సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న దృశ్యం
–స్పందన అంతంత మాత్రమే
–885 మంది కౌన్సెలింగ్‌కు హాజరు
యూనివర్సిటీక్యాంపస్:
రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం ఏపీఎడ్‌సెట్–2016 కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎస్వీయూనివర్సిటీ(తిరుపతి), ఆంధ్రాయూనివర్సిటీ (వైజాగ్), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు), ఎస్కేయూనివర్సిటీ(అనంతపురం), అంబేద్కర్ యూనివర్సిటీ(శ్రీకాకుళం), జేఎన్‌టీ యూనివర్సిటీ(కాకినాడ)లలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం గణితం, ఇంగ్లీషు సబ్జెక్ట్‌లకు కౌన్సెలింగ్ నిర్వహిచంగా 885 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. తొలి రోజు స్పందన అంతంత మాత్రంగానే కన్పించింది. తిరుపతిలో 196 మంది, వైజాగ్‌లో 143 మంది, గుంటూరులో 201 మంది, అనంతపురంలో 193 మంది, కాకినాడలో 87 మంది, శ్రీకాకుళంలో 65 మంది కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం ఫిజికల్‌సైన్స్, బయాలజీ సబ్జెక్ట్‌లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. శనివారం కౌన్సెలింగ్‌కు హాజరుకాలేక పోయిన వారిని ఆదివారం కూడా కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామన్నారు.