ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
యూనివర్సిటీక్యాంపస్: ప్రస్తుతం వివిధ సంస్థల్లో బిగ్‌డేటా విశ్లేషించాల్సిన అవసరం పెరిగిందని, ఈ దశలో బిగ్‌డేటా విశ్లేషకులు అవసరమని హైదరాబాద్‌లోని సీఆర్ రావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సంస్థ డెరైక్టర్ అల్లం అప్పారావు అన్నారు. ఎస్వీయూ సాంఖ్యకశాస్త్ర విభాగంలో గురువారం బిగ్‌డేటా అండ్ అనాలిటిక్స్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం అప్పారావు మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ సంస్థల అవసరాలు, సమాజ అవసరాలు, ఇతర సదుపాయాలు కల్పించాలంటే బిగ్‌డేటా విశ్లేషణ అవసరమన్నారు.
బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డులను అనుసంధానం చేయడం, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్‌తో లింక్ చేయడం ఇవన్నీ బిగ్‌డేటా కిందకే వస్తాయన్నారు. అందువల్ల ఈ రంగంలో ఉపా ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మా నవ వనరుల శాఖ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2015 నాటికి 44 మిలియన్ల సైంటిస్ట్‌ల అవసరం ఉందన్నారు. డేటా సైంటిస్ట్ టెక్నికల్ వినియోగానికి లేదా వినియోగదారుల సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే పరి మితం కాదని ఆయా సంస్థల్లో అంతర్గత విభాగాల్లో కూడా డేటా సైంటిస్ట్‌ల అవసరం ఉందని చెప్పారు. రెక్టార్ సీకే.జయశంకర్, గుంటూరుకు చెందిన వెంకట్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం రిజిస్ట్రార్ ఉమాశంకర్, సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్ శర్మ, సదస్సు కన్వీనర్ పి.రాజశేఖరరెడ్డి, సాంఖ్యకశాస్త్ర విభాగాధిపతి ఆర్.అబ్బయ్య, సదస్సు కార్యనిర్వహణ కార్యదర్శి ఎం.సుబ్బరాయుడు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.
బిగ్‌డేటా విశ్లేషణకు నిపుణులు అవసరం
Published Fri, Nov 28 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM
Advertisement