GoM
-
జీఎస్టీ స్లాబ్‌ల్లో మార్పులు..!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించి స్లాబ్ విధాన మార్పుసహా పలు అంశాలపై సంబంధిత రేట్ల హేతుబద్ధీకరణ మంత్రివర్గ కమిటీ (జీవోఎం) కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా కొన్ని వస్తువులపై రేట్ల తగ్గింపు అవసరంపై సమీక్ష నిర్వహించి ఆయా అంశాలను జీఎస్టీ కౌన్సిల్ ముందు సమర్పించాలని పన్ను అధికారుల కమిటీని కోరింది.ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ అంశాన్ని కొన్ని రాష్ట్రాల ప్రతినిధులు సమావేశంలో లేవనెత్తడం గమనార్హం. అయితే ఈ అంశాన్ని తదుపరి డేటా విశ్లేషణ కోసం కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. సెప్టెంబరు 9న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ 54వ అత్యున్నత స్థాయి సమావేశంనేపథ్యంలో తాజా మంత్రివర్గ కమిటీ సమావేశం జరిగింది.జీవోఎం కన్వీనర్‌గా తన మొదటి సమావేశం అనంతరం బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, ‘‘జీఎస్టీ పన్ను స్లాబ్‌లలో మార్పు చేయరాదని కొంతమంది జీవోఎం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని చర్చలు జరుగుతాయి, ఆపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుత జీఎస్టీ విధానంలో సున్నా, 5, 12, 18. 28 శాతం ఐదు విస్తృత పన్ను స్లాబ్‌లు ఉన్నాయి. లగ్జరీ– డీమెరిట్ వస్తువులపై అత్యధికంగా 28 శాతం రేటు కంటే ఎక్కువ సెస్‌ను విధిస్తున్నారు. -
ప్రభుత్వ సంస్థల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రకటించిన నాలుగు వ్యూహాత్మక రంగాలలో ప్రభుత్వ సంస్థల కొనసాగింపుపై మంత్రుల కమిటీ త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్) కార్యదర్శి టీకే పాండే వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్ రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సహా మంత్రులతో ఏర్పాటుకానున్న కమిటీ ఈ నాలుగు రంగాలలో ఎన్ని పీఎస్‌యూలను కొనసాగించేదీ నిర్ణయించనున్నట్లు తెలియజేశారు. తాజా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ నాలుగు వ్యూహాత్మక రంగాలుగా ఆటమిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర మినరల్స్, బ్యాంకింగ్, బీమా, ఫైనాన్షియల్ సర్వీసులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ రంగాలలో సాధ్యమైనంత తక్కువగానే ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించనున్నట్లు ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఈ అంశంపై నీతి ఆయోగ్ ప్రాథమిక జాబితాను రూపొందిస్తోంది. తద్వారా ప్రభుత్వం వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టనుంది. ఇతర రంగాలను ప్రయివేటైజ్ చేయనుంది. తద్వారా ప్రయివేటైజ్ చేయనున్న కంపెనీలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్ఐఎన్ఎల్కు కేబినెట్ ఓకే..: రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్(ఆర్ఐఎన్ఎల్)ను ప్రయివేటైజ్ చేసేందుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా అనుమతించినట్లు పాండే తాజాగా ట్వీట్ చేశారు. కంపెనీలో 100 శాతం వాటాను విక్రయించేందుకు గత నెల 27న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రయివేటైజేషన్‌లో భాగంగా యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేయనున్నట్లు వివరించారు. ప్రైవేటీకరణ లేదా విలీనం జాతీయ భద్రత, కీలక మౌలికసదుపాయాలు, ఇంధనం, మినరల్స్, ఫైనాన్షియల్ సర్వీసులను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా తాజా బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఎంపిక చేశారు. వీటిలో అతి తక్కువగా పీఎస్‌యూలను కొనసాగించే వీలున్నట్లు పాండే తెలియజేశారు. మిగిలిన కంపెనీలను ప్రైవేటీకరించడం, విలీనం, ఇతర సీపీఎస్ఈలకు అనుబంధ సంస్థలుగా మార్చడం లేదా మూసివేయడం వంటివి చేపట్టనున్నట్లు వివరించారు. వెరసి ప్రభుత్వ రంగ కంపెనీలలో భారీ స్థాయిలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలియజేశారు. ప్రయివేట్ రంగం నుంచి పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2021–22)లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా బీపీసీఎల్, ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయిన్ కార్పొరేషన్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎంఎల్, పవన్ హంస్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌లో డిజన్వెస్ట్మెంట్ను వేగవంతం చేయనున్నట్లు వివరించారు. -
కొత్త కేసులు 24,879
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్క రోజులో కొత్తగా 24,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 487 మంది కరోనాతో పోరాడుతూ మృత్యుఒడికి చేరారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 7,67,296కు, మరణాలు 21,129కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 2,69,789 కాగా, 4,76,377 మంది బాధితులు చికత్సతో పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేటు 62.08 శాతానికి చేరుకుంది. సామాజిక వ్యాప్తి దశకు చేరలేదు భారత్‌లో కరోనా వైరస్ ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఓఎస్డీ రాజేశ్ భూషణ్ గురువారం చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైరస్ తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులు కేవలం 49 జిల్లాల్లోనే నమోదయ్యాయని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 లక్షల మంది జనాభాకు కరోనా కేసులు, మరణాలను పరిశీలిస్తే భారత్‌లోనే అతి తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చేసిన ప్రకటనపై రాజేశ్ భూషణ్ స్పందించారు. ప్రజలు భౌతికదూరం కనీసం రెండు మీటర్ల దూరం పాటిస్తే గాలి ద్వారా వైరస్ సోకే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. దేశవ్యాప్తంగా నిత్యం 2.6 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. 90 శాతం కేసులు 8 రాష్ట్రాల్లోనే... దేశంలో 90 శాతం కరోనా యాక్టివ్ కేసులు కేవలం 8 రాష్ట్రాల్లో నమోదయ్యాయని కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) గురువారం ప్రకటించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలియజేసింది. కేంద్ర మంత్రుల బృందం సమావేశం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలో గురువారం జరిగింది. దేశంలో కరోనా బాధితుల కోసం 3,914 ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు పని చేస్తున్నాయని తెలిపింది. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ చెప్పారు. -
వచ్చే 3నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ..
శ్రీనగర్/న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో జమ్మూకశ్మీర్‌లో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలు, జననష్టం నివారణకే నిషేధాజ్ఞలు విధించి, కొనసాగిస్తున్నామన్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం జరిగిన మొదటి మీడియా సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. ‘వచ్చే 3నెలల్లో రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నాం. రాష్ట్ర చరిత్రలో∙ఇది అతిపెద్ద రిక్రూట్మెంట్. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యువతను కోరుతున్నా. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం త్వరలోనే భారీ ప్రకటన చేసే వీలుంది’ అని చెప్పారు. ‘జాతి వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్ను చాలా తేలిగ్గా స్వార్థానికి ఉపయోగించుకుంటాయి అందుకే సేవలను పునరుద్ధరించేందుకు మరికొంత సమయం పడుతుంది’ అని అన్నారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా , మెహబూబా ముఫ్తీ తదితర రాజకీయ పార్టీల నేతల నిర్బంధంపై అడిగిన ప్రశ్నకు ఆయన.. ‘వాళ్లు పెద్ద నేతలవ్వాలని మీరు కోరుకోవడం లేదా? ఇప్పటి వరకు నేను 30 పర్యాయాలు జైలు కెళ్లా. ఎమర్జెన్సీ సమయంలో ఆరు నెలలు జైలు జీవితం గడిపా. వాళ్లను అక్కడే ఉండనివ్వండి. ఎంత ఎక్కువ కాలం జైలులో ఉంటే ఎన్నికలప్పుడు అంతపెద్ద నాయకులవుతారు’ అని వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర ప్రజలపై బయటి నుంచి ఎటువంటి ఒత్తిడులు ఉండబోవని హామీ ఇస్తున్నా. వారి గుర్తింపు, మతం, సంస్కృతులను పరిరక్షిస్తాం’ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రాణనష్టం నివారించేందుకు ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో నిషేధాజ్ఞలు విధించామని, ఫలితంగా భద్రతా బలగాల చర్యల్లో ఒక్కరు కూడా చనిపోలేదన్నారు. ఇంటర్నెట్ చాలా ప్రమాదకరం ‘ఇంటర్నెట్ చాలా ప్రమాదకరమైంది. మనకు చాలా తక్కువగా ఇది ఉపయోగపడుతోంది. కానీ, భారత్ వ్యతిరేక విషప్రచారానికి, కశ్మీర్‌పై పుకార్ల వ్యాప్తికి ఉగ్రవాదులకు, పాక్‌కు ఇది సులువైన అస్త్రంగా మారింది. ఇంటర్నెట్ సేవలను క్రమేణా పునరుద్ధరిస్తాం’ అని తెలిపారు. రాహుల్ రాజకీయ బాలుడు కశ్మీర్లో హింస కొనసాగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంపై గవర్నర్ మాలిక్ ఎద్దేవా చేశారు. గొప్ప కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ తీరు రాజకీయాల్లో బాలుడి మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. గత వారం రాహుల్ చేసిన ప్రకటనను వాడుకుని పాక్ ఐరాసలో భారత్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిందన్నారు. ముందుగా కశ్మీర్‌పై కాంగ్రెస్ పార్టీ వైఖరిని వెల్లడించాలి.ఎన్నికల సమయంలో ఆర్టికల్ 370ను సమర్థించే కాంగ్రెస్ నేతలను ప్రజలే చెప్పులతో కొడతారు’ అని పేర్కొన్నారు. ‘రాహులే నాయకుడైతే పార్లమెంట్లో కాంగ్రెస్ నేత(ఆధిర్ రంజన్ చౌధురి) కశ్మీర్‌పై ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినప్పుడే ఆపి తగిన బుద్ధి చెప్పి ఉండేవాడు’ అని గవర్నర్ అన్నారు. రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ కశ్మీర్ స్వతంత్రప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దుని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను బుధవారం చేపట్టిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపింది. ఈ పిటిషన్ల విచారణకు అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ వెల్లడించింది. అక్టోబర్ మొదటి వారంలో రాజ్యాంగధర్మాసనం పిటిషన్లను విచారిస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్‌ను ఎలా రద్దు చేస్తారంటూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి కేంద్రానికి, జమ్ము కశ్మీర్ పాలనా యంత్రాంగానికి నోటీసులు పంపింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కశ్మీర్‌పై జీవోఎం రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కేంద్రం కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభించింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్– 370 రద్దుతోపాటు రాష్ట్రాన్ని మూడు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌గా విభజించడం తెల్సిందే. ఈ ప్రాంతాల అభివృద్ధితోపాటు, సామాజిక, ఆర్థిక సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్రం మంత్రుల బృందాన్ని (జీవోఎం) నియమించింది. అక్టోబర్ 31వ తేదీ నుంచి పని ప్రారంభించే ఈ కమిటీలో న్యాయ, సామాజిక న్యాయం, సాధికారిత, వ్యవసాయ, పెట్రోలియం శాఖల మంత్రులు రవిశంకర్, గహ్లోత్, నరేంద్ర తోమర్, ప్రధాన్‌తోపాటు ప్రధాని కార్యాలయంలో మంత్రి జితేంద్ర సభ్యులు. ఈ బృందం ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి వాటిపై అధ్యయనం చేయనుంది. కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, సామాజిక పరంగా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ బృందం తొలి సమావేశం సెప్టెంబర్‌లో ఉంటుంది. ‘కశ్మీర్’ అంతర్గత అంశమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కశ్మీర్లో హింసను పాకిస్థాన్ ప్రేరేపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కశ్మీర్ ఉగ్రవాదుల దుశ్చర్యల వెనుక పాక్ హస్తం ఉందన్నారు. కశ్మీర్ అంశం ముమ్మాటికీ భారతదేశ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. ఈ మేరకు రాహుల్ బుధవారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. చాలా విషయాల్లో ప్రభుత్వ చర్యలతో తాను విభేదించినప్పటికీ కశ్మీర్ అంశం భారత అంతర్గత వ్యవహారం అనడంలో తాను స్పష్టతతో ఉన్నట్లు తెలిపారు. ఇందులో జోక్యం చేసుకోవడానికి పాకిస్థాన్‌కు, ఇతర దేశాలకు ఎలాంటి హక్కు లేదన్నారు. అయితే, కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రవేశపెట్టిన పిటిషన్లో రాహుల్ పేరును అనవసరంగా లాగారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. పాక్ తన అసత్య ప్రచారానికి అండగా రాహుల్ పేరును వాడుకుంటోందని దుయ్యబట్టారు. రాహుల్ క్షమాపణ చెప్పాలి: జవదేకర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీరుపై జవదేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్లో హింసాకాండ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేవిగా, ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌కు మద్దతునిచ్చేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. రాహుల్, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జవదేకర్ బుధవారం డిమాండ్ చేశారు. కశ్మీర్లో హింస కొనసాగుతోందని, ఎంతోమంది మరణిస్తున్నారని, అత్యంత బాధ్యతారహిత రాజకీయాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాహుల్ ఇటీవల వ్యాఖ్యానించడం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై జవదేకర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ వాదనకు ఊతమిచ్చేలా మాట్లాడడం ఏమిటని రాహల్‌ను ప్రశ్నించారు. కశ్మీర్ వ్యవహారం భారతదేశ అంతర్గత వ్యవహారమని రాహుల్ బుధవారం ట్వీట్ చేయడంపై జవదేకర్ స్పందించారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో కశ్మీర్ అంశంపై రాహుల్ యూ–టర్న్ తీసుకున్నారని చెప్పారు. అంతేగానీ స్వయంగా ఆయనలో అలాంటి అభిప్రాయమేలేదన్నారు. రాహుల్‌కు ముద్దు వయనాడ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీకి ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. ఒక చోట జనం గుమిగూడి ఉండగా.. కారులో వెళ్తున్న రాహుల్ అక్కడ ఆగాడు. అంతలోనే డ్రైవర్ పక్క సీటులో కూర్చొని ఉన్న రాహుల్ బుగ్గపై బయటి నుంచి నీలిరంగు చొక్కా ధరించిన ఒక వ్యక్తి ముద్దు పెట్టాడు. దీంతో వెంటనే ఆ వ్యక్తిని కొందరు వెనక్కి లాగేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
లైంగిక వేధింపులపై జీవోఎం
న్యూఢిల్లీ: పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్ర మంత్రుల బృందాన్ని (జీవోఎం) నియమించింది. ఇందులో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉంటారు. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను ఈ బృందం సమీక్షిస్తుందని హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అన్నివర్గాలను సంప్రదించి లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లోగా జీవోఎం కేంద్రానికి నివేదికను సమర్పిస్తుందని వెల్లడించింది. పని ప్రదేశంలో మహిళల గౌరవాన్ని కాపాడటానికి, భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. మరోవైపు మహిళా ఉద్యోగులు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ‘షీ–బాక్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. ఏ స్థాయి ఉద్యోగిని అయినా ఇందులో ఫిర్యాదు చేస్తే, కంపెనీలోని సంబంధిత పరిష్కార విభాగానికి దీన్ని బదిలీ చేస్తామని వెల్లడించింది. బాధితుల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. -
#మీటూ ఎఫెక్ట్: రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. నలుగురు సభ్యులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ను ఏర్పాటు చేసింది. కార్యాలయాల్లో లైంగిక వేధింపులను నివారించడానికి అవసరమైన చట్టపరమైన, సంస్థాగత బలోపేతం చేయడానికి ప్రభుత్వం బుధవారం ఈ మంత్రుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సభ్యులుగా ఉంటారు. మహిళలు వారి వారి పని ప్రదేశాల్లో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి మేనకా గాంధీ తెలిపారు. సమయంతో నిమిత్తం లేకుండా బాధితులు ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదులను స్వీకరించేలా జాతీయ మహిళా కమిషన్లను బలోపేతం చేయడం లాంటి చర్యలను చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఈ కమిటీలో మహిళలకు సమ ప్రాధాన్యతను కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, హోంమంత్రికి మేనకగాంధీ కృతజ్ఞతలు తెలిపారు. మీటూ వివాదం దేశవ్యాప్తంగా సంచలనానికి తెరలేపడంతో లైంగిక వేధింపుల కట్టడికి మరింత కఠిన చర్యలపై ఈ జీవోఎం అధ్యయనం చేస్తుంది. 3నెలల్లో, మహిళల భద్రత కోసం ఇప్పటికే ఉన్న నిబంధనలను పరిశీలించడంతోపాటు మరింత ప్రభావవంతమైన తదుపరి చర్యలను సిఫార్సు చేస్తుంది. ఇప్పటికే మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి మేనకాగాంధీ ఈ అంశంపై మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే. -
‘విపత్తు పన్ను’ అధ్యయనానికి జీవోఎం
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తుల సమయంలో నిధుల సమీకరణకు విపత్తు పన్ను విధింపుపై అధ్యయనానికి ప్రభుత్వం మంత్రుల బృందాన్ని(జీవోఎం) ఏర్పాటుచేసింది. బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ దీనికి నేతృత్వం వహించనున్నారు. అక్టోబర్ 31 నాటికి ఈ కమిటీ జీఎస్టీ మండలికి నివేదికను సమర్పిస్తుందని అధికారిక ప్రకటన వెలువడింది. ప్రకృతి విపత్తుల బారినపడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు కొన్ని వస్తువులపై అదనపు పన్ను విధించేందుకు చట్టబద్ధంగా ఉన్న అవకాశాలను పరిశీలించడానికి కమిటీ ఏర్పాటుచేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో సమావేశమైన జీఎస్టీ మండలి నిర్ణయించింది. జీఎస్టీ మండలి లేవనెత్తిన పలు కీలక అంశాలను మంత్రుల బృందం పరిశీలించనుంది. ప్రభావిత రాష్ట్రంపైనే కొత్త పన్నును విధించాలా? లేక మొత్తం దేశానికి వర్తింపచేయాలా? ఏయే వస్తువులపై అదనపు పన్ను విధించాలి? విపత్తులను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాల సామర్థ్యం సరిపోతుందా? విపత్తు పన్నును ఏయే పరిస్థితుల్లో విధించాలి? తదితరాలపై అధ్యయనం చేస్తుంది. అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ, కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌సింగ్ బాదల్, ఒడిశా ఆర్థిక మంత్రి శశిభూషణ్ బెహరా, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముర్గానిత్వార్, ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్ పంత్‌లకు కమిటీలో చోటు కల్పించారు. -
ఎట్టకేలకు గట్టి బిల్లు
ఇంకా కళ్లు తెరవని పసి గుడ్డులు మొదలుకొని బాలబాలికలు, యువతుల వరకూ వేలాదిమందిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న మాఫియా ముఠాల ఆట కట్టించేందుకు ఎట్టకేలకు ఒక సమగ్ర చట్టం రాబోతున్నది. దీనికి సంబంధించి రూపొందించిన బిల్లు ప్రస్తుతం మంత్రుల బృందం(జీఓఎం) పరిశీలనలో ఉంది. నాగరిక విలువలనే సవాలు చేస్తున్న మనుషుల అక్రమ తరలింపు దుర్మార్గాన్ని అరికట్టడానికి అమల్లో ఉన్న చట్టాలు చాలడం లేదని, ఆ విషయంలో అత్యంత కఠినమైన చట్టం తీసుకొచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఎన్నడో 2004లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిపై ఆ న్యాయస్థానం ఆదేశాలిచ్చి కూడా రెండేళ్లు దాటింది. ఇన్నాళ్లకు ఆ బిల్లు రూపుదిద్దుకుంది. మాదక ద్రవ్యాల తర్వాత దేశవ్యాప్తంగా అత్యంత వ్యవస్థీకృతంగా చాపకింద నీరులా సాగిపోతున్న నేరం మనుషుల అక్రమ తరలింపే. ఈ మాఫియా సామ్రాజ్యంలో మాయమాటలు చెప్పి అమాయక ఆడపిల్లల్ని వలలో వేసుకునే దళారులు మొద లుకొని అనేకులున్నారు. బాధితుల్ని ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికీ తర లించడం, దేశ సరిహద్దులు కూడా దాటించడం ఇటీవలికాలంలో పలుమార్లు బయటపడింది. ఈమధ్యే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీలో ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకుంటున్న వీరేందర్ దేవ్ దీక్షిత్ నిర్వహిస్తున్న మూడు కేంద్రాలపై దాడి చేస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ మూడు కేంద్రాల్లో దాదాపు 50మంది యువతులు, బాలికలను కాపాడారు. దాడులు జరగ బోతున్నాయని ముందస్తు సమాచారం అందుకుని చాలామందిని అప్పటికే వేరే చోటకు తరలించినట్టు స్థానికులు చెబుతున్నారు. నిరుడు పశ్చిమబెంగాల్లో వెల్లడైన ఉదంతం మరింత దుర్మార్గమైనది. రోజుల వయసున్న పిల్లల్ని బిస్కెట్ల పెట్టెల్లో పెట్టి వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నట్టు బయటపడింది. ప్రసవించిన తల్లికి బిడ్డ పుట్టగానే మరణించిందని అబద్ధం చెప్పి, అందుకు కోర్టు గుమాస్తాల ద్వారా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తెప్పించి ఈ వ్యాపారం సాగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పుడప్పుడు దేశంలో వివిధ రైల్వే స్టేషన్లలో పదులు, వందల సంఖ్యలో పిల్లల్ని తరలిస్తూ ముఠాలు పట్టుబడుతున్నాయి. ఇలా అక్రమంగా తరలిస్తున్నవారిలో బాలికలనైతే వ్యభిచార కేంద్రాలకు విక్రయించడం, మగపిల్లల్ని వెట్టి చాకిరికి వినియోగించుకోవడానికి అమ్మడం సర్వసాధారణం. ఇవికాక పిల్లల అవయవాలు తొలగించి వారిని యాచక వృత్తిలోకి నెట్టడం కూడా రివాజు. మనుషుల అక్రమ తరలింపు రకరకాల ముసుగుల్లో సాగుతోంది. మెరుగైన ఉపాధి కల్పిస్తామని, ఇంటి పనులకు అవసరమని, అనాథలకు ఆశ్రయమిస్తామని, దత్తత కోసమని మభ్యపెట్టి అమాయక బాలబాలికలను తెచ్చి నరకకూపాల్లోకి తోస్తున్నారు. వ్యవసాయంలో, ఇటుకల పరిశ్రమల్లో వెట్టిచాకిరీ చేయించడానికి లేదా వ్యభిచారం చేసేందుకు తరలిస్తున్నారు. పిల్లలను చీకటికొట్టాల్లో బంధించి, చిత్రహింసలకు గురిచేసి వారిని దారికి తెచ్చుకుని ఇదంతా సాగిస్తున్నారు. అపహ రించిన పిల్లల ద్వారా ఏటా దాదాపు రూ. 200 కోట్ల వ్యాపారం సాగుతున్నదని అంచనా. ఇటీవల విడుదలైన జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం నిరుడు మనుషుల అక్రమ తరలింపు కేసులు 8,132 నమోదయ్యాయి. అంతక్రితం సంవత్సరం ఈ మాదిరి కేసులు 6,877. రాష్ట్రాలవారీగా చూస్తే పశ్చిమబెంగాల్, రాజస్థాన్‌లలో మహిళల అపహరణలు అధికంగా ఉన్నాయి. న్యాయస్థానాల్లో కూడా ఈ మాదిరి కేసుల విచారణ నత్తనడక నడుస్తోంది. 2015లో న్యాయస్థానాల ముందు 5,003 కేసులుంటే కేవలం 384 కేసుల విచారణ మాత్రమే పూర్తయింది. ఇందులో 55 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయి. అంటే 14.4 శాతం కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్ష పడింది. చట్టంలో నేరాల నిర్వచనం సక్రమంగా లేకపోవడం, ఆ చట్టాల అమలులో చూపే నిర్లక్ష్యం నేరగాళ్లకు పరోక్షంగా ప్రోత్సాహాన్నిస్తున్నాయి. మన దేశంలో భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 370ని సవరిస్తూ 2013లో తెచ్చిన చట్టం తొలిసారి పిల్లల అక్రమ తరలింపు అంశాన్ని నేరంగా పరిగణించింది. మనుషుల అక్రమ తరలింపుపై కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ ఇప్పటికి మూడుసార్లు ముసాయిదా బిల్లులు రూపొందించింది. అయితే అందులోని లోటుపాట్లు ఎత్తి చూపి వాటిని సవరిస్తే తప్ప ప్రయోజనం ఉండబోదని వివిధ సంస్థలు, వ్యక్తులు చెప్పడంతో తగినంత సమగ్రతతో తాజా బిల్లు రూపొందించారు. బాధితులపై మాదకద్రవ్యాలు, రసాయనాలు లేదా హర్మోన్లు ప్రయోగించడం, అవయవాలను తొలగించి పిల్లలను భిక్షాటనలో పెట్టడం, వెట్టిచాకిరీ కోసం మనుషుల్ని తర లించడం, వ్యభిచార వృత్తిలోకి దించడం, పిల్లలను మానవ కవచాలుగా లేదా సైనికులుగా వినియోగించడం, లైంగిక దోపిడీకి పాల్పడటం, వారిని అశ్లీల చిత్రాల్లో వినియోగించడం వగైరా నేరాలకు తాజా బిల్లు కఠిన శిక్షలను ప్రతిపాదించింది. అలాగే జాతీయ స్థాయిలో మనుషుల అక్రమ తరలింపు కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగం నెలకొల్పాలని నిర్దేశించింది. రాష్ట్రాల్లో ఇందుకోసం ప్రత్యేక అధి కారులుంటారు. మనుషుల అమ్మకాలు, కొనుగోళ్లలో పాలుపంచుకునేవారికి ఈ బిల్లు కనీసం ఏడేళ్ల కఠిన శిక్ష, గరిష్టంగా పదేళ్ల శిక్ష ప్రతిపాదిస్తోంది. లైంగిక నేరాలకు పాల్పడి వాటిని ప్రచారంలో పెడతామని బెదిరించి బాధితులనుంచి లేదా వారి కుటుంబాలనుంచి డబ్బులు వసూలు చేసినా, ఇతరత్రా ఒత్తిళ్లు తెచ్చినా మూడు నుంచి ఏడేళ్ల శిక్ష విధిస్తారు. ఈ బిల్లు సాధ్యమైనంత త్వరగా చట్టంగా మారడం తక్షణావసరం. అలాగే ఎంత కఠినమైన చట్టాలున్నా అమలు చేసే యంత్రాంగం చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో పనిచేయకపోతే ఉద్దేశం నెరవేరదు. అందువల్ల నేరగాళ్లతో కుమ్మక్కయ్యే, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలుండాలి. బాధితులకు పునరావాసం కూడా ముఖ్యం. ఇవన్నీ చేస్తేనే ఈ దుర్మార్గం దుంపనాశనమవుతుంది. -
రెస్టారెంట్లలో జీఎస్టీపై జీవోఎం ఏర్పాటు
న్యూఢిల్లీ: రెస్టారెంట్లలో జీఎస్టీ పన్ను రేట్లపై పునఃసమీక్ష, కంపొజిషన్ పథకాన్ని మరింత సులభతరంగా రూపొందించేలా సూచనల కోసం అస్సాం ఆర్థిక మంత్రి హేమంత బిస్వా నేతృత్వంలో మంత్రుల కమిటీ(జీవోఎం) ఏర్పాటైంది. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైన జీఎస్టీ మండలి భేటీలో జీవోఎంను ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల్లో మంత్రుల కమిటీ తమ నివేదికను సమర్పిస్తుంది. ఈ కమిటీలో బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ, జమ్మూకశ్మీర్ ఆర్థిక మంత్రి హసీబ్ డ్రాబు, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్, చత్తీస్‌గఢ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి అమర్ అగర్వాల్‌లు ఇతర సభ్యులుగా ఉంటారు. -
జీఎస్టీ సవాళ్లపై ప్రత్యేక కమిటీలు
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులో ఐటీ సవాళ్లు, ఎగుమతులపై ప్రత్యేక కమిటీలను నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 21వ భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్‌తో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కమిటీని నియమించినట్లు తెలిపింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కమిటీని పర్యవేక్షించనున్నట్లు వివరించింది. చత్తీస్ఘడ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి అమర్ అగర్వాల్, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ, కేరళ ఆర్థిక శాఖ మంత్రి డా. టీఎమ్ థామస్ ఐసాక్, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్లు కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారని వెల్లడించింది. సుశీల్ కుమార్ మోదీ నేతృత్వంలోని కమిటీ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలులో ఐటీ నుంచి ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి పని చేస్తుందని తెలిపింది. ఎగుమతులపై నియమించిన కమిటీకి రెవెన్యూ శాఖ సెక్రటరీ నేతృత్వం వహిస్తారని వెల్లడించింది. ఎగుమతులలో ఏర్పడుతున్న అడ్డంకులు, జీఎస్టీ తర్వాత ఎగుమతులను పెంచేందుకు జీఎస్టీ కౌన్సిల్‌కు ఈ కమిటీ సలహాలు ఇస్తుందని తెలిపింది. ఈ కమిటీలో సీబీఈసీ చైర్మన్, డైరెక్టర్ జనరల్, డీజీఎఫ్టీ అడిషనల్ సెక్రటరీ, జీఎస్టీ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్, ఎక్స్‌పోర్ట్స్ కమిషన్ డీజీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ల కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారని వివరించింది. -
యూపీఏ జీవోఎంలపై వేటు
