న్యూఢిల్లీ: రెస్టారెంట్లలో జీఎస్టీ పన్ను రేట్లపై పునఃసమీక్ష, కంపొజిషన్ పథకాన్ని మరింత సులభతరంగా రూపొందించేలా సూచనల కోసం అస్సాం ఆర్థిక మంత్రి హేమంత బిస్వా నేతృత్వంలో మంత్రుల కమిటీ(జీవోఎం) ఏర్పాటైంది. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైన జీఎస్టీ మండలి భేటీలో జీవోఎంను ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రెండు వారాల్లో మంత్రుల కమిటీ తమ నివేదికను సమర్పిస్తుంది. ఈ కమిటీలో బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ, జమ్మూకశ్మీర్ ఆర్థిక మంత్రి హసీబ్ డ్రాబు, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్, చత్తీస్‌గఢ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి అమర్ అగర్వాల్‌లు ఇతర సభ్యులుగా ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment