యూటీ అంటే యుద్ధమే: మంద కృష్ణమాదిగ | War would be started, if United territory proposal come on sight | Sakshi
Sakshi News home page

యూటీ అంటే యుద్ధమే: మంద కృష్ణమాదిగ

Published Thu, Sep 26 2013 2:50 AM | Last Updated on Tue, Oct 9 2018 5:22 PM

War would be started, if United territory proposal come on sight

హైదరాబాద్, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతం (యూటీ) చేయాలన్న ప్రతిపాదన వస్తే విద్యార్థులు ఢిల్లీపై యుద్దం ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తెలంగాణ ఉద్యమం భవిష్యత్ కార్యాచరణపై బుధవారం ఓయూలో అన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల రోజులపాటు ఉద్యమ కార్యాచరణను మందకృష్ణ ప్రకటించారు. కార్యాచరణలో భాగంగా.. ఈ నెల 30 నుంచి అక్టోబర్ 10 వరకూ అన్ని జిల్లా కేంద్రాలలో, యూనివర్సిటీలలో సదస్సులు నిర్వహించనున్నారు. అక్టోబర్ 15 నుంచి విద్యార్థి ప్రజా చైతన్య సైకిల్ యాత్రలు చేపట్టనున్నారు. అనంతరం అక్టోబర్ 30న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్విహ స్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement