Chefs
-
అంతర్జాతీయ చెఫ్‌లతో హైదరాబాద్‌లో కలీనరీ ఫెస్ట్
50 దేశాలకు చెందిన చెఫ్‌ల పాకశాస్త్ర ప్రదర్శన ఐఐహెచ్‌ఎమ్, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహణ నగరంలోకలినరీ ఫెస్ట్.. ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లో యునైటెడ్ వరల్డ్ యంగ్ చెఫ్స్ (UWYC) ఎక్స్పీరియన్స్" పేరుతో కలిరీఫెస్ట్ జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 మంది యువ పాకశాస్త్ర నిపుణులు తమ దేశాల నుండి సాంప్రదాయ వంటకాలను ప్రదర్శిస్తారు. ఆహార ప్రియులు వివిధ ప్రపంచ వంటకాలు ఇక్కడ ప్రదర్శిస్తారు.సాక్షి, సిటీబ్యూరో: నగరం మరో సారి వివిధ దేశాలకు చెందిన పససందైన రుచులకు వేదికగా మారనుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ కౌన్సిల్ లండన్ భాగస్వామ్యంతో నగరంలోని ది గ్లాస్ ఆనియన్ వేదికగా యునైటెడ్ వరల్డ్ యంగ్ చెఫ్స్ గ్యాస్ట్రోనమిక్ ఎక్స్పీరియన్స్ నిర్వహించనున్నారు. ఈ కలినరీ ఫెస్ట్‌లో 50కి పైగా దేశాల నుంచి ప్రముఖ చెఫ్‌లు అంతర్జాతీయ వంటకాలను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రదర్శించనున్నారు. ఇందులో 10 మంది చెఫ్‌లు హైదరాబాద్‌లో విభిన్న రుచుల సమ్మేళనాన్ని సృష్టించనున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!ఫిబ్రవరి 3న జరగనున్న ఈ ఫెస్ట్‌లో భారత్‌తో పాటు అల్బేనియా, ఆస్ట్రేలియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తైమూర్–లెస్టే, నైజీరియా, ఉగాండా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు చెందిన చెఫ్‌లు తమ పాకశాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. ఇదీ చదవండి: గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో! -
ఐటీ ఉద్యోగులను మించిపోయిన చెఫ్‌లు.. ఎలాగో చూడండి..
యూకే ఇమ్మిగ్రేషన్ డేటా ఇటీవలి విశ్లేషణ ఊహించని పరిణామాన్ని వెల్లడించింది. కంప్యూటర్ ప్రోగ్రామర్ల కంటే చెఫ్‌ల వీసా దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ సూపర్ పవర్ గా ఎదగాలన్న తన ఆకాంక్షలకు ఊతమిచ్చేందుకు అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులను ఆకర్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందుకు విరుద్ధంగా ఈ పరిణామం చోటు చేసుకుంది.ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2024 మార్చి వరకు 6,203 మంది చెఫ్‌లకు స్కిల్డ్ వర్కర్ వీసాలు మంజూరయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54 శాతం అధికం. ఇదే సమయంలో ప్రోగ్రామర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లకు జారీ చేసిన వర్క్ పర్మిట్ల సంఖ్య 8,752 నుంచి 4,280కి పడిపోయింది. ఈ రెండు వృత్తులు ముఖ్యంగా భారతీయ వలసదారులలో ప్రాచుర్యం పొందాయి. యూకేలో భారతీయ రెస్టారెంట్ పరిశ్రమకి గణనీయమైన ఉనికి ఉంది.అయితే చెఫ్ వీసాల పెరుగుదల స్వల్పకాలికమే కావచ్చు. స్కిల్డ్ వర్కర్ వీసా నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల యువ వర్కర్లకు కనీస వేతనం 38,700 పౌండ్లకు (సుమారు రూ.41 లక్షలు) పెరిగింది. 2023 ఏప్రిల్ నాటికి యూకేలో సగటు చెఫ్ జీతం 22,877 పౌండ్లు (సుమారు రూ.24 లక్షలు)గా ఉంది. చాలా రెస్టారెంట్లు కొత్త వేతన స్థాయిలను భరించే అవకాశం లేదు. దీంతో కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే దరఖాస్తుల హడావుడి పెరిగినట్లుగా తెలుస్తోంది.మరింత కఠినమైన ఆంక్షలు, అధిక వీసా ఫీజులను ప్రవేశపెట్టిన యూకే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో తాజా మార్పులను అధికారిక గణాంకాలు ఇంకా ప్రతిబింబించలేదు. 2023లో నికర వలసలు 10 శాతం తగ్గి 6,85,000 కు పడిపోవడం, వీసా దరఖాస్తులు తగ్గడంతో వలసలు తగ్గుముఖం పట్టాయని ప్రారంభ సూచికలు సూచిస్తున్నాయి. -
మన దేశంలోని టాప్ మహిళా చెఫ్‌లు వీరే!
ఇంతవరకు రెస్టారెంట్లో పురుషులే చెఫ్‌లుగా రాణించడం గురించి విన్నాం. అదీగాక మన పురాణాల్లో కూడా నల భీములు పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి కథలుగా విన్నాం. అందుకు తగ్గట్టుగానే పురుష చెఫ్‌లు ఈ రంగంలో సత్తా చాటారు, వారే ఈ రంగంలో మహారాజుల్లా ఏలుతున్నారు. అలాగే టీవీ షోల్లో కూడా ప్రముఖ రెస్టారెంట్ చెఫ్‌లు సంజయ్ కపూర్ వంటి దిగ్గజ చెఫ్‌లను చూశాం. అయితే ఇదే రంగంలో సత్తా చాటుతున్న టాప్ మహిళా చెఫ్‌లు ఉన్నారు. అంతేగాదు వాళ్లే రెస్టారెంట్లను స్వయంగా నిర్వహించి కిచెన్ క్వీన్స్‌లా రాణిస్తున్నారు. ఆ టాప్ మహిళా చెఫ్‌లు ఎవరంటే..? గరీమా ఆరోరా ఉత్తర భారతదేశానికి చెందిన ఈమె మనదేశంలో టాప్ -10 ఫీ మేల్ చెఫ్ లలో ఒకరు.. బ్యాంకాక్ లో 'గాతో' అనే పేరుతో ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇది సూపర్ సక్సెస్ కావడంతో మిచెలి స్టార్ పేరుతో మరో రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేసింది. ఈమెకు పాక శాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే రెస్టారెంట్ల వ్యాపారంలో శరవేగంగా దూసుకుపోతోంది. 'గాతో' రెస్టారెంట్‌కు బ్యాంకాక్‌లో మంచి ఫేమ్ ఉంది. View this post on Instagram A post shared by Vikas Khanna (@vikaskhannagroup) అనహిత దొండి పార్సికి చెందిన యువతి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకుంటా అంటే కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆమె ఇష్టాన్ని తెలుసుకొని గౌరవించారు. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసిన వెంటనే ఆమెనే సొంతంగా రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. పార్సి వంటకాలను తన కస్టమర్లకు పరిచయం చేశారు. అందులోనూ కొత్త కొత్త రకాలను సృష్టించి కస్టమర్ల నోటికి సరికొత్త రుచులు అందిస్తున్నారు. ఔత్సాహిక చెఫ్ గా అనహిత దొండి పేరు గడించారు. రీతు దాల్మియా పాత తరం మహిళ చెఫ్‌లలో ఈమెకు అగ్ర తాంబూలం దక్కుతుంది. పురుషాధిక్యమైన హోటల్ బిజినెస్ లో.. ఈమె ప్రవేశించి సత్తా చాటారు. తన కస్టమర్లకు తానే స్వయంగా వంట వండి పెడతారామే. ముఖ్యంగా నార్త్ ఇండియన్ వంటకాలు చేయడంలో ఈమె దిట్ట. పెద్ద పెద్ద వ్యాపారులు ఈమె వంటకు డైలీ కస్టమర్లు అంటే అతిశయోక్తి కాదు. శిఫ్రా ఖన్నా నార్త్ ఇండియాకు చెందిన ఈ యువతికి వంట చేయడం అంటే చాలా ఇష్టం. అలా అనేక రకాల వంటలను ఆమె సృష్టించింది.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని రకాల వంటల్లోనూ ప్రయోగాలు చేసింది. ఏకంగా మాస్టర్ చెఫ్ రెండవ సీజన్లో విజేతగా నిలిచింది. టీవీ హోస్ట్‌గా కూడా పనిచేస్తోంది. ఈమెకు ఒక క్లౌడ్ కిచెన్ ఉంది. కాకపోతే అందులో వెస్ట్రన్ డిషెస్ మాత్రమే లభిస్తాయి. పంకజ్ బదౌరియా మనదేశంలో మాస్టర్ చెఫ్ మొదటి సీజన్ విజేతగా పంకజ్ బదౌరియా నిలిచింది. సంప్రదాయ వంటలకు ఆధునిక మేళవింపు అద్దడంలో పంకజ్ ముందు వరుసలో ఉంటుంది. అలా వంట చేస్తుంది కాబట్టే ఆమె మాస్టర్ చెఫ్ మొదటి సీజన్ విజేత అయింది. ప్రస్తుతం ఈమె ఒక రెస్టారెంట్ నిర్వహిస్తోంది.. అందులో అన్ని రకాల వంటకాలూ లభిస్తాయి. పూజా దింగ్రా ఈమె టాప్ పేస్ట్రీ చెఫ్‌లలో పూజా ఒకరు. పేస్ట్రీ తయారీలో తనకు ఉన్న నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ధైర్యంగా ఓపెద్ద పేస్ట్రీ తయారీ యూనిట్ నెలకొల్పింది. అలా రకరకాల పేస్ట్రీలు తయారుచేసి యువతను బాగా ఆకట్లుకున్నారు. అంతేగాదు వెస్ట్రన్ పేస్ట్రీస్ కోసం ఏకంగా మకరాన్ అనే పేరుతో పెద్ద హోటల్ కూడా ఏర్పాటు చేసింది.. బనీ నందా మన దేశానికి ఫ్రెంచ్ డిసర్ట్స్‌ను పరిచయం చేసిన ఘనత బని నందాకు దక్కుతుంది. ఇటీవల అంబానీ ఇంట్లో వేడుకలు జరిగినప్పుడు.. ఈమె రెస్టారెంట్ నుంచే అక్కడికి ఫ్రెంచ్ వంటకాలు వెళ్లాయి. Le cordn bleu పేరుతో ఆమె రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. తేజస్వి చండేలా యూరోపియన్ వంటకాలు వండటంలో తేజస్వీకి మంచి ప్రావిణ్యం ఉంది. యూరోపియన్ పేస్ట్రీలకు మోడ్రన్ టచ్ ఇచ్చి అద్భుతంగా తయారు చేయగల నేర్పరితనం ఈమె సొంతం. ఈమె తయారు చేసే పేస్ట్రీలకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఆమె తయారుచేసే విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంజిలత్ ఫాతిమా నవాబ్ అవధ్ కుటుంబానికి చెందిన మహిళ ఈమె. నవాబు వంటకాలను వండటంలో ఫాతిమాకు మంచి ప్రావిణ్యం ఉంది. అందువల్లే ఆమె పలు రెస్టారెంట్లు ఓపెన్ చేసి కస్టమర్లకు నవాబుల వంటకాలను రుచి చూపిస్తున్నారు. బిర్యానీలో రకాలు మాత్రమే కాకుండా, చికెన్, మటన్‌తో తయారు చేసే ప్రత్యేకమైన వంటకాలను కస్టమర్లకు అందిస్తోంది. (చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!) -
సరదా సన్నివేశం.. రాహుల్‌కు మటన్ కర్రీ వండటం నేర్పిన లాలూ
పాట్నా: బిహార్‌లో ప్రసిద్ధి చెందిన 'చంపారన్ మటన్' ను ఏవిధంగా వండించాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ నేర్పించారు. లాలూ సూచనలు ఇస్తుండగా.. రాహుల్ మటన్ కర్రీని వండారు. ఈ వీడియోను రాహల్ తన ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేశారు. 'నాకు వంట చేయడం వచ్చు. కానీ పూర్తి నైపుణ్యం లేదు. యూరప్‌లో ఉండేప్పుడు ఒంటరిగా ఉండేవాన్ని. ఆ క్రమంలో వండటం నేర్చుకున్నాను. కొన్ని ప్రాథమిక వంటలు చేస్తాను.' అని రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తెలుపుతూ.. నేడు లాలూ యాదవ్ నేతృత్వంలో మంచి వంటకాన్ని వండాను అని రాసుకొచ్చారు. మటన్ వండే క్రమంలో నేతలిద్దరు ముచ్చటించుకున్నారు. వంట వండటం ఎప్పుడు నేర్చుకున్నారని రాహుల్ అడిగిన ప్రశ్నకు లాలూ సమాధానమిచ్చారు. ' 7వ తరగతి చదివే క్రమంలో నేను అన్నయ్యల వద్దకు పాట్నా వెళ్లాను. అక్కడ వారు ఉద్యోగం చేసేవారు. అక్కడే వారికి వండిపెట్టేవాడిని. కట్టెలు ఎలా సమకూర్చుకోవాలి..? వంట పాత్రలు ఎలా శుభ్రపరుచుకోవాలి..? మసాలాలు ఎలా రుబ్బుకోవాలో? నేర్చుకున్నాను.' అని లాలూ చెప్పారు. ఏడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో లాలూ.. రాహల్‌కు మటన్ ఎలా చేయాలో నేర్పించారు. మసాలాలతో సహా అన్ని రకాలను ఎలా కలపాలో చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రాజకీయాలపై ఆసక్తికర ప్రశ్నోత్తరాల చర్చ సాగింది. రాహుల్: రాజకీయాల్లో సీక్రెట్ మసాలాలు ఎంటి? లాలూ: కష్టపడి పనిచేయడమే, అన్నాయానికి వ్యతిరేకంగా పోరాడాలి. రాహుల్: మటన్ కర్రీని తయారు చేయడం.. రాజకీయాలు రెండింటి మధ్య తేడా ఏంటి? నాకు అన్ని కలపడం ఇష్టం.. లాలూ: అవును, కొంచమైనా కలపకుండా రాజకీయాలు చేయలేం. నాకూ రాజకీయం అంటే ఇష్టం. రాహుల్: మాలాంటి వచ్చే తరానికి మీరిచ్చే సలహా ఏంటీ? లాలూ: మీ పూర్వికులు ఈ దేశాన్ని కొత్త మార్గంలో నడిపించారు. ధర్మాన్ని కాపాడారు. మీరు దాన్ని మరిచిపోకూడదు. మటన్ కర్రీ తయారు చేసేప్పుడు బిహార్ డిప్యూటీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరి మిసా భారతి అక్కడే ఉన్నారు. వంట పూర్తి అయిన తర్వాత డైనింగ్ టేబుల్ వద్దకు అందరూ రావడాన్ని గమనించవచ్చు. ఆ తర్వాత రాహుల్ ఆ మటన్ కర్రీని తన సోదరి ప్రియాంకకు కూడా ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
మగవాళ్ల విందు.. తింటే పసందు
సాక్షి, తిరువొత్తియూరు: సాధారణంగా గొప్ప వంటను గురించి చెప్పాలంటే నలభీమ పాకం అని వర్ణిస్తుంటారు. ఆరితేరిన వంటగాళ్ల గురించి చెప్పాలంటే చారిత్రకపరంగా, సాంస్కృతిక పరంగా మగవాళ్లనే ఉదాహరణగా చెబుతుంటారు. దీన్ని నిజం చేస్తూ.. మదురై జిల్లా తిరుమంగళం సమీపం కరడిక్కల్ పంచాయతీలోని గ్రామం అనుపంపట్టి గ్రామంలో శనివారం చేపట్టిన మాంసాహార విందుకు వేలామంది పురుషులు హాజరయ్యారు. (కావల్ దైవం) కాపలా దేవుడుగా ప్రసిద్ధి చెందిన కరుపారై ముత్తయ్య సామి ఆలయంలో ఏటా మార్గళి మాసంలో పౌర్ణమి మరుసటి రోజున ఈ విందు కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ భోజనం చేస్తే వీరులైన మగ సంతానం వృద్ధి చెందడంతో పాటు వంశం అభివృద్ధి చెందుతుందని భక్తుల నమ్మకం. శుక్రవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభించి 60కి పైగా మేకలతో 50 బస్తాల బియ్యంతో మాంసాహార భోజనం తయారు చేశారు. శనివారం ఉదయం ముత్తయ్యస్వామికి ప్రత్యేక పూజలు చేసి తరువాత అందరికీ విందు పెట్టారు. (చదవండి: తమిళనాడులో దారుణం..) -
బీజేపీ జాతీయ సభ.. షెఫ్‌లకు యాదమ్మ ‘వంటల’ పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: ఫైవ్ స్టార్ హోటల్ ప్రధాన షెఫ్‌లు, వారి సహాయకులు తెలంగాణ వంటకాల పాఠాలు నేర్చుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆదివారం ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలను వడ్డించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఫుడ్ కమిటీ ఇన్చార్జీ, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, ఇతర నేతలు బుధవారం వంట ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా యాదమ్మ చేయబోయే వంటకాల జాబితాను సిద్ధం చేశారు. ఆయా వంటకాలు, కావాల్సిన సామగ్రి గురించి నోవాటెల్–హెచ్ఐసీసీ షెఫ్‌లు కరీంనగర్‌కు చెందిన తెలంగాణ వంటల నిపుణురాలు యాదమ్మ నుంచి వివరాలు తెలుసుకున్నారు. సభ కోసం సర్వపిండి, ముద్ద పప్పు, పచ్చి పులుసు, గంగవాయిలి పప్పు, భక్ష్యాలు, పల్ల పులుసు, మక్క గారెలు, ఉల్లి పకోడి, పంట గారెలు, బెల్లం పరమాన్నం, సేమియా పాయసంతోపాటు మరికొన్ని రకాల వంటలను సిద్ధం చేయనున్నారు. -
ఒంటి మీది బట్టల్లేకుండా నిరసన: ఎందుకంటే?
మాస్కో : రష్యాలో వందలాదిమంది మగవాళ్లు, ఆడవాళ్లు ఒంటి మీది బట్టలన్నింటినీ తొలగించుకుని ఆ గ్రూప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వ్యూయర్స్‌కి వాళ్లు చేస్తున్న మేలు ఏమిటంటే.. కంప్లీట్ దిగంబరంగా కాకుండా ప్లేట్లు, కప్పులు, సాస్ ప్యాన్లు, బాటిల్స్, స్టూళ్లు అడ్డుగా పెట్టుకుంటున్నారు. వాళ్లంతా రష్యాలోని బార్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లలో పని చేసే షెఫ్‌లు, కొందరైతే ఓనర్లు కూడా! లాక్డౌన్ తో పనులు లేకుండా పోవడంతో వాళ్లిలా తమ అభాగ్యతను ప్రదర్శిస్తున్నారు. ‘‘మేము ఒకటే కోరుతున్నాం. పని కల్పించండి’’ అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమీ లేని మనుషులుగా మిగిలామని చెప్పడానికే అలా నూలు పోగు లేకుండా నిరసన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారట వాళ్లంతా. చదవండి : రష్యాకు తలపోటుగా మారిన ఆయిల్ లీకేజీ -
లాక్డౌన్ చెఫ్‌లు
లాక్డౌన్ సమయాల్లో ఇంట్లోనే ఉండిపోవడంతో ఇంటి పనుల్లో తమ వంతు సహాయం చేస్తున్నారు స్టార్స్. తమ ప్రతిభను బయటకు తీసుకొస్తున్నారు. ఈ మధ్యే రామ్‌చరణ్, మంచు విష్ణు చెఫ్‌లుగా మారారు. తన మిసెస్ కోసం రామ్‌చరణ్ డిన్నర్ తయారు చేస్తే, ఫ్యామిలీ కోసం సరదాగా కోకోనట్ చికెన్ తయారు చేశారు మంచు విష్ణు. ‘‘భర్తలందరూ వినండి, మిస్టర్ సి. (చరణ్‌ని ఉపాసన అలానే పిలుస్తారు) నాకోసం డిన్నర్ తయారు చేశారు. డిన్నర్ పూర్తయిన తర్వాత అవి శుభ్రం కూడా చేశారు. ఇలాంటి చిన్న చిన్న పనులే అతన్ని నా హీరోని చేస్తాయి’’ అని ట్వీట్ చేయడంతో పాటు చరణ్ వంట చేస్తున్న వీడియోను ఉపాసన షేర్ చేశారు. లాక్డౌన్ పూర్తయ్యేలోగా వంటలో మాస్టర్ అవుతానేమో? అంటున్నారు విష్ణు. వంట చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, ‘‘కొబ్బరి బోండం లోపల చికెన్ రైస్‌ని బేక్ చేశాను. లాక్డౌన్ పూర్తయ్యేసరికి కొత్త కొత్త వంటకాల రెసిపీల పేటెంట్ హక్కులు తీసుకోవాల్సి ఉంటుందేమో?’’ అన్నారు విష్ణు. తనయుడు వంట చేస్తుంటే మోహన్‌బాబు పక్కనే ఉండి చూస్తున్నారు. -
దేవుపల్లి@ నల భీముల చిరునామా
సాక్షి,గజపతినగరం(విజయనగరం) : చుట్టూ పచ్చని పంటలు పండుతుంటే.. ఆ గ్రామంలో ఆకలి కేకలు వినిపించేవి. వర్షాల్లేక పంటలు ఎండిపోయేవి. ఆహారం కోసం జీవితాలు అల్లాడిపోయేవి. అప్పుడే పరిష్కార మార్గం ఆలోచించారు. ఆకలి తీరాలంటే.. ఆకలి తీర్చే ఆహారాన్ని వండటమే వృత్తిగా స్వీకరించారు. శుభకార్యాలకు వంట చేసే పనితో జీవితాలకు బాట వేసుకున్నారు. ఏ ఊళ్లో అయినా ఒకరో.. ఇద్దరో వంట చేసేవారుంటారు.. కానీ అక్షరాలా 250 మంది వంట మాస్టార్లతో ప్రత్యేకతను చాటుకుందా గ్రామం. నల భీముల చిరునామాగా మారిన దేవుపల్లి గ్రామంపై ఆసక్తికరమైన కథనమిది. చుట్టుపక్కల గ్రామాల్లో పంటలు పండినా.. దేవుపల్లిలో ఏటా పండేవి కావు. గ్రామంలో మెట్టు భూములు మాత్రమే ఉండేవి. ఉన్న కొద్ది మాత్రం పల్లపు భూముల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పండేవి కావు. ఎక్కువ కుటుంబాలు భూముల్లేక వ్యవసాయ పనులపైనే ఆధారపడేవారు. దీంతో ఆకలి మంటను తీర్చుకోవడానికి ఏ మార్గం కనిపించక వంట చేసే వృత్తిని గ్రామస్తులు స్వీకరించారు. అదే ఇప్పుడా గ్రామానికి గుర్తింపు తెచ్చి పెట్టింది. బుర్రకథ కళలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన కుమ్మరి మాస్టారుది కూడా ఈ గ్రామమే కావడం విశేషం.ఈ గ్రామంలో ఏ ఇంటి తలుపు తట్టినా తప్పని సరిగా ఒక వంట మాస్టారు ఉండటం విశేషం. పాతికేళ్లుగా వంట పనే వృత్తి దేవుపల్లి గ్రామంలో దాదాపు 3వేల మంది జనాభా ఉంటారు. అందులో 10 శాతం మంది శుభకార్యాలకు వండే పనిలోనే స్థిర పడ్డారంటే ఆ వృత్తిని ఎంతగా వారు గౌరవించి జీవనాధారంగా మలుచుకున్నారో అర్థమవుతుంది. శుభకార్యాల్లో దేవుపల్లి వంట మాస్టర్లు వంట చేశారంటే.. భోజనాలు బాగానే ఉంటాయి.. రుచి విషయంలో చూడాల్సిన అవసరం లేదని అతిథులు భావిస్తారు. ఇప్పడు వారికి ఏటా దాదాపు 200 రోజుల వరకు పని ఉంటోందంటే.. వంట అంత రుచిగా తయారు చేయడమే ప్రధాన కారణం. -
ఎల్లలు లేని ఇఫ్తార్ సంబరం
సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : రంజాన్ పర్వదినం చేరువవుతున్న శుభతరుణాన.. భారీ ఎత్తున జరిగిన ఇఫ్తార్ ఆనందాతిశయానికి నెలవైంది. ఆధ్యాత్మిక భావన ఉప్పొంగిపోగా.. సౌభ్రాతృత్వం వెల్లువైంది. వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.హెచ్. ఫరూఖీ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ అద్భుతమనిపించింది. ఈ ఇఫ్తార్‌లో సుమారు 5 వేల మంది ముస్లిం సోదరులు పాల్గొని విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇంత మందితో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పార్టీ కార్యకర్తలకైనా, ప్రజలకైనా ఎలాంటి సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి వచ్చి వివరిస్తే వారిని అందుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పార్లమెంట్లో మాట్లాడి వైద్యానికి అయ్యే ఖర్చు మంజూరయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. మైనార్టీల అభివృద్ధి కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా పథకాలను ప్రవేశపెట్టారని, జగన్ సీఎం అయితే అదే తరహాలో పథకాలను అమలవుతాయని హామీ ఇచ్చారు. ముస్లిముల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ముస్లింలంతా రంజాన్‌ను సంతోషంగా చేసుకోవాలని కోరారు. ఇన్ని వేల మందికి ఇఫ్తార్ ఇచ్చిన ఫరూకీని అభినందించారు. కార్యక్రమంలో ముందు ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్ర«ధాన కార్యదర్శులు గొల్ల బాబురావు, ప్రసాద్ రాజ్, కరణం ధర్మశ్రీ , పార్లీ నగర విభాగం అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, గురువులు, రామకృష్ణ మూర్తి, తిప్పల నాగిరెడ్డి, ఉషాకిరణ్, చంద్రమౌళి, కొయ్య ప్రసాదరెడ్డి, నగర మైనార్టీ సెల్ అ«ధ్యక్షుడు షరీఫ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, నాయకులు జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక చెఫ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇఫ్తార్ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక చెఫ్స్‌ను తీసుకొని వచ్చారు. వీరు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించి వహ్వా అనిపించారు. ఇఫ్తార్ జరిగిన ప్రదేశానికి వెలుపల కూడా హలీమ్ పంపిణీ చేశారు. -
నలభీములు
-
మెక్సికో నలభీములు..!
శనివారం మెక్సికో సిటీలోని చారిత్రక ఏంజెల్ ఆఫ్ ఇండిపెండెన్స్ స్మారక స్తూపం వద్ద గుమిగూడిన వీరంతా చెఫ్‌లు. మొత్తం 3,634 మంది ఇలా ఒకే చోటికి చేరి కొత్త గిన్నిస్ రికార్డును సృష్టించారు. దుబాయిలో 2003లో 2,847 మంది చెఫ్‌లు ఒకే చోటికి చేరి సృష్టించిన రికార్డును వీరు బద్దలుకొట్టారు. అలాగే శనివారం మరో 337 మంది వెయిటర్లు కూడా ట్రేలలో డ్రింకులను పెట్టుకుని మెక్సికో సిటీలో 800 మీటర్ల రేసును పూర్తి చేసి మరో గిన్నిస్ రికార్డును తిరగరాశారు.