seemandhra lawyers jac
-
'హైదరాబాద్‌ను యూటీ చేయాలి'
ఆర్టికల్ 371 (డి) రద్దు చేయడం కుదిరేపని కాదని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ సీవీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ శనివారం కాకినాడలో సమావేశమైంది. ఈ సందర్భంగా సీవీ మోహన్‌రెడ్డి ప్రసంగిస్తూ... రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే పదమే లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపరమైన సమస్యలు వస్తాయన్నారు. రాష్ట్రపతి పాలన అనేది సరైన నిర్ణయం కాదని సీవీ మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
రాష్ట్ర విభజన ప్రక్రియపై సుప్రీంకోర్టులో పిల్
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియపై సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. కేబినెట్ ఆమోదం చట్ట వ్యతిరేకంగా జరిగిందని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా తెలంగాణపై నోట్‌ను కేబినెట్ ఆమోదించటాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. -
నగరంలో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సమావేశం ప్రారంభం
సీమాంధ్రలోని న్యాయవాదుల జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశం శనివారం గుడిమల్కాపూర్‌లోని అశోక గార్డెన్స్‌లో ప్రారంభమైంది. ఆ సమావేశానికి సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఆ సదస్సును అడ్డుకునేందుకు తెలంగాణవాదులు యత్నించారు. ఆ క్రమంలో వారు అశోక గార్డెన్స్ సమీపంలోని వాటర్‌ట్యాంక్ ఎక్కి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
28న హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదుల సభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విభజించవద్దని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ నేత సి.వి.మోహన్‌రెడ్డి శనివారం యుపీఏ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రభుత్వం ముందుకు వెళ్లితే సమైక్య ఉద్యమాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీ వరకు తీసుకువెళ్తామని ఆయన హెచ్చరించారు. శనివారం సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ అనంతపురంలో సమావేశమైంది. ఆ సమావేశానంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని న్యూఢిల్లీలో రాష్ట్రపతితోపాటు పలువురు ప్రముఖులను కలసి విజ్ఞప్తి చేస్తామన్నారు. అలాగే జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించే ఆలోచన కూడా ఉందన్నారు. విభజనపై న్యాయపరమైన అంశాలతోనే ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్నికి వ్యతిరేకిస్తూ ఈ నెల 29 వరకు జిల్లా కోర్టుల్లో విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 28న హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర న్యాయవాదుల సభను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నగరం అందరి సొత్తు అని మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ మిత్రులపై తమకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా కేసులు నమోదు అయిన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తామన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తాము ఎంత వరకైన పోరాడతామని సి.వి.మోహన్‌రెడ్డి వెల్లడించారు.