ఆర్టికల్ 371 (డి) రద్దు చేయడం కుదిరేపని కాదని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ సీవీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ శనివారం కాకినాడలో సమావేశమైంది. ఈ సందర్భంగా సీవీ మోహన్రెడ్డి ప్రసంగిస్తూ... రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే పదమే లేదని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయన్నారు. రాష్ట్రపతి పాలన అనేది సరైన నిర్ణయం కాదని సీవీ మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు.