
న్యూఢిల్లీ: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్‌ను (జీసీసీ) ఏర్పాటు చేయడానికి ఆరు ప్రధాన నగరాల్లో అంతర్జాతీయ సంస్థలు 2022 నుండి 2024 జూన్ మధ్య సుమారు 53 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. వీటిలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై ఉన్నాయి. ఈ కాలంలో లీజుకు తీసుకున్న మొత్తం ఆఫీస్ స్పేస్‌లో బెంగళూరు ఏకంగా 40 శాతం వాటా కైవసం చేసుకుంది. హైదరాబాద్‌కు 21, చెన్నైకి 14 శాతం వాటా ఉంది.
ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ, హైరింగ్ సొల్యూషన్స్ కంపెనీ జాయిన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జీసీసీలు ఇటీవలి కాలంలో తమ భారతీయ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించాయి. నైపుణ్యం కలిగిన సిబ్బంది, తక్కువ వ్యయాలు, అనుకూల వ్యాపార వాతావరణం ఇందుకు కలిసి వచి్చంది. ఈ సెంటర్స్ వృద్ధి పథం భారత్‌లోని మొదటి ఆరు మెట్రోపాలిటన్ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంటుందని అంచనా. అసాధారణ ప్రతిభగల వ్యక్తులు వీటిని నడిపిస్తున్నారు. ఈ అంశం జీసీసీల విస్తరణ, భవిష్యత్తు అభివృద్ధికి వీలు కలి్పస్తుంది. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు తమ జీసీసీల కోసం పెద్ద ఎత్తున కార్యాలయ స్థలాలను సమకూర్చుకోవడం ద్వారా భారత్ పట్ల తమ దీర్ఘకాలిక నిబద్ధతను ధృవీకరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment