సీమాంధ్రలోని న్యాయవాదుల జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశం శనివారం గుడిమల్కాపూర్లోని అశోక గార్డెన్స్లో ప్రారంభమైంది. ఆ సమావేశానికి సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
అయితే ఆ సదస్సును అడ్డుకునేందుకు తెలంగాణవాదులు యత్నించారు. ఆ క్రమంలో వారు అశోక గార్డెన్స్ సమీపంలోని వాటర్ట్యాంక్ ఎక్కి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.