Mehdipatnam
-
మెహిదీపట్నం నుంచి కందవాడకు సిటీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: మెహిదీపట్నం నుంచి కందవాడకు బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు మెహిదీపట్నం–కందవాడ (592) రూట్లో మూడు ట్రిప్పులు ప్రతిరోజు రాకపోకలు సాగించనున్నాయి. ఈ బస్సులు నానల్‌నగర్, లంగర్‌హౌస్, టీకే బ్రిడ్జి, బండ్లగూడ, ఆరెమైసమ్మ, తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, గోల్డెన్‌ఫామ్స్, మల్కాపురం, పుల్లుట్ట, కేసారం, చేవెళ్ల మీదుగా కందవాడకు రాకపోకలు సాగిస్తాయి. మెహిదీపట్నం నుంచి ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1.30, సాయంత్రం 3.55 గంటలకు బయలుదేరుతాయి. అలాగే కందవాడ నుంచి ఉదయం 9.25 గంటలకు, మధ్యాహ్నం 2.45, సాయంత్రం 5.10 గంటలకు తిరిగి మెహిదీపట్నంకు బయలుదేరుతాయి. -
మెహిదీపట్నం స్కైవాక్‌కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: మెహిదీపట్నం చౌరస్తాలో ఏర్పాటు చేయనున్న స్కైవాక్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. స్కైవాక్ కోసం అవసరమైన భూమిని అప్పగించేందుకు రక్షణ శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే స్కైవాక్ నిర్మాణ పనులను పునరుద్ధరించనున్నారు. వాహనాల రద్దీ, అత్యధిక జనసమ్మర్థం కలిగిన మెహిదీపట్నం కూడలిలో పాదచారులు నలువైపులా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు అనుగుణంగా స్కైవాక్ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ స్కైవాక్ విస్తరణకు అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ మేరకు రక్షణ శాఖతో సంప్రదింపులు జరిపారు. కానీ అప్పట్లో భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ అధికారులు ససేమిరా అనడంతో పనులు నిలిచిపోయాయి. ఉప్పల్ స్కైవాక్ పూర్తి చేయడంతో పాటు మెహిదీపట్నం స్కైవాక్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ స్థలం లభ్యత సవాల్‌గా మారడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం స్కైవాక్‌కు అవసరమైన 3,380 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు రావడంతో పనులు పరుగులు పెట్టనున్నాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఫలించిన సీఎం రేవంత్‌రెడ్డి చొరవ.. ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లేవారి భద్రత దృష్ట్యా మెహిదీపట్నంలో స్కైవే నిర్మించాలనే ప్రతిపాదనలు ఎప్పటినుంచే ఉన్నాయి. కానీ.. రైతు బజార్ ప్రాంతంలో ఉన్న తమ భూములను ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించకపోవటంతో పీటముడి పడింది. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అత్యంత రద్దీ ఉండే మెహిదీపట్నం రైతు బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరిగిపోయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే సిటీలో ట్రాఫిక్ రద్దీని అధిగమించే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా రక్షణ శాఖ మంత్రిని కలిశారు. మెహిదీపట్నంలో ఉన్న రక్షణ శాఖ భూములను తమకు బదిలీ చేయాలని కోరారు. ఈ మేరకు అక్కడ ఉన్న డిఫెన్స్ జోన్‌కు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్పులకు అనుగుణంగా స్కైవే డిజైన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు అధికారులు మార్పులు చేశారు. సవరించిన కొత్త ప్రతిపాదనలను ఇటీవలే కేంద్రానికి పంపించారు. దీంతో స్కైవే నిర్మాణానికి అవసరమైన మేరకు భూముల కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. మొత్తం 3,380 చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది. బదిలీ చేసిన భూములకు బదులుగా కేంద్రం డిఫెన్స్ విభాగానికి రూ.15.15 కోట్ల విలువైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కలి్పంచాల్సి ఉంటుంది. మరికొంత స్థలానికి పదేళ్ల పాటు లైసైన్స్ రుసుం చెల్లించాలనే నిబంధన విధించింది. నాలుగు వారాల్లోనే ఈ భూములను అప్పగించేందుకు కేంద్ర రక్షణ శాఖ అంగీకరించింది. దీంతో మెహిదీపట్నం స్కై వాక్ పనులకున్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. ముంబై హైవేలో అత్యంత కీలకమైన రైతు బజార్ జంక్షన్లో ట్రాఫిక్ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. వీలైనంత త్వరగా స్కైవే నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
కొరియర్ వచ్చిందని చెప్పి..
సాక్షి, లంగర్‌హౌస్: కొరియర్ వచ్చిందంటూ పలు మార్లు ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో బెదిరించి బంగారు గొలుసు లాక్కెళ్లిన యువకుడిని లంగర్‌హౌస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఐ ముజీబ్ ఉర్ రెహమాన్, డీఎస్సై రాఘవేంద్ర స్వామిలతో కలిసి ఆసిఫ్‌నగర్ ఏసీపీ శివమారుతి వివరాలు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన సయ్యద్ హమీద్ మెహిదీపట్నంలోని ఓ హాస్టల్లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన అతను తన తమ్ముడి ఫీజు కట్టడానికి చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను డెలివరీ చేసే ప్రాంతాలను పరిశీలిస్తూ అదును కోసం ఎదురు చూస్తున్నాడు. నెల రోజుల క్రితం మారుతీ నగర్‌లోని ఓ ఇంట్లో డెలివరీ ఇచ్చాడు. సదరు వృద్ధురాలు ఒక్కరే ఉండటంతో పలుమార్లు అక్కడ చోరీకి ప్రయత్నించిన విఫలమయ్యాడు. ఈ నెల 23న మరోసారి ఆమె ఇంటికి వెళ్లిన హమీద్ కొరియర్ వచ్చిందని చెప్పాడు. అయితే ఆమె డోర్ తీయకుండా తన కుమారుడు వచ్చాకే అతనికే ఇవ్వాలని చెప్పింది. అదే రోజు పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లి కొరియర్ తీసుకోవాలని ఒత్తిడి చేసినా ఆమె నిరాకరించింది. సాయంత్రం అతను వెళ్లిపోయాడని భావించిన వృద్ధురాలు తలుపులు తెరిచి చూడగా పక్కనే దాగి ఉన్న సయ్యద్ ఇంట్లోకి దూరి ఆమెను కత్తితో బెదిరించి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 29న అతడిని అదుపులోకి తీసుకుని, సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులకు రివార్డులు.... సయ్యద్ హెల్మెట్ ధరించి ఎలాంటి ఆధారాలు లేకుండా చోరీ చేసినా పోలీసులు చాకచక్యంగా అతడిని పట్టుకున్నారు. కేసును ఛేదించిన కానిస్టేబుళ్లు మొహమ్మద్ మిన్హజుద్దీన్ ఖాన్, వల్లపు క్రిష్ణ, అరవింద్‌కుమార్‌లకు రివార్డులు అందించి అభినందించారు. (చదవండి: ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినా.. ) -
మెహదీపట్నం ప్రీమియర్ ఆసుపత్రిలో దారుణం
-
Hyderabad: 15 రోజులకు రూ.16 లక్షలు వసూల్.. అయినా దక్కని ప్రాణం
సాక్షి, హైదరాబాద్: మెహదీపట్నం ప్రీమియర్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. చికిత్స కోసం వచ్చిన ఓ రోగి వద్ద రూ.16 లక్షలు వసూలు చేసి ఆస్పత్రి వైద్యులు అతనికి మృతికి కారణమయ్యారని బంధువులు ఆరోపించారు. సబ్జి మండికి చెందిన జై కిషన్ గంగపుత్ర (54) గుండెనొప్పితో 15 రోజులు క్రితం ఆసుపత్రికి రాగా.. ట్రీట్మెంట్ పేరుతో భారీగా డబ్బులు దండుకున్నారు. అయినా సరైన వైద్యం అందించక పోవడంతో అతను చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. జై కిషన్ భార్య రాజ్యలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అతని ఆకస్మిక మరణంతో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. తక్షణమే ప్రభుత్వం, మంత్రులు , పోలీసులు స్పందించి ప్రీమియర్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే! -
తుపాకీతో సంచరిస్తున్నారని..
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్ తండాలో.. ఇద్దరు కొత్త వ్యక్తులు తుపాకీతో తిరుగుతున్నారని స్థానికులు వారిపై దాడికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఐలాపూర్‌లో తమ పూర్వీకులకు చెందిన భూములు కోర్టు వివాదంలో ఉన్నాయని, వాటిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టి విక్రయిస్తున్నారని ఫొటోలు, వీడియోలు తీసి కోర్టులో దాఖలు చేసేందుకు హైదరాబాద్ మెహదీపట్నంలోని మురారీనగర్కు చెందిన అన్నదమ్ములు వాజిద్, జావేద్ బుధవారం ఉదయం బైక్‌పై తండాకు వచ్చారు. వీరిని గమనించిన గ్రామ సర్పంచ్ భర్త రవి, కొత్త వ్యక్తులు తమ ప్రాంతంలో ఫొటోలు తీస్తున్నారని, వారి వద్ద రివాల్వర్ కూడా ఉందని కొందరు గ్రామస్తులతో కలసి వారిపై దాడికి దిగారు. అనంతరం వారిని అమీన్పూర్ పోలీసులకు అప్పగించారు. విచారణలో అమీన్పూర్ పోలీసులు జావేద్, వాజిద్‌ల వద్ద ఉన్నది లైసెన్స్ రివాల్వర్‌గా గుర్తించారు. తమకు సంబంధించిన భూముల్లో ఆక్రమణల ఫొటోలు తీసుకునేందుకు వెళ్లగా, సర్పంచ్ భర్త రవి, గ్రామస్తులను ఉసికొల్పి దాడి చేశాడని వారు డీఎస్పీ భీమ్‌రెడ్డికి తెలిపారు. అయితే రివాల్వర్‌తో ఆ ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని అందువల్లే గ్రామస్తులతో కలసి ప్రతిఘటించామని రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన జావేద్, వాజిద్‌లను తొలుత స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించి, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నలుగురికి రిమాండ్ : జావేద్, వాజిద్‌లపై దాడి చేసిన ఘటనలో అమీన్పూర్ పోలీసులు రవితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బుధవారం రాత్రి పటాన్చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఈ ఘటన వివరాలను మీడియాకు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నలుగురిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు. పోలీసులు ఈ ఘటనలో ఓ రివాల్వర్‌తోపాటు ఏడు తూటా లను, సర్పంచ్ భర్త ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో ల్యాండ్ మాఫియాకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అండదండలు ఉన్నాయని పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఆరోపించారు. అయితే దీనిని పోలీసులు కొట్టిపారేశారు. ఈ కేసుతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటన వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని డీఎస్పీ స్పష్టంచేశారు. -
పాతబస్తీలో కాషాయజెండా
రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రం ఇచ్చే పథకాలను తమ పథకాలుగా పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. బీజేపీ భారతీయుల పార్టీ, అన్ని వర్గాల వారిని గౌరవిస్తుంది. ముస్లిం మహిళల మేలు కోరే త్రిపుల్ తలాఖ్‌ను మోదీ రద్దు చేశారు. దేశం కోసమే 370 ఆర్టికల్‌ను రద్దు చేశారు. అధికారంలో ఉండే పార్టీకి తొత్తులా మారి అసదుద్దీన్ పబ్బం గడుపుకుంటున్నారు. హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టించి లబ్ధిపొందడం మజ్లిస్ పార్టీకే చెల్లింది. పాతబస్తీలో మజ్లిస్ ఆగడాలను ధైర్యంగా ఎదుర్కొన్నందువల్లే ఆలె నరేంద్రను టైగర్‌గా, బద్దం బాల్‌రెడ్డిని గోల్కొండ సింహంగా ప్రజలు పిలుచుకున్నారు. మజ్లిస్ గూండాగిరి కారణంగానే నందరాజ్ గౌడ్, పాపన్నలు బలయ్యారు. – గోల్కొండlసభలో బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్/గోల్కొండ: పాతబస్తీ నుంచి మజ్లిస్‌ను తరిమికొట్టి కాషాయ జెండాను ఎగరేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పునరుద్ఘాటించారు. నియంతృత్వం, అవినీతి, కుటుంబ పాలన విముక్తే లక్ష్యంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’రెండో రోజైన ఆదివారం మెహిదీపట్నం, షేక్‌పేట్, గోల్కొండ కోట మీదుగా సాగింది. ఈ సందర్భంగా షేక్‌పేట్ నాలా వద్ద సభలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులను పెంచిపోషిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి పార్టీలకు తగిన బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పాతబస్తీలో ఉండే ప్రతి హిందువు ధైర్యంగా ఉండాలని సూచించారు. వారికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మెట్రో, ఎంఎంటీఎస్ సేవలను పాతబస్తీకి విస్తరింపజేయాలని డిమాండ్ చేశారు. తద్వారా ఆ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. 2023 ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తామని, మొదటి సభను భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తన యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ అధినేతలకు నిద్రపట్టడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై తప్పుడు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతోందని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమని అన్నారు. యాత్ర ఇన్చార్జ్ కోలార్ ఎంపీ మునిస్వామి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రానికి రూ.65 వేల కోట్ల అప్పులు ఉండేవని, ప్రస్తుతం రూ. 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని విమర్శించారు. పూల వర్షం కురిపిస్తూ... మెహిదీపట్నంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో శనివారం రాత్రి బస చేసిన సంజయ్ ఆదివారం ఉదయం యాత్రను ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ.. బతుకమ్మ, బోనాలతో స్వాగతం పలికారు. కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల నుంచే కాకుండా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. యాదవ సంఘాలకు చెందిన కొందరు యువకులు దున్నపోతులను తెచ్చి వాటిపై సవారీ చేస్తూ యాత్రలో అందరి దృష్టిని ఆకర్షించారు. -
టెన్త్ చదివిన ‘డాక్టర్’ గుట్టు రట్టు!
-
టెన్త్ చదివిన ‘డాక్టర్’ గుట్టు రట్టు!
సాక్షి, హైదరాబాద్: చదివింది పదో తరగతి. చేసేది డాక్టర్ వృత్తి. అదేంటీ టెన్త్ చదివితే డాక్టర్ అవ్వొచ్చా? అని ఆశ్చర్యపోకండి. మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బయటపడిన నకిలీ డాక్టర్ వ్యవహారంలో ఇలాంటి ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫేక్ సర్టిఫికేట్‌తో డాక్టర్ అవతారం ఎత్తిన ప్రబుద్ధుడి సమాచారం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందింది. దాంతో సదరు ప్రైవేటు ఆస్పత్రిపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. టెన్త్ చదివి డాక్టర్‌గా చలామణి అవుతున్న ఫేక్ డాక్టర్ ముజిబ్, ఆస్పత్రి నిర్వాహకుడు షోహెబ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను అసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిందెవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. (కొంపముంచిన ఓఎల్ఎక్స్ బేరం!) -
భర్త అనుమానం.. భార్య దారుణం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మెహదీపట్నం ఫ్లైఓవర్ సమీపంలో గల బస్టాండ్ వద్ద సోమవారం రాత్రి కలకలం రేగింది. అక్రమ సంబంధం పేరిట భార్యను భర్త అనుమానించడంతో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బిడ్డ తనకు పుట్టలేదంటూ అనుమానిస్తున్నాడని తన భర్తతో నడిరోడ్డుపైనే ఘర్షణకు దిగింది. భర్తపై కోపంతో తన చేతిలోని చిన్నారిని రోడ్డుపై పడేసింది. తనపై కోపం చిన్నారిపై చూపడమేంటని భర్త ఆమెపై చేయిచేసుకున్నాడు. ఇదంతా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల కంటబడింది. పోలీసులు భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించి అక్కడ నుంచి పంపించారు. ఈ ఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. గొడవ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
భర్తపై కోపంతో చిన్నారిని రోడ్డుపై పడేసిన భార్య
-
పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. తీవ్ర భయాందోళన!
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి వద్ద శనివారం ఉదయం నడిరోడ్డు మీద పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడింది. పిల్లర్ నంబర్ 273 వద్ద ఫుల్ లోడ్‌తో ఉన్న ట్యాంకర్ బోల్తాపడటంతో రోడ్డు నిండా పెట్రోల్ లీకవుతోంది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది... వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని పెట్రోల్ పారిన చోట నీళ్లు చల్లారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించారు. సంఘటనాస్థలికి సమీపంలోని కాలనీవాసులను ఖాళీ చేయించారు. ట్రాఫిక్‌ను కూడా దారిమళ్లించారు. దీంతో మెహిదీపట్నం నుంచి ఆరాంగర్ రూట్లో ప్రయాణికులు మొదట ఇబ్బంది ఎదుర్కొన్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పీవీఎక్స్ప్రెస్వేపైనా తాత్కాలికంగా రాకపోకలను నిలిపేశారు. అనంతరం పోలీసులు, సహాయక సిబ్బంది బోల్తా పడిన ట్యాంకర్‌ను తొలగించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ క్లియర్ అయింది. వాహనాలు ప్రస్తుతం యథాతథంగా రాకపోకలు సాగిస్తున్నాయి. -
వృద్ధురాలిని బంధించి నగలు, నగదు దోపిడీ
హైదరాబాద్: మెహిదీపట్నం ప్రాంతంలోని పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 35 వద్దనున్న దిల్షాద్ నగర్లో దోపిడీ జరిగింది. ఆ ప్రాంతంలోని గులాం ముస్తఫా ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధురాలు అయిన ఆయన భార్య స్వకత్ ఫాతిమాను బంధించారు. ఇంట్లో ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలు, రూ.2000 నగదు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యుల నుంచి చోరీ సమాచారం తెలుసుకున్న అసిఫ్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. టాస్క్ఫోర్సు డీసీపీ లింబారెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంకులు తెరవకపోవడంతో జనం పాట్లు
-
లాక్మీ సంస్థ 29వ ఫ్రాంచైజీ సెలూన్
-
నడిచే హక్కుకోసం పోరు..
మెహదీపట్నం సమీపంలోని కరోల్‌బాగ్ కాలనీవాసి కాంతిమతి కన్నన్. పాదచారుల సమస్యలపై కొన్నేళ్లుగా తన గళాన్ని వినిపిస్తున్నారు. ‘ఈ నగరంలో రోజుకి ఒక పాదచారి యాక్సిడెంట్లో చనిపోతున్నారని మీకు తెలుసా?’ అంటూ ప్రశ్నిస్తారామె. పాదచారుల హక్కుల పట్ల పాలకులు, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నంత కాలం ఈ తరహా సంఘటనలు పెరుగుతూనే ఉంటాయన్నారు. జనాభాలో 70 శాతం మంది ఇప్పటికీ సొంత వాహన సౌకర్యం లేనివారే. మరి వీరంతా నడవడానికి సరైన దారేది? వంటి ప్రశ్నలకు సమాధానాలు వెదికే ప్రయత్నం చేస్తున్నారు. నగర రోడ్లను సర్వే చేశారు. పేరుకి రాష్ట్ర రాజధాని నగరమే అయినా హైదరాబాద్‌లో ఎక్కడా పాదాచారులకు మార్గమే లేదని, అరకొరగా ఉన్న ఫుట్‌పాత్‌లు అక్రమ పార్కింగ్లు, చెత్తకుండీలు, చిరు వ్యాపారాలు, చిన్న చిన్న గుళ్లు, మందిరాలతో నిండిపోయాయని గుర్తించారు. వీటన్నింటినీ ఫొటోలు, వీడియోలు తీశారు. వీటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన పరిధిలో తోచిన పరిష్కార మార్గాలు కూడా సూచించారు. చేస్తున్న ఉద్యోగాన్ని, వేలల్లో నెలవారీ జీతాన్ని వదిలేశారు. ‘రైట్ 2 వాక్ ఫౌండేషన్’ను సంస్థను ప్రారంభించారు. పూర్తి సమయాన్ని పాదచారుల హక్కులు, ఫుట్‌పాత్‌ల పరిరక్షణకు ఉద్యమించారు. పాదచారుల సమస్యలపై హైకోర్టులో పిల్ వేశారు. సీఎన్ఎన్, ఐబీఎన్ చానెల్లో సిటిజన్ రిపోర్టర్‌గా చేసి సమస్య తీవ్రతను వెలుగులోకి తెచ్చారు. 20 వేల మంది పాదచారుల నుంచి ఉద్యమానికి మద్దతుగా సంతకాలు సేకరించారు. ‘చాలా మంది ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు ఈ సమస్యపై స్పందించారు. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. అయితే ఇంకా చాలా జరగాలి. పాదచారుల హక్కులపై ప్రతి ఒక్కరిలో చైతన్యం పెరగాలి. పూర్తిస్థాయి పెడస్ట్రియన్ (పాదచారులు) పాలసీ రూపొందాలి. వీటికోసం పోరాడుతూనే ఉంటా’నంటున్నారు కాంతిమతి. ఇదే విషయంపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. - ఎస్.సత్యబాబు -
మెహిదీపట్నంలో పోలీసుల తనిఖీలు
-
బాలుడి అపహరణకు విఫలయత్నం
మెహదీపట్నం (హైదరాబాద్) : నగరంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి వద్ద ఏడాది వయసున్న ఓ బాలుడిని దుండగుడు అపహరించే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం మేరకు... హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి క్యాంటీన్లో కృష్ణ, లక్ష్మి దంపతులు పనిచేస్తున్నారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు సాయిరామ్ ఉన్నాడు. అయితే శనివారం సాయిరామ్ అక్కడే ఆడుకుంటుండగా మెదక్ జిల్లా మేడిపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి బాలుడిని తీసుకుని పరారయ్యే ప్రయత్నం చేశాడు. దీన్ని సమీపంలోని ఆర్టికల్ షాపు యజమాని గమనించి శ్రీనివాస్‌ను అడ్డుకున్నాడు. స్థానికుల సాయంతో శ్రీనివాస్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
మెహదీపట్నం (హైదరాబాద్) : నగరంలోని షేక్ పేట్ ప్రాంతంలో ఓ మహిళ బట్టలు ఆరేస్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. వివరాల ప్రకారం.. షేక్‌పేట లేబర్ కాలనీకి చెందిన భారతి (34) శనివారం ఓ ఇంటిలో పనిచేసేందుకు వెళ్లింది. బట్టలు ఉతికిన అనంతరం మేడపై ఆరేస్తుండగా అవి వెళ్లి సమీపంలోని విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్‌కు గురై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
'ప్రతికూల భావాలొద్దు.. లక్ష్యంపైనే గురి'
హైదరాబాద్: తనను తాను ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోలేదని ఆ ఆలోచన కూడా ఎప్పుడూ తన మనసులోకి రానివ్వలేదని ఈ ఏడాది సివిల్స్‌లో టాప్ ర్యాంకు సాధించిన ఇరా సింఘాల్ అన్నారు. ప్రతికూల భావాలవైపు ఏమాత్రం తన ఆలోచనను వెళ్లనివ్వలేదని, ఒకే లక్ష్యాన్ని నిర్ణయించుకునే ప్రతిక్షణం దానినే మననం చేసుకునేదానిని చెప్పారు. శుక్రవారం మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలను ఇరా సింఘాల్ సందర్శించారు. ఆల్ ఇండియా ర్యాంకు సాధించిన ఆమెను కళాశాలలోని గణిత విభాగం ప్రత్యేకంగా ఆహ్వానించడంతో హాజరై విద్యార్థులకు మంచి ఇన్సిపిరేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు విద్యార్థులంతా కరతల ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. కళాశాలకు వచ్చిన సందర్భంగా ఆమె ముగ్గురు అంగవైకల్య విద్యార్థులతో పరిచయం చేసుకునే సందర్భంలో కొంత ఆసక్తి కనబరిచారు. ఎలాంటి కష్టాలు వచ్చిన చదువును మధ్యలో ఆపేయోద్దని ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. గొప్ప శిఖరాలను మీరు(వికలాంగులు) అధిరోహించాలని, తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పుష్పలీలా మాట్లాడుతూ ఇరా సింఘాల్ ను అభినందించారు. ఆమె విజయాలను కొనియాడుతూ ప్రతి విద్యార్థి ఆమె నుంచి స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆమెకు సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. -
మెహదీపట్నంలో భారీ దోపిడీ
-
ఉలిక్కిపడ్డ సిటీ
ఐటీఐ గిల్డ్‌లో ప్రమాదం - భీతిల్లిన జనం - కోట్ల రూపాయల ఆస్తినష్టం మెహిదీపట్నం: నగరం నడిబొడ్డున భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో సిటీ ఉలిక్కిపడింది. గంటల పాటు ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు, పోలీసులు ఆందోళనకు గురయ్యారు. కిలోమీటర్ల మేర పొగలు వ్యాపిస్తూ మంటలు ఎగిసి పడటంతో సమీప ప్రాంతవాసులు కలవర పడ్డారు. ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక అధికారులు ఉరుకులు,పరుగులు తీశారు. పదహారు అగ్నిమాపక వాహనాలను తీసుకొచ్చి, ఐదు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఆదివారం సాయంత్రం విజయనగర్‌కాలనీ మల్లేపల్లి ఐటీఐ గిల్డ్ స్థలంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ చాలా కాలం నుంచి చిన్న చిన్న వాహనాల రిపేర్ షెడ్లతో పాటు వెల్డింగ్ దుకాణాలు, డెంటింగ్ షెడ్లు వంటి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. కాగా ఆదివారం విజయనగర్‌కాలనీ చౌరస్తా వైపు ఓ మూలన చిన్న షెడ్డులో మధ్యాహ్నం 3:30 గంటల సమీపంలో చిన్న అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు మంటలు కొద్ది కొద్దిగా వ్యాపిస్తూ మిగతా షెడ్లలోకి వ్యాపించాయి. షెడ్లలో దాదాపు రసాయనాలు, పాత టైర్లు ఉండడంతో మంటలు వేగంగా చెలరేగాయి. ఈ ప్రారంతం ఎప్పుడూ ర ద్దీగా ఉంటుంది. ఆదివారం సెలవు కావడంతో షాపులు మూతపడ్డాయి. దీంతో ప్రాణనష్టం, పెనుప్రమాదం తప్పింది. స్పందించిన ఎస్బీ కానిస్టేబుల్... ఘటనా స్థలం నుంచి బైక్‌పై వెళ్తున్న స్పెషల్‌బ్రాంచ్ కానిస్టేబుల్ టి.దిగంబర్సింగ్ వెంటనే స్పందించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అందరూ సకాలంలో వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 16 ఫైరింజన్లు 20 నీళ్ల ట్యాంకర్లు... మాదాపూర్, మొగల్పురా,సికింద్రాబాద్,హైకోర్టు, మలక్‌పేట, మౌలాలీ, సనత్‌నగర్, ఇంబ్రహీంపట్నం, లంగర్‌హౌస్, అసెంబ్లీ, గౌలిగూడ, ఫిలింనగర్, ముషీరాబాద్, సాలార్జంగ్ మ్యూజియం ఫైర్ స్టేషన్ల నుంచి వాహనాలు వచ్చాయి. మరో 20 నీళ్ల ట్యాంకర్లు(ప్రైవేట్) రప్పించారు. సహాయక చర్యల్లో ఫైర్ డెరైక్టర్ పి.వెంకటేశ్వర్, డీఎఫ్ఓ మహేందర్‌రెడ్డి, ఫైర్ ఆఫీసర్ విజయ్‌కుమార్‌లతో పాటు ఆయా ఫైర్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆదివారం కావడంతో తప్పిన ప్రాణ నష్టం... ఆదివారం సెలవు దినం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కేవలం రూ.కోట్లలో ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఇక్కడ 110 షాపులలో (కారు మెకానిక్, కార్పెంటర్, డెంటర్, పెయింటర్ తదితర కార్ఖానాలు) కనీసం మూడు వేల మంది కార్మికులు పని చేస్తుంటారు. సాధారణ రోజుల్లో ఇక్కడ అగ్నిప్రమాదం జరిగి ఉంటే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగేదని అధికారులు తెలిపారు. నిల్వ ఉన్న ఆయిల్ కొంప ముంచింది... ఐటీఐ గిల్ సుమారు ఐదేకరాల స్థలంలో ఉం ది. ఈ ప్రభుత్వ భూమిని కొందరు లీజ్‌కు తీసుకుని మొటారు మెకానిక్ వర్క్‌షాపులను నిర్వహిస్తున్నారు. ఈ గిల్‌లోని అన్ని దుకాణాలలో ఇంజన్ ఆయిల్ నిల్వలు ఉండటం కూడా మంటలు అదుపు రాకపోవడానికి ఒక కారణం. దీనికి తోడు కార్లకు ఉపయోగించే పెయింట్స్ కూడా ఉండటంతో మంటలు క్షణాల్లో చుట్టుపక్క దుకాణాలకు పాకాయి. -
ముస్తాఫా మృతి కేసులో కోర్టుకు నివేదిక
హైదరాబాద్: మొహిదీపట్నం ఆర్మీ మైదానంలో అనుమానాస్పదంగా మృతి చెందిన మదర్సా విద్యార్థి ముస్తాఫా(11) కేసులో హైదరాబాద్ పోలీసు కమిషనర్, ఆర్మీ అధికారులు సోమవారం కోర్టుకు నివేదిక సమర్పించారు. ప్రధానంగా ఆరు అంశాలపై విచారణ సాగించినట్టు నివేదికలో పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 70 మంది ఆర్మీ ఉద్యోగులను విచారించినట్టు వెల్లడించారు. 23 మందిని వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో విచారించామని తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డ అప్పలరాజు ప్రధాన నిందితుడని అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో కేసు విచారణ ఆలస్యమవుతోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దర్యాప్తు సాగిస్తున్నట్టు నివేదికలో తెలిపారు. -
నిరసనలతో హోరెత్తిన వేపగుంట
స్వగ్రామం చేరుకున్న ఆర్మీ జవాను అప్పలరాజు మృతదేహం విశాఖపట్నం: ఆర్మీ జవాను అప్పలరాజు మృతదేహం మెహిదీపట్నం నుంచి రావడంతో విశాఖ జిల్లా వేపగుంటలో విషాదకర వాతావరణం నెలకొంది. అప్పలరాజుని ముమ్మాటికీ హతమార్చారని ఆరోపిస్తూ నిరసనలు వెల్లువెత్తాయి. అప్పలరాజు హైదరాబాదు మెహిదీపట్నం ఆర్మీ ఏరియాలో విధుల్లో ఉండగానే పిస్తోలుతో కాల్చుకుని మరణించాడని అక్కడి అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అప్పలరాజు మృతదేహం మంగళవారం వేపగుంట సమీపించే సరికి కుటుంబసభ్యులు, స్థానికులు భారీగా చేరుకున్నారు. అప్పలరాజు అమర్హ్రే... అంటూ నినాదాలిచ్చారు. మృతుని తల్లి ముత్యాలమ్మ, సోదరుడు ముత్యాలు, భార్య అనసూయ, పిల్లల రోదనలతో జనం చలించిపోయారు. వీరితోపాటు జనం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. అప్పలరాజు ఆత్మహత్యకు పాల్పడేటంతటి పిరికివాడు కాడని... అతని మరణంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అప్పలరాజు భౌతికకాయానికి ఆర్మీఅధికారులు గౌరవవందనం ఏర్పాటు చేయకపోవడంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తని వేధించారు... ‘నా భర్తని ముమ్మాటికీ మానసికంగా హింసించే చంపారు...మరణానికి ముందు నుంచీ పోలీసులు, ఆర్మీ అధికారులూ ఆయనను వేధించారు’ అంటూ అప్పలరాజు భార్య అనసూయ కన్నీటి పర్యంతమయింది. మెహిదీపట్నం ఆర్మీ ఏరియాలో ముస్తఫా అనే బాలుని మృతిపై కొద్ది రోజులుగా విచారణ జరుగుతుండగా.... కేసు నుంచి బయట పడడానికి ఇద్దరు జవాన్లు తన భర్తపై నింద మోపారని చెప్పింది. చనిపోవడానికి మూడు రోజుల కిందటి నుంచీ పోలీసులు, ఆర్మీ అధికారులూ వేధించారని, ముస్తఫాని అప్పలరాజే చంపినట్లు బలవంతంగా ఒప్పుకోవాలని ఒత్తిడి తెస్తుండేవారని ఆరోపించింది. తన భర్త తుపాకీతో కాల్చుకుని మరణించే అవకాశం లేనే లేదని, ఎవరో ఆయనను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఆందోళన వ్యక్తం చేసింది. తన బావ అప్పలరాజు మరణంపై అనుమానాలున్నాయని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, జ్యుడీషియల్ విచారణ జరపాలని అప్పలరాజు బావమరిది శివరామకృష్ణ డిమాండ్ చేశారు. -
