Restaurant
-
కో కో రెస్టారెంట్ : డింపుల్ హయతీ, హెబ్బా పటేల్ సందడి
ఫుడ్ హబ్‌గా పేరుగాంచిన భాగ్యనగరానికి మరో హాట్‌స్పాట్ వచ్చింది. ముంబైకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ ఆసియా డైనింగ్ రెస్టారెంట్ ‘కోకో’ మన నగరంలో ప్రారంభమైంది. వినూత్న కాంటోనీస్, జపనీస్ వంటకాలు నగరవాసులను నోరూరించేందుకు సిద్ధమైంది. #KoKo Restaurant Launch in #Hyderabad #dimplehayati pic.twitter.com/XUyCPnmWMt— Dimple Hayathi (Parody) (@hayathidimple) November 11, 2024ప్రారంభోత్సవంలో డింపుల్ హయాతీ, హెబ్బా పటేల్, సిద్దు జొన్నలగడ్డ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు హాజరై సరికొత్త రుచులను ఆస్వాదించారు. -
హైదరాబాద్ లో భారీ పేలుడు
-
మనసుంటే మార్గం ఉంటుందంటే ఇదే..! వారానికి 90 గంటలు పనిచేస్తూ కూడా..
కొందరు మన కళ్లముందే బిలియనీర్ సీఈవోలుగా అత్యున్నతస్థాయికి ఎదుగుతుంటారు. ఆ క్రమంలో వాళ్లు ఎంతో కష్టపడటమే గాక ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. అయినా కూడా ఫ్యామిలీని, వృత్తిపర జీవితాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. రెండింటికీ పూర్తి న్యాయం చేసి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అలానే చేశారు ఈ బిలియనీర్ సీఈవో. అతడు విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలదొక్కుకునేందుకు ఎంతలా కష్టపడ్డాడో వింటే ఆశ్చర్యపోతారు. మరి దాంతోపాటు కుటుంబ జీవితాన్ని కూడా విజయవంతంగా ఎలా బ్యాలెన్స్ చేశాడంటే..రైజింగ్ కేన్స్ చికెన్ ఫింగర్స్ సహ-వ్యవస్థాపకుడు టాడ్ గ్రేవ్స్ బిలియనీర్ సీఈవో. అతను దాదాపు 800 రెస్టారెంట్లు నిర్వహిస్తూ విజయవంతమైన వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నాడు. అయితే తాను ప్రారంభదశలో వారానికి 90 గంటలకు పైగా పనిచేసి వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆనందాలను కోల్పోయినట్లు చెప్పుకొచ్చాడు 52 ఏళ్ల గ్రేవ్స్. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి రోజూ 12 నుంచి 16 గంటల వరకు కష్టపడేవాడినని అన్నారు. అయితే వృత్తిపరమైన జీవితం తోపాటు కుటుంబ ఆనందాన్ని దూరం చేసుకోకూడదని నిర్ణయించుకుని అందుకోసం సమయం కేటాయించేలా తన విధులను సెట్ చేసుకునే వాడినని అన్నారు. అలా తన వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితాన్ని పూర్తి న్యాయం చేసేలా బ్యాలెన్స్ చేసికోగలిగానని అన్నారు సీఈవో గ్రేవ్స్. అన్ని గంటలు పనిచేస్తూ కూడా ఇదెలా సాధ్యమయ్యిందో కూడా వివరించారు గ్రేవ్స్. తనకు గనుక ఆఫీస్‌లో పనిభారం ఎక్కువగా ఉంటే..తన భార్య పిల్లలను ఆపీసుకి తీసుకువచ్చి తనతో గడిపేలా ప్లాన్ చేస్తుందట. అలాగే తాను కూడా సెలవు రోజుల్లో పొద్దున్నే 4.30 గంటల కల్లా నిద్రలేచి పిల్లలతోనూ, తన తల్లిదండ్రులతోనూ గడిపేలా ప్లాన్ చేసుకునేవాడట. అలా తన కుటుంబ సభ్యులకు ప్రేమానుబంధాలను పంచుతూ వారిని సంతోషంగా ఉండేలా చేయడమే గాక మంచి వ్యాపారవేత్తగా రాణించేలా పాటుపడటంలో రాజీకి తావివ్వకుండా ఆహర్నిశలు శ్రమించానని చెప్పుకొచ్చాడు గ్రేవ్స్. ఓ బిజినెస్‌మ్యాన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేసేలా అత్యున్నత స్థాయికి చేరాలంటే అంకితభావంతో పనిచేయాలి సమయంతో సంబంధం లేకుండా కష్టపడాలని అన్నారు. తన కెరీర్ ప్రారంభంలో 1996 ఆ టైంలో కాలిఫోర్నియాలోని చమురు శుద్ధి కర్మాగారంలో వారానికి తొంభై గంటలకు పైగా పనిచేశానని, అలాగే లూసియానాలోని బాటన్ రూజ్‌లో చికెన్ ఫింగర్ రెస్టారెంట్ల నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు అలస్కాలో సాల్మన్ చేపలు పట్టేవాడినని అన్నారు. అంతలా కష్టపడి దాదాపు 800 చికెన్ ఫిగర్ రెస్టారెంట్లు నిర్వహించే స్థాయికి చేరుకున్నాడు గ్రేవ్స్. వాటి ద్వారా ఏడాదికి ఏకంగా రూ. 500 కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. అంతేగాదు అతడు ఉద్యోగులును నియమించుకునేటప్పడూ అతడిలో ఉన్న నిబద్ధత, కష్టపడేతత్వం ఎంతమేర ఉన్నాయో గమనించి నియమించుకుంటాడట. ఇక్కడ గ్రేవ్స్ వృత్తిని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడమే గాక మంచి సక్సెస్‌ని అందుకున్నాడు. మాటిమాటికి టైం లేదు అని చెప్పేవాళ్లకు ఈ బిలియనీర్ సీఈవో జీవితమే ఓ ఉదాహరణ కదూ..!. (చదవండి: వీల్‌ఛైర్‌తో విల్ పవర్‌కి అసలైన అర్థం ఇచ్చాడు!) -
మాదాపూర్: చికెన్ ఫ్రైలో పురుగులు.. షాకైన కస్టమర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తినే ఫుడ్‌లో పురుగులు, బొద్దింకలు, బల్లులు, జెర్రులు రావడంతో కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు. పరిశుభ్రత పాటించకపోవడంతో రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది.మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్లో చికెన్ ఫ్రైలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. సైబర్ టవర్ ఎదురుగా ఉన్న హోటల్ నుంచి ఓ కస్టమర్ ఆర్డర్ తెప్పించుకున్నారు. పార్శిల్ ఓపెన్ చేయగానే పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో షాక్ తిన్న కస్టమర్ అనిరుధ్ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
తల్లిపై కన్నేసి.. చిన్నారిని చంపి...
సుభాష్‌నగర్: బాలికను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడిన కేసులో నిందితుడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. బుధవారం సూరారం పోలీస్ స్టేషన్లో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. అదిలాబాద్ పాటగూడకు చెందిన సుమ భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలతో సహా నగరానికి వలస వచ్చి స్థానిక జీవన్ జ్యోతినగర్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. అదే జిల్లాకు చెందిన తిరుపతి కూడా జీవన్ జ్యోతినగర్లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి ప్రభాకర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ప్రభాకర్ ఇంటికి వచ్చే తిరుపతి అతడితో కలిసి మద్యం తాగుతూ, పిల్లలతో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో సుమపై కన్నేసిన తిరుపతి, ఇద్దరు పిల్లలతో పాటు ప్రభాకర్‌ను అంతమందించి ఆమెను లోబర్చుకోవాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా ఈ నెల 12న మధ్యాహ్నం సుమ పెద్ద కూతురు జోత్స్నను (7) హత్య చేసేందుకు బయటికి తీసుకెళ్లిన తిరుపతి అవకాశం దొరక్క ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ సాయంత్రం చిన్నారిని తీసుకెళ్లిన అతను బాసరగడి గ్రామ సమీపంలోని చెట్ల పొదల్లో కత్తితో పొడిచి హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి, గోనె సంచీలో మూట కట్టి తిరిగి ఇంటికి వచ్చాడు. ఏమీ తెలియనట్లు ప్రభాకర్‌తో కలిసి జ్యోత్స్న ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు నటించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సూరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించగా తిరుపతి సదరు బాలికను తీసుకెళ్లినట్లు నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకిస్తూ బాలికను హత్య చేసిన ప్రదేశాన్ని చూపించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడానికి కృషి చేసిన సిబ్బందికి రివార్డు అందజేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. -
షవర్మ తినడం వల్లే అస్వస్థతకు గురయ్యా...
రసూల్‌పురా: కార్ఖానా పీఎస్ పరిధిలోని ఓ రెస్టారెంట్లో షవర్మ తిని అస్వస్థతకు గురైనట్లు సీసీఎస్ సీఐ వంశీ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న రాత్రి సీఐ వంశీతో పాటు అతని డ్రైవర్ రెస్టారెంట్లో షవర్మ తిన్నారు. మర్నాడు ఆస్వస్థతకు గురైన సీఐ తాను షవర్మ కారణంగా తాను అనారోగ్యానికి గురైనట్లు కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అదే రోజు స్విగ్గి, జొమాటో ద్వారా షవర్మ ఆర్డరు చేసినవారిలో ఎవరూ అస్వస్థతకు గురి కాలేదని తేలింది. దీంతో పోలీసులు ఫుడ్‌సెఫ్టీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు ఇప్పటివరకు సదరు రెస్టారెంట్లో షవర్మ శాంపిల్ సేకరించేందుకు రాలేదని పోలీసులు తెలిపారు. -
రెస్టారెంట్ బిజినెస్‌లోకి రామ్ చరణ్ హీరోయిన్
హీరోహీరోయిన్లు వ్యాపారాలు చేయడం కొత్తేం కాదు. తెలుగు హీరోలు చాలామందికి హైదరాబాద్‌లో పబ్బులు, రెస్టారెంట్స్, జిమ్స్ ఉన్నాయి. ఓవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు ఈ బిజినెస్ వ్యవహరాలన్నీ చూస్తుంటారు. స్టార్ సెలబ్రిటీలందరూ ఇలా రెండు చేతులా సంపాదించేస్తుంటారు. ఇప్పుడు ఈ లిస్టులో హీరోయిన్ నేహాశర్మ కూడా చేరింది.(ఇదీ చదవండి: అమెరికాలో పెళ్లి.. సమంతనే స్పెషల్ ఎట్రాక్షన్)బిహార్‌కి చెందిన ఈమె.. రామ్ చరణ్ తొలి సినిమా 'చిరుత'తో హీరోయిన్ అయింది. తెలుగులో 'కుర్రాడు' అని మరో మూవీ చేసింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. మధ్యలో మలయాళ, పంజాబీలో తలో చిత్రంలో నటించింది. రీసెంట్గా 'బ్యాడ్ న్యూజ్' మూవీలో కనిపించింది. ప్రస్తుతం 'హేరా ఫేరీ 3'లో నటిస్తోంది.నటిగా ఓ మాదిరిగా బిజీగా ఉంటున్న నేహ శర్మ.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో దిల్లీలోని వసంత విహార్‌లో 'కాల్ మీ టెన్' పేరు జపనీస్ రెస్టారెంట్ ప్రారంభించింది. తద్వారా కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఒకవేళ ఇది విజయవంతమైతే నటిగా కెరీర్ డౌన్ అయినా సరే ఆర్థికంగా ఇబ్బంది ఉండదనమాట.(ఇదీ చదవండి: తమిళ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. అప్పటి గొడవ మళ్లీ) -
వారెవ్వా.. నీళ్లలో తేలియాడే రెస్టారెంట్
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గోరఖ్‌పూర్‌లోని పర్యాటక ప్రాంతం రామ్‌గఢ్ తాల్ సరస్సులో తేలియాడే రెస్టారెంట్ ఇది. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ రెస్టారెంట్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రారంభించారు. महायोगी गुरु श्री गोरखनाथ जी की तपोस्थली गोरखपुर में आज रामगढ़ताल में फ्लोटिंग रेस्टोरेंट के लोकार्पण तथा ग्रीनवुड अपार्टमेंट आवासीय परियोजना के आवंटियों को प्रमाण-पत्र वितरण हेतु आयोजित कार्यक्रम में सम्मिलित हुआ।रामगढ़ताल क्षेत्र देश-दुनिया के पर्यटकों को आकर्षित करने के साथ… pic.twitter.com/eDEErOF6Nm— Yogi Adityanath (@myogiadityanath) September 19, 2024 -
గ్లోబల్ ఫేవరెట్.. మొరాకో
న్యూయార్క్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మొరాకన్ రెస్టారెంట్ నగరంలోని జూబ్లీహిల్స్ వేదికగా ప్రారంభమైంది. అరుదైన వంటకాలతో వినూత్నమైన, పసందైన రుచులను అందించడం మొరాకన్ ప్రత్యేకత. భారతీయులకు ఈ మొరాకన్ రుచులను అందించడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాదులో రెస్టారెంట్ ప్రారంభించడం విశేషం. అయితే ఈ మొరాకన్ వ్యవస్థాపకులు, ప్రముఖ చెఫ్ అనీసా వహీద్ హైదరాబాదీ కావడం మరో విశేషం. లగ్జరీ వంటకాలుగా ఆదరణ పొందిన మొరాకో డిషెస్ సుగంధ ద్రవ్యాలతో పాటు భారతీయ వంటకాల్లో వినియోగించే కొన్ని ఫ్లెవర్స్ తో తయారు చేస్తారు. ఉత్తర ఆఫ్రికన్, మెడిటరేనియన్, అరబ్, పెర్షియన్ పాకశాస్త్ర మూలాల ప్రపంచ–ప్రసిద్ధ సమ్మేళనంతో సువాసనగల మొరాకో రుచులు భారత్ లోని మధ్యధరా/మధ్యప్రాచ్య ప్రాంతాల్లో విస్తరణకు పూనుకున్నారు. తారా కిచెన్ లోకి ప్రవేశించగానే ఎడారి–పర్వత–సముద్ర సెట్టింగులు దేశ వైభవాన్ని ప్రదర్శిస్తాయి. సహారా–ప్రేరేపిత డైనింగ్ రూమ్‌లో అతిథులకు వెండి టీ కుండల నుంచి అందించే మొరాకో పుదీనా టీతో స్వాగతం పలుకుతుంది. మొరాకో ప్రసిద్ధ బ్రైజ్డ్ డిష్, వినూత్నమైన మటన్–చికెన్, సీఫుడ్, ముఖ్యంగా టాగిన్ అని పిలువబడే కూరగాయలు.. వీటిని సంప్రదాయ శంఖు ఆకారపు కుండలో టేబుల్ పైన వడ్డించే విధానం అద్భుతం. ముఖ్యంగా సువాసనతో కూడిన మసాలా మిశ్రమాలు, గులాబీ సువాసనగల బక్లావా వంటి డెజర్ట్స్ నోరూరిస్తాయి. వెజిటబుల్, ఫ్రూట్ సలాడ్లు, డిప్లు వంటకాల అద్భుతమైన రుచులను అందిస్తుంది. ఆరోగ్య సంరక్షణ కోసం సమతుల్య పోషకాలతో వంటకాలను అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. అతి తక్కువ నూనెలు, పాల ఉత్పత్తులతో.. బాదం, దానిమ్మ మొలాసిస్తో ఫిగ్ సలాడ్, కాలి్చన వంకాయ, జాలోక్ కూరగాయల కౌస్కాస్, ఆలివ్ ఫిష్ ట్యాగిన్ ఇలా వినూత్న వంటకాలు వాహ్ అనిపిస్తాయి. ఈ వంటలలో గ్లూటెన్ ఇతర అలెర్జీ కారకాలు ఉండవని చెఫ్ లు తెలిపారు. -
దుబాయిలో రెస్టారెంట్ ఓపెనింగ్‌లో సోనమ్ కపూర్ (ఫొటోలు)
-
రెస్ట్రో బార్‌పై కోహ్లీ సిక్స్..
సాక్షి, సిటీబ్యూరో: సెలబ్రిటీలు వ్యాపార రంగంలోకి రావడం కొత్తేమీ కాదు.. కానీ వారి వ్యాపారాలకు హైదరాబాద్ నగరాన్ని వేదిక చేసుకోవడం ఈ మధ్య విరివిగా జరుగుతోంది. నగరంలో బాలీవుడ్ హీరోలు మొదలు మనీష్ మల్హోత్రా వంటి ఫ్యాషన్ ఐకాన్స్ నుంచి ప్రముఖ భారతీయ క్రీడాకారుల వరకూ సొంత వ్యాపారాలను ప్రారంభించిన వారే. విభిన్న సంస్కృతులతో పాటు సామాజికంగా, ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజలను సమ్మిళితం చేసేలా నగర జీవనం కొనసాగించడం ఒక కారణం. ఐతే నగరంలో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం సొంతంగా వన్–8 కమ్యూన్ అనే సరికొత్త రెస్ట్రో బార్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్ వంటి పసందైన వంటకాలు ఆహార ప్రియులకు నోరూరిస్తున్నాయి.విలాసవంతమైన ఆహారం, బ్రేవరేజస్తో పాటు, అధునాతన జీవన శైలికి అద్ధం పట్టే అద్భుతమైన ఇంటీరియర్ ఫ్యాషన్ లుక్ నేటి రెస్టారెంట్ కల్చర్‌లో భాగమైపోయింది. అయితే నగర వాసుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షించేందుకు ఎవరికి వారు తమ సొంత స్టైల్లో యునీక్ యాంబియన్స్ కోసం తాపత్రయపడుతున్నారు. అలాంటి వినూత్న అనుభూతిని అందించటం వన్–8 కమ్యూన్ ప్రత్యేకత. రిచ్ ఫుడ్.. వింటేజ్ లుక్.. ఇటీవలే హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ నడి»ొడ్డున ప్రారంభించిన వన్–8 కమ్యూన్ నగరానికున్న రాజసాన్ని, రిచ్ ఫ్లేవర్‌ను ప్రతిబింబిస్తుంది. ఇందులోని కిచెన్.. పాక ప్రపంచానికి నూతన హంగులు అద్దిందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. వన్–8 కమ్యూన్ బ్రాండ్ ఎథోస్‌కు కట్టుబడి, రెస్టారెంట్ డిజైన్ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడి వింటేజ్ లుక్స్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తుంది. జుహు, బెంగుళూరు, గుర్గావ్లలో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ రెస్ట్రో బార్ నగరానికి చేరుకోవడంతో ఫుడ్ లవర్స్‌తో పాటు క్రికెట్ ప్రియులు సైతం ఆసక్తిగా విచ్చేస్తున్నారు. రెస్ట్రో బార్లో భాగంగా రిచ్ ఫుడ్ డిషెస్‌తో పాటు బ్రేవరేజస్ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల వారికీ హాట్ స్పాట్‌గా మారింది.కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ ఇక్కడే..ఈ స్పాట్ రాయల్ లుక్ ఇంటీరియర్‌తో పాటు కోహ్లీకి అత్యంత ఇష్టమైన కార్న్ బార్లీ రిసోట్టో, మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్, టార్టేర్ టాప్డ్ అవకాడో వంటి పలు వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు. కోహ్లీ అభిమానులు ఈ వంటకాలను రుచి చూడటానికి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం విశేషం. స్థానికంగా ఆదరణ పొందుతున్న ఫుడ్ రెసిపీలతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విభిన్న మోడ్రన్ రుచులును తయారు చేస్తున్నారు. అంతే కాకుండా మద్యాన్ని ఇష్టపడే వారికి టలిస్కర్, గ్లెన్లివెట్, గ్లెన్ మెరంగే, గ్లెన్ ఫిడిచ్, క్రాగన్మోర్ వంటి విభిన్న టాప్ బ్రాండ్లు కొలువుదీరాయి. ఇవన్నీ దాదాపు పది–పన్నెండేళ్ల సరుకు కావడం విశేషం.సెలబ్ స్పాట్...హైటెక్ సిటీ వేదికగా కొలువుదీరిన ఈ రెస్టారెంట్ నగరంలోని సెలబ్రిటీలకు మంచి స్పాట్‌గా మారింది. దీని ప్రారం¿ోత్సవాలు ముగియకముందే మంచు మనోజ్ వంటి సినీతారల పుట్టినరోజు వేడుకలు ఇక్కడ నిర్వహించడం మరింత ఆసక్తి పెంచింది. వన్–8 కమ్యూన్ను ఇప్పటికే సినీ ప్రముఖులు మంచు లక్షి్మ, నాని, అడివి శేష్, నిఖిల్, తేజ సజ్జ, సు«దీర్ బాబు, సందీప్ కిషన్, ఆకాష్ పూరి, అభిరామ్ వంటి టాలీవుడ్ నటులు సందర్శించారు.సామాజిక, సాంస్కృతిక అనుసంధాన వేదిక..ఎల్లప్పుడూ ఆహారంతో పాటుగా సామాజికంగా ప్రజలందరినీ ఒకచోట చేర్చే స్థలాన్ని సృష్టించడం వన్–8 కమ్యూన్ ప్రధాన లక్ష్యం. స్థానికంగానే కాకుండా దేశ విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు, వ్యక్తులను ఆహారంతో అనుసంధానం చేసే కేంద్రంగా వన్–8 నిలుస్తుంది. స్థానిక ఫుడ్‌తో పాటు కాంటినెంటల్ ఫుడ్‌ను సైతం హైదరాబాద్ నగరం ఆహా్వనించింది, ఆస్వాదిస్తోంది. ఈ ఆదరణకు మెచ్చే విరాట్ కోహ్లీ ఈ రెస్ట్రో బార్‌ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే ఈ నగరం, ప్రజలు సరికొత్త రుచులను ఆస్వాదించాలని ఆశిస్తున్నాను. – వర్తిక్ తిహారా, వన్–8 కమ్యూన్ కో–ఫౌండర్ -
చిన్నారులతో పానీపూరీ తిన్న రాహుల్ గాంధీ
శ్రీనగర్‌ను సందర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఒక రెస్టారెంట్లో చిన్నారులతో పాటు పానీ పూరీ తిన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ హోటల్ అహ్దూస్లో విందు ఆరగించారు. అలాగే చిన్నారులతో పాటు పానీ పూరీ తిన్నారు.శ్రీనగర్‌లోని వ్యూ రెసిడెన్సీ రోడ్ ప్రాంతంలో రాహుల్ గాంధీ పర్యటించడం ఆసక్తికరంగా మారింది. ఆయన బసచేసిన హోటల్ చుట్టూ పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ఈ హోటల్లో రాహుల్ గాంధీ ఎవరికి కలుసుకున్నారనేది వెల్లడికాలేదు. थोड़ी पानी-पूरी.. थोड़ी Chit-Chat और ढेर सारा प्यार pic.twitter.com/TvBqFdVDIo— Congress (@INCIndia) August 21, 2024కాగా రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్ పర్యటనను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఆయనకు పలు సవాళ్లు విసిరింది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏపై రాహుల్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని తెలుసుకునేందుకు రాహుల్‌కు అవకాశం ఏర్పడిందని బీజెపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. కాంగ్రెస్ కొన్ని దశాబ్దాల పాటు జమ్ము కశ్మీర్లో వేర్పాటువాదం, ఉగ్రవాద వాతావరణానికి ఆజ్యం పోశాయని ఆరోపించారు. అయితే 2014లో కేంద్రంలో బీజెపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు మారిపోయాయన్నారు.#WATCH | Jammu & Kashmir | Lok Sabha LoP & Congress MP Rahul Gandhi along with Congress national president Mallikarjun Kharge visits an ice cream parlour at Srinagar's Lal Chowk.Both the Congress leaders arrived in Srinagar, J&K, earlier today. They will meet party leaders and… pic.twitter.com/vIDkbY9FLw— ANI (@ANI) August 21, 2024 -
ఈ బర్మా ఫుడ్.. క్రేజీ టేస్ట్!
సాక్షి, సిటీబ్యూరో: వినూత్న వంటకాలను ఆస్వాదించే వారి సంఖ్య ఈ మధ్య పెరిగింది. సిటీ లైఫ్‌లోని పాశ్చాత్య ఒరవడులకు గతకాలపు అభిరుచులను అద్ది వడ్డించే పసందైన రుచులకు ఆదరణ పెరిగింది. ఇలాంటి రెస్టారెంట్లు, ఫుడ్ స్పాట్స్‌కు నగరంలో మంచి క్రేజ్ ఉంది. ఐతే ఇలాంటి అంశాలతో కొన్ని రెస్టారెంట్లు నగరంలో ఇప్పటికే ఆదరణ పొందుతుండగా.. వారసత్వ వంటకాలకు అధునాతన హంగులద్ది వడ్డించే బర్మా బర్మా రెస్టారెంట్ హైటెక్ సిటీలో సందడి చేస్తోంది. అంతేగాకుండా బర్మీస్ వంటకాల రుచి తెలిసిన ఫుడ్ లవర్స్‌కు క్రేజీ స్పాట్‌గా మారింది.బర్మా సంస్కృతికి ప్రతీకగా.. ఖౌసూయ్, టీ లీఫ్ సలాడ్, సమోసా సూప్, మాండలే నూడిల్ బౌల్, బర్మీస్ ఫలూడా వంటి వంటకాలు ఇప్పడు చాలామందికి ఫేవరెట్ డిషెస్గా మారాయి. పరాటాతో టోహు మాష్, కొబ్బరి క్రీమ్‌తో స్టిక్కీ రైస్, మెకాంగ్ కర్రీ, కుంకుమపువ్వు–సమోసా, చీజ్‌కేక్ వంటి నోరూరించే రుచులకు నాలెడ్జ్ సిటీలోని బర్మా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బర్మాలో ప్రసిద్ది చెందిన ఈ విభిన్న రుచులు నగరంలో ప్రారంభించడం విశేషం. ఆసియాలోని అతిపెద్ద ఐటీ పార్కులలో ఒకటైన నగరాన్ని తన గమ్యస్థానంగా ఎంచుకోవడం, ఆహారాన్ని ఆస్వాదించడంలోనూ నగరవాసుల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.బర్మా సంప్రదాయ ప్రతీకలైన బర్మీస్ స్వరాలతో పాటు అక్కడి వీధులు, గృహాల నుంచి ప్రేరణ పొందిన యాంబియన్స్‌తో ఆహ్లాద ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. బర్మీస్ ప్రత్యేకతల నుంచి అత్యుత్తమంగా ఎంపిక చేసిన ఆరి్టసానల్ ‘టీ’లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ మొదలు తరతరాలుగా ఆదరణ పొందుతున్న గిరిజన, వారసత్వ వంటకాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉడికించిన అరటి ఆకు పాకెట్స్(కయునిన్ మావో) సిగ్నేచర్‌గా నిలుస్తుంది.సంస్కృతుల సమ్మేళనం..వలస ఆహార సంస్కృతులు, స్వదేశీ పదార్థాలతో సమ్మిళితమైన గతకాలపు హోమ్‌స్టైల్ వంటలు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుండగా ఇక్కడి బెస్ట్ సెల్లర్స్‌లో ‘మామిడి సలాడ్, స్పైసీ టీ లీఫ్, అవకాడో సలాడ్, లోటస్ రూట్ చిప్స్, సమోసా సూప్, బ్రౌన్ ఆనియన్, రంగూన్ బేక్డ్ మిల్క్’ ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. చిన్ననాటి స్నేహితులైన చిరాగ్ ఛజెర్, అంకిత్ గుప్తాల ఆలోచనల్లోంచి ఆవిష్కృతమైన బర్మా బర్మా.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, అహ్మదాబాద్‌లో విస్తరించింది.ముఖ్యంగా కోల్‌కతాలో ఎన్నడూ లేనివిధంగా బర్మీస్ సంస్కృతికి జీవం పోస్తోందని సహవ్యవస్థాపకులు అంకిత్ గుప్తా పేర్కొన్నారు. 2023లో అందించిన కొండే నాస్ట్ ట్రావెలర్ టాప్ రెస్టారెంట్ అవార్డ్స్‌లో బర్మా బర్మా 34వ స్థానంలో నిలిచిందని అన్నారు. వంటకాలు పులుపు, కారం రుచులతో.. కాఫీర్ లైమ్లు, బాలాచాంగ్ మిరియాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు తదితరాలను వినియోగిస్తాం. సిటీలో బర్మా నుంచి తీసుకొచ్చిన బాండెల్ చీజ్, పికిల్డ్ ప్లం, బాలచాంగ్ పెప్పర్స్, లాఫెట్ వంటి బర్మీస్ పదార్థాల రుచులతో నగరవాసులను యాంగోన్ వీధులకు తీసుకెళతామని వివరించారు. -
Pakistan: ఒకేసారి ఉద్యోగాలు కోల్పోయిన 700 మంది
పాకిస్తాన్‌లోని ఒక సంస్థలో పనిచేస్తున్న 700 మంది సిబ్బందికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఇస్లామాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్ మోనాల్‌ను మూసివేయడంతో దానిలో పని చేస్తున్న 700 మంది రోడ్డున పడ్డారు.డాన్ నివేదిక ప్రకారం ఇస్లామాబాద్‌లోని మార్గల్లా హిల్స్ నేషనల్ పార్క్‌లోని మోనాల్‌ను మాత్రమే కాకుండా ఇక్కడున్న అన్ని రెస్టారెంట్లను మూసివేయాలని పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణను ఉద్దేశించి 2024, జూన్ 11న సుప్రీం కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ పార్క్ చుట్టూ ఉన్న రెస్టారెంట్లను తక్షణం మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు 2024 సెప్టెంబర్ 11 నుంచి రెస్టారెంట్ మూసివేయనున్నామని మోనాల్ యాజమాన్యం తెలిపింది.ఈ హోటల్ గత రెండు దశాబ్దాలుగా ఆహర ప్రియులకు ఇష్టమైనదిగా పేరొందింది. 2006లో ప్రారంభించినప్పటి నుండి మోనాల్ నిరంతరం ఆహార ప్రియులకు సేవలు అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ రెస్టారెంట్లో 700 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇస్లామాబాద్‌కు వచ్చే పర్యాటకులు ఈ రెస్టారెంట్లో ఆహారం తినేందుకు వస్తుంటారు.మోనాల్ మూసివేత ప్రకటనతో దానిలో పనిచేస్తున్న ఉద్యోగుల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఓ ఉద్యోగి స్పృహ తప్పి పడిపోయాడు. అందరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ కనిపించారు. తమ రెస్టారెంట్‌కు స్టార్ రేటింగ్ ఉందని మోనాల్ యజమాని లుక్మాన్ అలీ అఫ్జల్ తెలిపారు. -
బర్గర్ కింగ్ వర్సెస్ బర్గర్ కింగ్..!
పుణె: అంతర్జాతీయ ఫాస్ట్–ఫుడ్ చెయిన్ బర్గర్ కింగ్ కార్పొరేషన్‌పై పుణెలో బర్గర్ కింగ్ పేరుతో ఉన్న రెస్టారెంట్ 13 ఏళ్లపాటు సాగిన న్యాయ పోరాటంలో విజయం సాధించింది. ‘బర్గర్ కింగ్’పేరును వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 13 వేలకుపైగా ఔట్లెట్లు కలిగిన తమ పేరును దెబ్బతీస్తున్నారని అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ బర్గర్ కింగ్ కార్పొరేషన్ 2011లో పుణె కోర్టులో కేసు వేసింది. ఆ పేరును వాడకుండా సంబంధిత రెస్టారెంట్‌ను ఆదేశించాలని, తమ బ్రాండ్‌కు పూడ్చలేని నష్టాన్ని కలుగజేసినందుకు రూ.20 లక్షలు చెల్లించాలని కూడా అందులో కోరింది. దీనిపై పుణె బర్గర్ కింగ్ యజమానులైన అనహిత, షాపూర్ ఇరానీలు న్యాయపోరాటం జరిపారు. ఒక్క పేరు తప్ప, బర్గర్ కింగ్ కార్పొరేషన్‌తో ఎలాంటి సారూప్యతలు తమ రెస్టారెంట్‌కు లేవన్నారు. తమ వంటి చిన్న వ్యాపారాలను దెబ్బకొట్టే దురుద్దేశంతోనే ఆ సంస్థ ఈ కేసు ఏళ్లపాటు కొనసాగించిందని ఇరానీ ఆరోపించారు. దీని కారణంగా తాము తీవ్ర వేదనకు, మానసిక ఒత్తిడికి గురయ్యామని చెప్పారు. విచారించిన జడ్జి సునీల్ వేద్ పాఠక్..‘ఇరానీ 1992లోనే బర్గర్ కింగ్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కానీ, అమెరికా కంపెనీ 2014 తర్వాతే దేశంలోకి అడుగుపెట్టింది. ఆ కంపెనీ వాదన చాలా బలహీనంగా ఉంది. పుణెలోని రెస్టారెంట్ బర్గర్ కింగ్ పేరుతో వినియోగదారులను తికమకపెట్టినట్లు గానీ, తప్పుదోవ పట్టించినట్లు గానీ నిరూపించలేకపోయింది’అని స్పష్టం చేశారు. అంతేకాదు, పుణె బర్గర్ కింగ్ రెస్టారెంట్‌తో తమ బ్రాండ్‌కు వాటిల్లిన నష్టంపై సరైన ఆధారాలను సైతం అమెరికా కంపెనీ చూపలేదన్నారు. అందుకే పరిహారం పొందే అర్హత కూడా ఆ సంస్థకు లేదన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎవరికీ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుణె రెస్టారెంట్ అదే పేరుతో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. -
అదో గిగా బర్గర్... ప్రపంచ రికార్డు కొట్టేసింది!
ఆగ్రాలోని హోటల్ గ్రాండ్ మెర్కూర్ బృందంతో కలిసి శరణ్‌దీప్ సింగ్ గతేడాది నవంబర్‌లో అతిపెద్ద బర్గర్‌ని తయారు చేశారు. బహుశా ఇదే అతిపెద్ద బర్గర్ అయ్యి ఉండొచ్చని అంతా అనుకున్నారు. ఇప్పుడూ ఆ విషయాన్ని ప్రముఖ ఎన్జీవో వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించిందని సదరు హోటల్ మేనేజర్ వివేక్ మహాజన్ తెలిపారు. పాశ్చాత్య వంటాకాన్ని కూడా పోషకాలతో కూడిన ఆహారంగా తయారు చేయొచ్చని ప్రూవ్ చేశారు. ఈ బర్గర్ తయారు చేసేందుకు మిల్లెట్స్‌తో తయరు చేసిన 20 కిలోల బన్స్, ఆరు కిలోల ఫ్రెంచ్ ఫ్రైస్, 5 కిలోల టమోటాలు, 5 కిలోల దోసకాయ, 5 కిలోల వెడ్జెస్, 12 కిలోల వివిధ రకాల మాయో / సాస్‌లు, 10 కిలోల పనీర్ 10 కిలోల బంగాళదుంప పట్టీలు, 5 కిలోల పాలకూర, 9 కిలోల టిన్ ఫుడ్, 4 కిలోల మసాలా వంటి ఇతర పదార్థాలను వినియోగించినట్లు తెలిపారు. దీన్ని రూపొందించింది బర్గర్ చచ్చుగా పిలిచే శరణ్‌దీప్ సింగ్. ఆయన ఈ బర్గర్‌ని ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో మిల్లెట్స్ ప్రోత్సహించేందుకు తయారు చేసినట్లు తెలిపారు. ఈ బర్గర్లో బన్స్ కోసం తాను జొన్న, బజ్రా, రాగి వంటి తృణ ధాన్యాల పిండిను వినియోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం శరణ్‌దీప్ సింగ్ తయారు చేసిన బర్గరే ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ లీఫ్ బర్గర్‌గా నిలవడం విశేషం. ఇది పూర్తిగా మిల్లెట్స్, తాజా కూరగాయలతో నిండి ఉంది. అతేగాదు పాశ్చాత్య వంటకాన్ని కూడా ఎలా ఆరోగ్యకరంగా పోషకమైన పద్ధతిలో ఆస్వాదించొచ్చు తెలియజెప్పారు. ఆ తర్వాత ఈ భారీ బర్గర్‌ని 200 మందికి పైగా పాఠశాల పిల్లలకు అందించినట్లు ఆ ఆగ్రా హోటల్ మేనేజర్ వివేక్ మహాజన్ తెలిపారు శరణ్‌దీప్ 2017 నుంచి 7 కిలోల బర్గర్‌ని తయారు చేయడం ప్రారంభించారు. అలా ఆయన 2018లో 15 కిలోల బర్గర్, 2019లో 20 కిలోల బర్గర్‌ని తయారు చేశారు. అలాగే అతను క్రికెటర్ హర్భజన్ సింగ్ కోసం 25 కిలోల బర్గర్‌ను కూడా తయారు చేశారు. డిసెంబర్ 2022లో హోషియార్‌పూర్‌లోని తన సిక్స్ బై 10 బర్గర్ రెస్టారెంట్లో 45 కిలోల వెజ్జీ బర్గర్‌ను తయారు చేశారు. (చదవండి: ఆకుపచ్చ కూరగాయాలు వండేటప్పుడూ రంగు కోల్పోకూడదంటే ఇలా చేయండి..!) -
ఢిల్లీలో మరో ప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.. పలువురికి గాయాలు
దేశరాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో గల ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన ప్రమాదాన్ని మరచిపోకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఐఎన్ఏ మార్కెట్లో ఫాస్ట్‌ఫుడ్ దుకాణం, రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులంతా భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ ఘటన ఈరోజు (సోమవారం) తెల్లవారు జామున చోటుచేసుకుంది.ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు మంటలను నియంత్రించే పనిలో ఉన్నాయి. ఈ ప్రమాదంలో కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి మనోజ్ మెహ్లావత్ మాట్లాడుతూ నేటి(సోమవారం) ఉదయం 3:20 గంటలకు మంటలు చెలరేగాయని, ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నామని తెలిపారు. చైనీస్ ఫుడ్ కార్నర్‌తో పాటు ఒక రెస్టారెంట్లో మంటలు చెలరేగాయని, ఘటన జరిగిన సమయంలో ఫాస్ట్ ఫుడ్ కార్నర్లో ఐదారుగురు ఉన్నారని తెలిపారు. వారంతా గాయపడ్డారని అన్నారు. #WATCH | Delhi: Fire broke out at a fast food restaurant in INA market. 8 fire tenders at the spot. Parts of the roof of the restaurant have collapsed. 4 to 6 people have been injured: Delhi Fire service pic.twitter.com/glnFOXqg60— ANI (@ANI) July 28, 2024 -
ఆ ఫోటోలతో మాకు సంబంధం లేదు.. వాస్తవాలు తెలుసుకోండి: సందీప్ కిషన్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ ఫుడ్ సెప్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో భాగంగా వివాహ భోజనంబు రెస్టారెంట్ నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. గడువు ముగిసిన చిట్టిముత్యాలు రైస్ బ్యాగ్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే తమపై వస్తున్న దుష్ప్రచారాన్ని హీరో సందీప్ కిషన్ ఖండించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ లేఖ విడుదల చేశారు. హెడ్‌లైన్స్ పెట్టేముందు వాస్తవాలు కూడా తెలుసుకోవాలని ఆయన సూచించారు.గత ఎనిమిదేళ్లుగా వివాహ భోజనంబు రెస్టారెంట్ పేరుతో మేము చాలా నమ్మకమైన సేవలు అందిస్తున్నామని సందీప్ కిషన్ రాసుకొచ్చారు. తమ హోటల్‌పై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలని అన్నారు. ముఖ్యంగా కొన్ని ఫోటోలు తమ కిచెన్‌కు సంబంధించినవి కావని అన్నారు. వేరే ఫోటోలు పెట్టి తమ కిచెన్ ఫోటోలుగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.హోటల్లో 2022 నాటికే గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగ్ ఉన్నమాట నిజమే.. కానీ ఇప్పటివరకు సీల్ తీయలేదని సందీప్ కిషన్ తెలిపారు. అది కేవలం వెండర్ శాంపిల్ కోసం ఇచ్చిన రైస్ బ్యాగ్ అని వివరించారు. ఈ విషయాన్ని ఫుడ్ సెఫ్టీ అధికారులు ధ్రువీకరించారని అన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వస్తున్న కిచెన్ ఫోటోలు మా రెస్టారెంట్‌కు సంబంధించినవి కాదని వెల్లడించారు. చిన్నచిన్న పొరపాట్లను గుర్తించి.. వాటిని సరిదిద్దుకోవాలని అధికారులు సూచించినట్లు వివరించారు. ఎప్పటిలాగే ఫుడ్ సేఫ్టీ, టేస్ట్ విషయంలో క్వాలిటీ ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని అన్నారు. Request my Dear Patrons to pls check facts before buying into the“Exaggerated Instant HeadLines Culture”We as Team #VivahaBhojanambu have built a Loyal clientele over 8 years with our Food & Sincerity,we would never take your love for granted ♥️*below facts can be verified pic.twitter.com/yiWt4UaDzL— Sundeep Kishan (@sundeepkishan) July 10, 2024 -
హోం మంత్రి అనుచరుల అరాచకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్లో తెలుగు తమ్ముళ్లు విధ్వంసానికి పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. బాధితుల కథనం మేరకు.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రియల్టర్, ఇద్దరు హేచరీల నిర్వాహకులు కలిసి పొరుగున అన్నవరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఒక రెస్టారెంట్‌కు ఇటీవల వచ్చారు. రెస్టారెంట్లో ఎటువంటి ఆర్డర్ ఇవ్వకుండా గంటల తరబడి కూర్చోవడంపై రెస్టారెంట్ నిర్వాహకులు ప్రశి్నంచారు.కస్టమర్లు వస్తున్నారు, వ్యాపారం దెబ్బతింటున్నదని టేబుల్ ఖాళీ చేయాలని రెస్టారెంట్ సిబ్బంది వారికి సూచించడంతో ఒక్కసారిగా వారు రెచి్చపోయారు. హోంమంత్రి తాలూకా తమనే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోమంటావా, ఖాళీ చేయిస్తావా అంటూ రెస్టారెంట్లో నానా రాద్ధాంతం సృష్టించారు. నిర్వాహకులు సర్దిచెబుతున్నా లెక్క చేయకుండా రెస్టారెంట్ ఎలా నిర్వహిస్తావో చూస్తామంటూ బెదిరించి కురీ్చలు తన్నేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు అదే రోజు సాయంత్రం సుమారు 20 మంది అనుచరులతో గుంపుగా మరోసారి వచ్చి రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి నిర్వాహకులతో గొడవకు దిగారు.మంత్రి తాలూకా అంటూ బిల్లు ఇచ్చేది లేదని మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ కురీ్చలు తన్నేసి నానా గొడవ సృష్టించి సిబ్బందిని బయటకు తీసుకొచ్చి చితకబాదారు. రెస్టారెంట్ నిర్వాహకులు కూడా తెలుగుదేశంపార్టీ సానుభూతిపరులే కావడంతో.. విషయాన్ని సిబ్బంది విదేశాల్లో ఉన్న హోటల్ నిర్వాహకునికి తెలియజేశారు. దీంతో ఆయన తన ఆతీ్మయుడైన సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఫోన్‌చేసి మంత్రి పేరు చెప్పి గలాటా సృష్టిస్తున్నారని వారిని కట్టడి చేసి కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిసింది. రెస్టారెంట్లో కురీ్చలు గిరాటేసి దాడులకు పాల్పడ్డ గలాటా తాలూకా వీడియోలు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.మంత్రి పేరు చెప్పి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంవో ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇంతలో గలాటా సృష్టించిన తెలుగు తమ్ముళ్లు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ వివాదంపై రెస్టారెంట్ నిర్వాహకులు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు మంత్రి ద్వారా రాజీ కోసం ప్రయతి్నస్తూ కేసు లేకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇదే విషయమై అన్నవరం సబ్ ఇనస్పెక్టర్ కిశోర్‌బాబును సంప్రదించగా రెస్టారెంట్లో స్వల్ప వివాదం జరిగినట్టు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. అయితే గొడవ విషయంపై తమకు నిర్వాహకుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
హోంమంత్రి అనిత Vs ఎమ్మెల్యే బాలకృష్ణ.. అసలేం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మధ్య ‘వన్’ రెస్టారెంట్ దాడి వ్యవహారం చిచ్చురేపింది. మూడు రోజుల క్రితం అన్నవరంలో వన్ రెస్టారెంట్ మేనేజర్, సిబ్బందిపై దాడి జరిగింది. రెస్టారెంట్ మేనేజర్, సిబ్బందిపై హోంమంత్రి అనిత అనుచరులు దాడికి పాల్పడ్డారు.ఫుడ్ ఆర్డర్ ఇవ్వకుండా టీడీపీ నేతలు గంటల తరబడి హోటల్లో కూర్చున్నారు. పీక్ అవర్‌లో ఎక్కువ సేపు కూర్చుంటే నష్టపోతామని హెటల్ సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో.. హోటల్ మేనేజర్, సిబ్బందితో టీడీపీ నేతలు ఘర్షణకు దిగి.. దాడికి పాల్పడ్డారు.ఈ గొడవ విషయాన్ని హోటల్ సిబ్బంది అమెరికాలోని యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అయితే దాడి విషయాన్ని నందమూరి బాలకృష్ణ దృష్టికి హోటల్ యాజమాని తీసుకెళ్లారు. దీంతో హోంమంత్రి వంగలపూడి అనితకు ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్ చేసిన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయినా గొడవ సద్దుమణగపోవడంతో పంచాయితీ సీఎం పేషీకి చేరింది. అనంతరం పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారా? హోంమంత్రి అనుచరులు కావడంతో పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తారా? అనే చర్చ నడుస్తోంది. -
బయట తినేటప్పుడు జర భద్రం..!
వీధి వీధికి ఒక రెస్టారెంట్, చిన్న చిన్న ఫుడ్ సెంటర్లు తెగ ఆకర్షణీయంగా దర్శనమిస్తుంటాయి. అందులోకి ఇప్పుడూ స్విగ్గీ, జోమాటో వంటి ఆన్లెన్ ఫుడ్ డెలివరీల పుణ్యమా అని బయట భోజనంపై ఆధారపడిపోతున్నారు చాలామంది ప్రజలు. కానీ ఇటీవల కాలంలో ప్రముఖ రెస్టారెంట్లలోనే నాసిరకం భోజనం, ఎక్స్పైరీ తేదీ దాటిని వాడుతున్నట్లు ఆహార భ్రద్రత అధికారులు జరిపిన దాడుల్లో తేలింది. ఇవి మరువక మునుపమే రీసెంట్గా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే..అందులో ఏకంగా చికెన్ పీస్‌లో పురుగులు బయటపడ్డాయి. వాటికి మించి..అన్నట్లుగా బయట ఆహారానికి సంబంధించి వెలుగులోకి రాని భయానక ఘటనలు కొన్ని ఇక్కడ జరిగాయి. ఇవి చూస్తే బయట భోజనం సురక్షితమేనా..? అనే సందేహం వచ్చేస్తుంది. అవేంటో చూద్దామా..మనం ఎప్పుడూ ఒకరు తిని వదిలేసిన ఆహారాన్ని లేదా కుళ్ళిన ఆహారాన్ని తినము. కానీ భారతదేశంలో ఇప్పుడు ఈ పరిస్థితే దాపురించింది!. ఎలా అనే కదా..? ఇటీవల రియల్‌గా జరిగిన ఘటన ఇది. కాస్త పేర్లు మార్చాం. కొద్ది రోజుల క్రితం రవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన స్నేహితుడుతో కలిసి ఒక ప్రసిద్ధ రెస్టారెంట్‌కు వెళ్లారు. సాధారణంగా రవికి బయటన భోజనం తినే అలవాటు లేదు. వాళ్లు తమ దర్పానికి తగ్గట్టు పనీర్ వంటకాలు ఆర్డర్ చేశారు. అయితే సర్వర్ తెచ్చిన పనీర్ ముక్కలు విభిన్న పరిమాణాలు, వేర్వేరు రంగుల్లో ఉన్నాయి. వాటిని చూడగానే రవికి ఏదో తేడా కొడుతుందని అనిపించింది రవికి. అవి చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగా కట్ చేసి వండినట్లు తెలుస్తోంది. దీంతో రవి వెయిటర్ని పిలిచి వంట చేసే వ్యక్తి తీసుకు రావాల్సిందిగా కోరాడు. అతడు వచ్చిన వెంటనే రవి నేరుగా పనీర్ ముక్కలు ఎందుకు విభిన్న పరిమాణాలు, రంగుల్లో ఉన్నాయని ప్రశ్నించాడు. రవికి ఇది మా ప్రత్యేకం వంటకం అని గర్వంగా చెప్పాడు ఆ వంటవాడు. అయితే తాను మరో ప్లేట్ ప్యాక్ చేసి తీసుకువెళ్తాను..దాన్ని మా ముందే తయారు చేయండని కాస్త పెద్ద స్వరంతో అడిగాడు రవి. దెబ్బకు రెస్టారెంట్ మొత్తం వణికిపోయింది. అక్కడున్న చాలామంది భోజనం ఆపేసి మరీ ప్రేక్షకుల్లా చూస్తున్నారు. దీంతో హోటల్ సిబ్బంది వివిధ కారణాలు చెప్పడం ప్రారంభించారు. చివరకు పోలీసుల భయంతో, వెయిటర్ అసలు కారణాన్ని తెలియజేసి తప్పును అంగీకరించాడు. ఇది అందరూ చేసే తప్పు..కస్టమర్లు చాలా సార్లు తమ ప్లేట్లలో అన్నం, కూరగాయలు, సలాడ్లు, చపాతీలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. హోటల్ సిబ్బంది వాటిని అన్నీ పడేయడం లేదు. పెద్ద పనీర్ ముక్కలను, కూరగాయలను తిరిగి మరొక వంటకంలో కలిపి వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది. ప్లేట్లలో మిగిలిన సలాడ్ కొత్త ఆర్డర్ కోసం ఉపయోగిస్తున్నారు నిర్వాహకులు. ఇలా పెద్ద పెద్ద హోటల్స్‌లోనే జరగడం బాధకరం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి..ఇక మీదట, ఎప్పుడు హోటల్లో భోజనం చేయడానికి వెళ్తే, మిగిలిన భోజనం ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకుని, బయటకు వెళ్లి జంతువులకు ఆహారంగా ఇవ్వండి లేదా ఆ సంచి చెత్తబుట్టలో మీరే స్వయంగా వేయండి. లేదంటే, మీ ప్లేట్లోని భోజనం మరొకరి ప్లేట్లోకి వచ్చిన ఎంగిలి ఆహారమై ఉండొచ్చు లేదా మీరు తినగా మిగిలిన భోజనం మరొకరికి ఆహారం కావచ్చు. జాగ్రత్త!! మరో సంఘటన.. శ్రీకృష్ణుని జన్మస్థానం అయిన బృందావనంలో జరిగింది. బృందావనాన్ని ఎంతో పవిత్రమైన భూమిగా చూస్తారు. కౌశల్ అతడి బృందం బృందావనానికి పయనమయ్యారు. ఢిల్లీ నుంచి సుదూర ప్రయాణం చేసిన తర్వాత వారంతా ఎంతో ఆకలితో ఉన్నారు. అందుకే ఒక శుభ్రంగా కనిపించే భోజనశాలలో ప్రవేశించాము. ఆర్డర్‌కు ఆలస్యం కాకుండా ఉండటానికి డిష్‌ల కంటే రెడీమేడ్ భోజన థాళిలను ఆర్డర్ చేసాము. ఒక శుభ్రమైన ట్రే ద్వారా దాల్, కూరగాయలఅన్నం, రైతా మరియు ఒక బుట్టలో చపాతీలు తీసుకువచ్చారు. మొదటి కొద్దిముక్కల తిన్నప్పుడు గుర్తించలేదు, కానీ తర్వాత ఏదో తేడాగా అనిపించింది. చపాతీ పుల్లగా ఉండగా, కూరగాయల రంగు విభిన్నంగా ఉంది. అన్నం రుచి కూడా అసహజంగా ఉంది. అందరం భోజనం అలాగే వదిలేసి, కౌంటర్ వద్దకి బిల్లు ఎంత అని అడిగాము, 650 రూపాయల బిల్లు ఇచ్చారు. ఆ తర్వాత బాబు.. తాము చెల్లిస్తాం కానీ ఒక్కసారి కిచెన్ చూపించండి అని అడిగారు వారంతా. అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ..ఏమయ్యింది అని అడిగాడు. ఒక కస్టమర్‌గా..! భోజనం ఎలా తయారయ్యిందో చెక్ చేయడం తన బాధ్యత అని చెబుతూ..వాళ్లంతా కిచెన్‌లోకి వెళ్లి చూసి కంగుతింటారు. కొన్ని చపాతీలు బుట్టలో ఉండగా, ఫ్రిజ్‌లో వేరే వేరే రకాలుగా వండిన కూరగాయలు, మూతలు లేని వంట పాత్రలు దర్శనమిచ్చాయి. కొన్ని మరీ దుర్వాసన కొడుతున్నాయి. అదంతా చూసి కోపంతో వంటవాడికి నాలుగు చివాట్లు పెట్టగా..అసలు విషయం బయటపెట్టాడు. ఈ కూరగాయలు వారం రోజులుగా ఉన్నాయి. అతను మరొక విషయం కూడా చెప్పాడు, వండేటప్పుడు పాత కూరగాయలను, కుళ్ళిన కూరగాయలను మళ్లీ నూనెతో వేడి చేసి కొత్తిమీర టమాటాలతో అలంకరించి కొత్త వంటకం లాగ వేరే కస్టమర్లకు వడ్డిస్తాం. చపాతి పిండిని కూడా రెండు రోజులకు ఒకసారి తయారు చేస్తాము. కరెంటు కోత కారణంగా ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలు చెడిపోతాయి. ఆ చెడిన వాసనను తెలియనివ్వకుండా మరిన్ని మసాలాలు, కారము కలిపి వంట చేసి సర్వ్ చేస్తాము. పులిసిపోయిన చపాతి పిండిని నాన్ తయారీకి ఉపయోగిస్తామంటూ వరుసగా తాము చేసే పాపాలను వరుసగా బయటప్టెటాడు. ఎప్పుడైనా మీరు కూడా యాత్రలు చేసినప్పుడూ..మీకు కూడా ఓ హోటల్ సర్వర్ ఇలాంటి భోజనమే పెట్టాలి అప్పుడు అర్థమవుతుంది తమ బాధ అంటూ ఉద్వేగంగా చెప్పారు. ఈ రోజు మనకు జరిగే ఇటువంటి ప్రమాదాలు, మోసాల నుంచి కేవలం మన అప్రమత్తత మాత్రమే రక్షిస్తుంది. భారతదేశంలో సత్యం అసత్యం మధ్య తేడా దారుణంగా క్షీణిస్తోంది. ప్రతి దుకాణం లేదా సంస్థల వద్ద ఒక మూలలో దేవాలయం ఉంటుంది. వ్యాపారి ఉదయం వచ్చినప్పుడు దేవుని విగ్రహం ముందు ధూపం, దీపం వెలిగించి, కౌంటర్‌కి నమస్కరించి, ఆ తర్వాత యథావిధిగా మంచి మనిషి ముసుగు తీసి రాక్షసుడి మాదిరి మోసాలకు పాల్పడతాడు. పైగా దేవుడిని ఈ కోరిక తీర్చమంటూ సాగిలపడుతుంటాడు. అస్సలు ఇన్ని మోసాలు చేస్తూ ఎలా కోరికలు లిస్ట్ దేవుడికి చెప్పగలడనేది అర్థం కానీ మిస్టరీ..!. కనీసం ఇసుమంత మేలు చేసి అడిగినా ఓ అందం..కానీ ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే. కేవలం స్వలాభమే ముఖ్యం అందుకు ఏమైనా చేస్తారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. సాధ్యమైనంత వరకు బయట భోజనం తినకుండా ఉండేందుకు ప్రయత్నించండి. (చదవండి: మల్టీవిటమిన్లు మరణ ప్రమాదాన్ని తగ్గించగలవా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
‘తాన్సేన్’ మొఘల్ వైభవం..
ఐదు దశాబ్దాల వారసత్వంతో ఆహార ప్రియులకు విభిన్న రుచులను అందిస్తున్న ఓహ్రీస్ గ్రూప్ ఔటర్‌రింగ్ రోడ్డు పక్కన, ఐటీ జోన్‌కు సమీపంలో తాన్సేన్ రెస్టారెంట్‌ను గురువారం ప్రారంభించింది.అద్భుతమైన పాకశాస్త్ర వారసత్వం, మొఘల్ వైభవంతో దీన్ని తీర్చిదిద్దామని సంస్థ చైర్మెన్ అమర్ ఓహ్రి పేర్కొన్నారు. లెజండరీ సంగీత కారకుడు తాన్సేన్ నుంచి ప్రేరణ పొంది గ్యాస్టోన మీ స్వచ్ఛమైన ఆనందాన్ని పొందుపరిచే రుచుల వేడుకగా ఇది నిలుస్తుందన్నారు. విభిన్న రుచులు, వంటకాల నైపుణ్యంతో ప్రతి వంటకం ఓ అద్భుత కళాఖండంలా తాన్సేన్లో ఉంటుందని చెఫ్ కన్సల్టెంట్ అనూజ్ వాధావన్ అన్నారు. - మణికొండ -
పార్ట్నర్షిప్ నుంచి తప్పుకున్న ప్రియాంక చోప్రా.. మూతపడనున్న రెస్టారెంట్!
సెలబ్రిటీలు కేవలం సినిమాలే కాదు. మరింత ఆదాయం కోసం కొత్త దారుల్లోనూ వెళ్తుంటారు. పలువురు సినీతారలు ఇప్పటికే బిజినెస్‌లు కూడా స్టార్ట్ చేశారు. అలా అందరిలాగే సరికొత్తగా హోటల్ బిజినెస్‌లో అడుగుపెట్టింది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఈ హోటల్‌ను మరొకరి భాగస్వామ్యంతో ఆమె మొదలు పెట్టింది.అయితే న్యూయార్క్ సిటీలో సోనా పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్ పార్ట్నర్షిప్ నుంచి ప్రియాంక చోప్రా పక్కకు తప్పుకుంది. దీంతో ఆమె వైదొలిగిన కొన్ని నెలలకే సోనా హోటల్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. మూడేళ్ల పాటు చేసుకున్న ఒప్పందం ముగియడంతో షట్ డౌన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈనెల 30 సోనా రెస్టారెంట్‌కు చివరి రోజుగా ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. మూడేళ్లుగా మీకు సేవ చేయడం మాకు గొప్ప గౌరవం అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు.కాగా.. 2021లో ప్రియాంక చోప్రా, మనీష్ గోయల్ కలిసి సంయుక్తంగా సోనా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. 2023 చివర్లో చోప్రా రెస్టారెంట్‌తో తనకున్న భాగస్వామ్యాన్ని ముగింపు పలికింది. దీంతో ఆమె తప్పుకున్న ఆరు నెలలకే రెస్టారెంట్ మూసివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. కాగా.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. కార్ల్ అర్బన్‌తో కలిసి 'ది బ్లఫ్' షూటింగ్‌తో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by SONA (@sonanewyork) -
హీరో శర్వానంద్ తమ్ముడి రెస్టారెంట్ రీ లాంచ్.. (ఫొటోలు)
-
ఓ ‘సూపు’ సూద్దామా..!
– రెస్టారెంట్లో తప్పనిసరి ట్రెండ్– కొత్త రుచులను ఆస్వాదిస్తున్న నగరవాసులు– రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం– ఇంట్లోనూ సులభంగా చేసుకోవచ్చు ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా మన చేతికిచ్చే మెనూలో మొదట కనిపించేది సూప్స్ అండ్ స్టార్టర్స్. ఎప్పటి నుంచో నగరంలో కొనసాగుతున్న ఈ ట్రెండ్.. ప్రస్తుతం తప్పనిసరైంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూప్స్ నగర జీవన శైలిలో భాగమయ్యాయి. ప్రస్తుతం ఆహార ప్రియులు రెస్టారెంట్లలో తమకు నచ్చిన సూపులను ఓ సూపు సూస్తున్నారు. విభిన్న ఫ్లేవర్స్ జిహ్వకు రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక పోషక విలువలు కలిగిన సూప్స్ చక్కని ఆరోగ్య ఫలితాలనూ అందిస్తున్నాయి. ఆకలి తీర్చడమే కాకుండా ఆకలిని పెంచడంలోనూ సూప్స్ది ప్రత్యేక స్థానం. వెజ్, నాన్‌వెజ్ రూపాల్లో లభించే సూప్స్‌లో విభిన్న రకాలున్నాయి. ప్రాంతం, ఆహారపు అలవాట్లను బట్టి వివిధ దేశాల్లో వివిధ రకాల సూప్స్ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇక నగరాల్లో అయితే అన్ని రకాల సూప్స్ అందుబాటులో ఉంటాయి. ఇండియన్, చైనీస్ సూప్‌లతో పాటు ఈ మధ్య కొరియన్ సూప్స్ సైతం నగరంలో ఆదరణ పొందుతున్నాయి. మిరియాలు, దోసకాయ, పాలు, నిమ్మరసం, పెరుగు, క్యారెట్, నువ్వులు, పాలకూర, అల్లం, రైస్ వెనిగర్ పదార్థాలతో తయారు చేసిన సూప్‌లు శరీరంలోని పోషకాలను, ఎలక్రో్టలైట్లను పెంపొందిస్తాయని ప్రముఖ చెఫ్ మంగ అశోక్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో రాడిసన్ బ్లూ వేదికగా తయారు చేసే సూప్స్‌లో సీజనల్‌గా ఆరోగ్యానికి సహకరించే మిరియాలు, అల్లం వంటి పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్నామని అన్నారు. ఎండలో డీహైడ్రేషన్‌కు, చలికాలం గొంతు ఇన్ఫెక్షన్లకు సూప్స్ చక్కని ఉపశమనం. గుండె నరాలు, మధుమేహం నిర్వహణలోనూ మనకు సాయపడతాయని అశోక్ చెబుతున్నారు. అయితే ఇంట్లో తయారు చేసుకునేందుకు అనువైన కొన్ని సూప్స్ గురించి తెలుసుకుందాం. హైడ్రేటింగ్ కోసం దోస–అవకాడో.. దోసకాయ, అవకాడో కలిపి చేసిన సూప్ హైడ్రేటింగ్ శక్తినిస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ సూప్ తయారీలో అవకాడోలు, దోసకాయలు, పెరుగు/కొబ్బరి పాలు, నిమ్మరసం, జీలకర్ర, మిరియాలు, పుదీనా కలపాలి. చల్లని సూప్‌లో కొత్తిమీర కూడా చేర్చాలి. ఇది కాస్త చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రధాయిని. క్యారెట్లు, దుంపలు, నిమ్మకాయ కలుపుకుంటే రుచి మారుతుంది. జరు సోబా జరు సోబా అనేది సంప్రదాయ సూప్‌ల మాదిరిగా కాకుండా..ఉడకబెట్టిన పులుసు ఆధారిత సూప్. చల్లబడిన బుక్వీట్ నూడుల్స్‌తో తయారు చేసే జపనీస్ వంటకం ఇది. సాస్‌తో వండే ఈ సూప్ సోయా, డాషి, మిరిన్ నుంచి తయారు చేస్తారు. ఈ చల్లని సూప్ తక్కువ కేలరీలతో హృదయనాళ ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా మధుమేహం నిర్వహణలో సహాయపడుతుంది. ఉడికించిన నూడుల్స్‌ను చల్లటి నీటితో శుభ్రం చేశాక అవి దృఢంగా మారతాయి. తియ్యగా.. కారంగా..... తియతియ్యగా, కారంగా నాలుకకు రుచినందించే వినూత్న సూప్..టమాట–మిరియాల సూప్. దక్షిణాదిలో ఎక్కువ ఆదరణ ఉన్న ఈ సూప్‌ను రసంగానూ వాడుకోవచ్చు. జలుబుకు నివారణగా నాలుకపై టేస్ట్ బడ్స్ మేల్కొల్పడానికి, చలిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మిరియాల రసం, జీర రసం, టమాట రసం, మిలాగు రసం, తక్కలి రసం, టమాట మిరియాల చారు వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు. ఇందులో మంచి రుచి కోసం వెల్లుల్లి, మిరియాలు, జీలకర్రను వినియోగిస్తారు. రుచుల సమ్మేళనాన్ని సమతుల్యం చేయడానికి కాస్త బెల్లంతో తీపి చేస్తారు. సీజనల్ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఇదొక చక్కని ఔషధంలా పనిచేస్తుంది.