au
-
ఏయూలో చారిత్రక కళావేదిక పునఃప్రారంభం
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్ర యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన చారిత్రక ఆరుబయలు రంగస్థల వేదిక–ఎస్కిన్ స్క్వేర్ను ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా శుక్రవారం పునఃప్రారంభించారు. దాదాపు రూ.కోటి వ్యయంతో నాడు–నేడు పథకం స్ఫూర్తితో ఆధునీకరించిన యాంఫీ థియేటర్‌ను నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఏయూ ప్రాంగణంలో తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటించిన కులగోత్రాలు చిత్రం షూటింగ్ జరిగిందన్నారు. త్వరలో తన సినిమా షూటింగ్‌ను కూడా ఇదే ప్రాంగణంలో చేస్తానని చెప్పారు. ఎందరో కళాకారులకు ప్రాణం పోసిన ఏయూ రంగస్థల వేదికను మళ్లీ తన చేతుల మీదుగా పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కళావేదిక చరిత్ర వింటుంటే అల్లూరి సీతారామరాజు గుర్తుకు వచ్చారన్నారు. తనపై ఎనలేని ప్రేమాభిమానాలు చూపించిన ఏయూ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏయూ హిందీ విభాగం గౌరవ ఆచార్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు సంస్కారం కలిగిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆ రోజుల్లో సొంత ఇంటిని కొనుక్కోకుండా తన సంపాదనలో లక్ష రూపాయలు గుడివాడ కాలేజీకి, రూ.25 వేలు ఏయూకు విరాళంగా అందించారని గుర్తు చేశారు. ఈరోజు ఆయన వారసులు ఏయూ రంగస్థల వేదికను పునఃప్రారంభించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సూచించిన విధంగా ఆర్ట్స్ కోర్సులకు పూర్వవైభవం తీసుకువస్తున్నామన్నారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నటన తదితరాలను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన నాడు–నేడు పథకం నిధులతో విశ్వవిద్యాలయంలో చేసిన అభివృద్ధిని వివరించారు. రెండున్నర దశాబ్దాలుగా నిరుపయోగంగా మారిన ఈ ప్రాంగణాన్ని సీఎం జగన్ సహకారంతో సుందరంగా తీర్చిదిద్దామన్నారు. దీనిని నామమాత్రపు అద్దెతో కళాకారులకు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు అక్కినేని అఖిల్, నాగార్జున సోదరి సుశీల, ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజి్రస్టార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్, ప్రిన్సిపాల్స్, డీన్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నేపథ్య గాయకుడు ధనుంజయ్ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. -
ఏయూ రంగస్థలానికి పూర్వవైభవం
విశాఖ (ఏయూ క్యాంపస్): ఆంధ్ర విశ్వకళా పరిషత్ తన పేరును సార్థకం చేసుకుంటూ చిత్రకళలు, నాటక రంగం, సంగీతం, నృత్యం నుంచి నేటి సినీ సంగీతం వరకు ఎందరో ఉద్దండులను సమాజానికి అందించే బృహత్తర బాధ్యతను నిర్విరామంగా నిర్వహిస్తోంది. దశాబ్దాల క్రితం కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఆరుబయలు రంగస్థలం దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నిరాదరణకు గురైంది. ప్రస్తుత వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి చొరవ తీసుకుని దీనిని పూర్తిస్థాయిలో ఆధునికీకరించి వినియోగంలోకి తెచ్చారు. 1940లో పునాదిరాయి ఎస్కిన్ స్క్వేర్ పేరిట 1940లో అప్పటి మద్రాసు గవర్నర్ రూథర్‌ఫర్డ్ ప్రారంభించబడిన ఏయూ కళాప్రాంగణం ఘనమైన చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ఇక్కడ ప్రదర్శించిన నాటకాలను వీక్షించేందుకు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు వంటి తెలుగు సినిమా అగ్ర కథానాయకులు వచ్చేవారు. చాట్ల శ్రీరాములు, అబ్బూరి గోపాలకృష్ణ, దేవదాస్ కనకాల, సాక్షి రంగారావు, వంకాయల సత్యనారాయణ, మిశ్రో వంటి నాటక ప్రయోక్తలు, సినీ రంగ ప్రముఖులు ఈ వేదిక నుంచే గొప్ప కళాకారులుగా ఎదిగారు. అక్కినేని కథానాయకుడిగా 1961లో విడుదలైన కులగోత్రాలు చిత్రంలో సన్నివేశాలను ఇదే వేదికపై చిత్రీకరించారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో.. ఇంతటి చారిత్రక ప్రాశస్త్యం కలిగి నాటక కళకు అంతులేని కీర్తిని సంపాదించిన కళావేదిక తరువాతి కాలంలో తగిన ప్రోత్సాహం లేక మరుగునపడి శిథిలావస్థకు చేరింది. హుద్‌హుద్ తుపాను కారణంగా మరింత దెబ్బతింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఇది నిరుపయోగంగా మారింది. సీఎం వైఎస్ జగన్ఆర్ట్స్ కోర్సుల్లో అన్ని విభాగాలకు పూర్వవైభవం తీసుకురావాలని.. సంగీతం, నాటక రంగం, నృత్యం, చిత్రకళా విభాగాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రోత్సహించాలని సూచించారు. దీంతో ఈ రంగస్థలాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ విషయంలో ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు పథకంలో అందించిన నిధులతో యాంపి థియేటర్‌కు ఊపిరినిచ్చారు. నెక్కంటి సీ ఫుడ్స్ సంస్థ అందించిన నిధులతో బెంచీలు, ఫ్లోరింగ్ పనులు పూర్తిచేశారు. కోరమాండల్ పెయింట్స్ సామాజిక బాధ్యతగా అందించిన నిధులతో ప్రాంగణానికి వర్ణాలద్ది కళావేదికను కళాత్మకంగా తీర్చిదిద్దారు. రెండంతస్తుల బ్యాక్ స్టేజీతో రెండు గ్రీన్ రూమ్‌లు, రంగస్థలంపై వర్షం, గాలివాన, నీలి ఆకాశం, సముద్రతీరం వంటి సన్నివేశాలను ప్రదర్శించడానికి వీలుగా సైక్లోరమా వ్యవస్థను తీర్చిదిద్దారు. రంగస్థల చారిత్రక, కళాప్రాశస్త్యాలు దెబ్బతినకుండా నేటి తరానికి ఉపయుక్తంగా సర్వహంగులతో సిద్ధం చేశారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, అక్కినేని సుశీల శుక్రవారం జరిగే కార్యక్రమంలో దీనిని ప్రారంభిస్తారు. అరుదైన ఘట్టం దేశంలో మరే విశ్వవిద్యాలయానికి లేని అరుదైన సందర్భం ఈ వేదికపై ఆవిష్కృతమైంది. ముగ్గురు భారతరత్నలు ఇదే వేదికను పంచుకున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న సీవీ రామన్ ముఖ్య అతిథిగా ప్రసంగించగా.. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏయూ ఉపకులపతి హోదాలో సభకు అధ్యక్షత వహించారు. దేశం గర్వించే ఇంజినీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రేక్షకుడిగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఇంతటి అరుదైన, అపూర్వ ఘటన దేశంలోని ఏ విశ్వవిద్యాలయ చరిత్రలోనూ జరగలేదు. -
ఏయూ బ్యాంక్ లాభం రూ.387 కోట్లు
ముంబై: జైపూర్ కేంద్రంగా పనిచేసే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 44 శాతం వృద్ధి చెందిన రూ.387 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు రూ.1,979 కోట్ల నుంచి రూ.2,773 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 28 శాతం వృద్ధితో రూ.1,246 కోట్లకు చేరుకుంది. కానీ, నికర వడ్డీ మార్జిన్ క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 5.9 శాతంగా ఉంటే, తాజాగా సమీక్షా త్రైమాసికంలో 5.7 శాతానికి పరిమితమైంది. డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేయడమే, నికర వడ్డీ మార్జిన్ క్షీణతకు దారితీసినట్టు బ్యాంక్ సీఈవో సంజయ్ అగర్వాల్ తెలిపారు. సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లపై రేట్లను తగ్గించినా కానీ, రానున్న రోజుల్లో నికర వడ్డీ మార్జిన్‌పై ఒత్తిడి ఉంటుందని స్పష్టం చేశారు. డిపాజిట్ల సమీకరణ విషయంలో బ్యాంక్‌ల మధ్య పోటీ మొదలైనట్టు అంగీకరించారు. నిధుల వ్యయాలు 5.96 శాతం నుంచి 6.58 శాతానికి పెరిగిపోవడంతో, డిపాజిట్లపై రేట్లను తగ్గించక మరో దారి లేదన్నారు. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర వడ్డీ మార్జిన్ 5.5–5.7 శాతానికి తగ్గొచ్చని చెప్పారు. క్రెడిట్ కార్డ్‌ల రుణ పుస్తకం రూ.1,000 కోట్లను దాటిందని, ఈ విభాగంలో భవిష్యత్తులో బలమైన వృద్ధిని చూడనునున్నట్టు చెప్పారు. రుణాలు 29 శాతం పెరిగి రూ.63,635 కోట్లకు చేరాయి. స్థూల ఎన్పీఏలు 1.76 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు 0.55 శాతానికి పరిమితమయ్యాయి. -
విశాఖ బహిరంగ సభ: జన కెరటాలు
సాక్షి, విశాఖపట్నం: సాగర ఘోషను మించి విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిధ్వనించింది. నగరంలోకి వచ్చిన ప్రతి బస్సు, ఆటో, బైక్.. అన్నీ ఏయూ మైదానం వైపే కదిలాయి. సీఎం, పీఎం నినాదాలతో సాగర తీరం హోరెత్తింది. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం విశాఖ వచ్చిన ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకే వేదికపై కనిపించి తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అధికార యంత్రాంగం సమర్థంగా ఏర్పాట్లు చేసింది. తెల్లవారుజామునే.. విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో బహిరంగసభ నిర్వహించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం జన సమీకరణ చేపట్టింది. సుమారు 3 లక్షల మందికి సభాస్థలిలో ఏర్పాట్లు చేశారు. సభాప్రాంగణం పూర్తిగా నిండిపోగా లక్షలాది మంది దారిలోనే నిలిచిపోయారు. అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి నుంచి కూడా తరలి వచ్చారు. వేకువ జామున 4 గంటల నుంచే ప్రయాణమై విశాఖ చేరుకున్నారు. 6 గంటల నుంచే సభాస్థలికి రావడం మొదలైంది. ఉదయం 9 గంటలకే సభా ప్రాంగణంలో సీట్లు నిండిపోయాయి. తర్వాత వచ్చిన వారంతా ప్రాంగణానికి ఇరువైపులా నిలుచుని సభ ముగిసేవరకూ ఓపిగ్గా నిరీక్షించడం విశేషం. 6 వేలకు పైగా బస్సులు, 15 వేల పైచిలుకు ఇతర వాహనాల్లో జనం ప్రభంజనంలా తరలివచ్చారు. బహిరంగ సభ గ్రౌండ్లో కిక్కిరిసిపోయిన జనం సీఎం రాకతో హోరెత్తిన ఏయూ.. ఉదయం 9.40 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకోవడంతో సీఎం.. సీఎం.. జై జగన్ నినాదాలతో మార్మోగింది. లక్షలాది గొంతులు ఏకమై ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడంతో ఏయూ క్యాంపస్ హోరెత్తింది. అనంతరం ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి జగన్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారని ప్రకటించిన వెంటనే జై జగన్.. జై విశాఖ నినాదాలతో హోరెత్తింది. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపూ ప్రజలు హర్షధ్వానాలతో ప్రతిస్పందించారు. అర్ధరాత్రి నుంచే అల్పాహారం.. సభకు తరలి రావడం నుంచి తిరిగి వెళ్లే వరకూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సిద్ధం చేసిన అల్పాహారాన్ని వేకువ జామున 2 గంటలకే 158 పాయింట్ల వద్దకు తరలించి వస్తున్న ప్రతి ఒక్కరికీ అందజేశారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలోనే ప్రతి ఒక్కరికీ భోజన పార్శిళ్లను కూడా అందజేశారు. లక్షల లీటర్ల మంచినీరు, వేలాది మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఆద్యంతం ఎక్కడికీ కదలకుండా చివరి వరకూ ఉన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 6,700 మంది పోలీసులు గట్టి భద్రతా కల్పించారు. మూడంచెల భద్రతా వ్యవస్థని ఏర్పాటు చేశారు. అధికారులు పూర్తి సమన్వయంతో వ్యవహరించి భారీ బహిరంగ సభను విజయవంతం చేశారు. సభా ప్రాంగణం వెలుపల రోడ్లన్నీ ఇలా జన ప్రవాహంతో నిండిపోయాయి.. ప్రధానికి ఘన వీడ్కోలు గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): రెండు రోజుల పర్యటన ముగించుకుని శనివారం మధ్యాహ్నం విశాఖ నుంచి తిరుగు పయనమైన ప్రధాని మోదీకి రాష్ట్ర అధికార యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, తూర్పు నావికాదళం కమాండ్ ఇన్ చీఫ్ ప్లాగ్ అధికారి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్‌దాస్ గుప్తా, విశాఖ జేసీ విశ్వనాథ్ తదితరులు ప్రధానికి వీడ్కోలు పలికారు. ప్రధాని మోదీ ఏయూలోని సభా స్థలం నుంచి హెలికాఫ్టర్‌లో నేరుగా ఐఎన్ఎస్ డేగాకు 11.26 గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 11.56 గంటలకు హైదరాబాద్ బయలుదేరారు. విశాఖ సభ సైడ్ లైట్స్.. ► ప్రియమైన సోదరీ సోదరులారా నమస్కారం... గవర్నర్ విశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సహచర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నమస్కారం..’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ....భారత్ మాతాకీ జై అంటూ అందరితో నినాదాలు చేయించి తన ప్రసంగాన్ని తెలుగులోనే ముగించారు. ► విశాఖను విశేష నగరంగా ప్రధాని అభివర్ణించడంలో సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది. ► రైల్వే మంత్రి కూడా తన ప్రసంగాన్ని అందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో ప్రారంభించారు. ► ఉదయం 9.40 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్ నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్డు మార్గంలో సభాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఉన్న ఐఎన్ఎస్ చోళ సూట్ నుంచి ప్రధాని మోదీ రోడ్డు మార్గంలోనే ఏయూ మైదానానికి వచ్చారు. ► భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కానున్నట్లు అంచనా వేసిన అధికార యంత్రాంగం అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసింది. మొత్తం 3 లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలోనూ ప్రజలు భారీగా తరలి వస్తుండటం విశేషం. ► సభ ముగిసిన తరువాత ప్రధాని, ముఖ్యమంత్రి వేదిక నుంచి దిగుతున్న సమయంలోనూ వేల మంది వస్తుండటం కనిపించింది. అప్పటికే కార్యక్రమం ముగిసిందని పోలీసులు చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. ► సీఎం జగన్ 10 నిమిషాల పాటు మాట్లాడగా ప్రధాని మోదీ 25 నిమిషాలకుపైగా ప్రసంగించారు. ► ప్రధానిని శాలువాతో సత్కరించి శ్రీరాముడి విగ్రహాన్ని సీఎం అందజేశారు. ► ప్రధాని ప్రారంభించనున్న ప్రాజెక్టులకు సంబంధించిన ‘ఏవీ’ని ప్రదర్శించారు. ► సభా ప్రాంగణం నుంచి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వేర్వేరు హెలికాప్టర్లలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ► ప్రధాని మోదీ 11.26కి ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఐఎన్ఎస్ డేగా నుంచి ప్రత్యేక విమానంలో 11.56కి హైదరాబాద్ పయనమయ్యారు. ► ప్రధాని మోదీకి వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఐఎన్ఎస్ డేగా నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు విమానాశ్రయానికి చేరుకొని 12.20కి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. ► వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్ రాజబాబు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ముత్తంశెట్టి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, మేయర్ హరివెంకటకుమారి తదితరులు ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలు పలికారు. – సాక్షి నెట్వర్క్ -
రాష్ట్రాభివృద్ధికి మీ సహాయ సహాకారాలు మరింత కావాలి: సీఎం జగన్
-
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘ఎనిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదు. విభజన హామీల్లో పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకూ.. స్టీల్‌ప్లాంట్ నుంచి రైల్వే జోన్ దాకా పలు అంశాలపై అనేకసార్లు విజ్ఞప్తులు చేశాం. మీరు (ప్రధాని మోదీ) సహృదయంతో వాటిని సానుకూలంగా పరిష్కరించాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు మినహా మా ప్రభుత్వానికి మరో అజెండా లేదు.. ఉండదు.. ఉండబోదు’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. శనివారం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో విభజన హామీలను నెరవేర్చాలంటూ ప్రధాని మోదీని సీఎం జగన్ మరోసారి కోరారు. తొలుత వేదికపైకి ప్రధానికి సాదరంగా స్వాగతం పలుకుతూనే.. రాష్ట్ర పరిస్థితులు, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలు, దీర్ఘకాలంగా ప్రజల ఆకాంక్షలను ఆయన ముందుంచారు. ఉత్తరాంధ్ర గడ్డపై నడయాడిన అభ్యుదయ వాదులు గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, వంగపండు సూక్తులను తన ప్రసంగంలో సీఎం జగన్ ప్రస్తావించారు. ఆ వివరాలివీ.. పున్నమి కెరటాలకు మించి.. ఇక్కడకి వచ్చిన ప్రజలను చూస్తుంటే ప్రజాకవి, గాయకుడు వంగపండు మాటలు, పాటలు గుర్తుకొస్తున్నాయి. ‘ఏం పిల్లడో ఎల్దామొస్తవా..!’ అంటూ ఈ రోజు మనం తలపెట్టిన ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా కదలి రావడం కనిపిస్తోంది. ఈ రోజు చారిత్రక ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఒకవైపు సముద్రం కనిపిస్తోంది. మరోవైపు జన సముద్రాన్ని తలపిస్తోంది. కార్తీక పౌర్ణమివేళ ఎగసిపడిన కెరటాలకు మించి జన కెరటాలు ఇక్కడ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దేశ ప్రగతి రథసారధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రివర్యులకు, లక్షలాదిగా తరలి వచ్చిన నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవ్వా తాతలకు ప్రభుత్వం తరపున ఉత్తరాంధ్ర గడ్డ మీద విశాఖలో సాదరంగా స్వాగతం పలుకుతున్నా. ఆకాంక్షలకు అద్దం.. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని చాటి చెప్పిన విజయనగరం వాసి, మహాకవి గురజాడ మాటలు మనందరికీ కర్తవ్య బోధ చేస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలకు ఇక్కడకు తరలి వచ్చిన జన సాగరం అద్దం పడుతోంది. ఇదే నేలమీద నడయాడిన మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే ‘‘వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయ్..’’ అంటూ కదలివస్తున్న లక్షల జనసందోహం మన ఎదుట కనిపిస్తోంది. దాదాపు రూ.10,742 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న ప్రధాని మోదీకి అశేష జనవాహిని తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున నిండు మనసుతో కృతజ్ఞతలు. ప్రతి కుటుంబం నిలదొక్కుకునేలా.. ప్రజల ప్రభుత్వంగా గత మూడున్నరేళ్లలో పిల్లల చదువులు, వైద్యం, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమంతో పాటు అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించాం. వికేంద్రీకరణ, పారదర్శకత కోసం గడప వద్దకే పరిపాలన లాంటివి మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం. ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవడం అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి ఒక్క కుటుంబం నిలదొక్కుకోవడమే అని నమ్మి ఇంటింటా ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి మా ఆర్థిక వనరుల్లో ప్రతి రూపాయినీ సద్వినియోగం చేశాం. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా శక్తి మేరకు మేం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం మరింత సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా. ప్రతి రూపాయీ పునర్నిర్మాణానికే.. ఎనిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. మా గాయాలు మానేలా, మా రాష్ట్రం జాతీయ స్రవంతితో కలసి అభివృద్ధి చెందడానికి వీలుగా విశాల హృదయంతో మీరు కేటాయించే ప్రతి సంస్థ, అదనంగా ఇచ్చే ప్రతి రూపాయీ ఏపీ పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని ఏపీ కోసం చేసే ఏ మంచి పనైనా రాష్ట్ర ప్రజానీకం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంతో గానీ, ప్రత్యేకంగా ప్రధాని మోదీతో గానీ మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకతీతం. ఏపీకి, రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను ఇక్కడి ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. డీజీపీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని సీఎం జగన్ శనివారం అభినందించారు. విశాఖలో ప్రధాని రెండు రోజుల పర్యటన సందర్భంగా డీజీపీ.. సీనియర్ ఐపీఎస్‌ల నేతృత్వంలో పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు. డీజీపీ పర్యవేక్షణలో తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని నగర పర్యటన, రోడ్ షోకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖను సీఎం అభినందించారని డీజీపీ కార్యాలయం వెల్లడించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అమరావతిలో నిర్మాణాలు కూడా ఇబ్బందికరమే: ప్రొ. విశ్వనాథమ్
-
బోస్టన్ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం: ఏయూ రిజిస్ట్రార్
-
ఏపీ ఆర్ సెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ఆర్ సెట్-2019 ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. 14 యూనివర్శిటీల్లో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలను పొందేందుకు ఆర్ సెట్ నిర్వహిస్తునట్లు తెలిపారు. 70 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష ఉంటుందన్నారు. ఈ నెల 8 నుంచి 11 వరుకు హైదరాబాద్‌తో సహా 10 నగరాల్లో ఏపీ ఆర్ సెట్ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఆర్ సెట్ ప్రాథమిక కీ ఈ నెల 13న విడుదల చేస్తామన్నారు. ఈ నెల 15 వరుకు అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. ఒక నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతిచ్చేది లేదని వీసీ ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. -
20న ఏపీ సెట్..
సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 20న ఏపీ సెట్ నిర్వహిస్తున్నామని ఏయూ వీసీ ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి మీడియాకు వెల్లడించారు. యూజీసీ అనుమతితో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతుల కోసం ఏపీ సెట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పేపర్-1 ఉదయం 9.30 గంటల నుంచి పదిన్నర గంటల వరుకు, పేపర్-2 ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరుకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం-1లో 50 ప్రశ్నలకు వంద మార్కులు, ప్రశ్నాపత్రం-2లో వంద ప్రశ్నలకు రెండు వందల మార్కులు ఉంటాయని వీసీ చెప్పారు. విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రసాదరెడ్డి తెలిపారు. ఏపీ సెట్‌కు 34,020 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని వెల్లడించారు. విశాఖ రీజియన్‌లో అత్యధికంగా 7805 మంది హాజరవుతున్నారన్నారు. పరీక్ష హాలులోకి సెల్ఫోన్లు అనుమతి లేదని.. తీసుకొస్తే కేసులు నమోదు చేస్తామని వీసీ స్పష్టం చేశారు. -
నేడు ఏయూ పూర్వవిద్యార్థుల సమ్మేళనం
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశానికి (వేవ్స్–2018) బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ కేంద్రం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా హాజరుకానున్నారు. ఈయన రాకతో సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. ఉదయం ప్రతీ విభాగంలో ఆయా విభాగాల పూర్వ విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రధాన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తారు. సాయంత్రం 4.45 గంటలకు రతన్ టాటా కన్వెన్షన్ సెంటర్‌కు విచ్చేసి వేవ్స్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు. అ‘పూర్వ’ సహకారం ఘన చరిత గల విశ్వవిద్యాలయాన్ని మరింత వృద్ధి చేసేందుకు అపూర్వ సహకారం అందిస్తున్నారు పూర్వ విద్యార్థులు. ఇంజినీరింగ్ విద్యార్థుల జ్ఞాపిక: ఏయూ హాస్పిటల్ : ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఉత్తర ప్రాంగణంలో 1981–85 బ్యాచ్ విద్యార్థులు వైద్యశాలను నిర్మించి అందించారు. రెండు అంతస్తుల్లో వైద్యసేవలు, ఎక్స్‌రే, ఫార్మసీ వంటి సేవలు అందించేలా దాదాపు 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.75లక్షలతో భవనాన్ని నిర్మించి వర్సిటీకి కానుకగా అందించారు. మైకేల్ స్మతిచిహ్నం ఫార్మసీ భవనం : ఏయూ ఫార్మసీ పూర్వ విద్యార్థి తాటికొండ కృపాకర్ పాల్ తన కుమారుడు మైకేల్ జ్ఞాపకార్థం రూ.5కోట్లతో నూతన భవనాన్ని అందించారు. పురాతన రాతి భవనాన్ని తలపించేలా దీనిని నిర్మించారు. జీఎంఆర్ : వ్యాపార దిగ్గజం గ్రంథి మల్లికార్జునరావు ఏయూ టీచర్స్ అసోసియేషన్‌కు సొంత భవనాన్ని నిర్మించారు. ఆచార్య బీల సత్యనారాయణ వీసీగా ఉన్న సమయంలో జీఎంఆర్ రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ప్రస్తుతం పూర్వ విద్యార్థుల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం పైభాగంలో ఆపూస కార్యాలయాన్ని ఆధునిక వసతులతో తీర్చిదిద్దారు. దీనికి అదనంగా స్మార్ట్ సెమినార్ హాల్, మల్టీ పర్పస్ హాల్‌ను రూ 50 లక్షలు వ్యయంతో నిర్మించారు. అదే విధంగా సంఘానికి రూ. కోటి నిధులను అందించారు. తండ్రి కానుకగా ఆడిటోరియం అందించిన వైవీఆర్ : ఏయూ ఇంజినీరింగ్ కళాశాల కెమికల్ ఇంజినీరింగ్ విభాగ పూర్వవిద్యార్థి వై.వి.ఎస్ మూర్తి వర్సిటీకి రూ.50 లక్షలు అందించాలని భావించారు. ఆ కోరికను తీర్చారు ఆయన కుమారుడు వై.వెంకటరావు. రూ 2 కోట్ల వ్యయంతో మూడు వందల మంది పట్టే విధంగా వైవీఎస్ మూర్తి ఆడిటోరియంను బహుమతిగా అందజేశారు. మరెందరో స్ఫూర్తిప్ర‘దాతలు’ ♦ పారిశ్రామిక వేత్త కుమార్‌రాజా తాను చదువుకున్న మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో రూ. 10 లక్షలతో డిజిటల్ తరగతిని ఏర్పాటుచేశారు. ఇదే తరహాలో కామర్స్ మేనేజ్మెంట్ విభాగానికి మరో తరగతి గదిని అందించారు. ♦ కామర్స్ విభాగం 1983–85 బ్యాచ్ ఎంబీఏ విద్యార్థులు సమావేశ మందిరాన్ని ఆధునికీకరించారు. దీనికి రూ. 10 లక్షల వరకు వెచ్చించారు. ♦ కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో 1966–71 బ్యాచ్ విద్యార్థులు 8.5 లక్షలతో వర్చువల్ క్లాస్‌రూమ్‌ను అభివృద్ధి చేశారు ♦ ఏయూ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణకు విశ్రాంత ఆచార్యురాలు సహాయం అందించారు. ♦ సివిల్ ఇంజినీరింగ్ విభాగ పూర్వవిద్యార్థులు విభాగ విద్యార్థినులకు ఉపయుక్తంగా అవసరమైన భవనాన్ని, వసతులను నిర్మించి అందించారు. కట్టమంచి దత్తపుత్రికలా..ఆవిర్భవించిందిలా.. ‘మనం పేదవాళ్లం కావచ్చు, బిచ్చగాళ్లం కానవసరం లేదు’ అని చెప్పేవారట కట్టమంచి రామలింగారెడ్డి. అందరికీ విద్య అందించాలనే సంకల్పంతో ప్రత్యేక విశ్వవిద్యాలయం కోసం నాటి పాలకులతో పోరాటమే చేశారాయన. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ప్రభుత్వంపై పలుమార్లు తెచ్చిన ఒత్తిడి ఫలితంగా వారు అంగీకరించక తప్పలేదు. ఆయన కృషి ఫలితంగా .. మానస పుత్రికలా అంకురార్పణ జరిగింది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి.. 1926 ఏప్రిల్ 26న తమ కలల సాకారంగా ఆవిర్భవించిన ఏయూను అభివృద్ధి చేసే బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్న కట్టమంచి తన వేతనం రూ. 2 వేలలో సగాన్ని వర్సిటీ అభివృద్ధికి విరాళంగా అందించేవారు. దేశాభివృద్ధికి ఉపకరించే విలువైన మానవ వనరులను తయారు చేయాలని నిరంతరం పరితపించేవా రు. ఈ ప్రక్రియలో ఉపకులపతి పదవిని తృణ ప్రాయంగా త్యజించి.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను వీసీగా తీసుకువచ్చారు. సర్వేపల్లి అనంతరం రెండో పర్యాయం ఉపకులపతిగా పనిచేసిన కట్టమంచి ఏయూ ఖ్యాతిని దిగంతాలకు వ్యాప్తిచేశారు. విశ్వవిద్యాలయం బోధన నియామకాలలో కేవలం ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చి విభిన్న ప్రాంతాల నిపుణులకు స్థానం కల్పించారు. మేధావుల నిలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజకీయ, న్యాయ శాస్త్ర కోవిదులను అందించింది. తత్వశాస్త్రం, ప్రభుత్వ పాలన, రాజనీతి శాస్త్రం, హిందీ, పారా సైకాలజీ విభాగాలకు చెందిన ఆచార్యులు పద్మశ్రీ, పద్మభూషన్, పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా పనిచేశారు. క్రీడల్లో అత్యుత్తమ స్థానాలను అందుకోవడం, పరిపాలనా పరంగా రాణించడం జరిగింది. రాజకీయ రంగంలో రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా, పార్లమెంట్ స్పీకర్‌గా ఏయూ పూర్వవిద్యార్థులు పనిచేయడం వర్సిటీకి నూతన చరిత్రను ఆపాదించాయి. శాస్త్ర పరిశోధన రంగానికి నిపుణులను, శాస్త్రవేత్తలను అందించింది. షార్, ఇస్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఏయూ విద్యార్థులు నేడు పదుల సంఖ్యలో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అణుశాస్త్ర వికాసానికి ఎంతో దోహదం చేసింది. అణుభౌతిక శాస్త్రం, మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ, జియాలజీ వంటి వి భా గాలు దూరదృష్టితో ప్రారంభించబడి దేశానికి మేధావుల కొరత రాకుండా చూస్తున్నాయి. భౌగోళికంగానూ ప్రత్యేకమే.. ఎదురుగా ఉవ్వెత్తున ఎగసి పడే సముద్ర కెరటాలు.. మరో వైపు నిశ్చలంగా దర్శనమిచ్చే పర్వత శ్రేణి. ఈ రెంటికి నడుమ విశాల ప్రాంగణంలో నెలవైన ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఈ భౌగోళిక స్వరూపమూ యువతకు ఓ సందేశాన్నిస్తున్నట్లుగా ఉంటుంది. కెరటంలా ఉవ్వెత్తున ఎగిసే అనంత శక్తిని తనలో నింపుకొని వచ్చిన యువతను తొణకని, బెణకని మేరు శిఖరంలా మలచే, మేధావిగా తీర్చిదిద్దే విద్యానిలయంగా వర్థిల్లాలనే ఆకాంక్ష నిబిడీకృతమైనట్లు కనిపిస్తుంది. ఇటువంటి రెండు విభిన్న ప్రాంతాల మధ్య నెలకొన్న విశ్వవిద్యాలయం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. దీనిని గుర్తించి, ఇక్కడ ఏర్పాటు చేసిన కట్టమంచి మరెంతో మహోన్నతుడు. స్ఫూర్తిప్రదాత రాజా విక్రమ్‌దేవ్ వర్మ వర్సిటీకి విలువైన భూములు, నిధులను అందించారు జైపూర్ సంస్థానాధీశులు. విశ్వవిద్యాలయానికి మూడు వందల ఎకరాల వరకు భూములతో పాటు భౌతిక శాస్త్రవిభాగాన్ని అందించారు రాజా విక్రమ్ దేవ్‌వర్మ. ఉన్నత విద్యావంతుడైన రాజా విక్రమదేవ్ వర్మ సైన్స్ కళాశాల భవనాలను నిర్మించడమే కాకుండా విశ్వవిద్యాలయం నిర్వహణకు ఏడాదికి లక్ష రూపాలను ప్రతీ సంవత్సరం వర్సిటీకి అందించేవారు. నాటి రోజుల్లో లక్ష రూపాయలు నేటి కోట్లకు సమానం. -
మీ వెంట మేముంటాం..
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగులకు పూర్తిస్థాయిలో ఉద్యోగ భద్రత కల్పించే వరకు వైఎస్సార్సీపీ విశ్రమించబోదని పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాస్ వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. గురువారం ఉదయం ఏయూలో జరుగుతున్న ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యను పలుమార్లు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం మరో పర్యాయం మంత్రితో ఉద్యోగుల సమస్య పరిష్కరించమని, రెగ్యులరైజ్ చేయాలని కోరానన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి అద్దెలు చెల్లిస్తూ నగరంలో కుటుంబంతో జీవనం కష్టతరమవుతోందన్నారు. అధికార పార్టీ నేతలు, స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. తాను ఇప్పటికే ఉద్యోగుల సమస్యలను పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. వర్సిటీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని ఆయన తన మాటగా చెప్పమన్నారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే వర్సిటీ ఉద్యోగుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగులకు న్యాయం చేయని పక్షంలో విద్యాశాఖమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. వర్సిటీ ఉద్యోగులు నిర్వహించే ప్రతీ ఉద్యమంలో తాను భాగం అవుతానని, వారి వెంట నిలచి ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపిస్తామన్నారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి చేపట్టే సమ్మెకు తాము సంఘీభావం తెలుపుతున్నామన్నారు. ఉద్యోగులు చాలీచా లని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి కుటుంబాలకు మంచి జీవితాన్ని ఇవ్వాలంటే ఉద్యోగాలు పర్మినెంట్ చేయడం ఒక్కటే పరిష్కారమన్నారు. అవసరమైతే ఉద్యోగులతో కలసి మంత్రి గంటా ఇంటికి వెళ్లి మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఉద్యోగుల శ్రేయోభిలాషికే మద్దతు జేఏసీ ఉపాధ్యక్షుడు డి.వి.రామకోటిరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేస్తామని ఇప్పటికే వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించారని దీనిని స్వాగతిస్తామన్నారు. అదే విధంగా వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తారని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు. వారు మాట నిలుపుకోవాలని మరో పర్యాయం విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. చిత్తశుద్ధితో ఉద్యోగుల సంక్షేమానికి పనిచేసే వారికే పట్టం కడతామన్నారు. స్వతంత్య్ర వ్యవస్థగా ఉన్న విశ్వవిద్యాలయం ఉద్యోగులకు పర్మినెంట్ చేయడంలో వివిధ జీవోల సాకు చూపుతూ నిలుపు చేయడం సరికాదన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం ఉద్యోగులకు అందించాలన్నారు. జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ జి.రవికుమార్ మాట్లాడుతూ 28 రోజులు, టైంస్కేల్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇ.లక్ష్మణరావు, జాయింట్ సెక్రటరీ ఎస్.కె ఫరీద్ మాట్లాడుతూ సమస్య పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి కె.అప్పారావు, వర్కింగ్ సెక్రటరీ సి.హెచ్.ఎన్. సత్యనారాయణ, మెల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహిచారు. పరిపాలనా భవనం నుంచి ఏయూ మెయిన్ గేట్ వరకు ర్యాలీ జరిపారు. ‘అమలుకాని వాగ్దానాలతో టీడీపీ వంచన’ ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించి, వారిని పర్మినెంట్ చేయాలని వైఎస్సార్‌ఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. వర్సిటీలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు తమ సంఘీభావం తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తయినా నేటికీ సమస్యలు పరిష్కరించకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగుల పోరాటానికి బాసటగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ఎస్‌యూ పార్లమెంట్ అధ్యక్షుడు బి.కాంతారావు, అరకు పార్లమెంట్ అధ్యక్షుడు టి.సురేష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు బి.మోహన్‌బాబు, కోటి రవికుమార్, ఎం.కళ్యాణ్, విద్యార్థి నాయకులు పి.సుధీర్‌పాల్, కుమార స్వామి, క్రాంతి కిరణ్, సాయికృష్ణ, రాధాకృష్ణ, విజయ కృష్ణ, వెంకటేష్, విజయ్, వినోద్, సంజయ్, జాన్సన్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపి సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల
విశాఖ : ఏపీ సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్‌ను ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మార్చి 26 నుంచి మే 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. అప్లికేషన్ ఫీజు జనరల్ కేటగిరి అభ్యర్ధులకు రూ.1000, బీసీ కేటగిరి అభ్యర్ధులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్ధులకు రూ.500గా నిర్ణయించారు. వెయ్యి రూపాయల అదనపు రుసుముతో మే 10, రెండు వేల అదనపు రుసుముతో మే 21, ఐదు వేల అదనపు రుసుముతో జూన్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పిస్తున్నట్టు ప్రొఫెసర్ తెలిపారు. ఏపీలోని విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి మొత్తం ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
ఉలిక్కిపడిన ఏయూ విద్యార్థులు
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల మెస్–1లో సాంబరులో బల్లి పడడంతో కలకలం రేగింది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భోజనానికి సిద్ధమైన విద్యార్థులు సాంబారు బకెట్లో బల్లిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటికే కొద్దిమంది తమ భోజనం ముగించారు. దీంతో వారంతా తమకు ఏమవుతుందోనని ఆందోళన చెందారు. మిగతా విద్యార్థులు భోజనం చేయకుండానే బయటకు వచ్చేశారు. హాస్టల్ మెస్ నుంచి బల్లి దర్శనమిచ్చిన సాంబారు బకెట్‌ను పట్టుకుని ర్యాలీగా ఏయూ మెయిన్‌గేట్ వద్దకు చేరుకున్నారు. తమ అవస్థలను ఏకరువు పెట్టారు. గేటు మూసివేసి ధర్నాకు దిగారు. తరచూ ఇదే తంతు: ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్లో పనిచేసే సిబ్బందికి నిర్లక్ష వైఖరి ఎక్కువైందని ఆరోపించారు. వండిన ఆహార పదార్థాలపై ఎటువంటి మూతలు పెట్టడడం లేదన్నారు. దీని కారణంగానే ప్రస్తుతం సాంబారులో బల్లి పడి ఉంటుందని చెప్పారు. ఇటువంటి సంఘటనలు కారణంగా విద్యార్థులు అస్వస్తతకు గురైతే ఎవరి బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తమను ప్రశ్నించేవారు లేరనే ధీమాతో హాస్టల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాణ్యత దేవుడెరుగు: హాస్టల్లో ఆహార పదార్థాల నాణ్యత నానాటికీ తీసికట్టుగా మారిపోతోందని విద్యార్థులు వాపోయారు. ఆహారం రుచిగా ఉండడం లేదని అడిగితే ఛీదరించుకుంటున్నారన్నారు. వర్సిటీ అధికారులు సైతం తమ సమస్యలను వినడం లేదన్నారు. సాంబారుకు, రసానికి తేడా ఉండడం లేదన్నారు. అధికారులు తమ గోడు వినాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏయూ మెయిన్‌గేట్ మూసివేసి ఆందోళనకు దిగారు. వర్సిటీ ఉన్నతాధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని నినదించారు. హాస్టల్ మెస్‌లను ప్రక్షాళన చేయాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. విద్యార్థులకు అండగా ఎస్ఎఫ్ఐ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. సంఘీభావం తెలిపి బాసటగా నిలిచారు. ప్రిన్సిపాల్ హామీతో శాంతించిన విద్యార్థులు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి.వినోదరావు, వార్డెన్ రమేష్‌బాబు విద్యార్థుల వద్దకు వచ్చి వారి సమస్యను విన్నారు. సాయంత్రం మెస్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని, అవసరమైన చర్యలు తీసుకుంటా మని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఆందోళన విరమించి తరగతులకు వెళ్లారు. -
డిసెంబర్లో ఏయూకు రాష్ట్రపతి కోవింద్!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నారు. డిసెంబర్ 7న విశాఖలోని తూర్పు నావికాదళ స్వర్ణోత్సవాలకు ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అదే రోజు రాష్ట్రపతి ఏయూను సందర్శించనున్నారు. గతంలో ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని ఏయూకు రావాలని ఆహ్వానించారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. -
ఏయూలో బయోమెట్రిక్ రగడ
-
పులకించిన విశాఖ సాగర తీరం
-
ఏయూ డిగ్రీ పేపర్ లీక్
⇒ వాట్సాప్‌లో ప్రత్యక్షమైన గణిత ప్రశ్నపత్రం ⇒ పరీక్షను రద్దు చేసిన అధికారులు విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో (ఏయూ) జరుగుతున్న డిగ్రీ మూడో సంవత్సర గణిత ప్రశ్నపత్రం లీకైంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన గణితం పేపర్ 3 లీనియర్ ఆల్జీబ్రా ప్రశ్నపత్రం ముందుగానే బయటకు పొక్కింది. ఇది వాట్సాప్‌లో విద్యార్థుల మధ్య పంపిణీ జరిగినట్లు తెలిసింది. విషయం తెలిసిన వెంటనే పరీక్షను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటించారు. ప్రశ్నపత్రం లీకైందనే సమాచారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీడియా సంస్థలకు అందింది. దీన్ని సరిచూసుకోవడానికి ఆ ప్రశ్నపత్రాన్ని ఏయూ అధికారులకు పంపారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేతృత్వంలో అధికారులు వాట్సాప్‌లో వచ్చిన ప్రశ్నపత్రాన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్న అసలు ప్రశ్నపత్రంతో సరిచూశారు. ప్రశ్నలు, ప్రశ్నపత్రం కోడ్ సరిపోవడంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన పరీక్షను వెంటనే రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు ప్రకటించారు. పరీక్షల విభాగం అధికారులు ఈ సమాచారాన్ని ఇతర కళాశాలలకు అందించినప్పటికీ దాదాపు అన్ని కళాశాలల్లో అప్పటికే బండిల్స్ తెరిచారు. ఇక చేసేది లేక ప్రశ్నపత్రాలను తిరిగి తమకు పంపాలని ఆదేశించారు. ప్రత్యేక పరిశీలకులను పరీక్షలు జరుగుతున్న కేంద్రాలకు పంపారు. కేవలం గణిత ప్రశ్నపత్రం ఒక్కటే బయటకువచ్చిందా, మరికొన్ని కూడా వచ్చాయా అనే దిశగా అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చిందనే విషయంపై ఆరాతీస్తున్నారు. వర్సిటీ పరీక్షల విభాగం నుంచి బయటకు వచ్చిందా, అనుబంధ కళాశాలల నుంచి వచ్చిందా అనేది తేలాల్సి ఉంది. ‘గణితం ప్రశ్నపత్రం రద్దు చేశాం. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తాం. ప్రశ్నపత్రం లీక్‌పై పూర్తి స్థాయి విచారణ జరుపుతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని రిజిస్ట్రార్ వి. ఉమామహేశ్వరరావు తెలిపారు. -
ఏయూలో వీసి Vs రిజిస్ట్రార్
-
‘హోదా’ కోసం విద్యార్థుల ఒక్క రోజు దీక్ష
ఏయూ క్యాంపస్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థి లోకం అహరహం పనిచేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు అన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక నిధులు అందించాలని కోరుతూ విశాఖలోని ఏయూ మెయిన్ గేట్ వద్ద శనివారం ఉదయం విద్యార్థులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంతో పోరాడి హోదా సాధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం లాలూచీపడి హోదా ఉద్యమాన్ని నీరుగారుస్తున్నదన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ రోజుకో అబద్దం చెబుతూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తుంటే.. చలోక్తులతో వెంకయ్యనాయుడు కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది సాధ్యపడుతుందన్నారు. హోదా కలిగిన ఇతర రాష్ట్రాల ప్రగతిని చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. యువజన విభాగం నాయకుడు కొండా రాజీవ్ గాంధీ మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ప్రజల సంజీవనిగా ప్రత్యేక హోదా నిలుస్తుందని, దీన్ని అడ్డుకోవాలని చూడటం దారుణమని అన్నారు. రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ హోదాతోనే ఉపాధి అవకాశాలు విస్తరించే అవకాశం ఉందన్నారు. బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ తగిన ప్రాధాన్యత కల్పించలేదన్నారు. విద్యార్థి విభాగం ఏయూ అధ్యక్షుడు రాజ్‌కమల్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఎవరో ఇచ్చే భిక్ష కాదని, తెలుగు రాష్ట్ర ప్రజల హక్కు అని అన్నారు. బీసీ సమాఖ్య అధ్యక్షుడు ఫక్కి దివాకర్, వైఎస్ఆర్సీపీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి.మోహన్‌బాబు, జీవన్, కుమారస్వామి, రాధ, జగదీష్, నాని, కార్తీక్, కోటి, శ్రీనివాస్, చాణక్య, గరికిన వెంకట్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. విద్యార్థుల దీక్షకు ఉత్తరాంధ్ర విద్యార్థి సేన, నిరుద్యోగుల పోరాట సమితి, బీసీ యువజన సంఘం, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాల నాయకులు, లీడర్ పత్రిక సంపాదకుడు రమణమూర్తి తదితరులు సంఘీభావం తెలిపారు. రాజనీతి శాస్త్రవిభాగాధిపతి డాక్టర్ పి.ప్రేమానందం సాయంత్రం విద్యార్థులకు నిమ్మ రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. -
పరీక్ష బాగా రాయలేదని ఎం.ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య
పెదవాలే్తరు (విశాఖ తూర్పు): పరీక్ష బాగా రాయలేదని మనస్తాపానికి గురైన ఎం.ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాశాడు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన కర్నేటి రాజేష్(22) ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం పరీక్ష రాశాడు. తర్వాత హాస్టల్‌కు చేరుకుని భోజనం చేశాడు. అనంతరం స్నేహితులతో కాసేపు గడిపిన రాజేష్ హాస్టల్ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. సాయంత్రం హాస్టల్లో తోటి విద్యార్థి చైతన్య వచ్చి తలుపుకొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ లోంచి చూసే సరికి ఫ్యాన్‌కు ఉరివేసుకుని రాజేష్ వేలాడుతున్నాడు. దీంతో విద్యార్థులు మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజేష్ గదిలో పరిశీలించగా సూసైడ్ నోట్ లభించిందని ఎస్సై దాలిబాబు తెలిపారు. ఆ నోట్లో తన మరణానికి ఎవరూ కారణం కాదని, తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో తాను చదువులో రాణించలేకపోతున్నానని, భయస్తుడిని కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఉంది. ‘తమ్ముడూ.. అమ్మానాన్నలను నువ్వే చూసుకో’ అని కూడా ఉంది. జంగారెడ్డిగూడెంలో విషాదం జంగారెడ్డిగూడెం : రాజేష్ ఆత్మహత్యతో జంగారెడ్డిగూడెంలోని అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తొలుత రాజేష్‌కు సీరియస్‌గా ఉందని ఫోన్ రావడంతో అతని తల్లిదండ్రులు సత్యనారాయణ, లక్ష్మి ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత మరణవార్త తెలియడంతో తీవ్రంగా రోదిస్తున్నారు. బుధవారం రాత్రి రాజేష్ తండ్రి సత్యనారాయణతోపాటు బంధువులు సుమారు 20 మంది కార్లలో వైజాగ్ బయలుదేరి వెళ్లారు. రాజేష్ తండ్రి సత్యనారాయణ జీడిపిక్కల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. తన ఇద్దరు కొడుకులను చదివించుకుంటున్నాడు. రాజేష్ తమ్ముడు మధుబాబు డిగ్రీ పూర్తిచేసి స్థానిక వైనాట్ షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. నా కొడుకు పిరికివాడు కాదు నా కొడుకు రాజేష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. తొలి నుంచి బాగా చదివే విద్యార్థి. బీఫార్మసీ సీటు ఉచితంగా లభించింది. ఎంఫార్మసీలోనూ ఆంధ్రాయూని వర్సిటీలో సీటు లభించింది. ఇటీవలే సంక్రాంతికి ఇంటికి వచ్చాడు. 19న వైజాగ్ వెళుతూ రూ.6వేలు హాస్టల్ ఫీజు కట్టాలని అడగ్గా, రూ.7వేలు ఇచ్చి పంపాను. ఇంతలోనే నా కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం వచ్చింది. రాజేష్‌కు ఎటువంటి ఇతర వ్యవహరాలూ లేవు. సూసైడ్ నోట్ రాసినట్టు చెబుతున్నారు. దానిపై అనుమానం ఉంది. – కర్నాటి సత్యనారాయణ, రాజేష్ తండ్రి -
ఏయూలో పీవీ ఐదవ స్మారకోపన్యాసం
-
ఉపాధి కల్పనే ధ్యేయం
► మంత్రి గంటా శ్రీనివాసరావు ► ఏయూలో సందడిగా జాబ్‌మేళా ► నేడూ కొనసాగింపు ఏయూ క్యాంపస్/బీచ్‌రోడ్ : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏయూ స్నాతకోత్సవ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ‘డిజిటల్ సమ్మిట్ జాబ్ మేళా 2016’ను ఆయన ప్రారంభించారు. ఉన్నత విద్యా మండలి, ఏయూ, మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్్స, మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సంయుక్తం గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ వర్సిటీలో కాలానుగుణంగా జాబ్‌మేళాలు నిర్వహించాలన్నారు. ఏయూ వీసీ జి. నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యాభ్యాసం పూర్తి చేసి కళాశాల నుంచి వెళ్లే సమయానికి విద్యార్థికి ఉపాధి అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జాబ్ మేళాలో 20 వేల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ సీఈవో ప్రసాద్, మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూష¯Œ్స సీఈవో శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేళా విజయవంతంపై హర్షం : జాబ్‌మేళాలో తొలిరోజు 1,250 మంది అభ్యర్థులు ఎంపిక కావడంపై మంత్రి గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. రెండోరోజు సైతం ఇదే స్ఫూర్తితో మరింత మందికి ఉపాధిని కల్పించాలని సూచించారు. ఏయూ, మిలీనియం, మిరాకిల్ సంస్థలు చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. 1250 మంది ఎంపిక : తొలిరోజు జరిగిన ప్రక్రియ లో 1, 250 మంది ఎంపికయ్యారు. వీరిలో మిరాకిల్ సంస్థలకు 282, యలమంచిలి సాఫ్ట్‌వేర్‌కు 50, ఐఐసీ టెక్కు 25, ఓపెన్ లాజిక్కు 125, ఏమ్జూర్కు 50, బల్క్హవర్కు 45, నోవల్ పేటెంట్‌కు 100, రోబో కంప్యూటెక్కు 100, మేట్రిక్స్ 50, జైన్ ఇన్ఫోటెక్‌కు 20 మంది, మిగతా సంస్థలకు మరికొంత మంది ఎంపికైనట్టు మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్ సీఈవో జి.శ్రీధర్ రెడ్డి తెలిపారు. హెచ్ఎస్బీసీ సంస్థ 700 మంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలో ఎంపిక చేసిందని, వీరికి శనివారం మరికొన్ని నైపుణ్యాల్లో పరీక్షించి, ప్రతిభావంతులను ఎంపిక చేస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చా జాబ్‌మేళా కోసం ఎంతో ఖర్చు చేసి హైదరాబాద్ నుంచి వచ్చా. అనుకున్నంత ఎక్కువ కంపెనీలు ఈ జాబ్‌మేళాల్లో పాల్గొనలేదు. ప్రతీ కంపెనీ వారు ఫోన్ చేసి చెబుతా మంటున్నారు. – ఎల్.హరీశ్, బీఎస్సీ, హైదరబాద్ మా కోర్సుకు ఉద్యోగాలు లేవట నేను బీఈ మెకానికల్ చేశాను. ఈ కోర్సుకు ఈ జాబ్‌మేళాలో పాల్గొన్న కంపెనీల్లో ఉద్యోగాలు లేవని చెబుతున్నారు. ప్రకటనలో అన్ని డిగ్రీ కోర్సుల వారికి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. తీరా వస్తే ఇక్కడ పరిస్థితి వేరు. జాబ్‌మేళా వల్ల సమయం వృథా అయింది. – పద్మజ, బీఈ, మెకానికల్ ఖాళీలను ముందే తెలపాలి ఏ ఏ కంపెనీల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ముందే తెలపాలి. జాబ్‌మేళా అంటే మౌకిక పరీక్షలు నిర్వహించి ఉద్యోగం వచ్చిందో లేదో వెంటనే చెప్పాలి. నేను నాలుగు కంపెనీ ఉద్యోగాల కోసం వెళ్తే.. అందరూ నా దరఖాస్తులు తీసుకొని ఫోన్ చేస్తామన్నారు. ఈ జాబ్‌మేళాలో రూ. 8 వేల నుంచి రూ.15 వేల మధ్య వచ్చే ఉద్యోగాలే ఉన్నాయి. ఈ జీతంతో నెలమొత్తం ఎలా నెట్టుకురాగలం. – సంపత్, బీటెక్ ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు జాబ్‌మేళా వల్ల ప్రముఖ కంపెనీలన్నింటికీ ఒకే చోట దరఖాస్తు చేసుకోవచ్చు. నేను రెండు ఉద్యోగాల కోసం మౌకిక పరీక్షలకు హాజరయ్యాను. వారు ఫోన్ చేసి చెబుతామన్నారు. నాకు ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉంది. – మనీషా, బీఎస్సీ నిరాశలో నిరుద్యోగులు ఏయూలో జరిగిన జాబ్‌మేళాలో నిరుద్యోగులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ప్రకటనలో తెలిపిన విధంగా మాత్రం ఇక్కడ పరిస్థితి లేకపోవడంతో ఆందోâýæన చెందారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకొని, ఫోన్ చేస్తామని చాలా సంస్థలు చెప్పడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కంపెనీలు సేల్స్‌మెన్ ఉద్యోగాలకు మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్పడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. -
ఏయూలో వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీ ప్రతినిధులు
ఏయూక్యాంపస్ : ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ సిడ్నీవర్సిటీ ప్రతినిధులు శుక్రవారం ఉదయం సందర్శించారు. వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు, ఇతర అధికారులు ప్రతినిధి బందం సమావేశమైంది. ఈ సందర్భంగా వీసీ నాగేశ్వరరావు ఏయూ స్వరూపం, కళాశాలలు, కోర్సులు వంటి అంశాలను వివరించారు. ఏయూ ఇప్పటికే అమెరికా, బ్రిటన్, సింగపూర్ దేశాలకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలతో సంయుక్తంగా పనిచేస్తోందని గుర్తుచేశారు. వర్సిటీ సామర్ధ్యాలు, విశిష్టతను తెలియజేశారు. వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీ ఎంటర్ ప్యూనర్‌షిప్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ గ్రీమీ సాల్టర్ మాట్లాడుతూ పరిశోధన ప్రధానంగా సేవలను అందించడం జరుగుతోందన్నారు. పరిశ్రమల అవసరాలను గుర్తించి కోర్సుల రూపకల్పన చేస్తామన్నారు. ఎంటర్‌ప్యూనర్‌షిప్‌లో బ్యాచులర్ డిగ్రీ కోర్సును నిర్వహిస్తున్నామన్నారు. వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్.సురేంద్ర మాట్లాడుతూ సాంకేతికత ఆధారితంగా బోధన నిర్వహించడం జరుగుతుందన్నారు. సంయుక్తంగా పనిచేస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉందన్నారు. పరిశ్రమలను దష్టిలో ఉంచుకుని కోర్సులను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి కేంద్రంగా తమ విశ్వవిద్యాలయం పనిచేస్తుందన్నారు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, జియో ఇంజనీరింగ్ వంటి కోర్సులను తమ విశ్వవిద్యాలయం అందించడం జరుగుతోందన్నారు. ఆర్కిటెక్చర్ కోర్సులను రానున్న విద్యా సంవత్సరం నుంచి తమ విశ్వవిద్యాలయంలో అందించే ఆలోచన ఉందన్నారు.వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీ సీనియర్ రీజినల్ మేనేజర్జూలియా షెల్లీ మాట్లాడుతూ 26 సంవత్సరాల క్రితం ప్రారంభించిన తమ వర్సిటీకి అనుసంధానంగా ఏడు కళాశాలల్లో 45 వేలమంది విద్యార్థులు విద్యను అభ్యశిస్తున్నారన్నారు. ఆవిష్కరణ రంగంలో విస్తత అవకాశాలు లభిస్తున్నాయని, సుస్థిర భాగస్వామి కోసం అన్వేషిస్తున్నామన్నారు. సాంస్కతిక వైవిద్య కలిగిన విశ్వవిద్యాలయంలో తమదొకటన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహరాల డీన్ ఆచార్య బి.మోహన వెంకట రామ్, ప్రిన్సిపాల్స్ సి.వి రామన్, కె.గీయత్రీ దేవి, డి.గౌరీ శంకర్, పి.ఎస్ అవధాని, కె.వైశాఖ్, ఆచార్య ఎం.ఎస్ ప్రసాదబాబు, విభాగాధిపతులు పాల్గొన్నారు. అనంతరం విదేశీ ప్రతినిధులను వీసీ నాగేశ్వరరావు సత్కరించి జ్ఞాపికలను బహూకరించారు. -
ఉత్సాహం..ఉరకేలేస్తూ...
ఏయూక్యాంపస్ : రక్తదాన చైతన్యం వెల్లివిరిసింది. యువతరం ఉత్సాహంగా తరలి వచ్చింది. వేలాది మంది ప్రాణాలకు రక్షగా ఉంటామని ప్రతిన బూనింది. తమ శక్తిని, రక్తాన్ని సమాజ హితానికి వినియోగిస్తామంది. ఆంధ్రవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవ మందిరంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి యూత్ పోటెత్తింది. రక్తదానం అవశ్యం... విస్తరిస్తున్న నగరంలో నిత్యం రక్తం కోసం వందలాది మంది రోగులు ఎదురుచూస్తుంటారు. వీరికి పూర్తిస్థాయిలో అవసరమైన రక్తం అందడం లేదు. దీనిని నివారించే దిశగా యువతరం కదలి వచ్చింది. ఆంధ్రవిశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం, ఎన్సీసీ సంయుక్తంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి రెండు వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా రక్తం కొరత వలన ఎదురవుతున్న సమస్యలను పరిష్కారం చూపడానికి కదిలారు. సాంస్కృతిక సమ్మేళనం... రక్తదాన శిబిరాన్ని వినూత్నంగా నిర్వహించారు. విద్యార్థులకు అక్కడికక్కడే రక్తదాన అవసరాన్ని తెలిపే విధంగా వివిధ ప్రశ్నలతోక్విజ్ నిర్వహించారు. వక్తత్వం, స్లోగన్ రచన పోటీలు జరిపారు. దీనితో పాటు విద్యార్థులు వివిధ శాస్త్రీయ, జానపద నత్యాలు చేశారు. దశావతార రూపకం ఎంతో ఆకట్టుకుంది. సాంస్కతిక సత్తాను చాటుతూ, రక్తదాన ప్రాధాన్యతను వివరించే దిశగా ఈ కార్యక్రమం సాగింది. యువత ఎంతో ఉత్సాహంగా నత్యాలు చేస్తూ గడిపారు. రక్తదానం చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను నిర్వాహకులు అందజేశారు. -
ఇలియట్ రచనా శైలిని అధ్యయనం చేయాలి
ఏయూక్యాంపస్: ఆంగ్ల రచయిత టి.ఎస్ ఇలియట్ వైవిధ్య రచనా శైలిని అధ్యయనం చేయాలని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ ఆంగ్ల విభాగంలో రీ విజిటింగ్ టి.ఎస్ ఇలియట్ జాతీయ సదస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తర ప్రత్యేక రచనా శైలితో ఇలియట్ ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నారన్నారు. ఇలియట్ రచనలను నేటి తరానికి పరిచయం చేస్తూ, అధ్యయనాలు జరిపించే దిశగా నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి తరం విద్యార్థులు ప్రముఖ రచయితల రచనలు, రచనా విధానాలను తెలుసుకుని అనుసరించాలన్నారు. తమ రచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల రచనలను యువత సునిశితంగా పరిశీలించడం అవసరమన్నారు.ఆచార్య విశ్వనాధరావు మాట్లాడుతూ విద్యను అందించిన ఆచార్యులను జీవితాంతం గుర్తుంచుకోవాలన్నారు. ఆచార్య కె.విశ్వనాధం తెలుగు, ఆంగ్ల, సంసత భాషలలో నిష్ణాతుడన్నారు. ఇటువంటి ఆచార్యులు నిరంతరం విద్యార్థులను తీర్చిదిద్దడానికి, పరిశోధనలను పెంపొందించడానికి పాటుపడ్డారని గుర్తుచేసుకున్నారు. బిఓఎస్ చైర్మన్ ఆచార్య టి.నారాయణ మాట్లాడుతూ రచనలో వైశిష్ట్యం, విమర్శనా వ్యాసాలను రచించి తన ప్రత్యేకతను చాటారన్నారు. విభాగాధిపతి ఆచార్య ఎల్.మంజుల డేవిడ్సన్ మాట్లాడుతూ ఆచార్య కె.విశ్వనాథం శత జయంతి సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు.ఇలియట్ రచనలపై ఆచార్య విశ్వనాధం విశిష్ట పరిశోధనలు, అధ్యయనం జరిపారని గుర్తుచేశారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు ఎస్.ప్రసన్నశ్రీ, జయప్రద, సాల్మన్బెన్నీ, విశ్రాంత ఆచార్యులు సుధీర్, చందు సుబ్బారావు, వాసుదేవరావు తదితరులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏపీఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
–స్పందన అంతంత మాత్రమే –885 మంది కౌన్సెలింగ్‌కు హాజరు యూనివర్సిటీక్యాంపస్: రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం ఏపీఎడ్‌సెట్–2016 కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎస్వీయూనివర్సిటీ(తిరుపతి), ఆంధ్రాయూనివర్సిటీ (వైజాగ్), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు), ఎస్కేయూనివర్సిటీ(అనంతపురం), అంబేద్కర్ యూనివర్సిటీ(శ్రీకాకుళం), జేఎన్టీ యూనివర్సిటీ(కాకినాడ)లలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం గణితం, ఇంగ్లీషు సబ్జెక్ట్‌లకు కౌన్సెలింగ్ నిర్వహిచంగా 885 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. తొలి రోజు స్పందన అంతంత మాత్రంగానే కన్పించింది. తిరుపతిలో 196 మంది, వైజాగ్‌లో 143 మంది, గుంటూరులో 201 మంది, అనంతపురంలో 193 మంది, కాకినాడలో 87 మంది, శ్రీకాకుళంలో 65 మంది కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం ఫిజికల్సైన్స్, బయాలజీ సబ్జెక్ట్‌లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. శనివారం కౌన్సెలింగ్‌కు హాజరుకాలేక పోయిన వారిని ఆదివారం కూడా కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామన్నారు. -
విద్యతో పేదరిక నిర్మూలన సాధ్యం
ఏయూక్యాంపస్: విద్యతో పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఉదయం ఏయూ సోషల్‌వర్క్ విభాగంలో కష్ణాపుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన ‘పేదరికంపై గెలుపు’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదరిక నిర్మూలన ముందుగా మన కుటుంబం, గ్రామం నుంచి ఆరంభం కావాల్సి ఉందన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యను కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేయాలన్నారు.రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ మాట్లాడుతూ నేడు పేదరికాన్ని కొంత వరకు అధిగమించడం జరిగిందన్నారు. స్వచ్చంద సంస్థలు ఈ ప్రక్రియలో చురుకైన భూమిక పోషిస్తున్నాయన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ సమర్ధ నాయకత్వంతో దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదరికంపై విజయం సాధించడానికి మరింత పనిచేయాల్సి ఉందన్నారు. ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీరామ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల మధ్య అభివద్ధిలో అసమానతలు ఉన్నాయన్నారు. నేటికీ విజనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కడప జిల్లాలో ఒక్క పరిశ్రమ స్థాపన జరగలేదన్నారు. ప్రాంతీయ అసమానతలు తొలగించి సమాన ప్రగతి సాధించడం ఎంతో అవసరమన్నారు. దీనిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాల్సి ఉందన్నారు. సోషల్‌వర్క్ విభాగాధిపతి ఆచార్య పి.అర్జున్మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, నీరు, ప్రాధమిక మౌళిక సదుపాయాలను కల్పించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించడానికి బాటలు వేయడం సాధ్యపడుతుందన్నారు. సోషల్‌వర్క్ విభాగ ఆచార్యులు ఎస్.వి సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పేదరికాన్ని అధిగమించి అభివద్ది చెందే విధానాన్ని ఉదాహరణలతో వివరించారు. సదస్సు సమన్వయకర్త ఆచార్య కె.విశ్వేస్వరరావు మాట్లాడుతూ స్వచ్చంద సంస్థలు భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యపడుతోందన్నారు. కార్యక్రమంలో 15 స్వచ్ఛంద సంస్థల నిర్మాహకులు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్దంసఖ్యలో పాల్గొన్నారు. -
అంతర్జాతీయ హాస్టల్ సిద్ధం
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన అధునాతన హాస్టల్‌ను వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఆదివారం సాయంత్రం సదర్శించారు. ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందింరానికి చేరువలో నిర్మాంణం పూర్తిచేసుకున్న భవనాన్ని పరిశీలించారు. పూర్తిస్థాయిలో పనులు ముగించి వచ్చే నెలలో విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని సూచించారు.విభిన్న దేశాల నుంచి ఏయూలో విద్యను అభ్యశించే విద్యార్థుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతోదన్నారు. దీనికి అనుగుణంగా అదనపు హాస్టల్స్‌ను నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఏయూ విద్యార్థులకు మరిన్ని హాస్టల్స్‌ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, విజయనిర్మాణ్ కంపెనీ అధినేత విజయకుమార్,చీఫ్ ఇంజనీర్ మాధవబాబు, పిఆర్ఓ ఎన్.వి.వి.ఎస్ఎస్ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. -
నన్నయ వర్సిటీ రిజిస్ట్రార్‌గా నరసింహారావు
నరసింహారావును అభినందిస్తున్న ఏయూ వీసీ నాగేశ్వరరావు ఏయూక్యాంపస్: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఏయూ వాణిజ్య నిర్వహణ విభాగం ఆచార్యుడు ఏ.నరసింహారావు నియమితులయ్యారు. ఈ మేరకు నన్నయ వర్సిటీ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయనను ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తన కార్యాలయంలో అభినందించారు. పటిష్టమైన అనుబంధ కళాశాలలను కలిగిన ఆదికవి నన్నయ వర్సిటీ నిర్వహణ ఎంతో కీలకమన్నారు. వీసీ ఆచార్య ముత్యాలనాయుడుతో సమన్వయం జరుపుతూ నన్నయ వర్సిటీ ప్రగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు. ఆచార్య నరసింహారావు ఫైనాన్స్, అకౌంటిగ్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో నిపుణుడు. క్రమశిక్షణ, సమయ పాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. వర్సిటీ పరిపాలనా వ్యవహారాలపై పూర్తి పట్టు కలిగి, సమర్థవంతునిగా నిరూపించుకున్నారు. 22న బాధ్యతల స్వీకరణ సోమవారం రాజహేంద్రవరంలో ఆచార్య నరసింహారావు బాధ్యతలు స్వీకరిస్తారు. నరసింహారావు ఎంకాం, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, పీహెచ్డీ పూర్తిచేశారు. ఏయూ ఆర్ట్స్ కళాశాల వార్డెన్‌గా, దూరవిద్యలో ఎంబీఏ కోర్సు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఏఐసీటీæఈ తనికీ బందం సభ్యుడిగా, ఏయూ సీపీసీ సభ్యుడిగా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అసోసియేట్ సభ్యునిగా ఉన్నారు. ఐసెట్ ప్రాంతీయ సమన్వయకర్తగా గతంలో పనిచేశారు. ఎటువంటి ప్రచారాన్ని కోరుకోకుండా నిరాడంబరంగా పనిచేయడం ఆచార్య నరసింహారావు వ్యక్తిత్వానికి నిదర్శనం. -
ప్రపంచశాంతితోనే ప్రగతి సాధ్యం
ఏయూక్యాంపస్: ప్రపంచశాంతి స్థాపనతోనే దేశాలు అభివృద్ధి సాధించగలవని పార్లమెంట్ సభ్యుడు కె.హరిబాబు అన్నారు. శనివారం ఉదయం ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో యస్ వుయ్ కెన్, ఏయూ జర్నలిజం విభాగం, యూఎన్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ యువజన సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగ్రవాదం, హింస ప్రతీ దేశంలో దర్శనమిస్తున్నాయని, వీటి కారణంగా దేశాలు వెనుకబడి పోతున్నాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో సైతం నేడు ఉగ్రవాదం దర్శనమిస్తోందన్నారు. సామాజిక దక్పథాన్ని కలిగించడం, యువతను మేల్కొలిపి కార్యోన్ముఖులను చేయడం లక్ష్యంగా యూఎన్ పనిచేస్తోందన్నారు. వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ యువతను సానుకూల దృక్పథంలో మంచి దిశగా నడిపించే ప్రయత్నం చేయాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.ఎస్.అవధాని మాట్లాడుతూ యువతరం తమ సామర్ధా్యలను తెలుగుకుని అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పి.హరిప్రకాష్ మాట్లాడారు. విజయ్ నిర్మాణ్ కంపెనీ చైర్మన్ విజయకుమార్, ఎంపీ కొత్తపల్లి గీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా కృష్ణవీర్ అభిషేక్, పి.స్టీఫెన్ అనురాగ్‌లు రచించిన ‘యస్ వుయ్ కెన్ డు సస్టెయినబుల్ డెవలప్మెంట్’ పుస్తకాన్ని వీసీ నాగేశ్వరరావు విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
ఏపీలో విదేశీ విశ్వవిద్యాలయ కేంద్రాలు
ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్వీడన్‌లోని బ్లికింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(బీటీహెచ్)తో దశాబ్దకాలం సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించడం శుభ పరిణామమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ సెనేట్ మందిరంలో నిర్వహించిన దశాబ్ది అనుబంధ ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఉపకులపతిగా ఉన్న సమయంలో ఈ ఎంఓయూకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ విద్యకు దశాబ్ధం క్రితమే ఏయూ నాంది పలికిందన్నారు. త్వరలో విదేశీ విద్యా సంస్థలు రాష్ట్రంలో తమ శాఖలను స్థాపించే అవకాశం ఉందన్నారు. తద్వారా విద్యార్థులు స్థానికంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ నాణ్యమైన ఉన్నవిద్యను అందించే క్రమంలో ప్రపంచంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేస్తామన్నారు. భవిష్యత్తులో సైతం సంయుక్త పరిశోధనలు, ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లను నిర్వహించాలని సూచించారు. బీటీహెచ్ స్వీడన్, వైస్‌చాన్సలర్ ఏండర్స్ హిడిస్టిర్న మాట్లాడుతూ ఇంజినీరింగ్ నైపుణ్యాలను వద్ధిచేసి, స్వీయ సంపత్తి సాధించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఆవిష్కరణల ప్రాతిపదికగా సమాజం అభివద్ధి చెందుతోందన్నారు. రానున్న దశాబ్ధ కాలంలో మరిన్ని నూతన కోర్సులు, కార్యక్రమాల నిర్వహణ దిశగా నడుస్తామన్నారు. ఇంజినీరింగ్ నిపుణులను తీర్చిదిద్ది మానవ వనరుల కొరతను తీర్చనున్నట్లు తెలిపారు. బీటీహెచ ఇండియా ఇనీషియేటివ్స్ డైరెక్టర్ గురుదత్ వేల్పుల మాట్లాడుతూ డబుల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య బి.మోహన వెంకట రామ్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆచార్య వేణుగోపాల రెడ్డి, ఆండ్రస్‌లను ఏయూ వీసీ నాగేశ్వరరావు సత్కరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య పి.విజయప్రకాష్, ప్రిన్సిపాల్స్ ఆచార్య సి.వి రామన్, కె.గీయత్రీ దేవి, డి.గౌరీ శంకర్, సి.హెచ్ రత్నం, ఇంజనీరింగ్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆవిష్కరణల దిశగా నడవండి
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆవిష్కరల దిశగా నడవాల్సిన అవసరం ఉందని సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం(ఎన్టీయూ) సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య బి.వి.ఆర్ చౌదరి అన్నారు. గురువారం ఉదయం ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు, ఇతర అధికారులతో పాలక మండలి సమావేశ మందిరంలలో ఆచార్య చౌదరి సమావేశమయ్యారు. ఎన్టీయూలో ప్రత్యేకంగా ఎన్టీయూ–ఇండియా కనెక్ట్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే తమ వర్సిటీ భారత్‌లోని ఐఐఎస్ఈ, ఐఐటీ, ఎన్ఐటీలతో పనిచేస్తోందన్నారు. ఇతే దరహాలో ఆంధ్రవిశ్వవిద్యాలయంతో పనిచేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఏయూ విద్యార్థులకు అవసరమైన ఇంటర్న్‌షిప్‌లు అందించనున్నట్లు తెలిపారు. సంయుక్త పరిశోధనలపై సాధ్యాసాధ్యాలు, అనువైన విభాగాలను పరిశీలించాలని సూచించారు. మెడికల్, ఇంజనీరింగ్ నిపుణులు సంయుక్తంగా పనిచేయడం వల్ల మెరుగైన పరిష్కారాలను చూపే దిశగా నడవాలన్నారు. ఐఐఎస్ఇతో నానో టెక్నాలజీ, ఐఐటీ ఢిల్లీతో ఎనర్జీ విభాగంలో పనిచేస్తున్నామన్నారు. సంయుక్తంగా పీహెచ్డీ ప్రోగ్రాములు నిర్వహించాలన్నారు. ఏయూ పూర్వవిద్యార్థిగా తనవంతు సహకారం అందిస్తానచెప్పారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏయూకు చెందిన నిపుణులు, అధికారులు ఎన్‌టీయూను త్వరలో సందర్శిస్తారన్నారు. వర్సిటీలోని యువ ఆచార్యులను గుర్తించి సంయుక్తంగా భవిష్యత్ పరిశోధనలు జరిపే అవకాశం ఉందన్నారు. సంయుక్తంగా సింపోజియంల నిర్వహణ, ఇంటర్న్‌షిప్‌లు కల్పించడం, ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలను నిర్వహించాలని సూచించారు. పరిపాలకులకు సైతం నిరంతర అవగాహన, నిపుణత కల్పించాలని సూచించారు. యూజీసీ సమన్వయకర్త ఆచార్య కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం 79ఎంఓయూలను కలిగి ఉందన్నారు. సంయుక్త పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, ప్రిన్సిపాల్స్ ఆచార్య సి.వి రామన్, కె.గాయత్రీ దేవి,డి.సూర్యప్రకాషరావు,సి.హెచ్ రత్నం,డి.గౌరీ శంకర్,డీన్స్ ఆచార్య బి.మోహన వెంకట రామ్, కె.వైశాఖ్, బి.వి సందీప్, కె.రఘుబాబు, పేరి శ్రీనివాసరావు, గీతం వర్సిటీ ఆచార్యుడు శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆచార్య చౌదరీని సత్కరించి వర్సిటీ జ్ఞాపికను బహూకరించారు. -
అరుణ కుమారికి డాక్టరేట్
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగ పరిశోధక విద్యార్థిని టి.అరుణ కుమారికి వర్సిటీ డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు ఎన్. సత్యనారాయణ పర్యవేక్షణలో ‘ గోవింద్ మిశ్రా కి ఉపన్యాసన్ మే చిత్ర సామాజిక జీవన్’ అంశంపై జరిపిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. గురువారం ఉదయం వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు అరుణ కుమారికి ఈ మేరకు ఉత్తర్వులు అందజేసి అభినందించారు. గోవింద్ మిశ్రా నవలల్లో చిత్రించిన సామాజిక జీవనపు అంశాలను తన పరిశోధనలో వివరించారు. ఈ సందర్భంగా అరుణను విభాగ ఆచార్యులు, పరిశోధకులు అభినందించారు. -
ఆశలన్నీ నోటిఫికేషన్‌పైనే!
ఆచార్యుల పోస్టుల భర్తీౖకి అర్హత పరీక్ష నేటి సమావేశంలో స్పష్టత వర్సిటీ మొక్కలకు జియోట్యాగింగ్ ఏయూక్యాంపస్: ఇటీవల అనంతపురంలో జరిగిన ఉపకులపతుల సమావేశంలో ఖాళీల భర్తీపై వర్సిటీల వీసీలు ఒక నిర్దిష్ట ఆలోచనకు వచ్చారు. అసోసియేట్ ఫ్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాలను పాత విధానంలో భర్తీ చేయడానికి నిర్ణయించారు. వీటి నియామకం ప్రక్రియ ప్రభుత్వ నియమావళిని అనుసరించి ఆయా వర్సిటీలే స్వయంగా చేపడతాయి. అయితే ఏవైనా అభ్యంతరాలను లేవనెత్తి.. ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కితే పోస్టుల భర్తీలో జాప్యం జరగకుండా.. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇక ఎంసెట్, ఐసెట్ తరహాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి అర్హత పరీక్ష నిర్వహించి తద్వారా పోస్టులు భర్తీ చేయాలన్న అంశంపై ఉపకులపతులు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రి దష్టికి తీసుకెళ్లారు. నేడు జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి దీనిపై ఏ విధంగా స్పందిస్తారనే విషయంపైనే అమలు ఆధారపడి ఉంది. ఒకవేళ్ల ముఖ్యమంత్రి ఏపీపీఎస్సీకి నియామక బాధ్యత అప్పగిస్తే వీసీలు నిమ్మకుండిపోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇదే జరిగితే వర్సిటీలకు ప్రాధాన్యత తగ్గి, కేవలం నామమాత్రంగానే మిగిలిపోవడం ఖాయం! మొక్కలకు జియో ట్యాగింగ్ వర్సిటీలో నాటే ప్రతి మొక్కను సంరక్షించే దిశగా జియోట్యాగింగ్ చేయనునున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఉపకులపతుల సమావేశంలో ప్రస్తావించనున్నట్లు భోగట్టా. తద్వారా ప్రతినెలా మొక్కల సంరక్షణ వివరాలను ముఖ్యమంత్రి డాష్ బోర్డ్కుకు సమాచారం చేరవేసే అవకాశం ఉంది. -
ఏయూలో నేటి నుంచి సాంస్కృతిక పోటీలు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో బుధవారం నుంచి రెండు రోజులపాటు సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పి.హరి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.10వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగంలో వక్తృత్వం, వాదం–ప్రతివాదం పోటీలను, ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో లలిత సంగీతం, బృందగాన పోటీలు, 11వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ఏయూ అసెంబ్లీ మందిరంలో శాస్త్రీయ, బృంద నృత్యాలు, మూకాభినయం పోటీలు నిర్వహిస్తారు. ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నవారు నిర్ణీత తేదీలలో పోటీలకు హాజరుకావాలన్నారు. కృష్ణా పుష్కరాలు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. -
నేటి నుంచి సాంస్కృతిక పోటీలు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నేటి నుంచి రెండు రోజులు సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నట్లు విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పి.హరి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగంలో వ్యక్తిత్వం,వాదం–ప్రతివాదం పోటీలను, ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో లలిత సంగీతం, బృందనాగ పోటీలు, 11వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి ఏయూ అసెంబ్లీ మందిరంలో శాస్త్రీయ, బృంద నత్యాలు, మూకాభినయం నిర్వహిస్తారు. ఇప్పటికే తమ పేర్లు నమోదు చేసుకున్నవారు నిర్ణీత తేదీలలో పోటీలలో హాజరుకావాలన్నారు. కష్ణా పుష్కరాలు, స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. -
శ్రీనుకు డాక్టరేట్
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగ పరిశోధక విద్యార్థి బోగి శ్రీనుకు వర్సిటీ డాక్టరేట్ లభించింది. మంగళవారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉత్తర్వులను అందించారు. విభాగ ఆచార్యులు డాక్టర్ బి.బి.వి శైలజ పర్యవేక్షనలో ‘కెమికల్ స్పెసిఫికేషన్ స్టడీస్ ఆన్ ఎల్–ఏస్పిరజిని అండ్ గై ్లగిజిని కాంప్లెక్సెస్ విత్ సమ్ ఎసన్షియల్ మెటల్ అయాన్స్ ఇన్ ఆక్వా–ఆర్గానిక్ మిక్సర్స్’ అంశంపై తన పరిశోధన జరిపారు.జీవసంబంధ లైగండ్‌లను ఉపయోగించి ఆవశ్యకత, లోహ అయానులతో సంశ్లిష్ట సమ్మేళనాల స్తిరత్వాన్ని, కంప్యూటర్ మోడలింగ్ స్టడీద్వానా జరిపిన అధ్యయనానికి డాక్టరేట్ లభించింది. -
ఆర్‌సెట్ నోటిఫికేషన్‌కు సన్నాహం
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రవేశాలను కల్పించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఏయూ ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ సెనేట్ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ మార్గదర్శకంగా ప్రతీ విభాగంలో ఖాళీల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించాలన్నారు.బిఆర్ఎస్ నియమావళిలో స్వల్పమార్పులు చేస్తున్నామని, వీటిని పూర్తిచేసి మరో రెండు నెలల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి జూన్ మాసంలో ఆర్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఆగష్టు నాటికిప్రవేశాలు జరిపే విధంగా షెడ్యూల్ తయారు చేస్తామన్నారు. ప్రవేశాలు క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పలువురు విద్యార్థులు దూరవిద్య ప్రవేశాలు, పరీక్ష ఫలితాల విడుదలలో జాప్యం, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు సంబంధించిన సందేహాలను వీసీ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సాయంత్రానికి పరిష్కారం చేయాలని అదేశించారు. డయల్ యువర్ యూనివర్సిటీలో విద్యార్థులు తెలిపే ప్రతీ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమ ఆమహేశ్వరరావు, ప్రవేశాల సంచాలకుల ఉఆచార్య ఓ.అనీల్ కుమార్, దూరవిద్య సంచాలకులు ఆచార్య ఎల్.డి సుధాకర్ బాబు, పీజీ పరీక్షల డీన్ ఆచార్య కె.విశ్వేస్వరరావు, యూజీ డీన్ ఆచార్య సుదర్శనరావు, సిడిసి డీన్ ఆచార్య టి.కోటేశ్వరరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో మమేకం
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్థులతో ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు మమేకమవుతున్నారు. నిత్యం తరగతులను సందర్శిస్తూ, హాస్టల్స్‌లో ఆకస్మికంగా కలియదిరుగుతూ విద్యార్థుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు తరగతిగదులను పరిశీలించి, తరగతులు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థుల నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకున్నారు. తరగతులు జరుగుతున్న విధానాన్ని విద్యార్థుల మాటల్లో విన్నారు. ప్రతీ తరగతిలో అధ్యాపకులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా విద్యార్థులు పూర్తిస్థాయిలో తరగతులకు హాజరుకావాలని సూచించారు. పరిశోధకుల హాజరు తక్కువగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విభాగాధిపతులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరిశోధకులు క్రమం తప్పకుండా విభాగంలో ఉండాలన్నారు. పరిశోధన ప్రగతిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. ఏయూ అవుట్గేట్ వద్దనున్న ఆవుల జయప్రదాదేవి భవనాన్ని వీసీ నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ భనవాన్ని విద్యార్థినుల వసతిగహంగా మార్పుచేస్తున్నామన్నారు. వర్సిటీకి చేరువలో వసతిగహం ఏర్పాటుకావడం మంచి పరిణామన్నారు. పూర్తిస్థాయిలో వసతులు, మెస్ సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు కోరిన విధంగా రీడింగ్ రూమ్, వైఫై సదుపాయాలను ఏర్పాటుచేస్తామన్నారు. త్వరలో మరికొన్ని అదనపు వసతిగహాలను నిర్మించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉదయం వసతిగహాన్ని రిజిస్ట్రార్ సందర్శించారు. చీఫ్ వార్డెన్ ఆచార్య టి.శోభశ్రీ పాల్గొన్నారు. -
యోగా సర్టిఫికెట్ కోర్సుకు ఆహ్వానం
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం యోగా కేంద్రం నిర్వహించే మూడు నెలల సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నిర్వహించే ఈ కోర్సు తరగతులు ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. దరఖాస్తులను బీచ్‌రోడ్డులోని ఏయూ యోగా కేంద్రం నుంచి పొందవచ్చును. శిక్షణలో భాగంగా శుద్ది క్రియలు, ఆసన, ప్రాణాయామ, బంధన విధానాలు వివరిస్తారు. ధ్యానంలో ప్రాధమిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆసక్తి కలిగినవారు 9866326487, 9908250896 నంబర్లలో సంప్రదించాలి. -
13 నుంచి ప్రత్యేక ప్రవేశాల కౌన్సెలింగ్
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నిర్వహించే ఎంటెక్, ఎంప్లానింగ్(సాయంకాల), ఎంబిఏ(ఫుల్‌టైం), పీజీ డిప్లమో కోర్సులకు ప్రత్యేక ఫీజు కలిగిన కోర్సుల్లో ఈ నెల 13నుంచి రెండవ దశ ప్రవేశాలను నిర్వహిస్తామని ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఓ.అనీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 13వ తేదీ మద్యాహ్నం రెండు గంటలకు 14వ తేదీ ఉదయం 10 గంటలకు ఎంటెక్, ఎం ప్లానింగ్ కోర్సులకు, ఎంబిఏ ప్రత్యేక ఫీజు విభాగాలకు మద్యాహ్నం 2 గంటలకు డిప్లమో కోర్సులకు ప్రవేశాల జరుపుతారు. -
గ్రీన్‌క్యాంపస్‌గా తీర్చిదిద్దుదాం
ఏయూక్యాంపస్: విశ్వవిద్యాలయ సుందరీకరణలో వక్షశాస్త్ర విభాగ విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఉదయం విభాగంలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ వర్సిటీలో ప్రధాన ప్రవేశ మార్గాలు, కూడళ్లవద్ద పచ్చదనం పరిచే కార్యక్రమానికి అవసరమైన సూచలను అందించాలని సూచించారు. హార్చికల్చర్, లాండ్స్కేప్ మేనేజ్మెంట్ విభాగ విద్యార్థులు నిర్ధిష్ట ప్రణాళికతో రావాలని వీటిని అమలు చేస్తామన్నారు. విద్యార్థులు ప్రత్యక్ష జ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్తి ప్రవర్తన, వ్యక్తిత్వం వర్సిటీ ఉన్నతిపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్,విద్యార్థి సమన్వయాధికారిణి ఆచార్య అరుంధతి ,బిఓఎస్ చైర్మన్ ఆచార్య ఓ.అనీల్ కుమార్, విభాగాధిపతి ఆచార్య వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
స్నేహితుడా.....
ఏయూక్యాంపస్: విద్యార్థులు ఆడి పాడారు, సీనియర్, జూనియర్ విద్యార్థులు కలిసి ఎంజాయ్ చేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు హుషారుగా సాగాయి. నృత్యాలు, గీతాలు, క్యాట్‌వాక్‌లు, బంద నత్యాలతో ఆనందాన్ని పంచారు. సీనియర్, జూరియన్ విద్యార్థులు ఎటువంటి బేధాలు లేకుండా ఆనందంగా ఆడిపాడి సందడి చేశారు. పాశ్యాత్య, సాంప్రదాయ నృత్యాల అనుగుణంగా విద్యార్థులు నర్తించారు. -
ఏయూలో రెండు కొత్త కోర్సులు
ఏయూక్యాంపస్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏయూ వాణిజ్య నిర్వహణ విభాగం రెండు నూతన కోర్సులను ప్రారంభించనుందని ఏయూ ఉప కులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం హైదరాబాదులో జరిగిన ఫిన్‌టెక్ సమావేశంలో చర్చించిన ఆంశాలను బుధవారం ఆయన వెల్లడించారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్, కార్డ్స్, పేమెంట్స్ రంగాల అవసరాలను తీర్చే దిశగా విద్యార్థులను తయారు చేయడానికి సమావేశంలో చర్చించామన్నారు. దీనిలో భాగంగా ఏయూ డీసీఎంఎస్ విభాగంలో రెండు సంవత్సరాల పీజీ కోర్సు, ఏడాది కాలవ్యవధి కలిగిన పీజీ డిప్లమో కోర్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. పీజీ కోర్సులో ఎనిమిది నెలలు వర్సిటీలో బోధన, మరో ఎనిమిది నెలలు పారిశ్రామిక నిపుణుల సహకారంతో బోధన, చివరి ఎనిమిది నెలలు పూర్తిగా పరిశ్రమలో ప్రత్యక్ష శిక్షణ అందిస్తామన్నారు. ఏడాది కోర్సులో ఆరు నెలలు వర్సిటీలో బోధన, మిగిలిన ఆరు నెలలు పరిశ్రమలో బోధన జరుగుతుందన్నారు. సమావేశానికి ప్రముఖ విత్త నిర్వహణ సంస్థలు బ్రాడ్రిడ్జ్, సైకుల్, థామస్ రాయిటర్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్ఎస్బీసీ, క్యాపిటల్ ఐక్యూ, భారతీ ఏక్సా, వెల్స్ ఫార్గో వంటి సంస్థల ఉన్నతాధికారులు పాల్గొని వారి సమస్యలను వివరించారన్నారు. ప్రధానంగా సాంకేతిక ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్ధిక రంగాన్ని వద్ధి చేయడం లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందన్నారు. -
ఏయూ వెబ్సైట్ హ్యాకింగ్
ఐదు రోజుల్లో ఇది రెండో సారి పెదవాల్తేరు : ఏయూ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురైందని రిజిస్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు బుధవారం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెబ్సైట్ హోమ్ పేజీలోని లోగోలను హ్యాకర్లు మార్చేశారని, దీని వల్ల నష్టం లేదని, అయినప్పటికీ నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏయూ వెబ్సైట్ హ్యాక్ కావడం ఐదు రోజుల్లో ఇది రెండోసారి. గత నెల 30న తొలిసారి హ్యాక్ అయింది. www.andhravuniversity.edu.in వెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాలు వెబ్సైట్లో దర్శనమిచ్చాయి. వెంటనే స్పందించిన అధికారులు మధ్యాహ్నానికి పునరుద్ధరించారు. వెబ్సైట్ హ్యాకింగ్ జరగలేదని, డొమైన్‌ను ఇతరులు డైవర్ట్ చేశారని దాని నిర్వాహకుడు ఆవాల రమేష్ ఆరోజు తెలిపారు. అయితే మళ్లీ హ్యాక్ చేయడంతో రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వర్సిటీలకు ర్యాంకింగ్‌లు అవసరం
ఏయూ క్యాంపస్: విశ్వ విద్యాలయాలకు జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్‌లు ఎంతో అవసరమని ఉన్నత విద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా అన్నారు. ఏయూ పాలక మండలి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏయూ అధికారులతో ఆమె సమావేశమై.. 15 అంశాలపై అధికారులు పనిచేస్తున్న తీరు, ప్రగతిని సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిశోధనలు వర్సిటీకి అవసరమన్నారు. స్మార్ట్ క్యాంపస్‌గా ఏయూను తయారు చేయాలని సూచించారు. వర్సిటీ పూర్వవిద్యార్థుల సహకారం స్వీకరిస్తూ పరిశోధన ప్రాజెక్టులను సాధించాల్సి ఉందన్నారు. నాయకత్వం, పనిలో నాణ్యత, సామూహికంగా పనిచేసే తత్వాన్ని అలవరచుకోవడం ఎంతో అవసరమన్నారు. అందరికీ బాధ్యతలను పంచుతూ సమష్టిగా పనిచేయాలని, ఏయూ సాధిస్తున్న ప్రగతిని నాలెడ్జ్ మిషన్ వెబ్సైట్లో పొందుపరచాలని ఆదేశించారు. వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో పారిశ్రామిక నిపుణులను సభ్యులుగా నియమించి, వారి నుంచి విలువైన సూచనలు స్వీకరిస్తున్నామని చెప్పారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈసీలో ఉంచి ఆమోదింపజేస్తామన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు, పాలక మండలి సభ్యుడు ఆచార్య ఎం.ప్రసాదరావు, ప్రిన్సిపాళ్లు సి.వి రామన్, డి.సూర్యప్రకాశరావు, గౌరీ శంకర్, గాయత్రీ దేవి, సి.హెచ్ రత్నం, రంగనాథం, ఎన్.ఎం యుగంధర్ పాల్గొన్నారు. -
విద్యార్థులు హాజరు తగ్గితే చర్యలు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం విద్యార్థుల హాజరు శాతాలు తగ్గితే తగిన చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఉదయం ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరం, సోషియాలజీ, సోషల్‌వర్క్ విభాగాలను సందర్శించారు. ప్లాటినం జూబ్లీ వసతిగహంలో వంటశాలను వనియోగించడ పోవడం, అపరిశుభ్ర వాతావరణంతో నిండిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిధులకు కేటాయించే గదులను మరింత పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వసతులను పెంచాలన్నారు. వెంటనే సంబంధిత డీన్ తనను సంప్రదించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఏయూ సోషియాలజీ విభాగాన్ని సందర్శించారు. విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండటంపై సంబంధిత విభాగాధిపతితో మాట్లాడారు. తరగతులు ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా తరగతులకు హాజరు కాని విద్యార్థులపై చర్యలు తీసుకోవాలన్నారు. వీరికి నోటీసులు పంపాలని ఆదేశించారు. విభాగాధిపతి ఇప్పటికే ప్రిన్సిపాల్ కార్యాలయానికి లేఖ రాసామని తెలిపారు. కొంతమంది విద్యార్థులు హాస్టల్స్‌లో ఉంటూ తరగతులకు హాజరుకావడం లేదని విభాగాధిపతి వీసీ దష్టికి తీసుకెళ్లారు. మొదటి సంవత్సరం తరగతితో కేవలం ఒక విద్యార్థి ఉండటాన్ని వీసీ గమనించారు. వర్సిటీలో ప్రతీ విభాగంలో పూర్తిస్తాయిలో విద్యార్థులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల హాజరుపట్టికలను పరిశీలించారు. సకాలంలో విధులకు హాజరుకాకుంటే తగిన చర్యలు తీసుకోవాలని విభాగాధిపతులకు స్పష్టం చేశారు. తరగతుల నిర్వహణ సక్రమంగా జరగాలని, విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. -
ఏయూ వెబ్సైట్ హ్యాకింగ్
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురయింది. ఉదయం www.andhrauniveristy.edu.inవెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాకింగ్ చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు వర్సిటీ వెబ్సైట్లో దర్శనమిచ్చాయి. వెంటనే స్పందించిన అధికారులు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. వెబ్‌సైట్‌ను సరిచేసే పనిలో పడ్డారు. మధ్యాహ్నం నాటికి వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు. దీనితో కొద్దిసేపు గందరగోళ వాతావరనం నెలకొంది. గతంలో రెండు పర్యాయములు ఏయూ వెబ్సైట్ హ్యకింగ్‌కు గురయింది. ఇంత జరుగుతున్న వర్సిటీ వెబ్‌సైట్‌ను పటిష్ట పరిచే దిశగా చర్యలు చేపట్టడం లేదు. పటిష్టమైన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ విభాగం, ప్రత్యేక కంప్యూటర్ సెంటర్, నిపుణులైన సిబ్బందిని కలిగిన ఉన్న ఏయూ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురవడం ఆశ్యర్యానికి గురిచేస్తోంది. వెబ్‌సైట్‌ను మరింత పటిష్ట పరచే దిశగా పనిచేయాలని వర్సిటీ ఆచార్యులు, విద్యార్థులు కోరుతున్నారు. వెబ్సైట్ హ్యాకింగ్ జరగలేదని, డొమైన్‌ను ఇతరులు డైవర్ట్ చేశారని ఉదయాన్నే తమకు తెలిసిన వెంటనే సమస్యను సరిచేశామని వెబ్సైట్ నిర్వాహకుడు ఆవాల రమేష్ తెలిపారు. -
పర్యావరణాన్ని సంరక్షించాలి
ఏయూక్యాంపస్: పర్యావరణ సంరక్షణ తక్షణ కర్తవ్యమని ఏయూ పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి ఆచార్య టి.భైరాగి రెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. విభాగ విద్యార్థులు పర్యావరణ సంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్లకార్డులతో అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు అవలంభించాల్సిన చర్యలను పోస్ట్‌కార్డుల రూపంలో వర్సిటీ ఉపకులపతికి పంపారు. ప్లాస్టిక్ రహితంగా వర్సిటీని ఉంచాలని, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని వీటిలో పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయడం అవసరమని ఆచార్య భైరాగి రెడ్డి అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడం వలన పర్యావరణ స్పహ కలిగించాలన్నారు. ప్రతీ విద్యార్థి పర్యావరణ చైతన్యంతో మెలగాలన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే ఎదురయ్యే దుష్పరిణామాలను వివరించారు. ప్రతీ వ్యక్తి పర్యావరణ హితంగా మెలగాలన్నారు. విద్యార్థులు ఆలోచింపజేసే విధంగా నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో విభాగ పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వర్సిటీ కీర్తిని పెంచేది విద్యార్థులే
వర్సిటీ కీర్తిని పెంచేది విద్యార్థులే –ఏయూ వీసీ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు వర్సిటీ,కీర్తి,ఏయూ,au,fame,students ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం కీర్తిని ఇనుమడింపజేసేది విద్యార్థులేనని ఏయూ ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం ఏయూ అసెంబ్లీ మందిరంలో సైన్స్, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వర్సిటీలో ఈ రెండేళ్లు ఎంతో విలువైనవని, కాలాన్ని వృథా చేసుకోరాదని హితవు పలికారు. ఆచార్యుల నుంచి జానాన్ని పొందడానికి నిరంతరం శ్రమించాలని, అదే నిజమైన సంపదగా నిలుస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. మహనీయుల జీవిత చరిత్రలను చదివి స్ఫూర్తిపొందాలన్నారు. సర్వేపల్లి వంటి మహనీయులు నడయాడిన పుణ్యభూమిగా ఏయూ ఖ్యాతిగాంచిందని, అలాంటి చోట చదుకునే అవకాశం రావడం అదృష్టంగా భావించి అవకాశాలను సద్వినియోగంచేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థీ నోబెల్ బహుమతిని సాధించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తెలుగు మాధ్యమం విద్యార్థులు శ్రమిస్తే పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించగలరన్నారు. ర్యాగింగ్ రహితంగా వర్సిటీని తీర్చిదిద్దామని చెప్పారు. ఎలాంటి చిన్న సంఘటన ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రెక్టార్ ఆచార్య ఇ.ఎ. నారాయణ మాట్లాడుతూ విభిన్న అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని సూచించారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్య విజయాన్ని అందిస్తుందని చెప్పారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.గాయత్రీ దేవి మాట్లాడుతూ విద్య అమరత్వాన్ని అందిస్తుందన్నారు. విద్యార్థి వ్యవహరాల డీన్ ఆచార్య పి.హరి ప్రకాష్, ఆచార్య టి.శోభశ్రీ, టి.వి క్రిష్ణ, జి.సుధాకర్, షారోన్ రాజు, రామారావు, ఎన్.ఏ.డి పాల్ తదితరులు పాల్గొన్నారు. -
జపాన్ అధ్యయన కేంద్రానికి రూ. 15 లక్షలు
ఏయూక్యాంపస్ : ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జపాన్ అధ్యయన కేంద్రం అభివద్ధికి జపాన్‌కు చెందిన మిత్సుబిషి కార్పొరేషన్ రూ. 15 లక్షల నిధులను మంజూరు చేసింది. శుక్రవారం ఉదయం కేంద్రం సంచాలకుడు ఆచార్య డి.వి.ఆర్ మూర్తి నిధుల మంజూరు పత్రాన్ని వీసీ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా వర్సిటీలో జపాన్ భాష, సంస్కతిని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం సంచాలకుడు ఆచార్య డి.వి.ఆర్.మూర్తి మాట్లాడుతూ 2016 సంవత్సరానికి కేంద్రం నిర్వహణ, అభివద్ధికి ఈ నిధులను వినియోగించడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం కేంద్రం ఏర్పాటుకు మిత్సుబిషి సంస్థ రూ. 27 లక్షలు అందించిందన్నారు. ప్రస్తుతం కేంద్రానికి అవసరమైన పుస్తకాలు, గ్రంధాలు, మౌలిక వసతులను సమకూర్చడం జరుగుతుందన్నారు. జపనీస్ డిప్లొమా కోర్సుకు ఆగస్టు 2న ప్రవేశాలు నిర్వహిస్తామన్నారు. పెదవాలే్తరులోని ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
జర్నలిజం విభాగానికి నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం జర్నలిజం విభాగానికి ‘బి స్కూల్ విత్ ఇండస్ట్రీ రిలేటెడ్ కరికులం ఇన్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్’ అవార్డు లభించింది. మంగళవారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య నాగేశ్వరరావుకు అవార్డును జర్నలిజం విభాగాధిపతి ఆచార్య పి.బాబి వర్ధన్ అందజేశారు. ఈ సందర్భంగా వీసీ నాగేశ్వరరావు మాట్లాడుతూ వరుసగా మూడవ సంవత్సరం ఈ అవార్డులను ఏయూ జర్నలిజం విభాగం అందుకోవడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విభాగ ఆచార్యులను అభినందించారు. ప్రసార మాధ్యమాల రంగానికి అవసరమైన నిపుణులను ఏయూ అందిస్తోందన్నారు. సమాజానికి దర్పణంగా ప్రసార మాధ్యమాలు నిలుస్తున్నాయన్నారు. ఈ రంగానికి దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగాలన్నారు. విభాగాధిపతి ఆచార్య పి.బాబి వర్ధన్మాట్లాడుతూ ఆనంద్ బజార్ పత్రిక(ఏబిపి) న్యూస్ నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డును 2016 సంవత్సరానికి అందుకుందన్నారు. మౌళిక వసతులు, పాఠ్య ప్రణాళిక, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను మార్పులు చేస్తున్న విధానం, ప్రొఫెషనల్ టీచర్స్‌ను కలిగి ఉండటం వలన ఇది సాధ్యపడిందన్నారు. వరుసగా మూడు సంవత్సరాలు అవార్డును సాధించడం విభాగంపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ స్థానాన్ని నిలుపుకుంటూ, మరింత మెరుగు పరచుకునే విధంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో బిఓఎస్ చైర్మన్ ఆచార్య డి.వి.ఆర్ మూర్తి, డాక్టర్ చల్లా రామక్రిష్ణ, డాక్టర్ కె.విజయకుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి రామన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏయూ క్యాంపస్ లో మంత్రి గంటా తనిఖీలు
ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతోందంటూ మీడియాలో ఆరోపణలు రావడంతో.. ఆంధ్ర ప్రధేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంపస్ లో తనిఖీలు నిర్వహించారు. ర్యాగింగ్ ఆరోపణలపై వర్సిటీ అధికారులు, విద్యార్థుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ర్యాగింగ్ చట్టాన్ని పటిష్టం చేశామని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ను ర్యాగింగ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కాగా.. సీనియర్ ల నుంచి వేధింపులు ఎదుర్కొన్న విధ్యార్థులు మీడియాను ఆశ్రయించినట్లు తెలిసిందని.. వారు తమకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు చేపడతాం అని గంటా తెలియజేశారు. -
ఏయూ బంద్ ప్రశాంతం.. సంపూర్ణం
స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు ఆరుగురు విద్యార్థి నేతల అరెస్టు దశలవారీ ఆందోళన కొనసాగిస్తా మన్న విద్యార్థి సంఘాలు విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హక్కు కోసం గళం విప్పిన ఏయూ ప్రొఫెసర్లు ప్రసాదరెడ్డి, అబ్బులుకు విద్యార్థి లోకం బాసటగా నిలిచింది. వారిపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై మండిపడింది. ప్రభు త్వ, ఏయూ ఉన్నతాధికారుల చర్యలకు నిరసనంగా ఏయూ బంద్ ను బుధవారం సంపూర్ణంగా, ప్ర శాంతంగా నిర్వహిం చింది. ప్రభుత్వం పోలీసులను మోహరించి బంద్‌ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిం చింది. అరెస్టులతో విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసింది. కానీ విద్యార్థులు స్వచ్ఛం దంగా స్పందించి బంద్‌ను విజయవంతం చేశారు. దశలవారీగా తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బంద్ ప్రశాంతం: ప్రొఫెసర్లపై కక్షసాధింపు చర్యలకు నిరసనగా ఏయూ బంద్ బుధవారం ప్రశాం తంగా జరిగింది. బుధవారం ఉదయం 10గంటలకే ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని తరగతులను బహిష్కరించారు. అన్ని విభాగాల విద్యార్థులు ప్రొఫెసర్లకు సంఘీభావం ప్రకటించారు. తరగతులకు హాజరు కాలేదు. ఉన్నతాధికారుల ఒత్తిడితో ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు కొందరు మాత్రమే తరగతులకు హాజరయ్యారు. బంద్‌కు సహకరించాల్సిందిగా విద్యార్థి సంఘాల నేతలు వారిని కోరారు. సానుకూలంగా స్పందించిన విద్యార్థులు తరగతుల నుంచి బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఇద్దరు ప్రొఫెసర్లపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను విద్యార్థులు నిరసించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని చెబుతూ అందుకోసం పోరాటం కొనసాగిస్తామని నినదించారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన యువభేరీ సదస్సులో ప్రొఫెసర్లు పాల్గొనడం ప్రభుత్వ వ్యతిరేక చర్య ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. యూజీసీ నిబంధనలను అతిక్రమించని ప్రొఫెసర్లపై ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఉన్నతాధికారుల ద్వారా వారికి నోటీసులు జారీ చేయించిందని ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రభుత్వ యత్నం బంద్‌ను విఫలం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం ఉదయం నుంచే పోలీసులు ఏయూ క్యాంపస్‌లో మోహరించారు. హాస్టళ్లకు వెళ్లి మరీ విద్యార్థులను సున్నితంగా బెదిరించినట్లు తెలిసింది. ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి బయటకు వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘాల నేతలను అడ్డుకున్నారు. తాము ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్నామని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. విద్యార్థి సంఘాల నేతలు కాంతారావు, చంద్రశేఖర్, ధీరజ్, జోగారావు, కల్యాణ్, స్వామిలను అరెస్టు చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు వంశీకృష్ణ, తిప్పల నాగిరెడ్డి, పార్టీ నేతలు సత్తి రామకృష్ణారెడ్డి, హనోక్, రవిరెడ్డి తదితరులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని విద్యార్థి నేతలకు సంఘీభావం ప్రకటించారు. సీఐ వెంకటరావుతో మాట్లాడారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు విడిచిపెట్టారు. ఆందోళన కొనసాగిస్తాం: విద్యార్థి సంఘాలు బంద్‌తో ఆందోళనను విరమించేది విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఇద్దరు ప్రొఫెసర్లపై చర్యలను నిరసిస్తూ దశలవారీగా ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి సృ్మతి ఇరానీలకు పోస్టుకార్టులు, ఎస్ఎంఎఎస్లు, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా తమ వాణిని వినిపించాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులు రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతూ ఏయూ ప్రతిష్టను దిగజారుస్తున్న తీరును కూడా వివరించనున్నారు. ప్రత్యేక హోదా అన్నది కేంద్రం ఇచ్చిన హామీయే కాబట్టి దాని కోసం మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం కాదని కూడా విన్నవించనున్నారు. ఈ పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. -
బూమ‘రాంగ్’ అవుతుందేమో..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినట్టు ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డిని సస్పెండ్ చేస్తే అది భవిష్యత్‌లో మరిన్ని చిక్కులకు దారి తీస్తుందని వర్సిటీ వర్గాలు భావిస్తున్నారు. విశాఖలో ఏయూ విద్యార్థులు నిర్వహించిన ‘యువభేరి’ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై మంత్రి అభీష్టం మేరకు చర్యలు తీసుకోవడం నిబంధనల ప్రకారం కుదరదని అంటున్నారు. యూజీసీ నిబంధనలను ఏమాత్రం అతిక్రమించని ప్రసాదరెడ్డిపై చర్య తీసుకుంటే అది బూమ‘రాంగ్’ అయి తమకే ఎదురుతిరుగుతుందని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ఏయూ అధికారవర్గాల్లో విస్మయం... ఢిల్లీలో ఉన్న ఏయూ వీసీ జీఎస్ఎన్ రాజుకు మంత్రి గంటా బుధవారం ఫోన్ చేసి ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వీసీ జీఎస్ఎన్ రాజు ఇరకాటంలో పడ్డారు. దాన్నుంచి తప్పించుకోవడానికి రిజిస్ట్రార్ రామ్మోహన్‌రావుకు వీసీ గురువారం ఫోన్ చేసి ప్రసాదరెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. వీసీ జోక్యం చేసుకోకుండా తన ద్వారా మంత్రి ఆదేశాలను అమలు చేయిద్దామని చూస్తున్నారని రిజిస్ట్రార్ రామ్మోహన్రావు భావిస్తున్నారు. అందుకే వీసీ శుక్రవారం విశాఖపట్నం వచ్చేవరకూ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మంత్రిది అవగాహనరాహిత్యం... ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి యూజీసీ నిబంధనలను ఉల్లఘించినట్లు కాదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజాసంబంధమైన సదస్సుల్లో పాల్గొనే వెసులుబాటు ప్రొఫెసర్లకు ఉందని వారు స్పష్టం చేశారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిపై చర్యలకు ఆదేశించిన మంత్రి గంటాది అవగాహనరాహిత్యమని వారు అన్నారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీమనోహర్ జోషి అలహాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉంటూనే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు హాజరయ్యేవారని, అప్పటి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రసంగించేవారని ఉదాహరించారు. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి ప్రాణప్రదం అయిన ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి చర్చించడానికి విద్యార్థులు నిర్వహించిన సదస్సులో పాల్గొని ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించడంలో ప్రసాదరెడ్డి నిబంధనలు ఉల్లంఘించినట్లుకాదనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్నత విద్యాశాఖ మంత్రికి విశ్వవిద్యాలయాలపై నేరుగా ఎలాంటి అధికారం ఉండదు. ఆయన వీసీలకు ఆదేశాలు జారీ చేయలేరని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యూజీసీ నిబంధనలను ఉల్లంఘించ లేదు: ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి ‘‘నేను 27ఏళ్లుగా ఏయూలో పనిచేస్తున్నాను. రిజిస్ట్రార్‌గా, రెక్టార్‌గా కీలక అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల్లో పనిచేసిన నాకు యూజీసీ నిబంధనలపై పూర్తి అవగాహన ఉంది. ప్రొఫెసర్‌గా ప్రజోపయోగ అంశాలు, ‘పాలిటీ’పై ప్రభుత్వానికి, సమాజానికి సూచనలు చేసే బాధ్యత, హక్కులు నాకు ఉన్నాయి. యువభేరి సదస్సులో నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. ప్రత్యేక హోదా సాధిస్తే విద్యార్థులకు, యువతకు ఎంత ప్రయోజనం కలుగుతుందో వివరించాను. నేను చేసిన సూచనలు పాటిస్తే, హోదా వస్తే ఈ ప్రభుత్వానికే మంచిపేరు వస్తుంది...’’ -
'ఉద్యోగాలివ్వాలని వేడుకుంటున్నాం'
-
ప్రత్యేక హోదా కోరుతూ రౌండ్ టేబుల్ మీటింగ్!
-
నేటి నుంచి ఏయూలో జాబ్‌మేళా
ఏయూ క్యాంపస్: ఏయూ వేదికగా శని,ఆదివారాల్లో మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 9 గంటలకు వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియం వేదికగా కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కా ర్పొరేషన్ డెరైక్టర్ డాక్టర్ కె.లక్ష్మీ నారాయణ, వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం జరిగే కార్యక్రమంలో విద్యార్థులను మంత్రి గంటా శ్రీ నివాసరావు నియామక పత్రాలను అందజేస్తారు. ఇప్పటి వరకు 12 వేల మంది విద్యార్థులు మేళా కోసం నమోదు చేసుకున్నారు. వీరికి మాత్రమే శనివారం జాబ్‌మేళా ఉంటుంది. ఆదివారం అందరూ పాల్గొనే అవకాశం ఉంది. అర్హులు వీరే: బీటెక్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ, ఎంబీఏ, డిప్లమో కోర్సులను చేసిన విద్యార్థులు దీనికి అర్హులు. జాబ్‌మేళాలో 14 సాఫ్ట్వేర్ సంస్థలు పాల్గొంటున్నాయి. విద్యార్థులు ఎటువంటి ప్రవేశ రుసుము చెల్లించనవసరం లేదు. 2013, 2014 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణత సాధిం చిన విద్యార్థులు సైతం ప్రాంగణ నియామకాలకు హాజరుకావచ్చు. విద్యార్థులు రెజ్యూమ్ కాపీలు, పాస్‌పోర్ట్ ఫొటోలు తీసుకురావలసి ఉంటుంది. సంస్థ ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం మిరాకిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ న్యూక్లాస్ రూమ్ కాంప్లెక్స్ సైయింట్ ప్లేస్మెంట్ కార్యక్రమం ఐఐటీ టెక్నాలజీస్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం యలమంచిలి సాఫ్ట్వేర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రిన్సిపాల్ కార్యాలయ భవనం మైక్రో జినిసిస్ జియో ఇంజినీరింగ్ విభాగం ఏమ్జూర్ టెక్నాలజీస్ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కెమికల్ ఇంజినీరింగ్ పీజీ బ్లాక్ ఇక్నోలైట్ టెక్నాలజీస్ ఎగ్జామినేషన్స్ సెల్ ఐనాట్ పవర్ టెక్నాలజీస్ ఇనుస్ట్రుమెంటేషన్ విభాగం మేట్రిక్స్ సెక్యూరిటీ అండ్ సర్వైలెన్స్ కంప్యూటర్ సైన్స్ విభాగం మైన్ ఫ్రేమ్స్ గ్లోబల్ టెక్నాలజీస్ కంప్యూటర్‌సైన్స్ విభాగం స్టెలెంట్ సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రిన్సిపాల్ కార్యాలయం భవనం -
ప్రతిష్ట పాతాళానికి..
ఏయూపై మంత్రి గంటా పెత్తనమేంటి? తుపాను నష్టం రూ.230 కోట్లా!? క్లాసులే జరగనప్పుడు పరీక్షలా? కలకలం రేపిన ఏయూ విభాగాధిపతుల వ్యాఖ్యలు ‘ఏయూపై మంత్రి గంటా పెత్తనమేమిటి?...ఆయన క్యాంపస్‌కు పదేపదే వచ్చి అధికారికంగా నిర్ణయాలు ప్రకటించేయడమేమిటి?... వీసీతో సహా ఏయూ అధికారులు అం తా ఆయనకు సాగిలపడటమేమిటి?... ఏయూ చరి త్రలో ఇంతవరకు ఇలాంటి దుస్థితి దాపురించలేదు. ఇ లా అయితే ఏయూ ప్రతిష్ట దిగజారి అదఃపాతాళానికి పడిపోతుంది’ ‘హుదూద్ తుపాను వల్ల ఏయూకు రూ.230 కోట్లు నష్టం వచ్చిందని ఏ ప్రాతి పదికన ప్రకటించేశారు?, అంత నష్టం ఎక్కడ జరిగింది?. భవనాలు ఏమీ దెబ్బతినలేదు. ల్యాబ్‌లకు నష్టం జరగలేదు. చెట్లు కూలిపోయిన మాట వాస్తవం. కానీ దాన్ని రూ.230 కోట్లుగా లెక్కించలేం కదా? ఆస్తి నష్టం జరగనప్పుడు అంత నష్టమని ఎ లా ప్రకటిస్తారు. దీని వెను క ఉన్న లోగుట్టు ఏమిటి?. దాతల నుంచి కేవలం ధన రూపంలోనే సహా యం కోరడం వెనుక మర్మమేమిటీ?’ ఏయూ విభాగాధిపతుల ఆవేదన ఇదీ. ప్రశ్న ల శరపరంపర ఇదీ. ఏయూ కేంద్రంగా సాగుతున్న అక్రమాలను సూటిగా నిలదీసిన వైనం ఇదీ. గత కొన్నేళ్లలో ఎన్నడూలేని రీతిలో విభాగాధిపతులు ఏయూ వ్యవహారాలపైన విరుచుకుపడ్డారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం ఇలా సాగింది... విభాగాధిపతుల సమావేశమే వేదికగా... ఏయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గాయత్రీదేవీ విభాగాధిపతులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే గాయత్రీదేవీ మాట్లాడుతూ నవంబర్ 10 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దాంతో విభాగాధిపతులు అందరూ అవాక్కయ్యారు. తమను కనీసం సంప్రదించకుండా పరీక్షల షెడ్యూల్‌ను నిర్ణయించేయడమేమిటని విస్తుపోయారు. కొంతకాలంగా ఏయూ వ్యవహారాలలై ఆగ్రహంతో ఉన్న విభాగాధిపతులు దాంతో ఒక్కసారిగా తమ నిరసనను తెలిపారు. ‘తుపాను అనంతరం క్లాస్‌లు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. ఇంకా 10 శాతం మంది విద్యార్థులు కూడా క్లాస్‌లకు రావడం లేదు. సిలబస్‌లు పూర్తికాలేదు. అలాంటిది నవంబర్ 10 నుంచి పరీక్షలు ఎలా నిర్వహిస్తారు?. తేదీలను ఖరారు చేసేముందు మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదా?’ అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఏయూలో సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలను ప్రస్తావిస్తూ అంశాలవారీగా ఇలా నిలదీశారు. మంత్రి గంటా పెత్తనమేమిటీ?... ఏయూ వ్యవహారాలన్నింటినీ మంత్రి గంటా శ్రీనివాసరావు హైజాక్ చేసేస్తున్న తీరును విభాగాధిపతులు తప్పుబట్టారు. ‘అసలు యూనివర్సిటీపై విద్యాశాఖ మంత్రి పెత్తనం ఏమిటి? ఏయూ విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం వీసీకి, పాలకమండలికే ఉంది. విభాగాధిపతులను సంప్రదించి వీసీ పాలకమండలిలో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. వీసీ నేరుగా గవర్నర్‌కే జవాబుదారిగా ఉండాలి. కానీ ఇవేవీ లేకుండా మంత్రి గంటా చీటికిమాటికి క్యాంపస్‌కు వచ్చేసి సమావేశాలు పెట్టడం ఏమిటి?. మన ఇద్దరు ఉన్నతాధికారులు చిత్తందొరా అని వంతపాడటమేమిటి?అని తీవ్రస్థాయిలో నిరసించారు. ఏయూకు రూ.230 కోట్ల నష్టమా?.. హవ్వా! హుదూద్ తుపాను వల్ల ఏయూకు రూ.230 కోట్ల నష్టం వచ్చినట్టు వీసీ జి.ఎస్.ఎన్.రాజు ప్రకటించడాన్ని విభాగాధిపతులు తప్పుబట్టారు. ఏ ప్రాతిపదికన లెక్కించి ఇంత భారీ నష్టం వచ్చినట్టు ప్రకటించారని ప్రశ్నించారు. ‘తుపాను వల్ల ఏయూ భవనాలకుగానీ ల్యాబ్‌లకుగానీ ఎలాంటి నష్టం కలగలేదు. కేవలం నాన్‌టీచింగ్ స్టాఫ్ క్వార్టర్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆ నష్టం రూ.50 లక్షల వరకు ఉండొచ్చు. ఇతర చిన్నాచితక నష్టం కలిగింది. అంతకుమించి ఏయూ ఆస్తులకు ఎలాంటి నష్టం కలగలేదు. మరి రూ.230 కోట్ల నష్టం అని ఎలా ప్రకటించారు? క్యాంపస్‌లో చెట్లు భారీగా కూలిపోయినమాట వాస్తవం. కానీ ఆ నష్టాన్ని డబ్బురూపేణా అంచనా వేయలేం కదా! కానీ రూ.230 కోట్లు నష్టం ఏర్పడినట్టు ప్రకటించడం వెనుక ఉద్దేశమేమిటి?’అని సందేహం వ్యక్తం చేశారు. ఇంతవరకు నాన్‌టీచింగ్ సిబ్బంది క్వార్ట్ర్స్కు నీరు, విద్యుత్తు సౌకర్యాన్ని పునరుద్ధరించకపోవడాన్నీ ప్రశ్నించారు. ఏయూలో తుపాను నష్టాలను తాము సరిచేస్తామని దాతలు వస్తుంటే మీరు వస్తు రూపేణా ఎలాంటి సహాయం చేయొద్దు... ఆ మొత్తాన్ని ఏయూ అకౌంట్లో వేయమని కోరుతున్నారు?, ఇదెంత వరకు సబబు?.. దాతలే నేరుగా దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేస్తామంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?.. దీనివెనుక లోగుట్టు ఏమిటి?’అని కూడా ప్రశ్నించారు. ఇలా విభాగాధిపతులు ఒక్కొక్కరుగా నేరుగా ప్రశ్నల శరపరంపర కురిపించడంతో ఆ సమావేశం ఆద్యంతం వాడిగా వేడిగా సాగింది. విభాగాధిపతులు లేవనెత్తిన అంశాలను వీసీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గాయత్రీదేవి సమావేశాన్ని ముగించారు. మేమే బాధితులం.. మా జీతాల నుంచి కోతా? తుపాను బాధితులకు ఏయూ ఉద్యోగుల రెండురోజుల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు మంత్రి ప్రకటించడాన్ని కూడా విభాగాధిపతులు తప్పుబట్టారు. ‘తుపాను వల్ల విశాఖలో నివసిస్తున్న ఏయూ ఉద్యోగులు నష్టపోయారు. వారిని ఆదుకోవాలి. ప్రభుత్వం నిధులు ఇవ్వడమే...ఇతర ప్రాంతాల ఉద్యోగులు, దాతల నుంచి విరాళాలు సేకరించడమే చేయాలి. అంతేగానీ తుపాను బాధితులు అయిన ఏయూ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తే ఎలా? అసలు ఈ నిర్ణయాన్ని మంత్రి గంటా ఎలా ప్రకటిస్తారు? అందుకు ఏయూ ఉన్నతాధికారులు ఎలా ఆమోదిస్తారు? అని కడిగిపారేశారు. తాము అసలు జీతాల నుంచి కోతను ఆమోదించేది లేదని తేల్చిచెప్పేశారు. -
ఎడ్ సెట్ 2014కుకు ఏయూ సిద్ధం
-
ఏయూలో విద్యార్థుల దీక్ష భగ్నం
-
ఆంధ్రా యూనివర్సిటీలో కేసిఆర్ దిష్టిబొమ్మ దగ్దం