎక్కువే. అందువల్లనే చాలామంది మహిళలు వాటిని కొనడం లేదనే విషయాన్ని గుర్తించారు ఈ స్నేహితులిద్దరూ. అందుకే తామే ఓ పెప్పర్ స్ప్రేని తయారుచేసి, తక్కువ రేటుకే మహిళలకు అందించాలనుకున్నారు. తమ పాకెట్‌మనీని పోగుచేస్తే పదకొండు వేలు అయ్యింది. ఫ్రెండ్సందరినీ అడిగి మరికొంత సొమ్ము కూడబెట్టారు. నాగాల్యాండ్‌లో దొరికే నాగా చిల్లీస్‌ని (ఇవి ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలు) ఉపయోగించి శక్తిమంతమైన పెప్పర్ స్ప్రేని తయారుచేశారు. కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లి తమ స్ప్రే గురించి వివరించారు. దాన్ని దగ్గర ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలిపారు. మార్కెట్లో ఐదు వందలు పలికే స్ప్రేని 199 రూపాయలకే అమ్మడం మొదలుపెట్టారు. వాళ్లు ప్రతి స్ప్రేమీద వేసుకున్న లాభం... కేవలం 50 రూపాయలు. అయితే ఈ లాభాన్ని కూడా తమకోసం వాడుకోవడం లేదు. పేద మహిళలకు అమ్మే స్ప్రేలలో ఈ మొత్తాన్ని తగ్గిస్తున్నారు. చాలామందికి వీరు కేవలం యాభై రూపాయలకే స్ప్రేను అమ్ముతున్నారు. ఇప్పటికి ఇలా ఓ రెండు వేల క్యాన్ల స్ప్రేలను అమ్మారు. ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది అని అడిగితే... ‘‘జరిగిన తరువాత బాధపడితే ఉపయోగం ఏముంది, అలాంటివి జరక్కుండా ఉండేందుకు ఏం చేయాలా అని ఆలోచించాం, అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. మా ఆలోచన మంచి ఫలితాన్నే ఇచ్చింది’’ అంటాడు పృథ్వీ. అది నిజం. ‘సమాజం మారాలి’, ‘దురాగతాలు ఆగాలి’ అంటూ నినాదాలు చేస్తే ఫలితం ఉండదు. ఎవరు వచ్చి ఈ దుస్థితిని మారుస్తారా అని ఎదురుచూడటం వల్ల ఉపయోగం ఉండదు. మార్పును మనస్ఫూర్తిగా కోరుకుంటే మొదటి అడుగు మనమే వేయాలి. ఆ విషయాన్ని ఈ ఇద్దరూ నిరూపించారు! -
ర్యాగింగ్‌పై విద్యార్థి సంఘాల ఆగ్రహం
కొండపాక, న్యూస్‌లైన్ : మండలంలోని వెలికట్ట శివారులో గల ఫార్మసీ కళాశాల సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నారని బీజేపీ, టీఆర్ఎస్వీ నేతలు శనివారం కళాశాల ప్రిన్స్‌పాల్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె కుమార్ యాదవ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కాట రమేష్‌ల ఆధ్వర్యంలో పలువురు యువకులు కళాశాలకు రావడంతో క ళాశాల సిబ్బంది గేట్లు మూసేశారు. దీంతో ఆగ్రహించిన సం ఘాల నేతలు కళాశాల వద్ద ఉన్న బెం చీలను కిందకు పడేయడంతో సిబ్బంది గేటు తీశారు. లోపలికి వెళ్లిన సంఘాల నాయకులు ప్రిన్స్‌పాల్ కార్తికేయన్‌ను కలిసి నిలదీశారు. కళాశాల సమీపంలో ఉన్న వెలికట్ట చౌరస్తా వద్ద తరచూ సీ నియర్ విద్యార్థుల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. ర్యాగి ంగ్‌తో విద్యార్థులు ఆత్మహత్యలకు పా ల్పడితే బాధ్యులెవరని ప్రశ్నించారు. ర్యాగింగ్‌ను పూర్తిస్థాయిలో అరికట్టాలనీ లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కళాశాల ప్రిన్స్‌పాల్ కా ర్తికేయన్ స్పందిస్తూ తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ర్యాగింగ్‌ను నిరోధించడానికి కాలేజీలో కమిటీ ఉందని చెప్పారు. ఇందుకు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్లకు భయపడి జూనియర్లు ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. కమిటీ ఏం చేస్తుందనీ, ర్యాగింగ్‌ను నిరోధించకపోతే తీవ్ర పరి ణామాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాల నాయకులు వెనుతిరిగారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆరెపల్లి లింగం, వడ్లకొండ శ్రీహరి, పంజ కుమార్, కాట మల్లేశంలతో పాటు దుద్దెడకు చెందిన యువకులు పాల్గొన్నారు. -
మొదటి సంవత్సరం విద్యార్థులపై ర్యాగింగ్
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప రిమ్స్‌ను ర్యాగింగ్ భూతం ఆవహించింది. ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొంతమంది వైద్య విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులను తమ వికృత, వెకిలి చేష్టలతో శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ర్యాగింగ్ చేయకూడదని ఎప్పటికప్పుడు అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా విద్యార్థులు తమ వెఖరిని మార్చుకోవడం లేదు. రిమ్స్ కళాశాలలో ఈ యేడాది ప్రవేశించిన కొంత మంది విద్యార్థినులపై పీజీ విద్యార్థినులు తమదైన శైలిలో ర్యాగింగ్ చేసేందుకు ప్రయత్నించారు. బాధిత విద్యార్థినులు ప్రిన్సిపల్‌కు మొర పెట్టుకోవడంతో వారిని సున్నితంగా హెచ్చరించారు. కొంతమంది మొదటి సంవత్సరం విద్యార్థులను ద్వితీయ సంవత్సరానికి చెందిన 8 మంది విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీరి వేధింపులకు తట్టుకోలేక ఓ విద్యార్థి హాస్టల్‌ను ఖాళీ చేశాడు. రాజీవ్ గాంధీ విగ్రహం వెనుకదారిలో క్యాంటీన్ సమీపంలో ఉన్న ఏటీఎం దగ్గర మొదటి సంవత్సరం విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ఇటీవల దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కొంతమంది సీనియర్ విద్యార్థులకు తమ డబ్బులతో భోజనం పార్శిళ్లు, ఇతర సామగ్రిని జూనియర్లు తీసుకురావాల్సిందే. గురు, శుక్రవారాలలో రిమ్స్ ైడె రక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్, ప్రిన్సిపల్ బాలకృష్ణ హ ఠాత్తుగా హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ సమయంలో కొంతమంది సీనియర్ విద్యార్థులు వికృత క్రీడకు పాల్పడుతుండగా కళ్లారా చూశారు. వెంటనే ఆ విద్యార్థులను పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. వీరి సెల్ఫోన్లను హాస్టళ్లను పర్యవేక్షిస్తు అధ్యాపకుల ఆధీనంలో ఉంచారు. ఎలాంటి ఫిర్యాదు అందలేదుః రిమ్స్ సీఐ రిమ్స్‌లో ర్యాగింగ్ జరిగినట్లు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అలాంటిది జరిగినట్లు మా దృష్టికి వస్తే సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాంటిదేమీ జరుగలేదు: -రిమ్స్ డైరక్టర్ రిమ్స్‌లో ర్యాగింగ్లాంటిదేమీ జరగలేదు.. దాని విషయం తరువాత చెబుతా.. ఈనెల 26,27 తేదీలలో జరగబోయే ప్రెషర్స్‌డే, కాలేజీడే ఏర్పాట్లపై చర్చించుకుంటున్నాం. -
ర్యాగింగ్‌కు వైద్య విద్యార్థి బలి
పళ్లిపట్టు, న్యూస్‌లైన్: ర్యాగింగ్ భూతానికి వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయా డు. ఈ విషాదకర సంఘటన కాంచీపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. కృష్ణగిరికి చెందిన ముహుల్ రాజ్‌కుమార్(18) కాంచీపుర ంలోని మీనాక్షి ప్రయివేటు వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల హాస్టల్లోనే ఉంటున్నాడు. ముహుల్రాజ్ కుమార్‌ను సీనియర్లు తీవ్రస్థాయిలో ర్యాగింగ్ చేసినట్లు సమాచారం. ఈ దృష్ట్యా బయట గది తీసుకుని చదువుకుంటానని తల్లిదండ్రులకు అతను చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తన గదిలో ఉన్న చీకటీగల మందు తాగి స్పృహ కోల్పోయా డు. రాజ్‌కుమార్‌కు తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. రాత్రి 11 గంట ల సమయంలో అతను ప్రాణాలు విడిచాడు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రు ల రోదన చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడ్డ సీనియర్లపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. కాంచీపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.