Know About World Largest Restaurant In China Can Serve Upto 5,800 People At A Time - Sakshi
Sakshi News home page

Largest Restaurant In World: కొండల మధ్యలో రెస్టారెంట్‌.. ఒకేసారి 5800మంది భోజనం చేయొచ్చు

Published Wed, Jul 12 2023 2:40 PM | Last Updated on Fri, Jul 14 2023 4:43 PM

Know About World Largest Restaurant In China Can Serve Upto 5,800 People At A Time - Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్‌ అది.. అక్కడ ఒకేసారి 5800 మంది భోజనం చేయొచ్చు. గతేడాది ఈ రెస్టారెంట్‌ గిన్నెస్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించింది. పగలు, రాత్రి అని తేడా లేకుండా 24 గంటలు ఈ రెస్టారెంట్‌ తెరిచే ఉంటుంది. మరి ఈ రెస్టారెంట్‌ ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకతలు ఏంటన్నది తెలుసుకుందాం..

చుట్టూ పచ్చని కొండలు, అందమైన ప్రకృతిని చూస్తూ ఫ్రెండ్స్‌ అండ్‌ ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకుంటూ ఘుమఘుమలాడే వంటలు తింటుంటే.. ఆ ఫీలింగే వేరు. ఇలాంటి అనుభూతిని పొందాలంటే మాత్రం పిపా యువాన్ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. హాట్‌పాట్‌ రెస్టారెంట్‌గా పిలవబడే ఈ రెస్టారెంట్‌ చైనాలోని చాంగ్‌క్వింగ్ పట్టణానికి సమీపంలో  కొండ మధ్యలో..  అద్భుతంగా ఉంటుంది. పదో, పాతికో కాదు.. ఈ రెస్టారెంట్‌లో ఏకంగా ఒకేసారి 5800 మంది భోజనం చేయొచ్చు.

3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 900కు పైగా టేబుళ్లు ఈ రెస్టారెంట్‌లో ఉన్నాయి. ఇక్కడ ముందుగానే టేబుల్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద రెస్టారెంట్‌లో మనకు బుక్‌ అయిన టేబుల్‌ ఏదో తెలుసుకోవడానికి కనీసం పావుగంటైనా సమయం పడుతుంది.. మరి టేస్టీ వంటలను రుచిచూడాలంటే ఆ మాత్రం సమయం వేచిచూడక తప్పదు. చైనాలోని పాపులర్​ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్​లో దొరుకుతాయి.


 

చైనాలోని పాపులర్​ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్​లో దొరుకుతాయి. ఇక్కడ వందలాది మంది వెయిటర్లు, వంట మనుషులు,25మంది క్యాషియర్లతో పాటు వందల మంది క్లీనింగ్‌ సిబ్బందిఇక్కడ ఉంటారు. 24 గంటల పాటు ఈ రెస్టారెంట్​ తెరిచే ఉంటుంది. ముఖ్యంగా రాత్రిళ్లు ఇక్కడికి వచ్చే కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.విద్యుత్​ దీపాల వెలుగుల్లో రెస్టారెంట్ మరింత అందంగా కనిపించడమే దీనికి కారణమని చెబుతున్నారు రెస్టారెంట్‌ నిర్వాహకులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement