
50 దేశాలకు చెందిన చెఫ్‌ల పాకశాస్త్ర ప్రదర్శన
ఐఐహెచ్‌ఎమ్, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ కౌన్సిల్
ఆధ్వర్యంలో నిర్వహణ నగరంలోకలినరీ ఫెస్ట్..
ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లో యునైటెడ్ వరల్డ్ యంగ్ చెఫ్స్ (UWYC) ఎక్స్‌పీరియన్స్" పేరుతో కలిరీఫెస్ట్ జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 మంది యువ పాకశాస్త్ర నిపుణులు తమ దేశాల నుండి సాంప్రదాయ వంటకాలను ప్రదర్శిస్తారు. ఆహార ప్రియులు వివిధ ప్రపంచ వంటకాలు ఇక‍్కడ ప్రదర్శిస్తారు.
సాక్షి, సిటీబ్యూరో: నగరం మరో సారి వివిధ దేశాలకు చెందిన పససందైన రుచులకు వేదికగా మారనుంది. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ కౌన్సిల్ లండన్ భాగస్వామ్యంతో నగరంలోని ది గ్లాస్ ఆనియన్ వేదికగా యునైటెడ్ వరల్డ్ యంగ్ చెఫ్స్ గ్యాస్ట్రోనమిక్ ఎక్స్‌పీరియన్స్ నిర్వహించనున్నారు. ఈ కలినరీ ఫెస్ట్‌లో 50కి పైగా దేశాల నుంచి ప్రముఖ చెఫ్‌లు అంతర్జాతీయ వంటకాలను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రదర్శించనున్నారు. ఇందులో 10 మంది చెఫ్‌లు హైదరాబాద్‌లో విభిన్న రుచుల సమ్మేళనాన్ని సృష్టించనున్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!
ఫిబ్రవరి 3న జరగనున్న ఈ ఫెస్ట్‌లో భారత్‌తో పాటు అల్బేనియా, ఆస్ట్రేలియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తైమూర్–లెస్టే, నైజీరియా, ఉగాండా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు చెందిన చెఫ్‌లు తమ పాకశాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు.
ఇదీ చదవండి: గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో!
Comments
Please login to add a commentAdd a comment