Union Territory
-
J&K Elections: హిమసీమ చరిత్రలోనే అత్యధిక ‘ఎన్నికల’ వేడి
. దశాబ్దాలుగా ఉగ్ర దాడులకు, కల్లోలానికి పర్యాయపదం. అశాంతితో అట్టుడికిపోతూ వస్తున్న ఆ ప్రాంతంలో ఉగ్ర దాడులు పెద్దగా తగ్గకున్నా కొన్నాళ్లుగా కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పదేళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కు ప్రత్యేక హోదా కలి్పంచిన ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కాంగ్రెస్ కీలక నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ స్థాపన వంటి కీలక పరిణామాలెన్నో ఈ పదేళ్లలో చోటుచేసుకున్నాయి. ఈ రాజకీయ పరిణామాలపై, లోయలో శాంతిస్థాపన యత్నాలు తదితరాలపై ప్రజల మనోగతానికి ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టే అవకాశముందని భావిస్తున్నారు. దాంతో పీడీపీ, ఎన్సీ వంటి స్థానిక పారీ్టలతో పాటు ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పైగా జమ్మూ కశీ్మర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రజల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పునర్ వ్యవస్థీకరణతో... దశాబ్దకాలంగా జమ్మూ కశీ్మర్ రాజకీయ ముఖచిత్రం ఊహాతీతంగా మారిపోయింది. 2026 జనగణన దాకా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరపరాదన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టి 2022లో ఈ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ స్థానాలను 87 (లడ్ఢాఖ్‌లోని 4 స్థానాలను మినహాయిస్తే) నుంచి 90కి పెంచారు. మొత్తం సీట్ల సంఖ్య పెద్దగా పెరగకున్నా ముస్లిం ప్రాబల్య కశీ్మర్లో సీట్లు 47కు తగ్గి, హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూలో 43కు పెరగడం విశేషం. జమ్మూలోని సాంబా, రాజౌరీ, కథువా జిల్లాల్లో రెండేసి సీట్లు పెరిగితే కశ్మీర్లో ఒక్క స్థానం (కుప్వారాలో) పెరిగింది. అంతకుముందు కశీ్మర్లో 46, జమ్మూలో 37, లడ్ఢాఖ్ ప్రాంతంలో 4 సీట్లుండేవి. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్ జనాభాలో 43.8 శాతం మంది జమ్మూలో, 56.2 శాతం కశీ్మర్లో నివసిస్తున్నారు. కశీ్మర్లోని ఉత్తరాది జిల్లాల్లో అత్యంత సున్నిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణ కత్తిమీద సామేనని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలన్నది నిర్ణయాన్ని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఈ క్షణాల కోసం జమ్మూ కశీ్మర్ ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.ఎల్జీదే పెత్తనం2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచీ జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. నాటినుంచీ కీలక అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే కేంద్రీకృతమయ్యాయి. అసెంబ్లీ అధికారాలు కుంచించుకుపోయాయి. దాదాపుగా ప్రభుత్వ నిర్ణయాలన్నింటికీ ఎల్జీ ఆమోదముద్ర తప్పనిసరిగా మారింది. పోలీసు వ్యవస్థతో పాటు భూములకు సంబంధించిన అన్ని అంశాలపైనా ఎల్జీదే నిర్ణయాధికారం.2014 ఎన్నికల్లో ఏం జరిగింది? → 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 65.52 శాతం ఓటింగ్ నమోదైంది. → పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) 28 స్థానాలతో ఏకైక అతి పెద్ద పారీ్టగా నిలిచింది. → రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి 25 సీట్లొచ్చాయి. → నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కి 15, కాంగ్రెస్‌కు 12 స్థానాలు దక్కాయి. → స్థానిక చిన్న పారీ్టలు, స్వతంత్రులకు 7 సీట్లొచ్చాయి. ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో చివరికి బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా సంకీర్ణ సర్కారు ఏర్పడింది. కానీ విభేదాల నేపథ్యంలో 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ఆ సర్కారు కుప్పకూలింది. ఆ తర్వాత 2020లో జిల్లా అభివృద్ధి మండళ్లకు, తాజాగా గత మేలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు.కాంగ్రెస్, ఎన్సీ పొత్తు ఈసారి కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు కుదుర్చుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఇందులో భాగంగా 51 స్థానాల్లో ఎన్సీ, 32 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తాయి. సీపీఎం, పాంథర్స్ పారీ్టలకు ఒక్కో స్థానం చొప్పున కేటాయించాయి. మిగతా 5 చోట్ల ఎన్సీ, కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీకి దిగుతుండటం విశేషం. మరోవైపు బీజేపీ 16 మంది అభ్యర్థుతో తొలి జాబితా విడుదల చేసింది. తొలుత 44 మంది పేర్లు ప్రకటించినా వాటిలో పలు పేర్లపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆ జాబితాను రద్దు చేసింది. ఇక మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ ఇప్పటిదాకా రెండు విడతల్లో 16 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) కూడా 13 మందితో తొలి జాబితా విడుదల చేసింది.ఈ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యం ఎందుకంటే... లో గత పదేళ్లలో అన్నివిధాలుగా సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అటు రాష్ట్ర హోదా రద్దయి కేంద్రపాలిత ప్రాంతంగా మారడం మొదలుకుని రాజకీయంగా కూడా ఎన్నో పరిణామాలు జరిగాయి. వీటన్నింటిపైనా సగటు జమ్మూ కశీ్మర్ ప్రజల మనోగతానికి వారి ఓటింగ్ సరళి అద్దం పట్టనుంది. అందుకే ఈ ఎన్నికలను జమ్మూ కశ్మీర్ చరిత్రలోనే కీలకమైనవిగా భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ
ఒకప్పుడు జమ్మూకశ్మీర్‌లో భాగమైన లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారాక స్థానికంగా పరిణామాలు ఎన్నో మలుపులు తీసుకున్నాయి. భిన్న ధ్రువాలుగా ఉండే బౌద్ధులు–ముస్లింలు ఇప్పుడు ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పోరాడుతున్నారు. లేహ్‌లో బౌద్ధులు ఎక్కువ. కార్గిల్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. వీరంతా తమ ప్రయోజనాలను పరిరక్షించాలని, తమ డిమాండ్లకు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతం కావడంతో.. తమకూ జమ్మూ కశీ్మర్ మాదిరిగా రాజకీయ అవకాశాలు కలి్పంచాలన్నది వీరి ప్రధాన డిమాండ్లలో ఒకటి. కేంద్రపాలిత ప్రాంతంగా మారాక లేహ్ కేంద్రంగా పనిచేసే సామాజిక, రాజకీయ సంస్థలన్నీ కలసి లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ)గా ఏర్పడ్డాయి. కార్గిల్ కేంద్రంగా పనిచేసే సామాజిక, మత, రాజకీయపరమైన సంస్థలన్నీ కలసి కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ (కేడీఏ)గా అవతరించాయి. ఈ రెండూ కొన్నేళ్లుగా డిమాండ్ల సాధనకు కలసికట్టుగా పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్ లోక్‌సభ స్థానానికి ఈ నెల 20న జరగనున్న పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయం ఎవరిని వరించేనో? లద్దాఖ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. ఈసారి సిట్టింగ్ ఎంపీ జామ్యంగ్ సేరింగ్ నామ్‌గ్యాల్ బదులు తాషి గ్యాల్సన్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి ఇక్కడ బాగా ఉంది. దాంతో ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు బీజేపీ ఈ ప్రయోగం చేసింది. గ్యాల్సన్ లద్దాక్ ఆటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, సీఈవోగా ఉన్నారు. పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో నామ్‌గ్యల్ స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగాలని యోచించినా అధినాయకత్వం జోక్యంతో వెనక్కు తగ్గారు. గ్యాల్సన్కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. 2014లోనూ లద్దాఖ్‌లో బీజేపీయే గెలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తుప్స్టాన్ చెవాంగ్ కేవలం 36 ఓట్ల ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థి గులామ్ రాజాపై నెగ్గారు. చెవాంగ్ 2009 ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్; ఉదంపూర్, లద్దాఖ్, జమ్మూల్లో కాంగ్రెస్ పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. కానీ కార్గిల్ ఎన్సీ నాయకత్వం అధిష్టానం నిర్ణయంతో విభేదించింది. హాజీ హనీఫా జాన్‌ను లద్దాక్‌లో పార్టీ అభ్యర్థిగా పోటీకి దింపింది. కాంగ్రెస్ కూడా సేరింగ్ నామ్గ్యల్ను అభ్యరి్థగా ప్రకటించింది. కానీ కార్గిల్ కాంగ్రెస్ నాయకులు కూడా అనూహ్యంగా హాజీ హనీఫాకే మద్దతు ప్రకటించారు. దాంతో కాంగ్రెస్, ఎన్‌సీలకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరికి ఇండియా కూటమి తరఫున సేరింగ్ నామ్గ్యల్ను అధికారిక అభ్యర్థిగా రెండు పారీ్టలూ ప్రకటించాయి. అలా బీజేపీ నుంచి గ్యాల్సన్, కాంగ్రెస్–ఎన్సీ ఉమ్మడి అభ్యరి్థగా సేరింగ్ న్యామ్‌గల్, ఆ రెండు పారీ్టల స్థానిక నేతల మద్దతుతో హాజీ హనీఫా పోటీలో ఉన్నారు. వీరిలో హనీఫా ఒక్కరే కార్గిల్ వాసి. మిగతా ఇద్దరూ లేహ్‌కు చెందిన వారు. దీంతో గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కార్గిల్, లేహ్ వాసులు ఎప్పటి మాదిరే భిన్నమైన తీర్పు ఇస్తారేమో చూడాలి. ఇదే కారణంతో లద్దాఖ్‌ను కార్గిల్, లేహ్ రెండు లోక్‌సభ స్థానాలుగా విడగొట్టాలని ఎల్ఏబీ, కేడీఏ డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్లు తక్కువ 1,73,266 చదరపు కిలోమీటర్లతో విస్తీర్ణపరంగా లద్దాఖ్ దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గం. కానీ ఓటర్లు మాత్రం కేవలం 1,82,571 మందే! గత మూడు లోక్‌సభ ఎన్నికలుగా ఇక్కడ 71 శాతానికి పైనే ఓటింగ్ నమోదవుతోంది.స్థానికుల డిమాండ్లులద్దాక్కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చడంతో పాటు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమీషన్, రెండు లోక్‌సభ స్థానాలు స్థానికుల డిమాండ్లు. ఆరో షెడ్యూల్లో చేరుస్తామని బీజేపీ 2019 మేనిఫెస్టోలో హామీ ఇచి్చంది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద సాంస్కృతిక, స్థానిక గుర్తింపుల పరిరక్షణకు స్వతంత్ర మండళ్ల ఏర్పాటు కూడా ఒక డిమాండ్. లద్దాఖ్‌లో లేహ్, కార్గిల్ కేంద్రంగా రెండు స్వతంత్ర మండళ్లు ఇప్పటికే ఉన్నా అవి 1995 చట్టం కింద ఏర్పాటైనవి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అలాంటప్పుడు అక్కడ సర్కార్ ఎందుకు?: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం పంచాయితీకి సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు.. కేంద్రానికి ఉన్న అధికారాలకు కొనసాగింపు అని కేంద్రం నొక్కి చెప్పడంతో, అలాంటప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని.. సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. అధికారం, సేవలు.. పరిపాలనపై నియంత్రణ.. తదితర అంశాల్లో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య తీవ్రస్థాయిలోనే వైరం నడుస్తోంది. ఈ దరిమిలా ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్‌పై వరుసగా మూడోరోజు వాదనలు వింది. గురువారం విచారణ సందర్భంగా.. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. ఢిల్లీ దేశ రాజధాని అని, దానికంటూ ఓ ఏకైక హోదా ఉందని, అక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తారు గనుక ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపారు. గతంలోని ఓ తీర్పును ప్రస్తావించిన ఆయన.. ఢిల్లీ కాస్మోపాలిటన్ నగరమని, ఒక మినీ భారత్లాంటిదని వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్ర, ఉమ్మడి జాబితాలోని అంశాలను ధర్మాసనం గౌరవిస్తుందని, కానీ, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే విషయాలపై శాసనం చేసే హక్కు ఢిల్లీ అసెంబ్లీకి ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాలపై పార్లమెంటుకు శాసనపరమైన నియంత్రణ ఉంటే, ఢిల్లీ ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల సంగతేంటని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే.. ఢిల్లీ శాసన అధికారాలలో భాగంగా సేవలపై శాసన నియంత్రణను ఏవిధంగా ఉద్దేశించలేదో చెప్పాలని న్యాయస్థానం సొలిసిటర్ జనరల్‌ను కోరింది. ఒకానొక తరుణంలో ఎల్జీ విశిష్ట అధికారాల ప్రస్తావన సైతం లేవనెత్తింది బెంచ్. ఆ సమయంలోనే సోలిసిటర్ జనరల్.. కేంద్ర పాలిత ప్రాంతమనేది కేంద్రానికి(యూనియన్)కు కొనసాగింపని, ఆ ఉద్దేశం దాని పరిధిలోని పరిపాలన కేంద్రం పరిధిలోకి వస్తుందని సోలిసిటర్‌జనరల్ కోర్టుకు తెలిపింది. అలాంటప్పుడు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ఎందుకంటూ బెంచ్.. సోలిసిటర్ జనరల్‌ను నిలదీసింది. పరిపాలన కేంద్ర ప్రభుత్వానిదే అయితే, ప్రభుత్వంతో ఇబ్బంది ఎందుకంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై సోలిసిటర్ జనరల్ స్పందించారు. క్రియాత్మక నియంత్రణ అనేది ఎన్నికైన ప్రభుత్వానిదని, కేంద్రం పరిపాలనా నియంత్రణతో సంబంధం కలిగి ఉందని తెలిపారు. రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ.. అందులో కేంద్ర, రాష్ట్ర సర్వీసులు ఉన్నాయని, కేంద్ర పాలిత ప్రాంతాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ తరుణంలో సమయం ముగియడంతో.. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను జనవరి 17కు వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఢిల్లీలో పాలన, ఇతర సేవల నియంత్రణపై ఢిల్లీ ప్రభుత్వం.. అత్యున్నత న్యాయస్థానాన్ని గతంలో ఆశ్రయించింది. 2018లో.. ధర్మాసనం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికైన ప్రభుత్వం సలహాలకు కట్టుబడి ఉంటారని, ఇద్దరూ ఒకరితో ఒకరు సామరస్యపూర్వకంగా పనిచేయాలని ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. అయితే.. 2019 ఫిబ్రవరిలో మాత్రం ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ భిన్న తీర్పులను వెల్లడించింది. పైగా ఆ ఇద్దరు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లు ఆ తర్వాత రిటైర్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం.. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనానికి బదిలీ అయ్యింది. -
వాహనాల తుక్కు ‘సింగిల్ విండో’లోకి 11 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు ఉద్దేశించిన ‘నేషనల్ సింగిల్ విండో సిస్టమ్’ పరిధిలోకి 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర రవాణా, రహదారుల శాఖ ప్రకటించింది. వాహనాలను తుక్కుగా మార్చే కేంద్రాల ఏర్పాటుకు 2022 నవంబర్ 14 నాటికి 117 మంది ఇన్వెస్టర్ల నుంచి దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది. ఇందులో 36 దరఖాస్తులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ఆంధప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అసోం, గోవా, ఉత్తరాఖండ్, చండీగఢ్ ఇందులో చేరాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి వాహనాల తుక్కు విధానం అమల్లోకి రావడం గమనార్హం. ఇతర రాష్ట్రాలను కూడా ఇందులో త్వరగా భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర రవాణా శాఖ తెలిపింది. 11 రాష్ట్రాల పరిధిలో 84 ఆటేమేటెడ్ టెస్టింగ్ కేంద్రాలను రాష్ట్రాల నియంత్రణలో ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు పేర్కొంది. చదవండి: iPhone 14: వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి! -
సీఎం భగవంత్ మాన్ మరొకటి.. చండీగఢ్ పంజాబ్‌కే సొంతం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో సంచలనానికి తెర తీశారు. శుక్రవారం విధాన సభ ప్రత్యేక సమావేశాల్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారాయన. చండీగఢ్ నగరాన్ని పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ తీర్మానం చేశారాయన. చండీగఢ్‌పై సర్వహక్కులు తమవేనని, వెంటనే దానిని వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారాయన. కేంద్రపాలిత ప్రాంత హోదాలో చండీగఢ్ ప్రస్తుతం పంజాబ్-హర్యానాల సంయుక్త రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. పరిపాలనాపరంగా 60:40గా పంజాబ్, హర్యానాలు చండీగఢ్‌నును పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో చండీగఢ్‌పై సర్వహక్కులు పంజాబ్‌వేనని, అందుకే పూర్తిగా పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ ఒక తీర్మానం చేశారు సీఎం భగవంత్ మాన్. దీనికి ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా మద్దతు ప్రకటించగా.. తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇదిలా ఉండగా.. పంజాబ్ సర్వీస్ రూల్స్‌కు బదులు ఛండీగఢ్ ఉద్యోగులకు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మధ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కౌంటర్‌గా చండీగఢ్.. పంజాబ్‌కే పూర్తి రాజధానిగా ఉండాలంటూ తీర్మానం సీఎం భగవంత్ మాన్ ప్రవేశపెట్టడం విశేషం. తీర్మానం సందర్భంగా.. భగవంత్ మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛండీగఢ్ నుంచి కాకుండా బయటి వాళ్లను(కేంద్ర సర్వీస్ ఉద్యోగులతో) నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అంతేకాదు ఇంతకాలం కొనసాగిన సమతుల్యతను దెబ్బ తీయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారాయన. భాక్రా బియస్ మేనేజ్మెంట్ బోర్డులో కేంద్ర ఉద్యోగుల్ని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఛండీగఢ్ పంజాబ్ రాజధానిగా పునరుద్ఘాటించిన సీఎం మాన్.. ఇంతకు ముందు ఇలా రాష్ట్రాలు విడిపోయిన సందర్భాల్లో రాజధాని మాతృరాష్ట్రంతోనే ఉన్న విషయాన్ని సైతం ప్రస్తావించారు. కాబట్టి, చంఢీగఢ్ను పంజాబ్‌కు బదిలీ చేయాలని అన్నారు. గతంలో సభ ఇందుకు సంబంధించి ఎన్నో తీర్మానాలు చేసినా లాభం లేకుండా పోయిందని, ఈసారి దానిని సాధించి తీరతామని చెప్పారాయన. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ప్రకారం.. పంజాబ్ రాష్ట్రం ఏర్పడింది. ఆపై పునర్వ్యవస్థీకరణతో హర్యానా పుట్టుకొచ్చింది. ఛండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా, పంజాబ్‌లో కొంత భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లో కలిసిపోయాయి. అప్పటి నుంచి భాక్రా బియస్ మేనేజ్మెంట్ బోర్డు లాంటి సంయుక్త ఆస్తుల మీద పరిపాలనను పంజాబ్-హర్యానాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. -
లక్షద్వీప్‌ను ముంచేస్తారా?
సేవ్ లక్షద్వీప్, గో బ్యాక్ ప్రఫుల్ నినాదాలతో ఇల్లిల్లూ మారుమోగిపోతోంది. సముద్ర జలాల్లో మునిగి మరీ నిరసన తెలుపుతున్నారు. దేశద్రోహం కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు కేంద్రం జీవాయుధాన్ని ప్రయోగించిందన్న దాకా పరిస్థితి వెళ్లిపోయింది . అసలు లక్షద్వీప్‌లో ఏం జరుగుతోంది? అడ్మినిస్ట్రేటర్ వివాదాస్పద నిర్ణయాలేంటి? ద్వీప సముదాయంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. అరేబియా సముద్రంలో ప్రశాంతంగా ఉండే పగడపు దీవుల్లో చిచ్చు రేగింది. అభివృద్ధి పేరుతో తీసుకున్న నిర్ణయాలు అలల్లో అలజడి రేపాయి. కేంద్రం నియమించిన అడ్మినిస్ట్రేటర్ ఏకపక్ష నిర్ణయాలు ఇప్పుడా దీవుల్ని నిండా ముంచేసేలా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ 2020 డిసెంబర్ 4 వరకు ఎంతో ప్రశాంతంగా ఉండేది. పెద్దగా వార్తల్లోకి వచ్చింది లేదు. అదే రోజు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ దినేశ్వర్ శర్మ మరణించడంతో కేంద్ర ప్రభుత్వం దాద్రా నాగర్ హవేలి అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు... గుజరాత్ మాజీ మంత్రి అయిన ప్రఫుల్ పటేల్ లక్షద్వీప్‌ని మాల్దీవుల్లా మార్చేస్తానంటూ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన ప్రతిపాదనలతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్థానిక యంత్రాంగంతో మాట మాత్రంగానైనా చర్చించకుండా తీసుకున్న నిర్ణయాలు తమ జీవన విధానం, సంస్కృతిని దెబ్బ తీస్తోందన్న ఆందోళనతో స్థానికులు ఉద్యమిస్తున్నారు. సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (ఎల్డీఏఆర్) సంక్షోభంలోకి నెట్టేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షద్వీప్‌లో స్టార్ హోటళ్లు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ రిసార్టులు, హై ప్రొఫైల్æ బీచ్ ఫ్రంట్లు నిర్మిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగి ఉన్న దీవి కాస్తా పోతుందనే ఆందోళనలైతే ఉన్నాయి. మరోవైపు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లక్షద్వీప్ ప్రజలకు బాసటగా నిలిచారు. ప్రఫుల్ పటేల్‌ను తొలగించాలన్న డిమాండ్‌లో కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని ఈ ప్రతిపాదనల్ని నిలిపివేయాలని కోరింది. 36 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఈ అభివృద్ధి ప్రణాళికపై స్థానికులతో చర్చించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా లక్షద్వీప్ ప్రజలకి అండగా నిలబడి ప్రజా వ్యతిరేక విధా నాల్ని వెనక్కి తీసుకోవాలని ప్రధానికి లేఖ రాశారు. నేడు లక్షద్వీప్‌కు ప్రఫుల్ ఉద్యమం తారస్థాయికి చేరుకున్న వేళ తాను ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు ప్రఫుల్ పటేల్. సోమవారం నుంచి వారం రోజుల పాటు లక్షద్వీప్‌లో ఆయన పర్యటించనున్నారు. ద్వీపంలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించనున్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుపై మంతనాలు జరుపుతారు. వివాదాస్పద నిర్ణయాలివే ► గోవధపై నిషేధం, గోమాంసం అమ్మకం, రవాణా చేయకూడదు. అలా చేసిన వారికి ఏడాది జైలు, రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ► తమ సంస్కృతి, ఆహారపు అలవాట్లపై దాడి అని స్థానికులు భగ్గుమంటున్నారు ► ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న వారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నప్పటికీ ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత పిల్లల్ని కనకపోతే పోటీ చేయొచ్చు. ► ఈ దీవుల్లో ఉండే అత్యధికులు ముస్లింలు కావడంతో వారికి పిల్లలు ఎక్కువ. అందుకే ఇక్కడ ముస్లిం జనాభాని టార్గెట్ చేశారన్న అసహనం వారిలో కనిపిస్తోంది. ► మద్యంపై నిషేధం ఉన్నప్పటికీ జనాభా నివసిస్తున్న దీవుల్లో కూడా పర్యాటకులకు మద్యం సర్వ్ చేయడానికి అనుమతినిచ్చారు ► సమాజ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేవారికి వ్యతిరేకంగా గూండా చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. ► దేశంలోనే నేరాల రేటు అతి తక్కువగా ఉన్న దీవుల్లో ఇలాంటి కఠిన చట్టం అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అడ్మినిస్ట్రేటర్‌ని విమర్శించే వారిపైనే దీనిని ప్రయోగిస్తారన్న ఆందోళనలు నెలకొన్నాయి. ► గత ఏడాది కాలంగా లక్షద్వీప్‌లో కఠినమైన కోవిడ్ నిబంధనలు పాటించడంతో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు ఆ ఆంక్షల్ని తొలగించడంతో 8 వేల వరకు కేసులు నమోదయ్యాయి. 30 మంది వరకు మరణించారు. ► గ్రీన్ జోన్ ట్యాగ్ తొలగిపోవడంతో కోవిడ్ ఇంకెంత ప్రమాదకరంగా మారుతుందోనన్న భయం స్థానికుల్ని వెంటాడుతోంది. ► ఈ దీవుల్లో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఎక్కడైనా భూముల్ని తీసుకునే అధికారాలు, అక్కడున్న వారిని ఖాళీ చేయించే అధికారం ఎల్డీఏఆర్కు కట్టబెట్టారు. మైనింగ్, క్వారీయింగ్ కూడా చేయొచ్చు. స్థానిక యంత్రాంగంతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భారీ కట్టడాలు వచ్చి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్న విమర్శలు వస్తున్నాయి. ► వేటకు వెళ్లే మత్స్యకారుల పడవల్లో భద్రత కల్పించడానికి ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు. ూ నేరుగా జనం కదలికలపై నిఘా పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని నిరసనలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. లక్షద్వీప్ ప్రత్యేకతలు కేరళకు పశ్చిమాన 200 కి.మీ. దూరంలో ఉన్న లక్షద్వీప్ 32 ద్వీపాల సముదాయం. వాటిలో 10 ద్వీపాల్లో ప్రజలు నివసిస్తున్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలోని మలబార్ జిల్లాలో అంతర్భాగంగా ఉండే లక్షద్వీప్‌కు 1956లో కేరళ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇచ్చారు. ఇక్కడ జనాభా కేవలం 65 వేలు. వారిలో 96 శాతం మంది ముస్లింలు. వీరు జాలర్ల వృత్తిలో ఉన్నారు. పశుమాంసమే వీరికి ఆహారం. వీరికి ఏదైనా కావాలంటే కేరళ రాష్ట్రం మీదే ఆధారపడతారు. కొబ్బరి చెట్ల పెంపకం, పర్యాటకం, పశుపోషణ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ రాజకీయ ప్రాబల్యం ఇక్కడ ఎక్కువ. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడిప్పుడే తమ ఉనికిని చాటుకుంటున్నాయి. 2014 నుంచి ఎన్సీపీ నుంచి మహమ్మద్ ఫైజల్ ఎంపీగా ఉంటే పంచాయతీ మండళ్లలో కాంగ్రెస్‌కు పట్టు ఉంది. పర్యావరణం దెబ్బతింటుంది లక్షద్వీప్ ఏమైపోతుందోనన్న ఆందోళన కలుగుతోంది. వాతావరణ మార్పులతో ఏడాది పొడవునా సముద్రం ఎప్పుడు చూసినా అల్లకల్లోలంగా ఉంటోంది. తుఫాన్లు పెరిగిపోతున్నాయి. పగడపు దిబ్బలు తరిగిపోతున్నాయి. 1998లో 51శాతం ఉన్న పగడపు దిబ్బలు 2017 నాటికి 11 శాతానికి తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో భవన నిర్మాణాలు, తవ్వకాలు చేపడితే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. పర్యావరణ సమతుల్యత దెబ్బ తిని ద్వీపం మునిగిపోయే ప్రమాదం ఉంది – ప్రొఫెసర్ ఎస్.అభిలాష్, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కేంద్ర పాలిత’ యోచన లేదు
ఖైరతాబాద్ (హైదరాబాద్): జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు ఎలా తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం సీఎం కేసీఆర్‌కు ఉందని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకుల సమావేశం ఖైరతాబాద్ సరస్వతి విద్యామందిర్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గ్రేటర్ ఎన్నికల సమయంలో మాకు ఎంఐఎంతో పొత్తులేదన్నారు. మేము అనుకుంటే సీఎంను గద్దె దించుతామని ఎంఐఎం చెప్పుకొచ్చింది. మరి కేసీఆర్ ఏ మొఖం పెట్టుకొని ఎంఐఎం మద్దతుతో మేయర్, డిప్యూటీ మేయర్ గెలిపించుకున్నారో ప్రజలకు చెప్పాలి. హైదరాబాద్‌లో పాలన ఎలా ఉండాలి.. పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు ఎవరుండాలనేది దారుస్సలాంలో నిర్ణయమవుతోంది’అని అన్నారు. అప్పుల రాష్ట్రంగా... ‘తెలంగాణను వ్యతిరేకించిన వారు మంత్రివర్గంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం.. ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా తయా రైంది. ప్రజలు ఓటుతో కేసీఆర్‌ను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెడితే.. అది నా చెప్పుతో సమానమంటారు. ఇది ప్రజలను, రాజ్యాంగాన్ని అవమానించడమే. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాం తంగా చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ రాంచందర్‌రావు గెలుపు ఖాయమని’కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చిం తల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు -
ఆ రెండింటిపై హోం శాఖ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: గిల్గిట్ బాల్టిస్తాన్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలపై వస్తున్న తప్పడు సమాచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం సూచించింది. గిల్గిట్ బాల్టిస్తాన్, లడక్లపై సోషల్ మీడియాలో ఇటీవల షేర్ చేసిన సమాచారం ప్రామాణికమైనది కాదని హోంమంత్రిత్వ శాఖ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. దీనిపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. గిల్గిట్-బాల్లిస్తాన్పై ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ట్విటర్ ఖాతా ధ్రువీకరించబడినది కాదు. 31,000 మంది ఫాలోవర్స్ ఉన్న ఈ ఖాతా గిల్గిట్-బాల్టిస్తాన్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల అధికారిక ట్విటర్ ఖాతా కాదు’ అని ట్వీట్ చేసింది. కేంద్ర భూభాగానికి చేందిన లడఖ్ అధికారిక ట్విటర్ ఖాతాలు రెండు మాత్రమే ఉన్నాయని తెలిపింది. అవి @DIPR_Leh, @InformationDep4లు అధికారికమైనవని వెల్లడించారు. (భారత్‌పై పాకిస్తాన్ తీవ్ర విమర్శలు) The Union Territory of Ladakh has two official Twitter handles ie.“DIPR Leh Ladakh, @DIPR_Leh” & “Information Department Kargil, @InformationDep4” & only these two Twitter handles are used by the administration of Ladakh to disseminate data & to make all important announcements. pic.twitter.com/ESxRlTpP6Z — DIPR Leh Ladakh (@DIPR_Leh) May 12, 2020 ఇక 31వేల మంది ఫాలోవర్స్ ఉన్న ఖాతా నకిలీదని.. అది షేర్ చేసిన సమాచారం ప్రామాణికమైనదిగా పరిగణించలేమని చెప్పింది. కాగా లడక్ కేంద్రపాలిత ప్రాంతాలపై అధికారిక సమాచారం కోసం దయచేసి @DIPR_Leh & @ InformationDep4 ఖాతాలను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేసింది. వీటికి సంబంధించిన ప్రభుత్వ అధికారిక ఖాతాలు ఇవి రెండు మాత్రమే ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్, లడక్, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని గాని, ముఖ్యమైన ప్రకటనలను వీటి ద్వారానే అధికారులు ప్రకటించడం లేదా విడుదల చేయడం జరుగుతుందని వెల్లడిచింది. కాబట్టి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై, వాటికి సంబంధించి వస్తున్న సమాచారాలు, ప్రకటనలపై దేశ ప్రజలంతా జాగ్రత్త వహించాలని ట్వీట్లో పేర్కొంది. చదవండి: 20 ఏళ్లలో 5 వైరస్లు అక్కడినుంచే..! అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో -
అక్కడ తొలి కేసు.. 40కి చేరిన బాధితులు
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో భారత్ వ్యాప్తంగా కోవిడ్-19 బారిన పడినవారి సంఖ్య 40కి చేరింది. ఇరాన్, దక్షిణ కొరియా వెళ్లొచ్చిన ఇద్దరు వ్యక్తులు జ్వరంతో బాధపడుతుండటంతో వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. ఇద్దరిలో ఒకరికి పాజిటివ్ అని తేలగా.. మరొకరి మెడికల్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కాగా, కేరళలో ఆదివారం ఒక్కరోజే ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల ఇటలీ నుంచి వచ్చింది. వీరు ఎయిర్‌పోర్టులో అధికారులకు తప్పుడు సమాచారం అందించి, స్క్రీనింగ్ టెస్ట్‌ను తప్పించుకున్నారు. (చదవండి: భారత్ @ 39) అప్పటికే వ్యాధి సోకిన వీరి ద్వారా మరో ఇద్దరికి కరోనా వైరస్ వ్యాపించడంతో కేరళలో బాధితుల సంఖ్య 5 అయింది. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య (16 మంది ఇటాలియన్లతో కలుపుకుని) 39 అయింది. జమ్మూలో నమోదైన తాజా కేసుతో మొత్తం 40కి చేరింది. కాగా, నెల క్రితం కేరళలో మూడు కేసులు నమోదు కాగా, చికిత్స అనంతరం వారు కోలుకున్నారు. ఇదిలాఉండగా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తు న్న కరోనా వైరస్‌తో చైనా తర్వాత తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఇటలీ చేరింది. అక్కడ 5,883 కేసులో నమోదు కాగా..366 మంది ప్రాణాలు విడిచారు. (చదవండి: రంగుల కేళి.. కరోనాతో జాగ్రత్త మరి) (చదవండి: 37,000 దిగువన మరింత పతనం) -
డయ్యూ అభివృద్ధికి చేయూత
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని 100 స్మార్ట్ సిటీ ల జాబితాలో టాప్–10లో నిలిచిన మహా విశాఖ నగరం.. మరో స్మార్ట్ సిటీ అభివృద్ధికి చేయూతనందించనుంది. కేంద్ర పట్టణాబివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనల మేరకు కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూను సిస్టర్ సిటీగా దత్తత తీసుకుంది. ఈ నగరంలో రూ.1000 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టనున్నారు. వాటికి సంబంధించి సలహాలందించేందుకు జీవీఎంసీ సమాయత్తమవుతోంది. నగరాల్ని ఆర్థిక, సామాజిక, పర్యావరణ హిత సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. దేశంలో 5 విడతల్లో 100 నగరాల్ని ఎంపిక చేసి వాటిని రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తోంది. తొలి జాబితాలోనే ఎంపికైన విశాఖ నగరం.. స్మార్ట్ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. స్మార్ట్ ప్రాజెక్టుల అమల్లో విశాఖ నగరం ఆది నుంచి మంచి స్థానంలోనే కొనసాగుతూ కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం 9వ స్థానంలో కొనసాగుతున్న విశాఖ నగరం.. ఇటీవలే బెస్ట్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు అవార్డును సైతం సొంతం చేసుకుంది. టాప్–20లో దూసుకుపోతున్న నగరాల మాదిరిగానే.. అట్టడుగున ఉన్న నగరాలను అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. ట్వంటీ 20 ఫార్ములా.. దిగువ స్థాయిలో ఉన్న నగరాలు సైతం.. అత్యుత్తమ సిటీలుగా గుర్తింపు పొందేలా ప్రోత్సహించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ట్వంటీ ట్వంటీ ఫార్ములాను అమలు చేస్తోంది. టాప్–20లో ఉన్న నగరాలతో.. దిగువ స్థాయిలో ఉన్న 20 నగరాలను అనుసంధానించిది. ఇందులో భాగంగా విశాఖ నగరానికి సిస్టర్ సిటీగా కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ స్మార్ట్ సిటీని అనుసంధానించారు. ప్రస్తుతం డయ్యూ నగరం 80వ స్థానంలో ఉంది. ఈ నగర బాధ్యతను విశాఖ స్మార్ట్ సిటీ చేపట్టనుంది. సిస్టర్ సిటీల్లో భాగంగా.. ట్వంటీ 20 ఫార్ములా ప్రకారం ఏఏ బాధ్యతలను చేపట్టాలనే విషయాలపై ఈ నెలాఖరున రెండు నగరాలూ ఒప్పందం కుదర్చుకోనున్నాయి. రూ.498 కోట్ల ప్రాజెక్టులకు సలహాలు.. గుజరాత్ దక్షిణ ప్రాంత తీరంలోని అరేబియా సముద్ర తీరంలో 40 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న డయ్యూ నగరంలో 12.14 కిలో మీటర్ల మేర స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రూ.498.41 కోట్ల నిధులతో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీటి సరఫరా, స్మార్ట్ మొబిలిటీ, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, మురుగునీటి వ్యవస్థ, సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు, స్మార్ట్ స్కూల్స్ నిర్వహణ మొదలైన అంశాలపై డయ్యూ స్మార్ట్ సిటీకి విశాఖ నగరం సలహాలు అందించనుంది. నిధుల వినియోగంలో డయ్యూ వెనుకంజ.. డయ్యూ నగరాన్ని సిస్టర్ సిటీగా ఎంపిక చేశారు. నిధుల వినియోగంలో డయ్యూ స్మార్ట్ సిటీ వెనుకంజలో ఉంది. ప్రాజెక్టు ప్రణాళికలు, వాటిని ఆచరణలోకి తీసుకు రావడం మొదలైన అంశాల్లో సలహాలు ఇవ్వనున్నాం. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఒప్పందం జరిగిన వెంటనే.. ఇంజినీర్లను పంపించి.. టెండర్లను ఎలా రూపొందించాలి.. మొదలైన అంశాలపై సలహాలు, సూచనలు అందించి.. బెస్ట్ స్మార్ట్ సిటీగా డయ్యూను అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
భూతల స్వర్గం నరకంగా మారిన వేళ..
జమ్మూ: ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ.. కుటుంబానికో వ్యథ. తమ సంస్కృతిని మరచిపోయారు. సంప్రదాయాలు వదిలేశారు. ప్రాణ సమానంగా ప్రేమించిన సాహిత్యం, కవిత్వం, సంగీతం గుర్తు కూడా లేదు. ఇస్లాం ఉగ్రవాదుల దాడుల భయంతో మూడు దశాబ్దాల కిందట కట్టుబట్టలతో తమ సొంత గడ్డను వీడిన కశ్మీర్ పండిట్లలో ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రంలో మోదీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో తిరిగి మాతృభూమికి చేరుకోవాలని పండిట్లు అందరూ తహతహలాడుతున్నారు. 30 ఏళ్ల క్రితం 1990, జనవరి 19 అర్ధరాత్రి ఇస్లాం జీహాదీల ఊచకోతతో చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైన పండిట్లు అందరూ సోషల్ మీడియా వేదికగా ఒకటయ్యారు. తాము లోయను విడిచి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంలో హమ్ వాపస్ ఆయేంగే హ్యాష్ ట్యాగ్‌తో వారు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్‌గా మారాయి. కొందరు అప్పట్లో శ్రీనగర్ నుంచి జమ్మూకి కొన్న బస్సు టిక్కెట్లు షేర్ చేస్తూ ఉంటే, మరికొందరు పీడకలలా ఇప్పటికీ వెంటాడుతున్న ఆనాటి అనుభవాలను కథలు కథలుగా చెబుతున్నారు. ఇప్పటికైనా తమకు నష్టపరిహారం చెల్లించి లోయలో భద్రత కల్పించాలని ఆనాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ కవి సర్వానంద్ కౌల్ ప్రేమి కుమారుడు రాజేందర్ కౌల్ ప్రేమి డిమాండ్ చేస్తున్నారు. ఇక జమ్ములో ఆదివారం పండిట్లు కశ్మీర్ లోయని విడిచి పెట్టి 30 ఏళ్లయిన సందర్భంలో ఆల్ స్టేట్ కశ్మీరీ పండిట్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సొంతింటికి తాము తిరిగి వెళ్లేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూతల స్వర్గం నరకంగా మారిన వేళ.. మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో మైనర్లుగా ఉన్న పండిట్లపై ఇస్లాం వేర్పాటువాద తీవ్రవాదులు దాడులకు దిగారు. జేకేఎల్ఎఫ్, ఇతర ఇస్లాం జీహాదీలు హిందువులు ఇస్లాంలోకి మారాలని, మారకపోతే లోయని విడిచిపెట్టి పోవాలని లేదంటే చంపేస్తామంటూ హెచ్చరించారు. 1989–90 మధ్య కాలంలో వందలాది మంది కశ్మీర్ పండిట్లను చంపేశారు. మహిళలపై మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడ్డారు. హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేశారు. కశ్మీర్‌ని అల్లాయే పరిపాలించాలి అంటూ లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటనలు చేశారు. దీంతో ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని 5 లక్షల మంది వరకు కశ్మీర్ పండిట్లు లోయని విడిచిపెట్టి జమ్మూ, ఢిల్లీ వంటి ప్రాంతాలకు పారిపోయారు. మోదీ సర్కార్ ప్రణాళికలేంటి ? కేంద్రంలో మోదీ సర్కార్ కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు రచిస్తోంది. కశ్మీర్ ఘర్షణల్లో చెల్లాచెదురైన 5 లక్షల మంది పండిట్లను తిరిగి కశ్మీర్ లోయకి తెప్పించడానికి 2015లో రోడ్ మ్యాప్ రచించింది. వీరి కోసం సురక్షితమైన టౌన్‌షిప్‌లు నిర్మించాలని, అందులోనే షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, పాఠశాలలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేయడానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇప్పుడు కశ్మీర్‌ను తన పాలన కిందకి తెచ్చుకోవడంతో పాటు పండిట్లు కూడా తిరిగి సొంత గూటికి చేరుతామన్న డిమాండ్లతో అది కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి. -
భాగ్యనగరం కేంద్రపాలితమా ?
మన భాగ్యనగరానికి కేంద్రపాలిత ప్రాంతమయ్యే ప్రమాదం ఉందా? దాని వల్ల ఎవరికి ప్రయోజనం? రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా దిగజార్చడమే రాజ్యాంగంపైన దాడి, ప్రజాస్వామ్యంపైన అత్యాచారం. సంవిధాన పరంగా మన దేశం రాష్ట్రాల సమాహారం. రాష్ట్రాలతోనే దేశం మనుగడ ముడిపడి ఉంటుంది. అనేక కారణాల వల్ల లదాక్ ప్రాంత ప్రజలు తము ఢిల్లీ పాలకుల అధీనంలో ఉండాలని కోరుకున్నారు. జమ్మూకశ్మీర్‌తో కలిసి ఉండడం వల్ల వారికీ ఏ ప్రయోజనమూ లేదని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం కావడాన్ని లదాక్ ప్రజలు స్వాగతించారు. జమ్మూలోని అధిక సంఖ్యాక ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇక కశ్మీర్ ప్రజల్లో చాలామంది తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని దిగజార్చడంగా భావిస్తున్నారు. బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో 370 ఆర్టికల్ గురించి ప్రస్తావించిందేగానీ జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తానని చెప్పలేదు. కశ్మీర్ లోయలో వారే కాదు, సొంతంగా సమగ్ర రాష్ట్ర హోదాలో ఉన్న ఏ ప్రాంతం కూడా కేంద్రపాలిత ప్రాంతంగా దిగజారడానికి అంగీకరించదు. జమ్మూకశ్మీర్‌ను చీల్చి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడానికి కేంద్రం అనుసరించిన పద్ధతి, రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించిన తీరు పరిశీలిస్తే, దేశంలో ప్రజాస్వామ్యానికి, ఏ రాష్ట్ర స్వరూపానిౖకైనా ప్రమా దం వాటిల్లుతుందనే భయాలు కలుగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, తర్వాత మద్దతును ఉపసంహరించి, కేంద్రంలో తన పాలనాధికారాన్ని ఉపయోగించి కేంద్రపాలనను రుద్దింది. రాజకీయ సంక్షోభాన్ని రాజ్యాంగ సంక్షోభంగా దురన్వయం చేసి నిరంకుశ నిర్ణయం తీసుకున్నది. ఆర్టికల్ 3గానీ, ఆర్టికల్ 370 గానీ, మరే ఇతర సంవిధాన సూత్రాలనుగానీ కేంద్రం లెక్కచేయలేదు. జమ్ముకశ్మీర్ రాజ్యాంగ సభ అంటే శాసనసభగా భావించాలని ఆర్టికల్ 370ని సవరించడం ఒకటి. రద్దయిన శాసనసభ అధికారాలను పార్లమెంట్ వినియోగించు కోవచ్చనే మరో ఎమర్జన్సీ సూత్రాన్ని అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణకు దుర్వినియోగం చేయడం మరొకటి. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌ను కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిపారేయడానికి ఈ దారిలో ప్రయాణిస్తారనే అభిప్రాయాన్ని మీడియాలో బీజేపీ అభిమానులు నాటారు. ఇక దీని మీద వ్యాసాలు, ఉపన్యాసాలు, చర్చలు, ట్విట్టర్లో తిట్లు, ఫేస్బుక్లో లైక్‌లు మొదలైనాయి. ఇదివరకు సినిమా, క్రికెట్ తారలకు అభిమానులుండేవారు. తారలు సమైక్యంగా ఉన్నా వారి అభిమానులు కొట్టుకునే వారు. ఇదేం పిచ్చి అనుకున్నారే కాని అది విస్తరించి రాజకీయాలను ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. భక్తులనే మాట వాడుకలోకి వచ్చింది. వీరభక్తి తెప్పలుగా ప్రవహించడం మొదలైంది. పక్కనే వీరద్వేషపు కాలుష్యం మరొకటి. ఇవన్నీ సోషల్ మీడియాలో పారే మురికితో కలిసి బలీయమైన అభిప్రాయ నిర్ణాయక భూతాలుగా పెరుగుతున్నాయి. ఒకాయనైతే మీరు బానిసలు మేం భక్తులం కనుక మేమే గొప్ప అని ఛాతీ విప్పి చాటుకుంటున్నారు. అసమ్మతిని, భిన్నాభిప్రాయాన్ని తిట్టడానికి రెచ్చగొట్టే పదజాలం వాడుతున్నారు. భక్తులని ఇదివరకు అనబడేవారు ఇప్పుడు గుడ్డిబానిసత్వంలో పడిపోయి కారణాల విచారణను వదిలేస్తున్నారు. పూర్తిగా సమర్థించకుండా, విద్వేషపు జల్లులతో వ్యతిరేకించకుండా, సమతుల్యమైన విశ్లేషణ చేయవచ్చనే వివేకం వదిలేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఖతం చేయడానికో, ఆంధ్రలో రాజకీయంగా ఎదగడానికో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమే బీజేపీ వ్యూహమని అనుకుంటే అది రాజకీయ విజ్ఞతను అనుమానింప చేస్తుంది. సాధారణంగా కేంద్రం ఈ విధంగా తెలంగాణ రాజధానిని కైవసం చేసుకునే వాతావరణం ఉందనిపించడం లేదు. అయినా ఆ పనిచేస్తే తెలుగు ప్రజలలో అది కొత్త ముసలమై తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమానికి కొత్త ఊపిరులూదుతుంది. బీజేపీకి ఏవిధంగా లాభిస్తుందో వారే ఆలోచించుకోవాలి. దక్షిణాదిలో కూడా అగ్నిగుండాన్ని రాజేసే చర్యలు మంచివి కావనే సద్బుద్ధి వికసించాలి మరి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మారిన జమ్మూ కశ్మీర్ ముఖచిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ ముఖచిత్రాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సమూలంగా మార్చివేసింది. ఆర్టికల్ 370 రద్దును ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేస్తూ పలు వివరాలు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌ను రెండు ముక్కలు చేస్తూ జమ్మూ కశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. లడఖ్ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ప్రజలు కోరుతున్నారని అమిత్ షా చెప్పారు. జమ్మూ కశ్మీర్ ఢిల్లీ తరహాలో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుంది. ఇక కేంద్రం నిర్ణయంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది. అలాగే జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: కశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం -
పదేళ్లూ యూటీగానే హైదరాబాద్
పార్లమెంట్లో ఏం జరిగింది -15 (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 20.02. 2014 నాటి రాజ్యసభ కార్య క్రమాల వివరాలివి. ఆరోజు చిరంజీవి చేసిన ప్రసంగంలోని తదుపరి భాగం.) డిప్యూటీ చైర్మన్: నన్ను రూలింగ్ ఇవ్వనివ్వండి. చిరంజీవిగారూ! కూర్చోండి. నా తీర్పు చెప్పనివ్వండి. వెంకయ్యనాయుడు: సార్, మీ రూలింగ్ ఇచ్చే ముందు.. ఒక్క విషయం... నా మిత్రుడు నిజాన్ని విప్పి చెప్పినందుకు కృతజ్ఞతలు. ఆయనతో సంప్రదించలేదు. ఆయన మంత్రివర్గ సహచరులతో సంప్రదించలేదు. సీడబ్ల్యూసీ ఎవ్వర్నీ పరిగణనలోకి తీసుకోకుండా, బిల్లు ఎప్పుడొస్తుందో, ఎలా ఉంటుందో చెప్పకుండా చేశారని - ఆయన ఒక్క విషయం తెలుసుకోవాలి. ఆయన నాకు మంచి మిత్రుడు, మంచి నటుడు కూడా. అంటే, సభలో నటుడు అని కాదు. చిరంజీవిగారు, ఆయన రాష్ట్రంలో అత్యంత ప్రఖ్యాతి చెందిన నటుల్లో ఒకరని చెప్పక తప్పదు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, నేను ఈ పార్లమెంట్లో అనేక సంవత్సరాలుగా సభ్యుణ్ణి. మంత్రిమండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి మాట్లాడకూడదని అనేకసార్లు రూలింగ్ చెప్పారు. నిర్ణయం ఆయనకు ఇష్టం లేకపోతే మంత్రి మండలిలో ఉండకూడదు. మంత్రిమండలిలో కొనసాగా లంటే నిర్ణయాన్ని ఒప్పుకోవాలి. నిర్ణయం మీద తన అసమ్మతి తెలియజేయాలంటే మంత్రివర్గ సమావేశంలో తెలియజేయాలి. లేదా మీ పార్టీ మీటింగ్‌లో చెప్పాలి. రాజ్యసభలో మాట్లాడకూడదు. మాకు మార్గదర్శకంగా రూలింగ్ ఇవ్వవల్సిందిగా చైర్మన్గారిని కోరుతున్నా. డిప్యూటీ చైర్మన్: నన్ను రూలింగ్ ఇవ్వనివ్వండి. మొట్టమొదటగా, అధికార పక్షం తరఫున ఎవరు మాట్లా డాలో నిర్ణయించేది వారే. ఆ విషయంలో అధ్యక్షస్థానం ప్రమేయమే ఉండదు. రెండవది, మంత్రిగానీ సభ్యుడు గానీ ఏం మాట్లాడాలో వారి నిర్ణయం. ఇలా మాట్లాడా లని అధ్యక్షులు చెప్పడానికి కుదరదు. మూడవది, గవర్నమెంట్లో ఉంటూ గవర్నమెంట్ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చా? ఇది సభ్యుడి నైతిక విచక్షణకు చెందిన విషయం. చిరంజీవిగారూ! మీరు కొనసాగించండి. చిరంజీవి: కృతజ్ఞతలు. నాయుడుగారు నేను తెర మీదే కాని ఇక్కడ నటుడ్ని కాదు అన్నారు. దానిని ఒక అభినందన సర్టిఫికెట్‌గా భావిస్తున్నా. నేను ఎవరి తర ఫున మాట్లాడుతున్నాననేగా ప్రశ్న... నేను గాయపడిన ప్రజల తరఫున మాట్లాడుతున్నా. మనమందరమూ ప్రజాప్రతినిధులం. ప్రజల ఆవేదన వ్యక్తం చేయాలి. డిప్యూటీ చైర్మన్: ఇక ముగించండి. చిరంజీవి: ముగిస్తున్నా! గత మూడు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఐటీ రంగంలోగానీ, వైద్య సినిమా రంగంలోగానీ, అభివృద్ధి జరిగిందంటే అది సీమాంధ్ర ప్రజల సహకారం వల్లనే. అందుకే హైదరాబాద్‌ను యూటీ చేయమంటున్నాం. పదేళ్లు ఉమ్మడి రాజధాని అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి రాజధాని అనే పదానికి అర్థమేమిటో నాకు తెలియదు. ఉమ్మడి రాజధాని అంటే యూటీ అయ్యుండాలి. అప్పుడే రెండు ప్రభుత్వాలు పనిచేసే అవకాశం ఉంటుంది. అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో కూర్చొని పరిపాలన చేస్తారు. డిప్యూటీ చైర్మన్: ముగించండి. చిరంజీవి: చండీగఢ్ లాగే హైదరాబాద్‌ను యూటీ చెయ్యాలి. హైదరాబాద్ విద్యా ఉపాధి రంగాలకి జీవన రేఖ లాంటిది. ప్రజలు భౌతికంగా, ఉద్వేగపరంగా హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నారు. అందుకే నేను యూటీ చెయ్యమంటున్నా. కాని మనం ఉమ్మడి రాజ ధాని అని అంటున్నాం. రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే పదమే లేదని మనందరికీ తెలుసు. డిప్యూటీ చైర్మన్: ముగించండి - దయచేసి. చిరంజీవి: అయిపోయింది. సార్, తెలుగు ప్రజల ఆత్మగౌరవం, మర్యాద కాపాడండి. వారి హక్కుల్ని కాలరాయకండి. అందుకే నేను యూటీ అడుగుతున్నా. కనీసం ఆ పదేళ్లూ, ఆ మానసిక సౌకర్యం, ఇది నాది అనే భావన కల్పించాలి. గర్వంగా జీవించగలగాలి. సీమాంధ్ర నిర్మాణం జరిగి, అవకాశాలు పెంచుకున్న తర్వాత, అది తెలంగాణలో భాగమైపోతుంది. దయచేసి బిల్లులో ఈ సవరణ తీసుకురావాలని కోరుతున్నా. అలాగే బాగా వెనకబడ్డ కర్నూలు, అనంతపూర్ జిల్లాలను తెలంగాణలో కలిపితే, వారి తీవ్రమైన నీటి సమస్య కూడా పరిష్కరించబడుతుంది. అలాగే పోలవరం చాలా ముఖ్యమైనది. మొట్టమొదటి నదుల అనుసంధానం ప్రాజెక్టు. పోలవరం ఏ ఇబ్బందులూ లేకుండా పూర్తి కావాలని నేను అనేకసార్లు కోరాను. కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుని పూర్తి చేయాలి. ముంపుకు గురయ్యే గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే, ఆటంకాలు లేకుండా ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇక ఆస్తులు, అప్పులూ నిష్పత్తి ప్రకారం పంచాలి. సీమాంధ్రకు ఎదురయ్యే లోటు భర్తీకి ఏర్పాటు చేయాలి. ఈ లోటు భర్తీకి ఆర్థిక ప్యాకేజీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి. పదేళ్లపాటు పన్ను రాయితీలు, మినహా యింపులు ఇస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్యాకేజీ ఇవ్వాలి. మంత్రిగారిక్కడే ఉన్నారు. వారు దయతో ఈ ప్రాంత అభివృద్ధిని ఆశీర్వదించాలి. అందరికీ సమాన న్యాయం కలగాలని కోరుకుంటూ, ఈ సవరణలు చేయకుండా ఈ బిల్లు పాస్ కాకూడదని గట్టిగా కోరుకుంటున్నాను. థాంక్యూ. డిప్యూటీ చైర్మన్: ఇప్పుడు కుమారి మాయావతి... మాయావతి: ఉప సభాపతి గారూ! దక్షిణ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనే కొత్త రాష్ట్రాన్ని ఏర్ప ర్చటం ఆనందదాయకం. ... అంతరాయం... డిప్యూటీ చైర్మన్: మహిళను గౌరవించండి.. దయ చేసి ఇలా చేయకండి. గౌరవనీయులైన మహిళా సభ్యురాలు.. మాయావతి: మా పార్టీ దీనిని సమర్థిస్తోంది. డిప్యూటీ చైర్మన్: (అంతరాయం కలిగిస్తున్న సభ్యు లను ఉద్దేశించి) అలా చెయ్యవద్దు.. సహకరించండి. మాయావతి: ఆఖరుగా నిర్ణయం... డిప్యూటీ చైర్మన్: (అంతరాయం కలిగిస్తున్న సభ్యు లను ఉద్దేశించి) ఇలా చేయకండి.. తృణమూల్ కాంగ్రెస్ ఒక మహిళ నాయకత్వంలోని పార్టీ.. మీరు సీనియర్ సభ్యులు... మాయావతి: ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు తెచ్చారు.. ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలు చేయబడుతోంది. ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com -
