SVU
-
'రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే రావాలి'
సాక్షి, తిరుపతి: మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో రాయలసీమపై దుష్ప్రచారం జరుగుతోందని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. మంగళవారం ఎస్వీయూలో రాయలసీమ మేధావుల ఫోరం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అమరావతి రైతు నాయకులు రాయలసీమ వాసులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాయలసీమ వాసులు వారి ప్రాంతానికి రాజధాని వద్దని చెబుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే రావాలి. చదవండి: (సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం) రాయలసీమలో గ్రామీణ వాతావరణం కలిగిన పట్టణాలే తప్ప ఒక్క నగరం కూడా లేదని గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అమరావతి రైతులు విశాల హృదయం, విశాల త్యాగం చేసినవారు. అమరావతి రైతు నాయకులు రాయలసీమవాసులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, వామపక్షాలు కర్నూలుకు హైకోర్టు రావాలని ఒప్పుకున్నాయి. రాయలసీమ వాసుల మౌనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రాయలసీమకు హైకోర్టు రాకూడదని ఎస్వీయూలో బహిరంగ సభ పెట్టాలంటే మేం ఎందుకు అనుమతించాలి. రాయలసీమ ప్రజలందరూ ఈ విషయంపై స్పందించాలి. రేపటి నుంచి రాయలసీమకు రాజధాని అంశంపై విద్యార్థుల్లోకి వెళ్తామ’ని పురుషోత్తం రెడ్డి అన్నారు. -
డ్యూటీ.. లూటీ
ఎస్వీయూ పరీక్షల విభాగం పనితీరు రోజురోజుకూ దిగజారిపోతోంది. ఆ విభాగంలోఅన్ని వ్యవహారాలు అత్యంతజాగ్రత్తగా, పకడ్బందీగా జరగాలి. అధికారి నుంచి అటెండర్ వరకు అన్ని స్థాయిల్లో ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలి. జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉండాలి. ఇందుకోసంయూనివర్సిటీ ఉద్యోగులకుఆన్ డ్యూటీ సౌకర్యంతో పాటు లక్షలాది రూపాయలను అలవెన్సులుగా ఇస్తోంది. అయితే అక్కడి ఉద్యోగులువిధులకు వెళ్లకుండానే నిధులు మింగేస్తున్నారనే విమర్శలువెల్లువెత్తుతున్నాయి.మంగళవారం వెలుగుచూసిన సంఘటన ఇందుకు నిదర్శనం. యూనివర్సిటీ క్యాంపస్: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరీక్షల విభాగానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ పరీక్షల నియంత్రణాధికారి పేరుతో జరగాలి. అయితే లా విభాగం పరిధిలోని ఎల్ఎల్బీ కోర్సు పరీక్షల జవాబు పత్రాలకు సంబంధించిన రీవాల్యుయేషన్ జవాబు పత్రాల బండిల్ మంగళవారం పరీక్షల విభాగంలో పనిచేసే ఒక అటెండర్ పేరిట కొరియర్ వచ్చింది. దీన్ని చూసి అధికారులు విస్తుపోతున్నారు. నిబంధనలు ఇలా.. పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్‌కు విద్యార్థులు దరఖాస్తు చేస్తే త్వరితగతిన ఫలితాల విడుదలకోసం కొంతమంది ఉద్యోగులను ఈ విధులకు కేటాయిస్తారు. ఆ సిబ్బంది సంబంధిత జవాబు పత్రాల బండిళ్లను పకడ్బందీగా సీల్ చేయించి వ్యక్తిగతంగా తీసుకెళ్లి మూల్యాంకనం చేసేవారికి ఇవ్వాలి. మూల్యాంకనం పూర్తి చేసిన తర్వాత జవాబు పత్రాలను పకడ్బందీగా సీల్ చేయించుకుని వ్యక్తిగతంగా తీసుకుని రావాలి. ఆ విధులకు యూనివర్సిటీ తగిన అలవెన్స్ చెల్లిస్తుంది. జరుగుతున్నది ఇదీ.. నిబంధనల ప్రకారం పరీక్షల విభాగం సిబ్బంది జవాబు పత్రాలను వ్యక్తిగతంగా తీసుకెళ్లకుండా పోస్ట్ ద్వారానో, ఇతరుల ద్వారానో పంపి, వాటిని తిరిగి తెప్పించుకుంటున్నారు. తాము వ్యక్తిగతంగా వెళ్లి వచ్చినట్లు బిల్లులుతీసుకుంటున్నారు. తాము వెళ్లకుండా ఓడీ రూపంలో లక్షలాది రూపాయల నిధులు కొల్లగొడుతున్నారు. ఇంతా జరుగుతున్న సంబం«ధిత సెక్షన్లలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, ఏఏఓలు ఏం చేస్తున్నారన్నది శేష ప్రశ్న. అవకతవకలెన్నో? పరీక్షల విభాగంలోని ఒక అటెండర్ పేరిట మంగళవారం కొరియర్ రావడంతో వర్సిటీ అధికారులు అవాక్కయ్యారు. పరీక్షల విభాగంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనడానికి ఈ సంఘటన సాక్ష్యంగా నిలిచింది. ఈ పార్సిల్ కాకినాడలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా సంస్థ నుంచి వచ్చింది. లా పరీక్షల రీవాల్యుయేషన్‌కు సంబంధించిన పార్సిల్‌గా గుర్తించారు. వాస్తవంగా ఈ బండిల్‌ను ఈ విధుల కోసం కేటాయించిన సిబ్బంది వ్యక్తిగతంగా వెళ్లి తీసుకురావాలి. కానీ అలా జరగలేదు. పరీక్షల నియంత్రణాధికారి పేరిట కాకుండా ఒక అటెండర్ చిరునామాతో పార్సిల్ రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలా ఎంత కాలంగా సాగుతుందో అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ ఉన్నతాధికారులు ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుని పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉంది. నా దృష్టికి రాలేదు అటెండర్ పేరుతో మూల్యాంకన పత్రాలు రావడంపై పరీక్షల నియంత్రణాధికారి దామ్లానాయక్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తన దృష్టికి రాలేదని తెలిపారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తానని చెప్పారు. -
ఎస్వీయూలో విషాదం..
సాక్షి, తిరుపతి: నగరంలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ)లో విషాదం చోటుచేసుకుంది. ఎస్సీయూలో చదువుతున్న విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. డైరీ కాలేజీకి చెందిన హాస్టల్ విష్ణువర్ధన్ అనే విద్యార్థి ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. విష్ణువర్ధన్ బలవన్మరణానికి పాల్పడటంతో తోటి విద్యార్థుల్లో విసాదం నెలకొంది. -
ఎస్వీ యూనివర్సిటీలో అక్రమాలపై విచారణ జరపాలి
-
ఎస్వీయూలో ఆందోళనల పర్వం
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక వైపు ఎన్ఎంఆర్ ఉద్యోగులు, మరో వైపు పోస్ట్ డాక్టరల్ ఫెలో(పీడీఎఫ్)లు విడివిడిగా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టారు. టైంస్కేల్ డిమాండ్ చేస్తూ ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఈ నెల 19 నుంచి పోరుబాట పట్టారు. మరో వైపు తమకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని పీడీఎఫ్‌లు సోమవారం నుంచి దీక్షలు చేపట్టారు. కాగా హాస్టల్ ఉద్యోగులు కూడా ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఈ ఆందోళనల్లో భాగంగా మంగళవారం ఎన్ఎంఆర్ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మహిళా ఉద్యోగులు కళ్లకు గంతలతో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ముందుగా గోల్డన్ జూబ్లీ ఆర్చి వద్ద నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ చేశారు. పరిపాలన భవనం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు ఆముదాల చిరంజీవి, నాగవెంకటేశు, బాలనరసింహారెడ్డి, మఠం గిరిబాబు పాల్గొన్నారు. అలాగే ఉద్యోగ భధ్రత కోరుతూ పీడీఎఫ్‌లు నిరసన దీక్ష కొనసాగించారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు వెంకటస్వామి, కాసారం లత, గంగాధర్ తదతరులు పాల్గొన్నారు. -
సిట్ శ్రీనివాసరావును నామమాత్రంగా విచారించింది
-
ఎస్వీయూలో నిరుద్యోగ దీక్ష
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్: నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ ఎస్వీయూలో మంగళవారం ప్రారంభమైన 48 గంటల నిరుద్యోగ దీక్షకు జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు, యువత స్వచ్ఛం దంగా తరలివచ్చింది. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఎస్వీయూలో వైఎస్సార్ విద్యార్థి విభాగం తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జి వి.హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ దీక్ష ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీని వాసులు ప్రారంభించిన ఈ దీక్షకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి మాజీ ఎంపీ వి.వరప్రసాద్‌రావు సంఘీభావం ప్రకటిం చారు. ముందుగా ఎస్వీయూ గోల్డన్ జూబ్లీ ఆర్చి ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, అనంతరం దీక్ష శిబిరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జంగా లపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటికో ఉద్యోగం, రూ.2 వేల భృతి ఇస్తానని హామీ ఇచ్చి నిలుపుకోలేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల వస్తున్నందున కేవలం రూ.వెయ్యి భృతి ప్రకటించారని, అది కూడా అనేక ఆంక్షలు పెట్టి యువతకు దక్కకుండా మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న మోసాలకు యువత పుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాం బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే రూ.వెయ్యి నిరుద్యోగ భృతి ఇస్తున్నారన్నారు. షరతులు లేకుండా భృతి ఇవ్వాలి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం ఇప్పటివరకు బాకీ పడిన నిరుద్యోగ భృతిని ఏడాదికి రూ.24 వేల చొప్పున ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని కోరారు. అబద్దాలు, మోసాల్లో సీఎం దిట్ట అన్నారు. నా లుగున్నరేళ్లగా భృతి ఇవ్వకుండా మోసం చేసిన బాబు ఇప్పుడు రూ.వెయ్యి భృతి మాత్రమే అనేక ఆంక్షలతో ఇవ్వడం దారుణమన్నారు. మాజీ ఎంపీ వరప్రసాద్‌రావు మాట్లాడుతూ ఏపీ సీఎం తనయుడు లోకేష్ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తల సదస్సు జరిగిన అనంతరం రూ.లక్ష కోట్ల పెట్టుబడి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారని, అయితే పెట్టబడులు ఎక్కడ వచ్చాయి?, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించా రు. కార్యక్రమంలో ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ రత్నయ్య, పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి, చిత్తూరు, తిరుపతి, రాజంపేట పార్లమెంట్ నియోజక వర్గాల విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవి రెడ్డి మోహిత్‌రెడ్డి, జే.సుధీర్, కిషోర్ దాస్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఓబుళరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.రాజశేఖర్ రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.సంగీత, నాయకులు తిరుమల ప్రకాశ్, మురళీ ధర్, క్యాంపస్ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి, తేజ, నవీన్, శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్వీయూ విద్యార్థుల అర్ధనగ్న ప్రదర్శన
సాక్షి, తిరుపతి : జ్ఞానభేరీ సభలో విద్యార్థుల అక్రమ అరెస్టులకు నిరసనగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆదివారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న జ్ఞానభేరి సభ రసాభాసంగా మారిన సంగతి తెలిసిందే. విద్యార్థులు ప్రత్యేక హోదా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఊహించని ఈ పరిమాణాలతో సభ అంతా గందరగోళంగా మారింది. నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని కోరారు. -
చంద్రబాబు తీరుపై ఎస్వీయు విద్యార్థుల ఆగ్రహం
-
హోదా కోసం తిరుపతిలో విద్యార్థుల వినూత్న నిరసన
-
ఎస్వీయూ ఏఈ నివాసంలో ఏసీబీ సోదాలు
సాక్షి, తిరుపతి : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అసిస్టెంట్ ఇంజినీర్ రుద్రకుమార్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. తిరుపతిలో ఆయన నివాసంతో పాటు, ఎస్వీ వర్సిటీ, నెల్లూరులోని ఏఈ సోదరుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 6 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు
యూనివర్సిటీ క్యాంపస్: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ)లోని సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ పసిఫిక్ స్టడీస్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి. జయచంద్రారెడ్డి తెలిపారు. సౌత్ ఏషియన్ సీ-ఎమర్జింగ్ సినారియో పేరిట నిర్వహించే ఈ సదస్సు మూడు రోజులపాటు జరుగుతుందన్నారు. వైస్ చాన్స్‌లర్ దామోదరం ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి నీలకంఠన్ రవి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫైర్స్ మాజీ పీయూష్ శ్రీవాస్తవ హాజరవుతారని వివరించారు. ఈ సందర్భంగా నీలకంఠన్ రవికి లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు ఫర్ ఇంటర్నేషనల్ అండర్‌స్టాండింగ్‌ను అందజేయనున్నట్లు జయచంద్రారెడ్డి చెప్పారు. -
ఆ పది కాలేజీల్లో చేరకండి
యూనివర్సిటీక్యాంపస్(చిత్తూరు): ఎస్వీయూ పరిధిలోని 10 కళాశాలలు 2017–18 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ కోసం ధరఖాస్తు చేయలేదని అటువంటి కళాశాలల్లో చేరవద్దని ఎస్వీయూ అకడమిక్ ఆడిట్ డీన్ ప్రొఫెసర్ బి.సుధీర్ తెలిపారు. అఫిలియేషన్‌కు ధరఖాస్తు చేయని ఆ కళాశాలలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. అటువంటి కళాశాలల్లో చేరి నష్టపోవద్దని చెప్పారు. అఫిలియేషన్‌కు ధరఖాస్తు చేయని కళాశాలల జాబితా ఇలా ఉంది... రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, శ్రీ ఆది శంకర కాలేజ్ ఆప్ ఎడ్యుకేషన్, తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యోదయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, శ్రీ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్(తిరుపతి), సహాయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (కొట్రమంగళం), శేషాచల డిగ్రీ కళాశాల (వడమాలపేట), స్కిమ్స్ డిగ్రీ కళాశాల (తొట్టంబేడు), ఎస్వీ డిగ్రీ కళాశాల( చెర్లోపల్లి), ఉషోదయ డిగ్రీ కళాశాల( బంగారుపాలెం). -
ఎస్వీయూ కొరడా
► వసతులు లేకుండా కాలేజీల నిర్వహణ ► 66 కళాశాలలకే అనుబంధం ► 150 కళాశాలలకు నిరాకరణ ► గుర్తింపు కళాశాలలకూ ‘నో’ యూనివర్సిటీక్యాంపస్: కనీస సౌకర్యాలు లేని అనుబంధ కళాశాలలపై ఎస్వీయూనివర్సిటీ కొరడా ఝుళిపించింది. ఈ విద్యాసంవత్సరానికి 150 కళాశాలలకు అనుబంధాన్ని నిరాకరించింది. తొలివిడతలో 66 కళాశాలలకు మాత్రమే అనుమతించారు. ఈ కళాశాలల జాబితాను బుధవారం యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చారు. ఎస్వీయూ పరిధిలో 220 కళాశాలలున్నాయి. ఇందులో 143 డిగ్రీ, 31 బీఈడీ, 4 బీపీడీ, 6 న్యా యకళాశాలలు, 27 ఎంబీఏ, ఎంసీఏ, 4 ఎంఈడీతో పాటు 5 ఎస్వీయూ క్యాంపస్ కళాశాలలు ఉన్నాయి. వీటికి 2017–18 విద్యాసంవత్సరానికి అనుబంధం కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. 210 కళాశాలలు దరఖాస్తు చేశాయి. గతనెలలో 171 కళాశాలలను ఎస్వీయూనివర్సిటీ అఫిలియేషన్ కమిటీ తనిఖీలు చేసింది. పలు చోట్ల వసతులు కొరవడ్డాయని గుర్తించింది. సౌకర్యాలున్న 66 కళాశాలలను గుర్తించి బుధవారం తొలిజాబితాను ప్రకటించింది. చాలా కళాశాలలకు కనీస సౌకర్యాలు లేవు. 10 సంవత్సరాల్లో సొంత భవనాలు ఏర్పాటు చేసుకోవాలి. సొంత భవనాలులేని 23 కళాశాలలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటీసులు సైతం పంపింది. కొన్ని చోట్ల ఒకే ఆవరణలో డిగ్రీ, ఇంటర్, డీఎడ్, పాఠశాలలు నిర్వహిస్తున్నారు. కనీస ప్రయోగశాలలు, గ్రంథాలయాలు లేవు. నాణ్యత కల్గిన సిబ్బంది లేరు. ఒకచోట అనుమతి పొంది మరోచోట కళాశాలలు నిర్వహిస్తున్నారు. కొన్ని కళాశాలలు కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఉన్నాయి. పార్కింగ్, క్రీడాసౌకర్యాలు లేవు. ఈ అంశాలను పరిశీలించిన కమిటీ సిఫార్సులను అకడమిక్ విభాగానికి సమర్పించింది. దీనిపై స్పందించిన ఎస్వీయూ అధికారులు పలు కళాశాలలకు అఫిలియేషన్‌ను ఇవ్వలేదు. గుర్తింపు పొందిన కళాశాలలు కూడా అఫిలియేషన్ జాబితాలో లేకపోవడం విశేషం. తిరుపతిలో అఫిలియేషన్ కళాశాలలు అకార్డ్ బిజినెస్ స్కూల్, ఏటీఎన్స్, కృష్ణతేజ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్సీరెడ్డి, ఎమరాల్డ్స్, గేట్, గాయత్రి, రామరాజ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రామరాజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రిమ్స్, రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆర్సీఆర్, సహాయ ఎంబీఏ కళాశాల, శ్రీరామ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్,ఎస్డీహెచ్ఆర్, సీకాం, పద్మావతి కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, గేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏఈఆర్ లా కళాశాల, ఎంబీఏ కళాశాల. -
ఎస్వీయూ అరుదైన ఘనత
► నాక్‌లో ఏప్లస్ గ్రేడ్ ► తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన వర్సిటీ యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూ 2009లో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్)లో ఏ గ్రేడ్ సాధించింది. అప్పట్లో అదో రికార్డు. ఆ రికార్డును ప్రస్తుతం తిరగరాసింది. ఏప్లస్ గ్రేడ్ సాధించింది. బెంగళూరులోని నాక్ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన నాక్ గ్రేడింగ్ ఫలితాల్లో ఎస్వీయూ 3.52 గ్రేడ్ పాయింట్లతో ఏ ప్లస్ గ్రేడ్‌ను సొంతం చేసుకుంది. నాలుగు గ్రేడ్ పాయింట్లకుగాను 3.52 గ్రేడ్ పాయింట్లు సాధించడం విశేషం. దేశంలో ఇప్పటి వరకు 7 యూనివర్సిటీలకే నాక్‌లో ఏప్లస్ గ్రేడ్ ఉంది. తాజాగా ఎస్వీయూ ఏప్లస్ సాధించి 8వ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. దేశంలోని ఏప్లస్ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీల్లో నాలుగు డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ యూనివర్సిటీకి కూడా ఏప్లస్ లేదు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో గీతం యూనివర్సిటీ (విశాఖపట్నం)కి మాత్రమే ఈ గుర్తింపు ఉంది. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా (హైదరాబాద్), ఆంధ్రా (విశాఖపట్నం)లకు సాధ్యం కాని ఏప్లస్ గ్రేడ్‌ను ఎస్వీయూ సొంతం చేసుకోవడం విశేషం. దక్షిణాది రాష్ట్రాల్లో అలగప్పా యూనివర్సిటీ తర్వాత ఏప్లస్ సాధించిన రెండో యూనివర్సిటీ ఎస్వీ యూ కావడం విశేషం. గత ఏడాది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలకు ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూ 601–800 ర్యాంక్ పొందింది. ఈ ఏడాది ప్రకటించిన ఏషియన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూ 401–600 ర్యాంక్ పొందింది. బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి ర్యాంక్ పొందింది. నాక్‌లో మంచి గ్రేడ్ రావడం పట్ల క్యాంపస్‌లో శుక్రవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. -
ఎస్వీయూలో డ్రగ్స్ కలకలం
హుక్కా మాత్రమే అంటున్న పోలీసులు తిరుపతి: ఎస్వీయూలో డ్రగ్స్ కలకలం రేగింది. సోమవారం రాత్రి పొద్దుపోయాక విశ్వతేజ బ్లాక్‌లోని 3303 గదిలో బీటెక్ విద్యార్థులు మత్తు పదార్థాలు తీసుకున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ప్రిన్సిపాల్ మల్లికార్జున, వార్డెన్ ప్రభాకర్‌లు వసతి గృహానికి వెళ్లి తనిఖీ చేయగా అక్కడ మత్తు పదార్థాలు గుర్తించినట్లు తెలిసింది. అనంతరం విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వసతి గృహాన్ని తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులు డ్రగ్స్ తీసుకోవడానికి ఉపయోగించే పరికరాలను గుర్తించారు. వాటిని స్వాధినం చేసుకున్నారు. అయితే ఈ సంఘటనపై సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ అవి డ్రగ్స్ కాదని, విద్యార్థులు హుక్కా మాత్రమే తీసుకుంటు కనిపించారని పేర్కొన్నారు. అది పొగాకు మాత్రమే అని, డ్రగ్స్ కాదన్నారు. గత వారం ర్యాగింగ్ ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ర్యాగింగ్ కలకలం ఏర్పడింది. హెచ్‌బ్లాక్ సమీపంలో సీనియర్, జూనియర్ విద్యార్థులు కలసి గెట్టుగెదర్ చేసుకుండగా, ర్యాగింగ్ జరుగుతోందని ప్రచారం కావడంతో వార్డెన్ ప్రభాకర్ సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులను అక్కడ నుంచి పంపించి వేశారు. ఈ సంఘటన మరవక ముందే మరోసారి డ్రగ్స్ కలకలం రేగడం విశేషం. ఈ సంఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున వివరణ కోసం ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. -
ఎస్వీయూ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత
తిరుపతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ.. విద్యార్థులు శాంతియుతంగా చేపడుతున్న నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. తిరుపతిలోని ఎస్వీయూ మెయిన్ గేట్ వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తుండగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు బలవంతంగా విద్యార్థులను అక్కడినుంచి తరలించారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ఎస్వీయులో హాస్టల్ గదుల కోసం విద్యార్థుల పాట్లు
-
జనవరి 3న తిరుపతికి ప్రధాని
► అదే రోజు ఎస్వీయూలో ఐఎస్సీ ప్రారంభం ►ఏర్పాట్లపై ఈనెల 16న తిరుపతిలో సీఎం సమీక్ష ►అధికారులందరూ బాధ్యతగా మెలగాలి ►కమిటీల కన్వీనర్లు,అధికారులతో కలెక్టర్ సమీక్ష సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనవరి 3 నుంచి 7 వరకూ తిరుపతిలో జరిగే జాతీయ స్థారుు ఇండియన్స సైన్స్ సభలను అధికారులందరూ విజయవంతం చేయాలనీ, ఇందుకోసం వివిధ కమిటీల కన్వీనర్లు బాధ్యతగా ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ సూచించారు. మొదటి రోజైన జనవరి 3న భారత ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి చేరుకుంటారనీ, ఆయన చేతుల మీదుగానే సైన్స కాంగ్రెస్ ప్రారంభం జరుగుతుందన్నారు. ప్రధాని రాకను ధృవీకరిస్తూ పీఎంవో నుంచి ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి ఎస్వీయూ ఆవరణలో నిర్వహించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారిక రివ్యూలో కలెక్టర్ పాల్గొన్నారు. సైన్స కాంగ్రెస్ సభల నిర్వహణ కోసం జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు. రిసెప్షన్, రవాణా, బస, భోజనం, విద్యుత్, ప్రచారం, మేనేజ్మెంట్ తదితర కమిటీల్లో ఉన్న కన్వీనర్లు, కోకన్వీనర్లు తమకు కేటారుుంచిన పనులను సకాలంలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. రానున్న 15 రోజులు కీలకమైనవి