jntu vc
-
వీసీ పీఠం ఎవరికో?
- రేసులో 35 మంది - 22న సెర్చ్ కమిటీ సమావేశం జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం నూతన వీసీ నియామకానికి సంబంధించి ప్రక్రియ మొదలైంది. జేఎన్టీయూ వీసీగా ఉన్న ప్రొఫెసర్ ఎం.సర్కార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే. ఈ ఏడాది జూన్‌లో వీసీ పదవికి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్వేషణ కమిటీ (సెర్చ్ కమిటీ)ని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది. ఈ కమిటీ ఈ నెల 22న విజయవాడలో సమావేశం కానుంది. అన్వేషణ కమిటీ ముగ్గురు పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేయనున్నారు. ఇందులో ఒకరిని సీఎం ఛాన్సలర్/ గవర్నర్‌కు సిఫార్సు చేస్తారు. మొదట పంపిన పేరును గవర్నర్ సమ్మతించకపోతే మరో పేరును (ఎంపిక చేసిన మూడు పేర్లలోనే) గవర్నర్‌కు సిఫార్సు చేస్తారు. రేసుగుర్రాలు జేఎన్టీయూ అనంతపురం పరిధిలోరాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. 2008లో యూనివర్శిటీ ఏర్పడినప్పటికీ..2011 నుంచి సంస్కరణల అమలు చేయడంతో జాతీయ స్థాయిలో ప్రతిష్ట పెరిగింది. సాంకేతిక విద్యలో జేఎన్టీయూ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిపోయింది. దీంతో సహజంగానే వీసీ పదవికి పోటీ పెరిగింది. మొత్తం 35 మంది వీసీ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఏడుగురు జేఎన్టీయూ అనంతపురం నుంచి పోటీలో ఉన్నారు. మెకానికల్ విభాగంలో ప్రొఫెసర్ కె.హేమచంద్రా రెడ్డి, ప్రొఫెసర్ యోహాన్ కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ ఆనందరాజు, ఎలక్ట్రికల్‌లో ప్రొఫెసర్ విజయ్‌కుమార్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ సత్యనారాయణ, సివిల్ విభాగంలో ప్రొఫెసర్ సుదర్శనరావు, ప్రొఫెసర్ భాస్కర్దేశాయ్, దరఖాస్తు చేసుకొన్న వారిలో ఉన్నారు. వచ్చే నెలలోనే నూతన వీసీ నియామకం వచ్చే నెలలో జేఎన్టీయూ అనంతపురం నూతన వీసీ నియామకం కానున్నారు. అన్వేషణ కమిటీ(సెర్చ్ కమిటీ)లో ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు వర్సిటీ నామినీ, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, మరో సభ్యుడు యూజీసీ నామినీ ఉంటారు. వర్సిటీ నామినీగా ప్రొఫెసర్ వి.రామచంద్ర రాజు (ఐఐఐటీ వీసీ)ను నియామకం చేశారు. నెలాఖరులోగా అన్వేషణ కమిటీ సమావేశం కానుంది. దరఖాస్తులన్నింటినీ పరిశీలించి.. మొత్తం ముగ్గుర్ని ఎంపిక చేస్తారు. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరినైనా నియామకం చేయాలని భావిస్తే.. దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ, అన్వేషణ కమిటీ సమావేశమయినప్పటికీ .. వారి దరఖాస్తులను ఆహ్వానించే వెసులుబాటు ఉంది. అయితే 10 సంవత్సరాలు ప్రొఫెసర్‌గా అనుభవమే ప్రధాన అర్హతగా పరిగణించారు. వీసీ పదవి దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. రాజకీయ పలుకబడి సంపాదించుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
సర్కార్‌కు కన్నీటి నివాళి
- జేఎన్టీయూ వీసీ పార్థివదేహం విశాఖకు తరలింపు - నేడు అంత్యక్రియలు జేఎన్టీయూ : జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ-ఏ)లో గురువారం గంభీర వాతావరణం కన్పించింది. వైస్ చాన్సలర్ ఎంఎంఎం సర్కారు మరణంతో వర్సిటీ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. వీసీ అధికారిక నివాసంలో సర్కార్ పార్థివదేహాన్ని బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి గురువారం ఉదయం పది వరకు ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు, వివిధ పార్టీల నాయకులు వీసీ పార్థివదేహాన్ని సందర్శించి..ఘన నివాళులర్పించారు. వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు గంటల తరబడి అక్కడే నిలబడి కొవ్వొత్తులు ప్రదర్శించారు. ‘సర్కార్ సార్.. అమర్‌రహే’ అంటూ నినాదాలు చేశారు. ప్రొఫెసర్లు వీసీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వీసీ కుమారుడు అషరుద్దీన్ షానవాజ్ గుండెలవిసేలా రోదించడం పలువురిని కలిచివేసింది. అనంతరం పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి విమానంలో విశాఖపట్నం తీసుకెళ్లారు. అక్కడ శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రముఖుల నివాళి సర్కార్ పార్థివదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి.. నివాళులర్పించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివా రెడ్డి, ఆర్డీఓ మలోలా, తహసీల్దార్ శ్రీనివాసులు, జేఎన్టీయూ రెక్టార్ ఆచార్య సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య, ప్రొఫెసర్లు కె.హేమచంద్రారెడ్డి, సుదర్శనరావు, విజయ్‌కుమార్, దుర్గాప్రసాద్, ప్రశాంతి, శశిధర్, కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఈశ్వరరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎం.రామశేఖర్‌రెడ్డి, డాక్టర్ చంద్రమౌళిరెడ్డి, డాక్టర్ నారాయణరెడ్డి, డాక్టర్ శివకుమార్, వర్సిటీ పాలకమండలి సభ్యులు కేసీ నాయుడు, మురళి, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల బోధనేతర ఉద్యోగుల అసోసియేషన్ (ఆంటియా) వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే నాగభూషణం తదితరులు నివాళులర్పించారు. జేఎన్టీయూ పాలకభవనంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో వీసీ సర్కార్ సేవలను పలువురు కొనియాడారు. -
జేఎన్టీయూపై సర్కార్ ముద్ర
నిరాడంబరతకు ఆయన నిలువెత్తు నిదర్శనం.. ఉన్నతోద్యోగిగా ఉన్నా.. సాధారణ వ్యక్తిలాగే అందరిలోనూ కలిసిపోయేవారు. మృదు స్వభావి... అందరినీ ఆప్యాయంగా పలుకరించే వ్యక్తిత్వం ఆయన సొంతం. చిరుద్యోగిని సైతం గౌరవిస్తూ పలకరించే ఆయనే జేఎన్టీయూ(ఎ) ఉపకులపతి ఎం.ఎం.ఎం. సర్కార్. 1953లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ.. జేఎన్టీయూ(ఎ) అభివృద్ధిలో తనదైన ముద్రను వేశారు. - జేఎన్టీయూ (అనంతపురం) ప్రస్థానం ఇలా... ప్రాథమిక విద్య : పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు ఇంజినీరింగ్ : కాకినాడలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఎంటెక్ : ఆంధ్రా యూనివర్సిటీ కెరీర్ ప్రారంభం : 1978, జులై నుంచి ఆంధ్రా యూనిర్సిటీ లెక్చరర్‌గా పొందిన పదవులు : అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్; అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆంధ్రా యూనివర్సిటీ, ఎంసెట్ రీజనల్ కోఆర్డినేటర్ వైజాగ్, మెంబర్ ఆఫ్ కాలేజీ రీసెర్చ్ కమిటీ - 2008–09లో హియరింగ్ కమిటీ – ఏఐసీటీఈ సభ్యులుగా - 74 ఇంటర్నేషనల్ జర్నల్స్, 15 నేషనల్ జర్నల్స్‌లో ప్రచురణలు - ‘కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్,’ ‘టూల్ డిజైన్,’ ‘మెషిన్ విజన్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్’ అనే రచనలు – 17 పీహెచ్డీ అవార్డుల ప్రదాతగా గుర్తింపు – 35 ఏళ్ల బోధన, పరిశోధనలో విశేష అనుభవం, ఏప్రిల్ 2013లో పదవీవిరమణ – 2015 అక్టోబర్ 26న ఆయన జేఎన్టీయూ ఉపకులపతిగా బాధ్యతల స్వీకరణ పాలనలో వైవిధ్యం ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సర్కార్ జేఎన్టీయూ ,అనంతపురం పురోగతికి విశేషమైన కృషి చేశారు. నవ సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు, నవకల్పనల కేంద్రంగా జేఎన్టీయూను తీర్చిదిద్దేందుకు వివిధ ప్రణాళికలు అమలు చేశారు. – విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన నోడల్ సంస్థ ద్వారా ప్రత్యేక తర్ఫీదు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. – ఈసెట్-16ను రాష్ట్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. – ఏటా 1,10,365 మంది బీటెక్ విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా పరీక్షల నిర్వహణ, క్రమం తప్పకుండా ఫలితాలు విడుదల చేయడంలో సంస్కరణలు చేపట్టారు. పరీక్షల విభాగంలో బయోమెట్రిక్‌ను అమలు చేసి పారదర్శకతను పెంచారు. – టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌లో 164, అసెంచర్‌లో 128, జెన్‌ప్యాక్ట్‌లో 13, సాక్ట్రోనిక్స్ 09, ఆర్వీ అసోసియేట్స్ 4, ఆర్టీసాన్ ఎంబీడెడ్ సిస్టమ్‌లో 2 ఉద్యోగాలను జేఎన్టీయూ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా దక్కేలా చేశారు. జేఎన్టీయూ క్యాంపస్ ఎంబీఏ విభాగంలో పార్లేజీలో 5, ఒసోమైస్ 6, వేద ఐఐటీ కంపెనీలో 3 ఉద్యోగాలు దక్కాయి. – చికాగో స్టేట్ యూనివర్సిటీ, కార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటి వర్సిటీలతో వివిధ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని విదేశాలలో రాయితీలతో కూడిన విద్యను అందించేలా చొరవ తీసుకున్నారు. – క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్ధేశంతో వర్సిటీ పరిధిలోని 28 జట్లు సౌత్‌జోన్ , ఆలిండియా ఇంటర్ వర్సిటీ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సాహం అందించారు. –నిర్మాణ దశలోనే ఏళ్లుగా మగ్గుతున్న ఆడిటోరియంను ఆధునిక హంగులతో పూర్తి చేయించారు. –రూ.72 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జేఎన్టీయూ పరిధిలో జరుగుతున్నాయి. –క్యాంపస్ కళాశాలలో రోడ్డు వెడల్పు చేయించి సుందరీకరించారు. –సోలార్ విద్యుదుత్పత్తితో విద్యుత్ ఛార్జీలు భారం తగ్గించాలనే సదుద్ధేశ్యంతో ఒక మెగావాట్ సోలార్ విద్యుదుత్పత్తి అమల్లోకి తెచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మూగబోయిన విశ్వవిద్యాలయం : జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య సర్కార్ హఠాన్మరణంతో విశ్వవిద్యాలయం మూగబోయింది. ప్రొఫెసర్లు, ఉద్యోగులు, విద్యార్థులు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి భారీగా చేరుకున్నారు. çవిషన్నవదనాలతో ఘన నివాళి అర్పించారు. బుధవారం ఉదయం నుంచి పాలక భనవంలో ఉన్న ఉపకులపతి సాయంత్రం అయ్యేసరికి ఇకలేరన్న సంగతి తెలియగానే విషాదఛాయలు అలుముకున్నాయి. -
బిగ్ డేటా అనాలసిస్‌తో సామర్థ్యం
జేఎన్టీయూ : బిగ్ డేటా అనాలసిస్‌తో మెడికల్, సోషియల్, సాఫ్ట్వేర్ రంగాల్లో వేగంతోపాటు సామర్థ్యం అలవడుతుంద ని జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య ఎం.సర్కార్ అన్నారు. జేఎ¯ŒSటీయూ అనంతపురంలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ‘అవేర్నెస్ అండ్ కెరీర్ ఆపర్చన్యుటీస్ బిగ్ డేటా అనాలసిస్’ అనే అంశంపై మూడురోజుల పాటు నిర్వహించనున్న సదస్సును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వ్యాపార సంబంధిత లావాదేవీలు, గణాంక విశ్లేషణల్లో బిగ్ డేటా ఉపయోగపడుతుందన్నారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి.ప్రహ్లాదరావు, సీఎస్ఈ విభాగాధిపతి ఆచార్య వసుంధర, టీసీఎస్ సీనియర్ కన్సెల్టెన్సీ అండ్ అకడమిక్ మేనేజర్ రిచర్డ్కింగ్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో పోస్టుల భర్తీ
జేఎన్టీయూ వీసీ ఆచార్య సర్కార్ డిసెంబర్‌లోగా కలికిరిలో ఇంజినీరింగ్ కళాశాల భవనాలు పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జేఎన్టీయూ : జేఎన్టీయూ–అనంతపురం పరిధిలో వచ్చే నెల మొదటి వారంలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వీసీ ఆచార్య ఎం.ఎం.ఎం.సర్కార్ తెలిపారు. వైస్ చాన్స్‌లర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించి మంగళవారంతో ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో సాక్షితో మాట్లాడుతూ... బోధన పోస్టుల కొరతను అధిగమించేందుకు శాశ్వత ప్రాతిపదికన ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి నవంబర్ 2న జరిగే పాలక మండలి సమావేశంలో ఆమోదం పొందనున్నట్లు తెలిపారు. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్, మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా నిర్ధారిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.300 కోట్లతో కలికిరిలో భవనాల నిర్మాణం కలికిరిలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సంబంధించి రూ.300 కోట్ల వ్యయంతో ఆధునాతన భవనాలు పూర్తి అయినట్లు వీసీ సర్కార్ తెలిపారు. ఈ భవనాలను డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. జేఎన్టీయూ అనంతపురంలో ఆడిటోరియం ఆధునీకరణకు రూ. 1.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. డిసెంబర్లో నిర్వహించే స్నాతకోత్సవాలకు ఈ పనులు పూర్తి అవుతాయన్నారు. ఒక మెగావాట్ సోలార్ విద్యుదుత్పత్తి చేస్తామన్నారు. తొలి విడతగా 200 కిలో వాట్ల సోలార్ విద్యుదుత్పతిక్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ ఆదాకు ఎల్ఈడీ బల్బులు వినియోగించనున్న నేపథ్యంలో వీటి సరఫరాకు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నామన్నారు. రూ.72 కోట్ల వ్యయంతో నాలుగు భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల మెరుగుకు కషి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విద్యార్థులు ఎంపిక కావడానికి తగిన కషి చేస్తున్నామన్నారు. వర్సిటీ క్యాంపస్ కళాశాలలో 85 శాతం నుంచి 90 శాతం క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విద్యార్థులు ఎంపికవుతున్నారన్నారు. అనుబంధ కళాశాలల్లో 20 శాతం నమోదవుతోందన్నారు. గతేడాది 170 మంది పరిశోధన విద్యార్థులకు పీహెచ్డీ అవార్డులు ఇచ్చామన్నారు. పరీక్షల విభాగంలో ఆన్లైన్ ప్రక్రియ విధానం ప్రవేశపెట్టామన్నారు. ఎంటెక్ కోర్సుల్లో నూతనంగా వీఎల్ఎస్ఐ, ఎంబీడెడ్ సిస్టమ్ , కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ , అడ్వాన్స్డ్ మ్యాన్‌ఫ్యాక్చురింగ్ సిస్టమ్ కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. -
నేడు ఎంసెట్ -3 షెడ్యూల్ !
-
నేడు ఎంసెట్ -3 షెడ్యూల్ !
► కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వ నిర్ణయం ► సెప్టెంబర్ 4న ఎగ్జామ్.. ► వారం రోజుల్లో ఫలితాలు.. ► నెలాఖరులోగా అడ్మిషన్లు ► జేఎన్టీయూ వీసీ లేదా రిజిస్ట్రార్‌కు కన్వీనర్ బాధ్యతలు ► ఎంసెట్-2 విద్యార్థులకు పాత రిజిస్ట్రేషన్‌పై కొత్త హాల్‌టికెట్లు హైదరాబాద్ : ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-3 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఎంసెట్-2 రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువడగానే అందుకు అనుగుణంగా తుది నిర్ణయం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. రీఎగ్జామ్‌కు కోర్టు ఓకే చెబితే వెంటనే షెడ్యూల్ ప్రకటించేందుకు కసరత్తు పూర్తి చేసింది. పరీక్షను సెప్టెంబర్ 4న నిర్వహించి, వారం రోజుల్లో ఫలితాలు వెల్లడించి అదే నెలాఖరులోగా ప్రవేశాలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఎంసెట్-2 పరీక్ష ప్రక్రియను 44 రోజుల్లో పూర్తి చేశారు. ఎంసెట్-3 నిర్వహణకు 45 రోజులు పట్టే అవకాశం ఉంది. లీక్ నేపథ్యంలో పరీక్షను పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని, ప్రశ్నపత్రాల తయారీ, వాటి ముద్రణ అంశాల్లో పక్కాగా వ్యవహరించాలంటూ అధికారులను ఆదేశాలు జారీ చేయనుంది. ఎంసెట్-3 నిర్వహణ బాధ్యతలను మళ్లీ జేఎన్టీయూహెచ్కే అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రస్తుత కన్వీనర్ రమణారావుకు కాకుండా జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ వేణుగోపాల్‌రె డ్డి లేదా రిజిస్ట్రార్ యాదయ్యకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పీజీఈసెట్ కన్వీనర్‌గా వేణుగోపాల్‌రెడ్డి వ్యవహరించగా.. ఈసెట్ కన్వీనర్‌గా యాదయ్య పని చేశారు. ఈ ఇద్దరిలో ఒకరికి ఎంసెట్-3 కన్వీనర్ బాధ్యతలు అప్పగించే వీలుంది. జూలై 9న జరిగిన ఎంసెట్-2 పరీక్షకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 50,964 మంది పరీక్షకు హాజరు కాగా 47,644 మంది అర్హత సాధించి, ర్యాంకులు పొందారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారందరికి పాత రిజిస్ట్రేషన్ నెంబర్‌తోనే కొత్త హాల్ టికెట్లను జారీ చేసి ఎంసెట్-3 నిర్వహించనునున్నారు. వీటన్నింటిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
వివాహ బంధం తెగకముందే.. మరో పెళ్లి!