హైదరాబాద్ యూటీ కాకుండా అడ్డుకున్నా
హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా కేంద్ర మంత్రివర్గంలో అడ్డుకున్నది తానేనని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అన్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదని ఆయన చెప్పారు. తెలంగాణలో ఏడాది తర్వాత ఎన్నికలు పెడితే గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని, రాబోయే రోజుల్లో బీజేపీతో ఇక్కడ టీఆర్ఎస్ జత కడుతుందని జైపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలంటే కాంగ్రెస్ నేతలు సెటిలర్లకు అండగా నిలవాలని ఆయన నాయకులకు తెలిపారు. -
‘యూటీ’ మాటే లేదు: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న హైదరాబాద్‌ను ఎన్డీయే ప్రభుత్వ హయాంలో కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేసే అవకాశం లేదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అలాంటి ఆలోచన మంచిది కాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సీమాంధ్రకు దక్కనందున ఇంకొక ప్రాంతానికి దక్కరాదనే ఆలోచన చేయకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ మంచి రాజధాని నిర్మించుకోవడం చక్కని పరిష్కారమవుతుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కల్పించిన ఐదేళ్ల ప్రత్యేక హోదా వ్యవధిని మరింతగా పెంచాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. -
టీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఓకే
-
హైదరాబాద్ యూటీ అంటే సహించం : నాగేందర్ గౌడ్
ఆలంపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూటీ అనేది ప్రజాస్వామ్య విరుద్ధమని, హైదరాబాద్‌పై తెలంగాణ ప్రజల హక్కును హరించాలని చూస్తే సహించబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే రంగారెడ్డి జిల్లా ఉనికి కోల్పోతుందన్నారు. తెలంగాణ తామే తెచ్చామని చెప్పుకుంటున్న ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రాయల తెలంగాణ అంశాన్ని లేవనెత్తడం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్, భద్రాచలం సహా ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకూ టీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంతో పాటు గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు బూత్ లెవెల్ కమిటీలను నియమిస్తున్నామని చెప్పారు. సోమవారం మేడ్చల్‌లో, 3న ధారూరు, 4న ఇబ్రహీంపట్నం, 5న పరిగి,పూడూరు, 6న వికారాబాద్, 7న చేవె ళ్ల. న వాబ్‌పేటలలో పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా హయత్‌నగర్‌కు చెందిన పొగాకు నర్సింహగౌడ్‌ను నియమించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం ఇన్చార్జి వంగేటి లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌ను ఢిల్లీ తరహా యూటీ చేయండి: జేడీశీలం
ఢిల్లీ: రాష్ట్రవిభజనపై కేంద్రం వేగం పెంచిన నేపథ్యంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కొత్తరాగం వినిపిస్తున్నారు. హైదరాబాద్‌ను ఢిల్లీ తరహా యూటీ చేయాలంటూ సీమాంధ్ర కేంద్రమంత్రి జేడీ శీలం డిమాండ్ చేశారు. దీనిపై రాజ్యాంగ సవరణ అందుకు అవసరమని అన్నారు. అయితే తాము చెప్పే అంశాలను జీ వోఎమ్ పట్టించుకోవడం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంటామని పేర్కొన్నారు. కాకపోతే హైదరాబాద్‌ను కనీసం ఐదేళ్లయినా యూటీ చేయాలంటూ కొత్తరాగాన్ని లెవనెత్తారు. రాష్ట్రవిభనపై ఓడిపోయాం లేదా గెలిచామని కాదు.. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామని శీలం తెలిపారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఓ ఉద్యోగి.. ఆయనకు కొన్ని హద్దులుంటాయని అన్నారు. అయితే కేంద్రపాలిత బాధ్యతను కేబినెట్ మంత్రులపైనే పెట్టామని ఆయన చెప్పారు. రాయలతెలంగాణ అంశాన్ని.. రాయలసీమ నేతలే తేల్చుకోవాలిని శీలం పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన సీడబ్య్లూసీ తీర్మానంలో 10 జిల్లాల తెలంగాణయే ఉందిని జేడీ శీలం స్పష్టం చేశారు. -
విభజన అనివార్యమనే భావన సరికాదు: లగడపాటి
రాష్ట్ర విభజన అనివార్యమని కొందరు నేతలు పేర్కొంటున్నారని, ఆ భావన సరైనది కాదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. బుధవారం న్యూఢిల్లీలో లగడపాటి మాట్లాడుతూ... పార్టీల తీర్మానం మేరకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. హైదరాబాద్‌ను కేంద్రంపాలిత ప్రాంతం చేస్తే విభజనకు అంగీకరిస్తామని కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం లేదని తెలిపారు. నేడు జరగనున్న కేంద్రం మంత్రుల బృందం సమావేశంలో ఏమీ తేలదని భావిస్తున్నట్లు లగడపాటి చెప్పారు. విభజన అంశం రాత్రికి రాత్రే తేలేది కాదని లగడపాటి వెల్లడించారు. -
రెండేళ్లు యూటీ?
-
హైదరాబాద్‌ను యూటీ చేయొద్దు
-
ఉమ్మడి రాజధానిగా జీహెచ్ఎంసీ?
-
ఉమ్మడి రాజధానిగా జీహెచ్ఎంసీ?
శాంతిభద్రతలు గవర్నర్ చేతికి.. జీవోఎం నివేదికలో సిఫారసులు ఆంటోనీ నివాసంలో అర్ధరాత్రి భేటీలో కాంగ్రెస్ పెద్దల ఖరారు రెండు రాష్ట్రాల్లోనూ ‘371డీ’ కొనసాగింపు జనాభా నిష్పత్తి ఆధారంగా ఆస్తులు, అప్పుల పంపిణీ సీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధికి ప్యాకేజీలు సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి కేంద్ర సంస్థల ఏర్పాటు.. ‘భద్రాచలం, రాయల తెలంగాణల’పై అసెంబ్లీ అభిప్రాయం ప్రకారం ముందుకు న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న డిమాండ్‌ను తిరస్కరించిన జీవోఎం.. జీహెచ్ఎంసీ ప్రాంతాన్ని ఉమ్మడి రాజధానిగా చేయాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతల పర్యవేక్షణను గవర్నర్‌కు అప్పగించాలని కూడా జీవోఎం తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనపై సుదీర్ఘ కసరత్తు చేసిన కేంద్ర మంత్రుల బృందం నివేదికకు, విభజన బిల్లు ముసాయిదాను కూడా బుధవారం రాత్రి రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నివాసంలో జరిగిన సమావేశంలో తుది రూపమిచ్చారు. జీవోఎం సభ్యుడు ఆంటోనీతో మరో సభ్యుడు జైరాం రమేశ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌లు సమావేశమై అర్ధరాత్రి దాటేవరకూ నివేదికపై చర్చించారు. పది పేజీలతో రూపొందించిన నివేదికలో పలు అంశాలను చేర్చారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం అందులో కీలకమైన అంశాలపై పలు సిఫారసులను చేర్చారు. గురువారం సోనియాగాంధీని కలిసి ఆమె సూచనల మేరకు ముసాయిదా బిల్లు, జీవోఎం నివేదికను కేబినెట్‌కు సమర్పిస్తారు. ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించిన మేరకు జీవోఎం నివేదికలో పొందు పరిచిన ముఖ్యాంశాలివీ... - హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న సీమాంధ్ర నేతల డిమాండ్‌ను తిరస్కరించారు. - జీహెచ్ఎంసీ పరిధిలో ఉమ్మడి రాజధాని చేస్తూ, శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతను గవర్నర్‌కు అప్పగిస్తారు. - విభజన బిల్లుతో పాటే ఆర్టికల్ 371డీని కూడా పార్లమెంటులో సాధారణ మెజారిటీతో సవరించవచ్చని, దానిని రెండు రాష్ట్రాల్లో కొనసాగించవచ్చని జీవోఎం పేర్కొంది. ‘ఈ 371డీ ఆర్టికల్ తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది’ అని నివేదికలో చేర్చారు. - తెలంగాణ విడిపోతే ఆ రాష్ట్రానికి విద్యుత్ కొరత ఎదురవుతుందన్న వాదనలను జీవోఎం కొట్టివేసింది. అలాంటిదేమీ ఉండదని, రాబోయే 25 నుంచి 35 ఏళ్ల వరకూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) ఉన్నాయని, అందులో తెలంగాణకు 56 శాతం, సీమాంధ్రకు 44 శాతం విద్యుత్ సరఫరా అయ్యేట్లు జెన్కో సహా ప్రయివేటు విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణకు విద్యుత్ కొరత ఉండదని పేర్కొంది. - జనాభా నిష్పత్తి ఆధారంగా ఆస్తులు, అప్పులు పంపిణీ చేయాలని జీవోఎం సిఫారసు చేసింది. - వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు సముచిత ప్యాకేజీలు ప్రకటించాలని చెప్పింది. - సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంత నేతలు చేస్తున్న ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. - సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి కేంద్రీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించింది. - భద్రాచలం, రాయల తెలంగాణ అంశాలపై సస్పెన్స్‌ను జీవోఎం కొనసాగించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. -
యూటీ చేయకుండా ఉమ్మడి రాజధాని సాధ్యమే: జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్రపాలిత ప్రాంతంగా మార్చకుండానే హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేయడం సాధ్యమేనని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి చెప్పారు. కేంద్రం కూడా ఇదే నమ్మకంతో ఉందన్నారు. ఒకవేళ అలాంటి వెసులుబాటు లేకపోతే పార్లమెంటులో కొత్త చట్టం తెస్తామని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, జాతీయస్థాయిలో విభజనకు అపూర్వ మద్దతు ఉందని అన్నారు. రాష్ట్ర విభజన విషయమై కేంద్రం ప్రస్తావించిన 11 అంశాలపై సోమవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ నేతల తరఫున తమ అభిప్రాయాలను జీవోఎంకు వివరిస్తామని తెలిపారు. ఈ మేరకు అందరి అభిప్రాయాలతో దాదాపు ఉమ్మడిగా నివేదిక రూపొందించామన్నారు. ఆదివారం కేంద్ర సహాయమంత్రి సర్వే సత్యనారాయణ నివాసంలో అందుబాటులో ఉన్న తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. విభజన నేపథ్యంలో ఏది సాధ్యం? ఏది అసాధ్యం? ఏది న్యాయం? ఏది అన్యాయమనే అంశాలపై చర్చించి నివేదిక తయారు చేసినట్లు తెలిపారు. ఇందులో కేంద్రానికి నిర్మాణాత్మక సూచనలు చేశామన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ నివేదికలోని అంశాలకు, తామిచ్చే నివేదికకు పెద్దగా వ్యత్యాసమేమీ లేదన్నారు. జీవోఎం అభిప్రాయాల సేకరణ అనంతరం విభజన బంతి ప్రభుత్వ పరిధిలోకి వెళుతుందని, విభజన నిర్ణయం పార్లమెంటు పరిధిలోనిదే తప్ప ప్రభుత్వానిది కాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ కొరత తీవ్ర మయ్యే అవకాశమున్న మాట నిజమేనని, అలాంటి అంశాలను ఏవిధంగా పరిష్కరించాలన్న దానిపైనే జీవోఎం అందరి అభిప్రాయాలను సేకరిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ 371(డీ) అధికరణను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విభజన బిల్లు ఆమోదం పొందేవరకు ఇలాగే వ్యవహరిస్తారని, ఆ తరువాత తమతో స్నేహపూర్వకంగానే ఉంటారని చెప్పారు. బాబుది పలాయనవాదం తొమ్మిదేళ్లు సీఎంగా, 10 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు సమన్యాయం అంటే ఏమిటని తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తిరిగి తననే ప్రశ్నించడం పలాయనవాదమే అవుతుందన్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం ఎలా చేస్తారనేది కేంద్ర డాక్యుమెంట్లో ఉంటుందని తెలిపారు. సీమాంధ్ర నేతలు ఏయే వేషాలు వేస్తున్నారో అక్కడి ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. రాష్ట్రాల విభజన విషయంలో ఆర్టికల్ (3) దుర్వినియోగాన్ని అడ్డుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పార్టీలకు చేసిన విజ్ఞప్తిని మీడియా ప్రస్తావించగా.. ‘రాజ్యాంగాన్నే తిరిగి రూపొందించాలనే గొప్ప మేధావులు వీళ్లు. అందరూ అభినవ అంబేద్కర్లు అయితే కష్టం. ఒక్క అంబేద్కర్‌తోనే ఇలా ప్రభావం ఉంది. ఇంతమంది అంబేద్కర్లు అయితే ఎలా పోతాం మనం?’’అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంబేద్కర్‌ను కించపర్చినట్లుగా ఉన్నాయనే భావన కలుగుతోందని పొంగులేటి చెప్పడంతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒక్కరే ఉన్నారని, ఆయన అసాధారణ మేధావి అని, రాజ్యాంగాన్ని మార్చాలంటూ అందరూ అంబేద్కర్‌లా మారితే గందరగోళంగా మారుతుందన్నదే తమ ఉద్దేశమని జైపాల్‌రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. జీవోఎంకు ఎంఐఎం ఇచ్చిన నివేదికతో స్థూలంగా అంగీకరిస్తున్నామని చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానంలో 10 జిల్లాలతో కూడిన తెలంగాణ అనే పదం లేనప్పటికీ కేబినెట్ నోట్లో మాత్రం ఈ ప్రస్తావన ఉందన్నారు. తాము రాయల తెలంగాణ కోరుకోవడం లేదని తెలిపారు. సీఎం పదవి కోసం తాము పోటీపడుతున్నామని జరుగుతున్న ప్రచారం హాస్యాస్పదమని జానారెడ్డి పేర్కొన్నారు. మా అందరి లక్ష్యం తెలంగాణ ఏర్పాటేనని, సీఎం ఎవరో హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. -
లీకులు.. షాకులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ‘ఉమ్మడి రాజధాని’పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లీకులు... జిల్లా ప్రజలను షాక్‌కు గురిచేస్తున్నాయి. యూటీ, సెమీ యూటీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధి అంటూ ఇలా రోజుకో ప్రకటన చేస్తూ అయోమయంలో పడేస్తోంది. మంత్రుల బృందం హైదరాబాద్ స్టేటస్‌పై ఇంకా నిర్దిష్ట ప్రకటన చేయన ప్పటికీ, ఆయా శాఖల కార్యదర్శులు, రాజకీయ పార్టీల నేతలతో జరుపుతున్న సంప్రదింపుల్లో ఉమ్మడి రాజధానిపై అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చే స్తోంది. ఈ క్రమంలోనే బయటకు పొక్కుతున్న అంశాలు జిల్లా అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందనే సంతోషం కన్నా.. జిల్లా ఉనికి దెబ్బతింటుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది కేవలం హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధి వరకే ఉంటుందని అంచనా వేశారు. అయితే, ఇటీవల జీవోఎం సంప్రదింపుల్లో ఉమ్మడి రాజధాని పరిధి కీలకాంశంగా మారింది. జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏ పరిధిని ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలని, పాలనా వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు వెలువడుతున్న సంకేతాలు జిల్లా ప్రజలను డైలమాలో పడేస్తున్నాయి. హైదరాబాద్ నగరపాలక సంస్థ(ఎంసీహెచ్)కు గ్రేటర్ హోదా కల్పిస్తూ 2007లో శివార్లలోని పది పురపాలక సంఘాలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఫలితంగా జిల్లాలోని 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గ్రేటర్లో అంతర్భాగమై పోయింది. దీంతో జిల్లా యంత్రాంగానికి ఈ ప్రాంతంపై పట్టు లేకుండా పోయింది. అభివృద్ధి కార్యక్రమాల అమలును పూర్తిగా గ్రేటర్ పాలకవర్గమే పర్యవేక్షిస్తుండటంతో కేవలం రెవెన్యూ వ్యవహారాలకే జిల్లా యంత్రాంగం పరిమితమైంది. మరోవైపు మంచినీటి సరఫరా వ్యవస్థ మెట్రో వాటర్ బోర్డు కనుసన్నల్లో ఉండటంతో ఇక్కడి ప్రజల బాగోగులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు ఆయా విభాగాల అధిపతులు ముఖ్య కార్యదర్శులు హోదా కలిగినవారు కావడంతో జిల్లా కలెక్టర్ పాత్ర నామమాత్రంగా మారిపోయింది. కేవలం సూచనలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిని కూడా అనూహ్యంగా పెంచడంతో జిల్లాలోని 22 మండలాలు మహానగరాభివృద్ధి సంస్థ ఆధీనంలోకి వచ్చాయి. భూములు, చెరువులు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర వ్యవహారాలన్నీ హెచ్ఎండీఏ గుప్పిట్లోకి వెళ్లాయి. తాజా ప్రతిపాదనలతో... హెచ్ఎండీఏ/ జీహెచ్ఎంసీ పరిధిలో పాలనా వ్యవహారాలు కేంద్రం పరిధిలోకి వెళితే జిల్లా ఉనికికి భంగం కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే ఇరుశాఖల అధిపత్యంతో జిల్లాలో పాలనా వ్యవస్థ మధ్య సమన్వయం లేకుండా పోయింది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర సర్కారు ఎత్తుగడలు ప్రజానీకాన్ని సందిగ్ధంలో పడేశాయి. ఉమ్మడి రాజధాని పరిధి హైదరాబాద్ వరకే పరిమితమవుతుందని తొలుత ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ఆలోచనలు.. సంప్రదింపులు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హెచ్ ఎండీఏ లేదా గ్రేటర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే రహస్య ఎజెండాను తెరమీదకు తెస్తే ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఈ శాఖల పెత్తనంతో జిల్లా రాబడిలో సింహభాగం రాజధానికే ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం తాజా ప్రతిపాదనలతో జిల్లా గ్రామీణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురయ్యే వీలు ఉంది. ఈ నేపథ్యంలో యూటీ, సెమీ యూటీ పై స్పష్టత వస్తేగానీ జిల్లా ప్రజల్లో ఉన్న ఆందోళనలు తొలిగేపోయే ఆస్కారముంది. -
జీవోఎం ముందు 'వట్టి' కోర్కెల చిట్టా
హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేయాలని రాష్ట్ర మంత్రి వట్టి వసంతకుమార్ మంత్రుల బృందానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మంత్రుల బృందం (జీవోఎం) ఎదుట తన కోర్కెల చిట్టా విప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని జీవోఎంను కోరారు. హైదరాబాద్ శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉంచాలని, హైదరాబాద్ రెవెన్యూ ఆదాయంలో 60 శాతం తమకు ఇప్పిస్తారని జీవోఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు.1956కు ముందు ఉన్న రాష్ట్రాన్ని తమకు ఇవ్వగలుగుతార అని జీవోఎంను ప్రశ్నించారు.తమ పార్టీ ఆదేశాల మేరకే నివేదికలిచ్చామని వట్టి ఈ సందర్బంగా గుర్తు చేశారు. తాను సంధించిన ప్రశ్నలను పరిష్కరించి ఆ తర్వాత విభజనపై ముందుకు వెళ్లాలని వట్టి వసంతకుమార్ జీవోఎంకు సూచించారు. -
'హైదరాబాద్‌ను యూటీ చేయాలి'
ఆర్టికల్ 371 (డి) రద్దు చేయడం కుదిరేపని కాదని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ సీవీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ శనివారం కాకినాడలో సమావేశమైంది. ఈ సందర్భంగా సీవీ మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ... రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే పదమే లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయన్నారు. రాష్ట్రపతి పాలన అనేది సరైన నిర్ణయం కాదని సీవీ మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఒప్పుకోం: ఎంఐఎం
-
హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఒప్పుకోం: ఎంఐఎం
హైదరాబాద్ : హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తేల్చి చెప్పారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒకవేళ విభజన అనివార్యమైతే రాయల తెలంగాణకే తాము మొగ్గు చూపుతామన్నారు. అసదుద్దీన్ కేంద్రపాలితం ఆలోచనే కాకుండా.. ఉమ్మడి రాజధానిపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని సహించేది లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. షరతులు లేని రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్నారు. విభజనపై ఏర్పాటు అయిన జీవోఎంకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ....మజ్లీస్ 46 పేజీల నివేదిక పంపింది. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు వెంటనే కొత్త రాజధాని ఏర్పాటు సత్వర చర్యలు చేపట్టాలని ఎంఐఎం తన లేఖలో కోరింది. విడదీయాల్సి వస్తే రాయలసీమలోని నాలుగు జిల్లాలను కలిసి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆపార్టీ సూచించింది. -
‘యూ’టీ టర్న్ వి‘భజన’
సాక్షి, విజయవాడ : ‘నేను వ్యక్తిగతంగా సమైక్యవాదినే. విభజన అనివార్యంగా కనపడుతోంది. ఇప్పటికే సీమాంధ్ర చాలా నష్టపోయింది. ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ’- నాలుగు రోజుల క్రితం నగరంలో పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన కేంద్ర మంత్రి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు. ‘నేనూ సమైక్యవాదిని. అయితే విభజన తప్పదు. ఒకవేళ సభలో ఓటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తే అనుకూలంగా ఓటు వేస్తాను. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్నది మా డిమాండ్.’ - రెండురోజుల క్రితం గుడివాడలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఊవాచ ‘హైదరాబాద్‌ను యూటీ చేస్తేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సీమాంధ్ర ప్రజల వాదనలను కేంద్ర మంత్రుల కమిటీ ముందుకు తీసుకువెళ్లాలి. మెజారిటీ ప్రజలు తెలంగాణ ను వ్యతిరేకించడం లేదు. అయితే సీమాంధ్ర సమస్యలు పరిష్కారం కావనే భయంతోనే ఉద్యమం వచ్చింది.’ - మంగళవారం మరో కేంద్ర మంత్రి జేడీ శీలం నగరంలో విలేకరులతో చెప్పిన మాటలు ఈ ముగ్గురు కేంద్ర మంత్రుల వ్యాఖ్యలలోని అంతరార్థం ఒక్కటే. తాము సమైక్యవాదులుగా ప్రకటించుకొంటూనే మరోవైపు విభజన తప్పదని ప్రజలకు సుతిమెత్తగా వివరించడం. రెండున్నర నెలలుగా ఉద్యమం పతాక స్థాయిలో సాగుతున్న దశలో రాజకీయ రాజధానిగా ఉన్న నగరం, జిల్లాలో కేంద్రమంత్రులు ప్రత్యేకంగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక అధిష్ఠానం వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా మైండ్‌గేమ్ అని అర్థమవుతోంది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర రాజధానిని నగరం పరిసరాల్లోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు ఈ వ్యాఖ్యలు ఇక్కడ నుంచే చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రులంతా ఒకే తరహా వ్యాఖ్యలుచేయడం ద్వారా ప్రజల్ని మానసికంగా విభజనకు సిద్ధం చేస్తున్నట్లు కనపడుతోంది. తద్వారా సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని చల్లార్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు తాము పట్టుబడుతున్నామని కేంద్రమంత్రులు కొత్తరాగం అందుకోవడమంటే విభజన తప్పదని సంకేతాలివ్వడమేనని తేలిపోతుంది. విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామా డ్రామాల పరంపర కొనసాగిస్తున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా కేంద్రమంత్రి పురందేశ్వరి వ్యాఖ్యలను సమర్థించడం ఆయన చిత్తుశుద్ధి ఏపాటిదో తేటతెల్లం చేస్తోంది. స్పీకర్ కార్యాలయం ముందు ధర్నా చేసైనా రాజీనామా ఆమోదింపచేసుకొని వస్తానని లగడపాటి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తన రాజీనామా ఆమోదించేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసును కూడా మంగళవారం ఆయన ఉపసంహరించుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎంపీలు, కేంద్ర మంత్రులు సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నట్లు భ్రమలు కల్పిస్తూ వచ్చారు. నాలుగైదురోజుల నుంచి వారి మాటల్లో వచ్చిన మార్పు చూస్తుంటే పదవుల్లో కొనసాగుతూనే విభజనకు సహకరిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్న కేంద్రానికి వీరు సహకరిస్తూనే.. సీమాంధ్ర ప్రజలను విభజనకు మానసికంగా సంసిద్ధం చేసే బాధ్యతను తమ భుజానికి ఎత్తుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఎక్కడికి వెళ్లినా సమైక్యతే తమ అజెండా అని, చివరకు అడ్డుకుంటామంటూనే.. విభజన తప్పకపోవచ్చంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. కేంద్రమంత్రులు ఏం చెప్పినా వినేందుకు తాము సిద్ధంగాలేమని, తమ వైఖరి మార్చుకోకపోతే తరిమికొట్టేందుకు వెనకాడబోమని జనం హెచ్చరిస్తున్నారు. -
హైదరాబాద్ యూటీ సాధ్యం కాదు: దిగ్విజయ్
-
హైదరాబాద్ యూటీ సాధ్యం కాదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయటం సాధ్యం కాదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ యూటీ ప్రతిపాదనకు సంబంధించి ఎవరితో మాట్లాడలేదని అన్నారు. రాజ్యాంగం, చట్టప్రకారం తెలంగాణపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై చర్చిస్తున్నట్లు దిగ్విజయ్ తెలిపారు. పనిలో పనిగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి విశ్వాసపాత్రుడని కితాబిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ నేత జేడీ శీలం...హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. -
యూటీ అంటే యుద్ధమే: మంద కృష్ణమాదిగ
హైదరాబాద్, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతం (యూటీ) చేయాలన్న ప్రతిపాదన వస్తే విద్యార్థులు ఢిల్లీపై యుద్దం ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తెలంగాణ ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై బుధవారం ఓయూలో అన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల రోజులపాటు ఉద్యమ కార్యాచరణను మందకృష్ణ ప్రకటించారు. కార్యాచరణలో భాగంగా.. ఈ నెల 30 నుంచి అక్టోబర్ 10 వరకూ అన్ని జిల్లా కేంద్రాలలో, యూనివర్సిటీలలో సదస్సులు నిర్వహించనున్నారు. అక్టోబర్ 15 నుంచి విద్యార్థి ప్రజా చైతన్య సైకిల్ యాత్రలు చేపట్టనున్నారు. అనంతరం అక్టోబర్ 30న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్విహ స్తారు. -
యూటీ అంటే యుద్ధమే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను యూటీ అని కిరికిరి చేస్తే యుద్ధమేనని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఓయూ జేఏసీ నేతలతో వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో విద్యార్థి గర్జన పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించాలనే ప్రతిపాదనతో ఓయూ జేఏసీ నేతలు శనివారం తెలంగాణ భవన్లో కేసీఆర్‌ను కలిశారు. అయితే.. అక్టోబర్ మొదటి వారంలోనే తెలంగాణపై చర్యలు ఉండే అవకాశముందని, ఆ తరువాతే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయించుకుందామని కేసీఆర్ సూచించారు. ‘ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ విదేశీ పర్యటన నుంచి వచ్చాకే తెలంగాణపై చర్యలు ఉండే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతనే ఉద్యమ కార్యాచరణపై మాట్లాడుకుందాం. ఎవరెన్ని ప్రయత్నాలు, కుట్రలు చేసినా 10 జిల్లాలతోనే తెలంగాణ వస్తుందనుకుంటున్నా. అయితే హైదరాబాద్‌పైనే కేంద్రం కిరికిరి పెడుతుందేమోనని అనుమానం వస్తున్నది. యూటీ అనే నేరుగా చెప్పకుండా శాంతి భద్రతలు, రెవెన్యూలో సీమాంధ్రకు వాటా వంటి పేచీ పెడ్తారేమో. ఇవి కూడా మన అనుమానాలే. హైదరాబాద్‌పై ఎలాంటి కిరికిరి పెట్టినా అంగీకరించేది లేదు. గల్లీ నుండి ఢిల్లీ దాకా అన్ని ప్రజా ఉద్యమాలను, విద్యార్థులను ఏకం చేద్దాం. తెలంగాణకు ఏ నష్టం జరిగినా పెద్దయుద్ధమే వస్తది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కొంచెం ఓపికతో చూద్దాం. ఏమన్నా జరిగితే విద్యార్థులే ముందుండి ఉద్యమాన్ని నడిపించాలె. లక్షమందితో నిజాం కాలేజీలోనే విద్యార్థి గర్జన పెట్టుకుందాం. భూకంపమే సృష్టిద్దాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్‌తో సమావేశమైన వారిలో ఓయూ జేఏసీ నేతలు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పిడమర్తి రవి, ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్యాదరి కిశోర్‌కుమార్, పల్లా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తుంగ బాలు, రాకేష్, మర్రి అనిల్, దుర్గం భాస్కర్, కందుల మధు, శంకర్ నాయక్, వడ్డె ఎల్లన్న, వెంకటేశ్, అంజిబాబు, అంజి యాదవ్, సంతోష్, రహీం, యాకయ్య తదితరులు ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భాష, యాసపై దాడి సమైక్య రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లోనే కాక.. తెలంగాణ యాస, భాష, సంస్కృతిపై భయంకరమైన దాడి జరిగిందని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకూ జిల్లాల్లో తెలంగాణ జాగృతి నిర్వహించబోయే ‘బంగారు బతుకమ్మ’ పోస్టర్‌ను తెలంగాణభవన్‌లో కేసీఆర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో హీరోలకు ఆంధ్రా భాషను పెట్టి.. విలన్లు, జోకర్లు, వ్యాంప్లతో తెలంగాణ యాసతో మాట్లాడిస్తున్నారని, ఇది దారుణమని విమర్శించారు. ప్రాంతాలను బట్టి వివిధ మాండలికాలు ఉంటాయని చెప్పారు. ఒకే జిల్లాలో కూడా ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య మాండలిక వ్యవహారాల్లో తేడాలుంటాయన్నారు. ఆంధ్రాలో బుల్లబ్బాయి అనే పేరు ఉంటుందని, హైదరాబాద్‌లో ఆ పేరుతో పిలిస్తే దవడ పగలగొడతారని చెప్పారు. బుల్లబ్బాయి అనేది తెలంగాణలో బూతులా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల్లో న్యూనతాభావం కల్పించేలా భాష, యాస, సంస్కృతిపై దాడి చేశారని చెప్పారు. ఉర్దూ పుట్టిన గడ్డ తెలంగాణ అని, ఈ ప్రాంతంలో తెలుగు, ఉర్దూ చెట్టాపట్టాలేసుకున్నాయని అన్నారు. ఆంధ్రా వారికి హిందీ రాదని, బ్రిటిష్ వారి ప్రభావంతో ఆంగ్లం తప్ప తెలంగాణ మాండలికాలపై అవగాహన లేదని వివరించారు. టీవీలు, సినిమాల ప్రభావం పెరిగిపోయిన తర్వాత సంస్కృతి, మాండలికాలు దెబ్బతిన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతికి పునరుజ్జీవం కల్పిస్తామన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ.. బంగారు బతుకమ్మ పేరుతో అన్ని తెలంగాణ జిల్లాల్లో 4 నుంచి 12 వరకూ బతుకమ్మలని నిర్వహించనున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహమూద్ అలీ, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, మాజీ ఎంపీ ఎ.పి.జితేందర్ రెడ్డి, నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు. -
యూటీ అంటే ఏమిటో తెలుసా?
కరీంనగర్: యూటీపై మాట్లాడేవారికి యూటీ అంటే ఏమిటో తెలియదని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి విమర్శించారు. యూటీ గురించి మాట్లాడేవారు ముందు అదేమిటో తెలుసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణపై యూపీఏ సమన్వయ కమిటీ ప్రకటన చేసిన అనంతరం సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమం ఊపందుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సీమాంధ్ర నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. తెలంగాణ బిల్లుపై జాప్యం జరిగేకొద్దీ రాష్ట్రంలో వైషమ్యాలు పెరుగుతాయన్నారు. తొలుత తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని తెలిపారు. తొందరగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడితే సీమాంధ్రులు చల్లబడతారన్నారు. గతంలో తెలంగాణలో ఉన్న హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదన అప్రజాస్వామికమని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
యూటీ అంటే అగ్గిబరాటాలే: ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేస్తామంటే ఉద్యమకారులంతా అగ్గిబరాటాలవుతారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం హెచ్చరించారు. తెలంగాణ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ విస్తృతస్థాయి సమావేశం, ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ పేరుతో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు హైదరాబాద్‌లో శుక్రవారం వేర్వేరుగా జరిగాయి. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో, ప్రేమ పునాదుల మీద హైదరాబాద్ భాగ్యనగరమైందన్నారు. అలాంటి హైదరాబాద్‌ను తెలంగాణ నుండి విడదీయాలనుకుంటే శరీరం నుండి తలను వేరు చేయాలనుకోవడమేనని వ్యాఖ్యానించారు. యూటీ అంటే అంగీకరించడానికి తెలంగాణవాదులు సిద్ధంగా లేరని తేల్చిచెప్పారు. 1956లో విలీనం కావడానికి ముందున్నట్టుగా హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌పై ఎవరో అధికారం చెలాయిస్తామంటే సహించేది లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకే పూర్తి అధికారం ఉండాలని చెప్పారు. 56 ఏండ్ల సీమాంధ్రుల పాలనలో నగరం పూర్తిగా ధ్వంసమైందని విమర్శించారు. చెరువులను పూడ్చివేసి, బాగ్లను ఆక్రమించి బంగళాలు కట్టుకున్నారని అన్నారు. హుస్సేన్‌సాగర్ చెరువులో మట్టిపోసి సినిమా థియేటర్ కట్టడమే అభివృద్ధా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో నిర్మించిన ఫ్లైఓవర్లు ఎవరింటికి దారి తీస్తాయో అందరికీ తెలుసునన్నారు. తెలంగాణలో ప్రాగాటూల్స్, హెచ్ఎంటీ, డీబీఆర్ మిల్స్, నిజాం సుగర్స్ వంటి ఫ్యాక్టరీల్లో తెలంగాణ వారే ఉద్యోగులుగా ఉండేవారని, వీటిలో సీమాంధ్రులకు స్థానం లేకపోవడంతోనే సీమాంధ్ర పాలకులు మూసేయించారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ఐదు జిల్లాల్లోని భూములను ఆక్రమించుకుని, వనరులను దక్కించుకున్నవారే అభివృద్ధి చేశామంటున్నారని ధ్వజమెత్తారు. ఎడ్ల బండి నీడలో నడిచే కుక్క బండిని మొత్తం లాగుతున్నట్టు భ్రమ పడ్డట్టుగానే హైదరాబాద్ విషయంలో సీమాంధ్రులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పాతబస్తీ కూడా బంజారాహిల్స్ స్థాయిలో అభివృద్ధి అవుతుందని ఆయన చెప్పారు. మరోసారి సీమాంధ్రుల కుట్ర సీడబ్ల్యూసీ, కేంద్రం ప్రకటించిన తెలంగాణను మరోసారి అడ్డుకోవడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు కుట్రలు చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. ప్రకటించిన తెలంగాణను కాపాడుకోవడానికి, తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయడానికి కార్యాచరణను జేఏసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలన్నారు. హైదరాబాద్‌పై కిరికిరిని అడ్డుకోవడానికి ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ నినాదంతో ఈ నెల 30న నగరంలో నిర్వహించే సదస్సుకు తెలంగాణవాదులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీఎన్జీఓలు హైదరాబాద్‌లో పెట్టుకున్న సభతో తెలంగాణ గుండె రగిలిపోతోందని ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్ చెప్పారు. హైదరాబాద్‌పై ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు నోటికొచ్చినట్లుగా వాగుతున్నారని, ఆయన పుట్టక ముందు నుంచే హైదరాబాద్ ఉందని చెప్పారు. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్ మాట్లాడుతూ... ప్రకటించిన తెలంగాణను కాపాడుకోవడానికి ఈ నెల 30న నగరంలో ‘స్వాభిమాన్’ మహాసభను నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. సీమాంధ్రులు నిర్వహిస్తున్న సమ్మెను వెంటనే విరమించుకోవాలని, పాఠశాలలు, కళాశాలలు తెరిపించాలని, బస్సులు నడిచేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాల్లో రసమయి బాలకిషన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు బాల్క సుమన్, జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీధర్, జేఏసీ అగ్రనేతలు పాల్గొన్నారు. -
విభజనేమైనా కాంగ్రెస్ ఇంటి సమస్యనా?
-
హైదరాబాద్ యూటీ అంటే యుద్ధమే: మంద కృష్ణ
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యుూటీ)గా చేస్తే కేంద్రంతో యుద్ధం తప్పదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేస్తే, తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమమే బలమైనదని 29న గుంటూరు సభలో నిరూపిస్తామన్నారు. తెలంగాణ వాదిగా తాను పాల్గొంటానని, 13 సీమాంధ్ర జిల్లాల నేతలు అదే సభలో పాల్గొని, ప్రత్యేకరాష్ట్ర వాదనను బలపరుస్తారన్నారు. సమైక్య ఉద్యమం నుంచి విద్యా సంస్థలు, ఆర్టీసీని మినహాయించాలన్న డిమాండ్‌తో ఇందిరాపార్కు వద్ద బుధవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలనే కుట్రలకు వ్యతిరేకంగా 21న లక్షమంది విద్యార్థులతో ఓయూలో యుద్ధభేరి సభ నిర్వహిస్తావున్నారు. -
పెద్దల భద్రతకు గట్టి చర్యలు!
న్యూఢిల్లీ: వయో వృద్ధుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వారి రక్షణకు సం బంధించి పోలీసింగ్ ఏర్పాట్లపై అత్యవసరంగా సమీక్షించి లోపాలను నివారించాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ పలు సూచనలు చేసింది. ఒంటరిగా నివసిస్తున్న వయో వృద్ధుల సమాచారం, నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించి వారికి తగిన సూచనలు చేయాలని కోరింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పోలీస్ స్టేషన్ వయో వృద్ధుల భద్రతకు చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు సమీక్షించేలా పోలీస్ ప్రధాన కార్యాలయం చర్యలు చేపట్టాలని తెలిపింది. రాత్రి, పగటి పూట కూడా పెట్రోలింగ్ నిర్వహించాలని మార్గదర్శకాల్లో సూచించింది. ధనవంతులైన వయో వృద్ధుల భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, వారి ఇళ్లలో పనిచేసే పనిమనుషులు, సిబ్బంది వివరాలను సేకరించాలని పేర్కొంది. కొద్ది దశాబ్దాలుగా ఉమ్మడి కుటుంబాల సం ఖ్య తగ్గటం, పిల్లలు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటం, సంతానం లేకపోవటం తదితర అంశాల వల్ల ఒంటరిగా నివసించే వృద్ధుల సంఖ్య పెరుగుతున్నందున సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు వ్యవహరించాలని సూచించింది. ‘వయో వృద్ధుల వివరాల రికార్డులను పోలీస్ ఉన్నతాధికారులు తరచుగా సమీక్షిస్తుండాలి. వారి నివాస ప్రాంతాల్లో గస్తీ పెంచాలి. సీనియర్ సిటిజన్ల భద్రత పర్యవేక్షణకు పోలీస్‌శాఖ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలి. నిరంతరం పనిచేసేలా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి’ అని మార్గదర్శకాల్లో పేర్కొంది. -
హైదరాబాద్ యూటీకి ఒప్పుకునేది లేదు
పరిగి, న్యూస్‌లైన్: ‘భౌగోళికంగా, సామాజికంగా.. ఇంకేవిధంగా చూసినా తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమే ... దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా (యూనియన్ టెరిటరీ)గా చేస్తామంటే ఒప్పుకునే’ ప్రసక్తే లేదని జేఏసీ, ఆయా సంఘాలు, యూనియన్ల నాయకులు తేల్చిచెప్పారు. పరిగి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం టీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెర్క సత్యయ్య అధ్యక్షతన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు - ప్రస్తుత పరిణామాలు అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ జేఏసీ, ఆయా ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముందుగా సమైక్య సభ సందర్భంగా తెలంగాణ విద్యార్థులపై దాడిని, అలాగే సభలో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్‌పై దాడిని ముక్తకంఠంతో ఖండించారు. తెలంగాణ అమరవీరులకు సంతాపంగా మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఆంధ్రా ప్రాంతంలో విలీనానికి ముందు హైదరాబాద్ అంతర్భాగంగా ఉన్న 10 జిల్లాల తెలంగాణనే కోరుకుంటున్నామని వక్తలు స్పష్టం చేశారు. పిడికెడుమంది పెట్టుబడిదారులు గోబెల్స్ ప్రచారంతో సీమాంధ్ర ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారెవరినీ వెళ్లిపోవాలని ఈ ప్రాంత ప్రజలు అనడం లేదని స్పష్టం చేశారు. బలవంతంగా కలిసుందామనటం నిరంకుశత్వమనీ, తెలంగాణను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జేఏసీ ఎప్పుడు పిలుపునిచ్చినా సమ్మె చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ బహుజనుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు ఎం.నాగేశ్వర్, విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి వెంకట్రాంలు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రాముయాదవ్, జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆంజనేయులు, విద్యార్థి జేఏసీ నియోజకవర్గ చైర్మన్ రవికుమార్, పట్టణ అధ్యక్షుడు మునీర్, నియోజకవర్గ కో కన్వీనర్ సాయిరాంజీ, పీఆర్టీయూ, యూటీఎఫ్ తదితర సంఘాల ప్రతినిధులు చంద్రమౌళి, రామాంజనేయులు, హరిలాల్, బిచ్చయ్య, శ్రీనివాస్, చందర్, యువజన సంఘాల నాయకులు శివకుమార్, తేజకిరణ్, మోహన్ పాల్గొన్నారు. -
హైదరాబాద్‌ను యూటీగా ఒప్పుకోం
హుజూర్నగర్, న్యూస్‌లైన్ తెలంగాణలో భాగంగా ఉన్న హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్ధాల కాలంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు అనేక ఉద్యమాలు, ఆత్మబలిదానాలు చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వెలువడిందన్నారు. హైదరాబాద్‌లోని సంపదను ఇన్ని రోజుల పాటు కొల్లగొట్టిన సీమాం ధ్రులు ఇంకా కొల్లగొట్టడానికే కుట్రలు పన్నుతున్నారన్నారు. సీమాం ధ్రలో జరుగుతున్న ఉద్యమం రాజకీయ పోరాటం మాత్రమే అన్నారు. ప్రజల ద్వారా వచ్చింది కాదన్నారు. హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణను మాత్రమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్వార్ధ ప్రయోజనాల కోసం చూడకుండా వెంటనే తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకే ప్రాంతానికి కొమ్ము కాయడం సరికాదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందించలేదన్నారు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, కోడిమల్లయ్యయాదవ్, జాల గురవయ్య, తిరుపతి వెంకయ్య, అన్నెపంగు రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌ను యూటీగా ఒప్పుకోం: అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి అంగీకరించే ప్రసక్తే లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు ఎంఐఎం నేతలను ఆహ్వానించేందుకు గురువారం దారుస్సలాంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయానికి ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వచ్చారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీని కలిసి బహిరంగసభకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ, సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఏపీఎన్జీఓలు చేపట్టబోయే సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. బహిరంగ సభకు హాజరయ్యేదీ లేనిదీ తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో కలిసి చర్చించి తెలియజేస్తామని చెప్పారు. -
ఏపీఎన్జీవోల సభ జరగనీయండి: డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సభకు ఎలాంటి ఆటంకం కలగనీయొద్దని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణవాదులను కోరారు. విభజన విషయంలో కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నించకుండా, విభజన వల్ల ఉద్యోగులకు వచ్చే సమస్యల పరిష్కారానికి మాత్రమే సభను వేదికగా ఉపయోగించుకోవాలని ఏపీ ఎన్జీవోలకు సూచించారు. టీఎన్జీవోల సభకు కూడా అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్జీవోలు, టీఎన్జీవోలతో ప్రభుత్వం మాట్లాడి చెరో తేదీని కేటాయిస్తే బాగుండేదన్నారు. హైదరాబాద్ మెట్రో అథారిటీ డెవలప్మెంట్ (హెచ్ఎండీఏ) పరిధిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన కేంద్రానికి లేదని చెప్పారు. కేంద్ర పాలిత ప్రాంతం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని, సీమాంధ్రకు ఒరిగేది కూడా ఏమీ ఉండదని అన్నారు. 10 జిల్లాల తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించిందని, ఈ ప్రక్రియలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కూడా భాగస్వాములను చేసిందని తెలిపారు. హైకమాండ్‌తో సీఎం ఏం చెప్పారో తనకు తెలియదని, అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నట్లు తెలిపారు. సీఎం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, ఆయన వ్యవహారాన్ని హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. విభజన జరిగితే సీఎం కాంగ్రెస్‌ను వీడి, వేరే పార్టీలోకి వెళతారని తాను అనుకోవడంలేదన్నారు. రాష్ర్ట విభజన నిర్ణయం వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే ప్రమాదముందని అంగీకరించారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటీకీ, ఒక్కోసారి రాజ్యాంగ ప్రక్రియను కొనసాగించాల్సి వస్తుందని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాకుండా అన్ని పార్టీల అభిప్రాయాల మేరకు ప్రజాస్వామ్యబద్దంగా విభజన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. విభజనపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని, రేపు ఇంకేమి మాట్లాడతారోనని ఎద్దేవా చేశారు. -
యూటీ ప్రతిపాదన ఉత్తిదే: దిగ్విజయ్‌సింగ్
టీ-కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ స్పష్టీకరణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయమే ఫైనల్ హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ ఏర్పాటు అటార్నీ జనరల్ అనారోగ్యం వల్లే ఈ ఆలస్యం ఆయన రాగానే ‘ప్రక్రియ’ మొదలవుతుంది టీ-కాంగ్రెస్ నేతలకు చెప్పిన పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ దిగ్విజయ్‌తో జానా, పొన్నాల, షబ్బీర్ భేటీ నీటి పంపకాలపై విద్యాసాగర్ నివేదిక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరిన దిలీప్‌కుమార్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తిదేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పార్టీ తెలంగాణ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ పార్టీ అత్యున్నత స్థాయిలో నిర్ణయం చేశాక దానిలో మార్పులు, చేర్పులుచేయటం ఆషామాషీ కాదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ‘విభజన విషయంలో అన్నీ ఆలోచించాకే వర్కింగ్ కమిటీ స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది. దాన్ని అమలు చేయాలన్నదే ఇప్పుడు మా ముందున్న లక్ష్యం. ఈ క్రమంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించి వారి అభ్యంతరాలను పరిశీలించటం మాకు ముఖ్యమే. ఇందులో భాగంగా హైదరాబాద్‌ను యూటీ చేయాలని చాలామంది నేతలు మా ముందు ప్రతిపాదనలు తెచ్చారు. వారు చెప్పినంత మాత్రాన హైదరాబాద్‌ను యూటీ చేయలేం. వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పడుతుంది. ఆ దిశగానే కసరత్తు జరుగుతోంది’ అని దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నట్లు టీ-కాంగ్రెస్ నేతలు తెలిపారు. ‘హైదరాబాద్ యూటీ అంటే మరోమారు సీడబ్ల్యూసీ చర్చించాలి. యూపీఏ పక్షాలను ఒప్పించాలి. దానికి ప్రతిపక్షాలు సైతం అంగీకరించాలి. ఇదంతా సాధ్యమయ్యేది కాదు. అలా చేస్తే కాంగ్రెస్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి యూటీ విషయంలో జరుగుతున్నదంతా ప్రచారమే. దానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని దిగ్విజయ్ చెప్పినట్లు వివరించారు. తెలంగాణ ప్రాంత రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, కపిలవాయి దిలీప్‌కుమార్, సాగునీటి రంగ నిపుణుడు విద్యాసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దయాసాగర్‌లు గురువారం ఉదయం ఢిల్లీలో దిగ్విజయ్‌ను కలిశారు. సుమారు అరగంట పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ యూటీ విషయమై జరుగుతున్న చర్చపై నేతలు ఆరా తీశారు. యూటీ ప్రతిపాదనకు ఇరు ప్రాంతాల నేతలు వ్యతిరేకమని, తెలంగాణ ప్రజలు దీనికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని స్పష్టంచేశారు. దీనిపై దిగ్విజయ్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, మీడియానే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొన్నట్లు సమాచారం. అటార్నీ జనరల్ రాగానే ప్రక్రియ మొదలు.. రాష్ట్ర విభజన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని టీ-కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌ను కోరారు. ప్రక్రియ ఆలస్యం జరుగుతున్నకొద్దీ అనేక అపోహలు తలెత్తుతున్నాయని చెప్పారు. దీనికి దిగ్విజయ్ స్పందిస్తూ ‘కొన్ని రోజులుగా కేంద్ర హోంమంత్రి షిండే అస్వస్థతతో ఉన్నారు. ఆయన కోలుకుని ప్రక్రియ మొదలుపెట్టే సమయానికి అటార్నీ జనరల్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన సోమవారం మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. ఆయన రాగానే కేబినెట్ నోట్‌పై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటాం. ఏయే అంశాలు పొందుపర్చాలో చర్చించి రెండు వారాల్లో నోట్‌ను రాష్ట్రపతికి పంపేలా కృషి చేస్తాం’ అని చెప్పినట్లు తెలిసింది. నీటి వివాదాలు భ్రమే... నీటి వివాదాలకు సంబంధించి సీమాంధ్ర నేతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర జల సంఘం మాజీ సభ్యుడు విద్యాసాగర్‌రావు ఈ సందర్భంగా దిగ్విజయ్‌తో పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదీ జలాల పరిధిలో ఉన్న ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల వివరాలతో కూడిన నివేదికను దిగ్విజయ్‌కు సమర్పించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు స్పష్టంగా ఉన్నాయని, విభజన జరిగినా అవే కేటాయింపులు కొనసాగుతాయని చెప్పారు. రాజోలిబండ, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలో మాత్రం నీటి పంపకాలు యధావిధిగా సాగేందుకు తుంగభద్ర బోర్డు తరహాలో ఓ బోర్డు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నట్లు తెలిసింది. ఇదిలావుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంతానికే పరిమితమన్నట్లు వ్యవహరిస్తున్నారని.. ఆయనను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ ఎమ్మెల్సీ, తెలంగాణ ఆర్ఎల్డీ నాయకుడు దిలీప్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. యూటీ ప్రసక్తే లేదన్నారు: జానారెడ్డి, పొన్నాల ‘హైదరాబాద్ యూటీ అన్న ప్రసక్తే లేదు. వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు పది జిల్లాల తెలంగాణే ఏర్పడుతుంది. యూటీ అంటే అది ఇంకో ఆందోళనకు దారితీస్తుందని చెప్పాం’ అని దిగ్విజయ్‌తో భేటీ అనంతరం మంత్రి జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య మీడియాతో పేర్కొన్నారు. యూటీపై అనవసర అపోహలు వద్దని, ఆ ప్రతిపాదన లేదని దిగ్విజయ్ చెప్పారని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ తెలిపారు. -
యూటీ ఆలోచనే వద్దు: పీఆర్టీయూ
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే ఆలోచనలు చేయవద్దని, హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదనకే కట్టుబడి ఉండాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) ప్రతినిధి బృందం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ ఇవ్వకుంటే.. సకల జనుల సమ్మె కోవలో మరోసారి సమ్మెకు సిద్ధమవుతామని ఆయనకు తెలిపింది. పీఆర్టీయూ ప్రతినిధి బృందం బుధవారం హోంమంత్రి షిండేతో సమావేశమైంది. అనంతరం బృందం సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రస్తావించిన అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని షిండే హామీ ఇచ్చినట్టు తెలిపారు. పీఆర్టీయూ ప్రతినిధి బృందంలో పీఆర్టీయూ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.సరోత్తమ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కె.జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి తదితరులున్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే సమరమే: కేటీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వకపోతే మళ్లీ సమరం చేస్తామని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ నేత కె.తారకరామారావు ఎంపీలు వివేక్, మంద జగన్నాధం, వేణుగోపాలచారిలతో కలిసి బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ను యూటీ చేయడం అంటే పెట్టుబడి, కబ్జాదారులకు కొమ్ముకాయడమేనన్నారు. హైదరాబాద్‌లో సమైక్య సభకు అనుమతివ్వడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. యూటీ అంటే తాటతీస్తాం: హరీష్ సిద్దిపేట: తలలు తెగిపడినా హైదరాబాద్‌ను యూటీగా ఒప్పుకోం అని టీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్ యూటీ అంటే తాట తీస్తామని మెదక్‌జిల్లా సిద్దిపేటలో బుధవారం ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఆదాయం అంతా కేంద్రానికి వెళుతుందనీ, అపుడు రెండు ప్రాంతాలకూ నష్టం జరుగుతుందన్నారు. యూటీ అంటే ఒప్పుకోం : ఈటెల సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం (యుూటీ)గా వూర్చేందుకు అంగీకరించబోవుని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ రూపొందించిన మహాశాంతి ర్యాలీ పోస్టర్‌ను ఈటెల రాజేందర్, తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ కన్వీనర్ కత్తి వెంకటస్వామి బుధవారం ఆవిష్కరించారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే మహా శాంతిర్యాలీలో లెక్చరర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. టీఎల్ఎఫ్ నేతలు సిద్దేశ్వర్, వసంత, గణేశ్, విజయకుమార్ పాల్గొన్నారు. యూటీ అంటే ఇరువురికీ నష్టమే: సీపీఐ సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రను అంగీకరించబోమని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేస్తే ఇరు ప్రాంతాలవారికీ నష్టమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే నారాయణ అన్నారు. యూటీ ప్రతిపాదనను ఎవరూ అంగీకరించరని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు విశ్వాసం కలిగించాలే తప్ప యూటీ పరిష్కారం కాదన్నారు. సమైక్యాంధ్రకు తాము అనుకూలం కాదని, ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే సభకు తాము హాజరుకాబోమని నారాయణ తెలిపారు. యూటీ అంటే ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తాం: దానం సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌ను యూటీ (కేంద్రపాలిత ప్రాంతం) చేయాలనే ప్రతిపాదన వస్తే తాము వ్యతిరేకిస్తామని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి దానం నాగేందర్ తెలిపారు. -
యూటీ అంటే ఉద్యమమే
శాడిస్టు ప్రేమికుల్లా సీమాంధ్ర నేతల కుట్రలు టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా మార్చాలని చూస్తే మరో మహోద్యమం తప్పదని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ దేవీప్రసాద్‌రావు హెచ్చరించారు. యూటీ చేయడంవల్ల ప్రభుత్వంలో స్థానిక ప్రజల భాగస్వామ్యం రద్దవుతుందని, దీన్ని సహించబోమన్నారు. ముల్కీ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం కరీంనగర్లో శాంతి ర్యాలీ, దీక్షల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన టీఎన్జీవోల భవనంలో మీడియాతో మాట్లాడారు. తమకు దక్కనిది ఇతరులకు దక్కకూడదన్న శాడిస్టు ప్రేమికుల్లాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌ను యూటీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో 7న జరుపతలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతివ్వాలని 10 రోజుల ముందే అనుమతి కోరితే నిరాకరించిన ప్రభుత్వం ఏపీఎన్జీవోల సభకు మాత్రం ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’కు అనుమతి కుట్రే సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట విభజన వద్దంటూ సభ నిర్వహించడం రెచ్చగొట్టడమేనని, హైదరాబాద్‌ను అశాంతి నగరంగా మార్చే కుట్రలో భాగంగానే ఈ సభకు అనుమతిచ్చారని ఆరోపించారు. తాము గతంలో ఎప్పుడు సభలకు అనుమతి కోరినా చివరి నిమిషం వరకు తేల్చకుండా ఇబ్బంది పెట్టిన పోలీసులు నాలుగు రోజుల ముందే ఈ సభకు ఎలా అనుమతిస్తారన్నారు. అసెంబ్లీ వద్ద గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల ఆందోళనలకు అనుమతించలేదని, మంగళవారం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ధర్నాకు మాత్రం పోలీసులు దగ్గరుండి రక్షణ కల్పించారన్నారు. ప్రభుత్వమే సీమంధ్ర ఉద్యమాన్ని నడుపుతోందన్న విషయం ఇప్పుడు రుజువైందని చెప్పారు. శాంతి ర్యాలీకి టీ మంత్రులే అనుమతి ఇప్పించాలని, ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలకైనా టీ మంత్రులే బాధ్యత వహించాలన్నారు. అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. ఉద్యోగుల అపోహలను కేంద్రం పరిష్కరించాలని దేవీప్రసాద్ కోరారు. -
కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్
-
యూటీ అంటే లూటీకి అంగీకరించినట్లే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను యూటీ చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ను అంగీకరించడమంటే సీమాంధ్ర పెట్టుబడిదారుల ‘లూటీ’ని ఆమోదించడమేనని టీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. శతాబ్దాల తెలంగాణ ప్రజల శ్రమతో నిర్మితమైన హైదరాబాద్‌ను కోల్పోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టంచేసింది. హైదరాబాద్ విషయంలో కేంద్రం విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు అంగీకరించరని పేర్కొంది. యూటీ ప్రతిపాదనను టీఆర్ఎస్ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పార్టీ నేతలు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ, దానికి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని ప్రకటిస్తూ సీడబ్ల్యూసీ చేసిన ప్రకటన శిలాక్షరమా? లేక నీటిరాతలా? అని ప్రశ్నించారు. సంపూర్ణ తెలంగాణ సాధించేంతవరకు టీఆర్ఎస్, తెలంగాణ సమాజం విశ్రమించదని తేల్చిచెప్పారు. ‘భావసారూప్యత కలిగిన రాజకీయపక్షాలు, రాజకీయేతర పక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి టీఆర్ఎస్ ఉద్యమిస్తుందని వెల్లడించారు. -
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీకరించం: టీఆర్ఎస్
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఒప్పుకోమని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తర్వాత సీమాంధ్రలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని మీడియాలో వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ స్పందించింది. తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం అని.. కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీకరించబోమని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. -
యూటీగా హైదరాబాద్: పీటీఐ కథనం
-
కేంద్రం పరిశీలనలో యూటీగా హైదరాబాద్
న్యూఢిల్లీ:తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అనంతరం కాంగ్రెస్ మరో ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అనంతరం హైదరాబాద్ ను చంఢీగడ్ తరహాలో ఉమ్మడి రాజధానిగా చేయాలని హైకమాండ్ పెద్దలు యోచిస్తున్నట్లు పీటీఐ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. చంఢీగడ్ తరహాలో హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసి, కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగించే అవకాశం ఉందని పేర్కొంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాష్ట్ర అంశంపై పీటీఐ ఓ కథనం ప్రచురించడంతో పార్టీ నేతలు మధ్య చర్చలు ఊపందుకున్నాయి. -
యూటీగా హైదరాబాద్! కేంద్రానికి సూచించనున్న హోం శాఖ!
ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి ప్రధాన సమస్యల్లో ఒకటిగా మారిన హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ పరిశీలిస్తోందని జాతీయ వార్తా చానళ్లు సీఎన్ఎన్-ఐబీఎన్, ఎన్డీటీవీ పేర్కొన్నాయి. ఏఐసీసీ వర్గాలను ఉటంకిస్తూ సోమవారం ఈ మేరకు కథనాలు ప్రసారం చేశాయి. పదేళ్ల దాకా కొత్త రాష్ట్రాలు రెండింటికీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, అనంతరం తెలంగాణలో కొనసాగుతుందని తొలుత కేంద్రం పేర్కొనడం తెలిసిందే. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో దీనిపై పునరాలోచన సాగుతోందని, ‘యూటీ’ ప్రతిపాదనను కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోందని ఆ చానళ్లు పేర్కొన్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌ను యూటీగా మార్చాలని కేంద్రానికి హోం శాఖ సూచించవచ్చని వివరించాయి. ఇక ఆంధ్రా రాజధానిగా విశాఖపట్నం, విజయవాడ పేర్లు ముందు వరుసలో ఉన్నట్టు పేర్కొన్నాయి. -
యూటీ అనేవారి నాలుకలు చీరేస్తారు: హరీష్‌రావు
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లేదా నగరంపై ప్రత్యేక హక్కులు కావాలనే వారి నాలుకలను తెలంగాణవాదులు చీరేస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు హెచ్చరించారు. ఇలాంటి డిమాండ్లు చేసేవారిలో కాంగ్రెస్ నేత చిరంజీవితో సహా ఎవరున్నా ఆ హెచ్చరిక అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి సమైక్యాంధ్ర పోరాట ంలో పాల్గొన్న వారికి పూలదండలు వేసి గౌరవిస్తున్న తీరుపై డీజీపీ జవాబివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతిదీక్షలో భాగంగా శనివారం గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది చేపట్టిన దీక్షను ప్రారంభించిన అనంతరం హరీష్‌రావు ప్రసంగించారు. చిరంజీవి హైదరాబాద్‌లో ఉండాలనుకున్నా, ఆయనకు ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉన్నా అందుకోసం ప్రయత్నించుకోవాలే తప్ప నగరంపై వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. హైదరాబాద్‌పై తెలంగాణవాదులకే హక్కులుంటాయని ఇందుకు వ్యతిరేక అభిప్రాయాలు, నిర్ణయాలు వచ్చినా ఇన్నాళ్లు ఓపికతో ఉన్న తెలంగాణవాదుల విశ్వరూపాన్ని చూడాల్సి వస్తుందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు వెనక్కుపోతుందంటున్న నేతలు వారి పార్టీల వైఖరిని స్పష్టంచేయాలని కోరారు. సొంత తమ్ముడితో సఖ్యంగా ఉండలేని నందమూరి హరికృష్ణకు ప్రాంతాలు విడిపోవద్దని కోరే అర్హత ఉందా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసిన హరికృష్ణ ఆయన తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన 610జీవో అమలుకోసం ఎందుకు పోరాడ లేదని నిలదీశారు. చంద్రబాబు తెలంగాణకు కట్టుబడింది వాస్తవం అయితే వెంటనే హరికృష్ణను పార్టీలోనుంచి సస్పెండ్ చేయాలని కోరారు. జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేయడం వల్లే హైదరాబాద్ నగరం ప్రస్తుత స్థాయిలో అభివృద్ధి చెందిందని అన్నారు. పారిశ్రామిక విస్తరణ కోసం 20 ఏళ్లలో తీవ్ర విధ్వంసం జరిగిందని ఆరోపించారు. ఐటీ, రియల్ ఎస్టేట్ వంటి వి అభివృద్ధి చెంది హెరిటేజ్ వంటి సంస్థలు పుట్టుకొచ్చి చేతి, కులవృత్తులను నాశనం చేశాయని అన్నారు. విభజనకు సహకరిస్తే రెండు చోట్లా వికాసం సాధ్యమని చెప్పారు. విద్య విషయంలో సీమాంధ్రులు వెనక బడి పోతారని కావాలనే కొందరు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిజాం కాలంలో నగరం చాలా అభివృద్ధి చెందిందని అన్నారు. టీఆర్ఎస్ అగ్రనేత కె.కేశవరావు ప్రసంగిస్తూ... తెలంగాణను అడ్డుకునేందుకు సినీ మాఫియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. హెచ్ఎండీఏ పరిధిలో 1.85లక్షల ఎకరాల వ్యవసాయ భూమి సీమాంధ్రుల చేతుల్లో ఉందన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణవారు పాన్‌షాపులు,తోపుడు బండ్లతో జీవనం సాగిస్తుంటే సీమాంధ్రులు షాపింగ్‌మాల్స్, మల్టిఫెక్స్ల స్థాయికి ఎదిగారని దుయ్యబట్టారు. రెండు లక్షలమంది ఉద్యోగులను తొలగించడం, తెలంగాణలోని 23 ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలను మూసివేయించారని ఆరోపించారు. అన్నిపార్టీల అభిప్రాయాలు తీసుకున తర్వాతే తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హైదరాబాద్ సంస్కృతి గురించి తెలియని వారే కేంద్ర పాలిత ప్రాంతం అనే డిమాండ్లు చేస్తారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌పై న్యాయబద్ధంగా కోరే హక్కులను వేటినైనా తెలంగాణవాదులు అభ్యంతరం చెప్పరని తెలిపారు. సీమాంధ్ర నేతలు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడవద్దని కోరారు. ప్రజాగాయని విమలక్క మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా దోపిడిదారులు ఉంటారని, వారిపై పోరాటం చేయక తప్పదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిమాణంపై దృష్టిసారించాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.అరవిందరెడి ్డ, జేఏసీ నేతలు వి.శ్రీనివాస్‌గౌడ్, దేవి ప్రసాద్, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ యూటీ చేస్తే అందరికి నష్టమే: దానం
త్వరలో తమకు ఎ.కే.ఆంటోని కమిటీ నుంచి పిలుపు వస్తుంది రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ శుక్రవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఆ సమయంలో హైదరాబాద్ ప్రాంత ప్రజల అభిప్రాయాలను మా నివేదిక ద్వారా ఆ కమిటీకి అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేస్తే అందరికీ నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని గౌరవించి తెలంగాణపై సీడబ్ల్యూసీ చేసిన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని దానం నాగేందర్ స్పష్టం చేశారు. సీఎం కిరణ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను అధిష్టానం ముందుంచారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను సమైక్యవాదినని ఎక్కడా చెప్పలేదన్న సంగతిని ఈ సందర్భంగా దానం నాగేందర్ గుర్తు చేశారు. -
యూటీ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే: దానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వాదనను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ తోసిపుచ్చారు. సీమాంధ్ర నేతల వాదనకు తలొగ్గి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. గాంధీభవన్ ఆవరణలో మంగళవారం దానం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ తెలంగాణలో భాగమేనని, ఈ విషయంలో సీడబ్ల్యూసీ తీర్మానాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర పాలిత ప్రాంతం ప్రతిపాదనను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గతంలో విజ్ఞప్తి చేస్తే కొత్త వాదనలను తీసుకురావొద్దని సోనియాగాంధీసహా హైకమాండ్ పెద్దలు చెప్పారని అన్నారు. అందుకే ఆ అంశం జోలికి తాము వెళ్లడం లేదన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ర్ట చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క బీసీ నేత కూడా ముఖ్యమంత్రి కాలేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని కూడా తొంగలో తొక్కారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీసీ నాయకుడినే ముఖ్యమంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. అందుకోసం తాను తెలంగాణ అంతటా విస్త్రతంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానని తెలిపారు. -
హైదరాబాద్‌ను యూటీ చేస్తే అగ్నిగుండమే
హైదరాబాద్ : హైదరాబాద్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను తాము అంగీకరించేది లేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అగ్నిగుండమే అవుతుందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని దానం తెలిపారు. ఆంటోనీ కమిటీ ముందు తమ వాదనలు వినిపిస్తామని దానం తెలిపారు. హైదరాబాద్‌పై అధిష్టానం పునరాలోచన చేస్తుందనే అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని దానం డిమాండ్ చేశారు. కాగా రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాల తీవ్రతను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని.. త్వరలోనే విభజన నిర్ణయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు నిన్న ఢిల్లీలో పేర్కొన్న విషయం తెలిసిందే. విభజన అనివార్యమైతే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా లేదా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాల్సిందేనన్నారు. -
హైదరాబాద్ మాదే.. యూటీగా వద్దు
* ఆంటోనీ కమిటీతో కాంగ్రెస్ టీ-నేతలు * ఉమ్మడి రాజధానిగా కూడా ఒప్పుకోం * శాంతిభద్రతలను కేంద్రం తీసుకుంటే అభ్యంతరం లేదు * రాయల తెలంగాణకూ ఒప్పుకునేది లేదు.. మా సంస్కృతులు వేర్వేరు * పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలి... ప్రక్రియలో వేగం పెంచాలి * నదీ జలాల పంపిణీపై రెగ్యులేటరీ అథారిటీ హామీ ఇస్తే సరిపోతుంది * సీమాంధ్ర ఉద్యమం వెనుక రాష్ట్ర పెద్దలు.. సీఎం, డీజీపీలపై ఆరోపణలు * అసెంబ్లీలో తెలంగాణ తీర్మానంపై ప్రత్యేకంగా చర్చించిన ఆంటోనీ కమిటీ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగానో లేక శాశ్వత ఉమ్మడి రాజధానిగానో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంటోనీ నేతృత్వంలోని కాంగ్రెస్ కమిటీకి స్పష్టంచేశారు. కావాలంటే హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో శాంతిభద్రతలను పూర్తిగా కేంద్రం అజమాయిషీ కిందకి తెస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నేతలంతా ముక్తకంఠంతో తోసిపుచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చేసిన తీర్మానం మేరకు హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు మాత్రమే తమకు సమ్మతమని తేల్చి చెప్పారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఇదే సమయంలో సీమాంధ్రలో ఆందోళనలను అదుపులోకి తెచ్చేలా వారికి త్వరగా రాజధాని, ప్యాకేజీలను ప్రకటించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. సీమాంధ్ర ఉద్యమం వెనుక పూర్తిగా రాష్ట్ర పెద్దలు ఉన్నారని, జాతీయ నేతల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా అక్కడి పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వారు కమిటీ ఎదుట ఆరోపించినట్లు సమాచారం. రాష్ట్ర విభజనపై సీమాంధ్రులు పలు అభ్యంతరాలు లేవనెత్తుతున్న తరుణంలో ఆంటోనీ కమిటీ సోమవారం రాత్రి తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయింది. ఈ సందర్భంగా.. విభజనలో నీటి పంపకాలు, హైదరాబాద్ అంశం, ఉద్యోగులు, విద్యార్థుల భద్రత, రాయల తెలంగాణ అంశం తదితరాలపై చర్చించారు. అలాగే.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌లతో కమిటీ ప్రత్యేకంగా సమావేశమై.. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం సాధ్యాసాధ్యాలపై చర్చించినట్లు తెలిసింది. ఎంసీహెచ్ పరిధి కేంద్ర అజమాయిషీ ఓకే.. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని.. మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ సీమాంధ్రులు వినిపిస్తున్నారని కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ప్రస్తావించినట్లు సమాచారం. దీనికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పందిస్తూ.. ‘హైదరాబాద్‌ను సీమాంధ్రులు అభివృద్ధి చేశారనటం అవాస్తవం.. అక్కడ వారు చేసిందేమీ లేదు. అక్కడ వనరులను, అవకాశాలను వాడుకొని బాగుపడ్డారంతే. హైదరాబాద్‌లో రాజస్థాన్, సూరత్, మహారాష్ట్ర ప్రజలూ ఉన్నారు. వారికి లేని అభద్రత సీమాంధ్రులకు అక్కర్లేదు’ అని పేర్కొన్నట్లు తెలిసింది. హెచ్ఎండీఏ పరిధిలో శాంతిభద్రతలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారని.. ఎంసీహెచ్ పరిధిలో శాంతిభద్రతలను కేంద్ర అజమాయిషీ కిందకు తెస్తే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు సమాచారం. రాయల తెలంగాణకు నో.. రాయల తెలంగాణ అంశాన్ని మరోమారు దిగ్విజయ్‌సింగ్ ప్రస్తావిస్తూ.. రాయలసీమలోని రెండు వెనకబడిన జిల్లాలను తెలంగాణలో కలిపితే నదీ జలాల అంశం పరిష్కారమవుతుంది కదా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి నేతలంతా మూకుమ్మడిగా అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ‘సీమ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి పూర్తి భిన్నంగా ఉంటాయి. తెలంగాణ ప్రజల మనస్తత్వం పూర్తిగా సౌమ్యంగా ఉంటే వారు అందుకు భిన్నంగా ఉంటారు’ అని యాదవరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కర్నూలు, అనంతపురం జిల్లాలు గతంలో తెలంగాణలో భాగమే కదా? అని దిగ్విజయ్ ప్రశ్నించగా.. దామోదర స్పందిస్తూ ‘1799లో టిప్పుసుల్తాన్ యుద్ధ సమయంలో తెలంగాణలో భాగంగా ఉన్న బళ్లారి, కర్నూలు, అనంతపురం, కడపలను సీడ్ చేశారు. ఇది జరిగి 200 ఏళ్లు గడిచింది. కాబట్టి వారికి, తెలంగాణ వారికి వైరుధ్యాలు అనేకం ఉన్నాయి’ అని చెప్పినట్లు తెలిసింది. సీడబ్ల్యూసీలో చేసిన తీర్మానం మేరకు పది జిల్లాల తెలంగాణే అంతా కోరుతున్నారని స్పష్టంచేసినట్లు సమాచారం. అలాగే.. నదీ జలాల వివాదాలకు సంబంధించి ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిగాయని, ఇంకా ఏవైనా సమస్యలు వస్తాయని భావిస్తే, రెగ్యులేటరీ అథారిటీ ద్వారా వాటిని పరిష్కారిస్తామని కేంద్రం వారికి బిల్లు సమయంలోనే హామీ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నట్లు తెలిసింది. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీ తీరును కమిటీ వద్ద టీ-నేతలు తప్పుపట్టిన ట్లు సమాచారం. అక్కడ రాజీవ్, ఇందిర విగ్రహాల ధ్వంసం జరుగుతున్నా సీఎం పట్టించుకోవటం లేదని, ఆందోళనలకారులు విచ్చలవిడిగా చెలరేగుతున్నా పోలీసు యంత్రాంగం చేతులు క ట్టుకుని చూస్తోందని ఆరోపించినట్లు తెలిసింది. దిగ్విజయ్ స్పందిస్తూ అక్కడి పరిణామాలన్నీ తమ దృష్టిలో ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. ఎవరు వస్తే వారి వాదనలు వింటాం: దిగ్విజయ్ పార్లమెంటు సమావేశాల్లో మంత్రులు బిజీగా ఉన్నందున హైదరాబాద్‌లో సమావేశం పెట్టలేకపోయామని దిగ్విజయ్‌సింగ్ భేటీ అనంతరం మీడియాతో పేర్కొన్నారు. ‘ఇలాంటి సమావేశం హైదరాబాద్‌లో జరగాల్సింది. అయితే పార్లమెంటులో సమావేశాల్లో మొయిలీ, ఆంటోనీ బిజీగా ఉన్నారు. అందువల్లఅక్కడికి వెళ్లలేకపోయాం. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇక్కడకు పిలిపించాం. వారి వాదనలు విన్నాం. రేపు కూడా ఈ సమావేశం జరుగుతుంది’ అని చెప్పారు. మంగళవారం ఎవరని పిలుస్తారు అని ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘నువ్వైనా రావచ్చు. ఎవరు వస్తే వారి వాదనలు వింటాం’ అని ఆయన బదులిచ్చారు. యూటీగా ఒప్పుకోం: ఉత్తమ్, గీతారెడ్డి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఒప్పుకునేది లేదని మంత్రులు గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు స్పష్టంచేశారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత విషయంలో ఎలాంటి చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అక్కడ ఉన్న ఇతర ప్రాంతాల వారి మాదిరే సీమాంధ్రులకు భద్రత ఉంటుందని తాము భరోసా ఇస్తున్నామన్నారు. ఆంటోనీ కమిటీతో భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సారయ్య, సుదర్శన్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, డిప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్క, మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్‌లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మధ్యలో వచ్చిన ఎంపీ రేణుకాచౌదరి సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. -
'హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించాలి'
హైదరాబాద్ నగరానికి రాష్ట్ర హోదా ఇచ్చి కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించాలని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ శుక్రవారం యూపీఏ సర్కార్‌ను డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి రాజకీయ కోణంలో రాష్ట్రాన్ని విభజిస్తున్నారని సెటిలర్స్ ఫ్రెంట్ ఆరోపించింది. రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నటికి క్షమించరని పేర్కొంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తమను ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మనడం సరికాదని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రాంత వాసులకు రక్షణ కల్పించేందుకు చట్టం చేస్తామని కాంగ్రెస్ చెప్పడాన్ని ఫ్రంట్ తప్పుబట్టింది. ముంబయిలో మహారాష్ట్రేతరులపై జరిగే దాడుల విషయంలో అలాంటి చట్టాలు చేశారా అని ఫ్రంట్ ప్రశ్నించింది. హైదరాబాద్‌పై పీటముడి ఏర్పడిన ప్రస్తుత సమయంలో అంబేద్కర్ సూచించినట్టు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా ప్రకటించాలని తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. రాష్ట విభజనను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని ఎన్జీవో నేత సాగర్ శుక్రవారం విజయవాడలో స్ఫష్టం చేశారు. కేంద్రమంత్రులు, సీమాంధ్ర నేతలు భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రమంత్రుల మౌనం సీమాంధ్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 12 అర్థరాత్రి నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సాగర్ స్పష్టం చేశారు. అలాగే సీమాంధ్రలో ఈ నెల 13 నుంచి గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు రాష్ట్ర గంథ్రాలయ సంస్థ అధ్యక్షుడు మధుసూదన్రాజ్ విజయవాడలో వెల్లడించారు. ఉద్యమంలో భాగంగా సీమాంధ్రలోని వెయ్యి గ్రంథాలయాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సీమాంధ్రలోని దాదాపు 15 వందల మంది గ్రంథాలయ ఉద్యోగులు ఆ సమ్మెలో పాల్గొంటారని మధుసూదన్రాజ్ తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే భవిష్యత్తులో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ యంవీఎస్ నాగిరెడ్డి శుక్రవారం విజయవాడలో వెల్లడించారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఇప్పటికైన స్పందించడం హర్షించదగిన పరిణమం అని ఆయన పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆనాడే సీఎం కిరణ్ అడ్డు చెప్పి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదని యంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని లేదా యూటీగా ఉంచాలి: చిరంజీవి
- రాజీనామాలతో ప్రయోజనం లేదని భావించాం: శీలం - కార్యాచరణపై ఢిల్లీలో సీమంధ్ర ప్రజాప్రతినిధుల భేటీ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కానీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని అలాకని పక్షంలో ఢిల్లీ తరహాలోగానీ ఉంచాలని కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ఆయన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇతర కేంద్రమంత్రులతో కలిసి దిగ్విజయ్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘చిదంబరం రాజ్యసభలో చేసిన ప్రకటన ప్రకారం.. కేబినెట్లో పెట్టబోయే బిల్లు కేవలం ‘తెలంగాణ విభజన పక్రియ మొద లుపెడతాం’ అని మాత్రమే ఉంటుంది. అంతేకానీ తుది నిర్ణయం కానీ, మిగతా అంశాలు ఎలా ఉంటాయన్న దానిపై నిర్ణయం ఉండదు. తుది బిల్లుకు ఇంకా సమయం ఉంది. అప్పుడు అందరితో చర్చిస్తారు..’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పునఃపరిశీలించే అవకాశముందా?’ అన్న ప్రశ్నకు ‘‘ఖచ్చితంగా ఉంది.. మా ప్రయత్నాలన్నీ ఆ దిశగానే జరుగుతున్నాయి’’ అని బదులిచ్చారు. ‘‘సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనలను దిగ్విజయ్‌సింగ్‌కు వివరించాం. విద్యార్థులు, రైతులు, ఎన్జీవోలు, ఉపాధి అవకాశాలు తదితర సమస్యలన్నింటినీ ఆయన దృష్టికి తీసుకువెళ్లాం. కమిటీని త్వరితగతిన ఏర్పాటు చేసి, పని చేసేలా చూడాలని కోరాం’’ అని జె.డి.శీలం తెలిపారు. దిగ్విజయ్‌ను కలవటానికి ముందు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 8 మంది కేంద్రమంత్రులు పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేకంగా సమావేశమై తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అస్వస్థతతో ఉన్న కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కిశోర్‌చంద్రదేవ్ మినహా మిగిలిన మంత్రులు - ఎం.ఎం.పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి, జె.డి.శీలం, కిల్లి కృపారాణి ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర విభ జన విధివిధానాలు ఇంకా ఖరారు కానందున ఈ దశలో తాము మంత్రి పదవులకు రాజీనామాలు చేయటం వల్ల ఫలితముండదన్న అభిప్రాయంతో ఉన్నామని భేటీ అనంతరం జె.డి.శీలం మీడియాతో పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని అధిష్టానాన్ని కోరుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలతో సహా సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు చేసిన ఏకగ్రీవ తీర్మానంతో ప్రధాని మన్మోహన్సింగ్ను, దిగ్విజయ్‌సింగ్‌ను కలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. దిగ్విజయ్‌ను కలిసిన తర్వాత పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్‌ను కూడా కలిశారు. మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలోనే ప్రధాని మన్మోహన్‌ను కలిసేందుకు అనుమతి కోరారు.