కాబట్టి అధికారులు సాధ్యమైనంత వరకూ సెలవులను పక్కన పెట్టాల్సి ఉంటుందన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే అతిథులు, వీవీఐపీలను అత్యంత జాగ్రత్తగా, ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. వారికిచ్చే ఆతిథ్యంలో ఎలాంటి లోపాలు జరగకూడదన్నారు. తిరుపతిలో జరిగేది ప్రపంచస్థారుు సైన్స పండుగగా కలెక్టర్ అభివర్ణించారు. సైన్స కాంగ్రెస్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ డీ. నారాయణరావు మాట్లాడుతూ, ఈనెల 16న సీఎం చంద్రబాబునాయుడు తిరుపతిలో మరోసారి సమీక్ష జరిపే అవకాశముందన్నారు. ఇప్పటివరకూ అన్ని విభాగాల్లోనూ 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఈనెల 20 నాటికి నూరు శాతం ఏర్పాట్లు పూర్తవుతాయని వివరించారు. సమీక్షలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పండాదాస్, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, టీటీడీ జేఈవో ప్రోలా భాస్కర్, మహిళా యూనివర్సిటీ వీసీ డాక్టర్ దుర్గాభవానీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిపుణుల సలహా మేరకే చెట్లు నరికివేత ఇస్కా సభల నిర్వహణ పేరుతో అధికారులు వర్సిటీ ఆవరణలోని అందమైన, భారీ చెట్లను నరికివేస్తున్నారు. పరిపాలన భవనం పక్కనే ఉన్న 40 ఏళ్ల నాటి వృక్షాలను కూడా నేలకూల్చారు. నీడనిచ్చే చెట్లను నరికివేస్తుంటే చూపరుల ప్రాణం ఉసూరుమంటోంది. ఇదే విషయాన్ని పాత్రికేయులు ఎస్వీయూ వీసీ డాక్టర్ దామోదరం దగ్గర ప్రస్తావించారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన వర్సిటీ భవనాలు కొన్ని చెట్ల కారణంగా పటిష్టత కోల్పోతున్నాయనీ, అంతేకాకుండా వివిధ రకాల అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్నందున వాటిని తొలగిస్తున్నామని వీసీ డాక్టర్ దామోదరం బదులిచ్చారు. అశోక, యూకలిప్టస్ చెట్ల వల్ల భవనాలకు నష్టం వాటిల్లుతుందనీ, ఉద్యానవన శాఖ నిపుణుల సూచనల మేరకు అటువంటి చెట్లను తొలగిస్తున్నామన్నారు. నష్టపోయే పచ్చదనాన్ని భర్తీ చేసేందుకు వర్సిటీ ఆవరణలో 7 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళిక తయారు చేశామన్నారు. -
తమిళనాడులో ఇద్దరు ఏపీ మెడికోలు మృతి
-
తమిళనాడులో ఇద్దరు ఏపీ విద్యార్థుల మృతి
తిరుత్తణి(తమిళనాడు): రోడ్డు ప్రమాదంలో తిరుపతికి చెందిన ఇద్దరు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా తిరుపతి శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాల(ఎస్వీయూ)లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు కారులో చెన్నైకి వెళుతున్నారు. ఈ క్రమంలో తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం వద్దకు రాగానే కారు అదుపు తప్పి ఓ అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సుదర్శన్, శివసాయికృష్ణ అనే వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను తిరుత్తణి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థులను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
సంక్రాంతి ముందు సైన్స్ పండుగ
–104వ సైన్స్ కాంగ్రెస్‌కు తిరుపతి వేదిక –1983లో తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ –ఏపీలో మూడోసారి – ఈ ఏడాది థీమ్ ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్’ యూనివర్సిటీ క్యాంపస్: శాస్త్ర సాంకేతిక రంగంలో నూతన పరిశోధనలు.. ఫలితాలు.. కొంగొత్త ఆవిష్కణలతో పాటు పలు అంశాలపై జరిగే చర్చా వేదికే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఎంతో ప్రతిష్టాత్మకమైన సైన్స్ కాంగ్రెస్ ఏటా జనవరిలో జరపడం ఆనవాయితీ. ఏటా ఈ సదస్సును దేశ ప్రధానే ప్రారంభిస్తారు. అంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి అతిథ్యం ఇచ్చే అవకాశం ఎస్వీయూకు దక్కింది. ఎస్వీయూలో వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగనుంది. జనవరి 3న ఎస్వీయూ స్టేడియంలో నిర్వహించనున్న సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎస్వీయూలో ఆడిటోరియం, సెనెట్ హాల్, అంతర్గత రహదార్లను అభివద్ధి చేయాలని ఈనెల 26న జరిగిన పాలకమండలిలో సైతం నిర్ణయం తీసుకున్నారు. 33 ఏళ్ల తర్వాత ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 1983లో తిరుపతిలో నిర్వహించారు. ‘ మ్యాన్ అండ్ ద ఓసియన్ రీసోర్స్ డెవలప్మెంట్’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. కోల్కత్తా కేంద్రంగా ఉన్న ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఏటా నిర్వహిస్తారు. తొలి సైన్స్ కాంగ్రెస్ 1914లో కలకత్తాలో నిర్వహించారు. జస్టిస్ అశుతోష్ ముఖర్జీ అధ్యక్షుడిగా, డి.హూపర్ ప్రధాన కార్యదర్శిగా ఈ సదస్సు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలిసారిగా 1937లో 24 వ సైన్స్ కాంగ్రెస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘ ద ఇండియన్ విలేజ్ ఇట్స్ ఫాస్ట్, ప్రజెంట్, ప్యూచర్’ అనే అంశంపై నిర్వహించారు. అనంతరం 1954, 1967, 1979, 1998, 2006లో మొత్తం ఆరుసార్లు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇక ఏపీ విషయానికి వస్తే 1983లో 70వ సైన్స్ కాంగ్రెస్ తిరుపతిలో నిర్వహించారు. ఫ్రొఫెసర్ బీ రామచంద్రరావు అధ్యక్షుడిగా, ప్రొఫెసర్ అర్చన శర్మ, అరుణ్ దేవ్‌లు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. 2008లో విశాఖపట్నంలో 95వ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. గత ఏడాది 103వ సైన్స్ కాంగ్రెస్‌ను మైసూర్లో నిర్వహించారు. ప్రారంభం ఇలా 1914లో బ్రిటీష్ రసాయన శాస్త్రవేత్తలు జేఎల్.సిమన్సన్, పీఎస్.మెక్ మోహన్‌లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను స్థాపించారు. జనవరి 15–17వ తేదీల్లో కలకత్తాలో జరిగిన ఈ సదస్సుకు ఐదుగురు శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఆరు సెషన్స్‌లో జరిగిన సదస్సులలో 35 పరిశోధన పత్రాలు సమర్పించారు. 2013లో కలకత్తాలోనే 100వ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. ఇదే సదస్సు సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరిపారు. 1981 నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డును ప్రవేశపెట్టారు. ఉత్తమ పరిశోధన పత్రాన్ని సమర్పించిన వారికి యంగ్‌సైంటిస్ట్ అవార్డు ఇవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ అవార్డు పొందిన వారికి రూ.25 వేల నగదు, ప్రశంసాæపత్రం ప్రదానం చేస్తున్నారు. ఎస్ఆర్ఎం నుంచి ఎస్వీయూకు.. జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతను మొదట చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి కేటాయించారు. ఇటీవల ఆ సంస్థపై మెడిసిన్ అడ్మిషన్ల అంశంపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో వేదిక ఎస్వీయూకు మార్చారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఎస్వీయూలోని వసతులు సౌకర్యాలు పరిశీలించి ఎస్వీయూలో నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర కేబినేట్ కూడా దీని నిర్వహణకు ఆమోదించింది. అయితే స్థానిక నిర్వహణ కార్యదర్శి నియామకం జరగలేదు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఎలెక్టెడ్ మెంబర్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న ఎస్వీయూ ప్రొఫెసర్ ఎం.భూపతినాయుడికి ఈ అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. 20 వేల మంది ప్రతినిధులు జనవరిలో జరగనున్న సైన్స్ కాంగ్రెస్‌కు 20వేల మంది ప్రతినిధులు, 200 మంది విదేశీ ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది. ఈ సదస్సు నిర్వహణకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించటంతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ఎస్వీయూకు రూ.కోటి నిధులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఉపయోగాలు: ఈ సదస్సు నిర్వహణ వల్ల ఎస్వీయూ ప్రతిష్ట ఇనమడించే అవకాశం ఉంది. దేశ, విదేశాల్లో ఎస్వీయూకు గుర్తింపు లభిస్తుంది. నూతన పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుంది. సైన్స్ పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తుంది. యువత స్ఫూర్తి పొంది భావి శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఏర్పడుతుంది. మంచి అవకాశం ఎస్వీయూకు 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించే అవకాశం రావడం అదష్టమని చెప్పవచ్చు. ఈ సదస్సు నిర్వహణ వల్ల ఎస్వీయూ ప్రతిష్ట పెరగటమే కాకుండా భవిష్యత్‌లో నూతన పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుంది. –ఆర్.గురుప్రసాద్, ఎస్వీయూ పాలకమండలి సభ్యుడు -
ఎస్వీయూ దూరవిద్యా పరీక్ష వాయిదా
తిరుపతి, యూనివర్సిటీ క్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలోని 59 కేంద్రాల్లో జరుగుతున్న పీజీ, యూజీ పరీక్షల్లో భాగంగా శనివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు దూరవిద్య విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంపీ.నరసింహరాజు తెలిపారు. శనివారం ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం జరగాల్సిన పరీక్షను వాయిదా వేశామన్నారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. వాయిదా పడిన పరీక్షను నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు. -
ఏపీఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
–స్పందన అంతంత మాత్రమే –885 మంది కౌన్సెలింగ్‌కు హాజరు యూనివర్సిటీక్యాంపస్: రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం ఏపీఎడ్‌సెట్–2016 కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎస్వీయూనివర్సిటీ(తిరుపతి), ఆంధ్రాయూనివర్సిటీ (వైజాగ్), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు), ఎస్కేయూనివర్సిటీ(అనంతపురం), అంబేద్కర్ యూనివర్సిటీ(శ్రీకాకుళం), జేఎన్టీ యూనివర్సిటీ(కాకినాడ)లలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం గణితం, ఇంగ్లీషు సబ్జెక్ట్‌లకు కౌన్సెలింగ్ నిర్వహిచంగా 885 మంది మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. తొలి రోజు స్పందన అంతంత మాత్రంగానే కన్పించింది. తిరుపతిలో 196 మంది, వైజాగ్‌లో 143 మంది, గుంటూరులో 201 మంది, అనంతపురంలో 193 మంది, కాకినాడలో 87 మంది, శ్రీకాకుళంలో 65 మంది కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం ఫిజికల్సైన్స్, బయాలజీ సబ్జెక్ట్‌లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. శనివారం కౌన్సెలింగ్‌కు హాజరుకాలేక పోయిన వారిని ఆదివారం కూడా కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామన్నారు. -
ఉర్దూ వర్సిటీ రిజిస్ట్రార్‌గా సత్తార్ సాహిర్
యూనివర్సిటీ క్యాంపస్: కర్నూలులో నూతనంగా ఏర్పాౖటెన ఉర్దూ యూనివర్సిటీ తొలి రిజిస్ట్రార్‌గా ఎస్వీయూ ఉర్దూ విభాగాధిపతి ప్రొఫెసర్ సయ్యద్ సత్తార్ సాహిర్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. 1992లో ఎస్వీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి అసోసియేట్‌గా, ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొందారు. ఉర్దూ విభాగాధిపతిగా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశారు. ఈ ఏడాది ఏర్పాౖటెన ఉర్దూ యూనివర్సిటీకి తొలి రిజిస్ట్రార్‌గా సయ్యద్ సత్తార్ సాహిర్‌ను నియమిస్తూ ఇన్చార్జి వీసీ నరసింహులు ఉత్తర్వులు జారీ చేశారు. -
యూనివర్సిటీలో ఎడ్యు‘కేట్లు’
– ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఇష్టారాజ్యం – ఇద్దరి అధికారుల కనుసన్నల్లో ఐదు బీపీఈడీ కళాశాలలు – అర్హత లేకున్నా మంజూరు చేయించిన వైనం – యూనివర్సిటీ పేర్కొన్న చోట ఓ కాలేజీ లేనేలేదు – ‘అవగాహన ఒప్పందం’తో ముందుకు సాక్షి ప్రతినిధి, తిరుపతి తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి విశిష్టమైన పేరు ప్రతిష్టలున్నాయి. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగి, వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్టులైన గొప్పవారిని తీర్చిదిద్దిన విశాలమైన శారదా నిలయమిది. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన సమున్నత రాజకీయ శిక్షణాశాల కూడా. వీరు కాక మరెంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్లు, సాహిత్య కోవిదులతో పాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను పరిచయం చేసిన వర్సిటీ ఇది. ఇంతటి పేరున్న యూనివర్సిటీ ప్రాభవం నేడు మసకబారుతోంది. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోంది. పలు విభాగాల్లో నెలకొన్న తీవ్రమైన నిర్లక్ష్యం వర్సిటీ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. వసతులు కనుమరుగవుతున్నాయి. దీంతో ఏయేటికాయేడు వర్సిటీ అడ్మిషన్లు తగ్గుతున్నాయి. ఎస్వీయూలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగమే ఇందుకు ఉదాహరణ. ఈ విభాగాన్నీ, ఇక్కడున్న విద్యార్థులను దగ్గరగా పరిశీలిస్తే నోరు తెరవాల్సిందే. ఎవర్ని పలకరించినా ఆశ్చర్యం కలిగించే ఆసక్తికర విషయాలు చెవుల్లో గంట కొడతాయి. కళ్లు విప్పార్చి ఔనా !! అనాల్సిందే మరి. అక్రమార్జనలో వీరి రూటు సప‘రేటు’ సంపాదనలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. కొందరు వ్యాపారం చేసి, మరికొందరు ఉద్యోగం చేసి...ఇంకొందరు తెలివి తేటలను ఉపయోగించి. కానీ....వర్సిటీలోని కొందరు టీచింగ్ స్టాఫ్ అడ్డదారిలో రెండు చేతులా సంపాదిస్తున్నారు. వసూల్ రాజాలుగా మారి విద్యార్థుల భవితవ్యంతో ఆడుకుంటున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులపై ఇటీవల బోలెడన్ని ఆరోపణలు హల్చల్ చేశాయి. వీరిపైనా ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలు కూడా విద్యార్థులు, అధ్యాపకవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇక్కడున్న ఆరోపణలను ఒక్కొక్కదాన్నీ విశ్లేషిస్తే..... వర్సిటీ పరిధిలోని ఐదు బీపీఈడీ కాలేజీలకు సరైన అర్హతలు లేకున్నా వర్సిటీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఏడాది కిందట అనుమతులు మంజూరు చేయించారు. ఓ బీపీఈడీ కళాశాల దరఖాస్తులో పేర్కొన్న చోటలేనే లేదు. దీంతో ఆ కళాశాల యాజమాన్యంతో సరైన ‘అవగాహన ఒప్పందం’ కుదుర్చుకున్న వీరిద్దరూ తమకు అనుకూలమైన మరో కాలేజీలో విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించేలా సాయమందించారు. 2014–15 సంవత్సరంలో ఏస్వీయూ పరిధిలోని ఐదు బీపీఈడీ కాలేజీల్లో మొదటి రెండు సెమిస్టర్లు జరిగాయి. ఒక్కొక్క సెమిస్టర్లో 3 థియరీ, 2 ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. ఎస్వీయూ బీపీఈడీ మినహా మిగిలిన నాలుగు కాలేజీలకూ ఎక్సటర్నల్ ఎగ్జామినర్లుగా వీరిద్దరే వెళ్లి, ఆ తర్వాత ఆయా కాలేజీలకు చెందిన 3 వేల సమాధాన పత్రాలను వీరే దిద్దారు. అప్పట్లో 300 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఆ తర్వాత ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 వేల చొప్పున సంభావన పుచ్చుకుని వీరందర్నీ పాస్ చేయించారన్న ఆరోపణలు ఇటీవల తెరమీదకొచ్చాయి. అప్పట్లో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా ఉన్నవాళ్లు పేపర్ కరెక్షన్లు ఎలా చేస్తారన్నది ప్రశ్న. విచారణ జాడేలేదు.. మరో ముఖ్యమైన విషయమేమంటే... 2014లో ఓ విద్యార్థిని ఎంఫిల్ రెగ్యులర్ స్కాలర్‌గా ఎస్వీయూలో ప్రవేశం పొందింది. ఆ తరువాత రెండ్రోజులకే ఆమె దుబాయ్ వెళ్లింది. అయితే ఆ విద్యార్థినికి 2016లో ఎంఫిల్ పట్టా ఇచ్చి పీహెచ్డీ ప్రవేశాన్ని కల్పించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అక్రమాలు. వీరికంటే ముందు పనిచేసిన ఓ ‘బాబు’ తన ఉద్యోగ కాలమంతా అందిన కాడికి దండుకున్నారన్న ఆరోపణలు సర్వత్రా గుప్పుమంటున్నాయి. ఈయన ఘన కార్యాలను వివరిస్తూ ఈ మధ్యనే ఓ భారీ కరపత్రం విడుదలైంది. ఇందులో సదరు అధికారి అవినీతి అక్రమాల చిట్టా ఉంది. సమ్మర్ క్యాంప్ కోసం విడుదలైన సొమ్ము మింగేయడం దగ్గర నుంచి వేలకు వేలు లంచాలుగా తీసుకుని అడ్డదారిలో విద్యార్థులను పాస్ చేయించే వరకూ ఆరోపణలున్నాయి. వీటిపై విచారణలే లేకుండా పోయాయి. చీకటి గదుల్లో విద్యార్థులు వర్సిటీ బీపీఈడీ విద్యార్థుల దుస్థితి కడు దయనీయంగా ఉంది. సరైన వసతి సదుపాయాలు లేక వీరు నానా అవస్థలు పడుతున్నారు. ఉండేందుకు సరైన గదులు లేక వంటరూముల్లోనూ గడుపుతున్నారు. బాత్రూములు, తాగునీరు, ఫ్యాన్లు లేక నానా ఇక్కట్లకు గురవుతున్నారు. కరెంటు లేని రాత్రుల్లో కాలసర్పాల సాహచర్యంలో దినమొక గండంగా గడుపుతున్నారు. వర్సిటీ ఉన్నతాధికారులేం చేస్తున్నట్టు?? వర్సిటీలోని ఓ కీలక విభాగంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అన్నీ తెలిసి మిన్నకుంటున్నారా, లేకపోతే తెలియని పరిస్థితుల్లో ఉన్నారో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా వర్సిటీని చక్కదిద్దే బాధ్యత వీరిపైనే ఉంది. -
ఇలాంటి భోజనం ఎలా తినాలి?
– ఎస్వీయూలో విద్యార్థుల ఆందోళన యూనివర్సిటీ క్యాంపస్:నాణ్యత, శుచి శుభ్రత లేని భోజనం ఎలా తినాలని ఎస్వీయూ హాస్టల్ విద్యార్థులు ప్రశ్నించారు. ఎస్వీయూలోని బీ–మెస్‌లో భోజనం బాగాలేదని ఆరోపిస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ప్లేట్లు చేతిలో పెట్టుకుని బీ–మెస్ ఎదురుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ మెస్‌లో భోజనం చాలా అధ్వాన్నంగా వుందన్నారు. నీళ ్లచెట్నీ, సాంబారుతో తినలేక పోతున్నామని విమర్శించారు. ఫీజులు మాత్రం అధిక మొత్తంలో వసూలుచేసుకుని నాణ్యతలేని భోజనం పెడుతున్నారని మండిపడ్డారు. భోజనం వడ్డించే సిబ్బంది కూడా తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. వైఎస్సార్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఓబుల్‌రెడ్డి, బీజేపీ ఎడ్యుకేషన్ సెల్ జిల్లా కన్వీనర్ విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘ నాయకులు మురళీధర్ విద్యార్థులకు మద్దతు తెలిపారు. నాణ్యమైన అందించాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు విద్యార్థులతో చర్చించారు. రెండు రోజుల్లో నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. చిత్తూరు జిల్లాలోని ఎస్వీ యూనివర్సిటీలోని సెనేట్ హాల్లో ఈ రోజు మధ్యాహ్నం మంత్రి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో 87.61 శాతం ఉత్తీర్ణత వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం 9 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా..మంత్రి అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. కాగా ఈ నెల 16న ఐసెట్ పరీక్ష జరిగిన ఐసెట్ ను ఈ ఏడాది ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించింది. -
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల వాయిదా
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ఐసెట్ ఫలితాల విడుదల మధ్యాహ్నానికి వాయిదా పడింది. మంత్రి గంటా శ్రీనివాసరావు రావటం ఆలస్యం కావటంతో ఫలితాల విడుదలను అధికారులు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే తిరుపతి ఎస్వీయూలో ఇవాళ ఉదయం 9 గంటలకు ఐసెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సంయుక్త ప్రవేశ పరీక్ష ఐసెట్ 2016ను ఈ ఏఆడాది ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించింది. ఈ నెల 16న ఐసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. -
ఎస్వీయూలో నిరుత్సాహ మేళా
ఇంటర్వ్యూలు తప్ప ఉద్యోగాలు ఇవ్వని కంపెనీలు యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూలో శుక్రవారం నిర్వహించిన చంద్రన్న ఉద్యోగ మేళా నిరుద్యోగులకు నిరాశ కల్పించింది. 20 కంపెనీలు వస్తున్నాయంటూ ఊదరకొట్టిన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించడంలో విఫలమైంది. ఎస్వీయూలో శుక్రవారం నిర్వహించిన ఉద్యోగ మేళాలో విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం తప్ప నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. చాలా మందిని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాలకు రావాలని సూచిం చారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎస్వీయూలో శుక్రవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిం చింది. పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో నిరుద్యోగులు ఎక్కువ మంది వచ్చారు. ఎస్వీయూ వీసీ దామోదరం ప్రారంభించారు. శ్రీనివాస ఆడిటోరియం, ప్రకాశ్‌భవన్, పాత ఎంబీఏ భవనంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొదట ముందుగా రిజిస్ట్రేషన్ చేసిన వారిని మాత్రమే అనుమతించారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారిని అనుమతించకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని వారు కూడా హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇబ్బంది పడ్డ విద్యార్థులు.. జాబ్‌మేళాకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఐదువేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కువమంది రావడంతో వారు ఆహారం, ఇతర అంశాల్లో ఇబ్బందిపడ్డారు. ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వచ్చింది. వర్షం పడడంతో తలదాచుకోవడానికి కష్టపడ్డారు. ఎక్కువ మందిని సెల్ఫ్ డీటైల్స్ అడిగి పంపారని విద్యార్థులు తెలిపారు. బీటెక్, డిగ్రీ వారికి ప్రాధాన్యత ఇచ్చారని, పీజీ విద్యార్థులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు విద్యార్థులు చెప్పారు. మార్కెటింగ్, బీపీవో ఉద్యోగాలు తప్ప మంచి ఉద్యోగాలు లేవని, రెండుమూడు కంపెనీలే గుర్తింపు పొందినవని నిరుద్యోగ అభ్యర్థులు చెప్పారు. -
కీచకుడికే గురువులు!
♦ మసకబారుతున్న ఎస్వీయూ ప్రతిష్ట ♦ కనువిప్పు కలిగించని నాగార్జున యూనివర్సిటీ ఘటన ♦ విద్యార్థులను వేధిస్తున్న ఆచార్యులు ♦ రోజుకో విభాగంలో ఆరోపణలు గురు సాక్షాత్ పరబ్రహ్మ.. అంటూ గురువులను కీర్తిస్తాం. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత వారికి ఇస్తాం. ఇపుడు గురుదేవుల పాత్రలో విద్యార్థుల భవితకు మార్గదర్శనం చేయాల్సిన కొందరు కీచకుడి అవతారమెత్తుతున్నారు. వారి వెకిలి చేష్టలను భరించలేని విద్యార్థినులు, సహోద్యోగులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ సంఘటనలను చూస్తే వీరు కీచకుడికే గురువులనాల్సిన దుర్గతి పడుతోందని విద్యావేత్తలు, మేధావులు అంటున్నారు. సాక్షి, ప్రతినిధి తిరుపతి: విద్యార్థినులను వేధిస్తున్న గురువుల ఉదంతాలు తరచూ ఎస్వీ యూనివర్సిటీలో చోటుచేసుకుంటున్నాయి. వివిధ విభాగాల్లో వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు గురుదేవుల పాత్రపై నీలినీడలు కమ్ముకుంటూ, సమాజానికి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు విద్యార్థులకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. బాధితులు పోలీసులు, మీడియాను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఏడు విశ్వవిద్యాలయాలు, 146 డిగ్రీ కళాశాలలు, 35 ఇంజినీరింగ్ కళాశాలలు, 32 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. దీనికితోడు నర్సింగ్, ఫార్మసీ, మెడికల్ తదితర కళాశాలలతో పాటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొన్నిచోట్ల విద్యార్థులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు. ఘన చరిత్ర ఉన్న ఎస్వీయూలో.. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ఎస్వీ యూనివర్సిటీలో విచారకర ఘటనలు జరుగుతుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన రిషితేశ్వరి ఘటనను మరువకముందే ఎస్వీ యూనివర్సిటీలో లైంగిక వేధింపుల కేసులు నమోదవుతుండటంతో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. కొన్ని ఉదాహరణలు.. - 2012లో జువాలజీ విభాగానికి ప్రొఫెసర్ రాజేశ్వరరావు లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి జైలు పాలయ్యారు. - 2013లో ఆక్వాకల్చర్‌కు చెందిన ఓ విద్యార్థిని రిటైర్డ్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. - ఇంగ్లిష్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ నరేంద్ర వ్యవహార శైలిపై అక్కడి పోస్టు డాక్టోరల్ ఫెలో ఒకరు సెప్టెంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. - సాంఖ్యకశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ రాజశేఖర్‌రెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నారని పీజీ విద్యార్థిని నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ప్రొఫెసర్ డి.ఉషారాణి ఆధ్వర్యంలో 15 మందితో కమి టీ వేసింది. ఈనెల 19వ తేదీన విచారణ జరగనుంది. - రసాయన శాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాసులు తనను వేధిస్తున్నారని పరిశోధక విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో మూడురోజుల క్రితం ఎస్వీయూ క్యాంపస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శ్రీనివాసులు మానసికంగా వేధిస్తున్నారని గత నవంబర్ 9న నలుగురు పరిశోధక విద్యార్థులు ఎస్వీయూ వీసీకి ఫిర్యాదు చేశారు. ఇతర ఫిర్యాదులూ.. ఎస్వీయూలో లైంగిక వేధింపుల ఘటనలే కాకుండా ఇతర కేసులు కూడా ఎక్కువయ్యాయి. గతనెల 17న ఎస్జీఎస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి రెడ్డెప్పరెడ్డి గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి రూ.31వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఏడాది జూన్‌లో తెలుగు విభాగంలో అధ్యాపకులు, పోస్టు డాక్టోరల్ ఫెలోలు పరస్పరం రూం కేటాయింపులో ఎస్వీయూ క్యాంపస్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇలాంటి విషయాలు పోలీస్‌స్టేషన్ వరకు వస్తున్నా.. చాలా విషయాలు సద్దుమణిగిపోతున్నాయి. వెలుగులోకి రాని ఘటనలు మరిన్ని ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనల వల్ల ఎస్వీ యూ ప్రతిష్ట మసకబారుతోంది. భవిష్యత్తులో ఎస్వీయూకు ఎలాంటి మచ్చ రాకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని, బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. -
ఆ విశ్వవిద్యాలయంలో చుక్కనీరు ఉంటే ఒట్టు
తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీ మహిళా హాస్టల్లో రెండు రోజులుగా నీటికొరత తీవ్రంగా ఉంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి చుక్కనీరు కూడా దొరకని పరిస్థితి. తాగడానికి, బాత్రూమ్లో వాడకానికి నీరు లేవు. దీంతో మంగళవారం రాత్రి భోజనం తినేందుకు కూడా చుక్కనీరు లేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థునులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. ప్రకాశం భవన్‌కు వెనుకవైపున ఉన్న మహిళ హాస్టళ్ళ సముదాయ ప్రాంగణంలో విద్యార్థులు బైఠాయించి విద్యార్థులు ఆందోళన చేశారు. హాస్టల్‌కు తీవ్ర నీటి కొరత ఉంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చాలారోజుల నుంచి హాస్టల్లో ఇదే పరిస్థితి ఉందని వార్డన్లు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 1000 మంది ఉన్న హాస్టల్లో 9 మంది మాత్రమే తాగునీటి కుళాయిలు ఉన్నాయని చెప్పారు. అలాగే గదికి ఇద్దరు ఉండాల్సిన రూముల్లో 7 నుంచి 9 మందికి కేటాయించారని చెప్పారు. దోమల భాద ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్లో భోజనం సరిగా లేదని ఆరోపించారు. సమస్యలను ఎన్నిసార్లు వార్డన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని చెప్పారు. వార్డన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. మహిళా హాస్టల్లో ఈ తరహా ఆందోళన జరగడం ఇదే మొదటిసారి. విద్యార్థుల ఆందోళన నేపధ్యంలో రిజిస్ట్రార్ దేవరాజులు, హాస్టల్ ప్రాంగణానికి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు శాంతించలేదు. దీంతో ఆయన నీరు తెప్పించే ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ అంశంపై వార్డన్ శకుంతల మాట్లాడుతూ నీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. నీటి కొరత విషయంలో తానేమీ చేయలేనిని పేర్కొన్నారు. -
సాక్షి ఎఫెక్ట్:ఏడుగురు విద్యార్థుల సస్పెండ్
తిరుపతి: శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ)లో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఇంఛార్జ్ వీసీ రాజగోపాల్ యూనివర్శిటీ అధికారులతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన సదరు విద్యార్థులను హాస్టల్, కాలేజీల నుంచి పంపించి వేస్తున్నట్లు వీసీ ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అంశంపై 'సాక్షి' దినపత్రిలో... 'సోమవారం నుంచి సినిమా చూపిస్తాం' అన్న శీర్షికపై కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు వర్సిటీలో విచారణకు ఆదేశించి విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. డి బ్లాక్ వసతి గృహం వద్ద ఎంసీఏ జూనియర్లను.. .సీనియర్లు వేధించి...చొక్కాలు విప్పి సెల్యూట్ చేయాలని ఒత్తిడి చేయటంతో జూనియర్లు భయాందోళనకు గురయ్యారు. -
సాక్షి ఎఫెక్ట్:ఏడుగురు విద్యార్థుల సస్పెండ్
-
'ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు'
తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉదంతంపై వర్సిటీ, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. యూనివర్సిటీలోని డీ బ్లాక్‌ను అధికారులు సందర్శించారు. ఎస్వీయూలో ర్యాగింగ్ జరిగిన విషయం వాస్తవమేనని రిజిస్ట్రార్ దేవరాజులు, ఆర్డీవో వీరబ్రహ్మయ్య చెప్పారు. ఎస్వీయూలో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడినట్టు గుర్తించామని, ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని రిజిస్ట్రార్ దేవరాజులు, ఆర్డీవో వీరబ్రహ్మయ్య తెలిపారు. ర్యాగింగ్ ఘటనపై విచారణ చేయడానికి ఏడుగురితో కమిటీ వేశామని వెల్లడించారు. -
ఎస్వీయూ ఘటనపై గంటా ఆగ్రహం
విశాఖ: తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్ కు కారణమైన విద్యార్థులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన యూనివర్సిటీ వీసీ ని ఆదేశించారు. కాగా ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ర్యాగింగ్‌కు సంబంధించి ముగ్గురిపై చర్యలకు రంగం సిద్ధమైంది. డీ బ్లాకుకు చేరుకుని విచారణ జరిపిన అధికారులు వర్సిటీలో విచారణకు ఆదేశించారు. -
ఎస్వీయూలో ర్యాగింగ్: ముగ్గురిపై చర్యలు!
-
ఎస్వీయూలో ర్యాగింగ్: ముగ్గురిపై చర్యలు!
