సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి వద్ద శనివారం ఉదయం నడిరోడ్డు మీద పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడింది. పిల్లర్ నంబర్ 273 వద్ద ఫుల్ లోడ్‌తో ఉన్న ట్యాంకర్ బోల్తాపడటంతో రోడ్డు నిండా పెట్రోల్ లీకవుతోంది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు.
సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది... వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని పెట్రోల్ పారిన చోట నీళ్లు చల్లారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించారు. సంఘటనాస్థలికి సమీపంలోని కాలనీవాసులను ఖాళీ చేయించారు. ట్రాఫిక్‌ను కూడా దారిమళ్లించారు. దీంతో మెహిదీపట్నం నుంచి ఆరాంగర్ రూట్‌లో ప్రయాణికులు మొదట ఇబ్బంది ఎదుర్కొన్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పీవీఎక్స్‌ప్రెస్‌వేపైనా తాత్కాలికంగా రాకపోకలను నిలిపేశారు. అనంతరం పోలీసులు, సహాయక సిబ్బంది బోల్తా పడిన ట్యాంకర్‌ను తొలగించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ క్లియర్ అయింది. వాహనాలు ప్రస్తుతం యథాతథంగా రాకపోకలు సాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment