restaurants
-
మన ఏడు రెస్టారెంట్లు ఆసియాలో బెస్ట్...
ఉత్తమ హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లను గుర్తించడంలో ప్రసిద్ధి చెందిన సంస్థ ‘50 బెస్ట్’ఆవిష్కరించిన ఆసియా ఉత్తమ రెస్టారెంట్ల విస్తృత జాబితాలో ఏడు భారతీయ రెస్టారెంట్లకు చోటు దక్కింది. 51 నుంచి 100వ ర్యాంకు ఫలితాలను శుక్రవారం సంస్థ వెల్లడించింది. ఇందులో ముంబై, ఢిల్లీ, కసౌలి, బెంగళూరుకు చెందిన ఏడు ప్రసిద్ధ రెస్టారెంట్లు ఉన్నాయి. కసౌలీలోని నార్ 66వ ర్యాంకు, బెంగళూరులోని ఫామ్‌లోర్ 68, ముంబైలోని అమెరికానో 71, న్యూఢిల్లీలోని ఇంజా 87, ముంబైలోని ద టేబుల్ 88, న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ 89, ముంబైలోని ద బాంబే క్యాంటీన్ 91వ ర్యాంకులను దక్కించుకున్నాయి. కాగా, టాప్ 50 రెస్టారెంట్లను మార్చి 25న సియోల్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ ప్రకటించనుంది. నార్, ఫామ్‌లోర్, ఇంజా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, నార్ కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ కావడం గమనార్హం. కసౌలిలో చెఫ్ ప్రతీక్ సాధు నడుపుతున్న ఈ రెస్టారెంట్ హిమాలయాల దిగువన ఉంది. హిమాలయ ఆహార సంస్కృతికి అద్దంపడుతుంది. స్థానిక వంటకాలను ప్రోత్సహిస్తుంది. ఢిల్లీలోని ఇంజా రెస్టారెంట్ భారతీయ–జపనీస్ వంటకాలకు ప్రసిద్ధి. బెంగళూరులోని ఫామ్‌లోర్ వ్యవసాయ ఆధారిత వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇది వ్యవసాయ క్షేత్రంలోనే నడిపిస్తుండటం గమనార్హం. బాంబే క్యాంటీన్, అమెరికానో, ది టేబుల్, దమ్ పుఖ్త్ గతంలోనూ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ముంబైలోని కమలా మిల్స్‌లో ఉన్న బాంబే క్యాంటీన్ వైవిధ్యమైన భారతీయ వంటకాలకు ఆధునికతను జోడించి రుచి చూపిస్తుంది. అమెరికానో.. కాలానుగుణంగా వస్తున్న మార్పులను బట్టి సృజనాత్మక వంటకాలపై దృష్టి సారించే ఆధునిక యురోపియన్ బిస్ట్రో. ద టేబుల్ రెస్టారెంట్.. ‘ఫామ్ టు టేబుల్’ఫిలాసఫీతో నడిచే భారతదేశపు మొట్టమొదటి రెస్టారెంట్. ఇక్కడ మెనూ శాన్ఫ్రాన్సిస్కో శైలిలో ఉంటుంది. ఈ రెస్టారెంట్ టాప్ వంటల్లో.. టాగ్లిరిని పాస్తా, గుమ్మడికాయ స్పాగెట్టి, ఆస్పరాగస్ రిసోటో ఉన్నాయి. ఢిల్లీలో సుప్రసిద్ధ రెస్టారెంట్ దమ్ పుఖ్త్లో సాంప్రదాయ భారతీయ వంటకాలైన బిర్యానీ, కబాబ్ వంటివి దొరుకుతాయి. –న్యూఢిల్లీ -
ఆసియా బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో భారత్ రెస్టారెంట్లు ఎన్నంటే..!
2025లో ఆసియాలోని 50 ఉత్తమ రెస్టారెంట్ల యొక్క విస్తరించిన జాబితాలో 7 భారతీయ రెస్టారెంట్లు స్థానం పొందాయి. 2025లో ఆసియాలోని ఉత్తమ రెస్టారెంట్ల సంకలనం 51వ నుండి 100వ స్థానంలో ఉంది. ఇటీవల విడుదలైంది. ఏడు భారతీయ సంస్థలు దీనిలో చోటు దక్కించుకున్నాయి. ఈ 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాలో ఏడు భారతీయ సంసథలు చోటు దక్కించుకున్నాయి. ఈ రెస్టారెంట్ల అవార్డుల ప్రదానోత్సవం ఆవిష్కరణ ఈ నెల ఆఖరున సియోల్ జరగనుంది. ఆ జాబితాలో చోటు దక్కించుక్ను ఏడు భారతీయ రెస్టారెంట్లు వరుసగా కసౌలిలోని నార్ (66వ స్థానం), బెంగళూరులోని ఫార్మ్లోర్ (68వ స్థానం), ముంబైలోని అమెరికానో (71వ స్థానం), న్యూఢిల్లీలోని ఇంజా (87వ స్థానం), ముంబైలోని ది టేబుల్ (88వ స్థానం), న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ (89వ స్థానం), ముంబైలోని ది బాంబే క్యాంటీన్ (91వ స్థానం). అంతేగాదు ముంబైలోని ది టేబుల్ రెండోసారి ఈ జాబితో నిలిచింది. గతంలో ఈ లిస్ట్‌లో నిలవడమేగాక "వన్ టు వాచ్ " అవార్డుని కూడా దక్కించుకుంది. అయితే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నార్, ఫార్మ్లోర్, ఇంజా రెస్టారెంట్లు తొలిసారిగా చోటు దక్కించుకున్నాయి. ఇక తొలిస్థానంలో సియోల్‌లోని బోర్న్ అండ్ బ్రెడ్ నిలిచింది. మొదటి పది స్థానాలలో బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్ సియోల్‌కి సంబంధించిన ఆరు రెస్టారెంట్లు ఉండటం విశేషం. కాగా, గతేడాది ఐదు భారతీయ రెస్టారెంట్లు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం దక్కించుకోగా ఈ ఏడాది మరో రెండు రెస్టారెంట్లు ఈ జాబితాలో చేరడం విశేషం. (చదవండి: మత్స్యకారుడి కూతురు జలక్రీడల్లో సత్తా చాటుతోంది..!) -
స్వీట్ చేంజ్.. విందులో పసందైన రుచులు
ఏదైనా శుభవార్త చెప్పే ముందు నోరు తీపి చేస్తారు. ఇది ఒకప్పటి మాట. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.. ప్రతి చిన్న విషయానికీ స్వీట్‌తో పండుగ చేసుకుంటున్నారు. అంతేనా! అంటే కాదు..కొందరు భోజనానికి ముందు.. కొందరు భోజనానికి తర్వాత కూడా స్వీట్ తినే అలవాటు చేసుకుంటున్నారు. ఈ అలవాటుకు అనుకూలంగా నగరంలోని పలు రెస్టారెంట్స్, హోటల్స్ ఫుడ్ సర్వ్ చేసేటప్పుడు చివరి వంటకంగా డిసర్ట్స్ సర్వ్ చేస్తున్నారు. స్టార్టర్స్, మెయిన్ కోర్సు వగైరాలన్నీ పూర్తయ్యాక ఫైనల్‌గా అందించే తీపి కబురు కోసం ఫుడ్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటిని తరచూ మారుస్తూ చెఫ్స్ కూడా ఆ ఆసక్తిని సజీవంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు మిఠాయి అంటే స్వీట్ షాప్ మాత్రమే గుర్తొచ్చే నగరవాసులు.. ఇప్పుడు కొన్ని రకాల డిసర్ట్స్‌ను ఎంజాయ్ చేసేందుకు రెస్టారెంట్స్‌కు క్యూ కడుతున్నారు. భోజనం అయిపోగానే కాస్తంత తీపి రుచిని ఆస్వాదించడం చాలా కాలంగా ఒక సంప్రదాయంగా స్థిరపడింది. ఇప్పుడు ఆ సంప్రదాయం ఇంతింతై వటుడింతై అన్నట్లు.. రెస్టారెంట్స్ వడ్డించే విందులో డిసర్ట్స్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన భాగంగా మార్చేసింది. మిఠాయిలు ఆస్వాదించాలంటే కేవలం స్వీట్ షాప్స్ మాత్రమే శరణ్యం అనే పరిస్థితి మారి కేవలం డిసర్ట్స్ కోసం రెస్టారెంట్స్‌కి వెళ్లడం ఇప్పుడు సాధారణంగా మారింది. జామ్.. బూమ్.. రెస్టారెంట్ల తొలినాళ్లలో గులాబ్ జామ్ వంటి అందరికీ తెలిసిన స్వీట్లను మాత్రమే వడ్డించేవారు. అయితే ఆ తర్వాత క్రమంలో పూర్తి భోజనాన్ని మూడు భాగాలుగా విభజించిన తర్వాత డిసర్ట్స్ పేరుతో మెనూలో ప్రత్యేక స్థానాన్ని తీపి వంటకాలకు కేటాయించారు. తొలినాళ్లలో గులాబ్ జామ్, హల్వా, జిలేబీ, రస్మలాయ్, కోవా మాత్రమే చాలాకాలం డిసర్ట్స్గా రాజ్యమేలాయి. అయితే మల్టీ క్యుజిన్ల వెల్లువ ధాటికి మెయిన్ కోర్సుతో పాటు డిసర్ట్స్ కూడా విభిన్న రుచులకు విస్తరించాయి. ఒకప్పుడు ఆరు వెరైటీల దగ్గర నుంచి ఇప్పుడు అతిథులకు తీపి రుచులను పెద్ద సంఖ్యలో లంచ్, డిన్నర్లలో వడ్డిస్తున్నారు.బేకరీ ఉత్పత్తులకూ చోటు.. తొలుత అందరికీ బాగా తెలిసిన ప్రాంతీయ తీపి వంటకాలు ఆ తర్వాత పేస్ట్రీలకు కూడా డిసర్ట్స్ స్టైల్ మారుతూ వచి్చంది. రస్మలాయ్కి బదులు అదే ఫ్లేవర్‌లో ఐస్‌క్రీమ్ పెడుతున్నారు. బఫేలో కాంటినెంటల్ చీజ్ కేక్, బ్రౌనీ, చాకోలావా, మథుపై.. ఇలా బేకరీ ఐటమ్స్ కూడా భాగం చేస్తున్నారు. కొంత కాలంగా ఐస్‌క్రీమ్ కూడా డిసర్ట్స్‌లో తప్పనిసరి భాగం అయిపోయింది. ఐస్‌క్రీమ్‌కి కాంబినేషన్‌గా గులాబ్‌జామ్/పేస్ట్రీస్/ మూంగ్‌దాల్ హల్వా వంటివి అతిథుల నోరూరిస్తున్నాయి. కొన్నిచోట్ల సంప్రదాయ వంటకాలైన ఖద్దూ కా ఖీర్, ఫ్రూట్ కస్టర్డ్.. సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం, పూర్ణాలు, బొబ్బట్లు కూడా వడ్డిస్తున్నారు. ఆరోగ్య ‘తీపి’..రస్తు.. ఇటీవల ప్రారంభమైన ఆరోగ్యకరమైన వంటకాల ప్రభావం రెస్టారెంట్స్ మీద కూడా పడింది. దీనిలో భాగంగా కొత్తగా పరిచయమైన మిల్టెట్స్తో తయారైన తీపి వంటకాలను అతిథులకు అందిస్తున్నారు. కొర్రల పరమాన్నం, జవారి లడ్డు, రాగుల పాయసం, ఊదల లడ్డు, సామల పరమాన్నం.. వంటివి నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ పంచదార కాకుండా తృణధాన్యాలు, బెల్లంతో తయారవడం డయాబెటిక్ రోగులకు కూడా పెద్దగా హానికారకం కాకపోవడంతో వీటి పట్ల నగరవాసుల్లో మోజు పెరిగిందని చెఫ్ యాదగిరి చెబుతున్నారు. ఆయా సీజన్లలో వచ్చే పండ్లను ఉపయోగించి తయారు చేసే సీజనల్ డిసర్ట్స్ కూడా రెస్టారెంట్స్‌లో సందడి చేస్తున్నాయి. సీతాఫలం దొరికే సీజన్లో సీతాఫల్ రబ్డీ, ప్రస్తుతం జామకాయలు విరివిగా దొరుకుతాయి కాబట్టి జామూన్ డిలైట్ ఇలా ఆయా సీజన్స్ ప్రకారం కొత్త రుచులను అందిస్తున్నారు. అలాగే మల్బరీ పండ్లు విరివిగా లభించే సమయంలో ఐస్‌క్రీమ్ మల్బరీస్ మిక్స్, మల్బరీ జ్యూస్ వంటివి అందిస్తున్నారు. -
మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
-
అమ్మిన వాడికి లాభాలు.. తిన్నవాడికి రోగాలు
-
‘మీ పేర్లు తప్పనిసరి’.. ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటల్ యజమానులు వారి పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయ్యాయని, జనవరి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుర్తింపు కార్డులను సిద్ధం చేసుకునేందుకు తగినంత సమయం ఇచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ మాదిరిగానే పరిశుభ్రమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించే ఉద్దేశ్యంతో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మేము నిర్ణయించుకున్నాము’ అని పట్టణాభివృద్ధి మంత్రి విక్రమాదిత్య సింగ్ అన్నారు. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.BIG NEWS 🚨 Himachal Congress Minister Vikramaditya Singh announces that all restaurants, food outlets will have to display owner’s identification. SHOCKING part is he referenced recent directive from CM Yogi Adityanath in his postYOGI MAGIC ACROSS INDIA 🔥🔥Yesterday CM… pic.twitter.com/J8YltyFvF4— Times Algebra (@TimesAlgebraIND) September 25, 2024పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించిన సమావేశంలో ఆహార లభ్యతపై ప్రజల్లో నెలకొన్న భయాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఈ కొత్త నిబంధనల్ని అమలు చేయాలని భావించినట్లు విక్రమాదిత్య సింగ్ చెప్పారు. 👉 చదవండి : రాష్ట్రంలో సీఎం యోగి సర్కార్ కొత్త రూల్స్యూపీ యోగి సర్కార్ సైతంకాగా,మంగళవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారం అందించేలా కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్లతో పాటు తినుబండరాలు అమ్మే ప్రదేశాల్లో యజమానులు, సిబ్బంది, చెఫ్‌లు తప్పని సరిగా మాస్క్‌లు, గ్లౌజ్స్ ధరించాలి. హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు సిబ్బంది, ఇతర మేనేజర్లు ఇతర ఉద్యోగులు తప్పని సరిగా వారి వివరాల్ని మెనూ కార్డ్‌లో ప్రదర్శించాలని సీఎం యోగి ఆధిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే మధ్యప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
USA Presidential Elections 2024: టిప్‌లపై పన్ను ఎత్తేస్తా: హారిస్
లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే దేశంలోని రెస్టారెంట్ల సిబ్బంది టిప్పులపై పన్నులను రద్దు చేస్తానని డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ హామీ ఇచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద పరిశ్రమల పన్నులపైనే అధికంగా ఆధారపడే నెవెడా రాష్ట్రంలో ర్యాలీలో ఆమె ఈ మేరకు ప్రకటించారు. మాట్లాడారు. శ్రామికుల కనీస వేతనం పెంచుతానన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కూడా ఇదే హామీ ఇవ్వడం విశేషం. దాన్నే హారిస్ కాపీ కొట్టారంటూ ఆయన ఎద్దేవా చేశారు. తన ఐడియాలను దొంగిలించడం మినహా హారిస్‌కు ఇంకేమీ చేతకాదన్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
-
ఆహార సేవల రంగం రూ.7.76 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత ఆహార సేవల రంగం మార్కెట్ విలువ ఏటా 8.1 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 2028 మార్చి నాటికి రూ.7.76 లక్షల కోట్లకు చేరుకుంటుందని జాతీయ రెస్టారెంట్స్ సంఘం (ఎన్ఆర్ఏఐ) అంచనా వేసింది. ఈ ఏడాది మార్చి నాటికి ఆహార సేవల రంగం మార్కెట్ విలువ రూ.5.69 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. దేశ ఆహార సేవల రంగంపై ఒక నివేదికను విడుదల చేసింది. ఆహార సేవల్లో సంఘటిత రంగం వాటా 13.2 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని తెలిపింది. కరోనా సంక్షోభం నుంచి ఈ రంగం బయటకు వచి్చందని పేర్కొంది. 2020 మార్చి నాటికి రూ.4.24 లక్షల కోట్లుగా ఉన్న మార్కె ట్, కరోనా దెబ్బకు 2021 మార్చి నాటికి రూ.2 లక్షల కోట్లకు తగ్గిపోవడం గమనార్హం. 2022 మార్చి నాటికి తిరిగి రూ.4.72 లక్షల కోట్లకు చేరుకోగా, 2023 మార్చి నాటికి రూ.5.3 లక్షల కోట్లు, ఈ ఏడాది మార్చి చివరికి రూ.5.69 లక్షల కోట్లకు విస్తరించినట్టు ఎన్ఆర్ఏఐ నివేదిక వెల్లడించింది. 2025 మార్చి నాటికి రూ.5.69 లక్షల కోట్లను తాకుతుందని అంచనా వేసింది. టాప్ –3 మార్కెట్ భారత ఆహార సేవల రంగం 2028 మార్చి నాటికి జపాన్ను అధిగమించి, ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని ఎన్ఆర్ఏఐ నివేదిక తెలిపింది. కరోనా ప్రతికూలతల నుంచి ఆహార సేవల మార్కెట్ వేగంగా వృద్ధి చెందిందని, ఇది ఈ రంగం బలమైన సామర్థ్యాలను తెలియజేస్తోందని ఎన్ఆర్ఏఐ ప్రెసిడెంట్ కబీర్ సూరి పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఈ పరిశ్రమ చూపించే ప్రభావాలను గుర్తించి, ఈ మార్కెట్ వృద్ధికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఆహార సేవల రంగం ఉపాధి పరంగా రెండో అతిపెద్ద విభాగమని, 85.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని ఎన్ఆర్ఏఐ నివేదిక తెలిపింది. 2028 నాటికి ఈ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు 1.03 కోట్లకు చేరతాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ నుంచి రూ.33,809 కోట్ల పన్ను ఏటా ప్రభుత్వానికి వస్తండగా, 2028 మార్చి నాటికి రూ.55,594 కోట్లకు చేరుతుందని తెలిపింది. -
ఇనార్బిట్ మాల్లో పాన్ ఏషియా ఫో రెస్టారెంట్ ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
సాక్షి, ఖమ్మం: ఆహార ప్రియులకు, బిర్యానీ లవర్స్‌కు అలెర్ట్. వారం మొత్తం కష్టపడి వీకెండ్లో ఫ్యామిలితో రెస్టారెంట్లకు,హోటళ్ళకు వెళ్ళి తింటున్నారా.. ఐతే కొంచెం జాగర్తండోయ్.. కొందరికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. మరికొందరికి చికెన్ కబాబ్స్ అంటే మరీ లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు. కానీ అవే ఆహార పదార్ధాలు వారాల కొద్దీ నిల్వ ఉంచి మీకు పెడుతున్నారంటే నమ్ముతారా.. ఇది ముమ్మాటికీ నమ్మలేని నిజమే అని చెప్పాలి. కావాలంటే ఒక్కసారి ఖమ్మం జిల్లాకు వెళ్ళి చూసొద్దాం రండి. రెస్టారెంటుకు వెళ్ళి డిమ్ లైటింగ్‌లో కూర్చుని వేడి వేడి బిర్యాని, దానికి తగ్గట్టుగా చికెన్ లాలిపప్స్.. చికెన్ 65, చికెన్ కబాబ్స్ తింటుంటే ఉంటుంది. చెబుతుంటేనే నోరూరిపోతుంది కదా. చికెన్, మటన్, ప్రాన్స్, ఇలా ఎన్నోరకాల వంటలు రెస్టారెంట్లలో,హోటళ్ళలో దొరుకుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్త.. అదే ఆహారం విషంగా మారితే మీ పరిస్థితి ఏంటి?. ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినా మనం ఏం చేస్తుంటా అలా రెస్టారెంటుకు వెళ్ళి బిర్యానీ తినాలి అనుకుంటాం అలాంటప్పుడు ఎక్కువగా ఫేమస్ రెస్టారెంట్లవైపే మొగ్గు చూపుతుంటాం. ఎందుకంటే పది రూపాయలు ఎక్కువైన సరే ఫుడ్ రుచితో పాటు శుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కూడా పాటిస్తారని.. అందులో తింటే ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఉండదన్న గట్టి నమ్మకంఅయితే ఆ గట్టి నమ్మకం కాస్త ఇప్పుడు గుడ్డి నమ్మకమని ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో తేలిపోయింది. రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు అంటూ ఊదరగొట్టే పెద్ద పెద్ద పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్ల బండారాలు బయటపడుతున్నాయి. కుళ్లిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక.. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఒకటో రెండో రెస్టారెంట్లలో కాదండోయ్. నగరంలో ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లలో ఇదే సీన్ కనిపించటం ఆందోళనకరం.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లలో ఫ్రీజర్‌లో దాచిన చికెన్ కబాబ్స్, ప్లాస్టిక్ బకెట్లలో మ్యారినేట్ చేసిన చికెన్, బ్యాచ్ నంబర్ లేని మసాలా ప్యాకెట్లు, మ్యానిఫ్యాక్చరింగ్ గడువు లేని పసుపు, ఎక్స్పైరీ డేట్ దాటిన సరుకులు, రూల్స్ అతిక్రమించి పామాయిల్ వినియోగం...ఇలా పలు లోపాలను, మోసాలను గుర్తించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ఫుడ్‌సేఫ్టీ కంట్రోల్ ఆఫీసర్ జ్యోతిర్మయి టాస్క్‌ఫోర్స్ టీమ్‌తో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు.హోటల్లో తనిఖీల సందర్భంగా సిబ్బంది ఎవరికీ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని తెలుసుకున్నారు .నాణ్యత లేని ఆహార పదార్థాలు సీజ్ చేశారు. శాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఓ హోటల్లో ఫ్రీజర్‌లో నిల్వ చేసిన 12 కిలోల చికెన్ కబాబ్స్‌ను గుర్తించిన అధికారులు, వాటిని రూల్స్ ప్రకారం మున్సిపల్ సిబ్బందికి అప్పగించాల్సి ఉండగా.. అక్కడే డ్రైనేజీలో పారబోయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిర్వాహకులు చపాతి, పరోటా పిండిని కలిపి ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచారు. చికెన్ ధమ్ బిర్యానీ కోసం మ్యారినేట్ చేసిన చికెన్‌ను ప్లాస్టిక్ బకెట్లో నిల్వ చేశారు. దీంతో మ్యారినేట్ చేసిన చికెన్‌ను కూడా బయటపడేయించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడంపై అధికారులు ఫైర్ అయ్యారు. స్టోరూమ్స్ ఎక్స్పైరీ అయిన జీలకర్ర, బ్రాండెడ్ కాని జీడిపప్పు, గోధుమ పిండిని గుర్తించి సీజ్ చేశారు. ఫుడ్‌సేఫ్టీ నిబంధనలను పాటించకపోతే పర్మిషన్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆహార వస్తువులపై లేబుల్స్, బ్యాచ్ నంబర్లోకపోతే ఫైన్‌తో పాటు, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 300 హోటళ్లు, 28 రెస్టారెంట్లు ఉండగా ఏడు నెలల్లో అధికారులు తనిఖీలు చేసి 14 కేసులు మాత్రమే నమోదు చేశారు. హైదరాబాద్ స్థాయిలో ఒత్తిళ్లు వస్తే తప్పా తనిఖీలు చేయరన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు తప్పించి రెగ్యులర్‌గా సోదాలు చేయరనే ఆరోపణలున్నాయి. మామూళ్ల వ్యవహారం కారణంగా చూసి చూడనట్టు వదిలేస్తారనే విమర్శలున్నాయి.ఇప్పటికైనా ఆహార భధ్రత అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నెలకో రెండు నెలలకో తనిఖీలు చేయడం కాకుండా నిత్యం రెస్టారెంట్లు హోటళ్ళపై నిఘా ఉంచాలని, ప్రజల ప్రాణాలకు హాని కలింగించే ఆహార పధార్దాలు ఇలాంటి రెస్టారెంట్లు,హోటళ్ళు వినియోగించకుండా తగు చర్యలు తీసుకోవాలని ఫుడ్ లవర్స్ కోరుతున్నారు. -
Hyderabad: బయటి ఫుడ్ అంటే భయపడుతున్న భోజన ప్రియులు!
వారాంతపు రోజుల్లో..నగరంలోని కొన్ని రెస్టారెంట్లలో సీట్ దొరకాలంటే కనీసం గంట నుంచి 2 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే అంతటి రద్దీ ఇప్పుడు లేదు. వేళా పాళా లేకుండా ఐస్‌క్రీములూ, పేస్త్రీలూ లాగించే నగర యువత తమ అలవాటును కొనసాగించడానికి జంకుతున్నారు. నగరవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అధికారులు రెస్టారెంట్లపై నిర్వహిస్తున్న దాడుల్లో బయటపడుతున్న విషయాలే దీనికి కారణం. సాక్షి హైదరాబాద్: పేరుగొప్ప రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, సూపర్ మార్కెట్లు...ఒకటేమిటి? కాదేదీ కల్తీ కనర్హం కాదేదీ ఆరోగ్య కారకం..అన్నట్టుగా నగరంలో పరిస్థితి దిగజారిందని తాజాగా అధికారుల దాడుల్లో వెల్లడైంది. నగరంలో ఫుడ్ లవర్స్‌కి ఫేవరెట్ బిర్యానీ సెంటర్లు, బ్రాండెడ్ ఐస్‌క్రీమ్ పార్లర్లు సైతం ప్రమాణాలు పాటించడంలో దారుణంగా వెనుకబడి ఉన్నాయని తేలింది. సోషల్ మీడియాలో హల్చల్... ఈ దాడులలో వెల్లడైన ఆహార వ్యాపారుల నిర్వాకాలు అటు ప్రధాన మీడియాలో బాగా హైలెట్ అయ్యాయి. మరోవైపు సోషల్ మీడియాలో కల్తీ ఉత్పత్తులు, నిల్వ ఆహారపదార్ధాల కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం సిటిజనులపై తీవ్ర ప్రభావాన్ని చూపి ంచింది. అదే సమయంలో లక్డీకాపూల్‌లోని ద్వారకా హోటల్లో క్యారెట్ హల్వా తిన్న కస్టమర్ తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడని వార్తలు సంచలనం సృష్టించాయి. ఒకదానికి ఒకటి తోడైనట్టుగా జరిగిన పరిణామాలతో సిటీలోని ఫుడ్ బిజినెస్ ఢమాల్ అయింది. 25 నుంచి 35 శాతం పడిపోయిన వ్యాపారం... ప్రస్తుతం బయటి ఆహారం అంటేనే నగర వాసుల్లో భయం ఏర్పడిందని, దీనికి గత 3 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలే కారణమని జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్ యజమాని అంగీకరించారు. తమ రెగ్యులర్ గెస్ట్స్ సంఖ్యలో భారీగా తేడా వచి్చందనీ, వచ్చినవారు కూడా..ఫుడ్ ఆర్డర్ చేస్తూనే సందేహాస్పదంగా చూస్తున్నారని, తరచి తరచి అడుగుతున్నారని ఆయన చెప్పారు. నగరవ్యాప్తంగా ఈ పరిస్థితుల వల్ల కనీసం 25 నుంచి 35 శాతం వరకూ ఫుడ్ బిజినెస్ దెబ్బతిన్నదని రెస్టారెంట్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. కొందరు చేసిన తప్పుకి ఎందరో బలవుతున్నారని వీరు వాపోతున్నారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్‌కు వచ్చే ఆర్డర్లు సైతం గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు కొందరు డెలివరీ బాయ్స్ చెప్పారు. కొనసాగుతున్న దాడులు...వెల్లడవుతున్న నిర్వాకాలు... మరోవైపు జీహెచ్ఎంసీతో కలిసి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం కూడా రెస్టారెంట్లపై తమ దాడులు కొనసాగించారు. మసాబ్ ట్యాంక్‌లోని ప్యారడైజ్ బిర్యానీ సెంటర్, అస్లీ హైదరాబాదీ ఖానాలో నిర్వహించిన దాడుల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్, నిల్వ ఆహారాన్ని గుర్తించారు. కీటకాలు రాకుండా వంటగది కిటికీలకు మెష్ సైతం ఏర్పాటు చేయలేదని, పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ లేవు తదితర ఉల్లంఘనలు తేల్చారు. అలాగే ప్యారడైజ్ బిర్యానీ సెంటర్లో ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్‌లో సరైన ప్రమాణాలు లేవని గుర్తించారు. గత 4 రోజులుగా సాగుతున్న దాడుల్లో 100కిపైగా రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ జాయింట్స్, ఫుడ్ సప్లై యాప్స్..వంటివి తనిఖీలు చేసి దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూశాయి. ఇదే ప్రస్తుతం నగరవాసుల్లో బయటి తిండి అంటే భయపడేట్టుగా చేసింది. -
ప్రపంచంలోనే 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాలో రెండు భారతీయ రెస్టారెంట్లకు చోటు!
విలియం రీడ్ మీడియా ఈ ఏడాది 2024కి ప్రంపంచలోని 50 అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అందుకోసం రెస్టారెంట్ల జాబితాను మరింతగా సవరించింది. ఈ గ్లోబల్ ర్యాకింగ్స్ని సవరించి 2024కి సంబంధించిన ప్రతిష్టాత్మక ఉత్తమ రెస్టారెంట్ల జాబితాను చేసింది. అందులో రెండు భారతీయ రెస్టారెంట్లకు చోటు దక్కడం విశేషం. ఈ రెండు రెస్టారెంట్లు టాప్ 51 నుంచి 100వ ర్యాంకుల్లో స్థానాలు దక్కించుకున్నాయి. ఈ సవరించిన జాబితాలో ముంబైలోని రెండు భారతీయ రెస్టారెంట్లలలో న్యూఢిల్లీలోని ఒక రెస్టారెంట్‌కి స్థానం దక్కింది. ముంబైలోని మాస్క్ అనే రెస్టారెంట్ ఈ అంతర్జాతీయ జాబితాలో 78వ స్థానం దక్కించుకోగా న్యూఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్ మరోసారి రీ ఎంట్రీ ఇచ్చి..89వ స్థానంలో నిలిచింది. మాస్క్ రెస్టారెంట్..ఆసియాలోని 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితా ప్రకారం 2023-2024లో భారతదేశంలోని ది బెస్ట్ రెస్టారెంట్‌గా మాస్క్ నిలిచింది. ఈ రెస్టారెంట్ ఫౌండర్ అదితి దుగర్, హెడ్ చెఫ్ వరణ్ టోట్లని సారథ్యంలో కస్టమర్లకు మంచి బ్రాండెడ్ ఉత్పత్తులతో చేసిన రుచులను అందించేవారు. అంతేగాదు అందుబాటులో ఉన్న పదర్థాలతోనే మంచి రుచిని అందించేలా ఆకరషణీయంగా కనిపించేలా సర్వ్ చేస్తుంది. ఇండియన్ యాక్సెంట్, న్యూఢిల్లీ ఇది 2015 నుండి 2021 వరకు వరుసగా ఏడేళ్లు అత్యుత్తమ రెస్టారెంట్ ప్రకటించబడింది. ఇది 2024కి ఆసియాలోని 50 ఉత్తమ రెస్టారెంట్లలో 26వ స్థానంలో ఉంది.ఇది భారతీయ సమాకాలీన వంటకాలను అందించే రెస్టారెంట్‌గా పేరుగాంచింది. చెఫ్ మనీష్ మెహ్రోత్రా సారథ్యంలో రకరకాల రుచుల ఆవిష్కరణల తోపాటు సీజన్‌కు తగ్గట్టు భారతీయ సంప్రదాయ వంటకాలతో ప్రజలను మంత్రముగ్ధులను చేస్తుంది. కాగా, జూన్ 5, 2024న లాస్ వెగాస్‌లో జరిగే అవార్డుల వేడుకలో ఈ ఏడాది 2024కి సంబంధించిన 50 అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాను లైవ్‌లో ప్రకటించనుంది. (చదవండి: నటుడు వరుణ్ సూద్‌కు వచ్చిన బ్రెయిన్ ఇంజూరీ అంటే? ఎందువల్ల వస్తుంది?)a -
నాడు నాలుగు రూపాయల జీతం.. నేడు 22 రెస్టారెంట్లకు యజమాని!
ఎవరైనా సరే జీవితంలో ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుని, అందుకు అనుగుణంగా పనిలోకి దిగితే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరని అంటుంటారు. అటువంటి వారిని ఆర్ధిక ఇబ్బందులు కూడా ఏమీ చేయలేవని చెబుతుంటారు. కర్ణాటకలోని ఓ కుగ్రామానికి చెందిన సురేష్ పూజారి తాను ఏదో ఒకరోజు 22 రెస్టారెంట్లకు యజమానిని అవుతానని ఎన్నడూ అనుకోలేదు. సురేష్‌ను బాల్యంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. చదువు కొనసాగించేందుకు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. అవి 1950 నాటి రోజులు.. పదేళ్ల వయసులోనే సురేష్ పూజారి కూలీగా మారాడు. ఊరిలో పెద్దగా పనులు దొరకకపోవడంతో ముంబైకి తరలివచ్చాడు. అప్పట్లో సురేష్‌కు ముంబై గురించి ఏమీ తెలియదు. ఎలాగోలా ఓ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న చిన్న దాబాలో ఉద్యోగం సంపాదించాడు. రోజంతా అక్కడ పనిచేసినందుకు సురేష్‌కు నెలకు నాలుగు రూపాయలు అందేది.. అక్కడ రెండేళ్లు పనిచేశాడు. తర్వాత అతనికి తెలిసిన వ్యక్తి జ్యూస్ షాపులో ఉద్యోగం ఇప్పించాడు. జీతం పెద్దగా పెరగలేదు. కానీ అక్కడ పనిలో నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే సురేష్‌కు ఓ క్యాంటీన్లో ఉద్యోగం వచ్చింది. జీతం ఆరు రూపాయలకు పెరిగింది. చదువు లేకుండా ముందుకు సాగడం కష్టమని అర్థం చేసుకున్నాడు. దీంతో రాత్రిపూట పాఠశాలకు వెళుతూ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తన దగ్గరున్న కొద్దిపాటి సొమ్ముతో గిర్గామ్ చౌపటీ సమీపంలో సురేష్ ఒక చిన్న పావ్ భాజీ దుకాణాన్ని తెరిచాడు. నాటి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఒకసారి తన సురేష్ దుకాణంలో పావ్ భాజీ రుచి చూశారు. ఆ రుచి అతనికి బాగా నచ్చడంతో మళ్లీ మళ్లీ అక్కడికి రావడం మొదలుపెట్టారు. జార్జ్ ఫెర్నాండెజ్, సురేష్ పూజారి స్నేహితులు అయ్యారు. తదనంతర కాలంలో సురేష్ తయారు చేసే పావ్ భాజీకి జనం నుంచి అమితమైన ఆదరణ లభించింది. దీంతో ఆయన క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. కొద్ది కాలంలోనే అతని దుకాణాలు దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. నేడు సురేష్ పూజారి నెలకొల్పిన ‘సుఖ్ సాగర్’ రెస్టారెంట్ల గురించి తెలియనివారుండరు. దేశంలో 22కు మించిన సుఖ్ సాగర్ రెస్టారెంట్ బ్రాంచీలు ఉన్నాయి. సుఖ్ సాగర్ రెస్టారెంట్ దక్షిణ భారత ఆహారాలకు తోడు పావ్ భాజీ, పంజాబీ ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. ఐస్‌క్రీమ్ పార్లర్, షాపింగ్ మాల్, త్రీస్టార్ హోటల్ యజమానిగా సురేష్ పూజారి మారారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ సహా పలువురు స్టార్స్ సుఖ్ సాగర్ రెస్టారెంట్ రుచులను మెచ్చుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకుంటూ, వ్యాపారంలో విజయం సాధించిన సురేష్ పూజారి యువతకు స్ఫూర్తిదాయకుడనడంలో ఏమాత్రం సందేహం లేదు. -
కిచెన్‌కు టాటా.. హోటళ్ల బాట..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలికాలంలో కుటుంబాల ఆదాయం పెరుగుతోంది. జీవన శైలి మారుతోంది. భా ర్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీ నితో మన దేశంలోని కుటుంబాలు ఇళ్లలో వంట గదికి టాటా చెప్తున్నారని.. హోటళ్ల బాట పడుతు న్నారని తాజాగా ఓ సర్వేలో తేలింది. ఇంట్లో వంట చేసుకోవడానికి బద్ధకంతోపాటు వివిధ వెరైటీల ఆహారం తినాలన్న కోరిక దీనికి కారణమని వెల్లడైంది. ప్రాసెస్డ్ ఆ హారం వినియోగం భారీగా పెరిగినట్టు తేలింది. వీధివీధినా వెలసిన రెస్టారెంట్లు, హోటళ్లు, విస్తృతంగా అందుబాటులోకి ఫుడ్ డెలివరీ యాప్‌లు, నిమిషాల్లో సరుకులు తెచ్చిచ్చే గ్రోసరీ యాప్‌లు.. దీనికి మరింత ఊతమిస్తున్నట్టు వెల్లడైంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (ఎంఓఎస్పీఐ), ఐసీఐసీఐ సెక్యూరి టీస్ చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యా యి. ఆ నివేదికల్లోని గణాంకాలను పరిశీలిస్తే.. ♦ అంతకుముందటి పదేళ్లతో పోల్చితే 2022–23 ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లోని అధిక ఆదాయ వర్గాల వారు ప్యాకేజ్డ్ ఫుడ్, డైనింగ్ ఔట్, పుడ్ డెలివరీ సరీ్వసెస్ కోసమే తమ ఫుడ్ బడ్జెట్లో 50శాతానికిపైగా ఖర్చు చేశారు. గతంలో ఇది 41.2 శాతమే. ♦ మధ్యతరగతి కుటుంబాలు తమ ఆహార బడ్జెట్లో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలపై చేస్తున్న ఖర్చు 16శాతం నుంచి 25 శాతానికి (గత పదేళ్లలో) పెరిగింది. ♦ అధికాదాయ కుటుంబాలకు సంబంధించి చూస్తే.. ‘స్టేపుల్ ఫుడ్ (ముడి ఆహార పదార్థాల)’పై వ్యయం తగ్గుతోందని.. క్రమంగా వారి ఇళ్లలో వంట గదులకు పనిలేకుండా పోతోందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రిపోర్ట్ పేర్కొంది. ♦ 2022–23లో అధికాదాయ కుటుంబాల తలసరి ఫుడ్ డెలివరీ వ్యయం ఏకంగా రూ.971గా ఉంది. అదే మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల్లో తలసరి ఫుడ్ డెలివరీ ఖర్చు రూ.60గా ఉంది. ♦ గత పదేళ్లతో పోల్చితే ఇంట్లో వంట చేసుకోవడం తగ్గింది. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లడం, డెలివరీ యాప్‌ల ద్వారా తెప్పించుకోవడం బాగా పెరిగింది. ఇది రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. ♦ గత పదేళ్లలో పోల్చితే ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగించే అధికాదాయ కస్టమర్లు రెండింతలు పెరిగారు. అదే మధ్య తరగతి కస్టమర్లు మూడింతలు పెరిగారు. ♦ అధికాదాయ వర్గాల వారు.. చక్కెర శాతం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, సేంద్రియ ఆహారం, పానీయాల వంటి వాటి వినియోగం పెంచారు. మిగతా వర్గాల వారూ వాటివైపు ఆకర్షితులవుతున్నారు. ♦ డ్రైఫ్రూట్స్‌పై చేస్తున్న కుటుంబ వ్యయం పట్టణ ప్రాంతాల్లో 1.3శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 1.2శాతంగా ఉంది. ♦ పట్టణ ప్రాంత కుటుంబాల ఆదాయం పెరిగినా.. ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలపై ఖర్చు తగ్గి.. ధాన్యాలు (సెరీల్స్), కోడిగుడ్లు, చేప, మాంసం, వంటనూనె వంటి వాటి వినియోగం గతంలోని స్ధాయిలోనే ఉండిపోయింది. -
గ్రేటర్లో మరిన్ని ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మరిన్ని ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్లు అందుబాటులోకి రానున్నాయి. మద్యం ప్రియులను ఆకట్టుకొనేలా.. అన్ని సదుపాయాలతో ఆధునికత ఉట్టిపడేలా ఏర్పాటు చేసే బార్లకు అనుమతినిచ్చేందుకు ఆబ్కారీ శాఖ సన్నాహాలు చేపట్టింది. విధివిధానాలను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటి వరకు ఎలైట్ బార్లకు ఎలాంటి టెండర్లు లేకుండానే అనుమతిస్తుండగా.. కొత్తగా ఏర్పాటు చేయనున్న వాటికి టెండర్లను ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. లిక్కర్ ధరలను పెంచకుండా ఎకై ్సజ్ ఆదాయాన్ని పెంచుకొనేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఎలైట్ బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతుల ప్రతిపాదనను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. 150 బార్లకు అనుమతులు.. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 550కి పైగా రెగ్యులర్ బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో కొన్ని సాధారణ జనతా బార్లు కాగా మరికొన్ని కనీస సదుపాయాలతో సేవలందిస్తున్నాయి. ఇక ఎలైట్ బార్ల సంఖ్య 100 లోపే ఉన్నట్లు అంచనా. ఇప్పుడున్న ఎలైట్ బార్లకు అదనంగా మరో 150కి పైగా కొత్త బార్లకు అనుమతినివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ఇప్పటి వరకు రూ.లక్షల లైసెన్స్ ఫీజుతో అనుమతులిచ్చారు. కొత్తగా అనుమతించనున్న ఎలైట్ బార్లకు టెండర్లను నిర్వహించడం ద్వారా మరింత ఆదాయాన్ని ఆర్జించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం 150 వరకు బార్లకు అనుమతించాలని ప్రతిపాదించినప్పటికీ వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయమే లక్ష్యం.. ఆదాయం పెంచుకొనేందుకు గత ప్రభుత్వం లిక్కర్ ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. మరోసారి లిక్కర్ ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం వాటి ధరల జోలికి వెళ్లకుండా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం ఎకై ్సజ్శాఖను ఆదేశించినట్లు సమాచారం. ఎలైట్ బార్ అండ్రెస్టారెంట్లకు 2017లోనే జీఓ విడుదలైనప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. ప్రస్తుతం ఈ జీఓను అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.రెగ్యులర్ బార్లకు రూ.40 లక్షల చొప్పున ఫీజు వసూలు చేస్తుండగా, ఎలైట్ బార్ల ఫీజు రూ.50 లక్షల వరకు ఉంటాయి. అలాగే ఏటా 25 శాతం చొప్పున ఫీజు పెంచుతారు. ఎలైట్బార్లు రెగ్యులర్ బార్ల కంటే అదనపు సదుపాయాలతో ఉంటాయి. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎలైట్బార్లను ఏర్పాటు చేస్తారు. లిక్కర్ బాటిళ్ల కోసమే సుమారు 2000 చదరపు అడుగుల స్థలం కేటాయించాలి. బార్ మొత్తం పూర్తిగా సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయంతో ఉంటుంది. వినియోగదారులకు శుచిగా, శుభ్రంగా, అత్యంత నాణ్యమైన పద్ధతుల్లో ఆహారాలను, స్నాక్స్‌ను వండి వడ్డించేందుకు చక్కటి ఆల్ట్రామోడరన్ కిచెన్ ఉంటుంది. విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈ ప్రమాణాల మేరకు ఏర్పాటు చేసే బార్లకే ఎలైట్ అనుమతులను ఇస్తారు. ఎలైట్ వైన్స్ సైతం.. ఎలైట్ బార్ల తరహాలోనే ఎలైట్ వైన్‌షాపులకు కూడా అనుమతులనిచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 750కి పైగా వైన్‌షాపులు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని వాక్ ఇన్ వైన్స్గా నిర్వహిస్తున్నారు. మద్యం ప్రియులను ఆకట్టుకొనేవిధంగా ఏర్పాటు చేసే వాక్ ఇన్ వైన్స్ కోసం అదనంగా రూ,5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ వైన్స్ కంటే ఈ వైన్స్‌లో ఎక్కువ రకాల బ్రాండ్లకు చెందిన లిక్కర్ అందుబాటులో ఉంటుంది. కొన్ని చోట్ల వివిధ రకాల విదేశీ బ్రాండ్లను కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు నగరంలో ఎలైట్ వైన్స్ లేవు. జూబ్లీహిల్స్‌లో ఉన్న టానిక్ లిక్కర్‌మాల్ మాత్రమే ఎలైట్ వైన్ షాపుగా అనుమతిని కలిగి ఉంది. టానిక్ తరహాలోనే మరిన్ని ఎలైట్ షాపులకు అనుమతులను ఇవ్వనున్నట్లు సమాచారం. ఉన్న బార్లే దివాలా తీస్తున్నాయి కోవిడ్ కాలం నుంచి బార్లు నష్టాల్లో నడుస్తున్నాయి. గతంలో కొత్తగా అనుమతించిన 150 బార్లలో కనీసం 70 బార్లను ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. వైన్‌షాపులలో పర్మిట్ రూమ్‌లకు అనుమతినివ్వడంతో బార్లకు నష్టం వస్తోంది. ఈ పరిస్థితుల్లో మరిన్ని ఎలైట్ బార్లకు అనుమతినివ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. –శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ రెస్టారెంట్స్ అండ్ బార్ ఓనర్స్ అసోసియేషన్ కోశాధికారి -
ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే?
ఆన్లైన్లో, రెస్టారెంట్‌లోగానీ ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఏదైనా లోపం ఉన్నా, లేదా ఇంకేమైనా వెంట్రుకలు లాంటి అవాంఛిత పదార్థాల్ని, వస్తువులను గుర్తించినా, వెంటనే సంబంధిత డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేయడం, దానికి వాళ్లు సారీ చెప్పడం, లేదా ఫ్రీ మీల్ ఆఫర్ చేయడం ఇదంతా మనకు తెలిసిన కథే. అయితే ఇలాంటి ఫ్రీ మీల్స్ కోసం ఆశపడిన ఒక అమ్మడు అడ్డంగా బుక్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు కస్టమర్లు ఫిర్యాదులు ఆధారంగా వారికి నష్టపరిహారం ఫ్రీ మీల్స్ ఆఫర్ చేస్తాయి. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం కథనం ప్రకారం ఇలా ఉచిత భోజనం కక్కుర్తి పడిన బ్రిటీష్ మహిళ రెస్టారెంట్‌ను మోసం చేయాలని ప్లాన్ చేసింది. ఇంగ్లాండ్‌లోని బ్లాక్‌బర్న్‌లోని ప్రసిద్ధ తినుబండారం అయిన అబ్జర్వేటరీలో భోజనం చేస్తూ ఆహారంలో జుట్టు వచ్చిందంటూ హడావిడి చేసింది. దీంతో హోటల్ యజమాని మహిళ బీఫ్ రోస్ట్ డిన్నర్‌ను తిరిగి ఆఫర్ చేశారు. అయితే, నిఘా కెమెరాలున్నాయన్న సంగతిని ఆ మహిళ మర్చిపోయింది. కానీ రెస్టారెంట్ యజమాని మాత్రం మర్చిపోలేదు. అందుకే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే తమ హోటల్లో ఇలా జరిగిందేమిటబ్బా అని ఆందోళన చెందిన అతను ఆ తరువాత అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించాడు. దీంతో అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. వీడియోలో మహిళ జుట్టును తీసి తన భాగస్వామి సగం తిన్న ప్లేట్లో ఉంచడం క్లియర్ కనిపించింది.టామ్ క్రాఫ్ట్ దీనిపై సోషల్ మీడియాలోపోస్ట్ పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. బిజినెస్ బాబులూ బీ అలర్ట్ జాగ్రత్త ఇలాంటి వాళ్లూ కూడా ఉంటారు అంటూ ఫేస్బుక్లో CCTV ఫుటేజీని షేర్ చేశాడు. ఇది చాలా అసహ్యంగా అనిపించిందని, కేవలం 15.88 డాలర్లు(రూ. 1300) కోసం ఇంతకు దిగజారతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు తమకు ఫైవ్ స్టార్ ఫుడ్ హైజీన్ రేటింగ్ ఉందనీ, అన్ని ఆహార భద్రతా మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపాడు. నిజంగా సీసీటీవీ ఫుటేజీని గమనించకపోతే ఆమె ఆరోపణతో తన వ్యాపారం, ప్రతిష్ట గంగలో కలిసిపోయేదిగా అంటూ వాపోయాడు.. -
దుర్గాపూజ బిజినెస్.. అక్కడ రూ.1,100 కోట్లు!
ఇటీవల ముగిసిన దుర్గా పూజ ఉత్సవం అక్కడి రెస్టారెంట్లకు కాసులు కురిపించింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెంగాల్లో ముఖ్యంగా కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇళ్లలో సంప్రదాయ పిండివంటలతో పాటు పిల్లాపాపలతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి ప్రత్యేకమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఆరు రోజుల్లో రూ. 1,100 కోట్లు కోల్‌కతా నగరంలోని ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు దసరా ఉత్సవాల సందర్భంగా ఆరు రోజుల్లో రూ. 1,100 కోట్లను ఆర్జించాయి. గత సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన ఆదాయం కంటే ఈ సారి 20 శాతం అధికంగా వచ్చిందని ఈస్ట్రన్ ఇండియా హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తెలిపింది. కోవిడ్ సంక్షోభం అనంతరం అన్ని అడ్డంకులు తొలగిపోయిన తర్వాత ఇది రెండవ దుర్గా పూజ. దశమి వరకు ఆరు రోజుల పాటు తెల్లవారుజామున 3 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లు ఆహారం ఆస్వాదిస్తూ కనిపించారని ఈస్ట్రన్ ఇండియా హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుదేష్ పొద్దార్ తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ఆరు రోజుల్లో నగరంలోని రెస్టారెంట్లు రూ. 1,100 కోట్ల వ్యాపారం చేశాయని ఆయన పీటీఐ వార్తా సంస్థకు చెప్పారు. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 20-25 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. -
గుండెపోటు నాటకంతో 20 రెస్టారెంట్లకు టోకరా: చివరికి ఏమైందంటే...?
రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టేందుకు గుండె పోటు డ్రామాలు ఆడడం అలవాటుగా మార్చుకున్నాడో ప్రబుద్ధుడు. ఇలా ఒకటీ, రెండూ కాదు ఏకంగా 20 రెస్టారెంట్లలో ఇదే తంతు కొనసాగించాడు. కానీ మోసం ఎల్లకాలం సాగదు కదా. ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు. ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పెయిన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. డైలీ లౌడ్ ప్రకారం ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లడం, కడుపునిండా లాగించేయడం ఆనక మూర్ఛపోయినట్టు నటించి, గుండె నొప్పి అంటూ నైలపై దొర్లి దొర్లి హడావిడి చేయడం ఇదీ ఇతగాడి తంతు. స్పెయిన్‌లోని బ్లాంకా ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్లలో ఫ్యాన్సీ డిన్నర్ తింటాడు. సరిగ్గా బిల్లు కట్టే సమయానికి గుండెపోటు అంటూ భయంకరమైన డ్రామాకు తెర తీస్తాడు. ఇతగాడి నాటకాన్ని పసిగట్టిన సిబ్బంది అప్రమత్తమై, ఈ కేటుగాడి ఫోటోను ఆ ప్రాంతంలోని అన్ని రెస్టారెంట్లకు పంపించి వారిని కూడా అలర్ట్ చేశారు. (టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!) దీన్ని గమనించని మనోడు ఒక లగ్జరీ రెస్టారెంట్లో యథావిధిగా సుష్టిగా భోంచేశాడు. ముందుగానే అక్కడి సిబ్బంది బిల్లు ఇచ్చారు. దీంతో సుమారు రూ. 3,081 బిల్లు చెక్కు ఇచ్చి వెళ్లి పోదామని చూశాడు. పాత బిల్లు సంగతి ఏంటని నిలదీశారు. అయితే హోటల్ గదికి వెళ్లి డబ్బులు తెస్తానని చెప్పాడు. సిబ్బంది అతన్ని వదిలి పెట్టలేదు. నాటకం మొదలు పెట్టాడు. గుండెనొప్పి వస్తోంది ఆంబులెన్స్‌ని పిలవాలంటూ హంగామా చేశాడు. కానీ వాళ్లు ఆంబులెన్స్‌కు బదులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతగాడి మోసానికి చెక్ పడింది. అతని ఫోటోను అన్ని రెస్టారెంట్లకు పంపి, అరెస్ట్ చేయించామని స్థానిక రెస్టారెంట్ మేనేజర్ మీడియాకు తెలిపారు. గత ఏడాది నవంబరు 22 నుంచి ఈ వ్యక్తి ఈ నగరంలోనే ఉంటున్నాడట. (భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో) -
గడ్డకట్టిన మంచుతో భారీ రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
గడ్డకట్టిన మంచుతో శిల్పాలు చెక్కి ప్రదర్శనకు పెట్టడం చలి ప్రదేశాల్లో మామూలే! స్వీడన్లోనైతే ఏకంగా గడ్డకట్టిన మంచుతో ఒక భారీ హోటల్‌నే నిర్మించారు. ఇందులోని మంచాలు, కుర్చీలు, బల్లలు వంటివన్నీ గడ్డకట్టిన మంచుతో తయారు చేసినవే కావడం విశేషం. జేమ్స్‌బాండ్ సినిమా ‘డై ఎనదర్ డే’లో కనిపించిన భవంతి నమూనా ఆధారంగా ఈ హోటల్‌ను నిర్మించడం విశేషం. టోర్నె నదిలో గడ్డ కట్టిన మంచును తవ్వి తెచ్చి, నదికి సమీపంలోనే దీనిని ఐదువందల టన్నుల మంచుతో నిర్మించారు. ఇందులో పన్నెండు ఆర్ట్ స్వీట్రూమ్స్, ఒక డీలక్స్ స్వీట్‌రూమ్, థీమ్డ్ రూమ్‌లు, బార్ సహా పలు వసతులు ఉన్నాయి. ఈ హోటల్లో పది ఒలింపిక్ స్విమింగ్ పూల్స్, ముప్పయిమూడు చిన్న స్విమింగ్‌పూల్స్ కూడా ఉన్నాయి. లూకా రోంకొరోని నేతృత్వంలో ఇరవై నాలుగు మంది హిమశిల్పులు దీనిని నిర్మించారు. దీని లోపలి భాగంలో ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఏడాది పొడవునా అతిథులకు అందుబాటులో ఉంటుంది. -
హార్ట్ ఎటాక్ రెస్టారెంట్.. ఫుడ్ తింటే నిజంగానే గుండెనొప్పి వస్తుందేమో!
ఈమధ్యకాలంలో రెస్టారెంట్ బిజినెస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ట్రెండ్‌కు తగ్గట్లు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు హోటల్ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. డిఫరెంట్ థీమ్స్‌తో,క్యాచీ నేమ్స్‌తో వ్యాపారాన్ని బాగా విస్తరిస్తున్నారు. అయితే అమెరికాలోని ఓ రెస్టారెంట్ పేరు వింటే మాత్రం మీకు గుండెదడ వచ్చేస్తుంది. ఎందుకంటే, ఆ రెస్టారెంట్ పేరు హార్ట్ ఎటాక్. పేరుకు తగ్గట్లే హాస్పిటల్ థీమ్ మొత్తం హాస్పిటల్ మాదిరి ఉంటుంది. మరి ఈ వెరైటీ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? ఎలాంటి వెరైటీ ఫుడ్ ఐటెమ్స్ అక్కడ దొరుకుతాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు రకరకాల వెరైటీ రెస్టారెంట్ పేర్లను విన్నాం, చూశాం. కానీ ఈ రెస్టారెంట్ పేరు వింటేనే గుండెనొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రెస్టారెంటపేరు హార్ట్ ఎటాక్ రెస్టారెంట్. అక్కడి ఫుడ్ ఐటెమ్స్ తింటే నిజంగానే మీకు హార్ట్ ఎటాక్ వస్తుందేమో. ఇక్కడ దొరికే బైపాస్ బర్గర్లు తింటే ఏకంగా 10వేల క్యాలరీల శక్తి లభిస్తుంది. బైపాస్ బర్గర్ అంటే ఒకదానిపై మరొకటి పెడుతూ వాటిలో ఉంచే పదార్థాల మోతాదును కూడా పెంచుకుంటూ పోతారు. కేవలం బర్గర్లు మాత్రమే కాదు, అక్కడ దొరికే ప్రతీ ఫుడ్ ఐటెంలో కొవ్వు అతిగానే ఉంటుంది. 2005లో జాన్ బాసో అనే వ్యక్తి ఈ ''హార్ట్ ఎటాక్ గ్రిల్'' రెస్టారెంట్‌ను ప్రారంభించగా వెరైటీగా ఉండటంతో కొద్ది నెలల్లోనే ఈ రెస్టారెంట్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్లగానే రెస్టారెంట్‌కి వచ్చామా? లేక హాస్పిటల్‌కి వచ్చామా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కస్టమర్స్ పేషెంట్స్‌లా గౌనులు వేసుకొని వెళ్లాలనే రూల్ ఉంది. ఇక అక్కడి వెయిటర్స్ నర్సులు, డాక్టర్లుగా డ్రెస్ చేసుకుంటారు. అంతేకాకుండా కస్టమర్లు ఇచ్చే ఆర్డర్స్‌ను ‘ప్రిస్క్రిప్షన్’ అంటారు. ఒకవేళ ఆర్డర్ చేశాక ఫుడ్ ఐటెమ్స్ తినకపోతే మీకు శిక్ష కూడా ఉంటుంది. అదేంటంటే నర్సులు వచ్చి సరదాగా బెల్ట్‌తో కొడతారట. ఇవన్నీ వింటుంటే..పిచ్చోళ్ల గురించి వినడమే కాదు.. చూడటం ఇదే మొదటి సారి అన్నట్లు ఉంది కదా. ఈ రెస్టారెంట్లో మరో వింత ఏమిటంటే 350 పౌండ్ల కన్నా అధిక బరువున్న వాళ్లకు ఎంత తింటే అంత ఫుడ్ ఫ్రీగా పెడతారట. View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) అయితే కస్టమర్ల ఆరోగ్యాన్ని హానిచేసేలా విపరీతమైన జంక్‌ను ఎంకరేజ్ చేసేలా ఈ రెస్టారెంట్ ఉందని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో తరచూ ఈ రెస్టారెంట్ వార్తల్లో నిలుస్తుంది. అయితే అక్కడ తినడం వల్ల ఆరోగ్యానికి హానీ అని తెలిసినా కస్టమర్ల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉండటం మరో విశేషం. -
మైమ‘రుచి’!.. ప్రతి రెస్టారెంట్లోనూ స్పెషల్ మెనూ
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఆవకాయ, గోంగూర, ముద్దపప్పు, చికెన్ బిర్యానీ, పెరుగు అన్నం తినీ తినీ బోర్ కొట్టాయా? అయితే మీరు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురం ప్రాంతానికి రండి. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో లభించే స్పెషల్ వంటకాలే కాకుండా అరేబియన్, చైనా ప్రాంతాల్లో నోరూరించే రుచులు, గుజరాతీ, రాజస్థాన్, బెంగళూరు, హైదరాబాద్‌లో లభించే స్పెషల్ డిషెస్ సిద్ధంగా ఉన్నాయి. కేవలం రొటీన్ ఫుడ్ తిని బోర్ కొట్టిన ఫుడ్ లవర్స్‌కు ఈ రెస్టారెంట్ల తలుపులు తెరిచి వేడి వేడి ఆహార పదార్థాలతో ఆహ్వానం పలుకుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రతి రెస్టారెంట్లోనూ స్పెషల్ మెనూ ♦ గుజరాతీ వంటకాలను రుచి చూడాలంటే రాజ్బోగ్ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. అక్కడ గుజరాత్లో లభించే అన్ని రకాల వంటకాలూ సిద్ధంగా ఉంటాయి. రెస్టారెంట్లోకి అడుగు పెట్టగానే గుజరాతీ సంప్రదాయం ప్రకారం నుదిట బొట్టుపెట్టి మరీ లోపలకు ఆహ్వానిస్తారు. ♦ రెండు తెలుగు రాష్ట్రాల్లో లభించే తెలుగు వంటకాల కోసం యునైటెడ్ తెలుగు కిచెన్స్(యూటీకే) రెస్టారెంట్ తలుపులు తీయాల్సిందే. రాయలసీమ, కోస్తా జిల్లాలు, తెలంగాణ ప్రాంతాల్లో లభించే అన్ని రకాల వంటకాలు ఈ రెస్టారెంట్లో నిత్యం సిద్ధంగా ఉంటాయి. ♦ అరేబియన్ ఫుడ్స్ టేస్ట్ చేద్దామనుకునే వారి కోసం మొగల్రాజపురంలోనే అరేబియన్ రెస్టారెంట్ స్వాగతం పలుకుతోంది. ఆరేబియా ప్రాంతంలో కూర్చున్నట్టుగా ఇక్కడ ప్రత్యేకంగా సీట్లను ఏర్పాటు చేశారు. ♦ ఇక చైనీస్ ఫుడ్స్‌ను రుచి చూడాలంటే జమ్మిచెట్టు సెంటర్ సమీపంలోని నాన్కింగ్ రెస్టారెంట్లోకి అడుగు పెట్టాల్సిందే. ♦ మొగల్రాజపురం పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో బెంగళూరు భవన్లో ఫేమస్ టిఫిన్లు తింటుంటే నిజంగా మనం బెంగళూరులో ఉన్నామా.. అన్న భావన కలుగుతుంది. అలాగే శాంటోస్ రెస్టారెంట్లో హైదరాబాద్ బిర్యానీ, డైనర్స్ క్లబ్లో కేకులు, ఇస్‌క్రీమ్‌లు ఇలా వివిధ రకాల ఫుడ్స్ నిత్యం సిద్ధంగా ఉంటాయి. -
‘నా పొట్ట.. నా ఇష్టం’.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న రెస్టారెంట్
కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే పబ్లిసిటీ చాలా అవసరం. ట్రెండ్‌కు తగ్గట్లు కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈమధ్య రెస్టారెంట్ బిజినెస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. డిఫరెంట్ థీమ్స్‌తో,క్యాచీ నేమ్స్‌తో వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్ పేర్లు అయితే ఒక్కసారి చదివితే గుర్తుండేలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. వెరైటీ పేర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. తాజాగా మరో రెస్టారెంట్ పేరు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవలె ప్రారంభమన ఆ రెస్టారెంట్ పేరు వింటే నవ్వు ఆపుకోలేరు. లేటెస్ట్గా ‘నా పొట్ట నా ఇష్టం’ అనే రెస్టారెంట్ పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ రెస్టారెంట్ పేరుపై పలు ఫన్నీ మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ రెస్టారెంట్ రాజమండ్రిలోని దానవాయిపేటలో ఉంది. ఇదే పేరుతో మరో రెస్టారెంట్ జగిత్యాలలో ఉంది. దానిపై సరదా కవిత్వాలు అల్లేస్తున్నారు. “నా పొట్ట నా ఇష్టం” 😂 చూడూ - చూడకపో నీ ఇష్టం తినడం నా అభీష్టం 😃 నే తినకపోతే హోటెల్ వాడికి నష్టం 😪 మధ్యలో నీకేమిటి కష్టం? 🤔 భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు వినూత్న ఐడియాలతో రెస్టారెంట్ ఓనర్స్ తెగ ట్రై చేస్తున్నారు. మొదట్లో ఓ హోటల్ ప్రారంభిస్తే అక్కడి టేస్ట్, క్వాలిటీ బావుంటే ఆటోమెటిక్‌గా వ్యాపారం పుంజుకునేది. కానీ ప్రస్తుతం నిర్వాహకులు మౌత్ పబ్లిసిటీకే సై అంటున్నారు. క్రియేటివిటీతో కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ రెస్టారెంట్లకు డిఫరెంట్ పేర్లు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ప్రయత్నిస్తారు. ఇలా గతంలోనూ..తిందాంరా మామ, తిన్నంత భోజనం, పాలమూరు గ్రిల్స్, వివాహ భోజనంబు, సుబ్బయ్యగారి హోటల్, బాబాయ్ భోజనం, రాయలసీమ రుచులు, ఉలవచారు, నాటుకోడి, మాయాబజార్,రాజుగారి పులావ్, ఘుమఘుమలు,నిరుద్యోగి ఎంఏ, బీఈడి, కోడికూర చిల్లు వంటి వెరైటీ రెస్టారెంట్ల పేర్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కనిపించే వెరైటీ టైటిల్స్ - హోటల్స్ తిన్నంత భోజనం - నాగోల్ మెట్రో ఉప్పు కారం - కొండాపూర్ కోడికూర, చిట్టిగారె - జూబ్లీ హిల్స్ రాజుగారి రుచులు - కొండాపూర్ వివాహ భోజనంబు - జూబ్లీ హిల్స్ దిబ్బ రొట్టి - మణికొండ అరిటాకు భోజనం - అమీర్ పేట వియ్యాలవారి విందు - ఎల్బీనగర్ తాలింపు - అమీర్ పేట తినేసి పో - కొంపల్లి బకాసుర - AS రావు నగర్ అద్భుతః - దిల్సుఖ్ నగర్ -
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్.. 24గంటలూ తెరిచే ఉంటుంది
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ అది.. అక్కడ ఒకేసారి 5800 మంది భోజనం చేయొచ్చు. గతేడాది ఈ రెస్టారెంట్ గిన్నెస్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించింది. పగలు, రాత్రి అని తేడా లేకుండా 24 గంటలు ఈ రెస్టారెంట్ తెరిచే ఉంటుంది. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకతలు ఏంటన్నది తెలుసుకుందాం.. చుట్టూ పచ్చని కొండలు, అందమైన ప్రకృతిని చూస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకుంటూ ఘుమఘుమలాడే వంటలు తింటుంటే.. ఆ ఫీలింగే వేరు. ఇలాంటి అనుభూతిని పొందాలంటే మాత్రం పిపా యువాన్ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. హాట్‌పాట్ రెస్టారెంట్‌గా పిలవబడే ఈ రెస్టారెంట్ చైనాలోని చాంగ్క్వింగ్ పట్టణానికి సమీపంలో కొండ మధ్యలో.. అద్భుతంగా ఉంటుంది. పదో, పాతికో కాదు.. ఈ రెస్టారెంట్లో ఏకంగా ఒకేసారి 5800 మంది భోజనం చేయొచ్చు. 3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 900కు పైగా టేబుళ్లు ఈ రెస్టారెంట్లో ఉన్నాయి. ఇక్కడ ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద రెస్టారెంట్లో మనకు బుక్ అయిన టేబుల్ ఏదో తెలుసుకోవడానికి కనీసం పావుగంటైనా సమయం పడుతుంది.. మరి టేస్టీ వంటలను రుచిచూడాలంటే ఆ మాత్రం సమయం వేచిచూడక తప్పదు. చైనాలోని పాపులర్ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్లో దొరుకుతాయి. చైనాలోని పాపులర్ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్లో దొరుకుతాయి. ఇక్కడ వందలాది మంది వెయిటర్లు, వంట మనుషులు,25మంది క్యాషియర్లతో పాటు వందల మంది క్లీనింగ్ సిబ్బందిఇక్కడ ఉంటారు. 24 గంటల పాటు ఈ రెస్టారెంట్ తెరిచే ఉంటుంది. ముఖ్యంగా రాత్రిళ్లు ఇక్కడికి వచ్చే కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.విద్యుత్ దీపాల వెలుగుల్లో రెస్టారెంట్ మరింత అందంగా కనిపించడమే దీనికి కారణమని చెబుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. -
తీరంలో తనివితీరా!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: సముద్రతీర ప్రాంతానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాల రామాపురం, ఓడరేవు, పాండురంగాపురం బీచ్‌లను చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గతంతో పోలిస్తే సముద్ర తీరం చూసేవారి సంఖ్య మరింతగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి నిత్యం సందర్శకులు బీచ్‌లకు తరలివస్తున్నారు. వారాంతంలో సందర్శకుల సంఖ్య రెట్టింపునకు మించి ఉంటోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడి బీచ్‌లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాఖ, గోవా, చెన్నైలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి బాపట్ల, చీరాల బీచ్‌లు మరింత దగ్గరగా ఉన్నాయి. రైల్వేతో పాటు ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. సొంత వాహనాలే కాకుండా రైల్లో రావాలనుకునేవారికి మరింత అనుకూలంగా ఉంది. ఖర్చుకూడా తక్కువవుతుండటంతో ఇక్కడ సందర్శకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్‌లో చీరాల, బాపట్ల తీరప్రాంతంలోని బీచ్‌లకు రోజుకు 50 వేలకు మించి సందర్శకులు వస్తున్నారు. మిగిలిన రోజుల్లోనూ 20 వేల మందికి తగ్గకుండా వస్తున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి, నరసరావుపేటలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి, బాపట్లలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీరభావన్నారాయణస్వామి, పొన్నూరులోని శ్రీ ఆంజనేయస్వామి లాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఈ ప్రాంతంలో ఉండటంతో సందర్శకులు అటు దేవాలయాలను, ఇటు బీచ్‌లను చూసుకుని వెళుతున్నారు. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట.. తీరంలో సందర్శకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇక్కడ పర్యాటకాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. తీరప్రాంతానికి రోడ్లు వేసి రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చింది. తీరప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో సొంతంగా రిసార్టుల నిర్మాణానికి సిద్ధమైంది. పెరిగిన రిసార్ట్లు బీచ్‌లకు సందర్శకులు పెరగడంతో అంతే స్థాయిలో ఇక్కడ రిసార్టులూ పెరుగుతున్నాయి. బాపట్ల సూర్యలంకలో 32 రూమ్‌లతో హరిత రిసార్ట్స్ హోటల్ ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో రిసార్ట్స్ ఏర్పాటు చేసింది. రోజూ 90 శాతం రూమ్‌లు ఫుల్ అవుతుండగా.. వీకెండ్స్‌లో వందశాతం నిండిపోతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో రద్దీ 50 శాతానికి పైగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గతంలో నెలకు రూ.20 లక్షల వ్యాపారం జరగ్గా.. ఇప్పడది రూ.40 లక్షలకు పెరిగిందని హరిత రిసార్ట్స్ మేనేజర్ చెప్పారు. హరిత రిసార్ట్స్‌లో రోజుకు రూమ్‌రెంట్ రూ.2,500 నుంచి 4,500 వరకూ ఉంది. ఇక ఈ ప్రాంతంలో గోల్డెన్శాండ్, వీ.హోటల్ , సీబ్రీజ్, రివేరా తదితర పేర్లతో వందలాది రూమ్‌లతో కార్పొరేట్ స్థాయి ప్రైవేటు రిసార్ట్స్‌లు పెద్ద ఎత్తున వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌రెంట్ రూ.10 వేల నుంచి 20 వేల వరకూ ఉంది. ఆన్లైన్ బుకింగ్స్‌తో ఇవి నిత్యం నిండిపోతున్నాయి. ఇక సాధారణ స్థాయిలో వందలాదిగా రిసార్ట్లు వెలిశాయి. వీటిల్లో రోజుకు రూమ్‌కు రూ.3 వేలకు పైనే రెంట్ ఉంది. చీరాల, బాపట్ల పట్టణాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా హోటళ్లు వెలిశాయి. బీచ్‌ల ఎఫెక్ట్‌తో అన్నీ నిత్యం రద్దీగా ఉంటున్నాయి. నాణ్యంగా ఫుడ్ ఉంటుందని పేరున్న హోటళ్లకు మరింత డిమాండ్ ఉంది. గోవా బీచ్ కన్నా బాగుంది సూర్యలంక బీచ్ గోవా బీచ్ కన్నా బాగుంది. ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది. మొదటిసారి సూర్యలంక బీచ్‌కు వచ్చాం. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది. బీచ్ పరిశుభ్రంగా ఉంది. సెక్యూరిటీ కూడా బాగుంది. – సాద్, అతీఫ్, అమాన్అలీ, నాసిద్.. హైదరాబాద్ ఖర్చు చాలా తక్కువ రైలు సౌకర్యం అందుబాటులో ఉండటంతో చీరాల, బాపట్ల బీచ్‌లకు రాగలుగుతున్నాం. ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతోంది. బీచ్ చాలా బాగుంది. ప్రైవేటు రిసార్ట్‌లలో అద్దె చాలా ఎక్కువగా వసూలు చేస్తున్నారు. – నవీన్, ప్రభాకర్, అజయ్.. మిర్యాలగూడ మూడేళ్లుగా మరింత రద్దీ సూర్యలంక, చీరాల ప్రాంతంలోని బీచ్‌లకు సందర్శకులు పెరిగారు. మూడేళ్లుగా పర్యాటకుల రద్దీ మరింతగా పెరిగింది. సోమవారం నుంచి గురువారం వరకు 90 శాతం రూమ్‌లు బుక్ అవుతుండగా.. శుక్రవారం నుంచి ఆదివారం వరకు 100 శాతం బుక్ అవుతున్నాయి. హోటల్ వ్యాపారం మరింతగా వృద్ధి చెందింది. రద్దీ పెరగడం వల్లే ఈ ప్రాంతంలో రిసార్టులు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. – నాగభూషణం, మేనేజర్, హరిత రిసార్ట్స్ -
రెస్టారెంట్లలో సర్వీస్ చార్జ్ చెల్లిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు వంటి వాటికి వెళ్లినప్పుడు కొన్నింటిలో అక్కడ తిన్నవాటికి, తాగినవాటికి బిల్‌తో పాటు అదనంగా సర్వీస్ చార్జ్ వసూలు చేస్తుంటారు. చాలా మంది ఇది తప్పనిసరేమో అనుకుని మారు మాట్లాడకుండా కట్టేసి వస్తుంటారు. అయితే ఈ సర్వీస్ చార్జ్ అన్నది తప్పసరా.. కాదా.. అని మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా తాజా స్పష్టత ఇచ్చింది. గత వారం నోయిడాలోని ప్రముఖ స్పెక్ట్రమ్ మాల్లోని ఒక రెస్టారెంట్లో హింసాత్మక ఘటన జరిగింది. అక్కడికి వచ్చిన ఓ కుటుంబానికి, రెస్టారెంట్ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రెస్టారెంట్ వేసిన సర్వీస్ ఛార్జీని చెల్లించడానికి నిరాకరించడంతో రెస్టారెంట్ సిబ్బంది కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించారు. మాల్ లోపల జరిగిన హింసాత్మక ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సర్వీస్ ఛార్జ్‌కు సంబంధించి దేశంలో ఉన్న చట్టాలు, రెస్టారెంట్లు, బార్ బిల్లులపై సర్వీస్ ఛార్జీలు చెల్లించడం తప్పనిసరి కాదా అనే దానిపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాల్లో జరిగిన ఘర్షణను దృష్టిలో ఉంచుకుని రెస్టారెంట్, బార్లలో సర్వీస్ ఛార్జీల చెల్లింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదా? డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలు చెల్లించాలని కస్టమర్లను బలవంతం చేయకూడదు. ఎందుకంటే దీనిని విచక్షణా ఛార్జ్ అని పిలుస్తారు. అంటే తన విచక్షణ మేరకు రెస్టారెంట్ లేదా బార్లలో అందించిన సేవతో సంతృప్తి చెందితేనే దీన్ని చెల్లిస్తారు. వారి సేవతో సంతృప్తి చెందకపోతే బలవంతంగా విధించకూడదు. దీనర్థం రెస్టారెంట్, బార్ బిల్లుల్లో సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదు. ఇదీ చదవండి: Fact Check: బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.30వేలకు మించితే క్లోజ్! నిజమేనా? -
ప్రపంచంలోని టాప్ 10 ఖరీదైన రెస్టారెంట్లు
-
మాకు తిరుగులేదు..ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో అదరగొట్టేస్తున్నాం!
న్యూఢిల్లీ: స్విగ్గీ ఫుడ్ వ్యాపారం లాభాల్లోకి ప్రవేశించినట్టు కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజేటి ప్రకటించారు. కంపెనీ ఏర్పాటైన తొమ్మిదేళ్ల లోపే ఈ మైలురాయిని చేరుకున్నామని, అంతర్జాతీయంగా ఈ ఘనత సాధించిన కేవలం కొన్ని కంపెనీల్లో స్విగ్గీ ఒకటిగా ఉన్నట్టు తెలిపారు. ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్లకు వెళ్లి తినడం పట్ల తాము బుల్లిష్‌గా ఉన్నట్టు బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. వచ్చే రెండు దశాబ్దాల కాలానికి వృద్ధి సామర్థ్యాల పట్ల స్విగ్గీ ఎంతో ఆశావహంగా ఉందని ప్రకటించారు. ఫుడ్ డెలివరీలో ఇక ముందూ వృద్ధిని కొనసాగిస్తామన్నా రు. ‘‘ఆవిష్కరణలపై మా తీక్షణ దృష్టి, బలమైన నిర్వహణ మరో మైలురాయిని చేరుకోవడానికి తోడ్పడ్డా యి. 2023 మార్చి నాటికి స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారం లాభదాయంగా మారింది (అన్ని వ్యయాలు కలిపి చూసుకుంటే)’’అని శ్రీహర్ష వెల్లడించారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో సాయపడిన భాగస్వాములు అందరికీ అభినందనలు తెలిపారు. కస్టమర్లతో స్విగ్గీకి బలమైన అనుబం ధం ఉన్నట్టు చెప్పారు. పరిశ్రమలోనే మెరుగైన రిపీట్, రిటెన్షన్ (కస్టమర్ల నుంచి మళ్లీ ఆర్డర్లు పొందడం, కస్టమర్లను నిలబెట్టుకోవడంలో) రేటు ను కలిగి ఉన్నట్టు చెప్పారు. ద్వితీయ, తృతీ య శ్రేణి పట్టణాల్లో కస్టమర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. స్విగ్గీతో రెస్టారెంట్ భాగస్వాముల అనుభవం కూడా మెరుగ్గా ఉందంటూ, ఇది పరస్పర విజయంగా పేర్కొన్నారు. ఆరంభంలోనే ఉన్నాం: 2014లో స్విగ్గీ ఫుడ్ డెలివరీని ప్రధాన వ్యాపారంగా మొదలు పెట్టినప్పడు, చాలా మంది దీన్ని గిట్టుబాటు కాని వ్యాపార నమూనాగా భావించినట్టు శ్రీహర్ష తెలిపారు. కానీ, ఇంత కాలం తాము చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం మొదలైందన్నారు. ‘‘ఈటింగ్ అవుట్ (రెస్టారెంట్లతో తినడం/డైన్ అవుట్), ఫుడ్ డెలివరీ వ్యాపారం భారత్‌లో ఇంకా ఆరంభ దశలోనే ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. వచ్చే రెండు దశాబ్దాల పాటు వృద్ధి పట్ల ఆశాభావంతో ఉన్నాం. ఫుడ్ డెలివరీ మరింత వృద్ధి చెందేందుకు బాధ్యతాయుత, కావాల్సిన చర్యలు చేపడతాం. దేశంలో ఇంకా సేవలు అందని ప్రాంతాలు, వినియోగ వర్గాలు చాలానే ఉన్నాయి. సరైన విభాగాల్లో పెట్టుబడులు పెడుతూ పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిని సాధించడమే మా లక్ష్యం’’అని శ్రీహర్ష తెలిపారు. క్విక్‌కామర్స్ వ్యాపారం విషయంలోనూ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు ప్రకటించారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నేడు క్విక్ కామర్స్‌లో ప్రముఖ సంస్థగా ఉన్నట్టు చెప్పారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ముగిసినట్టేనని స్పష్టం చేశారు. ఇన్‌స్టామార్ట్‌ను లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా మంచి పురోగతి సాధించామని, వచ్చే కొన్ని వారాల్లో తటస్థ స్థితికి చేరుకుంటామన్నారు. డైన్ అవుట్ విభాగంలోనూ తాము లీడర్‌గా ఉన్నట్టు చెప్పారు. 34 పట్టణాల్లో తమకు 21,000 రెస్టారెంట్ భాగస్వాములు ఉన్నట్టు తెలిపారు. -
నూనె మళ్లీ మళ్లీ మరిగించొద్దు.. చెడు కొలెస్ట్రాల్‌తో గుండెకు ముప్పు.. ఇంకా..
సాక్షి, అమరావతి: వంద లీటర్ల నూనెను వినియోగించి వంట చేస్తే 25 లీటర్లు మిగులుతుంది. సాధారణంగా మిగిలిన నూనెను మళ్లీ మళ్లీ మరిగించి వంటకు వాడుతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఈ అంశంపై హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు అవగాహన కల్పిస్తూ.. వాడిన వంట నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించేలా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం చర్యలు తీసుకుంటోంది. ఇలా గత ఏడాదిలో 1,00,257 లీటర్ల వాడిన వంట నూనెను బయో డీజిల్ తయారీ ఏజెన్సీలకు సరఫరా అయ్యేలా చేశారు. రోజుకు 50 లీటర్లకు మించి వంట నూనెను వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాల తయారీ సంస్థలు జాతీయ ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ)లో రిజిస్టరై ఉన్నాయి. ఇలా రిజిస్టరైన సంస్థలన్నీ ఒకసారి వాడిన నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. టీపీసీ 25 శాతానికి మించితే ఆరోగ్యం హుష్ మార్కెట్లో నూనెలు ఎక్కువగా వాడే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇతర ఆహార పదార్థాలకు అధిక డిమాండ్ ఉంటోంది. సాధారణంగా కంపెనీ నుంచి తయారై వచ్చిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 5 నుంచి 7 శాతం ఉంటుంది. ఆయిల్‌ను మరిగించే కొద్దీ టీపీసీ పెరుగుతూ ఉంటుంది. టీపీసీ మోతాదు 25 శాతానికి మించితే ఆరోగ్యానికి చాలా హానికరం. టీపీసీ మోతాదు పెరిగేకొద్దీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీనివల్ల రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తోంది. ఇలా వాడటం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏజెన్సీలే సేకరిస్తాయి రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ (రూకో) విభాగంలో బయోడీజిల్‌ను తయారు చేసే అనుమతులు ఉన్న ఏజెన్సీలు గుంటూరు, విశాఖ, కాకినాడ నగరాల్లో ఐదు ఉన్నాయి. ఈ ఏజెన్సీలు రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో వాడిన వంట నూనెను సేకరిస్తున్నాయి. ఏజెన్సీల నిర్వాహకులే హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద ఖాళీ డబ్బాలను అందుబాటులో ఉంచుతారు. ఆ డబ్బాల్లోకి వాడిన నూనెను నింపి సమాచారం ఇస్తే తీసుకునివెళతారు. మార్కెట్లో నూనె ధరలకు అనుగుణంగా సేకరించే వాడిన నూనెకు ఏజెన్సీలు డబ్బు చెల్లిస్తాయి. ప్రస్తుతం లీటర్‌కు రూ.40 నుంచి రూ.50 వరకూ చెల్లిస్తున్నారు. రెండోసారి వాడితే చెడు కొలెస్ట్రాల్ తప్పదు నూనెను ఒకసారి ఉపయోగిస్తే అందులోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్టే. తిరిగి ఆ నూనెను వేడి చేస్తే అది చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. నూనెల్ని రెండోసారి వాడితే గుండె జబ్బులే కాకుండా ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఒకసారి వాడిన నూనెను తిరిగి ఉపయోగిస్తే.. ఆహారం విషతుల్యమవుతుంది. దీనిని భుజిస్తే కడుపులో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. -
ఆకలైతుందా.. తినేసిపో! అంతేరా! దా–తిను!
రెస్టారెంట్ల వ్యాపారంలోకి దిగుతున్నవారు.. భోజన ప్రియుల్ని, ఇంట్లో వంటకు విరామం ఇచ్చి వెరైటీగా హోటల్లో తిందామనుకుని వచ్చే వారిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హంగులు, ఆర్భాటాలతో మెప్పించేవారు కొందరైతే, వినూత్నమైన ఆలోచనలతో థీమ్ బేస్డ్ రెస్టారెంటుల ఏర్పాటు వైపు మరికొందరు మొగ్గుచూపుతున్నారు. ఇంకొందరు మాత్రం..తమ రెస్టారెంట్లు, టేక్ అవేలు, కర్రీ, బిరియానీ పాయింట్లకు..ప్రత్యేక ప్రాంతం, వంటకం, రుచి, అంకెలు, అక్షరాలు ఆధారంగా పేర్లు పెట్టేస్తున్నారు. మనం రోజువారీ ఉపయోగించే కొన్ని పదాలు, వాక్యాలు కూడా రెస్టారెంట్ల పేర్లుగా మారిపోతున్నాయి. వీటిల్లో కొన్ని సరదాగా ధ్వనించే, నవ్వు పుట్టించే పేర్లు కూడా ఉంటుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ తరహా ట్రెండ్ ఇటీవల బాగా పెరిగిపోయింది. – సాక్షి, సిటీడెస్క్ ఉడిపి, విలాస్, మిలటరీ స్థానంలో.. ► గతంలో చాలా హోటళ్లకు అన్నపూర్ణ, అజంతా లాంటి సాధారణ పేర్ల తర్వాత ఉడిపి అనో, విలాస్ అనో, మిలటరీ హోటల్ అనో ఉండేది. దేవుళ్లు, కుటుంబసభ్యులు, పిల్ల లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు కలిసొచ్చేలా పెట్టేవారు. ఇప్పుడ లాంటి పేర్లకు చాలావరకు కాలం చెల్లింది. కొత్త, వింతైన, సరదా పేర్లదే హవా. గ్రేటర్ హైదరాబాద్‌లో అలాంటి పేర్ల మీద ఓ లుక్కేద్దామా.. అన్ని రుచులూ ఇక్కడే.. ఉప్పు కారం (కొండాపూర్), పెప్పర్ అండ్ సాల్ట్ (షేక్‌పేట్), సిల్వర్ సాల్ట్ (బంరాహిల్స్), సాల్ట్ అండ్ పెప్పర్ (లక్డీకాపూల్), టామరిండ్ ట్రీ (చింతచెట్టు (సికింద్రాబాద్), టామరిండ్ (మణికొండ), రాయలసీమ రుచులు (చాలాచోట్ల ఉంది), తెలు గింటి రుచులు (కూకట్పల్లి), రాజుగారి రుచులు (కొత్తగూడ), గోదావరి రు చులు (జూబ్లీహిల్స్), నెల్లూరు రుచులు (మోతీనగర్), రాయలవారి రుచులు (యూసుఫ్‌గూడ), కోనసీమ వంటిల్లు (కూకట్పల్లి), కృష్ణపట్నం (బంజారాహిల్స్), సింప్లీ సౌత్ (జూబ్లీహిల్స్), సింప్లీ తెలంగాణ (కొత్తపేట్), మా పల్లె వంటకాలు (గచ్చిబౌలి). వంటకాలనూ వదలకుండా.. కోడికూర–చిట్టిగారె (జూబ్లీహిల్స్, కొండాపూర్), దిబ్బరొట్టి (మణికొండ), రాజుగారి పులావ్, పొట్లం పులావ్ (శ్రీనగర్ కాలనీ), పకోడా పాపారావు (కేపీహెచ్‌బీ ఫేజ్–1), ఉలవచారు (జూబ్లీహిల్స్), ముద్దపప్పు ఆవకాయ అండ్ మోర్ (గచ్చిబౌలి), నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు (కేపీహెచ్‌బీ, మణికొండ), పంచెకట్టు దోశ (ప్రగతినగర్), పులిహోరాస్ (మణికొండ), బిరియానీ వాలా, బిర్యానీ హౌస్ (బంజారాహిల్స్), కిచిడీ ఎక్స్‌ప్రెస్ (మాదాపూర్). ఆహా.. ఏమి పేర్లు.. ► వివాహ భోజనంబు (సికింద్రాబాద్, బంజారాహిల్స్), వియ్యాలవారి విందు (కొత్త పేట్), అద్భుత: (దిల్సుఖ్నగర్), తినే సిపో (కొంపల్లి), తిన్నంత భోజనం (ఉప్ప ల్, సికింద్రాబాద్), దా–తిను (హఫీజ్‌పేట), పొట్ట నింపు (గుండ్ల పోచంపల్లి), కడుపు నిండా (ఉప్పల్), భలే బంతి భోజనం (మియాపూర్), రా బావా తిని చూడు (కూకట్పల్లి), సెకండ్ వైఫ్, పందెం కోడి (వెంగళరావునగర్), అంతేరా (జూబ్లీహిల్స్), ఆకలైతుందా?.. పంచభక్ష్య (కూకట్పల్లి), మాయా బజార్ (కార్ఖానా), పందెం కోడి (వెంగళరావునగర్), విలేజ్ వంటకాలు, ఆహా (షేక్‌పేట), పాకశాల (కూకట్పల్లి), విస్తరాకు, అరిటాకు భోజనం (అమీర్‌పేట), లలితమ్మగారి భోజనం (బంజారాహిల్స్), బాబాయ్ భోజనం (నేరేడ్మెట్), తాళింపు (అమీర్‌పేట), గోంగూర (బంజారాహిల్స్), ఘుమఘుమలు (మాదాపూర్). ప్రాంతీయతకు ప్రతిరూపం..‘అంతేరా’ రెస్టారెంట్ ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రాంతీయత ప్రతిబింబించేలా పేరు పెట్టాలనుకున్నాం. ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ’ఆంధ్రా తెలంగాణ రాయలసీమ’ సమ్మేళనంతో ఆ పేర్ల లోని మొదటి అక్షరాలతో ‘అంతేరా’పేరును ఎంచుకున్నాం. ఈ మూడు ప్రాంతాల రుచులను అందిస్తున్నాం. – నిర్వాహకులు,అంతేరా రెస్టారెంట్ థీమ్‌తో ఫామ్‌లోకి.. ► కొందరు నిర్వాహకులు థీమ్/కాన్సెప్ట్ బేస్డ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తూ భోజనప్రియుల్ని ఆకర్షిస్తున్నారు. రైలు, గుహలు, అడవులు, పల్లె వాతావరణం, జైళ్లు, బీచ్ ఆధారంగా చేసుకుని రెస్టారెంట్లు వెలుస్తుండటం గమనార్హం. గుహను తలపించేలా ఏర్పాటు చేసిన గుఫా ఓహ్రీస్ (బషీర్‌బాగ్), అడవి వాతావరణాన్ని తలపించేలా ఏర్పా టు చేసిన మారేడుమిల్లి (గచ్చి బౌలి), జైలును గుర్తుకు తెచ్చే జైల్ మండి (చాలాచోట్ల ఉంది).. ఖైదీ కిచెన్ (బంజారాహిల్స్), రైల్లో ఉన్నట్టుగా ఉండే జర్నీ 1853 (బంజారాహిల్స్) ఈ కోవలోనివే. ఇక బొమ్మ రైలు మీద భోజనం రావడం (ప్లాట్‌ఫామ్ 65), రోబో ఆహారం సర్వ్ చేయడం (రోబో కిచెన్, జూబ్లీహిల్స్) లాంటి ప్రత్యేకతలతో కూడిన రెస్టారెంట్లు కూడా నగరంలో వెలిసి కస్టమర్లను అలరిస్తున్నాయి. వియ్యాలవారి విందు. బహు పసందు మా హోటల్లో అన్నీ ప్రత్యేక వంటకాలే. తెలుగు రుచులు మా సొంతం. వెరైటీగా ఉంటుందని వియ్యాలవారి విందు పేరు పెట్టాం. అందరూ వియ్యాల వారిని ఏ లోటు లేకుండా ఎలా చూసుకుంటారో అదే తరహాలో ఆతిథ్యం ఇస్తున్నాం. – సీహెచ్ఆర్వీ నర్సింహారెడ్డి, వియ్యాల వారి విందు నిర్వాహకుడు బావలకు ఇచ్చే మర్యాదే ఇస్తాం ఇంటికి వచ్చిన బావకి ఏ విధంగా మర్యాద చేస్తారో అదే విధంగా మా హోటల్‌కు వచ్చినవారికి ఇస్తాం. ఈ ఆలోచనతోనే ‘రా బావా.. తిని చూడు’అని మా హోటల్‌కి పేరు పెట్టాం. – రామకృష్ణారెడ్డి, ‘రా బావ తిని చూడు’యజమాని అక్షరాలు, నంబర్లు.. ► మండీ 36 (జూబ్లీహిల్స్), 1980 మిలటరీ హోటల్ (మణికొండ, సైనిక్‌పురి),అంగారా 5 (బంజారాహిల్స్), శ్యాల 95ఏ (మాదా పూర్), వై2కే (పంజగుట్ట), ఎన్ గ్రాండ్ (కార్ఖానా), ఎం గ్రాండ్ (వనస్థలిపురం), బీ ప్లేస్ (అయ్యప్ప సొసైటీ), డీ కార్పెంటర్ (మాసబ్‌ట్యాంక్), ఏ2జెడ్ (జీడిమెట్ల). కడుపారా ’తిన్నంత భోజనం’.. ‘తిన్నంత భోజనం’లో ఆత్మీయత, అనుబంధం కనిపిస్తుంది. మా వద్దకు వచ్చే కస్టమర్ మాకు బంధువుతో సమానం. చుట్టాల ఇంటికి వెళితే కడుపు నిండా అన్నం పెట్టి తమ ప్రేమను చాటుకుంటారు. మా రెస్టారెంట్‌కు వచ్చినా అంతే. – గాంధీ మిర్యాల, తిన్నంత భోజనం వ్యవస్థాపకులు -
రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త
కర్నూలు: జిల్లాలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో పాచిపోయిన ఆహార పదార్థాలను వేడి చేసి వడ్డిస్తున్నట్లు తేలింది. బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాల నాణ్యతపై ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు.. ఆ విభాగం కర్నూలు ప్రాంతీయ అధికారి తిరుమలేశ్వరరెడ్డి నేతృత్వంలో శనివారం కర్నూలు జిల్లాలోని పలు రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి. కుళ్లిన కూరగాయలు వినియోగించడం, పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నట్లు గుర్తించారు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మాంసాహార పదార్థాలు రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి అవసరమైనప్పుడు తీసి ఉడికించడం, లేదంటే వేడి చేసి మసాలాలు, రంగులు కలిపి రుచికరంగా తయారు చేసి అందిస్తున్నట్లు గుర్తించి పలు హోటళ్లు, రెస్టారెంట్లకు జరిమానాలు విధించారు. విజిలెన్స్ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతలు, శానిటరీ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐలు నాగరాజు యాదవ్, కేశవరెడ్డి, ఏఏఓ షణ్ముఖ గణేష్, ఏజీ సిద్ధయ్య, ఎఫ్ఎస్ఓ శేఖర్‌రెడ్డి, రాముడు, తూనికలు కొలతల శాఖ అధికారి కుమార్, అనిల్ తదితరులు బృందాలుగా ఏర్పడి కర్నూలుతో పాటు కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. కర్నూలులోని ల్యాటిట్యూడ్ రెస్టారెంట్లో ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టి అవసరమైనప్పుడు వేడి చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే రెడ్ ఫుడ్ కలర్ వాడినట్లు గుర్తించి రూ.5 వేలు జరిమానా విధించారు. అలాగే కర్నూలులోని మసాలా బౌల్ హోటల్, నాగార్జున పార్క్ లేన్ బేకర్స్‌లో వంటశాల అపరిశుభ్రంగా ఉండడంతో రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. బావార్చీ మల్టీ రెస్టారెంట్లో ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో ఉంచి వేడిచేసి వినియోగిస్తున్నందుకు రూ.10 వేలు, అనిల్ బార్ అండ్ రెస్టారెంట్లో సరైన శుభ్రత లేని కారణంగా రూ.5 వేలు అపరాధ రుసుం విధించారు. అలాగే కోడుమూరు రెడ్డీస్ హోటల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించి 6ఏ కేసు నమోదు చేశారు. అలాగే కోడుమూరులోని శివ హోటల్లో వాటర్ బాటిళ్లు ఎంఆర్పీ కంటే రూ.5 అధికంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి తూనికలు కొలతల శాఖ అధికారులు రూ.2 వేలు ఫైన్ వేశారు. ఎమ్మిగనూరులోని అమృత బార్ అండ్ రెస్టారెంట్, గ్రాండ్ మహల్ హోటళ్లలో వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి రూ.10 వేలు, రూ.2 వేలు అపరాధ రుసుం విధించారు. చదవండి: చదివింది ఏడో తరగతి.. వామ్మో ఈమె మామూలు లేడీ కాదు.. షిఫ్ట్ కారులో వచ్చి.. -
మీరు తింటున్న చికెన్ బిర్యానీలో ఏముందో తెలుసా?.. భయంకర వాస్తవాలు
సాక్షిప్రతినిధి, కర్నూలు: మనం తింటున్న బిర్యానీలో మెటానియల్ ఎల్టో, టార్ట్రాజిన్ అనే రసాయనాలు కలుపుతున్నారు. దీంతో పాటు టేస్టింగ్‌సాల్ట్ (చైనాఉప్పు) తప్పనిసరి. వీటి వినియోగంతో బిర్యానీలో మంచి రుచి, రంగు వస్తోంది. కానీ వరుసగా 40 రోజులు తింటే కీళ్లనొప్పులు, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ►రెస్టారెంట్లకు వెళ్లినా, డిన్నర్లకు వెళ్లినా ఐస్‌క్రీం తినడం తప్పనిసరి. చివరకు ఫ్యామిలీ ప్యాక్‌లను ఇళ్లలో ఫ్రిజ్‌లలో ఉంచి తింటున్నారు. వీటిలో కొవ్వుశాతం మరీ తక్కువగా ఉన్న పాలను వినియోగించడంతో పాటు టార్ట్రాజిన్, రంగులు కలుపుతారు. ఐస్‌క్రీం గడ్డకట్టేందుకు రసాయనాలు వినియోగిస్తారు. పిల్లలకు ఎంతో ప్రేమతో వీటిని తినిపిస్తుంటాం. ఇవి ప్రాణాంతక వ్యాధులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ►దీర్ఘకాలం బేకరీలలో సిల్వర్ పూతతో ఉండే స్వీట్లు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సిల్వర్ పూతలో సీసం ఎక్కువగా ఉంటుంది. స్వీట్లలో వాడే సన్‌సెటన్, కాట్రాజ్, బ్రిలియంట్ ఎల్లో, టార్ఫిజిన్ కూడా హానికరమే. ►ఆపిల్ ఎక్కువ కాలం నాణ్యంగా ఉండేందుకు కంటికి కనిపించని మైనపుపూత పూస్తారు. అలాగే పురుగుమందులు పిచికారీ చేస్తారు. శుభ్రం చేయకుండా తింటే వీటితో కూడా ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం ►రోడ్డు సైడ్ తయారు చేసే పానీపూరి, గోబీతో పాటు అన్ని రకాల వంటల్లో టేస్టింగ్‌సాల్ట్, ఇతర రసాయనాలు కలుపుతున్నారు. రుచికోసం, మంచి రంగు కోసం, ఎక్కువ కాలం నిల్వ కోసం ఇలాంటి వాటిని వాడుతున్నారు. ఈ ఆహార పదార్థాలు తిన్న వారు ప్రమాదకర జబ్బుల బారిన పడుతున్నారు. ►ఆహార పదార్థాల అమ్మకం, వినియోగం జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆహార భద్రతా వ్యవస్థ వైఫల్యంతో కల్తీలకు అడ్డుపడటం లేదు. ఉమ్మడి జిల్లాలో 2018–19లో ఫుడ్‌సేప్టీ’(ఆహార భద్రత) అధికారులు 374 శాంపిల్స్ సేకరించి, 54 నాణ్యతలేనివిగా తేల్చారు. అలాగే 36 శాంపిల్స్ ఆరోగ్యానికి తీవ్ర హానికరమైనవిగా తేల్చి కేసులు నమోదు చేశారు. 2020–21లో 175 శాంపిల్స్ సేకరిస్తే ఐదు నాణ్యత లేనివని, ఎనిమిది నకిలీవని, ఒకటి హానికరమని తేల్చారు. 2021–22లో 313 శాంపిల్స్ తీస్తే ఇందులో ఐదు నాణ్యత లేనివి, రెండు ప్రమాదకరమైనవి, నాలుగు నకిలీవి ఉన్నట్లు నిర్ధారించారు. ఉమ్మడి జిల్లాలో చిన్నా పెద్దా హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు, చాట్, నుడుల్స్ షాపులు అన్ని కలుపుకుని ఆరు వేలకు పైగా ఉన్నాయి. కర్నూలు నగరంలోనే 1500 దాకా ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఆహారానికి సంబంధించిన అన్ని వ్యాపారాలకు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ లైసెన్స్ మంజూరు చేయాలి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న చిన్న, మధ్యతరగతి హోటళ్లలో 20 శాతానికి మించి అనుమతులు లేవు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఫుడ్‌సేప్టీ అధికారుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో తనిఖీలు, కేసుల నమోదుకు ఇబ్బందిగా మారింది. కేసులు నమోదు చేస్తే చార్జ్‌షీటు నుంచి కోర్టు కేసుల వరకూ తిరిగేందుకు కూడా సిబ్బంది లేరు. దీంతో కేసుల నమోదుకు ఈ శాఖ కూడా ఆసక్తి చూపడటం లేదు. నిబంధనల మేరకు ఏడాదికి నిర్వహించాల్సిన మేరకు శాంపిల్స్ తీసి మ.మ. అనిపిస్తున్నారు. రోజుల తరబడి నిల్వ.. ఫుడ్‌సేప్టీ అధికారులు పలు మండీల్లోని పండ్లు ల్యాబ్‌కు పంపారు. ఇందులో 13 శాంపిల్స్ ప్రమాదరకంగా తేల్చారు. ఇందులో ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, సపోటతో పాటు పలు రకాల పండ్లు ఉన్నాయి. పండ్లు మాగేందుకు వాడే రసాయనాలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. అలాగే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్, మటన్, రొయ్యలు, చేపలతో పాటు పలు రకాల పదార్థాలు రోజుల తరబడి నిల్వ ఉంటాయి. వాటికి కలర్‌కోటింగ్ ఇచ్చి రుచి కోసం రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారు. బేకరీల్లో స్వీట్లు, కేక్‌లకు వాడే రంగులు, వాటిపై వాడే వెండిపూత అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. కొన్ని స్వీట్లు నోట్లో పెట్టుకోగానే వాసన వస్తుంది. కొన్ని రసాయనాలను ప్రభుత్వం నిషేధించినా రెండు జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. గాలి, వెలుతురు ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. కానీ చాలాచోట్ల, ముఖ్యంగా డాబాల్లో, బార్లలో చీకట్లో ఆహారాన్ని వడ్డిస్తున్నారు. దీంతో ఆహారం ఎలా ఉందో, అందులో ఏ రంగు కలిపారో తెలియని పరిస్థితి. పురుగుమందుల కోటాలో టేస్టింగ్ సాల్ట్ దిగుమతి టేస్టింగ్‌సాల్ట్ చైనా నుంచి ఫరి్టలైజర్స్ పేరుమీద దిగుమతి అవుతోంది. ఆహార విషెస్ సూచికలో ఇది లేదు. చైనాలో ఇది వంటల్లో వాడితే ఉరిశిక్ష విధించేలా అక్కడి శిక్షలు ఉన్నాయి. దీన్ని తరచుగా తింటే బీపీ, షుగర్ చిన్నవయస్సులోనే వచ్చే ప్రమాదముంది. తరచూ వాడితే మన నాలుక కొన్ని రుచులను గుర్తించే గుణాన్ని కోల్పోతుంది. పాస్ట్‌ఫుడ్, రెస్టారెంట్లలో టేస్టింగ్‌సాల్ట్ లేకుండా ఏ వంటకం తయారవడం లేదు. ఆరోగ్యానికి హాని ఇలా.. ♦మెటానియల్ ఎల్లో వాడకం నిషేధం. కానీ వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై వెంటనే దు్రష్పభావం చూపించదు. నెమ్మదిగా క్యాన్సర్‌కు కారకమవుతుంది. చిన్నారుల్లో నిద్రలేమి, నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. ♦వంటకాల్లో రంగుకోసం వాడే నిషేధిత టార్ట్రాజిన్ చాలా ప్రమాదకరం. దీనితో థైరాయిడ్ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, తామర వచ్చే సూచనలు ఉన్నాయి. ♦స్వీట్లు, బిస్కెట్లలో ఆరెంజ్ రంగు కోసం వాడే సన్‌సెటన్, పసుపు రంగు కోసం వాడే కాట్రాజ్, గ్రీన్ కలర్ కోసం వాడే బ్రిలియంట్ బ్లూ, టారా్టజిన్లు ప్రమాదకరం. ♦చాక్లెట్లలో వాడే రోడ్మన్–బి కూడా ప్రాణాంతకమే. ♦ఆహార కల్తీ వల్లనే 53 శాతం మందికి క్యాన్సర్ వస్తున్నట్లు పలు సంస్థల సర్వేల్లో తేలింది. విదేశాల్లో చర్యలు ఇలా... ♦కెనడా, ఐర్లాండ్, స్వీడన్ వంటి దేశాల్లో ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఆ దేశాలను అత్యుత్తమ ఆహార నాణ్యత కలిగిన దేశాలుగా పేర్కొన్నాయి. ♦కెనడాలో విక్రయించే అన్ని ఆహారపదార్థాలను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సిందే. వ్యవసాయం, ఇతర ఆహారపదార్థాల కోసం అక్కడ ప్రత్యేకశాఖలు, విభాగాలున్నాయి. ♦వ్యవసాయ ఉత్పత్తులపై నిఘాకు, పునఃశుద్ధికి ‘వ్యవసాయ ఆహార కెనడా’ అనే సంస్థతో అక్కడి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కెనడియన్ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ(సీఎఫ్ఐఏ) ఆ«దీనంలో పనిచేస్తోంది. ఈ సంస్థ పౌరుడికి చేరే ప్రతి ఆహారపదార్థాన్ని తప్పకుండా పరిశీలించిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు అనుమతి ఇస్తుంది. కోడిగుడ్లను సైతం పునఃశుద్ధి ప్రక్రియ చేయకుండా అనుమతి ఇవ్వదు. రుచికోసం రసాయనాలను ఏమాత్రం అనుమతించవద్దు. సహజ రుచుల్లోనే వండివడ్డించాలనేది అక్కడి నియమం. ఇలాంటి నిబంధనలను ఇక్కడ కూడా కఠినంగా అమలు చేస్తేనే కల్తీని అరికట్టవచ్చు. చదవండి: బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు? -
ఇష్టంగానా? కష్టంగానా?
ఒకరికి ఖేదం... వేరొకరికి మోదం అంటే ఇదేనేమో! హోటళ్ళు, రెస్టారెంట్లలో తప్పనిసరి సర్వీస్ ఛార్జ్‌పై నిషేధంతో హోటల్ యజమానులు విచారిస్తుంటే, వినియోగదారులు సంతోషిస్తున్నారు. కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) సోమవారం జారీ చేసిన మార్గదర్శకాలతో దేశవ్యాప్తంగా ఆతిథ్యరంగంలో ఇదే పరిస్థితి. సేవా రుసుము (సామాన్య భాషలో టిప్స్) చెల్లించడం స్వచ్ఛందమే తప్ప తప్పనిసరి కాదనీ, ఎవరైనా నిర్బంధంగా వసూలు చేస్తుంటే 1915 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చనీ సీసీపీఏ తేల్చేసింది. ఆతిథ్యరంగ ప్రతినిధులు మాత్రం శ్రామికులకు ఉపకరించే సర్వీస్ ఛార్జ్‌లో చట్టవిరుద్ధమేమీ లేదనీ, దీనిపైన కూడా పన్ను చెల్లిస్తున్నం దున ప్రభుత్వానికి ఆదాయం వస్తోందనీ వాదిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న వృద్ధి, కొనుగోలుశక్తి లాంటి సమస్యలుండగా సర్కారు ‘టిప్స్’ అంశంపై దృష్టి పెట్టడం విచిత్రమే. ఇష్టపడి స్వచ్ఛందంగా ‘టిప్స్’ ఇవ్వడం వేరు. తప్పనిసరి అంటూ ముక్కుపిండి వసూలు చేయడం వేరు. ఈ వాదనే ఇప్పుడు హోటళ్ళలో విధిస్తున్న సేవా రుసుమును చర్చనీయాంశం చేసింది. వినియోగదారులు తాము అందుకున్న సేవలకు సంతృప్తి చెంది, ఇష్టంతో ఇవ్వాల్సిన సేవా రుసుమును చాలాచోట్ల బిల్లులో తప్పనిసరి భాగం చేశారు. అయిదేళ్ళ క్రితం దేశమంతటా అమలైన ‘వస్తు, సేవల పన్ను’ దీనికి అదనం. హోటల్లో తిండికి అయిన ఖర్చు మీద 5 నుంచి 15 శాతం దాకా సేవా రుసుమును హోటల్ వారే వేసి, ఆ రెంటినీ కలిపిన మొత్తం మీద ‘వస్తు, సేవల పన్ను’ (జీఎస్టీ) వసూలు చేయడం సరికాదన్నది కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదు. తినడానికి అయిన బిల్లు మీద ఎలాగూ సర్కారీ ‘వస్తు, సేవల పన్ను’ వసూలు చేస్తున్నప్పుడు, మళ్ళీ విడిగా హోటల్ వారి ‘సేవా రుసుము’ ఏమిటి? దీని వల్ల ఒకటి రుసుము, మరొకటి పన్ను అంటూ ఒకే సేవకు రెండుసార్లు చెల్లిస్తున్నట్లు అవుతోందనేది ఫిర్యాదీల వాదన. ఆ వాదన తార్కికమే. కానీ, సేవలందించే శ్రామికుడిని మానవీయ కోణంలో చూస్తే సరైనదేనా? హోటళ్ళు అంటున్నదీ అదే! సర్వీస్ ఛార్జ్‌కు చట్టబద్ధత ఏమీ లేకున్నా, బేరర్ శ్రమను గుర్తించి, మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా టిప్ ఇవ్వడం నైతికంగా ధర్మమే. అలాగని కొన్నిసార్లు సేవలు అసంతృప్తికరంగా ఉన్నప్పటికీ, బిల్లులో భాగంగా 10 శాతం తప్పనిసరి ‘సర్వీస్ ఛార్జ్’ను చెల్లించాల్సి వస్తున్న అనుభవాలూ లేకపోలేదు. దీనిపై ఫిర్యాదుల మేరకు కొన్నేళ్ళుగా వినియోగదారుల మంత్రిత్వ శాఖకూ, దేశంలోని 5 లక్షల పైచిలుకు రెస్టారెంట్ల పక్షాన నిలిచే ‘నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్నార్ఏఐ)కీ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, జీఎస్టీ విధింపు కన్నా ముందే 2017 ఏప్రిల్‌లోనే హోటళ్ళలో సర్వీస్ ఛార్జ్ వసూలుపై మంత్రిత్వ విభాగం మార్గదర్శకాలిచ్చింది. రెస్టారెంట్‌కు వచ్చినంత మాత్రాన సర్వీస్ ఛార్జ్‌కి కస్టమర్ అంగీకరించినట్టు కాదని పేర్కొంది. ఛార్జ్ కట్టే పక్షంలోనే ఆర్డర్ చేయాలంటూ, కస్టమర్ ప్రవేశంపై షరతులు పెట్టడం చట్టప్రకారం ‘అనుచిత వాణిజ్య పద్ధతి’ అవుతుందన్నది. మెనూ కార్డులో పేర్కొన్న రేట్లు, ప్రభుత్వం విధించే పన్నులు మినహా మరే సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చింది. తద్విరుద్ధమైన అనుచిత విధానాలపై కస్టమర్లు న్యాయవేదికలను ఆశ్రయించవచ్చని తెలిపింది. ‘అనుచిత వాణిజ్య పద్ధతి’ లాంటి పెద్ద పెద్ద మాటలు ఈ ‘టిప్స్’కు వర్తిస్తాయా, లేదా అన్నది పక్కనబెడితే, సర్వీస్ ఛార్జ్‌ను ఆపేయాలంటూ ఇలా 2017 నుంచి 2019 మధ్య కేంద్రం పలు మార్గదర్శకాలు ఇచ్చిందన్నది నిజం. అయినా హోటళ్ళ బిల్లులో తప్పనిసరి సర్వీస్‌ఛార్జ్ పద్ధతి కొనసాగుతూ వచ్చింది. దాని ఫలితమే ఫిర్యాదులు, ప్రభుత్వ తాజా నిర్ణయం. నెల రోజుల క్రితం జూన్ 2న కూడా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం దీనిపై హోటళ్ళ సంఘం వారితో సమావేశం జరిపింది. చివరకు సోమవారం నాటి సీసీపీఏ మార్గనిర్దేశనంతో ఇకపై హోటళ్ళు తప్పనిసరి సేవా రుసుము వసూలు చేయడం పూర్తి నిషిద్ధం. సీసీపీఏ చట్టబద్ధ సంస్థ. ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం– 2019’ కింద హక్కులు అమలయ్యేలా చూసేందుకూ, ఉల్లంఘించినవారిని శిక్షించేందుకూ రెండేళ్ళ క్రితమే 2020 జూలైలో ఏర్పాటైందనేది గమనార్హం. గతంతో పోలిస్తే 2021–22లో ఆతిథ్యరంగంలో ఆదాయం పడిపోయింది. ఇప్పుడు శ్రామికు లకు ప్రోత్సాహకంగా దక్కే టిప్స్ కూడా రద్దు అంటే కష్టమని హోటల్ యజమానుల అభిప్రాయం. ప్రభుత్వ లావాదేవీలకు ‘ప్రాసెసింగ్ ఫీ’ అనీ, రైలు, సినిమా టికెట్ల బుకింగ్‌కు ‘కన్వీనియన్స్ ఫీ’ అనీ, ఫుడ్ డెలివరీకి ‘రెస్టారెంట్ ఛార్జెస్’ అనీ రకరకాల పేర్లతో అనేక రంగాలు సేవా రుసుము వసూలు చేస్తూనే ఉన్నాయి. వాటిని అనుమతిస్తూ, ఆతిథ్యరంగంపై ఈ దాడి ఏమిటన్నది వారి వాదన. అలాగే, టిప్స్ రద్దుతో శ్రామికులకు కలిగే నష్టం భర్తీకి జీతాలు పెంచడం, దానికై హోటల్ రేట్లు పెంచడం అనివార్యం కావచ్చు. అయితే, కోవిడ్ అనంతరం ఆహార, ఇంధన ద్రవ్యోల్బణంతో సతమతమవుతూ ఇప్పటికే రేట్లు పెంచి, ఇరుకునపడ్డ హోటళ్ళు మరోసారి ఆ పని చేయగలవా? అయినా, అందుకున్న సేవల పట్ల సంతృప్తిని బట్టి, ఆర్థిక స్థోమతను బట్టి కస్టమర్లు ఇవ్వాల్సినదాన్ని కొన్ని హోటళ్ళు తప్పనిసరి అనబట్టే తలనొప్పి. యూరప్, యూకేల పద్ధతిలో మన దగ్గరా కస్టమర్ల ఇష్టానికే టిప్స్ చెల్లింపును వదిలేయాలి. అయినా, హోటల్లో టిప్ లాంటివాటి కన్నా కోవిడ్ పడగ నీడలోని ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే పని మీద మన పాలకులు పరిశ్రమిస్తే దేశానికి మంచిదేమో! -
హోటల్స్, రెస్టారెంట్లలో ఆ బలవంతపు వసూళ్లకు చెక్
న్యూఢిల్లీ: హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లే కస్టమర్లకు.. ఇక నుంచి ‘సర్వీస్ ఛార్జీ’ బాదుడు నుంచి ఊరట లభించింది. వినియోగదారుల విషయంలో ఇష్టానుసారం వ్యవహరించకుండా ఉండేందుకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సరికొత్త మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది. హోటల్స్, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల పేరిట కస్టమర్ల నుంచి బలవంతపు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ.. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. బిల్లులకు ఆటోమేటిక్‌గా కానీ, మ్యానువల్‌గా కానీ సర్వీస్ ఛార్జీలను జత చేయొద్దని సీసీపీఏ తన గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. సర్వీస్ ఛార్జీలను ఏ రూపేనా కూడా వసూలు చేయడానికి వీల్లేదు. కస్టమర్ల నుంచి బలవంతంగా వసూలు చేయరాదు. అది కేవలం స్వచ్ఛంద చెల్లింపు, ఆప్షనల్ మాత్రమే. ఈ విషయాన్ని కస్టమర్‌కు సైతం తెలియజేయాలని మార్గదర్శకాల్లో కన్జూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఫుడ్ బిల్లు, జీఎస్టీతో పాటు సర్వీస్ ఛార్జ్ అనేది బిల్లులో ఇకపై కనిపించడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా హోటల్, రెస్టారెంట్ గనుక సర్వీస్‌ఛార్జ్ వసూలు చేస్తే గనుక.. నిబంధనలను ఉల్లంఘించినట్లేనని తాజా మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. ఈ విషయమై ప్రశ్నించే.. నిలదీసే హక్కు కస్టమర్లకు ఉంటుందని తెలిపింది. ఫిర్యాదు చేయాలనుకుంటే.. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నెంబర్ 1915కు కాల్ చేయాలని తెలిపింది. లేదంటే ఎన్సీహెచ్ మొబైల్ యాప్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది. సీపీపీఏకు ఈ-మెయిల్ ccpa@nic.in ద్వారా కూడా ఫిర్యాదు ఇవ్వొచ్చని తెలిపింది. అంతేకాదు అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టిస్ కింద కన్జూమర్ కమిషన్లోనూ ఫిర్యాదు చేయొచ్చని స్పష్టం చేసింది. ఒకవేళ వేగవంతమైన చర్యల కోసం.. ఈ-దాఖిల్ పోర్టల్ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఇవేం కుదరకుంటే.. నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందిస్తే.. సీసీపీఏ సమన్వయం ద్వారా దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేసింది. చదవండి: కప్పు ఛాయ్ రూ. 70 వసూలు!.. రైల్వే వివరణ -
మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: వీకెండ్ అంటే ఐటీ హబ్‌లో పండగ వాతావరణం ఉంటుంది. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, పబ్‌లు కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. వచ్చే వీకెండ్లో జులై 2, 3న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆంక్షలు ఉండనున్నాయి. దీంతో రెస్టారెంట్లు, పబ్‌లు, మాల్స్‌లకు వచ్చే కస్టమర్లను నియంత్రించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హెచ్ఐసీసీ, నోవా టెల్‌తో పాటు నగరంలో 50కి పైగా స్టార్ హోటల్స్‌లో బస చేయనున్నారు. దీంతో రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. నోవాటెల్ చుట్టూ బలగాల గస్తీ తొలిసారిగా గ్రేటర్లో రెండు రోజుల పాటు ప్రధాని ఉండనున్నారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 2న సమావేశం జరగనున్న మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ, పలువురు కేంద్ర మంత్రులు బస చేయనున్న నోవాటెల్ హోటల్ చుట్టూ పోలీసు బలగాలు గస్తీ కాయనున్నాయి. రెండు రోజుల పాటు సైబర్ టవర్స్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను, వాటి పరిస్థితులను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సమావేశం జరిగే హెచ్ఐసీసీలో అతిథుల వాహనాల కోసం 3 ప్రాంతాలలో పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. సుమారు 500 నుంచి 600 కార్లు పార్కింగ్ చేసుకునే వీలుంటుంది. రెండు రోజుల పాటు 500 మంది ట్రాఫిక్ పోలీసులు విధులలో పాల్గొంటారని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. (చదవండి: సీఎం పీఠంకోసం కుమ్ములాట) -
టమాట కెచప్ ప్రియులకు చేదువార్త!
టమాట కెచప్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. బయట రెస్టారెంట్లలో, హోటళ్లలో ప్రధానమైనది ఈ కెచప్. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాక అందరూ ఈ టమాట సాస్‌లకు అలవాటు పడిపోయారు. ఐతే ఇక ఆ టమటా కెచప్ తయారు చేయడం కష్టమైపోతుందంటున్నారు వాతావరణ పరిశోధకులు. అందుకు వాతావరణ మార్పులే కారణమంటున్నారు. ఈ అధిక ఉష్టోగ్రతలు కారణంగా టమాట పంట ఉండదేమోనని భయపడుతున్నారు కూడా. ఇటీవల అధిక ఉష్ణోగ్రతలు కారణంగా కూరగాయాల ధరలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అందులోనూ టమాట ధర ఇటీవల కనివినీ ఎరుగని రీతిలో ఆకాశన్నంటింది. ఇందంతా ఒకత్తెయితే ఇక రాను రాను ఈ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఇక టమాట ఉత్పత్తి తగిపోతుందని వాతావరణ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ మేరకు డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం పెరుగుతున్న ఉష్ణోగ్రత టమాటల ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో ఒక గణిత నమూనాను రూపొందించింది కూడా. ఇప్పటివరకు ఇటలీ, చైనా మరియు కాలిఫోర్నియా టమాట ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయని పరిశోధకులు బృందం పేర్కొంది. ఇవి ప్రపంచ ఉత్పత్తిలో ఈ దేశాలే అధికంగా సరఫరా చేస్తున్నాయి. ఐతే ఇప్పుడూ ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రమాదంలో ఉన్నాయని అధ్యయనం తెలిపింది. గణిత నమూనా ప్రకారం 2050 నుంచి 2100 మధ్యకాలంలో టమాట పంట సగానికి తగ్గిపోతుందని తెలిపింది. 2050 నాటికి టమాట ఉత్పత్తి ఆరు శాతం క్షీణిస్తుందని పరిశోధన బృందం పేర్కొంది. అంతేకాదు 2040 నుంచి 2069 మధ్య టమాట ఉత్పత్తి ప్రాంతాలలో సుమారు 2.6 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత ఉంటుందని తదుపరి 30 సంవత్సరాలలో 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదల ఉంటుందని వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదలను 1980 నుంచి 2009 మధ్య కాలంలో ఉష్ణోగ్రతల పెరుగుదలను బట్టి పరిశోధకులు అంచనావేశారు. పదకొండు అతి పెద్ద సాగు పంటల్లో ఒకటైన ఈ టమాట పంట ప్రస్తుతం 14 మిలియన్ల టన్నుల నుంచి 7 మిలియన్ల టన్నులకు పడిపోతోంది. గతేడాది కూడా మార్చి నుంచి ఏప్రిల్ నెలల్లో పాకిస్తాన్, భారత్ వంటి దేశాల్లో టమాట పంట దారుణంగా పడిపోయింది. ఇలా టమటాల ఉత్పత్తి దారుణంగా పడిపోతే టమాట కెచప్, టమాట పేస్ట్ వంటివి ఇక ఉండవేమో అంటున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?) -
రెస్టారెంట్లపై కేంద్రం ఆగ్రహం,సర్వీస్ చార్జీ వసూలు చేయుడు బంజేయండి!
న్యూఢిల్లీ: రెస్టారెంట్లు సర్వీసు చార్జీ వసూలు చేయడం సరికాదని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కస్టమర్ల నుంచి సర్వీసు చార్జీ వసూలు చేయకుండా చట్టపరమైన కార్యాచరణను తీసుకొస్తామని ప్రకటించారు. రెస్టారెంట్ల అసోసియేషన్ ప్రతినిధులు, వినియోగదారుల సంఘాలతో గురువారం సమావేశం నిర్వహించిన అనంతరం వివరాలు వెల్లడించారు. ‘‘సర్వీసు చార్జీ వసూలు చట్టబద్ధమేనని అసోసియేషన్లు పేర్కొన్నప్పటికీ వినియోగ వ్యవహారాల శాఖ అభిప్రాయం అయితే..ఇది వినియోగదారుల హక్కులను దెబ్బతీస్తుంది. అంతేకాదు అనుచిత విధానం కూడా. 2017నాటి మార్గదర్శకాలు ఉన్నాయి కానీ, వాటిని అమలు చేయలేదు. కనుక త్వరలోనే చట్టపరమైన కార్యాచరణను ప్రకటిస్తాం. దాంతో చట్టప్రకారం అవి సర్వీసు చార్జీ వసూలు నిలిపివేయాల్సి ఉంటుంది’’అని రోహిత్ కుమార్‌సింగ్ తెలిపారు. కస్టమర్లు సర్వీసు చార్జీని సర్వీస్ ట్యాక్స్ గా పొరబడి చెల్లిస్తుంటారన్నారు. వినియోగదారులు, నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్ లేవనెత్తిన అంశాలపై తాజా సమావేశంలో కేంద్రం ప్రస్తావించింది. చట్టవిరుద్ధం కాదు..:‘‘ఇదే అంశం 2016–17లోనూ చర్చకు వచ్చింది. అప్పుడు అసోసియేషన్ తన స్పందన తెలిపింది. కాంపిటిషన్ కమిషన్‌కు సైతం మా వాదనను సమర్థవంతంగా వినిపించాం’’అని నేషనల్ రెస్టాంరెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. ‘‘సర్వీసు చార్జీ చట్ట విరుద్ధం కాదు, అనుచిత విధానమూ కాదు. ప్రజా వేదికపై ఈ చర్చ అనవసర గందరగోళానికి దారితీస్తుంది. రెస్టారెంట్ల సాఫీ కార్యాకలాపాలను ప్రభావితం చేస్తుంది’’అని ఎన్ఆర్ఏఐ ప్రెసిడెంట్ కబీర్‌సూరి పేర్కొన్నారు. చదవండి👉 శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది! -
ఆర్థిక వృద్ధిబాటలో అవరోధాలు
ఆర్థికవ్యవస్థపై కోవిడ్–19 మహమ్మారి థర్డ్ వేవ్ ప్రభావాన్ని ఎదుర్కోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెను సవాలుగా మారనుంది. కాంట్రాక్ట్ లేబర్ని ఎక్కువగా కొనసాగించే రంగాలు ఇప్పటికే ప్రమాదకర పరిస్థితుల్లో కూరుకుపోతున్నాయి. మరోవైపున నెలవారీ జీఎస్టీ రాబడులు గత ఆరునెలలుగా లక్ష కోట్ల రూపాయలకు పైనే వసూలు కావడం, విదేశీ మారక చెల్లింపు నిల్వలు రికార్డు స్థాయికి చేరుకోవడం, ఎగుమతులు పుంజుకోవడం వంటి అనేక సానుకూల ఆర్థిక సూచికలు ఈ 2022వ సంవత్సరంలో దేశాన్ని ముందుకు తీసుకుపోవచ్చు. అయితే ఈ సానుకూలతల మధ్యన కూడా కొనసాగుతున్న ఇతర ఆర్థిక దౌర్బల్యాలు మన అభివృద్ధి చట్రాన్ని వెనక్కు లాగే ప్రమాదముంది. నిరుద్యోగితా రేటు, పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణపు ఒత్తిళ్లు అనేవి... ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రయత్నాలకు గండి కొట్టే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో మన ఆర్థిక వ్యవస్థ వరుస సవాళ్లను ఎదు ర్కొంటుందనడంలో సందేహమే లేదు. మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన ఆర్థిక మాంద్యం నుంచి దేశం బయట పడుతున్నట్లు కనిపిస్తుండగా, ఆర్థిక వ్యవస్థకు తొలి సవాలు ఇప్పటికే ఎదురవడం చూస్తున్నాం. దేశం కోలుకుంటున్న ప్రక్రియను శక్తిమంతంగా అడ్డు కునేలా కొత్త కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ దూసుకొచ్చింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుంటున్న పరిస్థితులు తగ్గుముఖం పట్టి, దాని పునరుద్ధరణ ప్రక్రియ అసమాన స్థితిలోకి వెళుతుండటం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే కొత్త వేరియంట్ లక్షణాలు ప్రమాదకరం కాదనీ, గతంలోని డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ దశలో ఆసుపత్రుల పాలయ్యేవారి సంఖ్య, మర ణాల సంఖ్య తక్కువగా ఉంటుందనీ నిపుణులు హామీ ఇస్తున్నారు. కానీ చాలామంది ప్రజలతోపాటు ప్రత్యేకించి ఆరోగ్య సిబ్బంది కూడా ఒమిక్రాన్ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉన్నందున, వైద్య మౌలిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముంది. దేశవ్యాప్తంగా సెలవుల్లో అసంఖ్యాకంగా ప్రజలు మార్కెట్లకు పోటెత్తుతుండడం చూస్తున్నప్పుడు ఆందోళన కలుగకమానదు. కోవిడ్–19 మహమ్మారి థర్డ్ వేవ్ రూపంలో ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, మున్ముందు ఇది తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఆర్థికవ్యవస్థపై దాని తక్షణ ప్రభావాన్ని ఎదుర్కోవడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ 2022వ సంవత్సరంలో కీలక సవాలుగా మార నుంది. «థర్డ్ వేవ్ ఇప్పటికే తొలి దెబ్బ తీసింది. లక్షలాది మంది ఉద్యో గులను నియమించుకునే రెస్టారెంట్, హోటల్ పరిశ్రమ మరో సారి తిరోగమన బాట పట్టాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి పూర్వ స్థాయిని ఇప్పుడిప్పుడే అందుకుంటున్న విమానయాన రంగం మళ్లీ టేకాఫ్‌కు నోచుకోని పరిస్థితిని ఎదుర్కొంటోంది. నియత, అనియత రంగంలో విస్తృతంగా ఉంటున్న ఆతిథ్య రంగం స్పష్టంగా నిరాశా జనకమైన భవిష్యత్తును ఎదుర్కొంటోంది. 2020 మార్చి నెల నుంచి మహమ్మారి ధాటికి బాగా పెరిగి పోయిన నిరుద్యోగ సమస్య మళ్లీ సమాజాన్ని అతలాకుతలం చేయ నుంది. కోవిడ్ వైరస్ దాడి చేయకముందే చాలా రంగాల్లో ఉపాధి అవకాశాలు నిరాశను కలిగించే స్థాయికి చేరుకున్నాయి. అప్పట్లో లాక్ డౌన్ తర్వాత ఇది తీవ్ర సంక్షోభంగా మారిపోయింది. గత ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో నిరుద్యోగ రేటు నాలుగు నెలల్లో అత్యధిక స్థాయికి, అంటే 7.9 శాతానికి పెరిగిందని భారత ఆర్థికరంగా పర్య వేక్షణా కేంద్రం (సీఎమ్ఐఈ) తాజా డేటా పేర్కొంది. ఇంత సంక్షోభ సమయంలోనూ ఆశలు రేపే విషయం ఏమిటంటే, ఉపాధి కల్పనకు సంబంధించి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలు మెరుగ్గా కొనసాగాయి. అయితే చాలామంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఉపాధి పథకాలపైనే ఆధారపడటంతో గ్రామీణ ఉపాధి రంగంలో నాణ్యత పేలవ స్థాయిలోనే కొనసాగింది. మరో మాటలో చెప్పాలంటే పట్టణ ప్రాంతాల్లో మెరుగైన ఉపాధి అవ కాశాలు తగ్గి పోతుండగా, అనిపుణ రంగంలో ఎక్కువగా ఉపాధి అవశాలు లభిస్తున్నాయని సీఎమ్ఐఈ డేటా చెబుతోంది. చేదు వాస్తవం ఏమిటంటే దేశంలోని ఉపాధి అవకాశాల్లో అత్యధిక భాగం అసంఘటిత రంగంలో ఉండటమే! 2020వ సంవ త్సరంలో లాక్ డౌన్ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని తమ స్వస్థ్థలాలకు వెళ్లిపోయిన వలస కార్మికుల్లో చాలామంది, పట్టణ ప్రాంతాల్లో పని చేయడానికి తిరిగి రాలేదు. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ఆయా సంస్థలు సిబ్బందిని నియమించుకునే విషయమై ఊగిసలాడుతున్నం దున తగినంతమంది కార్మికులు అందుబాటులో లేకుండా పోయారు. కరోనా మహమ్మారి సమయాల్లో కంటే పరిస్థి తులు ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయని, పలు ఆర్థిక సూచికలను ప్రస్తావిస్తూ పేర్కొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపాధి అవకాశాల గురించి మాత్రం ప్రస్తావించలేదు. వాస్తవానికి, నిరుద్యోగితా స్థాయులను గణనీయంగా తగ్గించనంతవరకు, సామాజిక నిచ్చెన చివరి మెట్లపై నిలుచున్న వారిని ఉపాధి రాహిత్యం వెంటాడుతూనే ఉంటుందని గ్రహించాలి. అంతర్జాతీయ చమురు ధరల పెంపుదల ఎంతో ఆందోళనను కలిగిస్తోంది. బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ ముడి చమురు గత అక్టోబర్‌లో బ్యారెల్‌కు 86 డాలర్ల మేరకు పెరిగి ఆర్థిక వ్యవస్థకు చుక్కలు చూపించింది. చమురు వినియోగంలో 80 శాతం వరకు దిగు మతులపైనే మన దేశం ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఒమి క్రాన్ భయాల కారణంగా చమురు ధర కాస్త తగ్గుముఖం పట్టినట్లు మార్కెట్ సంకేతాలు చూపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ప్రస్తుతానికి ప్రమాదకరంగా కనిపించనప్పటికీ వైరస్ బారిన పడు తున్న వారి సంఖ్య పెరిగి పోతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇది తక్షణం విచ్ఛిన్నపరచకపోవచ్చు కానీ చమురు ధరలు మాత్రం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి నెలల్లో అధికంగా పెరిగిన చమురు ధరలు దేశ కరెంట్ అకౌంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత జూలై నుంచి సెప్టెంబర్ వరకు రెండో త్రైమాసికంలో ఇది మిగులు నుంచి లోటుకు దారితీసింది. అంతకు ముందటి త్రైమాసికంలో మన వాణిజ్య లోటు 30.7 బిలియన్ డాలర్ల నుంచి 44.4 బిలియన్ డాలర్లకు పెరగడమే దీనికి కారణం. ఇలా లోటు పెరగడం అనేది తక్షణం ప్రమాదకరం కాకపోవచ్చు. ఎందుకంటే చమురేతర దిగుమతుల పెరుగుదల కారణంగా ఆర్థిక వ్యవస్థ కాస్త ఉత్తేజితమైంది. అయితే చమురు దిగుమతుల వ్యయంలో పెరుగుదల కొనసాగుతుండటం సమస్యా త్మకమే అవుతుంది. ప్రత్యేకించి వ్యాక్సినేషన్లు, మౌలిక సౌకర్యాల కల్పనలో, గ్రామీణ ఉపాధి పథకాల్లో పెట్టుబడులు వంటి కీలక రంగాలకు ప్రభుత్వ ఆదాయాన్ని కేటాయించాల్సి ఉన్న సమయంలో... చమురు దిగుమతుల వ్యయం పెరగడం దేశానికి క్షేమకరం కాదు. వినియోగదారీ ధరల సూచీ పైపైకి ఎగబాకుతున్నందున, ప్రపంచ చమురు ధరలు పెరుగుతున్న వేళ ద్రవ్యోల్బణపు ఒత్తిళ్లు మరింతగా ఎక్కువవుతాయి. మన విధాన నిర్ణేతలు పరిష్కరించాల్సిన మరొక పెను సవాలు ద్రవ్యోల్బణమే. అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఇప్పటికీ అస్థిరంగా ఉంటున్నందున చమురు ధరల పెంపుదల వల్ల మరింతగా పెరగనున్న ధరలను నిర్వహించడం కష్టమే. ద్రవ్యోల్బణానికీ, వృద్ధిని ప్రోత్సహించడానికీ మధ్య సమ తౌల్యం సాధించాల్సిన అవసరం రిజర్వ్ బ్యాంక్‌ను అనిశ్చితిలోకి నెడు తోంది. అనేక దేశాల్లో బ్యాంకులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొం టున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ద్రవ్యోల్బణం ఇప్పుడు కనీవినీ ఎరుగని స్థాయులకు చేరడం గమనార్హం. దీనివల్ల సరళీకృత ద్రవ్య విధానాలు అంపశయ్య ఎక్కే పరిస్థితి ఉంటుంది. అయితే 2022లో కొన్ని సానుకూల ఆర్థిక సూచికలు దేశాన్ని ముందుకు తీసుకుపోయే సూచనలు కనబడుతున్నాయి. నెలవారీ జీఎస్టీ రాబడులు గత ఆరునెలలుగా ప్రతినెలా లక్ష కోట్ల రూపాయలకు పైనే వసూలవుతున్నాయి. పైగా మన విదేశీ మారక చెల్లింపు నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఆరునెలల్లో పదివేల అంకుర సంస్థల ఆవిర్భావంతో దేశీయ ఎగుమతులు బాగా పుంజు కున్నాయి. అదే సమయంలో... ఇన్ని సానుకూలతల మధ్యన కూడా కొనసాగుతున్న ఇతర ఆర్థిక దౌర్బల్యాలు మన అభివృద్ధి చట్రాన్ని వెనక్కు లాగే ప్రమాదముంది. కాంట్రాక్ట్ లేబర్‌ను ఎక్కువగా కొనసా గించే విభాగాల్లో మందకొడితనానికి కారణమవుతున్న నిరుద్యోగితా రేటు, పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణపు ఒత్తిళ్లు అనేవి... ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రయత్నాలకు, ప్రజారాశుల సంక్షేమాన్ని మెరుగుపర్చడానికి గండి కొడతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. – సుష్మా రామచంద్రన్, సీనియర్ జర్నలిస్ట్ -
ఒమిక్రాన్: జస్ట్ క్యాన్సిలేషన్స్తోనే రూ.200 కోట్ల నష్టం!
కరోనా దెబ్బకు ఆర్థికంగా దాదాపు ప్రతీ రంగం కుదేలు అయ్యింది. ముఖ్యంగా ప్రయాణాలు, కొవిడ్ రూల్స్ కారణంగా భారీగా నష్టపోయిన వాటిల్లో ఒకటి హాస్పిటాలిటీ సెక్టార్(ఆతిథ్య రంగం). అయితే పూర్వవైభవం సంతరించుకుందని సంబురపడే లోపే.. ఈ రంగంపై మరో పిడుగు పడింది. అది ఒమిక్రాన్ రూపంలో. తాజాగా ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు ఆతిథ్య రంగాన్ని మంచి సీజన్లో చావు దెబ్బ తీస్తున్నాయి. కరోనా కారణంగా ఈ రెండేళ్లలో ఆతిథ్య రంగానికి వాటిల్లిన నష్టం లక్షల కోట్ల రూపాయల్లోనే!. అందునా వారం రోజుల వ్యవధిలో సుమారు 200రూ. కోట్లు నష్టపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరో విశేషం ఏంటంటే.. ఈ నష్టం కేవలం బుకింగ్ క్యాన్సిలేషన్ ద్వారా వాటిల్లింది కావడం. యస్.. డిసెంబర్ 25 నుంచి జనవరి 31 మధ్య ఆతిథ్య రంగం ఈ మేర నష్టం చవిచూసింది. క్రిస్మస్, న్యూఇయర్‌తో పాటు వెడ్డింగ్స్, ఇతరత్ర ఈవెంట్స్ రద్దు ద్వారానే ఈ నష్టం వాటిల్లిందని ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోషియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మాంచి సీజన్ మీదే.. కరోనా సీజన్లో బుకింగ్‌లు లేక పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్ వెలవెలబోయాయి. నెలలపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలతో కోలుకోలేని దెబ్బ పడింది. 8 శాతం బిజినెస్ శాశ్వతంగా మూతపడింది కూడా!. తద్వారా ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో భారీ నష్టమే వాటిల్లింది. అయితే రెండు వేవ్‌లు అన్-సీజన్లో రావడంతో ఆతిథ్య రంగంపై నష్టం మరీ ఘోరంగా అయితే లేదు. కానీ, ఇప్పుడు వేడుకల సమయం. పైగా పెళ్లిళ్ల సీజన్. వ్యాక్సినేషన్ కూడా నడుస్తుండడంతో వ్యాపారాలు గాడిన పడతాయని అంతా భావించారు. ఇప్పుడేమో ఒమిక్రాన్ వల్ల పరిస్థితి ఊహించిన విధంగా లేదు. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లింది.. మునుముందు ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న దానిపై లెక్కలు కట్టే పనిలో ఉంది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోషియేషన్స్. అందుకే నష్టస్థాయి ఊహించినదానికంటే ఘోరంగా ఉండొచ్చనే ఆందోళనలో ఆతిథ్య రంగం ఉందని ఎఫ్హెచ్ఆర్ఏఐ సెక్రటరీ ప్రదీప్ శెట్టి చెబుతున్నారు. ఒమిక్రాన్ వల్లే.. అక్టోబర్ 2021 నుంచి హోటల్స్, రెస్టారెంట్ల బుకింగ్‌లు పెరుగుతూ వస్తుండడంతో హాస్పిటాలిటీ రంగానికి మంచి రోజులు వచ్చినట్లు భావించారంతా. డిసెంబర్ రెండో వారం నాటికి ఈ బుకింగ్‌లు ఏకంగా 80-90 శాతానికి చేరాయి( కార్పొరేట్ హోటల్స్‌లో అయితే అది 50 శాతం మార్క్ దాటింది). కానీ, కొత్త వేరియెంట్ ప్రభావంతో పరిస్థితి తలకిందులైంది. డిసెంబర్ 25 నుంచి హోటల్స్ ఆక్యుపెన్సీ, రేట్లు గణనీయంగా పడిపోతూ వస్తున్నాయి. ఆంక్షలు-కర్ఫ్యూలు, ఆక్యుపెన్సీ నిబంధనలు, కస్టమర్ల భయాందోళనల నడుమ అప్పటికే అయిన బుకింగ్స్ దాదాపు 60 శాతం మేర రద్దయ్యాయి. కరోనా తొలినాళ్లలోలాగా ఇప్పుడు మళ్లీ పది నుంచి 15 శాతం ఆక్యుపెన్సీతో హోటల్స్ బిజినెస్ నడుస్తోంది. మునుముందు కఠిన ఆంక్షలు విధిస్తే.. ఈ కాస్త ఆక్యుపెన్సీ కూడా ఉండకపోవచ్చనే ఆందోళన నెలకొంది. ప్రభుత్వ సాయం! ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందో అనే ఆందోళన ఆతిథ్య రంగంలో నెలకొంది. మరోవైపు రెస్టారెంట్లలోకి అడుగుపెట్టేవాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని, డిసెంబర్లో 50 శాతం ఉన్న అమ్మకాలు, ఆదాయాలు.. ఇప్పుడు కేవలం 10-20 శాతానికి పడిపోయాయని ఎఫ్హెచ్ఆర్ఏఐ అంటోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి మద్దతు కోరుకుంటోంది ఆతిథ్య రంగం. భౌతిక దూరం ఇతరత్ర కొవిడ్ రూల్స్ పాటిస్తామని, ప్రతిగా తమకు ఊరట-మినహాయింపులు ఇవ్వాలని కోరుతోంది ఎఫ్హెచ్ఆర్ఏఐ. అదే విధంగా ఉద్యోగుల జీతభత్యాల భారంగా మారుతున్న తరుణంలో.. పన్నులు తగ్గింపులాంటి మినహాయింపులు ఆశిస్తోంది కూడా. సంబంధిత వార్త: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండవచ్చంటే.. -
ప్యారడైజ్ బిర్యానీ.. ఇప్పుడు ఓరుగల్లులో..
ఊరూరా..నోరూరే బిర్యానీ ఘుమఘుమలు బిర్యానీ ప్రియుల్ని కట్టిపడేస్తున్నాయి. రోజూ కాకపోయినా జిహ్వచాపల్యం ఊరిస్తున్నప్పుడు వారానికి ఒకసారైనా బిర్యానీ ఆరగించాల్సిందేనన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అందుకే కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన బిర్యాని రుచులు ప్రతీ పల్లెపల్లెకు విస్తరిస్తున్నాయి. తాజాగా బిర్యానీ ఘుమఘమలతో ప్రపంచ రికార్డులను క్రియేట్ చేసిన ప్యారడైజ్ బిర్యానీ వరంగల్ వాసుల్ని కట్టిపడేయనుంది. వరంగల్ కేంద్రంగా ప్యారడైజ్ తన 43వ ఔట్లెట్ ను ప్రారంభించింది. బిర్యానీ ఘుమఘుమలు ముక్కుపూటాలను తాకుతుంటే పొట్టకన్నా మనసే ముందు నిండిపోతుందనిపించేలా ట్రైసిటీ వరంగల్-హన్మకొండ-ఖాజీపేట వాసులకు కాదు..హనమకొండ సుబేదారి, శాస్త్రినగర్ మెయిన్ రోడ్ లో ప్యారడైజ్ రెస్టారెంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మూడు నగరాల వాసులు, వరంగల్ రెండు జిల్లాల వాసులతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోని బిర్యానీ ప్రియులందరూ ఇకపై ప్యారడైజ్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని, హన్మకొండలోనే ప్యారడైజ్ బిర్యానీ అందుబాటులోకి వచ్చిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రికార్డులు ప్యారిడైజ్ బిర్యానీ దాసోహం ప్యారిడైజ్ బిర్యానీ సంస్థ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లను సృష్టించింది. ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్ చేసిన రెస్టారెంట్ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్ కాంగ్రెస్ లో అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా మరియు గోల్డెన్ స్పూన్ అవార్డు ను ఇండియా ఫుడ్ ఫోరమ్ వద్ద 2018లో అందుకుంది. తెలంగాణా స్టేట్ హోటల్స్ అసోసియేషన్స్, జీహెచ్ఎంసీ, టైమ్స్ ఫుడ్ అవార్డ్, ప్రైడ్ ఆఫ్ తెలంగాణా, లైఫ్‌టైమ్ అావ్‌మెంట్ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది -
APTDC: ఏపీ పర్యాటకం.. ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం
సాక్షి, అమరావతి : పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడంలో భాగంగా రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) పర్యాటక ఆస్తులను ఆపరేషన్, మెయింటెనెన్స్(వో అండ్ ఎం) విధానంలో అభివృద్ధి చేయనుంది. ప్రైవేట్ సంస్థలకు 34 చోట్ల లీజుకు ఇచ్చేందుకు ప్రదేశాలను ఖరారు చేసి టెండర్లు ఆహ్వానించింది. వివిధ జిల్లాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్‌ను ప్రైవేటు నిర్వహణకు అప్పగించడం ద్వారా పర్యాటకులకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి రావడంతో పాటు సంస్థకు ఏటా రూ.2 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. నూతన పర్యాటక విధానం–2025 పెట్టుబడిదారులకు అనేక రాయితీలిస్తుండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. అత్యధికంగా రెస్టారెంట్లు, రిసార్టులు.. వో అండ్ ఎం కింద 15, 20, 33 ఏళ్లపాటు లీజుకి ఇవ్వనున్నారు. వీటిల్లో అత్యధికంగా రెస్టారెంట్లు, రిసార్ట్స్ ఉన్నాయి. ఇటీవల ఏపీటీడీసీ అధికారులు వాటి కనీస ధరను నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. 25వ తేదీ బిడ్డింగ్ ప్రక్రియకు తుది గడువుగా నిర్ణయించారు. పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం, చిత్తూరులో రెండేసి, గుంటూరులో మూడు, విశాఖలో ఐదు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏడు.. రెస్టారెంట్లు, రిసార్ట్స్, హోటళ్లను ప్రైవేట్ ద్వారా నిర్వహించనున్నారు. మరోవైపు పర్యాటక శాఖకు చెందిన స్థలాల్లో కన్వెన్షన్ హాళ్లు, ఫుడ్ కోర్టులు, వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయనున్నారు. రాజమండ్రిలో ఇటీవల ప్రారంభించిన ఫ్లోటింగ్ జెట్టీ, అలిపిరిలో 103 గదులతో నిర్మాణ దశలో ఉన్న హరిత హోటల్, నెల్లూరు నగరంలోని ఎకో పార్క్, విశాఖలో యారాడ బీచ్ ఎమినిటీస్‌ను వో అండ్ ఎం ద్వారా అందుబాటులోకి తేనున్నారు. పాత టూరిజం పాలసీ ప్రకారం లీజు అద్దె అక్కడి మార్కెట్ విలువలో రెండు శాతంగా ఉండేది. దీనికి తోడు ఏటా 5 శాతం అద్దె పెరుగుతూ వచ్చేది. ఫలితంగా పెట్టుబడిదారులు ఆసక్తి చూపేవారు కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీ ప్రకారం లీజు అద్దెను ఒక శాతానికి తగ్గించడంతో పాటు.. మూడేళ్లకోసారి మాత్రమే 5 శాతం లీజు అద్దెను పెంచనున్నారు. కొత్తగా మారిటైం సమయాన్ని నెల నుంచి 4 నెలలకు పెంచారు. పర్యాటక ఆస్తుల సద్వినియోగం.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ఆస్తులను వినియోగంలోకి తెస్తున్నాం. ఈ క్రమంలోనే 34 ప్రాజెక్టులను వో అండ్ ఎం కింద ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నాం. తద్వారా ఆయా హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు అందుబాటులోకి రావడంతో పాటు, పర్యాటక ఆదాయం కూడా పెరుగుతుంది. – ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, ఏపీటీడీసీ చైర్మన్ -
అమ్మ బాబోయ్ వీడేంట్రా వేడి వేడి నూనెలో డైరెక్ట్‌గా చేతులు పెట్టేస్తున్నాడు!
ఇటీవల కాలంలో ప్రముఖ రెస్టారెంట్లలోనూ, స్ట్రీట్ ఫుడ్లు తయారు చేసే వాళ్లు తమ పాక కళా శాస్త్ర నైపుణ్యాలతో భోజన ప్రియులను భలే ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు వారు కొంగొత్త రుచులతో భోజన ప్రియులను మైమరిపించడంతో ప్రముఖులుగా పేరు తెచ్చుకంటున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) అంతేకాదు ఇటీవల కాలంలో చెఫ్ ఒక్కొక్కరూ ఒక్కొ రకమైన పద్దతుల్లో వంటకాలను చేసి కస్ట్మర్లను మంత్రముగ్దులను చేస్తున్నారు. ఇదే తరహాలో ఒక స్ట్రీట్‌ఫుడ్ చెఫ్ భయంకరంగానూ, విస్తుపోయే విధంగా ఎలా వేడి వేడి నూనెలో చేతులు పెట్టి వంటకాన్ని తయారు చేస్తున్నాడో చూడండి. అసలు విషయంలోకెళ్లితే...ఇక్కడోక స్ట్రీట్ ఫుడ్ లో వంటలు చేసే వ్యక్తి చికెన్‌ని డీప్ ఫ్రై చేస్తున్నాడు. అంతే ఉన్నటుండి ఒక్కసారిగా మరుగుతూ ఉన్న నూనెలో డైరెక్ట్‌గా చేతులతో చికెన్ ముక్కలు తీసేస్తున్నాడు. పైగా అతని చేతులు ఏ మాత్ర కాలినట్లుగా తన పనులు తాను చేసుకుంటూ పోతాడు. దీంతో సదరు కస్టమర్లు ఒక్కసారిగా విస్తూపోతారు. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు వీడు ఐరన్ మ్యాన్‌లా ఎలా చేస్తున్నాడర్రా బాబు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: దుపట్టా మేరా సాంగ్‌కు దుమ్ములేపేశారు..) View this post on Instagram A post shared by SHAILESH | JAIPUR (@nonvegfoodie) -
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. స్విగ్గీ, జొమాటో ఇక రెస్టారెంట్లే
లక్నో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ మండలి శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఇప్పుడేమీ చర్చించేది లేదన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎక్సైజ్ సుంకం, వ్యాట్‌ను ఒకే దేశీయ పన్ను రేటుగా మార్చితే అది ఇటు కేంద్రం అటు రాష్ట్రాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అభిప్రాయమే దీనికి కారణం. ఇక జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5% జీఎస్టీ పన్ను విధించింది. లక్నోలో శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రుల జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం జరిగింది. భేటీ అనంతరం సీతారామన్ తెలిపిన వివరాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► కొన్ని కోవిడ్–19 ఔషధాలపై రాయితీ పన్ను రేట్లను మూడు నెలలు అంటే డిసెంబర్ 31 వరకూ పొడిగించింది. ఖరీదైన జోల్జెన్సా్మ, విల్టెప్సో వంటి కండరాల క్షీణత ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభించింది. సెపె్టంబర్ 30తో ముగిసే మెడికల్ పరికరాలపై మినహాయింపులు ఇక కొనసాగవు. ► కేన్సర్ సంబంధిత ఔషధాలపై రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు. ► బలవర్థకమైన బియ్యం విషయంలో 18 శాతం నుండి 5 శాతానికి జీఎస్టీ రేటు కోత. ► బయో–డీజిల్ బ్లెండింగ్‌కు సంబంధించి రేటు 12 శాతం నుంచి 5 శాతానికి కుదింపు. ► వస్తు రవాణా విషయంలో రాష్ట్రాలు విధించే నేషనల్ పరి్మట్ ఫీజు జీఎస్టీ నుంచి మినహాయింపు ► లీజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ దిగుమతి ఐ–జీఎస్టీ చెల్లింపు మినహాయింపు. ► అన్ని రకాల పెన్నులపై 18% జీఎస్టీ. ► పునరుత్పాదక రంగ పరికరాలకు 12 శాతం పన్ను విధింపు. -
Hyderabad: చిట్టి ఇన్ టౌన్.. రోబో@ రెస్టారెంట్
ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మనిషి జీవనశైలిలోనే కాదు ఆతిథ్య రంగంలోనూ మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో వెయిటర్లు వడ్డిస్తే తినడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. దీంతో ఓ రెస్టారెంట్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించి వెయిటర్ల స్థానంలో రోబోలను తీసు కొచ్చారు. వినియోగదారులు ఇచ్చే ఆర్డర్లను తీసుకొని సర్వ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సరూర్‌నగర్ హూడాకాంప్లెక్స్లోని ‘చిట్టి ఇన్ టౌన్’ రోబో రెస్టారెంట్ వేదికగా మారింది. సాక్షి, హుడాకాంప్లెక్స్: కరోనాకు భయపడి చాలా మంది రెస్టారెంట్ ఫుడ్‌కు దూరంగా ఉంటున్నారు. ఫుడ్ సర్వ్ చేసే వాళ్లకి కరోనా లక్షణాలు ఉంటే తమకు ఎక్కడ సోకుతుందోనని ప్రజలు హోటల్, రెస్టారెంట్‌కి వెళ్లడానికి జంకుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మలక్‌పేట్‌కు చెందిన మణికాంత్‌గౌడ్ వినూత్నంగా ఆలోచించాడు. వెయిటర్ల స్థానంలో రోబోలను పెట్టి ఫుడ్ సర్వ్ చేసేలా.. ఆర్డర్ తీసుకునేలా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాలని పూనుకున్నాడు. కొత్తపేట్‌లోని హుడాకాంప్లెక్స్‌లో ‘చిట్టి ఇన్ టౌన్’పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ నాలుగు రోబోలను అందుబాటులో ఉంచారు. రెస్టారెంట్‌కు వచ్చే వారి ఆర్డర్లు తీసుకోవడం.. వచి్చన ఆర్డర్లను షెఫ్‌కు అందజేయడం... ఆహారం రెడీ అయిన తర్వాత ఆహారప్రియులకు వడ్డిస్తున్నాయి. అంతే కాకుండా తిన్న తరువాత ప్లేట్లను తీసుకెళ్లి శుభ్రం చేయడం.. బిల్లు జారీ చేయడం.. కస్టమర్ ఇచ్చిన డబ్బులను తీసుకెళ్లి కౌంటర్లో జమ చేయడం పనులన్నీ రోబోలే చేస్తుండటం విశేషం. రోబోలు చేస్తున్న ఈ పనులను చూసి కస్టమర్లు మంత్రముగ్ధులవుతున్నారు. మరో రోబో వచ్చి రెస్టారెంట్‌కు వచ్చిన వారితో ముచ్చటిస్తుంది. వచి్చన వారికి బోరు కొట్టకుండా చూస్తూ అతిథులను అమితంగా ఆకట్టుకుంటోంది. మంచి ఆదరణ.. కోవిడ్భయంతో రెస్టారెంట్‌కు రావడానికి జనాలు భయపడేవారు. నలుగురు మిత్రులం కలిసి వినూత్నంగా ఈరెస్టారెంట్ను ప్రారంభించాం. ఇప్పటికే మేం రోబోటిక్ కోర్సులను పూర్తి చేసి ఉండటంతో రోబోల తయారీ, పనితీరుపై మాకు అవగాహన ఉంది. ఇది మాకు కలిసి వచ్చింది. వీటిని చూసేందుకు చాలా మంది వస్తున్నారు. 120 సీటింగ్ సామర్థ్యం ఉన్నరెస్టారెంట్కు రావాలంటే ఆన్లైన్ బుకింగ్ తప్పని సరి. నేరుగా వచ్చేవారు వేచిఉండాల్సి ఉంటుంది. ఈ రోబోలతో రెస్టారెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. – మణికాంత్ గౌడ్, రెస్టారెంట్ యజమాని -
చిన్న పట్టణాల్లోనూ దూసుకెళ్దాం!
న్యూఢిల్లీ: క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (సత్వర సేవలు అందించేవి/క్యూఎస్ఆర్), మధ్య స్థాయి గ్రోసరీ రిటైల్ సంస్థలు చిన్న పట్టణాల్లోకి వేగంగా విస్తరించే ప్రణాళికలతో ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లు కరోనా లాక్డౌన్ల నుంచి కోలుకుంటుండడం.. డిమాండ్ క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఈ సంస్థలు వేగంగా విస్తరించాలనుకుంటున్నాయి. డోమినోస్ పిజ్జా, మెక్‌డొనాల్డ్, కేఎఫ్‌సీ ఇవన్నీ క్యూఎస్ఆర్ కిందకే వస్తాయి. వీటితోపాటు గ్రోసరీ గొలుసు దుకాణాల సంస్థ మోర్ సైతం చిన్న పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. చిన్న పట్టణాల్లో వీటి వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతుండడం ఆయా సంస్థలకు ఉత్సాహాన్నిస్తోంది. యువత నుంచి తమ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోందని, ఆకర్షణీయమైన ధరలు కూడా వినియోగదారులకు చేరువ చేస్తున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. దేశంలో అతిపెద్ద క్యూఎస్ఆర్ అయిన జుబిలంట్ ఫుడ్ వర్క్స్ డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ బ్రాండ్ల కింద దేశవ్యాప్తంగా 1,360 రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో (2020–21) కొత్తగా 135 స్టోర్లను ప్రారంభించిన ఈ సంస్థ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇంచుమించుగా ఇదే స్థాయిలో నూతన స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. టైర్–1 పట్టణాలతో పోలిస్తే ఇతర పట్టణాల్లో వ్యాపార వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు మార్చి ఫలితాల తర్వాత ఇన్వెస్టర్ల సదస్సులో ఈ కంపెనీ తెలిపింది. వృద్ధి బాటలోకి.. ‘‘మార్చి త్రైమాసికంలో తిరిగి వృద్ధి బాటలోకి అడుగు పెట్టాం. భారీగా నూతన స్టోర్లను ప్రారంభించడం కూడా జరిగింది. మార్జిన్లతోపాటు పోర్ట్‌ఫోలియోలోని బ్రాండ్ల సంఖ్య కూడా పెరిగింది’’ అని జుబిలంట్ ఫుడ్ వర్క్స్ సీఈవో ప్రతీక్పోట తెలిపారు. కరోరా రెండో విడత పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై ప్రభావం చూపించిందని.. నూతన వినియోగదారులకు చేరువ కావడమే వృద్ధి చోదకం అవుతుందని ఈ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘టైర్ 2, 3, 4 పట్టణాల్లోకి ప్రముఖ బ్రాండ్లు విస్తరిస్తున్నాయి. ఎందుకంటే ఈ చిన్న పట్టణాల్లో ఆయా కంపెనీలకు ఆదాయ వృద్ధి ఎక్కువగా ఉంటోంది’’ అని అనరాక్ రిటైల్ సంయుక్త ఎండీ పంకజ్ రెంజెన్ చెప్పారు. స్టోర్లను పెంచుకుంటూనే ఉన్నాయ్.. సాధారణంగా రెస్టారెంట్ల వ్యాపారం డెలివరీపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. దీంతో చిన్న పట్టణాల్లో చిన్న స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా స్థానికంగా డెలివరీ డిమాండ్‌ను చేరుకోవచ్చని కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ‘‘కరోనా కారణంగా సమస్యలు ఏర్పడినప్పటికీ టైర్–2, 3 పట్టణాల్లో, మెట్రోల్లోనూ మా ఫ్రాంచైజీ రెస్టారెంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూనే ఉంది’’అని కేఎఫ్‌సీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. కోజికోడ్, నిజామాబాద్, ముజఫర్‌పూర్, భాగల్పూర్ తదితర పట్టణాల్లో కేఎఫ్‌సీకి చెందిన యూమ్ రెస్టారెంట్లను తెరిచినట్టు చెప్పారు. మధ్య స్థాయి గ్రోసరీ రిటైల్ సంస్థలు సైతం చిన్న పట్టణాల్లో విస్తరణపై దృష్టి పెట్టాయి. ఆగ్రా, ఫైజాబాద్, ముజఫర్‌పూర్, సితాపూర్, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో విస్తరణ కోసం మోర్ సంస్థ స్థలాలను లీజుకు తీసుకుంది. కరోనా వల్ల లాక్డౌన్లు విధించినప్పటికీ చిన్న పట్టణాల్లోని యువ వినియోగదారులు తమ వృద్ధి చోదకాలని కంపెనీలు చెబుతున్నాయి. డోమినోస్ తన యాప్‌లో హిందీని చేర్చగా.. త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికతో ఉంది. -
బ్యాంక్ రంగం పై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా
-
కొత్త బిజినెస్ మొదలు పెట్టనున్న ఇలియానా!
నటీనటులు వ్యాపారాలు చేయడం కొత్తేమీ కాదు.. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు ఇప్పటికే వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. గోవా బ్యూటీ ఇలియానా కూడా త్వరలో కొత్త వ్యాపారం మొదలు పెట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇలియానా కొత్త బిజినెస్ మొదలుపెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. అందులో భాగంగానే బేకరీ, రెస్టారెంట్లు వంటి చైన్ బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. హీరోయిన్గా తనకు ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని తన పేరుతోనే వీటిని మార్కెట్ చేసుకోవాలనుకుంటున్నారని టాక్. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం అంటే రిస్క్ చేసినట్టే అనే కొందరు అన్నారట. ఇలియానా కూడా ఈ ఆలోచనతోనే లాక్డౌన్ తర్వాతే వ్యాపారం ఆరంభించాలనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. సో.. భవిష్యత్తులో ఇలియానా బేకరీ, ఇలియానా రెస్టారెంట్‌కి శ్రీకారం జరుగుతుందన్నమాట. -
Hotel Industry: అతిథులు లేక వెలవెల
కరోనా పహారా కాస్తుండగా హోటల్‌కొచ్చి ఆహారం ఎవరైనా తినగలరా..? వినియోగదారులకు బదులు కరోనా ఎంట్రీ ఇస్తే ఎవరైనా రెస్టారెంట్లను తెరిచి ఉంచగలరా..? కష్టమే కదా! అవును.. ఇప్పుడు ఆతిథ్యరంగం ఆగమాగమైంది. కరోనా తిథిలో అతిథికి కష్టమే! కోవిడ్ పడగ నీడన హోటల్ ఇండస్ట్రీ ఏవిధంగా కుదేలైందో ఓసారి ఈ కథనం చదవండి.. మీకే తెలుస్తుంది! సాక్షి, హైదరాబాద్: అది లక్డీకాపూల్ చౌరస్తాలో పేరొందిన హోటల్.. ఎప్పుడూ భోజనప్రియులతో కిక్కిరిసి ఉం టుంది.. ఆ హోటల్ కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లి తిరిగి రాలేదు.. గిరాకీ కూడా తక్కువగా ఉండటంతో యాజమాన్యం ఆ హోటల్‌ను మూసేసింది. అది అల్పాహార ప్రియులకు రుచికరమైన ‘చట్నీ’లు అందించడంలో పేరెన్నికగన్న హోటల్ గ్రూపు.. తమ కొత్తశాఖను అబిడ్స్‌లో గతేడాది ఆరం భంలో ప్రారంభించింది.. అంతలోనే కార్యకలాపాల ను నిలిపివేసి నాలుగైదు నెలల క్రితం తిరిగి కొనసాగించింది.. ఇప్పుడు ఉన్నట్టుండి బంద్ చేసింది.జాతీయస్థాయిలో పేరొందిన మరో హోటల్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని తమ బ్రాంచ్‌ను శాశ్వతంగా మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకిలా..? తెరిచిన హోటళ్లు ఎందుకు మూతపడుతున్నాయి.. మూతబడిన హోటళ్లు ఎం దుకు తెరుచుకోవడంలేదు.. ఏమైందీ హోటళ్లకు?.. అన్నింటికీ సమాధానం.. ‘కరోనా’! ఆతిథ్యరంగంపై కరోనా కర్కశ దాడికి ఇవి సాక్ష్యాలు మాత్రమే. కేవలం ఈ హోటళ్లే కాదు. చిన్నా, చితకా ఆహారపుబండ్లు కూడా చితికిపోయాయి. లాక్డౌన్, వైరస్ ప్రభావంతో పడిలేచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హోటల్ ఇండస్ట్రీపై సెకండ్‌వేవ్ మళ్లీ పంజా విసిరింది. రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలతో హోటల్ బిజినెస్ 25%, ఫుడ్ ఆన్లైన్ బిజినెస్ 20 శాతానికి మించిలేదు. ఇప్పటికే పెట్టుబడులు భారం మారాయి. విద్యుత్ బిల్లులు, నిర్వహణ ఖర్చులు తలకుమిం చిన భారంగా తయారయ్యాయి. ఐదు నక్షత్రాలు, మూడు నక్షత్రాల హోటళ్లు, రెస్టారెంట్లు ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయి సంక్షోభంలో కూరుకుపోయాయి. ఏడాది కాలంగా హోటళ్ల రంగాన్ని కరోనా కకావికలం చేస్తోందని పలువురు హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిర్వహణ భారం సాధారణ సదుపాయాలతో రెస్టారెంట్ నిర్వహించాలంటే కనీసం రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల పెట్టుబడి అవసరం. బిజినెస్ నడవకపోయినా అద్దె, విద్యుత్ చార్జీలు, వర్కర్ల జీతభత్యాలు చెల్లించాల్సిందే. నెలకు కనీసం రూ.లక్ష నుంచి రెండు లక్షల అద్దె ఉంటుంది. ఒక్కో రెస్టారెంట్లో వంట మాస్టర్లు మొదలు క్లీనర్లు, బేరర్ల వరకు సగటున 20 నుంచి 30 మంది పనిచేస్తారు. వారందరికీ జీతాలతోపాటు అదే హోటల్లో 3 పూటలా తిండి పెట్టా ల్సి ఉంటుంది. వంటశాలలో గ్రైండర్లు, హీటర్లు, గ్రీజర్లు, రెస్టారెంట్లో ఏసీలు, ఫ్యాన్ల వినియోగానికి విద్యుత్ చార్జీలు కమర్షియల్ టారిఫ్ కింద చెల్లించాలి. ఇవి పెద్ద మొత్తంలోనే ఉంటాయి. ఆదాయం 73 నుంచి 20 శాతానికి తగ్గుదల కరోనాకు ముందు ప్రతినిత్యం రూమ్ ఆక్యుపెన్సీ సగటు 60 నుంచి 80% వరకు ఉండేది. లాక్డౌన్ అనంతరం కొన్ని కార్పొరేట్ రెస్టారెంట్ల పరిస్థితి కొంత మెరుగ్గా కనిపించినా... మిగిలిన రెస్టారెంట్ల బిజినెస్ అంతంత మాత్రంగా తయారైంది. దీంతో నగరంలోని పేరొందిన హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. హోటళ్లలో ఫుడ్, బేవరేజెస్ అమ్మకాలు, ఈవెంట్స్ నిర్వహణ దెబ్బతినడంతో ఆదాయం 73% నుంచి 20 శాతానికి పడిపోయింది. మధ్య తరగతి హోటళ్లలో సైతం నగరానికి వచ్చి నవారు బస చేసేందుకు సుముఖత చూపకపోవడంతో ఆక్యుపెన్సీ 20 శాతానికి మించలేదు. ప్రతిరోజూ రూ.50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు వ్యాపారం సాగేది. గతేడాది లాక్‌డౌన్‌తో జీరోకు చేరి, తిరిగి అన్‌లాక్ అనంతరం బిజినెస్ నెమ్మదిగా రూ.5 కోట్ల నుంచి 40 కోట్లకు చేరింది. ఇప్పుడు సగానికిపైగా పడిపోతున్నట్లు తెలుస్తోంది. ‘అడ్వాన్స్’ఇక్కట్లు గ్రేటర్ హైదరాబాద్‌లో స్టార్, మధ్య తరహా హోట ళ్లు 1500లకుపైగా, చిన్న హోటల్స్, లాడ్జీలు 3,500 వరకు ఉంటాయన్నది అంచనా. నగరంలోని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లకు బల్క్ బుకింగ్స్ ద్వారానే ఆదాయం సమకూరుతోంది. అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లు, వేడుకలు, పార్టీలు, ఫంక్షన్లు, సినిమా షూటింగ్స్ వీటికి ప్రధాన ఆదాయవనరులు. ఆయా హోటళ్ల్ల గదులు, ఆహార పదార్థాలకు బల్క్ బుకింగ్ పద్ధతిలో ఆర్డర్లు ఉండేవి. ఐటీ రంగ నిపుణుల విడిదితోపాటు కొత్తగా పెట్టుబడులు, కంపెనీలను విస్తరించాలనుకునేవారు, సమావేశాల కోసం ఢిల్లీ, ముంబై వంటి నగరాల నుంచి వచ్చేవారితో హోటళ్లకు భారీగా ఆదాయం సమకూరేది. ఒకప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ కోసం పోటీపడే పరిíస్థితి కోవిడ్ అనంతరం కరువైంది. ఇప్పుడు 40% నుంచి 5%కి పడిపోయింది. ఫుడ్ కోర్టులు–ఆన్లైన్ ఆర్డర్లు.. మామూలుగానైతే రాత్రి పూటనే ఫుడ్‌కోర్టుల వ్యాపారం కొనసాగుతుంది. కర్ఫ్యూతో ఫుడ్‌కోర్టు లు త్వరగా మూసివేయక తప్పడంలేదు. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు తగ్గుముఖం పట్టాయి. దినసరి ఫుడ్ డెలివరీ ఆర్డర్లు 50 శాతానికి పడిపోగా, ఉపాధి సరిగా లేక డెలివరీ బాయ్స్‌కు ఆదాయం క్షిణిస్తోంది. ప్రభుత్వం ఆదుకోవాలి లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే నెమ్మదిగా రికవరీ దిశగా అడుగులేస్తున్న హోటల్ ఇండస్ట్రీపై సెకండ్ వేవ్ మళ్లీ కోలుకోని దెబ్బతీసింది. తాజాగా విధించిన రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలతో బిజినెస్‌లేక నిర్వహణ భారంగా తయారైంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. మళ్లీ గాడిలో పడాలంటే కష్టమే. సర్కారు ఖజానాకు ఆదాయ వనరులుగా ఉన్న హోటల్ పరిశ్రమ నష్టాలపాలైనప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంది. కరోనా కష్టకాలంలో జీఎస్టీ రద్దు చేయాలి. విద్యుత్ చార్జీల్లో రాయితీ కల్పించాలి.హోటల్ ఇండస్ట్రీని రక్షించాలి. – సద్ది వెంకట్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రభుత్వ ఖజానాకు తగ్గిన రాబడి హోటల్ రంగం ద్వారా ప్రభుత్వానికి వచ్చే జీఎస్టీ పడిపోయింది. సాధారణ రోజుల్లో ఒక్కో రెస్టారెంట్ ద్వారా నెలకు రూ.లక్ష నుంచి రూ.4 లక్షలు వరకు ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. రాష్ట్రం మొత్తం మీద జీఎస్టీ రూపంలో వచ్చే రాబడిలో గ్రేటర్ హైదరాబాద్ వాటా 70 శాతానికిపైగా ఉంటుంది. 2020–21 సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో రాబడి శూన్యం. రెండో, మూడో త్రైమాసికంలో అది 20 నుంచి 40 శాతం మించలేదు. చివరి త్రైమాసికం భారీగానే రాబడి వచ్చింది. తాజాగా సెకండ్‌వేవ్‌తో తిరిగి బిజినెస్ తగ్గి రాబడి పడిపోయే పరిస్ధితి కనిపిస్తోంది. 90 వేల కార్మికుల ఉపాధికి దెబ్బ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, స్టార్ హోటళ్ల చెఫ్‌లు, కుక్‌లు, హెల్ప ర్లు, సప్లయర్లుగా 90 వేలపైనే పనిచేస్తున్నట్లు కార్మిక శాఖ అధికార గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 80% అస్సాం, మణిపూర్, ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ రాష్ట్రాలకు చెందినవారే. లాక్డౌన్ వల్ల 90%పైగా కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయి అన్‌లాక్ అనంతరం 45% మంది తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌తో హోటల్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు ఉపాధి లేక రోడ్డునపడే పరిస్థితి కనిపిస్తోంది. ‘గాలి’ప్రచారంతో.. ‘గాలి నుంచి కరోనా సోకుతోందంటూ జరుగుతున్న ప్రచారంతో రెస్టారెంట్లు, హోటళ్లకు కస్టమర్లు రావడం లేదు. దీనికితోడు గతంలో సమూహాలుగా వచ్చే వినియోగదారులు ఇప్పుడు ఒకరిద్దరుగానే వస్తున్నారు. దీనికితోడు గతంలో 20 నిమిషాలకుపైగా గడిపే సమయం కాస్త 10 నిమిషాలకు తగ్గించేశారు. దీంతో ఒక్క ఆర్డర్‌ను మాత్రమే ఇస్తున్నారు. కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్, ఇతర ఆహారపు ఆర్డర్లు పూర్తిగా తగ్గించారు’అని గచ్చిబౌలికి చెందిన మరో హోటల్ యజమాని వెల్లడించారు. చదవండి: ప్రైవేటు దోపిడీని అడ్డుకోండి -
ఐటీ రాజధానిలో మొదలైన కరోనా సెకెండ్ వేవ్
సాక్షి, బెంగళూరు: ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో మహిళల కంటే పురుషులకే అధికంగా కరోనా వైరస్ సోకుతోంది. మాస్క్ వినియోగించడంలో నిర్లక్ష్యం వహించడంతో పాటు మహిళలతో పోలిస్తే బయట తిరిగేది ఎక్కువ మగవారే కావడంతో కరోనా బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. గత ఆరు రోజుల్లో 3,364 మంది పురుషులకు, 2,334 మంది మహిళలకు పాజిటివ్‌గా నిర్ధారించారు. వారంరోజుల నుంచి కర్ణాటకలో కరోనా రెండో ఉధృతి ప్రారంభమైందనడానికి సూచికగా నిత్యం 1500 లకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా నియమాలను మహిళల కంటే పురుషులే అధికంగా ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది. పబ్‌లు, రెస్టారెంట్లు, సభలు, సమావేశాలు, వివాహాలు, రెస్టారెంట్లలో ఎక్కువగా పురుషులే పాల్గొంటున్నారు. మొదలైన సెకెండ్ వేవ్.. ఈ ఏడాది (2021) ఆరంభమైన తర్వాత తొలిసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేల మార్క్ దాటింది. గత వారం రోజులుగా వెయ్యి పైగా పాజిటివ్‌లు నిర్ధారిస్తున్నారు. గతంలో 2020 నవంబరు 14వ తేదీన 2,154 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మార్చి 24వ తేదీన రెండు వేల మార్కు దాటింది. ఈ నెలారంభంలో 5,800గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య.. 23వ తేదీ నాటికి 15 వేలు దాటింది. -
సినిమా చూపించలేం మావా!
స్టార్ హీరోల కటౌట్లతో కళకళలాడిన థియేటర్ అది వందల సినిమాలను చూపించిన తెర అది హౌస్‌ఫుల్ బోర్డ్‌తో ఆనందించిన స్క్రీన్ అది గల్లాపెట్టె గలగలు విన్న చోటు అది తెగిన టికెట్లు, విసిరిన పూలతో మురిసిన ప్రాంగణం అది కానీ ఇక ఇవేవీ కనబడవు. స్టార్ల కటౌట్ల స్థానంలో ఆఫర్ల హోర్డింగులు అగుపించనున్నాయి పెళ్లి భజంత్రీలు మోగనున్నాయి రెస్టారెంట్లు కనపడబోతున్నాయి. భాగ్యనగరంలో పలు సింగిల్ థియేటర్లు మూతపడబోతున్నాయి. కొన్నేళ్లుగా ‘సినిమా చూపిస్త మావా’ అంటూ కొన్ని వందల సినిమాలు చూపించాయి. ఇక ‘సినిమా చూపించలేం మావా’ అంటున్నాయి. హైదరాబాద్‌లో ఫేమస్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొన్ని మూతపడనున్నాయని తెలిసింది. హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్‌కు పాపులర్ జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా ఆడేదాన్ని బట్టి హిట్, ఫ్లాప్ డిసైడ్ చేయొచ్చు అంటారు సినిమా పండితులు. సంధ్య, సుదర్శన్, దేవి, శ్రీమయూరి, సప్తగిరి, ఉష మయూరి... ఈ ఏరియాలో చాలా ముఖ్యమైన థియేటర్లు. ఈ థియేటర్స్‌లో శ్రీ మయూరి 70 ఎంఎంని త్వరలోనే మూసేయాలనుకుంటున్నారట. అలానే హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ఉండే ఫేమస్ సింగిల్ స్క్రీన్లు కూడా మూతబడనున్నాయని తెలిసింది. టోలీచౌకి ఏరియాలోని ‘గెలాక్సీ’, నారాయణగూడలోని ‘శాంతి’ థియేటర్, బహదూర్‌పురలోని ‘శ్రీరామా’, మెహదీపట్నంలోని ‘అంబ’, సికింద్రాబాద్ ఏరియాలోని ‘టివోలీ’, ఎల్బీ నగర్‌లోని ‘సుష్మ’ థియేటర్స్ కూడా మూతపడనున్నాయని సమాచారం. కరోనా వల్ల థియేటర్స్ పరిశ్రమకు పూర్తిస్థాయిలో దెబ్బ పడింది. ఎనిమిదిన్నర నెలలు అయింది థియేటర్స్‌లో బొమ్మ పడి... కౌంటర్ దగ్గర టికెట్స్ తెగి. అయితే ఇలా థియేటర్స్‌ను మూసివేయడం సినిమా ప్రేమికులకు పెద్ద దెబ్బే. కానీ కోవిడ్ కంటే ముందు నుంచి కూడా సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి బాలేదు. థియేటర్లు నిండకపోవడం, టికెట్ రేట్లు, రెంటల్ చార్జీలు, కరెంట్ బిల్లులు, యూఎఫ్ఓ (ప్రొజెక్టర్‌కి సంబంధించినవి) బిల్లులు.. ఈ లెక్కల్లో లాభం చూడటం గగనం అనే పరిస్థితులే థియేటర్లు మూసేద్దాం అనే నిర్ణయం వెనక బలమైన కారణం అని తెలిసింది. కరోనా వల్ల పరిస్థితి ఇంకా దారుణం అయింది. సినిమా పరిశ్రమ కోలుకోవాలని ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా థియేటర్ల యాజమాన్యాలకు అనేక రాయితీలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రకటన తర్వాత సినిమాహాళ్లు త్వరలోనే తెరచుకుంటాయి అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇలా పలు థియేటర్లకు శాశ్వతంగా తాళాలు పడబోతున్నాయనేది ఆయా థియేటర్లలో సినిమాలు చూసి ఆనందించిన ప్రేక్షకులకు చేదు వార్తే. ఈ సింగిల్ స్క్రీన్స్‌ను ఫంక్షన్ హాలులా, సూపర్ మార్కెట్లలా, షాపింగ్ మాల్స్‌లా మార్చబోతున్నారని తెలిసింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ సంఖ్య చాలా ఎక్కువ. అలానే మన తెలుగులో విడుదలయ్యే సినిమాల సంఖ్య కూడా అంతే. మరి థియేటర్స్ ఒక్కొక్కటిగా మూతపడితే థియేటర్స్ సిస్టమ్ కచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. ఆల్రెడీ ఓటీటీ వర్సెస్ థియేటర్స్ డిబేట్ ఓవైపు నడుస్తూనే ఉంది. ప్రేక్షకుడిని థియేటర్స్‌వైపు వచ్చేలా చేస్తూనే, ఆల్రెడీ ఉన్న థియేటర్స్‌ను కమర్షియల్ స్పేస్లా మార్చేయకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. ఎందరో సూపర్స్టార్లు పుట్టిన సింగిల్ స్క్రీన్లు తన శోభ కోల్పోకూడదు. థియేటర్లు మూతపడటానికి ప్రధాన కారణం గురించి థియేటర్ యాజమాన్యాల ప్రతినిధిగా సదానందం మాట్లాడుతూ – ‘‘లాభం లేకుండా ఏ వ్యాపారమూ చేయలేం. గవర్నమెంట్ నుండి మాకు రావాల్సిన రాయితీలు అన్నీ ఇచ్చామంటున్నారు. కానీ, పన్నెండేళ్లుగా రావాల్సిన థియేటర్ మెయింటినెన్స్ ఛార్జీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. (ప్రతి సినిమా టిక్కెట్‌కు 3 రూపాయలు గవర్నమెంట్ చెల్లించాలి). అలాగే రెండేళ్లనుండి థియేటర్లో ఫ్రీ పార్కింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో పార్కింగ్‌కు డబ్బులు లేక థియేటర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దానికి తోడు కరోనా కారణంగా సినిమాల ప్రొడక్షన్ తగ్గటం వంటి ఎన్నో కారణాలతో ఈ థియేటర్లు మూతపడుతున్నాయి. ఈ థియేటర్లన్నీ ప్రైమ్ ఏరియాల్లో ఉండటంతో వాటిని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు ఉపయోగించుకునే ఆలోచనలతో యాజమాన్యాలు ఉన్నాయి’’ అన్నారు. -
విజయవాడలో బరితెగించిన మాంసం మాఫియా
సాక్షి, అమరావతి బ్యూరో/పటమట: విజయవాడలో మాంసం మాఫియా బరితెగించింది. చనిపోయిన కోళ్లు.. చనిపోయిన మేకలు, గొర్రెల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని నీట్‌గా డ్రెస్సింగ్ చేసి రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడమే కాకుండా ప్రతి ఆదివారం బహిరంగంగానే విక్రయిస్తున్నారు. కల్తీ మాంసం విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నగరంలో వారానికి నాలుగు టన్నుల కల్తీ మాంసం విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. (ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు..) నిబంధనలు ఇవి.. నిబంధనల మేరకు కబేళాలో మటన్, బీఫ్ విక్రయదారులు తప్పనిసరిగా సంబంధిత జంతు శరీరంపై వీఎంసీ స్టాంప్ వేయించుకుని విక్రయాలు చేయాలి. కానీ ఒక పశువు, మేక, గొర్రెలకు స్టాంప్ వేయించుకుని మిగిలిన వాటి మాంసం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులైతే అది కూడా పాటించడం లేదు. అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. రెస్టారెంట్లో కుళ్లిన మాంసం ఈ నెల 4న బందరురోడ్డులోని ఓ రెస్టారెంట్లో నిల్వ ఉన్న 400 కిలోల మాంసాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్లు, వీఎంసీ వెటర్నరీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రిజ్‌లో పురుగులు పట్టి ఉన్న మాంసంతోనే వివిధ రకాల మాంసం పదార్థాలను తయారు చేయడం ఇటీవల సంచలనం కలిగించింది. ఈ నెల 8న భవానీపురం గొల్లపాలెంగట్టు వద్ద జరిగిన దాడుల్లో నగరంలోని పేరుమోసిన హోటళ్లకు సరఫరా చేసే బల్క్ మాంసం విక్రయదారుల నుంచి 400 కిలోల మాంసాన్ని వీఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఈ దాడుల్లో చనిపోయిన మేక మాంసం నుంచి పురుగులు బయటకు వచ్చాయి. అంతేకాకుండా తుప్పు పట్టిన ఫ్రీజర్‌లో మాంసం ఉంచడం వల్ల్ల ఆ తుప్పు మాంసంలోకి చేరి వాటిని తిన్నవారు అనారోగ్యం పాలవుతారని అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 3న రైల్వే పార్సిల్ కౌంటర్లో భువనేశ్వర్ నుంచి నగరానికి దిగుమతి చేసుకుంటున్న 100 మేక తలకాయలను అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 10న రామలింగేశ్వర నగర్‌లోని ఫిష్ మార్కెట్లో 100 కిలోల నిల్వ ఉన్న చేపలను విక్రయిస్తుండగా అడ్డుకున్నారు. ఈ నెల 15న కరెన్సీ నగర్, రామచంద్ర నగర్లో మటన్‌లో బీఫ్ కలిపి విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారుల నుంచి మాంసం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక
లండన్: ఒక పిజ్జా కొంటే రెండో పిజ్జా ఫ్రీ, ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ వంటి ఆఫర్లను మనం చూసే ఉంటాం. అయితే బ్రిటన్‌లో ఇలాంటి ఆఫర్లకు అడ్డుకట్ట పడబోతోంది. అంతేకాదు ప్రతి ఆహారం వల్ల ఎంత కేలరీల శక్తి వస్తుందో ఆయా వివరాలను కూడా రెస్టారెంట్లు మెనూలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి ఆలోచనలు బ్రిటిష్ ప్రభుత్వానికి కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఆలోచనలు చేశారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా కూర్చొని తినేవారి సంఖ్య పెరగడం, దాంతో ఊబకాయం కూడా పెరగడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులేస్తోంది. ఐసీయూకు వచ్చే వారిలో 8 శాతం మంది ఊబకాయంతో ఉన్నవారేనని సమాచారం. యువకుల్లో మూడింటి రెండొంతుల మంది అధిక బరువుతో బాధ పడుతున్నారని, 28 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని ప్రభుత్వం అంటోంది. బరువు తగ్గడం కష్టమే అయినా చిన్న చిన్న మార్పులతో ఫిట్‌గా ఉండొచ్చని ప్రధాని జాన్సన్ అన్నారు. -
లాక్‌డౌన్‌లోనూ భలే లాగించేశారు..!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కాలంలోనూ మనోళ్లు తెగ లాగించేశారు. దేశంలోని తమకు నచ్చిన రెస్టారెంట్ల నుంచి ఇష్టమైన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి తమ జిహ్వ చాపల్యాన్ని భోజనప్రియులు సంతృప్తిపరుచుకున్నారు. వాటిలో అగ్రస్థానం బిర్యానీకే దక్కింది. కోవిడ్ వ్యాప్తి కారణం గా విధించిన లాక్డౌన్ కాలంలో కేవలం బిర్యానీ డెలివరీ కోసమే 5.5 లక్షల ఆర్డర్లు వచ్చాయట. బట్టర్ నాన్లు, మసాలా దోశలను మూడున్నర లక్షల మార్లు భోజనప్రియులు తెప్పించుకున్నారు. మూడున్నర లక్షల ‘రెడీటు కుక్ ఇన్స్టెంట్ నూడుల్స్ ప్యాకెట్స్’డెలివరీ అయ్యాయి. చాక్లెట్ లావా కేక్‌ను 1.3 లక్షల సార్లు, గులాబ్ జామూన్ ను 85 వేల పర్యాయాలు, మౌస్సె కేక్‌ను 28 వేల మార్లు ఆర్డర్ చేశారు. కరోనా వ్యాప్తి నిరోధకం దృష్ట్యా మాస్క్‌లు, శానిటైజర్లతో పాటు వ్యక్తు ల మధ్య దూరం పాటించడం తప్పనిసరి కావడంతో పుట్టినరోజు, పెళ్లిరోజుల వేడుకలు తగ్గిపోయాయి. పలు వురు పుట్టినరోజు వే డుకలను వీడియో కాల్స్, ఆన్లైన్లో వర్చువల్ కేక్ కటింగ్ సెష న్స్ ద్వారా జరుపుకున్నారట. ఇలా లాక్డౌన్ కాలం లో 1.2 లక్షల కేక్‌లు డోర్ డెలి వరీ అయ్యాయి.ఇక భారతీయులు తమకిష్టమైన ఏయే ఆహారపదార్ధాలను, ఎన్నిసార్లు తెప్పించుకున్నారన్న దానిపై ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ‘‘స్టాట్‘ఈట్’ఇస్టిక్స్ రిపోర్ట్.. ది క్వారంటైన్ ఎడిషన్’’ పేరిట తన తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా నాలుగో ఏడాది కూడా అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహారపదార్థాల్లో బిర్యానీనే అగ్రస్థానంలో నిలిచినట్టు ఈ సంస్థ తెలిపింది. మొత్తం 4 కోట్ల ఆర్డర్ల డెలివరీ..: భారత్‌లో దాదాపు రెండున్నర నెలల పాటు అమల్లో ఉన్న లాక్డౌన్ కాలంలో ఫుడ్, సరుకులు, మెడిసిన్స్,ఇతర వస్తువులు కలిపి 4 కోట్ల ఆర్డర్లను స్విగ్గీ డెలివరీ చేసింది. ఇవేకాకుండా 73 వేల శానిటైజర్, హాండ్ వాష్ బాటిళ్లు, 47 వేల ఫేస్‌మాస్క్‌లు కూడా ఇళ్లకు చేరవేసింది. లాక్డౌన్లో రోజూ రాత్రి 8 గంటలకు సగటున 65 వేల వంతున ‘మీల్ ఆర్డర్లు’వచ్చేవని పేర్కొంది. 32.3 కోట్ల కేజీల ఉల్లిపాయలు, 5.6 కోట్ల కేజీల అరటిపండ్లు: కరోనా టైంలో ఇంటి వంటనే అస్వాదించుకునే వారి కోసమూ వివి«ధ రకాల ఆహార పదార్ధాలు, నిత్యావసర సరుకులను సైతం స్విగ్గీ సరఫరా చేసింది. దేశంలో ఇంట్లోనే వంట చేసుకున్న వాళ్లు తమకిచ్చిన ఆర్డర్ల మేరకు 32.3 కోట్ల కిలోల ఉల్లిపాయలు, 5.6 కోట్ల కిలోల అరటిపండ్లను డెలివరీ చేసినట్టు ఈ సంస్థ తెలిపింది. లాక్డౌన్ సమయంలో తమ నిత్యావసర సరుకుల విభాగం ద్వారా ఈ పంపిణీ చేసినట్టు నివేదికలో తెలిపింది. -
లాకులెత్తారు!
