రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్‌ను తిరస్కరించిన జీవోఎం.. జీహెచ్‌ఎంసీ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల పర్యవేక్షణను గవర్నర్‌కు అప్పగించాలని కూడా జీవోఎం తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.