తిరుపతి : ఎస్వీయూలో ఎంసీఏ విభాగంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ర్యాగింగ్‌కు సంబంధించి ముగ్గురిపై చర్యలకు రంగం సిద్ధమైంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అంశంపై 'సాక్షి' దినపత్రిలో... సోమవారం నుంచి సినిమా చూపిస్తాం అన్న శీర్షికపై కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు వర్సిటీలో విచారణకు ఆదేశించారు. డి బ్లాక్ వసతి గృహం వద్ద ఎంసీఏ జూనియర్లను...సీనియర్లు వేధించి...చొక్కాలు విప్పి సెల్యూట్ చేయాలని ఒత్తిడి చేయటంతో జూనియర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఆదివారం మధ్యాహ్న సమయంలో రెక్టార్ జయశంకర్, ప్రిన్సిపాల్ భగవాన్ రెడ్డి, డెప్యూటీ వార్డన్ రమేష్ బాబు తదితరులు డి బ్లాక్ సందర్శించారు. ఘటనపై విద్యార్థులను విచారణ జరిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
జ్ఞాన సముపార్జన కోసమే విద్య
ఎస్వీయూ స్నాతకోత్సవంలో కేంద్రమంత్రి వెంకయ్య యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ‘చదువు.. డిగ్రీల కోసమో, సంపాదనకో, ఉద్యోగం సాధించడానికో కాదు. జ్ఞాన సముపార్జన కోస మే. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 54వ స్నాతకోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన వెంకయ్య మాట్లాడుతూ దేశాభివృద్ధి గురించి రాజకీయాలకతీతంగా ఆలోచించాలని యువతకు పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణ ల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు ఉపాధి పొం దలేక పోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ‘మనం శాస్త్ర, పరిశోధనల్లో వెనుకంజలో ఉన్నాం. మంచి ఆలోచనలు, క్రమశిక్షణతో శ్రమపడితే విజయం తథ్యం.’ అని చెప్పారు. విద్యలో నాణ్యత పెరగాలి: గవర్నర్ ఉన్నతవిద్యలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఇష్టారాజ్యంగా కళాశాలలకు అనుమతివ్వడం వల్ల ఉన్నత విద్యలో నాణ్యత పడిపోయిందని వ్యాఖ్యానించారు. కాగా, కేంద్ర మంత్రి వెంకయ్య ప్రసంగిస్తున్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళన చేశారు. -
ఎస్వీయూలో వెంకయ్యకు చేదు అనుభవం
-
ఎస్వీయూలో వెంకయ్యకు చేదు అనుభవం
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ) స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. తొలుత పలువురు విద్యార్థులకు పట్టాలు అందజేసిన వెంకయ్య నాయుడు అనంతరం ప్రసంగించేందుకు సిద్ధమైయ్యారు. ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై నిరసన కార్యక్రమం చేపట్టారు. వెంకయ్య ప్రసంగం ఆరంభం కాగానే ప్లకార్డులతో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఏమైందంటూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితులు అదుపుతప్పడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
చంద్రబాబు తీరుపై ఎస్వీయూ విద్యార్థుల ఫైర్
-
తెలుగు భాష పరిరక్షణపై జాతీయ సదస్సు
తిరుపతి: తెలుగును జాతీయ భాషగా ప్రకటించాలనే అంశంపై జూన్ 13,14వ తేదీల్లో తిరుపతిలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు తాళంబేడు సాయిశంకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగుభాషా పరిరక్షణ సమితి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాశ్చ్య పరిశోధనా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కాలేజీ ప్రాంగణంలోనే నిర్వహించనున్న ఈ సదస్సుకు హాజరు కాగల వారు ఈనెల 31వ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు 944163385 నంబరును సంప్రదించాలని కోరారు. -
ఏపీ ఎడ్‌సెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువు పొడిగింపు
తిరుపతి : శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఎడ్ సెట్-2015 దరఖాస్తుకు చివరి తేదీని ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్ రాజేంద్ర తెలిపారు. వర్సిటీలోని వీసీ చాంబర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం, ఉనత్న విద్యామండలి ఆదేశాల మేరకు చివరి తేదీని పొడిగిస్తున్నట్టు చెప్పారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా తేదీని పొడిగించినట్టు ఆయన చెప్పారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీఈ, బీటెక్ అభ్యర్థులు.. బీఈడీ ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జనరల్ విద్యార్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.150 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.500 అపరాధ రుసుంతో మరో రెండు రోజులు (30 వ తేదీ వరకు) పొడిగించామన్నారు. -
బిగ్‌డేటా విశ్లేషణకు నిపుణులు అవసరం
ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం యూనివర్సిటీక్యాంపస్: ప్రస్తుతం వివిధ సంస్థల్లో బిగ్‌డేటా విశ్లేషించాల్సిన అవసరం పెరిగిందని, ఈ దశలో బిగ్‌డేటా విశ్లేషకులు అవసరమని హైదరాబాద్‌లోని సీఆర్ రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సంస్థ డెరైక్టర్ అల్లం అప్పారావు అన్నారు. ఎస్వీయూ సాంఖ్యకశాస్త్ర విభాగంలో గురువారం బిగ్‌డేటా అండ్ అనాలిటిక్స్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం అప్పారావు మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ సంస్థల అవసరాలు, సమాజ అవసరాలు, ఇతర సదుపాయాలు కల్పించాలంటే బిగ్‌డేటా విశ్లేషణ అవసరమన్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డులను అనుసంధానం చేయడం, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్‌తో లింక్ చేయడం ఇవన్నీ బిగ్‌డేటా కిందకే వస్తాయన్నారు. అందువల్ల ఈ రంగంలో ఉపా ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మా నవ వనరుల శాఖ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2015 నాటికి 44 మిలియన్ల సైంటిస్ట్‌ల అవసరం ఉందన్నారు. డేటా సైంటిస్ట్ టెక్నికల్ వినియోగానికి లేదా వినియోగదారుల సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే పరి మితం కాదని ఆయా సంస్థల్లో అంతర్గత విభాగాల్లో కూడా డేటా సైంటిస్ట్‌ల అవసరం ఉందని చెప్పారు. రెక్టార్ సీకే.జయశంకర్, గుంటూరుకు చెందిన వెంకట్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం రిజిస్ట్రార్ ఉమాశంకర్, సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్ శర్మ, సదస్సు కన్వీనర్ పి.రాజశేఖరరెడ్డి, సాంఖ్యకశాస్త్ర విభాగాధిపతి ఆర్.అబ్బయ్య, సదస్సు కార్యనిర్వహణ కార్యదర్శి ఎం.సుబ్బరాయుడు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఎం.వెంకటరమణ పాల్గొన్నారు. -
ర్యాగింగ్‌పై ఆరా తీసిన ఎస్వీయూ రిజిస్ట్రార్
తిరుపతి : ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు మంగళవారం ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపూ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బాలుర హాస్టల్లోని డి-బ్లాక్‌లో నిన్న ర్యాగింగ్ జరిగిన విషయం తెలిసిందే. మొదటి ఫ్లోర్‌లోని సీనియర్ల గదిలోకి జూనియర్లను పిలిపించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. పరిచయం పేరిట సీనియర్ విద్యార్థులు ....నృత్యాలు చేయాలంటూ జూనియర్లను ర్యాగింగ్ చేసిన విషయం తెలిసిందే. -
బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతి : తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న వినీత లేడీస్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడింది. కాగా ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఎస్వీ క్యాంపస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలిస్తున్నారు. -
ఎస్వీయూలో విద్యార్థుల దీక్ష భగ్నం
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎస్వీయూలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సోమవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ శని వారం నుంచి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించింది. ఈ దీక్ష సోమవారంతో మూడో రోజుకు చేరింది. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి పెరగడంతో దీక్షభగ్నం చేసేందుకు పోలీ సులు రెండు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆదివారం రాత్రి బలవంతంగా ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మిగిలిన ఐదుగురు సోమవారం దీక్షను కొనసాగించారు. అయితే వీరిని కూడా సోమవారం రాత్రి 7 గంటల సమయంలో బలవంతంగా అరెస్ట్ చేసి దీక్ష శిబిరం నుంచి తరలించేశారు. ఈ దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చిన మబ్బుచెంగారెడ్డి, పసుపులే టి హరిప్రసాద్, నరసింహయాదవ్,శ్రీధర్ వర్మ, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పోలీసులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో వెస్ట్ డీఎస్పీ ఎస్కే బాబు వాహనం కింద పడిపోయారు. విద్యార్థులే ఆయనను పైకి లేపారు. విద్యార్థులు, నాయకులు ప్రతిఘటిస్తున్నప్పటికీ పోలీసులు లెక్కచేయకుండా రుయాకు తరలించారు. అనంతరం శిబిరాన్ని తొలగించారు. పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, నాయకులు సోనియాగాంధీ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉద్యమకారులు మాట్లాడుతూ తాము చేస్తున్న దీక్షలను అడ్డుకోవడానికి సీఎం పన్నాగం పన్నారని ఆరోపించారు. తమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని, సమైక్యాంధ్ర కోసం ప్రాణాలున్నంత వరకు పోరాడతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. విద్యార్థి నాయకులు పత్తిపాటి వివేక్, రమణ, సాధు రంగనాథం పాల్గొన్నారు. అరెస్టయిన వారిలో హరికృష్ణ యాదవ్, శేషాద్రి నాయుడు, ఆనంద్‌గౌడ్, రామ్మోహన్, శివకుమార్ ఉన్నారు.