ప్రపంచశాంతితోనే ప్రగతి సాధ్యం
Published Sat, Aug 13 2016 11:55 PM | Last Updated on Wed, Sep 18 2019 3:24 PM
ఏయూక్యాంపస్: ప్రపంచశాంతి స్థాపనతోనే దేశాలు అభివృద్ధి సాధించగలవని పార్లమెంట్ సభ్యుడు కె.హరిబాబు అన్నారు. శనివారం ఉదయం ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో యస్ వుయ్ కెన్, ఏయూ జర్నలిజం విభాగం, యూఎన్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ యువజన సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగ్రవాదం, హింస ప్రతీ దేశంలో దర్శనమిస్తున్నాయని, వీటి కారణంగా దేశాలు వెనుకబడి పోతున్నాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో సైతం నేడు ఉగ్రవాదం దర్శనమిస్తోందన్నారు.
సామాజిక దక్పథాన్ని కలిగించడం, యువతను మేల్కొలిపి కార్యోన్ముఖులను చేయడం లక్ష్యంగా యూఎన్ పనిచేస్తోందన్నారు. వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ యువతను సానుకూల దృక్పథంలో మంచి దిశగా నడిపించే ప్రయత్నం చేయాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.ఎస్.అవధాని మాట్లాడుతూ యువతరం తమ సామర్ధా్యలను తెలుగుకుని అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పి.హరిప్రకాష్ మాట్లాడారు. విజయ్ నిర్మాణ్ కంపెనీ చైర్మన్ విజయకుమార్, ఎంపీ కొత్తపల్లి గీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా కృష్ణవీర్ అభిషేక్, పి.స్టీఫెన్ అనురాగ్‌లు రచించిన ‘యస్ వుయ్ కెన్ డు సస్టెయినబుల్ డెవలప్‌మెంట్’ పుస్తకాన్ని వీసీ నాగేశ్వరరావు విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
Advertisement
Advertisement