30 మంత్రుల బృందాలను రద్దు చేసిన మోడీ సర్కారు ఆయా అంశాలపై ఇక మంత్రిత్వ శాఖలదే నిర్ణయం న్యూఢిల్లీ: యూపీఏ పాలనావశేషాల తొలగింపు కార్యక్రమంలో భాగంగా.. ఆ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 30 మంత్రుల బృందాలను(జీవోఎం) మోడీ సర్కారు రద్దు చేసింది. వాటిలో 9 సాధికార మంత్రుల బృందాలు(ఈజీవోఎం) కాగా, 21 సాధారణ జీవోఎంలు. విధాన నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేయడం, వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ ఈజీవోఎంలు, జీవోఎంలకు నిర్దేశించిన విధులను ఆయా మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాలే నిర్వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇది మంత్రిత్వ శాఖలు, విభాగాలకు మరింత సాధికారత కల్పించే ఉద్దేశంతో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయమని పేర్కొంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇబ్బందులు ఎదుర్కొనే పక్షంలో కేబినెట్ సెక్రటేరియట్, పీఎంవో సహకరిస్తాయని ఆ ప్రకటనలో తెలిపారు. మంత్రిత్వ శాఖల మధ్య ఏర్పడే వివాదాలపై కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఈ జీవోఎంలలో చాలా వాటికి నాటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, ఇతర కీలక మంత్రులు చిదంబరం, శరద్ పవార్లు నేతృత్వం వహిస్తున్నారు. అవినీతి, రాష్ట్రాల మధ్య జల వివాదాలు, పాలనాసంస్కరణలు.. మొదలైన అంశాలపై ఆ జీవోఎంలను ఏర్పాటు చేశారు. వాటి సిఫారసులపై కేంద్ర కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునేది. ఏదైనా అంశంపై కేబినెట్ మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు జీవోఎంలను ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఏర్పడితే చివరి నిర్ణయం ప్రధానిగా నరేంద్ర మోడీనే తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో ఆయనపై బాధ్యత మరింత పెరిగే అవకాశం ఉంది. జీవోఎంల ఏర్పాటు మొదట్లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. యూపీఏ పాలనలో అది మరింత విస్తృతమైంది. ఈజీవోఎంలకు నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఉండేది. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 60 వరకు జీవోఎంలు ఏర్పాటయ్యాయి. అయితే అవి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏళ్ల తరబడి సాగుతూ ఉండేవి. కాగా, ఆయా అంశాల సంక్లిష్టత, వాటిలో ఒకటికి మించిన మంత్రిత్వ శాఖల జోక్యం ఉన్నందువల్లనే మంత్రుల బృందాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటూ జీవోఎంల ఏర్పాటును కాంగ్రెస్ సమర్ధించుకుంది. అయితే, జీఓఎంల రద్దుపై ఎలాంటి విమర్శలు చేయకుండా.. తాము కోరుకున్న విధంగా పరిపాలన సాగించే హక్కు, అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని వ్యాఖ్యానించింది. -
జీవోఎం విధానాన్నిరద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: జీవోఎంలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. పాలనలో పారదర్శకత కోసం జీవోఎంలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జీవోఎం పరిధిలో మిగిలిపోయిన నిర్ణయాలను ఇక నుంచి సంబంధిత శాఖలే చూసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో 21 మంత్రుల బృందాలు (జీవోఎం), 9 సాధికారిక బృందాలు(ఈజీవోఎం)లపై వేటు పడింది. ఇప్పటివరకూ పలురకాలైన అంశాలపై జీవోఎం కమిటీలు అందజేసే నివేదికలతోనే కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. కాగా, ఈ విధానంతో పరిపాలనలో పూర్తి పారదర్శకత ఉండదని భావించిన నరేంద్ర మోడీ సర్కారు దీనికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి శాఖా పరంగానే వాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. -
ఆప్షన్లు ఉంటాయని చెప్పామా?: జైరాం రమేశ్
-
ఆప్షన్లు ఉంటాయని చెప్పామా?: జైరాం రమేశ్
తెలంగాణ ఉద్యోగ సంఘాలతో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ స్థానికత, తక్కువ సర్వీసు, రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ, ఆప్షన్లు, ప్రత్యేక పరిస్థితులు..ఇలా ఉద్యోగుల విభజనకు ఆరు ప్రాతిపదికలున్నాయి వారంలో మార్గదర్శకాలు విడుదల చేస్తాం ఆప్షన్లు ఉండకూడదని ఉద్యోగ సంఘాల డిమాండ్ హైదరాబాద్: ‘‘ఉద్యోగుల విభజనలో ఆప్షన్లు కచ్చితంగా ఉంటాయని ఎవరు చెప్పారు? నేను లేదా జీవోఎం ఇతర సభ్యులు ఎవరైనా అధికారికంగా ప్రకటన చేశారా? రాజకీయ పార్టీలు ఏవో తప్పుగా ప్రచారం చేస్తే పట్టించుకుంటారా?..’’ అని తెలంగాణ ఉద్యోగ సంఘాలతో కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల విభజనకు ఆరు ప్రాతిపదికలు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు మార్గదర్శకాల రూపకల్పన కూడా ఇప్పటికే పూర్తయిందని, వారం రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవిభజనపై ఏర్పాటు చేసిన జీవోఎం సభ్యుడి హోదాలో గురువారం తెలంగాణ ఉద్యోగ సంఘాలతో హైదరాబాద్‌లోని ఒక హోటల్లో జైరాం రమేశ్ సమావేశమయ్యారు. సి.విఠల్, ఎం.నారాయణ (తెలంగాణ ఉద్యోగుల సంఘం), చంద్రశేఖర్‌గౌడ్, హరికిషన్ (గ్రూప్-1 అధికారుల సంఘం), పి.రఘు (విద్యుత్ ఉద్యోగుల జేఏసీ), పి.మధుసూదన్‌రెడ్డి (ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్), శివశంకర్ (రెవెన్యూ ఉద్యోగుల సంఘం), రాములు (ఉపాధ్యాయ సంఘం), సురేశ్ (సచివాలయ టీఎన్జీవో), శ్యాం కుమార్ (వాణిజ్యపన్నులు) తదితర ముఖ్య సంఘాల నేతలు సహా తెలంగాణకు చెందిన 27 ఉద్యోగ సంఘాలకు చెందిన దాదాపు 70 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ‘‘రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 371(డీ) ప్రకారం ఏర్పాటైన జోనల్ వ్యవస్థ అమల్లో ఉండగా తెలంగాణేతర ఉద్యోగులకు ఆప్షన్లు ఎలా ఇస్తారు? తెలంగాణ రాష్ట్రంలోనూ సీమాంధ్ర ఉద్యోగులను ఎలా భరిస్తాం?..’’ అని జైరాంను తెలంగాణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిలదీశారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వవద్దని, స్థానిక ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన జైరాం రమేశ్... జీవోఎం సభ్యుడిగా ఆప్షన్ల అంశంపై మాట్లాడుతున్నా. ఆప్షన్లు మాత్రమే ఉంటాయని ఎవరూ, ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు. ఉద్యోగుల పంపకానికి ఆరు ప్రాతిపదికలు ఉన్నాయి. స్థానికత, తక్కువ సర్వీసు, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 371(డి) ప్రకారం అమలులో ఉన్న జోనల్ వ్యవస్థ, ఆప్షన్ల పరిశీలన, కొన్ని ప్రత్యేక పరిస్థితుల ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుంది..’’ అని వివరించారు. ‘‘ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న అవకాశాలు, మానవతా దృక్పథం వంటివి ప్రత్యేక పరిస్థితుల కిందకు వస్తాయి. ఉద్యోగుల పంపకంపై మార్గదర్శకాలను ఇప్పటికే రూపొందించాం. వాటిని ప్రకటించడానికి ఎన్నికలకోడ్ అమలులో ఉంది. దీనిపై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశాం. వారంలోగా స్పష్టమైన మార్గదర్శకాలు వస్తాయి. వాటిని అధ్యయనం చేసిన తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పండి’’ అని జైరాం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు సమానమేనని, ఎవరికీ అన్యాయం చేయబోమని పేర్కొన్నారు. కాగా, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని, ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదని చంద్రశేఖర్‌గౌడ్ అభిప్రాయపడగా.. పదేళ్ల ఉమ్మడి అడ్మిషన్ల విధానాన్ని సవ రించాలని మధుసూదన్‌రెడ్డి కోరారు. కార్పొరేషన్ ఉద్యోగుల విభజన అధికారం పూర్తిగా ఆయా కార్పొరేషన్లకే అప్పగించడంవల్ల అన్యాయం జరిగే అవకాశాలున్నాయని, దీనిపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త రఘు కోరారు. దీనిపై స్పందించిన జైరాం... వాటికి ప్రత్యేకంగా మార్గదర్శకాలుంటాయని హామీ ఇచ్చారు. -
మునాక్ కాలువ వివాదాన్ని పరిష్కరించండి
జీఓఎం సమావేశానికి హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ : మునాక్ కాలువ ద్వారా ఢిల్లీ రాజధానికి అందించే నీటి విషయంలో ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మంత్రు ల బృందం (జీఓఎమ్) జూన్ మొదటి వారంలో సమావేశం కావాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జీఓఎం సమావేశం నిర్వహించి, తదుపరి విచారణకల్లా పరిస్థితిపై ఓ నివేదిక సమర్పించాలని జలవనరుల శాఖకు జస్టిస్ హిమా కోహ్లీ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ నివేదిక సమర్పించలేకపోతే సంబంధిత శాఖా సంయుక్త కార్యదర్శి కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ జలబోర్డుకు ఈ కాలువ ద్వారారోజుకి 80 మిలియన్‌గ్యాలన్ల నీరు సరఫరా అవుతోంది. 744 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మూడు నీటిశుద్ధి కేంద్రాలకు పంపించి, తద్వారా ఢిల్లీ ప్రజలకు నీటి సరఫరా చేస్తోంది. జీఓఎం మార్చి 6న జరిగిన సమావేశానికి అనారోగ్య కారణంగా కేంద్రమంత్రి కపిల్‌సిబల్ హాజరు కాలేకపోయినందున ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని జలవనరుల శాఖ కోర్టుకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. సమావేశం నిర్వహించి ద్వారకా, బవన, ఓఖ్లా నీటిశుద్ధి కేంద్రాలకు నీరు సరఫరా చేసి పనులు తొందరగా ప్రారంభమయ్యేటట్లు చూస్తామని ఢిల్లీ జలబోర్డు తరపు న్యాయవాది సుమీత్ పుష్కర్ణ కోర్టుకు నివేదించారు. మూడు నీటిశుద్ధి కేంద్రాల్లో పనులు ప్రారంభమయితే ప్రస్తుతం నిత్యావసరాలకోసం ట్యాంకర్లపై ఆధారపడుతున్న ద్వారక, దానిచుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలకు నీటి సమస్య ఉండదని స్థానికు లు అంటున్నారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ట్యాంకర్లు నీటి సరఫరా చేస్తున్నాయని, తమకు ఢిల్లీ జలబోర్డు ఒక్కనీటి చుక్క కూడా ఇవ్వక 20 ఏళ్లు దాటిపోయిందని ఆరోపిస్తూ మహవీర్ ఎన్క్లేవ్ కాంప్లెక్స్ కాలనీల వెల్ఫేర్ కాన్ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు పై ఆదేశాలిచ్చింది. నంగ్లోయి నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి ఎలాం టి అంతరాయం లేకుండా తమకు నీటి సరఫరా చేయాలని కోరుతూ 1994లో ఢిల్లీ జలబోర్డుకు 34లక్షలు చెల్లించామని అసోసియేషన్ ఆ ఫిర్యాదులో ఆరోపించింది. ద్వారకా నీటిశుద్ధి కేంద్రం పనిచేయకపోవడంవల్ల తాము నీటి సరఫరా చేయలేకపోతున్నామంటూ డీజేబీ తప్పించుకుంటోందని అందులో పేర్కొన్నారు. -
'కొత్త రాజధాని ఏర్పాటుకు కమిటీ'
-
రేపు కేంద్ర క్యాబినెట్ ముందుకు టీ బిల్లు
-
ప్రత్యేక తెలంగాణపై నివేదిక సిద్ధం చేసిన జీవోఎం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం తుది అంకానికి చేరుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి జీవోఎమ్(కేంద్ర మంత్రుల బృందం)కు అప్పచెప్పిన పనిని పూర్తి చేసి ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ నివేదికను అందజేశారు. కొత్తరాజధానికి నిధులు కేటాయించడంతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలలో వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయింపుపై ప్రధానంగా దృష్టి సారించారు. హైదరాబాద్ విద్యాసంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల కాలపరిమితి పొడిగింపుపై, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో ఉంచడంపై ఎటువంటి స్పష్టత రాలేదు. జనాభా ప్రాతిపదిక ఆధారంగా ఆస్తులు, అప్పుల పంపకాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. కాగా, సీమాంధ్ర కేంద్ర మంత్రుల డిమాండ్లను కేంద్రం పక్కకుపెట్టింది. హైదరాబాద్ ను యూటీ(కేంద్ర పాలిత ప్రాంతం)చేయాలన్న సీమాంధ్ర మంత్రుల విన్నపాన్ని కొట్టిపారేసింది. తెలంగాణ రాష్ట్ర అంశంపై కేంద్ర కేబినెట్ రేపు మరోసారి ప్రత్యేక భేటీ కానుంది. ఇదిలా ఉండగా టి.బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీజేపీ సూచించిన సవరణల్లో కొన్నింటినైనా పరిష్కారించాలనే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రేపటి కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు స్పష్టత రానుంది. -
తుది అంకానికి తెలంగాణ బిల్లు
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు తుది అంకానికి చేరింది. సోమవారం తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు రానున్నట్టు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. గురువారం బిల్లుపై తుది కసరత్తులు పూర్తి చేసిన జీవోఎం శుక్రవారం క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టనుంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీలో తెలంగాణ బిల్లుకు కొన్ని సవరణలు చేసినట్టు తెలిసింది. ప్రధానంగా సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే విషయంపై ఈ సవరణలు ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లులో 42వ ప్రతిపాదనలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశం ఉంది. ఆర్థిక సంఘం సిఫార్సులకు సంబంధించి ఇందులో కీలక సవరణ చేసినట్టు తెలిసింది. ఈ మార్పులతో రేపు క్యాబినెట్ ముందుకు దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గం శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ భేటీలో తెలంగాణ బిల్లును ఆమోదిస్తారని, అనంతరం సోమవారం లోక్‌సభ ముందు తెలంగాణ బిల్లును ప్రవేశపెడతారని ఢిల్లీ వర్గాల సమాచారం. -
విభజన బిల్లుకు తుది మెరుగులు
-
సంప్రదింపులు తప్పనిసరి: వీరప్ప మొయిలీ
-
సంప్రదింపులు తప్పనిసరి: వీరప్ప మొయిలీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై సంప్రదింపులు జరపడం అనేది తప్పనిసరి అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, జిఓఎం సభ్యుడు వీరప్ప మొయిలీ చెప్పారు. జిఓఎం సంప్రదింపులు ఎందుకు కొనసాగుతున్నాయన్న దానిపై ప్రశ్నలు అనవసరం అని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలు చెప్పుకునేందుకు చాలా అవకాశాలు ఇచ్చామని మొయిలీ తెలిపారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు తుది మెరుగులు దిద్దేందుకు జిఓఎం సభ్యులు ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం కానున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు నిన్న ఇచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. -
విభజన బిల్లుకు తుది మెరుగులు!
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు తుది మెరుగులు దిద్దేందుకు జీవోఎంలోని కేంద్ర మంత్రులు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. బుధవారం సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇచ్చిన ప్రతిపాదనలపై జీవోఎంలోని కేంద్ర మంత్రులు ఈ సందర్బంగా చర్చించనున్నారు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 5.30 నిముషాలకు కేంద్ర క్యాబినేట్ భేటీ కానుంది. అయితే ఆ సమయానికి విభజన బిల్లుకు తుది రూపం ఇచ్చేందుకు జీవోఎం సభ్యులు కసరత్తు చేస్తున్నారు. ఆంధప్రదేశ్ విభజన జరిగితే పోలవరం డివిజన్ సీమాంధ్రలో కలపాలని, హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని తదితర మొత్తం 9 ప్రతిపాదనలు జీవోఎం వద్ద సీమాంధ్ర కేంద్ర మంత్రులు బుధవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం జరగనున్న కేంద్ర మంత్రి వర్గం సమావేశం ఎదుట తెలంగాణ బిల్లు టేబుల్ ఐటంగా వచ్చే అవకాశం ఉంది. -
అసంపూర్తిగా ముగింపు..
-
జీవోఎం మళ్లీ భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం మరోసారి సమావేశమైంది. మంగళవారం జరిగిన భేటీనే ఆఖరిదని వార్తలు వచ్చినా.. బుధవారం సాయంత్రం మళ్లీ సమావేశమైంది. నార్త్‌బ్లాక్‌లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ పాల్గొన్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, కిశోర్ చంద్రదేవ్, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, కిల్లి కృపారాణి పాల్గొన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించారు. -
అరగంటలో ముగిసిన మంత్రుల బృందం భేటీ
-
ఈ వారంలోనే తెలంగాణ బిల్లు
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఈ వారంలోనే పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర ఆరోగ్య మంత్రి, కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సభ్యుడు గులాంనబీ ఆజాద్ చెప్పారు. తెలంగాణ బిల్లుపై జీవోఎమ్ సమావేశం ముగిసింది. బిల్లుపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు, సవరణలను పరిశీలించారు. బిల్లుకు కొన్ని సవరణలను జిఓఎం ఆమోదించింది. తుది బిల్లుని సిద్ధం చేశారు. సమావేశం ముగిసిన తరువాత గులాంనబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడారు. ఇదే ఆఖరి జీవోఎమ్ సమావేశమని ఆజాద్ తెలిపారు. ఎల్లుండి జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ నోట్ సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ వారంలోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్ర ప్రాంతంలోనే కలిపేందుకు జీవోఎమ్ నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ నెల 11న తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ప్రారంభమైన జీవోఎం సమావేశం
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)మంగళశారం సమావేశమయ్యారు. తెలంగాణ ముసాయిదా బిల్లులపై అసెంబ్లీ పంపిన అభిప్రాయాలు,సవరణలను జీవోఎం ఈ సందర్భంగా పరిశీలించనుంది. అసెంబ్లీలో కోరిన, ఇటు విపక్షాలు సూచించిన సవరణల్లో ప్రధానంగా పోలవరం, కొత్త రాజధానికి ఆర్థిక ప్యాకేజివంటి అంశాలను తిరిగి బిల్లులో ప్రవేశపెట్టేందుకు జీవోఎం చర్చించనుంది. సవరణలు చేసి తుది బిల్లును జీవోఎం సిద్ధం చేయనుంది. ఈ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా తిరిగి కేబినెట్ బిల్లును రాష్ట్రపతికి పంపే అవకాశం ఉంది. ఈ సమావేశానికి సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, ఆంటోనీ హాజరయ్యారు. కాగా సమావేశం జరిగే హోంశాఖ కార్యాలయానికి కేంద్రమంత్రి పురందేశ్వరి, కిల్లి కృపారాణి వచ్చారు. -
ఈ రోజు మద్యాహ్నం GOM భేటీ
-
యూరియా స్థిర వ్యయం పెంపు!
న్యూఢిల్లీ: యూరియా స్థిర వ్యయాన్ని టన్నుకు రూ.350 పెంచేందుకు కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) సిఫారసు చేసింది. ఈ సిఫారసును కేంద్రమంత్రివర్గం అంగీకరిస్తే.. పెంపు తరువాత టన్ను యూరియా కనీస స్థిరవ్యయం రూ. 2300 కానుంది. అయితే, పెరిగిన ధరను సబ్సీడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుంది, రైతులపై ఆ భారం పడదు. తాజా పెంపు ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ప్రభుత్వంపై యూరియా సబ్సీడీ భారం రూ. 900 కోట్ల మేర పెరగనుంది. 30 ఏళ్ల పైబడిన సంస్థలు ఉత్పత్తి చేస్తున్న యూరియాకు టన్నుకు రూ. 150, మిగతా అన్ని సంస్థలకు రూ. 350 పెంపును వర్తింపజేయాలని సంబంధిత జీఓఎం సిఫారసు చేసినట్లు కేంద్ర ఎరువుల శాఖ మంత్రి శ్రీకాంత్ జెన గురువారం వెల్లడించారు. యూరియా స్థిర వ్యయాన్ని నిర్ణయించేందుకు ఆధారమైన మూల సంవత్సరాన్ని కూడా 2002-03 నుంచి 2008-09కి మార్చారు. అయితే ఎరువుల కంపెనీలు మాత్రం స్థిరవ్యయాన్ని టన్నుకు రూ. 700 పెంచాలని, మూల సంవత్సరాన్ని 2011-12 చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. వేతనాలు, కూలీల ఖర్చు, కాంట్రాక్ట్ కార్మికుల జీతభత్యాలు మరమ్మతు, నిర్వహణ ఖర్చు, అమ్మకం ఖర్చులు.. వీటి మొత్తం ఆధారంగా యూరియా ప్లాంట్లలో స్థిర వ్యయాన్ని నిర్ధారిస్తారు. ఎరువుల సబ్సిడీల కింద రూ. 70585 కోట్లను ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది. భారత్ ఏటా 22 మిలియన్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తోంది. మరో 8 టన్నులను దిగుమతి చేసుకుంటోంది. -
ఫిబ్రవరి 11న లోక్‌సభలో టి- బిల్లు?
-
ఫిబ్రవరి 11న లోక్‌సభ ముందుకు తెలంగాణ బిల్లు?
రాష్ట్ర విభజన విషయంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 11వ తేదీన లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై అసలు చర్చ పూర్తి కాలేదు. గట్టిగా మాట్లాడితే అసలు సభ కూడా సజావుగా సాగడంలేదు. బిల్లుకు ఇప్పటికే వేల సంఖ్యలో సవరణలు వచ్చాయి. వాటిని ఇంకా క్రోడీకరించలేదు. ఈలోపే లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. సమాయాభావం వల్ల, లోక్‌సభ సమావేశాలు ముగిసిపోయే అకాశం ఉన్నందున ఈలోపే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా, తెలంగాణపై కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటుచేసిన మంత్రుల బృందం ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఇదే ఆ బృందం చిట్టచివరి సమావేశం అవుతుందని చెబుతున్నారు. ఈ జీవోఎం బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు కూడా బిల్లుపై జీవోఎం తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ తుది చర్చలు పూర్తయిన తర్వాత కేంద్ర మంత్రివర్గం ముందుకు ఫిబ్రవరి 7వ తేదీన తెలంగాణ బిల్లు వెళ్తుందని సమాచారం. ఈ కసరత్తు మొత్తం పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 11 లేదా 12 తేదీలలో తెలంగాణ బిల్లు లోక్‌సభ ముందుకు రానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఈసారి కూడా బిల్లును సభలో ప్రవేశపెడతారని అంటున్నారు. సవరణల గురించి ఆయనతో ప్రస్తావించగా, బిల్లుకు తప్పకుండా వేల సంఖ్యలో సవరణలు వస్తాయని, వాటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఎవరు ఎంతగా అభ్యంతరాలు చెబుతున్నా, అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు సైతం కాదంటున్నా కూడా వడివడిగా అడుగులు వేస్తూ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేలోపు తాము తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టామని చూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. -
'సీఎంకు తెలిసినంతగా రాజ్యాంగం నాకు తెలీదు'
-
'సీఎంకు తెలిసినంతగా రాజ్యాంగం నాకు తెలీదు'
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం) ఈనెల 30న మరోసారి సమావేశం అవుతుందని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. ఈ భేటీలో తెలంగాణపై బిల్లుపై చర్చించనున్నట్లు ఆయన సోమవారమిక్కడ పేర్కొన్నారు. ఈ విషయంపై తాను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడినట్లు తెలిపారు. రాజ్యాంగంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న పట్టు తనకు లేదని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర కేబినెట్ రూపొందించిన తెలంగాణ ముసాయిదా బిల్లును న్యాయశాఖ ఆమోదించాకే రాష్ట్రపతికి పంపినట్లు తెలిపారు. రాష్ట్రపతి ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపటం జరిగిందన్నారు. తెలంగాణ బిల్లుపై పార్లమెంట్లో చర్చకు పెడతామని, సభలో ఆమోదం పొందుతుందో లేదో చూద్దామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలతో బిల్లులో సవరణలపై అప్పటికే చర్చించామని జైరాం తెలిపారు. అసెంబ్లీ నుంచి వచ్చే సవరణలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని... బిల్లులో ఎన్ని సవరణలు ఆమోదం పొందుతాయో చెప్పలేమని అన్నారు. -
రియల్ తెలంగాణకు జై
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. దీంతో రాయల తెలంగాణ ప్రచారం నేపథ్యం లో 48 గంటల ఉద్రిక్తతకు తెరపడింది. కేంద్ర మంత్రుల కమిటీ(జీవోఎం) సమావేశం తర్వా త జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. గురువారం సాయంత్రం వర కు రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ బంద్‌ను పాటించిన ప్రజలు, ప్రజాస్వామికవాదులు, తెలంగాణవాదులు రాత్రి కేంద్ర కేబినేట్ నిర్ణ యం వెలువడటంతో సంబరాలు జరుపుకున్నా రు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, బెల్లంపల్లి తదితర నియోకవర్గాల్లో రాత్రి బాణాసంచా కాల్చారు. తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల స్థూపాల వద్ద ని వాళులు అర్పించారు. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, టీఎన్జీవోల సంఘం జిల్లా అ ధ్యక్షుడు అశోక్‌తోపాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా రాత్రి టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఒక్క రోజు బంద్ విజయవంతమైంది. జీవోఎం రాయల తెలంగాణ ప్రతిపాదనలకు నిరసనగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన బంద్ పిలుపునకు గురువారం అనూహ్య స్పందన లభించింది. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, వైఎస్సార్ సీపీలు, అనుబంధ సంఘాలు బంద్‌కు మద్దతు పలికాయి. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, న్యాయవాదులు, వ్యాపారులు, వాణి జ్య సంస్థల నిర్వాహకులకు తోడు అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ప్ర భుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. వ్యాపార సంస్థలు, బ్యాంక్‌లు, సినిమా థియేటర్లు, పెట్రోల్‌బంకు లు పూర్తిగా బంద్ పాటించాయి. ఈ సందర్భం గా జిల్లా అంతటా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించిన తెలంగాణవాదులు కేంద్రం, మంత్రు ల కమిటీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాగా జిల్లాలోని ఆరు డిపోల నుంచి 621 బస్సులు కదలని ఫలితంగా ఆర్టీసీ సుమారుగా రూ.50 లక్షల ఆదాయాన్ని కోల్పోయింది. అదే విధంగా మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు విధులను బహిష్కరించారు. 15 భూగర్భగనుల్లో సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచింది. బంద్ నేపథ్యంలో జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు మోహరించాయి. బంద్‌కు విశేష స్పందన టీఆర్ఎస్ పిలుపు మేరకు బంద్‌లో పాల్గొని జిల్లా ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. గురువారం ఉదయం నుంచి మొదలైన బంద్ కోసం తెలంగాణవాదులు పూర్థిస్తాయిలో ప్రజలు, ప్రజాస్వామికవాదులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం వరకు ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. ఆర్టీసీ కార్మికులు విధులకు వెళ్లకుండా బంద్‌లో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామకష్ణాపూర్ తదితర ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు రాయల తెలంగాణ ప్రతిపాదనలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. ఉద్యోగసంఘాల జేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. కాగా బంద్ నేపథ్యంలో ఉదయం నాలుగు గంటలకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే రామన్న ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి బస్సులను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. టీఎన్జీవో ఉద్యోగులు కలెక్టరేట్ లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. టీఎన్జీవో ఉద్యోగులు కలెక్టరేట్ లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి పురవీధుల్లో భారీ ర్యాలీ జరిపారు. అనంతరం ఐబీలో జేఏసీ దీక్షా శిబిరం నుంచి జేఏసీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాగజ్‌నగర్ రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, పాల్వాయి రాజ్యలక్ష్మీలు దుకాణం యజమానులను బంద్ పాటించాలని కోరారు. -
ఆమోదంపై ఆగ్రహం
జగ్గంపేట, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై జీఓఎం నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు, సమైక్యవాదులు భగ్గుమన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరు తూ పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గురువారం రాత్రి జగ్గంపేటలో 16వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధిం చారు. పెద్దసంఖ్యలో నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, సమైక్యవాదులు రాత్రి ఏడు గంటల నుంచి ఆందోళన చేపట్టారు. సోనియా గాంధీ, కాంగ్రెస్, మంత్రి తోట నరసింహంలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారణంగా రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సీఐ సుంకర మురళీమోహన్, ఎస్సై సురేష్‌బాబు, ట్రైనీ ఎస్సై సురేష్ ఆందోళన విరమించాలని జ్యోతులకు నచ్చజెప్పబోయినా ఆయన ససేమిరా అన్నారు. గంటపాటు వేచి ఉన్న పోలీసులు చివరికి జ్యోతులను, పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ జీపులో ఎక్కించబోయారు. తిరస్కరించిన జ్యోతుల సర్వీసు రోడ్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు నడిచి వెళ్లగా కార్యకర్తలు, సమైక్యవాదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనను అనుసరించారు. కేబినెట్ ఆమోదం దారుణం ఈ సందర్భంగా జ్యోతుల మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అనుకూలంగా గతంలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి జీఓఎం, కేంద్ర కేబినెట్లు ఆమోదం తెలపడం దారుణమన్నారు. విభజన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్న తమ అభిమతం కేంద్రానికి తాకేలా చేసేందుకే జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టామన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల మూడు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని, తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి సమైక్య పోరును సాగిస్తూ దేశంలోని అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు విభజనకు సహకరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. జగన్ పిలుపునకు కట్టుబడి సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేసి ఉంటే తెలుగుజాతి విచ్ఛిన్నం జరిగేది కాదన్నారు. అక్కడోమాట, ఇక్కడో మాటా చెబుతున్న టీడీపీ కూడా రాష్ట్ర విభజన పాపం మూటకట్టుకుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రి సమైక్యాంధ్ర ఉద్యమద్రోహిగా మిగిలిపోతారని, ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడంలో ప్రధానపాత్ర పోషించిన ఆయన రోడ్డుపైకి వస్తే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆందోళనలో పార్టీ నాయకులు జ్యోతుల నవీన్ కుమార్, మారిశెట్టి భద్రం, నీలాద్రిరాజు, జీను మణిబాబు, పాలచర్ల సత్యనారాయణ, వెలిశెట్టి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ, సోమవరం రాజు, సుంకర సీతారామయ్య, అడబాల వెంకటేశ్వరరావు, కుదప శ్రీనివాస్, మారిశెట్టి పుండరీకాక్షుడు, రాయి సాయి, కింగం రమణ, నాళం గోపి, బోరా సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. జ్యోతుల సహా 30 మందిని అరెస్టు చేసిన పోలీసులు అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. నేటి బంద్‌కు సహకరించండి రాష్ర్ట విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జరపతలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. సమైక్యవాదులంతా చేయి కలిపి పోరుబాటలో కలిసి రావాలని కోరారు. రాష్ర్ట చరిత్రలో దుర్దినం రాష్ర్ట చరిత్రలో ఇదొక దుర్దినం. కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసింది. ఈ నిర్ణయానికి రాష్ర్ట ముఖ్యమంత్రితో పాటు మొత్తం కేబినెట్ బాధ్యత వహించాలి. రాజకీయ కుట్రలో భాగంగా ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారు. తమ మనోభావాలకు విరుద్ధంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు సరైన రీతిలో స్పందిస్తారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్లమెంటులో తెలంగాణ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తారు. సమైక్యవాదులంతా చేయి కలిపి శుక్రవారం తలపెట్టిన రాష్ర్ట బంద్‌ను విజయవంతం చేసి కేంద్రం కళ్లు తెరిపించాలి. కేంద్ర, రాష్ర్ట మంత్రులకు తగిన గుణపాఠం చెప్పాలి. - పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు మెజార్టీ ప్రజల అభిమతానికి వ్యతిరేకం రాష్ట్రంలోని మెజార్టీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్రిజేష్‌కుమార్ తీర్పు వల్ల కృష్ణా పరీవాహక ప్రాంతం ఎడారయ్యే ప్రమాదం ఉంది. మరో రాష్ట్రం ఏర్పడటంతో ఈ ప్రాంతంలో రైతులు పంటలు వదులుకునే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీ తీర్మానం అవసరం లేదంటూ కేంద్రం సాంపద్రాయాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని మార్చుకోవాలి. గతంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించిన సాంప్రదాయాలను పాటించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ శుక్రవారం చేస్తున్న బంద్‌కు ప్రతివారూ సహకరించాలి. - పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు సీమాంధ్ర కేంద్ర మంత్రుల వైఫల్యమే.. సీమాంధ్ర కేంద్ర మంత్రులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే తెలంగాణ బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం వరకూ వెళ్లింది. ఇది ముమ్మాటికీ వారి వైఫల్యమే. వారు ఎంతసేపూ ప్రకటనలతో ప్రజలను మభ్య పెట్టడానికే ప్రయత్నించారు తప్ప విభజనను అడ్డుకోలేకపోయారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయారు. సమైక్యాంధ్రను సమర్థిస్తున్నట్టు పదేపదే ప్రకటనలు చేసిన ఆయన ఆచరణలో తెలంగాణ బిల్లును అడ్డుకోలేకపోయారు. తెలంగాణ ప్రాంతపు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేతల్లో ఉన్న చొరవ, ఐక్యత సీమాంధ్ర మంత్రులు, నాయకుల్లో లేవు. - కుడుపూడి చిట్టబ్బాయి, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ప్రజలే తగిన బుద్ధి చెపుతారు రాష్ట్ర విభజనను ఆమోదించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రహీనమైపోయింది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీ 200 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయింది. కేంద్ర మంత్రులు గబ్బిలాల్లా పదవులను పట్టుకుని వేలాడడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. సోనియా ఆడించమన్నట్టు తలలాడించిన ఈ నేతలు తెలుగుతల్లికి ఏం సమాధానం చెబుతారు? జగన్మోహన్రెడ్డి వంటి సమర్థుడైన నేత అధికారంలో లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రజలకు ఈ దుర్దశ పట్టింది. కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడి విభజనకు కారకులైన టీడీపీ, కాంగ్రెస్‌లకు ప్రజలు బుద్ధి చెబుతారు. - జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు -
ఫైనల్.. పది జిల్లాల తెలంగాణే
-
ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం అయ్యింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదిక తదితర అంశాలపై చర్చ జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ కానున్న విషయం తెలిసిందే. కాగా జీవోఎం సభ్యులు మాత్రం పూటకో రకమైన ప్రకటనలతో సీమాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెంచుతున్నారు. రాయల తెలంగాణను కాదనలేమని జైరాం రమేష్ అంటుంటే..... చిదంబరం మాత్రం రాయల తెలంగాణ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవోఎం తన పనిని ముగించి చేతులు దులుపుకోవడంతో ఇక మీదట ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీఆర్ఎస్తో పాటు తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నా రాయల తెలంగాణ ఏర్పాటుకే జీవోఎం సిఫార్సు చేసిందని హోం శాఖ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి అజిత్ సింగ్ తెలిపారు. -
రాయల తెలంగాణపై ఆజాద్ వెనకడుగు!
న్యూఢిల్లీ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనలు వెల్లువెత్తటంతో పది జిల్లాల తెలంగాణ వైపే కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. జీవోఎం సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ రాయల తెలంగాణపై వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడే పది జిల్లాల తెలంగాణకే సిపార్సు చేయాలని ఆయన... కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకి ప్రతిపాదించారు. ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న ఆజాద్ ఈమేరకు ఫోన్లో షిండేతో మాట్లాడినట్లు తెలుస్తుంది. రాయల తెలంగాణ ప్రతిపాదనను ప్రత్యామ్నాయంగానే చూడాలని ఆయన షిండేకి సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా అంగీకరిస్తే రాయల తెలంగాణకు మొగ్గు చూపవచ్చని చెప్పినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ ఏర్పాటుచేసిన మంత్రుల బృందం(జీవోఎం) ఎట్టకేలకు తన పని పూర్తి చేసింది. విభజనకు అనుసరించాల్సిన విధివిధానాల ఆధారంగా రూపొందించిన సిఫార్సులతో కూడిన నివేదికకు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013కు, కేబినెట్ నోట్‌కు నిన్న జరిపిన చివరి భేటీలో జీవోఎం ముద్ర వేసింది. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మూడింటినీ టేబుల్ ఐటెమ్‌గా పెడతారని తెలియవచ్చింది. కేబినెట్ వాటిపై చర్చించి ఆమోదం తెలపడంతో పాటు ఆ వెంటనే, అంటే ఈరోజే రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతికి కూడా పంపుతుందని సమాచారం. -
రేపు కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు: షిండే
తెలంగాణపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం తుది నివేదిక ఖరారు చేసింది. జీవోఎం చివరిసారిగా బుధవారం రాత్రి ఇక్కడ గంట సేపు సమావేశమై చర్చించించింది. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును గురువారం కేబినెట్ ముందు ఉంచనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 3న తమకు అప్పగించిన పనిని పూర్తిచేశామని షిండే తెలిపారు. ఇదే జీవోఎం చివరి సమావేశమని, నివేదికను కేబినెట్ పరిశీలిస్తుందన్నారు. కాగా పది జిల్లాలతో కూడిన తెలంగాణనా లేక 12 జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమివ్వలేదు. -
రేపు కేబినెట్ ముందుకు జీఓఎమ్ బిల్లు: షిండే
-
తెలంగాణపై జిఓఎం తుది నివేదిక ఖరారు
-
తెలంగాణపై జిఓఎం తుది నివేదిక ఖరారు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై తుది నివేదిక ఖరారు చేసింది. జిఓఎం ఆఖరి సమావేశం ముగిసింది. ఈ సమావేశం గంటసేపు జరిగింది. గులాంనబీ ఆజాద్ద్ మినహ మిగతా సభ్యలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ముగిసిన తరువాత వీరప్ప మొయిలీ మాట్లాడుతూ జిఓఎం తన పని పూర్తి చేసిందని తెలిపారు. ఇదే జిఓఎం తుది సమావేశమని చెప్పారు. విభజన బిల్లు ఖరారైందని, వివరాలు తాను చెప్పలేనని అన్నారు. సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ రేపు మంత్రి మండలి ముందుకు తెలంగాణ బిల్లు వెళుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ, 12 జిల్లాల రాయల తెలంగాణ ఈ రెండు అంశాలను జిఓఎం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) కేంద్ర మంత్రి మండలి ముందుకు ఎప్పుడు వెళ్లాలనేది ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నిర్ణయిస్తారు. -
త్వరలో పార్లమెంట్ కు తెలంగాణ బిల్లు: ఆజాద్
కోల్‌కతా : తెలంగాణ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పడిన జీవోఎం తన ప్రక్రియను వేగవంతం చేసిందని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదించాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. అయితే బిల్లు పార్లమెంట్ లో ఎప్పుడు ప్రవేశపెడతారన్నది తెలియదని ఆజాద్ వ్యాఖ్యానించారు. కాగా డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల ఎజెండాలో తెలంగాణ బిల్లు లేదు. ఈ నేపథ్యంలో బిల్లు ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీలైనంత త్వరగా బిల్లు ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కూడా మంగళవారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రకటించారు -
తెలంగాణ బిల్లుకు తుదిమెరుగులు
ఢిల్లీ: రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సభ్యుడు జైరామ్ రమేష్ కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) ముసాయిదా న్యాయ శాఖ నుంచి హోంశాఖకు చేరింది. ముసాయిదా బిల్లుకు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ బిల్లుపై జిఓఎం సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ఈరోజే ఆమోదించే అవకాశం ఉంది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాయల తెలంగాణపైనే మొగ్గు చూపుతున్న నేపధ్యంలో జిఓఎం సభ్యులు కూడా నిన్న ఈ అంశంపైనే వాడివేడిగా చర్చించిన విషయం తెలిసిందే. రాయల తెలంగాణ తెరపైకి రావడంతో కొంత సంక్లిష్టత ఏర్పడింది. -
....ఇంకా ఉంది
-
మళ్లీ భగ్గుమన్న తెలంగాణవాదులు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాయల తెలంగాణ ప్రక్రియ ఆందోళనకు ఆజ్యం పోస్తోంది. మంగళవారం కేంద్ర మంత్రుల కమిటీ(జీఓఎం) భేటీ, ఆ తదుపరి పరిణామాలు మళ్లీ తెలంగాణ ‘లడాయి’కి సంకేతాలు ఇస్తున్నాయి. దాదాపుగా రాష్ట్ర విభజన పూర్తయిందని భావించిన తరుణంలో ‘రాయల తెలంగాణ’ తెరపైకి రావడం వివాదాస్పదం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం, మంత్రుల కమిటీ వైఖరిలో 24 గంటల వ్యవధిలో జరిగిన మార్పులు తెలంగాణవాదులను రగిలిస్తున్నాయి. హైదరాబాద్‌పై ఆంక్షలు లేకుండా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని భావించిన తరుణంలో రాయల తెలంగాణ ప్రతిపాదన జోరందుకోవడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన అత్యవసర విలేకరుల సమావేశంలో 5న తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం నుంచి నిరసనలు, ధర్నాలకు పిలువునివ్వడంతో మళ్లీ తెలంగాణ భగ్గుమననుంది. నిరసనలు, ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కేంద్ర మంత్రుల కమిటీ భేటీ ఏమీ తేల్చకుండా సమావేశం వాయిదా పడటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించిన నేపథ్యంలో జిల్లాలో మళ్లీ ఉద్యమ కార్యాచరణలో ఆ పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రాయల తెలంగాణకు నిరసనగా ఆందోళనలు మంగళవారం ఉధృతంగా సాగాయి. పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. ఆదిలాబాద్‌లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించిన న్యాయవాదులు రాయల తెలంగాణ వద్దని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించగా, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. న్యూడెమోక్రసీ, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దహనం, రాస్తారోకో, ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. లక్సెట్టిపేటలో జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఆసిఫాబాద్‌లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గుండా మల్లేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం రాయల తెలంగాణ ఏర్పాటుకు మొగ్గుచూపితే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇచ్చోడ మండల కేంద్రంలో అఖిల పక్షం అధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదంటూ పలువురు ఆరోపించారు. 5న బంద్‌కు పిలుపునివ్వడ ంతోపాటు 6న టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరోలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నందున జిల్లాలో మళ్లీ ‘ప్రత్యేక’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడనుంది. బంద్‌ను విజయవంతం చేద్దాం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో రాయల తెలంగాణ ప్రతిపాదనలు తేవడం కుట్ర. ఈ విషయంలో కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. అందుకే తెలంగాణలో మరోసారి ఉద్యమించేందుకు అధినేత కేసీఆర్ 5న తెలంగాణ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లాలో బంద్ సక్సెస్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, రాజకీయ, న్యాయవాద, డాక్టర్ జేఏసీలతోపాటు తెలంగాణవాదులు బుధవారం నుంచి నిర్వహించే నిరసనలు, ఆందోళనలకు కదిలిరావాలని కోరుతున్నాము. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 4, 5 తేదీలలో కుంటాల, సారంగపూర్ మండలాల్లో జరిగే టీఆర్ఎస్ శిక్షణ తరగతులను వాయిదా వేశాము. -
రాయలతెలంగాణపైనే తర్జనభర్జన
రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఇప్పుడు కొత్తగా రాయలతెలంగాణపై తర్జన భర్జనపడుతోంది. ఈ రోజు సాయంత్రం జరిగిందే జిఓఎం తుది సమావేశం అనుకున్నారు. ఢిల్లీ నార్త్‌బ్లాక్ హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారధ్యంలో జరిగిన సమావేశానికి సభ్యులు అందరూ హాజరయ్యారు. జిఓఎం సభ్యులు చిదంబరం, ఎకె ఆంటోని,వీరప్ప మొయిలీ, నారాయణ స్వామి, జైరాం రమేశ్లతోపాటు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరాలు, పల్లంరాజు, జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్ మీనన్ కూడా హాజరయ్యారు. సమావేశం దాదాపు గంటన్నరసేపు కొనసాగింది. ఎక్కువగా రాయల తెలంగాణపైనే చర్చ జరిగింది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ రాయల తెలంగాణపైనే మొగ్గు చూపుతున్న నేపధ్యంలో జిఓఎం ఈ అంశంపైనే వాడివేడిగా చర్చించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా చర్చించినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపుగానీ, ఎల్లుండి గానీ మళ్లీ జిఓఎం సమావేశం జరిగే అవకాశం ఉంది. జిఓఎం ప్రతిపాదించిన అంశాలు: రాయల తెలంగాణకే మొగ్గు - ఇరురాష్ట్రాలకూ సమానంగా 21 చొప్పున లోక్‌సభ స్థానాలు - 147 చొప్పున శాసనసభ స్థానాలు - ఉమ్మడి రాధానిగా హైదరాబాద్ - జిహెచ్ఎంసి పరిధి వరకూ ఉమ్మడి రాజధాని - గవర్నర్ చేతికి శాంతి భద్రతల వ్యవహారం - రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా - ఇరురాష్ట్రాలకూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) వర్తింపు- రాజ్యాంగ సవరణలేకుండానే విభజన - తెలంగాణకే భద్రాచలం - కృష్ణా జలాపంపిణీకి నీటి నిర్వహణ బోర్డు - పీపీఏల నుంచి తెలంగాణకు విద్యుత్ - కొన్నొళ్ల పాటు ఉమ్మడి సర్వీసుల విధానం అమలు. ఒకే సంస్కృతి, సంప్రదాయాలు గల రాయలసీమ ప్రాంతాన్ని రెండుగా విడదీయాలనుకోవడం బాధాకరం. సీమ నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలను వేరుచేసి రాయలతెలంగాణ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆ ప్రాంత నాయులు ఎవరూ అంగీకరించడంలేదు. రాజకీయ ప్రయోజనాల కోసంమే కాంగ్రెస్ అధిష్టానం ఈ దారుణానికి పాల్పడుతోందని స్పష్టపోయింది. పది జిల్లాల తెలంగాణే కావాలని, రాయల తెలంగాణను ఒప్పుకోమని తెలంగాణవాదులు ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. తెలంగాణ జెఏసి నేతలు ఈరోజు బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలిశారు. తాము రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని రాజ్‌నాథ్ సింగ్ వారికి చెప్పారు. బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు కూడా రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్‌లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ రాయలతెలంగాణకు ఒప్పుకునేదిలేదని తెగేసి చెప్పారు. అలా చేస్తే మరో యుద్ధమేనని హెచ్చరించారు.ఈ ప్రతిపాదనకు నిరసనగా ఈ నెల 5న తెలంగాణ బంద్‌కు కూడా ఆయన పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 బిల్లుగా పేర్కొన్న తెలంగాణ బిల్లు ఎల్లుండి జరిగే కేబినెట్ భేటీ ముందుకు వస్తుందని సమాచారం. జిఓఎం నివేదిక, బిల్లు ముసాయిదాపై కేంద్ర మంత్రి మండలి చర్చించి ఆమోదిస్తుంది. ఆ తర్వాత ఈ ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి, అటునుంచి అసెంబ్లీకి పంపుతారు. బిల్లుపై అభిప్రాయం చెప్పడానికి అసెంబ్లీకి పది రోజుల గడువు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశాలు చాలా తక్కువని భావిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలన్న బిజెపి డిమాండ్ - అఖిలపక్ష సమావేశంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపధ్యంలో ఈ నెల 5 ప్రారంభమయ్యే సమావేశాలను 20వ తేదీ వరకు కొనసాగిస్తారు. ఒక వారం విరామం తరువాత ఈ నెల 27న తిరిగి ప్రారంభించేయోచనలో కేంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అధిష్టానం సూచనల మేరకే ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12 నుంచి జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ నిర్ణయం తరువాత, పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ఆమోదించేవిధంగా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అవసరాన్ని బట్టి ఎటూ సమావేశాల కాలాన్ని పొడిగిస్తారు. 2009 డిసెంబర్ నెల రాష్ట్ర రాజకీయాల్లో ఎంత కీలకంగా నిలిచిందో, రాష్ట్ర విభజన ప్రక్రియలో ఈ డిసెంబర్ నెల అంతే అత్యంత కీలకం కానుంది. -
రాయల తెలంగాణ అంటే యుద్దమే: కేసీఆర్
-
సమస్యల్ని చెప్పకోవడానికి జీవోఎం పిలవలేదు:జేడీ శీలం
ఢిల్లీ: తమ ప్రాంత సమస్యల్ని చెప్పడానికి వస్తే జీవోఎం నుంచి పిలుపు అందలేదని జేడీ శీలం తెలిపారు. కేబినెట్లో తెలంగాణ అంశం చర్చకు వస్తే ముగ్గురు సీమాంధ్ర మంత్రులు తమ అభిప్రాయాలను చెబుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన జేడీ శీలం..జీవోఎం తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదన్నారు. ఒకప్రక్క విభజన ప్రక్రియ జరుగుతుంటే సమైక్య రాష్ట్రం అని ఏమి చేయగలమన్నారు. జీవోఎం ఇప్పటి వరకూ ఏం చేయాలనుకుంటుందో తమకు చెప్పలేదన్నారు. ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో గల హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలో మంగళవారం సాయంత్రం జీవోఎం సమావేశమైంది. విభజన అంశం చివరి అంకానికి చేరడంతో జీవోఎం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, ఆంటోని,పి. చిదంబరం, నారాయణ స్వామి, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్ లు హాజరైయ్యారు. -
రాయల తెలంగాణ అంటే యుద్దమే: కేసీఆర్
రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మరో యుద్దానికి తెరతీస్తాం అని టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయల తెలంగాణ నిర్ణయానికి ఒప్పుకోమని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోందని.. మా పిల్లల చేసిన త్యాగాలు రాయల తెలంగాణ కాదు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి నిర్ణయం తీసుకుంది అని, ఆ నిర్ణయాన్ని కేబినెట్ కూడా అంగీకరించింన విషయాన్ని ఆయన తెలిపారు. అలాంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్పుడు నిర్ణయమతుందన్నారు. అలాగే షరతులతో కూడిన తెలంగాణకు అంగీకరించం అని అన్నారు. తెలంగాణ ఉద్యమం పద్నాలుగు సంవత్సరాల శ్రమ అని, ప్రాణ త్యాగాలకు పాల్పడింది రాయల తెలంగాణ కోసం కాదని కేసీఆర్ అన్నారు. ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా జీవోఎం చర్చిస్తుందని తాము మంత్రుల బృందాన్ని ప్రశ్నించామన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం, పోరాటం జరిగింది అని, తెలంగాణ సమస్యలను పరిష్కరించాలని కోరామని కేసీఆర్ తెలిపారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నామని.. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 29వ రాష్ట్రమవుతుందని తాను చెప్పానని ఆయన అన్నారు. గతంలో ఏర్పడిన 28 రాష్ట్రాలకు వర్తించే విధంగానే తెలంగాణకు కూడా అవే నిబంధనలు, విధానాలు ఉండాలి అని జీవోఎం సభ్యులకు తెలిపాను అని మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత రాజ్యంగంలో ఏముందో తమకు తెలుసు అని.. ఉమ్మడి రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అనే విషయం తమకు తెలుసు అని ఆయన అన్నారు. ఉన్నపళంగా వారిని వెళ్లమని కోరితే బాగుండదనే విషయం కారణంగా ఉమ్మడి రాజధానికి ఒప్పుకున్నామన్నారు. గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వెలువడుతున్నా.. తాము అడ్డదిడ్డంగా మాట్లాడటం ఇష్టం లేక టీఆర్ఎస్ స్పందించలేదని తెలిపారు. రాయల తెలంగాణ అంటే మరో యుద్దం తప్పదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. -
కావూరి నివాసంలో సీమాంధ్ర కేంద్రమంత్రుల భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు మంగళవారమిక్కడ సమావేశం అయ్యారు. హైదరాబాద్, రాయల తెలంగాణ, జీవోఎం భేటీ తదితర అంశాలపై వారు చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తుది విడతగా నేడు భేటీ కానున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. ఇక జీవోఎం ఆమోదించనున్న నివేదికలో రాష్ట్ర విభజనపై సిఫారసులు ఎలా ఉంటాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రతిపత్తి, ఉమ్మడి రాజధాని పరిధి, ఆర్టికల్ 371డీ, ఈ, నీటి సమస్యల పరిష్కారం అంశాలతో పాటు రాయల తెలంగాణ విషయమై జీవోఎం సిఫారసులు ఫలానా విధంగా ఉన్నాయని కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న పలు కథనాలతో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిఫారసుల అసలు స్వరూపం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. -
తెలంగాణ కు కట్టుబడి ఉన్నాం: ప్రధాని
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మన్మోహన్ సింగ్ స్సష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ముందుకు వెళుతోందని ప్రధాని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి జీఓఎం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎల్లుండి కేబినెట్ ముందుకు జీవోఎం నివేదిక రానుందని అధికారులు తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభలను సజావుగా నడిపేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాయల తెలంగాణకు సోనియా మొగ్గు చూపుతుందనే వార్తల నేపథ్యంలో కెబినెట్ సమావేశం జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణ అంశ ప్రస్తావన రాకపోవచ్చని తెలుస్తోంది. -
'రాయల తెలంగాణ ప్రతిపాదనకు రాజకీయ ఆమోదం'
-
రాయల తెలంగాణ దిశగా కేంద్రం!
ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మంతనాలు జరుపుతోంది. రాయల తెలంగాణ దిశగా కేంద్రం అడుగులేస్తున్నట్టు జాతీయ మీడియాలో కధనాలు వస్తున్నాయి. రాయల తెలంగాణ ప్రతిపాదనకు రాజకీయ ఆమోదం లభించినట్టు ఎన్డీ టీవీ కధనాన్ని నడుపుతోంది. ఇక సీడబ్ల్యూసీ నిర్ణయానుసారం హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ కాకుండా రాయల తెలంగాణ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. పార్లమెంట్లో చర్చించాల్సిన కీలక అంశాలు, తెలంగాణ బిల్లు వంటి అంశాలపై వివిధ పార్టీల నేతలతో కమల్‌నాథ్ చర్చించే అవకాశముంది. మరోవైపు పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ హస్తినలోనే మకాం వేశారు. డీఎస్ అధినేత్రి సోనియా గాంధీ, జీవోఎం సభ్యులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక జీవోఎం నివేదిక రేపు కేబినెట్ ముందుకు రానున్న నేపథ్యంలో నివేదికకు తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. ఇక రాయల తెలంగాణ ప్రతిపాదనపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప మరే దానికి అంగీకరించేలేది లేదని తేల్చి చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని గుర్తించకుండా కిరికిరి పెడితే ఊరుకోమని ఆపార్టీ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు. -
జీవోఎం నివేదికలో ఏముందో తెలియదు: దిగ్విజయ్
-
జీవోఎం నివేదికలో ఏముందో తెలియదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఏర్పడ్డ కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నివేదికలో ఏముందో తనకు తెలియదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. జీవోఎం నివేదిక త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని, కేబినెట్ ఆమోదించాక అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. ఈ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని దిగ్విజయ్ వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు వస్తుందని ఆశిస్తున్నట్లు దిగ్విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాయల తెలంగాణ అంశంపై వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. వ్యక్తిగత సంభాషణల వివరాలు మీడియాకు చెప్పలేనని, రాయల తెలంగాణ అంశాన్ని తాను ఖండించదలుచుకోలేదని దిగ్విజయ్ అన్నారు. -
త్వరలోనే పార్లమెంటు ముందుకు టి.బిల్లు: షిండే
ముంబై: తెలంగాణ బిల్లు త్వరలోనే పార్లమెంటు ముందుకు రానుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎం తన పనిని దాదాపు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. టీ.బిల్లు అంశంపై ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే పనిలో కేంద్రం నిమగ్నమైందన్నారు. ముందుగా టీ.బిల్లు నివేదికను కేంద్ర న్యాయశాఖ పరిశీలిస్తోందన్నారు. అనంతరం న్యాయశాఖ నుంచి రాగానే తెలంగాణ బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని షిండే తెలిపారు. జీవోఎం నివేదికపై కసరత్తు పూర్తి చేసినట్లు కేంద్రం ప్రకటించినప్పటికీ... నిర్ణయాన్ని అమలుచేసే ముందు ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరగనున్న రోజునే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
డిసెంబర్ 3న కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం
-
శీతాకాల సమావేశాల్లోనే టీ-బిల్లు?
పరస్పర విరుద్ధ ప్రకటనలతో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ అంశాన్ని గందరగోళంలోకి పడేస్తున్నారు. బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారా.. లేదా అనే విషయమై ఏమాత్రం స్పష్టత లేకుండా చేశారు. ఈ అంశంపై శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. శీతాకాల సమావేశల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడంపైనే ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. బిల్లు సాధ్యాసాధ్యాలపై నాయకులు చర్చించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా కేంద్ర మంత్రి కమల్ నాథ్ హాజరయ్యారు. జీవోఎం నివేదికపై సమూలంగా కోర్ కమిటీలో చర్చించారు. సమావేశం దాదాపు గంటసేపటి పాటు కొనసాగింది. అయితే, కమల్ నాథ్ మాత్రం మధ్యలోనే సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. ఈ సమయంలో మీడియా ఆయనతో మాట్లాడగా.. ఈ విడత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. అయితే కేంద్రం మాత్రం ఎలాగైనా బిల్లు ప్రవేశపెట్టే యోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తర్వాత కోర్ కమిటీ సభ్యుడు అహ్మద్ పటేల్ ఈ విషయాన్ని తెలిపారు. -
ఒకరోజు ముందుగానే కేంద్ర కేబినెట్ భేటీ
-
3న కేంద్ర, రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశాలు
న్యూఢిల్లీ : డిసెంబర్ 3న కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరుగుతుందని కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. జీవోఎం ప్రతిపాదనలు కేబినెట్‌కు వివరిస్తామని ఆయన శుక్రవారమిక్కడ పేర్కొన్నారు. అదే రోజు జీవోఎం నివేదికను కేబినెట్ ఆమోదిస్తుందని షిండే తెలిపారు. కాగా ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంకానుంది. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం రూపొందించిన ముసాయిదా బిల్లుపై సమావేశంలో చర్చించే అవకాశముంది. జీవోఎం నివేదికపై కసరత్తు పూర్తి చేసినట్లు ప్రకటించినప్పటికీ... నిర్ణయాన్ని అమలుచేసే ముందు ఆచితూచి వ్యవహరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే సాయంత్రం జరిగే కోర్ కమిటీ సమావేశంలో నివేదికపై చర్చించిన తర్వాత కీలకాంశాలపై స్పష్టత ఏర్పడుతుందని... ఆపై అవసరమైతే బీజేపీ అగ్రనేతలతో చర్చించాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరగనున్న రోజునే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
తెలంగాణ బిల్లుపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ
-
4న కేబినెట్ భేటీ
మర్నాడే రాష్ట్రపతి పరిశీలనకు? నేడు కోర్‌కమిటీ ముందు టీ ముసాయిదా 100 పేజీల జీవోఎం నివేదిక సిద్ధం విభజన ప్రక్రియ అమల్లో మార్పులు వెనకబడ్డ ప్రాంతాలన్నింటికీ ప్యాకేజీ చివరి నిమిషం దాకా మార్పులు: షిండే న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రక్రియను ఎప్పుడు పూర్తి చేయాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం రూపొందించుకున్న ప్రణాళికలో స్వల్ప మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముసాయిదా బిల్లు, కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నివేదికపై శుక్రవారం కాంగ్రెస్ కోర్‌కమిటీ సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమై చర్చించనుంది. కోర్ కమిటీ ఆమోదం పొందాకే వాటిని కేంద్ర కేబినెట్‌కు పంపాలని హస్తిన పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ బిల్లు, జీవోఎం నివేదిక వంటివేవీ చర్చకు రాలేదని తెలిసింది. భేటీ ఎజెండాలో ఇవేవీ లేని విషయం తెలిసిందే. హోంశాఖ వర్గాలు చెబుతున్న ప్రకారం డిసెంబర్ 4న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో విభజన బిల్లును, జీవోఎం నివేదికను ప్రవేశపెడతారు. కేబినెట్లో ఆమోదం పొందిన మర్నాడే దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు నివేదించే అవకాశాలున్నాయి. అయితే విభజన ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై శుక్రవారం కోర్‌కమిటీ చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. చిదంబరంతో షిండే, జైరాం భేటీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంతో గురువారం ఉదయం 11.30 గంటలకు మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, జైరాం రమేశ్ సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాలు జరిగిన ఈ భేటీలో తెలంగాణ, సీమాంధ్రలోని వెనకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు బుధవారం నాటి జీవోఎం భేటీ అనంతరం 11 అంశాలకు సంబంధించి జైరాం రూపొందించిన 100 పేజీల నివేదికలోని మంచిచెడులు, అందులో పొందుపరచాల్సిన ఇతరత్రా అంశాలను పరిశీలించారు. కోస్తా, రాయలసీమలతో పాటు తెలంగాణలోని వెనకబడ్డ ప్రాంతాలకు కూడా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అంశాలు నివేదికలో ఉన్నట్టు చెబుతున్నా, నిజానికి నివేదికలో ఏమేమున్నాయన్నది మాత్రం చిదంబర రహస్యంగానే ఉంది. భేటీ అనంతరం షిండే తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్ గానీ, భద్రాచలం గానీ జీవోఎంకు ప్రతిబంధకాలు కానే కావు. ఇతర సమస్యలేమిటనేది చెప్పలేను. ముసాయిదా బిల్లులో లోపాల్లేకుండా చర్చిస్తున్నాం. సూక్ష్మస్థాయి లోపాలపైనా దృష్టి పెట్టాం. నివేదికను వీలైనంత తొందరగా కేబినెట్లో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతాం’’ అని పేర్కొన్నారు. చివరి నిమిషం దాకా మార్పుచేర్పులుండవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. న్యాయశాఖ పరిశీలనలో టీ బిల్లు హోం శాఖ రూపొందించిన విభజన బిల్లు గురువారం కేంద్ర న్యాయ శాఖకు వెళ్లింది. శాఖలోని లెజిస్లేచర్ విభాగం అధికారులు బిల్లును నిశితంగా పరిశీలిస్తున్నారు. బిల్లు డిసెంబర్ 3న సాయంత్రం జరిగే జీవోఎం సభ్యుల సమావేశం ముందుకు రానుంది. సభ్యుల ఆమోదం అనంతరం ముసాయిదా బిల్లు, జీవోఎం సిఫార్సులను 4న జరిగే కేబినెట్లో ప్రవేశపెడతారు. అయితే తెలంగాణ బిల్లును వీలైనంత తొందరగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని సోనియాగాంధీ భావిస్తున్నందున శని లేదా సోమవారాల్లో కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు కూడా లేకపోలేని హోం శాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జైపాల్‌తో శీలం, దిగ్విజయ్‌తో మర్రి భేటీలు విభజన అనివార్యమైనందున హైదరాబాద్‌ను కొద్ది కాలమైనా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్న కేంద్ర మంత్రి జేడీ శీలం గురువారం కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌ను యూటీ చేసేలా సోనియాకు సూచించాలని కోరినట్టు తెలిసింది. మరోవైపు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి గురువారం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. రాజకీయ అస్థిరత ఉండొద్దంటే వాటిని 119 నుంచి 153కు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లి ముసాయిదా బిల్లులో పొందుపరిచేలా చూడాలన్నారు. తెలంగాణకు సోనియా పేరు: శంకర్రావు తెలంగాణ రాష్ట్రానికి సోనియాగాంధీ పేరు పెట్టాలని మాజీ మంత్రి పి.శంకర్రావు డిమాండ్ చేశారు. ఆమె వల్లే రాష్ట్రం ఏర్పడుతోందని మీడియాతో ఆయనన్నారు. విభజనను అడ్డుకుంటానని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగులుతారన్నారు. -
తెలంగాణ బిల్లుపై అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ
కాంగ్రెస్, కేంద్రం, జీవోఎం తీరుపై ప్రజల్లో ఆందోళన ‘రాయల’పై, హైదరాబాద్‌పై రోజుకో రకం లీకులు మరోవైపు ముంచుకొస్తున్న పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ రెండో వారంలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు! అవి సోనియా జన్మదినమైన డిసెంబర్ 9నే ఉంటాయా? పార్లమెంటులో బిల్లు పెట్టి ఊరుకుంటారా, పొడిగించి ఆమోదిస్తారా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం బిల్లుపై ఉంటుందా? ‘ఉమ్మడి’ చిక్కుముడిపై ఎలాంటి పరిష్కారాలు చూపుతారు? సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర విభజన అంశానికి చివరికి ఎలాంటి ముగింపు ఉంటుంది? విభజన ప్రక్రియపై కొద్దిరోజులుగా కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) చేస్తున్న హడావుడి, ఇంతకాలంగా గందరగోళమయంగా సాగిన చర్యల మధ్య నలుగుతూ వచ్చిన ఈ వ్యవహారం చివరి అంకంలో ఏ రకమైన మలుపులు తిరగనుంది? ఇప్పుడు సర్వత్రా వీటిపైనే చర్చ సాగుతోంది. ప్రధానంగా రానున్న కొద్ది రోజుల్లో ఏం జరగబోతోంది? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? విభజన బిల్లు రాష్ట్ర శాసనసభకు ఎప్పుడు వస్తుంది? అసలు ఈ మొత్తం వ్యవహారానికి ఎలా తెర దించుతారు? వంటి ప్రశ్నలు అందరికీ ఉత్కంఠ కలిగిస్తున్నాయి. డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చర్చలన్నీ విభజన చుట్టే సాగుతున్నాయి. అయితే డిసెంబర్ 17 లోపే తెలంగాణ బిల్లు పార్లమెంటుకు చేరేలా పావులు కదుపుతున్నారంటూ వస్తున్న వార్తలు కూడా మరింత అయోమయానికి, మరిన్ని అనుమానాలకే తావిస్తున్నాయి. అందులోని సాధ్యాసాధ్యాలపై కూడా అన్ని వర్గాల్లోనూ సందేహాలే తలెత్తుతున్నాయి. ఇవి చాలవన్నట్టు హైదరాబాద్ హోదాపై, రాయల తెలంగాణపై రోజుకో రకంగా వస్తున్న ఊహాగానాలు రాష్ట్ర ప్రజలను మరింతగా ఆందోళనలోకి నెడుతున్నాయి. జీహెచ్ఎంసీనే ఉమ్మడి రాజధాని చేస్తారని, కాదు హెచ్ఎండీఏ పరిధి మొత్తాన్నీ అని, రాయల తెలంగాణే ఇస్తారని, ఇవ్వబోరని... ఇలా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు, కేంద్ర ప్రభుత్వం, జీవోఎం సభ్యులే రకరకాల లీకులిస్తూ గందరగోళాన్ని యథాశక్తి పెంచుతున్నారు. మళ్లీ తెరపైకి ‘డిసెంబర్ 9’ విభజన బిల్లు ముసాయిదాపై జీవోఎం కసరత్తు పూర్తి చేసింది. కేంద్ర న్యాయ శాఖ రూపొందించే ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు’ త్వరలోనే కేంద్ర కేబినెట్‌కు రానుంది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ఒకరోజు ముందు, అంటే డిసెంబర్ 4న కేంద్ర మంత్రివర్గం సమావేశమై బిల్లును ఆమోదిస్తుందని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే ఆ తర్వాత జరగబోయే పరిణామాలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. పార్లమెంట్ ప్రారంభమయ్యే తొలి రోజునే, అంటే డిసెంబర్ 5న బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆయన వెనువెంటనే రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోరతారా, లేదా కొంత సమయం తీసుకుంటారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బిల్లును ఆయన ఓ మూడు రోజుల పాటు పరిశీలించాక అసెంబ్లీకి పంపుతారనుకున్నా, డిసెంబర్ రెండో వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశం ఉండేలా కన్పిస్తోంది. ఆ లెక్కన డిసెంబర్ 9 నుంచి 11 మధ్య అసెంబ్లీ సమావేశం కావచ్చు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు జరిగే సమావేశాలైనందున కేవలం విభజన బిల్లుపై అభిప్రాయం తెలిపేందుకు మాత్రమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం కావడం, 2009లో కూడా డిసెంబర్ 9వ తేదీనే కేంద్ర మంత్రి చిదంబరం తొలిసారి తెలంగాణ ప్రకటన చేయడం తెలిసిందే. ఈ దృష్ట్యా ఈసారి కూడా డిసెంబర్ 9నే అసెంబ్లీని సమావేశపరిచే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అలా చేస్తే సొంత పార్టీ నుంచే సోనియాపై విమర్శలు తప్పవని, కాబట్టి ఆ రోజు అసెంబ్లీ సమావేశం ఉండకపోవచ్చని కూడా వాదన వినిపిస్తోంది. పైగా ప్రత్యేక సమావేశాలను ఒక్క రోజుతోనే ముగిస్తారా?, లేక సుదీర్ఘ చర్చకు ఆస్కారమిచ్చి రెండు రోజులు కొనసాగిస్తారా? అన్నది రాష్ట్రపతి ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడిదాకా ఒకవేళ అంతా సాఫీగా సాగినా పార్లమెంట్లో బిల్లు ఎప్పుడు ప్రవేశపెడుతారు, దానిపై చర్చకు ఉండే సమయమెంత? వంటివి కూడా ఆసక్తికరంగా మారాయి. బిల్లు పెట్టబోరంటున్న అధికారులు అధికార వర్గాలు మాత్రం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అసలు తెలంగాణ బిల్లు పెట్టే అవకాశాలే లేవని చెబుతున్నాయి! డిసెంబర్ 5న సమావేశాలు మొదలై 20వ తేదీ దాకా జరుగుతాయి. మధ్యలో 7, 8, 14, 15 సెలవు దినాలు.అంటే 12 రోజులే జరిగే సమావేశాల్లో విభజన బిల్లుకు ఆమోదముద్ర పడటం ఏ మాత్రం సాధ్యం కాదని ఆ వర్గాలంటున్నాయి. రాజకీయ వర్గాలు మాత్రం అసెంబ్లీ అభిప్రాయం అనంతరం రాష్ట్రపతి నుంచి వచ్చే బిల్లును డిసెంబర్ మూడో వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. ఆ లెక్కన బిల్లును డిసెంబర్ 16న పార్లమెంట్లో ప్రవేశపెడతారనుకున్నా దానిపై లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఇదంతా కేవలం నాలుగు రోజుల్లో పూర్తి కావాలి! ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ ఏర్పాటు ప్రక్రియకు దాదాపు 2 సంవత్సరాలు పట్టడాన్ని ఈ సందర్భంగా కొన్ని వర్గాలు ఉదహరిస్తున్నాయి. కానీ ఇప్పుడు మిగిలింది కేవలంబిల్లుకు ఆమోదముద్ర వేయడం మాత్రమేనని, పైగా అందుకు పార్లమెంటులో సాధారణ మెజారిటీ చాలు గనుక ఈ సమావేశాల్లోనే విభజన ప్రక్రియంతా పూర్తయ్యే ఆస్కారం లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. 4 నెలలుగా గందరగోళమే విభజనపై కాంగ్రెస్ ఆది నుంచీ ప్రతి అడుగూ రాజకీయ వ్యూహంలో భాగంగానే వేస్తోంది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తామని సీడబ్ల్యూసీలో తీర్మానం చేసినా జూలై 30 నుంచి ఈ నాలుగు నెలలుగా నలభై రకాల డ్రామాలు నడిపింది! రాయల తెలంగాణ అని, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమనీ, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలుపుతామని.. ప్రతి సందర్భంలోనూ ఆయా అంశాలపై లీకులతో గందరగోళపరుస్తూ వచ్చింది. సీమాంధ్రలో వెల్లువెత్తిన ఉద్యమాన్ని చల్లార్చడానికా అన్నట్టు రోజుకో రకం కథ తెరపైకి తెచ్చి అయోమయ పరిస్థితులను సృష్టించింది. హడావుడిగా పార్టీపరంగా ఆంటోనీ కమిటీ వేసి, మళ్లీ పార్టీల అభిప్రాయమనీ, జీవోఎం ఏర్పాటు చేసి, దానికి వచ్చిన ప్రతిపాదనపై చర్చలంటూ అందరినీ అయోమయంలో పడేసింది. ఇదంతా ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఎదుర్కొనే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చేసినట్టు చెబుతున్నారు. ఇంతా చేసి, నాలుగు నెలల ‘కసరత్తు’ తర్వాత కూడా ఇప్పటికీ బిల్లుకు తుది మెరుగుల ప్రక్రియే సాగుతోందంటూ మళ్లీ లీకులే ఇస్తోంది! మొత్తానికి విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినా, లేదా దానికి ఏదో ఒక దశలో బ్రేక్ పడినా రాజకీయంగా తనకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడకుండా ఉండేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఇలా నానాపాట్లూ పడుతోందన్న విమర్శలున్నాయి. డిసెంబర్ 8 తర్వాత పరిస్థితిలో మార్పు? ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా విభజన బిల్లుపై ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల్లో మిజోరం మినహా మిగతా రాష్ట్రాల ఫలితాలన్నీ కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. వీటిని లోక్‌సభ సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా అవి భావిస్తున్నాయి. డిసెంబర్ 8న వాటి ఫలితాలు వెలువడనున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు’కు కాంగ్రెస్, బీజేపీ మద్దతిస్తున్నప్పటికీ సీమాంధ్ర సమస్యలపై బీజేపీ లేవనె త్తే అంశాలకు బిల్లులో పరిష్కార మార్గాలు లేకపోతే అప్పుడు ఆ పార్టీ ఎలాంటి వైఖరిని అవలంబిస్తుంది? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ ఊపు బీజేపీ తీరులో ఎలాంటి మార్పు తేవచ్చు? విభజన బిల్లుపై ఎలాంటి చర్చకు అది పట్టుబట్టవచ్చు? ఇలాంటి అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. బీజేపీ మద్దతు లేకుండానే బిల్లు ఆమోదం పొందడానికి కూడా కాంగ్రెస్ నాయకత్వం అంతర్గతంగా ‘ఫ్లోర్ మేనేజ్మెంట్’ చేసిందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈ అంచనాలన్నీ ఒకవిధంగా ఉండగా, మరోవైపు అసెంబ్లీల ఫలితాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా వస్తే యూపీఏ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకం కావడమే గాక అవిశ్వాస తీర్మానం, ముందస్తు ఎన్నికల వంటివెన్నో తెరపైకి రావచ్చంటున్నారు. ఒకవిధంగా అసెంబ్లీల ఫలితాలు వెల్లడయ్యే డిసెంబర్ 8, మర్నాడే వచ్చే సోనియా జన్మదినమైన డిసెంబర్ 9ల్లో జరిగే పరిణామాలపైనే బిల్లు భవితవ్యం ఆధారపడి ఉంటుందంటున్నారు. -
హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదు : షిండే
-
డిసెంబర్ 4న కేబినెట్‌కు జీవోఎం నివేదిక
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఎట్టకేలకు జీవోఎం నివేదిక ఓ కొలిక్కి వచ్చింది.విభజన నివేదికపై కేంద్ర మంత్రుల బృందం కసరత్తు పూర్తి చేసింది. తెలంగాణపై జీఓఎం నివేదిక డిసెంబరు 4న కేబినెట్ ముందుకు రానుంది. అదే రోజు ముసాయిదా బిల్లు ఆమోదం పొందేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత రాష్ట్రపతికి తెలంగాణ బిల్లు పంపనున్నారు. అక్కడ నుంచి వారంలోపే అసెంబ్లీకి పంపిస్తారని హోంశాఖ వర్గాలంటున్నాయి. పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికమంత్రి చిదంబరం కార్యాలయంలో జీవోఎం సభ్యులు భేటీ ముగిసింది. సుశీల్‌కుమార్ షిండే, జైరాం రమేష్, చిదంబరం ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొద్దిసేపటి తర్వాత షిండే వెళ్లిపోయారు. అనంతరం సుమారు 40 నిమిషాలపాటు ఆర్థికశాఖ అధికారులతో చిదంబరం, జైరాం రమేష్ చర్చలు జరిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని హోంశాఖవర్గాలు చెబుతున్నాయి. రేపు కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో జీవోఎం నివేదికపై చర్చించే అవకాశముంది. మరోవైపు... పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబరు 5 నుంచి ప్రారంభం కానున్నాయి. -
హస్తినలో దామోదర, జీవోఎం సభ్యులతో భేటీ
న్యూఢిల్లీ : అధిష్టానం పిలుపు మేరకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గురువారం హస్తిన చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు. హైదరాబాద్ విషయంలో పరిమిత ఆంక్షలు విధిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నందున.. డిప్యూటీ సీఎం అభిప్రాయాన్ని తెలుసుకునేందుకే ఢిల్లీకి పిలిచినట్లు తెలిసింది. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌పై పరిమిత ఆంక్షల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహం, ఆర్థిక ప్యాకేజీ వంటి అంశాలపై తాను ప్రత్యేకంగా రూపొందించిన నోట్‌ను జీవోఎం సభ్యులకు సమర్పించనున్నట్టు సమాచారం. దామోదర తొలుత కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో భేటీ అవుతారని తెలిసింది. ఆ తరువాత అందుబాటులో ఉన్న జీవోఎం సభ్యులతో భేటీ అవుతారు. -
రాజ్యాంగానికి లోబడే ‘ఉమ్మడి’: దిగ్విజయ్
‘‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగ, న్యాయ పరిధికి లోబడే ఉంటుంది... కొంత కాలం ఉమ్మడి రాజధాని చేయవచ్చనే వెసులుబాటు రాజ్యాంగంలో ఉంది’’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. విభజనకు సంబంధించిన అన్ని అంశాలపై జీవోఎం కసరత్తు బుధవారం పూర్తవుతుందని.. త్వరలోనే అసెంబ్లీకి విభజన బిల్లును పంపటంతో పాటు శీతాకాల సమావేశాల్లోనే ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందని ఆయన ఢిల్లీలో మీడియాతో చెప్పారు. విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెకమాండ్‌ను ధిక్కరిస్తున్నారనే వాదనను దిగ్విజయ్ నవ్వుతూ కొట్టిపారేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పార్టీకి విబేధాల్లేవు. ఆయన కాంగ్రెస్‌కు విధేయుడు. విభజన విషయంలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తున్నారు. ఈ విషయంలో తన అభిప్రాయం చెప్తున్నారే తప్ప అధిష్టానాన్ని ధిక్కరించటం లేదు’’ అని పేర్కొన్నారు. విభజనపై ఆంటోనీ కమిటీ నివేదిక గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఆ కమిటీ సోనియాగాంధీ ఏర్పాటు చేసినదే తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. -
జీవోఎం భేటీలు ఇంకా ఉన్నాయ్: షిండే
రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటుచేసిన మంత్రుల బృందం (జీవోఎం) సమావేశాలు ఇంకా ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో బుధవారం రాత్రి జీవోఎం భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కేంద్ర మంత్రివర్గానికి సమర్పించాల్సిన నివేదిక తయారీ పూర్తయిందా? మీ కసరత్తు అయిపోయినట్టేనా?’ అన్న ప్రశ్నలకు షిండే స్పందిస్తూ.. ‘‘ఇంకా కొన్ని సమావేశాలుంటాయి. ఎన్ని అనేది నేను కచ్చితంగా చెప్పలేను’’ అని పేర్కొన్నారు. ‘గురువారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై నివేదిక, బిల్లు చర్చకు వస్తాయా?’ అని అడగ్గా.. ‘‘రేపు కేబినెట్లో ఈ అంశం లేదు’’ అని సమాధానమిచ్చారు. ‘నివేదిక ఎప్పటికల్లా తయారవుతుంది? ఎప్పుడు కేబినెట్‌కు అందజేస్తారు?’ అని ప్రశ్నించగా.. ‘‘మొత్తం పూర్తయినపుడు కేబినెట్‌కి ఇస్తాం. అప్పుడు మా పని పూర్తయినట్టు లెక్క. ఆ సంగతి మీకు ముందే చెప్తాం... సరేనా!’’ అని నవ్వుతూ బదులిచ్చారు. -
ముగిసిన GOM భేటి
-
చివరి దశకు చేరిన తెలంగాణ బిల్లు!
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు చివరిదశకు చేరింది. దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇవాళ నిర్వహించే సమావేశమే చివరిదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంశంలోఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. హైదరాబాద్ యూటీకి జీవోఎం నిరాసక్తత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైద్య, విద్య, ఉపాధి, శాంతి భద్రతల అంశాలు కేంద్రం చేతుల్లోకి తీసుకుని ఆ బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. వివాదస్పదంగా మారిన భద్రాచలం తెలంగాణకే చెందుతుందని మంత్రుల బృందం తేల్చింది. అయితే పోలవరం ముంపు గ్రామాలు మాత్రం సీమాంధ్రలో కలపాలని ప్రతిపాదించనున్నారు. పూర్తిస్థాయిలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లేకుంటే తెలంగాణలో అసంతృప్తి ఉంటుందని...అలా జరిగితే రాజకీయ లబ్ధి పూర్తిగా చేకూరదని జీవోఎం సభ్యులు వాదించినట్లు సమాచారం. దీనిపై బుధవారం ఉదయం నుంచి విస్తృతంగా మంతనాలు జరిగాయి. మరోవైపు... జైరాంరమేష్, చిదంబరంలతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ అయ్యారు. ఇంతకాలం పోరాడతున్నామని బీరాలు పలికిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు పూర్తిగా చేతులెత్తేశారు రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రమంత్రి చిరంజీవి తెలిపారు. ఇంకా సమైక్యంకోసం ప్రయత్నించడంలో ప్రయోజనం లేదని చెప్పారు. కావూరి, కిశోర్‌చంద్రదేవ్ ఈ తతంగానికి దూరంగా ఉన్నారు. తెలంగాణ నిర్ణయం కీలకదశలో ఉన్న సమయంలో కావూరి అమెరికా పర్యటన అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇక రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అగ్రనేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. జీవోఎం మరిన్ని భేటీలు నిర్వహిస్తుందని కేంద్ర హోంమంత్రి షిండే అంటూంటే ..... రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాత్రం జీవోఎం నివేదిక పూర్తి చేస్తుందంటున్నారు. నివేదికను కేబినెట్ భేటిలో చర్చించిన తరువాత అసెంబ్లీకి తెలంగాణ బిల్లు పంపుతామని దిగ్విజయ్ తెలిపారు. ఎలాంటి సవరణలు లేకుండా రాజ్యంగ పరిథిలోనే హైదరాబాద్‌ను పరిమిత కాలపు ఉమ్మడి రాజధానిగా చేస్తామన్నారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నిబద్దత కలిగిన నాయకుడంటూ కితాబిచ్చారు. -
టి బిల్లు కోసం సంయుక్త సమావేశాలు?
-
ఇది జిఓఎం ఆఖరి సమావేశం కాదు: షిండే
ఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పడిన కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) రేపటి సమావేశం ఆఖరి సమావేశం కాదని ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్న కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జిఓఎం సుదీర్ఘ సమావేశం జరుగుతుంది. ఎవరికీ అన్యాయం జరగకుండా సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఈ ఉదయం కేంద్ర మంత్రులు జైరామ్ రమేష్, జైపాల్ రెడ్డి షిండేతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యుటి) చేయాలన్న ఆలోచనకు జైపాల్ రెడ్డి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొందరు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 10.30కు షిండేను కలిశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని వారు షిండేను కోరారు. రేపు ఉదయం సీమాంధ్ర మంత్రులతో జైరాం రమేష్ సమావేశమవుతారు. ఇదిలా ఉండగా, జిఓఎం తుది సమావేశం విషయమై సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్ గతంలో పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. అదే తుది సమావేశమని జైరాం రమేష్ అంటే, అది చివరిది కాదని షిండే చెప్పారు. మరికొన్ని సమావేశాలు జరుగుతాయని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా షిండే ఇది తుది సమావేశం కాదని చెబుతున్నారు. -
ఇది జిఓఎం ఆఖరి సమావేశం కాదు: షిండే
-
రెండేళ్లు హైదరాబాద్ యూటీ?
-
రెండేళ్లు హైదరాబాద్ యూటీ?
సాధ్యాసాధ్యాలపై సోనియా ఆరా హైదరాబాద్‌పై జీవోఎం సభ్యులతో మేడమ్ అత్యవసర సమావేశం అలాగైతే సీమాంధ్ర ఎమ్మెల్యేలు సహకరిస్తారన్న కేంద్ర మంత్రులు 28 నాటి కేబినెట్ భేటీకల్లా తెలంగాణ బిల్లు సిద్ధం చేయాలని ఆదేశం యూటీకి తాను సుముఖమేనన్న కిరణ్! విభజనకు సహకరిస్తాం.. సీఎంనూ ఒప్పిస్తాం: శీలం రేపు సాయంత్రం 4.30కు భేటీ కానున్న జీవోఎం న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను తాత్కాలిక కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధినంతటినీ రెండేళ్ల పాటు యూటీ చేసే విషయంపై తలెత్తే ఇబ్బందులేమిటో తెలుసుకుని, వాటిని అధిగమించేందుకు తగిన ప్రతిపాదనలు చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచించారు. సోమవారం సాయంత్రం జీవోఎం సభ్యులతో ఆమె అత్యవసరంగా సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లు, నివేదికలోని అంశాలపై గంటకు పైగా చర్చించారు. జీవోఎం సారథి సుశీల్‌కుమార్ షిండే, సభ్యులు పి.చిదంబరం, ఏకే ఆంటోనీ, జైరాం రమేశ్‌లతో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా భేటీలో పాల్గొన్నారు. ఏఐసీసీ వర్గాల సమాచారం మేరకు.. సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రతిపాదనల అమలు సాధ్యాసాధ్యాలపై తీవ్రంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు పూర్తిగా సహక రిస్తామని, అయితే హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల భద్రత కోసం దాన్ని యూటీ చేయాలని ఇటీవల సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇటీవల జీవోఎం సభ్యులతోపాటు హైకమాండ్ పెద్దలను విడివిడిగా కలిసి ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. సీమాంధ్రలో వేగంగా కొత్త రాజధాని నిర్మించుకోవాలంటే కనీసం రెండేళ్లయినా పడుతుందని, అప్పటి వరకైనా హైదరాబాద్‌ను యూటీ చేస్తే చాల ని కోరారు. తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే అసెంబ్లీలో విభజన బిల్లుకు ఇబ్బంది లేకుండా ఉండేలా సీమాంధ్ర ఎమ్మెల్యేలను ఒప్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇదే విషయంపై తాము ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోనూ మాట్లాడామని, ఆయన కూడా సానుకూలంగా ఉన్నారని జీవోఎం సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం ఈ విషయాన్ని సోనియా దృష్టికి కూడా తీసుకెళ్లారు. యూటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించడమే గాక విభజనపై ఆంటోనీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని, నవంబర్ 28న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశానికి నివేదికను సమర్పించాలని సోనియా ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. దీంతో జీవోఎం సభ్యులంతా బుధవారం సాయంత్రం 4.30 గంటలకు నార్త్ బ్లాక్‌లో సమావేశమై హైదరాబాద్ యూటీ, ఆంటోనీ నివేదిక సిఫార్సుల అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించి తమ నివేదికను ఖరారు చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర విభజనను బయటికి మాత్రం వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, లోలోన మాత్రం ఆ విషయంలో అధిష్టానానికి తన పూర్తి సహకారాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే విభజనకు తనకెలాంటి అభ్యంతరమూ లేదని ఆయన స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ యూటీ ప్రతిపాదన తెచ్చినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే రాష్ర్ట విభజనకు సహకరిస్తామని శీలం సోమవారం సాయంత్రం కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ తెలిపారు. ‘‘సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి కనీసం రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుంది. అందుకే అప్పటిదాకా హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నాం. మా ప్రతిపాదనకు అంగీకరిస్తే విభజన బిల్లుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలందరినీ ఒప్పిస్తాం’’ అని ఆయన తెలిపారు. అంటే కిరణ్‌ను కూడా విభజనకు ఒప్పిస్తారా అని ప్రశ్నించగా, అందరిలో సీఎం కూడా ఒకరని బదులిచ్చారు. కేబినెట్లో చర్చకు రాని తెలంగాణ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది. సుమారు 45 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలపైనే చర్చ జరిగినట్టు సమాచారం. నేడు షిండేతో మర్రి బృందం భేటీ విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని డిమాండ్ చేస్తున్న టీ కాంగ్రెస్ నేతలు మంగళవారం షిండేను కలవనున్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నేతల బృందం ఉదయం 10.30కు షిండేను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేయనుంది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను ప్రస్తుతమున్న 119 నుంచి 153కు పెంచాలని అందులో పేర్కొనున్నారు. -
హైదరాబాద్‌పైనే పీటముడి
న్యూఢిల్లీ: యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) సమావేశం ముగిసింది. రాష్ట్ర విభజనపై ఇంతకాలం కసరత్తు చేసి తయారు చేసిన నివేదికను జిఓఎంఆమెకు అందజేసింది. సమావేశంలో గంటన్నరసేపు చర్చించారు. హైదరాబాద్‌పైనే పీటముడిపడినట్లు తెలుస్తోంది. జిహెచ్ఎంసి పరిధిని ఉమ్మడి రాజధానిగా చేస్తే సీమాంధ్రుల హక్కులకు రక్షణ లభిస్తుందని జిఓఎంలోని ఒక సభ్యుడు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ నెల 27న జిఓఎం తుది సమావేశం జరుగుతుంది. సోనియా గాంధీ ఇప్పుడు ఇచ్చిన సలహాల ఆధారంగా తుది నివేదిక రూపొందించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జయరామ్, ఎకె ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, చిదంబరం పాల్గొన్నారు. -
సోనియాకు GOM తయారు చేసిన నివేదిక
-
సోనియాకు తమ నివేదిక ఇచ్చిన GOM