న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా కొనసాగుతున్న ‘లాక్డౌన్’ నుంచి వ్యూహాత్మక ‘అన్‌లాక్’ దిశగా దేశం మరో అడుగు వేసింది. మార్చి 25 తరువాత తొలిసారి దేశవ్యాప్తంగా సోమవారం పలు ప్రాంతాల్లో ప్రార్థనాలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, కార్యాలయాలు తెరుచుకున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ప్రకటించిన కఠిన నిబంధనల మధ్య ఆయా ప్రదేశాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనాలయాలు, మాల్స్‌లో ప్రవేశానికి సంబంధించి.. పరిమిత సంఖ్యలో వ్యక్తులను లోనికి అనుమతించడం, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పనిసరి చేయడం, ఆ ప్రదేశమంతా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం, ప్రవేశ ప్రాంతాలు సహా ఇతర ముఖ్య ప్రదేశాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచడం.. తదితర నిబంధనలను పాటించారు. అయోధ్యలోని రామజన్మభూమి, ఉడిపిలోని మూకాంబికా దేవాలయం, ఢిల్లీలోని జామామసీదు, అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం మొదలైనవి తెరుచుకున్నాయి. షాపింగ్ మాల్స్‌కి ఊహించిన స్థాయిలో వినియోగదారులు రాలేదు. కరోనా భయం, లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు అందుకు కారణంగా భావిస్తున్నారు. రెస్టారెంట్లలోనూ అరకొరగానే ఆహార ప్రియులు కనిపించారు. వెయిటర్లు ఫేస్ షీల్డ్‌లు ధరించి సర్వీస్ చేశారు. టేబుళ్లను దూరం దూరంగా ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లలో డిజిటల్ మెన్యూస్, డిజిటల్ పేమెంట్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. కాగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాల్లో ప్రార్థనాలయాలు, మాల్స్‌ను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. -
విజయవాడలో తెరుచుకున్న మాల్స్, రెస్టారెంట్లు
-
తెరుచుకున్న మాల్స్, రెస్టారెంట్లు..
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన చోట్ల సోమవారం నుంచి పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ నగరంలో మాల్స్,రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. కోవిడ్ నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మాల్స్, రెస్టారెంట్లకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లకు ప్రవేశద్వారం వద్ద సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ తో పాటు శానిటైజేషన్ చేస్తున్నారు. హోటల్ లో పని చేసే సిబ్బంది ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్, గ్లౌజులు వేసుకోవాలని, టేబుల్‌కు టేబుల్‌కు మధ్య దూరం ఉండే విధంగా చూడటం వంటి నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. (నేటి నుంచి అన్నీ ఓపెన్) విధులకు వచ్చే సిబ్బందితోపాటు వినియోగదారులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని.. జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది. కాగా, ఏప్రిల్ 20 నుంచే ‘రీస్టార్ట్’ పేరుతో పరిశ్రమలు ప్రారంభించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా షాపులకు.. ఇప్పుడు దేవాలయాలు, మాల్స్, హోటళ్లకు పచ్చజెండా ఊపడంతో పూర్తిస్థాయిలో వాణిజ్య లావాదేవీలు రాష్ట్రంలో మొదలయ్యాయి. -
జన సందోహంపై కఠిన నిషేధం
సాక్షి, హైదరాబాద్: దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించడంలో భాగంగా సోమవారం నుంచి రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవలను అనుమతించనున్నారు. ఈ క్రమంలో ఆయా సంస్థల నిర్వాహకులు పాటించాల్సిన ప్రామాణిక నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలను అమలు చేయడానికి ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ల నిర్వాహక కమిటీలు/ట్రస్టులు/సొసైటీలే బాధ్యులని స్పష్టం చేసింది. వీటిని అమలు చేయడంలో విఫలమైతే ఆయా స్థలాలను మూసివేయడంతో పాటు జరిమానాలు విధిస్తామని పేర్కొంది. ఇవీ సాధారణ మార్గదర్శకాలు.. ► ప్రవేశద్వారం వద్ద హ్యాండ్‌వాష్/శానిటైజర్, థర్మల్ స్కానింగ్ సదుపాయం ఏర్పాటు చేసి, కరోనా లక్షణాలు లేని వ్యక్తులకు మాత్రమే ప్రవేశం కల్పించాలి. ► భక్తులు, వినియోగదారులు, సిబ్బంది మాస్కు ధరించడం తప్పనిసరి. ► భారీ సమూహాలు/జన సందోహాలపై కఠిన నిషేధం.. ఏసీల టెంపరేచర్‌ను 24–30 సెంటీ గ్రేడ్ల మధ్య సెట్ చేయాలి. గాలిలో తేమశాతం 40–70 నిడివిలో ఉండేలా చూడాలి. ఆయా ప్రాంతాలను క్రమం తప్పకుండా పరిశుభ్రం చేయడంతో పాటు క్రిమిసంహారకాలు పిచికారీ చేస్తుండాలి. ► డోర్నాబ్స్, లిఫ్టుల బటన్లు, హ్యాండ్ రెయిల్స్, బెంచీలు, వాష్రూంలలోని పరికరాలు, తరచుగా జనం ముట్టుకునే వస్తువులను క్రమం తప్పకుండా 1 శాతం సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాలి ► వరుసల్లో ప్రజల మధ్య భౌతిక దూరం ఉండేలా మార్కింగ్ చేయాలి. ► వ్యాలెట్ పార్కింగ్ కోసం తీసుకునే వాహనాల స్టీరింగ్, డోర్ హ్యాండిల్స్, తాళం చెవులు తదితరాలను శానిటైజర్‌తో శుభ్రం చేయాలి. ► లిఫ్టుల్లో నియంత్రిత సంఖ్యలో మాత్రమే వ్యక్తులను అనుమతించాలి. ► షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లలోని గేమింగ్, క్రీడా సదుపాయాలపై నిషేధం కొనసాగుతుంది. మాల్స్‌లో దుస్తుల ట్రయల్స్‌పై అనుమతి లేదు. మత/ప్రార్థనా స్థలాల్లో పాటించాల్సిన నిబంధనలు ► ప్రాంగణంలో ప్రవేశించే ముందు అందరూ తమ చేతులు, కాళ్లను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి ► స్థల పరిమాణంతో పోల్చితే అధిక సంఖ్యలో భక్తులను అనుమతించరాదు. ► వరుసల్లో నిలబడిన వ్యక్తులను నియంత్రించడానికి అవసరమైతే డిస్పోజబుల్ పేపర్ కూపన్లను జారీ చేయాలి. ► విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను, మజార్లను ముట్టుకోవడానికి అనుమతి లేదు. ► ప్రార్థన కోసం సామూహికంగా ఒకే చాప (జానిమాజ్/మ్యాట్) వాడరాదు. ఎవరి చాప వారు తెచ్చుకోవాలి. ► ప్రసాదం, పవిత్ర జలాలు, తదితర పదార్థాల పంపిణీకి అనుమతి లేదు. ► సామూహిక వంటలు, లంగర్లు, అన్నదానాలు వంటి కార్యక్రమాల్లో భౌతిక దూరం పాటిస్తూ ఆహారం తయారు చేసి పంపిణీ చేయాలి. -
అన్‌లాక్ ఇలా..
సాక్షి, హైదరాబాద్ : సాధారణంగా ఏదైనా రెస్టారెంట్‌కు కుటుం బంతో కలసి వెళ్లినప్పుడు మనం ఏం చేస్తాం? మెనూ కార్డు తీసుకొని ఆర్డర్ ఇచ్చేందుకు ఇంటిల్లిపాదీ దాన్ని తరచితరచి చూస్తాం. ఆపై మనం పక్కనపెట్టిన కార్డును పక్క టేబుల్‌పై ఉన్న కస్టమర్లకు వెయిటర్లు ఇవ్వడమూ చూస్తుంటాం. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇకపై మెనూ కార్డు చేతులు మారే పరిస్థితికి తెరపడనుంది. ప్లాస్టిక్ మెనూ కార్డు స్థానంలో డిస్పోజబుల్ (ఒకసారి వినియోగించి పారేసే) మెనూ కార్డు దర్శనమివ్వనుంది. వీలైతే కాంటాక్ట్‌లెస్ ఆర్డర్ల విధానం అమల్లోకి రానుంది. హోటళ్లు, రెస్టారెంట్లలోని ఏసీల్లో ఉష్ణోగ్రత కేవలం 24–30 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితం కానుంది. హోటళ్లు, షాపింగ్ మాళ్లను సందర్శించే వినియోగదారుల కోసం ఈ మేరకు కొత్త నిబంధనలు ఎదురుచూస్తున్నాయి. దేశంలో కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు 80 రోజు లుగా మూతపడిన వాణిజ్య కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లను ఈ నెల 8 నుంచి తిరిగి తెరిచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తాజాగా సడలింపుల మార్గదర్శకాలను ప్రకటించింది. షాపింగ్ మాళ్లు, వాణిజ్య కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు కేటగిరీలవారీగా నిబంధనలు విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. సుదీర్ఘ విరామం తర్వాత తెరుస్తున్నందున ముందుగా శానిటైజేషన్ చేశాకే ఉద్యోగులు, సిబ్బందిని లోనికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే... కరోనా వ్యాప్తిని నిలువరించడంలో కీలకమైన భౌతికదూరం పాటించడంతోపాటు ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, ఏవైనా వస్తువులు తాకినప్పుడు లేదా పనికి ముందు, తర్వాత తప్పకుండా చేతులను శానిటైజర్/హ్యాండ్‌వాష్/సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు శుభ్రపర్చుకోవాలని కేంద్రం సూచించింది. ప్రతి వాణిజ్య కార్యాలయం, హోటల్, రెస్టారెంట్, షాపింగ్ మాల్లో యాజమాన్యం, సిబ్బంది తప్పనిసరిగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని, వినియోగదారులను తాకకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. విధులకు వచ్చే ఉద్యోగులు, సిబ్బందితోపాటు వినియోగదారులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని, జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది. కేటగిరీలవారీగా కేంద్రం మార్గదర్శకాలు ఇవీ... హోటళ్లు, అనుబంధ యూనిట్లు... ► గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారిని అనుమతించొద్దు. ►పనిచేసే సిబ్బంది తప్పకుండా మాస్కులు ధరించడంతోపాటు చేతికి గ్లౌజులు తొడుక్కోవాలి. ►కస్టమర్లు క్యూలలో నిల్చొనేటప్పుడు తప్పకుండా 6 అడుగుల భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ►రిసెప్షన్ వద్ద శానిటైజర్లు, వాష్ ఏరియాల్లో తప్పకుండా హ్యాండ్‌వాష్‌లు ఏర్పాటు చేయాలి. ► హోటల్‌కు వచ్చే అతిథుల వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలి. అందుకు ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలి. కార్యాలయాల్లో... ► ఎక్కువ మంది సిబ్బంది ఉండే కార్యాలయాలు సిబ్బందిని ఒకేసారి కాకుండా విడతలుగా లేదా వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వాలి. ► ప్రతి ఉద్యోగికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు మాస్కు వేసుకునేలా చేడాలి. ► లిఫ్ట్‌ల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. కార్యాలయం ప్రవేశంలోనే శానిటైజర్లు ఏర్పాటు చేసి వాటితో శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలి. ► శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నవారిని, జలుబు, దగ్గు తదితర లక్షణాలున్నవారికి ప్రవేశం అనుమతించవద్దు. ► మీటింగ్‌లను వీలైనంత తగ్గించుకొని ఆన్లైన్ పద్ధతిలో ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి. ► వాలెట్ పార్కింగ్ సిబ్బంది పూర్తి జాగ్రత్తతో ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. రెస్టారెంట్లలో... ► కస్టమర్ల్ల సీటింగ్ స్పేస్ విశాలంగా ఉండేలా, వ్యక్తుల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేయాలి. ► 50% సీటింగ్ సామర్థ్యానికి మించి వినియోగదారులను అనుమతించకూడదు. ► వృద్ధులు, చిన్నపిల్లల్ని అనుమతించవద్దు. ► డిస్పోజబుల్ మెనూలను వాడాలి. ఒకరు వాడిన మెనూను మరొకరు వాడకుండా చూడాలి. ► బట్ట న్యాప్కిన్లకు బదులు వినియోగదారులకు కాగితపు న్యాప్కిన్లు ఇవ్వాలి. ► కాంటాక్ట్‌లెస్ అర్డర్లతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలి. ► ప్రధానంగా పార్శిల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలి. టేక్ అవేను ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ► డోర్ డెలివరీ చేసే సిబ్బందికి తరచూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడంతోపాటు శానిటైజర్ వినియోగాన్ని విస్తృతంగా వాడేలా చూడాలి. ► సెంట్రలైజ్డ్ ఏసీ వాడకాన్ని తగ్గించి బయటిగాలి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ► కస్టమర్లు వచ్చి వెళ్లిన వెంటనే శానిటైజేషన్ చేయాలి. షాపింగ్ మాల్స్‌లో... ► లోనికి వచ్చే ఉద్యోగులు మొదలు కస్టమర్లకు ప్రవేశద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేయాలి. ► షాపింగ్‌మాల్ సామర్థ్యంలో సగం మందికే ప్రవేశం కల్పించాలి. ► ప్రతి కస్టమర్ ఎడం పాటించేలా చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి. ► ఉద్యోగులు, సిబ్బంది చేతికి గ్లౌజులు వేసుకున్నాకే కస్టమర్లకు వస్తువులు అందించాలి. ► పిల్లల ఆట ప్రాంగణాలను తెరవకూడదు. ► లిఫ్ట్ వినియోగాన్ని తగ్గించి ఎస్కలేటర్లను ప్రోత్సహించాలి. కస్టమర్ల తాకిడిని బట్టి వీలైనప్పుడల్లా షాపింగ్ మాల్‌ను సోడియం హైపోక్లోరైడ్ లాంటి ద్రావణంతో శానిటైజ్ చేయాలి. -
సకల జాగ్రత్తలతోనే పునఃప్రారంభించాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్ల వెలుపల రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఆధ్యాత్మిక స్థలాలు, ప్రార్థనా స్థలాలను ఈ నెల 8 నుంచి తెరుచుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రామాణిక నియమావళి (ఎస్ఓపీ)ని గురువారం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో ఏముందంటే.. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేనివారిని మాత్రమే హోటళ్లలో నియమించుకోవాలి. వినియోగదారుల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలే పాటించాలి. ఇక సామాజిక దూరం తప్పనిసరి. వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో హోటళ్లలో రద్దీ పెరగకుండా నియంత్రించాలి. హోటళ్లలో పనిచేస్తున్న వారిలో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వినియోగదారులతో డైరెక్టు కాంటాక్టు ఉండే విధులకు వారిని దూరంగా ఉంచాలి. ప్రజలు, సిబ్బంది రావడానికి, తిరిగి వెళ్లడానికి.. అలాగే సరుకుల రవాణాకు వేర్వేరు దారులు ఉండాలి. సాధ్యమైనంత వరకు పార్సిళ్ల రూపంలోనే.. రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం ఆర్డర్ ఇవ్వడానికి, నగదు చెల్లింపులకు డిజిటల్ వేదికలను ఉపయోగించేలా ప్రోత్సహించాలి. ఇందుకు ఈ–వ్యాలెట్లు ఉపయోగించడం మేలు. హోటళ్లకు వచ్చిన అతిథుల ఆరోగ్యం, ప్రయాణ చరిత్ర వంటి వివరాలను రికార్డుల్లో భద్రపర్చాలి. వారి నుంచి గుర్తింపు పత్రాలు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలి. అతిథుల లగేజీని రసాయనాలతో క్రిమిరహితం(శానిటైజ్) చేయాలి. అతిథులు, హోటల్ సిబ్బంది నేరుగా మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇందుకు ఇంటర్‌కామ్/మొబైల్ ఫోన్లు ఉపయోగించుకోవచ్చు. గేమింగ్ జోన్లు, చిన్న పిల్లల ఆటస్థలాలను కచ్చితంగా మూసివేయాలి. హోటళ్లలో ఒకసారి వాడి పారేసే మెనూ కార్డులు, న్యాప్కిన్లు ఉపయోగించాలి. రెస్టారెంట్లలోనే ఆహారం తినే అవకాశాన్ని నిరుత్సాహపరుస్తూ సాధ్యమైనంత వరకు పార్సిళ్ల రూపంలో ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఫుడ్ డెలివరీ సిబ్బంది ఆహార ప్యాకెట్లను కస్టమర్ల ఇంటి డోర్ల దగ్గర వదిలేయాలి. నేరుగా వారి చేతికే అందజేయడం తగదు. హోం డెలివరీకి వెళ్లే సిబ్బందికి తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. మాస్కులు ధరిస్తేనే అనుమతి షాపింగ్ మాళ్లలోనూ కరోనా నియంత్రణ చర్యలను వంద శాతం పాటించాలి. రెస్టారెంట్లు, హోటళ్లకు విధించిన మార్గదర్శకాలే షాపింగ్ మాళ్లకు కూడా వర్తిస్తాయి. మాస్కులు ధరించినవారినే లోపలికి అనుమతించాలి. మాల్ లోపల ఉన్నంతసేపూ మాస్కు ధరించేలా చూడాలి. సందర్శకులంతా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. షాపింగ్ మాల్ లోపల సందర్శకులు చేత్తో తాకేందుకు అవకాశం ఉనఅన్ని ప్రాంతాలు, వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. లోపల ఉమ్మివేయడం నేరం. కంటైన్మెంట్ జోన్ల బయట ఉన్న ఆధ్యాత్మిక స్థలాలు, ప్రార్థనా స్థలాలను తెరిచే విషయంలోనూ ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రికార్డు చేసిన పాటలు, ఆధ్యాత్మిక గీతాలు, బృంద గానాలకు ఇలాంటి చోట అనుమతి లేదు. ప్రసాదాలు పంచడం, జనంపై పవిత్ర జలాలు చల్లడం వంటివి చేయకూడదు. ఒకవేళ అన్నదానం చేస్తే అక్కడ భౌతిక దూరం పాటించాలి. మార్కింగ్ చేయాల్సిందే హోటళ్ల ముఖద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. అలాగే వినియోగదారులకు, సిబ్బందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలి. ఒక్కొక్కరికి మధ్య కనీసం 6 మీటర్ల సామాజిక దూరం ఉండేలా చూసేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని హోటళ్ల యాజమాన్యాలు నియమించుకోవాలి. వినియోగదారులు సామాజిక దూరం పాటించడం కోసం హోటల్ లోపల, బయట మార్కింగ్ చేయాలి. ఇక ఏసీలు 24–30 డిగ్రీల సెల్సియస్ మధ్య నడిచేలా చూడాలి. -
చైనీస్ రెస్టారెంట్లపై కరోనా ఎఫెక్ట్
సనత్‌నగర్/మారేడుపల్లి : ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు ‘కరోనా’ దెబ్బ ప్రభావం నగరంలోని చైనీస్ రెస్టారెంట్లపై పడింది. చైనా రెస్టారెంట్లు అంటే ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే హైదరాబాదీయుల అభీష్టానికి అనుగుణంగా వంటకాలు అందిస్తున్నప్పటికీ చైనీస్ రెస్టారెంట్లుగా ముద్రపడడంతో ‘అమ్మో చైనీస్’ వంటకాలా? అని నోరెళ్లబెడుతున్నారు. ‘కరోనా’ ప్రభావంతో నాలుగైదు రోజులుగా వ్యాపారం కొంతమేర తగ్గినట్లు వ్యాపార వర్గాలే చెబుతున్నాయి. సాధారణ రోజుల్లో 1.50 లక్షల ఆదాయం ఉంటే, వీకెండ్లో రూ.2 లక్షల పైచిలుకు ఆదాయం సమకూరేది. కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో గడిచిన నాలుగైదు రోజులుగా చైనీస్ వంటకాల జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. దీంతో తమ రెస్టారెంట్ ఆదాయం 10 నుంచి 20 శాత మేర తగ్గినట్లు బేగంపేటలోని ఓ చైనీస్ రెస్టారెంట్ ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు. సాధారణంగా చైనీస్ రెస్టారెంట్లలో ఎక్కువ శాతం వివిధ రకాల సూప్‌లతో పాటు చికెన్, మటన్, చేపలు, రొయ్యలతో వివిధ రకాల వంటకాలను తయారుచేసి అందిస్తుంటారు. ఆయా రకాల వంటకాలు హైదరాబాదీయులను నోరూరించేవే. కానీ చైనీస్ అనే పదం వినిపిస్తే కొన్ని రోజులు దూరం పెడితే మంచిదన్న ధోరణితో భోజన ప్రియులు ఉన్నట్లు తెలుస్తోంది. చైనీస్ వంటకాలు అనగానే చికెన్, ఎగ్ ఫ్రైడ్‌రైస్, చికెన్, ఎగ్ నూడిల్స్ మాత్రమే కాకుండా చికెన్‌తో స్టీమ్డ్ చికెన్ విత్ వెజిటెబుల్స్ ఇన్ ఏ జింజర్ సాస్, బ్రేస్డ్ చికెన్ ఇన్ స్మోక్డ్ చిల్లీ సాస్, చికెన్ విత్ చిల్లీస్ అండ్ బసిల్, జనరల్ టోస్ చికెన్, టైసింగ్ హోయి చికెన్, చికెన్ ఇన్ బ్లాక్ పెప్పర్ సాస్, రోస్ట్ లంబ్ హ్యునన్ సిచ్వన్ స్టైల్, బ్రేస్డ్ లంబ్ ఇన్ మహలక్ సాస్, ఇక సీ ఫుడ్ విషయానికొస్తే డైనమిక్ ఫ్రాన్స్, జుంబో ఫ్రాన్స్, కింక్ ఫ్రాన్స్ హునన్ స్టైల్, సింగపూర్ చిల్లీ ఫ్రాన్స్, మలేషియా కర్రీడ్ ఫ్రాన్స్, పాన్ ఫ్రైడ్ ఏషియా చిల్లి ఫిష్, ఫిష్ పెప్పర్ గార్లిక్ అంటూ రకరకాల పేర్లతో కూడిన వంటకాలను చైనీస్ రెస్టారెంట్లు అందిస్తున్నాయి. వీటికి వెజ్, నాన్‌వెజ్ సూప్స్ అదనం. ఈ క్రమంలో పేర్లు కూడా కొత్తగా ఉండడంతో దాని జోలికి వెళ్లడం ఎందుకులే అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వెళ్లినా లైట్ ఫుడ్‌కే ప్రాధాన్యం... కొంతమంది రెస్టారెంట్లకు వెళ్ళినా ఫ్రైడ్ రైస్, నూడుల్స్‌తో పాటు లైట్ ఫుడ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆయా రెస్టారెంట్ల వ్యాపారం కొంత మేర తగ్గినట్లు సమాచారం. వాస్తవంగా ఆయా రెస్టారెంట్లలో హైదరాబాదీయులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారి అభిరుచులకు తగ్గట్టుగానే ఆయా రకాల వంటకాలు అందిస్తున్నామని, కరోనాకు, ఇక్కడి వంటకాలకు ఎలాంటి సంబంధం లేదని ఆయా రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడివాసులు రెగ్యులర్‌గా భుజించేవే ఇక్కడ లభిస్తాయి తప్ప సోషల్ మీడియాలో చూపిస్తున్నట్లుగా హైదరాబాద్‌లోని చైనీస్ రెస్టారెంట్లలో అలాంటి పరిస్థితులు ఉండవని పేర్కొంటున్నారు. బోసిపోతున్న రెస్టారెంట్లు సికింద్రాబాద్ కార్ఖానాలో బిగ్ నూడిల్,నాన్కింగ్ సిఆర్ చైనీస్ రెస్టారెంట్లలో కొద్దిరోజులుగా చైనీస్ డిష్‌ల అమ్మకాలు తగ్గాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ రెస్టారెంట్లు కిటకిటలాడేవి. చైనీస్ డిష్‌లను తినేందుకు నగర వాసులు పెద్ద ఎత్తున రెస్టారెంట్లకు వస్తుంటారు. రెస్టారెంట్లలో కూర్చోడానికి స్థలంలేక సుమారు 15 నుంచి 30 నిమిషాల వరకు వేచి ఉండేవారు. సంక్రాంతి నుంచిఅమ్మకాలు తగ్గాయి సంక్రాంతిపండుగ తరువాత రెస్టారెంట్లో అమ్మకాలు తగ్గాయి. రోజుకు సుమారు 50 వేల వరకు అమ్మకాలు జరుగుతుండేవి. ప్రస్తుతం 30–40 వేల రూపాయల మధ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. చైనీస్ డిష్‌లను ఇష్టపడి తింటుంటారు. ఆన్లైన్లో ఎక్కువగా బుకింగ్‌లు జరుగుతుంటాయి. రెస్టారెంట్‌కు కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం లేదు. – అహ్క్యన్ , రెస్టారెంట్ నిర్వాహకుడు -
ఇక ఓయో.. కాఫీ!
న్యూఢిల్లీ: చౌకగా హోటల్ గదులను అందుబాటులోకి తెచ్చిన ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ తాజాగా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ప్రీమియం కాఫీ చెయిన్, రెస్టారెంట్లు ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. ది ఫ్రెంచ్ ప్రెస్ పేరుతో 50 పైగా ప్రీమియం కాఫీ షాప్‌లను ఏర్పాటు చేసేందుకు ఓయో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే నాలుగు క్లౌడ్ కిచెన్స్ చేతిలో ఉన్నందున .. వాటి ఊతంతో రెస్టారెంట్ చెయిన్ కూడా ప్రారంభించాలని ఓయో భావిస్తున్నట్లు తెలుస్తోంది. హోటల్ రూమ్స్‌ను చౌకగా అందుబాటులోకి తెచ్చిన కారణంగా ఓయోపై ’చౌక’ బ్రాండ్ అనే ముద్ర పడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ప్రీమియం కాఫీ చెయిన్‌పై ఈ ముద్ర పడకుండా చూసుకోవాలని ఓయో భావిస్తోంది. అందుకే తన బ్రాండ్ పేరు ఎక్కడా కనిపించకుండా ది ఫ్రెంచ్ ప్రెస్ బ్రాండ్ కింద ఈ కాఫీ చెయిన్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ‘ప్రీమియం కాఫీ చెయిన్ విభాగంలో ఎక్కువ సంస్థలు లేకపోవడంతో స్టార్‌బక్స్ వంటి దిగ్గజంతో పోటీపడొచ్చని, ఇందుకు కావల్సిన పూర్తి సామర్థ్యాలు తమకున్నాయని ఓయో భావిస్తోంది. అయితే, ఓయో అంటే చౌకైన, అందుబాటు ధర బ్రాండ్ అనే ముద్ర ఉన్న సంగతి కూడా దానికి తెలుసు. అందుకే కాస్త ఖరీదైన ఈ టార్గెట్ మార్కెట్ కోసం ఓయో బ్రాండింగ్ వాడకూడదని నిర్ణయించుకుంది‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్రయల్ రన్.. ఓయో ఇప్పటికే ఓయో టౌన్హౌసెస్ హోటళ్లలో ది ఫ్రెంచ్ ప్రెస్ ఔట్‌లెట్స్‌ను కొన్నింటిని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. పెద్ద మాల్స్, కాస్త ఖరీదైన ఏరియాల్లో మరికొన్నింటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే భారీ ఆఫీస్ కాంప్లెక్స్‌ల్లోని ఓయో కో–వర్కింగ్ స్పేస్‌లలోనూ వీటిని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఈ వార్తలను ధృవీకరించేందుకు ఓయో నిరాకరించింది. ఫుడ్ అండ్ బేవరేజెస్ వ్యాపారంలో కూడా తమ కార్యకలాపాలు ఉన్నాయని, ఫుల్ సర్వీస్ హోటల్స్‌లో నిర్వహించే కిచెన్స్ ద్వారా తమ ఆదాయంలో 25 శాతం వాటా వస్తోందని పేర్కొంది. ప్రస్తుతానికి మాత్రం మిగతా కార్యకలాపాల విస్తరణపై స్పందించబోమని వివరించింది. ప్రీమియం రెస్టారెంట్లపై దృష్టి.. ఓయో ఇప్పటికే అద్రక్, ఓ బిరియానీ, పరాఠా పండిట్, మాస్టర్ ఆఫ్ మోమోస్ పేరుతో నాలుగు క్లౌడ్ కిచెన్ బ్రాండ్స్ నిర్వహిస్తోంది. ది ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ చెయిన్‌ను విస్తరించిన తర్వాత ప్రీమియం రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేయాలని ఓయో ప్రణాళికలు రూపొందిస్తోంది. తమ సొంత హోటళ్లు, కో–వర్కింగ్ ప్రాపర్టీలు, స్టాండెలోన్ రెస్టారెంట్లలోనూ వీటిని ప్రారంభించాలని భావిస్తోంది. ఈ రెస్టారెంట్ల కోసం క్లౌడ్ కిచెన్స్ సేవలను ఉపయోగించుకోవాలని ఓయో యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఇంటి కంటే రెస్టారెంట్ పదిలం
వీకెండ్ వచ్చిందంటే చాలు భార్యా పిల్లలతో కలిసి బయటకు వెళ్లి సరదా సరదాగా షాపింగ్ చేసి మల్టీప్లెక్స్‌లో మూవీ చూసి, తర్వాత రెస్టారెంట్లో ఇష్టమైన ఫుడ్ లాగిస్తేనే భారతీయులకు అదో తుత్తి. ఒకప్పడు బయట హోటల్స్‌కు వెళ్లాలంటే బర్త్‌డే, మ్యారేజ్‌డే ఇలా ఏదో ఒక ఫంక్షన్ ఉంటేనే వెళ్లేవారు. ఇప్పుడు భారతీయుల మైండ్ సెట్ మారింది. శని ఆదివారాలు ఎన్ని రకాల వినోదాలున్నా హోటల్‌కి వెళ్లి చేతులు కడగవలసిందే. ప్రతీ నెలలో కనీసం ఏడుసార్లు భారతీయ కుటుంబాలు రెస్టారెంట్లలో తినడానికే ఇష్టపడుతున్నారని నేషనల్ రెస్టారెంట్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) సర్వేలో తేలింది. దీని కోసం భారతీయులు నెలకి సగటున రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక స్విగ్గీలు, జోమాటో, యూబర్ ఈట్స్ వంటి యాప్‌లు వచ్చాక హోటల్ నుంచి ఇంటికి తెప్పించుకోవడాలు పెరిగిపోయాయి. అలా దేశ ప్రజలు నెలకి సగటున 6.6 సార్లు బయట తిండే తింటున్నారు. ఫుడ్ ట్రక్లు, ఫుడ్ పార్క్స్ , టేక్ ఎవేలు, హోమ్ డెలివరీలు అందుబాటులోకి వచ్చాక, ఆతిథ్య రంగం కొత్త దారి పట్టిందని, నాణ్యమైన ఆహారాన్ని అందిస్తే ఇంటి భోజనమనే భావన వస్తే ఇంటి కన్నా రెస్టారెంట్లకి రావడానికే జనం ఇష్టపడుతున్నారని ఢిల్లీకి చెందిన రెస్టారెంట్ యజమాని అనురాగ్ కటియార్ వెల్లడించారు. నాలుగ్గోడల మధ్య మగ్గిపోతూ బయట నుంచి తెప్పించుకునే తిండి తినేకంటే, కాస్త ఆరుబయట గాలి పీల్చుకుంటూ రెస్టారెంట్లో యాంబియెన్స్‌ను ఎంజాయ్ చేస్తూ వేడివేడిగా తినడానికే 80 శాతం మంది భారతీయులు ఇష్టపడుతున్నారని ఎన్ఆర్ఏఐ సర్వేలో తేటతెల్లమైంది. ఎవరి టేస్ట్ వాళ్లదే రకరకాల ఘుమాయించే వంటకాలు,విభిన్న రుచులు, వైవిధ్యమైన డిషెస్ ఇప్పుడు ప్రతీచోటా దొరుకుతున్నాయి. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నట్టుగా ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్.. ఢిల్లీ వాసులకి స్థానికంగా దొరికే ఆహారం పట్ల మోజు లేదు. నార్త్ ఇండియన్ ఫుడ్ చూస్తేనే వారికి నోరూరుతుంది. బెంగుళూరులో దక్షిణాది వంటకాలపై అంతగా మోజు లేదు. నార్త్ ఇండియన్ మీల్స్, హైదరాబాదీ బిర్యానీలనే ఇష్టపడతారు. ఇక వెరైటీ రుచుల్ని ఆస్వాదించడంలో ముంబైకర్ల తీరే వేరు. దక్షిణాది రుచులకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు, దోసె, ఇడ్లీలను అత్యంత ఇష్టంగా లాగిస్తారు. ఇతర దేశాల వంటకాల్లో 33% మంది ఇటాలియన్ ఫుడ్ అంటే పడిచచ్చిపోతే, 29% మందికి చైనీస్ ఫుడ్ తింటేనే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి తప్ప ఎంతకని ఆ బయట తిండి తింటాం, ఇంట్లో చారు అన్నం తిన్నా అదే అమృతంలా అనిపిస్తుంది కదా అని 20శాతం మంది అభిప్రాయపడినట్టుగా సర్వేలో తేలింది. -
‘సైన్మా’ సూపర్ హిట్
హిమాయత్‌నగర్: అక్కడకు వెళ్తే సినిమా థియేటర్‌కు వెళ్లినట్టుంటుంది. లోనికి అడుగుపెట్టగానే సినిమాకు వచ్చినట్టు అనుభూతి కలుగుతుంది. మనకు కేటాయించిన సీట్లో కూర్చోగానే.. పాత సినిమాల్లోని ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ వీనులకు విందు చేస్తాయి. అదే కొంపల్లిలోని ‘సైన్మా’ రెస్టారెంట్. ఈ హోటల్ సినిమా వాతావరణాన్ని గుర్తు చేస్తే.. ఫుడ్ మాత్రం బాహుబలి సినిమాను తలపిస్తుంది. సరికొత్త థీమ్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్న ఈ రెస్టారెంట్ నగర టెక్కీలు, యువతకు తెగ నచ్చేసింది. అంతా ‘సైన్మా’నే తెలంగాణలో సినిమా అనే పదాన్ని ‘సైన్మా’ అని పలుకుతారు. అదే పేరుతో ఓ కొత్త రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని నగరానికి చెందిన సందీప్‌రెడ్డి, అక్షయ్రెడ్డిలు డిసెంబర్లో కొంపల్లిలో ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ ఎంట్రన్స్ నుంచే ‘సైన్మా’ సందడి మొదలవుతుంటుంది. రెస్టారెంట్ లోపల మొదటి సినిమా నుంచి ఇటీవల విడుదలైన సినిమాల పోస్టర్లు, హీరో, హీరోయిన్ల స్టిల్స్ ఆకట్టుకుంటాయి. ఈ రెస్టారెంట్లో ఉన్నంతసేపు థియేటర్లో ఉన్నట్లే అనిపించడం గమనార్హం. పగలు ఆడియో..రాత్రి వీడియో.. రెస్టారెంట్లో లంచ్ టైంలో ఆపా మధురాలు.. ఓల్డ్ మెలోడీ పాటలు శ్రావ్యంగా వినిపిస్తాయి. లంచ్ అవర్ అంతా ఆడియో సాంగ్స్‌ను వింటూ ఎంచక్కా మనకు నచ్చిన ఫుడ్‌ని ఎంజాయ్ చేయోచ్చు. ఇక రాత్రి డిన్నర్ సెక్షన్‌కు రూటు మార్చుతారు. లోపల పెద్ద స్క్రీన్‌పై అలనాటి వీడియో సాంగ్స్‌ను ప్లే చేస్తారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ.. ఇలా అందరి హీరోల ఎవర్గ్రీన్ వీడియో సాంగ్స్‌తో రెస్టారెంట్ సరికొత్తగా మారిపోతుంది. అంతేకాదు ఇక్కడ వడ్డించే ఫుడ్ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. బాహుబలి చికెన్.. తమలపాకు కబాబ్.. బాహుబలి పార్ట్–1, పార్ట్–2 సినిమాలకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఈ రెస్టారెంట్ నిర్వాహకులు ‘బాహుబలి చికెన్’ అనే కొత్త కాన్సెప్ట్‌ని పరిచయం చేశారు. బాహుబలి సినిమాలో తల్వార్‌తో హీరో ప్రభాస్ ప్రత్యర్థులను మట్టికరిపించాడు. ఇప్పుడు అదే తరహాలో తల్వార్‌తో చికెన్ పీసులు గుచ్చి అందిస్తారు. చికెన్ కబాబ్‌లో చాలా వెరైటీలే ఇక్కడ ఉన్నాయి. ఈ రెస్టారెంట్లో మరో ప్రత్యేకం ‘తమలపాకు కబాబ్’. పాన్ తింటుంటే ఎలా ఉంటుందో అదే రీతిలో ఈ కబాబ్ ఉంటుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం తాము ప్రవేశపెట్టినట్లు నిర్వాహకులు సందీప్‌రెడ్డి, అక్షయ్‌రెడ్డి చెబుతున్నారు. జింజర్ చికెన్ బిర్యానీ కూడా హైదరాబాద్ బిర్యానీ తరహీ ఫేమస్. మంచి ఘాటుగా ఉండే ఈ బిర్యానీకి నగర టెక్కీలు ఇష్టంగా లాగించేస్తున్నారు. సరికొత్త రుచులుమా ప్రత్యేకత ఇండియాలోనే ఈ థీమ్‌తో వచ్చిన తొలి రెస్టారెంట్ మాదే. నగర వ్యాప్తంగా మారెస్టారెంట్ హాట్ టాపిక్‌గా ఉంది. అందరికీ ‘సైన్మా’ వాతావరణంలో ఫుడ్‌ని తినిపించాలనే కాన్సెప్ట్‌తో దీన్ని ప్రారంభించాం. భోజనప్రియుల కోరికలకు అనుగుణంగా రుచులను అందిస్తాం. – సందీప్‌రెడ్డి, అక్షయ్‌రెడ్డి, ‘సైన్మా’ యాజమాన్యం -
5వేల రెస్టారెంట్లకు షాక్ ఇచ్చిన జొమాటో
ముంబై : అతిపెద్ద ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. నాణ్యతా ప్రమణాలు పాటించని దాదాపు 5 వేల రెస్టారెంట్లను తమ జాబితా నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి నుంచే దీన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని తెలిపింది. అంతేకాక దేశంలోని 150 పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకొన్న సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని వెల్లడించింది. ఈ విషయం గురించి జొమాటో సీఈవో మోహిత్ గుప్తా మాట్లాడుతూ ‘నిత్యం మా జాబితాలోకి కొత్తగా 400 రెస్టారెంట్లు వచ్చి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం చాలా ముఖ్యం. మాతో సంబంధం ఉన్న దాదాపు 80,000 రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను మరోసారి పరిశీలించాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఆ రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలను అందుకొనేందుకు సాయం చేస్తామ’ని వెల్లడించారు. -
50పైసల నుంచి రోజుకు 2లక్షల ఆదాయం వరకు!
‘చాలెంజ్’ సినిమాలో చిరంజీవిపది పైసలతో జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు.‘శివాజీ’ సినిమాలో రజనీకాంత్ వన్ రుపీతో లైఫ్‌ని ప్రారంభిస్తాడు.సవాల్‌గా తీసుకుంటారు ఇద్దరూ.సక్సెస్ అవుతారు. సేమ్.. వాళ్ల లాగే పట్రీషా యాభై పైసలతో జీవితాన్ని సవాల్‌గా తీసుకుని సక్సెస్ సాధించింది. పద్నాలుగు రెస్టారెంట్లతో... రోజుకిప్పుడు రెండు లక్షలు సంపాదిస్తోంది! పట్రీషా నారాయణ్.. చెన్నైలోని ‘సందీపా’ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ యజమాని. ఉండటానికి విలాసవంతమైన అపార్ట్మెంట్, అంతే లగ్జూరియస్ కారు, రెండువందల పైచిలుకు ఉద్యోగులకు బాస్! ఇక 2010 ‘ఫిక్కీ ఉమన్ ఎంట్రప్రెన్యూర్’ అవార్డీ అన్నది పాత సంగతే. అయితే పట్రీషాకు ఇవన్నీ వారసత్వంతో రాలేదు. ఆమె జీవితం వడ్డించిన విస్తరీ కాదు. అంతా రెక్కల కష్టం. పట్రీషా పుట్టి పెరిగింది చెన్నైలో. తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్లో, తల్లి టెలిఫోన్స్ డిపార్ట్మెంట్లో పని చేసేవారు. పట్రీషాకు ఇద్దరు తోబుట్టువులు. ఆమే తొలి సంతానం. ఇంటర్ ఫస్టియర్‌లో ఉండగా తనకన్నా పదమూడేళ్లు పెద్దవాడైన నారాయణ్‌తో పరిచయమైంది. ప్రేమగా మారింది. రహస్యంగా పెళ్లీ జరిగింది. నిజానికి ఇంటర్ అయ్యాక తల్లిదండ్రులతో చెప్పి తమ పెళ్లికి వాళ్ల అంగీకారం తీసుకోవాలనుకుంది పట్రీషా. కాని నారాయణ్ వద్దన్నాడు. వెంటనే తనతో వచ్చేయమంటూ ఆమెను ఒత్తిడి చేశాడు. పట్రీషా ఎంత నచ్చ జెప్పినా వినకపోగా ‘‘నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికి వచ్చి మీవాళ్లకు అంతా చెప్పేస్తాను’’ అంటూ బెదిరించాడు. భయపడ్డ పట్రీషా ఓ రోజు ఇంట్లో చెప్పేసింది తను పెళ్లి చేసుకుందని. మండిపడ్డ ఆమె తండ్రి పట్రీషాను ఇంట్లోంచి గెంటేశాడు. అన్నానగర్‌లో కాపురం పెట్టారు పట్రీషా, నారాయణ్. కలిసి ఉంటున్నకొద్దీ నారాయణ్‌లోని దుర్గుణాలు బయటపడసాగాయి. బద్దకం. పనిచేయడు. పైపెచ్చు మందు, సిగరెట్లు. నచ్చిన వ్యక్తి భర్తగా దొరికాడన్న సంతోషం లేకుండానే దాంపత్యం సాగుతోంది. ఇద్దరు పిల్లలూ పుట్టారు. నారాయణ్‌లో ఏ మాత్రం మంచి మార్పులేదు సరికదా.. మరింత దిగజారాడు. పట్రీషాను కొట్టడమూ మొదలు పెట్టాడు. వేరే దారి లేక అభిమానం చంపుకొని పుట్టింటికి వెళ్లింది. మొదట తండ్రి మండిపడ్డా.. కూతురి పరిస్థితి చూసి చలించిపోయాడు. ఇద్దరు పిల్లలతో ఉన్న బిడ్డను ఇంట్లోకి రానిచ్చాడు. నారాయణ్‌కు దూరంగా ఉండమని హెచ్చరించాడు. తలూపింది పట్రీషా. పికిల్స్ అండ్ జామ్స్ తల్లి, తండ్రి ప్రభుత్వోద్యోగస్తులు కావడంతో వారికి చేసి పెట్టడానికి చిన్నప్పుడే వంట నేర్చుకుంది పట్రీషా. కుకింగ్ అంటే ఆసక్తి కూడా. అందుకే ఖాళీగా కూర్చోకుండా పచ్చళ్లు, జామ్స్ తయారు చేసి బాటిళ్లలో పెట్టి తల్లితో ఆమె ఆఫీస్‌కి పంపించడం మొదలుపెట్టింది. అన్నీ అమ్ముడుపోవడమే కాక మూడు రోజులకే మళ్లీ డిమాండ్ కూడా వచ్చింది ఇంకా కావాలని. అలా పచ్చళ్లు, జామ్స్ తయారు చేసే వ్యాపకాన్ని వ్యాపారంగా మార్చుకుంది పట్రీషా. బీచ్‌లో టీ బండి పట్రీషా తండ్రి స్నేహితుడు ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ పీపుల్ కోసం ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. వాళ్లకు ఓ ఉపాధి చూపించాలని టీ, టిఫిన్ బళ్లను తెప్పించాడు. పట్రీషా స్థితి తెలుసుకొని తన దగ్గరున్న ఇద్దరికి ఉపాధి ఇప్పిస్తే ఓ బండి ఇస్తానని చెప్పాడు. ఒప్పుకుంది ఆమె. వెంటనే వాళ్లిద్దరికీ టీ, కాఫీ పెట్టడం, వాటిని సర్వ్ చేయడం నేర్పింది. బండి తీసుకొని మెరీనా బీచ్‌లో పెట్టుకుంది. మొదటి రోజు కేవలం ఒకే ఒక్క టీ అమ్మగలిగింది. ఆరోజు సంపాదన యాభై పైసలు. నిరాశతో ఇంటికెళ్లింది. వ్యాపారం చేయడం తన వల్ల కాదని తల్లికి చెప్పి ఏడ్చింది. ‘‘ఒక్క టీ అమ్ముడు పోవడాన్ని నువ్వు ఫెయిల్యూర్ అనుకుంటున్నావ్. అది నేను నీ సక్సెస్ అనుకుంటున్నా. జీరోతో రాకుండా యాభై పైసలు సంపాదించావు’’ అంటూ కూతురిలో ఉత్సాహాన్ని నింపింది. ఆ ఆశనే పెట్టుబడిగా పెట్టింది పట్రీషా. తెల్లవారికి సమోసా వంటి స్నాక్స్‌నూ బండీలో పెట్టింది టీ, కాఫీలతోపాటు. ఆశ్చర్యం ఆ రోజు ఆమె సంపాదన ఏడువందల రూపాయలు. ఇలా 1982 నుంచి 2003 వరకు సాగింది. తొలినాళ్లలో మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి పదకొండు వరకూ ఉండేది. ఆ తర్వాత మెరీనాబీచ్‌లో వాకర్స్ కోసం ఉదయం అయిదు గంటలకే ఓపెన్ చేసి తొమ్మిదింటి వరకూ బిజీగా ఉండేది. రోజుకి ఏడువందల రూపాయల నుంచి 25 వేలు ఆర్జించే వరకు వెళ్లింది ఆదాయం. బంద్ రోజుల్లో కూడా. కోలుకోలేని విషాదం పట్రీషా వంట రుచి ఆ నోటా ఈ నోటా బ్యాంక్ ఆఫ్ మధుౖరై ఉద్యోగుల దాకా వెళ్లింది. బ్యాంక్‌లో క్యాంటీన్ నిర్వహించడానికి ఆమెకు ఆఫర్ అందింది. మూడు వందల మందికి వండి వడ్డించాలి. తర్వాత నేషనల్ పోర్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ స్కూల్లోని ఏడువందల మంది స్టూడెంట్స్ కోసం వంట చేసే అవకాశం వచ్చింది. చేసింది. మేనేజ్మెంట్కు నచ్చింది. ఉండటానికి క్వార్టర్ కూడా ఇచ్చారు. అక్కడ ఆమె మొదటి నెల అందుకున్న జీతం ఎనభై వేలు (1998లో). తర్వాత అది కొద్దికాలానికే లక్ష రూపాయలకు చేరింది. కొంతకాలానికే సంగీతా రెస్టారెంట్ గ్రూప్ ఒక యూనిట్లో పార్ట్నర్షిప్ ఆఫర్ చేసింది. అప్పటికే పిల్లలు పెద్దవాళ్లైపోయారు. కూతురు పెళ్లి చేసేసింది. కొడుకు ప్రవీణ్ రాజ్‌కుమార్ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సంగీతా రెస్టారెంట్లో పార్ట్నర్షిప్ ఆఫర్ కన్నా సొంతంగా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనను తల్లి ముందు పెట్టాడు ప్రవీణ్. పట్రీషాకూ సబబే అనిపించింది. ఆ ఏర్పాట్లలో ఉండగా కుటుంబం కుప్పకూలే సంఘటన! కూతురు, అల్లుడు కారు యాక్సిడెంట్లో చనిపోయారు. పట్రీషా చాన్నాళ్ల దాకా మనిషి కాలేకపోయింది. రెస్టారెంట్ పనంతా ప్రవీణే చూసుకున్నాడు. ఎట్టకేలకు 2006లో ‘సందీపా’ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అప్పటికీ పట్రీషా ఇంకా షాక్‌లోనే ఉంది. అందుకే మొత్తం బాధ్యతలు తీసుకోకుండా.. కొడుకుకి సహాయంగా మాత్రమే ఉంది కొన్నాళ్ల దాకా. కూతురు, అల్లుడు చనిపోయినప్పుడు డెడ్‌బాడీస్ తీసుకురావడానికి ఒక్క అంబులెన్సూ ముందుకు రాలేదు. చనిపోయిన వార్త కన్నా అంబులెన్స్ బాధ్యతా రాహిత్యం ఆమెను ఎక్కువ కలచివేసింది. అందుకే రెస్టారెంట్ పెట్టిన కొన్నాళ్లకు ఓ అంబులెన్స్‌ను కొని రోడ్ యాక్సిడెంట్ బాధితులను ఆసుపత్రికి చేర్చే సేవనూ అందిస్తోంది పట్రీషా. ఈ ముప్పైఏళ్లలో..! ‘‘ఆత్మవిశ్వాసమే మనల్ని నడిపిస్తుంది. కష్టం లేకుండా ఫలితం రాదు. ఎదురు దెబ్బలే గమ్యానికి వారధి కడ్తాయి. గ్రహిస్తే గమ్యం చేరుకుని విజయం సాధిస్తాం’’ అంటుంది పట్రీషా. ఈ ముప్పైఏళ్లలో ఆమె నేర్చుకున్న సత్యం ఇదే. ఆమె ఫిలాసఫీ ఇదే. చెన్నైలో పట్రీషాకు ఇప్పుడు 14 అవుట్‌లెట్స్ ఉన్నాయి. ‘‘యాభై పైసల సంపాదన నుంచి రోజుకి రెండు లక్షల ఆదాయానికి చేరుకున్నాం. ఇది నా ఒక్కదాని కష్టం కాదు. నన్ను నమ్మి నాతోపాటు నడిచినవాళ్లందరి శ్రమ ఫలితం. కలెక్టివ్ విక్టరీ’’ అంటుంది పట్రీషా. – శరాది -
బిర్యానీలో బ్యాండేజ్‌లు వచ్చాయంటూ..
సిద్దిపేటజోన్ : పట్టణంలోని అక్షయ హోటల్లో విక్రయించిన బిర్యానిలో బ్యాండేజ్‌లు వచ్చాయంటూ ఆదివారం సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు చక్కర్లు కొట్టాయి. వార్త వైరల్ కావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు సానిటరీ ఇన్స్పెక్టర్ నగేష్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రవీందర్‌రావుతో కలిసి హోటల్‌కు వెళ్లి తనిఖీలు చేశారు. ఒక దశలో హోటల్లో పని చేసే సిబ్బందిలో ఎవరికైనా గాయాలు అయ్యాయా అన్న కోణంలో సైతం వివరాలు సేకరించారు. వైరల్ అయిన వార్తలో వాస్తవం ఉందా లేదా అన్న అంశంపై దర్యాప్తు చేస్తామన్నారు. పలు రెస్టారెంట్లలో తనిఖీలు.. అనంతరం పలు రెస్టారెంట్లు, హోటలలో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లోని అతిథి హోటల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని రూ. 3000 జరిమానాగా విధించారు. మెదక్ రోడ్డులోని చంద్రలోక్ హోటల్లో నాణ్యతా రహితంగా ఉన్న మాంసంను స్వాధీనం చేసుకున్నారు. రూ. 2000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మటన్, చికెన్లను ఫ్రీజ్‌లో నిల్వ పెట్టి తిరిగి వాటిని ప్రజలకు వినియోగించడం తగదన్నారు. ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వారి వెంట ఎన్విరాల్ మెంటల్ ఇంజనీర్ చందన్, ఉమేష్ తదితరులు ఉన్నారు. -
విదేశాల్లో భారత ‘వంటిల్లు’!
న్యూఢిల్లీ: పంజాబీ చికెన్ టిక్కా... రాజస్థానీ థాలీ... మహారాష్ట్ర వడాపావ్... తమిళనాడు సాంబార్ ఇడ్లీ... హైదరాబాద్ బిర్యానీ... చెబుతుంటేనే నోరూరుతోంది కదా..!! ఈ భారతీయుల వంటకాల ఘుమఝుమలు విదేశీయులనూ ఆవురావురుమనేలా చేస్తున్నాయి. అదిరిపోయే భారతీయ వంటలతో మనోళ్లు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. మన నలభీములకు విదేశీయులు ఎర్ర తివాచీ పరుస్తుండటంతో ఇక్కడి రెస్టారెంట్ చైన్లు అత్యంత వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. లైట్ బైట్ ఫుడ్స్, జిగ్స్ అండ్ జోరవార్ కల్రా రెస్టారెంట్ చైన్లతో పాటు పారిశ్రామికవేత్త, ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్‌కు చెందిన రెస్టారెంట్లు విదేశాల్లో పాగా వేస్తున్నాయి. అనుమతులు, లైసెన్సులు సులువు... కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్, డామినోస్ లాంటి విదేశీ రెస్టారెంట్ చైన్లకు దీటుగా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంస్థలు చొచ్చుకుపోతున్నాయి. ఇతర దేశాల్లో రెస్టారెంట్లను ప్రారంభించడం సులువుగా ఉండటం, బయట వంటకాలకు విదేశీయులు ఖర్చులు పెంచడం లాంటి సానుకూల అంశాలు హోటల్ వ్యాపార అభివృద్ధికి దోహదపడుతున్నాయని నిర్వహకులు చెబుతున్నారు. ’విదేశీ రెస్టారెంట్ వ్యాపారం విధానాలలో స్థిరత్వం ఉంటుంది. అనేక దేశాలలో హోటళ్లను ప్రారంభించడానికి బహుళ అనుమతులు, లైసెన్సుల అవసరం లేకపోవడం అనేది ప్రయోజనకరంగా ఉంది. లండన్, న్యూయార్క్, దుబాయ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో బయట తిండికి వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 150 మంది కూర్చుని భోజనం చేయడానికి సరిపడేంతటి రెస్టారెంట్‌ను ఈఏడాది సెప్టెంబరులోనే వాషింగ్టన్ డీసీలో ప్రారంభిస్తున్నాం’ అని లైట్ బైట్ ఫుడ్స్ డైరెక్టర్ రోహిత్ అగర్వాల్ అన్నారు. పంజాబ్ గ్రిల్ పేరుతో ఈ రెస్టారెంట్ ప్రారంభం కానుందని, త్వరలోనే దుబాయ్, కువైట్, ఇతర గల్ఫ్ దేశాలలో సైతం సత్తా చాటనున్నామని వెల్లడించారు. మానవ వనరుల పరంగా ఇబ్బందే... వ్యాపారం బాగానే ఉన్నా... మానవవనరుల కొరత, వీసా సమస్యలు వెంటాడుతున్నట్లు రోహిత్ తెలిపారు. భారత్‌లో మార్జిన్లు చూడలేకపోతున్న అనేక రెస్టారెంట్ చైన్లు విదేశాల్లో లాభాలను గడిస్తున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) అంటోంది. ఇతర దేశాలలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉందని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రాహుల్ సింగ్ వెల్లడించారు. గతేడాది అమెరికన్లు ఆహారంపై చేస్తున్న ఖర్చులలో ఏకంగా 48% రెస్టారెంట్లలోనే జరుగుతున్నట్లు తెలిపారు. విదేశాల్లో హోటల్ నడపడం చాలా సులభం... దివ్యాని ఇంటర్నేషనల్ అమెరికా, లండన్, సింగపూర్, దుబాయ్ దేశాలలో విస్తరిస్తోంది. నోరు ఊరించే వంటకాలతో అదరగొట్టే సంజీవ్ కపూర్ సైతం విదేశీ రెస్టారెంట్ల విస్తరణలో వేగంగా దూసుకుపోతున్నారు. సంజీవ్ కపూర్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మొత్తం 70 స్టోర్లను నడుపుతుండగా, వీటిలో సగం వరకు విదేశాల్లోనే ఉన్నాయి. విదేశాల్లో హోటల్ వ్యాపారం చాలా సులువుగా నడపవచ్చని వెల్లడించిన ఆయన త్వరలోనే లండన్, న్యూయార్క్, టొరంటో, సౌదీలలో రెస్టారెంట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
చైనా రెస్టారెంట్లలో అన్ని పనులకూ రోబోలే!
షాంఘై: మొబైల్లో బుక్ చేసుకుని చైనాలోని ఈ రెస్టారెంట్‌కి వస్తే చాలు. సాదరంగా ఆహ్వానించి కోరిన పదార్థాలు తెచ్చి వడ్డిస్తారు. ‘ఎంజాయ్ యువర్ మీల్ ’అని విష్ చేసి వెళ్తారు. వీరు టిప్ కూడా అడగరు! అవును.. వీరు అంటే మనుషులు కాదు రోబోలు! చైనా వ్యాపార దిగ్గజం ఆలీబాబా ఈ కామర్స్‌లో భాగంగా ఇలాంటి రెస్టారెంట్లను నిర్మించాలయోచిస్తోంది! 2020 వరకు చైనాలో ఇలాంటివి వెయ్యి ప్రారంభించాలని సంకల్పించింది. చైనాలో వెయిటర్స్ జీతాలు పెరిగిపోతున్నాయని, నెలకు రూ.లక్ష చెల్లించాల్సి వస్తోందని ఈ ప్రతిపాదన రూపకర్త, అలీబాబా ప్రోడక్ట్ మేనేజర్ కావ్ హైతో పేర్కొన్నారు. ఈ భారం వినియోగదారులపై పడి రెస్టారెంట్లలో తినడానికే జంకుతున్నారట. ప్రస్తుతం నలుగురు కలసి భోజనం చేయాలంటే రూ.4,000 ఖర్చవుతుంది. ఈ ప్రతిపాదనతో అది రూ.1,000కి దిగివస్తుందని అంచనా. ‘కార్మికుల జీతాలు ఇలాగే పెరుగుతూ పోతే మనుషుల స్థానంలో రోబోలు వస్తాయనడంలో అనుమానం లేదు’అని రోబోటిక్స్ ప్రొఫెసర్ వాంగ్ అంటున్నా -
కార్పొరేట్ ఆఫీసుల్లో ‘పాలిటోస్’ రెస్టారెంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చికెన్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న పాలిటోస్ కార్పొరేట్ బాట పట్టింది. ఫుడ్, కెఫెటేరియాల నిర్వహణలో ఉన్న హంగర్ బాక్స్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంతో 170 కార్పొరేట్ కంపెనీల్లో రెస్టారెంట్లను ఏర్పాటు చేసేందుకు పాలిటోస్కు మార్గం సుగమం అయింది. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమిని, జీఈ, టీసీఎస్ వంటి సంస్థల కార్యాలయాల్లో పాలిటోస్ రెస్టారెంట్లు దర్శనమీయనున్నాయి. క్యాప్‌జెమిని పుణే క్యాంపస్‌లలో 2 ఔట్లెట్లు ఇప్పటికే ప్రారంభించింది. ఇతర సంస్థల్లో 17 కేంద్రాల ఏర్పాటుకై భాగస్వాములతో ఒప్పందం కుదిరిందని పాలిటోస్ను ప్రమోట్ చేస్తున్న ప్రోవెంచర్ గ్రూప్ డైరెక్టర్ అనిల్ దొండ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఒక్కో రెస్టారెంట్ ద్వారా 10–12 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. మెట్రో అన్ని స్టేషన్లలో.. ఎల్అండ్టీతో ఇటీవలే ప్రోవెంచర్ చేతులు కలిపింది. దీనిలో భాగంగా హైదరాబాద్ మెట్రో అన్ని స్టేషన్లలో పాలిటోస్ రెస్టారెంట్లు ఏర్పాటు కానున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఏడు పాలిటోస్ స్టోర్లు ఉన్నాయి. వియత్నాంలో రెండు కేంద్రాలు ఉన్నాయి. యూఎస్ సహా అన్ని దేశాల్లోనూ అడుగుపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే అద్దె, విద్యుత్ చార్జీలు లేకపోవడంతో కార్పొరేట్ కార్యాలయాల్లోని పాలిటోస్ రెస్టారెంట్లలో ఉత్పత్తుల ధర 15–18 శాతం తక్కువగా ఉంటుంది. కంపెనీకి 10 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు.ప్రాంతాన్నిబట్టి ఫ్రాంచైజీకి రూ.15–35 లక్షలు అవుతుంది. విస్తరణ కోసం కంపెనీ రూ.10 కోట్లు సమీకరించే పనిలోఉంది. ఆధునిక టెక్నాలజీతో.. హైదరాబాద్ సమీపంలోని కందుకూరు వద్ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కంపెనీ నెలకొల్పింది. 3.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.4 కోట్ల వ్యయంతో దీనిని స్థాపించారు. గోద్రెజ్ టైసన్ నుంచి చికెన్‌ను కొనుగోలు చేస్తోంది. ‘‘ప్రాసెసింగ్ యూనిట్లో బ్లాస్ట్ ఫ్రీజింగ్ టెక్నాలజీని వినియోగించాం. దిగ్గజ సంస్థల వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. చికెన్ ఉత్పత్తులు కలుషితం కావు. బ్యాక్టీరియా దరిచేరదు. 8 నుంచి 12 నెలలపాటు ఉత్పత్తులు నిల్వ ఉంటాయి. ఈ యూనిట్ నుంచే కోల్డ్ చైన్ ద్వారా అన్ని కేంద్రాలకు సరఫరా చేస్తాం. రెస్టారెంట్లలో ప్రత్యేక ఓవెన్లను ఏర్పాటు చేశాం’’ అని అనిల్ వివరించారు. -
కుళ్లిన మాంసం..నాసిరకం అల్లం
అవి మంచిర్యాలలోని ప్రముఖ రెస్టా రెంట్లు... కాబట్టి ఆహార పదార్థాల్లో నాణ్యతను పాటిస్తారని ప్రజలు నమ్ము తారు. కానీ నాణ్యతలేని పదార్థాలు, కుళ్లిన మాంసం వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యా లతో చెలగాటమాడుతున్నారు. బుధ వారం పలు రెస్టారెంట్లలో టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వాటి బండారం బయట పడింది. అలాగే కళాంజలి పేరుతో తయార వుతున్న అల్లంపేస్ట్, మసాలా దినుసుల్లో నాణ్యత లోపాన్ని అధికారులు గుర్తించారు. మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని నాలుగు ప్రముఖ రెస్టారెంట్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పంజా విసిరారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో ఏ–1, సురభి గ్రాండ్, మాధవి, బాబా రెస్టారెంట్లలో ఆకస్మిక దాడులు చేసి ఆహార పదార్థాలను పరిశీలించారు. కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, మటన్, చికెన్ లభించండంతో కేసు నమోదు చేశారు. వాటి నిర్వా హకులకు రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. తదుపరి చర్యల నిమిత్తం ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారికి అప్పగించారు. అల్లం పేస్టు.. మసాలాలు సైతం.. జిల్లా కేంద్రంలోని కళాంజలి అహార పదార్థాల తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కళాంజలి బ్రాండ్ పేరుతో తయారీ చేసిన నిత్యావసర ఆహార పదార్థాలను నాణ్యత లేకుండా వివిధ కిరాణాలకు సరఫరా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి వాటిని పరిశీలించారు. అల్లం పేస్టు తయారు చేసి శుభ్రంగా లేని డ్రమ్ములో నిలువ ఉంచగా.. వాటి నమూనాలను సేకరించారు. ప్యాకెట్లపై ఎమ్మార్పీ లేకపోవడం, ప్యాకెట్‌పై సూచించిన విధంగా పరిమాణం లేకపోవడం, అల్లం తయారు చేసే మిషనరీ తుప్పు పట్టి ఉండటం, ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్ లేకపోవడంపై అధికారులు ప్రశ్నించారు. సరుకు వివరాల రికార్డులు లేకపోవడంతో మందలించి, పలు రకాల ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. పరీక్షల తర్వాత కల్తీ, నాసిరకం పదార్థాలు వినియోగిస్తున్నట్లు తేలితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ బుద్దె స్వామి, ఎస్సై సమ్మయ్య, సిబ్బంది సంపత్‌కుమార్, భాస్కర్‌గౌడ్, సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. -
రెండు రెస్టారెంట్లకు జరిమానా
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు బుధవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో నిల్వ పదార్థాలు అమ్ముతున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టినట్టు మున్సిపల్ కమిషనర్ బి.వంశీకృష్ణ తెలిపారు. పట్టణ పరిధిలోని లేపాక్షి రెస్టారెంట్, గ్రీన్‌చిల్లి రెస్టారెంట్లో తనిఖీలు చేశారు. లేపాక్షి హోటల్, గ్రీన్‌చిల్లి హోటల్స్‌లో నిల్వ ఉన్న చికెన్, బిర్యాని, వివిధ ఫ్రైలు, బిర్యాని, ఎగ్స్ గుర్తించారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను అమ్ముతున్న యజమానులపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడం సరికాదన్నారు. ఇలా మరోసారి జరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రెండు హోటళ్ల వారికి రూ.20వేల చొప్పన జరిమాన విధించారు. తెల్లవారుజామున హోటళ్లలో తనిఖీలు చేయడంతో పట్టణంలోని ఇతర హోటళ్ల వారు ఆందోళనకు గురయ్యారు. తనిఖీలలో శానిటరీ ఇన్స్పెక్టర్ రవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చట్నీస్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : కూకట్పల్లి చట్నీస్ రెస్టారెంట్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభంబించింది. షార్ట్ సర్కూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. రెస్టారెంట్ పక్కనే జోయలక్కాస్ జ్యువెల్లరీ దుకాణం ఉండటంతో నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన రెస్టారెంట్ నిర్వాహకులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరకున్న సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
రెస్టారెంట్ అంటే జేబుగుల్లే..
సాక్షి, న్యూఢిల్లీ : వీకెండ్స్‌లో రెస్టారెంట్‌కు వెళ్లడం ఖరీదైన వ్యవహారంగా మారింది. పలు వంటదినుసులపై 5 శాతం కస్టమ్స్ డ్యూటీతో పాటు, దిగుమతి చేసుకునే ఆహారంపైనా ఈ వడ్డింపుతో ధరలు భారమవుతాయని రెస్టారెంట్ చైన్స్ పేర్కొన్నాయి.వంటల్లో ఉపయోగించే ఆలివ్ ఆయిల్, ఆముదం, సీసేమ్ నూనెలపై కస్టమ్స్ డ్యూటీ 20 నుంచి 35 శాత పెరగ్గా, ఇతర ఆహార తయారీకి ఉపయోగించే పదార్ధాలపై గతం 30 శాతంగా ఉన్న లెవీని బడ్జెట్లో 50 శాతానికి పెంచారని రెస్టారెంట్ యజమానులు వాపోతున్నారు. వంట దినుసులను దిగుమతి చేసుకునే హోటల్స్, రెస్టారెంట్లు ఈ పన్ను దెబ్బకు బెంబేలెత్తుతున్నాయి. పెరిగిన సుంకాలతో తాము కస్టమర్లపై భారం మోపక తప్పదని కైలిన్ రెస్టారెంట్ చైన్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరవ్ ఖనిజో చెప్పారు. కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో పాటు జీఎస్టీ కింద ఇచ్చే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను తొలగించడం తమ లాభాలపై పెనుప్రభావం చూపుతుందని రెస్టారెంట్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఓ మాదిరి రెస్టారెంట్లు సైతం వంట దినుసులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రమంలో వీటిపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో చివరికి వినియోగదారులపై భారం పడుతుందని రెస్టారెంట్ ఓనర్లు ధరల బాంబు పేల్చుతున్నారు. -
రాణులకాలం వస్తోంది
రాజుల కాలం నాటి సెట్టింగులతో అమెరికాలో ‘మెడీవల్ టైమ్స్’ అని తొమ్మిది రెస్టారెంట్లు ఉన్నాయి. 1983 నుంచీ ఉన్నాయి. అవన్నీ కూడా కోటల్లా ఉంటాయి. వాటిలోకి వెళ్లి ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ మధ్యయుగాలనాటి పోరాట సన్నివేశాలను, కత్తి యుద్ధాలను చూడొచ్చు. అప్పటి యుద్ధ క్రీడల్ని కూడా లోపలి స్టాఫ్ ఆర్టిస్టులు ప్రదర్శిస్తుంటారు. డిన్నర్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కోరుకునే సంపన్న విలాసవంతులకు ఇవి మంచి కాలక్షేపం. రాజులు, మంత్రులు, గుర్రాలు, విలు విద్యలు, రంగస్థల నాటకాలు అన్నీ అక్కడే! తొమ్మిది రెస్టారెంట్లలో కలిపి దాదాపు పది వేల మందికి పైగా సిబ్బంది ఉంటారు. అవసరాన్ని బట్టి అక్కడివారు ఇక్కడికి మారుతుంటారు. ఫ్లారిడా, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, టెక్సాస్, ఆంటారియో, సౌత్ కరోలినా, మేరీల్యాండ్, జార్జియా.. ఈ తొమ్మిది చోట్లా రాజులూ, రాజ్యాలే థీమ్. ఏడాది పొడవునా రెస్టారెంట్ టేబుళ్లు భార్యాభర్తల్తో, పిల్లాజెల్లల్తో, బ్యాచిలర్లతో కిటకిటలాడుతుంటాయి. ఏడాదికి 25 లక్షలమంది కస్టమర్లు వచ్చిపోతుంటారు. విషయం ఏంటంటే.. ఇప్పుడీ రెస్టారెంట్లన్నీ థీమ్‌ని మార్చుకోబోతున్నాయి. ఇంతవరకు లోపల సింహాసనాలపై రాజులు కూర్చునేవారు. ఇప్పుడు రాణులు కూర్చొని ఈ చెయిన్ రెస్టారెంట్లలో రాజ్యపాలన చేయబోతున్నారు. అంటే.. కస్టమర్లకు ఎప్పుడూ కనిపించే రాజులు కాకుండా, ఇంతవరకు కనిపించని రాణులు ప్రత్యక్షమౌతారు. ఆ విధంగా థీమ్‌ని మార్చేసుకుంది.. ‘మెడీవల్ టైమ్స్’ గ్రూపు. ‘‘అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అందుకే మేమూ మా ప్రాధాన్యాన్ని పెంచుకోవాలనుకున్నాం’’ అని కంపెనీ ఓనర్లు అంటున్నారు. అయితే ఇక్కడికి తరచూ వచ్చే మగధీరులు కొందరు మాత్రం.. ‘సీట్లో రాజుగారు ఉంటే ఆ కిక్కే వేరప్పా’ అని పెదవి విరుస్తున్నారు. రాణిగారి పాలనను చూశాకైనా వీళ్లు మనసు మార్చుకుంటారేమో చూడాలి. మోడలింగ్‌లోకి కొత్తగా వచ్చిన హాలీవుడ్ అమ్మాయిల్ని రాణులుగా ఎంపిక చేసుకునే పనిలో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నాయి ఈ రెస్టారెంట్లు. -
ఆ భారీ ప్రమాదం బుకింగ్స్‌ను పడేసింది
ముంబై : దేశ ఆర్థిక రాజధానిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసిన కమలా హిల్స్ కాంపౌండ్‌లోని భారీ అగ్నిప్రమాదం, ముంబైలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై ప్రభావం చూపింది. కమలాహిల్స్లోని అగ్నిప్రమాదంతో బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మెగా కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. అక్రమంగా నిర్మించిన రెస్టారెంట్లను, పబ్‌లను కూల్చివేయడం చేపట్టింది. దీంతో ముంబై వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, హాటల్స్పై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో న్యూఇయర్‌లో హోటల్ బుకింగ్స్ 40 శాతం నుంచి 50 శాతం తగ్గిపోయినట్టు వ్యాపారవేత్తలు చెప్పారు. రిజర్వు చేసుకున్న బుకింగ్స్‌ను కూడా ప్రజలు రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు. ''గతేడాది కంటే ఈ ఏడాది చాలా రెస్టారెంట్లలో వ్యాపారం 40 శాతం క్షీణించింది. ముంబైలోని ఉత్తతమైన రెస్టారెంట్ హబ్‌గా కమలా హిల్స్ ఉంది. కానీ మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న ఈ కూల్చివేత కార్యక్రమంతో అక్కడ నీళ్లు కానీ, విద్యుత్ కానీ లభ్యమవడం లేదు'' నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు రియాజ్ ఆమ్లాని అన్నారు. పలు రెస్టారెంట్లకు నీటి, విద్యుత్ సరఫరాను కోత పెట్టినట్టు పేర్కొన్నారు. దీంతో ప్రజలు తమ రిజర్వేషన్లను రద్దు చేసుకున్నట్టు తెలిపారు. గురువారం అర్థరాత్రి నగరంలోని కమలా మిల్స్ కాంపౌండ్‌లో చెలరేగిన మంటలతో, 15 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఆ కాంపౌండ్‌లోని పలు ఇళ్లు, కార్యాలయాలు, రెస్టారెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. -
తాగినోళ్లకు తాగినంత..!?
సాక్షి, బెంగళూరు : న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు నగరంలో పబ్బులు, రెస్టారెంట్లు, బార్ల క్లోజింగ్ టైమ్‌లో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. బార్లు, పబ్బులును ఉదయం రెండు గంటలకు వరకూ తెరిచివుంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బార్లు, పబ్బుల్లో స్త్రీ, పురుషులకు ప్రత్యేక గదులను కేటాయించడంతో పాటు, పిల్లలతో వచ్చే తల్లులకు రిజర్వ్డ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని బెంగళూరు పోలీసులు బార్లు, పబ్బులు, రెస్టారెంట్ల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకలను సామరస్యంగా, ఆహ్లాదపూరిత వాతావరణంలో నిర్వహించుకోవాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ టీ సునీల్ కుమార్ ప్రజలను కోరారు. మద్యం మత్తులో అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తించేవారిని అక్కడికక్కడే అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటున్న వారికి బలంవంతంగా విషెస్ చెప్పడం, అల్లరి చేష్టలకు దిగినవారిని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు. నగరంలోని ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చర్చ్ స్ట్రీట్, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో 24 గంటల పాటు సీసీటీవీలో మానిటరింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా అల్లర్లు జరగవచ్చన్న ఉద్దేశంతో ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అందులో భాగంగా 15 వేల మంది పోలీసులు వినిమోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఇక అన్ని షాపులు 24x7
నాగ్‌పూర్ : మహారాష్ట్రలో ఇక నుంచి అన్ని దుకాణాలు, మాల్స్ 24x7 పనిచేయనున్నాయి. రోజంతా దుకాణాలు, మాల్స్ తెరిచి ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం(ఎంఎస్ఈ)లో సవరణలు తీసుకొచ్చింది. దీంతో బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, పెద్ద పెద్ద మాల్స్ రాత్రివేళ కూడా తెరిచే ఉంటాయి. మూడు షిఫ్ట్‌లలో ఉద్యోగులు పనిచేస్తారని,దుకాణాలు, మాల్స్ మాత్రమే కాక హోటల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, కూడా రోజంతా తెరచి ఉండనున్నాయని ప్రభుత్వం తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ విషయాన్ని తెలియపరుస్తూ హోటల్స్, రెస్టారెంట్లు, మాల్స్ వద్ద నోటిఫికేషన్‌ను అతికించారు. అయితే, 24x7 నిబంధన నుంచి మద్యం దుకాణాలు, పబ్బులు, డిస్కోటెక్స్‌కు మినహాయింపు ఇచ్చారు. అవి మాత్రం నిర్ణీత గడువు వరకు మాత్రం తెరిచి ఉంటాయి. ఇక అన్ని షాపులు మూడు షిఫ్ట్‌లో 24x7 గంటలు తెరచే ఉండనున్నాయని ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంభాజీ నిలంగేకర్ పాటిల్ తెలిపారు. ఈ నిర్ణయంతో ఎక్కువ మందికి ఉద్యోగవకాశాలు కల్పించనున్నామని పేర్కొన్నారు. ఈ చట్ట సవరణ ప్రకారం ఇక నుంచి కార్మికులందరికీ వీక్లీ ఆఫ్ ఇవ్వడం తప్పనిసరి చేసింది. పాత ఎంఎస్ఈ చట్టం నిబంధనల కిందనే లైసెన్సులను పొందాల్సివసరం లేదు. నేరుగా దుకాణాలకు సంబంధించిన అథారిటీ వద్ద ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 మంది వర్కర్ల కంటే తక్కువగా ఉన్న లేదా ఇంటి వద్ద ఉండే పనిచేసే ఉద్యోగులున్న చిన్న, మధ్య సైజు దుకాణాలకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇలా చేయడం వల్ల దాదాపు 22 లక్షల చిన్న దుకాణాదారులకు లబ్ధి చేకూరనుంది. 10 మంది కంటే తక్కువ మంది వర్క్‌ఫోర్స్ ఉన్న దుకాణాలు 12 లక్షలకుగా పైగా ఉన్నాయి. వీరు తమ సొంత టైమింగ్స్‌ను నిర్ణయించుకోవచ్చు. ఈ సవరణ చట్టం ఐడెంటీ కార్డులను, వీక్లీ ఆఫ్‌లను, కనీస వేతనాన్ని కూడా అందిస్తోంది. దీని వల్ల దాదాపు 35లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు. -
జీఎస్టీ:రెస్టారెంట్లపై భారీ ఊరట
గౌహతి: రెస్టారెంట్లపై వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని హోటల్స్‌పై (స్టార్ హోటల్స్‌తప్ప) జీఎస్టీ రేటును 5శాతంగా నిర్ణయించింది. గౌహతిలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీ స్లాబ్ రేట్ల వివరాలను మీడియాకు వివరించారు. జీఎస్టీ భారాన్ని హోటల్స్‌పై భారీగా తగ్గించినట్టు చెప్పారు. అలాగే దాదాపు 178 వస్తువులకు 28శాతం జీఎస్టీ నుంచి మినహాయింపు నిచ్చామనీ, 6 అంశాలను 5శాతంనుంచి జీరో శాతానికి తెచ్చామని చెప్పారు. హోటల్స్‌పై జీఎస్టీ కౌన్సిల్లో బాగా చర్చ జరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. ఇప్పటివరకు 18శాతం ఉండగా, ఇపుడు 5శాతంగా నిర్ణయించామన్నారు. టర్నోవర్, ఏసీ, నాన్‌ఏసీతో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై జీఎస్టీ రేటు 5శాతంగా ఉంటుందని తెలిపారు. ఏసీ, నాన్ ఏసీ తేడా లేకుండా..అలాగే టర్నోవర్‌తో సంబంధం లేకుండా రెస్టారెంట్లపై 5శాతం టాక్స్‌ను వినియోగదారులు చెల్లించాలి. అలాగే రూ. 7,500 రూము రెంట్ వసూలు చేసే స్టార్‌హోటల్స్‌పై 18శాతం జీఎస్టీ (ఐటీసీతో కలిపి) చెల్లించాల్సి ఉంటుంది. ఔట్ డోర్ కేటరింగ్‌పై 18శాతం (విత్ ఐటీసీ)గా ఉంటుంది. అయితే ఐటీసీ(ఇనపుడ్ టాక్స్ క్రెడిట్)లో కొన్నిసవరణలు చేసినట్టు చెప్పారు. ఇన్పుట్ క్రెడిట్‌ను హోటల్ యాజమాన్యం వినియోగదారులకు పాస్ చేయడం లేదనీ తమ దృష్టికి వచ్చిందన్నారు. అందుకే రెస్టారెంట్ల ఇండస్ట్రీకి ఐటీసీ లభించదని స్పష్టం చేశారు. ఈ కొత్త రేట్లు నవంబరు 15నుంచి అమల్లోకి రానున్నాయని ప్రకటించారు. అలాగే జీఎస్టీ లేట్ ఫైలింగ్ ఫీజును కూడా భారీగా తగ్గించింది. రోజుకు రూ.200 నుంచి రోజుకు రూ.20లకు తగ్గించడం విశేషం. -
రెస్టారెంట్లకు, మాల్స్‌కు కేంద్రం తాజా ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : రెస్టారెంట్లకు, మాల్స్‌కు, షాపింగ్ అవుట్లెట్లకు కేంద్రం సరికొత్త ఆదేశాలు జారీచేసేందుకు సిద్ధమైంది. వీరు అందించే ఉత్పత్తులపై జీఎస్టీని కలుపుకునే ఎంఆర్పీని ముద్రించే విధంగా ఆదేశాలు జారీచేయబోతుంది. అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆర్థికమంత్రుల గ్రూప్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని సీనియర్ అధికారి ధృవీకరించారు. ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించినట్టు పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన పూర్తిగా అన్ని ఉత్పత్తులపై ధరలు మారిపోయాయి. జీఎస్టీ అమలుతో ధరలు తగ్గుతాయని ఓ వైపు కేంద్రం చెబుతుంటే, వ్యాపారులు మాత్రం ధరలు బాదేస్తున్నారు. కొంతమంది రిటైలర్లు ఉత్పత్తుల ఎంఆర్పీ కంటే ఎక్కువగా జీఎస్టీ విధిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన మంత్రుల గ్రూప్ ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఎంఆర్పీ అనేది గరిష్ట చిల్లర ధర అని, ఈ ధరకే రిటైలర్ ఉత్పత్తులను అమ్మాలని, దానికంటే అదనంగా ఏ ఛార్జీలు వేసినా నేరం చేసినట్టు గుర్తించాలని మంత్రుల గ్రూప్ సూచించింది. ఎంఆర్పీ కంటే ఏదీ ఎక్కువ అమ్మకూడని స్పష్టం చేసింది. వస్తువు వాస్తవ ధర ఎంత, దానిపై జీఎస్టీ ఎంత అనేది ఎంఆర్పీ కింద వేర్వేరుగా చూపించాలని వ్యాపార సంస్థలకు సూచించింది. నవంబర్ 10న జరిగే జీఎస్టీ సమావేశంలో మంత్రుల ప్రతిపాదించిన ఈ సిఫారసును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించనుంది. -
రెస్టారెంట్లలో జీఎస్టీపై జీవోఎం ఏర్పాటు
న్యూఢిల్లీ: రెస్టారెంట్లలో జీఎస్టీ పన్ను రేట్లపై పునఃసమీక్ష, కంపొజిషన్ పథకాన్ని మరింత సులభతరంగా రూపొందించేలా సూచనల కోసం అస్సాం ఆర్థిక మంత్రి హేమంత బిస్వా నేతృత్వంలో మంత్రుల కమిటీ(జీవోఎం) ఏర్పాటైంది. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైన జీఎస్టీ మండలి భేటీలో జీవోఎంను ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల్లో మంత్రుల కమిటీ తమ నివేదికను సమర్పిస్తుంది. ఈ కమిటీలో బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ, జమ్మూకశ్మీర్ ఆర్థిక మంత్రి హసీబ్ డ్రాబు, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్, చత్తీస్‌గఢ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి అమర్ అగర్వాల్‌లు ఇతర సభ్యులుగా ఉంటారు. -
రెస్టారెంట్లు, హోటళ్లకు కేంద్రం వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : హోటళ్లు, రెస్టారెంట్లు ఎడాపెడా వాయించే సర్వీసు ఛార్జీలను తప్పనిసరిగా కాదని కేంద్రం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రెస్టారెంట్లు, హోటళ్లు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తూనే ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. సర్వీసు ఛార్జ్‌ను ఆదాయంగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించింది. వీటిపై పన్ను వసూలు చేయాలంటూ సీబీడీటీకి పేర్కొంది. సర్వీసు ఛార్జ్‌లను వసూలు చేస్తే.. వాటిపై కూడా పన్ను చెల్లించాలంటూ రెస్టారెంట్లను సైతం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు హెల్ప్‌లైన్, మీడియా ద్వారా ఫిర్యాదులు వచ్చాయని పాశ్వాన్ ట్వీట్ చేశారు. ఇకపై రెస్టారెంట్ల నుంచి పన్నులు తీసుకుంటున్నప్పుడు అందులో సర్వీస్ ఛార్జీని కూడా కలపాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డును ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జారీచేసిన గైడ్‌లైన్స్ ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేసే సర్వీసు ఛార్జ్‌లు తప్పనిసరి కాదని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది ఒక ఆప్షనల్ మాత్రమేనని పేర్కొంది. కానీ తమకందిన ఫిర్యాదుల్లో ఈ ఛార్జీలను బలవంతంగా వసూలు చేస్తున్నట్టు తెలిసిందని పాశ్వాన్ చెప్పారు. -
హోటళ్లూ ఆన్లైన్లో కొనేయొచ్చు!
♦ గంపగుత్త గ్రాసరీ ఆర్డర్ల కోసం జంబోగ్రాసరీ.కామ్ ♦ హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌లకు మాత్రమే సరఫరా ♦ ఢిల్లీ, గుర్గావ్లో సేవలు; నెల రోజుల్లో హైదరాబాద్‌లోనూ ♦ రూ.6 కోట్ల వార్షిక టర్నోవర్; రూ.25 కోట్ల నిధులకు కసరత్తు ♦ ‘స్టార్టప్ డైరీ’తో జంబోగ్రాసరీ కో–ఫౌండర్ సింబుల్ సిద్ధిఖీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంట్లోకి అవసరమైన బియ్యం, పప్పు ఉప్పుల వంటి సరకులను కొనుగోలు చేయాలంటేనే ఒక్కోసారి చిరాకొస్తుంది. అలాంటిది పెద్ద మొత్తంలో సరకులు అవసరమైన హోటళ్లు, రెస్టారెంట్లకు ఇంకెంత ఇబ్బందుంటుందో ఆలోచించండి. ఆన్లైన్లో ఇంటికి అవసరమైన గ్రాసరీలను కొనుగోలు చేసినట్టుగా వాటిక్కూడా కొనుగోలు చేసే వీలుంటే బావుంటుంది కదూ! ఇదిగో ఇదే వ్యాపార వేదికగా ప్రారంభించింది జంబోగ్రాసరీ.కామ్. దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్‌లకు గ్రాసరీలను సరఫరా చేసే తొలి స్టార్టప్ ఇదే. నెల రోజుల్లో హైదరాబాద్‌లోనూ సేవలను ప్రారంభించనుంది. నగరంలోని పలు హోటళ్లతో చర్చలూ జరుపుతోంది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ సింబుల్ సిద్ధిఖీ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘ఆతిథ్య రంగంలో వ్యాపార అవకాశాలను అందుకోవాలనే లక్ష్యంతో అభిషేక్ కుమార్‌తో కలిసి రూ.50 లక్షల పెట్టుబడులతో ఢిల్లీ కేంద్రంగా 2015 అక్టోబర్‌లో జంబోగ్రాసరీ.కామ్‌ను ప్రారంభించాం. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్స్, కార్పొరేట్ ఆఫీసు క్యాంటీన్లకు నిత్యావసర సరుకుల్ని సరఫరా చేస్తుంటాం. బియ్యం, పప్పుధాన్యాలు, మసాలాలు, వంట నూనె, బేకరీ, డ్రై ఫూట్స్, పాల ఉత్పత్తుల వంటివన్నీ ఉంటాయి. సరకుల సేకరణకు నేరుగా తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. స్టార్ హోటల్స్ నుంచి కార్పొరేట్ ఆఫీసు వరకూ.. ప్రస్తుతం జేడబ్ల్యూ మారియట్, హిల్టన్, తాజ్ వివాంత, లెమన్ ట్రీ, కోర్ట్ యార్డ్, వెస్టిన్ వంటి ప్రముఖ హోటళ్లు... అమెరికన్ ఎక్స్‌ప్రెస్, స్నాప్‌డీల్, యాక్సెంచర్, ఎయిర్టెల్ వంటి కార్పొరేట్ క్యాంటీన్లు మా కస్టమర్లు. రోజు వారీ ఆర్డర్లుండవు. వారం, నెల వారీ ఆర్డర్లుంటాయి. కనిష్ట ఆర్డర్ విలువ రూ.50 వేలు. 75 రోజుల పాటు వడ్డీ లేకుండా గ్రాసరీలను కొనుగోలు చేయొచ్చు. ఇందుకు అవసరమైన బిజినెస్ కార్డ్ కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకున్నాం. నెల రోజుల్లో హైదరాబాద్‌లో.. ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్ నగరాల్లో సేవలందిస్తున్నాం. నెల రోజుల్లో హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాలకు విస్తరిస్తాం. హైదరాబాద్‌లో ప్యారడైజ్ వంటి రెస్టారెంట్లతో మాట్లాడుతున్నాం. పాత నగరాలతో పాటూ విస్తరణ నగరాల్లో గ్రాసరీలతో పాటూ మాంసాహార ఉత్పత్తులనూ సరఫరా చేయాలని నిర్ణయించాం. గ్రాసరీలతో పాటూ అతిథ్య సంస్థలకు అవసరమైన ఇతరత్రా ఉత్పత్తులను సరఫరా చేయాలని నిర్ణయించాం. 4 నెలల్లో రూ.25 కోట్ల సమీకరణ.. ప్రస్తుతం సంస్థలో 20 మంది ఉద్యోగులున్నారు. నెలకు రూ.50 లక్షల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాం. గతేడాది రూ.6 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ‘‘విస్తరణ ప్రణాళికల నిమిత్తం తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. రూ.25 కోట్లు (4 మిలియన్ డాలర్ల) ఫండింగ్ కోసం పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. మరో 4 నెలల్లో డీల్‌ను ముగిస్తాం’’ అని సిద్ధిఖీ వివరించారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
సర్వీస్ చార్జ్‌పై క్లారిటీ..గైడ్‌లైన్స్ జారీ
న్యూఢిల్లీ: రెస్టారెంట్లు, హోటళ్ల విధిగా సర్వీస్ చార్జి చెల్లించే విధానానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తద్వారా సర్వీసు బాదుడుతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది. ఇక మీదటహోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి వసూలు చేసే సర్వస్ చార్జ్ తప్పనిసరికాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గైడలైన్స్ ను కేంద్రప్రభుత్వం రూపొందించింది. కస్టమర్ల నుంచి వసూల్ చేసే సర్వీస్ ఛార్జ్‌పై కేంద్ర ప్రభుత్వం నియమావళిని విడుదల చేసింది. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి అంశం కాదని, అది వ్యక్తగతమైనదని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాశ్ పాశ్వాన్ ట్విట్టర్లో ప్రకటించారు. సర్వీస్ చార్జ్ ఎంత చెల్లించాలి అని నిర్ణయించే అధికారం హోటల్స్‌కు, రెస్టారెంట్లకు లేదని ట్వీట్ చేశారు. కస్టమర్లు ఎంత సర్వీస్ ఛార్జ్ కట్టాలన్న అంశాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు డిసైడ్ చేయరాదని, అది కస్టమర్ విజ్ఞతకు వదిలి వేయాలని వరుస ట్వీట్లలో తెలిపారు.. సర్వీస్ ఛార్జ్ అంశంపై తయారు చేసిన మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాలకు పంపినట్లు పాశ్వాన్ పేర్కొన్నారు. కాగా సేవా రుసుంను తప్పనిసరిగా బిల్లుతో పాటు చేర్చే విధానానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల ప్రతినిధులతో చర్చించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను సమీక్షించి ఈ మేరకు సవరణలు ప్రతిపాదించింది. దీనికి హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లుతోపాటు వాటి స్థాయిని బట్టి 5-20 శాతం సర్వీస్ చార్జి బిల్లులో కలిపి వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. Hotels/Restaurants should not decide how much Service Charge is to be paid by the customer &it should be left to the discretion of customer. — Ram Vilas Paswan (@irvpaswan) April 21, 2017 Guidelines are being sent to states for necessary action at their ends. — Ram Vilas Paswan (@irvpaswan) April 21, 2017 -
చికెన్ ముక్కలు లెక్కగట్టి పెడతారట
న్యూఢిల్లీ: రెస్టారెంట్లు, హోటళ్లలో వృథా అయ్యే ఆహారాన్ని సేవ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. ఆహార రంగానికి చెందిన ముఖ్యులతో ఈ మేరకు సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ మంత్రి రామ్ విలాస్ పశ్వాన్ మీడియాతో పేర్కొన్నారు. రెస్టారెంట్లు, హోటళ్లకు వచ్చే వారికి ఒక్కో ప్లేటుకు ఎంత ఆహారం వడ్డించాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. తాను రెస్టారెంట్లకు వెళ్లిన సమయంలో ఆహారం వృథా కావడం గమనించినట్లు తెలిపారు. అధిక సంఖ్యలో పేదలు కలిగిన భారత్ లాంటి దేశంలో ఆహారం వృథాగా పోవడం మంచిది కాదన్నారు. రెస్టారెంట్లకు వచ్చే వారికి వడ్డించే ఆహారంపై చట్టపరమైన నిబంధనలు తెచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆహారంపై ఆంక్షలు వేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని.. ఇంట్రెస్ట్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉన్నందు వల్లే ఈ దిశలో యోచిస్తున్నట్లు తెలిపారు. రెస్టారెంట్లు, హోటళ్లు అన్నింటిలో ఒకే విధమైన రూల్స్‌ను తెచ్చే విషయంపై ఆహార రంగ నిపుణులతో చర్చలు జరుపుతామని అన్నారు. ఏ ఐటమ్‌ను ఎంత మొత్తంలో సర్వ్ చేస్తారనే విషయాన్ని రెస్టారెంట్లు, హోటళ్లు రాతపూర్వకంగా సమర్పించాల్సివుంటుందని తెలిపారు. అయితే, ఒక వ్యక్తి ఎంత ఆహారం తీసుకోగలడు అనే దాన్ని అంచనా వేసి ఆ మేరకు నిబంధనలు తయారు చేస్తామని చెప్పారు. అంటే ఒక వ్యక్తి ఎన్ని చికెన్ ముక్కలు తినగలడు అనే దాన్ని అంచనా వేసి అన్ని చికెన్ పీస్‌లు లెక్కగట్టి పెడతారనమాట. కాగా ధాబాల్లో మాత్రం ఈ నిబంధనలు వర్తించబోవని తెలిపారు. -
సేవా రుసుం ఇస్తే తీసుకోవాలి
• బలవంతం చేస్తే చర్యలు • హోటల్ యాజమాన్యాలకు సర్కారు స్పష్టీకరణ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెస్టారెంట్లు, హోటళ్లలో సేవా రుసుము చెల్లించే అంశంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సర్వీసు చార్జీల చెల్లింపు వినియోగదారుల విచక్షణకే వది లేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్జీల వసూలు ను తప్పనిసరి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సేవలకు సంతృప్తి పడి ఇస్తే తీసుకోవాలిగానీ, బల వంతం చేస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం–1986 ప్రకారం చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ కోర్టుల్లో ఆహార పదార్ధాలను భుజించేం దుకు వెళ్లిన వినియోగదారులపై ఆయా హోటల్ నిర్వాహకులు సర్వీసు చార్జీలను వడ్డిస్తు న్నారు. రూ.కోటిన్నర టర్నోవర్ కలిగిన సంస్థలు బిల్లుపై 5 శాతం, రూ. కోటిన్నర పైబడిన హోటళ్లు 15 శాతం సేవా రుసుమును వసూలు చేస్తున్నారు. వినియోగ దారులు ఆందోళన వ్యక్తం చేసినన నేపథ్యం లో గతేడాది చివరలో కేంద్రం సర్వీసు చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. బోర్డుపై టోల్ ఫ్రీ నంబర్ తప్పనిసరి ఇకపై వాణిజ్య కార్యకలాపాలు నిర్వర్తించే సంస్థలు విధిగా తమ దుకాణం బోర్డు మీద 180042500333 నంబర్ పొందుపరచాలి. దుకాణదారులు మోసాలకు పాల్పడితే ఆ టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారు. ‘గ్రహక్ సువిధ కేంద్ర’ పేరిట కేంద్రం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై స్పందించాలని జీహెచ్ఎంసీ, వాణిజ్యపన్నుల శాఖ, తూనికలు, కొలతలు, ఆహారభద్రత, కార్మికశాఖలకు జిల్లా పౌర సరఫరాలశాఖ లేఖ రాసింది. -
రెస్టారెంట్స్, హోటల్స్ మూసివేయండి!
రోడ్డు పక్కకు ఏమైనా షాపులు, రెస్టారెంట్లు, హోటల్స్ కట్టాలంటే.. ముందస్తుగా దానికి అనువైన పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. లేకపోతే రోడ్లపై వెళ్లే వాహనాదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పవు. కానీ కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ మాత్రం అసలు పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేయవు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మద్రాసు హైకోర్టు, సరిపడ పార్కింగ్ ప్రాంత లేని రెస్టారెంట్లు, హోటల్స్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం సుందర్‌లతో కూడా బెంచ్ ఈ మేరకు శుక్రవారం తీర్పునిచ్చింది. పార్కింగ్ స్థలం లేని రెస్టారెంట్లకు, హోటల్స్‌కు లైసెన్సులు రద్దు చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించిన బెంచ్ సభ్యులు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయంపై తదుపరి విచారణ మార్చి 24న చేపడతామని చెప్పారు. విచారణ తేదీలకు మూడు రోజుల ముందు వరకు ఈ విషయంపై జాయింట్ ప్రొగ్రెస్ రిపోర్టును తమకు అందజేయాలని అథారిటీలను ఆదేశించారు. '' ఒకవేళ సరిపడ పార్కింగ్ స్థలం లేకుండా రెస్టారెంట్లు, హోటల్స్ నడుస్తుంటే వాటిని వెంటనే అథారిటీలు మూసివేయాలి'' అని బెంచ్ సభ్యులు పేర్కొన్నారు. -
అయితే హోటల్స్ లో తినకండి..!
న్యూఢిల్లీ: రెస్టారెంట్లలో ఆర్డర్స్ పై ఎడాపెడా వాయించే సర్వీసు ఛార్జ్‌లపై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనపై నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ ఆర్ ఏఐ) స్పందించింది. ప్రభుత్వం ప్రకటను విభేదించిన సంఘం సర్వీస్ చార్జ్ చెల్లించే ఉద్దేశం లేకపోతే హెటల్స్ లో తినొద్దంటూ ఒక ప్రకటన జారీ చేసింది. సర్వీస్ ఛార్జ్ విధింపును పూర్తిగా సమర్ధించుకున్న ఎన్ఆర్ఏఐ సర్వీసు చార్జ్ ను ఐచ్ఛికం చేసే బదులు ప్రభుత్వం పన్నులు వదులుకోవాలని వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారంమే తాము ఈ చార్జిలను వసూలు చేస్తున్నట్టు ఎన్ ఆర్ ఏఐ అధ్యక్షుడు రియాజ్ అమ్లాని స్పష్టం చేశారు. ప్రభుత్వం చెబుతున్న అదే వినియోగదారుల రక్షణ చట్టాన్ని తమ వాదన మద్దతుగా రియాజ్ ఉదహరించారు. చట్ట విరుద్ధంగా, అన్యాయంగా తాము వ్యవహరించడం లేదని వివరణ ఇచ్చారు. సర్వీస్ చార్జి వసూళ్లను ఉద్యోగుల మధ్య సమానంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు. ఇది ఉద్యోగుల ఆదాయ పన్ను చెల్లించడం, రెస్టారెంట్ల వ్యాట్ బిల్లులాంటి వాటిల్లో భాగమంటూ సర్వీస్ చార్జి వసూలు సమర్ధించుకున్నారు. అలాగే అనేక రెస్టారెంట్లు ఇప్పటికే సర్వీస్ ఛార్జ్ చెల్లింపులపై వినియోగదారులకు మర్యాదగా వివరిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం తాజా ఆదేశాలకు బదులు సర్వీస్ చార్జ్ ను రద్దు చేసి ఉంటే బావుండేదని మరి కొంతమంది రెస్టా రెంట్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రెస్టారెంట్ అద్దెలు, మార్కెట్లో పోటీ , కార్మికుల జీతాలు పెరుగుతున్నాయని ప్రముఖ చెఫ్, మంకీ బార్ అవుట్ లెట్స్ ప్రతినిధి మను చంద్ర వ్యాఖ్యానించారు. ఇపుడిక ఈ ఖర్చులకోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ నిట్టూర్చారు. కాగా సర్వీసు చార్జీని తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని సోమవారం కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. సర్వీసు ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా అన్నది వినియోగదారులే నిర్ణయించుకుంటారని చెప్పిన కేంద్రం.. అది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని తేల్చి చెప్పింది. హోటల్స్, రెస్టారెంట్లలో 5 నుంచి 20 శాతం సర్వీసు ఛార్జ్ వసూలు చేస్తున్నారని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ తాజా నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వేడుకగా 2017
మహానగరం మురిసింది. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సిటీ చిందేసింది. రెండు సంత్సరాలకు వారధిలాంటి డిసెంబర్ 31 రాత్రివిద్యుత్ కాంతులను సింగారించుకుంది. గ్రేటర్ నలుదిశలా వెలసిన వెలుగుల వేదికలపై నవ వసంత వేడుకలు కొంగొత్త కాంతులను పంచాయి. సిటీలోని పబ్‌లు, క్లబ్‌లు, రిసార్ట్స్, రెస్టారెంట్లు, హోటళ్లు, ఓపెన్ ఆడిటోరియాలూ యువత ఆటపాటలతో నిండిపోయాయి. కాలం పరుగును లెక్కిస్తూ పరిగెట్టిన గడియారం ముల్లు టిక్..టిక్.. శబ్దం ప్రతి గుండెనూ తాకింది. అర్ధరాత్రి అడుగడుగునా ఆనంద పల్లవి అందుకుని ‘కొత్త’ రాగం పాడింది. రోడ్లు కేరింతలతో కేకపుట్టించాయి. నయాసాల్ జోష్‌తో సెల్ టవర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. -
ఇష్టముంటేనే సర్వీస్ చార్జీ
హోటళ్లు, రెస్టారెంట్ల విషయంలో స్పష్టం చేసిన ప్రభుత్వం న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు.. సర్వీస్ చార్జీ విధించే ముందు తప్పనిసరిగా వినియోగదారులను అడగాలని ప్రభుత్వం పేర్కొంది. సర్వీస్ చార్జీ అనేది స్వచ్ఛందమని, ఇది టిప్లాంటిదని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి హేమ్ పాండే పేర్కొన్నారు. అయితే చాలా హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో పది శాతం వరకూ సర్వీస్ చార్జీ విధిస్తున్నాయని వివరించారు. వినియోగదారులను అడిగిన తర్వాతనే హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీ విధించాలని పేర్కొన్నారు. ఆ ‘సర్వీస్’ నచ్చకపోతే వినియోగదారులు ఈ సర్వీస్ చార్జీని చెల్లించాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. సర్వీస్ చార్జీ చెల్లించాలా వద్దా అనేది వినియోగదారుల ఇష్టమని పేర్కొన్నారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవడానికి రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రెస్టారెంట్లు... బిల్లులపై 12.5 శాతం వ్యాట్‌ను, 6 శాతం సర్వీస్ ట్యాక్స్‌లతో పాటు సర్వీస్ చార్జీని కూడా విధిస్తున్నాయి. వినియోగదారుల హక్కులకు సంబంధించి అవగాహనను పెంచడానికి వివిధ చర్యలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకుందని హెమ్ పాండే చెప్పారు. కొత్త వినియోగదారుల రక్షణ బిల్లును రూపొందించామని వివరించారు. -
బెజవాడ రెస్టారెంట్లలో సీటీవోల తనిఖీలు
విజయవాడ : వాణిజ్య పన్నుల శాఖాధికారులు గురువారం నగరంలోని 15 రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. విజయవాడ రాజధానిగా మారినప్పటికీ రెస్టారెంట్ల నుంచి పన్నుల రాబడి పెరగకపోవడంతోపాటు పుష్కరాల సందర్భంగా ఆశించిన రాబడి రాకపోవడంతో ఆగ్రహించిన ఆ శాఖ కమిషనర్ శ్యామలరావు సీటీవో స్థాయి అధికారుల్ని 15 బృందాలుగా ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించారు. బందరురోడ్డు, ఏలూరురోడ్డు, మొగల్రాజపురంలోని రెస్టారెంట్లతో పాటు రెండు మూడు బ్రాంచీలు కలిగిన రెస్టారెంట్లపైన అధికారులు దృష్టిసారించినట్లు తెలిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనిఖీలు జరిగాయి. పుష్కరాల్లో అంత సీన్ లేదు పుష్కరాల సందర్భంగా రెస్టారెంట్లలో ఆశించిన స్థాయిలో వ్యాపారం సాగలేదని నిర్వాహకులు చెబుతున్నారు. పుష్కరాల రోజుల్లో అక్షయప్రాత, టీటీడీ, దుర్గగుడి వంటి ధార్మిక సంస్థలు పెద్దఎత్తున అన్నదాన ప్రసాదాలు వితరణ చేశాయని, అనేక స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేయడంతో కొన్ని రెస్టారెంట్లు సాధారణ రోజుల్లో కంటే తక్కువ వ్యాపారాలు చేసినట్లు తెలిసింది. అందువల్లనే పన్నులు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ కట్టలేదు. ఇదిలా ఉండగా అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న ఒకటి, రెండు రెస్టారెంట్ల జోలికి అధికారులు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
రెస్టారెంట్లను వణికిస్తున్న చైనా డాగ్స్?
బీజింగ్: చైనాలో రెస్టారెంట్లకు, మాంసం కొట్టు అమ్మకందార్లకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. తమ రెస్టారెంట్ల పేర్లకు ముసుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రెస్టారెంట్లు ఏకంగా వాటి పేరునే మార్చుకుంటున్నాయి. ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా.. రేపు(మంగళవారం) చైనాలో కుక్క మాంసం ఉత్సవం అట. దాదాపు పది వేల కుక్కలను బలిచ్చి ఈ ఉత్సవం జరుపుతారంట. అయితే, ఇప్పటికే జంతు ప్రేమికులు ఈ ఉత్సవాన్ని జరిపిన వారి అంతు చూస్తామని వార్నింగ్‌లు ఇచ్చిన నేపథ్యంలో ఆ మాంసాన్ని విక్రయిస్తున్నవారు, రెస్టారెంట్లలో భోజనంగా పెడుతున్నవారు వణికిపోతున్నారు. దాడులు జరిపే అవకాశం ఉన్నందున తమకు సహకరించాలని మరోపక్క పోలీసులు కూడా సూచించడంతో రెస్టారెంటు వాళ్లు ఈ పనిచేస్తున్నారు. చైనాలోని జియాంగ్బిన్ అనే రోడ్డును డాగ్ స్ట్రీట్ గా పిలుస్తారు. ఇక్కడ కుక్క మాంసం కుప్పులుగా దొరుకుతుంది. సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి కస్టమర్లు తెగలాగించేస్తుంటారు. కాగా, ఇదే ప్రాంతంలో ప్రతి ఏడాది కుక్క మాంసం పండుగ నిర్వహిస్తుంటారు. ఈ సంప్రదాయం 1990లోనే ప్రారంభమైంది. అయితే, ఉత్సవం నిర్వహించిన ప్రతిసారి ఘర్షణలు జరగడం సర్వసాధరణం అయ్యాయి. అయితే, మంగళవారం జరిగే ఉత్సవంలో మాత్రం భారీ ఘర్షణ జరిగే అవకాశం ఉందని, ఇంత క్రూరంగా మూగజీవాలను చంపుతూ ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని జంతు ప్రేమికులు ఇప్పటికే తమ వ్యూహాలతో సిద్ధమయ్యారని దాడులు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. దీంతో వారంతా తమ సైన్ బోర్డుల్లో 'కుక్క' అనే పేరు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. -
హోటళ్లపై జీహెచ్ఎంసీ దాడులు
హైదరాబాద్ : ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుండా నడుపుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లపై జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. మలక్‌పేట్‌లోని సిగ్నేచర్ బార్ యాజమాన్యం రూ.6 లక్షల ప్రాపర్లీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో బార్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వనస్థలిపురంలోని స్వాగత్ హోటల్ యాజమాన్యం రూ.40 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో హోటల్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. -
వేస్ట్ చేస్తే.. వేసేస్తారు!
‘తింటున్న దాని కంటే వృథా చేస్తున్నదే ఎక్కువ...’ ఆహారం విషయంలో ఐక్యరాజ్యసమితి వ్యాఖ్య ఇది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ వృథా అవుతున్న ఆహార పరిమాణం గురించి లెక్కగట్టిన ఆ సంస్థ ప్రతి ఏటా 13 లక్షల టన్నుల ఆహార పదార్థాలు మట్టిపాలు అవుతున్నాయని తేల్చింది. విందులు, పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో, ఇళ్లల్లో, హోటళ్లలో వృథా అవుతున్న ఆహార పరిమాణం ఇది. ఈ నేపథ్యంలో తమ వంతుగా ఇలాంటి వృథాను అరికట్టడానికి జర్మనీ చేస్తున్న ఒక ప్రయత్నం ఆసక్తికరంగా ఉంది. - సాక్షి సెంట్రల్ డెస్క్ ఆహారాన్ని వృథా చేస్తే ఫైన్ జర్మన్ రెస్టారెంట్లలో అమలవుతున్న చట్టం వేస్ట్ చేస్తే బిల్లు కన్నా పెరిగిపోయే ఫైన్ కిరాణా స్టోర్లలో పదార్థాలపై కన్నేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం వృథా అరికట్టడానికి కఠినమైన చట్టాలు అభినందనలు అందుకుంటున్న వృథా నివారణ యత్నాలు కందిపప్పు కష్టాలు.. కస్టమర్లపై ఫైన్! మనదేశంలోనూ ఫైన్ వేస్తామంటూ వృథా ను నివారించే ప్రయత్నాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. ముంబైలోని ఒక ఉడిపి హోటల్ వాళ్లు తమ హోటల్లో సాంబార్‌ను వృథా చేసే వాళ్లపై ఫైన్ వేస్తున్నారు. ఇడ్లీ తిన్న తర్వాత ఒక్కబొట్టు సాంబార్ కూడా మిగల్చకూడదక్కడ. మిగిలితే పది రూపాయల వరకూ ఫైన్ వేస్తున్నారు. సాంబార్ మిగలకూడదన్న నియమాన్ని కస్టమర్లకు ముందుగానే వివరించి అక్కడ ఇడ్లీ వడ్డిస్తున్నారు. అయితే ఇక్కడ అసలు వ్యవహారం వేరే ఉంది. కందిపప్పు ధర ఆకాశానికంటడంతో సాంబార్ తయారీ ఖర్చు పెరగడంతో ఆ హోటల్ ఈ ఫైన్ నిబంధన పెట్టిందంతే! రెస్టారెంట్ రూల్ ఇది... ‘మీకు కావాల్సినంత తినండి. కొసరి కొసరి వడ్డిస్తాం. కానీ తిన్నాక కంచంలో మెతుకు మిగలకూడదు’ అనేది జర్మనీ దేశంలోని రెస్టారెంట్లలో ఉన్న నియమం. ప్రభుత్వం చట్టంగా చేసిన ఈ నియమాన్ని అక్కడి రెస్టారెంట్ ఓనర్లు కచ్చితంగా అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు దారికి వచ్చారు. తిన్నంత తిని, పడేసినంత పడేసే దగ్గర నుంచి.. సరదాగా హోటల్‌కు వెళ్లినప్పుడు కూడా కొంచెం కొంచెం ఆర్డర్ ఇచ్చుకునే దశకు వచ్చారు. బిల్లు కన్నా ఫైనే ఎక్కువ! ఒక రెస్టారెంట్ లేదా హోటల్లో ఎవరైనా ఆహారాన్ని వృథా చేస్తే అక్కడున్న వేరే వాళ్లు కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఆఖరికి కోక్, ఎనర్జీ డ్రింకులను అయినా ఖాళీ చేయకుండా అలాగే వదిలేస్తే ఫైన్ పడుతుంది. కనీస వడ్డన 50 యూరోల వరకూ ఉంటుంది. ఈ మొత్తాన్ని మరోరకంగా చూస్తే... స్నేహి తులతోనో, బంధువులతోనో కలసి భోజనం చేస్తే అయ్యే బిల్లు కన్నా.. ఎక్కువ. అందుకే ఇప్పుడు జర్మన్ రెస్టారెంట్లలో, హోటళ్లకు వెళ్లిన వాళ్లు చాలా పరిమితంగానే ఆర్డర్లు ఇవ్వడాన్ని అలవాటు చేసుకున్నారు. అవ సరం అయితే మారు వడ్డనకు ఆర్డర్ ఇచ్చు కోవచ్చు.. వృథా చేయకుండా బయటికి వస్తే చాలనేది ఇప్పుడు అక్కడి ప్రజల భావన. ఫ్రాన్స్‌లో షాపుల వాళ్లపై... ప్రజలపై కాదు కానీ, కిరాణా సరుకులను అమ్మే గ్రోసరీ షాపుల వాళ్లపై దృష్టి పెట్టింది ఫ్రెంచి ప్రభుత్వం. ఒక ప్రణాళిక లేకుండా సరుకులను షాపుకు తెప్పించుకుని వాటి ఎక్స్పైరీ డేట్ దాటే వరకూ షాపులో ఉంచుకుని.. చివరకు వాటిని మట్టిపాలు చేయడానికి వీలులేదక్కడ. కాలపరిమితి దాటిపోయి వృథా అవుతాయనుకున్న ఆహారపదార్థాలను వీలైనంత ముందుగా ఏ అనాథాశ్రమాలకో డొనేట్ చేయాలి కానీ.. వృథా చేస్తే మాత్రం షాపు యజమానులకు భారీ ఫైన్లు, జైలు శిక్షలు అమల్లో ఉన్నాయి. ఈ విధంగా ఆహార వృథాను అరికట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాలో కూడా... ఆహారాన్ని వృథా చేయడంలో తొలి వర సలో, తొలిస్థానంలో ఉన్నారు అమెరికన్లు. అక్కడ కూడా రెస్టారెంట్లలో, హోటళ్లలో వృథా చేసే వారిపై ఫైన్ వేయాలనే ప్రతి పాదన ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని నగరాల్లో మాత్రమే అది అమలవుతోంది. ఇక మనదేశం విషయానికి వస్తే... భారతీయులు కూడా తమ వంతుగా ఏటా 58 వేల కోట్ల రూపాయల విలువచేసే ఆహారాన్ని చెత్తకుండీల పాల్జేస్తున్నారు. ప్రధానంగా పెళ్లిళ్లు, విందుల సమయాల్లోనే ఎక్కువ ఆహారం వృథా అవుతోంది. మరి వృథాను అరికట్టడానికి ప్రభుత్వం ఫైన్లే వేయనక్కర్లేదు. వృథా చేయరాదనే స్పృహ ఉంటే చాలు కదా! -
హైదరాబాద్‌లో అర్థరాత్రి వరకూ హోటళ్లకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు ఇకపై ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నడుపు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ గురువారం ఉత్తర్వు జారీ చేశారు. -
జూన్ 1 నుంచి కొత్త సేవా పన్ను రేటు అమల్లోకి
న్యూఢిల్లీ: బడ్జెట్లో కొత్తగా 14 శాతం మేర ప్రతిపాదించిన సర్వీస్ ట్యాక్స్ రేటు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుతం ఇది విద్యా సుంకం సహా 12.36 శాతంగా ఉంది. తాజా రేటుతో రెస్టారెంట్లలో తినడం, బీమా పాలసీలు .. ఫోన్ బిల్లులు మరింత భారంగా మారనున్నాయి. అడ్వర్టైజింగ్, విమాన ప్రయాణాలు, ఆర్కిటెక్టుల సేవలు, ఈవెంట్ మేనేజ్మెంట్ మొదలైన వాటన్నింటిపైనా సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. -
ఠండీ సండీ
బయట ఎండలు మండిపోతుంటే... గొంతులోకి చల్లగా ఐస్‌క్రీమ్ జారడం అద్భుతమైన అనుభూతి. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఐస్‌క్రీమ్స్ ఇష్టపడని వారు ఉండరు. ఇలాంటి హిమక్రీమ్ల ప్రేమికుల కోసమే... రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్, మాల్స్... డిఫరెంట్ ఐస్‌క్రీమ్స్‌ను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇక ఈ సమ్మర్ స్పెషల్‌గా అందరి నోరూరించనుంది సండీ. చాక్లెట్ ైబె ట్స్, కలర్‌ఫుల్ జెమ్స్, సీజనల్ ఫ్రూట్స్, డ్రై-ఫ్రూట్స్, చెర్రీస్, డేట్స్, వాల్నట్స్, సేమియా ఇలా అనేక రకాల కాంబినేషన్స్‌తో తయారు చేసి.. దానికి ఓరియో, వేపర్, చాక్లెట్ అండ్ కారమేల్ స్ప్రింకిల్స్, పైన్ ఆపిల్, ఆపిల్ క్రష్డ్ పీసెస్.. వంటి వాటితో డెకరేట్ చే స్తున్నారు. కోల్డ్ కాఫీ, ఐస్‌క్రీమ్ పంచ్, మాక్టైల్స్, కోక్ఫ్లోట్, ఫ్రూట్ సలాడ్ వంటి తినుబ ండారాల్లో సైతం కలుపుతున్నారు. నోరు తీపి చేసే గులాబ్‌జామూన్, హల్వా, ఖుర్బానీ-కా-మీటా, డబుల్-కా-మీటాల్లో సైతం ఈ సండీని కాంబినేషన్‌గా వాడుతున్నారు. ‘డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ ఇష్టపడుతున్నట్టే... ఐస్‌క్రీమ్స్‌లోనూ వెరైటీలను కోరుకుంటున్నారు. అలాంటి ఐస్‌క్రీమ్ లవర్స్ వీటిని ఇష్టంగా టేస్ట్ చేస్తారు’ అని చెబుతున్నారు హాజెల్ ఐస్‌క్రీమ్ కెఫే మేనేజర్ రాకేష్ కుమార్. - శిరీష చల్లపల్లి చిన్నారుల కోసం.. రొటీన్ సమ్మర్ క్యాంపులకు భిన్నంగా తాహెర్ అలీ బేగ్ థియేటర్ గ్రూప్ పిల్లల కోసం ప్రత్యేక వర్క్‌షాపు నిర్వహిస్తోంది. ‘స్కెచ్చింగ్, క్రియేటివ్‌గా ఆలోచించడం’ అనే అంశాలపై నిర్వహించే శిక్షణకు మూడు నుంచి ఏడేళ్లలోపు చిన్నారులు అర్హులు. మే 2 నుంచి 23 వరకు వారాంతాల్లో తరగతులు ఉంటాయి. వివరాలకు taher@ flickrollers.com -
నైవేద్యం స్పెషల్
ఉగాది పండుగ అనగానే గుర్తొచ్చేది పచ్చడి. అటుకుల పాయసం, పూర్ణాలు, బొబ్బట్లు, నేతితో చేసిన హల్వా... అదనపు రుచి! పండుగకు ఒక్కరోజే సెలవు. చదువుల కోసమో, ఉద్యోగ రీత్యానో నగరంలో ఉండేవారు... ఒక్కరోజు పండుగకు ఊళ్లకు వెళ్లలేరు. పండుగను చేసుకోలేరు. అలాంటివారి కోసమే ఉగాదికి నైవేద్యం స్పెషల్ ఐటమ్స్‌ను మెనూలో చేర్చాయి సిటీలోని వివిధ హోటల్స్, రెస్టారెంట్స్. అటుకుల పాయసం... పాలతో చేసే పాయసం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందులోనూ పండుగ స్పెషల్‌గా ఉండే అటుకుల పాయసం అంటే ఇష్టపడని వారుండరు. ఆవునెయ్యి, జీడిప్పు, బాదంపప్పు, సారపప్పులను చిక్కటి పాలను చేర్చి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ అటుకుల పాయసానిది నైవేద్యం స్పెషల్‌లో ఫస్ట్ ప్లేస్! పుత్తడి పూర్ణాలు... బియ్యపు పిండి, బెల్లం, శనగపప్పు, జీడిపప్పునకు సోంపును చేర్చిన ముద్దను.. బంగారు రంగు వచ్చేవరకు నేతిలో వేయిస్తారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ పూర్ణాల రుచి అమోఘం! బంగారు భక్షాలు... తెలంగాణస్పెషల్ వంటకం భక్షాలు. వీటినే పోలాలు అని కూడా అంటారు. చపాతీ చేసి మధ్యలో శనగపప్పు, పాత బెల్లం కలిపిన ముద్దను కూర్చి చేసే భక్షాల వాసనకు అందరూ ఫిదా కావాల్సిందే. వీటిని నేతిలో అద్దుకుని తిని చూడండి ఇంకోటి అనక మానరు! నేతి హల్వా... ఉడికించిన క్యారెట్ తురుము, డ్రైఫ్రూట్స్‌ని నేతిలో వేయించి... చక్కెర, బెల్లం తురుము, పచ్చి కోవా కలిపి చేసేదే నేతి హల్వా! దీని రుచి చూస్తే వాహ్వా అనాల్సిందే! -
ఉలవచారు ఇడ్లీ...
తెలుగువారి సంప్రదాయ రుచులు దోశ, ఇడ్లీ. వీటికి రకరకాల చట్నీలు, ఫ్లేవర్లు యాడ్ చేసి విభిన్నంగా అందించే ప్రయత్నం చేస్తున్నాయి నగరంలోని రెస్టారెంట్లు. దోశలో అయితే ఓకే... ఎన్నో వెరైటీలు పరిచయం. కానీ ఇడ్లీ..! దానికీ మాంచి రుచి యాడ్ చేశారు ఫిలింనగర్ మయూర హౌస్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ శివరాజ్. దీంతోపాటు స్పెషల్ దోశలనూ ఈయన తయారు చేస్తున్నారు. రండి... ఆ రుచులు మనమూ ‘టేస్ట్’ చేద్దాం... కార్న్ చీజ్ దోశ దోశల్లోనే ఇదో సరికొత్త వెరైటీ. మినప దోశపై నెయ్యిలో వేయించిన స్వీట్‌కార్న్, చీజ్‌ను వేసి, నాలుగు రకాల చట్నీలతో వడ్డిస్తే ఎరికైనా నోరూరాల్సిందే. తినేదాకా ఎందుకు... అసలు చూస్తుంటేనే కడుపు నిండినంత ఫీలింగ్ వస్తుంది. రుచే కాదు... ఆరోగ్యానికి కూడా ఈ దోశ ఎంతో మేలు చేస్తుంది. ఫుడ్ లవర్స్ దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వెరైటీ టేస్ట్... ఇడ్లీలకు కాంబినేషన్‌గా ఎన్నో చట్నీలు, సాంబార్లూ ఉన్నాయి. అవన్నీ పాత రుచులే. తొలిసారిగా ఆంధ్రా ఉలవచారుతో ఇడ్లీలు అందిస్తున్నాం. నగరవాసులకు ఇది ఓ సరికొత్త టేస్ట్‌ను ఇవ్వడమే కాదు... ఎంతో ఆరోగ్యాన్ని కూడా సమకూర్చుతుంది. పల్లీ, అల్లం చట్నీలు, సాంబారుతో ఎంత ఇష్టంగా లాగిస్తారో ఉలవచారు ఇడ్లీలు కూడా అంతే ఇష్టంగా తింటున్నారు నగరవాసులు. కాకినాడ పెసరట్టు అట్టులందు పెసరట్టు వేరయా అనేవారు ఎందరో! మినప దోశలు ఎన్ని రకాలుగా ఊరిస్తున్నా... పెసరట్టు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇంత ప్రత్యేకమైన పెసరట్టుకు మరిన్ని ఫ్లేవర్లు యాడ్ చేశాం. మేలు రకం పెసల పిండి... పైన నేతిలో వేయించిన జీడిపప్పు, కలర్ఫుల్గా కనిపించే క్యారెట్, కొత్తిమేర దట్టించి, దోరగా కాల్చి, దానికి కాస్త వెన్న జోడించి వడ్డిస్తే... వాహ్ అనాల్సిందే. సామాన్యులే కాదు సూపర్‌స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్లు కూడా అడిగి మరీ రెగ్యులర్‌గా పార్శిల్ తెప్పించుకుంటారు. అంత రుచిగా ఉంటుందీ పెసర దోశ. చెఫ్ శివరాజ్ -
రాత్రంతా హోటళ్లు, రెస్టారెంట్లు
అభ్యంతరం లేదన్న పోలీసు విభాగం సాక్షి, ముంబై: నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, పాల కేంద్రాలు, కాఫీ సెంటర్లు, మందుల షాపులు తదిత అత్యవసర సేవలకు సంబంధించిన దుకాణాలు రాత్రి వేళల్లో తెరిచి ఉంచితే తమకు అభ్యంతరం లేదని ముంబై పోలీసు శాఖ స్పష్టం చేసింది. దీంతో సెకండ్, నైట్ షిప్టులో పనిచేసే ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వ్యాపారులకు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సాధారణ ప్రజలకు ఎంతో ఊరట లభించనుంది. గడియారంలో ముల్లులాగా 24 గంటలు ఉరుకులు, పరుగులతో జీవనం సాగించే ముంబైకర్లకు రాత్రి 10 గంటలు దాటిన తరువాత మంచి హోటళ్లు, రెస్టారెంట్లు, కనీసం కాఫీ సెంటర్లు కూడా అందుబాటులో ఉండవు. నేటి ఆధునిక, పోటీ కాలంలో అనేక ప్రైవేట కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు రాత్రి వేళల్లో కూడా పనిచేస్తున్నాయి. నైట్ షిఫ్టుల్లో పని చేసే వారికి అర్థరాత్రి సమయంలో కనీసం అల్పాహారం, టీ, కాఫీ కూడా దొరకవు. దీంతో గత్యంతరం లేక చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఫుట్‌పాత్‌లపై లభించే అపరిశుభ్రమైన, కల్తీ తినుబండరాలు తినక తప్పడం లేదు. ముంబైకర్ల సౌకర్యార్థం రాత్రి వేళల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, పాల కేంద్రాలు తెరిచి ఉంచాలని గతంలో శివసేన కార్పొరేటర్లు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) స్థాయి సమితిలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు మంజూరు లభించడంతో ప్రభుత్వం ముందు ఉంచారు. కానీ గత కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం నిరాకరించడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ప్రభుత్వం మారిన తరువాత ఈ ప్రదిపాదనను మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన బీజేపీ, శివసేన ప్రభుత్వం రాత్రి వేళల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. దీంతో ఈ ప్రతిపాదనను ముంబై పోలీసు శాఖకు పంపించారు. నారిమన్‌పాయింట్, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), షాపింగ్ మాల్స్ లాంటి నివాసేతర ప్రాంతాలలో హోటళ్లు, రెస్టారెంట్లు, కాఫీ సెంటర్లు, పాల డెయిరీలు ప్రారంభించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసు శాఖ ప్రభుత్వంతో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆస్పత్రులున్న ప్రాంతాల్లో మాత్రమే మెడికల్ షాపులు (అనుమతి పొందినవి) 24 గంటలు తెరిచి ఉంటున్నాయి. మిగతా ప్రాంతాల్లో రాత్రి 10 గంటల తరువాత వాటిని మూసివేస్తున్నారు. అత్యవసరం సమయంలో మందులు కావాలంటే ఆస్పత్రులున్న ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఇక నుంచి ఉరుకులు పరుగులు తీయనవసరం లేదు. త్వరలో ముంబై పోలీసు శాఖ నుంచి సర్క్యులర్ విడుదల కానుంది. ఆ తరువాత అత్యవసర సేవల షాపులన్నీ అందుబాటులోకి వస్తాయి. -
న్యూ ‘ఇయర్’ రూల్స్..!
భువనగిరి/ కోదాడటౌన్ : నవ వసంతానికి స్వాగతం పలికేందుకు యువత ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటుంటుంది. అయితే ఆనందంగా గడుపుకోవాల్సిన నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నిండాకుండా ఉండేందుకు పోలీస్‌శాఖ కొన్ని సూచనలు చేసింది. హద్దు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు.. ఇంకెవరైనా సరే.. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలంటే ప్రభుత్వం జారీ చేసిన సరికొత్త నిబంధనలు పాటించాల్సిందే. ఈవెంట్ ఆర్గనైజర్లు ఎవరైనా వేడుకలను నిర్వహిస్తే ముం దస్తు అనుమతి తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి రూ.3వేల ఫీజు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా వేడుకలు నిర్వహిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని ఉన్నత స్థాయి నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా వేడుకలను నిర్ణీత సమయం వరకే నిర్వహించాల్సి ఉంటుంది. అనుమతులు కోసం ఎక్సైజ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను జిల్లా అధికారులకు పంపి వారి ఆమోదం పొందిన అనంతరం అనుమతులు జారీ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సివిల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం మత్తులో రోడ్లపై మోటార్‌సైకిళ్లతో విన్యాసాలు చేస్తే వారి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామంటున్నారు. వేడుకల పేరుతో శ్రుతిమించి వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. న్యూ ఇయర్ రోజున హోటళ్లు, మ ద్యం దుకాణాలను రాతిర11 గంటల వరకు మూసివేయాలని, అనుమతులు తీసుకున్న వారు కూడా తమతమ ప్రదేశాల్లోనే ప్రశాం తంగా వేడుకలను నిర్వహించాలని, అనుమతి ఉన్న సమయం లోపే వాటిని ముగించాలని ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు. అనుమతులు తీసుకోవాలి : మల్లయ్య, ఎక్సైజ్ సీఐ, కోదాడ ఈవెంట్ ఆర్గనైజర్లు నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించినా, అందులో మద్యం వినయోగించినా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. రూ. 3 వేలు చలానా రూపంలో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. పాటించాల్సిన నిబంధనలు... బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దు. డిసెంబర్31 వతేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. {పజలకు ఆటంకం కలగకుండా వేడుకలను నిర్వహించుకోవాలి. అనుమతి పొందిన కార్యక్రమాలను మాత్రమే నిర్వహించాలి. తాత్కాలిక స్టేజ్‌లను ఏర్పాటు చేస్తే తగిన పటిష్టత ఉందంటూ,అధికారు ల వద్ద అనుమతి పత్రం పొందాలి. వేడుకల్లో భాగంగా మద్యం ఇచ్చేలా ఉంటే దానికి సంబంధించిన అనుమతిని పొందాలి. హోటళ్లు, ఫాంహౌస్‌లకు వచ్చేవారి వాహనాలు నిలిపేందుకు తగిన పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలి. ముఖ్యైమైన ప్రాతాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హోటళ్లు, ఫాంహౌస్ నిర్వహకులు చర్యలు తీసుకోవాలి. ఒక వేళ ఏమైనా జరిగినా వాటికి హోటళ్లు ఫాంహౌస్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మద్యం తాగిన వారు తమ నివాసాలకు భద్రంగా చేరే విధంగా కార్యక్రమ నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేయాలి. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే విదేశీయులకు సంబంధించిన వివరాలు సమీపంలోని పోలీసు స్టేషన్లో సమర్పించాలి. ఈత కొలనుపై తాత్కాలిక స్టేజ్‌లను ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు కొత్త సంవత్సరానికి వేసే లైటింగ్ విద్యుత్ సంబంధిత అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం జరిగితే విద్యుత్ శాఖ బాధ్యత వహించదు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేసింది. -
‘న్యూ ఇయర్’లో నిబంధనలు తప్పొద్దు
డీజే, ఆర్కెస్ట్రాపై ఆంక్షలు వేడుకలు సజావుగా జరుపుకోండి నిర్వాహకులకు నగర పోలీసు కమిషనర్ సూచన సిటీబ్యూరో: న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే స్టార్ హోటళ్లు, పబ్స్, రెస్టారెంట్స్, బార్స్ నిర్వాహకులు డీజే, ఆర్కెస్ట్రాపై నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆంక్షలు విధించారు. వేడుకల్లో అపశ్రుతులు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో స్టార్ హోటల్స్, పబ్స్, రెస్టారెంట్స్, బార్స్ ప్రతినిధులతో ఆయన శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... నూతన సంవత్సర వేడుకలను సజావుగా జరుపుకోవాలని కోరారు. వేడుక నిర్వహణకు అవసరమైన 27 సూచనలు, నిబంధనలను ఆయన విడుదల చేశారు. వేడుకలు నిర్వహించే హోటళ్ల నిర్వాహకులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకల్లో పాల్గొనేవారికి నిర్వాహకులు పార్కింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించిన పరిమితి మేరకే లౌడ్‌స్పీకర్ల సౌండ్ ఉండాలన్నారు. ఆర్కెస్ట్రా ఉపయోగించరాదని స్పష్టం చేశారు. సమావేశంలో స్టార్‌హోటళ్లు, పబ్స్ ప్రతినిధులు 150 మందితో పాటు అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, జితేందర్, జాయింట్ కమిషనర్లు వై.నాగిరెడ్డి, శివప్రసాద్, డీసీపీలు సుధీర్‌బాబు, కమలాసన్‌రెడ్డి, డాక్టర్ రవీందర్, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు. టాస్క్‌ఫోర్స్/ఎస్ఓటీ ప్రత్యేక నిఘా... న్యూఇయర్ వేడుకల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి భరతం పట్టేం దుకు నగర ంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, శివార్లలో స్పెషల ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీ సులు సిద్ధమయ్యాయి. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీధర్ (ఈస్ట్) సూర్యప్రకాష్‌రావు (సౌత్) ఆనంద్‌కుమార్(నార్త్) భాస్కర్ (సెంట్రల్, వెస్ట్), ఎస్ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి ఈస్ట్‌జోన్ ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్ వెస్ట్‌జోన్ ఇన్స్పెక్టర్లు గురురాఘవేంద్ర, వెంకట్‌రెడ్డి, ఎస్ఐలు రాములు, ఆంజనేయులు, శివ, చైతన్యకుమార్‌లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. జంట పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ జారీ చేసిన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కూడా వీరు చర్యలు తీసుకుంటారు. రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో రేవ్‌పార్టీలు, పేకాట, మద్యం పార్టీలు నిర్విహ స్తే దాడులు చేస్తారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారి వివరాలను వీరు ఇప్పటికే ఇన్ఫార్మర్ల ద్వారా సేకరిస్తున్నారు. -
థీమ్ బరాబర్..
సిటీలో భోజనప్రియుల అభి‘రుచు’లకు తగ్గట్లే రెస్టారెంట్లు కూడా శరవేగంగా మారుతున్నాయి.పోటీ పెరగడంతో ఎలాగైనాకస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నాయి. సాదాసీదాగా కనిపించే రెస్టారెంట్లు త్వరగానే బోరు కొట్టేస్తుండటంతో, ‘సిటీ’జనులు కొత్తవాటి కోసం చూపు సారిస్తున్నారు. అలాంటి వారిని ఆకర్షించేందుకు నగరంలోని రెస్టారెంట్లు కొత్త కొత్త థీమ్స్‌తో ముస్తాబవుతున్నాయి. కొన్ని రాచరుచులతో అలరిస్తున్నాయి. మరికొన్ని ఖండాంతర రుచులను చేరువ చేస్తున్నాయి. ఇంకొన్ని ఒద్దికగా సంప్రదాయ రుచులనే సరికొత్తగా వండి వడ్డిస్తున్నాయి. ఇలాంటి థీమ్ రెస్టారెంట్లపై ‘సిటీప్లస్’ కథనం.. ‘చిరు’తిండి... భోజనప్రియులు తరచూ కొత్త కొత్త రెస్టారెంట్లకు వెళుతుంటారు. కొత్త కొత్త రుచులను ఆస్వాదిస్తుంటారు. రుచులు సరే, ఆరోగ్యం మాటేమిటి..? అనే ప్రశ్నకు సమాధానంగానే బేగంపేట్‌లో ‘ఆహార్ కుటీర్’ మొదలైంది. నలుగురు మిత్రులు.. రాంబాబు, అర్చన, శ్రీరామ్, దినేష్.. తమ కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి మరీ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలతోనే ఇక్కడ అన్ని పదార్థాలనూ తయారు చేస్తారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పెంచిన కూరగాయలనే వాడతారు. పల్లెవాతావరణాన్ని తలపించే ఈ రెస్టారెంట్ అలంకరణ ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఇక్కడ సంప్రదాయబద్ధంగా అరిటాకుల్లో వడ్డిస్తారు. మంచినీళ్లు, మజ్జిగ మట్టిపాత్రల్లో అందిస్తారు. మహారాజ భోజనం... చాలా రెస్టారెంట్లకు పేరులోనే ‘రెస్ట్’ ఉంటుంది గానీ, అక్కడకు వెళ్లేవారికి ఎలాంటి విశ్రాంతి ఉండదు. ఆర్డర్ చేసిన పదార్థాలు టేబుల్ మీదకు రాగానే, భోంచేయడం, ఆపై బిల్లు కట్టి, టిప్పు చదివించుకుని బయటపడటం.. ఇదంతా రొటీన్ వ్యవహారం. మణికొండలోని ‘వాక్’ (వీకెండ్స్ ఎట్ కూచిపూడి) రెస్టారెంట్ తీరే వేరు. ఇక్కడకు వెళ్లేవారెవరైనా, అడుగు పెడుతూనే ఆహారం కోసం ఆర్డర్ ఇవ్వక్కర్లేదు. విశ్రాంతిగా గడపొచ్చు. గేమ్స్ వంటి వాటితో కాలక్షేపం చేయవచ్చు. ఆకలేసినప్పుడు నిదానంగా ఆర్డర్ చేసి, తాపీగా భోజనం చేయవచ్చు. ‘కింగ్స్’లంచ్, ‘క్వీన్స్’ డిన్నర్ ఈ రెస్టారెంట్ స్పెషల్స్. ఇవి పేరుకు తగినట్లే రాజసం ఉట్టిపడుతూ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్లలో అరడజనేసి స్టార్టర్స్, నాలుగు రకాల టిఫిన్లు, ఏడు రకాల బిర్యానీలు, సీఫుడ్ సహా తొమ్మిదిరకాల నాన్ వెజ్ ఐటమ్స్, ఐదు రకాల స్వీట్లు, డెసర్ట్స్ ఉంటాయి. ‘కింగ్స్’లంచ్ కాస్త స్పైసీగా ఉంటే, ‘క్వీన్స్’డిన్నర్ కొంచెం డెలికేట్‌గా ఉంటుంది. ఇందులోని వైట్రూమ్ ధవళకాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఎల్ఈడీ లైట్లు వెలిగినప్పుడల్లా రంగులు మారుతుంటుంది. బ్లాక్రూమ్లోని ఎల్ఈడీ దీపాలు నింగిలో చుక్కల్లా తళతళలాడుతూ కొత్త అనుభూతినిస్తాయి. -
కత్రినా షేక్.. బిపాసా హాట్..
సిటీలో కాఫీలు, ఐస్‌క్రీమ్స్‌కు ఎలా రెగ్యులర్ బడ్డీస్ ఉన్నారో... మిల్క్షేక్లకూ అంతే ఉన్నారు. రెస్టారెంట్స్‌లో మెనూ తీసుకోగానే మిల్క్‌షేక్స్ ఏం ఉన్నాయా అని సెర్చ్ చేసేవారెందరో. అలాంటి మిల్క్‌షేక్ మేనియా ఉన్నవారి కోసం మాదాపూర్, శిల్పారామంలోని ఓరిస్ ఈట్మోర్ రెస్టారెంట్ సరికొత్త మెనూని సిద్ధం చేసింది. కత్రినా మ్యాంగో, హాట్ బడ్జ్ బిపాసా అంటూ బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లతో ఊరిస్తోంది. ‘‘ పేర్లు మాత్రమే కాదు టేస్ట్‌లోనూ మా మిల్క్‌షేక్స్ స్పెషల్’’ అని రెస్టారెంట్ మేనేజర్ హరి చెప్పారు. బ్లూ బియాన్స్, బెల్జియం చాక్లెట్ వంటి దాదాపు 8 రకాల మిల్క్‌షేక్స్‌ను ప్రత్యేకంగా అందిస్తున్నామన్నారు. తమవి కేవలం మిల్క్ షేక్స్ మాత్రమే కావని ఇవి ‘థిక్ షేక్స్’ అని చెబుతున్న ఈ రెస్టారెంట్ ప్రతినిధులు... ఐస్‌క్రీమ్‌ని ఫుల్‌గా దట్టించిన వెరైటీలివని అంటున్నారు. -
ఎటు చూసినా ఆకాశమే!
వీక్షణం బస్ ఎక్కినప్పుడు విండో సీటులో కూర్చోడానికే ఇష్టపడతారు ఎవరైనా. బస్సు ముందుకు పోతుంటే, వెనక్కి వెళ్లిపోతున్న దృశ్యాలను చూడటంలో ఉండే మజానే వేరు. అదే విమానంలో అలా చూస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా! విమానాల్లో కూడా విండో సీట్లు ఉంటాయి, అక్కడా మజా ఉంటుంది. కానీ స్పైక్ ఎస్-512 విమానంలో కలిగే మజా మామూలుది కాదు. ఎందుకంటే ఈ ఫ్లయిట్లో చిన్న చిన్న కిటికీలు కాదు ఉండేది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ మొత్తం అద్దాలే ఉంటాయి. దాంతో ఎటు చూసినా ఆకాశమే కనిపిస్తుంది. విమానంలో ఉన్నామా, ఆకాశంలో విహరిస్తున్నామా అన్నట్టు గొప్ప అనుభూతి కలుగుతుంది. న్యూయార్క నుంచి లండన్ వెళ్లేందుకుగాను ఓ ప్రముఖ సంస్థ దాదాపు ఎనభై వేల మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ విమానాన్ని తయారు చేస్తోంది. టికెట్టు రేటు కూడా ఆ రేంజ్‌లోనే ఉండవచ్చు. అయితే ఇందులో ఒకేసారి ఎక్కువమంది ప్రయాణించడానికి వీలుండదు. పట్టుకు పద్దెనిమిది మందికి మాత్రమే చాన్స. ఆ చాన్స కూడా అప్పుడే దొరకదు. 2018 వరకూ వేచి ఉండాల్సిందే! -
ప్రచారానికి తెర.. ప్రలోభాలతో ఎర
సాక్షి, నల్లగొండ,మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో యథేచ్ఛగా అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఓ వైపు పోలీసులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా గుట్టుచప్పుడు కాకుండా అభ్యర్థులు తమ పని చేసుకుంటూ వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల ప్రచార తీరును చూస్తే... అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉందా అన్న సందేహం కలగకమానదు. ప్రచారానికి శుక్రవారం చివరిరోజు కావడంతో ఆయా పార్టీల ప్రధాన నేతలు ఓటర్లను కలిసి అభ్యర్థించారు. ప్రతి వార్డులో పెద్ద ఎత్తున ర్యాలీలతో హోరెత్తించారు. పలుచోట్ల రోడ్‌షోలు నిర్వహించారు. పల్లెల నుంచి కూలీలను తీసుకొని ప్రచారం లో నిమగ్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జులు అభ్యర్థుల తరఫున ప్రచారం కొనసాగించారు. ఇంకోవైపు గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు, మద్యం ముట్టజెప్పారు. పోటీ గట్టిగా ఉన్న చోట, చైర్మన్ పీఠం ఆశిస్తున్న నేతలు ఒక్క ఓటుకు రూ.4 వేలు ఇవ్వడానికి కూడా వెనకాడడం లేదు. మిగిలిన చోట్ల హీనపక్షం రూ. వెయ్యి ముట్టజెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్న మద్యాన్ని ఎన్నికలకు కొన్ని గంటల ముందు వరద పారించేందుకు అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. సర్దుబాటు... రెబల్ అభ్యర్థులున్న చోట బుజ్జగింపులు జరుగుతున్నాయి. వీలైతే ఆర్థికంగా సహాయపడతామని హామీ ఇస్తున్నారు. దీంతో కొంతమంది అభ్యర్థులు సద్దుమణిగినట్లు సమచారం. వీరికి పడాల్సిన ఓట్లన్నీ.. పార్టీ అభ్యర్థులకు వేసే బాధ్యతలను కూడా రెబల్ అభ్యర్థుల భుజానే వేసినట్లు వినికిడి. కోడ్ ఉల్లంఘన.... అభ్యర్థులు అడుగడుగునా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. అక్రమాల పర్వానికి తెరతీశారు. ముఖ్యం గా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆయా పార్టీలు దాదాపు నాలుగైదు వందల మందితో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. వాస్తవంగా ర్యాలీలు తీయడానికి పోలీసుల అనుమతి తీసుకున్నా.. కొద్దిపాటి మందికే పరిమితం కావాలి. డబ్బు.. మద్యంతో గాలం.. జిల్లాకేంద్రంలో మెజార్టీ వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. అధికార యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించినా అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని ముందుగానే నిల్వ చేసుకున్నారు. తమ నివాసాల్లో మద్యం ఉంటే పట్టుబడతాయన్న ముందుచూపుతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో భద్రపరుచుకున్నారు. సూర్యాపేటలో ఒక్కో ఓటుకు అత్యధికంగా రూ.5 వేలు ఇస్తామని అభ్యర్థులు ఆశచూపారు. చైర్ పర్సన్ పీఠం కోసం బరిలో ఉన్న నాయకులు ఎంతైనా ఇవ్వడానికి వెనకాడడం లేదు. ప్రధాన పార్టీలు పోటాపోటీగా డబ్బు పంచడంలో తలమునకలయ్యాయి. దీనికి తోడు వెండి బరిణెలు, బిర్యానీ, ఒక మద్యం ఫుల్ బాటిల్ ముట్టజెప్పారు. ఓ వార్డులో ఐదు ఓట్లకు కలిపి ఫ్రిజ్ అందజేశారని సమాచారం. భువనగిరిలో ఓటుకు గరిష్టంగా రూ.3 వేలు చెల్లిస్తున్నారు. ఐదారు వార్డుల్లో హోరాహోరీగా పోటీ ఉండడంతో గెలుపు కోసం అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచుతున్నారు.మిర్యాలగూడలో ఓ పార్టీ నాయకులు కర్ణాటక నుంచి మద్యం దిగుమతి చేసుకున్నారు. ఆ పార్టీ అనుయాయుల ఇళ్లలో నిల్వ చే శారు. వీరు ఓటర్లకు పంచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఇస్తున్నారు.కోదాడలో నాలుగు రోజుల నుంచే మద్యం అందజేస్తున్నారు. ఒక్కో ఓటరుకు రూ. 2500 వరకు అప్పజెప్పుతున్నారు. కుంకుమ బరిణెలు, ముక్కు పుడకల పంపిణీ పరిపాటిగా మారింది. హుజూర్‌నగర్‌లో ఎక్కడా చూసినా నోట్ల కట్టలు, మద్యం బాటిళ్లే దర్శనమిస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో కొత్త కళ సంతరించుకుంది. ఇక్కడ అధికార పార్టీకి, విపక్షాలకు చావోరేవో అన్నట్లుగా ఉంది. విపక్షాలు ఏకం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. దీంతో డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. ఓటుకు గరిష్టంగా రూ. 3 వేలు ఇచ్చేస్తున్నారు. దేవరకొండలోనూ అభ్యర్థులు పోటాపోటీగా తలపడుతున్నారు. ఒక్కో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ.1500 వరకు చెల్లిస్తున్నారు. -
స్వేచ్ఛానుభూతి
బార్లు, రెస్టారెంట్ల సమయాన్ని రాత్రి ఒంటి గంట వరకు పొడిగించడంతో నగర వాసులు కొత్త అనుభవాన్ని చవి చూశారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శుక్రవారం ‘స్వేచ్ఛ’ లభించినట్లుగా అనుభూతిని పొందారు. అయితే బార్ల యజమానుల్లో నెలకొన్న గందరగోళం, ప్రజల్లో అవగాహనా లోపం వల్ల తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. చాలా వరకు బార్లు యధావిధిగా 11 గంటలకే మూతపడ్డాయి. రాత్రి సమయం పొడిగింపుపై అవగాహన కలిగిన మందు బాబులు మాత్రం జల్సా చేశారు. తొలి రోజు బాగా వ్యాపారం జరుగుతుందనే అంచనాతో ఉత్సాహంతో ఎదురు చూసినా ఫలితం లేకపోయిందని పలువురు బార్ యజమానులు తెలిపారు. సమయం పొడిగింపు గురించి తెలియని చాలా మంది అర్ధ రాత్రికే ఇంటికి చేరుకున్నారని చెప్పారు. అయితే మున్ముందు ‘మంచి రోజులు’ ఉంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని చాలా మంది బార్ల యజమానులు తమ రెగ్యులర్ కస్టమర్లకు సమయం పొడిగింపుపై ఎస్ఎంఎస్ల ద్వారా ‘అవగాహన’ కల్పించారు. కాగా అనేక మంది మందు ప్రియులు తొలి రోజున బాగా ఎంజాయ్ చేయడానికి ‘లేట్ నైట్ పార్టీ’పై మిత్రులకు ఫేస్ బుక్‌లో ఆహ్వానాన్ని పోస్ట్ చేశారు. హడావుడి తప్పింది వివిధ రంగాల్లోని యువత సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి చేరుకుంటారు. కాసేపు గడిపాక బార్లకు దారి తీస్తుంటారు. గంటల తరబడి బార్లలో కాలక్షేపం చేసే వారికి 11 గంటల గడువు మింగుడు పడకుండా ఉండేది. వారంతా ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రాత్రి పొద్దు గడిచే కొద్దీ బార్ల వైపు మళ్లే వారు కొందరైతే, మిత్రులందరినీ కలుపుకొని వెళ్లే వారు మరికొందరు. ఇలాంటి స్వేచ్ఛా జీవులకు పొడిగింపు సమయం వరంలా పరిణమించింది. రాత్రి 11 గంటల వరకు డ్యూటీలలో ఉండే వారు సైతం కొత్త పొడిగింపు వేళలతో సంబర పడిపోతున్నారు. హోటళ్లను 11 గంటలకే మూసివేయడంతో చాలా మంది కడుపు మాడ్చుకునో లేక ఇంటిలో తయారు చేసుకునే అల్పాహారంతోనో కడుపు నింపుకునే వారు. అలాంటి వారికి ఇప్పుడు కోరిన ఆహారం లభిస్తుంది. హోటళ్లు, తిను బండారాల కేంద్రాలు మాత్రం వారమంతా రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంటాయి. మరో వైపు బర్త్ డే పార్టీలు జరుపుకొనే వారికి కూడా ఈ పొడిగింపు సమయం సంబరాన్ని కలిగిస్తోంది. సాధారణంగా బార్లలో ఇలాంటి పార్టీలు జరుపుకొనే వారు 11 గంటల లోగా సంబరాలను ముగించాల్సి ఉంటుంది. అంటే...గంటకు ముందే పుట్టిన రోజు జరుపుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడా ఇబ్బంది తప్పిందని అనేక మంది ఉత్సాహ పడుతున్నారు. -
ఇంకా పురుషులకే అనుకూలం
పెద్దపెద్ద వంటలు కేవలం పురుషులు మాత్రమే చేయగలరు అనుకుంటారు చాలామంది. కానీ ఇది నిజం కాదు. ఎంతోమంది స్త్రీలు క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. మన పురాణాలు పరిశీలిస్తే కూడా పెద్దపెద్ద వంటలు చేసినవారిలో నలుడు, భీముడు వంటి పురుష పాత్రలే కనిపిస్తాయి. పనిచేసే వాతావరణం పురుషులకే అనుకూలంగా ఉంటోంది. అందువల్ల స్త్రీలు చెఫ్ వృత్తి నుంచి తప్పుకుంటున్నారు. అలాగే పని కోసం అదనపు సమయం వెచ్చించడానికి ఆసక్తి చూప లేరు. దేశాలలో అత్యధిక సంఖ్యలో మహిళలు చెఫ్‌లుగా రాణిస్తున్నారు. ఎక్కువ సమ యం నిలబడాల్సి రావడం, శారీరక శ్రమకు గురిచేసే పనులు... ఇలా మహిళలకు కొన్ని ప్రతికూల పరిస్థితులుఉన్నప్పటికీ... భవిష్యత్తులో ఈ రంగంలోకి మహిళలు బాగా వచ్చే అవకాశం ఉంది. నేను హైదరాబాద్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (హెచ్ఆర్) లో మాస్టర్స్ పూర్తి చేసి అమెరికా వెళ్లి ఐటి అనలిస్ట్‌గా పనిచేశాను. అక్కడే పలు రెస్టారెంట్స్‌లో చెఫ్‌గా పనిచేశాను. భారత్‌కు వచ్చాక, సొంత రెస్టారెంట్ ప్రారంభించాను. -
ఇంట ఆమె గెలిచింది... రచ్చ ఆయన గెలిచాడు
చెఫ్... అని గూగుల్‌లో ఇమేజెస్ వెతకండి... అందులో ఎంతమంది ఆడవాళ్లున్నారో లెక్కపెట్టండి. మౌస్‌ను ఎంత కిందికి దించినా కనపడటం లేదా? ప్రతి ఇంట్లోనూ స్త్రీ చేతి వంటే మనం తింటున్నాం. కానీ దాదాపు ప్రతి హోటల్లోనూ పురుషుడే మనకు వండి పెడుతున్నాడు. దీనికి కారణాలేంటని ఆరా తీస్తే సమాధానాలు, విశ్లేషణలు బోలెడొచ్చాయి. స్త్రీకి మానసికంగా సహనం ఎక్కువే ఉండచ్చు గాని శ్రమతో కూడిన సహనాన్ని భరించడానికి ఆమె శరీర నిర్మాణం అనుకూలంగా ఉండదు. గతంలో గ్యాస్ స్టౌలు, పనిని సులువు చేసే ఆధునిక పాత్రలు, ఇతర సదుపాయాలు లేకపోవడంతో, ఎక్కువమందికి ఒకేసారి వంట చేయడం స్త్రీలకు కష్టమయ్యేది. సహాయకులను పెట్టుకుందామన్నా, మగసహాయ కులు కావాలి. అప్పటి సమాజం దీనిని పూర్తిస్థాయిలో అనుమతించలేదు. వంట బాగా వచ్చిన స్త్రీలు... సొంత ఇంటి వేడుకల వరకు ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేవారు. వృత్తిగా స్వీకరించడానికి అనువైన పరిస్థితు లు ఉండేవి కావు. దీంతో స్త్రీలకు సామర్థ్యాలున్నా ఈ రంగంలోకి రాలేదు. ఎక్కువమంది స్త్రీలు చెఫ్‌లుగా లేకపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఏదైనా ఒక రంగంలో స్త్రీలు అసలు వేలు పెట్టే పరిస్థితులే లేనపుడు, తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారినా అది అందరికీ తెలిసి, దానిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఆ విషయం సమాజం అంగీకరించడానికి మరింత సమయం పడుతుంది. అందుకే స్త్రీలు చెఫ్‌లుగా రాణించే పరిస్థితులు కొన్నేళ్ల క్రితమే వచ్చినా వారు ఈ రంగం వైపు మొగ్గు చూపలేకపోయారు. ఇంకో విషయం.. వంట ఓ కళ. స్త్రీలకు మాత్రం వంట ఒక దినచర్య. పైగా ఇళ్లలో కుటుంబసభ్యుల ఆకలి తీర్చడం ప్రధానం. అందువల్ల వంటను ఒక కళగా, ప్రయోగాలు చేసే అంశంగా స్త్రీలు చూసేవారు కాదు. మరో కారణం ఏంటంటే... ఈ రంగంలో గతంలో వేతనాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఖరీదైన రెస్టారెంట్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లు రావడం, ప్రజలు తినడానికి బయటకు వెళ్లడాన్ని ఇష్టపడుతుండటం వల్ల అవకాశాలు బాగా పెరిగాయి. వాటితోపాటు ఆదాయం కూడా పెరిగింది. దీంతో ఇప్పుడు స్త్రీలు చెఫ్ లుగా రాణించే అవకాశాలు పెరుగుతున్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరుతున్న స్త్రీల శాతం పెరుగుతోంది. కాకపోతే ఈ టైమింగ్స్ వారిని ఇంకా నియంత్రిస్తున్నాయి. కొత్తగా వచ్చిన వెసులుబాటు ఏంటంటే... గతంలోలా భారీ పాత్రలతో డీల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే... ఆర్డర్లకు అనుగుణంగా ‘చెఫ్’లు వాటిని ఇద్దరు, ముగ్గురు, మహా అయితే ఏడెనిమిది మందికి సరిపడే తక్కువ పరిమాణాల్లో వండితే చాలు. ఏదేమైనా తమకు బాగా తెలిసున్న పనిలో స్త్రీలు ఇంత ఆలస్యంగా రావడం ఒక విచిత్రం! - ప్రకాశ్ చిమ్మల -
పెరగనున్న నేరాలు!
నైట్ లైఫ్ పొడిగింపుపై సర్వత్రా వ్యతిరేకత సర్కార్ అనుమతిపై బార్లు, రెస్టారెంట్ల యజమానుల అసంతృప్తి క్షీణించనున్న శాంతి భద్రతలు టెక్కీల ఓట్ల కోసం ఎన్నికల గిమ్మిక్కా...? సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో రాత్రి జీవనం (నైట్ లైఫ్)ను పొడిగించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బార్లు, రెస్టారెంట్లు శుక్ర, శనివారాల్లో, హోటళ్లు, తిను బండారాల విక్రయ కేంద్రాలు వారమంతా రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారానికి రెండు రోజులే ఆయినప్పటికీ బార్లు, రెస్టారెంట్ల యజమానులు, సిబ్బంది మాత్రం ప్రభుత్వ నిర్ణయంపై అసంత ృప్తి వ్యక్తం చేస్తున్నారు. 11 గంటల తర్వాత బార్లు, రెస్టారెంట్లకు వచ్చే వారిలో అధిక శాతం మంత్రి నేర స్వభావం కలిగిన వారై ఉంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారంతా గొడవ పడడానికే బార్లకు వస్తుంటారని వాపోతున్నారు. యాజమాన్యాలు నిర్బంధంగా ఒంటి గంట వరకు పని చేయాలని పట్టుబడితే ప్రస్తుతం నగరంలోని బార్లు, రెస్టారెంట్లలో పని చేస్తున్న వారిలో చాలా మంది నిలిచిపోయే అవకాశం ఉందని కోరమంగలలో ఓ బారులో పని చేస్తున్న చంద్రు తెలిపాడు. పూటుగా తాగిన వారితో తాము గొడవ పడలేమని, ఒక్కో సందర్భంలో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం రాత్రి వేళలను ఇలా పొడిగించడం సరికాదని అతను అభిప్రాయపడ్డాడు. ఎన్నికల జిమ్మిక్కా...? యువతను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నైట్ లైఫ్ పొడిగింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని వినవస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఐటీ, బీటీ, ఇతర పారిశ్రామిక వర్గాల నుంచి నైట్ లైఫ్‌ను పొడిగించాలన్న డిమాండ్ వస్తున్నప్పటికీ, శాంతి భద్రతల దృష్ట్యా గత ప్రభుత్వాలు సమ్మతించ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తయింది. ఇన్నాళ్లుగా లేనిది, హఠాత్తుగా ఎన్నికల సమయంలో అనుమతి ఇవ్వడానికి ఓట్లే కారణమనే విమర్శలూ వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పోలీసు శాఖ అతి కష్టం మీద జీర్ణం చేసుకోవాల్సి వస్తోంది. నైట్ లైఫ్ విస్తరణకు ఆది నుంచీ పోలీసు శాఖ అభ్యంతరం చెబుతూ వస్తోంది. రాత్రి బీట్లు చూసే పోలీసు సిబ్బందికి తోడుగా 2,500 మంది హోం గార్డులను నియమిస్తామని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ ప్రకటించినప్పటికీ పోలీసు శాఖకు ఈ నిర్ణయం మింగుడు పడలేదు. ఆ శాఖను పూర్తిగా పక్కన పెట్టి ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నదనే అపవాదు రాకుండా, మూడు నెలలు ప్రయోగాత్మకంగా నైట్ లైఫ్‌ను పొడిగిస్తామని జార్జ్ చెప్పారు. అనంతరం యధావిధిగా రాత్రి 11 గంటల గడువు కొనసాగుతుందని పోలీసు అధికారులు ఘంటాపథంగా చెబుతున్నారు. -
అర్థరాత్రి పుడ్
హోటళ్లు, రెస్టారెంట్లకు రాత్రి 1 వరకు అనుమతి బార్లు, పబ్‌లకు వారాంతాల్లో మాత్రమే అనుమతించిన సర్కార్ మూడు నెలల పాటు ప్రయోగాత్మంగా అమలు శాంతి భద్రతల సమస్య తలెత్తితే పునరాలోచన అక్రమ మైనింగ్‌పై దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ వెల్లడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాత్రి జీవనం (నైట్ లైఫ్) గురించి కలలు కంటున్న టెక్కీల కోరికలు ఎట్టకేలకు ఫలించనున్నాయి. రాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లను తెరచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతించింది. బార్లు, పబ్‌లు వారాంతాల్లో మాత్రమే ఒంటి గంట వరకు తెరచి ఉంచాలి. కొన్ని సంఘాలు, సంస్థల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ వెల్లడించారు. ఈ రోజు (శనివారం) నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. ఇతర మెట్రో నగరాల్లో కూడా ఒంటి గంట వరకు నైట్ లైఫ్‌ను విస్తరించారని తెలిపారు. మూడు నెలల పాటు ప్రయోగాత్మంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్పారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే దీనిపై పునరాలోచిస్తామని వెల్లడించారు. నగర పోలీసు కమిషనర్ సహా సీనియర్ పోలీసు అధికారులు నైట్ లైఫ్‌ను విస్తరించడాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వచ్చినప్పుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దీనిపై సాధక బాధలను చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడడానికి ఇప్పుడున్న పోలీసులు సరిపోరనే అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని రెండు వేల మంది హోం గార్డులను నియమించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జరగబోయే నేరాలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదని, అయితే నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి తగు చర్యలు చేపడతామని చెప్పారు. ప్రత్యేక బృందాలు : రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు జరపడానికి రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక బృందాలను నియమిస్తామని ఆయన తెలిపారు. లోకాయుక్త ప్రతిపాదనల మేరకు వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా శాంతి భద్రతలను కాపాడే దిశగా అదనపు డీజీపీ స్థాయి అధికారులను జిల్లాల ఇన్ఛార్జిలుగా నియమించనున్నట్లు వెల్లడించారు. నిర్జన ప్రదేశాల్లో ఏటీఎంలకు సాయుధ సిబ్బందిని కాపలాగా నియమించాలని ఆయా బ్యాంకులకు సూచించామని ఆయన తెలిపారు. -
‘స్వచ్ఛత’ సమరం
హోటళ్లు,రెస్టారెంట్లలో పరిశుభ్రతపై సూచికలు మార్గదర్శకాలు జారీ చేసిన పురపాలక శాఖ నేటి నుంచి జిల్లాలోని అన్ని పట్టణాల్లో అమలు జిల్లాలో ఆహార పదార్థాల విక్రయాల వ్యాపారంలో పరిశుభ్రత కనిపించడం లేదు. రోగకారక అంగళ్లుగా మారిన హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై పురపాలక అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఇకపై ఆహార పదార్థాల తయారీ, నాణ్యతా ప్రమాణాల విషయంలో తగిన జాగ్రత్తలు వహించకపోతే ఇబ్బందులు తప్పవుని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని కోసం మున్సిపాలిటీలు మంగళవారం నుంచి అపరిశుభ్రతపై ‘స్వచ్ఛత’ సమరానికి సిద్ధమవుతున్నాయి. సత్తెనపల్లి, న్యూస్‌లైన్ ప్రజారోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోటళ్ళు, రెస్టారెంట్లు, బేకరీలు,ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బయట విక్రయించే ఆహార పదార్థాల పరిశుభ్రత, నాణ్యతపై అవగాహన కోసం పురపాలక, నగర పాలక సంస్థల్లో మంగళవారం నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని పురపాలక శాఖ సంచాలకుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ‘స్వచ్ఛత’పేరుతో ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 3 వరకు వారం రోజులపాటు గుంటూరు నగరంతో పాటు, జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఆహార పదార్థాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు మున్సిపల్ సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు చేపడతారు. 25న మున్సిపాలిటీల పరిధిలో ఉన్న హోటళ్ళు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాటరింగ్ గ్రూప్స్, కమ్యూనిటీ హోటళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్కిస్తారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు వాటిని ప్రజారోగ్య అధికారి, మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేయాలి. ఇందులో వంటశాలలు, ఆహార పదార్థాల నిల్వ, తయారీ, మంచినీటి వసతి, పాలిథిన్ వాడకం, మలమూత్ర విసర్జన శాలలు, ఇతర విషయాలను పరిశీలించి నమోదు చేయాల్సి ఉంటుంది. 26 నుంచి నాలుగు రోజుల పాటు వంటగదుల నిర్వహణ, వంట చేసే తీరు, నిల్వ ఉంచుతున్న తీరును పరిశీలిస్తారు. అనంతరం ఆయా హోటళ్ళ యజమానులతో సమావేశం నిర్వహిస్తారు. 28న వంట సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు మార్చి 1 నుంచి అన్ని హోటళ్లు, బార్ అండ్ రెస్టాంట్లలో ఆహారం తీసుకునేటప్పుడు తీసు కోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు, ఆహారం వృథాతో జరిగే నష్టాలను తెలియజేసేలా సూచికలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. హోటళ్ళను పరిశీలించాలి హోటళ్ళు, రెస్టారెంట్లు, కళ్యాణమండపాలు తది తర వాటిల్లో ప్రజలకు అందిస్తున్న ఆహార పదార్థాలు, వంటశాలలను మున్సిపల్ సిబ్బంది పరిశీ లించాలి. 26న ఆయా నిర్వాహకుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేస్తాం. ఏమాత్రం హోటళ్ళల్లో పరిశుభ్రత లేకపోయినా, నిల్వ ఆహార పదార్థాలను విక్రయించినా సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్య విషయంలో ఆయా నిర్వాహకులు సహకరించాలి. - సిరిసిల్ల సత్యబాబు, మున్సిపల్ కమిషనర్, సత్తెనపల్లి -
జల్సా... రూ.12 కోట్లు
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లా వాసులు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విందులు, వినోదాలు, ఇతరత్రాలకు దాదాపు రూ. 12 కోట్లు హాం ఫట్ అనిపించారు. 31వ తేది రాత్రి నుంచి జనవరి 1 రాత్రి వరకు విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు. నూతన సంవత్సర ప్రారంభ సమయంలో ఆస్వాదించే ఆనందాన్ని సంవత్సరమంతా గుర్తు తెచ్చుకోవచ్చని జనవరి 1న జల్సాగా గడిపారు. అందుకే డిసెంబరు 31, జనవరి 1లలో దాదాపు రూ. 12 కోట్లు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా సోమ, మంగళ వారాల్లో మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. జిల్లాలోని అన్ని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో సీటు లభించడమే కష్టమైంది. ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సర వేడుకల్లో మద్యమే ఎక్కువ అమ్ముడైంది. జిల్లా వ్యాప్తంగా ఈ మూడురోజుల్లో రూ. 6 కోట్లకు పైగా మద్యం గుటగుటలాడించినట్లు సమాచారం. కేకులకు దాదాపు రూ.4 కోట్లకు పైగా ఖర్చు చేశారు. పూలు, బొకేలు, పూలమాలల కోసం రూ. 25 లక్షలకు పైగా వెచ్చించారు. విందులు, వినోదాల కోసం రూ. 2 కోట్లకు పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది. జోరు తగ్గింది.. సమైక్య ఉద్యమం ప్రభావంతో ఉద్యోగులు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఆచితూచి ఖర్చు చేశారు. యువకులు, ఉన్నత వర్గాలు మాత్రం భారీగానే ఖర్చు పెట్టారు. మొత్తంపై గతం కంటే 10 నుంచి 20 శాతం తక్కువగానే వ్యాపారం జరిగినా ధరలు పెరగడంతో వ్యాపారులు ‘సేఫ్’ అయ్యారు. కడప నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో ప్రముఖ బేకరీ సంస్థ ఏర్పాటు చేసిన కేకుల ప్రదర్శనలో రెండు రోజులకు 10 వేల కేకులకు పైగా అమ్ముడుపోగా, నగరంలోని ఇతర ప్రాంతాలు,జిల్లా అంతటా కూడా వ్యాపారం జోరుగా సాగింది. రూ.10 లక్షలకు పైగా పండ్ల వ్యాపారం జరిగింది. మొత్తంపై జిల్లా వాసులు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రూ. 12 కోట్లకు పైగా ఖర్చు చేశారు. -
వీకెండ్ వెరైటీగా గడిపేందుకు ఆసక్తి
నగరవాసుల అభి‘రుచి’ మారుతోంది.. వీకెండ్ భిన్నంగా గడపాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వెరైటీ రుచులతో పాటు డ్యాన్స్... మ్యూజిక్... మేజిక్కుల మేలుకలయికతో మురిసి మెరవాలన్నది సిటీజనుల లే‘టేస్ట్’ జీవనశైలి. వారంలోని ఐదురోజుల ఒత్తిడి వీకెండ్లో చిత్తయ్యేలా ఎంజాయ్ చేయాలని తపిస్తున్నారు. వీరికి తగ్గట్టే ఆహారంతో పాటు వడ్డించే వారి ఆహార్యమూ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాయి నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు. ‘మా ఆతిథ్యంలో కిక్కు ఉంది... దానికో లెక్క ఉంది..’ అంటూ కొత్త థీమ్‌లతో ఆకట్టుకుంటున్నాయి. చేస్తున్నాయి పలు హోటళ్లు. ఈ క్రమంలో కొన్ని హోటళ్ల సిబ్బంది సంప్రదాయ వస్త్రధారణతో సందడి చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి తమ రూపురేఖలను మార్చుకుంటూ కొత్తదనంతో వడ్డించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బార్బిక్యూ నేషన్ గతంలో సముద్రపు దొంగల థీమ్‌తో ప్రత్యేకంగా ఆహారోత్సవం ఏర్పాటు చేసింది. ఇందులో బాగంగా అక్కడి సిబ్బంది అచ్చంగా సముద్రపు దొంగలు ఎలా ఉంటారో అలా తయారై ఆహూతులకు వడ్డించారు. అంతేకాకుండా సముద్రపు ఉత్పత్తులను అలాగే పెట్టి అందులో వండిన పదార్థాలతో అతిథులకు అందించి కొత్తదనం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక కిచెన్ కార్నివాల్ పేరుతో సైతం ఇలానే రైలుబండిలో లభించే ఆహార పదార్థాలను హోటల్‌కు వచ్చిన వారికి అందించారు. ఛాయ్.. బేల్‌పురి, సమోసా, కిళ్లీ.. ఇలా ప్రతి వాటిని అందించే ప్రయత్నం చేశారు. మాబ్‌లతో మెరిసి.. కలిసి.. మరికొన్ని రెస్టారెంట్లు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌ను అనుసరిస్తూ అతిథులను ఆకట్టుకుంటున్నాయి. కేవలం ప్రత్యేకమైన రుచులు అందించడమే కాకుండా సంగీత, నృత్యాలతో అలరిస్తున్నాయి. అతిథుల మధ్య మెరుపులా సిబ్బంది ప్రత్యక్షమై నృత్యాలు చేస్తూ ఆరగింపులో కొత్త కిక్కు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అతిథులు భోజనం చేస్తుండగా మంద్రంగా వచ్చే సంగీతం రెట్టింపవుతుంది. ఉత్సాహం ఉరకలెత్తించేలా అక్కడ జోష్ పెంచుతున్నారు. ఫ్లాష్‌మాబ్‌తో మెరిసిపోతున్నారు. సమయానికి, ఆహారోత్సవానికి అనుగుణంగా నృత్యాలతో ముందుకు వస్తున్నారు. అక్కడ భోజనం చేసే వారు సైతం అందులో కలిసి ఆడిపాడుతున్నారు. చిన్నపెద్ద అంతా అందులో ఆనందపారవశ్యం పొందుతున్నారు. అంతేకాదు ప్రత్యక్షంగా సైతం పాటలు పాడించే పద్ధతిని ఇప్పుడు చాలా హోటల్స్ అనుకరిస్తున్నాయి. వచ్చినవారికికొసరి కొసరి వడ్డించడమే కాదు.. కావాల్సిన పాటలు సైతం వెంటనే పాడి వినిపించి ఆనందింపజేస్తున్నాయి. అభిరుచి మారుతోంది నగర వాసుల అభిరుచి మారుతోంది. ఇందుకనుగుంగానే మేమందించే ఆహారంతోపాటు ప్రత్యేకమైన అంశాలను మా మెనూలో చేర్చుతున్నాం. వినోదాన్ని పంచాలనే నేపథ్యంతో కొత్త కొత్త డ్యాన్స్ థీమ్‌లను ఏర్పాటుచేస్తున్నాం. మంచి స్పందన వస్తుంది. - రాజేష్‌కుమార్ భగత్, ఎగ్జిక్యూటివ్ ఛెఫ్, బార్బిక్యూ నేషన్ కొత్తదనం చూపిస్తున్నాం నిత్యం వచ్చేవారు ఒకే విధమైన ఆహారాన్ని కోరుకోరు. కొత్తదనం కోసం చూస్తారు. తమకు కావాల్సిన వంటకాల కోసం అన్వేషిస్తుంటారు. అందుకే వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలతో కూడిన ఆహారోత్సవాలను ఏర్పాటు చేస్తున్నాం. రోజురోజుకు ఈ ఆహారోత్సవాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. - నితిన్, తాజ్‌కృష్ణ ఎగ్జిక్యూటివ్ చెఫ్ లైవ్లీగా ఉంటే ఇష్టం భోజనానికి చాలా చోట్లకు వెళ్తుంటాం. కాని ఎక్కడకు వెళ్లినా మా కళ్ల ముందు తయారు చేసి వంట వండి అందించేవారు చాలా తక్కువ. అంతేకాకుండా మేం భోజనానికి బయటకు వచ్చేది అప్పుడప్పుడే. అలాంటప్పుడు కాస్త విభిన్నంగా ఉండే హోటల్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాం. తద్వారా మాకు కావల్సిన ఆనందం దక్కుతుంది. - భార్గవ్, తిలక్‌నగర్, విద్యార్థి స్పెషల్ థీమ్స్‌తో వినోదం వారంలో 5 రోజులూ పని ఒత్తిడితో ఉంటాం. వారాంతాల్లోనే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బయటకు వస్తుంటాం. అందువల్ల ఈ సమయంలో మ్యాగ్జిమం ఎంజాయ్ చేయాలి. నగరంలోని పలు హోటల్స్ ఇప్పుడు ప్రత్యేకమైన థీమ్స్‌తో ముందుకు వస్తున్నాయి. వీటివల్ల రిలాక్స్ అవుతాం. - దీప్తి, ఉద్యోగిని రుసి ఐడొనిలో చాక్లెట్ జార్ సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి: ఫ్లవర్‌వాజ్ గురించి విన్నాం కానీ... చాక్లెట్ జార్ గురించి విన్నారా? బంజారాహిల్స్ రోడ్‌నెం.10లో ఉన్న రుసిఐడొని రెస్టారెంట్ పరిచయం చేసిన సరికొత్త ‘రుచి’ ఇది. ఫడ్జ్ బ్రౌనీ ఇన్ ఎ జార్ పేరుతో దీన్ని ప్రత్యేకంగా అతిథులకు అందిస్తున్నట్టు రెస్టారెంట్ మేనేజర్ ప్రవీణ్ తెలిపారు. చిక్కటి పాలతో తయారు చేసిన ఈ డిజర్ట్‌ను ప్లేట్లో సర్వ్చేయడం కుదరదు కనుక ఈ తరహాలో సర్వ్ చేస్తున్నట్టు వివరించారు. సీత్రూ గ్లాస్ కారణంగా దీనిలో ఉన్న చాక్లెట్ కేక్, క్రీమ్... వగైరాలు చవులూరించేలా కను‘విందు’ చేస్తాయన్నారు. ఇది 4 లేయర్లు(పొరలు) ఉన్న డిజర్ట్. అడుగు భాగంలో డార్క్ చాక్లెట్ మూజ్, దానిపైన వైట్చాక్లెట్, ఫడ్జ్ బ్రౌనీ, మిక్స్‌డ్‌నట్స్, హాట్ ఫడ్జ్ చాక్లెట్ వేసి అందిస్తున్నారు. ఈ సరికొత్త డిజర్ట్ ధర రూ.120గా నిర్ణయించినట్టు ప్రవీణ్ తెలిపారు. -
ఉద్యమంఉధృతం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. గ్రామాల్లో సైతం నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉద్యోగులతోపాటు అన్ని వర్గాలు, వ్యాపారులు ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు సోమవారం నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడనున్నాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు మాత్రం తెరిచే అవకాశం ఉన్నప్పటికీ.. ఉద్యోగులు వాటిని కూడా మూయిస్తామని స్పష్టం చేస్తున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి పేరుతో అన్ని ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ సంఘాలన్నీ జిల్లాలో ఉన్న అన్ని విద్యా సంస్థలకు బృందాలుగా వెళ్లి తెరిచి ఉన్న వాటిని మూయించాలని నిర్ణయించాయి. 24న జిల్లా బంద్ ఉద్యమంలో భాగంగా ఈ నెల 24న జిల్లా బంద్‌కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. వ్యాపార సంస్థలన్నీ మూతపడనున్నాయి. భారీ షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న దుకాణాల వరకు తెరుచుకునే అవకాశాలు లేవు. అదే రోజు ఉద్యోగులంతా జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. జిల్లాను పూర్తిగా స్తంభింపజేయడం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమ సెగ కేంద్రానికి తాకేలా చేయాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రాజీనామాలు చేయడకుండా ఉద్యమానికి దూరంగా ఉంటున్న ప్రజాప్రతినిధులకు గట్టి హెచ్చరికలు జారీ చేయాలన్నది యోచనగా కనిపిస్తోంది. జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలకు అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఆటోలు బంద్: ఇప్పటికే జిల్లాలో ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ప్రజలందరూ ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి జిల్లా బంద్ నిర్వహిస్తుండగా దీనికి ఆటో కార్మికుల నుంచి మద్దతు లభించింది. ఈ నెల 24న జిల్లాలో ఆటో కార్మికులు కూడా బంద్ పాటించనున్నారు. కానీ ఒక యూనియన్‌కు సంబంధించిన కార్మికులు మాత్రమే బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. హోటళ్లు మూసివేత: ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో జరిగే సీమాంధ్ర బంద్‌కు సంఘీభావంగా అదే రోజు బంద్ పాటిస్తున్నట్టు విశాఖ హోటల్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు టి.సత్యనారాయణ ప్రకటించారు. విశాఖ,గాజువాక, గోపాలపట్నం,మధురవాడ, పెందుర్తి ప్రాంతాలలో హోటళ్లు, పార్లర్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, అతిథి గృహాలు మూసివేస్తామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం చేస్తున్న ఈ బంద్‌కు వ్యాపారులంతా సహకరించాలని పిలుపునిచ్చారు. మళ్లీ కేంద్ర ప్రభుత్వ సంస్థల దిగ్బంధం ఈ నెల 25, 26 తేదీలలో మరోసారి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించనున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఉద్యోగ సంఘాలు కేంద్ర కార్యాలయాలను ముట్టడించి కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఆఫీసులకు తాళాలు వేశారు. మళ్లీ ఈ నెల 25, 26 తేదీల్లో కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించారు. దీంతో ఈ రెండు రోజుల పాటు మరోసారి బ్యాంకులు కూడా మూతపడనున్నాయి.