హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యుూటీ)గా చేస్తే కేంద్రంతో యుద్ధం తప్పదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేస్తే, తెలంగాణలో కాంగ్రెస్ లేకుండా చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమమే బలమైనదని 29న గుంటూరు సభలో నిరూపిస్తామన్నారు. తెలంగాణ వాదిగా తాను పాల్గొంటానని, 13 సీమాంధ్ర జిల్లాల నేతలు అదే సభలో పాల్గొని, ప్రత్యేకరాష్ట్ర వాదనను బలపరుస్తారన్నారు. సమైక్య ఉద్యమం నుంచి విద్యా సంస్థలు, ఆర్టీసీని మినహాయించాలన్న డిమాండ్‌తో ఇందిరాపార్కు వద్ద బుధవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలనే కుట్రలకు వ్యతిరేకంగా 21న లక్షమంది విద్యార్థులతో ఓయూలో యుద్ధభేరి సభ నిర్వహిస్తావున్నారు.