ఇంతవరకు రెస్టారెంట్‌లో పురుషులే చెఫ్‌లుగా రాణించడం గురించి విన్నాం. అదీగాక మన పురాణాల్లో కూడా నల భీములు పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి కథలుగా విన్నాం. అందుకు తగ్గట్టుగానే పురుష చెఫ్‌లు ఈ రంగంలో సత్తా చాటారు, వారే ఈ రంగంలో మహారాజుల్లా ఏలుతున్నారు. అలాగే టీవీ షోల్లో కూడా ప్రముఖ రెస్టారెంట్ చెఫ్‌లు సంజయ్ కపూర్ వంటి దిగ్గజ చెఫ్‌లను చూశాం. అయితే ఇదే రంగంలో సత్తా చాటుతున్న టాప్ మహిళా చెఫ్‌లు ఉన్నారు. అంతేగాదు వాళ్లే రెస్టారెంట్లను స్వయంగా నిర్వహించి కిచెన్ క్వీన్స్‌లా రాణిస్తున్నారు. ఆ టాప్ మహిళా చెఫ్‌లు ఎవరంటే..?
గరీమా ఆరోరా
ఉత్తర భారతదేశానికి చెందిన ఈమె మనదేశంలో టాప్ -10 ఫీ మేల్ చెఫ్ లలో ఒకరు.. బ్యాంకాక్ లో 'గాతో' అనే పేరుతో ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇది సూపర్ సక్సెస్ కావడంతో మిచెలి స్టార్ పేరుతో మరో రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేసింది. ఈమెకు పాక శాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే రెస్టారెంట్ల వ్యాపారంలో శరవేగంగా దూసుకుపోతోంది. 'గాతో' రెస్టారెంట్కు బ్యాంకాక్లో మంచి ఫేమ్ ఉంది.
అనహిత దొండి
పార్సికి చెందిన యువతి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకుంటా అంటే కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆమె ఇష్టాన్ని తెలుసుకొని గౌరవించారు. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసిన వెంటనే ఆమెనే సొంతంగా రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. పార్సి వంటకాలను తన కస్టమర్లకు పరిచయం చేశారు. అందులోనూ కొత్త కొత్త రకాలను సృష్టించి కస్టమర్ల నోటికి సరికొత్త రుచులు అందిస్తున్నారు. ఔత్సాహిక చెఫ్ గా అనహిత దొండి పేరు గడించారు.
రీతు దాల్మియా
పాత తరం మహిళ చెఫ్లలో ఈమెకు అగ్ర తాంబూలం దక్కుతుంది. పురుషాధిక్యమైన హోటల్ బిజినెస్ లో.. ఈమె ప్రవేశించి సత్తా చాటారు. తన కస్టమర్లకు తానే స్వయంగా వంట వండి పెడతారామే. ముఖ్యంగా నార్త్ ఇండియన్ వంటకాలు చేయడంలో ఈమె దిట్ట. పెద్ద పెద్ద వ్యాపారులు ఈమె వంటకు డైలీ కస్టమర్లు అంటే అతిశయోక్తి కాదు.
శిఫ్రా ఖన్నా
నార్త్ ఇండియాకు చెందిన ఈ యువతికి వంట చేయడం అంటే చాలా ఇష్టం. అలా అనేక రకాల వంటలను ఆమె సృష్టించింది.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని రకాల వంటల్లోనూ ప్రయోగాలు చేసింది. ఏకంగా మాస్టర్ చెఫ్ రెండవ సీజన్లో విజేతగా నిలిచింది. టీవీ హోస్ట్‌గా కూడా పనిచేస్తోంది. ఈమెకు ఒక క్లౌడ్ కిచెన్ ఉంది. కాకపోతే అందులో వెస్ట్రన్ డిషెస్ మాత్రమే లభిస్తాయి.
పంకజ్ బదౌరియా
మనదేశంలో మాస్టర్ చెఫ్ మొదటి సీజన్ విజేతగా పంకజ్ బదౌరియా నిలిచింది. సంప్రదాయ వంటలకు ఆధునిక మేళవింపు అద్దడంలో పంకజ్ ముందు వరుసలో ఉంటుంది. అలా వంట చేస్తుంది కాబట్టే ఆమె మాస్టర్ చెఫ్ మొదటి సీజన్ విజేత అయింది. ప్రస్తుతం ఈమె ఒక రెస్టారెంట్ నిర్వహిస్తోంది.. అందులో అన్ని రకాల వంటకాలూ లభిస్తాయి.
పూజా దింగ్రా
ఈమె టాప్ పేస్ట్రీ చెఫ్‌లలో పూజా ఒకరు. పేస్ట్రీ తయారీలో తనకు ఉన్న నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ధైర్యంగా ఓపెద్ద పేస్ట్రీ తయారీ యూనిట్ నెలకొల్పింది. అలా రకరకాల పేస్ట్రీలు తయారుచేసి యువతను బాగా ఆకట్లుకున్నారు. అంతేగాదు వెస్ట్రన్ పేస్ట్రీస్ కోసం ఏకంగా మకరాన్ అనే పేరుతో పెద్ద హోటల్ కూడా ఏర్పాటు చేసింది..
బనీ నందా
మన దేశానికి ఫ్రెంచ్ డిసర్ట్స్‌ను పరిచయం చేసిన ఘనత బని నందాకు దక్కుతుంది. ఇటీవల అంబానీ ఇంట్లో వేడుకలు జరిగినప్పుడు.. ఈమె రెస్టారెంట్ నుంచే అక్కడికి ఫ్రెంచ్ వంటకాలు వెళ్లాయి. Le cordn bleu పేరుతో ఆమె రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు.
తేజస్వి చండేలా
యూరోపియన్ వంటకాలు వండటంలో తేజస్వీకి మంచి ప్రావిణ్యం ఉంది. యూరోపియన్ పేస్ట్రీలకు మోడ్రన్ టచ్ ఇచ్చి అద్భుతంగా తయారు చేయగల నేర్పరితనం ఈమె సొంతం. ఈమె తయారు చేసే పేస్ట్రీలకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఆమె తయారుచేసే విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మంజిలత్ ఫాతిమా
నవాబ్ అవధ్ కుటుంబానికి చెందిన మహిళ ఈమె. నవాబు వంటకాలను వండటంలో ఫాతిమాకు మంచి ప్రావిణ్యం ఉంది. అందువల్లే ఆమె పలు రెస్టారెంట్లు ఓపెన్ చేసి కస్టమర్లకు నవాబుల వంటకాలను రుచి చూపిస్తున్నారు. బిర్యానీలో రకాలు మాత్రమే కాకుండా, చికెన్, మటన్తో తయారు చేసే ప్రత్యేకమైన వంటకాలను కస్టమర్లకు అందిస్తోంది.
(చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!)
Comments
Please login to add a commentAdd a comment