Big data analysis
-
ఎగవేతదారులను వదలొద్దు
న్యూఢిల్లీ: వ్యవస్థలో లొసుగులను అడ్డం పెట్టుకుని పన్నులను ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించాలని ఆదాయ పన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అయితే, నిజాయతీగా కట్టాలనుకునేవారికి అవసరమైన తోడ్పాటునిచ్చి, తగిన విధంగా గౌరవించాలని పేర్కొన్నారు. 159వ ఆదాయపు పన్ను దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. ఎగవేతదారులను పట్టుకునేందుకు రెవెన్యూ శాఖలోని మూడు కీలక విభాగాలు (ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. ‘తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసుకునేందుకు మీ దగ్గర డేటా మైనింగ్, బిగ్ డేటా విశ్లేషణ వంటి సాధనాలు ఉన్నాయి. ఎగవేయాలనుకునే వారితో కఠినంగా వ్యవహరించండి. అలాంటి విషయాల్లో మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. సంపన్నులపై అధిక పన్ను భారం అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పన్నులు చెల్లించడాన్ని ప్రజలు జాతి నిర్మాణంలో తమ వంతు కర్తవ్యంగా భావించాలే తప్ప జరిమానాగా అనుకోరాదని మంత్రి చెప్పారు. ‘ఎక్కువ సంపాదిస్తున్న వారిని శిక్షించాలన్నది మా ఉద్దేశం కాదు. ఆదాయాలు, వనరులను మరింత మెరుగ్గా పంచడానికి ఈ పన్నులు అవసరం. అత్యధికంగా ఆదాయాలు ఆర్జించే వర్గాలు కొంత మేర సామాన్యుల అభ్యున్నతికి కూడా తోడ్పాటు అందించాలన్నదే లక్ష్యం. ఈ భావాన్ని అర్థం చేసుకుంటే చాలు.. ఇన్‌కం ట్యాక్స్ విభాగమంటే భయం ఉండదు‘ అని ఆమె తెలిపారు. సులభసాధ్యమైన లక్ష్యం.. 2019–20లో నిర్దేశించుకున్న రూ. 13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం సులభసాధ్యమైనదేనని నిర్మలా సీతారామన్ చెప్పారు.‘గడిచిన అయిదేళ్లలో పన్ను చెల్లింపుదారుల సంఖ్యను రెట్టింపు స్థాయికి చేర్చగలిగాం. అలాంటప్పుడు పన్ను వసూళ్లను రూ. 11.8 లక్షల కోట్ల నుంచి కాస్త ఎక్కువగా రూ. 13 లక్షల కోట్లకు పెంచుకోవడం పెద్ద కష్టం కానే కాదు. సాధించతగిన లక్ష్యాన్నే మీకు నిర్దేశించడం జరిగింది‘ అని ఆమె వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యించినట్లుగా పన్ను చెల్లింపుదారుల సంఖ్యను ప్రస్తుతమున్న 7 కోట్ల నుంచి 8 కోట్లకు పెంచే దిశగా కృషి చేయాలని చెప్పారు. ఆహ్లాదకర వ్యవహారంగా ఉండాలి.. పన్ను చెల్లింపు ప్రక్రియ అంటే భయం కోల్పేదిగా కాకుండా ఆహ్లాదకరమైన వ్యవహారంగా ఉండే పరిస్థితులు కల్పించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ చెప్పారు. పన్ను వసూళ్లు పారదర్శకమైన, సముచిత రీతిలో జరిగేట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చూడాలని ఆయన సూచించారు. 1960–61 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 13 లక్షలుగా ఉన్న ప్రత్యక్ష పన్ను వసూళ్లను గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.11.37 లక్షల కోట్ల స్థాయికి చేర్చడంలో ఆదాయపు పన్ను శాఖ సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని మోదీ చెప్పారు. -
బిగ్ డేటా అనాలసిస్‌తో సామర్థ్యం
జేఎన్టీయూ : బిగ్ డేటా అనాలసిస్‌తో మెడికల్, సోషియల్, సాఫ్ట్వేర్ రంగాల్లో వేగంతోపాటు సామర్థ్యం అలవడుతుంద ని జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య ఎం.సర్కార్ అన్నారు. జేఎ¯ŒSటీయూ అనంతపురంలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ‘అవేర్నెస్ అండ్ కెరీర్ ఆపర్చన్యుటీస్ బిగ్ డేటా అనాలసిస్’ అనే అంశంపై మూడురోజుల పాటు నిర్వహించనున్న సదస్సును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వ్యాపార సంబంధిత లావాదేవీలు, గణాంక విశ్లేషణల్లో బిగ్ డేటా ఉపయోగపడుతుందన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.ప్రహ్లాదరావు, సీఎస్ఈ విభాగాధిపతి ఆచార్య వసుంధర, టీసీఎస్ సీనియర్ కన్సెల్టెన్సీ అండ్ అకడమిక్ మేనేజర్ రిచర్డ్కింగ్ తదితరులు పాల్గొన్నారు. -
బిగ్‌డేటా విశ్లేషణకు నిపుణులు అవసరం
ఎస్వీయూలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం యూనివర్సిటీక్యాంపస్: ప్రస్తుతం వివిధ సంస్థల్లో బిగ్‌డేటా విశ్లేషించాల్సిన అవసరం పెరిగిందని, ఈ దశలో బిగ్‌డేటా విశ్లేషకులు అవసరమని హైదరాబాద్‌లోని సీఆర్ రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సంస్థ డెరైక్టర్ అల్లం అప్పారావు అన్నారు. ఎస్వీయూ సాంఖ్యకశాస్త్ర విభాగంలో గురువారం బిగ్‌డేటా అండ్ అనాలిటిక్స్ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం అప్పారావు మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ సంస్థల అవసరాలు, సమాజ అవసరాలు, ఇతర సదుపాయాలు కల్పించాలంటే బిగ్‌డేటా విశ్లేషణ అవసరమన్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డులను అనుసంధానం చేయడం, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్‌తో లింక్ చేయడం ఇవన్నీ బిగ్‌డేటా కిందకే వస్తాయన్నారు. అందువల్ల ఈ రంగంలో ఉపా ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మా నవ వనరుల శాఖ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2015 నాటికి 44 మిలియన్ల సైంటిస్ట్‌ల అవసరం ఉందన్నారు. డేటా సైంటిస్ట్ టెక్నికల్ వినియోగానికి లేదా వినియోగదారుల సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే పరి మితం కాదని ఆయా సంస్థల్లో అంతర్గత విభాగాల్లో కూడా డేటా సైంటిస్ట్‌ల అవసరం ఉందని చెప్పారు. రెక్టార్ సీకే.జయశంకర్, గుంటూరుకు చెందిన వెంకట్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం రిజిస్ట్రార్ ఉమాశంకర్, సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కేవీఎస్ శర్మ, సదస్సు కన్వీనర్ పి.రాజశేఖరరెడ్డి, సాంఖ్యకశాస్త్ర విభాగాధిపతి ఆర్.అబ్బయ్య, సదస్సు కార్యనిర్వహణ కార్యదర్శి ఎం.సుబ్బరాయుడు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.