బిగ్‌ డేటా అనాలసిస్‌తో సామర్థ్యం | Big data analysis increses capability | Sakshi
Sakshi News home page

బిగ్‌ డేటా అనాలసిస్‌తో సామర్థ్యం

Published Tue, Feb 21 2017 1:20 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

Big data analysis increses capability

జేఎన్టీయూ : బిగ్‌ డేటా అనాలసిస్‌తో మెడికల్, సోషియల్, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో వేగంతోపాటు సామర్థ్యం అలవడుతుంద ని జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య ఎం.సర్కార్‌ అన్నారు. జేఎ¯ŒSటీయూ అనంతపురంలోని సీఎస్‌ఈ విభాగం ఆధ్వర్యంలో ‘అవేర్‌నెస్‌ అండ్‌ కెరీర్‌ ఆపర్చన్యుటీస్‌ బిగ్‌ డేటా అనాలసిస్‌’ అనే అంశంపై మూడురోజుల పాటు నిర్వహించనున్న సదస్సును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వ్యాపార సంబంధిత లావాదేవీలు, గణాంక విశ్లేషణల్లో బిగ్‌ డేటా ఉపయోగపడుతుందన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య బి.ప్రహ్లాదరావు, సీఎస్‌ఈ విభాగాధిపతి ఆచార్య వసుంధర, టీసీఎస్‌ సీనియర్‌ కన్సెల్టెన్సీ అండ్‌ అకడమిక్‌ మేనేజర్‌ రిచర్డ్‌కింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement