Petrol tanker
-
పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 70 మంది మృతి
అబుజా : నైజీరియా ( Nigeria)లో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు ప్రకటించారు.నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఎన్ఈఎంఏ) అధికారిక ప్రకటన మేరకు.. శనివారం నార్త్ సెంట్రల్ నైజీరియా నైజర్ రాష్ట్రం (Niger state)లో అక్రమంగా ఇంధనాన్ని తరలించే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు ఎన్ఈఎంఏ అధికారులు నిర్ధారించారు.అగంతకులు జనరేటర్ సాయంతో ఒక పెట్రోల్ ట్యాంకర్ (petrol tanker explosion) నుంచి మరో పెట్రల్ ట్యాంకర్‌లోకి పెట్రోల్‌ను నింపి ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో ఒక్కసారి జనరేటర్ పేలడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. పేలుడు ధాటికి మంటలు చెలరేగి భారీ శబ్దాలు రావడం.. స్థానికుల ఆర్తనాదాలతో భయంకరంగా పరిస్థితి మారిపోయింది. అక్కడికక్కడే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా కాలిన గాయాలతో మరికొందరు విలవిల్లాడారు.పేలుడు ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. అయితే, భారీ స్థాయిలో ఎగిసి పడిన మంటల కారణంగా బాధితుల్ని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న పలువురు రెస్క్యూ సిబ్బంది సైతం అగ్నికి ఆహుతైనట్లు ఎన్ఈఎంఏ అధికార ప్రతినిధి హుస్సేన్ ఇసా తెలిపారు. ప్రమాదాలు సర్వసాధారణంనైజీరియాలో ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతుంటాయని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. నైజీరియాలో అస్థవ్యస్థంగా ఉన్న రైల్వే వ్యవస్థ కారణంగా ఎక్కువ శాతం మంది ప్రజలు రోడ్డు రవాణాను వినియోగించుకుంటున్నారు. పలుమార్లు అక్రమ ఇంధన రవాణా కారణంగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. గతేడాది ఇదే రాష్ట్రంలో గతేడాది సెప్టెంబరులో ఇదే తరహా దుర్ఘటన జరిగింది. నైజర్ రాష్ట్రంలో పశువులను తరలిస్తున్న ట్రక్కును పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 48 మందికి పైగా మరణించారు.నైజీరియా ఫెడరల్ రోడ్ సేఫ్టీ గణాంకాల ప్రకారం.. 2020లోనే 1,531 పెట్రోల్ ట్యాంకర్లు పేలాయి. ఫలితంగా 535 మరణించగా, 1,100 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఇలాంటి ఘటనల వల్ల ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా నిబంధనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. అయినప్పటికీ పలువురు అక్రమంగా ఇంధనాన్ని తరలిస్తూ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. -
రోడ్డుపై బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్
-
రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన పెట్రోలు ట్యాంకర్
ప్రకాశం జిల్లా: పెట్రోలు లోడ్‌తో వేగంగా వెళ్తున్న ట్యాంకర్ టైరు పంక్చరై రోడ్డు పక్కన ఆగి ఉన్న బాతుల లోడ్ లారీని ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న రెస్టారెంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన శనివారం సాయంత్రం జాతీయ రహదారిపై సింగరాయకొండ మండల పరిధిలోని జీవీఆర్ ఆక్వా కంపెనీ సమీపంలో రాయల్ భోజన్ హోటల్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలవడాన్ని మినహాయిస్తే.. పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన చూడటానికి చిన్నదైనా ఆయిల్ ట్యాంకర్ కావడంతో బోల్తా పడి ఉంటే తీవ్ర నష్టం జరిగేది. పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాలగూడ నుంచి నాయుడుపేటకు బాతుల లోడ్‌తో వెళ్తున్న ఐచర్ లారీకి రాయల్ భోజన్ హోటల్ సమీపంలో టైరు పంక్చరైంది. డ్రైవర్ పంక్చర్ వేస్తుండగా అదే సమయంలో విజయవాడ నుంచి నెల్లూరు జిల్లా జొన్నవాడ వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ అతి వేగంగా వచ్చి బాతుల లోడ్ లారీని బలంగా ఢీకొట్టి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం నేరుగా రోడ్డు పక్కనున్న రాయల్ భోజన హోటల్ గదిని ఢీకొట్టి ఆగింది. ఆ సమయంలో రెస్టారెంట్ యజమాని మద్దెల వెంకటేశ్వర్లు గదిలో నిద్రిస్తున్నాడు. అతని పక్కగా ట్యాంకర్ వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ సిద్దయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని హైవే అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అదే 5 గంటల సమయంలో జరిగి ఉంటే రెస్టారెంట్ బయట కుర్చీలు, మంచాలు వేసి జనం కూర్చుని ఉండేవారు. ప్రాణాపాయం కూడా జరిగేది. ప్రస్తుతం హోటల్ గది మాత్రమే ధ్వంసమై ప్రాణాపాయం జరగలేదని స్థానికులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పక్కనే ఉన్న సర్వీసు రోడ్డు ద్వారా పోలీసులు పునరుద్ధరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీరామ్ తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ రమణయ్య, కానిస్టేబుల్ సుమన్, హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఫ్లైఓవర్‌పై మంటల్లో చిక్కుకున్న పెట్రోల్ ట్యాంకర్
-
ఫ్లైఓవర్‌పై అగ్నికీలల్లో పెట్రోల్ ట్యాంకర్
ముంబై : నడిరోడ్డుపై పెట్రోల్ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ముంబైలోని గోరెగావ్ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ నిలిచిపోయింది. డ్రైవర్ క్యాబిన్లో చెలరేగిన మంటలు క్రమంగా ట్యాంకర్ అంతటికీ వ్యాపించడంతో అంధేరి నుంచి గోరెగావ్ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకోవడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్ధలాన్ని స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెట్రోల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం దృశ్యాన్ని రికార్డు చేసిన స్ధానికులు ముంబై పోలీసులకు ట్యాగ్ చేశారు. తమ సిబ్బంది ఘటనా స్ధలంలో సహాయక చర్యలు చేపడుతున్నారని, త్వరలోనే ట్రాఫిక్ పునరుద్ధరిస్తామని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్
-
పెట్రోల్ పంప్లో అగ్నికీలలు..
-
పెట్రోల్ పంప్లో అగ్నికీలలు..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఓ పెట్రోల్ పంప్ వద్ద పెట్రోల్ నింపుతుండగా ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి పెట్రోల్ పంపు నుంచి దూరంగా ఖాళీస్థలంలోకి ట్యాంకర్‌ను తీసుకెళ్లగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పింది. భోపాల్‌కు 220 కిమీ దూరంలోని నర్సింగ్‌పూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాకున్నా ట్యాంకర్ నుంచి ఎగిసిన అగ్నికీలలు పెట్రోల్ పంప్‌కు వ్యాపించడంతో ఆందోళన నెలకొంది. డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేసినా పెట్రోల్ పంప్ దగ్ధమై పరిసర ప్రాంతాలకు సైతం మంటలు వ్యాపించి భారీ నష్టం వాటిల్లేది. ట్యాంకర్ డ్రైవర్ సమయస్ఫూర్తితో అత్యంత వేగంగా సమీపంలోని ఖాళీ ప్రదేశానికి ట్యాంకర్‌ను తీసుకెళ్లడంతో భారీ ప్రమాదం తప్పింది. ట్యాంకర్ డ్రైవర్‌కు కాలిన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
రాజేంద్రనగర్ దగ్గర పెట్రోల్ ట్యాంక్ బోల్తా
-
పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. తీవ్ర భయాందోళన!
సాక్షి, హైదరాబాద్ : రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి వద్ద శనివారం ఉదయం నడిరోడ్డు మీద పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడింది. పిల్లర్ నంబర్ 273 వద్ద ఫుల్ లోడ్‌తో ఉన్న ట్యాంకర్ బోల్తాపడటంతో రోడ్డు నిండా పెట్రోల్ లీకవుతోంది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది... వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని పెట్రోల్ పారిన చోట నీళ్లు చల్లారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించారు. సంఘటనాస్థలికి సమీపంలోని కాలనీవాసులను ఖాళీ చేయించారు. ట్రాఫిక్‌ను కూడా దారిమళ్లించారు. దీంతో మెహిదీపట్నం నుంచి ఆరాంగర్ రూట్లో ప్రయాణికులు మొదట ఇబ్బంది ఎదుర్కొన్నారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పీవీఎక్స్ప్రెస్వేపైనా తాత్కాలికంగా రాకపోకలను నిలిపేశారు. అనంతరం పోలీసులు, సహాయక సిబ్బంది బోల్తా పడిన ట్యాంకర్‌ను తొలగించడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ క్లియర్ అయింది. వాహనాలు ప్రస్తుతం యథాతథంగా రాకపోకలు సాగిస్తున్నాయి. -
కాలేజీ బస్సును ఢీకొట్టిన ట్యాంకర్
► రేపూడిలో సినీ ఫక్కీలో ప్రమాదం ►ఐదుగురు విద్యార్థులకు గాయాలు ►ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం ► జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు ఫిరంగిపురం: సినీ ఫక్కీలో రహదారిపై మెలికలు తిరుగుతూ ఓ పెట్రోల్ ట్యాంకర్ వేగంగా కళాశాల బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మండలంలోని రేపూడి శివారులో కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై శనివారం జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. నరసరావుపేట శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు చెందిన బస్సు ఫిరంగిపురం, వేములూరిపాడు, రేపూడి గ్రామాల నుంచి 15 మంది విద్యార్థినులతో శనివారం నరసరావుపేటకు బయల్దేరింది.. రేపూడి శివారుకు చేరుకునే సమయానికి ఎదురుగా నరసరావుపేట నుంచి తాడేపల్లి వెళుతున్న పెట్రోలు ట్యాంకర్ సినీ ఫక్కీలో చక్కర్లు కొడుతూ ఎదురుగా వస్తోంది. బస్సు డ్రైవర్ వాసు, విద్యార్థినులు గుర్తించి పెద్దగా కేకలు వేస్తూనే ఉన్నారు. ఇంతలోనే ట్యాంకర్ బస్సును ఎదురుగా బలంగా ఢీకొట్టింది. ట్యాంకర్ అమాంతం వచ్చి బస్సు పక్కన ఆగింది. బస్సు ముందు అద్దాలు పగిలి పలువురిపై పడ్డాయి. మరికొందరు కిందపడి గాయాలపాలయ్యారు. ట్యాంకర్ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అటుగా వస్తున్న వాహనదారులు ఘటన స్థలంలో ఆగి క్షతగాత్రులను బస్సు నుంచి దించారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే.. బస్సు బయలుదేరిన ఐదు నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం జరగడం విశేషం. కొద్ది నిమిషాల్లోనే ప్రమాదం జరగడం, విద్యార్థినులు గాయపడటం అన్నీ జరిగిపోయాయి. వాహనదారులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని 108లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులను చూసిన విద్యార్థినులు కన్నీటి పర్వంతమయ్యారు. క్షతగాత్రులను పరామర్శించడానికి వచ్చిన తల్లిదండ్రులు, బంధువులతో ఆసుపత్రి ప్రాంగణం ఉద్విగ్నంగా మారింది. కేవలం ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంకర్ అదుపుతప్పి వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టిందని చెప్పారు. కేసు నమోదు... తొలుత ఘటనపై ఎస్సై ఎం.ఆనందరావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బస్సు, ట్యాంకర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిలిచిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గాయాలపాలైన విద్యార్థుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
చర్చి కూలి 160 మంది మృతి
నైజీరియాలో దుర్ఘటన లాగోస్: నైజీరియాలో శనివారం ఓ చర్చిలో ఘోర ప్రమాదం జరిగింది. చర్చి పైకప్పు కుప్పకూలడంతో 160 మంది దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అక్వా ఇబోమ్ రాష్ట్ర రాజధాని యువోలోని రీనర్స్ బైబిల్ చర్చ్ ఇంటర్నేషనల్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇంకా నిర్మాణంలోనే ఉన్న ఈ చర్చిలో భారీ లోహ స్తంభాలు విరిగిపడ్డంతో లోహపు పైకప్పు భక్తులపై కూలిపోరుుంది. చర్చి వ్యవస్థాపకుడైన మతబోధకుడు అకాన్ వీక్స్‌ను బిషప్‌గా ప్రకటించే కార్యక్రమం మొదలైన కాసేపటికే ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం నుంచి అకాన్ వీక్స్, రాష్ట్ర గవర్నర్ ఉదోమ్ ఎమ్మానుయెల్ తదితర ప్రముఖులు సురక్షితంగా తప్పించుకున్నారు. శిథిలాలను తొలగిస్తున్నామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న యువో వర్సిటీ టీచింగ్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. కాగా, చర్చి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, నిర్మాణంలో లోపాలున్నాయో లేదో తేల్చడానికి దర్యాప్తు జరుపుతామని అధికారులు వెల్లడించారు. నైజీరియాలో కాంట్రాక్టర్లు నాణ్యత లేని సామగ్రిని వాడడం వల్ల తరచూ భవనాలు కూలిపోతున్నారుు. 2014 లాగోస్‌లోని సినగోగ్ చర్చికి చెందిన బహుళ అంతస్తుల అతిథి గృహం కూలిపోవడంతో 116 మంది చనిపోయారు. కెన్యాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 30 మంది దుర్మరణం నైరోబి: పెట్రోల్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగారుు. ఈ ఘటనలో సుమారు 30 మంది మరణించగా, 11 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. కెన్యాలోని నైవాష పట్టణంలో శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కెన్యాలో నిత్యం రద్దీగా ఉండే నైరోబి-నాకూరు జాతీయ రహదారిపై వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ కరాయ్ ప్రాంతం వద్దకు రాగానే డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలను ఢీకొంది. దీంతో ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న ఇతర వాహనాలకు వ్యాపించడంతో ఆ వాహనాల్లోనివారు మంటల్లో కాలిపోయారని స్థానికులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. -
బకెట్ల కొద్దీ పెట్రోలు ఫ్రీ!
నల్లగొండ జిల్లాలో ట్యాంకర్ బోల్తా చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారు 65వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఓ పెట్రోలు ట్యాంకర్ బోల్తాపడింది. రంగారెడ్డి జిల్లా చర్లపల్లి ఐవోసీ టెర్మినల్ పాయింట్ నుంచి నల్లగొండకు 12 వేల లీటర్ల పెట్రోలుతో బయలు దేరిన ఏపీ 31డబ్ల్యూ 4668 నంబరు గల ట్యాంకర్ చౌటుప్పల్ మండలం మల్కాపురం శివారులోకి రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా పెట్రోల్‌ను బకెట్లలో, క్యాన్లలో నింపుకొని తీసుకెళ్లారు. హైవే మీదుగా వెళ్తున్న కార్లు, మోటార్ సైకిళ్లను ఆపి, డబ్బాలతో వాహనాల్లో పెట్రోల్ పోసుకున్నారు. ఇలా దాదాపు 6 వేల లీటర్ల పెట్రోల్ తీసుకెళ్లారు. సీఐ నవీన్‌కుమార్, ఎస్ఐలు మల్లీశ్వరి, హరిబాబు అక్కడికి వచ్చి, జనాన్ని చెదరగొట్టారు. క్రేన్ సహాయంతో ట్యాంకర్‌ను పెకైత్తించారు. ముందు జాగ్రత్త చర్యగా ఫైరింజన్‌ను రప్పించారు. -
పెట్రోల్ ట్యాంకర్ బోల్తా..ఒకరు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలో మంగళవారం రాత్రి జరిగిన ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు. గుంతకల్లు నుంచి గద్వాలకు పెట్రోల్‌తో వస్తున్న ట్యాంకర్ అదుపుతప్పి గద్వాల పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డుపై పడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన ట్యాంకర్ క్లీనర్ రామకృష్ణ అక్కడికక్కడే చనిపోయాడు. డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకుని పరారయ్యాడు. పెట్రోల్ లీక్ కాకపోవటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. రోడ్డుకు అడ్డంగా పడిన ట్యాంకర్‌ను పోలీసులు పొక్లెయినర్‌తో పక్కకు తప్పించి, రాకపోకలను క్రమబద్ధీకరించారు. -
పెట్రోల్ ట్యాంకర్ బోల్తా, తప్పిన ప్రమాదం
నల్లగొండ( సూర్యాపేట): నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జనగామ క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ముందస్తుగా సంఘటనా స్థలికి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయాలపాలైన వారిద్దరినీ చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, పెట్రోల్ ట్యాంకర్ నుంచి పెట్రోల్ తీసుకోవడానికి స్థానికులు బారులు తీరినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెట్రోల్ ట్యాంకర్-కారు ఢీ; ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ బీఎన్‌రెడ్డి నగర్లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పెట్రోల్ ట్యాంకర్ కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దాంతో నాగార్జున సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
తల్లీకూతుళ్లను బలిగొన్న ట్యాంకర్
నాచారం, న్యూస్‌లైన్: పెట్రోల్ ట్యాంకర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు తల్లీకూతుళ్లను బలిగొంది. బైక్‌ను వెనుక నుంచి ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందగా.. బైక్ నడుపుతున్న యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ హృదయ విదారక ఘటన నాచారం పోలీసుస్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం... మల్లాపూర్ శక్తిసాయినగర్‌లో జె.ఉప్పలయ్య, లలిత (35) దంపతులు నివాసముంటున్నారు. వీరికి చిన్నారి వైష్ణవి (6) సంతానం. లలిత తన కుమార్తె వైష్ణవిని తీసుకొని అన్నకొడుకు శ్రీకాంత్ వెంట బైక్ (ఏపీ23ఎన్2760)పై హబ్సిగూడలో ఉండే బంధువుల ఇంటికి బయలుదేరింది. మార్గంమధ్యలో నాచారం టెలిఫోన్ ఎక్స్ఛేంజి వద్ద వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన (ఏపీ16టీఎక్స్ 2019) పెట్రోల్ ట్యాంకర్ వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ట్యాంకర్ చక్రాలు లలిత వైష్ణవిల పైనుంచి వెళ్లడంతో వారు అక్కడిక్కడే మృతి చెందగా, శ్రీకాంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ట్యాంకర్‌ను ఘటనా స్థలంలో విడిచి పారిపోయాడు. పోలీసులు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.