ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతోందంటూ మీడియాలో ఆరోపణలు రావడంతో.. ఆంధ్ర ప్రధేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపస్ లో తనిఖీలు నిర్వహించారు. ర్యాగింగ్ ఆరోపణలపై వర్సిటీ అధికారులు, విద్యార్థుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ర్యాగింగ్ చట్టాన్ని పటిష్టం చేశామని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ను ర్యాగింగ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా.. సీనియర్ ల నుంచి వేధింపులు ఎదుర్కొన్న విధ్యార్థులు మీడియాను ఆశ్రయించినట్లు తెలిసిందని.. వారు తమకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు చేపడతాం అని గంటా తెలియజేశారు.