విద్యార్థినుల జోష్
-
‘సిగ్నల్ ఫ్రీ’.. రాకపోకలు సాఫీ
ఖైరతాబాద్, న్యూస్‌లైన్: లక్డీకాపూల్‌లో గురువారం నుంచి అమల్లోకి వచ్చిన సిగ్నల్ ఫ్రీ విధానం ఫలితాలనిచ్చింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు మెహిదీపట్నం వైపు, డీజీపీ కార్యాలయం వైపు నుంచి వచ్చే వాహనాలు నిరంకారి భవన్ వైపు వెళ్లాలంటే లక్డీకాపూల్ జంక్షన్లో ఉన్న సిగ్నల్ వద్ద ఆగాల్సి వచ్చేది. దీనివల్ల ఇటు బస్టాప్‌తో పాటు అటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు సైతం ట్రాఫిక్ జామ్ అయ్యేది. తాజాగా ‘సిగ్నల్ ఫ్రీ’ విధానం అమలుతో రాకపోకలు కొంతమేర సాఫీగా సాగాయి. వాహనచోదకులు తడబడకుండా నగర ట్రాఫిక్ పోలీసులు లక్డీకాపూల్ జంక్షన్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉంచి అవగాహన కలిగించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చే వాహనాలు కొత్త వంతెన వైపు వెళ్లే సమయంలో ఇబ్బంది ఏర్పడకుండా జంక్షన్ వద్ద బారికేడ్లు ఉంచారు. అయితే, వీటి కారణంగా డీజీపీ కార్యాలయం నుంచి వచ్చి నిరంకారి వైపు వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. మరోపక్క రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వైపు నుంచి వచ్చిన వారు సైతం కొత్త వంతెన పైకి వెళ్లే యత్నంలో జంక్షన్ వద్ద ఆగిపోతున్నారు. వీరికి ట్రాఫిక్ పోలీసులు మైకు ద్వారా సూచనలిస్తూ మార్గనిర్ధేశం చేశారు. అయోధ్య చౌరస్తా వద్ద సిమెంట్ దిమ్మెలు తొలగించి ఏర్పాటు చేసిన మార్గం వద్ద కూడా ట్రాఫిక్ పోలీసులు.. మెహిదీపట్నం వైపు వెళ్లాల్సిన వారు నేరుగా వెళ్లొచ్చని సూచనలు చేశారు. కొత్త విధానం అమలుతో రెండు వంతెనలపై రద్దీ దాదాపు సమానమైంది. మరో మూడ్రోజుల్లో ఇది అందరికీ అర్థమయ్యేలా చేస్తామని సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా ఇన్స్పెక్టర్ మదన్మోహన్ తెలిపారు. ఇదొక్కటే ప్రస్తుత ఇబ్బంది.. లక్డీకాపూల్ పాత వంతెన నుంచి వచ్చిన వాహనాలు అయోధ్య వద్ద ఏర్పాటు చేసిన కొత్త దారి నుంచి వెళ్తూ ఎడమ వైపునకు తిరిగి బజార్‌ఘాట్‌కు వెళ్లాలని ప్రయత్నించడం ఇబ్బందులు సృష్టిస్తోంది. వీరి వల్ల కొత్త వంతెన మీదుగా వచ్చే వాహనాలన్నీ ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. దీనికి పరిష్కారంగా కొత్తగా ఇచ్చిన దారికి ఎడమ వైపు ఉన్న కొలాప్సబుల్ డివైడర్లను మరింత ముందుకు విస్తరించాలని యోచిస్తున్నారు. ఇక, బజార్‌ఘాట్, ఫ్యాప్సీల వైపు వెళ్లే వారు కచ్చితంగా కొత్త వంతెన మీదుగానే వెళ్లాలని సూచిస్తున్నారు. ఇవే మార్గాల నుంచి వచ్చి నిరంకారి భవన్ వైపు వెళ్లే ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వాహనాలు అయోధ్య జంక్షన్ నుంచి మాసబ్‌ట్యాంక్ మార్గంలో ప్రయాణించి పీటీఐ బిల్డింగ్ వద్ద ‘యూ’ టర్న్ తీసుకుని గమ్యాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. -
నగరంలో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ సమావేశం ప్రారంభం
సీమాంధ్రలోని న్యాయవాదుల జేఏసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశం శనివారం గుడిమల్కాపూర్‌లోని అశోక గార్డెన్స్‌లో ప్రారంభమైంది. ఆ సమావేశానికి సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఆ సదస్సును అడ్డుకునేందుకు తెలంగాణవాదులు యత్నించారు. ఆ క్రమంలో వారు అశోక గార్డెన్స్ సమీపంలోని వాటర్‌ట్యాంక్ ఎక్కి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ వాదులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.